తొలి తెలుగు న్యూస్ రీడర్ మృతికి సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్ సంతాపం
రామంతాపూర్, సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రచార సాధనమైన దూర దర్శన్ చానల్‌లో తొలి తెలుగు యాంకర్‌గా ప్రసి ద్ధులు, తెలుగు ప్రజలకు తన కంచు కంఠంతో వార్తలు చెప్పిన జయంత్ శాంతి స్వరూప్ (74) కన్నుమూశారు. శుక్రవా రం ఉదయం ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్ దూరదర్శన్ సీనియర్ యాంకర్ రోజా రాణిని వివాహమాడారు. ఆమె కొన్ని సంవత్స రాల క్రితమే చనిపోయారు. శాంతి స్వరూప్‌కు ఇద్దరు కుమారులు మేగాన్‡్ష, అగ్నేయ. 1978లో దూరదర్శన్ కేంద్రంలో యాంకర్‌గా చేరిన ఆయన 1983 నుంచి తెలుగులో వార్తలు చదవ డం మొదలుపెట్టారు.
2011లో పదవీ విరమణ చేశారు. టెలిప్రాంప్టర్ర్ లేని రోజుల్లోనే వార్తలను ముందుగానే మననం చేసుకుని తెర ముందు పొల్లు పోకుండా తప్పులు లేకుండా అనర్గళంగా చదివి తెలుగు ప్రజలకు వార్తలు అందించారు. శాంతి స్వరూప్‌కు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవా ర్డుతో పాటు పలు సంస్థలు ఎన్నో అవార్డులతో సత్కరించాయి. భూపాల్ గ్యాస్ దుర్ఘటన కవ రేజ్‌ను వీక్షకులకు కళ్ళకు కట్టినట్లుగా అందించిన ఆయన రాతి మేఘం, క్రికెట్ మీద క్రేజ్, అర్ధాగ్ని అనే నవలలు కూడా రాశారు.
ఆయన పార్ధివ దేహాన్ని రామంతాపూర్ టీవీ కాలనీలోని స్వగృహానికి తరలించి అక్కడి నుంచి అంబర్‌పేట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కంచుకంఠం మూగబోయిందనీ, తొలితరం న్యూస్ రీడర్‌గా అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ మృతి బాధాకరమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ సంతాపాన్ని ప్రకటించారు.
శాంతి స్వరూప్ సేవలు చిరస్మరణీయం
తెలుగులో వార్తలు చదివిన తొలి తరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించా రు. ఆయన అందించిన సేవలు తెలుగు మీడి యా రంగంలో చిరస్మరణీయమని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరా లని ప్రార్థించారు. శాంతి స్వరూప్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
న్యూస్‌రీడర్‌గా తనదైన ముద్ర
శాంతి స్వరూప్ మరణం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. టీవీలో వార్త లను చదివే తొలితరం న్యూస్ రీడర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందిన శాంతి స్వరూప్ మీడియా రంగంలో తనదైన ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment