Rain Alert: హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం | Heavy Rains Lash Hyderabad, Parts of Telangana | Sakshi
Sakshi News home page

Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Published Sat, Oct 9 2021 1:03 PM | Last Updated on Sat, Oct 9 2021 1:56 PM

Heavy Rains Lash Hyderabad, Parts of Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో శనివారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని, నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో టోల్‌ ఫ్రీ నంబర్‌ 040-21111111కు ఫోన్‌లో సంప్రదించవచ్చని తెలిపింది. కాగా, శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికే నగరం అతలాకుతలమైంది. తాజాగా భారీ వర్షసూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement