హవ్వా.. ఏడేళ్లకే క్లాస్ రూంలో ఇవేం పనులు | Children aged just SEVEN are sexting | Sakshi
Sakshi News home page

హవ్వా.. ఏడేళ్లకే క్లాస్ రూంలో ఇవేం పనులు

Published Fri, Mar 25 2016 5:21 PM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

హవ్వా.. ఏడేళ్లకే క్లాస్ రూంలో ఇవేం పనులు

హవ్వా.. ఏడేళ్లకే క్లాస్ రూంలో ఇవేం పనులు

ఊహించలేని రోజులొస్తున్నాయి.. చూడకూడనివి దర్శనమిస్తున్నాయి. విష సంస్కృతి వాయు వేగంతో విస్తరిస్తోంది. అవునూ పాశ్చాత్య దేశాల్లో చిన్నారులను పోర్న్ బూతం కమ్మేస్తుంది. అది కూడా పట్టుమని పదేళ్లు కూడా నిండకుండానే. సాధారణంగానే అశ్లీలత చేష్టలు అధికంగా ఉండే పాశ్చాత్య దేశాల్లో ఆ ప్రభావం తమ చిన్నారులపై వేగంగానే పడుతోందని తెలుస్తోంది. ఎందుకంటే స్కూల్కు వెళుతున్న తమ 7 నుంచి 14 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులకు ఇస్తున్న సెల్‌ ఫోన్లలో మొత్తం అశ్లీల చిత్రాల బట్వాడా అవుతున్నాయి. తాము చేసేది తప్పు అనేది కూడా తెలియని వయసులోనే ఒకరి నుంచి మరొకరికి ఆ ఫొటోలను వీడియోలను పంపించుకుంటు తప్పులమీద తప్పులు చేస్తున్నారు. ఇవేవో ఆరోపణలు కాదు.

సాక్షాత్తు వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ఉపాధ్యాయలు చెప్పినవి. ఎన్ఏఎస్ యూడబ్ల్యూటీ యూనియన్ అనే సంస్థ ఒకటి ఆయా పాఠశాలల్లో విద్యార్థుల చేష్టలపట్ల సర్వే నిర్వహించగా సగానికి పైగా విద్యార్థులు చిన్న వయసులోనే అశ్లీల చేష్టలకు అలవాటుపడ్డారని బయటపడింది. వారి నగ్న చిత్రాలు వారే తీసుకోవడం, స్వయంగా అసభ్య చేష్టలకు పాల్పడి ఆ చర్యలను వీడియో తీయడం వాటిని తన బాయ్ ఫ్రెండేకో, గర్ల్‌ ఫ్రెండ్ కో పంపిస్తే వాటిని వాళ్లు తిరిగి స్నేహితులకు పంపించడం లాంటి పనులు చేస్తూ పుస్తకాలు పక్కన పడేసి అలాంటి పనుల్లో బిజీగా ఉండిపోయారని టీచర్లే స్వయంగా చెప్పారు. 1,300మంది టీచర్లను ప్రశ్నించగా వారు సోషల్ మీడియా ద్వారా ఎంతగా చెడిపోతున్నారో చెప్పారు.

వారి మొబైల్ ఫోన్ ల ద్వారా అసభ్యతకు పాల్పడుతుంటే సగానికి పైగా టీచర్లకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారంట. అది కూడా తరగతి గదుల్లోనే అయితే, వారు తప్పు చేస్తున్నారని కూడా తెలుసుకోలేని వయసు కలిగినవారని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిలో 7 నుంచి 14 ఏళ్ల లోపువారు 60శాతం ఉండగా.. 40 శాతంమంది 13 ఏళ్లు కలిగిన వారు ఉన్నారని సర్వే తెలిపింది. దీనిని అరికట్టకుంటే వారి భవిష్యత్తు అంధకారంగా మారడం తప్పదని హెచ్చరిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement