explicit pictures
-
అశ్లీల చిత్రాలను పంపించమని కోరాడు.. ఉద్యోగం గోవిందా..
లండన్: బీబీసీ ఛానల్ న్యూస్ ప్రెజెంటర్ ఒకరు 17 ఏళ్ల యువతి వ్యక్తిగత ఫోటోలను కోరుతూ అందుకు ప్రతిఫలంగా 35 వేల పౌండ్లు(సుమారు రూ.37 లక్షలు) దఫాలుగా చెల్లించిన ఉదంతంలో బీబీసీ ఎట్టకేలకు స్పందించింది. ఆరోపణలు ఎదుర్కుంటున్న బీబీసీ ఉద్యోగిని విధుల నుండి తప్పించినట్లు తెలిపింది. 37 లక్షలు ఎర.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మీడియా ఛానల్ అయిన బీబీసీలో ఒక న్యూస్ ప్రెజెంటర్ సంస్థ ప్రతిష్టను దిగజార్చే పనికి పాల్పడ్డాడు. 2020లో పరిచయమైన ఓ అమ్మాయిని తన వ్యక్తిగత చిత్రాలను పంపించవలసిందిగా కోరాడు. అప్పటికి ఆ అమ్మాయి వయసు 17 ఏళ్ళు కాగా ఇప్పుడు 20 ఏళ్ళు. అలా పంపించినందుకుగాను ఆమెకు 35 యూకే పౌండ్లు(సుమారు రూ.37 లక్షలు) కూడా ఎరగా చూపించాడు. సున్నితమైన అంశం కాబట్టి.. ఈ విషయం ఆ అమ్మాయి తల్లికి తెలియడంతో బిబిసి ప్రెజెంటర్ విషయాన్ని సన్ మీడియా దృష్టికి తీసుకొచ్చింది. దీంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. బీబీసీ ఛానల్ ప్రతిష్ట దిగజారుతుందేమోనన్న భయంతో సంస్థ యాజమాన్యం సంఘటనపై జాప్యంగా వ్యవహరించింది. చివరికి ఛానల్ పై ఒత్తిడి అధికం కావడంతో సదరు ప్రెజెంటర్ ను విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్బంగా బీబీసీ.. సంక్లిష్టమైన సమస్య కావడంతో సత్వరంగా చర్యలు తీసుకున్నాము. అయినా కూడా ఈ సంఘటనపై దర్యాపు చేసి నిజాలు వెల్లడించాలని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులను కోరింది. కల్చర్ సెక్రెటరీ లూసీ ఫ్రేజర్ బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డెవీతో ఈ విషయంపై మాట్లాడానని ఆయన దర్యాప్తు వేగవంతంగా చేస్తున్నట్లు హామీ ఇచ్చారని ట్విట్టర్లో షేర్ చేసింది. I have spoken to BBC Director General Tim Davie about the deeply concerning allegations involving one of its presenters. He has assured me the BBC are investigating swiftly and sensitively. — Lucy Frazer (@lucyfrazermp) July 9, 2023 ఇది కూడా చదవండి: ఫ్రాన్స్ అల్లర్లు - అభివృద్ధి చెందిన దేశానికి ఎందుకీ గతి పట్టింది? -
అశ్లీల, మార్ఫింగ్ వీడియోల కథ కంచికి!
ఇంటర్నెట్లో సైట్లను బ్లాక్ చేసినా మన దేశంలో అశ్లీల కంటెంట్ వీక్షణకు ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటున్నాయి. ఆఖరికి సోషల్ మీడియా అకౌంట్లలోనూ వీటి హవా నడుస్తోంది. అయితే ఇకపై ఇలాంటి ఆటలు సాగవు!. అశ్లీల కంటెంట్‌తో పాటు మార్ఫింగ్ వీడియోల తొలగింపు కోసం స్వయంగా రంగంలోకి దిగింది కేంద్రం. ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అశ్లీల, మార్ఫింగ్ వీడియోల పని పట్టేలో కేంద్ర ప్రభుత్వం తలమునకలైంది. వివిధ ప్లాట్‌ఫామ్‌లలోని అకౌంట్లపై వేట(టు) మొదలైంది. ఈ మేరకు కేంద్ర సాంకేతిక సమాచార మంత్రిత్వ శాఖ.. ట్విటర్, ఫేస్బుక్, టెలిగ్రాం అకౌంట్లలో సర్క్యులేట్ అవుతున్న మార్ఫింగ్, అశ్లీల వీడియోల అంశాన్ని ఆయా ప్లాట్‌ఫామ్స్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆయా అకౌంట్లను తాత్కాలికంగా లేదంటే పూర్తిగా నిషేధించడమో చేయాలంటూ కేంద్రం నుంచి ఆదేశాలు వెలువడుతున్నాయి కూడా. ఆ క్లిప్‌తో గుర్రు! గతంలో పోర్న్ సైట్ల బహిరంగ వీక్షణపై కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు టెలికామ్ ఆపరేటర్ల సహకారంతో ఈ చర్యకు ఉపక్రమించింది. అయినప్పటికీ ఇతర మార్గాల ద్వారా అశ్లీల కంటెంట్ వైరల్ అవుతూ వస్తుండగా.. ఎప్పటికప్పుడు చర్యల ద్వారా కట్టడి చేస్తూ వస్తోంది కేంద్రం. ఇదిలా ఉంటే ట్విటర్లాంటి సామాజిక మాధ్యమాల్లో సైతం అసభ్య, అశ్లీల, మార్ఫింగ్, ఫేక్ వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈ విషయంలో పలు ఫిర్యాదులు అందడంతో సీరియస్ అయిన కేంద్రం.. ఐటీ రూల్స్ 2021 ద్వారా కట్టడికి ప్రయత్నిస్తూ వస్తోంది. అయినా కూడా కంటెంట్ వ్యాప్తి ఆగడం లేదు. కేవలం ఏజ్ లిమిట్ పర్మిషన్తో యూజర్లను ఆయా ప్లాట్‌ఫామ్స్ అనుమతిస్తుండగా.. కేంద్రం మాత్రం ఇది కుదరని కరాకండిగా చెప్తోంది. ఇంతలో క్యాబినేట్ భేటీ సంబంధిత క్లిప్ మార్ఫింగ్ అయ్యి మరి సర్క్యులేట్ అవుతుండడంపై కేంద్రం గరం అయ్యింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఫటాఫట్ చర్యలు ప్రత్యేకించి కొన్ని అకౌంట్లు, పేజీలు, ఛానెల్స్ నుంచే అశ్లీల కంటెంట్, వర్గాల మధ్య చిచ్చు పెట్టే తరహా కంటెంట్ వ్యాప్తి చెందుతోంది. ఈ మేరకు ఆయా ప్లాట్‌ఫామ్స్ నుంచి సరైన స్పందన లేకపోతుండడంతో స్వయంగా సమాచార మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. త్వరగతిన రంగంలోకి దిగిన కేంద్రం.. 73 ట్విటర్ అకౌంట్లను సస్పెండ్ చేసింది. నాలుగు యూట్యూబ్ ఛానెళ్లను తొలగించింది. ఇన్స్టాగ్రామ్ గేమ్‌ను తొలగించిందని తెలుస్తోంది. కేవలం తొలగించడమే కాదు.. ఇలాంటి చేష్టలకు పాల్పడే బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని చెబుతోంది కేంద్రం. ఆడవాళ్ల కోసం.. మరోవైపు మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు, ఇతరత్ర కంటెంట్‌ను వ్యాప్తిచెందిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరిస్తోంది. ఈ మేరకు యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ మేనేజ్మెంట్లకు అలాంటి అకౌంట్ల విషయంలో జాప్యం చేయకుండా(విచారణ, దర్యాప్తు పేరుతో కాలయాపన చేయకుండా) త్వరగతిన యాక్షన్ తీసుకోవాలని సూచించింది. ప్రత్యేకించి ప్రముఖుల మార్ఫింగ్, అభ్యంతరకర, నకిలీ కంటెంట్ విషయంలో త్వరగతిన స్పందించాలని కోరింది. ఫిర్యాదులు అందినా.. అందకపోయినా నిరంతర పర్యవేక్షణ ద్వారా చర్యలకు ఉపక్రమించాలని తెలిపింది. టెక్నాలజీ(ఫేక్, మార్ఫింగ్) కట్టడికి టెక్నాలజీనే విరుగుడుగా ఉపయోగించాలని సూచిస్తోంది. వీపీఎన్ల నిషేధం! ట్విటర్, టెలిగ్రామ్ లాంటి అకౌంట్లతో పాటు వీపీఎన్(వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్)లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఇంటర్నెట్లో విచ్చలవిడిగా అశ్లీల, అభ్యంతరకర, నిషేధిత కంటెంట్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీపీఎన్ అకౌంట్ల నిషేధంపై కేంద్రం నజర్ పెట్టింది. ప్రత్యేక టూల్స్ ద్వారా అకౌంట్లపై నిఘా కొనసాగించాలంటూ ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ఒత్తిడి తెస్తోంది. దేశంలో వీపీఎన్ సేవలు, డార్క్ వెబ్ వాడకాన్ని పరిశీలించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి ట్రాకింగ్, నిఘా యంత్రాంగాలను బలోపేతం చేయాలని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.. ఇది వరకే హోం మంత్రిత్వ శాఖను కోరిన విషయం తెలిసిందే. మరోవైపు అశ్లీల సైట్ల డొమైన్ల(ఎప్పటికప్పుడు మారుస్తూ ఇంటర్నెట్లో దర్శనమివ్వడం!) విషయంలోనూ కఠిన నియంత్రణ ద్వారా కట్టడి చేయాలని అనుకుంటోంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ వేసవి లోపే అశ్లీల, మార్ఫింగ్ వీడియోల కట్టడిపై కేంద్రం పట్టు సాధించే అవకాశం ఉంది. చదవండి: 20 ఏళ్లుగా పరారీలో డాన్.. ఎలా దొరికాడో తెలిస్తే సంబరపడతారు -
ఇదేం టెక్నాలజీ! మన తారలకు చెప్పుకోలేని తలనొప్పి
గ్లామర్ ప్రపంచం.. ఎక్కువ మందిని తనవైపు లాగే ఒక ఆకర్షణ. సెలబ్రిటీలు ఏ పని చేసినా.. అదో వైరల్ న్యూస్ అవుతున్న రోజులివి. ముఖ్యంగా ఫిమేల్ సెలబ్రిటీల విషయంలో ఇది ఎక్కువగా ఉంటోంది. వాళ్ల దృష్టిలో ఇంటర్నెట్ అనేది ఫ్రీ ప్రమోషన్ ఎలిమెంట్. అందుకే తమ క్రేజ్‌ను నిలబెట్టుకునేందుకు గ్లామర్ ఫొటో-వీడియో కంటెంట్‌ను క్రమం తప్పకుండా షేర్ చేస్తుంటారు. అయితే వాళ్లకు తెలియకుండానే ఆ కంటెంట్ తప్పుడు దోవలో వెళ్తోంది. ఆ కంటెంట్‌ను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్నిండా ఫేక్ ఫొటోలు, అశ్లీల వీడియోలతో నింపేస్తున్నారు కొందరు. వెబ్ డెస్క్: ‘ఫేస్ మారిపోతది.. ఫన్ పుడుతది’.. ఈ ప్రచారంతోనే ఎడిటింగ్ యాప్స్‌ల హవా సాగుతోంది ఇప్పడు. కానీ, తెర వెనుక జరిగే తతంగం అంతా వేరే ఉంటోంది. సరదా కోణంలో చూసుకుంటున్నప్పటికీ.. అశ్లీల కంటెంట్ విపరీతంగా జనరేట్ కావడానికి ఇవే ప్రధాన కారణం అవుతున్నాయి. రోజుకి సుమారు 40 లక్షల ఎడిటింగ్ వీడియోలు, 3 కోట్లకు పైగా ‘ఫేక్’(ఎడిటింగ్) కంటెంట్ అప్లోడ్ అవుతున్నట్లు ఒక అంచనా. ఈ విషయంలో మామూలు వ్యక్తుల కంటే సెలబ్రిటీలు ఎక్కువగా బాధితులుగా మారుతున్నారు. . దీంతో విదేశాల్లో ఈ వ్యవహారాన్ని సెలబ్రిటీలు అంత తేలికగా తీసుకోవడం లేదు. హాలీవుడ్లో అయితే ఇలాంటి అశ్లీల కంటెంట్ కట్టడి కోసం పెద్ద ఉద్యమమే నడుస్తోంది. వీళ్లంతా పోరాడుతున్నారు మనదగ్గర దాదాపు పాతరం, కొత్త తారలంతా ఫేక్ఎడిటింగ్ కంటెంట్ బాధితులుగానే ఉన్నారు. అయితే తమను నెట్టింటికీడుస్తున్న వ్యవహారాలపై పోరాడటానికి ఎందుకనో వెనుకంజ వేస్తున్నారు. విదేశాల్లో మాత్రం ఇలాంటి కంటెంట్‌ను హీరోయిన్లు సహించడం లేదు. హాలీవుడ్ నటీమణులు కేట్ విన్స్లెట్, జెస్సికా ఆల్బాలు ఈ విషయంలో సైబర్ సంబంధిత విభాగాల్లో ఫిర్యాదులు చేయడంతో పాటు సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై ఓపెన్‌గా చర్చించారు. ఇక ‘వండర్ వుమెన్’ గాల్ గడోట్అయితే ఏకంగా అశ్లీల కంటెంట్ కట్టడి కోసం చిన్నసైజు ఉద్యమాన్నే నడిపిస్తోంది. నటి గాల్ గాడోట్ ఈజిప్ట్ నటి నెల్లీ కరీం.. ఓ అడుగు ముందుకు వేసి తన పేరుతో వైరల్ అవుతున్న కంటెంట్‌ను సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్ షేర్ చేసి మరీ నిరసన వ్యక్తం చేసింది. కొందరు బ్రిటన్ భామలు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రత్యేక చట్టాల ద్వారా కట్టడికి వీలు లేనప్పుడు.. అలాంటి సైట్లను పూర్తిగా నిషేధించడం ద్వారా అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. మన దగ్గరికి వస్తే బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్..భాషలకతీతంగా చాలామంది హీరోయిన్లు ఈ వ్యవహారంలో బాధితులుగా మారుతున్నారు. గూగుల్‌లో వాళ్ల కంటెంట్ కుప్పలుగా కనిపిస్తోంది. దారుణమైన విషయం ఏంటంటే.. ప్రముఖ సోషల్ మీడియా యాప్స్‌లోనూ వందల కొద్ది అకౌంట్ల ద్వారా అవి వైరల్ అవుతుండడం, వాటికి వేల నుంచి లక్షల మంది ఫాలోవర్స్ ఉండడం. వాళ్లే బెటర్ నాలుగు నెలల క్రితం కోలీవుడ్‌కు చెందిన ఓ నటి.. ట్విటర్లో హీరోయిన్ల ఫేక్ ఫొటోల్ని షేర్ చేస్తున్న ఓ అడల్ట్ అకౌంట్‌కు ఫాలో రిక్వెస్ట్ పెట్టింది. అది చూసి సంబురంగా ఆ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసి.. ఆమె రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశాడు ఆ అకౌంట్ అడ్మిన్. వెంటనే సైబర్ విభాగానికి ఫిర్యాదు చేసిన ఆ నటి.. అతన్ని కటకటాల వెనక్కి నెట్టించింది. తాజాగా భోజ్‌పురికి చెందిన ఇద్దరు హీరోయిన్లు తమ పేరుతో వైరల్ అవుతున్న కంటెంట్ మీద కోర్టుకు వెళ్లారు. ఇలా ఎంతోమంది చిన్నాచితకా హీరోయిన్లు అశ్లీల కంటెంట్ వ్యాప్తిపై ధైర్యంగా ముందుకొచ్చి పోరాడుతున్నారు. సాధారణంగా ఇలాంటి వేధింపులు ఎవరికైనా ఎదురైనప్పుడు వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేయడానికి ఆస్కారం ఉంటుందని, అవసరం అనుకుంటే ఫిర్యాదుదారుడి సమాచారం సైతం గోప్యంగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు న్యాయ నిపుణులు. ►సెక్షన్ 292(అశ్లీల కంటెంట్‌ను సర్క్యులేట్చేయడం) ► 354సీ (అనుమతి లేకుండా అసభ్య వీడియోల్ని చిత్రీకరించడం), ► 499 (వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడం), ► 509 (మహిళా గౌరవానికి భంగం కలిగించడం), ► వీటితో పాటు ఐటీ యాక్ట్‌లోని సెక్షన్లు 66ఈ, 67, 67ఎ, 72 సెక్షన్ల ప్రకారం ఉపశమనం పొందొచ్చు. ఫేస్ స్వాప్ ఫొటో, వీడియో ఎడిటింగ్ యాప్‌లలో ఫిల్టర్లు, ఫొటో మార్ఫింగ్‌లు సాధారణమైన వ్యవహారాలు. కానీ, టెక్నాలజీ అప్డేట్ మూలంగా అది మరీ శ్రుతి మించిపోతోంది. ఫేస్ స్వాప్.. అశ్లీల టెక్నాలజీని పెంపొదిస్తున్న వాటిల్లో ఒకటిగా మారింది. ఒకరి ముఖం ప్లేస్‌లో మరొకరి ఫేస్ ఉంచడమే దీని ఉద్దేశం. మొదట్లో రివెంజ్ పోర్న్ ద్వారా వార్తల్లో నిలిచిన ఫేస్ స్వాప్.. ఆ తర్వాత ఓ ఎంటర్టైనింగ్ ఫీచర్\టూల్‌గా మారింది. ఇప్పుడు దీనిని ఆసరాగా తీసుకుని సెలబ్రిటీలను తెర మీదకు తెస్తున్నారు కొందరు. హీరోయిన్ల ఫొటోలను ఎడిట్ చేసి.. ఇంటర్నెట్లో వదులుతున్నారు. డీప్‌ఫేక్ ఫీచర్ ఇది ఒకరకంగా మార్ఫింగ్ లాంటిదే. అల్రెడీ ఉన్న వీడియోతోగానీ, అప్పటికప్పుడు చేసే వీడియోతో ఫన్నీ కంటెంట్ క్రియేట్ చేసేందుకు ఉద్దేశించి రూపొందించిన ఫీచర్. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ(ఏఐ)తో పని చేసే సింథటిక్ టెక్నాలజీ ఇది. దీని ద్వారా ఒక వీడియోలోగానీ, ఫొటోలోగానీ ముఖాన్ని ఈ ఫీచర్ ద్వారా మార్చేయొచ్చు. ఆ ప్లేస్‌లో యూజర్ తన ఫేస్‌ని లేదంటే తనకు కావాల్సిన ముఖాన్ని అప్డేట్ చేసి ఓ కొత్త వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇదంతా ఒక సరదా వ్యవహారం. ఇందుకోసం కోట్లు ఖర్చు చేసి ఏఐ టెక్నాలజీ సాయం తీసుకుంటున్నాయి వీడియో ఎడిటింగ్ యాప్‌లు. కానీ, గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న సెలబ్రిటీలకు.. ఫేక్ వీడియోల ద్వారా ఈ టెక్నాలజీ కొత్త తలనొప్పి తీసుకొస్తోంది. కంట్రోల్ కాదనేనా? గతంలో ఇలాంటి కంటెంట్ తెరపైకి వచ్చినప్పుడు.. ఖండించిన తారలూ లేకపోలేదు. కానీ, ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. కొందరు సరదా కోసం ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంటే.. మరికొందరు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. అనని మాటల్ని అన్నట్లు.. చేయని పనుల్ని చేసినట్లు చూపిస్తున్నారు. కాంట్రవర్సీలు, ఫేక్ సెక్స్ స్కాండల్స్‌తో ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. దీంతో టెక్నాలజీ ‘సేఫ్టీ’పై అనుమానాలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ‘ప్రీ ఎంప్టివ్ రీసెర్చ్’ సర్వీస్ ఉంది. ఈ సర్వీస్ ద్వారా యూజర్ జనరేట్ కంటెంట్‌ను కంట్రోల్ చేయగలిగినా.. ఇతర సైట్లతో మళ్లీ వైరల్ అవ్వొచ్చని టెక్ నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి వ్యవహారాలేవీ కొత్తేం కాదని, ఎంత నియంత్రించినా మళ్లీ మళ్లీ తెరపైకి వస్తూనే ఉంటాయని చెప్తున్నారు నెదర్లాండ్స్ ఆర్ట్ఈజెడ్ యూనివర్సిటీ ‘ఎస్తెటిక్స్ అండ్ కల్చర్ ఆఫ్ టెక్నాలజీ’ ప్రొఫెసర్ నిశాంత్షా. బహుశా ఈ కోణంలోనే ఆ ఫేక్ బురదలో రాయి వేయడం ఎందుకని ఈ తలనొప్పిని పంటి బిగువున భరిస్తున్నారనే వాదన కూడా ఒకటి వినిపిస్తోంది. చదవండి: సెల్‌ఫోన్ టవర్లు, కేబుళ్లు కనుమరుగు కానున్నాయా..! -
‘నగ్నంగా చూడాలని ఉందా?’.. ఇదో సరదా!
రోజుకో కొత్త టూల్, కొత్త ఫీచర్స్ యూజర్లకు అందుబాటులోకి వస్తున్నాయి. సోషల్ మీడియా సంచార జీవులు.. ఈ ఫీచర్స్‌ను కచ్చితంగా ట్రై చేస్తుంటారు కూడా. అయితే వీళ్ల బలహీనతలను క్యాష్ చేసుకునేందుకు ‘అతి’ పోకడలు ప్రదర్శిస్తున్నాయి కొన్ని కంపెనీలు. టెక్నాలజీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో.. అదే స్థాయిలో నష్టాలుంటాయని మరోసారి రుజువైంది. సరదా పేరుతో పుట్టుకొచ్చిన చెండాలపు టూల్ ‘న్యూడీఫైయింగ్’.. ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో పెద్ద చర్చకే దారితీసింది. సాక్షి, వెబ్‌డెస్క్: యూకే ఎంపీ మరియా మిల్లర్(57).. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ‘న్యూడీఫైయింగ్’ మీద పార్లమెంట్ చర్చకు పట్టుబట్టడం ఈ చర్చకు ఆజ్యం పోసింది. న్యూఢీఫైయింగ్ టూల్ అంటే.. నగ్నంగా మార్చేసే టూల్. ఈ టూల్ సాయంతో బట్టల్లేకుండా చేయొచ్చు. ఫొటోగానీ, వీడియోగానీ ఈ టూల్ ద్వారా అప్డేట్ చేస్తే.. స్కానింగ్ చేసుకుని నగ్నంగా మార్చేసి చూపిస్తుంది. డీప్సుకెబే అనే వెబ్సైట్ కిందటి ఏడాది ఈ టూల్‌ను తీసుకురావడం, ఇప్పటికే కోట్ల మంది ఆ టూల్‌ను ఉపయోగించడం జరిగిపోయింది . ఒక్క జూన్ నెలలోనే యాభై లక్షల మంది ఈ సైట్‌ను సందర్శించారంటే.. ఈ టూల్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆడవాళ్లే లక్క్ష్యంగా.. డీప్‌సుక్‌బే వెబ్సైట్ వెనుక ఎవరు ఉన్నదనేది తెలియదు. కానీ, న్యూడీఫైయింగ్ టూల్‌ను(ఏఐ-లెవెరేజ్డ్ న్యూడిఫైయ్యర్) దరిద్రమైన ప్రచారంతో ప్రజల్లోకి తీసుకొచ్చింది మాత్రం ఇదే. కేవలం ఆడవాళ్లను మాత్రమే చూపిస్తాం అంటూ ప్రచారం చేసుకుంది ఈ వెబ్సైట్. ‘బట్టల వెనుక దాగున్న నగ్న సత్యాలను చూపిస్తాం.. మగవాళ్ల కలలను నిజం చేస్తాం’ అంటూ ప్రమోషన్ చేసుకోవడంతో డీప్‌సుక్‌బే వెబ్‌సైట్‌కు విపరీతమైన పబ్లిసిటీ దక్కింది. పే అండ్ యూజ్ సౌకర్యం కావడంతో ప్రపంచం వ్యాప్తంగా చాలామంది, మరికొందరు వీపీఎన్(వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్) సర్వీసుల ద్వారా ఈ టూల్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఎవరినీ వదలకుండా.. దాదాపు అన్ని దేశాలకు చెందిన బాధితులు లక్షల్లో .. డీప్‌సుక్‌బే న్యూఢీఫైయింగ్ టూల్ బారిన పడ్డారనే విషయం వెలుగులోకి వచ్చింది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, ఒలింపిక్ అథ్లెట్లు కూడా బాధిత జాబితాలో ఉండడం విశేషం. అందుకే ఈ టూల్ వ్యవహార శైలిపై అందరిలో ఆగ్రవేశాలు రగులుతున్నాయి. వాస్తవానికి న్యూడీఫైయర్ టూల్స్ కొత్తేం కాదు. ‘న్యూడ్ యువర్ ఫ్రెండ్’ సపోర్టింగ్ ఫీచర్ పేరుతో కొన్ని ఫొటో, వీడియో యాప్‌ల ద్వారా ఇలాంటి ఆమధ్య బాగా వైరల్ అయ్యాయి కూడా. అయితే డీప్‌న్యూడ్ అనే వెబ్సైట్ 2019లో ఈ టూల్‌ను తొలిసారిగా ఓన్ వెర్షన్‌తో లాంఛ్ చేసింది. ఆ టైంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో.. వెంటనే ఆ టెక్నాలజీని వెనక్కి తీసేసుకుంది. ఇక ఇలాంటి డిజిటల్ టెక్నాలజీ పట్ల ప్రపంచంలో ఎక్కడా న్యాయపరమైన చర్యలకు ఎలాంటి చట్టాలు లేవు. దీంతో యూకేలో ప్రత్యేక బిల్లు కోసం పోరాడాలని మరియా మిల్లర్ ప్రయత్నిస్తోంది. ఒక లెక్క ఉంటదా? న్యూఢీఫైయింగ్ టూల్.. ఇది హేతుబద్ధమైంది కాదు. కానీ, అడల్ట్ ఎంటర్టైన్మెంట్లో భాగంగా నడుస్తూ వస్తోంది. వివాదాలు-విమర్శలు-కేసులు ఏదేమైనా సరే.. న్యూడీఫైయింగ్ ఏఐ టూల్ సోర్స్ కోడ్ల అమ్మకం మాత్రం జోరుగా నడుస్తూనే ఉంది. ఏఐ టెక్నాలజీ ఏదైనా సరే.. లీగల్ అండ్ ఎథికల్‌గా ఉండాలనే నిబంధనను పాటించడం వల్లే చట్టాలూ కూడా ఇలాంటి టూల్స్‌ను అడ్డుకోలేకపోతున్నాయి. అయితే ఏదిఏమైనా అశ్లీలతను.. అదీ అవతలివాళ్ల అనుమతి లేకుండా డిజిటల్‌గా ప్రోత్సహించడం తీవ్ర నేరంగా పరిగణించాలని, ప్రత్యేక చట్టాల ద్వారా అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే రివెంజ్ పోర్న్(ప్రతీకారంలో భాగంగా కోపంతో అవతలివాళ్ల మీద అశ్లీలతను ప్రమోట్ చేయడం) కేసులు చూస్తూ వస్తున్నాం. ఆన్లైన్ భద్రతా చట్టాలు కూడా కాపాడలేని స్టేజ్‌లో ఇలాంటి టెక్నాలజీ గనుక పేట్రేగిపోతే.. రివెంజ్ పోర్న్ లాంటి నేరాలను అడ్డుకోవడం కష్టమవుతుందనేది సైబర్ నిపుణులు చెప్తున్న మాట. -
‘దిశ’పై పోస్టులు.. మరొకరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : ఫేస్బుక్ వేదికగా ‘దిశ’పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో కీలక నిందితుడు సాయినాథ్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. శనివారం నమోదు చేసిన కేసులో ఇతడే కీలకమని, మంగళవారం చిక్కిన శ్రీరామ్ సహ నిందితుడని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఉన్న అమరావతి కొండయ్య కాలనీకి చెందిన సాయినాథ్ అలియాస్ నాని బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఇటీవల జరిగిన దిశ ఉదంతం నేపథ్యంలో ఆమెను ఉద్దేశించి తన వాల్‌పై నాని అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేశాడు. వీటిని సమర్థిస్తూ శ్రీరామ్ సహా మరికొందరు కామెంట్స్ పెట్టారు. వీటిపై స్పందించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వ్యవహారంపై శనివారం సుమోటోగా కేసు నమోదు చేశారు. ఆధారాలను బట్టి సాయినాథ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తిం చారు. బుధవారం గుంటూరు వెళ్లిన ఓ ప్రత్యేక బృందం అతడిని అరెస్టు చేసింది. నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
హవ్వా.. ఏడేళ్లకే క్లాస్ రూంలో ఇవేం పనులు
ఊహించలేని రోజులొస్తున్నాయి.. చూడకూడనివి దర్శనమిస్తున్నాయి. విష సంస్కృతి వాయు వేగంతో విస్తరిస్తోంది. అవునూ పాశ్చాత్య దేశాల్లో చిన్నారులను పోర్న్ బూతం కమ్మేస్తుంది. అది కూడా పట్టుమని పదేళ్లు కూడా నిండకుండానే. సాధారణంగానే అశ్లీలత చేష్టలు అధికంగా ఉండే పాశ్చాత్య దేశాల్లో ఆ ప్రభావం తమ చిన్నారులపై వేగంగానే పడుతోందని తెలుస్తోంది. ఎందుకంటే స్కూల్‌కు వెళుతున్న తమ 7 నుంచి 14 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులకు ఇస్తున్న సెల్ ఫోన్లలో మొత్తం అశ్లీల చిత్రాల బట్వాడా అవుతున్నాయి. తాము చేసేది తప్పు అనేది కూడా తెలియని వయసులోనే ఒకరి నుంచి మరొకరికి ఆ ఫొటోలను వీడియోలను పంపించుకుంటు తప్పులమీద తప్పులు చేస్తున్నారు. ఇవేవో ఆరోపణలు కాదు. సాక్షాత్తు వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ఉపాధ్యాయలు చెప్పినవి. ఎన్ఏఎస్ యూడబ్ల్యూటీ యూనియన్ అనే సంస్థ ఒకటి ఆయా పాఠశాలల్లో విద్యార్థుల చేష్టలపట్ల సర్వే నిర్వహించగా సగానికి పైగా విద్యార్థులు చిన్న వయసులోనే అశ్లీల చేష్టలకు అలవాటుపడ్డారని బయటపడింది. వారి నగ్న చిత్రాలు వారే తీసుకోవడం, స్వయంగా అసభ్య చేష్టలకు పాల్పడి ఆ చర్యలను వీడియో తీయడం వాటిని తన బాయ్ ఫ్రెండేకో, గర్ల్ ఫ్రెండ్ కో పంపిస్తే వాటిని వాళ్లు తిరిగి స్నేహితులకు పంపించడం లాంటి పనులు చేస్తూ పుస్తకాలు పక్కన పడేసి అలాంటి పనుల్లో బిజీగా ఉండిపోయారని టీచర్లే స్వయంగా చెప్పారు. 1,300మంది టీచర్లను ప్రశ్నించగా వారు సోషల్ మీడియా ద్వారా ఎంతగా చెడిపోతున్నారో చెప్పారు. వారి మొబైల్ ఫోన్ ల ద్వారా అసభ్యతకు పాల్పడుతుంటే సగానికి పైగా టీచర్లకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారంట. అది కూడా తరగతి గదుల్లోనే అయితే, వారు తప్పు చేస్తున్నారని కూడా తెలుసుకోలేని వయసు కలిగినవారని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిలో 7 నుంచి 14 ఏళ్ల లోపువారు 60శాతం ఉండగా.. 40 శాతంమంది 13 ఏళ్లు కలిగిన వారు ఉన్నారని సర్వే తెలిపింది. దీనిని అరికట్టకుంటే వారి భవిష్యత్తు అంధకారంగా మారడం తప్పదని హెచ్చరిస్తున్నారు.