సాక్షి, హైదరాబాద్: నగరంలో పాదచారుల ఇబ్బందులు తొలగించేందుకు ఫుట్‌పాత్‌లపై శ్రద్ద చూపుతున్నట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. రాష్ట్రం ఆవిర్భావం నాటికి నగరంలో 452 కిలోమీటర్ల ఫుట్‌పాత్‌లుండగా, ప్రస్తుతం 817 కి.మీ.కు పెరిగినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
2020లో మున్సిపల్ మంత్రి ఆదేశాలకనుగుణంగా రూ. 32.75 కోట్ల అంచనా వ్యయంతో ప్రతి జోన్‌లో కనీసం 10 కిలోమీటర్ల చొప్పున మొత్తం 75.64 కిలోమీటర్ల మేర చేపట్టిన 69 పనుల్లో 60 పనులు పూర్తయినట్లు పేర్కొంది. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపింది.
సమగ్ర రోడ్డు నిర్వహణ ప్రాజెక్టులో భాగంగా (సీఆర్‌ఎంపీ) మరో 60 కి.మీ. ఫుట్‌పాత్‌ల నిర్మాణం, 6.5 కి.మీ. ఫుట్‌పాత్‌లకు మరమ్మతులు జరిగినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. (క్లిక్: జీహెచ్‌ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపులు ఎప్పటి నుంచి అంటే..)
Comments
Please login to add a commentAdd a comment