doordarshan
-
దేశం పాడిన గాయకుడు
కిశోర్ కుమార్ మీద సంజయ్ గాంధీ కినుక వహించాడు. ‘ఇరవై సూత్రాల పథకం’ ప్రచారం కోసం దూరదర్శన్ లో మొదలెట్టిన ‘గీతోం భరీ షామ్’లో పాడమని కిశోర్‌ని సంజయ్ గాంధీ ఆదేశించాడు. డబ్బులు లేకుండా కిశోర్ పాడడు. ఆదేశిస్తే అసలు పాడడు. దాంతో కిశోర్ గొంతుకు రేడియోలో తాళం పడింది. సినిమాల్లో పాడిస్తే ఏం గొడవోనని నిర్మాతలు వెనక్కి తగ్గారు. ‘ఆరాధన’ సూపర్ హిట్ తర్వాత కిశోర్‌కు వచ్చిన తిప్పలు ఇవి. అప్పుడు కొంతమంది రఫీ దగ్గరకు వచ్చి ‘కిశోర్‌కు శాస్తి జరిగింది. ఈ కాలాన్ని ఉపయోగించుకోండి’ అన్నారు. రఫీ ఏం మాట్లాడలేదు. ఢిల్లీ వెళ్లి సంజయ్‌ను కలిశాడు. ‘మీరు కిశోర్ మీద బ్యాన్ ఎత్తేయండి. అందుకు బదులుగా ఒకటి కాదు పది ప్రోగ్రామ్‌లు చేసిస్తాను’ అన్నాడు. ఆ వెంటనే నౌషాద్‌ను వెంటబెట్టుకుని దూరదర్శన్‌లో ప్రోగ్రామ్ ఇచ్చాడు. కిశోర్ బ్యాన్ పోయింది.పత్రికలు కూడా కిలాడీవి. రాజేష్ ఖన్నా స్టార్డమ్తో కిశోర్ గొంతు గిరాకీలోకి రాగానే ‘రఫీ పని అయిపోయింది’ అని రాయడం మొదలెట్టారు. రికార్డింగులు లేక రఫీ గోళ్లు గిల్లుకుంటున్నాడని రాశారు. కిశోర్ తైనాతీలు ఇవన్నీ తెచ్చి కిశోర్‌కి చూపించారు. కిశోర్ సంతోషించాడా? ప్రెస్‌మీట్ పెట్టి ‘ఇలాంటి వెధవ రాతలు మానండి. ఆయనంటే నాకు చాలా గౌరవం. మీరు ఎవర్ని గెలిపించి ఎవర్ని ఓడిస్తారు?’ అన్నాడు. ఈ ఇద్దరిని కొంతమంది ఫలానా మతం అనుకుంటారు. ఈ ఇద్దరు మాత్రం ఈ దేశవాసులు. రామ్, రహీమ్‌ల సన్మతి ఎరిగినవారు.రంజాను మాసంలో రికార్డింగుకు వచ్చి ‘హుక్కే మే ధువా’ (హుక్కా పొగ) అనే పదం చూసి పాడనన్నాడు రఫీ ఉపవాసానికి భంగమని. మతం అంటే అంత నిష్ఠ. సాటి మతం పట్ల? అంతే నిష్ఠ. ‘మన్ తర్పత్ హరి దర్శన్ కో ఆజ్’.... ‘బైజూ బావరా’లో రఫీ పాడితే కన్నీరు ఆగదు వినేవారికి. ఆ కాలంలో అనేక ఆలయాల్లో ఇది ప్రభాతగీతం. దీనిని పాడింది, రాసింది, స్వరం కట్టింది... రఫీ, షకీల్ బదాయునీ, నౌషాద్. ‘నా గొంతు రొటీన్ అవుతోంది. నాకు భజనలు పాడాలని ఉంది’ అని రఫీ వస్తే ఖయ్యాం ఆ కోరిక మన్నించి భజనలు పాడించి అపురూపమైన రికార్డు విడుదల చేశాడు. ‘రఫీ గొంతులో దేవుడు ఉన్నాడు’ అని అందరూ అనేవారే. ఆ దేవుడు అల్లాయా, ఈశ్వరుడా వెతకడం అల్పుల పని.1950–70ల మధ్య మన దేశ సినీ సంగీతం దాదాపు అన్ని భాషల్లో స్వర్ణయుగం చూసింది. సినిమా – దేశవాసులను కలిపే కొత్త మతం అయ్యింది. కళాకారులు వినోద ఉల్లాసాలకే కాదు సామ రస్య, సౌభ్రాతృత్వాలకు ప్రవక్తలుగా మారారు. దేశ విభజన చేదు నుంచి జనాన్ని బయట పడేయడానికి గుర్తెరిగి బాధ్యతగా నడుచుకున్నవారే అందరూ! ‘తూ హిందు బనేగా నా ముసల్మాన్ బనేగా ఇన్సాన్ కీ ఔలాద్ హై ఔలాద్ బనేగా’... (నువ్వు హిందువువి కావద్దు, ముసల్మానువి కావద్దు, మనిషిగా పుట్టినందున మనిషిగా మిగులు) అని సాహిర్ రాయగా రఫీ పాడి చిరస్మరణీయం చేశాడు. మదన్ మోహన్ ట్యూన్ చేసిన ‘కర్‌చలే హమ్ ఫిదా’... రఫీ పాడితే నేటికీ సరిహద్దు సైనికులకు తేజోగీతమే. గాంధీజీని బలిగొన్నారన్న వార్త తెలియగానే సంగీత దర్శకులు హన్స్‌లాల్–భగత్రామ్, గీతకర్త రాజేంద్ర కిషన్ కలిసి ఆయనకు నివాళిగా ‘సునో సునో అయ్ దునియావాలో బాపు కీ ఏ అమర్ కహానీ’ రూపొందిస్తే ఇంకెవరు పాడతారు రఫీ తప్ప! బాపు పాదాల ఎదుట పారిజాతాల కుప్ప గదా ఈ పాట.సరళత్వము, తీయదనము, స్వచ్ఛత... వీటిని ప్రదర్శించడం ద్వారా ముప్పై ఏళ్ల పాటు పాడి కోట్ల మంది అభిమానులను పొందిన అమృత గాయకుడు రఫీ. ‘సుహానీ రాత్ ఢల్ చుకీ, ‘చౌద్వీ కా చాంద్ హో’, ‘బహారో ఫూల్ బర్సావో’, ‘ఓ దునియా కే రఖ్వాలే’, ‘ఖోయా ఖోయా చాంద్’, ‘దీవానా హువా బాదల్’, ‘క్యా హువా తేరా వాదా’... ఈ పాటలకు అంతూ పొంతూ ఉందా? కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు... ఏ ప్రాంతమో ఏ భాషో... అందరూ రఫీ అభిమానులు. రోజువారీ పనిలో, కాయకష్టంలో, సేద తీరే వేళ, వేడుకల్లో రఫీ.. రఫీ... రఫీ! కూతురిని అత్తారింటికి సాగనంపేటప్పుడు ప్రతి తండ్రి తలుచుకుని ఉద్వేగాశ్రువులు రాల్చే పాట ‘బాబుల్ కి దువాయే లేతీ జా’... షంషాద్ బేగం, గీతాదత్, లతా, ఆశా... అందరూ రఫీకి జోడీలే. దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్, షమ్మీ కపూర్, అమితాబ్... అందరూ అభినయకర్తలే. రఫీ పాడటంతో సగం నటన. మిగిలిన సగమే వీరు చేయాల్సి వచ్చేది.55 ఏళ్లకు మరణించాడు రఫీ. రేపటి డిసెంబర్ 24కు శత జయంతి. అయినా ఇన్నాళ్లకూ కాసింత కూడా మరపునకురాని సుర గాయకుడు. పాటనూ, ప్రేమనూ పంచి అందరి చేత ‘రఫీ సాబ్’ అనిపించుకున్నవాడు. ఆయన మృతదేహం ఆస్పత్రిలో ఉంటే ‘భూపిందర్ సింగ్ – రఫీ తమ్ముడు’ అని సంతకం పెట్టి ఇంటికి చేర్చిన గాయకుడు భూపిందర్ది ఏ మతం? చనిపోయిన అన్న రఫీది ఏ మతం? ఆ రోజు ఆకాశం నుంచి ఆగని వర్షం. ఇసుక వేస్తే రాలని జనం. గాంధీ గారు మరణించినప్పుడు ఇంత జనం వచ్చారట. రఫీ శత జయంతి ముగియనున్న ఈ వేళ అందరం వెలికి తీయవలసింది, జాగృత పరచవలసినది ఆయన పంచిన ఈ ప్రేమనే, ప్రేమమయ గీతాలనే! విద్వేష గీతాన్ని ఎవరు ఆలపించాలనుకున్నా కావలించుకుని వినిపిద్దాం రఫీ గీతం – జిందాబాద్ జిందాబాద్ అయ్ మొహబ్బత్ జిందాబాద్. జీతే రహో రఫీ సాబ్! అభీనా జావో ఛోడ్కర్ కె దిల్ అభీ భరా నహీ... -
దూరదర్శన్‌లో కాపీ ఎడిటర్ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం
సాక్షి,హైదరాబాద్: ఆకాశవాణి-దూరదర్శన్ కేంద్రంలో కాంట్రాక్టు,పూర్తికాలపు ప్రాతిపదికన కాపీ ఎడిటర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులకు ఆహ్వానించారు. ఆసక్తిగలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ప్రసార భారతి వెబ్సైట్ https://applications.prasarbharati.org ద్వారా నిర్ణీత గడువులోగా సమర్పించాల్సి ఉంటుంది.కాపీ ఎడిటర్ ఉద్యోగానికి అవసరమైన విద్యార్హతలు, వయసు..జీత,భత్యాలు వంటి అదనపు సమాచారం కోసం ప్రసార భారతి వెబ్‌సైట్‌లోని ‘వేకెన్సీ’ https://prasarbharati.gov.in/pbvacancies/ విభాగంలో ఉన్న నోటిఫికేషనులో చూడొచ్చని ప్రసార భారతి తెలిపింది. -
నాడు దూరదర్శన్‌లో తొలిసారి ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు..
2024 లోక్‌సభ ఎన్నికలు ముగుస్తున్న తరుణంలో ఈనెల 4న వెలువడబోయే ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మనకు టీవీల్లో లేదా స్మార్ట్ఫోన్లలో ఎన్నికల ఫలితాలను చూసే అవకాశం ఉంది. అయితే ఒకప్పుడు ఎన్నికల్లో ఎవరు గెలిచారో తెలుసుకునేందుకు మరుసటి రోజు వచ్చే వార్తాపత్రికల కోసం వేచి ఉండాల్సి వచ్చేది. అయితే ‘సత్యం శివం సుందరం’ నినాదంతో మనముందుకొచ్చిన దూరదర్శన్ ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు మరుసటి రోజు వరకూ వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చేసింది. 1971 ఎన్నికల ఫలితాలు దూరదర్శన్‌లో మొదటిసారి ప్రసారమయ్యాయి. నాటి ఎన్నికలు ఎంతో ఉత్కంఠభరితంగా సాగాయి. దీనికి కారణం అప్పటివరకూ ఐక్యంగా ఉన్న కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. దీంతో ఫలితాలపై దేశ ప్రజలకు ఎక్కడలేని ఆసక్తి ఏర్పడింది. నాటి ఎన్నికల్లో పలు రాజకీయ పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ పండిట్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రిల మరణానంతరం విచ్ఛిన్నమైంది. నాటి నేత కామరాజ్ నాయకత్వంలో కాంగ్రెస్ (ఓ), ఇందిరా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ (ఐ) ఏర్పడ్డాయి. ఎన్నికల ఫలితాలు ఇందిరా గాంధీ వర్గంలోని కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. భారీ మెజారిటీతో ఇందిరా గాంధీ ప్రధాని అయ్యారు.దూరదర్శన్ 1959 సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. తొలినాళ్లలో మన దేశంలో టీవీని కొనుగోలు చేయడం సంపన్న కుటుంబాలకే పరిమితమయ్యింది. తరువాత టీవీలు క్రమక్రమంగా ప్రజలకు చేరువయ్యాయి. 1970 నాటికి ప్రభుత్వ కార్యక్రమాలను దూరదర్శన్ ముమ్మరంగా ప్రసారం చేయడం ప్రారంభించింది. అలాగే భారతదేశంలోని విస్తృత ఎన్నికల రంగంలోకి ప్రవేశించింది. 1971 ఎన్నికల ఫలితాలు దూరద్శన్లో ప్రసారమైనప్పుడు జనం ఎంతో ఆసక్తిగా గమనించారు. -
శాంతి స్వరూప్ కన్నుమూత
రామంతాపూర్, సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రచార సాధనమైన దూర దర్శన్ చానల్లో తొలి తెలుగు యాంకర్‌గా ప్రసి ద్ధులు, తెలుగు ప్రజలకు తన కంచు కంఠంతో వార్తలు చెప్పిన జయంత్ శాంతి స్వరూప్ (74) కన్నుమూశారు. శుక్రవా రం ఉదయం ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్ దూరదర్శన్ సీనియర్ యాంకర్ రోజా రాణిని వివాహమాడారు. ఆమె కొన్ని సంవత్స రాల క్రితమే చనిపోయారు. శాంతి స్వరూప్‌కు ఇద్దరు కుమారులు మేగాన్‡్ష, అగ్నేయ. 1978లో దూరదర్శన్ కేంద్రంలో యాంకర్‌గా చేరిన ఆయన 1983 నుంచి తెలుగులో వార్తలు చదవ డం మొదలుపెట్టారు. 2011లో పదవీ విరమణ చేశారు. టెలిప్రాంప్టర్ర్ లేని రోజుల్లోనే వార్తలను ముందుగానే మననం చేసుకుని తెర ముందు పొల్లు పోకుండా తప్పులు లేకుండా అనర్గళంగా చదివి తెలుగు ప్రజలకు వార్తలు అందించారు. శాంతి స్వరూప్‌కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవా ర్డుతో పాటు పలు సంస్థలు ఎన్నో అవార్డులతో సత్కరించాయి. భూపాల్ గ్యాస్ దుర్ఘటన కవ రేజ్‌ను వీక్షకులకు కళ్ళకు కట్టినట్లుగా అందించిన ఆయన రాతి మేఘం, క్రికెట్ మీద క్రేజ్, అర్ధాగ్ని అనే నవలలు కూడా రాశారు. ఆయన పార్ధివ దేహాన్ని రామంతాపూర్ టీవీ కాలనీలోని స్వగృహానికి తరలించి అక్కడి నుంచి అంబర్పేట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కంచుకంఠం మూగబోయిందనీ, తొలితరం న్యూస్ రీడర్‌గా అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ మృతి బాధాకరమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంతాపాన్ని ప్రకటించారు. శాంతి స్వరూప్ సేవలు చిరస్మరణీయం తెలుగులో వార్తలు చదివిన తొలి తరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించా రు. ఆయన అందించిన సేవలు తెలుగు మీడి యా రంగంలో చిరస్మరణీయమని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరా లని ప్రార్థించారు. శాంతి స్వరూప్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. న్యూస్‌రీడర్‌గా తనదైన ముద్ర శాంతి స్వరూప్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. టీవీలో వార్త లను చదివే తొలితరం న్యూస్ రీడర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందిన శాంతి స్వరూప్ మీడియా రంగంలో తనదైన ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
దూరదర్శన్ శాంతి స్వరూప్ కన్నుమూత
-
శాంతి స్వరూప్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: దూరదర్శన్ మొదటి తరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, పరిమిత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజుల నుండి శాంతి స్వరూప్ మార్గదర్శక ప్రయత్నం చాలా మంది వార్తా ప్రసారకులకు స్పూర్తినిచ్చిందని సీఎం జగన్ అన్నారు. ఈ సందర్భంగా శాంతి స్వరూప్ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఇది కూడా చదవండి: దూరదర్శన్ శాంతి స్వరూప్ కన్నుమూత -
దూరదర్శన్, ఆలిండియా ప్రచారానికి సమయం కేటాయించిన ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు ప్రసారభారతి ఆధీనంలోని దూరదర్శన్, ఆలిండియా రేడియోల్లో ప్రచారానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సమయం కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ రాజేశ్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో ఉన్న మొత్తం 10 గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కలిపి బ్రాడ్‌కాస్ట్‌కు 898 నిమిషాలు, టెలికాస్ట్కు 898 నిమిషాలు కేటాయించారు. అందులో బ్రాడ్‌కాస్ట్‌కు, టెలికాస్ట్కు విడివిడిగా సమయం కేటాయించారు. అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీకి 277 నిమిషాలు కేటాయించగా, ఆ సమయాన్ని 5 నిమిషాలకు ఒక స్లాట్ చొప్పున 55 స్లాట్లుగా విభజించారు. ఇక కాంగ్రెస్ పార్టీకి 185 నిమిషాలను 5 నిమిషాల చొప్పున 37 స్లాట్లు.. బీజేపీకి 79 నిమిషాలను 5 నిమిషాల చొప్పున 15 స్లాట్లు, టీడీపీకి 62 నిమిషాలను 12 స్లాట్లుగా, ఏఐఎంఐఎం పార్టీకి 58 నిమిషాలను 11 స్లాట్లుగా, బీఎస్పీకి 55 నిమిషాలను 11 స్లాట్లుగా సీపీఐ (ఎం)కు 47 నిమిషాలను 9 స్లాట్లుగా కేటాయించారు. ఈ ప్రచారాన్ని ఎన్నికలకు రెండు రోజుల ముందు నిలిపివేయాల్సి ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
WTC Final: భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త
భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్ వేదికగా జూన్ 7-12 మధ్యలో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్‌ను డీడీ స్పోర్ట్స్ (డీడీ ఫ్రీ డిష్) ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని దూరదర్శన్ స్పోర్ట్స్ ఇవాళ ట్విటర్ ద్వారా వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్ డీడీ స్పోర్ట్స్‌లో ఫ్రీగా ప్రత్యక్ష ప్రసారం అవుతుందని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 𝐈𝐂𝐂 𝐖𝐨𝐫𝐥𝐝 𝐓𝐞𝐬𝐭 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬𝐡𝐢𝐩 𝐅𝐈𝐍𝐀𝐋 𝟐𝟎𝟐𝟑 🏏 𝐈𝐍𝐃𝐈𝐀 𝐯𝐬 𝐀𝐔𝐒𝐓𝐑𝐀𝐋𝐈𝐀 - 𝐓𝐡𝐞 𝐔𝐥𝐭𝐢𝐦𝐚𝐭𝐞 𝐓𝐞𝐬𝐭 🗓️ 𝟕 𝐭𝐨 𝟏𝟏 𝐉𝐮𝐧𝐞 🏟️ 𝐓𝐡𝐞 𝐎𝐯𝐚𝐥 𝐋𝐈𝐕𝐄 𝐨𝐧 𝐃𝐃 𝐒𝐩𝐨𝐫𝐭𝐬📺 (𝐃𝐃 𝐅𝐫𝐞𝐞 𝐃𝐢𝐬𝐡)#TeamIndia #INDvsAUS #WTC23 pic.twitter.com/vHc3kWkKQW — Doordarshan Sports (@ddsportschannel) June 2, 2023 కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇదివరకే మ్యాచ్ వేదిక అయిన ఓవల్ మైదానానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొందాలని ఇరు జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. బలాబలాల వరకు ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తుండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగనుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. అస్ట్రేలియా: మార్కస్ హ్యారిస్, ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ, నాథన్ లయోన్ టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ చదవండి: WTC Final 2021-23: ఎక్కడా మన వాళ్లు టాప్‌లో లేరు.. అయినా ఫైనల్‌కు..! -
బ్లాక్ అండ్ వైట్ డేస్... ఎంత బంగారమో!
కేబుల్ ఛానల్స్, ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీసులకు ముందు వినోదానికి దూరదర్శన్ పెద్ద దిక్కు. దూరదర్శన్‌కు, ప్రేక్షకులకు మధ్య దూరం పెరిగినా ఆ నాస్టాల్జియాకు మాత్రం దూరం కాలేదు. దీనికి ఉదాహరణ వైరల్ అయిన ఈ వీడియో. ‘అల్బెల’ సినిమాలోని ‘షోల జో బడ్కే’ పాటను హార్మోనియం వాయిస్తూ సి.రామచంద్ర, కవితా కృష్ణమూర్తితో కలిసి పాడుతున్న బ్లాక్ అండ్ వైట్‌కు సంబంధించిన వీడియోను నటి హేమమాలిని పరిచయం చేస్తున్న దూరదర్శన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ వీడియో నెటిజనులను టైమ్‌మిషన్‌లో బ్లాక్ అండ్ వైట్ జమానాలోకి తీసుకువెళ్లింది. ఆరోజుల్లో దూరదర్శన్‌లో తమకు నచ్చిన కార్యక్రమాలతోపాటు ‘మహా... భారత్’ అనే టైటిల్ సాంగ్ వినిపించగానే తాము రెక్కలు కట్టుకొని టీవీల ముందు వాలిన దృశ్యాలను కూడా నెటిజనులు గుర్తుతెచ్చుకున్నారు. ఈ వీడియోను ‘గోల్డ్’ అండ్ ‘ప్యూర్’ అని ఆకాశానికెత్తారు నెటిజనులు. -
క్రికెట్ వైరల్ వీడియో: ఆనంద్ మహీంద్ర ట్వీట్, నెటిజన్ల నోస్టాల్జియా
సాక్షి, ముంబై: స్మార్ట్‌టీవీలు, శాటిలైట్ చానెల్స్ హవా రాకముందు దూరదర్శన్‌లో ప్రసారమయ్యే క్రికెట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలకు భారీ క్రేజ్ ఉండేది. ఆయా మ్యాచ్‌ల లైవ్ చూసేందుకు జనం ఎగబడేవారు. నిజానికి రేడియో కామెంటరీ తర్వాత విజువల్ పరంగా అదొక్కటే ప్రేక్షకులకు వరం.అయితే పాత రోజుల్లో యాంటెన్నా కష్టాలు, దూరదర్శన్‌లో క్రికెట్ అంటూ ఒక వీడియో ఇటీవల ఇంటర్నెట్లో బాగా హల్ చల్ చేస్తోంది. అలనాటి యాంటెన్నా, కరెంట్, పిక్చర్ క్వాలిటీ తదితర కష్టాలను గుర్తుచేస్తున్న ఈవీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఇది చదవండి: కోట్లాదిమందికి ప్రాణదాత, ఓఆర్ఎస్ సృష్టికర్త ఇకలేరు తాజాగా ఈ వీడియోను పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఎవరైనా ఈ వీడియోకి చక్కటి మ్యూజిక్ ట్రాక్ యాడ్ చేయండి అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పలు రకాల కమెంట్లతో సందడి చేస్తున్నారు. యాంటెన్నా ఒక్కటే కాదు సార్! ఆ రోజుల్లో చాలా ఇళ్లలో బ్లాక్ అండ్ టీవీలు ఉండేవి. సో...పిక్చర్ ట్యూబ్ సమస్యలు కూడా చాలా కామన్‌గా కనిపించేవి కామెంట్ చేశారు. Remember this guys 😁😁😁 fixing of TV Ariel cricket match on DD ❤️❤️❤️ pic.twitter.com/rq1KWcczBd — 🦏 Payal M/પાયલ મેહતા/ पायल मेहता/ পাযেল মেহতা (@payalmehta100) October 15, 2022 Someone should be able to add an appropriate music track in sync with this… https://t.co/1V06POnv7c — anand mahindra (@anandmahindra) October 17, 2022 Doordarshan experience. pic.twitter.com/1kKETatGIt — Ajit Aditya (@shashijeet990) October 17, 2022 -
స్వతంత్ర భారతి: కలర్లో దూరదర్శన్
1982 నవంబర్ 19 వ తేదీ. భారత్‌లో 9వ ఆసియా క్రీడలు ప్రారంభమైన రోజు. అదే రోజు దూరదర్శన్‌లో తొలిసారి పూర్తిస్థాయి రంగుల ప్రసారాలు మొదలయ్యాయి. అంతకు 6 నెలల క్రితమే దూరదర్శన్ ప్రయోగాత్మకంగా ఏప్రిల్ 25న తన వీక్షకులకు రంగుల్ని రుచి చూపించింది. భారతీయ టెలివిజన్ సెట్‌పై రు.8 వేలు. దిగుమతి చేసుకున్న విదేశీ సెట్‌పై రూ.15 వేల వరకు వెచ్చించిన వీక్షకులు తొలిసారిగా, టీవీని రంగుల్లో దర్శించారు. అనంతరం ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడోత్సవాల ప్రారంభ కార్యక్రమం వర్ణమయ శోభితంగా దూరదర్శన్‌లో ప్రసారమైంది. దిగుమతి చేసుకున్న సెట్ల నుంచి కస్టమ్స్ రాబడి ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆ సమయంలో ఎంత లేదన్నా 70 కోట్ల రూపాయలు గడించింది. అంత వరకు నలుపు తెలుపులకు పరిమితమైన దూరదర్శన్ మొదట్లో తాత్కాలికంగానూ, ఆ తర్వాత అత్యవసరంగానూ కలర్లోకి వచ్చేసింది. అప్పట్లో టెలివిజన్ సెట్లను కొనుగోలు చేయడానికి సామాన్య ప్రజానీకం సైతం చూపించిన తహతహను విమర్శకులు విశృంఖల వినిమయ ధోరణికి ఉదాహరణగా అభివర్ణించడం మీకు గుర్తుండే ఉంటుంది. ఆమాట ఎలా ఉన్నా.. ఆరంభంలో లక్ష కలర్ టీవీ సెట్లు దేశంలోకి దిగుమతి అయ్యాయి. అంటే ఒక్క 1982 లోనే! ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు – ఇన్శాట్ 1 ఎ ప్రయోగం. – నాబార్డ్ స్థాపన. – క్రీయాశీల రాజకీయాల నుంచి చరణ్‌సింగ్ విరమణ. – ఉత్తర ప్రదేశ్‌లో గోండా ఎన్కౌంటర్. కలకత్తాలో బైజాన్ సేతు మారణహోమం. -
సర్కారు వారి ఛానల్లో టీమిండియా మ్యాచ్‌లు
పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు టీమిండియా వచ్చే నెలలో (జులై) వెస్టిండీస్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. విండీస్ పర్యటనలో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లన్నీ సర్కారు వారి ఛానల్ అయిన డీడీ స్పోర్ట్స్‌లో మాత్రమే ప్రత్యక్ష ప్రసారమవుతాయని భారత సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. The TV broadcast of all cricket matches during India’s tour of West Indies in July 2022 will be available in India only on DD Sports, on all Cable & DTH platforms. @ddsportschannelhttps://t.co/b8MvynJu9g — Prasar Bharati प्रसार भारती (@prasarbharati) June 25, 2022 లైవ్ మ్యాచ్‌లతో పాటు నిపుణులు, సెలబ్రిటీలచే ప్రీ మ్యాచ్, పోస్ట్ మ్యాచ్ విశ్లేషణలు కూడా అందిస్తామని ప్రసార భారతి పేర్కొంది. అన్ని కేబుల్, డీటీహెచ్ ప్లాట్‌ఫామ్‌లలో డీడీ స్పోర్ట్స్ ఛానల్ ప్రసారమవుతుందని తెలిపింది. కాగా, జులై 22 నుంచి ఆగస్ట్ 7 వరకు వెస్టిండీస్‌లో పర్యటించే టీమిండియా 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు ఆడనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా జులై 17న పరిమిత ఓవర్ల సిరీస్‌లు ముగియగానే నేరుగా కరీబియన్ దీవులకు బయల్దేరనుంది. ఈ పర్యటనలో టీమిండియా తొలుత మూడు వన్డేలు (జూలై 22, 24, 27), ఆతర్వాత 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ (జులై 29, ఆగస్ట్ 1, 3, 6, 7) ఆడనుంది. వన్డే మ్యాచ్‌లన్నీ ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో జరుగనుండగా.. తొలి టీ20 ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో.. రెండు, మూడు టీ20లు వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్‌లో.. ఆఖరి రెండు టీ20లు అమెరికాలోని (ఫ్లోరిడా) బ్రోవార్డ్ కౌంటీ స్టేడియంలో జరుగనున్నాయి. చదవండి: ఇండియా వర్సెస్ ఐర్లాండ్ తొలి టీ20.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..! -
స్ఫూర్తి: తలవంచని పాట
పాడటం తప్పు కాదు... అదొక అద్భుతమైన కళ అయితే ఆ కళ కొందరికి కంటగింపుగా మారింది కశ్మీర్లో బహిరంగ వేదిక ఎక్కి ఒక అమ్మాయి పాట పాడటం అనేది అంత తేలికైన విషయం కాదు! వెర్రితలలు వేసే వెక్కిరింపులతో పాటు, ‘ప్రాణాలు తీస్తాం’ అని బెదిరింపులు కూడా ఎదురవుతుంటాయి. ఆ బెదిరింపులకు భయపడి ఉంటే కశ్మీర్‌లోని మారుమూల పల్లెలో పుట్టిన షాజియా బషీర్ గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో రాణించేది కాదు. ఎంతోమంది యువకళాకారులకు స్ఫూర్తిని ఇచ్చి ఉండేది కాదు... దక్షిణ కశ్మీర్‌లోని తాజివర అనే ఊళ్లో పుట్టింది షాజియ. చిన్నప్పటి నుంచి పాటలు అద్భుతంగా పాడేది. సంగీతంలో ఎక్కడా శిక్షణ తీసుకోకపోయినా, ఆ అందమైన ప్రకృతే ఆమెకు రాగాలు నేర్పిందేమో అన్నట్లుగా ఉండేది. పెరిగి పెద్దయ్యాక కూడా ఆమె పాట బాటను వీడలేదు. మిలే సుర్ (డిడి కశ్మీర్) అనే టీవీ కార్యక్రమానికి ఎంపిక కావడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. రకరకాల వడపోతల తరువాత ఎంపికైన నలుగురిలో తానొక్కతే అమ్మాయి. ఈ కార్యక్రమంతో షాజియాకు గాయనిగా ఎంతో పేరు వచ్చింది. మరోవైపు ‘రేడియో కశ్మీర్’ కోసం తాను పాడిన పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. ఏ ఊళ్లో సంగీత కార్యక్రమం జరిగినా తనను పిలిపించి పాడించేవారు. బాలీవుడ్ మసాలా పాటలు కాకుండా కశ్మీరి సంప్రదాయ జానపదగీతాలను పాడి అలరించేది. కొత్తతరానికి అవి కొత్త పాటలు, పాతతరానికి అవి మళ్లీ గుర్తు చేసుకునే మధురమైన పాటలు. ఎక్కడికైనా బస్‌లోనే వెళ్లేది. ఎంత రాత్రయినా తల్లిదండ్రులు తన కోసం బస్‌స్టాప్‌లో ఎదురు చూసేవారు. ఒకవైపు షాజియా గానమాధుర్యానికి అబ్బురపడి మెచ్చుకునేవాళ్లతో పాటు, మరోవైపు ‘వేదికలు ఎక్కి పాడడం ఏమిటి. ఊరూరూ తిరగడం ఏమిటీ’ అని విమర్శించేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. బెదిరింపులు కూడా వచ్చాయి. ఆ రోజులన్నీ తనకు నిద్రలేని రాత్రులే. ఈ వెక్కిరింపులు, బెదిరింపులను తట్టుకోవడం తన వల్ల కాదనుకొని ఒకానొక సమయంలో ‘పాట’కు శాశ్వతంగా దూరంగా జరగాలని అనుకుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు, సోదరుడు ధైర్యం చెప్పారు. తనను పాటకు మరింత దగ్గర చేశారు. ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఎన్నెన్నో దేశాల్లో తన పాటల అమృతాన్ని పంచింది షాజియ. నసీమ్ అక్తర్ మెమోరియల్ అవార్డ్, బక్షీ మెమోరియల్ కమిటీ అవార్డ్, సంగీత్ నాటక్ అకాడమీ... లాంటి ఎన్నో అవార్డ్లు అందుకున్న షాజియ సూఫీగీతాలతో పాటు హిందూ భక్తిగీతాలను మధురంగా ఆలపించడంలో అద్భుతం అనిపించుకుంది. 2014లో తండ్రి చనిపోవడంతో షాజియ గొంతులో దుఃఖం తప్ప ఏమీ లేకుండా పోయింది. అవి తనకు చీకటి రోజులు. అదేసమయంలో తండ్రి మాట ‘నువ్వు పాట ఎప్పుడూ ఆపవద్దు’ గుర్తుకు వచ్చి మళ్లీ పాడటం మొదలుపెట్టింది. తన పాట ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చింది. షాజియాను ఆదర్శంగా తీసుకొని ఈ తరం యువతులు సంగీతరంగంలో రాణిస్తున్నారు. ‘ఏ రంగంలో అయినా కష్టపడడం తప్ప విజయానికి దగ్గరి దారి అనేది లేదు’ అంటున్న షాజియా కష్టపడే తత్వానికి ఆత్మస్థైర్యాన్ని కూడా జోడించింది. -
మర్యాద సీతమ్మ.. టీవీలో నిర్మాతగా తొలి మహిళ
ప్రధానమంత్రి పదవికి అనుభవం ఏమిటని అడుగుతారా? నాకు చిన్న అవకాశం ఇవ్వడానికి ఈ ప్రశ్న ఎందుకు వస్తోంది? ‘అవకాశం ఇచ్చి చూడండి... సర్వీస్ నచ్చకపోతే రద్దు చేయండి’ సహనం హద్దు శిఖర స్థాయిని చేరిన క్షణంలో వచ్చిన మాటలవి. ఈ రోజు బ్యూటీ ఇండస్ట్రీకి ఆమె ఒక మార్గదర్శనం. ‘టీవీలో నిర్మాతగా తొలి మహిళ’’ అనే మకుటం ఆమె తొలి విజయం. ఈ రెండు విజయాల మధ్య ఓ విషమ పరీక్ష... అదే ఆమెను ధీరగా నిలిపింది. దూరదర్శన్ తొలి మహిళా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ సీతాదేవి పరిచయం. ‘మర్యాద రామన్న’ ఈ తీర్పరి పేరు తెలుగు బాల్యానికి చిరపరిచితం. ఈ న్యాయనిర్ణేత గురించి వింటూ పెరిగిన బాల్యానికి ఒక కనువిందు దూరదర్శన్‌లో ప్రసారమైన మర్యాదరామన్న సీరియల్. ఈ జానపద కథాస్రవంతికి దృశ్యరూపం ఇచ్చిన నిర్మాత సీతాదేవి. టెలివిజన్ రంగం తప్పటడుగులు వేస్తున్న రోజుల్లో ఆ రంగాన్ని చేయి పట్టుకుని నడిపించిన అనేకమంది ఉద్దండుల మధ్య ఒక లలితసుమం ఆమె. సీరియల్ నటీనటులు, సంగీత దర్శకులు, దర్శకుల టైటిల్ కార్డుల్లో ‘నిర్మాత: సీత’ రెండక్షరాల పేరు ఆమె. ఆ తర్వాత ఆమె పేరు ముందు మర్యాద రామన్న అనే గౌరవం చేరింది. టెలివిజన్ రంగంలో ఆమె గుర్తింపు ‘మర్యాద రామన్న సీతాదేవి’గా స్థిరపడిపోయింది. తెర నిండుగా వినోదం తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట ఆమె సొంతూరు. నాన్న కోదండ రామయ్య డాక్టర్. తల్లి విజయరాజేశ్వరి గృహిణి. ‘‘మా అమ్మ స్ట్రాంగ్ ఉమన్. నాకు రోల్ మోడల్’’ అన్నారు సీతాదేవి. హైదరాబాద్, వనిత కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత కెరీర్ గురించి సృజనాత్మకమైన ఆలోచనలు చిగురించాయామెలో. అప్పటి వరకు ముందు గదిలో శ్రవణానందం చేసిన రేడియోలు... ముందు గదిని టీవీలకు ఇచ్చి, తాము వెనుక గదులతో రాజీ పడుతున్న రోజులవి. దూరదర్శన్ అంటే పందుల పెంపకం అనే చమత్కారం చిరుదరహాసంగా స్థిరపడుతున్న రోజుల్లో ఓ ప్రయోగం మర్యాదరామన్న సీరియల్. ఆనందోబ్రహ్మ హాయిగా నవ్వించి హాస్యాన్ని కురిపిస్తుంటే, మర్యాద రామన్న ఆలోచింప చేస్తూ అలరించింది. సీతాదేవి ఆ రోజులను గుర్తు చేసుకుంటూ... ‘‘ఆ సీరియల్‌కి స్క్రిప్ట్ ఓకే చేయించుకోవడం ఒక ఘట్టం అయితే, చిత్రీకరించడం మరో ఘట్టం. జానపద కథకు కాస్ట్యూమ్స్ తయారీ పెద్ద సవాల్. సొంతంగా కుట్టించడానికి మా బడ్జెట్ సరిపోదు. సురభి వాళ్ల దగ్గర ప్రయత్నించాను. కెమెరా కంటికి సంతృప్తినివ్వవు అనిపించింది. సింహాసనం సినిమా గుర్తు వచ్చింది. ఆ రాజదర్బారు సెట్టింగ్‌లు, దుస్తులు ఉపయోగించుకోవడానికి అనుమతి తీసుకున్నాను. దాంతో మర్యాద రామన్నలో ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా వచ్చింది. పట్టును తలపించే జరీ అంచు దుస్తులు, నవరత్న ఖచిత మణిమయ మకుటాలను తలపించే ఆభరణాలు, లైటింగ్‌తో మెరుపులీనుతూ వీక్షకులను టీవీకి కట్టిపడేశాయి. ఇక కథలోని నీతి, మేధోపరమైన తార్కికత పిల్లలను ఆకట్టుకుంది. రెండు వందలకు పైగా ఆర్టిస్టులతో ఐదారు నెలల్లో సీరియల్ చిత్రీకరణ పూర్తి చేశాం. ఇది 1989–90ల నాటి మాట. ఆ తర్వాత ‘ఆణి ముత్యాలు’ శీర్షికన గురజాడ, పురాణం సుబ్రహ్మణ్య శర్మ వంటి మంచి కథకుల కథలకు దృశ్యరూపం ఇచ్చాం. సజావుగా సాగిపోతున్న తరుణంలో ఒక అవాంతరం రాజాజీ గారి మనుమడి నుంచి వచ్చింది. కాపీ రైట్ పోరు ప్రముఖ జాతీయ నాయకులు సి.రాజాజీ గారి కథల ఆధారంగా హిందీలో ‘కన్యాకుమారీ కీ కహానియా’ తీశాం. ఆ కథలు దక్షిణాది రాష్ట్రాల్లోని ఆర్ధోడాక్స్ కుటుంబాల జీవితాలకు దర్పణం అన్నమాట. రాజాజీ తన కథల కాపీరైట్ భారతీయ విద్యాభవన్కి వచ్చారు. మేము ముంబయికి వెళ్లి ఆ సంస్థ నుంచి అధికారికంగా రైట్స్ తీసుకున్నాం. దూరదర్శన్ ప్రయోగాత్మకంగా మొదట ఆరు కథలకే అనుమతి ఇచ్చింది, ఆ ఆరు కథలను చిత్రీకరించాం. అవి టెలికాస్ట్ కావడానికి అంతా సిద్ధమైన తర్వాత డెక్కన్ క్రానికల్‌లో ఒక వార్త. నిర్మాత, దూరదర్శన్ కుమ్మక్కై కాపీ రైట్స్ ఉల్లంఘించి కథలను వాడుకున్నారనేది ఆరోపణ. మా తప్పు లేదని రెండేళ్ల పాటు కోర్టులో పోరాడి పోరాడి, చివరికి కోఠీలో కాపీ రైట్ పుస్తకాలు తెచ్చుకుని చదివి, కాపీ రైట్ బోర్డును సమాధాన పరిచి ఆ ఆరు కథలను ప్రసారం చేయగలిగాం. నేను ఏ సవాల్‌నైనా స్వీకరించగలననేంతటి ఆత్మవిశ్వాసం నాలో ఉండేది. ఆ టైమ్‌లో ఆరోగ్యం కొత్త సవాల్ విసిరింది. అనారోగ్యంతో పోరాటం మామూలు జ్వరం రూపంలో మొదలైన అనారోగ్యానికి మూలం తలలో ఉందని తెలియడానికి ఆరు నెలలు పట్టింది. దాదాపుగా ఇరవై ఏళ్ల కిందట... మల్టిపుల్ స్లె్కరోసిస్ పట్ల పెద్దగా అవగాహన కూడా లేదు. అది నరాల సమస్య. ఆకలి లేదు, తిన్నది కడుపులో ఇమడదు. కంటిచూపు దాదాపుగా పోయింది, నడక పట్టు తప్పింది. అంత తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డాను. ఆ సవాల్‌ని కూడా మనోధైర్యంతో ఎదుర్కొన్నాను. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నన్ను నేను ఏదో ఒక వ్యాపకం లో బిజీగా ఉంచుకోకపోతే మానసికంగా ఆరోగ్యవంతం కాలేననిపించింది. పని మీద బయటకు వెళ్తేనే మంచిగా తయారవుతాం. బయటకు వెళ్లాల్సిన పని లేకపోతే బద్దకంగా గడిపేస్తాం. ఇలా ఉండకూడదని మళ్లీ పనిలో పడ్డాను. సీరియల్ చిత్రీకరణ వంటి ప్రెషర్ పెట్టుకోవద్దని చెప్పారు డాక్టర్లు. బ్యూటీ ఇండస్ట్రీ అయితే అలవోకగా నడిపేయవచ్చనే ఉద్దేశంతో పింక్స్ అండ్ బ్లూస్ పేరుతో ఈ రంగంలో అడుగుపెట్టాను. అవకాశం కోసం జూబ్లీహిల్స్ క్లబ్లో బ్యూటీ సెలూన్ కోసం అడిగినప్పుడు చాలా రోజులు ఇవ్వలేదు. ‘మీకున్న అనుభవం ఏంటన్నారు, కోర్సు చేశారా’ అన్నారు. ‘కోర్సు చేసిన నిపుణులను ఉద్యోగులుగా నియమించుకుంటాను’ అని చెప్పాను. అయినా ఇవ్వలేదు. ఇక విసిగిపోయి ‘ప్రధానమంత్రి పదవికి అనుభవం అడుగుతున్నారా’ అని అడగడంతో నాకు అవకాశం ఇచ్చారు. అలా 2005 క్రిస్టమస్ రోజు మొదలైన పార్లర్ ఇప్పుడు నలభై బ్రాంచ్‌లకు విస్తరించింది. ఫ్రాంచైజీలు ఇచ్చే స్థాయికి చేరింది. ఇప్పుడు అంతర్జాతీయంగా విస్తరణ గురించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను’’ అని చిరునవ్వు నవ్వారు సీతాదేవి. బహుశా ఆ నవ్వులో నిండిన మెండైన ఆత్మవిశ్వాసమే ఆమెను విజేతగా నిలిపినట్లుంది. నేను విజేతనే ‘కన్యాకుమారీ కీ కహానియా’ కథాస్రవంతిలో మిగిలిన కథల చిత్రీకరణకు నేను సిద్ధంగా ఉన్నప్పటికీ దూరదర్శన్ సిద్ధంగా లేకపోవడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. ఫ్లాప్‌తో ఆగిపోవడం నాకు నచ్చదు. అందుకే ‘ఆంధ్రరత్నాలు’ పేరుతో తెలుగు ప్రముఖుల జీవితాలను చిత్రీకరించాను. ఇరవై ఏళ్ల ప్రయాణంలో డబ్బు పెద్దగా సంపాదించలేదు, కానీ మంచి ప్రయత్నం చేశాననే సంతృప్తి కలిగింది. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కథకు పార్లమెంట్లో ప్రశంసలు వచ్చాయి. రాజాజీ కథలను అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకటరామన్ మెచ్చుకుని, ఆ వీడియోలు తెప్పించుకున్నారు. ఆ సందర్భంగా మా టీమ్‌ని రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానించారు. – పి. సీతాదేవి, ఫౌండర్, ఐశ్వర్య ఫిలింస్, పీఎన్బీ సెలూన్స్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
చైనా చేష్టలు.. భారత్ రియాక్షన్ ఇది
గల్వాన్ లోయ ఘర్షణల్లో పాల్గొన్న కమాండర్, ఉయిగర్ల ఊచకోతలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తిని టార్చ్‌బేరర్‌గా అర్హత ఇవ్వడం ద్వారా పెను వివాదానికే కేంద్రం బిందువుగా మారింది వింటర్ ఒలింపిక్స్ 2022. పైపెచ్చు ఇప్పుడు అథ్లెటిక్స్ను స్వేచ్ఛగా మాట్లాడేందుకు వీలు లేకుండా ఆంక్షలు పెట్టింది. ఇక గల్వాన్ లోయ ఘర్షణలకు కారణమైన సీపీఏల్ఏ కమాండర్ క్వీ ఫబోవోను టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడంపై భారత్, చైనా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సరిహద్దు అంశాన్ని కెలిగి.. రాజకీయం చేయాలని చూస్తోందని భారత్ అంటోంది. అందుకే వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత రాయబారి, దౌత్యవేత్తలు పాల్గొనడని స్పష్టం చేసింది. ఈ బహిష్కరణతో పాటు ఒలింపిక్స్ ఈవెంట్స్‌ను టెలికాస్ట్ చేయడంలో దూరదర్శన్ దూరంగా ఉంటుందని ప్రసారభారతి స్పష్టం చేసింది. Consequent to the announcement by @meaindia, @ddsportschannel will not telecast live the Opening and Closing ceremonies of the Winter Olympics being held in Beijing. https://t.co/sSP1EX9pSQ — Shashi Shekhar Vempati शशि शेखर (@shashidigital) February 3, 2022 పదహారు రోజులపాటు బీజింగ్ వేదికగా శీతాకాల ఒలింపిక్స్ జరగున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మునుపెన్నడూ లేనంతగా అథ్లెటిక్స్ మీద ఆంక్షలు విధించింది. అంతేకాదు చైనా చట్టాల మీద, రూల్స్‌కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే.. శిక్ష తప్పదని హెచ్చరించింది బీజింగ్ ఆర్గనైజింగ్ కమిటీ. అంతేకాదు నిరసనలు తెలిపే హక్కును తొలగిస్తూ.. అందుకు సంబంధించిన పోడియంలను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. -
దూరదర్శన్ కేంద్రం: మహిళల బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం దూరదర్శన్ కేంద్రంలోని మహిళల బాత్రుమ్‌లో సీక్రెట్ కెమెరాను కనిపించింది. ఈ కెమెరాను ఆదివారం ఓ మహిళ గుర్తించగా.. ఈ విషయంపై దూరదర్శన్ అధికారులు బుధవారం పోలీసులను సంప్రదించారు. దీనిపై తిరువనంతపురం సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వన్ డ్రైవ్ రెస్టారెంట్ కేసులో వెలుగులోకి కొత్త విషయాలు కాగా ఆఫీసులో తాత్కాలిక ఉద్యోగిగా జాయిన్ అయిన ఓ వ్యక్తి ఈ రహస్య కెమెరాను అరేంజ్ చేసినట్లు తెలిసింది. కెమెరాను తీసేయడంతో పాటు అక్కడ పెట్టిన ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. మెయిన్ స్టూడియోకి సమీపంలోని వాష్‌రూమ్‌లో ఈ కెమెరాను అమర్చినట్లు పేర్కొన్నారు. అయితే పోలీసులతోపాటు ఈ విషయాన్ని దూరదర్శన్ కేంద్రంలోని మహిళా కమిటీ, క్రమశిక్షణా కమిటీ అధికారులు అంతర్గతంగా విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ ఇన్ ఫుడ్‌కోర్టులోని మహిళల టాయిలెట్లో సెల్‌ఫోన్ పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారనే విషయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుడ్‌కోర్టుకు తన స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ యువతి రెస్ట్రూమ్కు వెళ్లింది. అక్కడి బాత్రూమ్లో కెమెరా ఆన్‌చేసిన సెల్‌ఫోన్‌ను గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. -
మోదీ ‘మనసులో మాట’కు కోట్లకు కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదే నరేంద్ర మోదీ ఆదరణ కోల్పోతున్న ఆలిండియా రేడియో, దూరదర్శన్పై దృష్టి సారించారు. మారుతున్న ప్రజల అభిరుచులకు తగ్గట్టు అభివృద్ధి చెందని ఆలిండియా రేడియో, దూరదర్శన్పై మోదీ తీసుకున్న నిర్ణయంతో పూర్వ వైభవం వచ్చింది. ఇప్పుడు మన దేశ రేడియో, దూరదర్శన్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రధానమంత్రి ‘మనసులో మాట (మన్ కీ బాత్)’ కార్యక్రమంతో కోట్లు వస్తున్నాయి. మూసివేతకు గురవుతుందని భావించిన ఆయా సంస్థలు ఇప్పుడు లాభాల బాట పట్టింది కూడా. 2014లో ‘మనసులో మాట (మన్ కీ బాత్)’ అనే కార్యక్రమాన్ని ఆలిండియా రేడియో, దూరదర్శన్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసుకు నచ్చిన అంశంపై మాట్లాడుతారు. అలా ఇప్పటివరకు 78 ఎపిసోడ్లు ప్రధాని మన్ కీ బాత్ చేశారు. ఈ కార్యక్రమంతో ఇప్పటివరకు రూ.30.80 కోట్ల ఆదాయం వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని సోమవారం ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. ఏ సంవత్సరం ఎంత ఆదాయం వచ్చిందో వివరంగా సభకు తెలిపింది. సంవత్సరం ఆదాయం 2014-15 రూ.1.6 కోట్లు 2015-16 రూ.2.81 కోట్లు 2016-17 రూ.5.14 కోట్లు 2017-18 రూ.10.64 కోట్లు 2018-19 రూ.7.47 కోట్లు 2019-20 రూ.2.56 కోట్లు 2020-21 రూ.1.02 కోట్లు ఈ మన్ కీ బాత్ ఆలిండియా రేడియోలోనే అంత్యత ప్రజాదరణ పొందిన కార్యక్రమంగా ప్రభుత్వం రాజ్యసభలో తెలిపింది. ప్రధానమంత్రి ప్రసంగంతో దూరదర్శన్ వీక్షకుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని గణాంకాలతో సహా వివరించింది. బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసర్చ్ కౌన్సిల్ (బార్క్) వివరాల ప్రకారం.. 6 కోట్ల నుంచి ఏకంగా 14.35 కోట్ల మంది వీక్షకులు పెరిగారని వెల్లడించింది. మారుమూల గ్రామాలకు సైతం ప్రధాని ప్రసంగం చేరిందని పేర్కొంది. అయితే ఈ ‘మనసులో మాట’ కార్యక్రమానికి ప్రధాని మోదీ ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించారు. తాను ఏ అంశంపై మాట్లాడాలో చెప్పాలని అప్పుడప్పుడు ప్రజలను అడుగుతుంటారు. ఈ కార్యక్రమంతో ప్రసార భారతి (ఆలిండియో రేడియో), దూరదర్శన్‌కు పూర్వ వైభవం వచ్చింది. ఆలిండియో రేడియోను దేశ రేడియోగా, దూరదర్శన్ను మన దేశ టీవీగా పేర్కొంటారు. మన దేశ అధికారిక ప్రసార మాధ్యమాలు ఆ రెండూ అనే విషయం అందరికీ తెలిసిందే. -
Ashok Shrivastav: ‘అతడి ఇంట్లోని మహిళల మీద జాలి కలుగుతోంది’
‘ఫైండ్ ఎ బెడ్’ అనే యూఎన్ కోవిడ్ సహాయ కార్యక్రమానికి ఇండియా నుంచి బాలీవుడ్ నటీమణులు రిచా చద్దా, సన్నీ లియోన్, స్వరా భాస్కర్ అంబాసిడర్లుగా ఉన్నారు. అయితే.. అందుకు వారు తగినవారు కాదు అని దూరదర్శన్ టీవీ జర్నలిస్ట్ అశోక్ శ్రీవాత్సవ్ ట్వీట్ చేయడం వివాదం అయింది. ‘తగని’ ఆ ముగ్గురూ శ్రీవాత్సవ్ కు తగిన సమాధానమే ఇవ్వబోతున్నారు. రిచా అయితే ఇప్పటికే టిట్ ఫర్ ట్వీట్ ఇచ్చేశారు. రిచా చద్దా, సన్నీ లియోన్, స్వరా భాస్కర్.. ఈ ముగ్గురూ.. ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ అని ఒక ఇమేజ్ ఉంది. కేవలం వాళ్లు నటించిన సినిమాల వల్ల మాత్రమే వచ్చిన ఇమేజ్ కాదు అది. విలక్షణమైన వాళ్ల వ్యక్తిత్వం కూడా ఆ ఇమేజ్‌కి కొంత కారణం. 34 ఏళ్ల రిచా సామాజిక కార్యకర్త. విద్యార్థి ఉద్యమాలకు మద్దతు ఇస్తుంటారు. అందువల్ల తనకు సినిమా ఛాన్స్‌లు పోతాయనేం భయపడరు. ఇక నాలుగు పదుల సన్నీ లియోన్. ఒకప్పుడు ఆమె పోర్న్ స్టార్. తర్వాత హాలీవుడ్‌కి, అక్కణ్ణుంచి బాలీవుడ్‌కి వచ్చారు. రాజకీయ స్పృహ, చైతన్యం రెండూ ఎక్కువే. మూగజీవుల సంరక్షణ సంస్థ ‘పెటా’కు బ్రాండ్ అంబాసిడర్ కూడా పని చేశారు. 33 ఏళ్ళ స్వరా భాస్కర్ డేర్ అండ్ డెవిలిష్! ప్రజావ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలపై జరిగే ప్రదర్శనలకు తన గళాన్ని ఇస్తుంటారు. సినిమాల్లో, ఓటీటీల్లో ఆమె వేసే పాత్రలు కూడా ఆమెకు దీటైనవే. అంటే దాపరికాలు ఉండనివి. ఈ ముగ్గురూ ప్రస్తుతం ‘ఫైండ్ ఎ బెడ్’ అనే ప్రచారోద్యమానికి మద్దతిస్తున్నారు. అయితే.. ‘ఫైండ్ ఎ బెడ్‌కు వీరు తగని వ్యక్తులు’ అని అశోక్ శ్రీవాత్సవ్ అనే జర్నలిస్టు విమర్శించడంతో రిచా, సన్నీ, స్వరా స్పందించవలసి వచ్చింది. బాధ్యత గల ఉద్యోగంలో ఉండి మహిళల్ని కించపరిచేలా రిచా, సన్నీ, స్వరాలను అంత మాట అన్న శ్రీవాత్సవ్ గురించి తర్వాత తెలుసుకోవచ్చు. ముందైతే ‘ఫైండ్ ఎ బెడ్’ ఏమిటో చూద్దాం. ఇదొక యూత్ ప్రోగ్రామ్. కోవిడ్ ఉద్ధృతితో ఆసుపత్రులలో బెడ్లు దొరకని ప్రస్తుత పరిస్థితుల్లో ముంబైలోని ‘ఇండియాస్ ఇంటర్నేషనల్ మూమెంట్ టు యునైటెడ్ నేషన్స్’ (ఐఐఎంయుఎన్) అనే సంస్థ తాజాగా ‘ఫైండ్ ఎ బెడ్’ అనే కార్యాచరణను భుజానికెత్తుకుంది. దేశంలోని 160 నగరాలను కలుపుతూ 26 వేల మంది విద్యార్థులతో ఒక వ్యవస్థను నిర్మించి, వారి ద్వారా అవసరమైన వారికి కోవిడ్ ఆసుపత్రులలో బెడ్లను సమకూర్చేందుకు చక్కటి ప్రణాళికను సిద్ధం చేసింది. ఏయే ఆసుపత్రులలో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయనే సమాచారాన్ని ఈ యువ సైన్యం ఎప్పటికప్పుడు సేకరిస్తుంది. ఆ సమాచారం ఆధారంగా ఏ ప్రాంతానికి చెందిన వారికి ఆ ప్రాంతంలో బెడ్ దొరికేలా ‘ఫైండ్ ఎ బెడ్’ ఏర్పాట్లు చేస్తుంది. యువతరంలో బాలీవుడ్ నటీనటులకు, అందులోనూ సామాజిక కార్యక్రమాల్లో కాస్త చురుగ్గా ఉండేవాళ్లకు క్రేజ్ ఉంటుంది కాబట్టి ఐ.ఐ.ఎం.యు.ఎన్. రిచా చద్దా, సన్నీ లియోన్, స్వరా భాస్కర్లను తమ ప్రచారోద్యమ గౌరవ సార థులుగా నియమించుకుంది. అది చూసే మన శ్రీవాత్సవ్ భ్రుకుటి ముడివేసి, ‘తగని వ్యక్తులు’ అని వీళ్ల మీద ఒక ట్వీట్ ముద్ర వేశారు. ∙∙ అశోక్ శ్రీవాత్సవ్ దూరదర్శన్‌లో సీనియర్ కన్సల్టింగ్ ఎడిటర్. అంతటి మనిషి ఇప్పుడిలా ఈ ముగ్గురిపై నోరు పారేసుకుని డీడీ ప్రతిష్టకే భంగం కలిగేలా చేశారని విమర్శలు వస్తున్నాయి. ‘ఫౌండ్ ఎ బెడ్’కు తమని తగని వ్యక్తులుగా పేర్కొంటూ ఆ ముగ్గురి ఫొటోలు పెట్టి ట్విట్టర్లో కామెంట్‌ను పోస్ట్ చేసిన శ్రీవాత్సవ్‌కు ఏ మాత్రం కనికరం లభించే అవకాశం కనిపించడం లేదు. గతంలో ఇలాంటివే కొన్ని అనవసర వ్యాఖ్యల్ని చేసిన చరిత్ర అతడికి ఉంది. ఇప్పుడిక భవిష్యత్తునూ లేకుండా చేసుకునేలా ఉన్నారు. ‘‘అతడి ట్వీట్‌ను చూసి షాక్ తిన్నాను. దూరదర్శన్ ఇలాంటి స్త్రీ ద్వేషినీ, దుష్ట మానవుడినా ఉద్యోగంలోకి తీసుకుంది!’’ అని రిచా ట్వీట్ చేశారు. ఆపత్సమయాలలో ప్రతి ఒక్కరూ అండగా నిలుస్తారు. ఇతడు సహాయం చేయకపోగా, ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు’’ అని అన్నారు. వెంటనే నటి పన్ను తాప్సీ.. రిచాకు మద్దతుగా స్పందించారు. ‘‘అతడు నా గురించి కూడా గతంలా ఇలాగే కామెంట్ చేశాడు. ముఖ్యమైన ట్వీట్లకు సమాధానం ఇవ్వవలసిన తొందరలో ఉండి అతడిని వదిలేశాను. తన అధికారాన్ని ఆ వ్యక్తి ఇలా వాడుకుంటున్నాడు’’ అని తాప్సీ అన్నారు. ‘‘ఇలాంటి వాళ్లను ఊరికే వదలిపెట్టకూడదు’’ అని తాప్సీ ట్వీట్‌కి రిచా రిప్లయ్ ఇచ్చారు. ముగ్గురిలో మిగతా ఇద్దరు.. సన్నీ లియోన్, స్వరా భాస్కర్ వెంటనే ఏమీ స్పందించలేదు. శ్రీవాత్సవ్‌పై వారు దూరదర్శన్‌కు ఫిర్యాదు చేసే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. రిచా అయితే నేటికీ ఆశ్చర్యంలోంచి తేరుకోలేకపోతున్నారు! ‘‘ఇలాంటి ఒక వ్యక్తి జాతీయ మీడియాలో ఎలా పని చేస్తున్నట్లు!! అతడి ఇంట్లోని, ఆఫీసులోని మహిళల మీద జాలి కలుగుతోంది’’ అని అంటున్నారు. -
‘వైద్యం అందకే గంట వ్యవధిలో నా భర్త, తల్లిని కోల్పోయాను’
న్యూఢిల్లీ: ఆసుపత్రిలో బెడ్స్, ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది కరోనా బాధితులు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. ఇక ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సకాలంలో వైద్యం అందకపోవడంతో చాలా కుటుంబాలు తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా సరైన వైద్య చికిత్స అందకపోవడంతోనే తన భర్త, తల్లి మరణించారని మాజీ దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ అర్చన దత్తా ఆరోపించారు. ఏప్రిల్ 27న మాల్వియా నగర్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో అర్చన తన భర్త, తల్లిని కోల్పోయారు. ఈ విషాదాలు కేవలం గంట వ్యవధిలో చోటుచేసుకోవడం మరింత దారుణం. వీరు చనిపోయిన తర్వాత ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ మేరకు ట్విటర్లో ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. తన తల్లి, భర్తను ఆసుపత్రిలో చేరడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఒక గంట వ్యవధిలోనే తన తల్లి, భర్తను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా లాగా చాలా మంది తమ కుటుంబానికి ఏం జరగకూడదని అనుకుంటారు.. కానీ అదే జరిగింది. నా తల్లి, భర్త ఇద్దరూ చికిత్స అందకుండానే మరణించారు. ఢిల్లీలోని ఎన్నో ప్రముఖ ఆసుపత్రులను సందర్శించానా చేర్చుకోలేదు. వారు మృతి చెందాక కరోనా పాజిటివ్ అని తేలింది.’ అని ట్వీట్ చేశారు. ఇక ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి భవన్ ప్రతినిధిగా ఎంఎస్ దత్తా ఉన్నారు. కాగా అర్చన భర్త ఎఆర్ దత్తా రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేసి విరమణ పొందిన ఏఆర్ దత్తా(68). ఆమె తల్లి బనీ ముఖర్జీ(88) ఇటీవల ఆరోగ్యం క్షీణించింది. అర్చన కుమారుడు అభిషేక్ వారిద్దరిని దక్షిణ డిల్లీలోని ఓ ప్రముఖ ఆసుతప్రికి తరలించాడు. అయితే అక్కడ వారు చేర్చుకోలేదు. ఇలా పలు ఆసుపత్రుల్లో ఏవ్వరూ స్పందించలేదు. చివరికి ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినప్పటికీ అప్పటికే శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఏర్పడి గంటల వ్యవధిలోనే వారిద్దరు మరణించారు. ఇక ప్రస్తుతం తమ కుటుంబంలో అభిషేక్ మినహా అందరూ కోవిడ్ బారిన పడినట్లు అర్చన దత్తా వెల్లడించారు. తన మేనకోడలి పరిస్థితి క్షీణిస్తోందని.. ఆక్సిజన్ కోసం ఆసుపత్రులు తిరుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: ‘మరో నాలుగు రోజులే, సీఎం యోగీకి మరణం తప్పదు’ జనాలతో కప్ప గంతులు వేయించిన పోలీసులు.. ఎందుకంటే! -
సప్తగిరి ఛానెల్లో పాఠ్యాంశాలు ప్రసారం
సాక్షి, అమరావతి: దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ ద్వారా రాష్ట్రంలోని 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనను పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష కొనసాగిస్తున్నాయి.సెప్టెంబర్ మాసానికి సంబంధించిన పాఠ్యాంశాల బోధన ప్రణాళికను సోమవారం విడుదల చేశాయి. ► లాక్డౌన్ సమయంలో, ఆ తరువాత కూడా విద్యాశాఖ టెన్త్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సంబంధించి సన్నద్ధతకు వీలుగా పాఠాలను దూరదర్శన్ ద్వారా రోజూ 2 గంటలపాటు ప్రసారం చేయించింది. ► తరువాత ఇతర తరగతుల విద్యార్థులకు బ్రిడ్జికోర్సు, విద్యావారథి పేరిట పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారాలను కొనసాగించింది. ► అన్‌లాక్ 4లో సెప్టెంబర్ 1 నుంచి విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలను బోధించాలని కేంద్రప్రభుత్వం సూచించడంతో ఆమేరకు ఏర్పాట్లు చేశారు. ► ఈ మేరకు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రయినింగ్ (సీమ్యాట్) డైరెక్టర్ వీఎన్ మస్తానయ్య మెమో జారీచేశారు. ► సెప్టెంబర్ 10 వరకు రోజువారీగా ఆయా తరగతులకు బోధన జరిగే అంశాల షెడ్యూల్‌ను ప్రకటించారు. వారంలో అయిదు రోజుల పాటు ఈ ప్రసారాలు ఉంటాయి. ప్రతి రోజూ ఆరుగంటలపాటు ప్రసారం చేస్తారు. -
13 నుంచి వీడియో పాఠాలు
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం దూరదర్శన్ చానల్ ద్వారా సబ్జెక్టు నిపుణులతో వీడియో పాఠశాలను ప్రసారం చేయనున్నట్లు పాఠశాల విద్య ఆర్జేడీ మర్తాల వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు 1,2 తరగతుల విద్యార్థులకు, 12 గంటల నుంచి 1 గంట వరకు 3,4,5వ తరగతుల విద్యార్థులకు క్లాసులు ఉంటాయన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు 6,7 తరగతుల విద్యార్థులకు.. సాయంత్రం 3 నుంచి 4 రకు 8,9 తరగతుల విద్యార్థులకు క్లాసులు ఉంటాయన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు లాంగ్వేజెస్, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నాన్‌లాంగ్వేజ్ సబ్జెక్టు వీడియో పాఠాలను ప్రసారం చేస్తారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 31వ తేదీ వరకు తరగతుల వారిగా షెడ్యూల్ ప్రకారం పాఠాల బోధన ప్రసారం అవుతుందన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ పరిధిలోని విద్యార్థులకు సంబంధిత సమాచారాన్ని తెలియచేయాలన్నారు. అలాగే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆర్జేడీ వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. -
‘రామాయణ్’ ప్రపంచ రికార్డు
న్యూఢిల్లీ: రామానంద సాగర్ రచించి, దర్శకత్వం వహించిన ‘రామాయణ్’ ధారావాహిక విడుదలైన 33 ఏళ్ళ తరువాత సైతం, ఇప్పటికీ భారతీయ టెలివిజన్ ప్రపంచాన్ని ఏలుతుంది. రామాయణ్ సీరియల్‌ను దూరదర్శన్ పునఃప్రసారం చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే రెండోసారి ప్రసారమౌతోన్న ధారావాహిక ప్రపంచంలోనే అత్యధికమంది వీక్షిస్తోన్న కార్యక్రమంగా రికార్డయినట్టు దూరదర్శన్ ఇండియా ట్విట్టర్లో షేర్ చేసింది. ఏప్రిల్ 16వ తేదీన ‘రామాయణ్ ను ప్రపంచవ్యాప్తంగా వీక్షించినవారి సంఖ్య అక్షరాలా 7.7 కోట్లు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది చూసే టీవీ ప్రసారాల రికార్డుని రామాయణ్ బద్దలు కొట్టినట్టయ్యింది. డీడీ నేషనల్ ఛానల్లో మార్చి నుంచి తిరిగి ప్రారంభించిన రామాయణ్ రోజుకి రెండు సార్లు ప్రసారం అవుతోంది. -
రామాయణ్ మరో కొత్త రికార్డు
న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీవీ ప్రేక్షకులను ఆనందింపజేయడానికి 1980, 90లలో అమితంగా ఆకట్టుకున్న రామాయణ్, మహాభారత్, శ్రీ కృష్ణ వంటి సీరియళ్లను దూరదర్శన్ తిరిగి ప్రసారం చేస్తుంది. పునఃప్రసారంలో భాగంగా ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన రామాయణ్ సీరియల్ తాజాగా మరో కొత్త రికార్డును తన పేరిట లిఖించుకొంది. లాక్డౌన్ కారణంగా మార్చి 28 నుంచి డీడీలో టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్‌ను ఏప్రిల్ 16న 7.7 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటివరకు రీ టెలికాస్ట్‌లో భాగంగా ప్రసారమైన సీరియళ్లలో అత్యధికంగా వీక్షించిన సీరియల్‌గా రామాయణ్ నిలిచింది. ఈ విషయాన్ని ప్రసారభారతి తన ట్విటర్లో గురువారం అధికారికంగా వెల్లడించింది. (మహాభారత్ డీడీ నంబర్ వన్) మొత్తం 72 ఎపిసోడ్లుగా ఉన్న రామాయణ్ సీరియల్ దూరదర్శన్‌లో ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఒక ఎపిసోడ్, తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్ ప్రసారమవుతుంది. 1987లో దూరదర్శన్‌లో మొదటిసారిగా ప్రసారమైన రామాయణ్ సీరియల్‌ను రామానంద సాగర్ దర్శకత్వం వహించారు. సీరియల్లో రామునిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చిలాకియా, రావణునిగా అరవింద్ త్రివేది, హనుమాన్‌గా ధారాసింగ్ తదితరులు నటించారు. Ramayan World Record - Highest Viewed Entertainment Program Globally#IndiaFightsCorona#IndiaFightsBack pic.twitter.com/RdCDehgxBe — Prasar Bharati (@prasarbharati) April 28, 2020 -
సీతాపహరణం చూస్తున్న ‘రావణుడు’!
-
సీతాపహరణం చూస్తున్న ‘రావణుడు’!
న్యూఢిల్లీ: భారత్‌లో రామాయణ, మహాభారత ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన సీరియళ్లు, సినిమాలు, నాటకాల ఆదరణకు కొదవే ఉండదు. ఇక లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమతమైన అభిమానులు, సెలబ్రిటీల కోరికమేరకు 37 ఏళ్ల క్రితం విజయవంతంగా ప్రదర్శితమైన రామాయణ్, మహాభారత్ సీరియళ్లను దూరదర్శన్ పునఃప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రేటింగ్స్ పరంగా నయా రికార్డులను సాధిస్తున్న రామాయణ్ మరోసారి వార్తల్లో నిలిచింది. నాడు రామాయణ్ సీరియల్లో రావణ పాత్రధారి అరవింద్ త్రివేది.. తాజాగా సీతాపహరణం దృశ్యాన్ని చూస్తున్న వీడియో వైరల్ అయింది. (చదవండి: డీడీ నంబర్ వన్) 81 ఏళ్ల వయసున్న త్రివేది సీతను అపహరించే ఘట్టం క్లైమాక్స్‌కు చేరుకున్న దృశ్యాల్ని టీవీ ముందు కూర్చుని ఆసక్తికరంగా వీక్షిస్తున్న వీడియో అది. సీతను రావణుడు చెరబడుతున్న సందర్భంలో ఆయన రెండు చేతులూ జోడించడం గమనార్హం. ఈ వీడియోను రామాయణ్ ఫ్యాన్స్ క్లబ్ ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్ అయింది. కాగా, రామానంద్‌సాగర్ దర్శకత్వం, నిర్మాణ సారథ్యంలో 1987లో వచ్చిన ఈ సీరియల్లో రాముడిగా అరుణ్ గోవలి, సీతగా దీపికా చిఖిలా, లక్ష్మణుడిగా సునీల్ లహరి నటించారు. (చదవండి: ఒక్కరోజులోనే ఆ సీరియల్‌కు 50 మిలియన్ వ్యూస్) -
డీడీ నంబర్ వన్
కేబుల్ రాకముందు దూరదర్శన్ (డీడీ) ఛానలే అందరికీ వినోదం, విజ్ఞానం అందించింది. కేబుల్ టీవీ, స్మార్ట్ ఫోన్స్ వినియోగం ఎక్కువ కావడంతో దూరదర్శన్ కి ఇంతకు ముందు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వడంలేదనే చెప్పాలి. అయితే ఈ ‘లాక్ డౌన్’ సమయంలో ‘డీడీ నేషనల్’ తన పూర్వ వైభవాన్ని చూస్తోంది. టీ. ఆర్. పీ రేటింగ్స్ లో అగ్రగామిగా నిలుస్తోంది. కారణం దూరదర్శన్ లో ఒకప్పుడు బాగా పాపులర్ అయిన సీరియల్స్, షోలను పునః ప్రసారం చేయడమే. బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) విడుదల చేసిన డేటా ఆధారంగా దేశంలో దూరదర్శన్ నంబర్ వన్ స్థానంలో ఉంది. లాక్ డౌన్ కి ముందు వారాల్లో టాప్ 10లో లేకపోయినా ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో కొనసాగడం విశేషం. మార్చి చివరి వారం (మార్చి 21–27) రేటింగ్ సంఖ్యతో పోలిస్తే ఆ మరుసటి వారం (మార్చి 28– ఏప్రిల్ 3) దూరదర్శన్ వీక్షకుల సంఖ్య సుమారు 580 రెట్లు పెరిగినట్టు తెలిసింది. ‘‘రామాయణం, మహాభారతం, శక్తిమాన్, సర్కస్, బ్యోమకేష్ బక్షి వంటి పాపులర్ సీరియళ్లు, ప్రోగ్రాములు తిరిగి ప్రసారం కావడం దేశం మొత్తాన్ని శ్రద్ధగా టీవీలకు అతుక్కుపోయేలా చేసింది డీడీ. ముఖ్యంగా రామాయణం , మహాభారతం ప్రసారం అవుతున్న సమయాల్లో వీక్షకుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. అలాగే క్వారంటైన్ సమయాల్లో టీవీ వీక్షించే సమయం కూడా 43 శాతం వరకు పెరిగింది’’ అని బార్క్ సంస్థ తెలిపింది. -
ఒక్కరోజులోనే ఆ సీరియల్‌కు 50 మిలియన్ వ్యూస్
సాక్షి, ఢిల్లీ : ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఇప్పటికే సినిమాలు, సీరియళ్లు, వీడియోగేమ్‌లు, అమెజాన్‌ప్రైమ్‌లు..అబ్బో చాలానే వచ్చేశాయి. అయినప్పటికీ మన భారతీయులకు రామాయణ, మహాభారతం లాంటి పౌరాణిక గాధలపై మమకారం ఏమాత్రం తగ్గలేదు. అప్పటికీ, ఇప్పటికీ అదే ఆదరణ, అదే భక్తి వాత్సల్యం. దీనికి నిదర్శనమే ఇప్పుడు దూరదర్శన్ ఛానెల్‌కు లభిస్తున్న రేటింగ్. ప్రస్తుతం దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న రామాయణ్, మహాభారత్ సీరియల్స్.. రేటింగ్స్‌లో దుమ్ముదులిపే రికార్డులను సాధిస్తుంది. 33 ఏళ్ల క్రితం ప్రసారమైన ఈ సీరియల్స్..లాక్డౌన్ పుణ్యమా అని మళ్లీ టెలికాస్ట్ అయ్యాయి. రామానంద్‌సాగర్, బిఆర్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన రామాయణ్, మహాభారత్ సీరియళ్లకు భారీ ఆదరణ లభిస్తోంది. దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న ఈ సీరియల్స్ మొదటి నాలుగు ఎపిసోడ్లకు 170 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు బార్క్ ఇండియా తెలిపింది. వీటిలో ఆదివారం ప్రసారమైన ఒక్క ఎపిసోడ్‌కే 5కోట్ల వ్యూయర్షిప్ నమోదైంది.దేశ చరిత్రలోనే సీరియల్స్‌కు ఈ రేంజ్లో వ్యూయర్షిప్ రావడం ఇదే మొదటిసారి.దీంతో డీడీ ఛానల్ వ్యూయర్షిప్ అమాంతం పెరిగింది. దీంతో డీడీ ఛానల్‌కి మునుపెన్నడూ లేనంతగా 650 శాతం లాభాల్లో దూసుకుపోయింది. దీనిపై దూదర్శన్ సీఈవో శశి శేఖర్ మాట్లాడుతూ.."దూరదర్శన్ వీక్షకులందరికీ చాలా ధన్యవాదాలు. భారతదేశం అంతటా అత్యధిక వీక్షించిన ఛానెల్ ఇదే. మీ అందరి మద్దతుకు కృతఙ్ఞతలు. ఇంట్లోనే ఉండండి. సురక్షితంగా ఉండండి "అంటూ ట్వీట్ చేశారు. A Big Thank You to all the viewers of Doordarshan - per @BARCIndia the most viewed channel during week 13 is @DDNational across India. With your support Public Broadcaster has helped India Stay Home, Stay Safe as we fight back #COVID-19 pandemic. — Shashi Shekhar (@shashidigital) April 9, 2020 మార్చి 28న రీ టెలికాస్ట్ అయిన ఈ సీరియల్స్..పాత రికార్డులను బద్దలుకొడుతూ కొత్త రికార్డులను సెట్చేసింది. పైగా దీని ద్వారీ ఈ తరం వారికి పౌరణిక గాధలపై అవగాహన ఏర్పడే మంచి అవకాశం లభించింది. -
కరోనా: దూరదర్శన్‌లో మళ్లీ షారుక్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని కరోనా కలవరపెడుతున్న నేపథ్యంలో దూరదర్శన్ పలు ఆసక్తికర ప్రసారాలను పునఃప్రసారం చేయనుంది. ఇప్పటికే దేశంలో లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజల కోరిక మేరకు రామాయణం, మహభారతం సీరియళ్లను మళ్లీ ప్రసారం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొన్ని పాత షోలను సైతం పునః ప్రసారం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది. 1989లో షారుక్‌ఖాన్ నటించిన టీవీ సిరీస్ ‘సర్కస్’తో పాటు 1993లో వచ్చిన రజిత్ కపూర్ బయో డిటెక్టివ్ షో ‘బ్యోమకేశ్ బక్షి’లను శనివారం నుంచి ప్రసారం చేయనున్నట్లు దూరదర్శన్ తన అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించింది. సర్కస్‌ను రాత్రి 8 గంటలకు, బ్యోమకేశ్ బక్షి ఉదయం 11 గంటలకు ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. (‘ఫస్ట్ టైమ్ నెలకు 1000 రోజులు’ ) Shekharan is BACK on @DDNational! Friends, #StayAtHome and watch your favorite @iamsrk's #Circus - TV Series (1989) - From 28th March at 8 pm on @DDNational pic.twitter.com/MZ2zWvmyf5 — Doordarshan National (@DDNational) March 27, 2020 కాగా సర్కస్‌లో షారుక్ శేఖరన్ పాత్ర చేశాడు. ఈ పాత్ర అతనికి మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పటికీ చాలామంది ఆ పాత్రను గుర్తు చేసుకుంటారనడంలో అతిశయోక్తి లేదు. ‘సర్కస్’కు విక్కీ అజీజ్ మీర్జా, కుందన్ షా దర్శకత్వం వహించారు. రేణుకా షాహనే, పవన్ మల్హోత్రా అశుతోష్ గోవారికర్ ముఖ్యపాత్రల్లో నటించారు. 1989, 1990లో మొదట ప్రసారం చేసిన సర్కస్ మళ్లీ ప్రజల డిమాండ్ మేరకు 2017, 2018లో కూడా ప్రసారం చేశారు. అయితే తాజాగా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలను అలరించడానికి మళ్లీ రెడీ అవుతుంది. అలాగే రజిత్ కపూర్ షో బ్యోమకేశ్ బక్షి మొదట 1993 నుంచి 1997 దాదాపు నాలుగు సంవత్సరాల పాటు కొనసాగింది. (బ్రెజిల్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు) -
మరోసారి ‘రామాయణ్’
న్యూఢిల్లీ: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని జీవితగాథ ఆధారంగా తీసిన రామాయణ్ ధారావాహిక మరోసారి దేశవ్యాప్తంగా ప్రజలను అలరించనుంది. ఈ సీరియల్‌ను ఈనెల 28వ తేదీ నుంచి దూరదర్శన్ డీడీ నేషనల్ చానెల్లో ప్రసారం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. దేశమంతా కరోనా లాక్డౌన్లో ఉన్న నేపథ్యంలో ప్రజల కోరిక మేరకు ఈ ఆధ్యాత్మిక సీరియల్‌ను మరోసారి ప్రసారం చేయాలని నిర్ణయించామన్నారు. శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఒక ఎపిసోడ్, తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్‌ను దూరదర్శన్‌లో చూడొచ్చని శుక్రవారం ట్విట్టర్లో ప్రకటించారు. 1987లో మొదటిసారిగా దూరదర్శన్‌లో రామాయణ్ ప్రసారమైంది. -
చీరకట్టుతో అలరించిన దురదర్శన్ వ్యాఖ్యాత..!
దూరదర్శన్ చానల్లో ప్రత్యేకమైన శైలితో శ్రోతలకు వార్తలు వినిపించిన అలనాటి న్యూస్‌రీడర్ సల్మా సుల్తాన్ ఓ ఫ్యాషన్ షో లో ర్యాంప్‌పై మెరిశారు. 72 ఏళ్ల వయసులోనూ ఆమె తన చీరకట్టుతో షోలో పాల్గొని అందర్ని అలరించారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో సుల్తాన్ భారతీయ సంస్కృతిని, చీరలకు ఉన్న సాంప్రదాయ విలువలను ప్రతిబింబిచే విధంగా చీరుకట్టుతో ర్యాంప్‌పై నడిచారు. చీరకట్టు గొప్పతనాన్ని మహిళలకు తెలియజేయానే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. సల్మా సుల్తాన్ తాను చీరలు ధరించడానికి ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం ఉండదని అన్నారు. ఈ సందర్భంగా సల్మా సుల్తాన్ మాట్లాడుతూ.. ‘ఈ ఫ్యాషన్ షో చాలా ఆనందం కలిగించింది. చీరకట్టుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ‘చీరలు ధరించడానికి ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం ఉండదని నమ్ముతాను. చీరలు ధరించడానికి మహిళలకు ధైర్యం, విశ్వాసం ఉండాలి. చీరలపైన అమితమైన విశ్వాసం, ఇష్టం ఉంటే.. ఏ వేషాధారణలో ఉన్నా మహిళలకు ఎటువంటి సమస్యలు తలెత్తవు’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ షోవన నారాయణ్‌తో పాటు ‘ఫ్యాషన్ లైఫ్ స్టైల్’ మేగజైన్ ప్రముఖులు హాజరయ్యారు. కాగా సుల్తాన్ మూడు దశాబ్దాల పాటు దురదర్శన్‌లో వ్యాఖ్యాతగా పనిచేశారు. జర్నలిస్టు, వ్యాఖ్యాతగా సుపరిచితమైన ఆమె 1997 వరకూ పని చేశారు. డీడీలో పని చేసినప్పుడు ఆమె ప్రత్యేకమైన శైలిలో వార్తలను చదివి అందరిని ఆకర్షించేవారు. ఎడమ చెవి కింద జుట్టులో గులాబీతో సాంప్రదాయమైన చీరకట్టుతో వార్తలు చదువుతూ అందరిని ఆకట్టుకునే వారు. ఆమె తన చీరను మెడ, భుజాల చుట్టూ ఆధునిక పద్ధతిలో కప్పుకొని సాంప్రదాయకంగా కనిపించేవారు. వ్యక్తిగత శైలిని ప్రదర్శించిన మొదటి వార్తా వ్యాఖ్యాతల్లో సుల్తాన్ ఒకరు. సల్మా చీరకట్టు, ప్రత్యేకమైన శైలిని చాలా కాలం కొత్త న్యూస్‌రీడర్లు అనుకరించారు. -
‘వీడు జనరేటర్ సౌండ్‌కు కూడా డ్యాన్స్ చేయగలడు’
సోషల్ మీడియా పుణ్యానా రాత్రికి రాత్రే స్టార్లు అయ్యే అవకాశం కల్గింది జనాలకు. ప్రియా ప్రకాశ్ వారియర్, సింగర్ బేబీ లాంటి వారందరికి ఓవర్‌నైట్ స్టార్డమ్ తెచ్చింది సోషల్ మీడియానే. ఇలాంటిదే టిక్‌టాక్ యాప్. దీని ద్వారా జనాలు తమలో ఉన్న ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయగల్గుతున్నారు. అయితే దీని వల్ల లాభల కంటే కూడా నష్టాలే ఎక్కువ ఉన్నాయనే వాదన ఉంది. ఈ మధ్యే కొన్ని రాష్ట్రాల్లో ఈ యాప్‌పై నిషేధం విధించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ సంగతలా వదిలేస్తే ప్రస్తుతం టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరలవుతోంది. దూరదర్శన్‌లో వార్తలు చూసే వారికి ఆ టైంలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే కాదేదీ కవితకనర్హం అన్నట్లు ఈ మ్యూజిక్కు వెరైటీగా బ్రేక్ డ్యాన్స్ చేశాడో యువకుడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. వైశాఖ్ నాయర్ అనే యువకుడు కాస్త డిఫరెంట్‌గా ఆలోచించి దూరదర్శన్ వార్తలు వచ్చేటప్పుడు వినిపించే బ్యాగ్రౌండ్ మ్యూజిక్కు బ్రేక్ డ్యాన్స్ వేశాడు. దాన్ని కాస్తా టిక్‌టాక్‌లో అప్లోడ్ చేయడంతో అది ఇప్పడు తెగ వైరలవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను లక్షమందికి పైగా చూశారు. ‘ప్రతి ట్రాక్‌కు వైశాఖ్ భలే చేశాడే’ అని కొందరు మెచ్చుకుంటే, ‘వీడికి ఇంకా పిల్ల చేష్టలు పోలేదు’ అంటూ ఇంకొందరు.. ‘జనరేటర్ మోతకు కూడా వీడు డ్యాన్స్ చేయగలడు’ అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు జనాలు. Doordarshan would not hv imagined this in their wildest dreams !! 😂 pic.twitter.com/epJ86aVssE — (•ิ_•ิ) Silk (@Ya5Ne) March 4, 2019 -
దూరదర్శన్‌కు మరో రెండు సైన్స్ చానళ్లు
న్యూఢిల్లీ: దూరదర్శన్ మరో రెండు కొత్త చానళ్లకు శ్రీకారం చుట్టింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియా సైన్స్ పేరుతో రెండు చానళ్లను దూరదర్శన్ మంగళవారం ప్రారంభించింది. డీడీ సైన్స్ పేరుతో ఒక చానల్‌ను, ఇండియా సైన్స్ పేరుతో వెబ్ చానల్‌ను దూరదర్శన్ ప్రారంభించింది. ఈ చానళ్ల ప్రారంభోత్సవానికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్దన్ హాజరై మాట్లాడారు. శాస్త్రీయ దృక్పథం అభివృద్ధికి ఓ చానల్ అత్యవసరమని అందుకు డీడీ సైన్స్ 24/7 చానల్‌ను సైన్స్‌కు అంకితమిస్తునట్లు తెలిపారు. దూరదర్శన్ జాతీయ చానల్లో ఒక గంటపాటు డీడీ సైన్స్ చానల్ కార్యక్రమాలుంటాయని, ఇండియా సైన్స్ చానల్ మాత్రం ఇంటర్నెట్ ఆధారిత చానల్ అని పేర్కొన్నారు. దేశంలో ప్రతిభావ్యుత్పత్తులకు, మెరుగైన ఆలోచనలకు కొదవలేదన్నారు. దేశంలో వాటర్ షెడ్ ఉద్యమం కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్‌కే పరిమితం కాదని సమాజంలో అభివృద్ధి చెందిన శాస్త్రీయ దృక్పథానికి ఆ ఉద్యమం నిదర్శనమన్నారు. త్వరలోనే ఈ డీడీ సైన్స్ చానల్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2030 నాటికి సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచంలోనే మన దేశం మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. -
దాడి మీడియా లక్ష్యంగా కాదు: మావోలు
రాయ్‌పూర్: దూరదర్శన్ కెమెరామన్ అచ్యుతానంద్ సాహు, మరో ఇద్దరు మీడియా సిబ్బందితో పాటుగా పోలీసులపై ఈ నెల 30న జరిగిన దాడికి బాధ్యత వహిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. మావోయిస్టు దర్భా డివిజన్ కమిటీ కార్యదర్శి సాయినాథ్ పేరుతో రెండు పేజీల లేఖను ఆ పార్టీ వెల్లడించింది. ఆ దాడి మీడియా లక్ష్యంగా జరిగింది కాదని, పోలీసుల లక్ష్యంగానే దాడి జరిగినట్లు పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి మీడియా వ్యక్తులు వచ్చేటప్పుడు పోలీసులను వెంటపెట్టుకురావొద్దని ఆ పార్టీ కోరింది. అక్టోబర్ 30న నక్సల్స్ జరిపిన దాడిలో ముగ్గురు పోలీసులు, దూరదర్శన్ కెమెరామన్ అచ్యుతానంద్ సాహు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పోలీసులే లక్ష్యంగా దాడి చేస్తే చేతిలో కెమెరా పట్టుకున్న అచ్యుతానంద్ సాహుపై కూడా మావోయిస్టులు కాల్పులెందుకు జరిపారని ఆ రాష్ట్ర స్పెషల్ డైరెక్టర్ జనరల్ డీఎం అవస్థి తీవ్రంగా స్పందించారు. -
మావోయిస్టు దాడిలో జర్నలిస్టు దుర్మరణం
చత్తీస్గడ్: మావోయిస్టుల దాడిలో ఒక వీడియో జర్నలిస్టు దుర్మరణం పాలయ్యారు. దంతేవాడ జిల్లాలో మంగళవారం జరిగిన నక్సల్స్‌దాడిలో ప్రభుత్వరంగ మీడియాసంస్థ దూరదర్శన్‌కు చెందిన కెమెరామ్యాన్ దుర్మరణం చెందారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో ఎన్నికల కవరేజ్ కోసం వెళ్లిన దూరదర్శన్ బృందం, పోలీసులపై దంతెవాడలోని అరన్పూర్ అడవుల సమీపంలో ఈదాడి జరిగింది. ఈ ఘటనపై నక్సల్స్ ఆపరేషన్స్ డీఐజీ పీ సుందర్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. చనిపోయిన మీడియా పర్సన్‌ను దూరదర్శన్ వీడియో జర్నలిస్టు అచ్యుతానందన్ సాహుగా గుర్తించామన్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరు పోలీసులు కూడా చనిపోయారన్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్రు పోలీసులను చికిత్సకోసం ఆసుపత్రికి తరలించామని డీఐజీ మీడియాకు వెల్లడించారు. పెట్రోలింగ్‌కు వెళ్లిన సందర్భంగా ఈ దాడి జరిగిందని తెలిపారు. Dantewada Naxal attack: Two security personnel who were injured brought to hospital. Two security personnel and a DD cameraman lost their lives in the attack. #Chhattisgarh pic.twitter.com/ZiqbwiNbNs — ANI (@ANI) October 30, 2018 -
దూరదర్శన్ కేంద్రాల మూసివేత!
జ్యోతినగర్ (రామగుండం): రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన ప్రసారాలను అందించిన 19 ప్రసార భారతి దూరదర్శన్ కేంద్రాలు మరో వారం రోజుల్లో మూతపడనున్నాయి. ఈ మేరకు ప్రసార భారతి డైరెక్టరేట్ జనరల్ నుంచి ఆయా దూరదర్శన్ కేంద్రాలకు ఉత్తర్వులు అందాయి. లోపవర్ ట్రాన్స్‌మీటర్/ వెరీ లోపవర్ ట్రాన్స్‌మీటర్ ప్రసారాలను నెలాఖరులో నిలుపుదల చేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. మూతపడే వాటిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 25 ఏళ్ల నుంచి ప్రసారాలను అందిస్తున్న 5 కేంద్రాలు ఉన్నాయి. ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్షిప్లో 1989లో ఏర్పాటు చేసిన దూరదర్శన్ కేంద్రం ద్వారా రామగుండం, గోదావరిఖని ప్రాంతంతో పాటు 40 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలకు దూరదర్శన్ ప్రసారాలు అందుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావమైనప్పటి నుంచి యాదగిరి పేరుతో ప్రసారాలు అందిస్తున్నారు. పోర్టబుల్ టీవీలకు తప్పని ఇబ్బందులు దూరదర్శన్ కేంద్రాలను ఎత్తివేసినప్పటికీ డిజిటలైజేషన్ సాయంతో నాణ్యమైన ప్రసారాలు రానున్నట్లు సమాచారం. కానీ పోర్టబుల్ టెలివిజన్లకు డిజిటల్ విధానం ఎంతవరకు ఉపయోగపడుతుందనేది తెలియాల్సి ఉంది. సిగ్నల్స్ అందుకునే సామర్థ్యం బ్లాక్ అండ్ వైట్ టీవీలకు సాధ్యమా..అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో డేటా లేకుండా ప్రసారాలను చూడవచ్చని చెబుతున్నందున, ఎఫ్ఎం తరహాలో మొబైల్ ప్రసారాలకు ఆదరణ లభించే అవకాశం ఉంది. చాలా తక్కువ మంది మాత్రమే దూరదర్శన్ చూస్తున్నట్లు సర్వేలో తేలడంతోనే కేంద్రాల తొలగింపునకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మూతపడనున్న దూరదర్శన్ ట్రాన్స్మీటర్లు 19 భద్రాచలం, భైంసా, గద్వాల, జడ్చర్ల, కరీంనగర్, కొల్లాపూర్, కోస్గి, మిర్యాలగూడ, మాడ్గుల, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, సిద్దిపేట, సిరిసిల్ల, తాలకొండపల్లి, వేములవాడ, వనపర్తి, యెల్లందు. -
ఇరువురు జానకీలు ఒక్కచోట చేరిన వేళ...
దూర్‌దర్శన్‌లో ధారవాహికలు ప్రారంభమయిన తొలి నాళ్లలో వచ్చిన సంచలనం ‘రామాయణ్’. వాల్మీకి మహర్షి రచించిన ఆ అపురూప కావ్యాన్ని దృశ్యంగా మలచి ఏడాదిన్నర కాలం పాటు ప్రేక్షకులను అలరించింది. ఆదివారం వచ్చిందంటే చాలు ఎన్ని పనులున్నా ‘రామాయణ్’ ప్రసార సమయానికి మాత్రం టీవీల ముందు వాలిపోయేవారు. అంతలా జనాల్ని అలరించిన ఆ దృశ్యకావ్యంలో అరుణ్ గోవిల్ ‘శ్రీరాముడి’గా నటించగా, దీపికా చిఖాలియా ‘జానకి’గా అలరించింది . ‘రామాయణ్’లో వారు ప్రేక్షకులను ఎంతలా అలరించారంటే, వారనేదో టీవీ నటుల్లా కాక, దేవతా మూర్తులు ‘సీతారాముల్లా’నే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. నేటి కాలంలో కూడా పలు ఇతిహాసాలను తెరకెక్కితోన్నా, అలనాటి ‘రామాయణ్’ స్థానం ప్రత్యేకం. ఈ కాలం నటినటులతో 2008లో కూడా ‘రామాయణ్’ ధారావాహిక ప్రారంభమయ్యింది. ఇది కూడా ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇందులో బొన్నెర్జి సీతా దేవి పాత్రలో నటించింది. అయితే ఈ మధ్య ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ నాటి సీత దీపికా చిఖాలియా, ఈ నాటి సీత బొన్నెర్జిలు ఇద్దరు ఒక్క చోట చేరడం జరిగింది. ఇంకేముంది ఇద్దరు జానకీలను తమ కెమరాల్లో బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు పోటి పడ్డారు. ఈ సందర్భంగా బొన్నెర్జి, చిఖలియాతో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దాంతో పాటు ‘ఈ నాటి సీత, ఆ నాటి సీతను కలిసింది. చాలా అద్భుతమైన, అరుదైన సందర్భం. నేను రామాయణలో నటించడానికి ఒప్పుకున్నప్పుడు మీ(చిఖాలియా) డీవీడీలను చూసి, అర్ధం చేసుకుని, తెలుసుకొని నటించాను. నిజంగా మీరోక లెజెండ్. ప్రేమతో’ అనే సందేశాన్ని పోస్టు చేశారు బొన్నెర్జి. ఇలా ఇద్దరు సీతలను ఒక్క చోట చూసిన అభిమానులు కూడా తెగ సంతోషిస్తున్నారు. వీరిద్దరి ఫోటోలను తెగ షేర్ చేస్తోన్నారు. When #Sita meets Sita ........ How I savoured this moment of meeting you @dipikkatopiwala my first work #ramayana was on the foundation of seeing your DVDs , understanding, forming knowledge. #legend................ lots of looooove. 🙏🏻🙏🏻🙏🏻 A post shared by Debina Bonnerjee (@debinabon) on Jul 29, 2018 at 2:07am PDT ఏనాటికైనా చెడుపై మంచే విజయం సాధిస్తుందనే ఇతివృత్తంతో వాల్మీకి రచించిన ఇతిహాసం రామాయణాన్ని సుభాష్ సాగర్, రామానంద్ సాగర్, ప్రేమ్ సాగర్లు నిర్మాతలుగా, రామానంద్, ఆనంద్ సాగర్, మోతీ సాగర్ దర్శకత్వంలో రామాయణ్‌ను తెరకెక్కించారు. దాదాపు 78 వారాలపాటు ప్రసారమయిన ఈ ధారావాహిక తొలి ఎపిసోడ్ 1986, జనవరి 25న ప్రారంభం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సీరియల్‌ను దాదాపు 65 కోట్ల మంది వీక్షించారు. -
ఐపీఎల్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దూరదర్శన్లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రసారం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో క్రికెట్ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గతంలో అయితే మ్యాచ్‌లు చూసేందుకు కేబుల్ నెట్వర్క్ కనెక్షన్లు తీసుకునేవారు. ప్రస్తుతం కొన్ని టెలికాం సంస్థలు సైతం ఐపీఎల్ క్రికెట్ అభిమానుల కోసం కొత్త రీఛార్జ్ ప్యాక్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో దూరదర్శన్ స్పోర్ట్స్‌లోనూ ప్రసారం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా దూరదర్శన్‌లో మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి. కానీ, ఐపీఎల్ మ్యాచ్‌లు కాస్త ఆలస్యంగా ప్రసారం అవుతాయని పేర్కొంది. మరోవైపు 2018-2022ల మధ్య ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసార హక్కులను కూడా స్టార్ ఇండియానే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో 2012-18 మధ్య హక్కులను రూ.3851 కోట్లకు స్టార్ ఇండియానే సొంతం చేసుకుంది. కాగా, టీమిండియా మ్యాచ్‌ల ప్రసార హక్కులను కళ్లు చెదిరే ధరను బీసీసీఐకి చెల్లిస్తూ స్టార్ ఇండియా నెట్వర్క్ సంస్థ ప్రసార హక్కులను నేడు (గురువారం) దక్కించుకున్న విషయం తెలిసిందే. అధికారిక సమాచారం ప్రకారం 6,138 కోట్ల రూపాయలకు టీమిండియా మ్యాచ్ ప్రసార హక్కులు అమ్ముడయ్యాయి. 2018-2023 ఐదేళ్ల కాలానికి మీడియా హక్కులను కైవసం చేసుకుంది. -
‘బ్లూవేల్’పై డాక్యుమెంటరీ చేయండి
న్యూఢిల్లీ: చాలా మంది ప్రాణాలను బలిగొంటున్న బ్లూవేల్ వేల్ చాలెంజ్ గేమ్ దుష్ప్రభావాలను వివరిస్తూ ఒక వారంలోగా పది నిమిషాల కార్యక్రమాన్ని రూపొందించి ప్రదర్శించాలని దూరదర్శన్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘మీరెలా చేస్తారో మాకు తెలీదు.. కానీ కచ్చితంగా ఈ పని చేసి తీరాలి’అని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం కన్వీల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల బెంచ్ ఆదేశించింది.బ్లూవేల్ చాలెంజ్ లాంటి ప్రమాదకర ఆటలను నిరోధించేందుకు మార్గదర్శకాలను రూపొందించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది స్నేహ కలిటా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన బెంచ్.. డాక్యుమెంటరీని ప్రైమ్ టైమ్ సమయాల్లో ప్రైవేట్ చానళ్లలోనూ ప్రదర్శించేలా సంబంధిత అధికారులను ఆదేశించింది. -
దూరదర్శన్‌కు ద్వంద్వ ప్రమాణాలేలా?
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ మాత సంస్థ ఆరెస్సెస్ అధినాయకుడు మోహన్ భగవత్ ప్రతిఏటా విజయదశమి రోజున ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగాన్ని శనివారం నాడు ప్రసారభారతి ఆధ్వర్యంలో నడిచే దూరదర్శన్ ప్రసారం చేయడం పట్ల తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రసారం చేయడానికి నిర్ద్వంద్వంగా నిరాకరించిన దూరదర్శన్, ఇప్పుడు రాజ్యాంగ లౌకిక భావాలకు వ్యతిరేకంగా మాట్లాడిన భగవత్ ప్రసంగాన్ని ప్రసారం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. స్వయంప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి ఆధ్వర్యంలో నడిచే దూరదర్శన్ ప్రసారాల విషయంలో ఇలా ద్వంద్వ ప్రమాణాలు పాటించడం ఏమేరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మానిక్ సర్కార్ రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న నాయకుడని, అలాంటి వ్యక్తి ప్రసంగానికే అవకాశం ఇవ్వని దూరదర్శన్ రాజ్యాంగ విరుద్ధ భావాలు కలిగిన వ్యక్తి ప్రసంగ ప్రసారానికి అనుమతివ్వడం ఏమిటని హేతువాదులు విమర్శిస్తున్నారు. 2014లో మోహన్ భగవత్ ప్రసంగ ప్రసారానికి దూరదర్శన్ అనుమతివ్వడంపట్ల అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. గత అనుభవాలను పరిగణలోకి తీసుకున్నా భగవత్ ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి వీల్లేదు. అయినా ఆయన ప్రసంగాన్ని అనుమతించారంటే స్వయం ప్రతిపత్తిని పక్కన పెట్టిన దూరదర్శన్ కేంద్ర ప్రభుత్వానికి లోబడి పనిచేస్తోందని అర్థం చేసుకోవచ్చు. -
సర్కార్ ప్రసంగంలో అభ్యంతరాలేమిటీ?
న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ తన రాష్ట్ర ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగాన్ని దూరదర్శన్, ఆకాశవాణి అగర్తలా విభాగం ప్రసారం చేయడానికి నిరాకరించడం పట్ల వివాదం రాజుకుంటోంది. తన ప్రసంగాన్ని యథాతధంగా ప్రసారం చేయడానికి నిరాకరించడం అసాధారణం, అప్రజాస్వామికం, అసహనం, నిరంకుశత్వం అని మానిక్ సర్కార్ విమర్శించగా, స్వయం ప్రతిపత్తిగలిగిన దూరదర్శన్, ఆకాశవాణిలు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖలో భాగమైనట్లు వ్యవహరించడం ఏమిటని వామపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మళ్లీ ఎమర్జెన్సీ కాలంనాటి ఆంక్షలు వస్తున్నాయని ప్రజాస్వామ్యవాదులు విమర్శిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 12వ తేదీన దూరదర్శన్, ఆకాశవాణిలు మానిక్ సర్కార్ ప్రసంగాన్ని రికార్డు చేశాయి. దీన్ని ఆగస్టు 15 తేదీన ప్రసారం చేయాల్సి ఉండింది. అయితే మానిక్ సర్కార్ ప్రసంగంలో అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయని, అవి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నందున యథాతధంగా ప్రసంగాన్ని ప్రసారం చేయడం కుదరదని చెబుతూ ఆగస్టు 14వ తేదీన సీఎం కార్యాలయానికి ఏఐఆర్ డైరెక్టర్ జనరల్ తరఫున అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ పేరిట ఓ లేఖ అందింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారు తన ప్రసంగ పాఠాన్ని మార్చుకున్నట్లయితే దాన్ని ప్రసారం చేయడానికి తమకు అభ్యంతరం లేదని తెలిపింది. ఢిల్లీలోని ప్రసార భారతి సీఈవోతో సంప్రతింపులు జరిపాకే తాము ఈ నిర్ణయానికి వచ్చామని కూడా ఆ లేఖలో స్పష్టం చేసింది. అయితే అందులో ఒక్క అక్షరాన్ని కూడా మార్చడం తమకు ఇష్టం లేదని సీఎం కార్యాలయం స్పష్టం చేయడంతో మానిక్ సర్కార్ ప్రసంగాన్ని దూరదర్శన్, ఆకాశవాణిలు ప్రసారం చేయలేదు. ఇంతకు మానక్ సర్కార్ లేఖలో అంత అభ్యంతరకరమైన అంశాలు ఏమీ ఉన్నాయి. భావ స్వాతంత్య్రం కలిగిన ప్రజాస్వామ్య దేశంలో స్వయంప్రతిపత్తిగల ప్రసార భారతికి నచ్చని అంశాలేమిటో, అవి ఎందుకు నచ్చలేదో ఓ సారి చూద్దాం! ప్రియమైన త్రిపుర ప్రజలారా! దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు. స్వాతంత్య్రం కోసం పోరాడిన అమర వీరులకు నా నివాళులు. స్వాతంత్య్రం కోసం పోరాడి ఇప్పటికీ మనందరి మధ్యనున్న యోధులకు నా గౌరవ వందనాలు. స్వాతంత్య్ర దినోత్సవం అంటే సంప్రదాయబద్ధంగా ఏటా జరుపుకునే ఓ పండుగ కాదు. ఈ దినానికి చారిత్రక ప్రాధాన్యతతోపాటు మన భావోద్రేకాలు ముడివడి ఉన్నాయి. ఈ సందర్భంగా మనం ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భిన్నత్వంలో ఏకత్వం మన సంప్రదాయ సంస్కతి. లౌకిక భావాల వల్లనే మన భారతీయులంతా కలిసిమెలిసి బతుకుతున్నారు. ఈరోజున మన లౌకిక భావానికి ముప్పు వాటిల్లుతోంది. కులమతాల ప్రాతిపదికన సమాజంలో విభనలు తీసుకరావడానికి కుట్రలు జరుగుతున్నాయి. సంకుచిత భావాలు జాతీయ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. గోరక్షణ పేరిట దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. వారిలో అభద్రతా భావం పెరిగిపోతోంది. భారత దేశంలో ఓ మత రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వాతంత్య్ర పోరాటానికి పురిగొల్పిన ఆదర్శాలు, కన్న కలలను దెబ్బతీసే విధంగా విచ్ఛిన్నకర శక్తులు రాజ్యమేలుతున్నాయి. స్వాతంత్య్ర ఉద్యమంతో ఏ మాత్రం సంబంధంలేని, పైగా స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించిన జాతి వ్యతిరేకులు నేడు రకరకాల పేర్లతో చెలామణి అవుతూ దేశ ఐక్యతను, సమగ్రతలను దెబ్బతీస్తున్నారు. దేశభక్తిగల ప్రతి పౌరుడు దేశ ఐక్యతకు కట్టుబడి ఈ విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా సంఘటితంగా నిలబడాలి’ అని మానిక్ సర్కార్ పిలుపునిచ్చారు. ‘నేడు సమాజంలో ధనిక, పేద అంతరాలు పెరిగిపోతున్నాయి. అపారమైన దేశ సంపద కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోకి చేరిపోగా మెజారిటీ ప్రజలు నోటి దగ్గరికి కూడు కూడా అందక కుమిలిపోతున్నారు. కొద్ది మంది కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ సామాజిక అంతరాలను పెంచి పోషిస్తున్న ప్రస్తుత ఆర్థిక, సామాజిక విధానానికి ప్రత్యామ్యాయ విధానం తప్పకుండా ఉంది. మెజారిటీ పేద ప్రజలను ఆదుకునే అలాంటి ప్రత్యామ్నాయ ఆర్థిక, సామాజిక విధానాన్ని సాధించడం కోసం త్రిపుర ప్రజలంతా ఒక్కటవ్వాలి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు భిన్నంగా రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు ఉన్నంత పరిధిలో ఈ ప్రభుత్వం కషి చేస్తోంది. ఇది సరిపోదు. ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాన్ని సాధించడం ఒక్కటే పరిష్కారం. అందుకు జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని కోరుకుంటున్నాను’ అని మానిక్ సర్కార్ తన ప్రసంగ పాఠంలో పేర్కొన్నారు. -
దూరదర్శన్‌కు కొత్త లోగో: గెలిస్తే బంపర్ ప్రైజ్
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్రాడ్ కాస్టింగ్ ఛానల్ దూరదర్శన్ ఐకానిక్ లోగో మారబోతుంది. కాలానుగుణంగా, యువ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి లోగో మార్పునకు దూరదర్శన్ ముందుకు వచ్చింది. ఇందు కోసం ప్రజల నుంచి దరఖాస్తులను కూడా దూరదర్శన్ ఆహ్వానిస్తోంది. కొత్త లోగో కోసం ఐడియాలు ఇస్తూ దరఖాస్తులను ఆగస్టు 14 వరకు సమర్పించాలని, గెలిచిన వారికి లక్ష రూపాయల వరకు బహుమానం కూడా ఇవ్వనున్నట్టు దూరదర్శన్ వెల్లడించింది. 30 ఏళ్ల కంటే తక్కువ వయసున యువతరాన్ని ఆకట్టుకోవడంతో దూరదర్శన్ విఫలమవుతుందని, ఈ నేపథ్యంలో లోగో మార్పు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వచ్చిందని దూరదర్శన్ నడిపే ప్రసారభారతీ సీఈవో శశి శేఖర్ వెంపటి తెలిపారు. దాదాపు 58 ఏళ్ల తర్వాత లోగో మార్చబోతున్నట్టు చెప్పారు. ఇది దేశంలోని యువతరంతో సంభాషించడానికి తాజా ప్రయత్నంగా వెంపటి అభివర్ణించారు. డీడీ బ్రాండును సరికొత్తగా తీసుకొస్తామన్నారు. బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దూరదర్శన్ను 1959లో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దీన్ని ఏర్పాటుచేసినట్టు మనుషుల కన్ను రూపంలో ఉండే ఇప్పటి లోగోను ఎంపిక చేశారు. అప్పటి నుంచీ అదే లోగో ప్రచారంలో ఉంది. ప్రస్తుత ప్రజల ఇష్టాలకు అనుగుణంగా, యువతను ఆకర్షించేలా కొత్త లోగో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మనదేశంలో 30 ఏళ్లలోపు యువతీయువకులు చాలామంది ఉన్నారని, వీరంతా దూరదర్శన్ కంటే చాలా చిన్నవారని, అప్పటి ప్రజల మనోభావాలకు, ఇష్టాలకు అనుగుణంగా ఆ లోగోను ఎంచుకున్నారని చెప్పారు. కానీ, ప్రస్తుత యువత ఆసక్తివేరుగా ఉందని, అందువల్ల వారిని అందరినీ ఆకట్టుకునేలా లోగో ఉండాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దూరదర్శన్ నేషనల్, రీజనల్, స్పోర్ట్స్ వంటి 21 చానళ్లను ఆపరేట్ చేస్తోంది. ప్రస్తుతం దేశంలో 65 శాతం మంది 35 ఏళ్లకు తక్కువగా ఉన్న వారే. -
షాకింగ్: యాంకర్‌ను మింగేసిన కొబ్బరిచెట్టు
ముంబై: ముంబైలో అనూహ్యమైన ప్రమాదం కలకలం రేపింది. మహిళను ఓ కొబ్బరిచెట్టు మృత్యువులా వెంటాడింది. మార్నింగ్ వాక్ వెళ్లిన ఆమె నెత్తిపై కొబ్బరి చెట్టు ఒక్కసారిగా విరిగి పడిన షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దూరదర్శన్ మాజీ యాంకర్ మరణించిన వైనం తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానిక సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బాధిత మహిళను దూరదర్శన్ మాజీ యాంకర్ కంచన్ రజత్ నాథ్(58)గా గుర్తించారు. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలోని శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది దూరదర్శన్ మాజీ యాంకర్, యోగ టీచర్ కూడా అయిన కంచన్ నాథ్ గురువారం ఉదయం మార్నింగ్ వాక్ వెళ్లారు. ఇంటికి సమీపంలో నడుస్తుండగా కొబ్బరిచెట్టు అకస్మాత్తుగా ఆమెమీద విరుచుకుపడింది. దీంతో ఆమె చెట్టుకింద పడి నలిగిపోయింది. అకస్మారక స్థితిలోకి జారుకున్న ఆమెను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. తీవ్ర గాయాలతో శనివారం ఉదయం కన్ను మూశారని కంచన్ భర్త తెలిపారు. ఈ విషాదంపై ఆమె కుటుంబ సభ్యులు ముంబై మున్సిపల్ కార్పోరేషన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పాడైపోయి.. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న చెట్టు కొట్టివేయడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో బీఎంసీ అనుమతి నిరాకరించిందని వారు ఆరోపించారు. -
హీరోయిన్‌పై వేటుకు సిద్ధం?
హీరోయిన్ కాజోల్ మీద వేటు వేసేందుకు ప్రసారభారతి సిద్ధం అవుతోంది. సమావేశాలకు హాజరు కాకపోవడంతో ఆమెను తప్పించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ అంశం సమాచార ప్రసార మంత్రిత్వశాఖ పరిశీలనలో ఉంది. దూరదర్శన్, ఆలిండియా రేడియోలతో కూడిన ప్రసారభారతి ఒక స్వతంత్ర సంస్థ. ఇది సమాచార ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. 2016 ఫిబ్రవరి నెలలో కాజోల్‌ను ఈ బోర్డులో పార్ట్ టైం సభ్యురాలిగా నియమించారు. అయితే గత నాలుగు సమావేశాల నుంచి ఆమె అసలు హాజరు కావడం లేదు. దాంతో ఆమెను ఆ పదవి నుంచి తప్పించాలని భావిస్తున్నారు. చైర్మన్‌కు చెప్పకుండా వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైతే వాళ్ల సభ్యత్వాన్ని రద్దుచేయచ్చని ప్రసారభారతి నిబంధనలు చెబుతున్నాయి. ముందుగానే ఉన్న వృత్తిపరమైన కమిట్మెంట్ల వల్లే గత మూడు నాలుగు సమావేశాలకు కాజోల్ హాజరు కాలేదని ఆమె ప్రతినిధి జైవీర్ అన్నారు. అంతేకాక ఈ సంవత్సరంలో చాలాకాలం పాటు కుటుంబపరమైన వైద్య కారణాలు కూడా అందుకు ఉన్నాయన్నారు. గత కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయినందుకు ఆమె కూడా చాలా బాధపడ్డారని తెలిపారు. కానీ బోర్డులోని పలువురు సభ్యులు మాత్రం గత సమావేశంలోనే ఆమె రాకపోవడాన్ని ప్రస్తావించి, కాజోల్‌ను తొలగించాలని అన్నారు. ముందుగా ఆమెకు ఒక నోటీసు పంపుతామని, ఆ తర్వాత ఆమెపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మంత్రిత్వశాఖ నిర్ణయిస్తుందని బోర్డు వర్గాలు తెలిపాయి. బోర్డు సమావేశాలకు వచ్చేందుకు సభ్యులకు విమాన చార్జీలు, హోటల్ చార్జీలు, ఇతర అలవెన్సులు ఇస్తారు. -
ఫ్రీగా దూరదర్శన్ చూడొచ్చు
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఫోన్లలో ఉచిత టీవీ సేవలను దూరదర్శన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలు ఫిబ్రవరి 25 నుంచే దేశంలోని 16 నగరాల్లో అమల్లో ఉన్నట్లు దూరదర్శన్ తెలిపింది. ఒకసారి యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న అనంతరం దూరదర్శన్ చానెల్‌ను చూడడానికి ఇంటర్నెట్ సదుపాయం కూడా అక్కర్లేదు. -
దూరదర్శన్‌లో ఐలమ్మ జీవిత చరిత్ర
హైదరాబాద్: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ నిజ జీవిత చరిత్రను సీరియల్‌గా దూరదర్శన్‌లో ప్రసారం కానుంది. ఈ నెల 2 నుంచి దూరదర్శన్ యాదగిరి ఛానల్లో ప్రసారం చేయనున్నట్టు దర్శక నిర్మాత నాగబాల సురేష్‌కుమార్ చెప్పారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్‌కాలనీలో ఉన్న తెలుగు టీవీ ఫెడరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చాకలి ఐలమ్మ సీరియల్ విశేషాలను తెలియజేశారు. మంగళవారం రాత్రి 7-30 గంటలకు ఇది ప్రసారమవుతుందని, డైలీ సీరియల్‌గా ఈ ధారావాహిక కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దీనిని అదేరోజు ప్రసారం చేయడానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. పెత్తందారీ వ్యవస్థను నామరూపాల్లేకుండా చేయాలనే కసితో, నిజాం దొరలను చీల్చి చెండాడాలనే చైతన్యంతో ఉద్యమించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని ఆమె తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ స్పూర్తి ప్రదాత అని తెలియజేశారు. -
దూరదర్శన్ న్యూస్‌ను స్వాధీనం చేసుకుంటుందా?
న్యూఢిల్లీ: ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాల కోసమంటూ ఇప్పటికే జాతీయ అధికారిక మీడియాను క్రియాశీలకంగా వాడుకుంటున్న మోదీ ప్రభుత్వం వాటిపై మరింత పట్టు బిగించబోతోందా.. తాజా పరిణామం చూస్తోంటే ఈ అనుమానం రాకమానదు. 'మన్ కీ బాత్' పేరిట ఆకాశవాణిని తనదైన శైలిలో ఉపయోగించుకుంటున్న మోదీ ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. పబ్లిక్ సర్వీస్ బ్రాడకాస్టర్ దూరదర్శన్ (జాతీయ ప్రజా ప్రసారకర్త) న్యూస్‌ను ప్రభుత్వం.. స్వాధీనం (టేక్ ఓవర్) చేసుకున్నట్లు తెలుస్తోంది. దూరదర్శన్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న అక్షయ్ రౌత్ స్థానంలో వీణా జైన్‌ని నియమిస్తూ శుక్రవారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రసార మంత్రిత్వ శాఖలో ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్‌గా ఉన్న జైన్, రెండు బాధ్యతలను ఉమ్మడిగా నిర్వహిస్తారని తెలిపింది. దూరదర్శన్ ఛానల్‌కు క్రమేపీ తగ్గుతున్న ప్రేక్షకాదరణ, క్షీణిస్తున్న ఆదాయం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం అకస్మాత్తుగా ప్రకటించిన ఈ నిర్ణయంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది . స్వయం ప్రతిపత్తి కలిగిన దూరదర్శన్పై పెత్తనం చెలాయించేందుకు, వార్తా ప్రసారాలను తమ నియంత్రణలో ఉంచుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా దూరదర్శన్లోని అన్ని మీడియా విభాగాల హెడ్లకు జైన్ నియామకానికి సంబంధించిన సమాచారాన్ని అందించి, ప్రసార భారతి సీఈఓ, ప్రసార భారతి బోర్డ్ ఛైర్మన్‌ను విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. కాగా జాతీయ అధికార ఛానల్ అయిన దూరదర్శన్ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. స్వతంత్య ప్రతిపత్తిని కలిగి ఉంది. అయితే ఆర్ఎస్ఎస్ 89వ వ్యవస్థాపక దినం సందర్భంగా, దసరా సందర్భంగా అక్టోబర్ 3న దూరదర్శన్ ఛానల్లో భాగవత్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని కాంగ్రెస్, లెప్ట్ పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. హిందూత్వ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి దూరదర్శన్ ఛానల్‌ను వాడుకున్నారని విమర్శించాయి. ఈ క్రమంలో డీడీ ద్వారా ఓ వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రసార భారతిని ఆదేశించినట్టు వార్తలొచ్చాయి. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తన ప్రసంగ పాఠాన్ని కట్ చేశారని ఆరోపిస్తూ జాతీయ టీవీ(డీడీ) ప్రొఫెషనల్ ఫ్రీడమ్ పాటించడం లేదని విచారం వ్యక్తం చేస్తూ మోదీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
దూరదర్శన్ అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్
-
అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్
-
దూరదర్శన్ అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్
విజయవాడ : దూరదర్శన్ ఉన్నతోద్యోగి ఒకరు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. విజయవాడ దూరదర్శన్ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ హనుమంతరావు గురువారం లక్షన్నర లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. టెలీ సీరియల్స్ బిల్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేయటంతో బాధితులు సీబీఐని ఆశ్రయించారు. దాంతో రంగంలోకి దిగిన సీబీఐ...అధికారి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం హనుమంతరావును అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దటీజ్,....మోదీ!
న్యూఢిల్లీ: గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాల కోసం సామాజిక వెబ్సైట్లను విశేషంగా ఉపయోగించుకొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక కూడా ప్రభుత్వ పథకాలకు ప్రజల వద్దకు తీసుకెళ్లడం కోసం, ప్రభుత్వ వ్యతిరేక విమర్శలను తిప్పికొట్టడం కోసం వాటిని క్రియాశీలకంగా ఇప్పటికీ ఉపయోగించుకుంటున్న విషయం తెల్సిందే. వారానికోసారి 'మన్ కీ బాత్' పేరిట ఆకాశవాణిని తనదైన శైలిలో ఉపయోగించుకుంటున్న మోదీ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి డీడీ మీద కన్నేశారు. ప్రతిపక్షాలు లేదా ఇతర పక్షాల నుంచి వచ్చే విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు, ప్రభుత్వ పథకాలకు విశేష ప్రాచుర్యం కల్పించేందుకు డీడీ ద్వారా ఓ వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రసార భారతిని ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. డీడీ తెర వెనక నుంచి ఈ పోర్టల్ కార్యకలాపాలను చూడాల్సిన బాధ్యతను ప్రముఖ రాజకీయ విమర్శకుడు సుబ్రహ్మణియం స్వామికి అప్పగించినట్టు తెలుస్తోంది. ఇంతకుముందు అధికారంలోవున్న రాజకీయ పక్షాల్లాగా విపక్షాలపై అనవసరంగా నోరు పారేసుకోకుండా, ప్రస్తుతమున్న మీడియాపై నియంత్రణ తీసుకురావడం లేదా మీడియాను ప్రలోభాలకు గురిచేయకుండా ఇలా తనదైన మీడియాను తీసుకొస్తున్నారు. దటీజ్,...మోదీ! -
దూరదర్శన్ కు జదేకర్ చురక
పనాజీ: అన్ని విషయాల్లో ఆలస్యంగా స్పందించే దూరదర్శన్ కు కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేవకర్ బహిరంగంగా మొట్టికాయ వేశారు. దక్షిణ గోవా రిసార్ట్ లో జరిగిన 16వ ఆల్ ఇండియా విప్స్ కాన్ఫెరెన్స్ లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి ప్రసంగించేందుకు సిద్ధంకాగానే ఆలస్యంగా వచ్చిన దూరదర్శన్ ప్రతినిధి హడావుడిగా ఆయన ముందు మైక్ పెట్టాడు. దీన్ని గమనించిన మంత్రి... దూరదర్శన్ అన్ని విషయాల్లో ఆలస్యంగానే స్పందిస్తుంది అంటూ చురక అంటించారు. జాతీయ అధికార చానల్ అయిన దూరదర్శన్ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. -
ముజాహిద్దీన్, అల్‌ఖైదా ప్రసంగాలను కూడా...
హైదరాబాద్ : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసరాన్ని దురదర్శన్ ప్రసారం చేయటాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోహన్ భగవత్ ప్రసంగాన్ని డీడీలో ఎలా ప్రసారం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ అంశాన్ని సమాచార శాఖమంత్రి సమర్థించటం సరికాదని వీహెచ్ అన్నారు. ఇండియన్ ముజాహిద్దీన్, అల్‌ఖైదా నేతల ప్రసంగాలను కూడా డీడీలో ప్రసారం చేయాలంటే పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ఐక్యంగా ఉంచాలనుకుంటున్నారా లేక విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారా అని వీహెచ్ సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఉన్న మత సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసేలా మోడీ సర్కార్ వ్యవహరించటం సరికాదని ఆయన అన్నారు. -
ప్రత్యక్ష ప్రసారం చేస్తే తప్పేంటి?
నాగపూర్: ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ప్రసంగాన్ని దూరదర్శన్ లో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. దూరదర్శన్ చేసిన దాంట్లో తప్పేంలేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. స్వయంప్రతిపత్తి కలిగిన దూరదర్శన్ ప్రొఫెషనలిజం చూపాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. దూరదర్శన్ కార్యకలాపాల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. భాగవత్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ 89వ వ్యవస్థాపక దినోత్సవంతో పాటు దసరా సందర్భంగా అక్టోబర్ 3న భాగవత్ చేసిన ప్రసంగాన్ని దూరదర్శన్‌లో గంట పాటు ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే తొలిసారి. భాగవత్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. -
దూరదర్శన్‌లో ఆర్ఎస్ఎస్ ప్రసంగం!
-
దూరదర్శన్‌లో ఆర్ఎస్ఎస్ ప్రసంగం!
దూరదర్శన్ ఛానల్లో ఆర్ఎస్ఎస్ అధినేత ప్రసంగాన్ని ప్రసారం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ అంశాన్ని సీపీఎం శుక్రవారం నాడు లేవనెత్తింది. ప్రభుత్వ ప్రసారకర్త అయిన ఛానల్‌ను ఈ రకంగా దుర్వినియోగం చేయడం సరికాదని సీపీఎం విమర్శించింది. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తన హిందూత్వ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి దూరదర్శన్ ఛానల్‌ను వాడుకున్నారని పార్టీ ఓ ప్రకటనలో విమర్శించింది. జాతీయ ప్రజా ప్రసారకర్తకు ఆర్ఎస్ఎస్ లాంటి ఓ మతవాద సంస్థ అధినేత ప్రసంగాన్ని ప్రచారం చేయడం తప్ప మరో పని ఏమీ లేదా అని ప్రశ్నించింది. మోదీ సర్కారు ప్రజా ప్రసారకర్త ఛానల్‌ను దుర్వినియోగం చేస్తోందనడానికి ఇదే నిదర్శనమని చెప్పింది. -
'మోడీ పాలనలో భారత్ దూసుకుపోతుంది'
నాగపూర్: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనలో భారత్ అన్ని రంగాల్లో దూసుకువెళ్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతి ఆకాంక్షించారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల కాల వ్యవధిలోనే ... దేశ ఆర్థికాభివృద్ధి, జాతీయ భద్రత, అంతర్జాతీయ సంబంధాల విషయంలో ఆయన సాధించిన పురోగతిని వివరించారు. దసరా పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం నాగపూర్‌లో రేషంబాగ్ మైదానంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి మోహన్ భగవతి ప్రసంగించారు. ఈ సందర్బంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మెహన్ భగవతి ప్రశంసల జల్లు కురిపించారు. మోడీ పాలనతో భారత్ ప్రజలలో చిరు ఆశలు మొలకెత్తాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు ఇవి ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. మోడీ తన పాలన ద్వారా మరి పథకాల అమలుకు కొంత సమయం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భగవతి ప్రసంగాన్ని డీడీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. -
దూరదర్శన్ టి.చానల్ ‘యాదగిరి’
సాక్షి, హైదరాబాద్: దూరదర్శన్ తెలంగాణ ప్రాంతీయ చానల్‌కు ‘యాదగిరి’ పేరును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో దూరదర్శన్ ‘సప్తగిరి’ పేరుతో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రసారాలు జరిగేవి. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక ప్రసారాలు చేసేందుకు కొత్త ప్రాంతీయ చానల్‌ను కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ పరిధిలోని ‘ప్రసార భారతి’ సంస్థ ప్రారంభించనుంది. ఈ చానల్‌కు ‘యాదగిరి’ అనే పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ దూరదర్శన్ అధికారులను కోరారు. ప్రసారాలను ఈనెల 27 నుంచి ప్రారంభిస్తామని హైదరాబాద్ దూరదర్శన్ అధికారులు తెలిపారు. -
'ఆ హీరోహీరోయిన్ల సినిమాలు నిషేధం'
ఎన్నికల బరిలో నిలిచిన హీరో హీరోయిన్లకు ఉన్నతాధికారులు మరో ఝలక్ ఇచ్చారు. సదరు హీరోహీరోయిన్లు నటించిన చిత్రాలు జాతీయ టెలివిజన్ ఛానల్ దూరదర్శన్‌లో ప్రసారం చేయకుండా నిలిపివేస్తున్నట్లు ఉన్నతాధికారులు గురువారం లక్నోలో వెల్లడించారు. హీరోయిన్లు హేమమాలిని, జయప్రద, నగ్మ,స్మృతి ఇరానీ, హీరో రాజ్ బబ్బార్తోపాటు జావెద్ జాఫ్రీ నటించిన చిత్రాలపై నిషేధం విధించినట్లు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో ఆ హీరోహీరోయిన్లు నటించిన చిత్రాలు టీవీలో ప్రసారం చేస్తే ఓటర్లపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. రాజ్ బబ్బార్, నగ్మా (కాంగ్రెస్ పార్టీ ) , జయప్రద (రాష్ట్రీయ లోక్ దళ్ ), హేమమాలిని, స్మృతి ఇరానీ (బీజేపీ), జావేద్ జాఫ్రీ (ఆప్) పార్టీల తరపున లోక్ సభ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
డీడీ షోలో తల్లీకూతుళ్లు
మహిళలపై నేరాలను నిరోధించే ప్రయత్నంలో భాగంగా దూరదర్శన్ తాజాగా ‘మై కుచ్ భీ కర్ సక్తీ హూ’ అనే షో రూపొందిస్తోంది. దీనికి సహకరించడానికి అలనాటి అందాలతార షర్మిళా ఠాగూర్, ఆమె ముద్దుల కూతురు సోహా అలీఖాన్ సిద్ధమవుతున్నారు. బాల్యవివాహాలు, లేత వయసు గర్భాలు, లింగ నిర్ధారణ వంటి దురాచారాలను ఎండగడుతుంది కాబట్టే ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నామని తల్లీకూతుళ్లు చెబుతున్నారు. ‘మనదేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఈ షోకు సహకరించడం మన బాధ్యత. ఇందులో పాల్గొనాలని నా కొడుకు-కోడలు సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్‌ను కూడా అడుగుతాను’ అని షర్మిళ అన్నారు. మై కుచ్ భీ కర్ సక్తీ హూను ఫిరోజ్ అబ్బాస్‌ఖాన్ నిర్మించి దర్శకత్వం వహిస్తున్నారు. మహిళలపై నేరాల నిరోధానికి డాక్టర్ స్నేహ చేసిన కృషిని గురించి ఈ కార్యక్రమం వివరిస్తుంది. సోహా మాట్లాడుతూ ‘మేం సంపన్న కుటుంబంలో పుట్టాం. ఎటువంటి ఇబ్బందులూ లేకున్నా నేను సినిమాల్లోకి వస్తానంటే మాత్రం ఒప్పుకోలేదు. నేను పట్టువీడకపోవడంతో చివరికి సరే అన్నారు. అందుకు నా కుటుంబానికి కృతజ్ఞురాలిని. అయితే ఇలాంటి ఉన్నతస్థాయి జీవితమంటే ఏంటో చాలా మంది మహిళలకు తెలియదు. కాబట్టే ఇలాంటి మంచి కార్యక్రమానికి సహకరిస్తున్నాను’ అని వివరించింది. సినిమా తారల వంటి ప్రముఖులు ఇలాంటి సామాజిక సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటే వీక్షకుల సంఖ్య బాగా పెరుగుతుందని తెలిపింది. మై కుచ్ భీ కర్ సక్తీ హూ షో ప్రపంచ మహిళల దినోత్సమైన మార్చి 8 నుంచి ప్రసారమవుతుంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ సైతం సత్యమేవ జయతే పేరుతో సామాజిక అంశాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం తెలిసిందే. -
దూరదర్శన్‌లో భారీ సీరియళ్లు!
న్యూఢిల్లీ: దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ఒకే తరహా మూస కార్యక్రమాలతో విసిగెత్తిన ప్రేక్షకులకు శుభవార్త! ఇకపై బుల్లితెరపై భారీ బడ్జెట్‌తో నిర్మించిన ధారావాహికలను ప్రసారం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నాణ్యమైన కార్యక్రమాలను అందచేసే నిర్మాతలతో కలిసి ఆదాయం పంచుకోవాలని దూరదర్శన్ నిర్ణయించింది. కొత్త విధానం ప్రకారం భారీ బడ్జెట్‌తో సీరియళ్లు నిర్మించే నిర్మాతలు ప్రకటనదారులను తెచ్చుకోవచ్చు. ఈ ప్రతిపాదనలను ప్రసార భారతి బోర్డు ఇటీవల ఆమోదించింది. ఆదాయ పంపిణీ విధానం కింద సీరియళ్ల నిర్మాతలు వాటిని దూరదర్శన్‌లో ప్రసారం కోసం ఉచితంగా అందచేయాలి. దీనిద్వారా లభించే ఆదాయాన్ని ప్రత్యేక ఖాతాకు జమచేసి దూరదర్శన్, నిర్మాతలు పంచుకుంటారు. కనీసం ఎయిర్టైం ఖర్చులైనా దూరదర్శన్‌కు దక్కేలా నిబంధన రూపొందించారు. -
దూరదర్శన్‌లో భారీ సీరియళ్లు!
న్యూఢిల్లీ: దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ఒకే తరహా మూస కార్యక్రమాలతో విసిగెత్తిన ప్రేక్షకులకు శుభవార్త! ఇకపై బుల్లితెరపై భారీ బడ్జెట్‌తో నిర్మించిన ధారావాహికలను ప్రసారం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నాణ్యమైన కార్యక్రమాలను అందచేసే నిర్మాతలతో కలిసి ఆదాయం పంచుకోవాలని దూరదర్శన్ నిర్ణయించింది. కొత్త విధానం ప్రకారం భారీ బడ్జెట్‌తో సీరియళ్లు నిర్మించే నిర్మాతలు ప్రకటనదారులను తెచ్చుకోవచ్చు. ఈ ప్రతిపాదనలను ప్రసార భారతి బోర్డు ఇటీవల ఆమోదించింది. ఆదాయ పంపిణీ విధానం కింద సీరియళ్ల నిర్మాతలు వాటిని దూరదర్శన్‌లో ప్రసారం కోసం ఉచితంగా అందచేయాలి. దీనిద్వారా లభించే ఆదాయాన్ని ప్రత్యేక ఖాతాకు జమచేసి దూరదర్శన్, నిర్మాతలు పంచుకుంటారు. కనీసం ఎయిర్టైం ఖర్చులైనా దూరదర్శన్‌కు దక్కేలా నిబంధన రూపొందించారు.