Prasara bharathi
-
సర్కారు వారి ఛానల్లో టీమిండియా మ్యాచ్‌లు
పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు టీమిండియా వచ్చే నెలలో (జులై) వెస్టిండీస్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. విండీస్ పర్యటనలో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లన్నీ సర్కారు వారి ఛానల్ అయిన డీడీ స్పోర్ట్స్‌లో మాత్రమే ప్రత్యక్ష ప్రసారమవుతాయని భారత సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. The TV broadcast of all cricket matches during India’s tour of West Indies in July 2022 will be available in India only on DD Sports, on all Cable & DTH platforms. @ddsportschannelhttps://t.co/b8MvynJu9g — Prasar Bharati प्रसार भारती (@prasarbharati) June 25, 2022 లైవ్ మ్యాచ్‌లతో పాటు నిపుణులు, సెలబ్రిటీలచే ప్రీ మ్యాచ్, పోస్ట్ మ్యాచ్ విశ్లేషణలు కూడా అందిస్తామని ప్రసార భారతి పేర్కొంది. అన్ని కేబుల్, డీటీహెచ్ ప్లాట్‌ఫామ్‌లలో డీడీ స్పోర్ట్స్ ఛానల్ ప్రసారమవుతుందని తెలిపింది. కాగా, జులై 22 నుంచి ఆగస్ట్ 7 వరకు వెస్టిండీస్‌లో పర్యటించే టీమిండియా 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు ఆడనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా జులై 17న పరిమిత ఓవర్ల సిరీస్‌లు ముగియగానే నేరుగా కరీబియన్ దీవులకు బయల్దేరనుంది. ఈ పర్యటనలో టీమిండియా తొలుత మూడు వన్డేలు (జూలై 22, 24, 27), ఆతర్వాత 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ (జులై 29, ఆగస్ట్ 1, 3, 6, 7) ఆడనుంది. వన్డే మ్యాచ్‌లన్నీ ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో జరుగనుండగా.. తొలి టీ20 ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో.. రెండు, మూడు టీ20లు వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్‌లో.. ఆఖరి రెండు టీ20లు అమెరికాలోని (ఫ్లోరిడా) బ్రోవార్డ్ కౌంటీ స్టేడియంలో జరుగనున్నాయి. చదవండి: ఇండియా వర్సెస్ ఐర్లాండ్ తొలి టీ20.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..! -
నా పరువు తీస్తున్నారు!
న్యూఢిల్లీ: రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో తన పేరును అనవసరంగా మీడియాలో ప్రచారం చేస్తున్నారని, దీన్ని నిలిపివేయాలని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రకుల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం వైఖరి వెల్లడించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తమ వైఖరిని చెప్పాలని పిటిషన్ విచారించిన జస్టిస్ నవీన్ చావ్లా కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకు, ప్రసారభారతికి, ప్రెస్ కౌన్సిల్‌కు, న్యూస్ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్‌కు నోటీసులు జారీ చేశారు. రకుల్ పిటిషన్‌ను ఫిర్యాదుగా స్వీకరించి ఈ నాలుగు సంస్థలు ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేశారు. డ్రగ్స్ కేసులో విచారణ వేళ సంబంధిత ఆఫీసర్లకన్నా ముందే మీడియాకు కొన్ని అంశాలు లీకవుతున్నాయని, దీనిపై విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు. ముందుగా ఫిర్యాదు చేయాల్సింది.. కేసులో కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వాదనలు వినిపించారు. రకుల్ కోరుకున్నట్లు ఇంజంక్షన్ లేదా బ్లాంకెట్ బ్యాన్ లాంటి ఆదేశాలివ్వద్దని కోరారు. కోర్టుకు వచ్చేముందు ఆమె ప్రభుత్వానికి కానీ సంబంధిత అథార్టీకి కానీ ఫిర్యాదు చేయలేదని, ఏదో ఒక్క మీడియా హౌస్ లేదా చానల్‌ను ప్రత్యేకంగా ఆమె పేర్కొనలేదని చెప్పారు. దీనిపై రకుల్ న్యాయవాది స్పందిస్తూ రకుల్ పేరు తాను చెప్పలేదని రియా చక్రవర్తి వివ రించినా మీడియా రిపోర్టులు రకుల్‌ను డ్రగ్స్ కేసుతో లింక్ చేసే రాస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో విపరీత ప్రచారం జరుగుతుండడంతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే సమయం లేక నేరుగా కోర్టును ఆశ్రయించామని చెప్పారు. -
#మీటూ సెగ ఆకాశవాణికి
భోపాల్: మీటూ ఉద్యమం ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో)ని తాకింది. స్టేషన్ మధ్యప్రదేశ్ షాదోల్ రేడియో స్టేషన్లో తొమ్మిది మంది మహిళా క్యాజువల్ ఉద్యోగులు లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేశారు. సహాయక డైరెక్టర్ (ప్రోగ్రామింగ్) రత్నాకర్ భారతిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో వీరు బహిరంగంగా వెలుగులోకి వచ్చారు. అయితే నిందితులపై చర్యలకు బదులుగా ఫిర్యాదు చేసిన మహిళలపై వేటు వేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఒకవైపు మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉధృతవుతుండగా ఏఐఆర్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొమ్మది మంది క్యాజువల్ బ్రాడ్‌కాస్టర్స్ రత్నాకర్‌పై సంబంధిత ఏఐఆర్ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏఐఆర్ అంతర్గత విచారణ కమిటీ రత్నాకర్‌ను దోషిగా తేల్చింది. అయినప్పటికీ ఆయనపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఉద్యోగ సంఘం ఆరోపించింది. పైగా ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన తొమ్మిది మంది మహిళలపై వేటు వేయడం అన్యాయమని వాదించింది. ధర్మశాల, ఓబ్రా, సాగర్, రాంపూర్,కురుక్షేత్ర, ఢిల్లీ స్టేషన్లలో కూడా లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇక్కడ కూడా దాదాపు ఇలాంటి చర్యలే రిపీట్ అయ్యాయని ఏఆఐర్ ట్రేడ్ యూనియన్ వాదన. నేరస్తులకు చిన్నపాటి హెచ్చరిక చేసి వదిలేశారు. అలాగే క్యాజువల్ బ్రాడ్‌కాస్టర్స్‌ను రిజైన్ చేయమని కోరారని యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ ఫయాజ్ షెహ్రార్ ఈ ఆరోపణలను ఖండించారు. ప్రతి ఫిర్యాదును ఇంటర్ కంప్లైంట్స్ కమిటీ విచారించిందని తెలిపారు. ఈ క్రమంలో షాదోల్ ఫిర్యాదులను విచారించి రత్నాకర్‌ను బదిలీ చేశామని ఫయాజ్ చెప్పారు. ప్రస్తుతం ఆయన డీజీ ప్రధాన కార్యాలయానికి సంబంధించిన కఠినమైన నిఘా పరిశీలనలో ఉన్నట్టు చెప్పారు. అలాగే మహిళా ఉద్యోగుల తొలగింపునకు, లైంగిక వేధింపుల ఫిర్యాదులకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. వారి ఫెర్ఫామెన్స్ వార్షిక సమీక్ష ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఇది ఇలావుంటే ఈ వ్యవహారంపై స్పందించిన ఆల్ ఇండియా రేడియో ట్రేడ్ యూనియన్ మరో అడుగు ముందుకేసింది. షాదోల్తో పాటు ఇతర 6 స్టేషన్లలో వెల్లువెత్తిన లైంగిక వేధింపుల ఫిర్యాదుల ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతోపాటు తొలగించిన మహిళా ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ప్రసారభారతి సీఈవో శశిశేఖర్ వెంపటికి ఒక లేఖ రాసింది. -
ప్రసార భారతిని ఎంపీలే మరిచిపోయారు!
సాక్షి, న్యూఢిల్లీ : ఆకాశవాణి, దూరదర్శన్‌లను నిర్వహిస్తున్న ప్రసార భారతి చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ ఏ. సూర్య ప్రకాష్ ‘వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్’కు చెందిన వారు. ఫౌండేషన్ నిర్వాహకులకు ఆర్ఎస్ఎస్, బీజేపీలకు సన్నిహిత సంబంధాలున్న విషయం తెల్సిందే. సహజంగానే తనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సైద్ధాంతిక అనుబంధం ఉంటుందని కూడా సూర్య ప్రకాష్ ఇటీవల ‘హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ పరిధిలోకి వస్తోంది. ఈ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్మృతి ఇరానీకి అధికార దర్పం కాస్త ఎక్కువే. వీరిరువురి గురించి తెలిసిన ఎవరికైనా ప్రసార భారతికి ఎంత స్వయం ప్రతిపత్తి ఉంటుందో, అది ఎంత తటస్థంగా వ్యవహరిస్తుందో ఇట్టే తెలిసిపోతుంది. ప్రసార భారతి చైర్మన్ సూర్య ప్రకాష్‌కు, స్మృతి ఇరానీలకు ఈ మధ్య బొత్తిగా పడటం లేదు. విధానపరంగా ఎంతమాత్రం కాదు. ప్రసార భారతి బోర్డు నియామకాల విషయంలో గొడవ. బోర్డులో ఖాళీగా ఉన్న ఓ ఐఏఎస్, ఇద్దరు సీనియర్ పాత్రికేయులను నియమించాలని స్మృతి ఇరానీ సిఫార్సు చేయగా, ఆ సిఫార్సులను సూర్య ప్రకాష్ చెత్తబుట్టలో పడేశారు. ఆ పోస్టులను అలాగే ఖాళీగా ఉంచుతున్నారు. ఆ పోస్టుల్లోని సీనియర్ పాత్రికేయులు చూసుకోవాల్సిన అసైన్మెంట్ను 2.9 కోట్లకు ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. దీంతో కోపం వచ్చిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రసార భారత సిబ్బందికి జనవరి, ఫిబ్రవరి నెలలకు జీతాలుగా ఇవ్వాల్సిన నిధులను నిలిపివేశారు. అయినప్పటికీ సూర్య ప్రకాష్ లొంగకుండా ఆపద్ధర్మ నిధి నుంచి సిబ్బందికి రెండు నెలల జీతాలను చెల్లించారు. ప్రసార భారతి (బ్రాడ్‌క్యాస్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) చట్టం కింద 1977లో స్వయం ప్రతిపత్తిని కల్పించారు. దానికి ఎంత స్వయం ప్రతిపత్తి ఎంతుందో మనందరికి తెల్సిందే. స్వాతంత్య్ర దినోత్సవం నాడు కేరళ ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి తిరస్కరించిన విషయమూ తెల్సిందే. ప్రైవేటు టీవీ చానళ్లు వెల్లువెత్తుతున్న నేటి రోజుల్లో పబ్లిక్ బ్రాడ్ క్యాస్టింగ్ సర్వీసు ఎంతైనా అవసరం. అయితే ఈ పబ్లిక్ సర్వీసు కాస్త స్టేట్ సర్వీసుగా మారిపోయి ఆకాశవాణి, దూరదర్శన్లు ప్రభుత్వానికి బాకాలుగా మారిపోయాయి. ప్రసార భారతి చట్టంలోని 13వ సెక్షన్ ప్రకారం 22 మంది పార్లమెంట్ సభ్యుల కమిటీ ఆకాశవాణి, దూరదర్శన్ల కార్యకలాపాలను చూసుకోవాల్సి ఉంది. చట్టం వచ్చి ఇన్నేళ్లు అవుతున్న ఒక్క ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుడు కూడా పార్లమెంట్ కమిటీ కోసం డిమాండ్ చేయక పోవడం ఆశ్చర్యంగా ఉంది. రాజ్యసభ టీవీ ఎంపీల కమిటీ ఆధ్యర్యంలో నడుస్తోంది. దానికి ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీ చైర్మన్‌గా ఉన్నారు. అలాంటప్పుడైనా ప్రసార భారతీ కమిటీ గురించి గుర్తుకు రావాలి. ప్రసార భారతి చైర్మన్, మంత్రి స్మతి ఇరానీ గొడవ పడుతున్న ఈ సమయంలోనైనా పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయడం మంచిది. -
రహమతుల్లా నుంచి ‘శశిశ్రీ’ వరకు...
కవి, రచయిత, వక్త, పత్రికా సంపాదకులు, ప్రసార భారతి న్యూస్ రిపోర్టర్ -ఇలా మూడున్నర దశాబ్దాలుగా తెలుగు సాహిత్యానికీ, ఇతర రంగాలకూ సేవ లందించిన ప్రజ్ఞాశాలి శశిశ్రీ (6.12.1957- 31-3- 2015). కడప జిల్లా సిద్ధవటంలో ఎస్.బి.సలీమాబీ, ఎస్.బి.రసూల్ దంపతులకు జన్మించిన శశిశ్రీ కడప పట్టణమే కార్యక్షేత్రంగా సేవలు అందించారు. పుట్టపర్తి నారాయణాచార్యుల వారి దగ్గర ప్రాచీన సాహిత్యం, వై.సి.వి. రెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి వంటి వారి దగ్గర అభ్యుదయ సాహిత్యం అధ్యయనం చేసిన విశాల దృక్పథం శశి శ్రీది. ‘మనోరంజని’ లిఖిత మాసపత్రికను, ‘సాహి త్యనేత్రం’ మాసపత్రికను స్థాపించి తనదైన ప్రతి భను చాటుకున్నారాయన. తనకు తెలుగు సాహిత్యంలో ఓనమాలు నేర్పి న తొలి గురువు పుట్టపర్తి వారేనని శశిశ్రీ చెప్పుకునే వారు. పుట్టపర్తి ఇంటి దగ్గరే తెలుగు పంచ మహాకా వ్యాలు, సంస్కృత కావ్యం ‘భామినీ విలాసం’ చదు వుకున్నట్టు చెబుతుండేవారు. ఒకసారి పుట్టపర్తి వారి ఇంటికి ఒక పండితుడు వచ్చినప్పుడు అక్కడే ఉన్న రహమతుల్లా (శశిశ్రీ)ను చూసి నీ పేరేమిటి? అని అడిగాడు. వెంటనే ఎస్.బి. రహమతుల్లా అని బదు లిచ్చాడు. ఆ వ్యక్తి ముఖకవళికల్లో మార్పు వచ్చింది. అంతటితో ఊరుకోక ‘‘స్వామీ! పోయి పోయి మహమ్మడ న్కా మీరు సాహిత్య పాఠాలు చెప్పే ది!’’ అని అనేశాడు. అది విన్న రహమ తుల్లా వెంటనే తన పుస్తకాలు చేతబట్టు కొని వెళ్లిపోతుంటే పుట్టపర్తి వారు ‘‘రేయ్! పాఠం మధ్యలో వదిలి ఎక్క డికి వెళ్తావు? కూర్చో...’’ అని వచ్చిన వ్యక్తిపై కోపా న్ని పరోక్షంగా ప్రదర్శిస్తూ మందలించారు. ఇలాంటి కొన్ని సందర్భాలు ఆయన మనసును నొప్పించాయి. ‘‘ఒరే, రహమతుల్లా! ఇప్పుడు కవిత్వమంటూ నాలుగు గీతలు గీసే నాయాళ్లంతా ఏదో ఒక కలం పేరు పెట్టుకుని చలామణి అవుతున్నారు. సరైన పద్ధ తిలో రచనలు చేస్తున్న నీవు కూడా ఒక కలం పేరు పెట్టుకుంటే పోదా!’’ అని పుట్టపర్తి రహమతుల్లాతో అన్నారు. ‘అది మీరే సూచించండి స్వామీ!’ అని కోరగా... పుట్టపర్తి ‘శశిశ్రీ’ అని పెట్టుకో, పోరా అని నవ్వుతూ చెప్పారు. ఆ విధంగా రహ మతుల్లా ‘శశిశ్రీ’ పేరుతో సాహిత్య సేవలను అందిస్తున్నారు. ఈ పేరు వారి పెండ్లి పత్రికల్లోనూ, దస్తా వేజు ల్లోనూ, బ్యాంకు అకౌంట్లకు కూడా చలామణి కావడం విశేషం. ‘పల్లవి’, ‘శబ్దానికి స్వాగతం’, ‘జేబులో సూర్యుడు’, ‘కాలాంతవేళ’ (వచన కావ్యాలు), ‘సీమగీతం’ (పద్య కావ్యం), ‘చూపు’ (వ్యాసాలు), ‘దహేజ్’, ‘టర్న్స్ ఆఫ్ లైఫ్’, ‘రాతిలో తేమ’ (కథా సంపుటాలు), ‘మనకు తెలి యని కడప’ (చరిత్ర), గురుదక్షిణకు చిహ్నంగా కేం ద్ర సాహిత్య అకాడమీ సహకారంతో ‘పుట్టపర్తి నారాయణాచార్య’ (విమర్శ) శశిశ్రీ రచించారు. ఆయన కథలు ఆంగ్లం, హిందీ, ఉర్దూ, కన్నడ, మల యాళ భాషలలోకి అనువాదమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘ఉగాది విశిష్ట సాహిత్య పురస్కారం-2010’, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘పట్టాభిరామిరెడ్డి లిటరరీ అవార్డు-2008’, గుంటూరు అభ్యుదయ రచయితల నుంచి ‘కొండేపూడి శ్రీనివాసరావు సాహిత్య పుర స్కారం-2008’, పత్రికా రచయితగా అందించిన సేవలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఉత్త మ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు-2007’, ‘యునిసెఫ్ అవార్డు-2010’ వంటి ఎన్నో పురస్కా రాలు ఆయనను వరించాయి. విద్యారంగానికి అం దించిన సేవలకు గుర్తింపుగా యోగి వేమన విశ్వ విద్యాలయం పాలక మండలి సభ్యునిగా రాష్ట్ర గవ ర్నర్ చేత నియమితులయ్యారు. ఆయన ‘అభ్యుద య రచయితల సంఘం’ రాష్ట్ర కార్యవర్గసభ్యులుగా కూడా పనిచేశారు. శశిశ్రీ మన మధ్య లేకపోయినా వారి రచనలు సాహిత్యలోకంలో విరాజిల్లుతున్నం త కాలం ఆయన కీర్తి అనే శరీరంతో జీవించివున్నట్లే. సవరణ ‘‘రోజానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?’’ అనే శీర్షి కతో బుధవారం (01-04-2015) ‘సాక్షి’లో 4వ పేజీలో వెలువడిన వ్యాసంలో రచయిత్రి సామాన్య ఫోన్ నంబరు తప్పుగా అచ్చయింది. ఆ ఫోన్ నంబ ర్ను 80196 00900 గా చదువుకోగలరు. - సి.శివారెడ్డి సి.పి. బ్రౌన్ గ్రంథాలయం, కడప