
సాక్షి, చెన్నై: గూగుల్ పే ద్వారా రూ.1000 పంపిన వారికి ఐదు శృంగార వీడియోలు, రూ.1,500 పంపిన వారికి 10 శృంగార వీడియోలను పంపుతామని సెల్‌ఫోన్‌లో ఓ గుర్తు తెలియని మహిళ మాట్లాడారు. దీన్ని తిరస్కరించిన యువకులకు సెల్‌ఫోన్‌లో బెదిరింపులు ఇస్తున్నట్టు తెలిసింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు గుర్తుతెలియని మహిళ కోసం గాలిస్తున్నారు. చెన్నై మదురవాయల్‌కు చెందిన ఉదయరాజ్ (26) ప్రైవేటు సంస్థ ఉద్యోగి. అతన్ని ఫోన్‌లో సంప్రదించిన ఓ మహిళ గూగుల్ పే ద్వారా రూ.100 పంపితే మహిళల చిత్రాలను పంపిస్తామని తెలిపారు. అందుకు ఉదయరాజ్ సమ్మతించలేదు.
ఆ యువతి ఎస్‌ఎంఎస్ పంపారు. ఆమెకు సహాయంగా ఓ వ్యక్తి ఉన్నట్టు తెలిసింది. రూ.1000 పంపితే ఐదు శృంగార వీడియోలు, రూ.1,500 పంపితే 10 శృంగార వీడియోలను పంపిస్తామని తెలిపారు. దీనికి ఉదయరాజ్ సమ్మతించకపోవడంతో ఆ యువతి ఉదయరాజ్‌పై మైలాపూర్ డెప్యూటీ పోలీసు కమిషనర్ వద్ద ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నకలను ఉదయరాజ్‌కు పంపించారు. ఉదయరాజ్ అదే పోలీసుస్టేషన్‌కు తనకు వచ్చిన ఎస్‌ఎంఎస్‌లు, సెల్‌ఫోన్‌లో సంభాషించిన దానిని రికార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి సెల్‌ఫోన్ నెంబరు ఆధారంగా మహిళ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment