ఎన్టీఆర్ పేరు తొలగించాలి.. లేకుంటే... | VH demands Remove ntr name shamshabad airport domestic terminal | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ పేరు తొలగించాలి.. లేకుంటే...

Published Sun, Nov 30 2014 1:28 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ఎన్టీఆర్ పేరు తొలగించాలి.. లేకుంటే... - Sakshi

ఎన్టీఆర్ పేరు తొలగించాలి.. లేకుంటే...

శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరును తొలగించాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (వీహెచ్) కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే రైల్ రోకో నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ అంశంపై చర్చించేందుకు వీహెచ్ అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడారు. ఎంఐఎంకు ఎప్పుడో తలాక్ చెప్పేశామని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీతో ఎటువంటి అవగాహన ఉండదని వీహెచ్ స్పష్టం చేశారు. ఒక నేతకు రెండు పదవులు ఇవ్వద్దని పార్టీ అధిష్టానానికి సూచిస్తామని వీహెచ్ వెల్లడించారు.  

 శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు తొలిగింపునకు చేపట్టాల్సిన కార్యచరణ కోసం చేపట్టిన ఈ భేటీలో సీనియరు నేతల నుంచి స్పందన కరువైంది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, జానారెడ్డి, బలరాంనాయక్, పొన్నం ప్రభాకర్లు మాత్రమే హాజరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement