Hyderabad Heavy Rains Videos Viral On Social Media - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. వైరలవుతోన్న వీడియోలు

Published Fri, Jul 22 2022 3:22 PM | Last Updated on Fri, Jul 22 2022 6:34 PM

Hyderabad Heavy Rains Videos Viral On Social Media - Sakshi

హైదరాబాద్:►హైదరాబాద్‌లో భారీ వర్షం ముంచెత్తుతోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో జంటనగరాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి.  రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఈ క్రమంలో భారీ వర్షాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.

అప్రమత్తమైన ట్రాఫిక్‌ పోలీసులు ఆఫీసులు, వ్యాపారాలు, కాలేజీలు, స్కూళ్లకు వెళ్లేవారికి పలు సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, నగరంలో అక్కడక్కడా భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొన్నది. మరో రెండు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని సూచించింది. 

src=hash&ref_src=twsrc%5Etfw">#TelanganaRains #TelanganaRain #HyderabadRain #CharminarRain #TelanganaFloods #HyderabadFloods pic.twitter.com/rPvUvoJTZl

— SYED SARWAR (@sab_kee_jaan) July 22, 2022

సికింద్రాబాద్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, రాజ్‌భవన్‌ రోడ్డు, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కూకట్‌పల్లి, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, రాయదుర్గం, గచ్చిబౌలి, ఫిలింనగర్‌, నాచారం, మల్లాపూర్‌, ఈసీఐఎల్‌, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, రామంతపూర్‌, ఉప్పల్‌, బోడుప్పల్‌, పిర్జాదీగూడ, మేడిపల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, తుర్కయంజాల్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, విద్యానగర్‌, రాంనగర్‌, సికింద్రాబాద్‌ స్టేషన్‌, కాచిగూడ, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో  గురువారం ఉదయం భారీ వర్షం కురవడంతో బాట సింగారం  మార్కెట్‌లో ఫ్రూట్స్‌ వరదకు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement