news anchor
-
శాంతి స్వరూప్ కన్నుమూత
రామంతాపూర్, సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రచార సాధనమైన దూర దర్శన్ చానల్లో తొలి తెలుగు యాంకర్‌గా ప్రసి ద్ధులు, తెలుగు ప్రజలకు తన కంచు కంఠంతో వార్తలు చెప్పిన జయంత్ శాంతి స్వరూప్ (74) కన్నుమూశారు. శుక్రవా రం ఉదయం ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్ దూరదర్శన్ సీనియర్ యాంకర్ రోజా రాణిని వివాహమాడారు. ఆమె కొన్ని సంవత్స రాల క్రితమే చనిపోయారు. శాంతి స్వరూప్‌కు ఇద్దరు కుమారులు మేగాన్‡్ష, అగ్నేయ. 1978లో దూరదర్శన్ కేంద్రంలో యాంకర్‌గా చేరిన ఆయన 1983 నుంచి తెలుగులో వార్తలు చదవ డం మొదలుపెట్టారు. 2011లో పదవీ విరమణ చేశారు. టెలిప్రాంప్టర్ర్ లేని రోజుల్లోనే వార్తలను ముందుగానే మననం చేసుకుని తెర ముందు పొల్లు పోకుండా తప్పులు లేకుండా అనర్గళంగా చదివి తెలుగు ప్రజలకు వార్తలు అందించారు. శాంతి స్వరూప్‌కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవా ర్డుతో పాటు పలు సంస్థలు ఎన్నో అవార్డులతో సత్కరించాయి. భూపాల్ గ్యాస్ దుర్ఘటన కవ రేజ్‌ను వీక్షకులకు కళ్ళకు కట్టినట్లుగా అందించిన ఆయన రాతి మేఘం, క్రికెట్ మీద క్రేజ్, అర్ధాగ్ని అనే నవలలు కూడా రాశారు. ఆయన పార్ధివ దేహాన్ని రామంతాపూర్ టీవీ కాలనీలోని స్వగృహానికి తరలించి అక్కడి నుంచి అంబర్పేట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కంచుకంఠం మూగబోయిందనీ, తొలితరం న్యూస్ రీడర్‌గా అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ మృతి బాధాకరమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంతాపాన్ని ప్రకటించారు. శాంతి స్వరూప్ సేవలు చిరస్మరణీయం తెలుగులో వార్తలు చదివిన తొలి తరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించా రు. ఆయన అందించిన సేవలు తెలుగు మీడి యా రంగంలో చిరస్మరణీయమని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరా లని ప్రార్థించారు. శాంతి స్వరూప్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. న్యూస్‌రీడర్‌గా తనదైన ముద్ర శాంతి స్వరూప్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. టీవీలో వార్త లను చదివే తొలితరం న్యూస్ రీడర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందిన శాంతి స్వరూప్ మీడియా రంగంలో తనదైన ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
అందమే అసూయ పడేలా ఉంది.. ఇంతకీ ఎవరీ సౌందర్య!
బెంగళూరు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ పేరు మారుమోగిపోతోంది. ప్రస్తుతం ప్రతి పరిశ్రమలోనూ అడుగుపెడుతూ తనదైన ముద్రను వేస్తోంది. తాజాగా ఏఐ (కృతిమ మేధస్సు) మీడియా రంగంలోకి కూడా ప్రవేశించింది. ఇంతకుముందు ఉత్తర భారతదేశంలో, కృత్రిమ మేధస్సు సాంకేతికతతో రూపొందించిన 'లిసా' 'సనా' అనే ఇద్దరు వర్చువల్ న్యూస్ రీడర్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటకలో ఓ మీడియా సంస్థ వర్చువల్ న్యూస్ రీడర్ ప్రవేశపెట్టింది. హాయ్ నా పేరు సౌందర్య అంటూ ఆ రోబోట్ పాఠకులకు పరిచయం చేసుకుంది. అనంతరం తను మాట్లాడుతూ.. ‘ నాలో కొంతమంది సహచరులు (AI న్యూస్ ప్రజెంటర్లు) ఉత్తర భారతదేశంలోని కొన్ని ఛానెల్‌లలో వార్తలు అందిస్తున్నారు. నేను సౌందర్య, పవర్ టీవీ ద్వారా సౌత్ ఇండియా మొదటి రోబోటిక్ యాంకర్ అని తెలిపింది. ఈ ఛానెల్ ప్రస్తుతం రోబో న్యూస్ రీడర్‌తో వివిధ వార్తా కార్యక్రమాలతో కూడా ప్రయోగాలు చేస్తుంది. కేవలం వీళ్లే కాకుండా దేశంలోని కొన్ని ఇతర ఛానెల్‌లు కూడా తమ స్వంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత న్యూస్ ప్రెజెంటర్లతో ముందుకు వస్తున్నాయి. ఇటీవల, OTV అనే ఒడియా ఛానెల్ రాష్ట్రం మొదటి AI న్యూస్ ప్రెజెంటర్ లిసాను ప్రారంభించింది. ఇంగ్లీష్, ఒడియా రెండింటిలోనూ దోషరహిత వార్తలు చదువుతూ చాలా మందిని ఆకట్టుకున్న తర్వాత లిసా ఇంటర్నెట్ను వైరల్‌గా మారింది. ఇంకా ముందుకు వెళితే, న్యూయార్క్‌కు చెందిన ఓ మహిళ కృత్రిమ మేధస్సును ఉపయోగించి తనకు భర్తను సృష్టించుకుని, అతనితో సంభాషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కూడా చేరుతోంది. భారతదేశంలోని ప్రముఖ మ్యాగజైన్ కంపెనీలలో ఒకటైన ఇండియా టుడే గ్రూప్ తన వార్తా సంస్థ ఆజ్ తక్ కోసం ఒక కృత్రిమ మేధస్సుతో కూడిన మహిళను సృష్టించింది. 'సనా'గా పిలవబడే ఈ మహిళ గత మార్చిలో ప్రపంచానికి పరిచయమైంది. చదవండి: లైకులు, కామెంట్ల కోసం చావు వార్తని సోషల్ మీడియాలో.. ఇప్పుడిది అవసరమా? -
అశ్లీల చిత్రాలను పంపించమని కోరాడు.. ఉద్యోగం గోవిందా..
లండన్: బీబీసీ ఛానల్ న్యూస్ ప్రెజెంటర్ ఒకరు 17 ఏళ్ల యువతి వ్యక్తిగత ఫోటోలను కోరుతూ అందుకు ప్రతిఫలంగా 35 వేల పౌండ్లు(సుమారు రూ.37 లక్షలు) దఫాలుగా చెల్లించిన ఉదంతంలో బీబీసీ ఎట్టకేలకు స్పందించింది. ఆరోపణలు ఎదుర్కుంటున్న బీబీసీ ఉద్యోగిని విధుల నుండి తప్పించినట్లు తెలిపింది. 37 లక్షలు ఎర.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మీడియా ఛానల్ అయిన బీబీసీలో ఒక న్యూస్ ప్రెజెంటర్ సంస్థ ప్రతిష్టను దిగజార్చే పనికి పాల్పడ్డాడు. 2020లో పరిచయమైన ఓ అమ్మాయిని తన వ్యక్తిగత చిత్రాలను పంపించవలసిందిగా కోరాడు. అప్పటికి ఆ అమ్మాయి వయసు 17 ఏళ్ళు కాగా ఇప్పుడు 20 ఏళ్ళు. అలా పంపించినందుకుగాను ఆమెకు 35 యూకే పౌండ్లు(సుమారు రూ.37 లక్షలు) కూడా ఎరగా చూపించాడు. సున్నితమైన అంశం కాబట్టి.. ఈ విషయం ఆ అమ్మాయి తల్లికి తెలియడంతో బిబిసి ప్రెజెంటర్ విషయాన్ని సన్ మీడియా దృష్టికి తీసుకొచ్చింది. దీంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. బీబీసీ ఛానల్ ప్రతిష్ట దిగజారుతుందేమోనన్న భయంతో సంస్థ యాజమాన్యం సంఘటనపై జాప్యంగా వ్యవహరించింది. చివరికి ఛానల్ పై ఒత్తిడి అధికం కావడంతో సదరు ప్రెజెంటర్ ను విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్బంగా బీబీసీ.. సంక్లిష్టమైన సమస్య కావడంతో సత్వరంగా చర్యలు తీసుకున్నాము. అయినా కూడా ఈ సంఘటనపై దర్యాపు చేసి నిజాలు వెల్లడించాలని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులను కోరింది. కల్చర్ సెక్రెటరీ లూసీ ఫ్రేజర్ బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డెవీతో ఈ విషయంపై మాట్లాడానని ఆయన దర్యాప్తు వేగవంతంగా చేస్తున్నట్లు హామీ ఇచ్చారని ట్విట్టర్లో షేర్ చేసింది. I have spoken to BBC Director General Tim Davie about the deeply concerning allegations involving one of its presenters. He has assured me the BBC are investigating swiftly and sensitively. — Lucy Frazer (@lucyfrazermp) July 9, 2023 ఇది కూడా చదవండి: ఫ్రాన్స్ అల్లర్లు - అభివృద్ధి చెందిన దేశానికి ఎందుకీ గతి పట్టింది? -
ఇదేం చిత్రం.. ముసుగు వేసుకుని వార్తలు చదవాలట!
Women Under Taliban Rule: సాధారణంగా వార్తలు చదివే యాంకర్లు, మహిళా రిపోర్టర్లు.. సందర్భాలను బట్టి ముస్తాబై కెమెరాల ముందుకు వస్తారు. మతాచారాల పేరుతో కఠినంగా వ్యవహరించే.. అరబ్ దేశాల్లో మాత్రం తలభాగాన్ని కప్పేసుకుని.. ముఖం కనిపించేలా వార్తలు చదువుతారు. అయితే అఫ్గన్‌లో మాత్రం తాలిబన్ ప్రభుత్వం.. టీవీ ప్రజెంటర్లకు విచిత్రమైన నిబంధన పెట్టాయి. ముఖం కూడా కప్పేసుకుని(పూర్తిగా శరీరాన్ని కప్పేసుకుని) వార్తలు చదవాలని తాజాగా నిబంధం తీసుకొచ్చింది. అధికారం చేపట్టడం సంగతి ఏమోగానీ.. తాలిబన్ల తలతిక్క నిర్ణయాలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతూనే ఉన్నాయి. హిజాబ్‌లో కాకున్నా.. కనీసం ఇంట్లోని దుప్పట్లు కప్పేసుకుని ఆఫీసులకు రావాలని ఆదేశించడం, డిస్ప్లే బొమ్మలకు తల భాగం లేకుండా షాపుల్లో ప్రదర్శనలకు ఉంచడం లాంటివి.. ఉదాహరణాలు. ఈ క్రమంలో ఇప్పుడు మరోకటి బయటపడింది. గతంలో తాలిబన్ల పాలనలో అరాచకాలను ఎదుర్కొన్న అక్కడి మహిళా లోకం.. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోంది. ఈ మధ్యే మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు ముఖాన్ని కప్పేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు తాలిబన్ అధికారులు. ఇప్పుడు యాంకర్లు, టీవీ ప్రజెంటర్లు, కవరేజ్‌కు వెళ్లే రిపోర్టర్లు.. ముఖం కూడా కనిపించకుండా తమ పని చేసుకోవాలంటూ ఆదేశించింది. మీడియా ఛానెల్స్‌తో ఇదివరకే సమావేశం అయ్యామని, మే 21వ తేదీ వరకు తమ ఆదేశాలను పాటించేందుకు చివరి గడువని తాలిబన్ మంత్రి అఖిఫ్ మహజార్ చెబుతున్నాడు. ఒకవేళ పాటించకుంటే ఏం చేస్తారని అడిగితే.. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల గురించి ఇప్పుడే స్పందించమని పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. పైగా కరోనా టైంలో ఎలాగూ ఫేస్‌మాస్క్‌లు ఉపయోగించారు కదా.. ఇప్పుడే అవే వాడమని ఉచిత సలహా ఒకటి ఇస్తున్నాడు. చదవండి: షూట్ ఎట్ సైట్ ఆదేశాలపై శ్రీలంక ప్రధాని స్పందన -
భారీ ప్రమాదం నుంచి బయటపడ్డ యాంకర్
-
షాకింగ్ వీడియో: లైవ్‌లో యాంకర్‌పై కూలిన స్టూడియో సెట్టు
బొగోటా: కొలంబియాలో దారుణం చోటు చేసుకుంది. లైవ్‌లో ఉన్న యాంకర్‌పై ఉన్నట్టుండి స్టూడియో సెట్టులోని ఓ భాగం కూలింది. అయితే అదృష్టవశాత్తు అతడికి పెద్దగా గాయాలేం కాలేదు. అయితే ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే.. యాంకర్‌పై సెట్టు కూలిన సమయంలో అక్కడ మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు వారిలో ఒక్కరు కూడా స్పందించలేదు. పైగా షో కంటిన్యూ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. కార్లోస్ ఓర్డుజ్ అనే యాంకర్ కొలంబియా ఈఎస్పీఎన్కు చెందిన ఒక షో ప్యానెలిస్టులలో సభ్యుడు. ఈ క్రమంలో ఈ నెల 10న షో నిర్వహిస్తుండగా.. సెట్లో ఉన్న భారీ మానిటర్ లాంటి నిర్మాణం అతనిపై పడింది. దాంతో అతడి ముఖం డెస్క్‌కు తగిలింది. ఈ ఘటనలో అతడు డెస్క్‌కు అతుక్కుపోయినట్లు కనిపించడం వీడియోలో చూడవచ్చు. ఇక ఇదే షోలో ఓర్డుజ్తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా పాల్గొన్నారు. యాంకర్‌పై సెట్ కూలడంతో వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత వారిలో ఒక వ్యక్తి తేరుకుని.. కాసేపు షోని కంటిన్యూ చేసి.. ఆ తర్వాత బ్రేక్ అని చెప్పి.. కట్ చేశాడు. వెంటనే ఓర్డుజ్ని లేపి ఆస్పత్రికి తరలించారు. అతడికి పెద్దగా గాయాలు కాలేదని తెలిపారు వైద్యులు. ఈ క్రమంలో తన గురించి కంగారు పడినవారందరికి ధన్యవాదాలు తెలిపాడు ఓర్డుజ్. సెట్ కూలిన ఘటనలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని.. క్షేమంగానే ఉన్నానంటూ ట్వీట్ చేశాడు. చదవండి: లైవ్ న్యూస్: పన్ను ఊడినా.. పట్టు వదలని యాంకర్ ఊపిరాగిపోయే ఉత్కంఠ: చివరకేమైంది?.. -
ప్రముఖ న్యూస్ యాంకర్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ వార్త సంస్థ రిపబ్లిక్ ఇండియా యాంకర్ వికాస్ శర్మ (35) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గురువారం రాత్రి మృతిచెందాడు. రిపబ్లిక్ టీవీలో వికాస్ రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ‘యే భారత్ కి బాత్ హై’ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు. అతడి మృతికి రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి సంతాపం వ్యక్తం చేశారు. వికాస్ మృతితో తన న్యూస్ నెట్‌వర్క్‌కు తీరని లోటు అని అర్నాబ్ గోస్వామి తెలిపారు. ఆయన ఎప్పుడూ సమాజం కోసం ఆలోచించే వ్యక్తి అని.. అలాంటి అరుదైన ప్రతిభ ఉన్న యాంకర్ ఇంత త్వరగా వెళ్లిపోతాడని ఊహించలేదని ఆవేదన చెందారు. కొన్ని రోజుల కిందట కరోనా బారినపడిన వికాస్ శర్మకు మూడు రోజుల కిందట తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు వికాస్‌ను నొయిడాలోని కైలాష్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. వికాస్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వికాస్ శర్మ మృతిపై బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ, జర్నలిస్ట్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
పన్ను ఊడినా.. పట్టు వదలని యాంకర్
-
లైవ్ న్యూస్: పన్ను ఊడినా.. పట్టు వదలని యాంకర్
వార్తలు చదువుతున్నప్పుడు యాంకర్లకు ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను చూసే ఉంటాం. మరి ముఖ్యంగా లైవ్‌లో వార్తలు చదువుతున్న సమయంలో ఎంతో సమయస్పూర్తిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎన్ని అవంతరాలు ఎదురైనా తప్పని సరిగా వార్తలు పూర్తి చెయ్యాల్సి వస్తుంది. తాజాగా ఉక్రెయిన్‌లో వార్తలు చదువుతున్న ఓ మహిళ న్యూస్ రీడర్‌కు వింత అనుభవం ఎదురైంది. మారిచ్కా పడల్కో అనే మహిళ వార్తలను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ క్రమంలో నోటి నుంచి ఒక పన్ను ఊడిపడింది. దీంతో భయానికి గురవ్వకుండా సమయస్పూర్తితో స్పందించిన మహిళ చేత్తో పంటిని తీసి వార్తలను చదవడం కొనసాగించింది. (హృదయాన్ని తాకే వీడియో: నీళ్ల కోసం ఉడత..) కాగా తన 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి ఘటన ఎదురవ్వలేదని మారిచ్కా స్థానిక మీడియా ముందు పేర్కొంది. 10 సంవత్సరాల క్రితం అలారం గడియారంతో ఆడుకుంటున్న తన కుమార్తె అనుకోకుండా పంటిని సగం పడగొట్టంతో ఆమె దంతాలు ఊడిపోయినట్లు మహిళ పేర్కొంది. ఇక ఈ వీడియోను సదరు మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో నెట్టింట్ల వైరల్‌గా మారింది. ఇప్పటికే దాదాపు 30 వేలకు పైగా లైకులు రాగా, అనేక మంది కామెంట్ చేస్తున్నారు. ‘లైవ్‌లో పన్ను ఊడిపోయినా పట్టు వదలకుండా వార్తలు పూర్తి చేసింది’ అని మహిళను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. (‘నాకేంటి! కరోనా ఏంటి!!’) -
న్యూస్ యాంకర్ దారుణ హత్య
కరాచీ : వ్యక్తిగత తగాదాలకు ఓ న్యూస్ యాంకర్ బలయ్యాడు. ఈ సంఘటన పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కరాచీకి చెందిన మురీద్ అబ్బాస్ అనే వ్యక్తి బోల్ న్యూస్ అనే ఛానల్లో పనిచేస్తున్నాడు. ఇతడికి అదేప్రాంతానికి చెందిన అతిఫ్ జమాన్‌తో వ్యక్తిగత తాగాదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అబ్బాస్‌పై అతిఫ్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అబ్బాస్‌ను చంపాలని నిశ్చయించుకున్నాడు. మంగళవారం సాయంత్రం ఖయాబన్-ఈ-బుఖారి ఏరియాలోని ఓ కేఫ్‌లో ఉన్న అబ్బాస్‌పై.. అబ్బాస్ స్నేహితుడు ఖైజర్ హయాత్‌పై అతిఫ్ గన్నుతో కాల్పులు జరిపి, అక్కడినుంచి పరారయ్యాడు. అక్కడి వారు గాయపడిన స్నేహితులిద్దరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఛాతి, పొట్టకింద బుల్లెట్లు దూసుకుపోయిన కారణంగా అబ్బాస్ చికిత్స పొందుతూ మరణించగా ఖైజర్ ప్రాణాలతో బయటపడ్డాడు. అక్కడి సీసీటీవీ ఫొటేజీల ఆధారంగా అతిఫ్ కాల్పులు జరిపినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేయటానికి ఇంటికి వెళ్లారు. దీంతో పోలీసులను చూసి భయాందోళనకు గురైన అతిఫ్ గన్నుతో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించటం గమనార్హం. దీనిపై ఐజీపీ(సింధ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) ఖలీమ్ ఇమామ్ మాట్లాడుతూ.. హత్య జరిగిన ప్రదేశం నుంచి మరిన్ని ఆధారాలు సేకరించటానికి ఫోరెన్సిక్ దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేసుకు సంబంధించిన నివేదిక అందజేయాలని కోరారు. -
నాతో పోటీ పడతారా?
అది చైనాలోని షిన్హువా న్యూస్ చానల్ కార్యాలయం.. ఓ రోజు ఉదయం ఆ ఆఫీస్ అంతా హడావుడిగా ఉంది. ఎందుకంటే ఆ ఆఫీస్‌లో ఓ కొత్త మహిళా న్యూస్ యాంకర్ చేరుతున్నారు. ఆమె వచ్చి వార్తలు చదువుతుంటే అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపే చూస్తున్నారు..! యాంకర్లన్నాక వార్తలు చదువుతారు.. అందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది.. అంత స్పెషాలిటీ ఏముందనే కదా మీ అనుమానం. ఉంది ఆమె చాలా స్పెషల్ గురూ. ఎందుకంటే ఆమె మనిషే కాదు.. బొమ్మ..! అరె బొమ్మ వార్తలు చదవడం ఏంటంటే.. ఆమె కృత్రిమ మేధస్సు సాంకేతికతతో కంప్యూటర్ ద్వారా తయారుచేసిన రోబో. ఈ ఫొటోలో వార్తలు చదువుతోందే ఆమే ఆ రోబో. ఇటీవల సౌదీ అరేబియా పౌరసత్వం పొందిన సోఫియా గుర్తింది కదా.. అచ్చు అలాంటిదే ఈ రోబో కూడా. పేరు షిన్ షియావోమెంగ్. ఆమెను షిన్హువా న్యూస్ చానల్ ఉద్యోగంలో నియమించుకుంది. చైనాలో ఈమె తొలి న్యూస్ యాంకర్‌గా రికార్డులోకెక్కింది. ఇప్పటివరకైతే ఈమె చైనీస్ భాషలో మాత్రమే వార్తలను చదవగలుగుతుందట. చక్కగా కెమెరా ముందు కూర్చుని సాధారణ మానవులు చదివినట్లే వార్తలు చదువుతోందట. కాగా, మూడు నెలల ముందే కృత్రిమ మేధతో వార్తలు చదివే ఇద్దరు పురుష యాంకర్లను కూడా ఆ చానల్ నియమించుకుంది. ఈ రోబోలు దాదాపు 3,400 వార్తలను చదివి వినిపించారు. -
పాకిస్థాన్‌తో టీవీ యాంకర్ల యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన టెర్రరిస్ట్ దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్థాన్‌పై యుద్ధం చేయాల్సిందేనంటూ పలు ప్రాంతీయ టీవీలతోపాటు పలు జాతీయ టీవీ ఛానళ్ల యాంకర్లు తీర్మానించడమే కాదు, ఇటు కేంద్ర ప్రభుత్వానికి, అటు భారత సైన్యానికి వెంటనే కదన రంగంలోకి దూకాల్సిందిగా శనివారం పదే పదే పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరు కూడా ఇదే కోరుకుంటున్నారని తేల్చి చెప్పారు. తెలుగు టీవీ యాంకర్ రష్మీ అవేశంతో ఊగిపోతూ పాకిస్థాన్‌పై రెండో సర్జికల్ స్ట్రైక్స్ చేయాలంటూ ‘తెర మాకీ....’ అంటూ రెచ్చిపోయారు. పాకిస్థాన్‌పై ఎలా బదులు తీర్చుకోవాలో తేల్చుకోవడానికి అఖిల పక్ష సమావేశాలతో ప్రధాని నరేంద్ర మోదీ తర్జనభర్జనలు పడుతుండగానే ‘పరిమిత యుద్ధం కోసం అన్ని పర్యవసానాలకు మోదీ సిద్ధంగా ఉన్నారు’ అంటూ ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేస్తూ వస్తున్నారు. ‘ప్రతీకారం కోరుకుంటున్న భారత్’ అన్న నినాదంతోనే ‘రిపబ్లిక్ టీవీ’ వార్తలను ప్రసారం చేసింది. సీనియర్ జర్నలిస్ట్, యాంకర్ అర్నాబ్ గోసామి మాట్లాడుతూ ‘పాక్‌తో యుద్ధం చేయడం మినహా మరో మార్గం ఉందా ? లేదు!’ అంటూ సెలవిచ్చారు. ‘పాకిస్థాన్ విషయంలో ఇక వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి లేదు’ అంటూ టైమ్స్ నౌ యాంకర్ నావికా కుమార్ వ్యాఖ్యానించారు. ‘ ఓ భారత ప్రధాని ప్రజలనుద్దేశించి ఇంత స్పష్టంగా మాట్లాడడం ఇదే మొదటి సారి. పాకిస్థాన్‌తో పరిమిత యుద్ధం కోసం అన్ని పర్యవసానాలను ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేశ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు’ అని ఇండియా టుడే టీవీ యాంకర్ రాహుల్ కన్వల్ వ్యాఖ్యానించారు. ‘పాకిస్థాన్‌లోని అన్ని టెర్రరిస్టు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరపాలి’ అంటూ న్యూస్ 18 యాంకర్ భూపేంద్ర చౌబే పిలుపునిచ్చారు. యుద్ధానికి సమయం ఆసన్నమైందంటూ 2016లో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ దాడులను ప్రస్తావిస్తూ ఏబీపీ న్యూస్ ఛానల్ అయితే ఇటీవల విడుదలైన ‘యురి’ బాలివుడ్ సినిమాలోని క్లిప్స్‌ను చూపించారు. యాంకర్ల పిలుపులపై ‘ఎన్డీటీవీ ఇండియా’ రవిష్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. ‘మన సైనికులు మరణించినందుకు మనకు బాధగా ఉంటుంది. మనసు ప్రతీకారం కోరుకుంటుంది. ఇక్కడే కాస్త సంయమనం అవసరం. అరుపులు, కేకలు వినిపించడానికి ప్రతి సంఘటన ఓ సినిమా ప్లాట్ కాదు. రెచ్చగొట్టే భాష రాజకీయ ప్రయోజనాలను నెరవేరుస్తుంది. సమస్యను పరిష్కరించదు. ఈ సమయంలో మనం మౌనం పాటించడమే అమర వీరులకు నిజమైన నివాళి. మృధువుగా మాట్లాడుతాం. బాధిత కుటుంబాల మెదళ్లును తొలుస్తున్న విషయం గురించి ఆలోచిద్దాం. కశ్మీరు పరిస్థితి కంటే మీడియా పరిస్థితి దిగజారినందుకు బాధగా ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. కార్గిల్ వీరుడి అమూల్య సందేశం ‘జీ న్యూస్’ చర్చాగోష్టిలో పాల్గొన్న 1999లో పాకిస్థాన్‌తో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొని కుడి కాలును కోల్పోయిన యోధుడు మేజర్ నవదీప్ సింగ్ చాలా బాధ్యుతాయుతంగా స్పందించారు. ‘దేశ త్రివర్ణ పతాకానికి అండగా ప్రాణాలర్పించేందుకు ప్రతి సైనికుడు సిద్ధంగానే ఉన్నారు. ఒకప్పుడు టెర్రరిస్టయిన నజీర్ వానిలాగా ఓ కశ్మీర్ యువకుడు ఎందుకు కావాలనుకుంటున్నాడో కూడా ఆలోచించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. యుద్ధం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ప్రాణాలే కాదు, అవయవాలు కూడా పోతాయి. ఆ తర్వాత నష్ట పరిహారం కోసం కోర్టుల తలుపులు తట్టాలి. యుద్ధంలో సైనికుడు చనిపోవాలని మనం కోరుకుంటాం. ఆ తర్వాత ఆ సైనికుడి వితంతు భార్య పింఛను కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. యుద్ధంలో కొన్నిసార్లు మృతదేహం ఆనవాళ్లు కూడా దొరకవు. పింఛను కావాలంటే భర్త మతదేహాన్ని తీసుకరావాలని అధికార యంత్రాంగం ఆదేశిస్తుంది. యుద్ధంలో గాయపడితే అంగవైకల్య నష్టపరిహార పింఛను కోసం ఏళ్లకు ఏళ్లు కోర్టుల చుట్టూ తిరగాలి. యుద్ధంలో కాలు కోల్పోయిన నేను పింఛను కోసం ఏడేళ్లు కోర్టుల చుట్టూ తిరిగాను. సైనిక పింఛను విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్పీళ్లను ఉపసంహరించుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు స్వయంగా ఆదేశించినప్పటికీ ఇప్పటికీ వెయ్యి కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రాణాలతో పరాచకాలొద్దు. అన్యాయంగా సైనికుల ప్రాణాలను బలిపెట్టవద్దు. భారత సైన్యానికి ఎప్పుడు ఎలా స్పందించాలో తెలుసు. ఎం చేయాలో వారికి మనం సూచించాల్సిన అవసరం లేదు. సముచిత సమయంలో సముచిత చర్య తీసుకోవడం వారికి తెలుసు. ముందుగా పాకిస్థాన్‌ను టెర్రరిస్టు దేశంగా ప్రపంచం ప్రకంటించేలా దౌత్యపరమైన ఒత్తిడి తీసుకరావాలి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందిగదా అంటూ ఆవేశంతో మాట్లాడడం సముచితం కాదు’ అని ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అయినా ‘సార్! మీరు పుల్వామా దాడి చిత్రాలను చూసినట్లు లేదు. ప్రతీకారం ఒక్కటే పరిష్కారమని మీరు భావించకపోవడానికి అదే కారణం అనుకుంటా’ అని జీన్యూస్ యాంకర్ వ్యాఖ్యానించడం కొసమెరపు. -
విలేకరిపై కేసును ఖండించిన ఐఎన్ఎస్
న్యూఢిల్లీ: మలయాళ టీవీ చానల్ ‘మాతృభూమి న్యూస్’కు చెందిన ప్రముఖ యాంకర్‌పై మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేయడాన్ని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) ఖండించింది. ఇలాంటి చర్యలతో కేరళ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించింది. ప్రజాస్వామ్య దేశంలో మీడియాపై ఇలాంటి దాడులు పత్రికా స్వేచ్ఛకు, స్వతంత్రంగా ఆలోచించి, మాట్లాడే సంస్కృతికి గొడ్డలిపెట్టుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్ను రద్దుచేయాలని ప్రభుత్వానికి ఐఎన్ఎస్ విజ్ఞప్తి చేసింది. -
రోడ్డుపై ఉన్న హిజ్రా... నేను ఒక్కటే
సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటిలో మనిషిది ప్రత్యేక స్థానం. మనుషుల్లో ఆడ, మగ అని...ఇవి రెండు మాత్రమే సహజ సిద్ధమైనవనీ... ఆడ, మగ కాకుండా మూడో రకాన్ని ఈ సమాజం చిన్న చూపు చూడటం జరుగుతోంది. సగం ఆడ, సగం మగ లక్షణాలతో ఉన్న వారి పట్ల లోకువే ఈ లోకానికి. మారుతున్న కాలంలో గే, లెస్బియన్స్, ట్రాన్స్‌జెండర్స్ అంటూ కొత్త లక్షణాలు వస్తున్నాయి. వీటన్నింటిని సమాజం అంగీకరించాలి. ఎందుకంటే వారు మనుషులే కదా. పాకిస్థాన్‌లో మొదటిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్.. న్యూస్ యాంకర్ స్థాయికి ఎదిగింది. తను ఆస్థాయికి ఎదిగిన ప్రయాణాన్ని, ఎదురైన కష్టాలను ఎదురొడ్డిన తన అనుభవాల్ని పంచుకుంది. అయితే తను ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలను పడాల్సి వచ్చిందనీ, తను చదువుకునే సమయంలో సెలూన్లో పనిచేస్తుండగా తనను గెంటేశారనీ, చేతి ఖర్చులకు కూడా తనవద్ద డబ్బులుండేవి కావనీ, అలాంటి సమయంలో రోడ్డుపై యాచిస్తూ ఉండే హిజ్రాలకు నాకు తేడా లేదనిపించిందంటూ తను పడిన వేదనను వివరించింది. మార్వియ మాలిక్ పాకిస్థాన్‌లో న్యూస్ యాంకర్ అయిన మొదటి ట్రాన్స్‌జెండర్. శనివారం మార్వియ చదివిన న్యూస్ బులిటెన్ వైరల్ అయ్యింది. దీంతో తనకు పాజిటివ్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. జరా చంగేజీ అనే ట్రాన్స్‌జెండర్ గొప్ప నటిగా గుర్తింపు పొందిన తరువాత, పాకిస్థాన్ సెనేట్ వీరిని కూడా మూడో జెండర్‌గా గుర్తించింది. డ్రైవింగ్ లైసెన్సులపై ఎక్స్(x) జెండర్‌గా ముద్రిస్తున్నారు. మొదటిసారిగా 2009లో పాక్ సుప్రీంకోర్టు మూడో జెండర్‌ను ఎక్స్(x) జెండర్‌గా గుర్తించడం జరిగింది. గతేడాది పాక్ ప్రభుత్వం మొదటిసారిగా ట్రాన్స్‌జెండర్ కేటగిరిలో పాస్‌పోర్ట్‌ను ఇచ్చింది. పైగా గతేడాది మొదటిసారిగా జనాభా లెక్కల్లో వీరిని కూడా చేర్చింది. దేశంలో 10,418 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు పేర్కొంది పాక్ ప్రభుత్వం. -
బీబీసీ టాప్ యాంకర్ల జీతాల్లో కోత
సంస్థలో పురుష , మహిళా ఉద్యోగుల మధ్య ఆదాయ అసమానతలు ఆరోపణల నేపథ్యంలో బీబీసీకి చెందిన టాప్ న్యూస్ ప్రెజెంటర్లు దిగి రాక తప్పలేదు. తమ వేతనాలను తగ్గించుకునేందుకు ఆరుగురు యాంకర్లు ఆమోదం తెలిపారు. జెరెమీ వైన్, జాన్ హంప్రీస్, నిక్కీ క్యాంబెల్, హ్యూ ఎడ్వర్డ్స్, జాన్ సోపెల్, జెరెమీ వైన్, నిక్ రాబిన్ సన్ తమ వేతనాల్లో కోతకు అంగీకరించారు. ఒకే పని చేస్తున్న స్త్రీ పురుషులకు సమాన వేతనాలను అమలు చేయాలి పే కట్కు అంగీకరించిన జెరెమీ వైన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మహిళా సహోద్యోగులకే తన మద్దతు అని ప్రకటించారు. పురుష, మహిళా అంతర్జాతీయ ఎడిటర్ల వేతనాలలో అసమానతలకు నిరసనగా బీబీసీ చైనా ఎడిటర్ క్యారీ గ్రేసీ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బీబీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రేక్షకులతో నిజమైన సంబంధం కలిగి ఉన్న గొప్ప జర్నలిసులు, ప్రెజెంటర్లనీ తెలిపింది. వారు తమ సంస్థలో పనిచేయడం గర్వంగా ఉందని పేర్కొంది. జులై, 2017లో బీబీసీ తమ సంస్థలో తమ సంస్థలో అత్యధిక వేతనాలు తీసుకుంటున్న వారిలో 2/3వంతు పురుషులే ఉన్నారని, ఇందులో ఏడుగురు ఎడిటర్లు ఉన్నారని నివేదించింది. 150,000 పౌండ్ల(సుమారు రూ.1.35 కోట్లు)కు పైగా వేతనాలు పొందుతున్న వారి జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో క్రిస్ ఎవాన్స్ 2016/2017లో రూ.19.84 కోట్ల నుంచి రూ.22.54 కోట్ల వేతనంతో మొదటి స్థానంలో నిలిచారు. అదే సమయంలో మహిళల్లో అత్యధికంగా క్లాడియా వింకెల్‌మ్యాన్ రూ.4 కోట్ల నుంచి రూ.4.5 కోట్లు మాత్రమే వేతనంగా పొందినట్టు రిపోర్ట్ చేసింది. దీంతో బీబీసీ లాంటి అంతర్జాతీయ సంస్థలో వివక్ష, వేతన వ్యత్యాసాలు అంశంపై వివాదం రాజుకుంది. కాట్టి కే, ఎమిలీ మెట్లిస్, అలెక్స్ జోన్స్ సహా దాదాపు 40మంది హై ప్రొఫైల్ మహిళా ఉద్యోగులు ఈ సంస్కృతికి స్వస్తి చెప్పాలంటూ ఒక బహిరంగ లేఖ రాయడం కలకలం రేపింది. స్త్రీ, పురుష వేతన వ్యత్యాసానికి నిరసనగా గత నెలలో బీబీసీ చైనా ఎడిటర్ క్యారీ గ్రేసీ రాజీనామా చేశారు. దీనిపై బ్రిటీష్ కల్చరల్ సెక్రటరీ మాట్ హాన్ కాక్ కూడా దీనిపై స్పందించారు. బీబీసీ లాంటి అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగులకు న్యాయమైన, సమాన వేతనాలు ఉండాలని, బ్రిటిష్ విలువలకు ధృవతారలా బీబీసీ ఉండాలని సూచించారు. కాగా ఆన్-ఎయిర్ ప్రెజెంటర్లు, ఎడిటర్లు, కరస్పాండెంట్ల వేతనాల విషయంలో బీబీసీ అనుసరించే విధానాన్ని వచ్చే వారం విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. -
కూతురితో కలిసి న్యూస్ చదివిన యాంకర్..
-
బాలికపై అత్యాచారం: కూతురితో కలిసి యాంకర్..
ఇస్లామాబాద్: ఎనిమిదేళ్ల బాలికను కిరాతకంగా అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనపై పాకిస్థాన్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు నిరసనగా ప్రముఖ చానెల్ సమా టీవీలో ఓ యాంకర్ తన చిన్నారి కూతురితో కలిసి న్యూస్ చదవడం పలువురిని కదిలించింది. కిరన్ నాజ్ అనే యాంకర్ తన కూతురిని ఒడిలో కూచుబెట్టుకొని న్యూస్ బులిటెన్‌ను ప్రారంభించింది. 'ఈ రోజు నేను కిరన్ నాజ్‌ను కాదు. ఒక అమ్మను.. అందుకే నా కూతురితోపాటు ఇక్కడ కూర్చున్నాను' అని ఆమె న్యూస్ ప్రారంభించారు. దేశంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆమె భావోద్వేగంగా 1.50 నిమిషాలపాటు మాట్లాడారు. 'చిన్న శవపేటికలే అత్యంత బరువైనవనే మాట ఎంతో సత్యం. ఆ చిన్నారి శవపేటిక బరువును ఇప్పుడు యావత్ పాకిస్థాన్ మోస్తోంది' అని నాజ్ పేర్కొన్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని కసుర్‌లో ఎనిమిదేళ బాలికపై కిరాతకంగా అత్యాచారం, హత్య జరిగిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ప్రావిన్స్ అంతటా ఈ ఘటనకు వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు చోటుచేసుకున్నాయి. భారత సరిహద్దుకు అతికొద్దీ దూరంలోనే కసూర్ పట్టణం ఉంది. -
వాటర్‌ఫాల్ లో కొట్టుకుపోయిన యాంకర్
జార్జియా: అమెరికాకు చెందిన ప్రముఖ మహిళా యాంకర్ నార్త్ కాలిఫోర్నియా వాటర్ ఫాల్స్ లో ప్రమాదవశాత్తూ కొట్టుకుపోవడం విషాదాన్ని నింపింది. జార్జియాలో యాంకర్ గా పనిచేస్తున్న టేలర్ టెర్రాల్ (24) టెక్సావే లేక్ రైన్ బో జలపాతంలో పడి మృత్యువాత పడ్డారు. స్థానిక అమెరికా అటవీ అధికారులు అందించిన సమాచారం ప్రకారం ట్రాన్సిల్వేనియా కౌంటీ, రైన్ బో వాటర్ పాల్స్ దగ్గర టేలర్ రాళ్ల పై నడుస్తుండగా కాలు జారి 160 అడుగుల లోతుకి పడిపోవడంతో దుర్మరణం పాలయ్యారు. గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. కాగా 2013లో రిపోర్టర్ గా కరీర్ ప్రారంభించిన టేలర్ తరువాత యాంకర్ గా పదోన్నతి పొందారని ఆమె స్నేహితులుతెలిపారు. శుక్రవారం ఆమె పుట్టిన రోజని గుర్తు చేసుకున్నారు. ఆమె మృతిని ధృవీకరించిన సదరు ఛానల్ న్యూస్ డైరక్టర్ బ్రాండన్ కూడా ఆమె అకాల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఎపుడూ ప్రకాశవంతమైన చిరునవ్వు తో వుండే టేలర్ మంచి హార్డ్ వర్కర్ అని తెలిపారు. అటు టేలర్ మృతిపై స్థానిక మీడియా వర్గాలు దిగ్ర్భాంతిని వ్యక్తం చేశాయి. -
న్యూస్ చదివిన అంధ బాలుడు
-
న్యూస్ ప్రెజెంటర్‌గా అంధబాలుడు
కోయంబత్తూర్: పట్టుదల, కృషి ఉంటే, శారీరక వైకల్యాలను సైతం అధిగమించి రాణించవచ్చని నిరూపించాడు తమిళనాడుకు చెందిన 11 ఏళ్ల బాలుడు. సంకల్పాన్ని మించిన బలం లేదని రుజువు చేస్తూ పుట్టుకతోనే చూపును కోల్పోయిన శ్రీరామానుజన్ మరో సంచలనానికి నాంది పలికాడు. ఒక తమిళ న్యూస్ ఛానల్లో న్యూస్ యాంకరింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందరికంటే భిన్నంగా ఏదైనా సాధించాలని తపన పడిన రామానుజం, దానికి టీవీ మీడియాను వారధిగా ఎంచుకున్నాడు. టీవీలో వార్తలు చదవడం ద్వారా తన గురించి పదిమందికి తెలియజేయాలనుకున్నాడు. తనలాంటి వారికి స్ఫూర్తిగా నిలవాలనుకున్నాడు. నేపాల్ భూకంపం తర్వాత పరిణామాలు, మహింద్రా రాజపక్సే ట్రయల్ తదితర వార్తలతో కూడిన 22 నిమిషాల న్యూస్ బులిటెన్‌ను బ్రెయిలీ లిపి సహాయంగా శ్రీరామానుజం ప్రెజెంట్ చేశాడు. అది చూసిన అతని తల్లిదండ్రుల కళ్లు ఆనందంతో వర్షించాయి. ముందు రెండు నిమిషాలు కొంచెం తడబడ్డా, అలవాటైన తర్వాత బాగా చదివానంటూ శ్రీరామానుజం ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతానికి శ్రీరామానుజానికి వారానికి ఒక స్పెషల్ బులిటెన్ ఇస్తున్నామని.. తరువాత రెగ్యులర్‌గా వార్తలు చదివే అవకాశాన్ని కల్పిస్తామని ఛానల్ ఛైర్మన్ తెలిపారు. వికలాంగులను ప్రోత్సహించడంతోపాటు,నేత్ర దానంపై ప్రజల్లో అవగాహన కల్పించడం తమ ఉద్దేశమన్నారు. ప్రపంచంలో తొలిసారిగా ఒక అంధుడి చేత వార్తలను చదివించిన ఘనత తమ ఛానల్ దక్కించుకుందని ఆయన తెలిపారు. కాగా ఇప్పటికే ట్రాన్స్‌జెండర్స్ న్యూస్ యాంకర్లుగా, ప్రోగ్రామ్ ప్రెజెంటర్స్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
తొలి లింగమార్పిడి యాంకర్.. పద్మిని!
దేశ టెలివిజన్ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా.. లింగమార్పిడి చేయించుకున్న ఓ మహిళ న్యూస్‌రీడర్‌గా అవతారం ఎత్తింది. దాంతో ఇప్పటికి తనకు సామాజికంగా, వ్యక్తిగతంగా ఉన్న సమస్యలన్నీ తీరిపోయాయని ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాత్రి 7 గంటలకు ఆమె తొలిసారిగా కెమెరా ముందు నిలబడి లోటస్ న్యూస్ ఛానల్ స్టూడియోలో వార్తలు చదివింది. ఇంతకుముందు ఆమె కొన్ని టీవీ సీరియళ్లలో నటించింది. ఇంతకాలం ఆమెకు రకరకాల ఒత్తిళ్లు వచ్చాయి. ప్రధానంగా లింగమార్పిడి చేయించుకున్నవాళ్ల హక్కుల కోసం ఉద్యమించినప్పుడు, తమపై చూపుతున్న వివక్షకు, వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు ఆమెకు వచ్చిన సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కానీ, ఎట్టకేలకు న్యూస్ రీడర్‌గా రావడంతో అవన్నీ తొలగిపోయాయని చెబుతోంది. ఇది పెద్ద బాధ్యతేనని, ప్రత్యక్షంగా చదువుతున్నప్పుడు ఏ చిన్న తప్పు రాకుండా చూసుకోవాలని అంటోంది. మొదట్లో తాను కొంత భయపడ్డానని, కానీ ఇప్పుడు ప్రేక్షకులు కూడా తనను అర్థం చేసుకుంటున్నారని తెలిపింది. ఇప్పుడు కోయంబత్తూరు నుంచి ప్రసారమయ్యే లోటస్ న్యూస్ ఛానల్లో ప్రతిరోజూ రాత్రి 7గంటలకు ప్రసారమయ్యే బులెటిన్‌లో ఆమెను చూసేందుకే చాలామంది టీవీలు పెడుతున్నారట!