హైదరాబాద్ : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసరాన్ని దురదర్శన్ ప్రసారం చేయటాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోహన్ భగవత్ ప్రసంగాన్ని డీడీలో ఎలా ప్రసారం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ అంశాన్ని సమాచార శాఖమంత్రి సమర్థించటం సరికాదని వీహెచ్ అన్నారు.
ఇండియన్ ముజాహిద్దీన్, అల్ఖైదా నేతల ప్రసంగాలను కూడా డీడీలో ప్రసారం చేయాలంటే పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ఐక్యంగా ఉంచాలనుకుంటున్నారా లేక విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారా అని వీహెచ్ సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఉన్న మత సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసేలా మోడీ సర్కార్ వ్యవహరించటం సరికాదని ఆయన అన్నారు.