సమాచారమే ఇచ్చారు...ఆహ్వానించలేదు: వీహెచ్ | congress MP V hanumantha rao to meet ex mps soon | Sakshi
Sakshi News home page

సమాచారమే ఇచ్చారు...ఆహ్వానించలేదు: వీహెచ్

Published Mon, Nov 3 2014 1:04 PM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

congress MP V hanumantha rao to meet ex mps soon

హైదరాబాద్ : టీసీఎల్పీ సమావేశం ఉందని తనకు సమాచారం మాత్రమే ఇచ్చారని, అయితే సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానించలేదని రాజ్యసభ సభ్యుడు, రాజ్యసభ ఎంపీ వీ హనుమంతరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుంటే కాంగ్రెస్ కేడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని ఆయన సోమవారమిక్కడ అన్నారు.

 

వలసలను కట్టడి చేయటం...పార్టీని బలోపేతం చేయడంపై ప్రస్తుత, మాజీ ఎంపీలను ఈనెల 9వ తేదీన ప్రత్యేకంగా భేటీ అవుతున్నట్లు వీహెచ్ తెలిపారు. కాగా ఈనెల 5వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీసీఎల్పీ భేటీ అయిన విషయం తెలిసిందే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement