1982 నవంబర్ 19 వ తేదీ. భారత్‌లో 9వ ఆసియా క్రీడలు ప్రారంభమైన రోజు. అదే రోజు దూరదర్శన్‌లో తొలిసారి పూర్తిస్థాయి రంగుల ప్రసారాలు మొదలయ్యాయి. అంతకు 6 నెలల క్రితమే దూరదర్శన్ ప్రయోగాత్మకంగా ఏప్రిల్ 25న తన వీక్షకులకు రంగుల్ని రుచి చూపించింది. భారతీయ టెలివిజన్ సెట్‌పై రు.8 వేలు. దిగుమతి చేసుకున్న విదేశీ సెట్‌పై రూ.15 వేల వరకు వెచ్చించిన వీక్షకులు తొలిసారిగా, టీవీని రంగుల్లో దర్శించారు.
అనంతరం ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడోత్సవాల ప్రారంభ కార్యక్రమం వర్ణమయ శోభితంగా దూరదర్శన్‌లో ప్రసారమైంది. దిగుమతి చేసుకున్న సెట్ల నుంచి కస్టమ్స్ రాబడి ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆ సమయంలో ఎంత లేదన్నా 70 కోట్ల రూపాయలు గడించింది. అంత వరకు నలుపు తెలుపులకు పరిమితమైన దూరదర్శన్ మొదట్లో తాత్కాలికంగానూ, ఆ తర్వాత అత్యవసరంగానూ కలర్‌లోకి వచ్చేసింది.
అప్పట్లో టెలివిజన్ సెట్‌లను కొనుగోలు చేయడానికి సామాన్య ప్రజానీకం సైతం చూపించిన తహతహను విమర్శకులు విశృంఖల వినిమయ ధోరణికి ఉదాహరణగా అభివర్ణించడం మీకు గుర్తుండే ఉంటుంది. ఆమాట ఎలా ఉన్నా.. ఆరంభంలో లక్ష కలర్ టీవీ సెట్లు దేశంలోకి దిగుమతి అయ్యాయి. అంటే ఒక్క 1982 లోనే!
ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు
– ఇన్‌శాట్ 1 ఎ ప్రయోగం.
– నాబార్డ్ స్థాపన.
– క్రీయాశీల రాజకీయాల నుంచి చరణ్‌సింగ్ విరమణ.
– ఉత్తర ప్రదేశ్‌లో గోండా ఎన్‌కౌంటర్. కలకత్తాలో బైజాన్ సేతు మారణహోమం.
Comments
Please login to add a commentAdd a comment