తెగ నవ్విస్తున్న రావణ వీడియోలు | Hilarious Dussehra Viral Videos | Sakshi
Sakshi News home page

తెగ నవ్విస్తున్న రావణ వీడియోలు

Published Sun, Oct 13 2024 10:24 AM | Last Updated on Sun, Oct 13 2024 10:24 AM

Hilarious Dussehra Viral Videos

న్యూఢిల్లీ: దేశంలో దసరా సంబరాలు అత్యంత వైభవంగా పూర్తయ్యాయి. నవరాత్రుల్లో వివిధ ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది.  
 

దసరా వేడుకల్లో నిర్వహించిన రావణ దహనానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇవి యూజర్లను తెగ నవ్విస్తున్నాయి.  

ఒక వీడియోలో రావణుని వేషంలో ఉన్న వ్యక్తి గుట్కా తింటున్నట్లు కనిపిస్తాడు. మరో వీడియోలో రావణుడు బుల్లెట్ బైక్‌ను నడుపుతూ కనిపిస్తున్నాడు.

ఇంకొక వీడియోలో రావణ వేషధారి నటి సప్నా చౌదరి పాటకు నృత్యం చేస్తూ కనిపిస్తున్నాడు. ఈ వైరల్ వీడియోలను చూసినవారు మళ్లీమళ్లీ వీటిని చూస్తున్నారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకునే దసరా గడిచిపోయినప్పటికీ, సోషల్ మీడియాలో ఇప్పటికీ దసరా సంబరాలు సందడి చేస్తున్నాయి. ఈ వీడియోలను చూసినవారు తెగ నవ్వుకుంటున్నారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఒక వీడియోలో సీత అపహరణ సమయంలో సన్యాసి వేషంలో వచ్చిన రావణుడు ఒక సినిమాలోని పాటకు నృత్యం చేస్తూ అలరిస్తున్నాడు.

మరో వీడియోలో రావణుని దిష్టిబొమ్మ నోటి నుండి మంటలు వెలువటమే కాకుండా, తలపై నుండి నిప్పులు  ఎగజిమ్మడం ఎంతో ఫన్నీగా కనిపిస్తుంది. 
 

ఇది కూడా చదవండి: తిరుమల శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement