videos
-
అమ్మకానికి కుంభమేళా మహిళల పుణ్య స్నానాల వీడియోలు!
లక్నో : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు (Kumbh Mela) భక్తులు పెద్దఎత్తున తరలివస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 56 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.ఈక్రమంలో కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళా భక్తుల వీడియోలు విక్రయిస్తున్న,కొనుగోలు చేస్తున్న నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.ఇప్పటివరకు 103 సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.యూపీ సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్ కుంభమేళాలో మహిళలు స్నానమాచరించడం, దుస్తులు మార్చుకునే వీడియోల్ని పలువురు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో కొన్ని సోషల్ మీడియా ప్రొఫైళ్లు, గ్రూపుల్లో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించి, వాటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కుంభమేళా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (DIG) వైభవ్ కృష్ణ మీడియాతో తెలిపారు. బుధవారం కుంభమేళాలో స్నానం చేయడంతో పాటు, దుస్తులు మార్చుకుంటున్న మహిళల వీడియోల్ని తీస్తున్నారు. వాటిని అమ్మకానికి పెడుతున్నట్లు సమాచారం వచ్చింది.ఆ వీడియోలను అమ్మేవారిని, కొనుగోలు చేసే వారిని అరెస్ట్ చేస్తాం. మా సోషల్ మీడియా టీమ్ నిరంతరం వీటిని మానిటర్ చేస్తోంది. ఎవరైతే మహిళల ప్రైవేట్ వీడియోలను అప్లోడ్ చేస్తున్నారో, వారి ప్రొఫైళ్లపై చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.ఇప్పటివరకు ఎంతమంది వ్యక్తులు లేదా గ్రూపులను గుర్తించారనే సమాచారంపై డీఐజీ వైభవ్ కృష్ణ స్పందించారు. 103 సోషల్ మీడియా ప్రొఫైళను గుర్తించాం. వీటిలో ప్రజల్ని భయాందోళనకు గురి చేసే అకౌంట్లతో పాటు మహిళల ప్రైవేట్ వీడియోలను పోస్ట్ చేస్తున్న అకౌంట్లు ఉన్నట్లు వెల్లడించారు. 26 సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్లలో కుంభమేళాలో స్నానమాచరించే మహిళల వీడియోల్ని అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. ఇందులో ప్రమేయం ఉన్నవారందరిపై చర్యలు తీసుకుంటామని కుంభమేళా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (DIG) వైభవ్ కృష్ణ హెచ్చరించారు. కాగా, కుంభమేళాలో మహిళల వీడియోల్ని తీస్తున్న దుండగులు ఒక్కో వీడియోను రూ.2వేల నుంచి రూ.3వేల వరకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. -
Mahakumbh: స్నానపు దృశ్యాలు అప్లోడ్ చేసిన వారిపై చర్యలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. త్రివేణి సంగమంలో లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే మహా కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళలు, బట్టలు మార్చుకుంటున్న మహిళలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఉదంతం వెలుగుచూసింది దీనిని గమనించిన యూపీ పోలీసులు రంగంలోకి దిగి, నిందితులపై చర్యలకు ఉపక్రమించారు.ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ కుమార్ ఆదేశాల మేరకు.. సోషల్ మీడియాలో మహా కుంభమేళాకు సంబంధించిన అభ్యంతరకరమైన పోస్టులు, వదంతులను వ్యాప్తి చేసే వారిపై నిరంతరం పోలీసులు దృష్టిసారిస్తున్నారు. అలాంటివారిని గుర్తించి, చర్యలు చేపడుతున్నారు. మహాకుంభ్‌లో మహిళలు స్నానం చేస్తున్నప్పుడు, దుస్తులు మార్చుకుంటున్నప్పుడు కొందరు వీడియోలు తీసి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్లోడ్ చేస్తున్నారని పోలీసులకు తెలియవచ్చింది. ఇది మహిళల గోప్యత, గౌరవాన్ని ఉల్లంఘించడమేనంటూ పోలీసులు ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు.యూపీ పోలీసుల ఈ తరహాలోని రెండు ఉదంతాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. ఫిబ్రవరి 2న @neha1224872024 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుంభమేళాకు వచ్చిన మహిళలు స్నానం చేస్తూ, బట్టలు మార్చుకుంటున్న వీడియోలను ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ ఖాతాను నిర్వహిస్తున్న వారిని గుర్తించేందుకు యూపీ పోలీసులు మెటా కంపెనీ నుండి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. ఇదేవిధంగా ఫిబ్రవరి 19న టెలిగ్రామ్ ఛానెల్లోని ఒక ఖాతాపై కేసు నమోదయ్యింది. మహా కుంభోత్సవంలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలను అందుబాటులో ఉంచుతామని టెలిగ్రామ్ ఛానల్ CCTV CHANNEL 11 పేర్కొంది. దీంతో దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు.ఇది కూడా చదవండి: Delhi: సీఎంగా రేఖా గుప్తా ఎంపికతో హర్యానాలో సంబరాలు -
Mastan Sai Case: 44 మంది యువతులు, 250కి పైగా వీడియోలు
మణికొండ: నగ్న వీడియోలు, బ్లాక్‌మెయిలింగ్, డ్రగ్స్, అత్యాచారం, హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్‌సాయిని కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు. రెండో రోజు శుక్రవారం క్రైం పోలీసులతో పాటు సైబరాబాద్ నార్కొటిక్స్ విభాగం సైబరాబాద్ ఇన్చార్జి హరిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు అతడిని విచారించారు. ఈ సందర్భంగా మస్తాన్‌సాయిని డ్రగ్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తావు, ఎంత మందికి ఇచ్చావు, డ్రగ్స్ అలవాటు చేసిన యువతులపై ఎందుకు అత్యాచారం చేశావని, అలా ఎంత మందిని చేశావు, నగ్న వీడియోలను తీయాల్సిన అవసరం ఏమిటని, లావణ్యను ఎందుకు హత్య చేయాలనుకున్నావని ప్రశ్నించినట్లు తెలిసింది. తన హార్డ్ డిస్క్‌లో లావణ్య ఆరోపించినట్లు వేల సంఖ్యలో వీడియోలు లేవని, తన భార్యతో పాటు ఇద్దరు గర్ల్ఫ్రెండ్స్వి మాత్రమే ఉన్నాయని మరోసారి బుకాయించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. దాంతో హార్డ్డెస్్కను అతడి ముందే ఓపెన్ చేసిన పోలీసులు అవాక్కయ్యారు. అందులో ఒక్కో యువతికి సంబంధించి ఒక్కో ఫోల్డర్ రూపంలో వాట్సాప్ చాట్స్, ఆడియో, వీడియో, స్క్రీన్ రికార్డింగ్‌లను భద్రపర్చినట్లు పోలీసులు గుర్తించారు. హార్డ్డిస్్కలో 44 మంది యువతులకు సంబందించి 250కి పైగా వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. తన విల్లాలోని బెడ్రూంలో సీక్రెట్‌గా ఏర్పాటు చేసిన ఐదు కెమెరాలతో వీటిని తీసినట్లు విచారణలో మస్తాన్‌సాయి అంగీకరించినట్టు సమాచారం. లావణ్య ఇంట్లోనూ తీసిన వీడియోలు, చాట్ డాటా అతడి సెల్‌ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి ఆధారంగా అతడిని ప్రశ్నించినట్లు తెలిసింది. తన మిత్రుడు వినీత్‌రెడ్డి తనకు డ్రగ్స్ సరఫరా చేసే వాడని, పార్టీలు ఉన్నపుడు అతడి వద్ద కొనుగోలు చేసే వాడినని మస్తాన్‌సాయి వెల్లడించినట్లు సమాచారం. దీంతో వినీత్‌రెడ్డిని అరెస్టు చేసి, మరోమారు విచారించాలని నార్కోటిక్స్ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. రెండో రోజు విచారణలో మస్తాన్‌సాయి యువతులను డ్రగ్స్ పార్టీల ద్వారా మచి్చక చేసుకుని వారిని లైంగికంగా వాడుకున్నానని అంగీకరించినట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం వరకు పోలీసులు అతడి మరింత లోతుగా విచారించనున్నారు. అప్పటికీ తమకు రావాల్సిన సమాచారం రాకపోతే శనివారం మరో సారి కస్టడీ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకుంటా: లావణ్య -
రీల్స్ పిచ్చి..! బాలికను రెండుసార్లు వివాహం భార్గవ్
సీతమ్మధార: సెల్ఫోన్లకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్న రోజులివి. రీల్స్ పిచ్చి ఓ మైనర్ తల్లిదండ్రులను తలెత్తుకోకుండా చేస్తే..మరో యువకుడ్ని కటకటాలపాల్జేసింది. ఫోర్త్‌టౌన్ పోలీసు స్టేషన్లో యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఆ వివరాలు..తాటిచెట్లపాలెం రెడ్డివీధికి చెందిన 15 ఏళ్ల బాలికకు రీల్స్ అంటే పిచ్చి..నిత్యం రీల్స్ చేయడం..వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం అలవాటు. ఈ క్రమంలో సమీప ఇంట్లో ఉంటున్న భార్గవ్..బాలిక చేసిన రీల్స్ చూసి లైక్ కొట్టాడు. క్రమంగా ఇన్స్టాలోనే పరిచయం పెంచుకున్నాడు. ఫోన్ నంబర్ తీసుకున్నాడు. తనకు రీల్స్ చేయాలని ఉందని, దానికి సహకరించాలని బాలికను కోరాడు. లేదంటే చనిపోతానని బెదిరించాడు. దీంతో ఇటీవల కై లాసపురం కొండమీద గల వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద వీరిద్దరూ కలుసుకున్నారు. జనవరి 9వ తేదీన మళ్లీ అదే ప్రదేశంలో కలుసుకుని బలవంతంగా బాలిక మెడలో తాళి కట్టాడు. ఆ తరువాత కొద్ది రోజులకు మళ్లీ సదరు బాలికను సింహాచలం తీసుకువెళ్లి అక్కడ మరోమారి వివాహం చేసుకున్నాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫోర్త్ టౌన్ పోలీసులు భార్గవ్‌పై పోక్సో, బాల్యవివాహ నిరోధక చట్టం, ఎస్టీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. భార్గవ్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఆ యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసును ఫోర్త్ టౌన్ సీఐ సత్యనారాయణ పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
Delhi Election Result: సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రారంభ ట్రెండ్లలో బీజేపీ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ ఎన్నికలపై సోషల్ మీడియాలో మీమ్స్ , రీల్స్ వెల్లువెత్తుతున్నాయి. #DelhiElectionResults pic.twitter.com/TuHLOUHVWW— Desi Bhayo (@desi_bhayo88) February 8, 2025సోషల్ మీడియాలో పలువురు యూజర్స్ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లపై వ్యంగ్యబాణాలు విసురుతున్నారు.Ban gaye Raaja. #DelhiElectionResults #avadhojha pic.twitter.com/pPlicGf47R— Prayag (@theprayagtiwari) February 8, 2025ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగగా, నేడు (ఫిబ్రవరి 8) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపులో ముందుగా బీజేపీ ఆధిక్యం కనబరిచింది.#DelhiElectionResults #DelhiElections2025 Celebrations started in Congress camp after consistently leading in ONE seat out of 70in #Delhi 🔥WHAT A PARTY and WHAT A LEADER🔥💥 pic.twitter.com/tgIUMYDbb0— Mastikhor 🤪 (@ventingout247) February 8, 2025పలువురు ఆప్ నేతలు వెనుకంజలో కొనసాగుతున్నారు. దీనిని చూసిన యూజర్స్ పలు రకాల మీమ్స్ రూపొందించి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.Congress in every election #DelhiElectionResults pic.twitter.com/pyt64Lt0DL— Ex Bhakt (@exbhakt_) February 8, 2025 -
HYD: గాయత్రి హాస్టల్ కేసులో షాకింగ్ విషయాలు
తూర్పుగోదావరి: అశ్లీల వీడియోల పేరుతో యువతిని బెదిరిస్తూ నాలుగేళ్ల నుంచి డబ్బులు గుంజుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను మంగళవారం సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో డీఎస్పీ జి.దేవకుమార్ వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. నిడదవోలుకు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న గాయత్రీ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ విప్రో కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అదే హాస్టల్లో ఉంటున్న కాజా అనూషాదేవితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గుంటూరు జిల్లా ఓబులనాయుడుపాలేనికి చెందిన నీనావత్ దేవా నాయక్ అలియాస్ మధు అనే వ్యక్తిని అనూషాదేవి వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో స్నేహితురాలికి తన భర్తను పరిచయం చేసింది. అనూషాదేవితో ఉన్న పరిచయం, ఒకే హాస్టల్లో ఉండడంతో బాధితురాలు ఆమెతో అత్యంత సన్నిహితంగా ఉండేది. దీంతో దేవనాయక్ వేరే వ్యక్తి ఫోన్ చేసినట్లుగా బాధితురాలికి ఫోన్ చేసి తన వద్ద ఆమె న్యూడ్ వీడియోలున్నాయని, వాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరించారు. అలా చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. విడతల వారీగా ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా డబ్బులు వేయించుకునేవాడు. ఇలా కూడబెట్టిన సొమ్ముతో చిన్న కాకానిలో అపార్ట్మెంటు కోనుగోలు చేశాడు.కారు, బుల్లెట్, పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేశాడు. కాగా..తనను ఒక వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తున్న విషయాన్ని అనూషాదేవికి బాధితురాలు తెలిపింది. ఈ విషయం మళ్లీ దేవానాయక్ దృష్టికి వెళ్లింది. వేరొకరి ద్వారా సెటిల్మెంట్ చేసినట్లు బాధితురాలిని నమ్మించాడు. అలాగే పలు అవసరాల కోసం బాధితురాలి దగ్గర డబ్బులు కాజేశాడు. కాగా.. అనూషాదేవి, ఆమె భర్త దేవానాయక్లు తనను మోసం చేస్తున్నారని బాధితురాలు గుర్తించించి. దీంతో తల్లిదండ్రులతో కలిసి నిడదవోలు పోలీసులను ఆశ్రయించింది. ఇలా ఆమె 2021 నుంచి 2025 వరకూ దాదాపు రూ. 2,53,76,000 మోసపోయింది. మరో రూ.14 లక్షలు డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించింది. మూడు రోజుల్లో కేసు ఛేదనబాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మూడు రోజుల్లో దేవా నాయక్‌ను పట్టుకున్నారు. అతడి నుంచి రూ.1,81,45,000 విలువైన 938 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2.250 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.75 లక్షల నగదు, కారు, బుల్లెట్ స్వా«దీనం చేసుకున్నారు. చిన్నకాకానిలో కొనుగోలు చేసిన అపార్ట్మెంటును స్థానిక రెవెన్యూ అధికారుల ద్వారా స్వా«దీనం పర్చుకున్నారు. -
వైభవంగా జరిగిన నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం - హాజరైన ప్రముఖులు (ఫోటోలు)
-
వార్తల్లోకెక్కిన లగ్గం హీరోయిన్.. ప్రజ్ఞా నాగ్రా గురించి ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)
-
నట్టింటి నుంచి.. నెట్టింటికి..
పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. అని సినీ గేయ రచయిత ఆత్రేయ పాట అందరికీ తెలిసిందే.. అయితే ఆ పాటలో చెప్పిన విధంగా పెళ్లివారి నట్టింట్లో అచ్చం అలాంటి సందడే కొనసాగేది. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది.. పెళ్లి సందడి నట్టింట్లో నుంచి నెట్టింట్లోకి చేరింది. దీంతో రకరకాల ఆధునిక పోకడలు ఈ తతంగంలో కనిపిస్తున్నాయి. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదేరా బ్రదర్ అని మరో కవి అన్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అయ్యే విధంగా తతంగం నడుస్తోంది. పెళ్లిచూపులు, ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ మొదలు, పెళ్లి అనంతరం జరిగే తతంగాల వరకూ అన్నీ సోషల్ వేదికగా షేర్ చేసుకుంటున్నారు. పెళ్లిలో నేటి ఆధునిక పోకడలపైనే ఈ కథనం.. నేటి తరానికి ప్రతిదీ సెలబ్రేషనే.. సామాజిక మాధ్యమాల్లో పెళ్లి సంబరాలు అంబరాన్నంటేలా చేసుకుంటున్నారు. పెళ్లి పనులు ప్రారంభమైనప్పటి నుంచి ప్రీవెడ్డింగ్, పెళ్లి వేడుకలు, పోస్ట్ వెడ్డింగ్, సీమంతం ఇలా ఒక్కటేమిటి ప్రతి సందర్భాన్నీ వీడియోలు, ఫొటోలు తీసుకుని భద్రపరుచుకుంటున్నారు. తరతరాలు గుర్తుండిపోయేలా విభిన్నంగా, వినూత్నంగా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటికి సంబంధించిన పొట్టి వీడియోలను యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అయితే ఇటీవల సరికొత్త ట్రెండ్ వచి్చంది. అదేంటంటే.. పెళ్లి చూపులకు సంబంధించిన వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఈ వీడియోలు తాజాగా ఫుల్ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. సంతోషాన్ని పంచుకునేందుకు.. ఇటీవల తమ జీవితంలో జరిగే ముఖ్యమైన అంశాలను ప్రపంచంతో పంచుకోవడం అలవాటైంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోల రూపంలో పెడుతున్న వారు ఎక్కువ అవుతున్నారు. ఒకప్పుడు పెళ్లిచూపులకు సంబంధించిన అంశాలను చాలా గోప్యంగా ఉంచేవారు. అంతా సెట్ అయిన తర్వాత కానీ బయట ప్రపంచానికి తెలియనిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. జీవితంలో జరిగే ప్రతి ముఖ్యమైన ఘట్టాన్నీ గుర్తుంచుకునేందుకు ప్రయతి్నస్తున్నారు. పెళ్లి చూపుల కోసం పెళ్లి కొడుకు కారు దిగిన దగ్గరి నుంచి పెళ్లి చూపులు జరుగుతున్న తతంగం మొత్తాన్నీ వీడియోలు తీసుకుంటున్నారు. అటు పెళ్లి కొడుకు, ఇటు పెళ్లి కూతురు నవ్వుతూ సిగ్గు పడుతుంటే అదో మరపురాని అనుభూతిగా మిగిలిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. పెళ్లి కూతురు తరపు వాళ్లు, పెళ్లి కొడుకు తరపు బంధువులు ఈ సందర్భంగా సరదాగా జరిపే మాటామంతీ కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ సంభాషణలను ఆధారంగా చేసుకుని ఎన్నో ఫన్నీ వీడియోలు తీస్తూ నవ్వులు పూయిస్తున్నారు. కామెంట్ల వెల్లువ.. పెళ్లి చూపులకు సంబంధించిన వీడియోలను చక్కగా ఎడిటింగ్ చేసి, సూటయ్యే పాటలను బ్యాక్‌గ్రౌండ్‌లో సెట్‌చేసి అప్లోడ్ చేస్తున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు సరదాగా మాట్లాడుకుంటున్న సందర్భాన్ని కూడా వీడియోలు తీస్తున్నారు. రెండు, మూడేళ్లుగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ తరహా వీడియోలు తెగ పాపులర్‌గా ఉండేవి. ఇటీవల కాలంలోనే మన దగ్గర కూడా ఇలా పెళ్లి చూపుల వీడియోలు తీసి ఇన్‌స్ట్రాగామ్ వంటి వేదికల్లో పోస్టు చేస్తున్నారు. దీంతో మన దగ్గర కూడా ఈ రీల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ రీల్స్ చూసిన వీక్షకులు కూడా నూతన వధూవరులకు కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు చెబుతూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. పెళ్లి కాని యువతీ, యువకులు మాత్రం ఈ వీడియోలను చూస్తుంటే ‘పెళ్లి చేసుకుంటే బాగుండూ అనిపిస్తోంది’ అంటూ కామెంట్లు పెడుతూ నవ్వులు పూయిస్తున్నారు. మొత్తానికీ ఈ ఏడాది పెళ్లి చూపుల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయనే చెప్పుకోవచ్చు. జాగ్రత్త అంటున్న నిపుణులు.. ఇటీవల చాలావరకూ ప్రీవెడ్డింగ్, హల్దీ, మెహందీ, పోస్టు వెడ్డింగ్, బేబీ బంప్ వీడియోలు షూట్ చేసుకోవడం కామన్‌గా మారిపోయింది. అయితే ఏదైనా కానీ మితి మీరనంత వరకే మంచిదని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా మోజులో పడి అతిగా ప్రవర్తిస్తే వ్యక్తిగత జీవితంతో పాటు సమాజంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. గతంలో సెన్సేషన్ కోసమో.. వినూత్నంగా, విభిన్నంగా చేయాలనే ఉద్దేశంతోనో వెరైటీగా షూటింగ్స్ చేసి విమర్శలు కొని తెచ్చుకున్న వారూ లేకపోలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లోని ఫొటోలు, వీడియోలు నేటి టెక్నాలజీ కారణంగా మిస్ యూజ్ అయిన సందర్భాలనూ చూస్తూనే ఉన్నాం.. -
UP By Election: వరుస వీడియోలతో పోలీసులపై సమాజ్‌వాదీ మండిపాటు
అంబేద్కర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ నేటి (బుధవారం)ఉదయం ఏడు గంటల నుంచి కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. मुजफ्फरनगर की मीरापुर विधानसभा के किथोड़ा में बूथ संख्या 178, 179 पर पुलिस द्वारा मतदाताओं को वोट डालने से रोका जा रहा है।संज्ञान ले चुनाव आयोग, निष्पक्ष मतदान सुनिश्चित हो।@ecisveep @ceoup @DmMuzaffarnagar pic.twitter.com/u9QUq2Pov1— Samajwadi Party (@samajwadiparty) November 20, 2024ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఒక వీడియోను షేర్ చేసింది. దానిలో బురఖా ధరించిన ఒక మహిళ తనను ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించింది. బూత్ వద్ద తన ఐడీని చూపించినప్పటికీ తనకు ఓటు వేసేందుకు అనుమతినివ్వలేదని ఆమె పేర్కొంది. ఈ వీడియో కింద.. అంబేద్కర్ నగర్‌లోని కతేహరి అసెంబ్లీలోని బూత్ నంబర్ 65లో ఓటు వేయకుండా బురఖా ధరించిన మహిళను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల సంఘం దీనిపై దృష్టి సారించి, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగేలా చూడాలి’ అని సమాజ్‌వాదీ పార్టీ రాసింది.अम्बेडकर नगर की कटेहरी विधानसभा के बूथ संख्या 65 पर पुलिस द्वारा मतदाताओं को वोट डालने से रोका जा रहा है।संज्ञान ले चुनाव आयोग, निष्पक्ष मतदान सुनिश्चित हो।@ecisveep @ceoup @AmbedkarnagarDM pic.twitter.com/tYi9h8XSXo— Samajwadi Party (@samajwadiparty) November 20, 2024ఇదేవిధంగా కాన్పూర్‌లోని సిసామావు అసెంబ్లీ ఓటింగ్‌కు సంబంధించిన వీడియోను సమాజ్‌వాదీ పార్టీ షేర్ చేస్తూ, ఓటు వేయకుండా ఓటర్లను పోలీసులు అడ్డుకుంటున్నారని, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తూ వారిని వేధిస్తున్నారని ఆరోపించింది. ఎన్నికల సంఘం దీనిని గమనించాలని కోరింది.अंबेडकरनगर की कटेहरी विधानसभा के बूथ संख्या 120, 121 पर पूर्व सांसद रितेश पांडे के समर्थकों द्वारा बूथ पर भाजपा का झंडा लगाकर किया जा रहा कब्जा।संज्ञान ले चुनाव आयोग, निष्पक्ष मतदान सुनिश्चित हो।@ecisveep @ceoup @AmbedkarnagarDM pic.twitter.com/sIh4tMcnGN— Samajwadi Party (@samajwadiparty) November 20, 2024ఇదేవిధంగా ముజఫర్గర్లోని మీరాపూర్ స్థానానికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఎస్పీ, ముజఫర్‌నగర్‌లోని మీరాపూర్ అసెంబ్లీ కితోడాలో బూత్ నంబర్ 178, 179లో ఓటర్లు ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని రాసింది. మొరాదాబాద్‌లోని కుందర్కి అసెంబ్లీలోని బూత్ నంబర్ 162 వద్ద ఓటర్ల స్లిప్పులను పోలీసులు లాక్కుంటున్నారని ఆరోపించింది.ఇది కూడా చదవండి: UP By Election: అల్లరి మూకలకు అఖిలేష్ హెచ్చరిక -
పరువు నష్టం కలిగించే పోస్టులు తొలగించండి
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లే వీడియోలను అప్లోడ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని యూట్యూబ్‌ను హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ల పరువుకు నష్టం కలిగించే పోస్టులు తొలగించాలని స్పష్టం చేసింది. వ్యక్తిగత వేధింపులకు పాల్పడే వీడియోలు పెట్టడం తగదని మందలించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద హామీ ఇచ్చిన విధంగా ఏ పౌరుడినీ వేధించే కంటెంట్ ఉండకూడదని తేల్చిచెప్పింది. ‘మీమాంస విక్టిమ్స్’పేరుతో అనధికారిక ప్రతివాదులు పిటిషనర్లపై పెట్టిన వీడియోలు, ఫొటోలు, ఆడియో సందేశాలను వెంటనే బ్లాక్ చేయాలని యూట్యూబ్‌కు చెప్పింది. అలాగే పిటిషనర్ల పరువుకు నష్టం కలిగించే పోస్టు యూట్యూబ్‌లో పెట్టవద్దని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. తమ పరువుకు నష్టం కలిగించేలా ఉన్న వీడియోలు, ఫొటోలు, ఆడియో సందేశాలు యూట్యూబ్ నుంచి తొలగించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌కు చెందిన ఎం.శివకుమార్, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రావణ్‌కుమార్ విచారణ చేపట్టారు. కావాలనే పోస్టులు పెట్టారు.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న శివకుమార్ సూచన మేరకు మురళీకృష్ణ, సమత రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టి లాభం పొందారు. ఈ క్రమంలోనే శివకుమార్ తమ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారంటూ మురళి, సమతతోపాటు మరికొందరు క్రిమినల్ కేసు పెట్టారు. ఈ కేసు ట్రయల్ కోర్టు వద్ద పెండింగ్‌లో ఉంది. ‘మీమాంస విక్టిమ్స్’పేరుతో యూట్యూబ్ చానల్ సృష్టించిన మురళి, సమత.. శివ, అతని కుటుంబసభ్యుల ఫొటోలతో పరువు నష్టం కలిగించేలా నిరాధార ఆరోపణలతో 51 వీడియోలు, ఆడియోలు పోస్టు చేశారు. ఈ వేధింపులు భరించలేక శివ భార్య ఆత్మహత్యకు యత్నించింది. ఈ పోస్టులను తొలగించాలని యూట్యూబ్‌కు మెయిల్ పంపినా స్పందన లేదు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు’ అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆ వివాదంపై వీడియోలు పెట్టడాన్ని తప్పుబట్టారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ముఖ్య కార్యదర్శి, యూట్యూబ్, ఎ.మురళీకృష్ణ, సమతా శ్యామలకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ డిసెంబర్ 4లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. -
భరద్వాజ తీర్థంలో అసాంఘిక కార్యక్రమాలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న భరద్వాజ తీర్థంలో కొంతమంది యూట్యూబర్లు అశ్లీల నృత్యాలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. భరద్వాజ తీర్థం భరద్వాజ మహర్షి తపస్సు చేసిన స్థలంగా ఖ్యాతి పొందింది. భక్తపరాయణుడైన శివయ్య సంవత్సరంలో ఒకరోజు తై అమావాస్యకు శ్రీకాళహస్తీశ్వరాలయం నుంచి సతీసమేతంగా భరద్వాజ తీర్థానికి వచ్చి అభిషేక పూజలు అందుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రశాంతమైన ఈ స్థలంలో తరచూ అసాంఘిక కార్యక్రమాలు పెచ్చుమీరుతున్నారు. కొంతమంది యువకులు చెట్లకింద కూర్చుని మద్యం సేవిస్తున్నారు. దీనికితోడు ఇటీవల యూ ట్యూబర్లు అశ్లీల నృత్యాలను ఇక్కడ చిత్రీకరించి సోషల్‌మీడియాలో పోస్టు చేయడం విమర్శలకు తావిస్తోంది. సెక్యూరిటీ సూపర్వైజర్లు, సెక్యూరిటీ గార్డులు సరిగా విధులు నిర్వర్తించకపోవడం వల్లే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా పెరిగాయని మండిపడుతున్నారు. మూడు నెలలుగా సెక్యూరిటీ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో వారు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు దీనిపై దృష్టిసారిస్తారో.. లేక ఆ శివుడికే వదిలేస్తారో వేచి చూడాల్సి ఉంది. -
వ్యక్తిత్వ హననం చేస్తారా?.. యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై విడదల రజిని పోలీసులకు ఫిర్యాదు
సాక్షి,గుంటూరు : వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టింగ్స్ పెడుతున్న వారిపై మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ అనే యాంకర్‌తో పాటు, మరో రెండు యూట్యూబ్ ఛానెల్ నిర్వహకులు తన గురించి అసభ్యకర పోస్టింగ్స్, వీడియోలు పెడుతున్నారని పోలీసుల ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా పోలీసులతో పాటు జాతీయ మహిళా కమీషన్, ఏపీ మహిళా కమీషన్, డీజీపీలకు విడదల రజిని ఫిర్యాదు చేశారు. -
యాదాద్రిలో రీల్స్.. స్పందించిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఇటీవల చేసిన ఫొటోషూట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్‌రెడ్డి స్పందించారు. ఈ విషయమై శుక్రవారం(అక్టోబర్ 25) కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. గుడి లోపల తాను ఫోటోషూట్ చేయలేదని చెప్పారు. యాదాద్రి దేవాలయ అద్భుత నిర్మాణం గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిందుకే తాను ఫొటో షూట్ చేశానన్నారు. తాను లక్ష్మీనరసింహస్వామికి పెద్ద భక్తుడినని, ఆలయ ఈవో, పోలీసుల అనుమతి తీసుకునే ఫొటోషూట్ చేశానని కౌశిక్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కాగా, ఇటీవల ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తన భార్య,కూతురితో కలిసి యాదాద్రి గుడిలో రీల్స్ షూట్ చేశారు. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆలయ ఈవో కౌశిక్‌రెడ్డిపై యాదాద్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే తాను ఈవో అనుమతితోనే వీడియోలు షూట్ చేశానని కౌశిక్‌రెడ్డి చెబుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత.. హైకోర్టులో కేఏ పాల్ వాదనలు -
అనగనగా మునగ
సంప్రదాయేతర పంటల సాగు ద్వారా ఏజెన్సీ రైతులు అధిక ఆదాయం సాధించేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ పక్కా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళికను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు వీలుగా యూట్యూబ్ చానల్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఈ చానల్ ద్వారా ప్రత్యేక వీడియోలు అప్లోడ్ చేస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంమునగ అంటే మొదటి మెట్టు‘కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం’పేరుతో ఉన్న యూట్యూబ్ చానల్లో జితేశ్ వి.పాటిల్ 40 నిమిషాల నిడివి గల వీడియోను ఈనెల 23న అప్లోడ్ చేశారు. జిల్లాలో ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారని, ఈ సంప్రదాయ పంటల సాగు వల్ల ఎకరానికి రూ.20 వేలకు మించి ఆదాయం రావడం లేదని ఆ వీడియోలో కలెక్టర్ స్పష్టం చేశారు. మునగ సాగు చేయడం ద్వారా కనిష్టంగా రూ.75 వేలు, గింజలు, ఆకుల అమ్మకం ద్వారా మరో రూ.25 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని వివరంగా చెప్పారు.ఖర్చు లేకుండా సాగుఎకరంలో వెయ్యి మునగ చెట్లు నాటొచ్చని కలెక్టర్ పాటిల్ తెలిపారు. మొక్క నాటింది మొదలు దిగుబడి వచ్చే వరకు రైతులకు ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుంది, రైతులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏంటనేవి వివరించారు. విత్తనాలు, మెటీరియల్ కాంపోనెంట్ అంతా కలిపి ఎకరానికి రూ.33 వేల దాకా ఖర్చు వస్తుందని, ఇదే సమయంలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలకు ఉపాధి హామీ పథకం తోడైతే రూ.34,500 వరకు రైతుకు సాయం అందుతుందన్నారు. మునగ సాగుకు ఉపాధి హామీ పథకం వర్తించాలంటే ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులై ఉండాలని చెప్పారు.మార్కెటింగ్ ఈజీఒక మునగ చెట్టుకు కనిష్టంగా 180.. గరిష్టంగా 500కు పైగా కాయలు వస్తాయని తెలిపారు. ఒక చెట్టుకు 180 కాయల దిగుబడి అనుకుంటే... రూపాయికి రెండు కాయల వంతున అమ్మినా ఎకరం మీద రూ.75 వేల ఆదాయం కచ్చితంగా వస్తుందన్నారు. తక్కువ రేటుకు అమ్మితే హైదరాబాద్ నుంచి వ్యాపారులే వచ్చి మునగ కాయలు తీసుకెళతారని, మార్కెటింగ్ చేయాల్సిన అవసరమే ఉండదని చెప్పారు.నవంబర్‌లో మొదలునవంబర్ రెండో వారంలో విత్తనాల కొనుగోలుతో మొదలయ్యే ‘మిషన్ మునగ’జూన్ చివరి వారంలో దిగుబడి తీసుకునే వరకు కొనసాగనుంది. ప్రతీ నెల, ప్రతీ వారం ఏ పని చేయాలనే అంశంపై రూపొందించిన రూట్‌మ్యాప్‌ను క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు, సిబ్బందికి పంపారు. రాబోయే రబీ సీజన్లో జిల్లాలో కనీసం పది వేల ఎకరాల్లో మునగ సాగు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కలెక్టర్ ఆలోచనలు ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిపై ఇప్పుడు ఉంది. అవగాహన తెచ్చుకొనిభద్రాద్రి జిల్లా కలెక్టర్‌గా ఈ ఏడాది జూన్ 15న జితేశ్ వి.పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత కొన్నాళ్లకే అశ్వారావుపేట మండలంలో పెద్దవాగుకు గండిపడింది. బాధిత రైతులతో మాట్లాడుతున్న సందర్భంలోనే జిల్లా రైతులు తక్కువ ఆదాయం పొందుతున్న అంశాన్ని కలెక్టర్ గుర్తించారు. అప్పటి నుంచి జిల్లాలో సాగు జరుగుతున్న తీరుతెన్నులు ఆయన పరిశీలించారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా రైతులకు అధిక ఆదాయం రావాలంటే మునగ సాగే మేలనే నిర్ణయానికి వచ్చారు. అంతటితో ఆగిపోకుండా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి పక్కా రోడ్‌మ్యాప్ రూపొందించారు. మలిదశలో మునగ సాగుతో పాటు రెండు ఎకరాల పొలంలో మునగ, వెదురు సాగుతో పాటు చేపలు, తేరో టీగల పెంపకంపై దృష్టి పెట్టనున్నారు. -
మరో వివాదంలో కౌశిక్‌రెడ్డి.. యాదాద్రి గుడిలో రీల్స్
యాదాద్రిభువనగిరిజిల్లా,సాక్షి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాడవీధుల్లో భార్య, కుమార్తెతో కలిసి కౌశిక్‌రెడ్డి రీల్స్ చిత్రీకరించారు. ఆలయంలో సెల్ ఫోన్లు,కెమెరాలు నిషేదం ఉండగా కౌశిక్‌రెడ్డి ఏకంగా రీల్స్ చేయడం దుమారానికి కారణమైంది.భాస్కర్ రావు ఆలయ ఈవోగా వచ్చాక రాజకీయ నాయకులను చూసి చూడమట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం ఏకంగా లడ్డూ కౌంటర్‌లోపలికి ఓ ఎమ్మెల్యే అనుచరులు ప్రవేశించారన్న ఆరోపణలున్నాయి.ఈ వ్యవహారంలో తూతూ మంత్రంగా షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.అంతకు ముందు కొండపైనున్న బాత్ రూముల్లోనే ఏకంగా తాగిపడేసిన మందుబాటిల్స్,గుట్కా ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. కాగా, హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్‌రెడ్డి ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకే చెందిన ఎమ్మెల్యే అరికెపూడిగాంధీతో సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకొని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు సెటైర్లు -
టీడీపీ నేత ‘గాజుల’ రాసలీలలు
రాయచోటి: తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం ముగియక ముందే తాజాగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం పార్టీ పరిశీలకుడుగా ఉంటున్న గాజుల ఖాదర్‌బాషా నిర్వాకం వెలుగులోకి వచ్చింది. రాయచోటిలోని ఓ మహిళను లోబర్చుకుని సాగించిన రాసలీలల వీడియోలు బహిర్గతమవడం ఇప్పుడు సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉంటూ రాయచోటి నియోజకవర్గంలో బాషా చక్రం తిప్పుతున్నాడు.మంత్రులు, అధికారులు తన గుప్పెట్లో ఉన్నారంటూ అధికార యంత్రాంగాన్ని, నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు విమర్శలున్నాయి. రాజకీయంగా కానీ, మరే ఇతర పనులు జరగాలన్నా తనకు ‘కావాల్సిన’ పనులు చేసి పెట్టాల్సిందేనని ‘గాజుల’ హుకుం జారీచేస్తుంటాడని.. ఈ నేపథ్యంలోనే రాయచోటిలో పేద, మధ్య తరగతి మహిళలనే ఆయన టార్గెట్‌గా పెట్టుకున్నాడన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. తన కోరిక తీరిస్తే పెన్షన్ లేదా ఇంటి స్థలం ఇప్పిస్తానంటూ మహిళలను లోబర్చుకుని అకృత్యాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఖాదర్‌బాషా పెన్షన్ ఇప్పిస్తానంటూ ఓ మహిళకు నమ్మబలికి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గురువారం ఉదయం బాధితురాలే స్వయంగా మీడియాకు తెలియజేశారు. దీంతో అసలు విషయం బయటకొచ్చింది.పార్టీ పరువును గంగలో కలిపారుఅధికారాన్ని అడ్డుపెట్టుకుని గాజుల ఖాదర్‌బాషా మహిళలపై లైంగిక దాడులతో పార్టీ పరువును గంగలో కలిపాడంటూ ఆ పార్టీ నాయకులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియోల రూపంలో వైరల్ అవుతున్న దృశ్యాలు పార్టీకి మరింత నష్టం తెచ్చేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకాకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న తరుణంలో ఇలాంటి దారుణాలు పార్టీని మరింత ఇబ్బందుల్లోకి తీసుకెళ్తాయని ఆ పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. -
రాష్ట్ర హోదా త్వరగా రావాలి
శ్రీనగర్: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌కు తొలి సీఎంగా బుధవారం బాధ్య తలు స్వీకరించిన కొద్దిసేపటికే పీటీఐ వీడియోస్‌తో ఒమర్ అబ్దుల్లా ముఖాముఖి మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్ర హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘ కాంగ్రెస్ పార్టీతో కలిసి రాష్ట్ర హోదా సాధనకు కృషిచేస్తాం. త్వరలోనే రాష్ట్ర హోదా దక్కొచ్చని భావిస్తున్నాం. ఖాళీగా ఉన్న మంత్రిపదవుల భర్తీ కోసం కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నాం. కాంగ్రెస్‌తో బేధాభి ప్రాయా లు అబద్ధం. నిజంగానే సఖ్యత చెడితే ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక వంటి అగ్రనేతలు మా ప్రమాణ స్వీకార కార్య క్రమానికి రారుకదా. ప్రభు త్వంలో చేరాలా వద్దా అనేది వాళ్ల ఇష్టం. శాసనమండలి కూడా లేని జమ్మూ కశ్మీర్లో తక్కువ మంది మంత్రులతో ప్రభు త్వాన్ని నడపాలని భావిస్తున్నాం. గతంలోలాగా 40, 45 మంది మంత్రులుండే కాలం పోయింది. 2018 నుంచి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కశ్మీర్లో లేదు. తమ సమస్యల్ని పట్టించుకున్న నాథుడే లేడని ప్రజలు నిరాశలో కుంగిపోయారు. అందుకే కొత్తగా ఏర్పడిన మా ప్రభుత్వ తక్షణ కర్తవ్యం వారి సమస్యలను పరిష్కరించడమే. కేంద్రపాలిత ప్రాంతంగా కశ్మీర్‌ను పాలించడం కొత్త రకం సవాల్. అందివచ్చిన తొలి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడం పెద్ద నేరంతో సమానం. గత తప్పిదాలు చేయబోను. కేజ్రీవాల్‌సహా దేశంలో పరిపా లనా అనుభవం ఉన్న కీలక వ్యక్తులు అందరి నుంచి పాఠాలు నేర్చుకుంటా’’ అని ఒమర్ వ్యాఖ్యానించారు. -
తెగ నవ్విస్తున్న రావణ వీడియోలు
న్యూఢిల్లీ: దేశంలో దసరా సంబరాలు అత్యంత వైభవంగా పూర్తయ్యాయి. నవరాత్రుల్లో వివిధ ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది. Ravan army dancing on havan karenge 😂😂 Punjabi Ramleela 🔥 pic.twitter.com/H4fEbj5gtu— Harpreet (@harpreet4567) October 11, 2024దసరా వేడుకల్లో నిర్వహించిన రావణ దహనానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి యూజర్లను తెగ నవ్విస్తున్నాయి. लड़किया एग्जाम के 2 दिन पहले - बहुत डर लग रहा है पता नहीं क्या होगा ।लड़के जब उनका अंत नजदीक हो - pic.twitter.com/cf1gwSQx8R— Desi Bhayo (@desi_bhayo88) October 12, 2024ఒక వీడియోలో రావణుని వేషంలో ఉన్న వ్యక్తి గుట్కా తింటున్నట్లు కనిపిస్తాడు. మరో వీడియోలో రావణుడు బుల్లెట్ బైక్‌ను నడుపుతూ కనిపిస్తున్నాడు.RAVAN SPOTTED DOING FOOD DELIVERY 😂This #Dussehra we’re making sure Ravan pays for his sins by delivering happiness for a change 🔥magicpin X Ravan fighting evil of high food delivery charges 👺 pic.twitter.com/zpzwsvMuXm— magicpin (@mymagicpin) October 11, 2024ఇంకొక వీడియోలో రావణ వేషధారి నటి సప్నా చౌదరి పాటకు నృత్యం చేస్తూ కనిపిస్తున్నాడు. ఈ వైరల్ వీడియోలను చూసినవారు మళ్లీమళ్లీ వీటిని చూస్తున్నారు.हजारों रावण आते हैं, एक पुतले को जलता हुआ देखने 😔 pic.twitter.com/g3DZQXGm5g— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) October 12, 2024చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకునే దసరా గడిచిపోయినప్పటికీ, సోషల్ మీడియాలో ఇప్పటికీ దసరా సంబరాలు సందడి చేస్తున్నాయి. ఈ వీడియోలను చూసినవారు తెగ నవ్వుకుంటున్నారు.This Ravan has my vote. He got a vibe on “Sharara” song. Ramleela pic.twitter.com/f6Lq0Fq8d6— Harpreet (@harpreet4567) October 12, 2024సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో సీత అపహరణ సమయంలో సన్యాసి వేషంలో వచ్చిన రావణుడు ఒక సినిమాలోని పాటకు నృత్యం చేస్తూ అలరిస్తున్నాడు.जेल में चल रही थी रामलीला🏹माता सीता को खोजने निकले वानर बने दो कैदी..🐒अब तक नहीं लौटे...🤔#Haridwarjail #Ramleela #Uttarakhand #VijayaDashami #HappyDussehra #विजयादशमी #दशहरा जय श्री राम🚩 pic.twitter.com/P9P8dBAJTT— Sanjeev 🇮🇳 (@sun4shiva) October 12, 2024మరో వీడియోలో రావణుని దిష్టిబొమ్మ నోటి నుండి మంటలు వెలువటమే కాకుండా, తలపై నుండి నిప్పులు ఎగజిమ్మడం ఎంతో ఫన్నీగా కనిపిస్తుంది. ఇది కూడా చదవండి: తిరుమల శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ.. -
టిక్ టాక్ బామ్మ.. వయసు 78.. ఫాలోవర్లు 23 వేలు
ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ ట్రెండింగ్ డ్యాన్స్ ఇరగదీస్తున్న విజయలక్ష్మి బంజారాహిల్స్: ఆమె భామ కాదు.. బామ్మ.. స్టేజీ ఎక్కి డ్యాన్స్ మొదలెట్టిందంటే చాలు.. కుర్రకారు ఈలలు, గోలలు.. ఆమె డ్యాన్స్ చూస్తే పెద్దవాళ్లు ఐనా సరే ముక్కున వేలు వేసుకోవాల్సిందే.. ఆమె వేసే స్టెప్పులకు కురీ్చల్లో నుంచి అమాంతం లేసి చప్పట్లు చరవాల్సిందే.. ఇంతకూ ఆ బామ్మ వయసు ఎంతో తెలుసా..! సరిగ్గా 78 ఏళ్లు.. ఆమెకు ఇన్‌స్టాలో దాదాపు 23 వేల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. టిక్ టాక్ భామ్మగా పిలుచుకునే ఆమె పేరు విజయలక్ష్మి. పదేళ్ల పాటు హోంగార్డుగా.. బాలానగర్‌కు చెందిన విజయలక్ష్మి పదేళ్లపాటు హోంగార్డుగా పనిచేసింది. బాలనగర్, కూకట్పల్లి, చందానగర్, జీడిమెట్ల, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసింది. మనువడు ఫోన్ చూసే క్రమంలో ఆమె టిక్ టాక్‌లో తనకు ఒక ఖాతాను ఏర్పాటు చేసుకుంది. డ్యాన్స్ చేయడం, నటులను అనుకరించడం, డైలాగ్‌లకు అనుగుణంగా నటించడం ప్రారంభించింది. ఇంకేముంది ఆమెను ఫాలో చేసే వారి సంఖ్య 12 లక్షలకు చేరింది. దీంతో టిక్ టాక్ బామ్మగా ఆమెకు ఎక్కడలేని గుర్తింపు వచి్చంది. అదే సమయంలో టిక్‌టాక్ నిషేధించడంతో టికి అనే మరో యాప్‌లోకి వెళ్లింది. అందులోనూ దాదాపు 2.5 లక్షల మంది ఫాలోవర్లు వచ్చి చేరారు. అది కూడా బ్యాన్ కావడంతో బామ్మ తాజాగా ఇన్‌స్టా వైపు మళ్లింది.యూత్ ఫిదా.. తన ఇద్దరు కుమారులకు దూరమై ఒంటరిగా ఉన్న విజయలక్ష్మి అక్కడక్కడ నృత్య కార్యక్రమాలకు హాజరయ్యేది. ఈ క్రమంలోనే సినీనటి కరాటే కళ్యాణితో పరిచయం ఏర్పడి నాలుగేళ్లుగా ఆమెతోనే ఉంటోంది. బామ్మ నృత్యాలకు నెటిజన్లు అంతా ఫిదా అవుతున్నారు. ఇన్‌స్టాలో ఇప్పటికే దాదాపు 3300 డ్యాన్స్ వీడియోలను పోస్టు చేసింది. ఇటీవల ఆమె వినాయకుడి మండపం వద్ద వేసిన డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. క్లాస్ అయినా, మాస్ అయినా పాట ఏది వచి్చనా ఆమె స్టెప్పులను ఎవరూ ఆపలేరు. యువతతో కలిసి డ్యాన్స్ చేయడానికి బామ్మనే పోటీపడుతుంది. ఈ వయసులోనూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా డ్యాన్స్ చేసే ఆ బామ్మ ప్రతిరోజు యోగ చేస్తుంది. మితమైన, పోషకాహారం తీసుకుంటానని, అదే తన ఆరోగ్య రహస్యమని చెబుతోంది.సినిమాల్లోకి.. ప్రస్తుతం బామ్మ సినిమాల వైపు అడుగులు వేసింది. విడుదలకు సిద్ధమైన ‘ఉప్పు కప్పురంబు’ చిత్రంలో ఆమె బామ్మ పాత్రలో నటించింది. ఇదే కాకుండా కొన్ని ఛానెళ్లలో బామ్మ మాట పేరుతో సుభాషిౠతాలు, విలువలు, మానవ సంబంధాల గురించి వివరిస్తుంది. ఈ బామ్మకు సినీ పరిశ్రమలోనూ పలువురు ఇన్‌స్టా అభిమానులు ఉన్నారు. -
Fake Doctor: యూట్యూబ్ చూస్తూ ఆపరేషన్
పట్నా: నకిలీ వైద్యుల చేతుల్లో అమాయక రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆగట్లేవు. నకిలీడాక్టర్ యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ 15 ఏళ్ల బాలుడికి శస్త్రచికిత్స చేయబోయి అతని ప్రాణాలు తీసిన ఘటన తాజాగా బిహార్‌లో వెలుగుచూసింది. పరారైన నకిలీ వైద్యుడు, ఆస్పత్రి సిబ్బందిని పట్టుకునేందుకు పోలీసులు వేట మొదలుపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరణ్ జిల్లాలోని మదౌరా పట్టణంలో నకిలీ డాక్టర్ అజిత్ కుమార్ పురి ‘శ్రీ గణపతి హాస్పిటల్’ పేరిట ఒక వైద్యశాల నిర్వహిస్తున్నాడు. 15 ఏళ్ల కృష్ణకుమార్ వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతుండటంతో శుక్రవారం రాత్రి అతడిని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. కాసేపటికి వాంతులు తగినా పిత్తాశయంలో రాళ్లున్నాయని, ఆపరేషన్ తప్పదని వైద్యుడు చెప్పాడు. తండ్రి వారించినా బలవంతంగా ఆపరేషన్ చేశాడు. బాలుడు విపరీతమైన నొప్పితో బాధపడుతుండటంతో నిలదీయగా గద్దించి పంపించేశాడు. ఇంటికెళ్లాక బాలుడు స్పృహ కోల్పోవడంతో మళ్లీ అదే ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడం ముందే పసిగట్టిన వైద్యుడు వెంటనే పటా్న తీసుకెళ్లాలని సూచించాడు. మార్గమధ్యంలోనే బాలుడు కన్నుమూశాడు. ‘‘వైద్యునికి ఎలాంటి అర్హత లేదని మాకు తెలీదు. యూట్యూబ్ చేస్తూ ఆపరేషన్ చేశాడు. తర్వాతే విషయం మాకు అర్థమైంది’’ అని బాలుడి తాత ప్రహ్లాద్ ప్రసాద్ షా ఆరోపించారు. -
Chandrababu: రెడీ.. లైట్స్ ఆన్ స్టార్ట్ యాక్షన్!
సాక్షి, అమరావతి: టీవీల్లో వరదలు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తుంటే ఓ ఫొటో..! ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఓ వీడియో క్లిప్..! మీడియా ప్రతినిధులను పిలిచి చేతులు అటూ ఇటూ ఊపుతూ ఏదో వివరిస్తుంటే 360 డిగ్రీల్లో కెమెరా రోల్ చేస్తూ షూట్..! ఎవరక్కడ? అనడమే ఆలస్యం.. ‘సిద్ధం దొరా..!’ అంటూ సదా అందుబాటులో ఉంటున్న కలెక్టర్, పోలీస్ కమిషనర్ నుంచి యావత్ యంత్రాంగం...!!ఇదెక్కడో హైదరాబాద్ శివారులోని ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ అనుకునేరు! కానే కాదు.. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో రెండు రోజులుగా సాగుతున్న సీను ఇదీ! ఓవైపు కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది ‘అన్నమో రామచంద్రా’ అని అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు యావత్ యంత్రాంగాన్ని తన చుట్టూ మోహరించి కలెక్టరేట్లో పండిస్తున్న ప్రచార సీన్ ఇదీ..!!నా ఫొటోలూ.. నా వీడియోలూ.. అంతా నేనేపీక్స్కు చేరిన చంద్రబాబు ప్రచార పిచ్చిస్పైడర్ సినిమాలో విలన్ ఎస్జే సూర్య ప్రజల హాహాకారాలు, ఆర్తనాదాలు వింటూ పైశాచిక ఆనందంతో పరవశించిపోతుంటాడు. సినిమాలో అది ఊహాజనిత పాత్ర కావచ్చుగానీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలి అందుకే మాత్రం భిన్నంగా లేదన్న విమర్శలు మరోసారి బలంగా వినిపిస్తున్నాయి.వరద బాధితులు ఎలా పోతేనేం..! కరకట్టలు తెగి ఊళ్లు, చేలూ కొట్టుకుపోతేనేం... పేపర్లలో నా ఫొటోలు రావాలి..! టీవీ చానళ్ల తెర నిండా నేనే కనిపించాలి..! సోషల్ మీడియాలో నేనే వైరల్ కావాలి!! అనే రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తుండటం ఆయన ప్రచార కండూతికి నిదర్శనం. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలోనో ఉండవల్లి కరకట్ట మీద ఉన్న తన క్యాంప్ ఆఫీసు నుంచో నిరభ్యంతరంగా సమీక్షించవచ్చు. కానీ అలా చేస్తే చంద్రబాబు ఫొటోలు, వీడియోలు మీడియాలో పెద్దగా రావు కదా!! ఇక టెక్నాలజీకి తాను బ్రాండ్ అంబాసిడర్‌నని తరచూ చెప్పుకునే చంద్రబాబు విజయవాడకు భారీ వరద ఐఎండీ రెండు రోజులు ముందు నుంచే హెచ్చరిస్తున్నా ముప్పును అంచనా వేయడంలో ఘోర వైఫల్యం చెందారు. కూటమి సర్కారు వైఫల్యం విజయవాడ ప్రజల పాలిట శాపంగా మారింది. దాంతో తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చేందుకు దీంతో చంద్రబాబు సరికొత్త డ్రామాకు తెరతీశారు. విజయవాడ కలెక్టరేట్‌కు మకాం మార్చి తానేదో ఒంటి చేత్తో వరదను అడ్డుకుంటున్నట్లు ‘బిల్డప్ బాబాయ్’ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు.టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులతోపాటు అప్పటికప్పుడు జాతీయ మీడియాను కూడా పిలిపించుకుని చుట్టూ కూర్చొబెట్టుకుని మరీ ప్రచార సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. బోటులో తిరుగుతున్న చంద్రబాబు... బుల్ డోజర్పై ఎక్కి చేతులు ఊపుతూ ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు... లైఫ్ జాకెట్ వేసుకుని వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న చంద్రబాబు... అధికారులతో మాట్లాడుతున్న చంద్రబాబు... డ్రోన్లను పరిశీలిస్తున్న చంద్రబాబు.. ఇలా సాగుతోంది ఈ ప్రహసనం. ముఖ్యమంత్రి వస్తున్నారంటే సహాయక చర్యలు వేగంగా చేపట్టి ఆర్థిక సహాయం చేస్తారని, వైద్య సేవలు అందేలా చూస్తారని బాధితులు ఆశిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం చేతులు ఊపుతూ కెమెరాలకు ఫోజులిస్తూ వెళ్లిపోయారు. దీంతో బాధితులు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించేవారు లేక.. ఆహారం అందక, తాగునీరు లేక అల్లాడుతున్నారు.బాబు సేవలో యంత్రాంగం ముఖ్యమంత్రే వచ్చి కలెక్టరేట్లో తిష్ట వేయడంతో అధికార యంత్రాంగం అంతా ఆయన చుట్టూ చేతులు కట్టుకుని నిలబడి వరద బాధితులను గాలికి వదిలేసింది. ఇక ఓ వందమందితో కూడిన చంద్రదండు అనే ప్రైవేట్ సైన్యం అక్కడే మోహరించి చంద్రబాబు ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోంది. కేవలం 24 గంటల్లో వందల సంఖ్యలో చంద్రబాబు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం గమనార్హం. సీఎం ఆఫీసు మునక... కరకట్ట ఇంట్లోకి వరదఅమరావతిని వరదలు ముంచెత్తడంతో అక్కడ రాజధాని నిర్మాణంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక కరకట్ట మీద చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. అటు సచివాలయం ఇటు కరకట్ట నివాసం రెండూ చంద్రబాబు అవినీతి, వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తుండటంతో విజయవాడ కలెక్టరేట్లో మకాం వేసి హైడ్రామాకు తెరతీశారు. 2015లో రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు ప్రచార కండూతి ఏకంగా 29 మంది భక్తుల ప్రాణాలను బలిగొన్న విషయం మరోసారి అందరికీ గుర్తుకొస్తోంది. ఇప్పుడు కూడా దాదాపు అదే రీతిలో ప్రచార కండూతితో వ్యవహరిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది.తన ప్రచారానికే సీఎం ప్రాధాన్యంసీఎం చంద్రబాబు చేసేది తక్కువ.. ప్రచారం చేసుకునేది ఎక్కువ అని చెప్పేందుకు తాజా వరద ప్రత్యక్ష సాక్ష్యం. విజయవాడలో బుడమేరు వరద ధాటికి సింగ్నగర్తో పాటు పలు ప్రాంతాలు ముంపునకుగురై ప్రజలు విలవిల్లాడుతున్నారు. వారికి అందించే సహాయ చర్యలను పర్యవేక్షించడానికంటూ చంద్రబాబు అవసరం లేకపోయినా అతిగా పర్యటనలు చేస్తున్నారు. కానీ అదంతా కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి కోసమేనని అర్థమైంది. టీడీపీ సోషల్ మీడియాలో రెండు రోజులుగా పెడుతున్న ఫొటోలు, వీడియోలే ఇందుకు సాక్ష్యం.టీడీపీ అధికారిక ‘ఎక్స్’ లో 225 టీడీపీ ఫేస్బుక్ గ్రూపులో 245ఐటీడీపీ ఫేస్బుక్లో 52సీఎంఓ అధికారిక ‘ఎక్స్’లో 30రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ వాట్సప్ గ్రూపులో వందలాది ఫొటోలు, వీడియోలు పోస్ట్ -
వైద్యుడి రూపంలోని రాక్షసుడు
వాషింగ్టన్: చికిత్స కోసం వచ్చే రోగుల పట్ల అభిమానం, వాత్సల్యం ప్రదర్శిస్తూ సాంత్వన చేకూర్చాల్సిన వైద్యుడు రాక్షసంగా ప్రవర్తించాడు. తాను పనిచేసే ఆసుపత్రిలో రహస్యంగా కెమెరాలు అమర్చి మహిళలు, చిన్నారుల నగ్న వీడియోలు, ఫొటోలు చిత్రీకరించాడు. కొందరు మహిళలకు మత్తుమందు ఇచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నాక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను సైతం రికార్డు చేసి, తన కంప్యూటర్లో భద్రపర్చాడు. ఆఖరికి సొంత ఇంట్లో కూడా కెమెరా అమర్చి వీడియోలు చిత్రీకరించాడంటే అతడెంత ఉన్మాదో అర్థం చేసుకోవచ్చు. చివరికి పాపం పండడంతో కట్టుకున్న భార్యే అతడి బాగోతాన్ని పోలీసులకు తెలియజేసింది. పోలీసులు రంగంలోకి దిగి ఆ దుర్మార్గుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అతడొక భారతీయ వైద్యుడు కావడం గమనార్హం. భారతీయుడైన ఒమెయిర్ ఎజాజ్(40) స్వదేశంలో వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత 2011లో వర్క్ వీసాపై అమెరికా చేరుకున్నాడు. తొలుత అలబామాలో నివసించాడు. 2018లో మిషిగాన్‌కు మకాం మార్చాడు. మొదట రెండు ఆసుపత్రుల్లో డాక్టర్‌గా పనిచేశాడు. తర్వాత ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని వేర్వేరు ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. డాక్టర్‌గా విధుల్లో చేరినప్పటి నుంచే తనలోని మరో కోణం బయటపడకుండా జాగ్రత్తపడ్డాడు. బాత్రూ మ్లు, బట్టలు మార్చుకొనే గదులు, హాస్పి టల్లో మహిళా రోగులు ఉండే గదుల్లో రహస్యంగా కెమెరాలు అమర్చేవాడు. కెమె రాల్లోని దృశ్యాలను రికార్డు చేసి, ఎప్పటి కప్పుడు కంప్యూటర్లో భద్రపర్చేవాడు. మహిళలు, చిన్నారులే అతడి టార్గెట్. రెండేళ్ల పసిపాప వీడియోలు సైతం రికార్డు చేశాడు. అలాగే తనవద్దకు చికిత్స కోసం వచ్చే మహిళలపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ వ్యవహారమంతా చాలా ఏళ్లపాటు కొనసాగింది. ఇంట్లో కూడా రహస్యంగా కెమెరా ఏర్పాటు చేసినట్లు ఒమెయిర్ ఎజాజ్ భార్య కొన్ని రోజుల క్రితమే గుర్తించింది. అందులో రికార్డయిన దృశ్యాలను చూసి నిర్ఘాంతపోయింది. తన భర్త నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాక్ష్యాధారాలు కూడా అందజేసింది. దీంతో ఈ నెల 8వ తేదీన ఒమెయిర్ ఎజాజ్‌ను ఓక్లాండ్ కౌంటీ పోలీసులు అతడి ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇంట్లో సోదా చేయగా పెద్ద సంఖ్యలో ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్కులు లభ్యమయ్యాయి. వాటిలో అభ్యంతరకరమైన వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక హార్డ్ డిస్క్‌లో 13 వేల వీడియోలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. -
ఆరోరాల కనువిందు
వాషింగ్టన్: భూ ఉపరితల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అద్భుతమైన చిత్రాలను కెమెరాల్లో బంధించింది. కనువిందు చేసే ఆకుపచ్చ, ఊదా రంగుల కాంతి పుంజాల (ఆరోరా) ఫొటోలు, వీడియోలను భూమికి పంపింది. ఆరోరాల పైనుంచి అంతరిక్ష కేంద్రం పయనిస్తున్న సమయంలో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఉత్తర ధ్రువజ్యోతి అని, కాంతి ప్రవాహం అని పిలిచే అరోరాలు భూమి నుంచి అరుదుగా కనిపిస్తుంటాయి. గాలి రేణువులు, విద్యుత్ శక్తి కలిగిన సూర్యకాంతి రేణువులు భూ అయస్కాంత క్షేత్రంలో ఢీకొన్నప్పుడు అరోరాలు ఏర్పడుతుంటాయి. ఇవి సాధారణంగా ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగుల్లో కనిపిస్తాయి. -
'గోరుముద్ద'కు తాజ్ రుచులు
సాక్షి, అమరావతి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ‘జగనన్న గోరుముద్ద’ మరింత రుచిగా మారనుంది. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి పోషకాలతో అందించాలన్న లక్ష్యంతో వంటల తయారీలో మరిన్ని మార్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రోజుకో మెనూ చొప్పున వారంలో ఆరు రోజులపాటు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెల (జూన్) 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత విషయంలో ప్రభుత్వం మరింత దృష్టిపెట్టింది. ప్రస్తుతం అందిస్తున్న మెనూనే మరింత రుచితో పాటు పోషకాలతో అందించేందుకు తిరుపతిలోని హోటల్ తాజ్ చెఫ్‌ల సహకారం తీసుకుంది. రోజుకో మెనూ అందిస్తున్నందున అదే భోజనాన్ని ఇక ప్రత్యేకంగా ఎలా తయారుచెయ్యొచ్చో తెలిపేలా ఆరు వీడియోలను పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. వీటిని మధ్యాహ్న భోజనం వండుతున్న సుమారు 85 వేల మంది సిబ్బందికి చూపించి అవగాహన కల్పి0చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆయా వీడియోల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంట ఎలా చేయాలో తాజ్ చెఫ్‌లు వివరించడమే కాకుండా వాటి ఆరోగ్య ప్రయోజనాలను తెలియజేస్తారు. గోరుముద్ద యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన వీడియోలను మధ్యాహ్న భోజనం అందించే రాష్ట్రంలోని 44,190 పాఠశాలల్లో పనిచేస్తున్న మొత్తం 85 వేల మంది వంటవారు వారి స్మార్ట్ఫోన్లలో చూస్తారు. స్మార్ట్‌ఫోన్ లేకుంటే ఉన్నత పాఠశాలల్లోని ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్‌పీ)పైన, ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీల్లోను పాఠశాల సమయం ముగిశాక సిబ్బందికి చూపిస్తారు. పిల్లల ఆరోగ్యం కోసం మెనూ రూపకల్పన.. నిజానికి.. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో బాధ్యతలు చేపట్టాక పేద పిల్లల విద్య, ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టిపెట్టారు. అప్పటికే నిర్విర్యమైపోయిన ప్రభుత్వ పాఠశాల విద్యపై పలు సంస్కరణలు అమలుచేశారు. అప్పటివరకు బడుల్లో విద్యార్థులకు మధ్యాహ్నం నీళ్ల సాంబారు, ముద్దయిపోయిన అన్నం పెడుతుండడంతో 40 శాతం మంది పిల్లలు కూడా ఆ భోజనాన్ని తినకపోవడాన్ని గుర్తించారు. దీంతో ముఖ్యమంత్రే స్వయంగా రోజుకో మెనూ చొప్పున ‘జగనన్న గోరుముద్ద’ను రూపొందించారు. వంటపై మూడంచెల పర్యవేక్షణ ఏర్పాటుచేసి ఉపాధ్యాయులు, విద్యార్థులను భాగస్వాములను చేశారు. రాష్ట్రంలోని 44,190 ప్రభుత్వ పాఠశాలల్లో ఏ రోజు ఏ మెనూ ఎలా ఉందో పరిశీలించేందుకు.. వంటలో నాణ్యతను చూసేందుకు ‘ఏఐ’ టెక్నాలజీ యాప్‌ను రూపొందించి, మండల స్థాయి నుంచి పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్, ముఖ్య కార్యదర్శి వరకు ఆ వివరాలు తెలిసేలా చర్యలు తీసుకున్నారు.దీంతో నాలుగేళ్లుగా ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థుల సంఖ్య 90 శాతానికి పెరిగింది. మిగిలిన 10 శాతం మంది (ముఖ్యంగా బాలికలు) ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటి నుంచి బాక్సులను తెచ్చుకుంటున్నారు. జగనన్న ‘గోరుముద్ద’తో పరిపూర్ణత.. పేదింటి పిల్లలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు రాష్ట్రంలోని 44,190 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ‘జగనన్న గోరుముద్ద’ కింద నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. విద్యార్థుల్లో రక్తహీనత తగ్గించేందుకు ఫో ర్టి ఫైడ్ సార్టెక్స్ బియ్యంతో అన్నం పెడుతున్నారు. రోజుకో మెనూ చొప్పున సోమవారం నుంచి శనివారం వరకు 16 రకాల పదార్థాలను గోరుముద్దలో చేర్చారు. ఏ రోజు ఏయే పదార్థాలు పెట్టాలో మెనూలో స్పష్టంగా పేర్కొన్నారు. పిల్లల్లో రక్తహీనతను తగ్గించేందుకు వారంలో మూడ్రోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మూడ్రోజులు బెల్లం చిక్కీ ఇస్తున్నారు. ఐదు రోజులు ఉడికించిన గుడ్డు తప్పనిసరి చేశారు. ప్రతి గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల లేదా విలేజ్ క్లినిక్ నుంచి సిబ్బంది వచ్చి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేస్తారు. ముఖ్యంగా రక్తహీనతను తగ్గించేందుకు మాత్రలు ఇవ్వడంతో పాటు వారు సక్రమంగా వాడుతున్నారో లేదో పరిశీలిస్తున్నారు. మధ్యాహ్న భోజనం 100 శాతం తినేలా మార్పులు.. ప్రస్తుతం రాష్ట్రంలోని 36,612 పాఠశాలల్లో విద్యార్థులు 100 శాతం మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారు. మరో 5,012 పాఠశాలల్లో 95–99 శాతం మంది తింటుండగా, 885 పాఠశాలల్లో 90–95 శాతం మధ్య, 439 పాఠశాలల్లో 85–90 శాతం మధ్య, 353 పాఠశాలల్లో 80–85 శాతం మంది గోరుముద్ద తీసుకుంటున్నారు. 522 పాఠశాలల్లో 50–80 శాతం, 60 పాఠశాలల్లో 30–50 శాతం మధ్య ఉండగా, 236 పాఠశాలల్లో మాత్రమే 30 శాతంలోపు తీసుకుంటున్నారు.ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లోను 100 శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తీసుకునేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. బడికి వచ్చిన ప్రతి విద్యార్థీ బడిలో అందించే మధ్యాహ్న భోజనం తినేలా రుచిగా, వంటలో పిల్లల ఆరోగ్యానికి మేలుచేసే పోషకాలు ఉండేలా చర్యలు చేపట్టారు. అందుకనుగుణంగా తిరుపతిలోని హోటల్ తాజ్ చెఫ్‌లతో వంటలపై రూపొందించిన వీడియోల ద్వారా సిబ్బందికి అవగాహన కల్పిస్తారు. గోరుముద్ద మెనూ ఇదీ.. » సోమవారం హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటేబుల్ పులావు, గుడ్డు కూర, చిక్కీ » మంగళవారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు » బుధవారం వెజిటేబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ » గురువారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/నిమ్మకాయ పులిహోర, టొమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డు » శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ » శనివారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్ -
బీజేపీ నేతలు తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించారు
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశి్చమ బెంగాల్ సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపులు, అత్యాచారాల వ్యవహారం మరో మలుపు తిరిగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని సందేశ్‌ఖాలీకి చెందిన ముగ్గురు మహిళలు స్పష్టం చేశారు. స్థానిక బీజేపీ మహిళా నేత ఒకరు తెల్లకాగితాలపై తమతో బలవంతంగా సంతకాలు పెట్టించారని, ఈ కాగితాలపై బీజేపీ నాయకులే ఫిర్యాదులు రాసి, తమ పేరిట తృణమూల్ కాంగ్రెస్ నేతలపై పోలీసు స్టేషన్లో అత్యాచారం కేసులు పెట్టారని చెప్పారు. తమను మభ్యపెట్టి మోసం చేసిన బీజేపీ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు తమను వేధిస్తున్నారని, తమకు రక్షణ కలి్పంచాలని కోరారు. ఈ మేరకు ముగ్గురు మహిళలు చెబుతున్నట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోలను తృణమూల్ కాంగ్రెస్ షేర్ చేసింది. సందేశ్‌ఖాలీ మహిళలపై తమ పార్టీ నాయకులెవరూ లైంగిక వేధింపులకు పాల్పడలేదని, బీజేపీ నేతలే తప్పుడు ప్రచారం చేశారని పశి్చమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి పాంజా ఆరోపించారు. సందేశ్‌ఖాలీలో కొన్ని భూకబ్జా ఘటనలు మినహా లైంగిక వేధింపుల ప్రసక్తే లేదని అన్నారు. తమ పార్టీని అప్రతిష్టపాలు చేసేలా తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ నాయకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదంతా కుట్ర: సువేందు అధికారి కొత్తగా తెరపైకి వచి్చన వీడియోలపై బీజేపీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన సువేందు అధికారి స్పందించారు. వాటిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిõÙక్ బెనర్జీ ఉద్దేశపూర్వకంగా సృష్టించాడని విమర్శించారు. దీనివెనుక ప్రైవేట్ ఎన్నికల, రాజకీయ వ్యూహ సంస్థ ‘ఐ–ప్యాక్’ ప్రోద్బలం ఉందని చెప్పారు. మహిళలను తీసుకొచ్చి, బీజేపీపై ఆరోపణలు చేయిస్తున్నారని, ఇదంతా కుట్రేనని స్పష్టం చేశారు. అభిషేక్ బెనర్జీ, ఐ–ప్యాక్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ త్వరలో కోర్టు ఆశ్రయిస్తామని అన్నారు. బీజేపీ నేతలపై ఫిర్యాదు సువేందు అధికారితోపాటు మరికొందరు బీజేపీ నేతలపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు గురువారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నాయకులపై అత్యాచార ఆరోపణలు చేసేలా సందేశ్‌ఖాలీ మహిళలను బీజేపీ నేతలు ప్రేరేపించారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
బెంగళూరు: మహిళ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు హెచ్డీ రేవణ్ణకు బెంగళూరు కోర్టు రిమాండ్ విధించింది. ఆరు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డ మహిళను కిడ్నాప్ చేశారని రేవణ్ణపై కేసు నమోదైంది. ఈ కేసులో రేవణ్ణను ఇటీవలే సిట్ అరెస్టు చేసింది. తన తల్లిని కిడ్నాప్ చేయడమే కాక ఆమెపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని కిడ్నాప్‌కు గురైన మహిళ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో రేవణ్ణపై కేసు నమోదైంది. -
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
బెంగళూరు: సంచలనం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్య వీడియోలపై జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. అభ్యంతరకర వీడియోలున్న 25 వేల పెన్‌డ్రైవ్‌లను పంచడం వెనుక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారని మండిపడ్డారు. తొలుత ఏప్రిల్ 21న బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పెన్‌డ్రైవ్‌ను రిలీజ్ చేశారన్నారు. వాట్సాప్ ఛానల్ సృష్టించి మరీ వీడియోలు కావాల్సిన వారు ఛానల్‌ను ఫాలో అవ్వాలని కోరారని చెప్పారు. దీనిపై ఏప్రిల్ 22న తమ పార్టీ పోలింగ్ ఏజెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాడన్నారు. సిట్‌తో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు. తప్పు చేసిన వారికి చట్టం ప్రకారం పడాల్సిందేనని స్పష్టం చేశారు. వీడియోలు పంచినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పోలీసు అధికారుల సాయంతోనే పెన్‌డ్రైవ్‌లను పంచినట్లు తమకు సమాచారం ఉందన్నారు. జేడీఎస్ ఎంపీ అభ్యర్థులు ముగ్గురు ఓడిపోతారన్న సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు గుర్తొస్తే ఇప్పడు అనుమానం వేస్తోందన్నారు. -
Hasan Sex Scandal: తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హసన్ సెక్స్ వీడియోల వివాదంపై ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారిగా స్పందించారు. లైంగిక వేధింపుల వీడియోలు బయటికిరాగానే ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి రేవణ్ణ తాజాగా సోషల్ మీడియాలో ఒక లేఖ పోస్టు చేశారు.సెక్స్ స్కాండల్‌ను దర్యాప్తు చేస్తున్న సిట్ ముందు వారం రోజుల్లో హాజరవుతానని తెలిపారు. నిజమే గెలుస్తుందన్నారు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియగానే మరుసటి రోజు ఏప్రిల్ 27న ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందే రేవణ్ణ సెక్స్ వీడియోలు హసన్ ప్రాంతంలో వైరల్ అయ్యాయి.ప్రజ్వల్ లోక్‌సభ ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి జేడీఎస్ పార్టీ తరపున బరిలోకి దిగారు. ప్రస్తుతం ఆయనే హసన్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2019 నుంచి 2022 వరకు హసన్, బెంగళూరుల్లోని ప్రజ్వల్ రేవణ్ణ ఇళ్లలో పలువురు మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తుండగా వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోలున్న పెన్‌డ్రైవ్ బయటికి రావడంతో సెక్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చింది. -
PrajwalRevannavideo: త్వరలో భారత్‌కు ప్రజ్వల్ రేవణ్ణ..?
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపుల వీడియోల వ్యవహారంలో సస్పెండైన జేడీఎస్ ఎంపీ రేవణ్ణ జర్మనీ నుంచి త్వరలో ఇండియా వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మే 3-4 తేదీల మధ్య రేవణ్ణ బెంగళూరుకు చేరుకోవచ్చని కర్ణాటక పోలీసు వర్గాలు చెబుతున్నాయి.లైంగిక వేధింపుల వీడియోల వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు ఇవ్వడంతో ప్రజ్వల్ భారత్‌కు రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రజ్వల్ తండ్రి ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. కాగా, ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు గత వారం హసన్ ప్రాంతంలో వైరల్ అయ్యాయి. మొత్తం 2,976 వీడియోలున్న పెన్‌డ్రైవ్ బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలన్నీ 2019-2022 మధ్య బెంగళూరు, హసన్‌లలోని రేవణ్ణ నివాసాలలో చిత్రీకరించినవనిప్రాథమికంగా తేలింది. తనపై ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఒక మహిళ చేసిన ఫిర్యాదుతో అతడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కిందపోలీసులు కేసు నమోదు చేశారు.లైంగిక వేధింపుల వీడియోలు వెలుగు చూసి వివాదం పెద్దదైన నేపథ్యంలో రేవణ్ణ ఏప్రిల్ 27న బెంగళూరు నుంచి జర్మనీ వెళ్లిపోయాడు. కాగా, రేవణ్ణ జేడీఎస్ తరపున హసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీలో ఉన్నారు. ఇక్కడ ఏప్రిల్ 26న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
ఎక్కడా తగ్గేదే లేదండీ..పల్లె టు పాపులర్ జోన్ జోరుగా హుషారుగా
యూత్ పల్స్: కంటెంట్‌లో సత్తా ఉండాలేగానీ కాలు కదపకుండా, కడుపులో చల్ల కదలకుండా సొంత ఊళ్లోనే ఉంటూ తగినంత డబ్బు సంపాదించవచ్చు అని నిరూపిస్తున్నారు గ్రామీణ యువ కంటెంట్ క్రియేటర్లు. హాస్యం నుంచి వ్యవసాయం వరకు రకరకాల సబ్జెక్ట్‌లను వైరల్ చేయడంలో నేర్పు సాధించారు.ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆరియారి గ్రామానికి చెందిన శివానీ కుమారికి సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. గ్రామీణ జీవితాన్ని పాటలు, కామెడీతో కూడిన స్కెచ్‌ల ద్వారా ఆవిష్కరిస్తూ సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంది. తనతో సమానంగా ఫాలోవర్లు ఉన్న ఇంగ్లీష్ క్రియేటర్లు కుమారి కంటే ఎక్కువ సంపాదిస్తున్నటికీ డబ్బుల గురించి చింత ఆమెకు లేదు. డబ్బుల కంటే కంటెంట్ క్రియేషన్ గురించే ఎక్కువ దృష్టి పెడుతుంది కుమారి.ఒడిశాలోని చిత్రకూట్‌కు చెందిన ధీరజ్ టక్రీకి గతంలో ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడడం వచ్చేది కాదు. తడబడుతూ మాట్లాడేవాడు. దీంతో యూట్యూబ్ వీడియోలు చూసి ధీరజ్ అమెరికన్స్లా ఫ్లూయెంట్‌గా మాట్లాడడం నేర్చుకున్నాడు. అమెరికన్ యాక్సెంట్‌తో మాట్లాడే నైపుణ్యం ధీరజ్‌ను ‘ఇన్‌స్టా ఫేమ్’ చేసింది. 2023లో ధీరజ్ ఫాలోవర్ల సంఖ్య 160 మాత్రమే. హ్యాండ్సమ్ అనే మాటను ఫారిన్ యాక్సెంట్లో ఎలా పలకాలి అనే రీల్ వైరల్ కావడంతో ధీరజ్ టక్రీ ఫాలోవర్ల సంఖ్య వేలకు చేరింది. మధ్యప్రదేశ్‌లోని బిరాఖేడీ గ్రామానికి చెందిన 23 సంవత్సరాల రామ్ పారమార్ 17 సంవత్సరాల వయసులో యూట్యూబ్ చానల్ మొదలు పెట్టాడు. తన చానల్ ద్వారా వ్యవసాయానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడేవాడు. ఏడు, ఎనిమిది వేలతో యూట్యూబ్‌లో అతడి సంపాదన మొదలైంది. ఇప్పుడు బ్రాండ్ కొలాబరేషన్ ద్వారా లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాడు.పది లక్షలు వెచ్చించి తన గ్రామంలో ఆఫీస్ నిర్మించుకున్నాడు. కారు కొన్నాడు. ఇద్దరు సభ్యులతో ఉన్న టీమ్‌ను విస్తరించే పనిలో ఉన్నాడు. గుజరాతీ, తమిళ భాషల్లో కూడా కంటెంట్‌ను విస్తరించే ఆలోచనలో ఉన్నాడు.‘మన దేశంలో చాలా ప్రాంతాల్లో రైతులు హిందీ భాషను అర్థం చేసుకోలేరు. వారిని దృష్టిలో పెట్టుకొని ఇతరుల సహకారంతో ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌ను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కంటెంట్‌ను చేరువ చేయాలనుకుంటున్నాను’ అంటున్నాడు ధీరజ్.ఇరవై ఏడు సంవత్సరాల మయూరి పాటిల్‌కు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా డబ్బు సంపాదించాలనేది లక్ష్యం కాదు. ‘పశ్చిమ కనుమలను కాపాడుకుందాం’ అనే నినాదంతో రీల్స్ చేస్తొంది. పశ్చిమ కనుమల అందాలను కళ్లకు కట్టేలా ఉండే ఆ రీల్స్ ఎంతోమందిని ఆకట్టుకుంటున్నాయి. ఆలోచించేలా చేస్తున్నాయి. కొండపై ఉన్న ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న ఒక వృద్ధురాలి జీవనశైలిపై పాటిల్ చేసిన రీల్ వైరల్ అయింది. ఎలాంటి కమర్శియల్ ఎలిమెంట్స్ లేని ఈ రీల్ సూపర్ సక్సెస్ కావడమే కాదు అది పాటిల్‌కు ఎంతో ఉత్సాహాన్నీ ఇచ్చింది.మహారాష్ట్రలోని పులగామ్ గ్రామానికి చెందిన నేహా తాంబ్రేది సూపర్ పవర్ గ్రామీణ యాస. కామెడీ దట్టించి వివిధ సామాజిక సమస్యలపై తమ ప్రాంత మాండలికంలో నేహా చేసే వీడియోలు సోషల్ మీడియాలో ΄ాపులర్ అయ్యాయి. తన గ్రామం నుంచి వెళ్లి పుణెలో ఇంజనీరింగ్ చేయడం నేహాకు కల్చరల్ షాక్.‘నా గ్రామీణ మరాఠీ యాసను వెక్కిరించేవారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది నేహా.ఎంతోమంది వెక్కిరించిన ఆ యాస కంటెంట్ క్రియేషన్‌లో ఆమె బలం అయింది. నేహా సృష్టించిన ‘తోంబ్రే బాయి’ క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది.స్థూలంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంత క్రియేటర్లు సోషల్ మీడియాలో కొత్త దృశ్యం ఆవిష్కరిస్తున్నారు. కర్నాటకాలోని చిన్న పల్లెల నుంచి ఈశాన్యప్రాంతాలలోని మారుమూల గ్రామాల వరకు కంటెంట్ క్రియేషన్ ద్వారా వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. ప్రతి క్రియేటర్ తనదైన ప్రత్యేకతను కంటెంట్‌కు జోడిస్తున్నారు.‘ఇన్స్టాగ్రామ్ ఉద్దేశాన్ని చాలా బ్రాండ్స్ మరిచి΄ోయాయి. ఇన్స్టాగ్రామ్ అనేది ఫన్, స్టోరీ టెల్లింగ్‌కు వేదిక’ అంటుంది ముంబైకి చెందిన కంటెంట్ సొల్యూషన్స్ ఫర్మ్ ‘అప్పర్‌కేస్’ డైరెక్టర్ నిఠషా భర్వానీ. ఇన్‌స్టాగ్రామ్‌కు కీలకమైన ఫన్, వైవిధ్యాన్ని జోడిస్తూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు గ్రామీణ ప్రాంత యువ కంటెంట్ క్రియేటర్లు.ఎక్కడా తగ్గేదే లేదండీగ్రామీణ్ర ప్రాంత జీవనశైలికి అద్దం పట్టే వీడియోలతో ΄ాపులర్ అయింది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శివానీ కుమారి. ఆడంబరాల కంటే సహజత్వమే కంటెంట్‌కు అందాన్ని తీసుకువస్తుంది అనేది కుమారి నమ్మే థియరీ. అందుకే ఆమె చేసే వీడియోల్లో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఊళ్లో సొంత ఇళ్లు కట్టుకుంది. సోషల్ మీడియాలో కుమారి ΄ాపులారిటీని దృష్టిలో పెట్టుకొని వ్యక్తుల నుంచి మొదలు ఆర్గనైజేషన్స్ వరకు ప్రశంసపూర్వకమైన ఈ–మెయిల్స్ వస్తుంటాయి. అవి ఆమెకు బలమైన టానిక్‌లా పనిచేస్తాయి. ‘ఇంగ్లిష్‌లో గడగడా మాట్లాడితేనే కంటెంట్ హిట్ అవుతుంది’ అనే భావనను కుమారిలాంటి వాళ్లు తప్పని తేల్చేస్తు్తన్నారు. ఇంగ్లీష్–స్పీకింగ్ అర్బన్ క్రియటర్స్ కంటే తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారు శివాని కుమారి -
ఇలాంటి జీవి ఒకటి ఉందా?
-
చేపలెందుకు ఒడ్డుకు వచ్చేశాయి?
-
Nitish Rajput: వీడియో పెట్టు కోట్లు కొట్టు
వీడియోలు చేస్తే ఎంత వస్తుంది? యూట్యూబ్‌లో పెడితే ఎంత వస్తుంది? ఎంత టాలెంట్ ఉంటే అంత వస్తుంది. నితిష్ రాజ్‌పుట్‌కు నెలకు 25 లక్షలు సంవత్సరానికి ఎంత లేదన్నా 3 కోట్లు వస్తాయి. ‘నాలెడ్జ్ ఈజ్ పవర్’ అన్నారు. సామాజిక అంశాల పై విస్తృత సమాచారం అందిస్తూ అతడు చేసే వీడియోల వల్లే ఈ ఆదాయం. నితిష్ సక్సెస్ స్టోరీ. 2022లో మన దేశంలో పాన్‌మసాలా వ్యాపార లావాదేవీల మొత్తం ఎంతో తెలుసా? 43,410 కోట్లు. ఊహకు అందని భారీ వ్యాపారం. అందుకే పాన్‌మసాలా సంస్థలు తమ బ్రాండ్ పేరు జనం నాలికల మీద తద్వారా వారి పొగాకు ఉత్పత్తులు జనాల నోళ్ల లోపలకు వెళ్లాలంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలతో ఎలా యాడ్స్ చేయిస్తాయో నితిష్ రాజ్పుట్ తన 30 నిమిషాల వీడియోలో వివరిస్తాడు. ఎలాగైతే ఆల్కహాల్ కంపెనీలు తమ బ్రాండ్ ప్రచారం కోసం మంచి నీళ్లు, మ్యూజిక్ సీడీలను తమ బ్రాండ్‌తో యాడ్స్ చేస్తాయో... పాన్ మసాలా కంపెనీలు కూడా అదే దారిలో సినిమా స్టార్స్‌ను పెట్టి లాఘవంగా ‘ఇలాచీ’, ‘గులాబ్’ అంటూ దొంగ యాడ్స్ చేస్తాయని వివరిస్తాడు. అమ్మేది మాత్రం పొగాకు ఉత్పత్తులనే అని తెలుపుతాడు. అంతేకాదు పొగాకు ఉత్పత్తుల్లో నేరుగా ప్రభుత్వం ఎలా భాగస్వామ్యం అయి ఉందో కూడా చెప్తాడు. ఇంత సవివరంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా దాదాపుగా రాయదు. అందుకే నితిష్ రాజ్పుట్ వీడియోలకు అంత డిమాండ్. అన్ని వైపుల సమాచారం నితిష్ రాజ్పుట్ 2020లో తన పేరు మీద ‘నితిష్ రాజ్‌పూట్ యూట్యూబ్ చానెల్’ను మొదలుపెట్టాడు. అందులో తనే మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడతాడు? ఒరిస్సాలో ట్రైన్ యాక్సిడెంట్‌కు కారణాలేమిటి? మణిపూర్‌లో ఏం జరుగుతోంది? ఖలిస్తాన్ ఉద్యమంలో వాస్తవం ఎంత? తాలిబన్లంటే ఎవరు? క్రెడిట్ కార్డ్స్‌లో మోసం ఎలా జరుగుతుంది... ఇలాంటి అంశాలతో వీడియోలు చేస్తాడు. అయితే ఇవి పైపైన చేసే వీడియోలు కాదు. దాదాపు పరిశోధనాత్మక జర్నలిజం స్థాయిలో ఉంటాయి. తీసుకున్న అంశంలో ఏదో ఒక పక్షం వహించకుండా అన్ని పక్షాల వైపు నుంచి సమాచారాన్ని రాసి పోస్ట్ చేస్తాడు. అంతే కాదు చరిత్రలో జరిగిపోయిన కొన్ని ఘటనలను కూడా వివరిస్తాడు. ఉదాహరణకు ఇజ్రాయిల్– పాలస్తీనాల మధ్య గొడవ. ఇలా ఒకటనేముంది మ్యూచువల్ ఫండ్స్ దగ్గరి నుంచి స్టాక్ మార్కెట్ పాఠాల వరకూ అన్నీ చెబుతాడు. అందుకే రెండేళ్ల కాలంలోనే అనూహ్యమైన విజయం సాధించాడు. ఉత్తరప్రదేశ్ కుర్రాడు నితిష్ రాజ్పుట్ ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ అనే చిన్న ఊళ్లో పుట్టాడు. ఇప్పుడు అతనికి 33 ఏళ్లు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బి.టెక్. చేసి ఐ.టి. కంపెనీల్లో పని చేశాడు. కాని తనకంటూ ఒక సొంత అస్తిత్వం, ఆర్థిక అంతస్తు ఉండాలని ఆశించి 2020లో వీడియో చానల్ ప్రారంభించాడు. సగటు మనిషికి నిత్యం కనిపించే విషయాలే లోతుగా తెలియచేయడం అతడు ఎంచుకున్న ఫార్ములా. ఉదాహరణకు బిట్‌కాయిన్ కథా కమామిషు ఏమిటి అనే వీడియో చూస్తే దాని గురించి మనకు దాదాపుగా ఓ సమగ్ర అవగాహన వస్తుంది. ఎయిర్‌పోర్ట్‌లు ఎలా ఆదాయం గడిస్తాయి అనేది అతని మరో వీడియో. బాలీవుడ్లో భారీ సినిమాలు ఫ్లాప్ అయినా డబ్బులెందుకు వస్తున్నాయి అనేది మరో వీడియో. స్పష్టంగా, డేటా విజువల్స్‌తో మంచి ఎడిటింగ్‌తో అతను ధారగా చెప్పుకుపోతాడు. 50 లక్షల ఫాలోయెర్లు నితిష్ రాజ్పుట్ యూట్యూబ్ చానల్‌కు 35 లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఫేస్బుక్, ఇన్‌స్టా ఇవన్నీ కలిపి మొత్తం 50 లక్షల మంది అతణ్ణి ఫాలో అవుతున్నారు. నితిష్ రాజ్పుట్ యూట్యూబ్‌లో ఇప్పటి వరకూ చేసిన వీడియోలకు 25 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోల్లో యాడ్స్ ప్లే అవుతాయి కనుక యూట్యూబ్ నుంచి అలాగే ప్రాడెక్ట్స్ ప్రమోషన్ వల్ల నెలకు అతడు 25 లక్షలు సంపాదిస్తున్నాడు. సంవత్సరానికి 3 కోట్ల ఆదాయం గడిస్తున్నాడు. రెండేళ్లల్లో సాధించిన విజయం అంటే ఆశ్చర్యమే. -
టెక్స్ట్ ఇస్తే వీడియో వచ్చేస్తుంది - టెక్నాలజీలో ఏఐ మరో అద్భుతం..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకి చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు ఏఐ గురించి తెలియని చాలామంది కూడా ఈ రోజు తెగ ఉపయోగించేస్తున్నారు. ప్రశ్న నీది, సమాధానం నాది అనే రీతిగా.. సర్చ్ బాక్స్‌లో సర్చ్ చేసే విషయానికి సమాధానం వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఓపెన్ఏఐ సంస్థ 'సొర' (Sora) అనే ఏఐ మోడల్ పరిచయం చేసింది. ఇప్పటి వరకు మనం టెక్స్ట్ ఎంటర్ చేస్తే.. సమాధానం కూడా టెక్స్ట్ రూపంలోనే వచ్చేది. అయితే ఇప్పుడు 'ఓపెన్ఏఐ సొర' మీరు ఎంటర్ చేసే టెక్స్ట్‌కు వీడియోలను క్రియేట్ చేస్తుంది. వినటానికి కొంత ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇది నిజమే. అంటే సొర ఇప్పుడు వాస్తవ ప్రపంచానికి దగ్గరగా కనిపించే వీడియోలను క్రియేట్ చేస్తుంది. సొర (Sora) ఓపెన్ఏఐ పరిచయం చేసిన సొర మనం ఇచ్చే టెక్స్ట్ అర్థం చేసుకుని దానికి తగిన విధంగా చిన్న వీడియోలు క్రియేట్ చేస్తుంది. వాస్తవానికి దగ్గరా తీసుకెళ్లే ఉద్దేశ్యంలో భాగంగానే కంపెనీ సొరను పరిచయం చేసింది. అయితే ఇది కేవలం ఒక నిమిషం నిడివి కలిగిన వీడియోలను మాత్రమే క్రియేట్ చేయగలదు. వీడియో కూడా హై-క్వాలిటీలో ఉంటుంది. ఇప్పటికే సొర రూపోంచిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓపెన్ఏఐ సొర మనం ఎంటర్ చేసే టెక్స్ట్ అర్థం చేసుకుంటే దానికి తగిన వీడియోలను డెలివరీ చేస్తుంది. అంటే మనం అందించే టెక్స్ట్ చాలా స్పష్టంగా ఉండాలి. ప్రస్తుతం ఇది ఏఐ మోడల్ రీసెర్చర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీన్ని త్వరలోనే సాధారణ యూజర్లందరికి కూడా అందుబాటులోకి తీసుకురావడానికి సంస్థ కృషి చేస్తోంది. ఈ టెక్నాలజీ అద్భుతాలను సృష్టించడానికి మాత్రమే కాకుండా.. తప్పుడు సమాచారాలైన ద్వేషపూరిత ప్రసంగం, పక్షపాతం వంటి హానికరమైన ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించే అవకాశం ఉందని, ఇలాంటి వాటిని గుర్తించి, నిరోధించడానికి కంపెనీ తగిన జాగ్రత్తలు తీసుకుంటోందని సమాచారం. ఇదీ చదవండి: అన్నంత పని చేసిన టెక్ దిగ్గజం - కష్టాల్లో టెకీలు.. Introducing Sora, our text-to-video model. Sora can create videos of up to 60 seconds featuring highly detailed scenes, complex camera motion, and multiple characters with vibrant emotions. https://t.co/7j2JN27M3W Prompt: “Beautiful, snowy… pic.twitter.com/ruTEWn87vf — OpenAI (@OpenAI) February 15, 2024 -
ఒకప్పుడు రోజు కూలీ..నేడు యూట్యూబ్ స్టార్‌గా..!
నాడు ఆ వ్యక్తి రోజు కూలీగా కటిక దారిద్య్రం అనుభవించేవాడు. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. అలాంటి స్థితోలో అనుకోని అతిథిలా వచ్చిపడినా కరోనా మహమ్మారితో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిపోయింది. కనీసం కుటుంబాన్ని పోషించలేని దారుణమైన స్థితిలోకి వచ్చేశాడు. అయిపోంది జీవితం అనుకునే టైంలో "యూట్యూబ్" ఓ ఆశా కిరణంలా అతడి లైఫ్‌లోకి వచ్చింది. అంతే అక్కడ నుంచి అతడి జీవితమే మారిపోయింది. ఈ రోజు ఏకంగా నెలకు రెండు లక్షల వరకు ఆర్జిస్తున్నాడు. ఇంతకీ అతడెవరు? అతని యూట్యూబ్ ప్రస్థానం ఎలా సాగిందంటే..? ఒడిశాకు చెందిన ఇశాక్ రోజు వారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆ చాలీచాలని సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. రోజుకి అతికష్టం మీద 250 రూపాయలు సంపాదించేవాడు. ఇంతలో కరోనా మహమ్మారి కారణం ఆ సంపాదన కూడా లేకుండా పోయింది. పరిస్థితి ఒక్కసారిగా గందరగోళంగా అయిపోయింది. ఏంచేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలో యూట్యూబ్ ఓ వరంలా అతడి జీవితంలోకి వచ్చింది. యూట్యూబ్ ఛానెల్‌తో డబ్బులు సంపాదించొచ్చు అనే విషయం తెలుసుకుని వీడియోల చేయడంపై దృష్టి సారించాడు. ఒడియా వంటకాలతో అలరించాలనుకున్నాడు. తమ సంప్రదాయ వంటకాలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసేవాడు. అయితే మొదట్లో అతడి వీడియోలు ఎవ్వరూ చూసేవారు కాదు. అయితే ఒకరోజు అనుకోకుండా ఒడిశాలో బాగా ఇష్టపడే పులియబెట్టిన అన్నం అయిన బాసి పఖాలా వీడియో బాగా ప్రేక్షకాధరణ పొంది వైరల్ అయ్యింది. అంతే అక్కడ నుంచి అతని వీడియోలు బాగా నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగి అతని ఫాలోవర్ల సంఖ్య 20 వేలకు చేరింది. ఇక యూఎస్, బ్రెజిల్, మంగోలియా దేశాల వాళ్లు కూడా ఇతని వీడియోలను ఆదరించడంతో ఒక్కసారిగా ఓవర్ నైట్‌స్టార్ అయ్యిపోయాడు. ది బెటర్ ఇండియా వంటి ప్రముఖ వెబ్సైట్లు మీడియా అతడి గురించి రాయడంతో మరింత ఫేమస్ అయ్యాడు. ఆఖరికి ప్రధాని నరేంద్ర మోదీ సైతం మన్ కీ బాత్ రేడియో షోలో అతడి గురించి ప్రస్తావించడమే గాకుండా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆ యూట్యూబ్ స్టార్ ఇశాక్ మాట్లాడుతూ..ఈ రోజు నా వీడియోలు బాగా వెళ్తే గనుకు నెలకు దాదాపు రూ. 3 లక్షల దాక సంపాదించగలనని దీమాగా చెబుతున్నాడు. దీనివల్ల వీడియో ఎడిట్ చేసేందుకు ల్యాప్‌టాప్ కొనుక్కున్నాను, ఉపయోగించడం తెలుసుకున్నానని చెబుతున్నాడు. అలాగే ఓ సెకండ్ హ్యాండ్ కారుని కూడా కొనుక్కోగలిగానని ఆనందంగా చెప్పాడు. అలాగే నా కుటుంబాన్ని ఈ రేంజ్లో చూసుకోగలుగుతానని కలలో కూడా అనుకోలేదంటూ బావోద్వేగంగా మాట్లాడాడు ఇసాక్. (చదవండి: ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా సోలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్!) -
సైకో గ్యాంగ్.. లవర్స్, వివాహేతర సంబంధ జంటే టార్గెట్
నల్లగొండ క్రైం: ప్రేమజంటలు సన్నిహితంగా ఉన్న సమయంలో ఓ సైకో గ్యాంగ్ సెల్ఫోన్లో రహస్యంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీడియోలు చూపించి వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్నారు. అంతేకాకుండా మహిళలు, యువతులపై లైంగికదాడికి పాల్పడుతున్నారు. నల్లగొండ పట్టణంలోని నార్కట్‌పల్లి – అద్దంకి ప్రధాన రహదారి పానగల్ బైపాస్ సమీపంలోని నంద్యాల నరసింహారెడ్డి కాలనీ వద్ద ఈ గ్యాంగ్ వ్యవహారం బయటపడింది. వీరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. నల్లగొండ పట్టణంలోని రాంనగర్‌కు చెందిన ఆరుగురు యువకులు ఒక గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. నల్లగొండ పట్ట ణానికి చెందిన కొందరు ప్రేమ జంటలు, వివాహేతర సంబంధం ఉన్న వారు చెట్లపొదల మధ్య సన్ని హితంగా ఉండడాన్ని పసిగట్టి సెల్ఫోన్లో రహస్యంగా వీడియో తీసి ఆయా జంటలను బ్లాక్ మెయిల్ చేసి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకుంటున్నారు. ఎవరికై నా చెప్తే మీ ఇంట్లో వాళ్లకు ఈ వీడియోలు పంపుతామని, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇస్తేనే వీడియోలను డిలీట్ చేస్తామని వారికి ఫోన్ కాల్స్ చేస్తున్నారు. దీంతో పరువు పోతుందని, వివాహేతర సంబంధం బయట పడుతుందనే ఉద్దేశంతో ఈ విషయాలను బాధితులు ఎవరికీ చెప్పడం లేదు. గత మూడేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెలుగులోకి ఇలా.. ఓ యువకుడు తన ప్రియురాలిని తీసుకొని నంధ్యాల నరసింహారెడ్డి కాలనీ సమీపంలోని నిర్మానుశ్య ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. వారు సన్నిహితంగా ఉన్న సమయంలో గ్యాంగ్‌లోని యువకులు యువతిని బలవంతంగా కొట్టి లైంగిక దాడికి పాల్పడి వీడియో తీశారు. వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు లాక్కున్నారు. అదే సమయంలో వివాహేతర సంబంధం కలిగిన మరో జంట పై ఇదే తరహాలో దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి పోలీసుల దృష్టికి తీసుకురావడంతో ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారిస్తున్నట్లు తెలిసింది. దోపిడీ చేసిన నగదు, బంగారు ఆభరణాలు రికవరీ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే.. అనేక మంది మహిళలు బాధితులుగా ఉన్నట్లు ఫోన్ కాల్‌డేటా ఆధారంగా తెలుస్తోంది. ఈ విషయంపై నల్లగొండ టూటౌన్ ఎస్సై నాగరాజును వివరణ కోరగా.. ఆ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసుల బృందం గాలిస్తున్నట్లు తెలిపారు. -
డీప్‌ఫేక్ ఆందోళనకరం
వాషింగ్టన్: ప్రముఖుల ఫొటోలు, వీడియోలను దురి్వనియోగం చేస్తూ కృత్రిమ మేథ(ఏఐ)తో సృష్టిస్తున్న డీప్ ఫేక్ నకిలీ ఫొటోలు, వీడియోల ధోరణి అత్యంత భయంకరమైనదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ప్రఖ్యాత పాప్ గాయని టైలర్ స్విఫ్ట్ నకిలీ అసభ్య ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై ఒక ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ప్రముఖుల డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోల సృష్టి, వ్యాప్తికి అడ్డుకట్ట పడాల్సిందే. ప్రభుత్వాల, సోషల్‌మీడియా సంస్థల తక్షణ స్పందన అవసరం. సురక్షితమైన, వాస్తవిక సమాచారం మాత్రమే ఆన్లైన్లో లభించేలా సాంకేతికతను, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రభుత్వాలు నిబంధనలను సవరించి కట్టుదిట్టంచేయాలి. ఇది మనందరి బాధ్యత’’ అని అన్నారు. -
అశ్లీల కంటెంట్... యూట్యూబ్‌కు సమన్లు
ఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ యూట్యూబ్ భారత్ విభాగానికి నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) సమన్లు జారీ చేసింది. తల్లులు, కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. అటువంటి ఛానెల్‌ల జాబితాతో జనవరి 15న తమ ముందు హాజరు కావాలని యూట్యూబ్ సంస్థ భారత్ విభాగ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ హెడ్‌ని కోరింది. ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో ఈ మేరకు భారతదేశంలోని యూట్యూబ్ ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ అధిపతి మీరా చాట్‌కు లేఖ రాశారు. తల్లులు, కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన చర్యలను చిత్రీకరించే యూట్యూబ్ ఛానెల్‌లలో ఆందోళనకరమైన ధోరణిని కమిషన్ గుర్తించిందని ప్రియాంక కనూంగో అన్నారు. ‘వీడియోలలో’ తల్లులు, కొడుకుల మధ్య అసభ్యకరమైన చర్యలు, తల్లులు, యుక్తవయస్సులో ఉన్న కొడుకుల మధ్య ముద్దులు వంటివి ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఈ వీడియోలు లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే (పోక్సో) చట్టం- 2012ను ఉల్లంఘిస్తున్నాయి.' అని కమిషన్ గుర్తించిందని తెలిపారు. “యూట్యూబ్ దీన్ని పరిష్కరించాలి. నేరస్థులు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వీడియోలను కమర్షియల్‌గా మార్చడం అంటే పోర్న్ అమ్మడం లాంటిది. పిల్లలు లైంగిక వేధింపులకు గురైన వీడియోలను ప్రదర్శించే ఏదైనా ప్లాట్‌ఫామ్ జైలుకు వెళ్లవలసి ఉంటుంది.”అని ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో తెలిపారు. ఇదీ చదవండి: అతిపెద్ద సముద్ర వంతెన.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం -
యూట్యూబ్ షేక్.. 2023లో దుమ్ము రేపిన వీడియోలు, షార్ట్స్ ఇవే..
ఆధునిక కాలంలో సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. దీంతో ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగిన నిమిషంలో తెలిసిపోతోంది. ఇందులో కూడా కొన్ని సంఘటనలు మాత్రమే పెద్దగా వైరల్ అవుతాయి. ఈ ఏడాది (2023) ఎక్కువ మంది చూసిన వీడియోలు ఏవి, టాప్ ట్రెండింగ్ కంటెంట్, దాని వెనుక ఉన్న క్రియేటర్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 2023లో ఎక్కువ మంది వీక్షించిన వీడియాల్లో చెప్పుకోదగ్గది 'చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్-ల్యాండింగ్ లైవ్ టెలికాస్ట్'. దీనికి ప్రారంభంలో 8.5 మిలియన్స్.. ఇప్పటి వరకు 79 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. ఈ సంవత్సరంలో యూట్యూబ్‌లో అతిపెద్ద లైవ్ స్ట్రీమ్‌గా ఇది సంచలనం సృష్టించింది. ఆ తరువాత వరుసగా మ్యాన్ ఆన్ మిషన్, యూపీఎస్సీ స్టాండ్ అప్ కామెడీ, డైలీ వ్లాగర్ పేరడీ, శాస్తా బిగ్ బాస్ 2 వంటివి ఎక్కువ వ్యూవ్స్ పొందాయి. టాప్ 15 గేమింగ్ వీడియోలు 2023లో 'ఐ స్టోల్ సుప్రా ఫ్రమ్ మాఫియా హౌస్' ఎక్కువమంది హృదయాలను దోచింది. ఈ గేమింగ్ వీడియో ఇప్పటికి 30 మిలియన్ వీక్షణనలను పొందింది. ఆ తరువాత స్థానంలో జీటీఏ5 ఇన్ రియల్ లైఫ్, గ్రానీ చాఫ్టర్ 1, స్కిబిడి టాయిలెట్ 39 - 59, కునాలి కో దర్ నహీ లగ్తా వంటివి ఉన్నాయి. టాప్ 10 కంటెంట్ క్రియేటర్స్ ఈ ఏడాది యుట్యూబ్లో సంచలనం సృష్టించిన టాప్ 10 కంటెంట్ క్రియేటర్ల జాబితాలో ప్రధమ స్థానంలో పవన్ సాహు ఉండగా.. ఆ ఆ తరువాత స్థానాల్లో నీతూ బిష్ట్ (Neetu Bisht), క్యూట్ శివాని 05, ఫిల్మీ సూరజ్ యాక్టర్, అమన్ డ్యాన్సర్ రియల్, ఆర్టిస్ట్ సింతు మౌర్య మొదలైనవారు ఉన్నాయి. ఇందులోనే మహిళల విభాగంలో నీతూ బిష్ట్, షాలు కిరార్, జశ్వి విశ్వి, ది థాట్ఫుల్ గర్ల్, రాయల్ క్యూన్, సోనాల్ అగర్వాల్, మింకు టింకు, అంజు డ్రాయింగ్ షార్ట్స్, మహి లక్రా వ్లాగ్స్, మామ్ అండ్ రీదిష్ణ వంటి వారు ఉన్నారు. టాప్ 15 షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్ విభాగంలో ఈ ఏడాది వరుసగా పతి కో బనాయా పాగల్, కదం కదం భజాంగే జా, 500 మీ ఐఫోన్, బ్లో ద రోలర్ అండ్ విన్ ఛాలెంజ్, చలాక్ బాయ్ ఫ్రెండ్, టామ్ అండ్ జెర్రీ (రిత్వి & కవి), పోర్ ఛాలెంజ్ విత్ సిరప్ వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: 50 రూపాయలతో రూ.350 కోట్ల సామ్రాజ్యం - చూపు లేకున్నా.. సక్సెస్ కొట్టాడిలా.. టాప్ 15 మ్యూజిక్ వీడియోలు 2023లో పాపులర్ అయిన వీడియోల విషయానికి వస్తే.. ఇందులో మొదటి స్థానంలో ఘనీ కో సబ్ ఘన్, జరా హక్తే జరా బచ్కే, జవేద్ మోహ్సిన్, క్యా లోగే తుమ్, హా నువ్ కావాలయ్యా (జైలర్), పల్సర్ బైక్ (ధమాకా), నా రెడీ (లియో) మొదలైనవి ఉన్నాయి. -
సిగరెట్ తాగుతూ పీఎస్ ఎదుట రీల్స్ చేసినందుకు..
హైదరాబాద్: పోలీస్ స్టేషన్ ఎదుట సిగరెట్ తాగుతూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తికి న్యాయస్థానం 8 రోజుల జైలు శిక్ష విధించింది. రాంగోపాల్‌పేట్ ఇన్స్పెక్టర్ లింగేశ్వర్ కథనం ప్రకారం పాటిగడ్డ ఎన్బీటీనగర్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి వంశీకృష్ణ (25) ఈ నెల 17న రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ ఎదుట సిగరెట్ తాగుతూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని గమనించిన రాంగోపాల్‌పేట్ పోలీసులు అతనిపై ఈ పెట్టీ కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుచగా సికింద్రాబాద్ 16వ ప్రత్యేక మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ అతడికి 8 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. -
యాడ్.. మార్చేనా పబ్లిక్ మూడ్!
సూటిగా సుత్తిలేకుండా..గురిపెడితే టార్గెట్ రీచ్ అయ్యేలా..విమర్శనాస్త్రం సంధిస్తే.. వైరిపక్షం విలవిల్లాడేలా ఉంటున్నాయి రాజకీయ పార్టీల లఘు చిత్రాల ప్రకటనలు. పబ్లిక్ మీటింగ్‌లో అగ్రనేతలు దంచికొట్టే ఉపన్యాసాలు ఓటరును ఎంత మేర ప్రభావితం చేస్తాయో లేదో కానీ, టీవీల్లో ప్రకటనల రూపంలో వస్తున్న పొలిటికల్ యాడ్స్ మాత్రం ప్రజల మూడ్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ అధికార పార్టీని ఇరుకునపెట్టేలా కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు ఉంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీల్లో నెరవేర్చని అంశాలను టార్గెట్ చేస్తూ బీజేపీ వీడియోలు ఉంటున్నాయి. ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఏం మార్పు తెచ్చామన్నది అధికార బీఆర్ఎస్ చెప్పుకొస్తోంది. మొత్తంగా ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను ఆలోచింపజేసేలా.. ఆకర్షించేలా పొలిటికల్ యాడ్స్‌తో అదరగొడుతున్నాయి. ఓటర్‌కు వీలైనంత రీచ్ అయ్యేలా... పొలిటికల్ యాడ్స్ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటోందని చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలపైనా వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. అదే సమయంలో బీఆర్ఎస్ సైతం కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన మేలు ఏంటి..? మళ్లీ కేసీఆర్‌నే ఎందుకు సీఎం చేయాలన్నది సూటిగా అర్థమయ్యేలా లఘు చిత్రాలను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం గుప్పిస్తోంది. ఇందుకోసం రాజకీయ ప్రత్యర్థులను ఠక్కున గుర్తించేలా క్యారెక్టర్లు, వారి హావభావాలను సైతం పలికించేలా ఈ వీడియోల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విమర్శల ఘాటుతో ఫిర్యాదులు ఈ పొలిటికల్ యాడ్స్‌లో విమర్శల ఘాటు పెరగడంతో ఆయా పొలిటికల్ పార్టీల నాయకులు ఆ ప్రకటనలు నిలిపివేయించాలని ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదులు చేశారు. అంతలా పొలిటికల్ యాడ్లు వేడి పెంచుతున్నాయి. ‘గులాబీ జెండా..తెలంగాణకు అండ’ ట్యాగ్‌తో బీఆర్ఎస్ షార్ట్ వీడియోలను చేస్తే..‘‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి..’’అన్న ట్యాగ్‌లైన్‌ను కాంగ్రెస్ పార్టీ వాడుతోంది. ఇక బీజేపీ ‘‘సాలు దొర..ఇక నీకు సెలవు దొర..’’ట్యాగ్‌లైన్‌తో పిట్టల దొర క్యారెక్టర్‌ను పెట్టి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ లఘు వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. కంటెంట్ ఒకరిది.. మార్ఫింగ్ మరొకరిది.. ‘‘అప్పుడెట్లా ఉండే తెలంగాణ..ఇప్పుడెట్లుంది తెలంగాణ’’ అంటూ అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు రీల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రులు మొదలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది ఈ రీల్ ఫార్ములా ఫాలో అయ్యారు. తీన్మార్ స్టెప్పులతో సదరు నాయకుడి కామెంట్లతో ఉన్న ఈ షార్ట్ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయ్యాయి. అయితే ఎంతో ప్లానింగ్, కంటెంట్‌తో తయారు చేసిన ఈ షార్ట్ వీడియోలను ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ వాడి ప్రత్యర్థి పార్టీలు తిప్పికొడుతున్నాయి. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ‘అప్పుడెట్లుండే తెలంగాణ.. ఇప్పుడెట్లయింది తెలంగాణ’ వీడియోలను ప్రత్యర్థి పార్టీల సోషల్‌మీడియా గ్రూపుల సభ్యులు మార్ఫిగ్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ (ఎక్స్), ఇన్‌స్టా్రగామ్ ఇలా అన్ని వేదికల్లోనూ వీడియోలు, రీల్స్.. వాటిపై ప్రత్యర్థుల మార్ఫింగ్‌లు హోరెత్తుతున్నాయి. -నాగోజు సత్యనారాయణ -
ఇంటర్నెట్ ను ముంచెత్తుతున్న డీప్ ఫేక్ లు
-
అవధుల్లేని ఆనందం
డబ్బుల సంగతేమో కానీ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా 114 మిలియన్ల యూట్యూబ్ చానళ్లు ఉన్నాయి. అంటే 11 కోట్లకు పైగానే. ఈ విశ్వంలోని సుమారు 800 కోట్ల జనాభాలో సగటున ప్రతి 72 మందికి ఒక చానల్ అన్నమాట. ఇటీవల విడుదలైన రజినీకాంత్ సినిమా ‘జైలర్’లో రజినీ ఐదేళ్ల మనవడు రుత్విక్ కూడా ఓ చానల్ నడుపుతుంటాడు. వీడియో చిత్రీకరణకు తాత రజినీ సాయం తీసుకుంటుంటాడు. ‘ఏదో ఒక వీడియో తీసేసి అప్లోడ్ చేసెయ్..’ అని తాత సలహా ఇస్తే.. ‘బాగోలేని వీడియోలకు సంబంధించి కామెంట్స్‌లో జనం ఎలా గడ్డి పెడతారో చూడు’ అని సమాధానం చెప్పడం ఆకట్టుకుంటుంది. ఆయా రంగాల్లో రాణిస్తున్న వారు తమ గురించి, తమకు తెలిసింది ప్రజలకు తెలియజేసి, వారి మెప్పు పొందాలని ఉబలాట పడుతుండటం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఇలా నిర్ణయించుకున్న మరుక్షణమే యూ ట్యూబ్ చానల్ పెట్టేస్తున్నారు. ఇలా ఆవిర్భవించిన చానళ్ల ద్వారా వంటింట్లో వంటలు మొదలు రాకెట్ తయారీ వరకు ఎవరికి ఏ సందేహం వచ్చినా ఇట్టే సమాధానం దొరుకుతోంది. ఏ చానల్‌కు సంబంధించిన వీడియోను ఎంత ఎక్కువ మంది చూస్తారో ఆ చానల్ పెట్టిన వాళ్లకు అంతగా డబ్బులొస్తాయి. ఇదంతా ఎవరు ఏ అంశానికి అత్యంత ప్రభావితమవుతారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఇటీవలి కాలంలో మన ఇండియన్స్, ప్రత్యేకించి పలువురు తెలుగు యూ ట్యూబర్స్ కూడా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా చానళ్లు, వీడియోలు వీక్షిస్తున్న వారి అభిరుచుల్లో వచ్చిన మార్పులు ఆశ్చర్యంగొలుపుతున్నాయి. – వీఏవీ రంగాచార్యులు, ఏపీ సెంట్రల్ డెస్క్ కొందరికి ఖేదం.. మరికొందరికి మోదం యూ ట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి.. కొందరేమో లక్షలు, కోట్లకు పడగలెత్తుతుంటే మరికొందరు మాత్రం నెలలు, ఏళ్ల తరబడి కష్టపడుతున్నా, కనీసం మానిటైజేషన్‌కు నోచుకోవడం లేదు. ఎలాగోలా మానిటైజేషన్ అయినా వారు అప్లోడ్ చేసే వీడియోలు వైరల్ కావడం లేదంటూ వాపోతుంటారు. ఇందుకు వారు యూ ట్యూబ్ ఆల్గారిథమ్ ఫాలో కాకపోవడమే. ఏ తరహా కంటెంట్‌ను జనం కోరుకుంటున్నారనేది గమనించి.. వీడియోలు రూపొందించుకోవాలి. ఒక్కోసారి సీరియస్ అంశాలు సైతం వైరల్ అవుతుంటాయి. అయితే అది ప్రజల అవసరాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు స్పోకెన్ ఇంగ్లిష్‌కు సంబంధించి మన తెలుగు కుర్రాడు స్టార్ట్ చేసిన ‘వశిష్ట 360’ చానల్ విశేష ఆదరణ పొందింది. ఆ వీడియోల ఆధారంగా ప్రచురించిన పుస్తకాల ద్వారా అతను కోట్లాది రూపాయలు ఆర్జించాడు. వరల్డ్ నంబర్ వన్ మిస్టర్ బీస్ట్ అనే యువకుడు (అసలు పేరు జిమ్మి డొనాల్డ్సన్) తన 13వ ఏట చానల్ స్టార్ట్ చేశాడు. మొదట్లో ‘ఐ పుట్ 100 మిలియన్ ఆర్బీజ్ ఇన్ మై ఫ్రెండ్స్ బ్యాక్ యార్డ్’ అనే వీడియోకు 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రతి వీడియోకు సగటున 150 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. సముద్రంలో ఒంటరిగా ఏడు రోజులు గడపడం, షోల రీ క్రియేషన్, ఒక డాలర్ నుంచి ఒక మిలియన్ డాలర్స్ వరకు హోటల్ గదులు.. ఇలా ప్రతి వీడియో కొత్తదనంతో, విచిత్రంగా ఉండటం విశేషం. ఉదాహరణకు.. పేద్ద మాల్‌లోకి వెళ్లి.. 15 నిమిషాల్లో ఎవరేం కావాలన్నా కొనుక్కుని బిల్లింగ్ కోసం లైన్లో నిలుచుంటే ఆ బిల్లు తానే చెల్లిస్తానని చెప్పడం.. నిజంగానే చెల్లించడం. ఇతడి ప్రతి వీడియో రియాలిటీతో స్ట్రెయిట్‌గా సబ్జెక్ట్‌లోకి వెళ్తుంది. ఎక్కడా సుత్తి ఉండదు. ఒక్కో వీడియో షూటింగ్‌కు వారం పది రోజులు కష్టపడినా, తుదకు ఆ వీడియో నిడివి కేవలం 15–20 నిమిషాలే ఉంటుంది. ఇతను తన వీడియోల ద్వారా వచ్చే మొత్తంలో చాలా వరకు పేద ప్రజల కోసమే వెచ్చిస్తాడు. పాతికేళ్ల ఈ యువకుడు గత ఏడాది యూ ట్యూబ్ ద్వారా అత్యధికంగా సంపాదించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఏకంగా 82 మిలియన్ డాలర్లు సంపాదించారు. మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.700 కోట్లు పైమాటే. అంటే రోజుకు దాదాపు రూ.2 కోట్లు. ఫోర్బ్స్ 2023 టాప్ క్రియేటర్స్ ఇన్ వరల్డ్ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. అభిరుచుల్లో మార్పు ♦ ప్రపంచాన్ని అన్వేషించడం అనేది ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. కొత్త విషయాలను తెలుసుకోవడంతో పాటు వారి వారి అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం కోసం చాలా మంది సామాజిక మాధ్యమాలను ఫాలోఅవుతున్నారు. ♦ ఈ విషయంలో ఇప్పటిదాకా యూ ట్యూబ్ అతిపెద్ద ఫ్లాట్‌ఫాం. ఈ స్థానాన్ని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఆక్రమించేస్తోంది. యువతరం అంతా ఇన్స్టాలోనే మునిగి తేలుతోంది. ♦ 40–50 శాతం యువత స్క్రీన్ టైమ్ సగటున రోజూ 4 నుంచి 10 గంటలు ఉంటోంది. ఇంత సమయం స్క్రీన్ కోసం కేటాయించడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇది న్యూరో, కంటి, మానసిక సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ♦ యువ దంపతుల దాంపత్య జీవితంలోనూ ఇది చిచ్చు రేపే ప్రమాదం ఉందని చెబుతున్నారు. నెగెటివ్ అంశాల పట్ల మనసు మళ్లడం సహజమే అయినా అస్తమానం అదే అలవాటుగా మారి అనుకరించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ♦ ఇలా విద్యార్థుల స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల పాఠ్యాంశాల పట్ల అటెన్షన్ స్పాన్ తగ్గిపోతోంది. ♦ఈ సమస్యలన్నింటికీ స్వీయ నియంత్రణే మార్గం అని నిపుణులు చెబుతున్నారు. అది డోపమైన్ ఎఫెక్ట్ జనరేషన్, జనరేషన్‌కు ప్రజల అభిప్రాయాలు, అభిరుచులు మారుతుంటాయి. ఇందుకు సహజంగా 15 ఏళ్లు పడుతుంది. అయితే ఇటీవలి కాలంలో టెక్నాలజీలో మార్పుల∙ప్రభావం వల్ల రెండేళ్లలోనే అభిరుచులు మారిపోతున్నాయి. ఇదివరకు బాగా కష్టపడే వాళ్లు మాత్రమే డబ్బు సంపాదించే వారు. మనం ఇన్నాళ్లు చెత్తా, చెదారం అనుకున్న కంటెంట్‌తో కూడా రూ.లక్షలు, కోట్లు సంపాదించేస్తున్నారు. యాలకలు, లవంగాలు అంటూ చేస్తున్న వీడియోలకు కూడా లక్షల్లో లైక్‌లు వస్తున్నాయి. ఇదంతా ‘హ్యాపీనెస్’ అనే సూత్రం. ఉదాహరణకు ఒక రోజంతా కష్టపడి ఒక పుస్తకం చదివితే ఎంత ఆనందం వస్తుందో.. ఒక నిమిషం పాటి రీల్/షాట్ చూస్తే అంతే ఆనందం వస్తుంది. కొన్ని పిచ్చి పనులను చూసినప్పుడు కూడా కొందరి మనసు అలానే స్పందించి డోపమైన్ అనే న్యూరోట్రాన్స్మీటర్ హార్మోన్ రిలీజ్ అవుతోంది. ఈ తరహా డోపమైన్‌కు జనం అలవాటు పడిపోయారు. – విశేష్ , సైకాలజిస్ట్ -
వీడియోలు చూడటానికి ఇదే ఫేవరెట్!
న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్లైన్లో వీడియోల వీక్షణకు ఎక్కువ మంది యూట్యూబ్‌ను ఎంచుకుంటున్నారు. ప్రతి అయిదుగురిలో నలుగురు తమ ప్లాట్‌ఫామ్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు యూట్యూబ్ ఒక ప్రకటనలో తెలిపింది. యూట్యూబ్‌ను ఇంటర్నెట్ ఆధారిత టీవీల్లో చూసే వారి సంఖ్య గణనీయంగా ఉంటోందని తెలిపింది. అలాగే యూట్యూబ్ షార్ట్స్ (తక్కువ నిడివి ఉండే వీడియోలు) సగటు రోజువారీ వీక్షణలు 120 శాతం మేర పెరిగినట్లు సంస్థ తెలిపింది. షార్ట్స్ వీక్షకుల్లో 96 శాతం మంది .. 18–44 ఏళ్ల వయస్సు మధ్య వారు ఉంటున్నారని పేర్కొంది. కంటెంట్ అప్లోడ్స్ 40 శాతం పెరిగినట్లు యూట్యూబ్ వివరించింది. -
ప్రేమ పేరుతో వంచన.. రహస్య వీడియోలు బయటపెడతానని..!
తిరుత్తణి: ప్రేమ పేరిట యువతిని మోసం చేసిన యువకుడిని పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. తిరుత్తణి యూనియన్ ఎస్.అగ్రహారం గ్రామానికి చెందిన యువతి (24) చైన్నెలో ప్రయివేటు కళాశాలలో చదువుతోంది. రోజూ తిరుత్తణి నుంచి ట్రైనులో కళాశాలకు వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో ఆమెకు గుడిగుంట గ్రామానికి చెందిన ఇళంగో(30)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ఆమెను అనుభవించాడు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోలు తీశాడు. తనను వివాహం చేసుకోవాలని యువతి కోరగా కుదరదని, ఎవరికై నా చెబితే అశ్లీల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె యువకుడి ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. వారు కూడా ఆమెను బెదిరించి పంపి వెంటనే యువకుడికి వేరొక అమ్మాయితో వివాహం చేశారు. మోసపోయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుత్తణి ఎస్ఐ రాఖీకుమారి కేసు నమోదు చేసి ఇళంగోను అరెస్టు చేశారు. పైగా యువతిని బెదిరించి ఆత్మహత్యకు ప్రేరేపించి పరారిలో వున్న ఇళంగో తండ్రి నాగరత్నం, అతని పెదనాన్న చక్రపాణి, కృష్ణమూర్తి, చిన్నాన్న సంజీవులు కోసం గాలిస్తున్నారు. -
64 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్.. కారణం ఏంటంటే?
ఆధునిక కాలంలో యూట్యూబ్ గురించి పెద్దగా పరిచయమే అవసరం లేదు. దీని ద్వారా ఎంతోమంది బాగా సంపాదిస్తున్నారు. అయితే ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇటీవల ఏకంగా ఇండియాలో 19 లక్షల వీడియోలను తొలగించినట్లు వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు భారతదేశంలో 2023 జనవరి నుంచి మార్చి వరకు సుమారు 1.9 మిలియన్లకంటే ఎక్కువ వీడియోలను తొలగించినట్లు తెలిసింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా 6.48 మిలియన్ల (64 లక్షల కంటే ఎక్కువ) వీడియోలను తీసివేసింది. ఇదీ చదవండి: ఆడియో, వీడియో కాల్ సదుపాయం ఎక్స్(ట్విటర్)లో కూడా - ఎలాన్ మస్క్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ యూట్యూబ్ పొందే ఫ్లాగ్‌లు అండ్ యూట్యూబ్ పాలసీలను ఎలా అమలు చేస్తుంది అనే దానిపై గ్లోబల్ డేటాను విడుదల చేసింది. ఇందులో తొలగించిన వీడియోల వివరాలు వెల్లడించింది. ఒక్క భారతదేశంలో (1.9 మిలియన్స్) మాత్రమే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్ తీసివేసింది. అగ్రరాజ్యమైన అమెరికాలో 654968, రష్యాలో 491933, బ్రెజిల్లో 449759 వీడియోలను తొలగించినట్లు సమాచారం. -
సైక్లింగ్‌తో స్ఫూర్తి నింపుతూ...
సాక్షి, వరంగల్: ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదని అందరూ అంటారు. కానీ కొందరు మాత్రమే ఆరోగ్యంకోసం తపిస్తారు. ఆదాయం వేటలోపడి ఆరోగ్యాన్ని మరచిపోతారు. అయితే యుక్త వయసులోనే రంజిత్ కుమార్ దవేరాకు ఆరోగ్యం ఎంత విలువైనదో తెలియజెప్పింది కరోనా... మార్చిన మహమ్మారి... కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఆ మహమ్మారి బారిన పడిన నాన్న రాములే కాదు...కళ్లెదుటే ఎంతో మంది చనిపోవడం వరంగల్ గిర్మాజీపేటకు చెందిన ఈ డీఫార్మసీ గ్రాడ్యుయేట్‌ను కదిలించింది. సరైన శారీరక శ్రమ లేక వ్యాధినిరోధకత కోల్పోయి ఈ మహమ్మారికి బలయ్యారని ఆయనకు అవగతమైంది. దీంతో ప్రతిఒక్కరిలో ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండాలన్న ఆలోచన కలిగించడమే లక్ష్యంగా సైక్లింగ్ వైపు రంజిత్ అడుగులు పడ్డాయి. అలా 2021 ఏప్రిల్ 5న మొదలైన ‘రంజిత్ ఆన్ వీల్స్’సైక్లింగ్....దశలవారీగా రాష్ట్రాలు దాటింది. ఇప్పుడు ఏకంగా ఖండాంతరాలు దాటింది. ఏ ఉద్దేశంతో ఈ సైక్లింగ్ మొదలెట్టాడో... ఇప్పుడు అదీ కార్యాచరణ రూపంలో కనిపించడం ఎంతో సంతృప్తిగా ఉందని అంటున్నాడు రంజిత్. దాదాపు 500 మంది వరకు తనను చూసి స్ఫూర్తి పొందారని మలేసియాలో సైక్లింగ్ కొనసాగిస్తున్న రంజిత్ ‘సాక్షి’కి తెలిపారు. తనను ఆగస్టు 15న మలేసియా ఇండియన్ హైకమిషన్ సత్కరించడం సంతోషం కలిగించిందన్నాడు. అలా మొదలైంది... 2021 ఏప్రిల్ ఐదున హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు మొదలైన సైక్లింగ్...దాదాపు 3,000 కిలోమీటర్లు తిరిగి హైదరాబాద్‌లోనే జూన్ 14న ముగిసింది. మళ్లీ జూలై 17న ప్రారంభించి హైదరాబాద్ నుంచి లడఖ్ వరకు సైక్లింగ్ చేశాడు. ఇది కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్, లదాఖ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల మీదుగా తిరిగి అక్టోబర్ 22న హైదరాబాద్‌లో ముగిసింది. ఈ సమయంలోనే రంజిత్ సినీ హీరో సోనూసూద్‌ను కలిశాడు. ఆ తరువాత హైదరాబాద్ నుంచి చైనా సరిహద్దు వరకు పెంపుడు శునకం భగీరతో కలిసి రంజిత్ సైక్లింగ్ చేశాడు. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా, అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్,అస్సాం, వెస్ట్‌బెంగాల్, సిక్కింల నుంచి నథులాపాస్‌లో చైనా బార్డర్ వరకు వెళ్లాడు. గత 2022 ఫిబ్రవరి 8న మొదలైన ఈ ఆరువేల కిలోమీటర్ల యాత్ర జూలై 25న ముగిసింది. ఆ్రస్టేలియా వైపుగా... హైదరాబాద్ నుంచి వియత్నాంకు రోడ్డు మార్గాన వెళ్లే అవకాశం లేకపోవడంతో 2023 మే ఐదున శంషాబాద్ విమానాశ్రయంలో సైకిల్ ప్యాక్ చేసుకొని వియత్నాం వెళ్లాడు. అక్కడ హానోయ్ సిటీ నుంచి హోచి మిన్హ్ వరకు దాదాపు మూడు వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేసి, ఆ తర్వాత కాంబోడియాలోకి ప్రవేశించి 900 కిలోమీటర్లు, థాయ్‌లాండ్‌లో 2,200 కిలోమీటర్లు, మలేసియాలో 400 కిలోమీటర్లు దాటి ప్రస్తుతం కౌలంలంపూర్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత సింగపూర్, ఇండోనేసియా, జకార్తాకు, అక్కడి నుంచి ఆ్రస్టేలియాకు విమానం ద్వారా చేరుకొని సైక్లింగ్ పూర్తి చేస్తాడు రంజిత్. 2021 ఏప్రిల్ ఐదు నుంచి ఇప్పటివరకు 22 వేల కిలోమీటర్ల మార్క్ చేరుకున్నాడు. ఆసియా, ఆ్రస్టేలియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ ఖండాల్లో సైక్లింగ్ చేసే దిశగా ముందుకు వెళుతున్నానని వెల్లడించాడు. సోషల్ మీడియాతో మరింత క్రేజ్ సైక్లింగ్ చేస్తున్న సమయంలో రంజిత్ తీస్తున్న వీడియోలు, ఫొటోలు తనకు సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఫాలోవర్స్‌ను తెస్తున్నాయి. ‘రంజిత్ ఆన్ వీల్స్’ఫేస్బుక్ పేజీలో 40,000 మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 3,15,000 మంది, యూట్యూబ్‌లో రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా సైక్లింగ్ చేస్తూనే...ఇంకోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా రంజిత్ ఎంతో మందిని చైతన్యవంతం చేస్తున్నారు. -
'స్నానం చేస్తుండగా వీడియోలు తీసేవాడు'.. హీరోయిన్ తీవ్ర ఆరోపణలు!
బిగ్ బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ నటి రాఖీసావంత్, ఆమె మాజీ భర్త ఆదిల్ దురానీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవలే జైలు నుంచి బయటకొచ్చిన ఆదిల్.. రాఖీసావంత్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి మోసం చేసిందని ఆరోపించాడు. అంతే కాకుండా నాకు తెలియకుండా అకౌంట్ నుంచి రూ.1.5 కోట్లు విత్ డ్రా చేసిందని ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలోనే రాఖీ సావంత్ సైతం ప్రెస్ మీట్ పెట్టి అంతేస్థాయిలో రివర్స్ కౌంటరిచ్చింది. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. డిప్రెషన్లో నటుడు.. 10 ఏళ్ల బంధానికి స్వస్తి!) మీడియాతో మాట్లాడుతూ ఆదిల్ దురానీపై సంచలన కామెంట్స్ చేసింది. ఆదిల్ తన ప్రియురాలైన ఇరానీ అమ్మాయిపై ఆరు నెలలపాటు అత్యాచారం చేశాడని ఆరోపించింది. అంతే కాకుండా తనను కొట్టి హింసించాడని వాపోయింది. అంతే కాకుండా లైంగిక వేధింపులకు గురిచేసి.. తన నగ్న వీడియోలను రికార్డ్ చేసి దుబాయ్‌లో విక్రయించాడని రాఖీసావంత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను వాష్‌రూమ్‌లో ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేసేవాడని.. అలాంటి వీడియోలు అతని వద్ద చాలా ఉన్నాయని రాఖీ పేర్కొంది. ఆ వీడియోలను దుబాయ్‌లో రూ. 47 లక్షల రూపాయలకు విక్రయించాడని రాఖీ సావంత్ ఆరోపిస్తోంది. ఆదిల్‌కు చాలామందితో వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయని.. మహిళలతో మాత్రమే కాకుండా పురుషులతో కూడా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ప్రత్యక్షంగా చూశానని రాఖీ తెలిపింది. ఆ వీడియోల వల్ల తనకు ఏం చేయాలో తెలియడం లేదని వాపోయింది. నాపై కూడా ఇంట్లోనే అత్యాచారం చేశాడని రాఖీ ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. నగ్న వీడియోలు వైరల్ అవుతాయని అనుక్షణం భయపడుతూ బతికానని చెప్పుకొచ్చింది. ఒక సెలబ్రిటీగా ప్రపంచానికి తన ముఖాన్ని ఎలా చూపించాలని ఆలోచిస్తూ కాలం వెళ్లదీశానని తెలిపింది. కాగా.. పరస్పరం ఆరోపణలు చేసుకున్న రాఖీ-ఆదిల్ 2022లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. (ఇది చదవండి: లగ్జరీ కారు కొనుగోలు చేసిన స్టార్ హీరోయిన్.. ఎన్ని కోట్లంటే? ) -
వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్ - అదేంటో తెలుసా?
Whatsapp Caption Edit Feature: వాట్సాప్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఇప్పటికే మెసేజ్ ఎడిట్ ఫీచర్ పరిచయం చేయగా.. ఇప్పుడు మరో లేటెస్ట్ ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. వాట్సాప్‌లో ఇప్పుడు ఫొటోస్, వీడియోలు, గిఫ్ట్స్, డాక్యుమెంట్స్ క్యాప్షన్ కూడా ఎడిటింగ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఆ తరువాత ఈ ఫీచర్ అందరికి అందుబాటులోకి వస్తుంది. ఇది తప్పకుండా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము. ఇదీ చదవండి: ఇషా అంబానీ కారు.. దూరం నుంచి అలా.. దగ్గర నుంచి ఇలా! ఇప్పటి వరకు ఇలాంటి ఎడిటింగ్ ఫీచర్ అందుబాటులో లేదు. అయితే ఇప్పుడు ఈ కొత్త ఫీచర్‌తో ఒకసారి పంపిన వీడియో, ఫోటో క్యాప్షన్ సులభంగా ఎడిట్ చేయవచ్చు. కావున మీరు పంపించి క్యాప్షన్‌లో ఏదైనా తప్పులుంటే కేవలం 15 నిమిషాలు లోపు మాత్రమే ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఎడిట్ చేసుకునే అవకాశం లేదు. దీనిని వినియోగాదారులు తప్పకుండా గమనించాలి. -
తాతకు చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు
-
చంద్రయాన్–3 నుంచి చంద్రుడి వీడియో.. నీలి ఆకుపచ్చ రంగులో మూన్
బెంగళూరు: చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన వీడియోను చంద్రయాన్–3 మిషన్ ఆదివారం చిత్రీకరించింది. ఈ వీడియోను ఇస్రో సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. చంద్రయాన్–3 మిషన్ శనివారమే చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ వీడియోలో చందమామ ఉపరితలం నీలి ఆకుపచ్చ రంగుల్లో కనిపిస్తోంది. అంతేకాకుండా చందమామపై ఉన్న లోతైన బిలాలు కూడా కనిపిస్తున్నాయి. చంద్రుడికి సంబంధించి చంద్రయాన్–3 పంపించిన తొలి వీడియో ఇదే కావడం విశేషం. -
అక్కడికెళ్లిన అమ్మాయిల వీడియో షేర్ చేసిన నటి.. నెటిజన్ల ఫైర్
నటి కస్తూరి శంకర్ మొదట్లో సినిమాలకు మాత్రమే పరిమితం అయిన ఆమె పలు స్టార్ హీరోలతో నటించడమే కాకుండా పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్లో తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. ఓ గృహిని పడే కష్టాలు, భర్త నుంచి విడిపోయిన అనంతరం సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయనేది తెరపై చూపిస్తోంది. దీంతో తులసిగా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే కస్తూరి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. సమాజంలో జరిగే ప్రతి అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది. దీంతో ఒక్కోసారి ఆమెపై వ్యతిరేకత కూడా వస్తుంటుంది. (ఇదీ చదవండి; స్టార్ హీరోపై విడాకుల రూమర్స్.. విదేశాల్లో ఉందంటూ!) తాజాగా ఆమె ఇద్దర అమ్మాయిలకు సంబంధించిన వ్యక్తిగత వీడియోను షేర్ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు వైన్ షాపునకు వెళ్లి మద్యం సీసాలు కొంటారు. దానిని షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చింది. 'తాగండి అమ్మాయిలు తాగండి.. ఏ మాత్రం తగ్గద్దు. ఎనిమిది మందిలో ఈమె ఒక్కరే మగరాయుడు. ఇదీ ఏ మాత్రం తప్పుకాదు, అసహ్యమూ కాదు. ఏమవుతుంది మహా అయితే వాట్సాప్ ఫార్వర్డ్ ఆఫ్ ద డే అవుతుంది. మీరు సూపర్.. మహిళల హక్కుల గురించి ఆలోచించకుండానే తిరిగి వస్తున్నాయి.' అంటూ కామెంట్ చేసింది. దీంతో వాళ్లను పొగుడుతున్నావా..? లేదా తప్పుబడుతున్నావా..? ఏ మాత్రం అర్థం కావడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే కస్తూరిపై సీరియస్ అవుతున్నారు. అమ్మాయిల వీడియోను ఇలా నెట్టింట షేర్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చిత్రపరిశ్రమలోని ప్రముఖలకు చెందిన అమ్మాయిలు పబ్‌లకు వెళ్తున్నారు. వారి ఫోటోలు కూడా ఇలా షేర్ చేసే దమ్ము నీకు ఉందా..? అంటూ మండిపడుతున్నారు. ఇదే విషయంపై ప్రముఖ సింగర్ చిన్మయి కూడా స్పందించింది. 'కస్తూరి నువ్వు ఇలా షేర్ చేయాల్సిన అవసరం ఏమెచ్చింది. నిజాయితీగా చెప్తున్నా. ఇది చాలా తప్పు' అంటూ ట్వీట్ చేసింది. దీంతో చిన్మయిని నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. అమ్మాయిలు అయినంత మాత్రనా మద్యం తీసుకోకుడదా..? వారికంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయినేది గుర్తించాలి. మద్యం మగవారు మాత్రమే తీసుకోవాలని రాసి ఉందా..? అని కస్తూరిపై ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా వీడియో షేర్ చేయడంతో ఆమెపై కోలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగుతుంది. தண்ணியடி, பெண்ணே தண்ணியடி ! எட்டு மறிவினில் ஆணுக்கிங்கே பெண் இளைப்பில்லை காணென்று தண்ணியடி. WhatsApp fwd of the day. As received. Super. அப்ப பெண்கள் உரிமை தொகை சிந்தாம சிதறாம திரும்பிடும் 🫤#dravidamodel pic.twitter.com/7SA889fwpp — Kasturi (@KasthuriShankar) July 13, 2023 (ఇదీ చదవండి: స్టార్ హీరో కుమారుడు తెరంగేట్రం.. ఏకంగా స్టార్ హీరోయిన్ కూతురితోనే!) -
భార్య అర్ధ నగ్న చిత్రాలను స్నేహితులకు పంపిన భర్త
కర్ణాటక: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త, భార్యపై ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి ఆమె ప్రైవేట్ వీడియోలు, అర్ధనగ్న చిత్రాలను స్నేహితులకు పంపడంతో పాటు ఇంటర్నెట్లో పెట్టాడు. ఇది తెలిసి బాధితురాలు మైసూరు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. ఉదయగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి నగరలో నివాసం ఉంటున్న అబ్దుల్ సలీంతో 10 నెలల కిందట ఒక యువతికి పెళ్లయింది. అయితే కొద్దిరోజులకే గొడవలు పడి దూరం అయ్యారు. ఇద్దరు కలిసి ఉన్న సమయంలో అబ్దుల్ సలీం భార్య వీడియోలు, అర్ధనగ్న ఫోటోలను తీసి పెట్టుకున్నాడు. తనను కాదని వెళ్లిపోయిందన్న ఉక్రోషంతో వాటిని స్నేహితులకు పంపడంతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాధితురాలు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టారు. -
వైరల్‌గా మారిన పూరీ జగన్నాథ ఆలయం లోపలి దృశ్యాలు
భువనేశ్వర్: అధికారులు అనేక ఆంక్షలు విధించినప్పటికీ, పూరీ జగన్నాథ ఆలయం లోపలి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. తరచూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నా.. నిఘా వ్యవస్థ లోపంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితులు ఆలయ భద్రత వ్యవస్థ పటిష్టతకు సవాల్‌గా నిలుస్తున్నాయి. శ్రీమందిరం లోపలికి సెల్ఫోన్లు, కెమెరాలు ఇతరేతర సాంకేతిక పరికరాలు, యంత్రాల ప్రవేశం పూర్తిగా నిషేధం. ఈ నేపథ్యంలో సింహద్వారం ఆవరణలో పటిష్టంగా తనిఖీలు నిర్వహించి, లోపలికి ప్రవేశించేందుకు అనుమతించే విధానం అమలులో ఉంది. ఈ వ్యవస్థ కార్యచరణ లోపంతో తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి శ్రీమందిరం ప్రధాన దేవస్థానం లోపలి దృశ్యాలను వీడియో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పరిస్థితులు తీవ్ర కలకలం రేపి, విశిష్ట మందిరం భద్రతపై తీవ్రమైన ప్రశ్నలకు అవకాశం కల్పిస్తున్నాయి. వీడియోలో తారసపడిన వ్యక్తి స్థానికేతరుడుగా భావిస్తున్నారు. ఈ దృశ్యాల్ని తన ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో అప్లోడ్ చేసి, విడుదల చేయడంతో వివాదం ఊపందుకుంది. దీని ప్రకారం వివాదాస్పద యాత్రికుడు వారణాసికి చెందిన వ్యక్తి రోహిత్ జైస్వాల్గా గుర్తించారు. ఆలయ ప్రాంగణంలో సెల్ఫోన్లు నిషేధించినా.. తనతో పరికరాన్ని ఎలా తీసుకు వెళ్లడనే దానిపై అనుబంధ వర్గాలు తక్షణమే స్పందించలేని దయనీయ పరిస్థితులు తాండవిస్తున్నాయి. స్వామివారు లేని సమయంలో.. తోబుట్టువులతో కలిసి జగన్నాథుడు గుండిచా మందిరానికి యాత్రగా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ వ్యవధిలో నిత్యం కళకళలాడే శ్రీమందిరం బోసిబోయింది. మరమ్మతులు తదితర నిర్వహణ పనులు కొనసాగుతున్నాయి. అయితే యాత్రికులు శ్రీమందిరం సందర్శించేందుకు ఎటువంటి ఆంక్షలు లేకున్నా.. భద్రతాపరమైన కార్యాచరణ కట్టుదిట్టంగా కొనసాగుతోంది. మూల విరాట్లు లేనందున శ్రీమందిరం సందర్శనకు నామమాత్రపు యాత్రికులు మాత్రమే సందర్శిస్తున్నారు. జనసందోహం లేని ఈ వ్యవధిలో భద్రత, తనిఖీ కార్యకలాపాలు మందగించే నిర్లక్ష్య పరిస్థితులను యాత్రికుడు అనుకూలంగా చేసుకొని, లోపలి దృశ్యాల చిత్రీకరణకు పాల్పడేందుకు వీలైందనే ఆరోపణ బలంగా వ్యాపించింది. రాత్రింబవళ్లు నిరవధికంగా కొనసాగాల్సిన భద్రతా వ్యవస్థ కార్యాచరణ పెద్ద సవాల్‌గా నిలిచింది. చర్యలలో అలసత్వం కారణంగా అతను ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాడా? లేదా ఘటనలో ఎవరిదైనా సహాయం తీసుకున్నాడా? అనే దానిపై స్పష్టత లేదు. చర్చలేవీ..? జగన్నాథ దేవాలయం లోపలి దృశ్యాల వీడియోలు, చిత్రాలు ఇంతకుముందు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిందితులను అదుపులోకి తీసుకుని చర్యలు చేపట్టడం మినహా అవాంఛిత సంఘటనల పునరావృతం నివారణ దిశలో పూరీ జిల్లా, పోలీసు, జగన్నాథ ఆలయ పాల క వర్గం ఇతర అనుబంధ వర్గాలు చేపట్టిన చర్యలు శూన్యంగా పరిణమించాయి. లోపలి దృశ్యాల చిత్రీకరణ వివాదస్పద కార్యకలాపాల్లో బాధ్యులైన సిబ్బంది, అధికార వర్గాల వ్యతిరేకంగా చేపట్టిన చర్యల దాఖలాలు లేకపోవడం విచారకరం. -
రన్ అవుట్ చేయకుండా గొడవ చూస్తున్నాడు వీడు ఎవడు రా బాబు ....
-
ఈ మొబైల్ ఉంటే ఇంట్లో థియేటర్ ఉన్నట్టే.. ధర ఎంత ఉండొచ్చంటే?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇంట్లోనే మనకు నచ్చిన స్క్రీన్ సైజులో థియేటర్ క్వాలిటీతో వీడియోలు, సినిమాలు వీక్షించొచ్చు. వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ‘ప్రొజెక్టర్ మోడ్ స్మార్ట్ ఫోన్ల’తో డిజిటల్ రంగం మరింత స్మార్ట్ కానుంది. చేతిలో సెల్‌ఫోన్ ఉంటే ఇంట్లో గోడలు.. నేల.. కార్యాలయం.. కార్లు.. విహార యాత్రలకు వెళితే ఆరు బయటి ప్రాంతాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ సెల్‌ఫోన్‌లోని ప్రొజెక్టర్ ద్వారా వీడియోలు చూడొచ్చు. సెల్ఫోన్లో ప్రొజెక్టర్ ఇన్‌బిల్డ్ చేసి చైనా, జపాన్, అమెరికా, సౌత్ కొరియాకు చెందిన పలు కంపెనీలు వీటిని రూపొందించాయి. లినోవా, అక్యుమెన్, మోటో–జెడ్, మోవి, శాంసంగ్ బీమ్–2 మోడల్స్ పేరుతో ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లోకి విడుదలయ్యాయి. త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి. థియేటర్ క్వాలిటీతో.. ఈ ఫోన్లలో ఇంటిగ్రేటెడ్ లేజర్ ప్రొజెక్టర్ ఉంటుంది. లినోవా కంపెనీ తొలుత దీన్ని రూపొందించగా.. ఆ తర్వాత ఇతర కంపెనీలు దృష్టి సారించాయి. ఇప్పుడు మార్కెట్లో ఈ ఫోన్ల ధర రూ.35 వేల నుంచి రూ.1.80 లక్షల వరకూ పలుకుతున్నాయి. ఫోన్, ప్రొజెక్టర్ క్వాలిటీ ఆధారంగా వీటి ధరలు ఉన్నాయి. 50 నుంచి 200 ఇంచుల స్క్రీన్ వరకూ మనం వీడియోలో ప్రొజెక్ట్ చేయొచ్చు. ఇందులో హెచ్డీ, ఫుల్ హెచ్డీ, 4కే క్వాలిటీతో వీడియోలు చూడొచ్చు. హోమ్ థియేటర్‌ను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి డీటీఎస్ సౌండ్‌తో పూర్తిగా థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌తో వీడియోలు చూడొచ్చు. వీడియో ప్రజెంటేషన్‌కు ప్రొజెక్టర్ల అవసరం లేకుండా ఇలాంటి సెల్‌ఫోన్‌తో ప్రజెంటేషన్ చేయొచ్చు. -
యప్‌టీవీ నుంచి వీడియోగ్రాఫ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓటీటీ సంస్థ యప్‌టీవీ కొత్తగా వీడియో స్ట్రీమింగ్ అవసరాలకు ఉపయోగపడే వీడియోగ్రాఫ్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. ఆన్ డిమాండ్, లైవ్ స్ట్రీమింగ్ మొదలైన వాటికి కావాల్సిన ప్లగ్ అండ్ ప్లే ఏపీఐలు ఇందులో ఉంటాయని సంస్థ వ్యవస్థాపకుడు ఉదయ్ రెడ్డి తెలిపారు. వేగవంతమైన వీడియో ఎన్కోడింగ్కు, వీడియో ఎడిటింగ్, లైవ్ వీడియో క్లిప్పింగ్లాంటి వాటికి ఇది అనువైనదిగా ఉంటుందని పేర్కొన్నారు. యూజర్లు, కంటెంట్ క్రియేటర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వినూత్న ఫీచర్లతో ఈ ప్లాట్‌ఫామ్‌ను తీర్చిదిద్దినట్లు వివరించారు. ఇప్పటికే ట్యూరి టో, హీరోగో తదితర సంస్థలు వీడియోగ్రాఫ్ను వినియోగిస్తున్నట్లు ఉదయ్ రెడ్డి చెప్పారు. -
పెళ్లయ్యాక ఆమెతో భర్త ఒక్కరోజు గడపలేదు.. మరో మహిళతో రీల్స్..
కర్ణాటక: భర్తకు వేరే మహిళతో కలిసి రీల్స్ చేయటం ముఖ్యం. మరిదికి ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుని అశ్లీల వీడియోలు చూడడం ముఖ్యం. దీనిని ప్రశ్నించవలసిన అత్తమామలు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ మహిళ ఒకరు బెంగళూరు తూర్పు విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ప్రమోద్ కుమార్, మరిది, అత్త మామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. 2022 మే లో ప్రమోద్‌కుమార్‌తో బాధిత మహిళకు పెళ్లయింది. రూ.30 లక్షల ఖర్చు చేసి పెళ్లి చేయడంతో పాటు బాగా కట్న కానుకలిచ్చారు. ఆ రోజు నుంచి ఒక్క రోజు కూడా ఆమెతో భర్త గడపలేదు. కానీ మరో మహిళతో వీడియోలు చేస్తూ ఫేస్బుక్, ఇన్‌స్టాలో పోస్ట్ చేసేవాడు. ఇక మరిది పని ఇంట్లో కూర్చుని నీలి చిత్రాలను చూడడంతో పాటు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. సొంత ఇల్లు ఉందని నమ్మించి, తీరా బాడుగ ఇంటిలో ఉంటూ తనను మోసం చేశారని వాపోయింది. పుట్టింటి నుంచి మరింత డబ్బులు తీసుకురావాలని రాచి రంపాన పెడుతున్నారని తెలిపింది. -
రీల్స్ చెయ్.. లక్ష పట్టేయ్! గవర్నమెంట్ బంపర్ ఆఫర్..
ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వంటి సోషల్ మీడియాలో రీల్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. రీల్స్ చేసి ఆకట్టుకోగల సత్తా ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. రీల్స్ చేసి ఆకట్టుకున్న వారికి లక్ష బహుమతి అందివ్వనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ అందించిన సమాచారం ప్రకారం.. రీల్స్ చేసే వారి కోసం ఒక ప్రత్యేక కాంటెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందులో గెలిచిన వారికి ఒక లక్ష నగదు బహుమతి లభిస్తుంది. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి, నగర ప్రాముఖ్యత గురించి ఆసక్తికరంగా చూపరులను ఆకట్టుకునే విధంగా 60 సెకన్ల నిడివితో ఓ వీడియో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు పోస్ట్ చేసే వీడియోలో @DigitalMediaTS అని ట్యాగ్ చేయాలి. అంతే కాకుండా ఇలాంటి వీడియోలను dir_dm@telangana.gov.in కి కూడా మెయిల్ చేయవచ్చు. ఏప్రిల్ 30 చివరి నాటికి వీడియోలను పంపాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. మరిన్ని వివరాలు కోసం https://it.telangana.gov.in/contest/ వెబ్సైట్ సందర్శించవచ్చు. గతంలో డబ్ ష్మాష్, టిక్ టాక్ వంటివి మంచి ట్రెండింగ్‌లో నడిచాయి, అయితే ఇప్పుడు యూట్యూబ్ షార్ట్ వీడియోలో, రీల్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. రీల్స్ చేస్తూ కాలం గడిపేవారికి ఇది ఒక సువర్ణావకాశం అనే చెప్పాలి. వీడియోలన్నీ కూడా హైదరాబాద్ నగర అభివృద్ధిని తెలియజేయాలి. Great with Reels? Love Hyderabad? Here's something exciting for you! Capture the charm and vividness of #HappeningHyderabad and share with us by tagging @DigitalMediaTS Win cash prizes worth Rs 1,00,000/- Entries close on April 30. For details visit https://t.co/8J20OoaI9v pic.twitter.com/oaL1KTlI0Y — Telangana Digital Media Wing (@DigitalMediaTS) April 4, 2023 -
NMACC: ప్రశంసలు: నీతా ‘షో’ కు కదిలిపోయిన ఆనంద్ మహీంద్ర
సాక్షి: ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ప్రారంభించిన డ్రీమ్ ప్రాజెక్ట్ నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) ఎం అండ్ ఎం అధినేత బిలియనీర్ ఆనంద్ మహీంద్ర ప్రశంసలు కురిపించారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ 'ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్' షోపై తన అనుభవాన్ని ట్విటర్లో షేర్ చేశారు. మ్యూజికల్ షో కథనం తన హృదయాన్ని కదిలించిందనీ, ముఖ్యంగా నీతా అంబానీ రఘుపతి రాఘవ రాజా రామ్‌కి పాటతో పూజ్య బాపూజీని గుర్తు చేశారంటూ అభినందించారు. (NMACC: నీతా అంబానీ అద్భుతమైన డ్యాన్స్, మీరూ ఫిదా అవ్వాల్సిందే!) వరుస ట్వీట్లలో ఈ సందర్భంగా తన సంతోషాన్నిపంచుకున్న ఆనంద్ మహీంద్ర అద్భుతమైన ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించినందుకు ముఖేశ్, నీతా అంబానీలకు ధన్యవాదాలు తెలిపారు. థియేటర్ డైరెక్టర్ ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. లైట్ అండ్ సౌండ్ అద్భుతం. హృదయాన్ని కదిలించే ఈ షోను తనఇద్దరు మనవళ్లు ఈ ప్రదర్శన చూసి, దీని గొప్పతనాన్ని గ్రహించాలని కోరుకోంటున్నా అంటూ ట్వీట్ చేశారు. (నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్ ) కాగా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నడిబొడ్డునున్న జియో వరల్డ్ సెంటర్లో అట్టహాసంగా నిర్వహించిన ఎన్ఎంఏసీసీ గ్రాండ్ ఓపెనింగ్‌కు బిలియనీర్ ఆనంద్ మహీంద్రా భార్య అనురాధతో సహా హాజరయ్యారు. బ్లాక్ జోధ్‌పురి సూట్లో ఆనంద్మహీంద్రా, పూల జరీ వర్క్ సాల్మన్ పింక్ చీరలో భార్య అనూరాధ క్లాసీగా స్పెషల్‌గా కనిపించారు. But more than the spectacle, it is the narrative that stirs the heart. My dominant sentiment was of wanting my two grandsons to see the show & grasp the richness of their Indian heritage. Thank you #NitaAmbani & #MukeshAmbani for this show & for a performance platform second to… pic.twitter.com/PzpKwvUgKz — anand mahindra (@anandmahindra) April 1, 2023 Last night, the #NMACC was launched in Mumbai with the staging of “The Great Indian Musical: Civilization to Nation.” A tour de force conceived by Feroz Abbas Khan. It’s a spectacular panorama of India’s cultural & political history. The light, sound, colour & movement are… pic.twitter.com/ZDknbbwbxY — anand mahindra (@anandmahindra) April 1, 2023 our desi celebs showed up at nmacc event & rocked like no one else 🫶🏼 pic.twitter.com/H45tvMkmvo — anushka. (@softiealiaa) April 1, 2023 -
వైరల్ వీడియో: నాకూ వచ్చు రీల్స్..
-
హ్యాపీ పేరెంటింగ్: వసపిట్ట పాఠాలు
తల్లిదండ్రులుగా పిల్లలను చూసుకోవాల్సిన విధానాన్ని, తల్లిగా తన అనుభవాన్ని కళ్లకు కడుతూ యూ ట్యూబర్‌గా రాణిస్తోంది హైదరాబాద్ కొండాపూర్‌లో ఉంటున్న చిలుకూరి కృష్ణమాధురి, నాలుగు, ఏడాదిన్నర వయసున్న పిల్లలతో కలిసి, తన స్వీయ అనుభవాలను షేర్ చేస్తుంటుంది. మాధురి మూడేళ్లుగా చేస్తున్న ఈ ప్రయత్నాలు... పిల్లల పెంపకంలో తను తీసుకునే జాగ్రత్తలు ఎంతోమంది తల్లులకు పాఠాలు అవుతున్నాయి. ఈ విషయాల గురించి మాధురి మాట్లాడుతూ ... ‘‘నేను పుట్టి పెరిగింది రాజమండ్రిలో. మావారిది గుంటూరు. మా వారి ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉండేవాళ్లం. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్న నేను పిల్లల పుట్టడంతో ఇంటి దగ్గరే ఉండిపోయాను. పిల్లలపై తపన, వారి ఆరోగ్య జాగ్రత్తలు, పెంపకం విషయాలన్నీ తల్లిగా నాకు ప్రతిరోజూ ఓ పాఠమే. వీటిని నలుగురితో పంచుకుంటే కొంతమంది తల్లులకైనా ఉపయోగపడుతుంది కదా అని సరదాగా వీడియోలు తీసి, యూ ట్యూబ్‌లో పోస్ట్ చేసేదాన్ని. వాయిస్ ఆఫ్ వసపిట్ట పిల్లల అల్లరి మాటలకు పెద్దవాళ్లు ముద్దుగా పెట్టే పేరు వసపిట్ట. నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని చిన్నప్పటి నుంచి కాస్త ఎక్కువగా మాట్లాడేదాన్ని. అందుకే, అందరూ నన్ను వసపిట్ట అని పిలిచేవారు. దీంతో ఛానెల్‌కి ఇదే పేరు బాగుంటుందని ఎంచుకున్నాను. మూడేళ్లు అవుతోంది ఇది స్టార్ట్ చేసి. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చాక నా పోస్ట్‌లు మరిన్ని పెరిగాయి. పెంపకాన్ని పరిచయం చేస్తూ.. అమ్మ తన పిల్లలను ఏ విధంగా పెంచుతుందనే విషయాల గురించి వెతికితే తెలుగులో ఎక్కువ బ్లాగర్స్ లేరు. ఉన్నా, వివరంగా చెప్పేవారు లేరు. పిల్లల పెంపకం అనగానే చాలా వరకు డాక్టర్లు, డైటీషియన్లు కనిపిస్తారు. వాళ్లు చెప్పేవి అందరూ ఆచరణలో పెడుతున్నారో లేదో తెలియదు. నేను డాక్టర్ దగ్గరకు పిల్లలను తీసుకెళ్లినప్పుడు, అక్కడ వారిచ్చిన మందులు, జాగ్రత్తల నుంచి అన్నీ నా ఛానెల్ ద్వారా పరిచయం చేస్తుంటాను. రోజువారి పనులు చిన్న పిల్లలున్న ఇల్లు ఎలా ఉంటుందో తల్లులందరికీ అనుభవమే. ఇల్లు పీకి పందిరేస్తారు అంటుంటారు. ఇలాంటప్పుడు చిన్నపిల్లలకు క్రమశిక్షణ ఎలా అలవాటు చేయాలి, దుమ్ము, కాలుష్యం నుంచి వారిని ఎలా కాపాడాలి, టీవీ చూడకుండా తినడం ఎలా అలవాటు చేయాలి, స్క్రీన్ టైమ్ ఎందుకు తగ్గించాలి.. ఇలాంటివి పిల్లలను ఇన్వాల్వ్ చేసి చెప్పడం వల్ల చాలా మంది కనెక్ట్ అయ్యారు. అంతేకాదు, వాళ్లంతట వాళ్లు పనులు చేసుకోవడం, వంటలో సాయం చేయడం.. వంటివి పిల్లలకు పెద్దవాళ్లు అలవాటు చేయాలి. వీటిని మా పిల్లలను చూపిస్తూ ‘హ్యాపీ పేరెంటింగ్’ అనేది తెలియజేయాలనుకున్నాను. అదే చేస్తున్నాను. ఆనందకరమైన లక్ష్యం మదర్ హుడ్, ఫాదర్ హుడ్ ఎంజాయ్ చేస్తూ పిల్లలు కూడా మంచి ఫీలింగ్‌తో పెరగాలనేది నా ఆలోచన. మేం సమస్యలను ఎలా అధిగమిస్తున్నామో కూడా చూపిస్తున్నాను. వీటిని చూడటానికి నాలుగు లక్షలకు పైగా వీక్షకులున్నారు. వీరిలో పిల్లలున్నవారు 70 శాతం మంది ఉన్నారు. నా వీడియోలు చూసి తాము కూడా బ్లాగ్స్ చేస్తున్నామని కొందరు చెబుతుంటారు. ఆరోగ్య జాగ్రత్తలు... వీక్షకులలో చాలా మంది డాక్టరు చెప్పే జాగ్రత్తలు, కిడ్స్ ఫుడ్ గురించి సలహాలు సూచనలు అడుగుతుంటారు. పిల్లలు సరిగా తినరు అనేది పెద్దలు ప్రతిసారి చెబుతుంటారు. కానీ, ఎందుకు తినరు, ఎలా తింటారు.. అనే వివరాలను మా పిల్లలను ఉదాహరణగా చూపిస్తూ వివరిస్తుంటాను. వివిధ సమయాలలో పిల్లల ప్రవర్తన, మనం వారితో మాట్లాడటం, ్రపాక్టికల్గా చేస్తూ చెబుతుంటాను. పిల్లలు కూడా ఈ విధానాన్ని బాగా ఇష్టపడుతున్నారు. మా పిల్లలకు ఓ సారి ర్యాషెష్ వచ్చాయి. వాటిని ప్రాక్టికల్‌గా చూపించి, డాక్టరు చెప్పిన సూచనలతో పాటు, నేను స్వయంగా ఎలాంటి కేర్ తీసుకుంటున్నానో చూపించాను. అలాగే.. డెంటల్ ట్రీట్మెంట్, గర్భిణిగా ఉన్నప్పుడు, తల్లిపాల ప్రాముఖ్యత.. ఆ సమయాల్లో నేనెలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను.. మరికొన్ని ఇతరుల ద్వారా సేకరించిన సూచనలూ ఇస్తుంటాను. మా నాన్న రైల్వేలో ఉద్యోగి. చిన్నప్పటి నుంచి కుటుంబంలో ప్రతి విషయంలో నా అభిప్రాయాన్ని కూడా అడిగేవారు. అలా వారి నుంచే నాకు నా పిల్లల పెంపకాన్ని మరింతగా నలుగురికి తెలియజేయాలనే ఆలోచన పెరుగుతూ వచ్చింది’’ అని తల్లిగా తన అనుభవ పాఠాలను ఆనందంగా వివరించారు మాధురి. – నిర్మలారెడ్డి -
జిలేబీ బాబాకు 14 ఏళ్ల జైలు
చండీగఢ్: తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకుంటూ అరాచకాలు సాగించిన జిలేబీ బాబా అలియాస్ అమర్‌వీర్ అలియాస్ బిల్లూ అలియాస్ అమర్‌పురి (63) పాపం పండింది. 100 మందికిపైగా మహిళలపై అత్యాచారం చేసి, వీడియోలు తీసినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. ఓ బాలికపై రెండు సార్లు అత్యాచారం చేసిన కేసులో పోక్సో చట్టం సెక్షన్ 6 కింద అతనికి 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు హరియాణాలోని ఫతేహాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అదనపు జిల్లా జడ్జి బల్వంత్‌సింగ్ బుధవారం ప్రకటించారు. జిలేబీ బాబాను హరియాణా పోలీసులు 2018లో అరెస్టు చేశారు. అతడి ఫోన్లో 120కి పైగా అశ్లీల వీడియో క్లిప్పింగ్‌లను గుర్తించారు. జిలేబీ బాబా హరియాణాలోని తోహన్ పట్టణంలో బాబా బాలక్‌నాథ్ మందిరం అధినేతగా ప్రాచుర్యం పొందాడు. మహిళలకు మాదకద్రవ్యాలిచ్చి అత్యాచారం చేయడం, ఆ దురాగతాన్ని వీడియోలో చిత్రీకరించడం, వాటిని చూపి బ్లాక్మెయిల్ చేసి బాధితుల నుంచి డబ్బులు గుంజడం అతని స్టైల్. -
ఆకుపచ్చ ధనం
పచ్చగా కళకళలాడటం అంటే ఏమిటో రేష్మా రంజన్‌కు తెలుసు. అందుకే తృప్తినివ్వని గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలి మరీ ఇంట్లో ఉండిపోయింది. ఇంట్లో ఏం చేసింది? తనకిష్టమైన మొక్కలు పెంచింది. మట్టి, నీరు, కుండీ, ఆకు, ఎరువు... ఇవి ఎలా ఉపయోగిస్తే ఇంటి మొక్కలు అందంగా అద్భుతంగా ఉంటాయో బాగా తెలుసుకుంది. వాటినే వీడియో పాఠాలు చేసింది. ‘ప్రకృతీస్ గార్డెన్’ పేరుతో వందలాది వీడియోలు చేసింది. పది లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఏర్పడ్డారు. రేష్మా దిశా నిర్దేశంలో ఇళ్లల్లో మొక్కలు పెంచుతున్నారు. వారు హ్యాపీగా ఉన్నారు. దీనివల్ల వచ్చే ఆదాయంతో రేష్మా పచ్చగా ఉంది. జార్ఘండ్‌లోని బొకారోలో రేష్మా రంజన్ ఇంటికి వెళితే చిన్న సైజు వనంలో అడుగు పెట్టినట్టు ఉంది. దాదాపు 2000 అందమైన, రకరకాల కుండీల్లో వందలాది రకాల మొక్కలు కనిపిస్తాయి. కొత్తిమీర, పొదీనాతో మొదలు ఆపిల్, అవకాడో వరకూ రేష్మా కుండీల్లో సృష్టించనిది అంటూ ఏదీ లేదు. ఒక కుండీలో ఉల్లిపాయలు పెరుగుతుంటాయి... మరో కుండీలో అనాసపళ్లు... ఇంకో కుండీలో చిలగడ దుంపలు, మరో కుండీలో నేతి బీరకాయలు... ఇక పూలైతే లెక్కే లేదు. వాటి మధ్య కూచుని వీడియోలు చేస్తుంటుంది రేష్మా. కేవలం తను పెంచి చూసిన మొక్కల గురించే ఆమె మాట్లాడుతుంది. ఆ అనుభవాల నుంచి వచ్చిన పాఠాలు కాబట్టే ఆమెకు పది లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ► బాల్యం ముఖ్యం బాల్యంలో ఏర్పరిచే మంచి ప్రభావాలు వారికి జీవితాంతం ఉంటాయి అనడానికి రేష్మ రంజన్ ఒక ఉదాహరణ. రేష్మాది బొకారో అయినా ఐదో క్లాస్ వరకూ బీహార్‌లోని పల్లెలో అమ్మమ్మ, తాతయ్య దగ్గర పెరిగింది. తాతయ్య ఇంట్లో విపరీతంగా చెట్లు. ‘దారిన పసిబిడ్డను వదిలి వెళ్లిపోతే చూసినవారు ఎలా కలత చెందుతారో ఎవరైనా ఏదైనా మొక్కను పారేసి ఉంటే మా తాత అంత కలత చెందేవాడు’ అంటుంది రేష్మా. అతడు ఎక్కడ ఏ మొక్క నిర్లక్ష్యంగా పడేసి ఉన్నా తెచ్చి ఇంట్లో దానికి ప్రాణం పోసేవాడు. రేష్మా మూడో క్లాసు పాసై నాలుక్కు వెళుతున్నప్పుడు మూడు మొక్కలు తెచ్చి వీటిని నువ్వే పెంచాలి అని చెప్పాడు తాతయ్య. ‘అయితే నేను మరీ అతిగా పెంచి ఎక్కువ నీళ్ళు, ఎక్కువ ఎరువు వేసేసి వాటిని చంపేశాను’ అని నవ్వుతుంది రేష్మా. ఆ గుణపాఠం నుంచి బాల్యంలోనే మొక్కలను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నేర్చుకుంది. ‘అదే మొక్కల మీద నా ప్రేమకు అంకురం’ అంటుంది రేష్మా. ► ఉద్యోగంలో అసంతృప్తి ఇంటర్ తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐ.సి.ఏ.ఆర్) నుంచి అగ్రికల్చర్ సైన్స్ డిగ్రీ చేసిన రేష్మా ఆ వెంటనే అగ్రికల్చర్ కోఆర్డినేటర్‌గా ప్రభుత్వ ఉద్యోగం పొందింది. ‘2015లో నాకు ఉద్యోగం వచ్చింది. నాకు ఇష్టమైన ఉద్యోగం అనుకున్నాను. నా పని రైతులకు వారి పంట పోషణలో సాయం చేయడం. కాని నా లాంటి చిన్న పిల్ల చెప్తే వినడం ఏమిటి అనుకునేవారో లేదా వారి సంప్రదాయ జ్ఞానం మీద విశ్వాసమో కాని నేను చెప్పే సూచనలు రైతులు వినేవారు కాదు. అంతేకాదు మట్టిని బట్టి, విత్తును బట్టి పంటలో మార్పు చేర్పులు చెప్తే లక్ష్యం చేసేవారు కాదు. ఆ అసంతృప్తి నాకు ఉండేది. మరోవైపు ఉద్యోగం వల్ల నేను స్వయంగా మొక్కలు పెంచలేకపోయేదాన్ని. అదే సమయంలో నా చదువును చూసి ఫ్రెండ్స్ ఫలానా మొక్కలు ఎవరు వేయాలి... ఫలానా తీగను ఎలా పెంచాలి... అని సలహా అడిగేవారు. ఈ అన్ని సమస్యలకు సమాధానంగా ఉద్యోగం మానేసి యూట్యూబ్ చానల్ మొదలెట్టాను’ అంటుంది రేష్మా. ► పదివేల మంది అనుకుంటే ‘నేను మొక్కలు, తీగలు, పూల చెట్లు, పండ్ల చెట్లు, కూరగాయలు, ఇండోర్ ప్లాంట్లు... వీటన్నింటిని ఎలా పెంచారో, కేర్ తీసుకోవాలో చెప్తే నాలాగే మొక్కలను ఇష్టపడే ఒక పదివేల మంది అయినా ఫాలో కాకపోతారా అనుకున్నాను. సహజ పద్ధతిలో గులాబీ పెంచడం ఎలా? అనేది నా మొదటి వీడియో. దానికి వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. పది వేల మంది అనుకుంటే రెండు మూడేళ్ల లోనే లక్ష మంది అయ్యారు. 2016 నుంచి నా పాఠాలు కొనసాగితే 2022 చివరకు పది లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ అయ్యారు. ప్రొడక్ట్ ప్రమోషన్స్ కోసం వచ్చే వారి వల్ల కాని, యూట్యూబ్–ఫేస్బుక్ పేజ్ వల్ల కాని నాకు నెలకు లక్ష నుంచి లక్షన్నర ఆదాయం వస్తోంది’ అంటుంది రేష్మా. ఒక పనిలో పూర్తిగా నైపుణ్యం ఉంటే ఆ పనిలో ఆనందం, ఆదాయం రెండూ పొందవచ్చు. మీకు బాగా మొక్కలు పెంచడం వస్తే రేష్మాలా యూట్యూబ్ చానల్ నడపొచ్చు. బాగా మొక్కలు పెంచాలని ఉంటే ఆమె చానల్ ఫాలో కావచ్చు. ‘అందరూ మొక్కలు పెంచితే ప్రపంచం పచ్చగా మారడానికి ఎక్కువ టైమ్ పట్టదు’ అని రేష్మా చెప్పే మాట అందరూ వినాలి. ► అందమైన ఇల్లు మొక్కలు ఎలా అంటే అలా పెంచడం కాదు. వాటిని అందమైన కుండీల్లో అందమైన అరల మీద పెడితే వచ్చే అందాన్ని కూడా రేష్మా చెబుతుంది. సహజంగా ఎరువుల్ని, క్రిమి సంహారకాలను ఎలా తయారు చేసుకోవాలో చూపుతుంది. సేంద్రియ విధానాలు కూడా చూపుతుంది. ఇండోర్ ప్లాంట్స్ ఎలా శుభ్రం చేయాలి అనే ఆమె వీడియో ఇండోర్ ప్లాంట్స్ ఉన్నవారంతా చూడతగ్గది. ‘వాల్ డెకరేషన్’గా గోడలకు కుండీలు బిగించి ఎలాంటి మొక్కలు పెంచాలో చూపుతుంది. ఇంకా ఆమె చెప్పే విషయాలు అనంతం. -
ఊహించని షాక్.. భారత్‌లో 17 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్!
కంపెనీ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వీడియోలపై కొరడా ఘుళిపించింది ప్రముఖ వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్. భారతలో ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ మధ్య దాదాపు 17 లక్షలకు పైగా రూల్స్ పాటించిన వీడియోలను తొలగించినట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సంఖ్య 56 లక్షలకు వరకు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు 73.7 కోట్ల కామెంట్లను కూడా యూట్యూబ్ నుంచి తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో రోజు కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అయితే అందులో తప్పుదారి పట్టించే మెటాడేటా, థంబ్‌నెయిల్స్, నిబంధన పాటించని వీడియోలు స్పామ్ కామెంట్లు వంటివి కలిగి ఉన్న వీడియోలను 50 లక్షలకు పైగా తొలగించింది. డేటా ప్రకారం, ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా పరీక్షించిన తర్వాత 99 శాతం కామెంట్లు తొలగించింది. మెషీన్ల ద్వారా గుర్తించి వీడియోలలో 36 శాతం వీడియోలు ఒక వ్యూస్ కూడా పొందకముందే తీసేవేసింది. కంపెనీ అనుసరిస్తున్న నియమాల ఉల్లంఘనలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేసింది. యూట్యూబ్ దీనిపై స్పందిస్తూ.. “మేము ఇందులో మెషీన్ లెర్నింగ్‌తో హ్యూమన్ రివ్యూయర్ల కలయిక ఉన్న టెక్నాలజీని ఉపయోగించి మా విధానాలను అమలు చేస్తున్నాము. మా ఆటోమేటెడ్ ఫ్లాగింగ్ సిస్టమ్‌ల కంపెనీ మార్గదర్శకాలకు లోబడి పని చేస్తుంటాయి. ఇవి ఉల్లంఘనలకు పాల్పడిన వీడియోలను గుర్తించడంతో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపింది. చదవండి: బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేసింది: త్వరపడకపోతే..! -
Hyderabad: మెకానిక్‌తో వచ్చి.. రహస్య కెమెరా అమర్చి!
సాక్షి, హైదరాబాద్: అల్వాల్‌కు చెందిన ఓ మహిళ మొబైల్ షాప్‌ను నిర్వహిస్తుంది. అక్కడికి వివో మొబైల్ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్న గాజులరామారానికి చెందిన సయ్యద్ రియాజ్ సెల్‌ఫోన్ విక్రయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తరుచు వచ్చేవాడు. ఈ క్రమంలో సదరు మహిళతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. ఓ రోజు మహిళ షాపులో ఉన్న సమయంలో తన భర్తతో సెల్ఫోన్లో గీజర్, ఏసీ రిపేర్ విషయమై మాట్లాడుతుండగా.. అదే సమయంలో అక్కడికి వచ్చిన రియాజ్ మెకానిక్‌ను ఏర్పాటు చేస్తానని మహిళను ఒప్పించాడు. మర్నాడు మెకానిక్‌ను తీసుకుని మహిళ ఇంటికెళ్లిన రియాజ్.. ఆమెకు తెలియకుండా ఇంట్లో రహస్య కెమెరాను అమర్చాడు. ఈ క్రమంలో ఆమె ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తన వద్ద నగ్న వీడియోలు, ఫొటోలు ఉన్నాయని, ఇంటికి పిలవకపోతే వీటిని వైరల్ చేస్తానని బెదిరించసాగాడు. తాను చెప్పినట్లు నడుచుకోకపోతే ఫొటోలు ప్రింట్ తీసి ఆమె ఇంటి పరిసరాల్లో గోడల మీద అతికిస్తానని బెదిరించాడు. ఓ రోజు మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డాడు. భయంతో ఆమె కేకలు పెట్టడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో బాధితురాలు పేట్ బషీరాబాద్ షీ టీమ్స్‌ను సంప్రదించింది. వారి సూచన మేరకు అల్వాల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ►ఈ ఒక్క కేసే కాదు.. పార్క్‌లో వాకింగ్ చేస్తున్న మహిళపై ఫ్లాష్ లైట్లు కొట్టిన ఆకతాయి, లిఫ్ట్‌లో మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన పోకిరీ, పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి పరారైన వ్యక్తి తదితరులకు షీటీమ్స్ చెక్ పెట్టింది. 126 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్.. గత నెలలో సైబరాబాద్ షీ టీమ్స్‌కు 98 ఫిర్యాదులు అందాయి. వీటిల్లో 29 కేసులు నమోదు చేయగా.. 4 క్రిమినల్ కేసులు, 25 పెట్టీ కేసులున్నాయి. అత్యధికంగా 74 ఫిర్యాదులు వాట్సాప్ ద్వారా అందాయి. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్‌లో 126 మంది ఆకతాయిలకు గురువారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇందులో 20 మంది మైనర్లున్నారు. అర్ధరాత్రి డెకాయ్.. ఐటీ కంపెనీలకు నిలయమైన సైబరాబాద్‌లో రాత్రి వేళల్లో కూడా పలు కంపెనీలు పనిచేస్తుంటాయి. దీంతో మహిళా ఉద్యోగుల భద్రత, రక్షణ కోసం సైబరాబాద్ షీ టీమ్స్ అర్ధరాత్రి డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఫుడ్ కోర్ట్లు, వసతి గృహాలు, మెట్రో స్టేషన్లు, మాదాపూర్‌లోని 100 ఫీట్ల రోడ్, కూకట్పల్లి ఏరియా బస్ స్టాప్‌లు తదితర ప్రాంతాల్లో మఫ్టీలో సంచరిస్తున్న షీ టీమ్స్ బృందాలు గత నెలలో మహిళలను వేధిస్తున్న 60 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గత నెల రోజుల్లో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో 477 డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించగా 31 మంది ఆకతాయిలు పట్టుబడ్డారు. -
వీడియోలు, గేమింగ్, సోషల్‌మీడియా
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఆటలు, సామాజిక మాధ్యమాలు, వీడియోల వ్యసనం పిల్లలకు బాగా ఎక్కువైందని పట్టణప్రాంతాల్లోని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆన్లైన్ వేదికగా సర్వేలు నిర్వహించే ‘లోకల్‌సర్కిల్స్’ సంస్థ చేపట్టిన ఓ సర్వేలో ఇలాంటి పలు అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది జనవరి–నవంబర్ కాలంలో దేశవ్యాప్తంగా 287 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. సర్వే ఫలితాల ప్రకారం.. ► తమ 9–17 ఏళ్ల వయసు పిల్లలు గేమింగ్, వీడియోలు, సోషల్‌మీడియాకు అతుక్కుపోయారని పట్టణ ప్రాంతాల్లోని తల్లిదండ్రుల్లో దాదాపు 40 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► తమ 13–17 వయసు పిల్లలు రోజూ సగటున 3 గంటలకుపైగా ఇదే పనిలో ఉంటున్నారని 62 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు ► 9–13 వయసు చిన్నారులు రోజూ కనీసం మూడు గంటలు సోషల్ మీడియా, వీడియోలు, గేమింగ్తోనూ గడుపుతున్నట్లు 49 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు ► సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్ ఖాతాలు ఓపెన్ చేయాలంటే కనీసం 13 ఏళ్లు వయసుండాలని ఆయా సంస్థలు చెబుతున్నాయి. కానీ, 13 ఏళ్లలోపే అంటే 9–13 ఏళ్ల తమ పిల్లలు వీటిని చూస్తున్నారని 47 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు ► పట్టణప్రాంతాల్లోని 13–17 వయసు పిల్లల్లో ఈ సంస్కృతి మరీ ఎక్కువ ఉందని 44 శాతం మంది పేరెంట్స్ అభిప్రాయపడ్డారు ► సోషల్‌మీడియా ఖాతా తెరిచేందుకు కనీస వయసును 13 ఏళ్లకు బదులు 15 ఏళ్లుగా సవరించాలని 68 శాతం మంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ► ఆన్లైన్ తరగతులు, కొత్త విషయాలను నేర్చుకోవడంతోపాటు వినోదం కోసం కోవిడ్ తర్వాత ఇంటర్నెట్ను వాడుతున్న పట్టణప్రాంత చిన్నారుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
వస్త్ర వ్యాపారితో శారీరక సంబంధం.. సోదరులతో కలిసి హనీట్రాప్‌కు..
సాక్షి, బెంగళూరు (బనశంకరి): మనిషి బలహీనతే వారికి పెట్టుబడి. వల విసిరి లోబర్చుకుని ఆపై డబ్బూ దస్కం దోచుకోవడం పరిపాటిగా మారింది. సిలికాన్ సిటీలో హానీట్రాప్ దందాలు పెచ్చుమీరుతున్నాయి. సులభంగా బెదిరించి డబ్బులు దండుకోవడానికి దీనిని ఎంచుకుంటున్నారు. అలాగే టెక్నాలజీ సాయంతో అమాయక ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. పనిలో చేరి వలలో వేసుకుని వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న యువతి వస్త్ర వ్యాపారితో స్నేహంగా ఉంటూ తన సోదరులతో కలిసి హనీట్రాప్ కు పాల్పడి రూ.43 లక్షలు దోచేసింది. ఈఘటన బాధితుడు నగర్తపేటే నివాసి విక్రంజైన్ (43) అనే వస్త్రవ్యాపారి ఉప్పారపేటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి మైత్రి, ఆమె సోదరుడు కిరణ్, స్నేహితుడు సిద్దు అనే ముగ్గురిపై దర్యాప్తు చేపడుతున్నామని ఉప్పారపేటే పోలీసులు తెలిపారు. జైన్ 2020లో మైత్రి అనే యువతిని షాపులో పనికి చేర్చుకున్నాడు. ఈ సమయంలో యువతి తన సోదరుడు కిరణ్ రోడ్డుప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరాడని, డబ్బు కావాలని జైన్ నుంచి రూ.2 లక్షలు అప్పుగా తీసుకుంది. తరువాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కొద్దిరోజుల తరువాత జైన్‌కు మైత్రి ఫోన్ చేసి కేజీ.రోడ్డు బెంగళూరు గేట్ హోటల్‌కు రావాలనడంతో జైన్ వెళ్లాడు. హోటల్లో మైత్రి, కిరణ్, సిద్దు ఉన్నారు. రూ.8 లక్షలు ఇవ్వాలని, లేకపోతే మన ఇద్దరి మధ్య ఉన్న శారీరక సంబంధం గురించి ప్రచారం చేసి పరువు తీస్తానని బెదిరించింది. భయపడిన జైన్ వారికి రూ.8 లక్షలు అందజేశాడు. ఆ తరువాత కూడా దశలవారీగా వారు అతని నుంచి రూ.43 లక్షలు దోచేశారు. మరింత డబ్బు కోసం వేధిస్తుండడంతో తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పాన్‌కార్డు పేరుతో రూ.3.22 లక్షలు వంచన పాన్‌కార్డు అప్డేట్ చేయకపోతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని బ్యాంక్ సిబ్బంది ముసుగులో మహిళకు రూ.3.22 లక్షలు సైబర్ వంచకులు టోపీ వేశారు. జేపీ.నగరలో చంద్రిక (64)కు ఈ నెల 8 తేదీన గుర్తుతెలియని నెంబరు నుంచి చంద్రికాకు ఫోన్ వచ్చింది. మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం, మీ పాన్‌కార్డును అప్డేట్ చేయాలి, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది అని చెప్పారు. సరేనని చంద్రిక బ్యాంక్ అకౌంట్ వివరాలను పంపగానే ఆమె ఖాతా నుంచి ను రూ.3.22 లక్షలు నగదు కట్ అయింది. ఆమె లబోదిబోమంటూ బ్యాంకుకు వెళ్లి విచారించగా ఇది సైబర్ వంచకుల పని అని తెలిసి సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసింది. చదవండి: (Hyderabad: పదోతరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం) లింక్ నొక్కి చూసినందుకు రూ.6.24 లక్షలు స్వాహా మొబైల్‌కు వచ్చిన ఆన్లైన్ లింక్‌పై క్లిక్ చేసి నగ్నవీడియో చూసి బ్లాక్‌మెయిల్‌కు గురైన వృద్దుడు రూ.6.24 లక్షలు పోగొట్టుకున్నాడు. బీటీఎం.లేఔట్లో ఉండే 75 ఏళ్ల వృద్ధుడు బాధితుడు. ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు వంచకులైన సౌరవ్, బల్జిత్ రై, రేష్మా అనే ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. వృద్దుని మొబైల్ కు అక్టోబరులో గుర్తుతెలియని వ్యక్తి నుంచి లింక్ వచ్చింది. కుతూహలంతో లింక్‌పై క్లిక్‌చేసి యువతి వీడియోను కొద్దిసేపు వీక్షించాడు. ఈ తతంగాన్ని దుండగులు స్క్రీన్షాట్లు తీసుకున్నారు. తరువాత బాధితునికి ఫోన్ చేసి నువ్వు ఓ యువతితో అశ్లీలంగా ఉన్న మీ వీడియో మా వద్ద ఉందని బెదిరించారు. అతని నుంచి దశలవారీగా రూ.6.24 లక్షలను తమ అకౌంట్లకు బదిలీ చేయించుకున్నారు. డబ్బు కోసం మళ్లీ ఒత్తిడి చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితుల కోసం గాలింపు సాగుతోంది. -
‘వీడియోలో అమిత్‌షా పేరు చెబితే.. సంబంధం ఉన్నట్టేనా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీజేపీ పెద్దల హస్తం ఉందంటూ సీఎం కేసీఆర్ మీడియా వేదికగా కొన్ని వీడియోలు బయటపెట్టారు. ఈ వీడియోలపై బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌పై సెటైరికల్ కామెంట్స్‌తో కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న కేసీఆర్ చూపించిన వీడియోల్లో ఏమీలేదు. ఫస్ట్ షో.. సెకండ్ షో అన్నాడు. చివరికి కామెడీ షో అయింది. కేసీఆర్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి దృష్టి మరల్చేందుకే ఇదంతా చేస్తున్నారు. లిక్కర్ కేసులో ఎప్పుడైనా అరెస్ట్‌లు జరగొచ్చు. ఈ ఎపిసోడ్ అంతా పెద్ద డ్రామా. ఫామ్‌హౌస్ స్క్రిప్ట్ అంతా ఢిల్లీలోనే తయారైంది. కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే సీఎస్, డీజీపీని పిలిపించాడు. వాళ్లకు ఫామ్‌హౌస్ ఎపిసోడ్ మొత్తం వివరించారు. ఫామ్‌హౌస్‌లో నేనింతే.. నా బతుకు ఇంతే అనే సినిమా తీశారు. ఆ ముగ్గురు నకిలీ గ్యాంగ్‌ను పీఎస్‌కు తీసుకెళ్లారు. ఆ నలుగురు ఆణిముత్యాలను మాత్రం ప్రగతిభవన్‌కు తీసుకెళ్లారు. ఈ ఎపిసోడ్లో డబ్బులు ఎక్కడా చూపించలేదు. 26న ఘటన జరిగితే.. సాక్షుల సంతకాలు 27న ఎలా తీసుకుంటారు?. ఇదంతా ప్లాన్ ప్రకారం కేసీఆర్ డైరెక్షన్లోనే నడిచింది. అమిత్‌షా పేరు చెప్పినంత మాత్రాన ఆయనతో సంబంధాలు ఉన్నట్లేనా?. తుషార్‌కు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు. -
కేసీఆర్‌కు తన ఎమ్మెల్యేలపై ఎందుకు విశ్వాసం లేదు: తరుణ్ చుగ్
-
సీఎం కేసీఆర్‌కు బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సవాల్
సాక్షి, ఢిల్లీ: ఫామ్ హౌస్ వీడియోలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ వీడియోలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌కు ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్‌కు దమ్ముంటే వీడియోలపై ఆలయంలో ప్రమాణం చేయాలన్నారు. ఇప్పటికే బండి సంజయ్ ఆలయంలో ప్రమాణం చేశారన్నారు. ఈ వీడియోలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘‘మునుగోడులో అధికారం దుర్వినియోగం చేసింది. పోలింగ్‌కు కొన్ని గంటల ముందు వరుకు మంత్రులు అక్కడే ఉన్నారు. కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారు. నిజ నిజాలేంటో ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారు’’ అని తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్‌కు తన ఎమ్మెల్యేలపై ఎందుకు విశ్వాసం లేదు అంటూ ఆయన ప్రశ్నించారు. మీ దగ్గర అమ్ముడుపోయే ఎమ్మెల్యేలే ఉన్నారా?. సీఎం కేసీఆర్ సినిమా కట్టుకథలు వినిపిస్తున్నారు. సెవెన్ స్టార్ ఫాంహౌస్‌లో కూర్చుని కథలు రచిస్తున్నారు. ముగ్గురు బ్రోకర్లలో ఎవరితోనూ తమకు సంబంధాలు లేవన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు ప్రజలు చరమగీతం పాడతారని తరుణ్‌చుగ్ పేర్కొన్నారు. చదవండి: పెరిగిన ఓటింగ్ శాతం.. బీజేపీ ఏమంటోంది? -
చెరకు తోటలో మూకుమ్మడి అత్యాచారం.. ఆ సైట్లకు బానిసై అఘాయిత్యం
సాక్షి, బెంగళూరు(బనశంకరి): చేతిలో మొబైల్‌ఫోన్, అందులో ఇంటర్నెట్, దీనివల్ల దుర్వినియోగం కూడా జరుగుతోంది. తెలిసీతెలియని బాలలు అశ్లీల చిత్రాలు చూసి నేరాల వైపు చూస్తున్నారు. కలబుర్గి జిల్లా ఆళంద శివార్లలో కోరళ్లిలో మంగళవారం చెరుకు తోటలో మైనర్ బాలికపై అత్యాచారం, హత్య తీవ్ర సంచలనం సృష్టించగా, ఈ కేసులో మైనర్ బాలున్ని అఫ్జలపుర పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ 16 ఏళ్ల బాలుడు ఐటీఐ విద్యార్థి. ఇతను ఎవరితో కలవకుండా నిత్యం ఒంటరిగా ఉంటూ ఎప్పుడూ మొబైల్లో అశ్లీల చిత్రాలను చూసేవాడని ఫిర్యాదులున్నాయి. దీంతో అశ్లీల వీడియోల వ్యామోహంలో పడి ఈ నీచ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది. ఎలా జరిగింది జిల్లా ఎస్పీ ఇశా పంత్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు కోరళ్లిలో నివాసముంటాడు. మొబైల్లో పోర్న్ వీక్షణకు బానిసయ్యాడు. ఘటనా సమయంలో బాలిక బహిర్బూమి కి వెళ్లడం చూసి బాలుడు వెంబడించాడు. అతన్ని చూసి బాలిక పరుగులు తీసినప్పటికీ వెంటాడి చెరుకు తోటలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి రాయితో దాడి చేసి బాలికను హత్య చేశాడు. చదవండి: (Bengaluru: చెరకు తోటలో మూకుమ్మడి అత్యాచారం, హత్య?) ఇంటింటికీ మరుగుదొడ్డి ఉండాలి, మొబైల్‌పై నిఘా ముఖ్యం ఘటన చోటుచేసుకున్న 24 గంటల్లోగా ఆళంద పోలీసులు గాలించి బాలుడిని అరెస్ట్ చేశారు. కేసును ఛేదించిన సిబ్బందికి రూ. లక్ష బహుమానాన్ని ప్రకటించారు. పదిరోజుల్లోగా చార్జిషీట్ వేస్తారని ఎస్పీ తెలిపారు. గ్రామాల్లో ప్రతి ఇంట్లోనూ మరుగుదొడ్డి నిర్మించుకుని ఉపయోగించాలని, పిల్లలు మొబైల్‌ను దుర్వినియోగం చేయకుండా తల్లిదండ్రులు కట్టడి చేయాలని ఆమె సూచించారు. ఈ రెండు విషయాలపై జాగృతి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. -
యూజర్లకు భారీ షాకిచ్చిన యూట్యూబ్.. డబ్బులు చెల్లించాల్సిందేనా!
యూట్యూబ్ ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలను తన వైపు తిప్పుకుని అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫాంగా అవతరించింది యూట్యూబ్. ప్రస్తుతం ఆదాయం పెంచుకునేందుకు అనేక మార్గాలలో ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో యూజర్లపై భారం మోపుతోంది. తాజాగా యూట్యూబ్ మరో బాదుడికి సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. యూజర్లు ఇకపై యూట్యూబ్‌లోని హై క్వాలిటీ వీడియోలు చూడాలంటే పైసలు చెల్లించాల్సి వచ్చేలా ఉంది. ఎలా అని ఓ లుక్కేద్దాం! సమాచారం ప్రకారం.. యూట్యూబ్‌లో 4K రెజుల్యూషన్ వీడియోలను యూజర్లు చూసేందుకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తప్పనిసరి చేసే ప్లాన్‌లో ఉందట. ప్రసుత్తం యూట్యూబ్‌లో యాడ్స్ లేకుండా వీడియోలు చూసేందుకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉండాలి. ఇందుకోసం నెలకు రూ.129, మూడు నెలలకు రూ. 399, సంవత్సరానికి ₹1290 వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరహాలోనే 4k వీడియోలు చూడాలంటే కూడా ప్రీమియం తప్పనిసరి చేయనున్నారని సమాచారం. ప్రస్తుతానికైతే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, యూజర్లలో దీనిపై చర్చ మాత్రం జరుగుతోంది. 4కే వీడియోలు చూడాలంటే యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని తమకు నోటిఫికేషన్స్ వస్తున్నట్టు కొందరు యూజర్లు రెడిట్ ప్లాట్‌ఫాంలో వివరించారు. కొందరు యూజర్లు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. దీని బట్టి చూస్తే త్వరలో యూట్యూబ్‌లో 4కే వీడియోలు ఉచితంగా చూడటం సాధ్యం కాకపోవచ్చు. హై క్వాలిటీ వీడియోలు చూడాలంటే యూట్యూబ్ ప్రీమియం మెంబర్షిప్ తీసుకోవాల్సి వచ్చేలా ఉంది. So, after testing up to 12 ads on YouTube for non-Premium users, now some users reported that they also have to get a Premium account just to watch videos in 4K. pic.twitter.com/jJodoAxeDp — Alvin (@sondesix) October 1, 2022 చదవండి: ఫ్రెషర్స్‌కి భారీ షాక్.. ఐటీలో ఏం జరుగుతోంది, ఆఫర్ లెటర్స్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్! -
మాజీ మంత్రిపై బెదిరింపుల ఆరోపణలు
ముంబై: ఒక మాజీ మంత్రి హిందుమతానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఒక వ్యక్తిని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు ఎదుర్కొటున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ మేరకు ముంబై పోలీసులు సదరు వ్యక్తి ఫిర్యాదు మేరకు మహారాష్ట్ర మాజీ మంత్రి ఛగన్ భుజపాల్, మరో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాదు సదరు వ్యక్తి తాను హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడిన రెండు వీడియోలను ఎన్సీప్ నాయకుడికి పంపించడంతో వారు తనను చంపేస్తానంటూ బెదిరించారని వాపోయాడు. భుజపాల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రస్తుతం నాసిక్ జిల్లాలోని యోలా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేగాదు ఆయ గతంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా సేవలందించారు. (చదవండి: నామినేషన్ సమర్పించిన మరునాడే రాజీనామా చేసిన ఖర్గే) -
చంపడం ఎలా? అని సర్చ్ చేసి మరీ ....
టెక్నాలజీ మన అభివృద్ధికి ఉపయోగపడుతుందో లేదో గానీ వినాశనానికి మాత్రం ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పక తప్పదు. సాంకేతిక సాయంతో మనషులను చంపకునే దారుణ స్థితికి దిగజారిపోతున్నాం. అరచేతిలో ప్రపంచాన్ని అందిపుచ్చుకున్నామని ఆనందపడాలో లేక అది మానవ నాశనానికి స్వయంగా రూపొందించుకున్న మృత్యుపాశమనాలో తెలియడం లేదు. ఎందుకంటే ఇక్కడొక వ్యక్తి భార్యనే చంపేందుకు టెక్నాలజీని వాడాడు. అదికూడా చంపడం ఎలా అని ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మరీ మర్డర్‌కి ప్లాన్ చేశాడు. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.....మధ్యప్రదేశ్‌లోని రాజగఢ్ జిల్లాకి చెందిన బద్రీప్రసాద్ మీనా అప్పులుపాలై సతమతమవుతున్నాడు. ఐతే భార్య ఇన్సురెన్స్ డబ్బలుతో ఆ అప్పులు తీర్చాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. అందుకోసం తన భార్యనే చంపేందుకు పథకం వేశాడు. ఈ మేరకు బద్రీప్రసాద్ చంపడం ఎలా? అని ఇంటర్నెట్లో సర్చ్ చేసి...పలు రకాల వీడియోలు చూసి మరీ స్కెచ్ వేశాడు. ఈ మేరకు అతను తన ముగ్గురు సహచర వ్యక్తుల సాయంతో భార్య పూజాని జులై 26న భోపాల్‌కి సమీపంలోని రహదారిలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐతే బాధిత మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందని చెప్పారు. తొలుత పోలీసుల విచారణలో అతను వారిని తప్పుదోవ పట్టించాడని అన్నారు. అంతేకాదు పోలీసులు తమదైన తరహాలో విచారించేటప్పటికి బద్రీప్రాసద్ తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని అధికారులు చెప్పుకొచ్చారు. ఈ మేరకు పోలీసులు బద్రీప్రసాద్‌తో పాటు, తన సహచరులలో ఒకరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని తెలిపారు. మిగతా ఇద్దరు సహచర వ్యక్తులు పరారీలో ఉన్నారని అన్నారు. (చదవండి: పదే పదే ఆడపిల్లలు పుడుతున్నారని తండ్రి కర్కశం.. కూతుర్ని నేలకేసి కొట్టిన ఆటో డ్రైవర్) -
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. వైరలవుతోన్న వీడియోలు
హైదరాబాద్:►హైదరాబాద్‌లో భారీ వర్షం ముంచెత్తుతోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో జంటనగరాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ క్రమంలో భారీ వర్షాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. Hyderabad's drainage system is definitely on ventilator. Who is stopping @GHMCOnline to remove illegal encroachment on Nalas?@revanth_anumula @KotaNeelima #HyderabadRains pic.twitter.com/7zwUhqtyrF — Nageshwar Rao (@itsmeKNR) July 22, 2022 #Madhapur #Hitechcity#HyderabadRains pic.twitter.com/jPD3FLs3Px — Bicycle Mayor of Hyderabad (@sselvan) July 22, 2022 అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు ఆఫీసులు, వ్యాపారాలు, కాలేజీలు, స్కూళ్లకు వెళ్లేవారికి పలు సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, నగరంలో అక్కడక్కడా భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొన్నది. మరో రెండు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని సూచించింది. Today #HyderabadRains In #Charminar 🌧️🌊 Heavy rain on & off in #Kphb@Hyderabadrains@HYDmeterologist@Rajani_Weather@Weather_AP@APWeatherman96@imdhydofficial@Ravicha18803311@VizagWeather247#HyderabadRains #Hyderabad@SkymetWeather@Windycom@weatherindia pic.twitter.com/sa5hoX0PAE — kishore (@trulykishore) July 22, 2022 src=hash&ref_src=twsrc%5Etfw">#TelanganaRains #TelanganaRain #HyderabadRain #CharminarRain #TelanganaFloods #HyderabadFloods pic.twitter.com/rPvUvoJTZl — SYED SARWAR (@sab_kee_jaan) July 22, 2022 సికింద్రాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, రాజ్‌భవన్ రోడ్డు, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కూకట్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాయదుర్గం, గచ్చిబౌలి, ఫిలింనగర్, నాచారం, మల్లాపూర్, ఈసీఐఎల్, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్, పిర్జాదీగూడ, మేడిపల్లి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, తుర్కయంజాల్, ముషీరాబాద్, చిక్కడపల్లి, విద్యానగర్, రాంనగర్, సికింద్రాబాద్ స్టేషన్, కాచిగూడ, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. #22JULY 1:10PM⚠️ Heavy Rains now in #Kukatpally 🌧️ No Stopping In Rains ,More Rains From Sangareddy Spreading towards #Hyderabad#HyderabadRains pic.twitter.com/k5vYkYSc5V — Hyderabad Rains (@Hyderabadrains) July 22, 2022 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో గురువారం ఉదయం భారీ వర్షం కురవడంతో బాట సింగారం మార్కెట్లో ఫ్రూట్స్ వరదకు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Hardships of traders at Batasingaram Fruit Market#HyderabadRains pic.twitter.com/hhy7oo99dA — Md Nizamuddin (@NizamJourno) July 22, 2022 Heavy Rain lashes at many places in #Hyderabad. Commuters struck in huge traffic jam. #HyderabadRains #Traffic pic.twitter.com/xJCQcumhOK — Vidya Sagar Gunti (@GVidya_Sagar) July 22, 2022 -
రహస్యంగా ప్రేమ జంటల ఫోటోలు, వీడియోలు రికార్డ్.. ఫోన్ లాక్కొని చూడగా..
సాక్షి, సూర్యాపేట జిల్లా: రహస్యంగా ప్రేమజంటల ఫొటోలు, వీడియోలు తీస్తున్న యువకుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్ గ్రామానికి చెందిన రామకృష్ణ చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామ శివారులో వెలసిన శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో పాటు, పరిసర ప్రాంతాల్లో కట్టడాలను చూసేందుకు వస్తున్న ప్రేమ జంటలను రహస్యంగా సెల్ఫోన్లో చిత్రికరిస్తున్నాడు. దీనిని గమనించిన వారు ఫోన్ లాక్కుని చూడగా అందులో అప్పటికే ఇంతకు ముందు తీసిన 40 వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. అక్కడే ఉన్న స్థానికులకు విషయం చెప్పడంతో వారు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. చదవండి: పెళ్లై 40 రోజులు.. ఏమైందో ఏమో.. బయటకు వెళ్తున్నానని చెప్పి! -
ప్రభుత్వ ఆఫీసుల్లో ఫొటోలు, వీడియోలపై నిషేధం
శివాజీనగర: ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ప్రజలు ఫొటో తీయటానికి, వీడియోలు చిత్రీకరించడానికి ఆస్కారం లేకుండా కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ప్రైవేట్ వ్యక్తులు కార్యాలయాల్లోకి వచ్చి ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఉంచుతున్నారు. దీనివల్ల మహిళా ఉద్యోగుల గౌరవానికి భంగం వాటిల్లుతోందని, అనధికారికంగా ఫొటోలు, వీడియోలు తీయకుండా చర్యలు తీసుకోవాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం కూలంకుషంగా పరిశీలించింది. ఇకపై పనివేళల్లో అనధికారికంగా ఫొటోలు, వీడియోలు తీయరాదని ఆదేశిస్తూ సిబ్బంది, పరిపాలనా విభాగం కార్యదర్శి కే.వెంకటేశప్ప ఆదేశాలు జారీచేశారు. గవర్నర్ ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. కాగా చట్టవిరుద్ధంగా ఫొటోలు, వీడియోలు తీసేవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయాన్ని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. -
కీటికిలో నుంచి గుట్టుగా మహిళ ఫొటోలు తీసి..
సాక్షి, హైదరాబాద్: కిటికిలో నుంచి గుట్టుగా మహిళ ఫొటోలు, వీడియోలు తీస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మెట్టుగూడకు చెందిన మహిళా రైల్వే ఉద్యోగి. అదే ప్రాంతానికి చెందిన నవీన్ కిటికి నుంచి ఫొటోలు, వీడియోలు తీస్తున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవీన్‌పై శనివారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. లైంగిక వేధింపులు లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిపై కేసు నమోదు చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సీతాఫల్మండి మేడిబావికి చెందిన వరలక్ష్మి ఓ అపార్ట్మెంట్లో వాచ్‌ఉమెన్‌గా పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన అరవింద్ ఈనెల 16న రాత్రి వెకిలిచేష్టలు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అరవింద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ నరేష్ తెలిపారు. అసభ్య పదజాలంతో మెసేజ్‌లు.. అసభ్యపదజాలంతో వాట్సాప్ మెసేజ్‌లు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నామాలగుండు ఉప్పరిబస్తీకి చెందిన సౌజన్య రాణిగంజ్ హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో టెలికాలర్‌గా పనిచేస్తోంది. కొంతకాలంగా ఓ వ్యక్తి అసభ్యపదజాలంతో మెసేజ్‌లు వీడియోలు పంపిస్తున్నాడు. వాట్సాప్ నంబర్‌ను బ్లాక్ చేస్తే మరో నంబర్ నుంచి పంపిస్తున్నాడు. తగిన ఆధారాలతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ నరేష్ తెలిపారు. చదవండి: ‘నాకు, నా భర్తకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది’