షాపింగ్‌ మాల్స్‌కు జీహెచ్‌ఎంసీ షాక్‌ | GHMC Innovative Program For Pedestrians | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 14 2018 11:17 AM | Last Updated on Sun, Oct 14 2018 2:06 PM

GHMC Innovative Program For Pedestrians - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో బడా దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు షాకిచ్చారు. ‘ఇది మీ దారి.. మీరు నడుచుకుంటూ వెళ్లేందుకు వీలుగా ఉండేందుకు ఏర్పాటు చేసిన మార్గం.. అయితే ఇక్కడి బడా దుకాణాల నిర్వాహకులు మీరు వెళ్లేందుకు వీలు లేకుండా ఆ రోడ్డును ఆక్రమించేశారు’’ అని నగర షాపింగ్‌ మాల్స్‌, దుకాణాల ముందు రాస్తూ జీహెచ్‌ఎంసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

నగరంలో చాలా చోట్ల పెద్ద పెద్ద దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌లు పాదచారుల రోడ్డును ఆక్రమిస్తున్నాయి. దీంతో  పాదచారులు నడుచుకుంటు వెళ్లేందుకు దారివ్వకుండా ఆ ప్రాంతాన్ని ఎలా ఆక్రమించుకున్నారో తెలిసేలా వివరిస్తూ అధికారులు షాపుల ముందే రాస్తున్నారు. ఇప్పటికైనా మీకు కేటాయించిన దారిలో నడవాలని ప్రజలకు సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement