GHMC officials
-
ఢిల్లీ పరేడ్‌కు అసామాన్యులు
ఈసారి గణతంత్ర దినోత్సవ ఉత్సవాలకు తెలంగాణ నుంచి ‘అసామాన్యులు’ హాజరై తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఒకరు హైదరాబాద్ స్వీపర్ నారాయణమ్మ. మరొకరు కోదాడ మొబైల్ షీ టాయిలెట్ నిర్వహిస్తున్న నాగలక్ష్మి. ప్రజల కోసం భిన్నమైన ఉపాధుల్లో అంకితభావంతో పని చేస్తున్న వీరిద్దరూ ‘శ్రమయేవ జయతే’కు నిజమైన ప్రతీకలు. నారాయణమ్మ, నాగలక్ష్మిల పరిచయం. నారాయణమ్మ దినచర్యను చూస్తే కర్మయోగుల దినచర్యలా అనిపిస్తుంది. తెల్లవారుజాము నాలుగ్గంటలకు నిద్ర లేస్తుందామె. స్నానపానాదులు ముగించుకుని గంటసేపు గురుధ్యానం చేసి కొద్దిగా టీ తాగి ఆరు గంటలకంతా బంజారాహిల్స్‌లోని కాలనీలో రోడ్లు ఊడ్చే పనిలోకి వస్తుంది. పెదాల మీద ఏదో ఒక జానపదగీతమో, గురు తత్వమో, స్మరణో లేకుండా నారాయణమ్మ కనిపించదు. అందుకే ఆమెను అందరూ ‘సింగింగ్ స్వీపర్’ అంటారు. 22 సంవత్సరాలుగా నగరాన్ని తన చేతులతో శుభ్రం చేస్తూ స్వస్థతనిస్తూ మరోవైపు వీలున్నప్పుడల్లా భజనలకు, భక్తి కార్యక్రమాలకు హాజరయ్యి ముక్తిమార్గాన్ని చూపుతూ నారాయణమ్మ చేస్తున్న సేవ సామాన్యం కాదు. అందుకే ఆమెను రిపబ్లిక్ డేకి ఢిల్లీ పంపాలని జి.హెచ్.ఎం.సి. అధికారులు నిశ్చయించారు. ‘ఇది విని మావాళ్లంతా చాలా సంతోషించారు. మంచి కర్మల ఫలితం ఇది’ అంటుంది నారాయణమ్మ. బావులు తవ్వుతూ రంగారెడ్డి జిల్లా యాచారంకు చెందిన నారాయణమ్మ భర్తతో కలిసి బావులు తవ్వే పనికి వెళ్లేది. అది చాలా శ్రమతో కూడిన పని. అయినా పదిహేను ఇరవై రోజుల్లో బావిని తవ్వి జలను బయటకు తేవడంలో ఆమెకు తృప్తి కలిగేది. తర్వాత జెసీబీలు వచ్చాయి. బావుల స్థానంలో బోర్లు వచ్చాయి. దాంతో పొట్ట చేత్తో పట్టుకుని హైదరాబాద్ చేరుకుంది నారాయణమ్మ. అప్పటికే తల్లి స్వీపర్‌గా చేస్తుండంతో తన పని కూతురికి అప్పజెప్పింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ అదే పనిలో కొనసాగుతూ ఉంది నారాయణమ్మ. నెలకు 14 వేలు వస్తాయి. కొడుకు లారీ డ్రైవర్‌గా చేస్తున్నాడు. కూతురిని స్వీపర్ ఉద్యోగంలోనే పెట్టించింది. జీవుడే దేవుడు నారాయణమ్మకు భక్తి ఎక్కువ. పెళ్లయినప్పటి నుంచి భర్తతో కలిసి దేశంలోని గుళ్లన్నీ తిరిగేది. సంపాదించినది అంతా తీర్థయాత్రలకే ఖర్చు పెట్టింది. ‘కాని గుళ్లన్నీ తిరిగాక జీవుడిలోనే దేవుడు ఉన్నాడని గ్రహించాను. కరీంనగర్ జిల్లాకు చెందిన నిత్యానంద రాజేశ్వరాచార్యుల దగ్గర గురుబోధ తీసుకున్నా. నన్ను నేను ఆత్మజ్ఞానిగా మార్చుకున్నా. మనిషి చిత్తం విచిత్రం. అతను లోకాన్ని తరచి చూసి ముక్తిపొందాలంటే గురువును తెలుసుకుని గురుబోధతో నడుచుకోవాలి. అజ్ఞానాన్ని తవ్వి బయట పారేయాలి’ అంటుంది నారాయణమ్మ. ఆమెకు రోకటి పాటల దగ్గరి నుంచి మంగళహారతి పాటల వరకూ కరతామలకం. రామయణ, భారతాలను కూడా పాటలుగా పాడుతుంది. వేమన పద్యాల నుంచి సంస్కృత పద్యాల వరకూ అన్నీ చెబుతుంది. ఆమె ధారణకు, ఆధ్యాత్మిక అవగాహనకు ఎవరైనా నమస్కరించాల్సిందే. కోదాడలో అమూల్యసేవ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాగలక్ష్మి నిర్వహించే మొబైల్ షీ టాయిలెట్ కనిపిస్తుంది. 30 ఏళ్ల ఈ డబుల్ డిగ్రీ హోల్డర్ కోదాడ మునిసిపల్ ఉద్యోగిగా మొబైల్ టాయిలెట్‌ను నిర్వహించడానికి, తిప్పడానికి ఏ మాత్రం సిగ్గుపడదు. ‘ఐదేళ్లుగా ఈ టాయిలెట్‌ను నిర్వహిస్తున్నాను. ఆటోకు బిగించిన టాయిలెట్‌ను రోజూ నేను ఉదయం ఎనిమిదన్నర నుంచి పట్టణంలో తిప్పుతాను. గుళ్ల దగ్గర, బస్టాండ్ దగ్గర, మార్కెట్ దగ్గర అవసరాన్ని బట్టి ఉంచుతాను. పనుల కోసం పల్లెల నుంచి వచ్చిన స్త్రీలు తగిన టాయిలెట్లు లేక ఇబ్బంది పడతారు. వారు నా మొబైల్ టాయిలెట్‌ను చూడగానే ఎంతో రిలీఫ్ ఫీలవుతూ ఉపయోగిస్తారు. నేను గమనించేదేమిటంటే ఆ ఒత్తిడి తీరాక వారు చల్లగా బతకమ్మా ఆని ఆశీర్వదించడం. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు ఎంతో సంతోషపడతారు’ అంటుంది నాగలక్ష్మి. ఈ మొబైల్ టాయిలెట్ ఉపయోగించుకోవడానికి ఏమీ రుసుము చెల్లించనక్కర లేదు. మధ్యాహ్నం వరకూ ఈ వాహనాన్ని నడిపే నాగలక్ష్మి మధ్యాహ్నం భోజన విరామం తీసుకుని మళ్లీ సాయంత్రం వరకూ తిప్పుతుంది. ‘మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది’ అంటుందామె. ఆమె అంకితభావాన్ని గమనించిన జి.హెచ్.ఎం.సి. అధికారులు ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ ప్రతినిధిగా ఢిల్లీకి పంపుతున్నారు. -
ఇది మీ అంతరాత్మను కదిలించలేదా?
సాక్షి, హైదరాబాద్: ‘‘నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. అధికారులు ఏం చేస్తున్నారు? ఇది మీ అంతరాత్మలను కదిలించలేదా? ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వీధి కుక్కల నియంత్రణకు మీ వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా?’’అని జీహెచ్ఎంసీ అధికారులను హైకోర్టు నిలదీసింది. ఈ ఘటనకు సంబంధించి బాలుడి తల్లిదండ్రులు పరిహారం పొందేందుకు అర్హులేనని స్పష్టం చేసింది. అధికారులు తీసుకున్న చర్యలేమిటో కోర్టుకు తెలియజేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. సుమోటోగా విచారణ నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన గంగాధర్ హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఓ కారు సర్వీసింగ్ సెంటర్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం గంగాధర్‌తోపాటు సర్వీసింగ్ సెంటర్‌కు వెళ్లిన నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్‌పై వీధికుక్కలు దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై ఓ పత్రికలో ప్రచురితమైన వార్తను హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం గురువారం దీనిపై విచారణ నిర్వహించింది. బాలుడి మరణం దురదృష్టకరమని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా వీధికుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలేమిటో తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఇలాంటివి మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. -
ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌కు షాక్.. ప్రాపర్టీ కూల్చివేత
సాక్షి, హైదరాబాద్ / బంజారాహిల్స్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నందుకుమార్‌కు చెందిన హోటల్ డెక్కన్ కిచెన్‌కు అనుబంధంగా ఉన్న రెండు నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు ఆదివారం కూల్చేశారు. నందుకుమార్ ప్రస్తుతం జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయన ఆస్తులపై ఆధికారులు ఆరా తీశారు. దీంతో ఫిల్మ్ నగర్లో ఉన్న డెక్కన్ కిచెన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జీహెచ్ఎంసీ సర్కిల్–18 పరిధి, జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ రోడ్ నం.1లోని ప్లాట్ నంబర్ 2 (ఇంటి నంబర్ 8–2–293/82/ఎఫ్/2)లో సినీ నటుడు దగ్గుబాటి రానాకు వెయ్యి గజాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని నందుకుమార్‌కు చెందిన డబ్ల్యూ3 హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లీజుకు తీసుకుంది. పక్కనే ఉన్న దగ్గుబాటి వెంకటేష్‌కు చెందిన ప్లాట్ నంబర్ 3లోని వెయ్యి గజాల స్థలాన్ని కూడా నందుకుమార్ లీజుకు తీసుకుని డెక్కన్ కిచెన్ పేరుతో రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నాడు. దగ్గుబాటి రానా ఫిర్యాదు తమ స్థలంలో, జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారని రానా గతంలో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారని, వెంటనే అడ్డుకోవాలని రానా ఇటీవల మరోసారి ఫిర్యాదు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ నందకుమార్ నిర్మాణ పనులను కొనసాగిస్తుండటంతో ఆదివారం జీహెచ్ఎంసీ సర్కిల్–18 టౌన్‌ప్లానింగ్ ఏసీపీ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది జేసీబీల సహాయంతో కూల్చివేతలు చేపట్టారు. సుమారు 3 గంటల పాటు కూల్చివేతల ప్రక్రియ కొనసాగింది. నందకుమార్ భార్య సహా కుటుంబ సభ్యులు కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తాము చట్ట ప్రకారం లీజుకు తీసుకున్నామని, కోర్టు స్టే సైతం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: (రాజకీయాలు చేయడానికి మా ఇళ్లకు వచ్చారా?.. జనసేన నాయకులపై లబ్ధిదారుల ఫైర్) -
ఆపేశారా.. అడ్డుకున్నారా?
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలంగా జీహెచ్ఎంసీలో పాతుకుపోయి.. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన సహాయ వైద్యాధికారులను (ఏఎంఓహెచ్) వారి మాతృ సంస్థలకు పంపేందుకు సిద్ధమైన ఉన్నతాధికారులు 12 మందిని సాగనంపేందుకు రంగం సిద్ధం చేశారు. ఏడుగురికి రిలీవ్ ఉత్తర్వులు సైతం జారీ చేశారు. మిగతా అయిదుగురిని సైతం నేడో, రేపో పంపించనున్నట్లు సంకేతాలు వెలువడినప్పటికీ వారిని పంపించలేదు. దాదాపు నెల రోజులైనా వారినింకా కదల్చలేదు. వారి స్థానాల్లో వారు విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఏడుగురిని పంపించడానికి అంతకుముందు సైతం అధికారులు తాత్సారం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నుంచి అందిన ఆదేశాల నేపథ్యంలో.. డిప్యుటేషన్ గడువు ముగిసిపోయినప్పటికీ కొ నసాగుతున్న వారిని మాతృసంస్థకు సరెండర్ చేస్తూ జీహెచ్ఎంసీ నుంచి రిలీవ్ చేశారు. మరో అయిదుగురిని ఇంకా ఎందుకు పంపించలేదన్నది జీహెచ్ఎంసీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అవినీతి ప్రక్షాళన కానుందని భావించినా.. అవినీతిలో మునిగిన ఆరోగ్య, పారిశుద్ధ్య విభాగం ప్రక్షాళన కానుందని భావించినప్పటికీ బ్రేక్ పడింది. అత్యంత ఉన్నతస్థాయిలోని, రాజకీయ పైరవీలతోనే ఈ ప్రక్రియకు బ్రేక్ పడినట్లు భావిస్తున్నారు. తగిన అండదండలుంటే జీహెచ్ఎంసీలో ఎంత అవినీతి చేసిన వారినైనా కొనసాగించడం, కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినా చర్యలు ఉండకపోవడం చర్చనీయాంశంగా మారింది. పారిశుద్ధ్య, ఎంటమాలజీ విభాగాల్లో కొందరు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మరణించిన, పనిచేయలేని వారి స్థానంలో కారుణ్య నియామకాల కింద కుటుంబ సభ్యులకు ఇచ్చే ఉద్యోగాలకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. చేతులు తడపని వారిని సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని జీహెచ్ఎంసీలోని యూనియన్ నాయకుడు అల్వాల్ శివకుమార్ పేర్కొన్నారు. (చదవండి: లగ్జరీ కార్లే టార్గెట్! విమానంలో వస్తాడు... దొంగిలించిన కారులో జారుకుంటాడు) -
సాఫీ జర్నీకి సై... మరో మూడు లింక్ రోడ్లు
సాక్షి హైదరాబాద్/బంజారాహిల్స్: నగర ప్రజలకు ప్రయాణ సదుపాయాన్ని సౌలభ్యంగా మారుస్తున్న లింక్రోడ్లలో మరో మూడింటికి, అభివృద్ధిపర్చిన మల్కంచెరువుకు సోమవారం మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ పనుల విలువ దాదాపు రూ.100 కోట్లు. ఎస్సార్డీపీలో భాగంగా ప్రధాన రహదారుల్లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్లతో ప్రయాణ సదుపాయం పెరుగుతుండగా, ఆయా ప్రాంతాలను చేరుకునేందుకు లింక్‌రోడ్లు ఎంతగానో ఉపకరిస్తున్నాయని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. నందిహిల్స్ అండర్‌పాస్.. జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 51 నందిహిల్స్ కాలనీలో అండర్‌పాస్‌గా నిర్మించిన లింక్ రోడ్డు వ్యయం రూ. 30 .30 కోట్లు. ఓల్డ్బాంబే హైవే (లెదర్‌పార్క్) నుంచి సైలెంట్ వ్యాలీ మీదుగా రోడ్‌నెంబర్ 45 వరకు నిర్మించిన ఈ లింక్ రోడ్డుతో షేక్‌పేట నుంచి రోడ్ నెంబర్ 45కు వెళ్లేవారికి ప్రస్తుతమున్న 5 కి.మీ దూరం 3.5 కి.మీలకు తగ్గుతుంది. ఈ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి. సర్వీస్ రోడ్ల వల్ల షేక్‌పేట–జూబ్లీహిల్స్‌ల మధ్య సాఫీ ప్రయాణం సాధ్యమని అధికారులు పేర్కొన్నారు. ఓల్డ్ బాంబే హైవే– ఖాజాగూడ రోడ్డు ఓల్డ్ బాంబే హైవే నుంచి వయా మల్కంచెరువు, చిత్రపురి కాలనీల మీదుగా ఖాజాగూడ రోడ్డు వరకు నిర్మించిన లింక్‌రోడ్డు పొడవు దాదాపు కిలోమీటరు. ఖాజాగూడ రోడ్డుకు వెళ్లాల్సినవారు ఖాజాగూడ జంక్షన్‌కు వెళ్లనవసరం లేకుండా గమ్యస్థానం చేరుకోవచ్చు. పోచమ్మబస్తీ, చిత్రపురి కాలనీ తదితర పరిసరాల వారికి ఎంతో ప్రయోజనం. అర కిలోమీటరు దూరం తగ్గుతుంది. దీని వ్యయం రూ. 15.07 కోట్లు. ఖాజాగూడ లేక్ – ఓఆర్ఆర్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ కాంపౌండ్ వాల్‌కు సమాంతరంగా ఖాజాగూడ లేక్ నుంచి ఖాజాగూడ– నానక్‌రామ్‌గూడ రోడ్డు వరకు నిర్మించిన ఈ లింక్ రోడ్డు పొడవు కిలోమీటరు. ఓల్డ్బాంబే హైవే నుంచి (కేర్ హాస్పిటల్ దగ్గర) ఖాజాగూడ రోడ్డుకు చేరుకోవాల్సిన వారికి ఇది ప్రత్యామ్నాయ మార్గం. దీని వ్యయం రూ. 47.66 కోట్లు. సీఎస్సార్‌లో భాగంగా మల్కం చెరువును అభివృద్ధి పరిచారు. పరిసరాలను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు (చదవండి: స్కిల్, అప్‌స్కిల్, రీ–స్కిల్ ) -
జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా.. నిర్ణీత గడువు ముగిసినా ఏళ్లకేళ్లుగా జీహెచ్ఎంసీని పట్టుకొని వదలకుండా అతుక్కున్న ఆరుగురు సహాయ వైద్యాధికారులను (ఏఎంఓహెచ్) వదిలించుకుంది. ఆరుగురు ఏఎంఓహెచ్‌లను వారి మాతృసంస్థ అయిన పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు పంపించింది. దీనికి ముందు ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. ఏళ్లకేళ్లుగా కొనసాగుతున్న.. పలు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన వీరిని మాతృసంస్థకు పంపించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దాన్ని అమలు చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ను ఆదేశించారు. అందుకనుగుణంగా, తమను మాతృసంస్థలకు పంపించాల్సిందిగా కోరుతూ స్వీయలేఖలు అందజేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ సంబంధిత ఏఎంఓహెచ్‌లకు సూచించారు. లేని పక్షంలో ఎదురయ్యే తీవ్ర పరిణామాలను వివరించి హెచ్చరించినట్లు సమాచారం. వీరిలో జీహెచ్ఎంసీలో డిప్యుటేషన్ మూడేళ్లు, ఐదేళ్లు మించిన వారు కూడా ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో వారు లేఖలు రాయడం.. వారిని వెంటనే మాతృసంస్థలకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఆగమేఘాల మీద జరిగాయి. వారు రిలీవ్ అయినట్లుగా కూడా పరిగణిస్తూ, వారిని మాతృశాఖ డైరెక్టర్‌కు రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంబంధిత సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు రిలీవ్ అయిన ఏఎంఓహెచ్‌ల స్థానాల్లో తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచించడంతో పాటు దాన్ని అమలు చేసినట్లు నివేదించాలని ఆదేశించారు. ఈ అంశంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా జోనల్ కమిషనర్లకు సూచించారు. చదవండి: బోయిగూడ అగ్ని ప్రమాదం: గోదాంలో ఉండేది 8 మందే.. ఆ నలుగురు ఎవరంటే! చెత్త పనిలో అవినీతి తగ్గేనా? ►ప్రజలకు వైద్యం చేయాల్సిన డాక్టర్లు జీహెచ్ఎంసీలోని ఆరోగ్యం– పారిశుద్ధ్య విభాగంలోకి ఏఎంఓహెచ్‌లుగా వచ్చారంటే చాలు ‘చెత్త’ పనులు చేస్తున్నారు. సక్రమ పారిశుద్ధ్యంతోనే ఆరోగ్యం బాగుంటుందనే బ్రిటిష్ హయాం నాటి ప్రాథమిక సూత్రం ఆధారంగా జీహెచ్ఎంసీలో ఏఎంఓహెచ్‌లకు పారిశుద్ధ్య బాధ్యతలప్పగించారు. దాన్ని ఒక బాధ్యతగా చూడాల్సిన వారు చెత్త పనుల్లోని అవినీతిలో కూరుకుపోతున్నారు. స్వీపర్ల నియామకాల నుంచి మొదలు పెడితే బల్క్ చెత్త ఉత్పత్తి చేసే హోటళ్లు, ఫంక్షన్ల హాళ్ల నిర్వాహకుల నుంచి మామూళ్లు వసూలు చేసేంతదాకా దిగజారారు. ►జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ఎంతో కాలంగా అవినీతి ఆరోపణలున్నా, ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో వాటికి అడ్డుకట్ట పడలేదని జీహెచ్ఎంసీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశాల కనుగుణంగా కమిషనర్ లోకేశ్‌కుమార్ వారిని మాతృశాఖలకు పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇది బల్దియా చరిత్రలోనే రికార్డు. ఇక రాబోయే రోజుల్లో ఏఎంఓహెచ్లనే వారు జీహెచ్ఎంసీలో ఉండరని తెలుస్తోంది. మిగతా విభాగాలపైనా దృష్టి సారిస్తారా? జీహెచ్ఎంసీకి ఒకసారి వచ్చారంటే చాలు మాతృశాఖలకు తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఏళ్ల తరబడి కొనసాగుతున్న వారు వివిధ విభాగాల్లో ఎందరో ఉన్నారు. అంతేకాదు.. డిప్యుటేషన్ ముగిసినా, కొనసాగింపు లేకుండానే పని చేస్తున్నవారు కూడా ఉన్నారు. డిప్యుటేషన్ ముగిసిన వారిపై, దీర్ఘకాలంగా కొనసాగుతున్న వారిపై కూడా తగిన చర్యలు తీసుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది. -
Rain Alert: హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: నగరంలో శనివారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని, నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్ 040-21111111కు ఫోన్లో సంప్రదించవచ్చని తెలిపింది. కాగా, శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికే నగరం అతలాకుతలమైంది. తాజాగా భారీ వర్షసూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. -
కల్లోలం: ఎర్రగడ్డలో ఒక్కరోజే 32 శవాల అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పాటు రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. ఎర్రగడ్డ ఈఎస్ఐ హిందూ శ్మశానవాటికలో రోజు పెద్ద సంఖ్యలో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు జరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 32 మృతదేహాలకు అంత్యక్రియలు జరిపినట్లు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి 9.30 గంటల వరకు అందిన సమాచారం మేరకు మొత్తం 32 కరోనా బారినపడిన మృతిచెందిన వారికి అంత్యక్రియలు చేశారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స పొందుతూ మరణించినవారే ఉన్నారు. ఎర్రగడ్డలోని ఈఎస్ఐ శ్మశానవాటికలో వాటికి దహన సంస్కారాలు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. అయితే ఇది ఒక్క ఎర్రగడ్డ శ్మశానం లెక్కలు మాత్రమే. అధికారికంగా ప్రకటించిన లెక్కలే ఇంత ఉంటే అనధికారికంగా ఎన్ని ఉంటాయోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో ఎంత సంఖ్యలో కరోనా మృతులు సంభవిస్తున్నాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చదవండి: లాక్డౌన్ పెట్టాలా లేదా అన్నది సీఎం నిర్ణయం చదవండి: రాబోయే 3, 4 వారాలు చాలా కీలకం.. మరింత జాగ్రత్త -
కరోనా పాజిటివా అయితే ఇంటికి తాళమే
సాక్షి, ముషీరాబాద్ : గతంలో ఏ ప్రాంతంలోనైనా ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలితే అధికారులు ఆ ఇంటి పరిసరాలను కంటైన్మెంట్గా ప్రకటిస్తూ బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించేవారు. వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను జీహెచ్ఎంసీ సిబ్బందే అందజేసేవారు. తాజాగా జీహెచ్ఎంసీ అధికారులు ఈ విధానానికి స్వస్తి పలికారు. ప్రస్తుతం ఏ ఇంట్లోనైతే కరోనా పాజిటివ్ అని తేలిందో వారందరినీ ఇంట్లోనే ఉంచి బయట నుంచి తాళం వేసి, నిత్యావసర వస్తువుల కోసం సమీపంలోని కిరాణా షాపు, పాలబూత్‌ల ఫోన్ నంబర్లు ఇస్తున్నారు. తాజాగా కవాడిగూడలోని భాగ్యలక్షి్మకాలనీలో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. (కిరాణ షాపులే కేంద్రంగా కరోనా విజృంభణ) -
‘గ్రేటర్’ ట్రాఫిక్ కమిషనరేట్
సాక్షి, హైదరాబాద్: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరంలో వాహనాలతోపాటు పాదచారులు సౌకర్యవంతంగా ప్రయాణిం చేలా రోడ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ట్రాఫిక్ వ్యవస్థను శాస్త్రీయంగా క్రమబద్ధీకరిస్తామని, దీని సమన్వయానికి జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక ట్రాఫిక్ కమిషనరేట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గురువారం బుద్ధభవన్‌లో జీహెచ్ఎంసీ, పోలీసు, విద్యుత్, టీఎస్ఐఐసీ, జలమండలి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ, నగర ప్రజలను ప్రజా రవాణా వైపు మళ్లించేలా వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు. వాణిజ్య ప్రాంతాల్లోని సెట్‌బ్యాక్‌ల స్థలాన్ని ఫుట్‌వేలకు వినియోగించనున్నట్లు తెలిపారు. ముంబైలో ప్రజారవాణా వినియోగం 72 శాతం కాగా, నగ రం లో 34 శాతమేనన్నారు. ఐదేళ్లలో వాహనాల సంఖ్య 73 లక్షల నుంచి కోటీ ఇరవై లక్షలకు పెరిగిందన్నారు. ప్రజా రవాణా పెంపే లక్ష్యం మెట్రోరైలు, ఎంఎంటీఎస్ వ్యవస్థల అభివృద్ధితో పాటు ప్రధాన మార్గాల్లో లేనింగ్‌లు, ఇరువైపులా ఫుట్‌పాత్‌లు, సైకిల్ మార్గాలు ఏర్పాటు చేస్తామని, పచ్చదనాన్ని పెంచుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఖాళీ స్థలాలను పార్కింగ్ ప్రదేశాలుగా మార్చేందుకు ప్రైవేట్ యజమానులను ఒప్పించాలని, తద్వారా ఆదాయం పొందొచ్చనే విషయాన్ని వారికి తెలపాలన్నారు. లేఔట్ల ఓపెన్ ప్రదేశాల్లో ప్రజల సదుపాయార్థం పబ్లిక్ టాయ్లెట్లు, పార్కులు, బస్షెల్టర్లు, స్కైవాక్ వేలు ఏర్పాటు చేస్తామన్నారు. డయల్ ‘100’కు విస్తృత ప్రచారం మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. టోల్ ఫ్రీ నంబర్ 100కు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. వైన్స్ పరిసరాల్లో మద్యం తాగే వారిపై చర్యలు తీసుకోవాలని, సంబంధిత దుకాణాలను మూసివేయించాలని సూచించారు. పార్కులు, ఖాళీ స్థలాలు అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారరాదన్నారు. నగరంలో 4 లక్షల ఎల్ఈడీ లైట్లున్నాయని, ఇంకా అదనంగా ఏర్పాటు చేస్తామన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, రోడ్లు, రవాణా సదుపాయాలు బాగుంటే ట్రాఫిక్ సమస్యలుండవన్నారు. ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణకు నిధులివ్వాలని కోరారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్‌కుమార్, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ రోడ్ల బాధ్యత ప్రైవేట్ ఏజెన్సీలదే సమగ్ర రోడ్ల నిర్వహణ పథకం (సీఆర్ఎంపీ) కింద 709 కి.మీ. మేర ప్రధాన రోడ్ల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించామని, ఈనెల 9 నుంచి ఏజెన్సీలు పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఐదేళ్ల వరకు ఆ రోడ్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్ట్ ఏజెన్సీలదేనని, పైప్లైన్లు, కేబుళ్లు, డ్రైనేజీ తవ్వకాలు, మరమ్మతులు, పునరుద్ధరణ పనులన్నీ ఏజెన్సీలే చేపట్టాలన్నారు. వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ -
ముందు మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయాలి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచానికంతా అక్రమ నిర్మాణాలు కనపడతాయి. కానీ మీకు (జీహెచ్ఎంసీ) మాత్రం కనిపించవు. అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా వెలుస్తున్నాయంటే వాటిని అడ్డుకునే సమర్థత మీకు లేదా? పై స్థాయిలో ఉండే అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తే, కింది స్థాయి అధికారులు సక్రమంగా ఉంటారు. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవచ్చని పలు చట్టాలు చెబుతున్నాయి. పర్యవేక్షణ చేయకుండా కళ్లు మూసుకుని విధులు సక్రమంగా నిర్వర్తించని అధికారులపై జీహెచ్ఎంసీ ఏం చర్యలు తీసుకుంటున్నట్లు? – హైకోర్టు ధర్మాసనం అక్రమ నిర్మాణాల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులపై హైకోర్టు నిప్పులు చెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో వెలిసిన, వెలుస్తున్న అక్రమ కట్టడాల విషయంలో నిర్లిప్తంగా ఉన్న అధికారులపై, సిబ్బందిపై చట్టపరంగా ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని మంగళవారం జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను మార్చి 5కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు చోట్ల చేపట్టిన అక్రమ నిర్మాణాల విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవట్లేదంటూ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ముందు అధికారులను ప్రాసిక్యూట్ చేయాలి.. రెండు అంతస్తులకు అనుమతి తీసుకుని, 5 అంతస్తులు నిర్మిస్తుంటే జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని విచారణ సందర్భంగా హైకోర్టు నిలదీసింది. మూడో అంతస్తు నిర్మించేటప్పుడే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించింది. ‘విధి నిర్వహణలో ఉన్నతాధికారులు సక్రమంగా వ్యవహరిస్తే క్షేత్రస్థాయిలోని అధికారులు కూడా విధులు సక్రమంగా నిర్వర్తిస్తారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు అధికారులకు ఎన్నో అధికారాలున్నాయి. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా, ఏ అధికారి కూడా తమ అధికారాన్ని ఉపయోగించట్లేదు. ఆ నిర్మాణాల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇలా వ్యవహరించే అధికారులను ఎందుకు ప్రాసిక్యూట్ చేయట్లేదు? అక్రమ నిర్మాణదారులకన్నా ముందు ఈ అధికారులను ప్రాసిక్యూట్ చేయాలి’అని ధర్మాసనం మండిపడింది. అంతకన్నా మీరేం చేయగలరు? జీహెచ్ఎంసీ న్యాయవాది సంపత్ ప్రభాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, నోటీసులు జారీ చేశామని చెప్పారు. ‘అంతకన్నా మీరేం చేయగలరు? నోటీసులిచ్చామని చెప్పడం సులభం. కానీ అక్రమ నిర్మాణాలను కూల్చేసే సమర్థత మీకు (జీహెచ్ఎంసీ) ఉందా? ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయో పర్యవేక్షించే స్థితిలో మీ అధికారుల్లేరా? విధి నిర్వహణలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అంత అసమర్థులుగా ఉన్నారా?, అక్రమ నిర్మాణాలను మొగ్గలోనే అణిచివేస్తుంటే హైకోర్టులో ఇన్ని వ్యాజ్యాలు దాఖలయ్యే పరిస్థితి ఉండదు. అవినీతి నిరోధక చట్టం కింద ‘అవినీతి’కి విస్తృతమైన అర్థం ఉంది. విధులను సక్రమంగా నిర్వర్తించని అధికారులకు ఈ చట్ట నిబంధనలను వర్తింపచేయాలి. ఐపీసీతో పాటు పలు చట్ట నిబంధనల కింద ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి. అయితే ఇలాంటి అధికారుల విషయంలో జీహెచ్ఎంసీ ఏం చేస్తున్నట్లు?’అంటూ దుయ్యబట్టింది. -
షాపింగ్ మాల్స్‌కు జీహెచ్ఎంసీ షాక్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో బడా దుకాణాలు, షాపింగ్ మాల్స్‌కు జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. ‘ఇది మీ దారి.. మీరు నడుచుకుంటూ వెళ్లేందుకు వీలుగా ఉండేందుకు ఏర్పాటు చేసిన మార్గం.. అయితే ఇక్కడి బడా దుకాణాల నిర్వాహకులు మీరు వెళ్లేందుకు వీలు లేకుండా ఆ రోడ్డును ఆక్రమించేశారు’’ అని నగర షాపింగ్ మాల్స్, దుకాణాల ముందు రాస్తూ జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలో చాలా చోట్ల పెద్ద పెద్ద దుకాణాలు, షాపింగ్ మాల్స్‌లు పాదచారుల రోడ్డును ఆక్రమిస్తున్నాయి. దీంతో పాదచారులు నడుచుకుంటు వెళ్లేందుకు దారివ్వకుండా ఆ ప్రాంతాన్ని ఎలా ఆక్రమించుకున్నారో తెలిసేలా వివరిస్తూ అధికారులు షాపుల ముందే రాస్తున్నారు. ఇప్పటికైనా మీకు కేటాయించిన దారిలో నడవాలని ప్రజలకు సూచిస్తున్నారు. -
రాణిగంజ్‌లో చల్లారిన మంటలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని రాణి గంజ్‌లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 15 గంటలపైనే కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అంతేకాక ఎగసిపడుతున్న మంటలు పక్క భవనాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. ప్రజలను ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు దూర ప్రాంతాలకు తరలించారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించడం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ప్రమాదంలో బిల్డింగ్ పూర్తి దగ్ధమయి కూప్పకూలిపోయింది. బిల్డింగ్‌లోని గౌడన్‌లో భారీ స్థాయిలో పెయింట్ డబ్బాలను నిల్వ ఉంచారు. పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల కేబుల్ గౌడన్లోకి కూడా మంటలు వ్యాపించాయి. ఈ విధమైన సంఘటనలు పురావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అగ్ని ప్రమాదంపై మంత్రులు, ఇదర ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించారు. రాణిగంజ్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన పెయింట్, కేబుల్స్, ఇతర కెమికల్ గోడన్లపై అధికారులు ఆరా తీస్తున్నారు. అక్రమ నిల్వలపై జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని డైరెక్టర్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. బిల్డింగ్‌కు ట్రేడ్ లైసెన్స్, ఫైర్ నామ్స్, పార్కింగ్ అనుమతులు ఉన్నాయా.. లేదా అనే దానిపై అధికారులు ఆరా చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పెయింట్ డబ్బాలు బుగ్గి అవ్వడమేకాక.. ఆ ప్రాంతంలోనే భవనాలు దెబ్బ తిన్నాయి. ఈ ప్రమాదంతో దాదాపు కోట్లలో నష్టం జరిగినట్లు అధికారుల అంచనా వేస్తున్నారు. -
హైదరాబాద్: ఐటీ కంపెనీలకు ఇంటర్నెట్ కట్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ స్తంభాలకు ఉండే ఇంటర్ నెట్ కేబుల్స్‌ను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడంతో పలు ఐటీ కంపెనీలలో నెట్‌సేవలు నిలిచిపోయాయి. గచ్చిబౌలి డీఎల్ఎఫ్ ఐటీ కారిడార్‌కు అనుకొని ఉన్న జయభేరి ఎన్‌క్లేవ్‌లోని ఖాళీ స్థలంలో పెట్ పార్కును నిర్మిస్తున్నారు. పెట్ పార్కు ముందు కరెంట్ స్తంభాలకు ఇంటర్ నెట్ వైర్లు ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన, శేరిలింగంపల్లి సర్కిల్ –20 ఉప కమిషనర్ వి.మమత పెట్ పార్కును సందర్శించారు. అదే సమయంలో వెస్ట్ జోనల్ ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది క్రేన్ సహాయంతో స్తంభాలకు ఉన్న ఇంటర్ నెట్ కెబుల్ వైర్లను తొలగించారు.ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇంటర్ నెట్ కేబుల్స్ తొలగించారని ఐటీ కంపెనీ ప్రతినిధులు వాపోయారు. ఈ విషయంపై మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. స్తంభాలను మార్చుతున్నాం... కొద్ది రోజుల్లోనే పెట్ పార్కు ప్రారంభం కానుందని, ఈ క్రమంలో పార్కును అనుకొని ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాల్సి ఉందన్నారు. దీనిలో భాగంగా స్తంభాలకు ఉన్న కెబుళ్లను ముందుగా తొలగించామని తెలిపారు. స్తంభాలకు కెబుల్ పెట్టిన వారు ఎలాంటి అనుమతి పొందలేదన్నారు. అనుమతి తీసుకుంటే మళ్లీ కెబుళ్లను పునరుద్ధరించేందుకు అవకాశమిస్తామని అన్నారు. – జోనల్ కమిషనర్ హరిచందన -
సుప్రీం తీర్పునూ పట్టించుకోరా?
విగ్రహాల అనుమతులపై సర్కారు పట్ల హైకోర్టు ఆగ్రహం అమలు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: విగ్రహాల ఏర్పాటుకు అనుమతులిచ్చే విషయంలో సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోరా అంటూ తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజోపయోగ స్థలాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై విగ్రహాల ఏర్పాటుకు ఎటువంటి అనుమతులు ఇవ్వొద్దంటూ సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఒకవేళ అమలు చేయకపోతే దానిని తీవ్రంగా పరిగణించి, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి గత వారం ఉత్తర్వులు జారీ చేశారు. సికింద్రాబాద్‌లోని చిలకలగూడ మునిసిపల్ పార్కులో నాగులూరి మేడ్చల్ నర్సింహ అనే వ్యక్తి విగ్రహ ఏర్పాటుకు అనుమతినిస్తూ పురపాలకశాఖ, జీహెచ్ఎంసీ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చిలకలగూడ పార్కు వాకర్స్ అసోసియేషన్‌తోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విగ్రహాల ఏర్పాటుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, ఆదేశాలను అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. ప్రజోపయోగ స్థలాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వొద్దని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిస్తే అందుకు విరుద్ధంగా అధికారులు చిలకలగూడ పార్కులో విగ్రహ ఏర్పాటుకు ఎలా అనుమతినిచ్చారో అంతుబట్టకుండా ఉందని న్యాయమూర్తి అన్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలనే పట్టించుకోరా అని ప్రశ్నించారు. నర్సింహ విగ్రహ అనుమతి విషయంలో అధికారులు సుప్రీం తీర్పును విస్మరించారని ఆక్షేపించారు. ఇప్పటికే విగ్రహ ఏర్పాటు పూర్తయినందున దానిని తొలగించేందుకు ప్రస్తుతం ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. విగ్రహాలకు అనుమతినిచ్చే విషయంలో సుప్రీం తీర్పును కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టంచేశారు. -
ఆటకేదీ ఆదరణ?
సిటీలోని ప్రముఖ స్టేడియాలు... ♦ అంబర్‌పేట స్టేడియం ♦ గోల్కొండ ప్లేగ్రౌండ్ ♦ పటేల్ ప్లేగ్రౌండ్, శాలిబండ ♦ విక్టరీ ప్లే గ్రౌండ్ , చాదర్‌ఘాట్ ♦ విజయనగర్ కాలనీ స్పోర్టింగ్ గ్రౌండ్ ♦ ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరాపార్కు పట్టణ ప్రణాళిక విభాగం నిబంధనల మేరకు లేఔట్లలో 10 శాతం ఖాళీ స్థలాలుండాలి. వీటిని ఆటస్థలాలు, ఉద్యానవనాలకు వినియోగించాలి. కానీ నగరంలో ఈ నిబంధన కాగితాలకే పరిమితమైంది. ఖాళీ స్థలాలు 3 శాతం మించి లేవు. ఉన్న వాటిల్లోనూ ఆటస్థలాలకు వినియోగిస్తున్నవి తక్కువే. అసలే అరకొరగా ఉన్న ఆటస్థలాలు ఏటికేడు అదృశ్యమవుతున్నాయి. కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి. నగరంలో ఒకప్పుడు 725 ప్లేగ్రౌండ్స్ ఉండగా, అవి 600కు తగ్గాయి. తీరా క్షేత్ర స్థాయిలో చూస్తే ప్రస్తుతం 521 మాత్రమే ఉన్నాయి. వీటిలో ఎన్ని ఉంటాయో, పోతాయో తెలియని పరిస్థితి. పాలకులు, అధికారులు వీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అరకొర సౌకర్యాలు... ప్రస్తుతం ఉన్న ఆటస్థలాల్లో సదుపాయాలు లేక క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని సౌకర్యాలున్నాయని జీహెచ్ఎంసీ సెలవిస్తుండగా, వాస్తవంలో మాత్రం భిన్నంగా ఉంది. ఆటస్థలాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లకు ఆసక్తి కొద్దీ వెళ్లే పేద క్రీడాకారులకు క్రీడాపరికరాలు అందుబాటులో ఉండడం లేదు. దీంతో వారు సొంతంగా పరికరాలు కొనుక్కోలేక క్రీడాసక్తిని చంపుకోవాల్సి వస్తోంది. ఆరుబయట ఆటస్థలాలు లేక, అపార్టుమెంట్లలో కొనసాగుతున్న విద్యాసంస్థల్లోనూ క్రీడలకు అవకాశాల్లేక భవిష్యత్ తరాలు ఆటలకు దూరమవుతున్నాయి. పాయింట్ అవుట్... ► జోన్‌కు ఐదు చొప్పున ఐదు జోన్లలో 25 ప్లేగ్రౌండ్స్‌ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ► 46 ఏళ్ల పాటు నిరాటంకంగా నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లకు 2015లో స్వస్తి పలికారు. 2014లో 1260 సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లు ఏర్పాటు చేయగా, 2015లో ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు. ► కనీసం 10 శాతం ఖాళీ స్థలాలుండాల్సి ఉండగా, మూడు శాతం కూడా లేని దుస్థితి. ఉన్న వాటిలోనూ ఆటస్థలాలు 25 శాతమే. అక్కడక్కడ కొన్ని ఖాళీ స్థలాలు పిల్లలు ఆడుకునేందుకు ఉపయోగపడుతుండగా, వాటినీ లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ► క్రీడాకారులకు ఎంతో సదుపాయంగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో సైతం కళాభారతి నిర్మించాలనే ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది. ► 1000 జిమ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఏడాదైనా వాటి జాడ లేదు. వీటి కోసం బడ్జెట్లో భారీగా నిధులు కూడా కేటాయించారు. ► ఆయా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, ఆటస్థలాల నిర్వహణ, ఇతరత్రా సదుపాయాల కోసం ఈ ఆర్థిక సంవత్సరం రూ.3 కోట్లు కేటాయించగా.. రూ.కోటి మాత్రమే ఖర్చు చేశారు. ► స్పోర్ట్స్ విభాగం పేరిట ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రూ.60 కోట్లు కేటాయించారు. అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల ఆధునీకరణ తదితర పనులు వీటిలో ఉన్నాయి. కానీ ఇదీ కార్యరూపం దాల్చలేదు. ► క్రీడా విభాగానికి సంబంధించిన 99 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అద్దెకు ఆటస్థలాలు నగరంలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలని, నానాటికీ తగ్గిపోతున్న ఆటస్థలాలను అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ ప్రస్తుత కమిషనర్ జనార్దన్‌రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యాసంస్థలకు ఆటస్థలాలను అద్దెకిచ్చేందుకు నిర్ణయించారు. అయినప్పటికీ విద్యాసంస్థల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ప్రోత్సాహం కరవు అరవింద్, అంబర్‌పేట నగరంలో క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లేదు. ఆటస్థలాలకు క్రీడా పరికరాలు సరఫరా చేయడం లేదు. ఎవరి క్రీడా పరికరాలు వారే తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆటస్థలాల అభివృద్ధిలో జీహెచ్ఎంసీ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. గ్రౌండ్స్‌లో ఏదైనా పాడైపోతే మరమ్మతులకే నెలల సమయం పడుతోంది. ఈ పరిస్థితి మారాలి. ఆటస్థలాల అభివృద్ధికి కృషి చేసే వారికే నా ఓటు. కాంక్రీట్ జంగిల్‌గా మారిన భాగ్యనగరిలో ‘ఆట’విడుపునకు అంగుళం స్థలం కూడా దొరకని పరిస్థితి. ‘కబ్జా’ సర్పం పడగవిప్పి ఆటస్థలాలు అదృశ్యమవుతున్నాయి. కొన్ని ఉన్నా వాటిలో సదుపాయాల లేమి. అరకొర వసతులతో క్రీడాకారులకు అష్టకష్టాలు. అభివృద్ధి ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమైన.. పాలకుల నిర్లక్ష్యం, యంత్రాంగం వైఫల్యాల ఫలితమిది. గ్రేటర్ ఎన్నికల వేళ.. అభివృద్ధి మంత్రం జపిస్తూ.. హామీలతో అదరగొడుతున్న నాయకులారా.. ఆటస్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే వారికే తమ ఓటు అంటున్నారు సిటీజనులు. - సాక్షి, సిటీబ్యూరో, అంబర్‌పేట భ్రమలో అధికారులు.. రజినీకాంత్, బాగ్ అంబర్‌పేట ఇండోర్, అవుట్డోర్ స్టేడియంలు అసలైన క్రీడాకారులకు అందుబాటులో ఉండడం లేదు. వ్యాయామం, విశ్రాంతి కోసం వచ్చే వారితో మైదానాలు నిండిపోతున్నాయి. దీంతో అక్కడ ప్రాక్టీస్ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆట స్థలాలున్నాయి.. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామనే భ్రమలో జీహెచ్ఎంసీ అధికారులున్నారు. ఆటస్థలాలు క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా చొరవ తీసుకొనే నాయకులకే నా ప్రాధాన్యం.