టిక్కెట్లు ఇవ్వకపోతే 2019లోనూ నష్టపోతాం | V hanumanta rao demands constitutional powers for BCs | Sakshi
Sakshi News home page

టిక్కెట్లు ఇవ్వకపోతే 2019లోనూ నష్టపోతాం

Published Mon, Aug 25 2014 12:14 PM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

టిక్కెట్లు ఇవ్వకపోతే 2019లోనూ నష్టపోతాం - Sakshi

టిక్కెట్లు ఇవ్వకపోతే 2019లోనూ నష్టపోతాం

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఇవ్వకపోతే 2019 ఎన్నికల్లో కూడా నష్టపోతుందని రాజ్యసభ సభ్యుడు, ఆపార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు వ్యాఖ్యానించారు. పార్టీ పదవుల్లో బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోతే ఆ వర్గాలు కాంగ్రెస్ను నమ్మరని ఆయన సోమవారమిక్కడ అన్నారు. బీసీలకు సబ్ప్లాన్ అంశంపై కాంగ్రెస్ పోరాడాలని వీహెచ్ కోరారు.

రంగారెడ్డివ జిల్లా ఇబ్రహింపట్నంలో ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు’ రెండో రోజు కొనసాగుతోంది. ఈ సమావేశానికి దిగ్విజయ్తో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. పది అంశాలపూ గ్రూప్ల వారీగా చర్చ జరుపుతున్నారు. నేతలు సభలో నివేదికలు సమర్పించనున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు తొలిరోజు రగడ జరిగిన విషయం తెలిసిందే. సీనియర్ల వల్లే పార్టీ ఎన్నికల్లో ఓడిందని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement