లండన్: బీబీసీ ఛానల్ న్యూస్ ప్రెజెంటర్ ఒకరు 17 ఏళ్ల యువతి వ్యక్తిగత ఫోటోలను కోరుతూ అందుకు ప్రతిఫలంగా 35 వేల పౌండ్లు(సుమారు రూ.37 లక్షలు) దఫాలుగా చెల్లించిన ఉదంతంలో బీబీసీ ఎట్టకేలకు స్పందించింది. ఆరోపణలు ఎదుర్కుంటున్న బీబీసీ ఉద్యోగిని విధుల నుండి తప్పించినట్లు తెలిపింది.
37 లక్షలు ఎర..
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మీడియా ఛానల్ అయిన బీబీసీలో ఒక న్యూస్ ప్రెజెంటర్ సంస్థ ప్రతిష్టను దిగజార్చే పనికి పాల్పడ్డాడు. 2020లో పరిచయమైన ఓ అమ్మాయిని తన వ్యక్తిగత చిత్రాలను పంపించవలసిందిగా కోరాడు. అప్పటికి ఆ అమ్మాయి వయసు 17 ఏళ్ళు కాగా ఇప్పుడు 20 ఏళ్ళు. అలా పంపించినందుకుగాను ఆమెకు 35 యూకే పౌండ్లు(సుమారు రూ.37 లక్షలు) కూడా ఎరగా చూపించాడు.
సున్నితమైన అంశం కాబట్టి..
ఈ విషయం ఆ అమ్మాయి తల్లికి తెలియడంతో బిబిసి ప్రెజెంటర్ విషయాన్ని సన్ మీడియా దృష్టికి తీసుకొచ్చింది. దీంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. బీబీసీ ఛానల్ ప్రతిష్ట దిగజారుతుందేమోనన్న భయంతో సంస్థ యాజమాన్యం సంఘటనపై జాప్యంగా వ్యవహరించింది. చివరికి ఛానల్ పై ఒత్తిడి అధికం కావడంతో సదరు ప్రెజెంటర్ ను విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్బంగా బీబీసీ.. సంక్లిష్టమైన సమస్య కావడంతో సత్వరంగా చర్యలు తీసుకున్నాము. అయినా కూడా ఈ సంఘటనపై దర్యాపు చేసి నిజాలు వెల్లడించాలని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులను కోరింది.
కల్చర్ సెక్రెటరీ లూసీ ఫ్రేజర్ బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డెవీతో ఈ విషయంపై మాట్లాడానని ఆయన దర్యాప్తు వేగవంతంగా చేస్తున్నట్లు హామీ ఇచ్చారని ట్విట్టర్లో షేర్ చేసింది.
I have spoken to BBC Director General Tim Davie about the deeply concerning allegations involving one of its presenters. He has assured me the BBC are investigating swiftly and sensitively.
— Lucy Frazer (@lucyfrazermp) July 9, 2023
ఇది కూడా చదవండి: ఫ్రాన్స్ అల్లర్లు - అభివృద్ధి చెందిన దేశానికి ఎందుకీ గతి పట్టింది?
Comments
Please login to add a commentAdd a comment