heavy rains in hyderabad
-
అతి భారీ వర్షాలు.. ట్యాంక్‌బండ్ వద్ద వరద ఉధృతి పరిశీలించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో హైదరాబాద్ తాజా పరిస్థితిపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుంచి పురపాలకశాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదే విధంగా హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని మంత్రి పరిశీలించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా పని చేయాలని సూచించారు. అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపైన అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వరద నీరు నిలిచిన పట్టణాల్లో మరిన్ని సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. శిథిల భవనాల నుంచి జనాలను వెంటనే తరలించాలని ఆదేశించారు. గత ఏడాదితో పోలిస్తే ఆయా ప్రాంతాల్లో వరద సమస్య తగ్గిందన్నారు. మూసీ వరదను మానిటర్ చేస్తున్నాం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. పురపాలకశాఖ అధికారులతోనూ కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారని తెలిపారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. మూసీ వరదను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని తెలిపారు. వరద ప్రభావం కొంత తగ్గింది కుంభవృష్టిగా, ఎడతెరిపి లేకుండా వర్షం పడటం వలన ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురవుతుందని, పలు కాలనీల్లో మాత్రం తాత్కాలికంగా వరదనీరు వచ్చి చేరిందని అన్నారు. నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గిందన్నారు. తమ ప్రధాన లక్ష్యం ప్రాణ నష్టం జరగకుండా చూడమేనని స్పష్టం చేశారు. వాళ్ల సెలవులు రద్దు హైదరాబాద్ నగరంలోనూ జీహెచ్ఎంసీ కమిషనర్ సహా ఇతర ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్న కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ పనిచేస్తున్నారని తెలిపారు. పురపాలక ఉద్యోగుల అన్ని సెలవులు రద్దు చేసినట్లు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సాధ్యమైన ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 135 చెరువులకు గేట్లు బిగించాం హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. హైదరాబాద్ నగరంలో డిసిల్టింగ్ కార్యక్రమాన్ని ఎప్పుడో పూర్తి చేశాం. దీంతోపాటు చెరువుల బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాము. 135 చెరువులకు గేట్లు బిగించాం. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అధికారులు సిబ్బంది కూడా విస్తృతంగా పనిచేస్తున్నారు ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది గతంలో ఇలాంటి భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేది. అయితే ఈసారి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గింది. ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాని . భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయవద్దు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు వర్షాన్ని ఎదుర్కొనేందుకు పనిచేస్తున్నాయి. వారి మనో ధైర్యం దెబ్బతినకుండా నాయకులు మాట్లాడితే బాగుంటుంది. చెరువులకు గండి పడే ప్రమాదం వరద పెరిగే ప్రాంతాల్లో ఉన్న పౌరులను అలర్ట్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నాం. చెరువులకు గండి పడే ప్రమాదం ఉంటే వాటిని కూడా సమీక్షిస్తున్నాం. వర్షాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటాం. వరంగల్ నగరానికి వెళ్లాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించాము. అవసరమైతే రేపు నేను కూడా స్వయంగా వెళ్తాను’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. -
హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడగా మరికొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మియాపూర్, రాయదుర్గం, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి, సురారం, గాజులరామారం, కూకట్పల్లి, చింతల్, బాలానగర్, నార్సింగి, కోకాపేట్, కొండాపూర్, కొంపల్లి, అల్వాల్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, లింగంపల్లి, నిజాంపేట, నేరెడ్‌మెట్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. View in Gachibowli pic.twitter.com/3Ume7WqYOL — Suman Amarnath (@sumanva) June 4, 2023 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, రామచంద్రపురం, అమీన్పూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుండగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ నగరంలో వాన దంచికొడుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. Heavy winds and rains in Gachibowli side of Hyderabad. pic.twitter.com/GhC2msC98D — N Jagannath Das_TT (@dassport_TT) June 4, 2023 మరోవైపు తెలంగాణలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సూచనలున్నాయని పేర్కొంది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానపడే అవకాశాలున్నాయని, మిగతా చోట్ల అక్కడక్కడ జల్లులు కురుస్తాయని తెలిపింది. Storm! #Hyderabad #Hyderabadrains pic.twitter.com/AUbuVyhlmv — krishna karthik (@krishnakarthik1) June 4, 2023 @balaji25_t @HYDWeatherMan HeavyRains at alwal #Hyderabad #Rains pic.twitter.com/G2SacYLIbM — Mahesh MK (@ursmaheshmk) June 4, 2023 -
హైదరాబాదీలకు అలర్ట్.. ఈదురు గాలులతో భారీ వర్షం..
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మెహదీపట్నం, మణికొండ, షేక్ పేట్, మాసబ్ ట్యాంక్, టోలిచౌకి, అత్తాపూర్, రాజేంద్రనగర్‌లో వర్షం కురుస్తోంది. కొన్నిచోట్ల ఈదురు గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 16 వరకు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏడు గంటల పాటు ఆ రూట్లు బంద్ -
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం
సాక్షి, హైదరాబాద్: నగరంలో సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారింది. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, ముసాపేట్, నాంపల్లి, లక్డీకపూల్, దిల్‌సుఖ్‌నగర్‌లో వర్షం పడింది. వర్షానికి రోడ్లు జలమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో కార్యాలయాల నుంచి ఇంటికి బయలుదేరిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉరుములు, మెరుపులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదవండి: బండి సంజయ్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు -
నైరుతి బంగాళాఖాతంలో మాండూస్ అల్లకల్లోలం
-
ఇది బెంగళూరు కాదు సార్.. హైదరాబాదే!
వైరల్: నగరంలో బుధవారం రాత్రి కురిసిన జడివాన.. రోడ్లను జలమయం చేసేసింది. మరోవైపు వరద నీరు, డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వీధులన్నీ చెరువులను తలపించాయి. చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు చేరుకుని.. నగర వాసులు నానా ఇబ్బందులు పడ్డారు. చాలాచోట్ల ద్విచక్ర వాహనాలు, ఆటోలు కొట్టుకుని పోగా.. మరికొన్ని చోట్ల కార్లు, ఆటోలు నీట మునిగి పాడైపోయాయి. ఇక హైదరాబాద్ వరదలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. గతంలో హైదరాబాద్ వరదలపై బీజేపీ నేతలు సెటైర్లు వేయడాన్ని ఉద్దేశిస్తూ.. మొన్న బెంగళూరు వరదలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటర్‌గా స్పందించిన సంగతి తెలిసిందే. మన నగరాలు రాష్ట్రాలకు ఆర్థిక ఇంజిన్ల లాంటివి. అవి దేశ వృద్ధిని నడిపిస్తాయి. అర్బనైజేషన్ (పట్టణీకరణ), సబ్-అర్బనైజేషన్ వేగవంతంగా జరుగుతున్న వేళ.. అందుకు తగినట్లు నగరాలను అప్‌గ్రేడ్ చేసేందుకు తగినంత పెట్టుబడులు కేటాయించకపోతే మౌలిక వసతులు కుప్పకూలిపోతాయిపట్టణ ప్రణాళిక పాలనలో మనకు సంస్కరణలు చాలా అవసరం అంటూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని ట్యాగ్ చేశారు కేటీఆర్. అయితే బెంగళూరు ఏకధాటి వర్షాల కంటే.. ఇప్పుడు ఒక్కరాత్రిలో అదీ కొన్నిగంటలపాటు కురిసిన వర్షానికి రోడ్లు జలమయం కావడంపై సెటైర్లు పేలుస్తున్నారు కొందరు నెటిజన్లు. చిన్నపాటి వర్షానికే మునిగిపోయే హైదరాబాద్ రోడ్లను ఎందుకు బాగు చేయటం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని పక్కరాష్ట్రాలకు బోధిస్తున్న మంత్రి కేటీఆర్.. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో రోడ్లు, డ్రైనేజీల దుస్థితి గురించి ఏం చేస్తున్నారంటూ వీడియోలతో సహా నిలదీస్తున్నారు. ఇది బెంగళూరు, అహ్మదాబాద్, ఏ వెనిసో అంతేకంటే కాదని.. హైదరాబాదేనని.. ముందు ఇక్కడి సంగతి చూడాలంటూ సెటైర్లు పేలుస్తున్నారు. #ktr #KCR congratulations for bringing river in Hyderabad. CM wants to be PM.@bandisanjay_bjp @Sagar4BJP @TigerRajaSingh #BRSParty https://t.co/4SI1V5PkBb — Bhanu Charan (@nirvaanbeta) October 13, 2022 Singapore, Dallas, Istanbul 👇👇 #HyderabadRains #TwitterTillu https://t.co/Mc0pnunCO0 — PNR (@PNR2043) October 13, 2022 @KTRTRS - saying again, pehle Hyd dekho, Ahmedabad nahi #HyderabadRains https://t.co/L06dVhALn0 — Nikhil Surana (@Nikhil2707) October 13, 2022 Situation out of Control.. Washed Away in Seconds... #HyderabadRains pic.twitter.com/ImEnyOYeB0 — Laddu_9999🇮🇳🇮🇳 (@Laddu_9999) October 13, 2022 Hyderabad Mayor's Have Changed But No changes against Monsoon.. No Action plan accordingly since Year's They are Discussing But No solution.. See the Two Wheeler How He Flushed Out.. #HyderabadRains pic.twitter.com/z6VBtTAa1L — Laddu_9999🇮🇳🇮🇳 (@Laddu_9999) October 13, 2022 Visuals from last night. Many vehicles washed away in Borabanda n at Yousufguda #Hyderabad after continuous #Rain for couple of hours. #HyderabadRains pic.twitter.com/o83T4wkzHu — Nellutla Kavitha (@iamKavithaRao) October 13, 2022 Hyderabad to Venice in one day! Development I must say! Thank you @KTRTRS You didn't make it Dallas but Venice is fine.. 🤣🤣🤣#HyderabadRains https://t.co/AwGxZGPST7 — Chinnu Rao.. #ProudHindu 🇮🇳 (@bubblebuster26) October 13, 2022 Terrible visuals of rain water lashing away vehicles coming in from Borabanda and Yousufguda area #HyderabadRains #hyderabad pic.twitter.com/IzT4Oe5Mvf — Siraj Noorani (@sirajnoorani) October 12, 2022 Situation at Meenakshi Enclave, #Suchitra 1.30am Flooded after a moderately heavy rainfall in #Hyderabad. ⛈️⛈️☔️#HyderabadRains #Telangana pic.twitter.com/nguQSPyeRN — Siraj Noorani (@sirajnoorani) October 12, 2022 అన్నా @trsharish ఒక పదివేల బోట్లు హైదరాబాద్ ప్రజలకు ఇవ్వు అన్నా.... Cc @nazir28 #HyderabadRains https://t.co/JzT3sMahXC pic.twitter.com/ZgxwnBNWwS — 🇰 🇰 🇷 (@KKMUSK_003) October 13, 2022 -
HYD: హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వాన
సాక్షి, హైదరాబాద్: నగరంలో వర్షం మళ్లీ మొదలైంది. పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, యూసఫ్‌గూడ, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, ఉప్పల్, బోడుప్పల్, బేగంపేట్, సికింద్రాబాద్, ఆల్వాల్.. ఇలా చాలా చోట్ల సోమవారం పొద్దుపొద్దున్నే చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వాన పడుతోంది. ఆకాశం భారీగా మేఘావృతం అయి ఉండడంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. దసరా సెలవుల తర్వాత విద్యాసంస్థలు మొదలు అవుతుండడం, మరోవైపు ఆఫీస్ వేళలు కావడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం సైతం ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. శనివారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం.. నగరాన్ని ముంచెత్తింది. అయితే ఆదివారం కాస్త ఉపశమనం ఇవ్వడంతో వరుణుడి గండం తొలగిందని అంతా అనుకున్నారు. అయితే.. మరో రెండు రోజులపాటు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్ష ప్రభావం కనిపిస్తోంది. కామారెడ్డి, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు అధికారులు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
ఈదురుగాలులతో హైదరాబాద్‌లో జోరు వాన
సాక్షి, హైదరాబాద్: అల్పపీడన ప్రభావం మరోసారి నగరంపై పడింది. బుధవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో.. ఉరుములు మెరుపులతో భారీ వర్షం దంచికొడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, యూసఫ్‌గూడ్, కూకట్పల్లి.. ఇలా చాలా చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించడం.. వీటి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఈ ప్రభావం కొనసాగవచ్చని తెలుస్తోంది. -
Hyderabad: ముంచెత్తిన జోరు వాన.. వరద నీటిలో చిన్నారుల ఈత
సాక్షి, హైదరాబాద్: హోరెత్తిన వాన నగరాన్ని వణికించింది. చినుకులా రాలి వరదలా మారి జడిపించింది. ఉరుములు, మెరుపులతో హడలెత్తించింది. వరుణుడు విరుచుకుపడ్డాడు. సాయంత్రం మొదలైన వర్ష బీభత్సం అర్ధరాత్రి వరకూ తన ప్రతాపం చూపించింది. ఈ సీజన్లోనే అతి భారీగా కురిసి సిటీజనుల్ని గడగడలాడించింది. రహదారులపై వరద వెల్లువలా పారింది. ఎక్కడి వాహనాలు అక్కడే కిలోమీటర్ల మేర నిలిచిపోయి నరకాన్ని తలపించింది. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సుమారు గంట వ్యవధిలో పలు చోట్ల 5 సెంటీ మీటర్ల మేర కురిసిన జడివానతో నగరం చిగురుటాకులా వణికిపోయింది. గోల్కొండ కోట పరిసరాల్లో కురుస్తున్న వర్షం జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ విభాగాలు హైఅలర్ట్ ప్రకటించాయి. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని హెచ్చరికలు జారీ చేశాయి. ముంపు సమస్యలపై బల్దియా కాల్‌సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వరద నీరు వెళ్లేందుకు మ్యాన్‌హోల్ మూతలను తెరవరాదని జలమండలి సూచించింది. సాయంత్రం వేళ వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు,విద్యాసంస్థల నుంచి బయటకు వెళ్లిన వారు సుమారు నాలుగు గంటల పాటు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. సోమవారం రాత్రి 10 గంటల వరకు గోషామహల్ సర్కిల్ నాంపల్లిలో అత్యధికంగా 9.5, కార్వాన్ పరిధిలోని టోలిచౌకీలో అత్యల్పంగా 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. చిన్నారుల ఈత హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడ చూసిన వరద నీరే కనిపించింది. మల్లేపల్లి వద్ద రోడ్డుపై భారీగా వరద నీరు చేరడంతో ఇద్దరు చిన్నారులు అందులోనే ఈతకొట్టారు. రోడ్డుపై వాహనాలు వెళ్తున్న చిన్నారులు ఈత కొట్టడం విశేషం.. ఈ వీడియో తాజాగా వైరల్‌గా మారింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Boys having fun in the #Rain Water Flowing on the road at #Mallepally #HyderabadRains pic.twitter.com/dhtZ0zmLK7 — BNN Channel (@Bavazir_network) September 26, 2022 Heavy downpour in Osman Gunj after rain lashed parts of #Hyderabad city. #HyderabadRains pic.twitter.com/t0DRdcF2pl — Sowmith Yakkati (@sowmith7) September 26, 2022 మునిగిన సెల్లార్లు.. మియాపూర్ నుంచి ఎల్బీనగర్, జేబీఎస్– ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం మూడు మెట్రో రూట్లలోనూ ట్రాఫిక్ రద్దీ కనిపించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వందలాది బస్తీలు నీటమునిగాయి. ఇళ్లలోకి చేరిన వరదనీటిని తొలగించేందుకు బస్తీల వాసులు నానా అవస్థలు పడ్డారు. పలు అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి వరదనీరు చేరడంతో స్థానికులు బెంబేలెత్తారు. జీహెచ్ఎంసీ, జలమండలి అత్యవసర విభాగాలు రంగంలోకి దిగి వరద నీటిని తోడాయి. వరద నీటి చేరికతో నగరంలోని సుమారు 1500 కి.మీ మార్గంలో ఉన్న ప్రధాన నాలాలు ఉద్ధృతంగా ప్రవహించాయి. రానున్న 24 గంటల్లో నగరంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. మెహిదీపట్నం ఎన్ఎండీసీ వద్ద ట్రాఫిక్‌జాం #KCR sir first take care of ur state and then dream of becoming #PrimeMinister 1 hr #Rain and all the so called world class infrastructure is in water 🙄🙄🙄@KTRTRS @ysathishreddy #Telangana @GadwalvijayaTRS #HyderabadRains pic.twitter.com/qHIKCnSWIM — MERUGU RAJU (@MR4BJP) September 26, 2022 ఈ ప్రాంతాల్లో బీభత్సం.. నగరంలో జడివాన పలు చోట్ల బీభత్సం సృష్టించింది. ప్రధానంగా నాంపల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లక్డీకాపూల్, నాంపల్లి, ట్యాంక్‌బండ్, రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్, కిస్మత్పూర్, అత్తాపూర్, మణికొండ, నార్సింగి, కాటేదాన్, లంగర్‌హౌజ్, గోల్కొండ, కార్వాన్, మెహిదీపట్నం, జియాగూడ ప్రాంతాల్లో జడివాన కారణంగా ప్రధాన రహదారులు, కాలనీలు, బస్తీలు చెరువులను తలపించాయి. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, భోలక్‌పూర్, కవాడీగూడ, గాంధీనగర్, జవహర్‌నగర్, రాంనగర్, దోమలగూడ, చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, బార్కాస్, ఫలక్‌నుమా, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్ ప్రాంతాల్లోనూ జడివాన సాధారణ జనజీవనాన్ని స్తంభింపజేసింది. మూసారంబాగ్ బ్రిడ్జిని ముంచెత్తిన వరద మూసారంబాగ్ బ్రిడ్జిపై నిలిచిన వరదనీరు మలక్‌పేట: భారీ వర్షం కారణంగా మూసారంబాగ్ బ్రిడ్జిపై వరదనీరు చేరింది. ట్రాఫిక్‌జాం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది, మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు చేపట్టారు. గోల్నాక వాహేద్‌నగర్ బ్రిడ్జి నుంచి దిల్సుఖ్నగర్ వైపు వచ్చే వాహనాల రాకపోకల రద్దీ పెరగడంతో ట్రాఫిక్‌కు ఇక్కట్లు తప్పలేదు. బేగంపేట్ ఫ్లైఓవర్‌పై నిలిచిన వరదనీరు విద్యుత్ సరఫరాకు అంతరాయం నగరంలో ఈదురు గాలితో కూడిన భారీ వర్షానికి గ్రేటర్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. హబ్సిగూడ, సరూర్‌నగర్, బంజారాహిల్స్ సర్కిళ్ల పరిధిలో 100కు పైగా పీడర్లు ట్రిప్ అయ్యాయి. మలక్‌పేట్, హబ్సిగూడలో చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడటంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని చోట్ల 30 నుంచి 40 నిమిషాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగా మరికొన్ని చోట్ల అర్ధరాత్రి తర్వాత కూడా సరఫరా లేకపొవడంతో ఆయా ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. వీధుల్లో కరెంట్ లైట్లు వెలగకపోవడంతో నీరు నిలిచిన లోతట్టు ప్రాంతాల్లో వెళ్లే వాహనదారులు మ్యాన్‌హోళ్లలో చిక్కుకుని ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కరెంటు లేకపోవడంతో మరోవైపు దోమలు కంటి మీద నిద్ర లేకుండా చేశాయి. గోల్కొండ కోటలో బతుకమ్మ పేర్చిన ప్లేట్లను తలలపై పెట్టుకున్న మహిళలు మెట్రో రైళ్లు కిక్కిరిసి మరోవైపు క్యాబ్‌లు, ఆటోలు బుక్ కాకపోవడంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో అందరూ మెట్రోను ఆశ్రయించడంతో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి. -
కుండపోత వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం
-
అలర్ట్: మరో మూడు రోజులు భారీ వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. మరికొన్ని చోట్ల ఇంకా వర్షప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక కుండపోత వర్షంతో రాజధాని హైదరాబాద్.. జంట నగరం సికింద్రాబాద్లు అతలాకుతలం అయ్యాయి. ఎటు చూసినా నగర జీవనం అస్తవ్యస్తంగా కనిపించింది. రెండు గంటల్లో.. దాదాపు 10 సెం.మీ. మేర కురిసింది వాన. మోకాళ్ల లోతు నీరు ఎటు చూసినా నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు భారీగా ట్రాఫిక్‌ఝామ్ కాగా.. కిలోమీటర్ దూరం దాటేందుకు గంటకు పైగా ఎదురు చూడాల్సి వస్తోంది. రంగారెడ్డి, శంషాబాద్ మండలాల్లోనూ భారీ వర్షాల ప్రభావం కనిపించింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంతో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయ్యింది. మూసీకి వరద నీరు పోటెత్తడంతో అంబర్‌పేట మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు చేరింది. ఖైరతాబాద్-పంజాగుట్ట మార్గంలో ట్రాఫిక్‌జామ్ భారీగా అయ్యింది. చాలాచోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. వర్షం మొదలైన కాసేపటికే పరిస్థితిని అంచనా వేసిన అధికారులు ప్రయాణాన్ని రెండు గంటలపాటు వాయిదా వేసుకోవాలంటూ ట్రాఫిక్ పోలీసులు ముందస్తుగానే వాహనదారులకు సూచించడం తెలిసిందే. నగరంలో.. నాంపల్లిలో అత్యధికంగా 9.2 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. అలాగే.. ఎల్బీ స్టేడియం పరిసరాల్లో 8.6. ఖైరతాబాద్ 7.5 సెం.మీ. సరూర్‌నగర్ 7.2 సెం.మీ. రాజేంద్రనగర్‌లో 6.4 సెం.మీ, మెహదీపట్నంలో 4.5 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం
-
హైదరాబాద్‌లో భారీ వర్షం
-
హైదరాబాద్‌లో మళ్లీ కుంభవృష్టి.. ద్రోణి ప్రభావంతో దంచికొట్టిన వాన
సాక్షి, హైదరాబాద్: ఉత్తర– దక్షిణ ద్రోణి ప్రభావంతో నగరంలో పలు ప్రాంతాల్లో మళ్లీ కుంభవృష్టి కురిసింది. సాయంత్రం వేళ ఒక్కసారిగా కురిసిన కుండపోతతో పలు కూడళ్ల వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ప్రధానంగా కూకట్పల్లి, మూసాపేట్, అమీర్‌పేట్, సోమాజిగూడ, పంజాగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, నాంపల్లి, లక్డికాపూల్, అబిడ్స్, బషీర్‌బాగ్, నారాయణగూడ, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, కోఠి, చాదర్‌ఘాట్, మలక్‌పేట్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై వరదనీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. మూసీలో కొనసాగుతున్న వరద ప్రవాహం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు వరదనీరు పోటెత్తుతోంది. దీంతో జలాశయాలకున్న పలు గేట్లను తెరచి మూసీలోకి వరదనీటిని వదిలిపెడుతున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు గండిపేట్ జలాశయంలోకి వెయ్యి క్యూసెక్కుల వరదనీరు చేరగా..4 గేట్లను 4 అడుగుల మేర తెరచి 1500 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టారు. హిమాయత్‌సాగర్‌లోకి 600 క్యూసెక్కుల వరద నీరు చేరగా.. రెండు గేట్లను ఒక అడుగు మేర తెరచి 660 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టినట్లు జలమండలి ప్రకటించింది. మౌలాలి డివిజన్లో.. గౌతంనగర్: భారీ వర్షం కారణంగా మౌలాలి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మౌలాలి దర్గా, పాత మౌలాలి, సాదుల్లానగర్, షఫీనగర్, భరత్‌నగర్, లక్ష్మీనగర్, సుధానగర్ తదితర కాలనీలు నీటి మునిగాయి. మల్కాజిగిరి,ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ల పరిధిలోని పలు కాలనీల్లో నాలాలు నిండి రహదారులపై వర్షం నీరు ఏరులై పారింది. సర్కిల్ పరిధిలోని ఎమర్జెన్సీ బృందాలు, కార్పొరేటర్లు సహాయక చర్యలు చేపట్టారు. పోలీస్ కంట్రోల్ రూం ఎదురుగా.. సాక్షి, సిటీబ్యూరో: ఉత్తర– దక్షిణ ద్రోణి ప్రభావంతో నగరంలో పలు ప్రాంతాల్లో మళ్లీ కుంభవృష్టి కురిసింది. సాయంత్రం వేళ ఒక్కసారిగా కురిసిన కుండపోతతో పలు కూడళ్ల వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ప్రధానంగా కూకట్పల్లి, మూసాపేట్, అమీర్‌పేట్, సోమాజిగూడ, పంజాగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, నాంపల్లి, లక్డికాపూల్, అబిడ్స్, బషీర్‌బాగ్, నారాయణగూడ, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, కోఠి, చాదర్‌ఘాట్, మలక్‌పేట్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై వరదనీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. మూసీలో కొనసాగుతున్న వరద ప్రవాహం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు వరదనీరు పోటెత్తుతోంది. దీంతో జలాశయాలకున్న పలు గేట్లను తెరచి మూసీలోకి వరదనీటిని వదిలిపెడుతున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు గండిపేట్ జలాశయంలోకి వెయ్యి క్యూసెక్కుల వరదనీరు చేరగా..4 గేట్లను 4 అడుగుల మేర తెరచి 1500 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టారు. హిమాయత్‌సాగర్‌లోకి 600 క్యూసెక్కుల వరద నీరు చేరగా.. రెండు గేట్లను ఒక అడుగు మేర తెరచి 660 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టినట్లు జలమండలి ప్రకటించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, అమీర్‌పేట్, మాదాపూర్, జీడిమెట్ల, లింగంపల్లి, గచ్చిబౌలి, కూకట్పల్లి, మారేపల్లి, కంటోన్మెంట్ ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. అదే విధంగా హబ్సిగూడ, ఓయూ, నాచారం, అంబర్‌పేట, సికింద్రాబాద్, తార్నాక, కుత్బుల్లాపూర్, సురారం, చింతల్, గాజుల రామారం, కొంపల్లి బహూదూర్ పల్లి, షాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. చదవండి: క్యాబ్ లేదా ఆటో రైడ్ బుకింగ్ చేస్తున్నారా? చేతిలో నగదు లేదా? Rain is getting more and more intense at Hafeezpet, hi-tech City, Novotel #Hyderabad #HyderabadRains #TelanganaRains @HiHyderabad @WeatherRadar_IN @SkymetWeather @weatherindia @balaji25_t @Hyderabadrains @Rajani_Weather @HydWatch @HYDmeterologist @TS_AP_Weather @Hyderabad_Bot pic.twitter.com/kbfpbW8qPW — Jeethendra Kumar (@iam_jeeth) August 1, 2022 Heavy Downpour Now⛈️ Jeedimetla. pic.twitter.com/Ooi06U60gG — Hyderabad Rains (@Hyderabadrains) August 1, 2022 -
హైదరాబాద్‌లో మరోసారి దంచికొట్టిన వర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం దంచికొడుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో మొదలైన వాన ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎస్ఆర్ నగర్, కూకట్‌పల్లిలో కుండపోత వర్షం కురుస్తోంది. గండిపేట, బండ్లగూడ, రాజేంద్రనగర్, గచ్చిబౌలి,షేక్‌పేట, మణికొండలోనూ వాన కుమ్మేస్తోంది. వరద నీటితో రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా గతకొన్నిరోజుల నుంచి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. నేడు మరోసారి భారీ వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Heavy rain at Punjagutta.@HiHyderabad @swachhhyd @balaji25_t @Rajani_Weather @RajenderPHP @PANDARAJATH @sai_koushika @aSouthIndian @puducherri @NallulaHere @GHMCOnline #HyderabadRains pic.twitter.com/ZyPjeWwWZF — Amar⚡ (@amartadi) July 31, 2022 Huge rain at budvel Rajendranagar since 30 mints @Hyderabadrains @balaji25_t pic.twitter.com/Js441CZsBA — L Tarun Kumar (@LTarunKumar1) July 31, 2022 -
భాగ్యనగరంలో కురుస్తున్న భారీ వర్షం
-
TS: రానున్న 2 రోజుల్లో అతి భారీ వర్షాలు.. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: వదలని వాన వణికిస్తోంది. రాష్ట్రంలో రెండ్రోజులుగా నమోదవుతున్న వర్షాలతో ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తమవుతుండగా.. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పది జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. శనివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 5.16 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక విభాగం వెల్లడించింది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 16.76 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో శనివా రం వరకు రాష్ట్రంలో 30.46 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, రెట్టింపునకు పైగా 63.66 సెంటీమీ టర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలి పింది. సాధారణ వర్షపాతం కంటే 109% అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 9 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. కొనసాగుతున్న ఉపరితలద్రోణి రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసా గుతోంది. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి కొమరన్ ప్రదేశం వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి స్థిరంగా కొనసా గుతోంది. ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరి తల అవర్తనం ఈ రోజు ఇంటీరియర్ ఒడిశా దాని పరిసర ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్‌లలో కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రబావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. నిరంతరం అప్రమత్తం: సీఎస్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తతతో ఉండాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. శనివా రం ఆయన విపత్తుల నిర్వహణ శాఖ కార్య దర్శి రాహుల్ బొజ్జతో కలసి జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరసగా వస్తున్న రెండురోజుల సెలవులను ఉపయో గించుకోకుండా పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎస్ ఆదేశించారు. రెడ్ అలర్ట్ జిల్లాలు: ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వరంగల్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనుమకొండ ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు: నల్లగొండ, జనగామ, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ చదవండి: భారీ వర్షాలు, వరదలపై ప్రజలకు సీఎం కేసీఆర్ హెచ్చరిక -
భారీ వర్షాలు, వరదలపై ప్రజలకు సీఎం కేసీఆర్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ శనివారం అత్యవసర సమీక్ష చేపట్టారు. మొన్నటికంటే ఎక్కువ వరదలు వచ్చే ప్రమాదముందని తెలిపిన సీఎం.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరోసారి ఎగువనుంచి గోదావరిలోకి భారీ వరద వచ్చే అవకాశం ఉందని, దీంతో గోదావరి పరివాహక జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఇది పరీక్షా సమయమని, కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు సంబంధిత అన్నిశాఖల అధికారులు వారి ఉద్యోగ కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మొన్నటిలాగే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్యశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, మిషన్ భగీరథ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు యంత్రాంగాన్ని కిందిస్థాయి పోలీస్ స్టేషన్ల వరకు ఎస్ఐ, సీఐలతోపాటు, పోలీసు సిబ్బందిని హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని వర్షాలు, వరదలు, చెరువుల పరిస్థితిపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జలమండలి ఎం.డి. దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తదితరులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నీటిపారుదలశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గోదావరి ప్రవాహాన్ని, శ్రీరాంసాగర్ నుంచి కడెం వరకు ప్రాజెక్టుల పరిస్థితులను, వరదలు ఎట్లా వస్తున్నాయనే విషయాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు. భారీ వర్షాలతో గోదావరి నదీ ప్రవాహం ఎస్సారెస్పీ నుంచి, కడెం నుంచి వస్తున్న ప్రవాహాలను, గంట గంటకూ మారుతున్న వరద పరిస్థితిని శాటిలైట్ ఆధారంగా రికార్డు చేసే విధానాన్ని ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ సీఎంకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు. చదవండి: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. కొత్తగా 13 మండలాలు వాతావరణ హెచ్చరికలను ఆధారం చేసుకొని, కురవబోయే భారీ వర్షాల వల్ల సంభవించే వరదను ముందుగానే అంచనా వేస్తే.. లోతట్టు ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు చర్యల కోసం ఈ టెక్నాలజీని వినియోగించుకోవచ్చని రజత్ కుమార్ వివరించారు. వాతావరణ శాఖ వానలను అంచనా వేస్తుంది. కానీ తద్వారా వచ్చే వరద ముప్పును పసిగట్టలేక పోతుందని, ఈ టెక్నాలజీతో వరద ముప్పును కూడా అంచనా వేయవచ్చని రజత్ కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. -
హైదరాబాద్: నిండుకుండలా హుస్సేన్ సాగర్
-
హైదరాబాద్: కాలువని తలపిస్తోన్న నిజాంపేటలోని బండారిలేఔట్
-
తెలంగాణలో మరో మూడ్రోజులపాటు జోరువానలు
-
దంచికొట్టిన వాన
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నగరంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం కురిసింది. సాధారణ జనజీవనం స్తంభించింది. రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా హఫీజ్‌పేట్‌లో 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు వర్షం ధాటికి విలవిల్లాడారు. వర్షబీభత్సానికి సుమారు 200కు పైగా బస్తీలు నీటమునిగాయి. ఇళ్లలోకి చేరిన వరదనీటితో పలు బస్తీలవాసులు నరకయాతన అనుభవించారు. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. వర్షపునీటిలో వాహనాలు భారంగా ముందుకు కదిలాయి. ఉదయం, సాయంత్రం వేళ కురిసిన వర్షంతో ప్రధాన రహదారులపై వంద కూడళ్లలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. నగరంలోని పలు చెరువులు, కుంటలు ఉప్పొంగాయి. వీటికి ఆనుకొని ఉన్న బస్తీల వాసులు బిక్కు బిక్కుమంటూ గడిపారు. జంటజలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు చేరడంతో గండిపేట్ జలాశయానికి ఉన్న గేట్లలో రెండు గేట్లు, హిమాయత్‌సాగర్ ఒక గేటు తెరచి వరదనీటిని మూసీలోకి వదిలారు. రాగల 24 గంటల్లో నగరంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఈ నెల 8 నుంచి 22 వరకు భారీగా వర్షపునీరు నిలిచిన ఘటనలపై బల్దియా కాల్ సెంటర్‌కు 1456 ఫిర్యాదులందినట్లు జీహెచ్ఎంసీ వర్గాలు తెలిపాయి. ఉప్పొంగే మురుగు సమస్యలపై గురువారం జలమండలికి 500కు పైగా ఫిర్యాదులందాయి. అత్యవసర బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో నగరంలో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. గత వారం వరుసగా ఐదారు రోజులు వర్షాలు కురవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మధ్యలో రెండు మూడు రోజులు తెరిపివ్వగా..శుక్రవారం వాన దంచికొట్టింది. దీంతో మళ్లీ వాన కష్టాలు యథావిధిగా నగరవాసిని దెబ్బతీశాయి. నీటమునిగిన కాలనీలు, బస్తీలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో కాలనీలు, బస్తీలు నీటమునిగాయి. సూరారం శ్రీరాంనగర్ ప్రాంతం చెరువును తలపించింది. జీడిమెట్ల డివిజన్ మీనాక్షి కాలనీ ప్రాంతంలో నాలా పనులు నిలిచి పోవడంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు అంగడిపేట్, స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ, జీడిమెట్ల గ్రామం మీదుగా వెళ్లకుండా కాలనీలోనే నిల్వ ఉండటంతో ప్రజలు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. నిజాంపేట బండారి లేఔట్ ప్రాంతంలో పలు అపార్ట్మెంట్ల సెల్లార్లలో వరద నీరు చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు. అయోధ్యనగర్‌లో నాలా పరివాహక ప్రాంతం ఉండడంతో వెంకటేశ్వరనగర్, గణేశ్‌నగర్, పాపయ్యయాదవ్ నగర్, కాకతీయ నగర్ కూరగాయల మార్కెట్, శ్రీనివాస్‌నగర్ ప్రాంతాల్లో రోడ్లపై మోకాలు లోతు వరదనీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లల్లోకి వర్షపునీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. పలు ప్రాంతాల్లో వర్షబీభత్సం ఇలా.. బేగంపేట్‌లోని బ్రాహ్మణవాడి బస్తీలో నడుములోతున వరదనీరు పోటెత్తింది. నిజాంపేట్‌లో వరదనీటిలో కార్లు, ద్విచక్రవాహనాలు సహా పలు వాహనాలు నీటమునిగాయి. అపార్ట్మెంట్ల సెల్లార్లు చెరువులను తలపించాయి. చింతల్ కాకతీయ నగర్లోనూ భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఇళ్లు, దుకాణ సముదాయాల్లోకి భారీగా వరదనీరు చేరింది. బోయిన్పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, అల్వాల్, రసూల్ పురా తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, మారేడ్‌పల్లి, ప్యారడైజ్, బేగంపేట్ ప్రాంతాల్లో వరదనీటిలో ట్రాఫిక్ భారంగా ముందుకు కదలింది. కోఠి, బేగంబజార్, సుల్తాన్‌బజార్, ఆబిడ్స్, ట్రూప్‌బజార్, బషీర్‌భాగ్, లక్డీకాపూల్, నారాయణగూడ, హిమాయత్‌నగర్ ప్రాంతాల్లో జోరు వానకు మోకాళ్ల లోతున వరదనీరు పోటెత్తింది. కోఠిలోని పలు దుకాణాల్లోకి చేరిన వరదనీటిని తేడేందుకు వ్యాపారులు అవస్థలు పడ్డారు. భారీగా వర్షపునీరు నిలిచే రహదారులపై ట్రాఫిక్ పోలీసులను మోహరించారు. జీహెచ్ఎంసీ అత్యవసర సిబ్బంది మోటార్లతో నీటిని తోడారు. మ్యాన్‌హోళ్లను తెరచి వరదనీటిని వేగంగా కిందకు పంపించారు. వరదనీటిలో ఘనవ్యర్థాలు చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు బాటసింగారం పండ్లమార్కెట్లో వర్షంధాటికి దుకాణాలన్నీ నీటమునిగాయి. బత్తాయి సహా పలు రకాల పండ్లు వరదనీటిలో కొట్టుకుపోయాయి. నీటిలో మునిగినవాటిని కాపాడుకునేందుకు వ్యాపారులు అవస్థలు పడ్డారు. వర్ష విలయానికి మక్కామసీదు ఆవరణలో ఓ పాత భవనం నేలకూలింది. ఎల్బీనగర్ పరిధిలోని సహారాస్టేట్స్ కాలనీలో ఓ భవనం ప్రహరీ కూలి పక్కనే ఉన్న నాలాలో పడిపోయింది. ట్రాఫిక్ పోలీసుల హై అలర్ట్.. భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సిటీజన్లకు పలు సూచనలు చేశారు. వర్షం ఆగిన వెంటనే రహదారులపైకి రావద్దని సూచించారు. కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం నిలిచిన గంట తర్వాత బయటకు రావాలని సూచించారు. ఈ సూచనలను పాటించని పక్షంలో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పవని స్పష్టంచేశారు. నిండుకుండల్లా జంటజలాశయాలు.. నగరానికి ఆనుకొని ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లు నిండుకుండలను తలపిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు గండిపేట్ జలాశయంలోకి 200 క్యూసెక్కుల వరదనీరు చేరగా రెండు గేట్లను ఒక అడుగు మేర తెరచి 208 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదిలారు. హిమాయత్‌సాగర్‌లోకి 100 క్యూసెక్కుల నీరు చేరగా..ఒక గేటును 0.6 ఫీట్ల మేర తెరచి 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టినట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. కూలినచెట్లు 400 పైనే.. ఈ నెలలో ఇప్పటి వరకు కురిసిన వర్షాల వల్ల నగరంలో 419 చెట్లు కూలిన ఫిర్యాదులందినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాటిని తొలగించినట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. జూలై 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు 419 కూలిన చెట్లను తొలగించినట్లు పేర్కొంది. కూకట్పల్లి నాలా నుంచి వస్తున్న నీటితో హుస్సేన్ సాగర్‌కు వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా..513.43కు చేరింది. -
హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. కిలోమీటర్లమేర నిలిచిన ట్రాఫిక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షంతో నగరంలో కిలోమీటర్లమేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక వాకర్స్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. రోడ్డుపై నడవాలంటేనే జంకుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతవరణశాఖ వెల్లడించింది. కూకట్పల్లి వై జంక్షన్ చెరువును తలపిస్తోంది. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. మెట్రో పక్కన పార్క్ చేసిన బైక్‌లు నీటిలో మునిగాయి. ఫతేనగర్ స్టేషన్ దగ్గర భారీగా వరద నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. 5 అడుగులకు పైగా వరద నీరు చేరడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఫతేనగర్ మీదుగా వెళ్లే వాహనాలు ఇతర మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ సిబ్బంది సూచించారు. అమీర్‌పేట్ నుంచి కూకట్పల్లి వెళ్లే వాహనాలు నిలిపివేశారు. చదవండి: తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ మెట్రో ఇబ్బందులు భారీ వర్ష ప్రభావం మెట్రో స్టేషన్లను కూడా తాకింది. మెట్రో స్టేషన్లలో సర్వర్ ప్రాబ్లమ్ తలెత్తింది. టికెట్లు ఇష్యూ కాకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీంతో అరగంట నుంచి మెట్రో స్టేషన్లలో భారీ క్యూలైన్లు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి ముందస్తు సమాచారం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఎక్కడికక్కడ రోడ్లపై పారుతున్న వర్షపునీరు
-
హైదరాబాద్: మరో 2 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం
-
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. వైరలవుతోన్న వీడియోలు
హైదరాబాద్:►హైదరాబాద్‌లో భారీ వర్షం ముంచెత్తుతోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో జంటనగరాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ క్రమంలో భారీ వర్షాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. Hyderabad's drainage system is definitely on ventilator. Who is stopping @GHMCOnline to remove illegal encroachment on Nalas?@revanth_anumula @KotaNeelima #HyderabadRains pic.twitter.com/7zwUhqtyrF — Nageshwar Rao (@itsmeKNR) July 22, 2022 #Madhapur #Hitechcity#HyderabadRains pic.twitter.com/jPD3FLs3Px — Bicycle Mayor of Hyderabad (@sselvan) July 22, 2022 అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు ఆఫీసులు, వ్యాపారాలు, కాలేజీలు, స్కూళ్లకు వెళ్లేవారికి పలు సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, నగరంలో అక్కడక్కడా భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొన్నది. మరో రెండు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని సూచించింది. Today #HyderabadRains In #Charminar 🌧️🌊 Heavy rain on & off in #Kphb@Hyderabadrains@HYDmeterologist@Rajani_Weather@Weather_AP@APWeatherman96@imdhydofficial@Ravicha18803311@VizagWeather247#HyderabadRains #Hyderabad@SkymetWeather@Windycom@weatherindia pic.twitter.com/sa5hoX0PAE — kishore (@trulykishore) July 22, 2022 src=hash&ref_src=twsrc%5Etfw">#TelanganaRains #TelanganaRain #HyderabadRain #CharminarRain #TelanganaFloods #HyderabadFloods pic.twitter.com/rPvUvoJTZl — SYED SARWAR (@sab_kee_jaan) July 22, 2022 సికింద్రాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, రాజ్‌భవన్ రోడ్డు, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కూకట్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాయదుర్గం, గచ్చిబౌలి, ఫిలింనగర్, నాచారం, మల్లాపూర్, ఈసీఐఎల్, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్, పిర్జాదీగూడ, మేడిపల్లి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, తుర్కయంజాల్, ముషీరాబాద్, చిక్కడపల్లి, విద్యానగర్, రాంనగర్, సికింద్రాబాద్ స్టేషన్, కాచిగూడ, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. #22JULY 1:10PM⚠️ Heavy Rains now in #Kukatpally 🌧️ No Stopping In Rains ,More Rains From Sangareddy Spreading towards #Hyderabad#HyderabadRains pic.twitter.com/k5vYkYSc5V — Hyderabad Rains (@Hyderabadrains) July 22, 2022 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో గురువారం ఉదయం భారీ వర్షం కురవడంతో బాట సింగారం మార్కెట్లో ఫ్రూట్స్ వరదకు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Hardships of traders at Batasingaram Fruit Market#HyderabadRains pic.twitter.com/hhy7oo99dA — Md Nizamuddin (@NizamJourno) July 22, 2022 Heavy Rain lashes at many places in #Hyderabad. Commuters struck in huge traffic jam. #HyderabadRains #Traffic pic.twitter.com/xJCQcumhOK — Vidya Sagar Gunti (@GVidya_Sagar) July 22, 2022 -
హైదరాబాద్: జూపార్క్ సఫారీ జోన్లోకి పోటెత్తిన వరద నీరు
-
జూలోకి వరద నీరు.. లయన్ సఫారీ మూసివేత
సాక్షి, హైదరాబాద్: మీరాలం ట్యాంక్ ఓవర్ ఫ్లో కారణంగా వరదనీరు జూపార్కులోకి ఒక్కసారిగా వచ్చేసింది. దీంతో జూ అధికారులు వర్షపు నీరు సాఫీగా సాగేందుకు చర్యలు చేపట్టారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా లయన్ సఫారీలోని వన్యప్రాణులను నైట్ ఎన్‌క్లోజర్‌లోకి తరలించారు. సందర్శకులు లయన్ సఫారీ వైపు వెళ్లకుండా సందర్శనను పూర్తిగా మూసివేశారు. జూపార్కు యథావిధిగా ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు తెరిచి ఉంటుందని జూ అధికారులు తెలిపారు. (క్లిక్: హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు.. జీహెచ్ఎంసీ అలర్ట్) మంచినీటి సరఫరా యథాతథం కృష్ణా ఫేజ్–1 జంక్షన్ మరమ్మతు పనులు వాయిదా వేయడంతో బుధవారం హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలకు యథావిధిగా మంచి నీటిసరఫరా జరగనుందని జలమండలి ప్రకటించింది. నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి ఇంతకుముందు ప్రకటించిన విషయం విదితమే. భారీ వర్షాల కారణంగా ఈ పనులను తాత్కాలికంగా వాయిదా వేశామని.. తిరిగి మరమ్మతులు చేపట్టే తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. (క్లిక్: హైదరాబాద్ లో అధిక వర్షపాతం.. వరద నీరు ఇంకే దారేదీ?) -
హైదరాబాద్: జూపార్క్‌లో చేరిన వరద నీరు
-
నిండుకుండలా మారిన హుస్సేన్‌సాగర్
-
హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు.. జీహెచ్ఎంసీ అలర్ట్
సాక్షి, సిటీబ్యూరో: వరుస వర్షాలతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముఖ్యంగా హుస్సేన్‌సాగర్ దిగువ ప్రాంతంలోని బస్తీలు, మూసీ పరిసర ప్రాంతాల బస్తీలు, కాలనీల్లోని ప్రజలు ఏ క్షణం ఎలాంటి సంఘటన జరగనుందోననే ఆందోళనతో వణికిపోతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో హుస్సేన్‌సాగర్ జలాశయం నిండిపోయింది. చదవండి: హైదరాబాద్ పరిధిలో 68% అధిక వర్షపాతం.. వరద నీరు ఇంకే దారేదీ? జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్టీఎల్)513.41 మీటర్లుకాగా, సోమవారానికి ఎఫ్టీఎల్ను మించి 513.45 మీటర్లకు చేరుకుంది. మంగళవారం 513.46మీటర్లకు, బుధవారం మధ్యాహ్నానికి 513.49 మీటర్లకు చేరుకోవడంతో తూములద్వారా నీరును దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు.ట్యాంక్‌బండ్ కింద ఉన్న తూములు పూడికతో మూసుకుపోవడంతో నీరు సాఫీగా వెళ్లేందుకు వాటిని తొలగించడం సర్ప్లస్ వెయిర్ (అలుగు)నుంచి సైతం నీరు వెళ్లేలా చెత్తాచెదారాల తొలగింపు వంటి చర్యలు చేపట్టారు. భయం.. భయంగా.. ♦ఒకేసారి భారీ మొత్తంలో వరదనీరు కిందకు చేరితే దిగువ ప్రాంతాల్లోని కవాడిగూడ, అశోక్‌నగర్, నాగమయ్యకుంట, సబర్మతీనగర్ తదితర బస్తీల్లోకి నీరు చేరే ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు ఆందోళన చేరుతున్నారు. వదలని ముసురుతో సాగర్‌లో నీటిమట్టం ఏమాత్రం తగ్గలేదు. ఈ బస్తీలే కాక నగరంలోని వివిధ లోతట్టు ప్రాంతాల్లోనూ, మూసీ పరిసర ప్రాంతాల్లోనూ నీరు నిలిచిపోయే పరిస్థితి ఉండటంతో దాదాపు 150 బస్తీల ప్రజలు ఎప్పుడేం జరుగుతుందోనని వణికిపోతున్నారు. ♦ఓవైపు నానిన గోడలు కూలే ప్రమాదాలు పొంచిఉన్నాయి. లోతట్టు బస్తీలైన అంబర్‌పేట నియోజకవర్గంలోని పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్, నరసింహబస్తీ, సంజయ్‌గాంధీనగర్, విజ్ఞాన్‌పురి, బతుకమ్మకుంట, మలక్‌పేట పరిసరాల్లోని న్యూశంకర్‌నగర్, గంగానగర్, అన్నపూర్ణనగర్, పూల్‌బాగ్, కాలాడేరా, కమలానగర్, మూసానగర్, మూసారాంబాగ్, ఇందిరానగర్, శంకేశ్వరబజార్, ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ♦ఎప్పుడు వర్షాలొచ్చినా తీవ్రప్రభావం చూపించే పాతబస్తీలోని సిద్దిఖీనగర్, అమన్‌నగర్, భవానీనగర్, రహ్మత్‌నగర్, మౌలాకాచిల్లా, ముర్తుజానగర్, ఫరత్నగర్లతోపాటు గోల్కొండ పరిసరాల్లోని తాఖత్‌బౌలి, సజ్జద్ కాలనీ, నయీం కాలనీ, సాలేహ్‌నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంఎస్‌మక్తా, సికింద్రాబాద్‌లోని బ్రాహ్మణవాడి, రసూల్‌పురా , తదితర ప్రాంతాల్లోని బస్తీల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇలా వివిధ బస్తీల్లోని దినసరి కూలీలు తదితరులు ఓవైపువర్షాల వల్ల కూలి పనుల్లేక, మరోవైపు ముంపు ముప్పుతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తూముల ద్వారా నీరు విడుదల.. హుస్సేన్‌సాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రత్యేకంగా గేట్లు అంటూ లేవని హుస్సేన్‌సాగర్‌పై తగిన అవగాహన ఉన్న ఇంజినీర్లు తెలిపారు. వారి సమాచారం మేరకు, హుస్సేన్‌సాగర్‌కు నాలుగు ప్రధాన తూములు, రెండు అలుగులు ఎప్పటినుంచో ఉన్నాయి. వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో పూడుకుపోయాయి. మ్యారియట్ హోటల్ దగ్గర, బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ దగ్గర అలుగులున్నాయి. ట్యాంక్‌బండ్ మధ్యన తూములున్నాయి. మరమ్మతులు లేక సవ్యంగా నీరు పారడం లేదు. మ్యారియట్ హోటల్‌వైపు ఉన్న తూము నుంచి అవసరమైన సమయాల్లో ఎక్కువ నీటిని దిగువకు విడుదల చేసేందుకు ప్రస్తుత సీఎస్ సోమేశ్‌కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటునే చాలామంది గేట్లు తెరిచారంటున్నారు. -
హైదరాబాద్ పరిధిలో 68% అధిక వర్షపాతం.. వరద నీరు ఇంకే దారేదీ?
సాక్షి, హైదరాబాద్: నైరుతి ప్రారంభం నుంచి గ్రేటర్‌ను కుండపోత వర్షాలు కుమ్మేస్తున్నాయి. సీజన్ ప్రారంభమైన జూన్ 1 నుంచి ఈ నెల 12 వరకు సరాసరిన 68 శాతం అధిక వర్షపాతం నమోదైంది. పలు మండలాల్లో సాధారణం కంటే ఏకంగా 50 నుంచి 80 శాతం అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. ఈ సీజన్ ముగిసే సెప్టెంబరు చివరి నాటికి వర్షపాతం మరింత అధికంగా నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే అధిక వర్షాలతో నగరానికి ఆనుకొని ఉన్న జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ సహా హుస్సేన్‌సాగర్‌తో పాటు చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. నాలాలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. తెరిపి లేకుండా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు, జలాశయాలకు ఆనుకొని ఉన్న బస్తీల వాసులు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. పలు మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. గ్రేటర్ పరిధిలో ఇప్పటివరకు (జూన్ ఒకటి నుంచి జూలై 12 వరకు) సాధారణంగా 161.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవడం పరిపాటే. కానీ ఈసారి ఏకంగా 270.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 68 శాతం అధికమన్నమాట. ఇక తిరుమలగిరి మండలంలో ఏకంగా 115 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మారేడుపల్లిలో 84 శాతం, బహదూర్‌పురాలో 76, బండ్లగూడలో 78 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ లెక్కలు చెబుతున్నాయి. చదవండి: జలుబు లాగే కరోనా వరద నీరు ఇంకే దారేదీ? కాంక్రీట్ మహారణ్యంలా మారిన గ్రేటర్ సిటీలో కురిసిన వర్షపాతంలో సుమారు 80 శాతం రహదారులపై ప్రవహించి నాలాలు, చెరువులు, కుంటలు.. అటు నుంచి మూసీలోకి చేరుతోంది. వర్షపాతాన్ని నేలగర్భంలోకి ఇంకించేందుకు ఇళ్లు, కార్యాలయాలు, భవనాలు, పరిశ్రమల్లో చాలినన్ని ఇంకుడు గుంతలు లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తింది. దీంతో సీజన్లో కుండపోత వర్షాలు కురిసినప్పటికీ వేసవిలో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని భూగర్భ జలశాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్లోనే ప్రతి భవనానికీ ఉన్న బోరుబావికి ఆనుకొని ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. జలదిగ్బంధంలో అల్లంతోట బావి కాలనీ.. సనత్‌నగర్: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు బేగంపేట లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అల్లంతోట బావి రహదారులు నీట మునగటంతో జనం ఇళ్లలోనుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఒకవైపు పాంటలూన్స్ వైపు నుంచి మరో వైపు మయూరి మార్గ్ నుంచి వరదనీరు భారీగా వచ్చి చేరుతుండటంతో గత నాలుగు రోజులుగా అల్లంతోట బావి జలదిగ్భందంలో చిక్కుకు పోయింది. వరదనీరు బయటకు వెళ్లలేక పోవటంతో కొత్తగా వచ్చే వర్షపు నీటితో ముంపు సమస్య తీవ్రమవుతోంది. -
వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష.. ఆ నాలుగు జిల్లాలకు రూ. 8 కోట్ల తక్షణ సాయం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా గోదావరి ఉధృతి, వరద సహాయక చర్యలపై సీఎం జగన్ దిశనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయన్నారు. జులై మాసంలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిందని, ఇప్పడు రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందన్నారు. బుధవారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందన్న సీఎం జగన్.. దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో గోదారినదికి వరదలు కొనసాగే అవకాశం ఉందని, ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకూడదని అన్నారు. ‘కూనవరం, చింతూరుల్లో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. కంట్రోలు రూమ్స్ సమర్థవంతంగా పనిచేయాలి. వి.ఆర్.పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. లైన్ డిపార్ట్మెంట్లు ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలి. అవసరమైనచోట వరద సహాయక శిబిరాలు తెరవండి. సహాయ శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలి. మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వండి. తక్షణ సహాయంగా వారికి ఉపయోగపడుతుంది. చదవండి: Andhra Pradesh: మరో రెండ్రోజులు వర్షాలే పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉండాలి. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలి. పారిశుధ్యం బాగుండేలా చర్యలు తీసుకోవాలి. తాగునీటి పథకాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి. కరెంట్ సరఫరాకు అంతరాయం వచ్చిన నేపథ్యంలో అత్యవసర సర్వీసులు నడిచేందుకు వీలుగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోండి. తాగునీటికోసం ట్యాంకర్లను సిద్ధంచేసుకోవాలి. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రతమత్తంగా ఉండండి. చెరువులు, ఇరిగేషన్‌కాల్వలు.. ఎక్కడ బలహీనంగా ఉన్నాయో.. అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోండి. విద్యుత్ సబ్స్టేషన్లు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోండి. బోట్లు, లైఫ్ జాకెట్లు.. అవసరైన ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచండి. అల్లూరి సీతారామరాజు, ఈస్ట్‌గోదావరి, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2కోట్ల చొప్పున తక్షణ నిధులు ఇస్తున్నాం. వరద కారణంగా జరిగిన నష్టాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి రోజువారీ నివేదికలు పంపాలని’ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. చదవండి: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో భారీ వర్షాలు.. గోదారి ఉగ్రరూపం -
Hyderabad Rains: మూడ్రోజులుగా ముసురుకుంది.. స్తంభించిన జనజీవనం
సాక్షి, హైదరాబాద్: ఆకాశానికి చిల్లులు పడ్డాయా.. మేఘాలు వర్ష ధారలయ్యాయా అన్నట్లు మూడ్రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో నగరం తడిసిముద్దయ్యింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చి చేరింది. ఆదివారం ఉదయం హఫీజ్‌పేట్‌లో అత్యధికంగా 7.7 సెంటీమీటర్లు, మైలార్‌దేవ్‌పల్లి, శివరాంపల్లిలలో 6, గాజుల రామారం ఉషోదయ కాలనీలో 5.6, బాలానగర్‌లో 5.3, మియాపూర్, జూపార్కులలో 5.2 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదయ్యింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) రాయదుర్గంలో కనిష్టంగా 4.5 సెంటీమీటర్ల వాన కురిసింది. రామంతాపూర్, కందికల్ గేట్, జీడిమెట్ల, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, ఆర్సీపురం, తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. మురుగునీటి కాల్వకు మరమ్మతులు కొనసాగుతున్న అనేక చోట్ల వరదనీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చదవండి: ప్రాజెక్టులకు వరద పోటు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న మార్గాల్లో దెబ్బతిన్న రోడ్లపై గుంతల్లో వాననీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. Its not a rivulet, #Waterlogging on roads due to continuous #HeavyRains near #Attapur area in #Hyderabad, Traffic interrupts. #Telangana govt alerted citizens, declared 3 days holidays to Educational Institutions.#HyderabadRains #heavyrain #Telanganarains #TelanganaFloods pic.twitter.com/Tn1MJblQLo — Surya Reddy (@jsuryareddy) July 10, 2022 జంట జలాశయాలకు వరద ప్రవాహం మణికొండ: గత రెండు రోజులుగా శివారు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గండిపేట (ఉస్మాన్‌సాగర్) చెరువులోకి వరదనీరు పోటెత్తుతుండటంతో ఆదివారం సాయంత్రం రెండు గేట్లను వదలి నీటిని కిందకు వదిలారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1785.80 అడుగులకు చేరుకుంది. పైనుంచి 208 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 7,9 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 100 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. గండిపేట గేట్లను ఎత్తుతున్న అధికారులు దాంతో మూసీ నదిలో నీటి ప్రవాహం మొదలయ్యింది. గండిపేటలోని గేట్లకు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, జలమండలి డీజీఎంలు నరహరి, వెంకట్రావులు పూజలు నిర్వహించి గేట్లను పైకి ఎత్తారు. రాత్రికి మరింత వరద ఎక్కువైతే అవే గేట్లను మరింత ఎత్తటం, మరిన్ని గేట్లను ఎత్తేందుకు యంత్రాంగం సిద్దంగా ఉందని జలమండలి అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గండిపేట కౌన్సిలర్లు విజిత ప్రశాంత్ యాదవ్, నాయకులు గోపాల గణేష్, సీఐ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వరద నీటితో హిమాయత్‌సాగర్ Waves in Hyderabad @balaji25_t @Rajani_Weather#HyderabadRains pic.twitter.com/1L1TCEjNGt — karthikavsk(sharzsCAr) (@karthikavsk) July 10, 2022 నిండుకుండలా హిమాయత్‌సాగర్.. బండ్లగూడ: భారీ వర్షాలు కురుస్తుండడంతో హిమాయత్‌సాగర్ చెరువు వరద నీటితో నిండుకుండను తలపిస్తోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం పెరుగుతోంది. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1760.50 అడుగులుగా ఉంది. దీంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు జలమండలి మేనేజర్ రేణుక, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్‌ల ఆధ్వర్యంలో 10, 5వ నంబర్ గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు పంపిస్తున్నారు. -
హైదరాబాద్ లో భారీ వర్షం
-
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గురువారం ఉదయమే వాతావారణం చల్లబడింది. దీంతో ఎల్బీనగర్, చైతన్యపురి, కొత్తపేట్, సరూర్ నగర్. కర్మన్ ఘాట్, రాజేంద్రనగర్, హైదర్‌గూడ, నాగోల్, మీర్పేట్, అత్తాపూర్, నార్సింగి మణికొండ, పుప్పాలగూడ ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. నాంపల్లి, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, కోఠి, గోషామహల్, చాదర్‌ఘాట్, అంబర్పేట్, హిమాయత్‌నగర్, రామంతపూర్, చే నంబర్, గోల్నాక, ఉప్పల్, సైదాబాద్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, దిల్‌షుఖ్‌నగర్‌లో భారీగా వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. -
Rain Alert: హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: నగరంలో శనివారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని, నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్ 040-21111111కు ఫోన్లో సంప్రదించవచ్చని తెలిపింది. కాగా, శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికే నగరం అతలాకుతలమైంది. తాజాగా భారీ వర్షసూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. -
హైదరాబాద్‌లో ఒక్కసారిగా కుండపోత వర్షం.. ఫోటోలు
సాక్షి, హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్ పరిధిలో శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి పొద్దు పోయే వరకు కుండపోతగా జడి వాన కురిసింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో నగరం నిండా మునిగింది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. ఈదురుగాలుల బీభత్సానికి పలుచోట్ల చెట్ల కొమ్మలు తెగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగి పడడంతో పలుచోట్ల అంధకారం అలుముకుంది. పలు బస్తీలలో ఇళ్లల్లోకి చేరిన వరద నీటితో స్థానికులు అవస్థలు పడ్డారు. చైతన్యపురి ప్రధాన రహదారిలో Greater Hyderabad 🌧🌦#HyderabadRains pic.twitter.com/vFbKjT1erQ — Nani (@srichowdary4) October 9, 2021 ప్రధాన రహదారులపై రాత్రి 8 నుంచి 11 గంటల వరకు ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. దిల్సుఖ్నగర్ పరిధిలోని లింగోజి గూడలో అత్యధికంగా 12.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాత్రి 10 గంటల వరకు కుర్మగూడలో 11.7, ఎల్బీనగర్ 11, హస్తినాపురంలో 10.8, ఆస్మాన్‌ఘడ్ 10.5, విరాట్‌నగర్ 10.3, కంచన్‌బాగ్ 10, సర్దార్ మహల్ 9.9, చందూలాల్ బారాదరిలో 9.6, జహానుమా 9.2, రెయిన్ బజార్ 9.2, శివరాంపల్లి 8.9, అత్తాపూర్ 8.1, నాచారం 8.1, రాజేంద్రనగర్ 8, భవానీనగర్ 7.4, బేగంబజార్ 7.2, బతుకమ్మకుంట 7.1, నాంపల్లిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దిల్‌సుఖ్‌నగర్‌లో #HyderabadRains | Rainwater entered a restaurant in Old City after incessant rains lashed Hyderabad yesterday. (ANI) pic.twitter.com/rJEGYwGdKZ — NDTV (@ndtv) October 9, 2021 ►రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో భారీ వర్షానికి ట్రాఫిక్ నిలిచిపోయింది. అత్తాపూర్ ఆరాంఘర్ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ►అప్పా చెరువు నుండి వరద నీరు కర్నూలు జాతీయ రహదారిపై ప్రవహించడంతో శంషాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిని మూసివేశారు. వాహనాలను హిమాయత్ సాగర్ మీదుగా మళ్లిస్తున్నారు. సాగర్ రింగ్‌రోడ్డులో ►కాటేదాన్ 33/11 కె.వి సబ్‌స్టేషన్ మరోసారి నీటమునిగింది. దీంతో పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ►సికింద్రాబాద్‌లోని మెట్టుగూడ, వారాసిగూడ, సీతాఫల్‌మండీ, చిలకలగూడ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. ఎల్బీనగర్లో #HyderabadRains in #Telangana on Friday night. Today morning as well we have seen water logging in many areas. Yesterday, Three cars drowned at PVNR expressway pillar no. 194 #HeavyRainpic.twitter.com/JRZ6ibSIBg — #Telangana (@HiiHyderabad) October 9, 2021 ►దిల్‌సుఖ్‌గర్, సరూర్‌నగర్, మలక్‌పేట్, మీర్‌పేట, బడంగ్‌పేటలలో వరదనీరు పోటెత్తింది. ప్రధాన రహదారులు సైతం నీటమునిగాయి. మూడు గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హిమాయత్ నగర్, నారాయణగూడ, బషీర్‌బాగ్ ప్రాంతాల్లోనూ రహదారు లు నీటమునిగి..మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లాయి. ►పాతబస్తీలో వరదనీటిలో ట్రాలీ ఆటోతో పాటు పలు వాహనాలు కొట్టుకుపోయాయి. కొత్తపేటలో #HyderabadRains in #Telangana on Friday night. Today morning as well we have seen water logging in many areas. Yesterday, Three cars drowned at PVNR expressway pillar no. 194 #HeavyRainpic.twitter.com/JRZ6ibSIBg — #Telangana (@HiiHyderabad) October 9, 2021 వందలాది ఫీడర్లలో నిలిచిన విద్యుత్ సరఫరా గ్రేటర్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత్ సరఫరా స్తంభించింది. 250కిపైగా ఫీడర్ల పరిధిలో అంతరాయం ఏర్పడటంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఎల్బీనగర్, మీర్‌పేట, బడంగ్‌పేట, సంతో‹Ùనగర్, లింగోజిగూడ, హస్తినాపురం, నాగోల్, సరూర్‌నగర్, చంపాపేట, కర్మన్‌ఘాట్, కొత్తపేట, మలక్‌పేట, పాతబస్తీ సహా పలు ప్రాంతాలలో పూర్తిగా విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. రాజేంద్రనగర్, మెహదీపట్నం, అత్తాపూర్, సైదాబాద్, నాంపల్లి, అఫ్జల్‌గంజ్, ఇమ్లీబన్ బస్టాండ్ పరిసరాల్లో అంధకారం తప్పలేదు. పాతబస్తీలో ఒకరికొకరు తోడుగా రోడ్డు దాటుతున్న దృశ్యం చిక్కడపల్లి, నారాయణగూడ, ఉప్పల్, అంబర్‌పేట, సికింద్రాబాద్ ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఒకవైపు ఏకధాటిగా కురుస్తున్న వర్షం..మరో వైపు మోకాళ్ల లోతు చేరిన వరద నీటితో ప్రయాణికులు, వీధి దీపాలు వెలగక ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచి్చంది. పలు చోట్ల గంట నుంచి గంటన్నర పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. మరికొన్ని చోట్ల రాత్రి పొద్దుపోయేదాకా కరెంట్ సరఫరా లేదు. రోడ్డుపై భారీగా చేరిన వరద నీరు వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ భారీ వర్షానికి ఉప్పల్‌లో రోడ్లపై ఉన్న షటర్లు, షాపుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగ ప్రవేశం చేసి రోడ్లపై డివైడర్లను తొలగించారు. వరంగల్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పాతబస్తీలోని ఓ హోటల్లో.. విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షం, గాలుల నేపథ్యంలో సంస్థ చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో సీఎండీ జి.రఘుమారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ గాలుల నేపథ్యంలో చెట్ల కొమ్మలు కూలి విద్యుత్ లైన్స్, స్తంభాలు విరిగే అవకాశమున్నందున క్షేత్ర స్థాయి సిబ్బంది విధిగా పెట్రోలింగ్ చేయాలని ఆదేశించారు. రాత్రంతా భారీ వర్షం..గాలులు వీచే అవకాశమున్నందున ఎఫ్ఓసీ, సీబీడీ సిబ్బంది సబ్ స్టేషన్లలో అందుబాటులో ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574 నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు. రాంగోపాల్‌పేట నల్లగుట్టలో నీట మునిగిన కాలనీ విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షం, గాలుల నేపథ్యంలో సంస్థ చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో సీఎండీ జి.రఘుమారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ గాలుల నేపథ్యంలో చెట్ల కొమ్మలు కూలి విద్యుత్ లైన్స్, స్తంభాలు విరిగే అవకాశమున్నందున క్షేత్ర స్థాయి సిబ్బంది విధిగా పెట్రోలింగ్ చేయాలని ఆదేశించారు. రాత్రంతా భారీ వర్షం..గాలులు వీచే అవకాశమున్నందున ఎఫ్ఓసీ, సీబీడీ సిబ్బంది సబ్ స్టేషన్లలో అందుబాటులో ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574 నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు. రాణిగంజ్‌లో.. పాతబస్తీ అతలాకుతలం చార్మినార్: పాతబస్తీలో గంటన్నరపాటు దంచికొట్టిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు నరకయాతన పడ్డారు. చారి్మనార్, మీరాలం మండి, మదీనా, పత్తర్ గట్టి, పురానాపూల్ తదితర ప్రాంతాల నుంచి సైదాబాద్, మలక్‌పేట, సంతోష్ నగర్, డబీర్ పురా, చంచల్ గూడ, ఈదిబజార్ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ రైల్వే అండర్‌బ్రిడ్జి పూర్తిగా వరదనీటిలో మునిగిపోవడంతో రోడ్లపైనే గంటల తరబడి వాహనదారులు నిలిచిపోయారు. చాంద్రాయణగుట్ట, జంగమ్మెట్, చత్రినాక, పటేల్ నగర్, శివాజీ నగర్, శివగంగా నగర్ తదితర ప్రాంతాలలో వరద నీరు ఇళ్లలోకి చేరింది. దాదాపు మొదటి అంతస్తు మునిగేంత వరకు వరద నీరు చేరింది. -
హైదరాబాద్: నేడు భారీ వర్ష సూచన!
సాక్షి, హైదరాబాద్: వాయుగుండం ప్రభావంతో మంగళవారం నగరంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. సోమవారం కురిసిన కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు చెరువులను తలపించగా..మళ్లీ కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఇళ్లలోకి చేరిన వర్షపునీటిని తొలగించేందుకు పలు బస్తీల వాసులు అవస్థలు పడ్డారు. బల్దియా సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారింది. రాగల 24 గంటల్లో వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలుండడంతో నగరంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని స్పష్టంచేసింది. విపత్తుస్పందనా దళం, బల్దియా, రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. కాగా మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు సులేమాన్ నగర్లో 1.4 సెంటీమీటర్లు, మాదాపూర్, బోరబండ, చర్లపల్లి, శ్రీనగర్ కాలనీల్లో అరసెంటీమీటరు మేర వర్షపాతం నమోదైంది. చదవండి: హైదరాబాద్‌లో కుండపోత వర్షం: ఏటా ఇదే సీన్.. అయినా! -
హైదరాబాద్‌లో కుండపోత వర్షం: ఏటా ఇదే సీన్.. అయినా!
సాక్షి, హైదరాబాద్: కుండపోత వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ సిటీ చిగురుటాకులా వణుకుతోంది. సోమవారం కురిసిన జడివానతో నగరజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు చెరువులను తలపించగా..లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఎడతెరిపి లేని వానతో జనం ఇళ్లనుంచే బయటకు రాలేని పరిస్థితి తలెత్తింది. వచ్చే 24 గంటల్లోనూ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలని హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ పరిధిలోని మూడు లక్షల మ్యాన్‌హోల్ మూతలను ఎట్టి పరిస్థితుల్లో తెరవరాదని జీహెచ్ఎంసీ, జలమండలి హెచ్చరించాయి. గ్రేటర్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో, పురాతన భవనాల్లో నివాసం ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. పోలీస్, జలమండలి, విద్యుత్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పరిస్థితిని సమీక్షించాయి. చదవండి: Telangana: నేడు, రేపు భారీ వర్షాలు ఏటా ఇదే సీన్ ఏటా సెప్టెంబరులో పేరుగొప్ప మహానగరంలో ఎటు చూసినా ఇదే సీన్. శతాబ్దకాలంగా నగరంలో భారీ వర్షాల చరిత్రను పరిశీలిస్తే నాడు 1908లో మూసీ వరదలు..2000 సంవత్సరంలో సిటీని సగం ముంచేసిన భారీ వర్షాలు..ఇక 2016లో పలు ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి...ఈ విపత్తులన్నీ ఇదే నెలలో చోటుచేసుకోవడం గమనార్హం. నిపుణుల కమిటీ సూచనల అమలేదీ..? మహానగరాన్ని వరదల సమయంలో నిండా మునగకుండా చూసేందుకు 2003లో కిర్లోస్కర్ కమిటీ విలువైన సూచనలు చేసింది. సుమారు 1500 కి.మీ మార్గంలో విస్తరించిన నాలాలపై ఉన్న పదివేలకు పైగా ఉన్న ఆక్రమణలను తొలగించడంతోపాటు వరదనీటి కాల్వలను విస్తరించాలని సూచించింది. జరిగిన పనులను పరిశీలిస్తే..గత కొన్నేళ్లుగా సుమారు 30 శాతమే పనులు పూర్తయ్యాయి. మరో 70 శాతం పనులు పూర్తికాకపోవడంతో భారీ వర్షం కురిసిన ప్రతీసారీ సిటీ నిండా మునుగుతోంది. మూడేళ్ల క్రితం ముంబయి ఐఐటీ, తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సంస్థల నిపుణులు ఇంకుడు కొలనులు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో సిటీకి ముంపు సమస్య 50 శాతానికి పైగాతీరుతుందని అప్పట్లోనే స్పష్టంచేసినా యంత్రాంగం పట్టించుకోలేదు. చదవండి: హైదరాబాద్‌లో కాస్త తగ్గుముఖం పట్టిన వర్షం.. Moosrambagh Bridge closed due to heavy rain.#HyderabadRains#TelanganaRains pic.twitter.com/1CNzmO1kuS — Qadri Syed Rizwan (@Qadrisyedrizwan) September 25, 2021 #HyderabadRains @KTRTRS situation in dammaiguda. Last year too my parents were in similar situation. What measures did your govt take in this one year? Absolutely NOTHING. They sent only one tractor to evacuate people and guess what tractor couldnt enter my parent's house lane pic.twitter.com/cyLRArdwIx — Srujana (@SrujanaAM) September 27, 2021 -
హైదరాబాద్‌లో మళ్లీ కుమ్మేసిన వాన.. ఎక్కడ ఏమైందంటే!
రోజంతా ఏకధాటిగా కురిసిన వర్షానికి శనివారం నగరంలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. మూసారంబాగ్, మలక్‌పేట్‌లో ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులను ఆస్పత్రులకు తరలించే 108 వాహనాలు సహా ప్రైవేటు అంబులెన్స్‌లు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. మొత్తంగా శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన వానతో నగరం అతలాకుతలమైంది -సాక్షి, హైదరాబాద్ ట్రాఫిక్ స్తంభన.. రోడ్లపైకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో కొత్తపేట్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట్ రైల్వేబ్రిడ్జీ, జూబ్లీహిల్స్, పంజగుట్ట, అమీర్‌పేట్, మూసాపేట్, సికింద్రాబాద్, బేగంపేట్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, చంపాపేట్, చాంద్రాయణగుట్ట, మోహిదీపట్నం, అత్తాపూర్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్, మాసాబ్‌ట్యాంక్, లక్డీకాపూల్, ఆరీ్టసీక్రాస్ రోడ్డు, అంబర్పేట్, రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చదవండి: హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. ఎవరూ బయటకు రావొద్దు! సుందరయ్య విజ్ఙాన్ కేంద్రం వద్ద అంబులెన్స్‌ల్లో అవస్థ మలక్‌పేటలోని లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. వరదనీటి కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌జాం అయింది. రోగులను ఆస్పత్రులకు తరలిస్తున్న ఐదు అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. ట్రాఫిక్ పోలీసులు నానా తంటాలు పడి అంబులెన్స్‌లకు దారి చూపించాల్సి వచి్చంది. అక్బర్‌బాగ్, ఓల్డ్ మలక్‌పేట్, మున్సిపల్ కాలనీ, పద్మనగర్, కాలడేర, మలక్‌పేట్ రైల్వే బిడ్జి, అజంపుర, సైదాబాద్, సరూర్‌నగర్, ఆర్కేపురం, ఐఎస్‌సదన్ తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి. కరెంట్ కట్ వర్షం, వరదల కారణంగా చెట్లకొమ్మలు విరిగిలైన్లపై పడటంతో మెట్రో జోన్లో 42, రంగారెడ్డి జోన్లో 34 ఫీడర్లు ట్రిప్పై విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల సరఫరాను వెంటనే పునరుద్ధరించినప్పటికీ..మరికొన్ని చోట్ల అర్థరాత్రి తర్వాత కూడా కరెంట్ రాలేదు. ఇంట్లో లైట్లు వెలుగక, ఫ్యాన్లు తిరగక దోమలు కంటిమీద కునుకులేకుండా చేశాయి. అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు ఫోన్ చేస్తే ..వారి ఫోన్లు మూగబోయి ఉండటంతో సిటిజన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మలక్‌పేట్ మూసారంబాగ్లో వరదనీటిలో కొట్టుకు పోతున్న కారు నిండుకుండల్లా చెరువులు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, తుర్కయాంజాల్ చెరువు సహా రామంతాపూర్ చెరువులు నిండుకుండలను తలపించాయి. ఎగువ నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు వాటి గేట్లు తెరిచి కిందికి నీటిని విడుదల చేశారు. ఫలితంగా మూసీ పరివాహక ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. అంబర్‌పేట నుంచి మూసారంబాగ్ మధ్యలో ఉన్న వంతెనపై నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా ఆయా ప్రాంతాలకు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మూసీ పరివాహాక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పీ అండ్ టీ కాలనీ సీసల బస్తీలో జంట జలాశయాలకు భారీగా వరద సాక్షి, సిటీబ్యూరో/మణికొండ: గత నాలుగు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మూసీ సహా ఈసీ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు వరదనీరు పోటెత్తుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ►హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1761.75 అడుగుల మేర నీరు చేరింది. మొత్తం 17 గేట్లు ఉండగా 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790.00 అడుగులు కాగా..ప్రస్తుతం 1789.00 అడుగుల మేర నీరు చేరింది. మొత్తం గేట్ల సంఖ్య 15 గేట్లు కాగా 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మలక్‌పేట్‌లో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా శనివారం సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు సైదాబాద్‌లో అత్యధికంగా 10.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఆస్మాన్‌ఘడ్‌లో 9.2, మలక్‌పేటలో 7.6, విరాట్‌నగర్‌లో 6.5, ఐఎస్‌సదన్‌లో 6.3, రెయిన్‌బజార్‌లో 5.5, కంచన్‌బాగ్‌లో 5.4, కాచిగూడలో 5.0, ఉప్పల్ మారుతినగర్లో 4.6, మచ్చ»ొల్లారంలో 4.5, చర్లపల్లి, సర్దార్ మహల్ 4.3, బతుకమ్మకుంటలో 4.1, డబీర్‌పురలో 4.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 48 గంటల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. మలక్‌పేట్ ప్రధాన రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు ఎక్కడ ఏమైందంటే...? ►సరూర్ నగర్‌లోని సీసలబస్తీ, కమలానగర్, కోదండరాంనగర్, శారదానగర్, ఎస్సీ హాస్టల్ రోడ్డు, పీఅండ్‌టీ కాలనీలలోని రోడ్లపై మోకాళ్ల లోతు నీరు ప్రవహించింది. ►కర్మన్‌ఘాట్ ప్రధాన రోడ్డులో పార్కు చేసిన వాహనాలు నీటిలో మునిగిపోయాయి. దిల్సుఖ్నగర్–ఎల్బీనగర్ వెళ్లే జాతీయ రహదారి చైతన్యపురి చౌరస్తాలోని వైభవ్ టిఫిన్ సెంటర్ రోడ్డులో మూడు అడుగుల మేర వరదనీరు ప్రవహించింది. ►గడ్డిఅన్నారంలోని శివగంగా థియేటర్ రోడ్డులో వాన నీటితో నిండిపోవటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. ►బాలాపూర్ మండలంలోని ఉస్మాన్ నగర్, ఆర్కేపురం యాదవనగర్, అల్కాపురి, ఎన్టీఆర్నగర్, తీగలగూడ, అజంపురలోని కాలనీలు, సింగరేణి కాలనీ, మీర్పేట్ లెనిన్‌నగర్, ఆర్సీఐ రోడ్డు, జిల్లెలగూడలోని శ్రీధర్‌నగర్, సత్యనగర్, మిథిలానగర్ తదితర కాలనీలు ముంపునకు గురయ్యాయి. దిల్సుఖ్నగర్ శివగంగ థియేటర్ రోడ్డులో ►అంబర్‌పేటలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పటేల్‌నగర్, అలీ కేఫ్, గోల్నాక తదితర ప్రాంతాలకు వర్షపునీరు భారీగా వచ్చి చేరింది. భారీగా ఇళ్లల్లోకి వర్షపునీరు చేరింది. అలీకేఫ్ వద్ద, మూసీ బ్రిడ్జిపై వరదనీరు పొంగి పొర్లింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ► చార్మినార్ సర్దార్ మహల్ రోడ్డు నుంచి కోట్లా ఆలిజా రోడ్డు వైపు గల ప్రధాన రోడ్డులోని డ్రైనేజీ పొంగి మురుగునీరు వరదనీటితో కలిసిపోయింది. మోకాలు లోతు వరకు రోడ్డుపై వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. చిక్కడపల్లిలో ►రాజ్‌భవన్, సోమాజిగూడ సీఎం క్యాంప్ ఆఫీస్ సమీప ప్రాంతాల్లో వరద నీటి కాల్వ మ్యాన్‌హోళ్లు నోళ్లు తెరుచుకుని ప్రమాదకరంగా మారాయి. చింతల్‌బస్తీ, ఫిలింనగర్, కమలాపురి కాలనీ, సయ్యద్‌నగర్, ఫస్ట్‌లాన్సర్, ఉదయ్‌నగర్, సింగాడికుంట, శ్రీరాం నగర్, అంబేద్కర్‌నగర్, మక్తా, పోచమ్మ బస్తీ, అమీర్‌పేట్ మార్కెట్, పంజగుట్ట మోడల్‌హౌజ్ తదితర ప్రాంతాల ప్రజలు మురుగునీటితో అవస్థలు పడుతున్నారు. ►సుందరయ్య విజ్ఞానకేంద్రం ప్రాంతం చెరువును తలపించింది. మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో అక్కడ పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలు, కార్లు నీటమునిగాయి. -
హైదరాబాద్‌లో పదే పదే.. అదే సీన్
వర్షం కురిసిన ప్రతిసారీ నగరం వణికిపోతోంది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఎప్పటిలాగే పలు కాలనీలు, బస్తీలతోపాటు ప్రధాన రహదారులు నీట మునిగాయి. వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. అధికారుల లెక్కల మేరకు నగరంలో 200 వాటర్‌లాగింగ్ ప్రాంతాలుండగా, లెక్కలో లేనిప్రాంతాలు ఇంతకంటే ఎక్కువే ఉన్నాయి. సాక్షి, సిటీబ్యూరో: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నగరంలో శుక్రవారం పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం సముద్రమట్టం నుంచి 1.5 కి.మీ నుంచి 3.1 కి.మీ మధ్య కేంద్రీకృతమైందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో నగ రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ప్రకటి ంచింది. బేగంపేటలోని ద్వారకాదాస్ సొసైటీలో ఇలా.. కాగా గురువారం రాత్రి పలు ప్రాంతాల్లో 9–10 సెంటీమీటర్ల మేర కురిసిన జడివానకు పలు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. ఇళ్లలోకి చేరిన వరదనీటిని తోడేందుకు పలు బస్తీ ల వా సులు నానా అవస్థలు పడ్డారు. కాగా రాత్రి 10 గంటల వరకు ఆర్సీ పురంలో 4.8 సెం.మీ., శేరిలింగంపల్లి 3.0, ఖాజాగూడ 2.6, మణికొండ 2.5, బీహెచ్ఈఎల్ 2.4, రాయదుర్గం 1.9, షేక్‌పేట్ 1.9, లింగంపల్లి 1.6, మెహిదీపట్నం 1.5, గుడిమల్కాపూర్‌లో 1.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చదవండి: నేడు మహా గణపతికి నేత్రోత్సవం ► మూడు గంటల్లోనే దాదాపు పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఎక్కువ ప్రభావం కనిపించింది ► బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్‌పేట, కూకట్పల్లి, కృష్ణాగర్, లక్డీకాపూల్,పంజగుట్ట తదితర ప్రాంతాల్లో వర్ష తాకిడికి ప్రజలు అల్లాడిపోయారు ► ప్రధాన రహదారుల ప్రాంతాల్లో మోకాలిలోతు నీరు నిలిపోవడంతో ముందుకు కదల్లేక వాహనవారులు పడరాని పాట్లు పడ్డారు ► నగర ప్రజలకు సుపరిచితమైన రాజ్‌భవన్‌రోడ్, ఒలిఫెంటా బ్రిడ్జి, మైత్రీవనం, విల్లామేరీ కాలేజ్, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ వంటి ప్రాంతాల్లోనే కాక పలు కొత్తప్రాంతాల్లోనూ నీరు నిలిచిపోయింది ► జీహెచ్ఎంసీకి 59 ఫిర్యాదులందాయి. వీటిల్లో 40 నీటినిల్వలకు సంబంధించినవి కాగా, 19 ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ఫిర్యాదులందని సమస్యలు ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయి -
కుమ్మేసిన కుండపోత: వైరలవుతోన్న ఫోటోలు, వీడియోలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో గురువారం రాత్రి పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. కూకట్పల్లి, బాలానగర్, యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి నగర్, షాపూర్‌నగర్, మూసాపేట, అమీర్‌పేట, మైత్రీవనం, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, సరూర్‌నగర్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, పంజాగుట్ట మెట్రో, ఎర్రగడ్డ, శ్రీనగర్ కాలనీ, రాజ్‌భవన్ రోడ్ లేక్‌వ్యూ గెస్ట్ హౌస్, ఖైరతాబాద్, హబ్సిగూడ, టోలిచౌకి, సికింద్రాబాద్, కోఠి, దిల్సుఖ్నగర్, నారాయణగూడ, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో వర్షం భారీగా కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి. రాత్రి 7.50 నుంచి 9 గంటల వరకు కుంభవృష్టి కుమ్మేసింది. వరదనీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. వాహనాల రాకపోకలు స్తంభించాయి. రాత్రి 11 గంటల వరకూ రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను రోడ్డు క్లియర్ చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. నగరంలో సుమారు వంద ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి 11 గంటల వరకు జూబ్లీహిల్స్‌లో 9.8, మూసాపేటలో 9.6, చందానగర్‌లో 8.8, సరూర్‌నగర్‌లో 8.3, మోతీనగర్‌లో 7.9, మాదాపూర్‌లో 7.7, యూసఫ్‌గూడలో 7.6, బాలానగర్‌లో 7.1, చాంద్రాయణగుట్టలో 6.9, శ్రీనగర్ కాలనీలో 6.8, ఫాతిమానగర్‌లో 6.5, ఎల్బీనగర్లో 6.3, రంగారెడ్డి నగర్లో 5.9, జీడిమెట్లలో 5.8, ఆసిఫ్‌నగర్, కేపీహెచ్‌బీలలో 5.7, గాజులరామారంలో 5.4, అత్తాపూర్‌లో 4.5 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదయ్యింది. రంగంలోకి జీహెచ్ఎంసీ బృందాలు జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగి రోడ్లపై నిలిచి నీటిని తోడివేశాయి. డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సహాయక చర్యల కోసం 040 21111111 నంబర్‌కు ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఇళ్లలోంచి బయటికి రావద్దని ప్రజలను అప్రమత్తం చేసింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Watch 😱😱 #hyderabadrain #hyderabadflood #heavyrains @HiHyderabad @HiWarangal @balaji25_t @HYDmeterologist pic.twitter.com/8JMkPvlTBd — Mohammad fasahathullah siddiqui (@MdFasahathullah) September 2, 2021 It’s not #istanbul means Old City of #Hyderabad it’s #Dallas of #Telangana #YousufGuda #KrishnaNagar #HyderabadRains pic.twitter.com/lIjQRhCxZK — Mubashir.Khurram (@infomubashir) September 2, 2021 #hyderabadrain #hyderabadflood#hyderabad #StayHomeStaySafe@HiWarangal @HiHyderabad @DonitaJose pic.twitter.com/yFNrlek4VV — Mohammad fasahathullah siddiqui (@MdFasahathullah) September 2, 2021 -
వామ్మో! ఇదేం వాన.. గ్రేటర్లో కుండపోత రికార్డు ఇప్పుడే
సాక్షి, హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో గ్రేటర్ సిటీని కుండపోత వాన ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఆకాశానికి చిల్లు పడిందన్న చందంగా 20 సెంటీమీటర్లకు పైగా కుంభవృష్టి కురిసింది. నాలాలు ఉగ్రరూపం దాల్చాయి. పలు చెరువులు పూర్తి స్థాయిలో నిండి వరదనీరు పొంగిపొర్లి సమీప బస్తీలు, కాలనీలను ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. వందలాది బస్తీల్లో ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు పలు బస్తీల వాసులు రాత్రంతా జాగారం చేశారు. ఈ సీజన్లో జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు నమోదైన అతి భారీ వర్షం ఇదేనని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడం, ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో పాటు క్యుములోనింబస్, స్ట్రాటస్ మేఘాల ప్రభావంతో నగరంలో పలు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. వరద నీటిలో ఉప్పల్ స్వరూపానగర్ పలు మండలాల్లో సాధారణం కంటే అత్యధికం.. జీహెచ్ఎంసీ పరిధితో పాటు పొరుగునే ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలో పలు మండలాల్లో జూన్ ఒకటి నుంచి జూలై 15 వరకు సాధారణం కంటే 70 నుంచి 90 శాతానికి పైగా అధిక వర్షపాతం నమోదవడం విశేషం. అత్యధికంగా తిరుమలగిరిలో 106 శాతం, ముషీరాబాద్‌లో 131 శాతం, కాప్రాలో ఏకంగా 153 శాతం, ఉప్పల్‌లో 173 శాతం, సరూర్‌నగర్‌లో 148 శాతం అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. గ్రేటర్లో కుండపోత రికార్డు ఇప్పుడే.. గ్రేటర్ పరిధిలో జూలై నెలలో అధిక వర్షపాతం నమోదవడం పరిపాటే. ఇక ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నగరంలో 24 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైన రికార్డులు గతంలో ఉన్నాయి. కానీ నగర వాతావరణ శాఖ రికార్డులను పరిశీలిస్తే జూలై నెలలో అధిక వర్షపాతం నమోదైంది మాత్రం.. జూలై 15, 2021 కావడం విశేషం. పలు చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనప్పటికీ.. సరాసరిన నగరంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు జూలై మాసంలో 1989 జూలై 24న మాత్రమే నగరంలో 14.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాజాగా పాత రికార్డులు బద్దలయ్యాయి. బాలాపూర్‌లో జలమయమైన ఆర్సీఐ రోడ్డు నగరాన్ని వణికించిన భారీ వర్షం బుధవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు భీతిల్లాయి. రాత్రి 8 గంటల నుంచి వేకువజాము వరకు ఏకధాటిగా కురిసిన కుండపోతతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. గత ఏడాది వరదల్ని గుర్తు తెచ్చుకుని వణికిపోయారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తెల్లారే లోపల ఏం జరగనుందోనని ఆందోళన చెందారు. గ్రేటర్ పరిధిలోని వంద కాలనీలకు పైగా ప్రజలు వాన భయంతో సరిగా నిద్రపోలేదు. మలక్‌పేట నియోజకవర్గంలోని ఎర్రగుంట, మీర్‌పేట, జిల్లెలగూడ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలో అంజయ్యనగర్ పూర్తిగా నీట మునిగింది. అయిదడుగుల మేర నీరు ఇంకా నిలిచే ఉంది. పద్మా కాలనీ, అచ్చయ్యనగర్, శ్రీరాంనగర్ బస్తీ తదితర ప్రాంతాల్లోనూ భారీగా నీటి నిల్వలు చేరాయి. బిక్కుబిక్కుమంటూ గడిపిన కాలనీలు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పద్మావతి కాలనీ, రాఘవేంద్ర కాలనీ, పీవీఆర్ కాలనీ, అయ్యప్పకాలనీ, సాగర్ ఎన్క్లేవ్, రెడ్డి కాలనీ, కోదండరామ కాలనీ, అయ్యప్పనగర్, మల్లికార్జున నగర్ తదితర కాలనీల్లో నీట మునిగాయి. ఉప్పల్ నియోజకవర్గంలోని శివసాయినగర్, మధురానగర్ కాలనీ, న్యూభవానీనగర్, ఇందిరానగర్, రాఘవేంద్రకాలనీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్లోని ఎన్ఎండీసీ కాలనీ, సరస్వతీనగర్ తదితర కాలనీలు నీట మునిగాయి. సనత్‌నగర్ నియోజకవర్గంలోని నాలా పరీవాహక ప్రాంతాల్లోని బ్రాహ్మణవాడి, అల్లంతోట బావి, తదితర ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని చింతలబస్తీ, మక్తా, ఇందిరానగర్‌లతోపాటు సోమాజిగూడ, ఫిల్మ్‌నగర్ ప్రాంతాల్లో వర్ష ప్రభావం కనిపించింది. నదీం కాలనీలో దాదాపు ఇరవై ఇళ్లలో వరద నీరు చేరింది. ఆనంద్‌బాగ్‌లో నీట మునిగిన కాలనీ తెగిపడిన కరెంట్ వైర్లు, ట్రిప్ అయిన ఫీడర్లు సాక్షి, హైదరాబాద్: ఈదురుగాలితో కూడిన భారీ వర్షానికి నగరంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడి వైర్లు తెగి పోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, మరికొన్ని చోట్ల ఇన్సులేటర్లు, ఏబీ స్విచ్‌లు, జంపర్లు, సీటీ/పీటీలో సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా బుధవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు గ్రేటర్లో 500పైగా ఫీడర్లు ట్రిప్పయ్యాయి. కొన్నిచోట్ల రెండు మూడు గంటల్లోనే విద్యుత్‌ను పునరుద్ధరించగా.. మరికొన్ని ప్రాంతాలు అంధకారంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంటి సామగ్రితో సురక్షిత ప్రాంతానికి తరలివెళ్తున్న హయత్‌నగర్ పద్మావతి కాలనీవాసులు విద్యుత్‌కు అంతరాయం దిల్సుఖ్నగర్, సరూర్‌నగర్, హయత్ నగర్, హస్తినాపురం, వందనపురి కాలనీ, సాగర్‌ఎన్‌క్లేవ్, రాఘవేంద్రనగర్, రెడ్డికాలనీ, కోదండరామ్‌కాలనీ, నాగోల్‌లోని అయ్యప్పనగర్, ఉప్పల్ స్వరూప్‌నగర్, మీర్పేట్ సాయినగర్ కాలనీ, మిథులానగర్ కాలనీ, జల్పల్లి, ఉస్మాన్‌నగర్, ఎర్రగుంట, జిల్లెలగూడ, అడిక్‌మెట్ డివిజన్లోని అంజయ్యనగర్, ముషీరాబాద్‌లోని పద్మాకాలనీ, అచ్చయ్య కాలనీ, శ్రీరాంనగర్‌బస్తీ, నాచారం ఎర్రకుంట, క్రి్రస్టియన్ కాలనీ, హరిహరపురం కాలనీలకు వరద పోటెత్తడంతో ఆయా ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు ఇంటి చుట్టూ నీరు.. ఇటు కరెంట్ కోత.. కొన్ని చోట్ల రెండు మూడు గంటల్లోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తే.. మరికొన్ని చోట్ల గురువారం రాత్రి పొద్దు పోయిన తర్వాత కూడా కరెంట్ సరఫరా కాలేదు. అసలే ఇంటి చుట్లు మోకాల్లోతు మురుగునీరు...ఆపై ఇంట్లో కరెంట్ కూడా లేక ప్యాన్లు పనిచేయక పోవడంతో దోమలు విజృంభించాయి. విని యోగదారుల కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఫలితంగా కొంత మంది ఇళ్లకు తాళాలు వేసుకుని బంధువుల ఇళ్లకు చేరుకోగా...మరికొంత మంది చీక ట్లోనే మగ్గిపోవాల్సి వచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులు క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బందికి ఫోన్ చేస్తే నంబర్లు స్విచ్ ఆఫ్ చేసి ఉంచడంతో వారు కొంత అసహనానికి గురయ్యారు. విధిలేని పరిస్థితుల్లో 1912 కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తే.. రోజంతా లైన్లు బిజీగా ఉన్నట్లు సమాధానమే వచ్చింది. ఆన్లైన్లో ఫిర్యాదులు చేసినా.. అధికారులు స్పందించలేదు. అంతే.. వానొస్తే చింతే.. సాక్షి, సిటీబ్యూరో: ఈ చిత్రం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని దీనదయాళ్నగర్ నాలా పనులకు సంబంధించినది. ఈ నాలాలో పడి గత సంవత్సరం సెపె్టంబర్లో సుమేధ (12) అనే బాలిక మరణించింది. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ రెండు మీటర్లలోపు ఓపెన్ నాలాలకు క్యాపింగ్ చేస్తామన్నారు. ఎక్కువ వెడల్పు నాలాలకూ అవసరమైన చర్యలు చేపడతామన్నారు. వర్షాకాలం రాకముందే మే మాసాంతానికి పనులు పూర్తి కావాల్సి ఉండగా, ప్రారంభమే కాలేదు. గత ఏడాది దుర్ఘటనను కొందరు గుర్తు చేయడంతో.. ఇటీవలే హడావుడిగా ప్రారంభించారు. పైకప్పులను పరుస్తున్నారు. ఈ నాలాకు సంబంధించి దీనదయాళ్నగర్ కమ్యూనిటీ హాల్ దగ్గరి నుంచి సంతోషిమాత గుడి వరకు 720 మీటర్ల మేర పనులకు బాక్స్ డ్రైనేజీ సహా రూ.2.40 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. పై ఫొటోల్లో కనిపిస్తున్నవే జరుగుతున్న పనులు. వర్షాలు దంచికొడుతున్నాయి. సీజన్ ముగిసేంత దాకా పనులయ్యే అవకాశం లేదు. ఇదే సర్కిల్ పరిధిలోని కాకతీయనగర్ నుంచి దీనదయాళ్నగర్ కమ్యూనిటీ హాల్ వరకు రూ. 45 లక్షలతో పనుల్ని కూడా ఇటీవలే చేపట్టారు. పరిసరాల్లోని రేణుకానగర్– కాకతీయనగర్ వరకు రూ. 1.40 కోట్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు.బండమైసమ్మ గుడి నుంచి దీనదయాళ్నగర్ వరకు 400 మీటర్ల మేర రూ. 19 లక్షల విలువైన పనులు మాత్రం పూర్తిచేశారు. బండ చెరువు నుంచి అనంత సరస్వతి కమాన్ వర కు రూ.66 లక్షల అంచనా పనుల టెండర్లు కూడా పూర్తికాలేదు.ఇదీ నాలాల పనులకు సంబంధించి ఉదాహరణ. అన్ని సర్కిళ్లలో అన్ని నాలాల పనులు కూడా దాదాపుగా ఇలాగే కుంటుతున్నాయి. చెరువుల పనులను పరిశీలిస్తే.. గత సంవత్సరమే దిల్సుఖ్నగర్ తపోవన్ కాలనీ రోడ్‌నెంబర్ 6 నుంచి సరూర్‌నగర్ చెరువులోకి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో స్కూటీతో ఉన్న ఒకరిని కాపాడబోయి ఓ వ్యక్తి మరణించిన ఘటన నగర ప్రజలింకా మరిచిపోలేదు. చెరువు వరద ముంపు సమస్య కంటే సుందర పనులకు ప్రాధాన్యం ఇచి్చన అధికారులు మట్టి కట్ట వేయడంతో చెరువులోకి నీరు పోకుండా కాలనీల్లో కాలనీల్లో నీరు నిలిచిపోయింది. కర్మన్‌ఘాట్, సరూర్‌నగర్ ప్రధాన రహదారి నుంచి చెరువు ఔట్ లెట్లో కలిపే తపోవన్ కాలనీలో పనులను చేయకుండా సగంలో ఆపేశారు. పరిసర కొన్ని కాలనీల నుంచి జనప్రియ కాలనీ వరకు నాలా పనులు పూర్తి చేసినప్పటికీ, అక్కడి నుంచి సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్ ప్రధాన రహదారి వరకు సుమారు 400 మీటర్ల పనులు ఇప్పటికీ ప్రారంభానికే నోచుకోలేదు. వీటితో పాటు పలు కాలనీల్లో పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాలేదు. దీంతో నీరు చెరువులోకి వెళ్లకుండా నీళ్లలో కాలనీల దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. -
హైదరాబాద్ వరదలు: ఏడ్చేందుకూ ఏమీ మిగలలేదు
వానలు వెలిశాయి. వరదలు తగ్గాయి. కానీ వరదలతో పాటే సర్వం కోల్పోయిన బాధితులు ఇంకా తేరుకోలేదు. పది రోజుల పాటు నీట మునిగిన హబ్సిగూడ కాలనీలో.. ఇప్పుడు ఖాళీ ఇళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. పోగొట్టుకున్న వస్తువుల కోసం దేవులాడుకొనే మనుషుల ఆవేదన కనిపిస్తోంది. రవీంద్రనగర్, లక్ష్మీనగర్, సాయిచిత్రానగర్ తదితర కాలనీల్లో ఇళ్లంటే ఖాళీ గోడలు, పై కప్పులు, బురద పేరుకున్న గచ్చు మాత్రమే. పాడైన సోఫాలు, మంచాలు, దుప్పట్లు, వంటపాత్రలు, టీవీలు, ఫ్రీజ్‌లు అక్కడక్కడా రోడ్లపై కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. సాక్షి, హైదరాబాద్: ఇరవై ఏళ్ల క్రితమే కల్వకుర్తి నుంచి వచ్చిన విజయ, నర్సింహారావు దంపతుల కుట్టుమిషన్లు.. నందూ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే విలువైన పుస్తకాలు, ఆన్లైన్ చదువుల కోసం తెచ్చిన మొబైల్ ఫోన్లు, ఇందిర కిరాణా దుకాణం, సంపత్ హెయిర్ కటింగ్ సెలూన్... అన్నీ శిథిల జ్ఞాపకాలే. రవీంద్రనగర్ కాలనీకి చెందిన అభిజిత్‌రెడ్డి మాటల్లో చెప్పాలంటే ‘ఇప్పుడు అక్కడ ఏం మిగిలిందని... కట్టుబట్టలు... వరద మిగిల్చిన కష్టాలు తప్ప... పదిరోజుల క్రితం నీటమునిగిన హబ్సిగూడ కాలనీలే కాదు. గ్రేటర్‌లోని వందలాది కాలనీల్లో నిరాశ్రయులైన వేలాది కుటుంబాలు, లక్షలాది ప్రజలకు ఇప్పుడు వరద వదిలి వెళ్లిన కష్టాలు, బురద నిండిన రోడ్లు మాత్రమే మిగిలాయి. ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వానలు.. వరదలు మిగిల్చిన బాధలు వెల్లడయ్యాయి.. చెదిరిన గూడు... వరదలో కొట్టుకుపోగా మిగిలిన వస్తువులను డాబాపైన ఆరబెట్టుకొని బిక్కుబిక్కుమంటూ నిస్సహాయంగా చూస్తున్న విజయ, నర్సింహారావు దంపతులు 20 ఏళ్ల క్రితం నగరానికి వచ్చారు. ఇంట్లో చాలా వస్తువులు నీటిపాలయ్యాయి. బియ్యం, ఉప్పు, పప్పులతో సహా అన్నీ పోయాయి. ఇప్పుడు హోటల్ నుంచి ఏదో ఒకటి తెచ్చుకొని తింటున్నారు. రాత్రి పూట కటిక నేలపైనే నిద్రిస్తున్నారు. ఇదంతా ఒకవైపు అయితే.. మరోవైపు ఆమె ప్రాణప్రదంగా భావించే కుట్టుమిషన్ కూడా నీటిలో కొట్టుకుపోయింది. ఇరవై ఏళ్లుగా ఉపాధినిచ్చిన కుట్టుమిషన్ అది. దానితో పాటే దసరా కోసం తెచ్చిపెట్టిన డ్రెస్ మెటీరియల్స్, చీరలు, చుట్టుపక్కల మహిళల నుంచి తీసుకున్న ఆర్డర్లు అన్నీ పోయాయి. ‘కనీసం రూ.5 లక్షల విలువైన వస్తువులు వరదలో పోయాయి. ఇప్పుడు ఉన్నవాటిలో చాలా వరకు పనికి రాకుండా ఉన్నాయి. ఈ వయసులో పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించుకోగలమా. టైలరింగ్ అంటే చాలా ఇష్టం. కానీ కుట్టుమిషన్ కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేవ్..’ విజయ ఇంట్లోనే కాదు. ఆమె కళ్లల్లోనూ నీరింకిపోయింది. బహుశా ఏడ్చేందుకు కూడా ఏమీ మిగలలేదు. కూలిన బతుకులు... మేఘావత్ నందు, సరోజ దంపతులు రెండేళ్ల క్రితం రవీంద్రనగర్ కాలనీకి వచ్చారు.అక్కడే ఒక గుడిసె వేసుకుని ఉంటున్నారు. ఆ నేలకు ప్రతి నెలా రూ.1000 చొప్పున అద్దె చెల్లిస్తారు.సరోజ ఉదయంపూట ఇళ్లల్లో పని చేస్తుంది. నందు కూలీకి వెళ్తాడు, సాయంత్రం ఇద్దరూ కలిసి జొన్న రొట్టెలు చేసి అమ్ముతారు. ఇద్దరు కూతుళ్లు. వాళ్లను బాగా చదివించేందుకు కష్టపడుతున్నారు. రూ.9000 ఖర్చు చేసి ఇద్దరికీ పుస్తకాలు తెచ్చారు. ఆన్లైన్ చదువుల కోసం మరో రూ.20 వేలు ఖర్చు చేసి రెండు మొబైల్ ఫోన్లు కొనుక్కొచ్చారు. ఇదంతా వాళ్ల శక్తికి మించిన ఖర్చే కానీ పిల్లలు బాగా చదువుకోవాలనే ఆశ కొద్దీ భారమైనా భరించారు. కానీ అన్నింటినీ ఒక్క వాన తుడిచిపెట్టింది. ఆ రాత్రి కోసం వండుకున్న అన్నం, కూరలతో సహా అన్నీ వరదలపాలయ్యాయి. పుస్తకాలు, సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, టీవీ, వంటగ్యాస్, స్టౌ, బియ్యం...ఏదీ మిగల్లేదు. ‘‘కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదు.ఇప్పుడు ఎవరో ఒకరు అన్నం పెడుతున్నారు. రాత్రి పూట బాల్కనీల్లో తలదాచుకుంటున్నాం. దేవరకొండ నుంచి వచ్చాం. పిల్లలను బాగా చదివించాలనుకున్నాం. కానీ మరోసారి సెల్ఫోన్లు,పుస్తకాలు కొనగలమా..’’నందు ఆవేదన ఇది. ఏం మిగిలిందంటే... అభిజిత్రెడ్డిది ఉమ్మడి కుటుంబం. పది మంది కుటుంబ సభ్యులు.పెద్ద ఇల్లు. పిల్లలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. కానీ ఆ రాత్రి ఏకధాటిగా కురిసిన వర్షం ఇంటిల్లిపాదికి కునుకు లేకుండా చేసింది. ఇల్లంతా నీట మునిగింది. అందరూ అతి కష్టంగా డాబాపైకి చేరుకున్నారు. మరుసటి రోజు పడవ సహాయంతో బయటకు వచ్చి బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ ఇంటి నిండా బురద మాత్రమే మిగిలింది. ‘‘ ఏం మిగిలిందని చెప్పాలి. 6 క్వింటాళ్ల బియ్యం నీటిలో కలిసిపోయాయి. రూ.లక్ష ఖరీదైన ఫ్రిజ్ పోయింది.టీవీలు,మంచాలు,పరుపులు,బెడ్షీట్లు, బుల్లెట్, ఇన్నోవా కారు పాడయ్యాయి. రెండు లాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు.. ఐప్యాడ్ అన్నీ పోయాయి. కనీసం రూ.25 లక్షల నష్టం వాటిల్లింది. ఒక్క వస్తువు కూడా పనికొచ్చేలా లేదు, ఇంటి గోడలు కూడా పాడయ్యాయి. తిరిగి బాగు చేసుకొంటే తప్ప ఇంట్లో ఉండలేము.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కోల్పోయారు... లక్ష్మీనగర్‌కు చెందిన నిర్మల అపార్ట్మెంట్లో ఆరు కుటుంబాలు సర్వం కోల్పోయాయి. ఆ ఇళ్లల్లో పాడైన వస్తువులను జీహెచ్ఎంసీ వాహనాల్లో తరలించారు. ‘‘అధికారులు ఇటు వైపు తొంగి చూడడం లేదు.కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదు. పరిహారం కూడ ఎవరికి ఇస్తున్నారో తెలియదు.చాలా బాధగా ఉంది..’’ అని అపార్ట్మెంట్ యజమాని నిర్మల చెప్పారు. వరంగల్ నుంచి వచ్చి రవీంద్రనగర్ కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్న ఇందిర, రమేష్ దంపతులు కిరాణా షాపులో కనీసం రూ.6 లక్షల విలువైన సరుకును కోల్పోయారు. ఇల్లు కూడా నీట మునిగింది. ‘‘ అప్పు కోసం తిరుగుతున్నాను. వానొచ్చినా, వరదొచ్చినా బతకాల్సిందే కదా. కిరాణా షాపు తప్ప మరేం ఆధారం ఉంది. అందుకే మళ్లీ షాపు పెట్టుకొనేందుకు అప్పు చేయవలసి వస్తుంది.’’ అని చెప్పారు రమేష్. కళ్లకు కడుతున్న వరద బాధితుల కడగండ్లు.. ఫొటోగ్యాలరీ -
ఔదార్యం చాటుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు
సాక్షి, సిద్ధిపేట : గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరబాద్ నగరం అతలాకుతలం అయింది. పలు కాలనీలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వరద బాధితులకు తన వంతు సహాయంగా సినీ నటుడు సంపూర్ణేష్ బాబు 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందజేశాడు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకు సంబంధిత చెక్కును అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. అకాల వర్షాల కారణంగా హైదరాబాద్ ప్రజలు ఎంతో నష్టపోయారని వారికి తన వంతు సహాయం అందించానని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు సంపూర్ణేష్ బాబును అభినందించారు.సిద్దిపేట బిడ్డగా, సినీ ఆర్టిస్టుగా మానవత్వం చాటుకున్నారని ప్రశంసించారు. (హైదరాబాద్ వరదలు : ప్రభాస్ భారీ విరాళం ) గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు కాలనీలు నీట మునిగాయి. ఈ భారీ వర్షాల కారణంగా నగరవాసులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందల్లో కాలనీలు జలదిగ్బంధం కావడంతో ప్రజలు భయట అడుగు పెట్టలేని పరిస్థితి నేలకొంది. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. 550 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ప్రభాస్ సహా పలువురు ప్రముఖులు సీఎం రిలీఫ్ ఫండ్‌కి భారీ విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. (హైదరాబాద్ వరదలు: నాగార్జున విరాళం) -
భారీ వర్షం: రేపు హైదరాబాద్‌కు కేంద్ర బృందం
సాక్షి, హైదరాబాద్: గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మహా నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో మునిగిన ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు చేపడుతోంది. డీఆర్ఎఫ్ బృందాలు వర్షాభావ ప్రాంతాల్లో బోట్లను కూడా అందుబాటులో ఉంచారు. మరోవైపు వర్షాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు సైతం తమవంతు ఆర్ధిక సాయాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు. చదవండి: సిటీలో పలు చోట్ల భారీ వర్షం ఇదిలా ఉండగా ఈ రోజు(బుధవారం) సాయంత్రం కేంద్ర బృందం హైదరాబాద్‌కు రానుంది. రెండు రోజులపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇక వర్షాలతో రాష్ట్రంలో వేల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు తక్షణ సాయంగా రూ.1350 కోట్లు విడుదల చేయాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం నగరానికి విచ్చేయనుంది. చదవండి: ఆర్థిక సాయం: ఇంటికి పదివేలు.. -
భారీ వర్షం; బండి ‘బేజార్’..
సాక్షి, సిటీబ్యూరో: వానల కారణంగా నీటమునిగిన వాహనాలకు మరమ్మతులు చేయించడం కూడా ఇప్పుడు కష్టంగా మారింది. బీమా సంస్థలు సకాలంలో గుర్తించి నష్టాన్ని అంచనా వేయకపోవడం వల్ల, మెకానిక్లపైన పెరిగిన ఒత్తిడి కారణంగా, సిటీలో విడిభాగాల కొరత ఏర్పడింది. దీంతో వేలాది వాహనాలు మరమ్మతులకు కూడా నోచుకోలేని పరిస్థితి నెలకొంది. బైక్‌లకు మాత్రం రెండు, మూడు రోజుల్లో సర్వీసింగ్ సేవలు లభిస్తుండగా కార్ల విషయంలో మాత్రం జాప్యం ఎక్కువగా ఉంది. కోవిడ్ కారణంగా నగరంలో వ్యక్తిగత వాహనాల వినియోగం భారీగా పెరిగింది. కానీ ప్రస్తుతం చాలా చోట్ల వాహనాలు నీటమునిగి వినియోగానికి పనికిరాకుండా పాడైపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చదవండి: విశ్వ నగరాలు.. శాస్త్రీయ విధానాలు నగరంలోని మల్కాజిగిరి, అల్వాల్, సికింద్రాబాద్, పాతబస్తీ, ఎల్బీనగర్, హయత్‌నగర్, వనస్థలిపురం, ఉప్పల్, బోడుప్పల్, నాచారం, ఈసీఐఎల్ తదితర ప్రాంతాల్లో వరుసగా కురుస్తున్న వర్షాలు, వరదలతో వేల కొద్దీ కార్లు, ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. కోవిడ్ మహమ్మారి నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్ కారణంగా ప్రజారవాణా స్తంభించడంతో నగరంలో వ్యక్తిగత వాహనాల వినియోగం భారీగా పెరిగింది. రవాణాశాఖ అంచనాల మేరకు నగరంలో సుమారు 55 లక్షల వాహనాలు ఉన్నాయి. గత మూడు నెలల్లోనే 60 వేల ద్విచక్ర వాహనాలు, మరో 25 వేలకు పైగా కార్లు రోడ్డెక్కాయి. ఇప్పటికీ ఒక్క మెట్రో సర్వీసులు మినహా సిటీ బస్సులు పరిమితంగానే ఉండడం వల్ల, ఎంఎంటీఎస్ వంటివి లేకపోవడం వల్ల ఎక్కువ మంది వ్యక్తిగత వాహనాలపైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. ఒక్కసారిగా పోటెత్తిన వర్షాలు, వరదలతో 1500కు పైగా కాలనీలలో వరదబీభత్సం సృష్టించించింది. రహదారులు సైతం చెరువులను తలపించాయి. ఇలాంటి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వాహనాలు నీటిపాలయ్యాయి. చదవండి: రాష్ట్రంలో పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు.. రూ.వేలల్లో భారం... ప్రకృతి వైపరీత్యాలు, వరదల్లో చిక్కుకునిపోయి చెడిపోయినప్పుడు సదరు బీమా సంస్థల సమక్షంలోనే వాహనాలను బయటకు తీసి నష్టాన్ని అంచనా వేయవలసి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ ప్రక్రియ స్తంభించింది. వాహనదారులే స్వయంగా బయటకు తీసి మెకానిక్ షెడ్లకు తరలిస్తున్నారు. బీమా సంస్థల అనుమతిలో జాప్యం కారణంగా షోరూమ్ మెకానిక్‌లకు తరలిస్తున్న వాటి సంఖ్య తక్కువగానే ఉంది. మరోవైపు కొన్ని సంస్థలు మాత్రం వినియోగదారులే ఖర్చులు భరించి బిల్లులు అందజేస్తే ఆ మొత్తాన్ని అందజేయనున్నట్లు చెబుతున్నాయి. ప్రస్తుతం నీటమునిగిన కార్లలో ఎక్కువ శాత ఈసీఎం, సీజ్బాక్స్, సెంటర్ లాకింగ్ బాక్స్, ఎయిర్‌బ్యాగ్ మిడిల్, పవర్‌స్టీరింగ్ వంటివి దెబ్బతింటున్నాయి. డాష్‌బోర్డు వరకు నీళ్లు చేరితే నష్టం ఎక్కువగానే ఉంటుంది. విడిభాగాల అవసరంఇంకా పెరుగుతుంది. సగటున ఒక్కో కారు రిపేర్ కోసం రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు ఖర్చవుతున్నట్లు అంచనా. చదవండి: వణికిస్తున్న మీర్పేట్ చెరువు బైక్‌లు తుప్పు పడితే కష్టమే... సైలెన్సర్లలోకి నీరు పోవడం వల్ల ఇంజన్ దెబ్బతింటుంది. ఎక్కువ రోజులు నీళ్లల్లో ఉంటే విడిభాగాలు తుప్పు పట్టిపోతాయి. ప్రస్తుతం నీటమునిగిన బైక్‌లలో ఎక్కువ శాతం ఎయిర్ఫిల్టర్లు, పవర్కాయిల్స్, స్టార్టింగ్ కాయిల్స్ దెబ్బతింటున్నాయి. పిస్టన్, బేరింగ్స్ వంటివి చెడిపోతున్నాయి. బైక్ సర్వీసింగ్ ఖర్చు రూ.2500 నుంచి రూ.విడిభాగాల వినియోగం మేరకు రూ.5000 వరకు వస్తుంది. పూర్తిబీమా ఉంటేనే పరిహారం... నీటమునిగిన వాహనాల మరమ్మతుల కోసం చెల్లింపుల్లో జాప్యం ఉన్నప్పటికీ బీమా సంస్థలపైన ఒత్తిడి కూడా పెరిగింది. సాధారణంగా ప్రతి వాహనానికి పూర్తి బీమా ఉంటేనే పరిహారం లభిస్తుంది. థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్లకు ఇది వర్తించదు. వాహనానికి జరిగిన నష్టాన్ని బీమా సంస్థలు సర్వేయర్ల ద్వారా అంచనా వేసి నిర్ధారిస్తాయి. అప్పటి వరకు వాటిని ఇంజన్ స్టార్ట్ చేయకుండా నీటిలోంచి బయటకు తీసి పెట్టాలి. ఇంజన్ స్టార్ట్ చేసి బండి నడిపితే బీమా పరిహారం లభించదు. ఒక వర్షం.. వేయి సవాళ్లు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలనూ చుట్టిముట్టిన వాన వెయ్యి సవాళ్లు కనబడేలా చేస్తోంది. నగరానికి వచ్చే దాదాపు అన్ని జాతీయ, స్టేట్ హైవేలు వరద నీటిలో చిక్కుకొని...కొన్ని మార్గాల్లో రహదారి కూడా పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత వారం రోజులుగా రెండుసార్లు కురిసిన భారీ వర్షం నగర రహదారుల దుస్థితిని తేటతెల్లం చేసింది. సిటీపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా నగర శివారు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పుణ్యమా అని రవాణా మార్గం కొంతమెరుగుపడింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఓఆర్ఆర్కు అనుసంధానంగా ఇంకా నిర్మించాల్సిన రేడియల్ రోడ్లతో పాటు ప్రతిపాదిత స్పైక్ రోడ్ల నిర్మాణం ఆచరణరూపం దాలిస్తే రవాణా కనెక్టివిటీ బాగా ఉండేది. భారీ వర్షాల వంటి విపత్తులు సంభవించినప్పుడు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఈ రహదారులు ఉపయోగపడే ఆస్కారముందని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే వీటికి రూ.ఆరు వేల కోట్లకుపైగా నిధులు వెచ్చిస్తేనే మెరుగైన రవాణా ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఆయా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 33కు అందుబాటులోకి 23 ఇన్నర్ రింగ్–ఔటర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా 33 రేడియల్ రోడ్లు అందుబాటులోకి తీసుకురావాలని కొన్నేళ్ల క్రితం నిర్ణయించిన హెచ్ఎండీఏ అధికారులు జైకా రుణ సహాయంతో ఇప్పటివరకు 19 రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మరో నాలుగు ఆర్ అండ్ బీ అధికారులు నిర్మించారు. అంటే ఇప్పటివరకు 23 రేడియల్ రోడ్లు మాత్రమే పూర్తిస్థాయిలో వాహనదారులకు అందుబాటులోకి వచ్చాయి. నాగోల్ నుంచి ప్రతాపసింగారం వరకు రేడియల్ రోడ్డు నిర్మించే అంశాన్ని ప్రస్తుతం హెచ్ఎండీఏ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కురిసిన వర్షం ధాటికి ఆయా ప్రాంతాల్లో రహదారులపైకి వరద నీరు వచ్చి వాహనదారులకు ఇబ్బందులు ఎదురుకావడంతో ఈ అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. ఇక మిగిలిన తొమ్మిది రేడియల్ రోడ్లకు భూసేకరణ అడ్డంకిగా ఉండడం, ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలు ఉండడం, కాలనీల మధ్య నుంచి వెళ్తుండడంతో వాటిని పట్టాలెక్కించలేదు. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా సాఫీ జర్నీ కోసం మరిన్ని రోడ్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డుకు రీజినల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా దాదాపు 50కి పైగా ప్రాంతాల్లో స్పైక్ రహదారులు నిర్మించాలని ఆలోచించిన అధికారులు ఇప్పటివరకు ఆచరణ రూపంలోకి తీసుకురాలేదు. వీటిని అందుబాటులోకి తీసుకొస్తే భారీ వర్షాలు పడినా వాహనదారుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఈ రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.ఆరు వేల కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశముందని అధికారులు చెబుతుండడంతో ఇవి అచరణ రూపంలోకి వస్తాయా అన్నది అనుమానమే. -
భారీ వర్షం.. పానీపూరి తినడానికి వెళ్లి!
సాక్షి, హైదరాబాద్ : మంగళవారం నగరంలో కురిసిన కుండపోత వర్షానికి వీధులన్నీ జలమయమయ్యాయి. కాలనీల్లోకి వరద నీరు చేరడంతో జన జీవనం అతలాకుతలమైంది. వదరలో వాహనాలు కొట్టుకుపోగా కొన్ని వందల చెట్లు నెలకొరిగాయి. ఇప్పడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అబ్దుల్లాపూర్ మెట్టు మండలం ఇంజపూర్ వాగులో గురువారం ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిని తోరూరు గ్రామానికి చెందిన ప్రణయ్(19), ప్రదీప్ (16)లుగా పోలీసులు గుర్తించారు. మంగళవారం సాయంత్రం తోరూరు గ్రామం నుంచి ఇంజపూర్‌కు పానీపూరి తినడానికి వెళుతుండగా ప్రణయ్, ప్రదీప్ వాగులో గల్లంతయ్యారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను వేలికితీసిన పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. చదవండి: ఇంకా వీడని అంధకారం.. మరోవైపు నాగోల్ బండ్లగూడా మల్లికార్జున నగర్లో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి కురిసిన వర్షాలతో ఏర్పడిన వరదలో పోస్ట్ మాన్ సుందర్ రాజు కొట్టుకుపోయాడు. విధులు ముగించుకుని బండ్లగూడా మల్లికార్జున నగర్‌లోని ఇంటికి సైకిల్‌పై వెళుతుండగా నీళ్లలో పడిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దురదృష్టవశాత్తు 48 గంటలు తర్వాత సందర్ శవమై తేలడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. చదవండి: హైదరాబాద్ సీపీ ఇంట్లోకి వరదనీరు -
పండుగపూట తడిసి ముద్దయిన నగరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు వీడటంలేదు. వరుస వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. దీంతో బతుకమ్మ ఉత్సవాలకు అనేకచోట్ల ఆటంకం కలిగింది. ఈ వర్షాల కారణంగా పలు పంటలపై వ్యతిరేక ప్రభా వం చూపే పరిస్థితి కనిపిస్తుంది. పత్తి కాయ పగిలే దశలో ఉన్నందున నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తా కర్ణాటక వరకు తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇంటీరియర్ ఒడిశ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో సోమవారం కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఒకట్రెండుచోట్ల భారీవర్షాలతోపాటు, చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. నగరంలో 10 సెంటీమీటర్ల వర్షం రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరం వరుస వర్షాలతో నిండా మునుగుతోంది. ఆదివారం క్యుములోనింబస్ మేఘాల కారణంగా నగరంలో కుండపోత వర్షం కురిసింది. ఆదివారం మధ్యా హ్నం నుంచి హైదరాబాద్‌లోని కూకట్పల్లి మండ లం రాజీవ్‌గృహకల్ప, జగద్గిరిగుట్ట ప్రాంతా ల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుతు్బల్లాపూర్ మండలం గాజులరామారం, ఉషోదయపార్కు వద్ద 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక షాపూర్‌నగర్‌లో 8.5, సుభాష్‌నగర్, ఆలి్వ న్ కాలనీలలో 7, అంబర్‌పేట, రామంతాపూర్‌లలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లోని వందకుపైగా బస్తీలు నీటమునిగాయి. ప్రధాన రహదారులపై ఉన్న భారీ వృక్షాలు కుప్పకూలడంతో వాటి కింద పార్కింగ్ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇళ్లలోకి చేరిన వరదనీటిని తోడేందుకు పలు బస్తీల వాసులు నానా అవస్థలు పడ్డారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టాయి. పలు నాలాలు ఉగ్రరూపం దాల్చడంతో వాటికి ఆనుకుని ఉన్న బస్తీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇంట్లోకి చేరిన నీటిలో మునిగి వ్యక్తి మృతి బొల్లారం: తిరుమలగిరిలో ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం ఓ వ్యక్తి ప్రాణాలను హరించింది. ఇక్కడి శాస్త్రీనగర్‌లోని నాలా ఉప్పొంగి దానికి ఆనుకొని ఉన్న ఇంట్లోకి ప్రవహించడంతో నిద్రలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల కథనం మేరకు శాస్త్రీనగర్‌కు చెందిన జగదీశ్(35), తల్లితో కలిసి గత రెండేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. తల్లి బాయమ్మ స్థానిక చర్చితో పాటు పలు చర్చిల వద్ద యాచిస్తూ జీవనం సాగిస్తోంది. కాగా ఆదివారం మధ్యాహ్నం జగదీశ్ ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఇదే సమయంలో భారీగా వర్షం కురవడంతో అతని ఇల్లు కూడా నాలా వెంట ఉండడంతో వరద నీళ్లు ఉప్పొంగి వారి ఇంట్లోకి ప్రవేశించాయి. గాఢ నిద్రలో ఉన్న జగదీశ్ ఈ విషయం తెల్సుకునేలోపే ఊపిరందనిస్థితికి చేరుకొని ప్రాణాలు కోల్పోయాడు. వర్షం తగ్గిన తరువాత ఇంట్లోని గడప వద్ద పడివున్న జగదీశ్ మృతదేహాన్ని స్థానికులు గమనించి తల్లికి విషయాన్ని చేరవేశారు.విగతజీవుడిగా ఉన్న కుమారుడిని చూసి తల్లి కుప్పకూలింది. కాగా అతనికి మూర్ఛవ్యాధి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బస్తీవాసులతో పాటు బోర్డు సభ్యురాలు భాగ్యశ్రీ, టీఆర్ఎస్ ఏడోవార్డు అధ్యక్షుడు కేబీశంకర్‌రావు ఆర్థిక సాయం చేయడంతో జగదీశ్‌కు అంత్యక్రియలు జరిపారు. -
హైదరాబాద్‌ను మరోసారి ముంచెత్తిన వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. నగరంలోని పలు ప్రాంతల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. నారాయణగూడ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్‌లలో భారీగా వర్షం పడుతోంది. కోటి, అబిడ్స్, నాంపల్లి, అఫ్జల్‌గంజ్ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడి.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షం ధాటికి నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లమీద వరదనీరు చేరింది. ఒకవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్‌లతో నగరవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. -
మళ్లీ నగరాన్ని చుట్టేసిన వర్షం..
-
మళ్లీ నగరాన్ని చుట్టేసిన వర్షం..
సాక్షి, హైదరాబాద్: నగరాన్ని వర్షాలు మళ్లీ ముంచెత్తుతున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. సెలవు దినం కూడా మున్సిపల్ కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఉప్పల్, ఎల్బీనగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్‌లలో కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు సెలవు దినం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు నుంచి నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. మరో నాలుగు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. -
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: నగరాన్ని వర్షాలు మళ్లీ ముంచెత్తుతున్నాయి. శుక్రవారం రాత్రి నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల మేర రోడ్ల మీద ట్రాఫిక్ నిలిచిపోవడంతో వానలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూకట్పల్లి, అమీర్‌పేట, కొండాపూర్‌లో కుండపోతగా వర్షం కురుస్తోంది. మియాపూర్, బీహెచ్ఈఎల్, బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, పంజాగుట్ట వర్షం భారీ కురుస్తోంది. ఉప్పల్, మెహిదీపట్నం, కార్వాన్, టోలిచౌక్, అంబర్ పేట, శేరిలింగంపల్లి, కంటోన్మెంట్ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. మాదాపూర్‌లో ఏకంగా 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ట్రాఫిక్ కష్టాలు..! శుక్రవారం రాత్రి భారీ వర్షం నగరాన్ని ముంచెత్తడంతో నగరవాసులు తీవ్ర అవస్థలు పడ్డారు. రోడ్ల మీద భారీగా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు నరకం అనుభవించారు. కిలోమీటర్ దూరం వెళ్లేందుకు కూడా గంటలకొద్దీ సమయం పడుతుండటంతో వానలో సిటీ వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. భారీ వర్షంతో మదాపూర్ నుంచి మియాపూర్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే రహదారిలోనూ ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు అనేక అవస్థలు పడ్డారు. ఇటు చే నంబర్ రోడ్డులోనూ, అటు జుబ్లీహిల్స్, హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు కుత్బుల్లాపూర్ 6.18 సెం.మీ మాదాపూర్ 5.88 సెం.మీ కుత్బుల్లాపూర్(జీహెచ్ఎంసీ) 4.48 సెం.మీ బాలానగర్ 2.83 సెం.మీ ఆసిఫ్ నగర్ 1.40 సెం.మీ -
భారీష్..
-
నాలాల ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక ప్రణాళిక
హైదరాబాద్ : నగరాన్ని ముంచెత్తిన వరదలను దృష్టిలో ఉంచుకుని వర్షాల నుంచి కోలుకున్నాక నాలాల ఆక్రమణలపై హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) దృష్టి పెట్టాలని నిర్ణయించింది. నాలాల ఆక్రమణల తొలగింపుపు ప్రత్యేక ప్రణాళికను రూపొందించనుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్, చీఫ్ సిటీ ప్లానర్ సభ్యులుగా నాలాలపై అధ్యయనానికి ఓ ప్రత్యేక కమిటీని వేసింది. ఈ కమిటీ పది రోజుల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు ఇచ్చింది. శాటిలైట్ చిత్రాల ద్వారా నాలాల పరిస్థితిని అంచనా వేయాలని నిర్ణయించింది. ఆక్రమణల కేసును పరిష్కరించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయనుంది. ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఈ నెల 26న జరిగే మంత్రివర్గం తీర్మానం చేయనుంది. అలాగే రోడ్ల నిర్మాణంపై ఏడాదంతా ప్రత్యేక దృష్టి పెట్టనుంది. -
హైదరాబాద్ అతలాకుతలం..రంగంలోకి ఆర్మీ
హైదరాబాద్ : భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న భాగ్యనగరంలో వరద సహాయక చర్యల కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్మీ సాయం కోరింది. మరి కొన్నిరోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో వరద తగ్గే వరకూ సహకారం అందించాలని ప్రభుత్వం ఆర్మీకి విజ్ఞప్తి చేసింది. ఆర్మీతో సమన్వయం చేసుకునేందుకు జీహెచ్ఎంసీ తరఫున ముగ్గురు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. జీహెచ్ఎంసీ అధికారుల వినతి మేరకు రంగంలోకి దిగిన ఆర్మీ శుక్రవారం ఆల్వాల్ లో పర్యటించి అక్కడి పరిస్థితిని పరిశీలించింది. కాగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగి అనేక ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సహాయచర్యలు చేపట్టినా తగినంత ఫలితం కనిపించడం లేదు. దీంతో అధికారులు ఆర్మీ సాయం కోరారు. మరోవైపు జీహెచ్ఎంసీ కమిషనర్ భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని బొంతు రామ్మోహన్ సూచించారు. అటువంటి మెసేజ్‌లు పంపిస్తే... ఐపీ అడ్రస్ ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
తెలంగాణలో మరో ఐదురోజులు భారీ వర్షాలు
హైదరాబాద్ : తెలంగాణలో మరో అయిదు రోజులు భారీ వర్షాలు కురియనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో నగరంతో పాటు తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా ఇప్పటికే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. నగరంలో ఇంకా పలు ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. మరోసారి భారీ వర్ష సూచనతో ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు. రెండో రోజు కూడా వారికి నిద్ర కరువు నిజాంపేటలోని తుర్క చెరువు ఉగ్రరూపం దాల్చడంతో చెరువు కింద ఉన్న బండారి లేఅవుట్ కాలనీలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. భయంతో నిద్రలేకుండా రెండో రోజు కూడా సహాయం కోసం వేచిచూస్తున్నారు. తుర్క చెరువు చిన్న తూము తెరవడంతో కాలనీలోకి నీరు చేరడంతో పాటు కాలనీలో నుంచి నీరు బయటికి వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో నీరు కాలనీలోనే సెల్లార్ల నిండా ఉంది. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు సెల్లార్లలో నీరు మోటార్లద్వారా బయటికి పంపించేందుకు తీవ్ర యత్నం చేస్తున్నప్పటికీ తూము నీరు ప్రవాహం తగ్గకపోవడంతో నీరు తగ్గడంలేదు. దీంతో ఇళ్ళల్లో ఉన్న వృద్దులు, పిల్లలు బయటికి రాలేని పరిస్థితి దాపురించింది. రెండు రోజులుగా విద్యుత్ సరఫరా లేదు. మంచినీటిసరఫరా లేదు. పాలు, ఆహార పదార్ధాల కోసం రోడ్లపై ఉన్న నీటిలోనుంచి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా ప్రజలు తమ బాధను వచ్చిన ప్రతి ప్రజాప్రతినిధికి, అధికారికి విన్నవించిన సమస్యకు పరిష్కారం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిజాంపేట బండారి లేఅవుట్లో నీట మునిగిన అపార్ట్మెంట్లను మంత్రి కేటీఆర్ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా తమ కాలనీకి శాశ్వత పరిష్కారం చూపించాలని మంత్రికి మహిళలు పెద్దపెట్టున మొరపెట్టుకున్నారు. కొంతమంది కాలనీ వాసులు లే అవుట్‌కు విరుద్దంగా నిర్మాణాలు వెలిశాయని కూడా ఫిర్యాదు చేశారు. దాదాపు మూడు గంటల పాటు మంత్రి వెంట మహిళలు తమ బాధలను వివరించారు. ఇలాంటి ప్రకృతి వైఫరీత్యాలు ఏర్పడినపుడు ప్రభుత్వం చేసే సహాయ కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
హైదరాబాద్‌లో అవసరమైతే సైన్యం సాయం!
హైదరాబాద్: హైదరాబాద్‌ను ఎడతెరిపి లేని వర్షాలు బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో నగరంలోని వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డికి ఫోన్ చేసి.. నగరంలోని పరిస్థితిని ఆరా తీశారు. భారీ వర్షాలు, వరదల వల్ల పరిస్థితి తీవ్రంగా ఉంటే.. సైన్యం సహాయం తీసుకోవాలని సూచించారు. మరోవైపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలపై డీజీపీ అనురాగ్ గురువారం సమీక్ష నిర్వహించారు. వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పనిచేయాలని ఆయన పోలీసులను ఆదేశించారు. ఛలాన్లు ఆపేసి.. ట్రాఫిక్ క్లియర్ చేయాలని ఆయన సూచించారు. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు భయపెడుతున్న సంగతి తెలిసిందే. గత రెండురోజులుగా కురిసిన వర్షాలకు నగరం అతలాకుతలమైంది. తాజాగా గురువారం మధ్యాహ్నం నుంచి పలుప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, ముషీరాబాద్, మూసాపేట్, బంజారాహిల్స్, తార్నాక, బర్కతపురా, అమీర్‌పేట, ఎస్ఆర్నగర్, నిజాంపేట్, మియాపూర్, ఉప్పల్, మాదాపూర్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. మొన్న కురిసిన భారీ వర్షానికి బెంబేలెత్తిపోతున్న ప్రజలకు నిన్న వర్షం తెరపివ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు భారీ వర్షం ముంచెత్తడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వందలాది అపార్ట్ మెంట్ల సెల్లార్లలో భారీగా నీరు చేరింది. పలు చోట్ల చెరువులు నిండు కుండలా మారాయి. తాజా వర్షంతో నగరంలోని రహదార్లు చెరువులుగా మారుతున్నాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంపు ప్రాంతాల ప్రజలు నిత్యావసర వస్తువులు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. నిజాంపేట బంగారీ లేఅవుట్ లో నీట మునిగిన అపార్ట్‌మెంట్స్‌లో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. దీంతో దిక్కు తోచని స్థితిలో స్థానికులు ఉన్నారు. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి చార్మినార్ చుట్టూ భారీగా వరద నీరు చేరింది. దీంతో..స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొకాళ్ల లోతు నీటిలో తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
జీహెచ్ఎంసీ కమిషనర్‌కు కేసీఆర్ ఫోన్
హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డికి ఫోన్ కాల్ చేశారు. భారీ వర్షాల కారణంగా నగరంలో ఏర్పడ్డ పరిస్థితులపై ఆయన ఈ సందర్భంగా ఆరా తీశారు. నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. అవసరం అయితే రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని సూచించారు. అలాగే హుస్సేన్ సాగర్ ద్వారా నీటి విడుదల సందర్భంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. జీహెచ్ఎంసీ, పోలీస్, జలమండలి, విద్యుత్, నీటి పారుదల శాఖ ఇతర ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచన చేశారు. అలాగే నగరంలోని చెరువులు, కుంటల్లోకి భారీ వరదనీరు వస్తున్నందున అవి తెగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. కాగా నగరంలో చేపట్టిన పునరావాస, సహాయ చర్యలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. -
భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ సమీక్ష
హైదరాబాద్ : నగరంలో భారీ వర్షాలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల నిమిత్తం నగరంలో 220 మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు పని చేస్తున్నాయని ఆయన తెలిపారు. నీట మునిగిన కాలనీలు, బస్తీల్లో భోజన వసతి ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు. నాలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. పైప్‌లైన్ పగలడం వల్లే ఎన్టీఆర్ మార్గ్‌లో రోడ్డుపై గుంత ఏర్పడినట్లు ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా మ్యాన్‌హోల్స్‌ను ఎవరూ తెరవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డయల్ 100, జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040-21111111కు వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నామన్నారు. అలాగే పురాతన భవనాల్లో ఉన్నవారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సూచించారు. హుస్సేన్ సాగర్ నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.