పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు టీమిండియా వచ్చే నెలలో (జులై) వెస్టిండీస్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. విండీస్ పర్యటనలో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లన్నీ సర్కారు వారి ఛానల్ అయిన డీడీ స్పోర్ట్స్‌లో మాత్రమే ప్రత్యక్ష ప్రసారమవుతాయని భారత సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
The TV broadcast of all cricket matches during India’s tour of West Indies in July 2022 will be available in India only on DD Sports, on all Cable & DTH platforms. @ddsportschannelhttps://t.co/b8MvynJu9g
— Prasar Bharati प्रसार भारती (@prasarbharati) June 25, 2022
లైవ్ మ్యాచ్‌లతో పాటు నిపుణులు, సెలబ్రిటీలచే ప్రీ మ్యాచ్, పోస్ట్ మ్యాచ్ విశ్లేషణలు కూడా అందిస్తామని ప్రసార భారతి పేర్కొంది. అన్ని కేబుల్, డీటీహెచ్ ప్లాట్‌ఫామ్‌లలో డీడీ స్పోర్ట్స్ ఛానల్ ప్రసారమవుతుందని తెలిపింది. కాగా, జులై 22 నుంచి ఆగస్ట్ 7 వరకు వెస్టిండీస్‌లో పర్యటించే టీమిండియా 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు ఆడనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా జులై 17న పరిమిత ఓవర్ల సిరీస్‌లు ముగియగానే నేరుగా కరీబియన్ దీవులకు బయల్దేరనుంది.
ఈ పర్యటనలో టీమిండియా తొలుత మూడు వన్డేలు (జూలై 22, 24, 27), ఆతర్వాత 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ (జులై 29, ఆగస్ట్ 1, 3, 6, 7) ఆడనుంది. వన్డే మ్యాచ్‌లన్నీ ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో జరుగనుండగా.. తొలి టీ20 ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో.. రెండు, మూడు టీ20లు వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్‌లో.. ఆఖరి రెండు టీ20లు అమెరికాలోని (ఫ్లోరిడా) బ్రోవార్డ్ కౌంటీ స్టేడియంలో జరుగనున్నాయి.
చదవండి: ఇండియా వర్సెస్ ఐర్లాండ్ తొలి టీ20.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..!
Comments
Please login to add a commentAdd a comment