Footpath
-
అదుపు తప్పి.. వేగంగా ఢీకొట్టి..
బంజారాహిల్స్: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారి నుంచి కారు దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌కు చెందిన ఆభరణాల వ్యాపారి తనయుడు సాధుల హర్షవర్ధన్ మరో ఐదుగురు స్నేహితులతో కలిసి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–13లోని సాయి మెన్షన్ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఆయనే నిర్మాతగా, హీరోగా అర్జున్ దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. శుక్రవారం రాత్రి హర్షవర్ధన్ తన స్నేహితులు సాంకేత్ శ్రీనివాస్ అలియాస్ తేజ, మాడే కార్తీక్, వంశీ, రాకేష్ నేతతో కలిసి ఉంటున్నాడు. హర్షవర్ధన్, వంశీలు గదిలో మద్యం తాగుతుండగా.. రాకేష్ అనే మరో స్నేహితుడు జూబ్లీహిల్స్‌లోని ఎయిర్‌లైవ్ పబ్‌లో ఉండగా తనను పికప్ చేసుకోవడానికి రావాలని హర్షవర్ధన్‌కు ఫోన్ చేశాడు. తాను మద్యం మత్తులో ఉన్నానని, మీరు వెళ్లి తీసుకురావాలంటూ కార్తీక్‌కు చెప్పి కారు తాళంచెవి ఇచ్చాడు. అర్ధరాత్రి 1.04 గంటల ప్రాంతంలో కార్తీక్.. థార్ కారు నడుపుతుండగా తేజ పక్కన కూర్చొని రాకే‹Ùను తీసుకురావడానికి జూబ్లీహిల్స్ పబ్‌కు బయలుదేరారు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 నుంచి అగ్రసేన్ చౌరస్తా మీదుగా అతి వేగంగా కేబీఆర్ పార్కు వైపు వెళ్తుండగా బసవతారకం కేన్సర్ హాస్పిటల్ సమీపంలో కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టి అక్కడ నిద్రిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తి (40) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన తెల్లవారుజామున 1.15 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ ఏసీపీ సామల వెంకట్‌రెడ్డి సిబ్బందితో కలిసి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటన వివరాలను ప్రత్యక్ష సాక్షుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. కారు డోర్ తీసి పరారైన యువకులు.. కారు బోల్తా పడిన తర్వాత డోర్ నుంచి ఇద్దరు యువకులు బయటకు వచ్చి పరుగులు తీశారని అక్కడ ఉన్నవారు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు కారు నెంబర్ ఆధారంగా ఫోన్ నెంబర్ సేకరించి సీసీ ఫుటేజీల ఆధారంగా కారు ఎక్కడి నుంచి వచి్చందో గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత భయంతో కార్తీక్, తేజ పారిపోతూ గదిలో ఉన్న హర్షవర్దన్, వంశీ, నేతను కూడా పారిపోవాలని చెప్పడంతో అంతా ఉడాయించారు. అయితే తెల్లవారుజామున ఇంటికి వచ్చిన రాకే‹Ùకు గదికి తాళం వేసి ఉండడం కనిపించింది. పోలీసులు రాకేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ మిస్టరీ వీడింది. పరారీలో ఉన్న కార్తీక్, తేజ, హర్షవర్ధన్, వంశీ, నేత తదితరులను అదుపులోకి తీసుకున్నారు. కారు నడిపిన కార్తీక్ పక్కనే కూర్చొన్న తేజలపై బీఎన్ఎస్ సెక్షన్ 105 (2), 337, ఎంవీ యాక్ట్ 184, 187, పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కారు ఇచి్చన హర్షవర్దన్‌పై కూడా కేసు నమోదైంది. కారు నడుపుతున్న కార్తీక్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని గుర్తించారు. కార్తీక్, తేజకు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించగా వారు మద్యం తాగలేదని తేలింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన లారీ
పుణే: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు గాయాలపాలయ్యారు. మహారాష్ట్రలోని పుణే నగరంలో ఆదివారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అమరావతికి చెందిన కార్మికులు వారి కుటుంబాలతోపాటు రెండు రోజుల క్రితం ఉపాధి కోసం పుణేకు వచ్చారు. వఘోలి ప్రాంతంలోని కెస్నాడ్ ఫటా ఫుట్‌పాత్‌పై వీరంతా నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 12.55 గంటల సమయంలో అదుపు తప్పిన ఓ ట్రక్కు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైగా దూసుకెళ్లింది. ఘటనలో రెండేళ్లలోపు ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు చనిపోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ గజానన్ టొట్రేను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
తప్పతాగి ఫుట్‌పాత్‌పైకి ఎక్కించి.. పుణేలో ఘోరం
ముంబై: పుణేలో అర్ధరాత్రి ఘోరం జరిగింది. ఫుల్‌గా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఫుట్‌పాత్‌పైకి ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఫుట్‌పాత్ నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది.సుమారు ఒంటి గంట సమయంలో ఓ వ్యక్తి వాహనం నడుపుతూ వాఘోలి చౌక్ ఏరియాకు చేరుకున్నాడు. హఠాత్తుగా తన బండికి అక్కడే ఉన్న ఫుట్‌పాత్‌పైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాలు పోవడానికి కారణమైనందుకు మోటార్ వెహికిల్స్ యాక్ట్‌తో పాటు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.మృతుల్లో.. ఏడాది, రేండేళ్ల వయసున్న చిన్నారులు, విశాల్ పన్వర్(22) ఉన్నారు. అమరావతిలో నిర్మాణ పనుల కోసం వచ్చిన కూలీలు.. కేశ్నాథ్ ఫాటా ఏరియాలో ఫుట్‌పాత్‌పై పడుకున్నారని, వాళ్లపై నుంచి ట్రక్కు దూసుకెళ్లిందని, వాహనం నడిపిన వ్యక్తి బాగా తాగి ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.#महाराष्ट्र के पुणे में भयानक सड़क हादसा..नशे में धुत #डंपर ड्राइवर ने फुटपाथ पर सो रहे 9 लोगों को कुचला, 3 की मौत#Maharashtra #Pune #accident #footpath #Dumper #drunkdriving pic.twitter.com/y71i5EtaAQ— mishikasingh (@mishika_singh) December 23, 2024Pune: Dumper Truck Driver Claims Three Lives, Injures Nine In Wagholi Near Kesnand Phata In a tragic incident on Pune’s Wagholi area near Kesnand phata, a speeding dumper truck ran over 12 people sleeping on a footpath, killing three and injuring nine. The accident, reportedly… pic.twitter.com/K6T09Om7v4— Pune Pulse (@pulse_pune) December 23, 2024 -
Right to Walk.. ఇంకెప్పుడు..?
గ్రేటర్ సిటీని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటున్న పాలకులు నగరం మధ్యలో ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ వంటి పనులపై దృష్టి పెడుతున్నా, కాలినడకన వెళ్లే వారికి అవసరమైన మేరకు ఫుట్‌పాత్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ)ల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు ప్రధాన రహదారుల్లో సాఫీగా కొద్ది దూరం కూడా నడవలేక.. ఒకవైపు నుంచి మరో వైపు రోడ్డు దాటలేక పాదచారులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. చాలాచోట్ల ఫుట్‌పాత్‌లు లేక, ఉన్న ఫుట్‌పాత్‌లు చాలా ప్రాంతాల్లో ఆక్రమణకు గురికావడంతో పాదచారులు విధిలేని పరిస్థితు ల్లో రోడ్లపైనే నడుస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. కిక్కిరిసిన జంక్షన్ల వద్ద రోడ్డు దాటేందుకు ప్రయత్నించేవారు కూడా రయ్ మంటూ దూసుకుపోయే వాహనాల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ఎఫ్‌ఓబీలు ఉన్నా చాలాచోట్ల లిఫ్ట్‌ల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో నిరుపయోగంగా ఉంటున్నాయి.ఈ కారణంగా పాదచారులు ఎఫ్‌ఓబీలు ఉపయోగించకుండా ట్రాఫిక్ మధ్యలోనే రోడ్లు దాటేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. గత ఏడాది నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 123 మంది మృత్యువాత పడగా అనేకమంది గాయాల పాలవడం గమనార్హం. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 9,013 కి.మీ పొడవైన రోడ్లు ఉండగా ఫుట్‌పాత్‌లు కేవలం 817 కిలోమీటర్లకే పరిమితం కావడం పరిస్థితిని స్పష్టం చేస్తోంది.10% కూడా లేని ఫుట్పాత్లుజీహెచ్ఎంసీ పరిధిలో బీటీ, సీసీ, ఇతరత్రా రోడ్లన్నీ కలిపి మొత్తం 9,013 కిలోమీటర్ల రహదారులుండగా, వాటిల్లో ఫుట్‌పాత్‌లు లేదా వాక్‌వేలు కలిపి కనీసం 10 శాతం కూడా లేవు. ఉన్న ఫుట్‌పాత్‌లు దుకాణదారులు తమ అమ్మకపు సామగ్రిని ఉంచడానికి, వాహనాల పార్కింగ్‌కు, టీకొట్లు, తోçపుడు బండ్లు, ఇతరత్రా చిన్న వ్యాపారాల నిర్వహణకు పనికి వస్తున్నాయే తప్ప ప్రజలు నడవడానికి అనువుగా ఉండటం లేదు. ప్రభుత్వ సంస్థలు సైతం పబ్లిక్ టాయ్లెట్లు, ట్రాన్స్ఫార్మర్లు, రూ.5 భోజన కేంద్రాలు వంటివి ఫుట్‌పాత్‌లపైనే ఏర్పాటు చేయడం గమనార్హం. కాగా కొందరు ఇసుక, ఇటుక, కంకర వంటి వాటిని సైతం ఫుట్‌పాత్‌లపైనే ఉంచి వ్యాపారాలు చేస్తున్నారు. అన్ని రోడ్లకు ఫుట్పాత్లుండాలిఅన్ని రహదారుల వెంబడి ఫుట్‌పాత్‌లను నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే ఇప్పటికే ఉన్న ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించి, అవి ప్రజలు నడిచేందుకు మాత్రమే ఉపయోగపడేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జీహెచ్ఎంసీలో ఈవీడీఎం విభాగం ప్రారంభమైన తొలినాళ్లలో ఆరేళ్ల క్రితం ‘రైట్ టూ వాక్’ పేరిట 20 వేలకు పైగా ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించింది. చిన్నాచితకా వ్యాపారులను వాటిపై నుంచి తరలించారు. తొలగింపు సమయంలో ఫుట్‌పాత్‌లు దెబ్బతిన్న ప్రాంతాల్లో కొత్తగా నిర్మిస్తామని పేర్కొన్నారు. కానీ కొత్తగా నిర్మించలేదు సరికదా.. కొన్నాళ్లకే ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో మళ్లీ వ్యాపారాలు వెలిశాయి.జీహెచ్ఎంసీలో రోడ్లు.. పుట్‌పాత్‌లు ఇలా (కి.మీ.లలో)⇒ మొత్తం రోడ్లు 9,013⇒ సీసీ రోడ్లు 6,167⇒ బీటీరోడ్లు 2,846⇒ ఫుట్‌పాత్‌లు 817ఫుట్‌పాత్‌ల పరిస్థితి అలా ఉంచితే.. ఒక వైపు నుంచి మరో వైపు రోడ్డు దాటి వెళ్లాలంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా బిజీ రోడ్లలో ఆగకుండా దూసుకొచ్చే వాహనాలతో ఒక్క అడుగు ముందుకు వేయడం కూడా కష్టంగా ఉంటుంది. బిక్కుబిక్కుమంటూ వచ్చే వాహనాల వైపు చేతిని అడ్డంగా పెడుతూ బతుకుజీవుడా అనుకుంటూ రోడ్లు దాటుతున్నవారు నిత్యం కనిపిస్తుంటారు. ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారి పరిస్థితి చెప్పనక్కర్లేదు.ఎవరో ఒకరు తోడులేందే వారు రోడ్డు దాటలేని పరిస్థితి ఉంటోంది. పాదచారులు రోడ్లు దాటేందుకు ఫుట్ఓవర్ బ్రిడ్జీలు, పెలికాన్ సిగ్నల్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కోట్ల రూపాయలు ఖర్చవడం తప్ప అవి ప్రజలకు ఉపయోగపడటం లేదు. నగరంలో ఉన్న అనేక ఫుట్ఓవర్ బ్రిడ్జీలు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా ఉంటున్నాయి. పాదచారుల నిర్లక్ష్యం కూడా ఇందుకు కొంత తోడవుతోంది. చాలాచోట్ల లిఫ్ట్‌లు పని చేయడం లేదు. కొన్నిచోట్ల పనిచేస్తున్నా పాదచారులు వాటిని ఉపయోగించడం లేదు. అధికార యంత్రాంగం మాత్రం ప్రజలకు ఉపయోగపడుతున్నదీ, లేనిదీ పరిశీలించకుండానే కొత్తవి నిర్మించేందుకు పూనుకుంటోంది. ఉన్నవి ఉపయోగపడేలా చేసే దిశగా చర్యలు చేపట్టడం లేదు.ఎన్ని ఉన్నా ఏం లాభం?జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, నేషనల్ హైవే, టీజీఐఐసీ సంస్థలు ఏర్పాటు చేసిన ఎఫ్‌ఓబీలు పాతవి 23 ఉండగా, కొత్తగా పనులు చేపట్టిన వాటిల్లో 12 పూర్తయ్యాయి. మరో ఐదు పురోగతిలో ఉన్నాయి. ఎఫ్‌ఓబీలు ఎక్కువ ఎత్తులో ఉండటంతో చాలామంది వాటిని వినియోగించుకోవడం లేదు. వయోవృద్ధులు శారీరక సమస్యలున్న వారు అసలు ఎక్కలేక పోతున్నారు. ఎక్కగలిగే శక్తి ఉన్నవారు సైతం వాటిని ఎక్కి నడిచి దిగే కంటే ఎలాగోలా రోడ్డు దాటేయొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లోనూ లిఫ్టులు, ఎస్కలేటర్లు వంటివి ఏర్పాటు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని ఏర్పాటు చేయడంతో ఊరుకోకుండా ప్రజలు వాటిని వినియోగించేలా చూడాలని, ఎలా వినియోగించాలో తెలియని వారి కోసం నిర్వహణ సిబ్బందిని నియమించాలని అంటున్నారు.ఫుట్‌పాత్‌లు ఉండాల్సింది ఇలా (మీటర్లలో..)⇒ దుకాణాల ముందు 3.5 4.5⇒ బస్టాప్‌లు 3.00⇒ వాణిజ్య ప్రాంతాల్లో.. 4.00⇒ ఇతర ప్రాంతాల్లో.. 2.5(నగరంలో 0.60 మీటర్ల నుంచి 3 మీటర్ల లోపే ఉన్నాయి. ఎక్కువగా మీటరు నుంచి మీటరున్నర వరకే ఉన్నాయి) రోడ్డుపైకి వెళ్లకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలికోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఎఫ్‌ఓబీలను ప్రజలు వినియోగించుకోవాలి. కొందరు రోడ్డు పైనుంచే వెళ్తూ ప్రమా దకరమైనప్పటికీ సెంట్రల్ మీడియన్లను సైతం ఎక్కి దిగుతున్నారు. ఈ పరిస్థితి నివారణకు బ్రిడ్జికి అటూ ఇటూ కనీసం వంద మీటర్ల వరకు ప్రజలు రోడ్డు మీదకు వెళ్లేందుకు వీల్లేకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. – ఆర్. శ్రీధర్, స్ట్రక్చరల్ ఇంజనీర్, రిటైర్డ్ ఈఎన్సీ, జీహెచ్ఎంసీఆ వ్యవస్థతో బ్రిడ్జీలు ఏర్పాటు చేయొచ్చుఫుట్పాత్లు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఫుట్‌పాత్‌లు లేని ప్రాంతాల్లో రోడ్డు చివరి లైన్లో టూ టయర్ సిస్టమ్‌తో బ్రిడ్జిలాంటి ఏర్పాటు చేయవచ్చు. 2 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేసే ఈ బ్రిడ్జి పైనుంచి పాదచారులు వెళ్లేలా, టూ, త్రీవీలర్లు కిందనుంచి వెళ్లేలా నిర్మాణాలు చేయొచ్చు. అలాగే రోడ్డు దాటేందుకు జాకింగ్ కాన్సెప్ట్‌తో మీటర్ రేడియస్‌తో టన్నెల్ లాంటి నిర్మాణం చేయొచ్చు. గతంలో ఓ పోలీసు ఉన్నతాధికారి హయాంలో ఇలాంటి ఆలోచనలు జరిగాయి. ఆయన మారడంతో అది అటకెక్కింది. – ప్రొఫెసర్ లక్ష్మణరావు, జేఎన్టీయూఎక్కువ ఎత్తు అవసరం లేదునగరంలో ఏర్పాటు చేసిన ఎఫ్‌ఓబీలు చాలా ఎత్తులో ఉన్నందువల్ల ఎవరూ ఎక్కడం లేదు. కాబట్టి ఎత్తు కాస్త తగ్గించాలి. మెట్రో స్టేషన్లలో మాదిరిగా లిఫ్టులు, ఎక్సలేటర్లు ఉంటే అవసరమైన వారు వినియోగిస్తారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వద్ద ఎఫ్ఓబీ ఉన్నప్పటికీ లిఫ్టు పనిచేయక ఎక్కడం లేదు. పాదచారులు ఎక్కువగా రోడ్లు దాటే ప్రాంతాలను గుర్తించి అక్కడ రోడ్క్రాసింగ్కు వీలుగా సిగ్నల్ లైట్లు పెట్టడం మాత్రమే కాకుండా వాహనాలు కచ్చితంగా ఆగేలా చూడాలి. పాదచారుల క్రాసింగ్ ఏరియా అని తెలిసేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయాలి. పాదచారులకు సహాయకులుగా పోలీసులు లేదా ఇతర సిబ్బందిని నియమించాలి. దీనివల్ల కొందరికి ఉపాధి కూడా లభిస్తుంది. – డా. దొంతి నరసింహారెడ్డి, సామాజికవేత్తపేరుకే పెలికాన్ సిగ్నల్స్బిజీ రోడ్డును దాటాలనుకునే పాదచారుల కోసం నగరంలోని 70కి పైగా ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నల్స్ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పాదచారి ఎవరైనా రోడ్డు దాటాలనుకున్నప్పుడు పక్కనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాలో ఉండే స్విచ్‌ను నొక్కాల్సి ఉంటుంది. అప్పుడు రెడ్ సిగ్నల్ పడి కొన్ని సెకన్ల తర్వాత రోడ్డుకిరువైపులా రాకపోకలు సాగించే వాహనాలు నిర్ణీత సమయం ఆగిపోతాయి. అప్పుడు పాదచారులు రోడ్డు దాటాల్సి ఉంటుంది.ఒక్కసారి బటన్ నొక్కిన తర్వాత.. పదే పదే నొక్కినా పని చేయకుండా కొంత గ్యాప్ ఉంటుంది. అంటే ఎవరైనా కూడా వెంట వెంటనే నొక్కడానికి అవకాశం ఉండదన్న మాట. అయితే బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి వద్ద, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో ఉన్న ఈ పెలికాన్ సిగ్నల్స్ కేవలం అలంకారంగానే ఉన్నాయి. ఎప్పుడో ఏర్పాటు చేసిన ఈ సిగ్నల్స్ కొన్ని ప్రాంతాల్లో పనిచేయడం లేదు. అసలు వీటిని ఎలా వినియోగించాలో కూడా ప్రజలకు తెలియదని, అధికారులు ఈ విషయంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.లిఫ్ట్ ఉన్నా వేస్ట్ ఎర్రగడ్డ ప్రధాన రహదారిలోని మోడల్ కాలనీ కమాన్ వద్ద ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిని సరిగా నిర్వహించడం లేదు. లిఫ్ట్ సౌకర్యం ఉన్నా అది ఎప్పుడు పని చేస్తుందో, ఎప్పుడు పని చేయదో తెలియదు. నాలాంటి సీనియర్ సిటిజన్లు మెట్లు ఎక్కి వెళ్లలేకపోతున్నాం. ఎఫ్ఓబీ సమీపంలో చెత్తాచెదారం నిండి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. –జేఎస్టీ శాయి, మోడల్ కాలనీ, సనత్‌నగర్.నిబంధనల పాటింపు తప్పనిసరి చేయాలిపాదచారులకు సైతం కొన్ని నిబంధనలు ఉన్నాయి. వీటి ప్రకారం పెడస్ట్రియన్ క్రాసింగ్స్‌లో, నిర్దేశించిన విధంగానే రోడ్డు దాటాలి. అలా చేయకపోవడం ఉల్లంఘన కిందికే వస్తుంది. నేను గతంలో చెన్నై వెళ్లిన ప్పుడు ఓ విషయం గమనించా. అప్పట్లో అక్కడి సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండేది. దీంతో పాదచారులు రోడ్డు దాటడానికి వీలుగా అండర్ పాస్ ఏర్పాటు చేశారు.అయితే తొలినాళ్లలో దీన్ని వినియోగించకుండా రోడ్డు పైనుంచే దాటుతుండ టంతో ప్రమాదాలు కొన సాగాయి. దీంతో ఆ అండర్ పాస్ వద్ద ఓ కాని స్టేబుల్‌ను ఏర్పాటు చేశారు. ఎవరైనా అండర్ పాస్ కాకుండా రోడ్డు పైనుంచి క్రాస్ చేస్తే కానిస్టేబుల్ పట్టుకునేవారు. అక్కడి కక్కడే రూ.5 జరిమానా విధించి వసూలు చేసే వారు. దీంతో పాటు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతో అండర్ పాస్ వినియోగం పెరిగింది. ఇలాంటి విధానాలు హైదారాబాద్‌లోనూ అమల్లోకి తీసుకురావాలి. – కేవీకే రెడ్డి, ట్రాఫిక్ నిపుణుడునగరంలో ఎఫ్ఓబీలున్న ప్రాంతాలుపాతవి: అనుటెక్స్ (సైనిక్‌పురి), హెచ్‌పీ పెట్రోల్‌బంక్ (రామంతాపూర్), నేషనల్ పోలీస్ అకాడమీ (రాజేంద్రనగర్), గగన్‌పహాడ్, మహవీర్ హాస్పిటల్, ఎన్ఎండీసీ (మాసాబ్‌ట్యాంక్), ఎన్టీఆర్ మార్గ్ (ట్యాంక్‌బండ్), గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, ముఫకంజా కాలేజ్ (బంజారాహిల్స్), భారతీయ విద్యాభవన్ స్కూల్ (ఫిల్మ్‌నగర్), వెల్స్ ఫార్గో (ఖాజాగూడ), ఐఎస్బీ, ఐటీసీ కోహినూర్, మియాపూర్ క్రాస్‌రోడ్స్, ఆల్విన్ క్రాస్‌రోడ్స్ (మదీనగూడ), మలేసియన్ టౌన్షిప్, కేపీహెచ్‌బీ–4 ఫేజ్, కళామందిర్ (కేపీహెచ్‌బీ కాలనీ), ఐడీపీఎల్, మెట్టుగూడ, రైల్‌నిలయం, హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్ (బేగంపేట).కొత్తవి: బాలానగర్, చెన్నెయ్ షాపింగ్ మాల్ (మదీనగూడ), మియాపూర్, ఈఎస్ఐ హాస్పిటల్(ఎర్రగడ్డ), హైదరాబాద్ సెంట్రల్ మాల్, నేరేడ్మెట్ బస్టాప్, సెయింట్ ఆన్స్ స్కూల్(సికింద్రాబాద్), తార్నాక, స్వప్న థియేటర్ (రాజేంద్రనగర్), ఒమర్ హోటల్, రంగభుజంగ థియేటర్, మూసాపేట క్రాస్‌రోడ్స్. -
చదువుకో తమ్ముడా... చదువుకో చదువుకుంటే కలలు పండే కాలమే నీదవుతది
దిల్లీలోని కమలానగర్ మార్కెట్‌కు దగ్గరలో ఉన్న ఫుట్‌పాత్‌పై కూర్చున్న ఒక పిల్లాడు శ్రద్ధగా చదువుకుంటూనే మరో వైపు హెయిర్ బ్యాండ్లను అమ్ముతున్నాడు. ఇది చూసిన హ్యారీ అనే ఫోటోగ్రాఫర్ పిల్లాడితో మాటలు కలిపాడు. ఆరో క్లాసు చదువుతున్న పవన్ తన కుటుంబానికి సహాయంగా ఉండడం కోసం పుట్‌పాత్‌పై హెయిర్ బ్యాండ్లు అమ్ముతుంటాడు. అలా అని చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయడు. ఏ రోజు పాఠాలు ఆ రోజు శ్రద్ధగా చదువుకుంటాడు. తన కుటుంబ స్థితిగతులను హ్యారీకి చె΄్పాడు పవన్. ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో తక్కువ టైమ్‌లోనే పది మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకు΄ోయింది. పవన్ కుటుంబానికి అండగా నిలబడడానికి చాలామంది ముందుకు రావడం మరో విశేషం. -
నడక నరకమే
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో ఎన్నో ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలు చేపట్టినా.. స్కైవేలు రానున్నా.. ప్రజలకు చాలినన్ని నడకదారులు మాత్రం అందుబాటులో లేవు. దీంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. నగరంలో 9,100 కి.మీ మేర రహదారులున్నాయి. ఇందులో పది శాతం ఫుట్‌పాత్‌లు కూడా లేవు. వేలాది కోట్ల రూపాయల వ్యయంతో భారీ ప్రాజెక్టులు పూర్తి చేసినప్పటికీ.. రూ.100 కోట్ల ఫుట్‌పాత్‌లు కూడా నిర్మించలేదు. వాహనదారుల సాఫీ ప్రయాణం కోసం సిగ్నల్‌ఫ్రీగా ఉండేలా వివిధ ఫ్లై ఓవర్లతో పాటు వారికి ప్రయాణ సమయం, ఇంధన వ్యయం, కాలుష్యం తగ్గేలా, ఫ్లై ఓవర్లతోపాటు లింక్ రోడ్లు కూడా నిర్మిస్తున్నప్పటికీ నడిచేవారికి అవసరమైన ఫుట్‌పాత్‌లపై ప్రభుత్వాలు శ్రద్ధ చూపడంలేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అడపాదడపా ప్రాణాలు పోతున్నాయి. ఉన్నా నడవలేరు.. ఉన్న ఫుట్‌పాత్‌లే తక్కువ కాగా, అవి సైతం ప్రజల నడకకు ఉపయోగపడటం లేదు. వాటిపైనే దుకాణాలు, ట్రాన్స్ఫార్మర్లు, పబ్లిక్ టాయ్లెట్లు, వాటర్ ఏటీఎంలు, చెట్లు, అన్నపూర్ణ భోజన కేంద్రాలు ఉన్నాయి. దీంతో ఆటంకాలు లేకుండా కనీసం యాభై మీటర్లు కూడా నడిచే పరిస్థితి లేదు. ఈ దుస్థితి మారుస్తారేమోనని ఎదురు చూస్తున్న పాదచారుల సమస్యల్ని పట్టించుకుంటున్న వారే లేకుండాపోయారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతున్నా ఏళ్లుగా ఉన్న పాత సమస్య.. పాదచారుల అవస్థలు మాత్రం తీరడం లేదు. తాము నడిచేందుకు తగిన విధంగా, ఫుట్‌పాత్‌లుండాలని, అన్నిప్రధాన ర హదారుల వెంబడీ సదుపాయంగా నడిచేంత వెడల్పుతోవాటిని నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ►గడచిన పదేళ్ల కాలంలో కనీసం 400 కి.మీ ఫుట్‌పాత్‌లు కూడా నిర్మించలేదు. ► రెండేళ్లక్రితం జోన్‌కు కనీసం పది కిలోమీటర్లయినా ఫుట్‌పాత్‌లు నిర్మించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించినా పనులు పూర్తి కాలేదు. ► సీఆర్ఎంసీ కింద రోడ్ల నిర్మాణం చేపట్టిన ఏజెన్సీలు సైతం ఫుట్‌ఫాత్‌లను పట్టించుకోవడం లేదు. గత ఆరేళ్లలో నిర్మించిన ఫుట్‌పాత్‌లు.. వాటికై న వ్యయం సంవత్సరం ఫుట్ వ్యయం పాత్‌లు (రూ.కోట్లలో) 2017 63 2.67 2018 95 7.20 2019 105 12.80 2020 89 17.96 2021 86 20.99 2022 49 18.90 -
మేమేమి చేశాము పాపం?
బుడిబుడి అడుగులు వేస్తూ.. కేరింతలు కొడుతూ.. అందర్నీ దాటుకుంటూ.. ఒక్కో మెట్టూ ఎక్కుతున్న కుమార్తెను చూసి ఉప్పొంగిపోయారు. ఆ గోవిందుడిని స్మరిస్తూ.. ముందు వెళ్తున్న కుమార్తెను గమనిస్తూ.. ముందుకు సాగారు. ఇంతలో బాలిక హఠాత్తుగా అదృశ్యమవ్వడంతో తల్లిదండ్రులు ఒకింత గందరగోళానికి లోనయ్యారు. ఎక్కడుందోనన్న ఆత్రుతతో చీకటిని చీల్చుకుంటూ వెతుకులాడడం ప్రారంభించారు. నిశీధిలో రెప్ప వాల్చకుండా ఎక్కడో ఒకచోట సురక్షితంగా ఉంటుందని ఎదురుచూశారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. వన్యమృగాల దాడిలో చిన్నారి మృతిచెందిందని తెలిసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మా ఇంటి మహాలక్ష్మిని తీసుకెళ్లావా..దేవుడా! అంటూ గుండెలవిసేలా రోదించారు. అక్క ఎక్కడుందమ్మా..? అంటూ తమ్ముడు అడిగే మాటలకు ఆ తల్లి జవాబు చెప్పలేక కన్నీరుమున్నీరవుతూ విలపించడం అక్కడి వారిని కలిచివేసింది. ఈ విషాద ఘటన రుయా ఆస్పత్రి వద్ద శనివారం కనిపించింది. సాక్షి, తిరుపతి: తిరుమల అలిపిరి నడక మార్గంలో శుక్రవారం రాత్రి ఘోరం చోటుచేసుకుంది. వన్యమృగం దాడిలో ఆరేళ్ల బాలిక మృతిచెందడం అందరినీ కలిచివేసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, కోవూరు మండలం, పోతిరెడ్డిపాళెంకు చెందిన దినేష్‌కుమార్, శిశికళ కుమార్తె లక్షిత(6) శుక్రవారం సాయంత్రం అలిపిరి కాలిబాటలో కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది జల్లెడ పట్టారు. శనివారం తెల్లవారు జాము నుంచి మరోమారు గాలింపు చేపట్టగా.. అలిపిరి నడకమార్గంలోని నరసింహస్వామి ఆలయానికి వంద నుంచి 200 మీటర్ల దూరంలో ఓ బండరాయిపై లక్షిత మృతదేహం లభ్యమైంది. క్రూరం..ఘోరం చిన్నారి లక్షితను వన్యమృగాలు అతికిరాతకంగా హతమార్చినట్టు తెలుస్తోంది. మెడ, తల భాగాన్ని.. కుడి కాలు తొడ భాగంలోని కండను పూర్తిగా తినేయడంతో భయానకంగా మారింది. చిన్నారి మృతదేహాన్ని ఉదయం 7.55 గంటలకు తిరుపతి రుయా ఆస్పత్రి తీసుకొచ్చారు. 15 నిమిషాల పాటు డాక్టర్లు పరిశీలించి శవపరీక్ష కోసం మార్చురీకి తరలించారు. ఎస్వీ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ విభాగ వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఉదయం 11.05 గంటలకు పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు టీటీడీ అంబులెన్స్ సిద్ధం చేసింది. కొంప ముంచిన బెలూన్! సీసీ ఫుటేజ్ పరిశీలించిన అధికారులు చిన్నారి హుందాగా.. వేగంగా ఆడుకుంటూ తల్లిదండ్రులకంటే ముందే మెట్లెక్కడం కనిపిచింది. ఈ క్రమంలో ఆంజనేయస్వామి విగ్రహం తర్వాత ఓ దుకాణం వద్ద బిస్కెట్ ప్యాకెట్‌ను కొనిచ్చారు. వాటిని తింటూ చిన్నారి ముందుకు సాగింది. నరసింహస్వామి ఆలయ సమీపంలో చిన్నారి కనిపించకుండా పోయింది. బెలూన్‌తో ఆడుకుంటున్న సమయంలో గాలికి ఆ బెలూన్ మెట్లమార్గం దాటి వెళ్లడం.. దానికోసం పరుగులు తీసేక్రమంలో ఆ పరిసర ప్రాంతాల్లో చెట్ల మాటున దాగి ఉన్న క్రూరమృగం పాపను ఎత్తుకెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. రుయాలో మిన్నంటిన ఆర్తనాదాలు రుయా మార్చురీ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చిన్నారి మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న నా బిడ్డ దక్కకుండా పోయిందంటూ తల్లి శశికళ గుండెలు బాదుకుంటూ రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. చిన్నారి నానమ్మ మనుమరాలితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ దేవుడా..! ఇంత శిక్షవేశావేంటయా... అంటూ విలపించడం కలిచివేసింది. అక్క ఎక్కడమ్మా?..అంటూ తమ్ముడు లిఖిత్ అడుగుతుండడంతో తల్లి సమాధానం చెప్పలేక.. ఇంకెక్కడ అక్క నాయనా! దేవుడు తీసుకెళ్లి పోయాడురా అంటూ.. కన్నీరుమున్నీరైంది. మా ఇంటి మహాలక్ష్మి ఇక లేదన్న విషయాన్ని ఎలా జీర్ణించుకోవాలంటూ తల బాదుకుంటూ విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. దాడి చేసింది చిరుతేనా? వన్యమృగం చిన్నారి శరీరాన్ని చిన్నాభిన్నం చేసింది. చూడడానికి వీలుకాని రీతిలో మృతదేహం పడిఉండడం.. చూస్తే చిరుతా..లేక ఎలుగుబంటా అనే విషయాన్ని అధికారులు నిర్ధారించలేకపోతున్నారు. మరికొందరు రేసుకుక్కల పనేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే ఒక నిర్ణయానికి రాగలమని అధికారులు చెబుతున్నారు. అయితే చిరుతదాడేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఘటన స్థలాన్ని సీసీఎఫ్ నాగేశ్వరరావు, డీఎఫ్ఓ సతీష్‌కుమార్ పరిశీలించారు. దాడిచేసిన జంతువును బంధించేందుకు బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎలుగుబంటు అయితే మత్తుద్వారా బంధిస్తామని, చిరుత అయితే బోన్ ద్వారా బంధించనున్నట్లు వెల్లడించారు. జంతువుల కదిలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తామన్నారు. ఏడో మైలురాయి నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హైఅలర్ట్ జోన్‌గా ప్రకటించారు. ఘటనా స్థలాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పరిశీలించారు. చిన్నారి మృతి బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సంఘటనా స్థలాన్ని ఎస్పీ పరమేశ్వరరెడ్డి పరిశీలించారు. బాలికను వన్యమృగాలు దారుణంగా చంపడం బాధాకరమన్నారు. భక్తులందరూ గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. -
ఎదుగుతున్నానుకున్నాడు..సడెన్ బ్రేక్‌లా ఫుట్‌పాత్‌పై పడ్డాడు అదే..
ఓ సాధారణ పట్టణంలో పుట్టి పెరిగాడతడు. కంప్యూటర్ కోర్సు కోసం హైదరాబాద్ వచ్చాడతడు. నేర్చుకున్నాడు... తను నేర్చిన విద్యను ఇతరులకు నేర్పించేపనిలో మునిగిపోయాడు. ఎదుగుతున్నాననుకున్నాడు... అగాధంలోకి జారిపోయాడు. ఫుట్ పాత్ మీదే నిద్ర... అతడిని మార్చిన రోజది. సంజీవకుమార్ పుట్టింది, పెరిగింది మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో. పాలిటెక్నిక్, ఐటీఐ, గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకునే నాటికి సమాజంలో సాంకేతికంగా మరో విప్లవం మొదలైంది. అదే కంప్యూటర్ ఎడ్యుకేషన్. రాబోయే కాలంలో కంప్యూటర్ లేనిదే ఏ పనీ చేయలేమని తెలుసుకున్నాడు సంజీవ్‌కుమార్. హైదరాబాద్‌కు వచ్చి డీటీపీతో మొదలు పెట్టి డీసీఏ, పీజీడీసీఏ, పీజీ డీఎస్ఈ వరకు అప్పటికి అందుబాటులో ఉన్న కోర్సులన్నీ చేశాడు. తన మీద నమ్మకం పెరిగింది. సైబర్‌టెక్ పేరుతో నల్లకుంటలో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ స్థాపించాడు. కంప్యూటర్స్‌లో ప్రపంచాన్ని ఆందోళనలో ముంచెత్తిన వైటూకే సమస్య సద్దుమణిగింది. కానీ అంతకంటే పెద్ద ఉత్పాతం సంజీవకుమార్ జీవితాన్ని ఆవరించింది. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నాడతడు. అప్పు మిగిలింది! ‘‘నా మీద నాకున్న నమ్మకం, దానికితోడు అందరినీ నమ్మడం నా జీవిత గమనాన్ని మార్చేశాయి. నా మీద నమ్మకంతో కంప్యూటర్ సెంటర్లు ప్రారంభించాను. స్నేహితుల మీద నమ్మకంతో పదకొండు బ్రాంచ్‌లకు విస్తరించాను. కొన్ని బ్రాంచ్‌ల నిర్వహణ స్నేహితులకప్పగించాను. కొందరు స్నేహితులు పెట్టుబడి కోసం డబ్బు అప్పు ఇచ్చి సహకరించారు. నా పెళ్లి కోసం ఒకటిన్నర నెలలు మా ఊరెళ్లాను. పెళ్లి చేసుకుని హైదరాబాద్‌కి వచ్చేటప్పటికి పరిస్థితి తారుమారుగా ఉంది. ఫ్రాంచైసీలు తీసుకున్న స్నేహితులు మోసం చేశారు. నా కళ్ల ముందు తొంబై ఐదు లక్షల అప్పు. నా భార్య బంగారం, నేను నిర్వహిస్తున్న కంప్యూటర్ సెంటర్లను అమ్మేసి కూడా ఆ అప్పు తీరలేదు. అప్పు ఇచ్చిన స్నేహితుల నుంచి ఒత్తిడి పెరిగింది. నా భార్యను పుట్టింట్లో ఉంచి హైదరాబాద్‌కొచ్చాను. నా దగ్గర డబ్బున్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్లెవరూ నాకు ఒక్కరోజు అన్నం కూడా పెట్టలేదు. ఆకలితో ఫుట్‌పాత్ మీద పడుకున్న రోజును నా జీవితంలో మర్చిపోలేను. డబ్బులేని మనిషికి విలువ లేదని తెలిసి వచ్చిన క్షణాలవి. మరి ఫుట్‌పాత్ మీదనే బతికేవాళ్ల పరిస్థితి ఏమిటి... అనే ఆలోచన మొదలైన క్షణం కూడా అదే. వైద్యం... ఆహారం! నేను స్కై ఫౌండేషన్ స్థాపించింది 2012లో. అప్పటి నుంచి వీధుల్లో బతికే వాళ్లకు ప్రతి ఆదివారం అన్నం పెట్టడం, మందులివ్వడం, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నాను. ఆఫీస్‌లోనే వండి రెండు వందలకు పైగా పార్సిళ్లతో మా వ్యాన్ బయలుదేరుతుంది. వాటిని ఫుట్‌పాత్ మీద, చెట్టుకింద పడుకున్న వాళ్లకు ఇస్తాం. అలాగే ప్రతి బిడ్డా పుట్టిన రోజు పండుగనూ, కేక్ కట్ చేసిన ఆనందాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో పిల్లలకు సామూహికంగా పుట్టిన రోజులు చేస్తున్నాను. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజు పిల్లల చేత జెండావందనం చేయిస్తాను. కోఠీలో పాత పుస్తకాలు తెచ్చి పంచుతాను. వీటన్నింటికంటే నేను గర్వంగా చెప్పుకోగలిగిన పని వీళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించడం. ఫుట్‌పాత్‌ల మీద బతుకీడ్చే వాళ్లకు ఆధార్ కార్డు ఉండదు, మొబైల్ ఫోన్ ఉండదు. కరోనా వ్యాక్సిన్ వేయాలంటే ఈ రెండూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసి ప్రత్యేక అనుమతి తీసుకుని వాళ్లందరికీ వ్యాక్సిన్ వేయించాను. కరోనా సమయంలో సేవలందించిన వైద్యులకు, వైద్య సిబ్బందికి సన్మానం చేశాను. ఒక్క అవకాశమివ్వండి! వీధుల్లో బతుకు వెళ్లదీసే వాళ్లకు తాత్కాలికంగా అన్నం పెట్టడం, దుస్తులివ్వడం శాశ్వత పరిష్కారం కాదు. ఈ బతుకులు రోడ్డు పక్కనే ఉండిపోకూడదంటే వాళ్లకు బతుకుదెరువు చూపించాలి. ప్రభుత్వాలు వాళ్లను షెల్టర్ హోమ్‌లో ఉంచి ఆహారం పెట్టడంతో సరిపెట్టకూడదు. చిన్న చిన్న పనుల్లో శిక్షణ ఇచ్చి సమాజంలోకి పంపించాలి. వడ్రంగం, బుక్ బైండింగ్, అగరుబత్తీల తయారీ, విస్తరాకుల కటింగ్ వంటి చిన్న పనులు నేర్పించినా చాలు. వాళ్లకు ఒక దారి చూపించినవాళ్లమవుతామని ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలిచ్చాను. పైలట్ ప్రాజెక్టుగా ఒక ఏరియాకి బాధ్యత ఇవ్వండి. విజయవంతం చేసి చూపిస్తానని కూడా తెలియచేశాను. అలా చేయగలిగినప్పుడు వీధి జీవితాలు ఇంటివెలుగులవుతాయి’’ అన్నారు సంజీవకుమార్. ఫుట్‌పాత్ మీద కొత్త ఉపాధి! కంప్యూటర్ సెంటర్లను అమ్మేసిన తర్వాత కన్సల్టెంట్‌గా మారాను. తార్నాకలోని సన్మాన్ హోటల్ ముందున్న ఫుట్ పాతే నా వర్క్ ప్లేస్. నా భుజాన ఒక్క బ్యాగ్‌తో పాన్ కార్డ్ సర్వీస్ రూపంలో జీవితం కొత్తగా మొదలైంది. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు వచ్చేవి. నెలకు రెండు వేల అద్దెతో ఒక గదిలో ‘స్కై క్రియేషన్స్’ పేరుతో సర్వీస్‌ను రిజిస్టర్ చేశాను. పాన్ కార్డు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్‌లు, ప్లేస్మెంట్ల వరకు సర్వీస్‌లను విస్తరించాను. పద్మారావు నగర్లో ఓ చిన్న ఫ్లాట్ కొనుకున్న తర్వాత స్కై ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవ మొదలు పెట్టాను. అద్దె ఇంట్లో ఫౌండేషన్ రిజిస్టర్ చేయాలంటే ఇంటి యజమాని అనుమతించరు. కాబట్టి సొంత గూడు ఒకటి ఏర్పరుచుకునే వరకు ఆగి అప్పటి నుంచి వీధి పాలైన జీవితాల కోసం పని చేయడం మొదలుపెట్టాను. – సంజీవకుమార్, ఫౌండర్, స్కై ఫౌండేషన్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పాపం పసివాడు
స్కూల్‌కు వెళ్లాల్సిన పిల్లలు ఎర్రటి ఎండలో రోడ్డు పక్కన, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బెలూన్లు అమ్ముకోవడం కోసం పడే కష్టం చూస్తుంటే మనసు చివుక్కుమంటుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో.... ఒక పిల్లాడు కీచైన్లు అమ్మడం కోసం ఫుట్‌పాత్‌పై కూర్చున్నాడు. కాలికి అయిన గాయానికి ప్లాస్టిక్ పేపర్ చుట్టుకున్నాడు. సాక్షి అనే యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో 7.4 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘అయ్యయ్యో’ అని సానుభూతి చూపుతున్న వాళ్లతో పాటు... ‘పిల్లాడి తల్లిదండ్రుల తప్పా? వ్యవస్థ తప్పా?’ అని ప్రశ్నించేవాళ్లు.... ‘ఆ పిల్లాడికి నా వంతుగా సహాయం చేస్తాను’ అని ముందుకు వస్తున్నవారు ఎందరో ఉన్నారు. -
నడక హక్కును అమలు చేసిన తొలి రాష్ట్రం.. అక్కడ ఫుట్‌పాత్‌లు తప్పనిసరి!
దేశంలో నడక హక్కు (రైట్ టు వాక్)ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. రోడ్డు ప్రమాదాల కారణంగా పాదచారులు, సైక్లిస్టుల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్హెచ్ఏఐతో సహా అన్ని రహదారి యాజమాన్య ఏజెన్సీలు రోడ్ల నిర్మాణం, విస్తరణలో భాగంగా ఫుట్‌పాత్‌లు నిర్మించడాన్ని తప్పనిసరి చేసింది పంజాబ్ ప్రభుత్వం. తద్వారా 'నడక హక్కు'ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఇదీ చదవండి: Mothers Day: బడా వ్యాపారవేత్తలైనా తల్లిచాటు బిడ్డలే.. టాప్ బిజినెస్ టైకూన్స్ మాతృమూర్తుల గురించి తెలుసా? పంజాబ్ హర్యానా హై కోర్ట్, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిల్ పై ఆయా కోర్టు ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది . పంజాబ్ చీఫ్ సెక్రటరీ విజయ్ కుమార్ జంజువా ఆ రాష్ట్ర ప్రభుత్వ ట్రాఫిక్ సలహాదారు నవదీప్ అసిజాకు ఇచ్చిన సమాచారం మేరకు.. రాష్ట్రంలో ఇకపై చేపట్టే అన్ని రోడ్ల నిర్మాణాలు, విస్తరణల్లో సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌ల ఏర్పాటు తప్పనిసరి. ఈ మేరకు ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లను నిర్మించడానికి కావాల్సిన బడ్జెట్, కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, స్థానిక సంస్థలు, ఎన్హెచ్ఏఐ, అర్బన్ డెవలప్మెంట్ విభాగాలకు కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం నుంచి లేఖలు అందాయి. ఇదీ చదవండి: మొబైల్ ఫోన్ పోయిందా? ఇక చింతే లేదు.. త్వరలో పటిష్ట వ్యవస్థ! -
ఫుట్‌పాత్‌పై జుట్లు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్
స్కూల్లో అబ్బాయిలు అప్పుడప్పుడు స్నేహితులతో గొడపడుతుంటారు. మాటా పెరిగి ఒక్కోసారి పోట్లాడుకునే సందర్భాలు ఉంటాయి. అమ్మాయిల మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. అసలు ఎలాంటి గొడవల జోలికి వెళ్లరు. కానీ ఇప్పుడు ట్రెండు మారింది. అమ్మాయిలే ఫైటింగ్‌కు దిగుతున్నారు. ఒకరిపైఒకరు దాడి చేసుకుంటూ సినిమా రేంజ్లో పోట్లాటకు దిగుతున్నారు. కారణమేదైనా ఒక్కోసారి సీరియస్‌గా ఫైట్ చేసుకుంటున్నారు. ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. స్కూల్ డ్రెస్సులో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఫుట్‌పాత్‌పైనే రెచ్చిపోయారు. జుట్లు పట్టుకుని పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. ఆవేశంతో ఊగిపోతూ ఫైటింగ్ చేస్తూ తోసేసుకుని కిందపడ్డారు. చుట్టుపక్కన ఉన్న వాళ్లు వీళ్లనే ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అబ్బాయిలైతే అరుపులు, కేకలు వేస్తూ ఫైటింగ్‌ను ఎంకరేజ్ చేశారు. చివరకు అక్కుడున్న ఒకరు జోక్యం చేసుకుని పైటింగ్ను ఆపారు. Kalesh B/w KV girls Over unnecessary comments on Celebrity Crushpic.twitter.com/546XV3DeBK — Ghar Ke Kalesh (@gharkekalesh) January 29, 2023 ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెట్టారు. ఈ అమ్మాయిలు బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అందించారని, పాప్‌కార్న్ తింటూ వీరి ఫైటింగ్ చూసి ఎంజాయ్ చేసినట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. చదవండి: స్టేజీపై డ్యాన్స్ ఇరగదీసిన పెళ్లికూతురు.. వీడియో వైరల్.. -
షాకింగ్ ఘటన: వీధి కుక్కలకి ఆహారం పెడుతుండగా..ర్యాష్‌గా దూసుకొచ్చిన కారు
రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేలా ఎన్ని కట్టుదిట్టమైన వాహన చట్టాలను తీసుకొచ్చినా.. ఏదో ఒక దుర్ఘటన జరుగుతూనే ఉంటోంది. మొన్నటి మొన్న ఒక మహిళను కారుతో ఢీ కొట్టి కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన మరువక మునుపే ఇలాంటి వరుస ఘటనలు చోటు చేసుకోవడం బాధకరం. అచ్చం అలానే ఇక్కడొక యువతి ఘోర రోడ్డుప్రమాదం బారిన పడింది. వివరాల్లోకెళ్తే..25 ఏళ్ల తేజస్వీత, ఆమె తల్లి మంజీదర్ కౌర్‌లు ఇంటి సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఉన్న వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నారు. సరిగ్గా అదే సమయానికి ఒక ఎస్యూవీ కారు యూటర్న్ తీసుకుని వచ్చి మరి తేజస్వీతను దారణంగా ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో తేజస్వీత తలకు తీవ్ర గాయాలయ్యాయి. కానీ ఆ కారు కనీసం ఆగకుండా అంతే వేగంగా వెళ్లిపోయింది. ఈ అనుహ్య ఘటనతో బిత్తరపోయిన ఆమె తల్లి మంజీదర్ కౌర్ వెంటనే తేరుకుని పోలీసుకు ఫోన్ చేసి తదనంతర కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. ఆమెను కుటుంబసభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరిలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోటుకుంటుందని తెలిపారు. బాధితురాలి తండ్రి ఓజస్వీ కౌల్ మాట్లాడుతూ..తేజస్విత ఆర్కిటెక్కర్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ప్రతి రోజు ఆమె వీధి కుక్కలకి ఆహారం పెట్టేందుక తన తల్లితో కలిసి వెళ్తుంటుందని ఆవేదనగా చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. Caught On CCTV: Chandigarh Woman Hit By Car While Feeding Stray Dog https://t.co/xs6vfKpoPR pic.twitter.com/fgngCqWq4X — NDTV (@ndtv) January 16, 2023 (చదవండి: ప్రయాణికుడి కోసం విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..అయినా దక్కని ప్రాణాలు) -
షాకింగ్ ఘటన: అకస్మాత్తుగా ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చిన కారు...ముగ్గురికి గాయాలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మారుతీ బ్రెజ్ కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకురావడంతో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలో గులాబీ బాగ్‌లోని లీలావతి పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది. ఐతే ఆ కారు అదుపుతప్పి అకస్మాత్తుగా ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చింది. అక్కడ ఉన్న పిల్లలను ఢీకొని కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారు టైరు పేలి ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు కొందరూ చిన్నారులకు సాయం అందించగా, మరికొందరూ సదరు కారు డ్రైవర్ని అడ్డుకుని అందులోని మరో వ్యక్తిని బంధించారు. ఆ తర్వాత ఆ ఇద్దర్నీ పోలీసులుకు అప్పగించారు. ఈ ఘటనతో ప్రాంతంలో చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరారు. వాస్తవానికి ఆ సమయంలో డ్రైవర్ తాగి ఉన్నాడని, ఈ ప్రాంతంలో పాఠశాల ఉందని స్థానికులు హెచ్చరించిన తర్వాత కూడా తన తీరు మార్చుకోకుండా దురుసుగా ప్రవర్తించాడని చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, గాయపడిన ఇద్దరు చిన్నారులు పరిస్థితి నిలకడగానే ఉంది. మరో ఆరేళ్ల బాలుడు మాత్రం ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. #WATCH | Delhi: A speeding car hits three children in Gulabi Bagh area this morning, two children received minor injuries while the third is critical but stable and admitted to a hospital: Delhi Police (Note: Graphic content, CCTV visuals) pic.twitter.com/1HAc4qyqGk — ANI (@ANI) December 18, 2022 (చదవండి: 5 ఏళ్లైనా వీడని దంపతుల డెత్ మిస్టరీ..హంతకుడి తలపై ఏకంగా 300 కోట్లు) -
హైదరాబాద్ సిటీలో ఈ సమస్యలు తీరేదెన్నడు?
సాక్షి, హైదరాబాద్: ‘పెడస్ట్రియన్ ఈజ్ కింగ్ ఆఫ్ ది రోడ్’ ఈ అంతర్జాతీయ నానుడి నగరంలో మాత్రం మాటలకే పరిమితమవుతోంది. హైదరాబాద్ సిటీలో పాదచారులకు మాత్రం పిటీగా మారింది. ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలు, కనిపించని మౌలిక వసతులే దీన్ని స్పష్టం చేస్తున్నాయి. నగరంలో ప్రతి ఏడాదీ రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో పాదచారులది రెండో స్థానం. గత ఏడాది నగర పరిధిలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో 94 మంది పాదచారులు మరణించారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)–2021 గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 53 నగరాలకు సంబంధించిన గణాంకాలు విడుదల కాగా... వీటిలో హైదరాబాద్ పాదచారుల మరణాలకు సంబంధించి ఆరో స్థానంలో నిలిచింది. ఈ సమస్యలు తీరేదెన్నడో... రాజధానిలో ఉన్న రహదారులపై పాదచారులు భద్రంగా తిరిగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. పురాతన నగరమైన పాతబస్తీలోనే కాదు... ఇటీవలే రూపుదిద్దుకుని, నానాటికీ అభివృద్ధి చెందుతున్న హైటెక్ సిటీ పరిసరాల్లోనూ ఇవి మచ్చుకైనా కనిపించవు. ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలోనూ పాదచారులకు అవసరమైన స్థాయిలో ప్రాధ్యానం లభించట్లేదు. ప్రణాళిక లోపం కారణంగా నగరంలో ఉన్న ఫుట్‌పాత్‌ల్లో సగం ఆక్రమణకు గురికాగా... మిగిలిన చోట్ల అనేక అడ్డంకులు వస్తున్నాయి. జంక్షన్స్ వద్ద పెడస్ట్రియన్స్ క్రాసింగ్ కోసం ప్రత్యేకమైన చర్యలు, అందుకు అనుగుణంలో ‘ఆల్ రెడ్స్’ అనే సాంకేతిక అంశం ఏర్పాటు ఇంకా జరుగుతూనే ఉంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (ఎఫ్ఓబీ) నిర్మాణం, అందుబాటులోకి తీసుకురావడం నత్తనడకన సాగుతున్నాయి. చదవండి: (Hyderabad: సెప్టెంబర్ గండం.. గ్రేటర్ వాసుల వెన్నులో వణుకు) భూగర్భ మార్గాలు కనుమరుగు... నగరంలోని రద్దీ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉన్న చోట్లగతంలో భూగర్భ క్రాసింగ్ మార్గాలు నిర్మించారు. సరైన నిర్వహణ, భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కోఠిల్లో ఏర్పాటు చేసిన భూగర్భ క్రాసింగ్ మార్గాలు ఆదరణకు నోచుకోలేదు. దీంతో ఒకటి పూర్తిగా కనుమరుగు కాగా... మరోటి స్వరూపం మార్చుకుని పాదచారులకు పనికిరాకుండా పోయింది. మెట్రోరైల్ నిర్మాణాల కోసం అప్పట్లో సిటీలోని ఫుట్ఓవర్ బ్రిడ్జ్‌ల్ని తొలగించారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ కొన్నింటిని నిర్మిస్తున్నా... అవసరాలకు తగ్గట్టు మాత్రం ఇవి లేవు. ఈ పరిస్థితుల కారణంగా గతేడాది నగరంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల కారణంగా 590 మంది క్షతగాత్రులుగా కాగా... 94 మంది మరణించారు. ఈ చర్యలు తీసుకోవాల్సిందే... ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారాలు, కాలిబాటల్ని మింగేసిన బడా మాల్స్ ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రభుత్వ విభాగాల అనాలోచిత చర్యలు మరో ఎత్తు. వీటివల్ల మరికొన్ని ఇబ్బందులు వచ్చిపడి కాలిబాటలు బాటసారులకు బాసట కాలేకపోతున్నాయి. ఫుట్‌పాత్‌లపై ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన, పెంచిన చెట్లకు తోడు అధికారులు ఉద్దేశపూర్వకంగా, అనాలోచి ధోరణిలో ఏర్పాటు చేసిన (చేస్తున్న) విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంబాలు, మూత్రశాలలు ఆ కొద్ది స్థలాన్నీ ఆక్రమించేస్తూ పాదచారులకు పాదం మోపే చోటు లేకుండా చేస్తున్నాయి. రోడ్లకు అనుసంధానంగా ఉన్న క్యారేజ్‌వే ఆధారంగా కాలిబాటలు కనిష్టంగా 4–5 అడుగుల వెడల్పు ఉండేలా విస్తరించాలి. ప్రస్తుతం ఉన్న వాటిపై అడ్డదిడ్డంగా ఉంటున్న చెట్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటివి తొలగించాలి. ఈ తొలగింపు ప్రక్రియ సాధ్యం కాని ప్రాంతాల్లో ఉన్న ఫుట్‌పాత్ వెడల్పు కనీసం 2 నుంచి మూడు అడుగులు అధికంగా విస్తరించాలి. ఈ ఫుట్‌పాత్‌లు కేవలం పాదచారులు నడవడానికి మాత్రమే అన్నది అందరికీ అవగాహన కల్పించడంతో పాటు అది కచ్చితంగా అమలు అయ్యేలా చేయాలని సూచించారు. ఆక్రమణలు నిరోధించడానికి జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో కూడిన సంయుక్త ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేయాలి. -
ఫుట్ పాత్ పైకి వచ్చిన ట్రక్.... రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం: వీడియో వైరల్
ఎప్పడూ ఎలాంటి ఘోరం జరుగుతుందో చెప్పలేం. మనం సురక్షితమైన ప్రదేశంలో ఉన్నప్పటకీ విధిరాత బాగోకపోతే ఏదైన జరగవచ్చు. మనకి భూమ్మీద ఆయుషు ఉంటే ఎంతటి ఘోరమైన ప్రమాదం నుంచే అయినా బయటపడవచ్చు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి పెద్ద పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వివరాల్లోకెళ్తే...ఒక వ్యక్తి ఫుట్ పాత్ పై నిలబడి ఉండగా అనుహ్యంగా ఒక ట్రక్ అతనిపైకి దూసుకుపోతుంది. ఆ ట్రక్ చాలా ప్రమాదకరంగా అతని పైకి దూసుకుపోయింది. కానీ అదృష్టవశాత్తు ఆ వ్యక్తికి ఏం కాలేదు. ఆ వ్యక్తి ట్రక్కు గేట్ మధ్య ఇరుక్కుపోయాడు. తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఐపీఎస్ ఆఫీసర్ దీపాంశు కబ్రా ఈ వీడియోని ట్విట్టర్లో పోస్టు చేశారు. ఐతే ఈ వీడియో పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించడం విశేషం. Life is Sooooooo unpredictable! pic.twitter.com/tFZQ1kJf74 — Dipanshu Kabra (@ipskabra) July 7, 2022 (చదవండి: రెస్టారెంట్‌పై దాడులకు తెగబడ్డ మహిళలు...వీడియో వైరల్) -
శ్రీవారి మెట్టు మార్గాన్ని ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్
సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు అనుమతివ్వనున్నారు. గత నవంబర్‌లో కురిసిన వర్షానికి తిరుమల మెట్ల మార్గం, ఘాట్ రోడ్ ధ్వంసమవగా టీటీడీ యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీటీడీ అధికారులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. చదవండి: (పసికందును లాలించిన సీఎం వైఎస్ జగన్) -
బాటసారి.. వేసారి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ఫ్లై ఓవర్లు, ఇతర పనులకు రూ.25 వేల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. నడిచేవారి కోసం కనీసం వందల కోట్లు ఖర్చయ్యే ఫుట్‌పాత్‌లు నిర్మించలేకపోతోంది. వాహనాలకు ఎక్కడా చిక్కులు ఉండరాదని సిగ్నల్‌ఫ్రీగా సాగేందుకు ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నట్లుగానే పాదచారులు సాఫీగా నడక సాగించేందుకు ఫుట్‌పాత్‌లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో గతంలో 6 వేల కి.మీ మేర రహదారులుండగా, ప్రస్తుతం అవి 9100 కి.మీలకు పెరిగాయి. వీటిలో బీటీ, సీసీ, తదితరాలు ఉన్నాయి. రోడ్లు వాహనదారులకు సదుపాయం కాగా, నడిచేవారి కోసం రహదారి పక్కన ఫుట్‌పాత్‌లు లేవు. దీంతో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కారణాలు అనేకం.. నగరంలో కాలిబాటలు అందుబాటులో లేకపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో వాటి నిర్మాణాన్నే మరిచారు. ప్రధాన రహదారుల వెంబడి కొన్ని ప్రాంతాల్లో పేరుకు అవి కాలిబాటలైనా నడిచేవారికి ఉపయోగపడటం లేదు. వాటిపై వెలసిన దుకాణాలు, ట్రాన్స్ఫార్మర్లు, పబ్లిక్‌టాయ్‌లెట్లు.. వాటర్ ఏటీఎంలు, చెట్లు, అన్నపూర్ణ భోజన కేంద్రాలు తదితరాలతో 50 మీటర్లు కూడా సవ్యంగా నడిచే పరిస్థితి లేదు. ఈ దుస్థితి మారుస్తామని ఏళ్ల తరబడి ప్రకటనలు చేస్తున్న జీహెచ్ఎంసీ యంత్రాంగం పనులు మాత్రం చేయలేకపోతోంది. దీంతో పాదచారుల కష్టాలు తీరడం లేదు. గత రెండేళ్లలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొత్తగా ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపట్టడంతో పాటు అవి పాదచారులకు ఉపయోగపడేలా బొలార్డ్స్, రెయిలింగ్స్ వంటివి ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేప్పటికీ (2014–15) నగరంలో 452 కి.మీ ఫుట్‌పాత్‌లున్నాయి. గత సంవత్సరం (2021) వరకు 817 కి.మీ.లకు పెరిగాయి. అంటే 365 కి.మీ నిర్మించారు. జోన్‌కు కనీసం 10కి.మీ ఫుట్‌పాత్‌లు నిర్మించాలని రెండేళ్లక్రితం (2020) మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో 75 కి.మీ మేర పనులు చేపట్టి వాటిల్లో 60 కి.మీ మేర పూర్తిచేశారు. మిగతా 15 కి.మీ పనులు ఇంకా పూర్తికావాల్సి ఉంది. సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం(సీఆర్ఎంపీ)లో భాగంగా ప్రధాన రహదారుల మార్గాల్లో రోడ్ల బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టు ఏజెన్సీలు 60 కి.మీ.ల మేర ఫుట్‌ఫాత్‌లు నిర్మించాయి. వీటితో కలిపి గడచిన ఏడేళ్లలో మొత్తం 365 కి.మీ.ల ఫుట్‌పాత్‌లు నిర్మించారు. రోడ్ల వెంబడి తగిన స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఫుట్‌ఫాత్‌లు నిర్మించినట్లు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: క్యాబ్.. ఓన్లీ క్యాష్!) -
హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌ల వైశాల్యం ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: నగరంలో పాదచారుల ఇబ్బందులు తొలగించేందుకు ఫుట్‌పాత్‌లపై శ్రద్ద చూపుతున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. రాష్ట్రం ఆవిర్భావం నాటికి నగరంలో 452 కిలోమీటర్ల ఫుట్పాత్లుండగా, ప్రస్తుతం 817 కి.మీ.కు పెరిగినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 2020లో మున్సిపల్ మంత్రి ఆదేశాలకనుగుణంగా రూ. 32.75 కోట్ల అంచనా వ్యయంతో ప్రతి జోన్లో కనీసం 10 కిలోమీటర్ల చొప్పున మొత్తం 75.64 కిలోమీటర్ల మేర చేపట్టిన 69 పనుల్లో 60 పనులు పూర్తయినట్లు పేర్కొంది. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపింది. సమగ్ర రోడ్డు నిర్వహణ ప్రాజెక్టులో భాగంగా (సీఆర్ఎంపీ) మరో 60 కి.మీ. ఫుట్‌పాత్‌ల నిర్మాణం, 6.5 కి.మీ. ఫుట్‌పాత్‌లకు మరమ్మతులు జరిగినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. (క్లిక్: జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపులు ఎప్పటి నుంచి అంటే..) -
మెట్రో స్టేషన్లో ‘ఆధార్’ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు మెట్రో స్టేషన్లలో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతానికి మూసారాంబాగ్ మెట్రోస్టేషన్లో ప్రయోగాత్మకంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మెట్రోరైలు వర్గాలు తెలిపాయి. ఈ కేంద్రానికి సిటీజన్ల నుంచి వచ్చే ఆదరణను బట్టి మరిన్ని స్టేషన్లలో ఆధార్, మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నాయి. త్వరలో మరో 27 బస్తీ దవాఖానాలు నగరంలో త్వరలో మరో 27 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు 256 బస్తీ దవాఖానాలు ఏర్పాటు కాగా, త్వరలో మరో 27 ఏర్పాటు చేసేందుకు ఆయా బస్తీల్లోని కమ్యూనిటీహాళ్లు, వార్డు కార్యాలయాల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. డివిజన్‌కు రెండు వంతున జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో 300 బస్తీ దవాఖానాలు, అవసరాన్ని బట్టి మరో యాభై అదనంగా ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫుట్‌పాత్‌పై ఆక్రమణల తొలగింపు ఖైరతాబాద్ రాజ్‌దూత్ చౌరస్తాలో ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేసుకున్న వివిధ ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం తొలగించారు. చౌరస్తాలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫుట్‌పాత్ ఆక్రమణల నేపథ్యంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మరుతున్నందున జీహెచ్ఎంసీ సర్కిల్–17 ఉప కమిషనర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఆక్రమణలను తొలగించారు. చౌరస్తాలోని హోటల్ యజ్ఞేష్ విరాట్ హోటల్ ముందు ఉన్న ఆక్రమణలతో పాటు రోడ్డు మీదకు ఏర్పాటు చేసిన షాపులను, బండీలను తొలగించారు. జేసీబీ ఇతర వాహనాలతో మూడు గంటలపాటు తొలగింపు కార్యక్రమం జరిగింది. చౌరస్తాలో మరో వైపు ట్రాన్స్ఫార్మర్ను అనుకొని ఏర్పాటు చేసిన నిర్మాణాలను సైతం అధికారులు తొలగించారు. (చదవండి: ఆర్ఆర్ఆర్.. 4,400 ఎకరాలు.. కసరత్తు మొదలైంది) ఎల్బీనగర్లో భారీగా పెరిగిన ఓటర్లు! ఎల్బీనగర్లో ఓటర్ల సంఖ్య 5,57,081కి చేరింది. పురుష ఓటర్లు 2,91,749 కాగా.. మహిళా ఓటర్లు 2,65,229 మంది, ట్రాన్స్‌జెండర్స్ 103 మంది ఉన్నట్టు 2022లో విడుదల చేసిన తుది జాబితాలో పేర్కొన్నారు.గ్రేటర్ పరిధిలో ఎల్బీనగర్ 3వ స్థానంలో ఉంది. గతంలో ఎల్బీనగర్ ఓటర్లు 5,24,577మంది ఉండగా, ఇందులో పురుషులు 2,74.830 కాగా.. మహిళలు 2,49,653 మంది ఇతరులు 94లు ఉన్నారు. గతంలో కంటే సుమారు 32,504 మంది కొత్తగా యువ ఓటర్లు పెరిగినట్టు తెలుస్తోంది. గతంలో పురుష ఓటర్లు 274830మంది ఉండా ప్రస్తుతం 2,91,749 మంది ఉన్నారు. కొత్తగా 16,919 మంది, మహిళా ఓటర్లు గతంలో 2.49653 మంది ఉండగా, ప్రస్తుతం 265229 మంది ఉన్నారు. కొత్తగా 15,576 మంది ఓటర్లు పెరిగారు. ఇక ఇతరులు గతంలో 94 ఉంటే... ప్రస్తుతం 103కి చేరగా కొత్తగా 9మంది పెరిగారు. మొత్తానికి 2022లో ప్రకటించిన తుది జాబితాలో భారీగా ఓటర్లు పెరిగారు. (చదవండి: నుమాయిష్‌కు వైరస్ దెబ్బ.. ‘ఏం చేయాలో తోచడం లేదు’) -
హత్య కేసులో అరెస్ట్.. విచారణలో షాకింగ్ నిజాలు..
ముంబై: కొందరు కోపంతో హత్యలు చేస్తే, ఇంకొందరు క్షణికావేశంలో హత్యలు చేస్తారు. కానీ సైకోలు మాత్రం ఏ కారణం లేకపోయినా హత్యలు చేస్తుంటారు. తాజాగా ఓ సైకో 15 నిమిషాల తేడాలో ఇద్దరి తలలను పగలు కొట్టి చంపేశాడు. ఈ ఘటన మహరాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. కర్ణాటకాకు చెందిన సురేష్ శంకర్ గౌడ గత కొన్ని సంవత్సరాలుగా ముంబైలో చెత్త ఏరుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నెల 23న జేజే మార్గ్‌లోని రోడ్డుపై వెళుతున్న అతడు పుట్‌పాత్‌పై పడుకున్న ఓ వ్యక్తిని చూశాడు. ఏమనుకున్నాడో ఆ వ్యక్తి తలను సిమెంటు ఇటుకతో కొట్టి కిరాతకంగా చంపేశాడు. ఆ ప్రాంత సీసీటీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు సురేష్‌ను అరెస్ట్ చేసి విచారణ మొదలుపెట్టారో లేదో పోలీసులే ఆశ్చర్యపోయే నిజాలు బయటపడ్డాయి. కాగ పోలీసుల విచారణలో.. జేజే మార్గ్ హత్యకు 15 నిమిషాల ముందు బైకుల్లాలో అచ్చం అలాగే ఓ మనిషిని కొట్టి చంపానని చెప్పాడు. అంతేకాదు.. 2015లో ఇలాంటి హత్య కేసులోనే అతడు జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఆ వ్యక్తి ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడనే కారణాలు మాత్రం తెలియరాలేదు. నిందితుడు ప్రస్తుతం జుడిషియల్ కస్టడీకి తరలించారు. దర్యాప్తులో భాగంగా గతంలో అతడు ఎన్ని హత్యలకు పాల్పడ్డాడో తెలుసుకోవటానకి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చదవండి: ఈటింగ్ కాంటెస్ట్‌లో పాల్గొన్న విద్యార్థిని మృతి -
పెద్దమనసు చాటుకున్న కేటీఆర్
సాక్షి, చాదర్‌ఘాట్: రహదారికి ఆనుకుని ఉన్న ఫుట్‌పాత్‌పైనే నవజాత శిశువుతో కలిసి ఓ యాచకురాలు ఆవాసం ఏర్పరుచుకుంది. చాదర్‌ఘాట్ రహదారి పక్కన ఆ అభాగ్యరాలి దీనస్థితిని గమనించిన ఓ నెటిజన్ వారి ఫొటో తీసి ఆమెకు తగిన సహాయం చేయాల్సిందిగా కోరుతూ కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. దీనిపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి తన పెద్దమనసు చాటుకున్నారు. Request @ZC_Charminar to immediately shift them to the nearest night shelter https://t.co/hrIZHxKwOK — KTR (@KTRTRS) October 7, 2021 నెటిజన్ పెట్టిన చంటిబిడ్డతో కూడిన ఫొటోను చార్మినార్ జోనల్ కమిషనర్‌కు పంపుతూ వెంటనే వారిని సమీప నైట్‌షెల్టర్‌కు తరలించాలని సూచించారు. అభాగ్యురాలి దీనస్థితిపై వెంటనే స్పందించిన కేటీఆర్‌ను పలువురు నెటిజన్లు అభినందించారు. చదవండి: (పట్టుకోవడానికి వెళ్తే పోలీసులపైకి కుక్కలు వదిలాడు) -
భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు
కలకత్తా: పదేళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక నాయకుడిగా వెలుగొందారు. అలాంటి వ్యక్తి భార్య చెల్లెలు అంటే డాబుగీబు దర్పంతో ఉంటుందని అనుకుంటే పొరపాటే. ఆమె ఫుట్‌పాత్‌పై భిక్షమెత్తుకుంటున్న దౌర్భాగ్యపు పరిస్థితి. పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా బరాబజార్ ప్రాంతంలోని దున్లాప్‌లో ఆమె మాసిపోయిన దుస్తులతో కనిపించింది. ఫుట్‌పాత్‌పైనే ఆమె జీవనం గడుపుతున్న దుస్థితి. చదవండి: మహిళలు జన్మనివ్వడానికే.. మంత్రులుగా పనికి రారు బుద్ధదేవ్ భట్టాచార్య పదేళ్ల పాటు బెంగాల్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన భార్య మీరా. ఆమె సోదరినే ఇరా బసు. ఫుట్‌పాత్‌పై ఉంటున్న ఇరా వైరాలజీలో పీహెచ్డీ చేసింది. ఆమె అద్భుతంగా ఆంగ్లంతోపాటు బెంగాలీ మాట్లాడగలదు. అంతేకాదు రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నీస్ క్రీడాకారిణి. క్రికెట్లో కూడా రాష్ట్రస్థాయిలో ఆడింది. అలాంటి ఇరా రెండేళ్లుగా ఫుట్‌పాత్‌పై నివసిస్తోంది. 1976లో ప్రియానాథ్ బాలిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఇరా బసు 2009లో పదవీ విరమణ పొందారు. ఆమె టీచర్‌గా ఉన్నప్పుడు బావ బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో బరానగర్‌లో ఉంటున్న ఆమె ఖర్దాలోని లిచూ బగాన్‌కు మకాం మార్చారు. కొన్నాళ్లకే ఏమైందో ఏమోగానీ ఆమె పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు దున్లాప్‌లోని ఫుట్‌పాత్‌పై జీవనం సాగిస్తోంది. ఆమె అలా జీవనం సాగించడంపై ఆమె పనిచేసిన ప్రియానాథ్ పాఠశాల హెడ్ మిస్ట్రెస్ కృష్ణకాలి చందా స్పందించారు. ‘ఇరా బసు మా పాఠశాలలోనే బోధించారు. పదవీ విరమణ అనంతరం పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోమని చెబితే ఇంతవరకు ఆమె పత్రాలు సమర్పించలేదు. ఆమె ఎందుకు పింఛన్‌కు దరఖాస్తు చేసుకోలేదో తెలియదు’ అని పేర్కొన్నారు. అయితే మొన్న ఉపాధ్యాయ దినోత్సవం నాడు మాత్రం ఇరాబసును కొందరు స్థానిక సంఘాల నాయకులు సన్మానించారు. పూలమాల.. శాలువా వేసి సన్మానించారు. ఆ సమయంలో ఇరా బసు మాట్లాడింది. ‘నన్ను ఎంతో మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా నన్ను ప్రేమిస్తున్నారు. కొందరు నన్ను కౌగిలించుకుని కన్నీళ్లు పెడతారు’ అని తెలిపింది. ఈ సందర్భంగా తన బావ బుద్ధదేవ్ భట్టాచార్య గురించి మాట్లాడింది. ‘నేను టీచర్‌గా ఉన్నప్పుడే అతడి నుంచి ఎలాంటి లబ్ధి పొందను. నా కుటుంబ వివరాలు తెలుసుకున్న వారందరూ నాకు వీఐపీ గుర్తింపు ఇవ్వనవసరం లేదు’ అని స్పష్టం చేసింది. ఆమె ఫుట్‌పాత్‌పై జీవిస్తున్నది తెలుసుకున్న అధికారులు ఆమెను వెంటనే అంబులెన్స్‌లో కలకత్తాకు తీసుకెళ్లారు. ఆమెకు వైద్యారోగ్య పరీక్షలు చేయించి చికిత్స అందించే అవకాశం ఉంది. ఆమె బాగోగులు ప్రభుత్వం చూసుకునే అవకాశం ఉంది. -
కన్న ఒడి.. కన్నీటి తడి!
సాక్షి, హైదరాబాద్: జీవన సంధ్యాసమయంలో పేగు బంధం తల్లడిల్లలేదు. వృద్ధాప్యంలో ఒంటరి బతుక్కు ఊతమవ్వలేదు. చిన్నప్పుడు చంటి పాపలను కంటిపాపలుగా చూసిన ఆ కళ్లు చెమ్మగిల్లితే తుడవనూలేదు. చేయి పట్టి నడిపించిన ఆ చేతులను చేరదీయలేదు. బుక్కెడు బువ్వ పెట్టి కడుపు నింపేవారే దూరంగా వెళ్లిపోయారు. బిడ్డలను నమ్ముకున్న ఆ తల్లులకు చివరికి కన్నీరే మిగిల్చారు. రెక్కలొచ్చి ఎక్కడికో వెళ్లిపోయారు. రెక్కలు అలసి ఆ మాతృమూర్తులు ఒంటరి వారయ్యారు. నగరంలోని బంజారాహిల్స్ రోడ్డునంబర్– 10లోని ఫుట్‌పాతే ఇద్దరు అమ్మలకు ఆశ్రయంగా మారిన వ్యథార్థ జీవన యథార్థ గాథ ఇది. బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద కేబీఆర్ పార్కును ఆనుకొని ఉన్న ఫుట్‌పాత్‌పై ఇద్దరు ‘అమ్మ’లు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ కష్టాల పాలవుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి సమీపంలోని దొడుకొండపల్లికి చెందిన కాశమ్మ (60)కు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ఆమె కుటుంబం 25 ఏళ్ల క్రితమే బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చింది. కూలిపనులు చేస్తుండేవారు. కొన్నేళ్ల కిందట కాశమ్మ భర్త చనిపోయరు. కుమారులు, కుమార్తెకు వివాహాలయ్యాయి. వేర్వేరుగా బతుకున్నారు. ఈ క్రమంలో గత ఏడాది మొదటి దశ కరోనా సమయంలోనే పనులు లేక తలోదారి పట్టారు. కొడుకులిద్దరూ తల్లిని వదిలేసి వెళ్లిపోయా రు. కాశమ్మ ఒంటరిదైంది. కూతురు కూడా చూసే పరిస్థితి లేదు. ఒంటరిగా మారిన కాశమ్మ ఫుట్‌పాత్‌నే ఆశ్రయంగా చేసుకుంది. దారిన పోయేవారు ఇంత తిండిపెడితే కడుపు నింపుకొంటోంది. వెంకమ్మది మరో దీనగాథ.. నెల్లూరు జిల్లా మొల్కురుకు చెందిన వెంకమ్మ (60)కి ఓ కుమారుడున్నాడు. బంజారాహిల్స్ రోడ్డు నం.10లోని సింగాడికుంటలో ఉంటున్నాడు. కరోనా కష్టకాలంలో కొడుకును చూద్దామని వెంకమ్మ నగరానికి ఇటీవల వచ్చింది. తమకే కడుపుకింత తిండిలేక సతమతమవుతున్నామని నువ్వు మాకు భారమంటూ కొడుకు ముఖం మీదే చెప్పి పంపించాడు. వెళ్లడానికి దారి ఖర్చులు లేకపోవడంతో బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద అన్నం పెడుతున్నారంటే వచ్చింది. ఇక ఇక్కడే ఆశ్రయం ఏర్పాటు చేసుకుంది. కాశమ్మతో పాటు తనూ ఉంటోంది. తమ కష్టాలు పంచుకుంటున్నారు. కాగా.. బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద ఫుట్‌పాత్‌పై సుమారు 150 మంది వరకు నిరాశ్రయులు నానా కష్టాలు పడుతున్నారు. ఎవరైనా ఇంత తిండిపెడితేనే వీరి కడుపు నింపుకొంటున్నారు. ఆదుకోని నైట్‌షెల్లర్లు జీహెచ్ఎంసీ సర్కిల్– 18 పరిధి కిందకు వచ్చే ఈ ప్రాంతంలో నిత్యం వందలాది మంది ఫుట్‌పాత్‌లపై ఆశ్రయం పొందుతున్నారు. రాత్రిపూట వీటిపైనే నిద్రిస్తున్నారు. ఎవరైనా ఇంత అన్నం పెడితే తింటూ కాలం గడుపుతున్నారు. కనీసం వృద్ధులనైనా నైట్ షెల్టర్లలోకి చేర్చాల్సిన బాధ్యతను అధికారులు మర్చిపోయారు. – బంజారాహిల్స్ -
జూన్ 1 నుంచి అలిపిరి కాలినడక మార్గం మూత
తిరుమల: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు జూన్ 1 నుంచి జూలై 31వ తేదీ వరకు ఆ మార్గాన్ని మూసివేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. అయితే, కాలినడకన తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాలని కోరింది. ఇందుకోసం అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సుల ద్వారా భక్తులను తరలించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది. సుందరకాండ పారాయణం ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు సుందరకాండ 58వ సర్గలో గల 167 శ్లోకాలను వేద పండితులు అఖండ పారాయణం చేశారు. చదవండి: పంపా క్షేత్రమే హనుమంతుని జన్మస్థలం శరణ్య.. నువ్వు డాక్టర్ కావాలమ్మా! -
మధుర జ్ఞాపకాలతో కాదు.. చేదు జ్ఞాపకాలతో వీరి బాల్యం
సాక్షి, హైదరాబాద్ (గోల్కొండ) : ముక్కుపచ్చలారని చిన్నారుల బాల్యం ఫుట్‌పాత్‌లపైనే గడిచిపోతున్నది. మధుర జ్ఞాపికాలను మిగిల్చే బాల్యం వీరికి చేదు జ్ఞాపకాలను మిగులుస్తోందనం నిర్వివాదాశం. కరోనా నేపథ్యంలో పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలలో పని లేక పస్తులుంటున్న కార్మికులు పొట్టకూటి కోసం నగరానికి వలస వచ్చారు. ఇక్కడా వారికి ఉపాధి దొరకడం గగనమైపోయింది. నగరానికి వలస వచ్చిన వీరు ఫుట్‌పాత్‌లు, ఫ్లై ఓవర్ల కింద డివైడర్ల పైనే కాపురం ఉంటున్నారు. ప్లాస్టిక్ ఆట బొమ్మలు, బెలూన్లు అమ్ముకుంటూ వీరు అతి కష్టంగా బతుకీడుస్తున్నారు. రాత్రంతా ఫుట్‌పాత్‌లపై ఉంటూ బెలూన్లు, ఇతర ప్లాస్టిక్ ఆట వస్తువులు తయారు చేసుకుంటారు. ఉదయమే ఫుట్‌పాత్‌లపై రొట్టెలు వేసుకుని వారు తిని, పిల్లలకు తినిపిస్తారు. అనంతరం కుటుంబ పెద్దలంతా ఆట బొమ్మలను అమ్మడానికి వెళ్లిపోతారు. ఒక వ్యక్తిని పిల్లలను చూడటానికి వదిలి వెళ్తారు. పిల్లలు ఫుట్‌పాత్‌ల మీదనే స్నానం చేస్తూ, దానినే ఆడుకుంటూ ఉంటారు. రాత్రి మళ్లీ తమ తల్లిదండ్రుల ముఖాలు చూస్తారు. టోలిచౌకి చౌరాస్తా, షేక్‌పేట్ నాలా, రేతిబౌలి రింగ్ రోడ్డు, మెహిదీపట్నం పీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే తదితర ప్రాంతాలలు వలస కుటుంబాలు ఫుట్‌పాత్‌లపై, ఫ్లై ఓవర్ల కింద డివైడర్లపై నివసిస్తాయి. ( చదవండి: ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. బాలిక కేకలు వేయడంతో! ) -
జీహెచ్ఎంసీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే పాదచారులు గాల్లో నడవాలా అని ప్రశ్నించింది. ఫుట్‌పాత్‌లపై వెంటనే ఆక్రమణలను తొలగించాలని, ఇంతకుముందు తీసుకున్న చర్యలను వివరిస్తూ స్థాయి నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సమగ్ర సర్వే చేసి గతంలో ఉన్న ఫుట్‌పాత్‌లను తొలగిస్తే ఆ ప్రాంతంలో తిరిగి నిర్మించాలని, ప్రజలు సౌకర్యం గా నడిచేలా ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నా చర్యలు చేపట్టకపోవడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది మామిడాల తిరుమలరావు వ్యక్తిగతంగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. నగరంలోని అనేక ప్రాంతా ల్లో ఫుట్‌పాత్‌లను తొలగించారని, కొన్ని చోట్ల ఫుట్‌పాత్‌లను వీధి వ్యాపారులు ఆక్రమించుకుంటున్నారని తిరుమలరావు వివరించారు. దీంతో గత్యంతరం లేక పాదచారులు రోడ్డుపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, ఈ సమయంలో ప్రమాదాలు జరిగితే పాదచారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా పేర్కొంటున్నారని తెలిపారు. ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ మార్గదర్శకాల ప్రకారం ఫుట్‌పాత్‌లను నిర్మించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని వివరించారు. ఈ పిటిషన్లో నగర పోలీసు కమిషనర్‌ను ఎందుకు ప్రతివాదిగా చేర్చారని ధర్మాసనం ప్రశ్నించగా.. కమిషనర్ కార్యాలయంతోపాటు పోలీస్స్టేషన్ల ఎదురుగా రోడ్లపైనే వాహనాలను అడ్డగోలుగా పార్క్ చేస్తున్నా పట్టించుకోవట్లేదని నివేదించారు. ‘రోడ్లు విస్తరణ చేయడంతో ఫుట్‌పాత్‌లను తొలగిస్తున్నారు. 1990ల్లో 10 ఫీట్లున్న ఫుట్‌పాత్‌లు రోడ్ల విస్తరణతో 5 ఫీట్లకు తగ్గాయి. ఇటీవల మెట్రో నిర్మాణానికి సంబంధించి పిల్లర్లను ఏర్పాటు చేయడంలో పూర్తిగా ఫుట్‌పాత్‌లను తొలగించారు. అక్కడక్కడ ఉన్న ఫుట్‌పాత్‌లను చిరువ్యాపారులు ఆక్రమించుకుంటున్నారు. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు’అని జస్టిస్ విజయసేన్‌రెడ్డి పేర్కొన్నారు. చిరువ్యాపారుల కోసం ప్రత్యేకంగా ప్రాంతాన్ని కేటాయించలేదా అని ధర్మాసనం ప్రశ్నించగా.. కొన్ని ప్రదేశాలను కేటాయించామని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని, ఈ దిశగా తామిచ్చిన ఆదేశాలను అమలు చేయాలని, తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. -
రోడ్ల పనులు సరే.. ఫుట్‌పాత్‌ల సంగతేంటి
సమగ్ర రోడ్ల నిర్వహణ పథకం కింద పెద్ద కాంట్రాక్టు ఏజెన్సీలకు రోడ్ల నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పడంతో గ్రేటర్‌లోని ప్రధాన రహదారుల మార్గాల్లో వాహనదారుల ఇబ్బందులు కొంత మేర తగ్గాయి. కానీ పాదచారుల కష్టాలు మాత్రం తీరడంలేదు. ఈ బాధ్యతలు చేపట్టిన ఏజెన్సీలే ఫుట్‌పాత్‌ల పనులు కూడా చేయాల్సి ఉండగా రోడ్లతోపాటు ఫుట్‌పాత్‌ల పనులు జరగడం లేదు. దాంతో పాదచారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు రోడ్ల పనులు చేస్తున్నప్పటికీ, ఫుట్‌పాత్‌లు తదితర పనులు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో : సమగ్ర రోడ్ల నిర్వహణ పథకం కింద నగరంలో రోడ్లతోపాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణాలు సమగ్రంగా చేపట్టాలి. ఇది కాంట్రాక్టు ఒప్పందంలోనూ ఉంది. కానీ దీన్ని ఎక్కడా సక్రమంగా అమలు చేయడం లేదు. రోడ్ల నిర్మాణం చేపట్టి చేతులు దులుపుకొంటున్నారే తప్ప..పాదచారులకు అత్యంత కీలకమైన ఫుట్‌పాత్‌ల పనులు చేపట్టడం లేదు. చదవండి: ఇక రోడ్లపై పాదచారులకు ప్రాధాన్యత కాంట్రాక్టు ఒప్పందం మేరకు .. ► రోడ్ల నిర్వహణలో భాగంగా క్యాచ్పిట్స్, డ్రెయిన్లు, నాలాలు, సివర్ లైన్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ► రోడ్లపై నిల్వనీరు లేకుండా చర్యలు తీసుకోవాలి. ► డెబ్రిస్ తొలగించాలి. బ్లాక్స్పాట్లు లేకుండా చూడాలి. ► ఫుట్‌పాత్, టేబుల్ డ్రెయిన్, స్పీడ్ బ్రేకర్లు, బార్ మార్కింగ్స్, సెంట్రల్ మీడియన్, లేన్ మార్కింగ్, రోడ్ స్టడ్స్, సైనేజీ బోర్డులు, కెర్బ్ పెయింటింగ్‌లు వేయాలి. ► సుందరీకరణ పనుల్ని కూడా చేయాలి. కానీ ఇవి పూర్తికాలేదు. ► కాంట్రాక్టు ఏజెన్సీలకు అప్పగించిన రోడ్లు :709 కి.మీ. ► వీటిల్లో మొదటి సంవత్సరం 50 శాతం, రెండో సంవత్సరం 30 శాతం, మూడో సంవత్సరం 20 శాతం రోడ్ల పనులు పూర్తి చేయాలి. ► ఐదు సంవత్సరాల వరకు నిర్వహణ పనులు చేయాలి. ►నిబంధనల కనుగుణంగా రోడ్ల పనులు జరిగినప్పటికీ, ఫుట్‌పాత్‌ల పనులు జరగలేదు. ► వీటిల్లో డీబీఎం, వీడీసీసీ రోడ్లున్నాయి. ►ఇవి కాక మరో 290 కి.మీ.లు బీసీ రోడ్లున్నాయి. ► ఫుట్‌పాత్‌లు మాత్రం కొత్తవి, మరమ్మతులు చేసినవి వెరసి 22 కి.మీ.లే పూర్తయ్యాయి. ►పాదచారులకు నడక మార్గాల్లేక తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ► తీవ్ర ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన రోడ్లు, ఫుట్‌పాత్‌ల పనులు ప్యాకేజీల వారీగా జోన్ రోడ్లు (కి.మీ.) ఫుట్‌పాత్‌లు (కి.మీ.) ఎల్బీనగర్ 46.48 0.00 చార్మినార్ 60.02 2.25 ఖైరతాబాద్(1) 43.52 3.82 ఖైరతాబాద్(2) 45.48 2.14 శేరిలింగంపల్లి 52.83 4.57 కూకట్పల్లి 30.24 2.19 సికింద్రాబాద్ 45.22 7.65 -
ఇక రోడ్లపై పాదచారులకు ప్రాధాన్యత
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఓ విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంది. వీధులన్నీ కాలుష్యం వాయువులతో ఎలా కమ్ముకుపోతున్నాయో, అలాంటి కాలుష్యాన్ని నివారించాల్సిన అవసరం ఉందన్న విషయంలో కేంద్రానికి స్పష్టత వచ్చింది. పట్టణాల్లో పాదచారులకు, సైకిళ్లకు మరిన్ని సదుపాయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి నగరం, పట్టణంలో పాదచారులకు అనువుగా ఉండేటట్లు కనీసం మూడు మార్కెట్లను అభివృద్ధి చేయాలని, అందుకు రోడ్లపై తగిన ఫుట్‌పాత్‌లు ఉండాలని, సైకిళ్ల కోసం పట్టణాలు, నగరాల్లో మరిన్ని సైకిల్ ట్రాక్‌లు నిర్మించాలని గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటికి సంబంధించి అభివృద్ధి చేయాల్సిన చెరువులను జూన్ 30వ తేదీ నాటికి గుర్తించాలని, అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి పనులను పారంభించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. (‘బాయ్ కాట్ చైనా’ సాధ్యమేనా?) వీధులను ప్రజలకు అనువైన విధంగా మార్చడానికి కరోనా సమయమే సానుకూలమని మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్ సమయాన్ని ఉపయోగించుకొని ఫుట్‌పాత్‌లను, సైకిల్ వేలను అభివృద్ధి చేస్తున్నాయి. ‘వరల్డ్ ఏర్ క్వాలిటీ రిపోర్ట్’ ప్రకారం ప్రపంచంలోని పది కాలుష్య నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. ఈ కారణంగా రోడ్ల విస్తరణకు, వాహనాల కుదింపునకు భారత ప్రభుత్వం ఎక్కువ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. (భారత్- చైనా సరిహద్దు ‘చిచ్చు’కు కారణం?) -
ఆ ఆంటీ మా సిటీకి వస్తే బాగుండు..!
-
ఆ ఆంటీ మా సిటీకి వస్తే బాగుండు..!
పుణె: లక్షలాది వాహనాలు, దుమ్మూ, ధూళి, పొగతో సతమతమయ్యే నగరాల్లోని బాటసారులకు కనీసం నడిచే తోవ కూడా ఉండటం లేదు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి కొందరు వ్యాపారాలు చేసుకుంటుండగా.. మరికొందరు ద్విచక్ర వాహనదారులు షార్ట్‌కట్‌గా ఫుట్‌పాత్‌పై నుంచి బక్ పోనిస్తున్నారు. దీంతో బాటసారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పుణె నగరం కూడా దీనికి మినహాయింపు కాదు. ఈనేపథ్యంలో నగరానికి చెందిన ఓ పెద్దావిడ ద్విచక్ర వాహనదారులకు తగిన ‘బుద్ధి’ చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఫుట్‌పాత్ పైనుంచి వస్తున్న బైకర్లను అడ్డుకుని.. చీవాట్లు పెట్టారు. ఆమె ‘క్లాస్’కు భయపడ్డ బైకర్లు ఫుట్‌పాత్ పైనుంచి వచ్చేందుకు వెనకడుగు వేశారు. ఈక్రమంలోనే ఆమెకు మరో ఇద్దరు కూడా జత కలిశారు. ముగ్గురూ కలిసి ఫుట్‌పాత్ పైనుంచి వాహనాలు రాకుండా కట్టడి చేశారు. ఈ వీడియోను అమిత్ రూకే అనే జర్నలిస్టు ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్ అయింది. రెండు రోజుల్లోనే 2.3 లక్షల వ్యూస్ సాధించింది. ఇక పెద్దావిడ చొరవపై కామెంట్లు వర్షం కురుస్తోంది. ఆంటీ బాగా బుద్ధి చెప్పిందని కొందరు, పుణె పోలీసులకు కర్తవ్యం గుర్తుకు తెచ్చారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ మేడమ్, ఫుట్‌పాత్‌పై బైక్ నడిపేవారు సిగ్గుపడాలి ఇంకొకరు కామెంట్ చేశారు. ‘ఈ ఆంటీ ముంబైకి వచ్చి మాతో ఉంటే బాగుండు. ఒక మంచి పని చేస్తే అందరూ మద్దతుగా నిలుస్తారని ఇక్కడి జనం కూడా తెలుసుకుంటారు’అని ఓ యూజర్ పేర్కొన్నాడు. -
ఉప్పల్ జంక్షన్లో ‘ఐకానిక్ బోర్డు వాక్’
సాక్షి, సిటీబ్యూరో: వరంగల్ జాతీయరహదారివైపు రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో ఉప్పల్ జంక్షన్ వద్దరోడ్డు దాటేందుకు నానా కష్టాలు పడుతున్న పాదచారుల కోసం ‘ఐకానిక్ బోర్డు వాక్’ను ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏభావిస్తోంది. ఇందుకోసం ప్రణాళికను వేగిరం చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)ఇంజనీరింగ్ విభాగాధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు మొదలెట్టారు. ఇప్పటివరకు నగరంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక హంగులతో పాదచారుల భద్రతకు పెద్దపీట వేస్తూ డిజైన్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ బాధ్యతను ఇప్పటికే ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీకి అప్పగించారు. ఈ ఐకానిక్ బోర్డు వాక్ (స్కైవాక్) డిజైన్లు పూర్తవగానే టెండర్లు పిలిచి సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకితీసుకురావాలని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. పాదచారుల భద్రత కోసమే... వాహనదారులు మితిమీరిన వేగంతో దూసుకెళ్లడంతో పాటు సిగ్నల్ జంప్ చేసి వెళ్లడం వల్ల పాదచారులు ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం లుక్ ఈస్ట్‌లో భాగంగా ఫ్లైఓవర్ల నిర్మాణానికి పెద్దపీట వేయడం, మెట్రో కూడా అందుబాటులోకి రావడంతో వాహనాలతో పాటు జనాల రద్దీ కూడా పెరిగింది. అటు వాహనదారులు నిర్లక్ష్యంగా ఉన్నా, ఇటు పాదచారుడు గమనించకుండా ఉన్నా...ఇలా ఇద్దరిలో ఏ ఒక్కరూ అజాగ్రత్తగా ఉన్నా రోడ్డు ప్రమాదాలు జరిగితే పాదచారులే బలవుతున్నారు. ఇలా ఉప్పల్ జంక్షన్లో 2019లో దాదాపు 15 మంది వరకు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన హెచ్ఎండీఏ అధికారులు స్కైవాక్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. అంతా సవ్యంగా ఉంటే మరో నెల రోజుల్లోనే టెండర్లు పిలిచి నిర్మాణం దిశగా అడుగులు పడతాయని హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఐకానిక్ బోర్డు వాక్ డిజైన్ తయారుచేస్తున్నామని, త్వరలోనే పూర్తవుతుందని ఆయన చెప్పారు. దీని నిర్మాణానికి రూ.ఐదు కోట్లు వ్యయం కావచ్చని తెలిపారు. ఐకానిక్ బోర్డు వాక్ అంటే... ఎక్కువ సంఖ్యలో ప్రజల సంచారం ఉండే ప్రాంతాల్లో సౌలభ్యం కోసం ఐకానిక్ బోర్డు వాక్‌లు ఏర్పాటుచేస్తారు. ఇప్పటివరకు మన నగరంలో రోడ్డు ఒకవైపు నుంచి మరోవైపునకు పాదచారులు వెళ్లేలా స్కై వాక్‌లు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు నిర్మించారు. అయితే ఉప్పల్ జంక్షన్లో నిర్మించాలనుకుంటున్న ఐకానిక్ బోర్డు వాక్ మాత్రం దీనికి భిన్నం. ఈ వంతెన నాలుగైదు వైపులా పాదచారులు వారి గమ్యాలకు వెళ్లేలా డిజైన్ ఉంటుంది. ఉదాహరణకు ఉప్పల్ జంక్షన్ నుంచి మెట్రో స్టేషన్‌కు చేరుకోవాలనుకునే వారి సౌలభ్యం కోసం, అక్కడే ఉన్న పాఠశాలకు విద్యార్థులు వెళ్లేలా, నేరుగా బస్టాండ్‌కు చేరుకునేలా, రోడ్డు ఓవైపు నుంచి మరో రోడ్డు వైపునకు వెళ్లేలా ఈ ‘ఐకానిక్ బోర్డు వాక్’ను నిర్మిస్తారు. -
ఓ బాట‘సారీ’
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రతి ఏడాదీ రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో పాదచారులది రెండో స్థానం. గడిచిన నాలుగేళ్ళ గణాంకాలు పరిశీలిస్తే ఏటా వందకు పైగా పెడస్ట్రియన్స్ రోడ్డుకు బలవుతున్నారు. నగర పరిధిలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో మృతులుగా మారిన పాదచారులు 38 శాతానికి పైగా ఉన్నారు. ఈ పరిస్థితి తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రాథమిక అంశాలైన ఫుట్‌పాత్‌లు మాయం కావడం, అవసరమైన అన్ని ప్రాంతాల్లోనూ పెలికాన్ సిగ్నల్స్‌తో పాటు జీబ్రా క్రాసింగ్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేకపోవడం. ఈ సమస్యలు తీర్చడానికి జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేయడంతో వచ్చే ఏడాది పరిస్థితులు మారవచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే నగర ట్రాఫిక్ పోలీసుల కృషి ఫలితంగా ఏటా ప్రమాదాలు, మృతులతో పాటు యాక్సిడెంట్స్‌లో అశువులుబాస్తున్న పాదచారుల సంఖ్యా తగ్గుతూ వస్తోంది. కానీ కనిష్టంగా 100 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరంగా మారుతోంది. రెండో స్థానంలో పాదచారులు... నగర ట్రాఫిక్ పోలీసులు ఏటా ప్రమాదాలపై విశ్లేషణ నిర్వహిస్తారు. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాలు, బాధితులుగా/మృతులుగా మారుతున్న వారు ఎవరెవరు అనేది గణాంకాల ప్రకారం జాబితాలు రూపొందిస్తుంటారు. 2016–2019 (డిసెంబర్ 16) మధ్య హైదరాబాద్ పోలీసులు రూపొందించిన రికార్డుల ప్రకారం ప్రతి ఏడాది సిటీలో చోటు చేసుకుంటున్న ప్రమాదాలు రెండు వేలకు పైనే ఉంటున్నాయి. వీటిలో వందల మంది మృత్యువాతపడుతున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా మారుతున్న వారిలో ద్విచక్ర వాహనచోదకులు తొలిస్థానంలో ఉండగా... రెండో స్థానం పాదచారులదే. ఇప్పుడే కాదు... గత కొన్నేళ్లుగా నమోదైన గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాద బాధితుల్లో పాదచారులే ఎక్కువగా ఉన్నారు. సిటీలో నాలుగేళ్ళల్లో మొత్తం 9435 ప్రమాదాలు చోటు చేసుకోగా... 1232 మంది మరణించారు. వీటిలో మృత్యువాతపడిన పాదచారుల సంఖ్య 519గా ఉంది. మొత్తమ్మీద రోడ్డు ప్రమాద బాధితుల్లో 36.6 శాతం, మృతుల్లో 42.12 శాతం పాదచారులే ఉన్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది గణాంకాలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 261 మంది చనిపోగా... వీరిలో పాదచారులు 101 మంది (38.69 శాతం) ఉన్నారు. ఎఫ్‌ఓబీలు, భూగర్భ మార్గాలు కనుమరుగు... నగరంలోని రద్దీ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉన్న చోట్ల గతంలో భూగర్భ క్రాసింగ్ మార్గాలు (సబ్–వే) నిర్మించారు. ఆపై దిల్‌సుక్‌నగర్, సికింద్రాబాద్, బేగంపేట, మెహదీపట్నం సహా అనేక ప్రాంతాల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులోకి తీసుకువచ్చారు. సరైన నిర్వహణ, భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కోఠిల్లో ఏర్పాటు చేసిన భూగర్భ క్రాసింగ్ మార్గాలు ఆదరణకు నోచుకోలేదు. దీంతో ఒకటి పూర్తిగా కనుమరుగు కాగా... మరోటి స్వరూపం మార్చుకుని పాదచారులకు పనికిరాకుండా పోయింది. ఇక ఫుట్ఓవర్ బ్రిడ్జిలు కట్టిన జీహెచ్ఎంసీ అధికారులు వాటికి ఎలివేటర్ వంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో నగరవాసులకు ఉపయోగపడలేదు. ఇవి పూర్తిగా ఓ స్వరూపాన్ని సంతరించుకోకముందే ‘మెట్రో’ గండం ముంచుకువచ్చింది. మెట్రోరైల్ నిర్మాణాల కోసం సిటీలోని ఫుట్ఓవర్ బ్రిడ్జ్‌ల్ని తొలగించారు. ఈ ఏడాది పరిస్థితులు మారేనా? పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్న నగర ట్రాఫిక్ పోలీసులు పలు ప్రతిపాదనలు రూపొందించి జీహెచ్ఎంసీకి పంపారు. వీటికి అనుగుణంగా ఇప్పటికే అనేక చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు (ఎఫ్ఓబీ) రూపుదిద్దుకుంటున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేయించిన జీహెచ్ఎంసీ సకల సౌకర్యాలతో నిర్మిస్తోంది. మరోపక్క జంక్షన్లు కాని, ఎఫ్‌ఓబీలు లేని చోట్ల పాదచారులు రోడ్డు దాటడానికి అనువుగా మూడు కమిషనరేట్లలో కలిపి 106 పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమై ప్రభుత్వానికి చేరాయి. ఇవి కూడా మంజూరై అందుబాటులోకి వస్తే వచ్చే ఏడాది పాదచారుల ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు చెప్తున్నారు. అయితే పాదచారులు సైతం ఈ మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరుతున్నారు. -
ఫుట్‌పాత్‌లపై పడుకోవడం నేరం!
సాక్షి, న్యూఢిల్లీ : లాస్ వెగాస్ నగరంలో ఫుట్‌పాత్‌లపై ప్రజలెవరూ పడుకోకుండా నగర పాలక మండలి కొత్త చట్టం తీసుకొచ్చింది. రాత్రి. పగలు తేడా లేకుండా అన్ని వేళల్లో ఫుట్‌పాత్‌లపై టెంట్లు వేసుకొని గానీ, నిద్రపోతూ ఎవరైనా కనిపిస్తే దాన్ని నేరంగా పరిగణించి వెయ్యి డాలర్ల జరిమానా విధిస్తారు. అమెరికాలో ఇలాంటి చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి నగరంగా కూడా లాస్ వెగాస్‌కు గుర్తింపు ఉంది. గతంలో బాయిస్, ఇదాహో నగరాలు ఇలాంటి చట్టాలను తీసుకరాగా అమెరికా సర్క్యూట్ కోర్టులు కొట్టివేశాయి. ఈసారి ఇక్కడ అలా జరగదని సిటీ అలార్నీ బ్రాడ్ జెర్బిక్ చెప్పారు. ‘ప్రభుత్వ షెల్టర్లలో పడకలు ఖాళీగా ఉన్నప్పుడు’ అనే క్లాజ్ చట్టంలో తీసుకొచ్చామని ఆయన తెలిపారు. పేద ప్రజలకు ఉద్దేశించిన ప్రభుత్వ షెల్టర్లలో పడకలు ఖాళీగా ఉంటున్నాయని కూడా ఆయన చెప్పారు. లాస్ వెగాస్‌లో పేద ప్రజలే కాకుండా, డ్రగ్స్‌కు అలవాటు పడిన వాళ్లు, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు ఫుట్‌పాత్‌లపై పడుకుంటున్నారు. నగరంలో అద్దెలు ఎక్కువ అవడం వల్ల కూడా చాలా మంది ఫుట్‌పాత్‌లను ఆశ్రయిస్తున్నారు. పర్యాటకుల రద్దీ ఎక్కువ ఉన్న చోట్ల ఈ చట్టాన్ని మినహాయించినట్లు అటార్నీ తెలిపారు. బుధవారం నాడే ఈ చట్టాన్ని తీసుకొచ్చిన నగర పాలక మండలి తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. వెయ్యి డాలర్లు కట్టలేని వాళ్లను జైళ్లకు పంపిస్తామని చెబుతున్నారుగానీ ఎన్ని రోజులు పంపిస్తారన్నది చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదు. -
ఓ బాటసారీ.. నీకో దారి
సాక్షి, సిటీబ్యూరో: పాదచారుల సౌకర్యాలపై బల్దియా దృష్టి పెట్టింది. ఇప్పటికే నగరంలోని ప్రధాన రహదారుల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేందుకు టెండర్లు ఆహ్వానించగా.. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అంతర్గత రహదారులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తొలిదశలో జోన్‌కు కనీసం 10 కి.మీ చొప్పున ఫుట్‌పాత్‌లు నిర్మించేందుకు వివిధ ప్రాంతాల్లో మార్గాలను ఎంపిక చేశారు. గ్రేటర్లో దాదాపు 9100 కి.మీ మేర రోడ్లు ఉండగా, వీటిలో 900 కి.మీ మేర ప్రధాన రహదారులు ఉన్నాయి. ఇందులోసుమారు 700 కి.మీ.కు పైగా బస్సులు, ఇతర వాహనాలు ప్రయాణాంచే ముఖ్యమైన మార్గాలు కావడంతో వీటి నిర్వహణను ‘యాన్యువల్ మెయింటనెన్స్ కాంట్రాక్ట్’ (ఏఎంసీ)కి ఇచ్చేందుకు టెండర్లు పిలిచారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికయ్యే కాంట్రాక్ట్ ఏజెన్సీయే ఆయా రోడ్ల నిర్వహణతో పాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణ కూడా చూడాల్సి ఉంటుంది. అయితే, ప్రధాన రహదారులతో పాటు అంతర్గత మార్గాల్లోనూ రహదారులకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు నిర్మించాలని ఇటీవల మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఫుట్‌పాత్‌లు నిర్మించాల్సిన మారాలను స్థానిక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు గుర్తించారు. త్వరలోనే అంచనాలు, ఇతర ముఖ్యమైన పనులు పూర్తిచేసి ఫుట్‌పాత్‌ల పనులకు టెండర్లు పిలిచేందుకు చర్యలు ప్రారంభించారు. శేరిలింగంపల్లి జోన్లో నిర్మించే ఫుట్‌పాత్‌లకు రీసైకిల్డ్ ప్లాస్టిక్ టైల్స్ వినియోగించాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో కొన్ని.. అంతర్గత రోడ్లలో ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో సికింద్రాబాద్ జోన్ పరిధిలోని హిమాయత్‌నగర్, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్ అంబర్‌పేట, బన్సీలాల్‌పేట, రాంగోపాల్‌పేట, బేగంపేట, చార్మినార్ జోన్ పరిధిలోని మూసారంబాగ్, ఐఎస్ సదన్, రామ్నాస్పురా, ఫలక్‌నుమా, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, ఎల్బీనగర్ జోన్‌లోని కాప్రా, చిల్కానగర్, నాగోల్, బీఎన్‌రెడ్డి కాలనీ, హస్తినాపురం, ఆర్కేపురం తదితర వార్డులు ఉన్నాయి. వీటితోపాటు కూకట్పల్లి మూసాపేట సర్కిల్లోని గౌతంనగర్–ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్, మంజీరా పైప్‌లైన్ రోడ్–ఇందూ విల్లాస్, కూకట్పల్లి సర్కిల్లోని ఎల్లమ్మబండ–జన్మభూమి కాలనీ, కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుచిత్రారోడ్–బ్యాంక్‌కాలనీ కమ్యూనిటీహాల్, గాంధీ విగ్రహం–వెంకటేశ్వరస్వామి గుడి, గాజులరామారం సర్కిల్ పరిధిలోని ఉషోదయకాలనీ, శేరిలింగంపల్లి జోన్‌లోని దీప్తిశ్రీనగర్, కాకతీయహిల్స్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. నడిచేందుకు వీలుగా నిర్మాణం గ్రేటర్ నగరంలో 9100 కి.మీ రహదారులు ఉన్నప్పటికీ 500 కి.మీ మించి ఫుట్‌ఫాత్‌లు లేవు. దీంతో పలు సందర్భాల్లో పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రాణనష్టం కూడా జరుగుతోంది. ప్రధాన రహదారుల పనులను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తుండడంతో అంతర్గత రహదారుల్లో రద్దీ ఉండే మార్గాల్లో ప్రజలు నడిచేందుకు వీలుగా ఫుట్‌పాత్‌లు నిర్మించనున్నారు. ఆయా ప్రాంతాల్లోని స్థల సదుపాయాన్ని బట్టి వీటిని నిర్మించనున్నారు. అర్బన్ రోడ్ స్టాండర్ట్స్ మేరకు ఫుట్‌పాత్‌ల వెడల్పు రోడ్డు వెడల్పులో కనీసం పది శాతం ఉండాలి. అంటే 60 అడుగుల రోడ్డుంటే కనీసం 6 అడుగుల వెడల్పుతో ఫుట్ఫాత్ ఉండాలని ఇంజినీర్లు చెబుతున్నారు. కానీ నగరంలోని పరిస్థితుల దృష్ట్యా ఇది సాధ్యం కాదు. దీంతో తక్కువ స్థలమున్న ప్రాంతాల్లోనూ కనీసం 1.2 మీటర్ల వెడల్పుకు తగ్గకుండా ఫుట్‌పాత్‌లు నిర్మించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. కనీసం ఈ వెడల్పు కూడా లేకపోతే పాదచారులు నడిచే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు. -
బండ్లకే ఫుట్‌పాత్!
అమీర్‌పేట: సెకండ్‌హ్యాండ్ సేల్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపార సముదాయాలుగా మార్చేస్తున్నారు. దీనికి తోడు ప్రైవేట్ సంస్థల వాహనాలనూ రోడ్లపైనే నిలుపుతుండడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులను ఆదేశించినా ఫలితం లేకుండా పోతోందని స్థానికులు వాపోతున్నారు. కార్ల సెకండ్ సేల్స్‌కు బల్కంపేట, అమీర్‌పేట, సంజీవరెడ్డినగర్ ప్రాంతాలు కేంద్రాలుగా మారాయి. చాలామంది ఇక్కడి పరిసర ప్రాంతాల్లో వ్యాపారాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.అయితే వాహనాలు పార్కింగ్ చేసేందుకు వీలున్న చోట వ్యాపారాలు చేయాల్సి ఉండగా.. చాలామంది నివాస గృహాలను అద్దెకు తీసుకొని బిజినెస్ నడిపిస్తున్నారు. విక్రయానికి వచ్చే కార్లను రోజుల తరబడి ఫుట్‌పాత్‌లపై నిలిపి ఉంచుతున్నారు. ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వెనకా, 60 ఫీట్ రోడ్డు, బీకేగూడ, ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంతాల్లో తరుచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఎస్ఆర్నగర్ కమ్యూనిటీ హాలు నుంచి బీకేగూడ మున్సిపల్ వార్డు కార్యాలయం వరకు ఫుట్‌పాత్‌లు పూర్తిగా కనుమరుగయ్యాయి. దీనిపై బల్దియా అధికారులు, ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫుట్‌పాత్ టైల్స్, టాయిలెట్లు
గచ్చిబౌలి: ప్లాస్టిక్ భూతం మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చెత్తలో పేరుకుపోయిన ప్లాస్టిక్ భూసారంతో పాటు భూగర్భ జలాలు కలుషితం చేస్తూ మానవాళిని ఆందోళనకు గురి చేస్తోంది. అలాంటి ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసి టైల్స్‌ను తయారు చేశారు. ఆ టైల్స్‌తో ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ వెస్ట్ జోనల్ అధికారులు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ప్లాస్టిక్ రీసైక్లింగ్‌తో తయారు చేసిన వాల్, రూఫ్ షీట్స్‌తో టాయిలెట్ల నిర్మాణం చేపట్టడం విశేషం. మియాపూర్ మెట్రో వద్ద ప్లాస్టిక్ రీసైక్లింగ్‌తో తయారు చేసిన షీట్స్‌తో ఫైర్ ప్రూఫ్ గదిని నిర్మించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రీసైక్లింగ్‌తో ప్లాస్టిక్ వ్యర్థానికి ఓ అర్థం చెబుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. అయ్యప్ప సొసైటీలో ఫుట్‌పాత్‌ల నిర్మాణం.. ఆర్డర్ చేసి ఇండోర్ నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ టైల్స్‌ను తెప్పిస్తున్నారు. శేరిలింగంపల్లి సర్కిల్– 20లోని డాగ్ పార్క్, శిల్పారామం ముందు, చందానగర్ సర్కిల్ 21లోని అయ్యప్ప సొసైటీ 100 అడుగుల రోడ్డులో ఫుట్‌పాత్‌ల నిర్మాణం పైలట్ ప్రాజెక్ట్‌గా చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ, బ్యాంబూ హౌస్ ఇండియా సంయుక్తంగా ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేస్తున్నాయి. 6 నెలలకోసారి ఈ టైల్స్‌ను మార్చాల్సిన అవసరం లేకపోవడంతో ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. 600 పాలీబ్యాగ్స్‌ను రీసైక్లింగ్ చేస్తే 300 గ్రాముల బరువైన ఒక టైల్‌ను తయారు చేయవచ్చు. దృఢంగా ఉండే ఈ టైల్స్ డ్యామేజ్ కావు. అంతేకాకుండా వర్షపు నీటిని భూమిలోకి ఇంకేందుకు వీలుంటుంది. భూగర్భ జలాలు పెంపొందేందుకు అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ టైల్స్‌ను బెస్ట్ ప్రాక్టీస్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఇలాంటి టైల్స్‌ను వాడాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఎకో ఫ్రెండ్లీ టైల్స్ వాడకంతో ప్లాస్టిక్ వ్యర్థాలను డంప్ యార్డ్‌కు చేరకుండా చేయవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ గుర్తించింది.. ప్లాస్టిక్ రిసైక్టింగ్ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు వేయడాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అర్బన్ అఫైర్స్ గుర్తించింది. ఇలాగే దేశవ్యాప్తంగా అమలు చేయాలని మార్గదర్శకాలు పంపించింది. రీసైక్లింగ్‌తో డంప్ యార్డ్‌లకు ప్లాస్టిక్ తగ్గే అవకాశం ఉంది. మన దగ్గర ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసి 3000 చెత్త డబ్బాలు ఉత్పత్తి చేసి జోనల్ పరిధిలో పెట్టాం. ఇప్పుడు 21 చెరువుల వద్ద రిసైక్లింగ్ షీట్స్‌తో టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్లాస్టిక్ రిసైక్లింగ్ వాల్, రూఫ్ టాప్ షీట్లతో ఫైర్ ప్రూఫ్, సేఫ్టీ గదిని మియాపూర్ మెట్రో వద్ద ప్రయోగాత్మకంగా నిర్మించాం. – హరిచందన దాసరి, వెస్ట్ జోనల్ కమిషనర్ ఫైర్ ప్రూఫ్ గది నిర్మాణం.. మియాపూర్ మెట్రో స్టేషన్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్‌తో చేసి షీట్స్‌తో వాచ్మెన్ ఉండేందుకు ఫైర్‌ప్రూఫ్ గదిని నిర్మించారు. రూ.1.50 లక్షల వ్యయంతో ఈ హౌస్‌ను ఏర్పాటు చేశారు. ఐరన్ రాడ్లతో నిర్మాణం చేపడితే ఖర్చు రెట్టింపు కానుంది. టెట్రాప్యాక్స్, బాటిల్ క్యాప్స్, పాలీబ్యాగ్స్‌ను రీసైక్లింగ్ చేసిన వాల్, రూఫ్ షీట్స్‌తో గదిని నిర్మించారు. ఈ మెటీరియల్ వాడి హీట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ డ్యామేజ్ ఫ్రీ హౌస్‌లను తయారు చేయవచ్చు. చెరువుల వద్ద టాయిలెట్ల నిర్మాణం.. ప్లాస్టిక్ రీసైక్లింగ్‌తో చేసిన షీట్స్‌తో చెరువుల వద్ద టాయిలెట్ల నిర్మాణం చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ వెస్ట్ జోనల్ పరిధిలోని 21 చెరువుల వద్ద ప్లాస్టిక్ టాయిలెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే చందానగర్‌లోని గంగారం చెరువుతో పాటు రామసముద్రం, గుర్నాథం చెరువు, మల్కం చెరువు సమీపాల్లో టాయిలెట్ల నిర్మాణం చేపడుతున్నారు. వినాయక నిమజ్జనం నాటికి 21 చెరువుల వద్ద టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇప్పటికే వెస్ట్ జోనల్ పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారైన బిన్స్‌ను వాడుకలోకి తెచ్చారు. డంపింగ్ యార్డ్‌తో వేరు చేసిన ప్లాస్టిక్‌ను సేకరించి సనత్‌నగర్‌లోనే రీసైక్లింగ్ చేసి వాల్షీట్స్, చెత్త బిన్స్‌ను తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్‌తో చేసిన టైల్స్‌తో వేసిన ఫుట్‌పాత్ -
పుట్‌పాత్ పైకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
-
ఇక అక్రమాల లెక్క!
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలు, ఫుట్‌పాత్ ఆక్రమణలపై టౌన్‌ప్లానింగ్ విభాగం సర్వే చేపట్టింది. ఎన్ని అక్రమ భవన నిర్మాణాలు, ఫుట్‌పాత్ ఆక్రమణలు ఉన్నాయో లెక్కించి... ఆ తర్వాత కూల్చివేతలు చేపట్టనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఓ ప్రహసనంగా మారాయన్న సంగతి తెలిసిందే. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడో లేక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడో హడావుడి చేసే అధికారులు... ఆ తర్వాత వాటి విషయం మరిచిపోతున్నారు. దాదాపు ఏడాది కాలంగా ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ విభాగం ఫుట్‌పాత్ ఆక్రమణలపై దృష్టిసారించి వాటిని తొలగిస్తోంది. కానీ దాదాపు ఆరు నెలలుగా ఎన్నికల కోడ్‌తో ఇది నిలిచిపోయింది. కోడ్ ముగియగానే జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశం నిర్వహించిన మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ అక్రమ నిర్మాణాల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంపేట ప్రధాన రహదారిపై శాశ్వత నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ సంబంధిత ఏసీపీని సస్పెండ్ చేశారు. అవసరమైతే ఇంజినీరింగ్ విభాగానికి టౌన్‌ప్లానింగ్ బాధ్యతలు అప్పగించి అక్రమ నిర్మాణాలు తొలగిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి? ఎక్కడెక్కడ కొనసాగుతున్నాయి? ఫుట్‌పాత్ ఆక్రమణలు ఎక్కడెక్కడ జరిగాయి? అనే అంశాలపై సర్వే చేయాల్సిందిగా సంబంధిత సర్కిళ్లలోని టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పని ప్రారంభించిన అధికారులు సర్వే పూర్తి చేసి వచ్చే వారంలో చర్యలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. అవసరమైన పక్షంలో ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ విభాగం సహకారం తీసుకోనున్నారు. ఫుట్‌పాత్ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిన బాధ్యత టౌన్‌ప్లానింగ్ విభాగానిదేనని అర్వింద్‌కుమార్ పేర్కొనడంతో తొలుత సర్వే చేపట్టారు. అటకెక్కిన ‘అమలు’.. అక్రమ నిర్మాణాలపై గత నవంబర్లోనే జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ టౌన్‌ప్లానింగ్ అధికారులను హెచ్చరించారు. అడ్డగోలుగా వెలుస్తున్న అక్రమ భవన నిర్మాణాలను అడ్డుకోకపోవడంపై సమీక్ష సమావేశం సందర్భంగా ప్రస్తావించారు. ఒక అధికారిని సస్పెండ్ చేయాలని నిర్ణయించినప్పటికీ మెమోతో సరిపెట్టారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి సర్కిళ్ల వారీగా ఎన్ని అక్రమ నిర్మాణాలు, డీవియేషన్లు ఉన్నాయో? ఎన్ని నోటీసులు జారీ చేశారో? కోర్టు కేసులెన్ని ఉన్నాయో? నివేదిక రూపొందించాల్సిందిగా ఆదేశించారు. ఈ వివరాలన్నింటినీ రోజూ వారీగా నమోదు చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాలని కూడా సూచించారు. అంతేకాకుండా భవన నిర్మాణ అనుమతులు జారీ కాగానే, నిర్ణీత వ్యవధుల్లోగా తనిఖీలు చేసేందుకు తగిన విధానాన్ని రూపొందించాలని నిర్ణయించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి నోటీసుల జారీని కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. తద్వారా ఎప్పుడు నోటీసులిచ్చారు? తదుపరి ఏం చర్యలు తీసుకున్నారు? అనే విషయాలు ఉన్నతాధికారులకు కూడా ఎప్పటికప్పుడు తెలుస్తాయని భావించారు. మరోవైపు అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకోవాలని టౌన్‌ప్లానింగ్ ఉన్నతాధికారులు దాదాపు ఏడాదిన్నర క్రితమే నిర్ణయించారు. అక్రమ నిర్మాణాలను ఎప్పటికప్పుడు కూల్చి వేసేందుకు సర్కిల్, జోన్ల స్థాయిలో టౌన్‌ప్లానింగ్, విజిలెన్స్ తదితర విభాగాలతో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. కానీ ఇవేవీ అమల్లోకి రాలేదు. శిథిల భవనాలపైనా సర్వే.. త్వరలో వర్షాకాలం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శిథిల భవనాల సర్వే కూడా పూర్తి చేసి తొలగించాల్సిన లేదా మరమ్మతులు చేయాల్సిన భవనాలకు నోటీసులు జారీ చేయాలని, ఈ ప్రక్రియను జూన్ 10లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత నిబంధనల మేరకు చర్యలు తీసుకోనున్నారు. జీహెచ్ఎంసీ లెక్కల ప్రకారం గతేడాది వరకు దాదాపు 2,010 పురాతన, శిథిల భవనాలు ఉండగా వాటిల్లో దాదాపు 1,400 భవనాలను కూల్చివేశారు. మరో 600 కూల్చివేయాల్సి ఉంది. గతేడాది నుంచి ఇప్పటి వరకు మరికొన్ని శిథిలావస్థకు చేరి ఉంటాయి. ప్రతిఏటా దాదాపు వెయ్యి వరకు శిథిల భవనాలుంటున్నాయి. పాతబస్తీతో పాటు కోఠి, అబిడ్స్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. నిర్ణీత వ్యవధుల్లో శిథిల భవనాల్లోని వారికి నోటీసులైతే జారీ చేస్తున్నప్పటికీ, తదుపరి చర్యలు తీసుకోవడం లేరు. ఈసారైనా ఈ తీరు మారుతుందేమో చూడాలి. -
బాటసారీ.. లేదు దారి
నగరంలో నడిచే దారి కరువైంది. ఫలితంగా పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గ్రేటర్లో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో పాదచారులే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది జరిగిన ప్రమాదాల్లో 36శాతం మంది బాధితులు వీరే కావడం గమనార్హం. సాక్షి, సిటీబ్యూరో :ఎన్నో అంశాల్లో ప్రగతి పథంలో దూసుకెళుతున్న హైదరాబాద్ మహానగరం పాదచారులకు రోడ్డుపై నడిచే అవకాశం మాత్రం ఇవ్వడం లేదు. ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలే ఈ అంశాన్ని చెబుతున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా కనీస మౌలిక వసతులు కల్పించకపోవడం మరింత ఊతమిస్తున్నాయి. నగరంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో ద్విచక్రవాహన దారులు (50 శాతం)మొదటి స్థానంలో ఉంటే పాదచారులు రెండోస్థానంలో ఉన్నారు. గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో బాధితులుగా మారిన వారిలో వీరు 36 శాతానికి పైగా ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కారణాలు ఏమైన్నప్పటికీ ప్రాథమిక అంశాలైన ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, అవసరమైన అన్ని ప్రాంతాల్లోనూ పెలికాన్ సిగ్నల్స్‌తో పాటు జీబ్రా క్రాసింగ్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేకపోవడం..ఉన్న వాటిని సరిగా పట్టించుకోక పోవడం వల్లనేఈ పరిస్థితి తలెత్తింది. మృతుల్లో పాదచారులూ ఎక్కువే.. నగర ట్రాఫిక్ పోలీసులు ఏటా ప్రమాదాలపై విశ్లేషణ నిర్వహిస్తారు. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాలు, బాధితులుగా/మృతులుగా మారుతున్న వారు ఎవరనేది గణాంకాల ప్రకారం జాబితాలు రూపొందిస్తుంటారు. 2018కి సంబంధించి హైదరాబాద్ పోలీసులు రూపొందించిన రికార్డుల ప్రకారం సిటీలో జరుగుతున్న ప్రమాదాలు రెండు వేలకు పైనే ఉన్నాయి. వీటిలో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా మారుతున్న వారిలో ద్విచక్ర వాహనచోదకులు తొలిస్థానంలో ఉండగా.. రెండో స్థానం పాదచారులదే. కొన్నేళ్ల గణాంకాలను లెక్కతీస్తే రోడ్డు ప్రమాద బాధితుల్లో పాదచారులే ఎక్కువగా ఉన్నారు. సిటీలో గత ఏడాది మొత్తం 2,540 ప్రమాదాలు జరగ్గా.. 2,550 మంది బాధితులుగా మారారు. వీటిలో ప్రమాదాల బారిన పడిన పాదచారుల సంఖ్య 924 మంది ఉన్నారు. మొత్తమ్మీద రోడ్డు ప్రమాద బాధితుల్లో 36 శాతం, మృతుల్లో 43 శాతం పాదచారులే ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీటికి మోక్షమెప్పుడో? రాజధానిలో ఉన్న రహదారులపై పాదచారులు భద్రంగా తిరిగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. పురాతన నగరమైన పాతబస్తీతో పాటు ఇటీవల రూపుదిద్దుకుని, అభివృద్ధి చెందుతున్న హైటెక్ సిటీ పరిసరాల్లోనూ ఇవి మచ్చుకైనా కనిపించవు. ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలోనూ పాదచారులకు అవసరమైన స్థాయిలో ప్రాధ్యానం లేదు. ప్రణాళిక లోపం వల్ల నగరంలో ఉన్న ఫుట్‌పాత్‌ల్లో సగం ఆక్రమణకు గురికాగా.. మిగిలిన చోట్ల అనేక అడ్డంకులు వస్తున్నాయి. జంక్షన్స్ వద్ద ‘పెడస్ట్రియన్స్ క్రాసింగ్’ కోసం ప్రత్యేక చర్యలు, అందుకు అనుగుణంగా ‘ఆల్ రెడ్స్’ అనే సాంకేతిక అంశం ఏర్పాటు ఆమడదూరంలో ఉన్నాయి. వీటికి పరిష్కారంగా ట్రాఫిక్ విభాగం అధికారులు పంపిన ప్రతిపాదనలకు కూడా ‘గ్రేటర్’లో మోక్షం లభించడం లేదు. నగరంలో కీలక ప్రాంతాల్లో కనీసం రెండడుగుల వెడల్పుతో ఫుట్‌పాత్ ఏర్పాటు చేయాలని, దీనికి బారికేడింగ్, అవసరమైన ప్రాంతాల్లో క్రాస్ చేసేందుకు ఓపెనింగ్స్ అవసరమని చేసిన ప్రతిపాదనలు బల్దియా ఫైళ్లల్లో కొన్నేళ్లుగా మగ్గిపోతున్నాయి. మూలనపడ్డ ‘పెలికాన్స్’ ప్రతిపాదన పాదచారుల భద్రత కోసం సిటీలో నిత్యం బిజీగా ఉండే 60 ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని కొన్నేళ్ల క్రితమే ట్రాఫిక్ అధికారులు నిర్ణయించారు. ట్రాఫిక్‌కు సంబంధించిన మౌలిక వసతుల కల్పన జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి 2010 మార్చిలో జీహెచ్ఎంసీకి పంపారు. ఒక్కో సిగ్నల్ ఏర్పాటుకు రూ.40 వేల వరకు ఖర్చవుతుందని అంచనా వేసిన ‘గ్రేటర్’ అధికారులు.. కేవలం 30 సిగ్నల్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిని దశల వారీగా ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రాథమికంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద నాలుగింటిని అందుబాటులోకి తెచ్చారు. ఏడాది తరక్కుండానే అవి పాడైపోయినా పట్టించుకునేవారు కరవయ్యారు. మిగిలిన చోట ఏర్పాటు ప్రతిపాదనను దాదాపు మర్చిపోయారు. బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని కేర్ ఆస్పత్రి సమీపంలో మరో పెలికాన్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని భావించి ప్రాథమిక కసరత్తు చేసినా అది అమలు కాలేదు. ఈ లోపాలు సరిచేయాల్సిందే.. ♦ ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారాలు, కాలిబాటలను మింగేసిన బడా మాల్స్ ఒక ఎత్తయితే ప్రభుత్వ విభాగాల అనాలోచిత చర్యలు మరో ఎత్తు. వీటివల్ల మరికొన్ని ఇబ్బందులు తలెత్తి కాలిబాటలు అక్కరకు రావడం లేదు. ఫుట్‌పాత్‌ల మధ్యలో ఉన్న చెట్లకు తోడు అధికారులు ఉద్దేశ పూర్వకంగా, అనాలోచి ధోరణిలో ఏర్పాటు చేసిన/చేస్తున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, మూత్రశాలలు ఆ కొద్ది స్థలాన్నీ ఆక్రమించేస్తూ పాదచారులకు నడిచే దారి లేకుండా చేస్తున్నాయి. ♦ రోడ్లకు అనుసంధానంగా ఉన్న క్యారేజ్‌వే ఆధారంగా కాలిబాటలు కనిష్టంగా 4–5 అడుగుల వెడల్పు ఉండాలి. ప్రస్తుతం ఉన్న వాటిపై అడ్డదిడ్డంగా ఉన్న చెట్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటివి తొలగించాలి. ఈ తొలగింపు ప్రక్రియ సాధ్యం కాని ప్రాంతాల్లో ఉన్న ఫుట్‌పాత్ వెడల్పు కనీసం 2 నుంచి మూడు అడుగులు అదనంగా విస్తరించాలి. ♦ ఈ ఫుట్‌పాత్‌లు కేవలం పాదచారులు నడవడానికి మాత్రమే అన్నది అందరికీ అవగాహన కల్పించడంతో పాటు అది కచ్చితంగా అమలయ్యేలా చేయాలి. ఆక్రమణలు నిరోధించడానికి జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో సంయుక్త ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేయాలి. ♦ నిత్యం రోడ్డుపై నడుస్తున్న పాదచారుల కంటే వాటిని దాటేందుకు ప్రయత్నిస్తున్న వారే ఎక్కువగా ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. పెడస్ట్రియన్లు సైతం ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటకుండా అడ్డగించేందుకు కాలిబాటలకు కచ్చితంగా బారికేడ్లు ఉండాలి. పటిష్టమైన స్టీలుతో వీటిని ఏర్పాటు చేసి కేవలం రోడ్డు దాటేందుకు అవకాశం ఇచ్చిన చోట మాత్రమే ఓపెనింగ్ ఉంచాలి. ♦ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లపై కూడా కనిష్టంగా మూడడుగుల ఎత్తుండే బారికేడ్లు ఏర్పాటు చేయాలి. వీటివల్ల అడ్డదిడ్డంగా పాదచారులు ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటుతూ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉండదు. రోడ్డు దాటే అవకాశం ఇచ్చిన చోట మాత్రమే డివైడర్లపై బారికేడ్లు లేకుండా చూడాలి. డివైడర్లపై ఉండే ఈ దారి కనిష్టంగా రెండున్నర అడుగుల కంటే ఎక్కువే ఉండాలి. ఆయా ప్రాంతాల్లో పాదచారులకు ఉపయుక్తంగా ఉండేలా పెడస్ట్రియన్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయాలి. ♦ రహదారులపై పాదచారులు రోడ్డు దాటేందుకు అవకా«శం ఇచ్చిన చోట స్పష్టమైన సూచికలు, అందరికీ కనిపించేలా జీబ్రా క్రాసింగ్స్‌తో పాటు ఇరువైపులా పాదచారుల (పెలికాన్) సిగ్నల్స్ అందుబాటులోకి తీసుకువచ్చినా నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ దాటడం అంత తేలిక కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులు ఆయా కీలక ప్రాంతాల్లో పాదచారుల భద్రతకు బాధ్యత తీసుకోవాలి. ♦ అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఐటీఎంఎస్ ప్రాజెక్టులో భాగంగా పాదచారుల కోసం సిగ్నలింగ్ వ్యవస్థలో కొత్త విధానం ఏర్పాటు చేయాలి. అన్ని దారుల్లోనూ రెడ్, గ్రీన్ సిగ్నల్స్ పడటం పూర్తయ్యాక 10 నుంచి 15 సెకండ్ల పాటు అన్ని వైపులా రెడ్ సిగ్నల్ పడేలా.. ఆ సమయంలో ప్రత్యేకమైన సైరన్‌తో పాదచారుల సురక్షితంగా జంక్షన్ దాటేలా రూపొందించాలి. ♦ రాజధానిలోని రోడ్లు అనేక ప్రాంతాల్లో చాలా వెడల్పుతో ఉంటాయి. కొన్నిచోట్ల 25 నుంచి 50 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్లూ ఉన్నాయి. ఇలాంటి చోట్ల క్రాస్ చేయాలని నడక ప్రారంభించిన పాదచారి ఒకే తడవలో రోడ్డు మొత్తం దాటడం సాధ్యం కాదు. ఇలాంటి సందర్భాల్లో డివైడర్లు లేదా రోడ్డు మధ్యలో ఆగిపోతున్న పాదచారులు అయోమయానికి గురవుతున్నారు. దీంతో ఒక్కోసారి ప్రమాదాలకు గురవుతున్నారు. అలా కాకుండా రోడ్డు మొత్తం దాటడానికి వీల్లేనపుడు మధ్యలో ఆగే సందర్భాల్లో డివైడర్‌పై ‘పెడస్ట్రియన్ రెఫ్యూజీలు’గా పిలిచే ప్రాంతాలను ఏర్పాటు చేయాలి. ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం నగరంలో పాదచారుల భద్రతకు జీహెచ్ఎంసీ సహాయంతో అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం 27 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు మంజూరు చేయించగా వీటిలో ఆరు అందుబాటులోకి వచ్చాయి. మరో నాలుగు నిర్మాణంలో ఉన్నాయి. మెట్రో స్టేషన్లను ఆధారంగా చేసుకుని రోడ్డు దాటేలా ఆ సంస్థను ఒప్పించాం. సిటీలో గుర్తించిన ప్రాంతాల్లో సెంట్రల్ మీడియం ఎత్తు పెంచడంతో పాటు రెయిలింగ్ ఏర్పాటు చేయిస్తున్నాం. పాదచారులు ఎక్కువగా రోడ్డు దాటే ప్రాంతాలైన మెట్టుగూడ, మెహదీపట్నం, రసూల్పురాల్లో ఉన్న సిగ్నల్స్‌ను ఆధునీకరించాం. – ఎల్.ఎస్. చౌహాన్, ట్రాఫిక్ డీసీపీ వాహన చోదకుల నిర్లక్ష్యమూ కారణమే.. సిటీ రహదారులపై పాదచారులు రోడ్డు దాటాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి మౌలికవసతుల కొరత ఓ కారణమైతే వాహన చోదకుల వ్యవహారశైలి మరో కారణం. సాధారణంగా జంక్షన్లో ఆగి ఎదురుచూస్తున్న పాదచారి రెడ్ సిగ్నల్ పడి వాహనాలు ఆగినప్పుడు రోడ్డు దాటే ప్రయత్నం చేస్తాడు. అయితే, కొందరు ద్విచక్ర, తేలికపాటి వాహన చోదకులు ఆ సమయంలోనూ వాహనాలను ముందుకు ఉరిస్తూ పాదచారులను ఇబ్బంది పెట్టడంతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్నారు. మరోపక్క అందుబాటులో ఉన్న మౌలిక వసతులను పాదచారులు కూడా సక్రమంగా వినియోగించుకోవాలి.– కరణ్‌జీత్ సింగ్, జగదీష్ మార్కెట్ ఎఫ్‌ఓబీలు, భూగర్భ మార్గాలు కనుమరుగు నగరంలోని రద్దీ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉన్న చోట్ల గతంలో భూగర్భ క్రాసింగ్ మార్గాలు నిర్మించారు. ఆపై దిల్‌సుక్‌నగర్, సికింద్రాబాద్, బేగంపేట, మెహదీపట్నం సహా అనేక ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులోకి తెచ్చారు. సరైన నిర్వహణ, భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కోఠి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భూగర్భ క్రాసింగ్ మార్గాలు ఆదరణకు నోచుకోలేదు. దీంతో ఒకటి పూర్తిగా కనుమరుగు కాగా మరొకటి స్వరూపం మార్చుకుని పాదచారులకు పనికిరాకుండా పోయింది. ఇక ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కట్టిన జీహెచ్ఎంసీ అధికారులు వాటికి ఎలివేటర్ వంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో పాదచారులకు ఉపయోగపడలేదు. ఇవి పూర్తిగా ఓ స్వరూపాన్ని సంతరించుకోకముందే ‘మెట్రో’ గండం వచ్చిపడింది. మెట్రోరైల్ నిర్మాణాల కోసం సిటీలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లను తొలగించారు. తర్వాత కొన్ని నిర్మిస్తున్నా అవి అవసరాలకు అనుగుణంగా మాత్రం లేవు. 2018లో నగర పోలీస్ విభాగం గణాంకాలు ఇవీ.. మొత్తం ప్రమాదాలు : 2,540 క్షతగాత్రులు : 2,550 మృతులు : 303 బాధిత ద్విచక్రవాహన చోదకులు : 1,231 బాధిత పాదచారులు : 924 రహదారుల పరిస్థితి ఇలా... బల్దియా ఆధీనంలోని రోడ్లు : 6,200 కి.మీ. ఆర్ అండ్ బీ ఆధీనంలోనివి : 189.49 కి.మీ. జాతీయ రహదారుల సంస్థ ఆధీనంలోనివి : 98.7 కి.మీ. మొత్తం రోడ్ల పొడవు : 6.488 కి.మీ. ఫుట్‌పాత్‌ల పొడవు : 2 వేల కి.మీ. లోపుటవీటిలో సరాసరిన కనిష్టంగా ఐదు కి.మీ. అడ్డంకులు లేకుండాఉన్న ఫుట్‌పాత్‌లు లేవు. -
వేడిని పెంచుతున్న ఫుట్‌పాత్‌లు
సాక్షి, న్యూఢిల్లీ : సుందర నగరాల్లో సాధారణంగా రోడ్ల పక్కన ఎండ ఎక్కువ పడకుండా ఎల్తైన చెట్లు, పక్కన పాదాచారుల కోసం సిమ్మెంట్ టైల్స్‌తో కూడిన ఫుట్‌పాత్‌లు కనిపిస్తాయి. పగటి పూట ఎండ వేడిని తగ్గించేందుకు రోడ్లు పక్కనున్న ఎల్తైన చెట్లు ఎంతగానో ఉపయోగపడుతాయి. సిమ్మెంట్ ఫుట్‌పాత్‌లు, పక్కనుండే పలు అంతస్తుల భవనాలు పగటి పూట ఎండలోని వేడిని గ్రహించి రాత్రి పూట వాతావరణంలోకి వదులుతాయి. తద్వారా రాత్రిపూట వాతావరణం ఆశించినంత లేదా కావాల్సినంత చల్లగా ఉండక పోవచ్చు. మానవులు ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రిపూట వాతావరణం చల్లగా ఉండాలనేది వైద్యులు ఎప్పుడే తేల్చి చెప్పారు. అయితే సిమ్మెంట్ ఫుట్‌పాత్‌లు, ఎల్తైన కాంక్రీటు భవనాలు రాత్రి పూట వాతావరణం వేడికి కారణం అవుతున్నాయని శాస్త్రవేత్తలు ఇప్పుడు కనిపెట్టారు. మాడిసన్లోని విస్కాన్సిన్ యూనివర్శిటీ పరిశోధకులు సైకిల్ మోటర్లకు జీపీఎస్ డివైస్‌లు, ఉష్ణోగ్రత సెన్సర్లు అమర్చి పగటి పూట, రాత్రివేళ వివిధ రోడ్లలో వాటిని నడిపి ఉష్ణోగ్రతలను నమోదు చేశారు. ఏ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గుల్లో ఉన్నాయో గమనించి ఎందుకున్నాయో తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిసరాలను పరిశీలించారు. కింద కాంక్రీట్ ఫుట్పాతులున్నా, పైన ఛత్రిలాగా గుబురైన చెట్లు ఉన్న చోట వేడి తక్కువగా ఉండడం, పక్కన ఎల్తైన కాంక్రీటు భవనాలుంటే వేడి స్థాయిలో మార్పులు ఉండడం గమనించారు. పార్కుల వద్ద ఎక్కువ చెట్లు ఉండడం వల్ల అక్కడి వాతావరణం ఎక్కువగా చల్లగా ఉండడం తెల్సిందే. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఇతర వేడి ప్రాంతాలకు పనులపై తరచూ వెళ్లి రావడం వల్ల కూడా (చలి, వాతావరణంల మధ్య సర్దుబాటు కుదరక) వారి ఆరోగ్యం దెబ్బతింటుందట. పల్లెల్లో అంతగా చెట్లు లేకున్నా పట్టణాల్లో ఎక్కువ చెట్లున్నా పట్టణాల్లో వాతావరణంలో వేడి ఎక్కువగా ఉండడానికి కారణం (వాహనాల కాలుష్యాన్ని మినహాయించి) వేడిని గ్రహించి రాత్రికి దాన్ని వదిలేసే కాంక్రీట్ భవనాలే. అందుకని కాంక్రీటు భవనాల మధ్య చెట్లు ఉండడంతోపాటు కాంక్రీట్ ఫుట్‌పాత్‌లకు బదులు, గడ్డితో కూడిన ఫుట్‌పాత్‌లు ఉండడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. చెట్లు పార్కులకే పరిమితం కాకుండా ప్రతివీధి, ప్రతి సంధులో చెట్లు ఉండడం వల్ల వాతావరణం చల్లగా ఉండడంతోపాటు సమ ఉష్ణోగ్రత ఉండి ప్రజల ఆరోగ్యానికి ఢోకా ఉండదని వారంటున్నారు. -
అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు
ఖైరతాబాద్: అదుపుతప్పిన వేగంతో వచ్చిన కారు ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన ఘటన ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఐమాక్స్ రోటరీ చౌరస్తా వైపు వస్తున్న హోండా క్రిస్టా కారు (టిఎస్07 యుహెచ్2043) ఎన్టీఆర్ గార్డెన్ దాటగానే అదుపు తప్పిన వేగంతో రోడ్డు పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. కారులో భార్యాభర్తతో పాటు రెండు సంవత్సరాల బాబు ఉన్నారు. బాబు తలకు తీవ్రగాయాలయ్యాయి. భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వీరు కారులోంచి దిగి ఆటోలో సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. ట్రాఫిక్ పోలీసులు వెంటనే కారును క్రేన్ సాయంతో అక్కడి నుంచి తొలగించారు. -
విద్యుదాఘాతంతో బాలుడి మృతి
-
ఆడుకుంటూ వెళ్లి.. స్తంభాన్ని పట్టుకుని..
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సరఫరా నిర్వహణ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫుట్‌పాత్ పక్కనే ఉన్న స్తంభాన్ని పట్టుకోవడంతో విద్యుత్ఘాతానికి గురై ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీరంచెరువు పీబీఈఎల్ సీటీ (ఫెబల్ సిటీ)లో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. చెన్నైకి చెందిన దివాకర్ హైటెక్ సిటీ ప్రాంతంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. భార్య, కుమారుడు మోనీష్(7)తో కలిసి ఫెబల్ సిటీలోని ఈ–బ్లాక్ 12వ అంతస్తు 8వ నెంబర్ ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. మోనీష్ స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ సాయంత్రం అపార్ట్మెంట్లోని తోటి పిల్లలతో కలిసి లాన్లో ఆడుకునేవాడు. సోమవారం కూడా ఆడుకోవడానికి కిందకు వచ్చాడు. ఈ క్రమంలో ఆడుతూ ఆడుతూ వెళ్లి ఫుట్‌పాత్ పక్కనే ఉన్న వీధిదీపం స్తంభాన్ని పట్టుకున్నాడు. దాని కింది భాగంలో విద్యుత్ వైరు పాడై ఉండటంతో స్తంభానికి కరెంటు సరఫరా అవుతోంది. దీంతో మోనీష్ విద్యుత్ఘాతానికి గురై నిమిషంపాటు అలాగే ఉండిపోయాడు. ఆ సమయంలో అక్కడ ఆడుకుంటున్న చిన్నారులతోపాటు వాకింగ్ చేస్తున్నవారు ఎవరూ ఈ విషయాన్ని గమనించలేదు. నిమిషం తర్వాత మోనీష్ కింద పడిపోయాడు. వెంటనే చిన్నారిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా..అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. జరిగిన ఘటనతో ఆందోళనకు గురైన అపార్ట్‌మెంట్‌వాసులు మంగళవారం ఉదయం ఆందోళన చేపట్టారు. బిల్డర్‌తో పాటు కాంట్రాక్టర్లను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పీబీఈఎల్ సిటీ నిర్వాహకులు నివారణ చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న భూగర్భ కేబుల్ వైర్లకు టేపులు చుట్టారు. స్తంభం వద్దకు వెళ్తూ... విద్యుత్ఘాతానికి గురై అలాగే ఉండిపోయిన మోనీష్ పోస్టుమార్టానికి తండ్రి ససేమిరా... మోనీష్ మృతదేహాన్ని అతడి తల్లిదండ్రులు సోమవారం రాత్రే తమ స్వస్థలం చెన్నై తీసుకెళ్లారు. అయితే, ఇక్కడ కేసు నమోదు చేయడానికి పోస్టుమార్టం నివే దిక అవసరం కావడంతో పోలీసులు మోనీష్ తండ్రి దివాకర్‌ను సంప్రదించారు. అయితే, తన కుమారుడికి పోస్టుమార్టం చేయించడానికి ఆయన తొలుత అంగీకరించలేదు. దీంతో అపార్ట్‌మెంట్‌వాసులు దివాకర్‌తో మాట్లాడి ఒప్పించారు. అనంతరం చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఐదు రోజుల్లో వస్తుందని వెల్లడించారు. ఈ కేసులో బిల్డర్, అసోసియేషన్, విద్యుత్ సరఫరా కాంట్రాక్టర్‌పై కేసులు నమోదుచేసినట్లు చెప్పారు. -
ఉప్పల్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు
-
నవ్యంగా ‘నడకదారి’!
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటిదాకా ఆక్రమణల తొలగింపుతో పాటు విపత్తుల నిర్వహణలో ప్రజలకు అండగా నిలుస్తున్న జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం ఇక ప్రజా సదుపాయాలనూ కల్పించనుంది. పాదచారులు నడిచేందుకు చక్కటి ఫుట్‌పాత్‌లను నిర్ణీత ప్రమాణాల కనుగుణంగా నిర్మించనుంది. ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి అవసరమైన టెండర్ల నుంచి నిర్మాణం పూర్తిచేసే బాధ్యతలూ నిర్వహించనుంది. జీహెచ్ఎంసీలో ఈవీడీఎం కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసి.. విభాగం డైరెక్టర్‌గా విశ్వజిత్ కంపాటిని ప్రభుత్వం నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టాక ప్రతి రెండో శనివారం వివిధ మార్గాల్లో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టడం తెలిసిందే. గత సంవత్సరం జూన్ 30 నుంచి ప్రారంభమైన స్పెషల్ డ్రైవ్‌లకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొంతకాలం విరామమిచ్చారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ తిరిగి చేపట్టారు. అలా.. ఇప్పటివరకు దాదాపు 15 వేల ఆక్రమణల్ని తొలగించారు. ఈ చర్యలకు ప్రజల నుంచి హర్షం వ్యక్తమైంది. అయితే ఈ ఆనందం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. ఫుట్‌ఫాత్‌లపై ఆక్రమణలు తొలగించాక.. తిరిగి కొద్దిరోజులకే మళ్లీ ఆక్రమణలు ప్రారంభమయ్యాయి. దాంతోపాటు ఆక్రమణల తొలగింపు వల్ల ఏర్పడ్డ డెబ్రిస్ తదితరాలతో కూడా ప్రజలు నడవడానికి వీల్లేకుండా పోయింది. వీటిని సరిదిద్దేందుకు, డెబ్రిస్ తదితర వ్యర్థాలతో మిగిలిన వాటిని చక్కదిద్దేందుకు తిరిగి ఫుట్‌పాత్‌లను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. అందుకుగాను ఇంజినీరింగ్ విభాగం టెండర్లు పిలిచి..టెండర్లు పూర్తయ్యి, పనులు పూర్తయ్యేందుకు సమయం పడుతోంది. ఈలోగా తిరిగి ఆక్రమణలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు ఈ పరిస్థితిని నివారించడంతోపాటు.. ఫుట్పాత్లుప్రజలకు సదుపాయయోగ్యంగా, సులభంగా నడవడానికి అనువుగా ఉండాలని కమిషనర్ దానకిశోర్ భావించారు. అందుకుగాను ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లను వెంటనే నిర్మించేందుకు ఈవీడీఎంకే విభాగానికే బాధ్యతలుంటే మంచిదని భావించి, అప్పగించారు. ఫుట్‌ఫాత్‌లను ప్రస్తుతమున్న విధంగా కాకుండా ప్రజలకు సదుపాయంగా ఉండేలా.. నిర్ణీత ప్రమాణాలతో, చూడ చక్కగా, అందంగా ఉండాలని భావించిన ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ అందుకనుగుణంగా చర్యలకు శ్రీకారం చుట్టారు.ఇందుకుగాను జీహెచ్ఎంసీ ఫుట్పాత్లని తెలిసేలా , అంతటా ఒకే నమూనాలో, ప్రజలకు సదుపాయంగా తగిన డిజైన్లతో ఏర్పాటు చేయాలని భావించారు. అందుకు తగిన డిజైన్లు రూపొందించే పనిలో పడ్డారు. మెట్రోరైలు మార్గాల్లో మాదిరిగా జీహెచ్ఎంసీ ఫుట్పాత్లని తెలిసే విధంగా తగిన గ్రిల్స్, కెర్బ్స్టోన్స్తదితరమైనవి ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు విశ్వజిత్ తెలిపారు. డిజైన్లు పూర్తయ్యాక నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మళ్లీ వెలసిన ‘అక్రమాల’పై చర్యలు.. ఆయా మార్గాల్లో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించిన ఈవీడీఎం..కొంతకాలం తర్వాత తిరిగి వెలసిన అక్రమాలపైనా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇదివరకు తొలగించిన ఆక్రమణల స్థానంలో హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో తిరిగి ఆక్రమణలకు పాల్పడ్డ ‘ హేవ్మోర్’ ఐస్‌క్రీమ్, శ్రీహరి ఎన్క్లేవ్, లైఫ్‌స్పాన్ డెంటల్ హాస్పిటల్స్, నేచురల్బ్యూటీ సెలూన్, షాగున్ స్వీట్‌హౌస్ తదితరమైన వాటి ఆక్రమణల్ని తిరిగి తొలగించింది. స్పెషల్ డ్రైవ్ సంఖ్య తొలగించిన ఆక్రమణలు 1. 5034 2. 1829 3. 1174 4. 1695 5. 1134 6. 764 7. 805 8. 620 9. 989 10. 736 -
బండెనక బండి.. ఫుట్‌పాత్ నిండి..
హైదరాబాద్ :నగరంలో ట్రాఫిక్‌జాం కష్టాలకు ఈ చిత్రాలే నిదర్శనం. బండెనక బండి.. పుట్‌ఫాత్‌పై వరుసగా నిండి.. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చేందుకు ద్విచక్రవాహనదారులు అష్టకష్టాలు పడ్డారు. సోమవారం మూసాపేట్ ప్లైఓవర్ వద్ద ట్రాఫిక్ జాం కావడంతో ద్విచక్ర వాహనదారులు పక్కనున్న ఫుట్‌పాత్‌పైకి ఎక్కి వెళ్లాలనుకున్నారు. ఇలా ఫుట్‌పాత్‌పైకి వందలాది వాహనాలు వచ్చాయి. కొద్దిదూరం వెళ్లాక రోడ్డు ఖాళీగా కనిపించడంతో కిందికి దిగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.– ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి -
ఫుట్‌పాత్‌పై ప్రసవం
సాక్షి, న్యూఢిల్లీ: భర్త, ఇద్దరు పిల్లలతో రోడ్లపై నివసించే మహిళ దక్షిణ ఢిల్లీలో రోడ్డు పక్కనున్న ఫుట్‌పాత్‌పై ఆడపిల్లను ప్రసవించింది. బారాపులా ప్రాంతంలోనున్న నైట్‌షెల్టర్లలో చోటు లభించకపోవడం వల్ల లక్ష్మి, రోజు కూలీ పనిచేసే ఆమె భర్త బబ్లూ, ఇద్దరు పిల్లలు బుధవారం రాత్రి పుట్‌పాత్‌పై నిద్రపోయారు. ఆ రాత్రి ఆమెకు నొప్పులు వచ్చి బిడ్డను అక్కడే ప్రసవించింది. బిడ్డను ప్రసవించిన 18 గంటల తరువాత కూడా తల్లికి, బిడ్డకు మధ్య ఉండే పేగును కత్తిరించలేదని, దాని వల్ల తల్లికి, బిడ్డకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనే ఎన్జీవోకు చెందిన సునీల్‌కుమార్ ఎలీడియా చెప్పారు. నైట్ రెçస్క్యూ టీమ్ అందించిన సమాచారంతో తాము అంబులెన్స్‌ను పిలిచి మహిళను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చించామని ఆయన చెప్పారు. గర్భిణులు, పాలిచ్చే తల్లుల కోసం ఢిల్లీ ప్రభుత్వం రెండు నైట్ షెల్టర్లు నడుపుతోందని అయితే అయితే వాటి వద్ద ఆపదలో, అవసరంలో ఉన్న వారిని ఆదుకునే, రక్షించే యంత్రాంగం లేదని సునీల్‌కుమార్ చెప్పారు. లక్ష్మి, ఆమె భర్త ఏడు సంవత్సరాలుగా ఢిల్లీ రోడ్లపై నివసిస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని జార్ఖండ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. లక్ష్మి, కొత్తగా పుట్టిన ఆమె కూతురు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారని, వారికి సరైన ఆరోగ్య సంరక్షణ లభిస్తోందని సునీల్ కుమార్ చెప్పారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ప్రస్తుతానికి తల్లీ బిడ్డలను షెల్టర్ హోమ్‌కు పంపి తరువాత పాలిచ్చే తల్లుల కోసం నడిపే కేంద్రానికి తరలిస్తామని ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు సభ్యుడు బిపిన్ రాయ్ చెప్పారు. -
నత్త నడక..!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఫుట్‌పాత్‌లు, రహదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. ముఖ్యంగా ఫుట్‌పాత్‌లు సరిగా లేక, ఉన్నవి ఆక్రమణలకు గురవడంతో నగరంలో నడవడమే యాతనగా మారిందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రహదారులు, ఫుట్‌పాత్‌ల పనులపై దృష్టి సారించారు. ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టి దాదాపు నాలుగు నెలల కాలంలో 12 వేల ఆక్రమణలను తొలగించారు. వీటిని తొలగించిన ప్రాంతాల్లో «ధ్వంసమైన ఫుట్‌పాత్‌లను పునరుద్ధరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పీపీఎం (పీరియాడికల్ ప్రివెంటివ్ మెయింటనెన్స్)లో భాగంగా రీకార్పెటింగ్ చేస్తున్న ప్రధాన రహదారుల మార్గాల్లో రోడ్లతోపాటే ఫుట్‌పాత్‌లు కూడా నిర్మించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఆదేశించారు. 900 కి.మీ. ఎప్పటికో? నగరంలోని అన్ని ప్రధానమార్గాల్లో దాదాపు 900 కి.మీ.ల మేర ఫుట్‌పాత్‌లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే ఉన్న ఫుట్‌పాత్‌ల నిర్వహణ సైతం సరిగా లేదు. వీటి నిర్వహణను మెరుగుపరచాల్సిందిగా కమిషనర్ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. పీపీఎంలో భాగంగా రూ.721 కోట్లతో దాదాపు 800 లేన్ కి.మీ.ల మేర రోడ్ల రీకార్పెటింగ్ పనులు చేపట్టారు. వాటితో పాటే ఫుట్‌పాత్‌ల నిర్మాణం పూర్తికావాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు పూర్తయినప్పటికీ, అన్ని ప్రాంతాల్లో కాలేదు. వాటితో సహా మొత్తం 900 కి.మీ.ల మేర ఫుట్‌ఫాత్‌లు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక అధికారులు, సిబ్బంది మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నమవడంతో పాటు ఎన్నికల కోడ్ కారణంగా పనులకు బ్రేక్ వేశారు.కోడ్ ముగియడంతో ఇక యుద్ధప్రాతిపదికన పుట్‌ఫాత్ నిర్మాణాలు పూర్తిచేయాల్సిందిగా కమిషనర్ ఆదేశించారు. నడక దారేదీ..? జీహెచ్ఎంసీ చేపట్టిన కూల్చివేతల స్పెషల్ డ్రైవ్‌కు పలు ప్రశంసలు లభించాయి. ఇప్పటి వరకు దాదాపు 12 వేల ఆక్రమణల్ని తొలగించారు. కానీ ఆమేర నడక సదుపాయం అందుబాటులోకి రాలేదు. తొలగింపు సందర్భంగా ఫుట్‌పాత్‌లు ధ్వంసమైన ప్రాంతాల్లో మరమ్మతులు, కొత్త ఫుట్‌పాత్‌ల నిర్మాణం తదితరమైన వాటికి దాదాపు రూ.88 కోట్లతో 310 కి.మీ.ల మేర ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఈపనుల్ని అక్టోబర్‌లోగా పూర్తిచేయాలని గత ఆగస్టులో నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్..తదితర కారణాలతో పనులు ముందుకు కదల్లేదు. ఈలోపున మళ్లీ పలు ప్రాంతాల్లో తిరిగి ఆక్రమణలు మొదలయ్యాయి. కుత్బుల్లాపూర్ సుచిత్ర రోడ్,సికింద్రాబాద్ మినర్వా కాంప్లెక్స్, పీజీరోడ్ , ప్యారడైజ్ మంజు ధియేటర్, మినర్వా గ్రాండ్ హోటల్ , ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ , అశోక్‌నగర్, తార్నా క, సంతోష్‌నగర్, కంచన్‌బాగ్, మదీనగూడ.. ఇలా ఆక్రమణాలు తొలగించిన చాలా ప్రాంతాల్లో తిరిగి వ్యాపారాలు వెలిశాయి. దీంతో ప్రజలకు నడకదారి అందుబాటులోకి రాలేదు. పాదచారుల మృతి.. ఈ సంవత్సరం ఆరంభం నుంచి ఇప్పటి వరకు నగరంలో దాదాపు 2500 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, వీటిల్లో దాదాపు వందమంది పాదచారులు మృతిచెందారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పుట్‌పాత్‌ల వెడల్పు ఇరుగ్గా ఉంది. ఇవి పాదచారులు నడవడానికి అనుకూలంగా లేవు. మారని రోడ్ల దుస్థితి.. ఫుట్‌పాత్‌ల పరిస్థితి ఇలా ఉండగా..నగరంలోని అనేక ప్రాంతాల్లో నాలుగు చినుకులకే రోడ్లు అధ్వాన్నంగా మారాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల సమస్యలు తీర్చాలంటూ పలువురు నెటిజెన్లు ట్విట్టర్లో కోరారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీ పొంగిపొర్లుతోందని, కొన్ని ప్రాంతాల్లో రోడ్లను తవ్వి తిరిగి వేయలేదని ఫిర్యాదు చేశారు. -
ఖాళీ జాగా.. వేసేయ్ పాగా
సాక్షి, జగిత్యాల: జిల్లా కేంద్రంలో ఖాళీ జాగా కనిపిస్తే కబ్జాదారులు పాగా వేసేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన స్థలాల్లో అక్రమంగా టేలాలు వేస్తూ అద్దెకిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల పట్టింపులేమితో జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఖాళీస్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. పునర్విభజనలో భాగంగా జిగిత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడడం.. గ్రేడ్–1 మున్సిపాలిటీగా అభివృద్ధిలో ముందంజలో ఉంది. ఖాళీస్థలాల గురించి పట్టించుకోకపోవడంతో బల్దియా భారీగా ఆదాయం నష్టపోతోంది. జగిత్యాలలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న ఉద్యానవనం, అగ్నిమాపకశాఖ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఖాళీస్థలాల్లో ఎన్నో టేలాలు వెలిశాయి. టౌన్‌ప్లానింగ్ అధికారులు పట్టించుకోకపోవడంతో వారు ఆడింది ఆటగా నడుస్తుంది. వాస్తవంగా అక్కడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మిస్తే కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. గతంలో అంగడిబజార్ ప్రాంతంలో ఉన్న బల్దియాస్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి.. టెండర్లు వేస్తే ఒక్కో షాపునకు రూ.4లక్షల నుంచి రూ.5 లక్షలు పలికింది. వీటి ద్వారా నెలకు రూ.30 వేలు వరకు అద్దె వస్తుంది. ప్రస్తుతం కూడా పట్టణంలోని ఖాళీస్థలాల్లో ఆక్రమణలను తొలగించి షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మిస్తే బల్దియాకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంగడిబజార్‌లో నిర్మించిన షాపింగ్‌కాంప్లెక్స్‌లో పై అంతస్తు నిర్మిస్తే మరింత ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాగే ఎంపీడీవో కార్యాలయం, టౌన్‌హాల్ సమీపంలోనూ ఆక్రమణలను తొలగించి షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మిస్తే బల్దియాకు అత్యధికంగా ఆదాయం లభించనుంది. ప్రస్తుతం జగిత్యాల మున్సిపల్ ఆస్తిపన్ను రూ.5 కోట్లు ఉంది. వీటిని నిర్మిస్తే మరింత ఆదాయం సమకూరనుంది. అన్ని ఆక్రమణలే..! జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్,పాతబస్టాండ్, తహసీల్‌చౌరస్తా ప్రధాన మార్గాల్లోని రోడ్లలో నిత్యం ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక చిన్న వ్యాపారం పేరిట రేకులషెడ్డు ఏర్పాటు చేసుకొని మున్సిపాలిటీకి ఎంక్రోజ్‌మెంట్ కింద కొద్దిమేర కిస్తులు చెల్లిస్తున్నారు. పాలకవర్గం అధికారులు స్పందించి వీటన్నింటిని తొలగించి పెద్ద ఎత్తున కాంప్లెక్స్‌లు నిర్మించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అంతా బినామీలే.. మున్సిపాలిటీ స్థలాలను కొందరు ఆక్రమించుకొని వాటిలో షెడ్లు వేసి అద్దెకిస్తున్నారు. దాదాపు నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు పొందుతున్నారు. గతంలో స్థలాల్లో ఉన్న వారు రేకులషెడ్లు వేసి వాటిని అద్దెకు ఇచ్చారు. వాణిజ్య వ్యాపారాలు అత్యధికంగా జరిగే స్థలాలు కావడంతో గత్యంతరం లేక వారు చెప్పిన అద్దెను చెల్లిస్తున్నారు. ఇలా బల్దియా ఆదాయానికి గండి కొడుతూ వారు ఇష్టారాజ్యంగా సంపాదిస్తున్నారు. మున్సిపాలిటీ స్థలానికి వీరే యజమానులు వ్యవహరిస్తుండడం గమనార్హం. పాలకవర్గం, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి విలువైన ఖాళీస్థలాల్లో అక్రమంగా వెలసిన షెడ్లను తొలగించి షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని కోరాతున్నారు. నోటీసులు జారీ చేశాం జిల్లా కేంద్రంలోని పలు రోడ్లపై వెలసిన ఆక్రమణ షెడ్ల వారికి నోటీసులు సైతం జారీ చేశాం. మున్సిపల్ దృష్టికి వచ్చింది. త్వరలోనే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం. షాపింగ్కాంప్లెక్స్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించేలా చర్యలు తీసుకుంటాం. – సంపత్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ -
‘అడ్డు’పడ్డారో బుక్కయ్యారే!
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో పాదచారులకు ఉద్దేశించిన ఫుట్‌పాత్‌లపై నడవాలంటే చాలా కష్టం. ఎందుకంటే అసలు ఫుట్‌పాత్‌లనేవి ఉండాలి కదా! గ్రేటర్లో ప్రధాన రోడ్ల వెంబడి ఉన్న కాలిబాటలను వ్యాపారులు, దుకాణదారులు ఆక్రమించుకున్నారు. మరికొందరు తమ ఆస్తి అన్నట్టు చిరు వ్యాపారులకు అద్దెకు కూడా ఇచ్చేస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. పాదచారులతో పాటు వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా ఫుట్‌పాత్‌లను వీధి వ్యాపారాలకు అద్దెకిస్తూ అక్రమార్జన పొందుతున్న వాణిజ్య సముదాయాల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. ప్రధాన రహదారి వెంట ఉన్న వాణిజ్య సముదాయాల ముందున్న ప్రభుత్వ భూమిని, ఫుట్‌పాత్‌ను హాకర్లకు కిరాయికి ఇస్తుండడంటో చాలా ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఐటీ కారిడార్‌లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. దీంతోఇక్కడ ప్రయాణికులు నడిచే దారిలేక నిత్యం నరకం చూస్తున్నారు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై నిత్యం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదులు వస్తుండడంతో చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి గచ్చిబౌలిలోని ఇందిరానగర్‌లో ఫుట్‌పాత్‌లు, రోడ్ల ఆక్రమణలను జేసీబీ యంత్రాలతో శని,ఆదివారాల్లో కూల్చివేశారు. రోజూ అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో భద్రతా చర్యల్లో భాగంగా ఈ కూల్చివేతలు చేపట్టామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. గచ్చిబౌలి జంక్షన్ నుంచి ఐఐటీ కూడలి వరకు ఫుట్‌పాత్‌ల అక్రమణతో రోజూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. దీంతోపాటు వాహన ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. అందుకే ఆక్రమణలను తొలగిస్తున్నామని చెప్పారు. ఇందిరానగర్‌లో చాలా మంది వాణిజ్య సముదాయాల యజమానులు తమ భవనం ముందున్న ఉన్న ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాన్ని వీధి వ్యాపారులకు అద్దెకు ఇస్తున్నారని, దీంతో ఆక్రమణలు మితిమీరాయని గుర్తించామన్నారు. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇతర ప్రాంతాల్లోనూ చర్యలు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏ ప్రాంతంలోనైనా రహదారులు, ఫుట్‌పాత్‌లు అక్రమిస్తే ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. తమ దృష్టికి వచ్చిన వాటితో పాటు స్థానికులు, వాహనచోదకుల నుంచి అందే ఫిర్యాదులతో ఆయా ప్రాంతాల్లో కూల్చివేతలు చేపడతామన్నారు. వాహనదారులతో పాటు పాదచారుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రహదారుల వెంట వీధి వ్యాపారాలు చేసే వారు పద్ధతి మార్చుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ సూచించారు. ఐటీ ప్రాంతంలోనే ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉండడంతో తొలుత ఈ ప్రాంతంపై దృష్టి పెట్టామన్నారు. శంషాబాద్, బాలానగర్ జోన్లలోనూ సాఫీ ట్రాపిక్కు పక్కా వ్యూహంతో ముందుకెళుతున్నామని వివరించారు. -
ఊపిరి ఆగుతున్నా.. ఆదుకోరేమయ్యా?
ఆధునిక సమాజంలో అనాథలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఆకలితో అలమటిస్తూ నిత్యం జీవితంతో పోరాడుతూ బతుకుతున్న దుస్థితి. విధి వారిని కుటుంబం నుంచి దూరం చేసినా.. పట్టుదలతో ఆకలి తీర్చుకుంటున్నారు. చూసే వారు లేక అనారోగ్యంతో పిట్టల్లా రాలిపోతున్నారు అనాథలు. వీరిని ఆదుకుంటామని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం చేతులేత్తిసింది. దీనికి తోడు అధికారుల మనసు కూడా రాకపోవడంతో నిశ్శబ్దంగా తనువు చాలిస్తున్నారు... ప్రకాశం, చీరాల: అనాథల జీవితాలు అర్దాంతరంగా ముగిసిపోతున్నాయి. నా అనే నాథుడే లేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఎండ, వాన...చలికి చితికిపోతున్నారు. రోజు ఏదో ఒక వీధిలో అనారోగ్యంతో తనువు చాలిస్తున్నారు. వారి కోసం ఆదుకునేందుకు మేమున్నాం అంటూ ప్రగల్బాలు పలికి మిన్నకుండి పోయింది. మున్సిపల్ అధికారులు వారిపై మమకారం చూపకపోగా, వారికి కేటాయించిన నిధులను సైతం మింగేశారు. అనాథల కోసం రాత్రి విడిది (షెల్టర్) ఏర్పాటు చేస్తామని మూడేళ్ల క్రితం మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదం చేసి పైపెచ్చు రూ.5 లక్షలు ఖర్చు చేశారు. కానీ ఒక్క అనాథకు కూడా షెల్టర్ ఇవ్వలేదు. మనసు లేని అధికారులు... వారికి ప్రతిరోజు అల్పాహారం, రాత్రికి భోజనం ఏర్పాటు చేసి రాత్రి వసతి కల్పిస్తామంటూ ప్రభుత్వం రెండేళ్ల క్రితం జీవో విడుదల చేసింది. రాష్ట్రంలోని సంగతేమో కానీ చీరాలలో మాత్రం అనాథలను ఆదుకోవడం లేదు. దేవుడు వరమిచ్చినా పూజారి వదడంలేదన్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసినా అమలు చేసేందుకు కింది స్థాయి అధికారులకు మాత్రం మనసు రావడంలేదు. దీంతో అనాథలుగా మారిన ఎంతో మంది మహిళలు, వృద్ధులు ఎండ వేడిమికి చలి గాలులకు వణికిపోతు రైల్వే స్టేషన్, బస్టాండ్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, దుకాణాల అరుగులపై నిద్రిస్తు అల్లాడిపోతున్నారు. పథకం ఉద్దేశం... పట్టణ పేదరిక నిర్మూలన (మెప్మా) సిబ్బంది పట్టణంలో అనాథలు ఎంత మంది ఉన్నారు, వారు ఏఏ పనులు చేస్తుంటారనే విషయాలను సేకరించి అధికారులకు నివేదిస్తారు. ఆ నివేదికల ప్రకారం అధికారులు నిధులు విడుదల చేసి వారికి ప్రతిరోజు అల్పాహారం, రాత్రికి భోజనం అందిండంతో పాటు వారు రాత్రి నిద్రించేందుకు వసతి (షల్టర్) ఏర్పాటు చేయాలి. 2015–16 గాను చీరాలలో 50 మంది అనాథలు మాత్రమేనని అధికారులు లెక్కలు తేల్చారు. ఏ ప్రాంతంలో చూసినా అనాథలు, బిక్షగాళ్లు లెక్కకు మించి తిరుగుతుంటే అధికారులు మాత్రం చీరాలలో కేవలం 50 మంది అనాథలు ఉన్నట్లు లెక్కలు తేల్చడం విస్మయానికి గురి చేస్తోంది. హడావుడిగా రూ. 5 లక్షలు ఖర్చుచేశారు... ప్రభుత్వం జీవో విడుదల చేసిన రెండేళ్లకు చీరాల మున్సిపల్ అధికారులు, పట్టణ పేదరిక నిర్మూలన (మెప్మా) ద్వారా అనాథలకు షెల్టర్ ఏర్పాటు చేసేందుకు హడావుడి చేశారు. నిరుపయోగంగా ఏ మాత్రం నివాసయోగ్యంకాని కూలేందుకు సిద్ధంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ బంగ్లా అనాథల షల్టర్‌కు సిద్ధం చేశారు. పెచ్చులూడుతున్న ఆ భవనానికి రూ. 5 లక్షలతో చిన్నచిన్న మరమ్మతులు చేపట్టి రంగులు వేయించారు. అనాథలైన స్త్రీ, పురుషులను వేర్వేరుగా ఉంచేందుకు గదులను సిద్ధం చేశారు. వంట గది, బాత్ రూమ్‌లు, లెట్రిన్లు కూడా కట్టించారు. తీరా షెల్టర్‌ను ప్రారంభించే నాటికి స్థానికులు అభ్యంతరం చెప్పారు. నివాస ప్రాంతాలలో అనాథలను పెడితే షెల్టర్‌లోకి ఎటువంటి వారు వస్తారో తెలియదు, ఈ ప్రాంతంలోకి దొంగలు, ఇతర నేరగాళ్లు వచ్చే ప్రమాదం ఉందని అడ్డు చెప్పారు. దీంతో అధికారులు షెల్టర్ ప్రారంభోత్సవాన్ని నిలుపుదల చేశారు. రూ. 5 లక్షలతో మరమ్మతులు చేపట్టినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా అయ్యాయి. ప్రస్థుతం ఆ భవనాన్ని మున్సిపాలిటికి చెందిన పాత సామాగ్రిని భద్ర పరిచేందుకు ఉపయోగిస్తున్నారు. -
ఫుట్‌పాత్‌పై ఈనాడుకు నోటీసులు ఇచ్చాం
-
‘ఫుట్‌పాత్‌ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు’
హైదరాబాద్: నగరంలో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు స్పెషల్‌డ్రైవ్ చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు.. ధ్వంసమైన ఫుట్‌పాత్‌ల పునరుద్ధరణతోపాటు ప్రధాన రహదారుల వెంబడి పాదచారులు నడిచేందుకు వీలుగా కొత్త ఫుట్‌పాత్‌లు నిర్మించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శనివారం ఖైరతాబాద్ నుంచి అమీర్‌పేట వరకూ ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. అయితే సోమాజిగూడ ఈనాడు కార్యాలయం వద్దకు వచ్చేసరికి హైడ్రామా నడిచింది. ఈనాడు ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న కాంపౌండ్ వాల్‌ను కూల్చడానికి జీహెచ్ఎంసీ అధికారులు యత్నించారు. అయితే సదరు జీహెచ్ఎంసీ అధికారులను ఈనాడు సిబ్బంది అడ్డుకున్నారు. అదే సమయంలో సాయంత్రం వరకూ తమకు సమయం ఇవ్వాలని కోరారు. ఫుట్‌పాత్‌ను ఆక్రమించి ఈనాడు నిర్మాణాలు చేపట్టిందని జీహెచ్ఎంసీ అధికారి విశ్వజిత్ తెలిపారు. దాదాపు ఆరు అడుగుల మేర ఫుట్‌పాత్‌ను ఈనాడు ఆక్రమించిందన్నారు. కాగా, మాస్టర్ ప్లాన్ పరిశీలన తర్వాత నిర్ణయం తీసుకుంటామని విశ్వజిత్ పేర్కొన్నారు. -
ఫుట్పాత్లన్నీ ప్రజలు నడిచేందుకే !
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు స్పెషల్‌డ్రైవ్ చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు.. ధ్వంసమైన ఫుట్‌పాత్‌ల పునరుద్ధరణతోపాటు ప్రధాన రహదారుల వెంబడి పాదచారులు నడిచేందుకు వీలుగా కొత్త ఫుట్‌పాత్‌లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఇవి పర్యావరణ హితంగా ఉండేందుకు తగిన విధివిధానాలు రూపొందించారు. అర్బన్ రోడ్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టనున్నారు. అన్ని రహదారులకు.. ముఖ్యంగా ప్రధాన మార్గాల్లోని దాదాపు 900 కి.మీ. మేర రహదారుల వెంబడి ప్రజలు నడవడానికి వీలుగా ఫుట్‌పాత్‌లు నిర్మించాలని.. వీటి కనిష్ట వెడల్పు 1.2 మీటర్లకు తగ్గకూడదని, గరిష్టంగా స్థల సదుపాయాన్ని బట్టి ఐదడుగుల వరకు కూడా నిర్మించాలని నిర్ణయించారు. వీటి నిర్మాణానికి దాదాపు రూ.250 కోట్లు ఖర్చు కాగలదని అంచనా. ప్రమాణాలకు అనుగుణంగా.. నిర్ణీత ప్రమాణాల మేరకు రోడ్డు వెడల్పులో పదిశాతానికి తగ్గకుండా ఫుట్‌పాత్ ఉండాలి. రోడ్డుకు ఒక్కోవైపు పదిశాతం వంతున రెండు వైపులా వెరసి 20 శాతం ఫుట్‌పాత్‌లు ఉండాలి. ఉదాహరణకు రోడ్డు వెడల్పు వంద అడుగులుంటే ఒక్కో వైపు పది అడుగుల వంతున ఫుట్‌పాత్‌లుండాలి. కానీ నగరంలోని పరిస్థితుల దృష్ట్యా ఇది సాధ్యం కాదని భావించి, రోడ్డు వెడల్పు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ కనిష్టంగా 1.2 మీటర్లయినా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు.ప్రతి ఫుట్‌పాత్‌కు ప్రీకాస్ట్ కెర్బింగ్ వాడాలని, వర్షం వచ్చినప్పుడు నీరు ఫుట్‌పాత్‌లపై నిల్వకుండా సన్నని రంధ్రాలున్న పేవర్‌బ్లాక్‌లు వినియోగించాలని సంబంధిత ఇంజనీర్లకు సూచించారు. ఇసుక లేదా స్టోన్ డస్ట్పైన పేవర్‌బ్లాక్‌లు అమర్చాలని, కెర్బ్ల కనీస ఎత్తు 300 మి.మీ.లుగా ఉండాలని నిర్ణయించారు. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలకు ఇబ్బంది కలుగకుండా ఫుట్‌పాత్‌లపైకి వెళ్లే ప్రవేశమార్గాల్లో తగిన ర్యాంప్‌లు, ద్విచక్ర వాహనాలు ఫుట్‌పాత్‌లపైకి వెళ్లకుండా నిర్ణీత ప్రదేశాల్లో బొల్లార్డ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఫుట్పాత్లన్నీ ఒకే రూపంలో, చూడటానికి అందంగా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. గ్రే, బ్లాక్, రెడ్ రంగుల్లో ఉండే పేవర్‌బ్లాక్‌లు వినియోగించాలని నిర్ణయించారు. నిర్వహణపై అశ్రద్ధ వద్దు నగరంలో ఇప్పటి వరకు నిర్మించినట్లు తూతూమంత్రంగా కాకుండా, నిర్ణీత ప్రమాణాల మేరకు ఫుట్‌పాత్‌లను నిర్మించడంతో పాటు నిర్వహణ బాధ్యతలు కూడా చూడాల్సిందిగా జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ జియావుద్దీన్ సూపరింటెండింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు సూచించారు. ఫుట్‌పాత్‌లు ప్రజలు సాఫీగా, సజావుగా నడిచేందుకు వీలుగా.. వాటిపై ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా సంబంధిత ప్రాంతాల్లోని ఇంజనీర్లు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇలా అయితే ఎలా..? ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి సంబంధించిన సూచనలైతే బాగానే ఉన్నప్పటికీ.. నగరంలోని ప్రధాన రహదారులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలో లేవు. చాలావరకు హెచ్ఆర్డీసీఎల్ (హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్) పరిధిలో ఉన్నాయి. మెట్రో మార్గాల్లో హెచ్ఎంఆర్ఎల్ పరిధిలో ఉన్నాయి. ఎర్రమంజిల్ వద్ద నిర్మిస్తున్న ఫుట్‌పాత్‌లకు పేవర్బ్లాక్ల కింద ఇసుక, స్టోన్‌డస్ట్ బదులు సిమెంట్ వినియోగిస్తున్నందువల్ల వర్షపు నీరు లోనికి ఇంకకుండా ఫుట్‌పాత్‌లపై నీరు నిలిచే ప్రమాదముందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఇదే అంశాన్ని జీహెచ్ఎంసీ ఇంజనీర్ల వద్ద ప్రస్తావిస్తే.. మెట్రో రైలు మార్గంలో ఉన్న అది తమ పరిధిలోది కాదన్నారు. ఆ పనులతో తమకు సంబంధం లేదని అంటున్నారు. -
ఫుట్‌పాత్ ఆక్రమణల గుర్తింపునకు అధికారి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మహబూబ్‌గంజ్, సిద్ధిఅంబర్ బజార్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని వ్యాపారాలు చేయడంపై వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ఒక అధికారిని నియమించాలని నిర్ణయించింది. ఆ అధికారి నెలపాటు ప్రతిరోజూ ఫుట్‌పాత్ ఆక్రమణ ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన అనంతరం తమకు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. సదరు అధికారిని నియమించాలని హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. విచారణ ఆగస్టు 14కి వాయిదా వేసింది. సిద్ధిఅంబర్ బజార్, మహబూబ్‌గంజ్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించాలని కోరుతూ లక్ష్మీనివాస్ అగర్వాల్ అనే వ్యక్తి ‘పిల్’ దాఖలు చేశారు. దీనిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఫుట్‌పాత్ ఆక్రమణలకు గురికావడానికి వీల్లేదని, ఇలాంటి చర్యల్ని సహించేది లేదని తేల్చి చెప్పింది. కాలి నడకన వెళ్లే వారి కోసం ఉద్దేశించిన ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే వారు ఎక్కడ నడవాలని ప్రశ్నించింది. ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేసుకోవడం వల్ల బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఆక్రమణలపై కొరడా
-
ఫుట్‌పాత్‌ల అక్రమణలపై జీహెస్ఎమ్సీ కొరడా
-
కోర్టుకొస్తే కొడతారా?
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర రాజధానిలోని మహబూబ్‌గంజ్, సిద్దిఅంబర్ బజార్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తొలగించాలని పిల్ దాఖలు చేసిన పిటిషనర్‌పై దాడి చేస్తారా? ఇందుకు అఫ్జల్‌గంజ్ పోలీసులు వ్యక్తిగత బాధ్యత వహించాలి. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించకపోగా, కోర్టుకు వచ్చిన వారికి కూడా రక్షణ కల్పించలేరా?’అని పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుట్‌పాత్‌లు ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్న వారు తనపై దాడి చేశారని పిటిషనర్ లక్ష్మీ నివాస్ అగర్వాల్ హైకోర్టు దృష్టికి తీసుకురావడంతో దాడి చేసిన వారిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్‌కు రక్షణ కల్పించకుండా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఇందుకు అఫ్జల్‌గంజ్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) వ్యక్తిగతంగా బాధ్యులవుతారని పేర్కొంది. దాడి ఘటనపై అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై బుధవారం విచారణ జరుపుతామని వెల్లడించింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దాడికి బాధ్యులైన వారిని ఉపేక్షించబోమని హెచ్చరించింది. కాగా, హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై రిటైర్డ్ ప్రొఫెసర్ బీఆర్ శాంత రాసిన లేఖను కూడా పిల్‌గా పరిగణించిన హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఫుట్‌పాత్‌ల ఆక్రమణల వల్లే జనమంతా రోడ్లపై నడవాల్సిన దుస్థితి ఏర్పడిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, పట్టణ ప్రణాళిక శాఖ డైరెక్టర్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. -
రంగంలోకి కోర్టు అధికారి..
సాక్షి, హైదరాబాద్: ఫుట్‌పాత్‌లపై వెలుస్తున్న ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో తమ అధికారులనే హైకోర్టు రంగంలోకి దిగింది. హైదరాబాద్ సిద్ది అంబర్‌బజార్, మహబూబ్గంజ్లలో ఆక్రమణల పరిశీలనకు న్యాయాధికారిని నియమించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ఎంఎస్‌జే)ను ఆదేశించింది. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని న్యాయాధికారికి స్పష్టం చేసింది. న్యాయాధికారికి అన్ని రకాల సహాయ, సహకారాలు అందించాలని పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావుల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిఅంబర్ బజార్లో ఫుట్‌పాత్‌లు, రోడ్ల ఆక్రమణలు జరుగుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ హైకోర్టులో లక్ష్మీనివాస్ అగర్వాల్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం.. మంగళవారం మరో సారి విచారించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేశామని, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను కమిటీ తొలగించిందని తెలిపారు. కంటితుడుపుగా వ్యవహరిస్తున్నారు...: పిటిషనర్ అధికారులు కంటితుడుపుగా వ్యవహరిస్తున్నారని, ఆక్రమణలు అలాగే కొనసాగుతున్నాయని పిటిషనర్ లక్ష్మీనివాస్ కోర్టుకు ఫోటోలు చూపించారు. ఆక్రమణలు చేయబోమని కోర్టుకు హామీ ఇచ్చి న షాపుల యాజమానులు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారని నివేదించారు. కొంత మంది దుకాణదారులు, స్థానిక పోలీసులు ప్రత్యక్షంగా, పరోక్షంగా తనను బెదిరిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకున్న 4 షాపుల యజమానులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలని అధికారులను ఆదేశించింది. -
ఫుట్‌పాత్‌లపై మెట్లు, ర్యాంపులా?
సాక్షి, హైదరాబాద్: ఫుట్‌పాత్‌లపై పుట్టగొడుగుల్లా ఆక్రమణలు వెలుస్తున్నా వాటిని తొలగించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ జీహెచ్ఎంసీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు వ్యాపారులు ఫుట్‌పాత్‌లపై మెట్లు, ర్యాంపులు నిర్మించుకుంటున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది. ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల వల్ల పాదచారులు గత్యంతరం లేక రోడ్లపై నడుస్తున్నారని, ఇకనైనా ఆక్రమణల తొలగింపు విషయంలో కఠిన చర్యలు ప్రారంభించి పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి. శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్ది అంబర్ బజార్లో ఫుట్‌పాత్‌లు, రోడ్ల ఆక్రమణలు జరుగుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ లక్ష్మీనివాస్ అగర్వాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలిచ్చింది. ఆక్రమణదారుల పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ కమిషనర్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను జనవరి 23కి వాయిదా వేసింది. -
గ్యాస్ సిలిండర్ల తనిఖీ లేదేం?
సాక్షి, హైదరాబాద్: వాహనాల్లో అమర్చిన గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉన్నా, ఆ పని చేయకపోవడంపై ఉమ్మడి హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రవాణా శాఖ కమిషనర్, డీజీపీ, కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి, హెచ్‌పీసీఎల్ తదితరులను ఆదేశించింది. దీనిలో భాగంగా వారికి నోటీసులు జారీ చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వాహనాల్లో గ్యాస్ సిలిండర్లను తనిఖీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ వినియోగదారుల హక్కుల సంఘం గ్రేటర్ అధ్యక్షుడు హరిబాబు హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. పార్కులపై కౌంటర్ దాఖలు చేయండి: జంట నగరాలతో పాటు తెలంగాణలో పార్కులకోసం స్థలం కేటాయింపు, వాటి నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పార్కులకు తగినంత స్థలం లేకపోవడం వల్ల హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయిందని, ఈ విషయంలో ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ సీనియర్ న్యాయవాది కె.ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆక్రమణలకు అడ్డాలుగా ఫుట్‌పాత్‌లు జంట నగరాల్లోని ఫుట్పాత్లన్నీ ఆక్రమణలకు అడ్డాలుగా మారాయని, దీంతో పాదచారులు విధిలేని పరిస్థితుల్లో రోడ్లపై నడవాల్సి వస్తోందని ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని మండిపడింది. హైదరాబాద్, సిద్ది అంబర్బజార్లలో ఫుట్‌పాత్ వ్యాపారులు చట్టానికంటే తామే అధికులమని భావిస్తున్నారని.. అందుకే కోర్టుకిచ్చిన హామీని ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారో తెలపాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది. ఇందుకు స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని కమిషనర్‌కు స్పష్టం చేసింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌ల ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘సోలార్’ కంపెనీలకు భూములు కట్టబెట్టొద్దు మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో ప్రైవేట్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల్ని రిజిస్ట్రేషన్ చేశారనే ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. దేవాదాయ, సర్వీస్ ఇనాం, అసైన్డ్ భూములే కాకుండా వెట్టి నుంచి విముక్తి కల్పించిన కార్మికులకు ఇచ్చిన భూముల్ని కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పాలమూరు వలస కూలీల సంఘం హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ప్రైవేట్ సోలార్ పవర్ ప్రాజెక్టుల పేరిట రిజిస్ట్రేషన్ జరగకుండా చూడాలని అధికారులను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వ, పేదల భూములు పరులపరం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి, రెండు జిల్లాల కలెక్టర్లకు నోటీసులిచ్చింది. -
ఫుట్‌పాత్ ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్
– పగటిపూట నగరంలోకి భారీ వాహనాల నిషేధం – నగర పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్ష కర్నూలు : కర్నూలు నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ఫుట్‌పాత్ ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. నగరంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపుల ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకున్న వ్యాపారుల దుకాణాలను మున్సిపల్ అధికారుల సహకారంతో తొలగించేందుకు కార్యాచరణ రూపొందించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఎస్పీ గోపీనాథ్ జట్టి నగర పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో డీఎస్పీలు రమణమూర్తి, వినోద్‌కుమార్, ట్రాఫిక్ సీఐ దివాకర్‌రెడ్డి, ఎస్ఐ తిమ్మారెడ్డి, ఆర్ఎస్ఐ జయప్రకాష్‌లతో సమావేశం నిర్వహించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రధాన జంక్షన్లలో రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్ ఏర్పాటు, ఫ్రీ లెఫ్ట్, ఫ్రీ రైట్ (కుడి, ఎడమ మలుపులు) డివైడర్స్‌ను రీ డిజైనింగ్ చేయించాలని నిర్ణయించారు. పగటి పూట నగరంలోకి భారీ వాహనాలు ప్రవేశించకుండా నిషేధం అమలు చేయనున్నారు. బారీకేడ్లు, రోడ్ సిగ్నల్స్, డైరెక్షన్ బోర్డులు, నో పార్కింగ్ బోర్డులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయించాలని ట్రాఫిక్ పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. డ్రైవింగ్ లైసెన్ లేకుండా వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. ఎక్కడ పడితే అక్కడ పార్కింగే చేసే వాహనదారులకు జరిమానా విధించాలని సూచించారు. -
‘రోడ్డు మీద నడవడం పౌరుల హక్కు’
న్యూఢిల్లీ: పట్టణాల్లో, ముఖ్యంగా నగరాల్లో రోడ్డుమీద నడవాలంటే, రోడ్డు దాటాలంటే పాదాచారులకు ఎంతో కష్టమో మనందరికి నిత్యానుభవమే. ఒకప్పుడు పట్టణాల్లో, ముఖ్యంగా నగరాల్లో రోడ్ల మీద నడవాలంటే రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లు లేదా సైడ్‌వాక్‌లు ఎక్కువగా ఉండేవి. ఇక రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాసింగ్‌లు, వాటివద్ద పాదాచారులకు సిగ్నల్ క్రాసింగ్‌లు ఉండేవి. వాహనాల రద్దీ పెరగడంతో రోడ్ల విస్తరణ పేరిట ఫుట్‌పాత్‌లు, జీబ్రా క్రాసింగ్‌లు కనుమరుగవుతూ వచ్చాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా పాదాచారులకు ప్రత్యేకదారులు, జీబ్రా క్రాసింగ్‌లు 30శాతానికి మించి లేవు. కొన్నిచోట్ల ప్లైఒవర్ వంతెనలు వచ్చినా అవి అన్ని చోట్ల అందుబాటులో లేవు. ఉన్నా వయోవద్ధులకు అవి ఉపయోగపడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో పట్టణ ప్రాంతాల్లో రోడ్డు దాటడం ప్రమాదకరమేనని ప్రతి పది మంది పాదాచారుల్లో తొమ్మిది మంది ఓ జాతీయ సర్వేలో అభిప్రాయపడ్డారు. రోడ్డు మీద నడిచే హక్కు, రోడ్డు దాటే హక్కు పాదాచారులకు లేదా? రోడ్లపై వాహనాలను నడిపే హక్కు వాహనదారులకే ఉందా? వచ్చిపోయే వాహనాలను చూసుకొని భద్రంగా దాటాల్సిన బాధ్యత పాదాచారులదేనా? వారు భద్రంగా రోడ్డు దాటేలా దారి ఇవ్వాల్సిన బాధ్యత వాహనదారులది కాదా? అయినప్పటికీ రోడ్డు ప్రమాదం జరిగితే అందుకు ఎవరు బాధ్యులవుతారు? అన్న ప్రశ్నలు తలెత్తడం కూడా సహజం. ఈ విషయం స్పష్టం చేయడానికి సరైన కేంద్ర చట్టాలు లేవుగానీ, రోడ్డు మీద నడవడం పాదాచారుడి హక్కని, ఆ హక్కుకు భంగం కలిగించకపోవడమే కాకుండా పాదాచారుడికి దారివ్వాల్సిన బాధ్యత కూడా వాహనదారులదేనని పలు కోర్టు తీర్పులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో పాదాచారుడు గాయపడితే అందుకు బాధ్యత వహించాల్సింది కూడా వాహనదారుడే. వీటిని పట్టించుకోకుండా వాహనదారులు, రోడ్డు మీద వెళ్లే హక్కు తమదేనన్నట్లుగా దూసుకుపోతుంటారు. కొన్ని చోట్ల ఫుట్‌పాత్‌ల మీదుగా కూడా వాహనాలు వెళుతుంటాయి. పాదాచారులు రోడ్డు దాటేందుకు చేతులుచాచి ఆపినాగానీ వాహనదారులు ఆగని సందర్భాలు మన దేశంలో అనేకం. అందుకే దేశంలో ప్రతి ఏడాది సంభవిస్తున్న ప్రమాదాల్లో 400 మంది మరణిస్తుంటే వారిలో 20 మంది పాదాచారులే ఉంటున్నారన్నది ప్రభుత్వ అధికారుల లెక్క. కానీ వాస్తవానికి పాదాచారుల మతుల సంఖ్య అనధికారికంగా రెండింతలు ఉంటోంది. ‘రోడ్లపై నడిచే హక్కు దేశంలోని ప్రతి పౌరుడికి ఉంది. అది పౌరుడి సొంత రిస్క్ అని భావించడం తప్పు. పాదాచారుల భద్రతను దష్టిలో పెట్టుకొని వాహనాలను నడపడం వాహనదారుల బాధ్యత’ అంటూ హైకోర్టులు గతంలోనే తీర్పులను ఇచ్చాయి. ఈ విషయంలో సరైనా చట్టాలు చేయాలంటూ వివిధ ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగా, ఆ బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించి కేంద్రం చేతులు దులుపుకుంది. ఈ విషయమై ఇటీవల ఓ ట్రాఫిక్ అడ్వైజర్ పంజాబ్, హర్యానా కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. రోడ్డు మీద నడిచే హక్కును పౌరుడి ప్రాథమిక హక్కుగా గుర్తించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై తీర్పు వెలువడితే పాదాచారుల కష్టాలు తీరవచ్చు. -
ఫుట్‌పాత్ షాప్‌ను ఢీకొట్టిన బస్సు.. యువకుడు మృతి
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆర్టీసీ బస్సు ఫుట్‌పాత్ షాప్‌ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం పశ్చిమ ఢిల్లీలోని నంగోలయ్లో చోటు చేసుకుంది. నంగోలయ్- లజ్‌పత్ నగర్ రూట్లో నడిచే ఢిల్లీ రోడ్ రవాణసంస్థ బస్సు వేగంగా వెళ్లి ఫుట్‌పాత్ పై ఉన్న షాపును ఢీకొట్టింది. దీంతో రాజు (25) అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులని సమీప ఆసుపత్రికి తరలించామని, వీరు శంకర్ (30), రాకేశ్(26), మిథున్(33)లని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నామని, డ్రైవర్, కండక్టర్లను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. -
ఫుట్‌పాత్‌పై ప్రసవ వేదన
అక్కడే ఆడ శిశువుకు జన్మనిచ్చిన మహిళ హైదరాబాద్: అర్ధరాత్రి వేళ బంధువుల ఇంటికి వెళ్లేందుకు వచ్చిన ఓ నిండుచూలాలికి పురిటి నొప్పులు వచ్చాయి. స్థానికులు 108కి సమా చారమందించారు. అనంతరం ఆమె పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు సమీపంలో నివాసం ఉండే జ్యోతి(24) నల్లకుంటలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు శుక్రవారం రాత్రి బయలుదేరింది. రాత్రి 11.10కి నల్లకుంట చేరుకోగానే.. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో చౌరస్తా సమీపంలోని ఓ స్వీట్ షాప్ వద్ద ఫుట్‌పాత్‌పై కూలబడిపోయింది. నొప్పులతో ఇబ్బందిపడుతున్న ఆమెను చూసిన ఇద్దరు యువకులు పోలీసులు, 108కి సమాచారమందించారు. 108 సిబ్బంది, రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు మహిళల సహకారంతో జ్యోతి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
ఆక్రమణదారులపై ‘ధిక్కార’ చర్యలు
106 షాపుల యజమానులకు కోర్టు ధిక్కార నోటీసులు సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సిద్దిఅంబర్బ జార్లో ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించబోమంటూ హామీ ఇచ్చి, దానిని ఉల్లంఘించిన 106 షాపుల యజమానులపై ఉమ్మడి హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. హామీని ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరించాలంటూ వారందరికీ మంగళవారం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. సిద్దిఅంబర్‌బజార్‌లో ఫుట్‌పాత్‌లు, రోడ్ల ఆక్రమణలు జరుగుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ లక్ష్మీనివాస్ అగర్వాల్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ క్రమంలో సిద్దిఅంబర్‌బజార్‌లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలకు పాల్పడుతున్న 106 షాపులను ధర్మాసనం ఇటీవల జప్తు చేయించింది. దీంతో ఆ షాపుల యజమానులు ఇకపై ఆక్రమణలకు పాల్పడబోమం టూ రాతపూర్వక హామీలివ్వడంతో, జప్తు చేసిన షాపులను తెరవాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ ఆక్రమణలు మళ్లీ మొదలు కావడంతో వారిపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలకు ధర్మాసనం ఉపక్రమించింది. -
మళ్లీ ఫుట్‌పాత్‌లను ఆక్రమించం
హైకోర్టుకు 106 షాపుల యజమానుల హామీ సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సిద్ది అంబర్ బజార్లో మళ్లీ ఫుట్‌పాత్‌లను ఆక్రమించమని 106 షాపుల యజమానులు హైకోర్టుకు హామీ ఇచ్చారు. వాటిని రికార్డ్ చేసుకున్న హైకోర్టు, సీజ్ చేసిన షాపులను తెరవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. కోర్టుకిచ్చిన హామీకి విరుద్ధంగా మళ్లీ ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే తిరిగి షాపులను సీజ్ చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, సిద్ది అంబర్ బజార్, మహబూబ్‌గంజ్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపునకు జీహెచ్ఎంసీ అధికారులు చర్య లు తీసుకోవడం లేదంటూ లక్ష్మినివా స్ అగర్వాల్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ వేసిన సంగతి విదితమే. ఈ వ్యాజ్యం విచారణ సమయంలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించమంటూ వ్యాపా రులు గతంలో కోర్టుకు హామీ ఇచ్చి ఉల్లంఘించడంతో వాటిని సీజ్ చేయాలని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం అప్పట్లో జీహెచ్ఎంసీని ఆదేశించింది. దీంతో షాపుల యజమానులు తిరిగి హైకోర్టును ఆశ్రరుుంచారు. -
ఫుట్‌పాత్ ఆక్రమణదారులపై హైకోర్టు కన్నెర్ర
సిద్ధిఅంబర్ బజార్లో 106 షాపులను 3 రోజుల్లో సీజ్ చేయాలని గ్రేటర్ అధికారులకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సిద్ధిఅంబర్ బజార్లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించబోమంటూ హామీ ఇచ్చి ఉల్లంఘించిన షాపు యజమానులపై హైకోర్టు కన్నెరజ్రేసింది. హామీని ఉల్లంఘించిన 106 షాపులను తక్షణమే మూసేసి సీల్ వేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. ఇందుకు అవసరమైతే పోలీసుల సాయాన్ని కూడా తీసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఆదేశాల అమలు నివేదికను తమ ముందుంచాలని పేర్కొంది. తదుపరి విచారణను రెండు వారాలకు వారుుదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని సిద్ధిఅంబర్ బజార్, మహబూబ్‌గంజ్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపునకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ లక్ష్మినివాస్ అగర్వాల్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డి స్పందిస్తూ ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకున్న వారి వివరాలతో నివేదికను కోర్టు ముందుంచారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించబోమంటూ గతంలో 153 మంది షాపుల యజమానులు హామీ ఇచ్చారని, అందులో 106 మంది ఆ హామీని ఉల్లంఘించారని తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం...కోర్టుకిచ్చిన హామీని ఉల్లంఘించడం కోర్టు ధిక్కారమే అవుతుందని స్పష్టం చేసింది. మరోసారి ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చునని షాపు యజమానులే చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. హామీని ఉల్లంఘించిన 106 షాపులకు తక్షణమే సీల్ వేయాలని, ఈ ప్రక్రియను మూడు వారాల్లో పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ధర్మాసనం ఆదేశించింది. -
'రహస్యంగా పెళ్లి చేసుకోవాలని ఉంది'
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి డకోటా జాన్సన్ తన తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ బాటలో నడవాలనుకుంటుంది. వారిలాగే ఆమె కూడా రహస్యంగా వివాహం చేసుకోవాలనుకుంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాము దాదాపు 18 నెలలపాటు కలుసుకున్న తర్వాత ఎవరికీ తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నామని డకోటా తాతబామ్మలు టిప్పీ, పీటర్ గ్రిఫిత్ తెలిపారు. అలాగే చేసుకున్నామని డకోటా తల్లిదండ్రులు మిలానీ గ్రిఫిత్, డోన్ జాన్సన్ కూడా రహస్యంగా వివాహం చేసుకొని వచ్చి తమను ఆశ్యర్యంలో ముంచెత్తారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాను కూడా తన వాళ్ల సాంప్రదాయాన్నే కొనసాగిస్తానని డకోటా జాన్సన్ చెప్పింది. ఒక వేళ తొలి ప్రయత్నంలో తాను అనుకుంది జరగకుంటే మరోసారి కూడా అలాంటి ప్రయత్నమే చేస్తానని డకోటా తెలిపింది. -
ఫుట్‌పాత్‌పైకి దూసుకువచ్చిన కారు
యాచకుడు దుర్మరణం.. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ పట్టివేత నాయుడుపేటటౌ¯న్: ఫుట్‌పాత్‌పైకి ఒక్కసారిగా బొలేరో కారు దూసుకు రావడంతో గుర్తుతెలియని యాచకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు వివరాల మేరకు.. స్థానిక వినాయకుడి గుడి పక్కన రోడ్డు ఫుట్‌పాత్‌పై ఓయాకుడు కూర్చుని ఉన్నాడు. నాయుడుపేట వైపు నుంచి ఓ బొలేరో కారు అతివేగంగా వస్తూ ఒక్కసారిగా గుడి పక్కనే ఉన్న ఫుట్‌పాత్ పైకి దూసుకువచ్చింది. దాంతో అక్కడ కూర్చుని ఉన్న సుమారు 50 సంవత్సరాలకు పైగా వయస్సు ఓ యాచకుడు మృత్యువాతపడ్డాడు. బొలేరో కారు సిని ఫకీలో పైకి లేపి కూర్చుని ఉన్న వ్యక్తిపైకి నడపడంతో స్థానికులు గుర్తించి సంఘటన స్థలం వద్దకు పరిగెత్తారు. అప్పటికే కారు నడుపుతున్న డ్రైవర్ అక్కడి నుంచి పరారైయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకున్నారు. అయితే ఆ వ్యక్తి మద్యం మత్తులో తూగుతుండడాన్ని గుర్తించారు. బొలేరో వాహనం ఎంపీ షుగర్ ఫ్యాక్టరీకి చెందిన వాహనంగా గుర్తించారు. డ్రైవర్ పట్టణానికి చెందిన మాబాషాగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తే అరెస్టే
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు పెరగడానికి ఆక్రమణలు కూడా ప్రధాన కారణం. వ్యాపారులు ఫుట్పాత్ల్ని ఆక్రమించడంతో పాదచారులకు రహదారులే ఆధారమవుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడటమే కాదు... కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ పరిణామలను దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఫుట్‌పాత్‌లను ఆక్రమించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలా అలా ముందుకొస్తూ... ఈ ఆక్రమణదారుల వ్యవహారం నానాటికీ తలనొప్పిగా మారుతోందని ట్రాఫిక్ విభాగం అధికారులు చెప్తున్నారు. ఓ దుకాణదారుడు తొలుత తన దుకాణం ముందు ఉన్న ఫుట్‌పాత్‌పై కన్నేస్తున్నాడు. కొన్ని రోజుల పాటు దుకాణం తెరిచినప్పుడు అక్కడ సామాను పెట్టి, మూసేప్పుడు తిరిగి తీసేయడంతో ఆక్రమణ మొదలవుతోంది. కొన్నాళ్లకు ఆయా ఫుట్‌పాత్‌లపై నిర్మాణాలు చేపట్టి రహదారిని కూడా ఆక్రమిస్తున్నారు. ఇలా నానాటికీ కుంచించుకుపోతున్న ఫుట్‌పాత్‌లు, రహదారులు సామాన్యులకు అనేక ఇబ్బందులు కలిగించడంతో పాటు నరకం చూపిస్తున్నాయి. ఒకప్పుడు జరిమానా మాత్రమే... ఫుట్‌పాత్, రోడ్డు ఆక్రమణలపై ఒకప్పుడు కఠిన చర్యలు తీసుకునే ఆస్కారం ఉండేదికాదు. వీరిపై కేవలం సిటీ పోలీసు (సీపీ) యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానాతో సరిపెట్టేవారు. దీంతో ఈ ఆక్రమణదారులపై ఎలాంటి ప్రభావం ఉండేది కాదు. ట్రాఫిక్ పోలీసులు వచ్చినప్పుడల్లా జరిమానాలు కట్టేస్తూ తమ పంథా కొనసాగించేవారు. ఫలితంగా సమస్య తీరకపోవడంతో పాటు ఆక్రమణదారుల సంఖ్య నానాటికీ పెరిగేది. ఏళ్లుగా కొనసాగుతున్న జరిమానా విధానంలోని లోపాలను గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. క్రిమినల్ కేసులతో కోర్టుకు... నగరంలో ఈ తరహా ఆక్రమణలకు పాల్పడుతున్న వ్యాపారులపై క్రిమినల్ కేసుల నమోదు ప్రక్రియ ప్రారంభించారు. దీనికోసం ‘మొబైల్ ఈ–టికెట్’ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించి ట్రాఫిక్ పోలీసులు వినియోగిస్తున్న ట్యాబ్‌్సలో పొందుపరిచారు. దీని ఆధారంగా ఆక్రమణదారులపై సాంకేతికంగా కేసులు నమోదు చేసే ఆస్కారం ఏర్పడింది. ఈ యాప్‌లో టిన్ నెంబర్, దుకాణం, యజమాని వివరాలతో పాటు ఆక్రమణ ఫొటో సైతం తీసుకునే ఆస్కారం ఉంది. ఇది జీపీఎస్ ఆధారితంగా పని చేయడంతో న్యాయస్థానంలో బలమైన సాక్ష్యంగా పనికి వస్తోంది. వీటి ఆధారంగా ఆక్రమణదారులను న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. రెండుసార్లు అవకాశం ఇచ్చాకే: ‘సిటీలో ఫుట్‌పాత్‌లు, రహదారుల్ని ఆక్రమిస్తున్న దుకాణదారులకు రెండు అవకాశాలు ఇస్తున్నాం. తొలుత రెండుసార్లు కేవలం జరిమానా, కౌన్సెలింగ్‌తో సరిపెడుతున్నాం. మూడోసారి కూడా పునరావృతమైతే క్రిమినల్ కేసు నమోదు చేసి అభియోగపత్రాలతో సహా కోర్టుకు తరలిస్తున్నాం. ఇప్పటికే కొందరికి జైలు శిక్ష కూడా పడింది. ఈ వివరాల ఆధారంగా జీహెచ్ఎంసీ అధికారులకూ లేఖ రాసి వారి ట్రేడ్ లైసెన్సు రద్దుకు సిఫార్సు చేస్తున్నాం.’ – జితేందర్, నగర ట్రాఫిక్ చీఫ్ -
సామాన్యుడి బజార్
-
ఫుట్‌పాత్‌పై పురుడుపోసిన ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్ : మిట్టమధ్యహ్నం భానుడు నడినెత్తిన నిప్పులు కురిపిస్తుండగా ఓ నిండు చూలాలు భర్తతో కలిసి రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతోంది. అంతలోనే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. ఒక్క అడుగూ ముందుకు నడవలేకపోయింది. బాధను బిగబడుతూ ఉన్నచోటనే కూలబడింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఆ మహిళ దగ్గరికి వచ్చారు. ఆసుపత్రికి తీసుకెళ్లే టైమ్ లేదు. చుట్టుపక్కనవాళ్లనడిగి చీరలు తెప్పించి ఫుట్ పాత్ చూట్టూ చీరలు అడ్డంగా కట్టి, మహిళా కానిస్టేబుళ్లే పురుడుపోశారు. పుట్టిన పండంటి మగబిడ్డను పొత్తిళ్లలోకి తీసుకుని, అప్పటికప్పుడు తెప్పించిన వస్త్రాల్లో చుట్టి పడుకోబెట్టారు. అనంతరం బాబును, తల్లిని ఆంబులెన్స్ లో కోఠిలోని ప్రసూతి వైద్యశాలకు తరలించారు. హైదరాబాద్ లోని నారాయణగూడా శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న ఫుట్ పాత్ పై మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుందీ సంఘటన. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. వారి వివరాలు తెలియాల్సిఉంది. -
‘5 నెలల్లో చార్మినార్ ఫుట్‌పాత్ ప్రాజెక్టు’
హైదరాబాద్: చార్మినార్ పాదచారుల ప్రాజెక్టును వచ్చే ఐదు నెలల్లోపు పూర్తి చేయనున్నట్టు పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. ఆ ప్రాంతంలో త్వరలో బ్యాటరీ వాహనాలు, బ్యాటరీతో నడిచే బస్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టును 1993లో మొదలు పెట్టినా ఇప్పటికీ పూర్తి కాలేదంటూ గురువారం ఉదయం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మజ్లిస్ సభ్యులు అక్బరుద్దీన్, ముంతాజ్‌ఖాన్, పాషాఖాద్రి ప్రశ్నించారు. దీనికి మంత్రి స్పందిస్తూ... 1993లో పథకానికి రూపకల్పన జరిగినా పనులు మొదలైంది మాత్రం 2007 లోనే అని పేర్కొన్నారు. పనుల్లో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. గుల్జార్‌హౌస్‌లో 50 శాతం పనులు పూర్తయ్యాయని, లాడ్‌బజార్‌లో ప్రత్యామ్నాయంగా లూప్ రోడ్స్ వేస్తామని పేర్కొన్నారు. చార్మినార్ వద్ద వెంటనే తాత్కాలిక టాయిలెట్ ఏర్పాటు చేస్తామని, పత్తర్ ఘట్టి కమాన్లను శుభ్రం చేసేందుకు రూ.50 లక్షలు, దుకాణాలకు ఒకే రకమైన బోర్డుల ఏర్పాటుకు రూ. 25 లక్షలు ఖర్చయ్యాయన్నారు. -
ఎవరో ఈ అవ్వ..!
బంజారాహిల్స్: ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలు ఎవ రో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు... గత పది రోజు లుగా ఫిలింనగర్‌లోని ఫిలించాంబర్ ఎదుట ఫుట్‌పాత్‌పై ఉంటున్న ఆమెకు స్థానికులు ఆహారం అందిస్తున్నారు. అయి తే నానాటికి ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అంగన్వాడీ కార్యకర్త పుష్పలత ఆమెను యూసుఫ్‌గూడలోని స్టేట్‌హోంకు తరలించారు. ఈ వృద్ధురాలిని వివరాలకోసం ఆరా తీయగా తన పేరు ఎల్లమ్మ అని, తాను నిజామాబాద్‌కు చెందిన దానినని తనకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు చెప్పింది. పదిరోజుల క్రితం తన కొడుకే ఇక్కడ వదిలేసి వెళ్లాడని తెలిపింది. వారికి భారమయ్యావని వదిలించుకున్నారా అంటే..అలాంటిదేమీ లేదని తన కొడుకులు మంచి వారని చెప్పుకొచ్చింది. తిరిగి నిజామాబాద్ వెళ్తావా అని అధికారులు ప్రశ్నించగా తన కొడుకులే కష్టపడి ఇంత తింటున్నారు. వారికి భారం కాదల్చుకోలేదని పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో దిగమింగుకుంటూ చెప్పింది. పదిరోజులుగా ఆమె ఆలనాపాలన చూస్తున్న ఫుట్‌పాత్ వ్యాపారులు అధికారులు ఆమెను స్టేట్‌హోంకు తరలిస్తుండగా కంటనీరు పెట్టుకున్నా రు. ఆమె కూడా వారిని విడిచి వెళ్లలేక ఏడుస్తూ కూర్చోవడంతో ఉద్విగ్నవాతావరణం చోటు చేసుకుంది. -
నడిచే హక్కుకోసం పోరు..
మెహదీపట్నం సమీపంలోని కరోల్‌బాగ్ కాలనీవాసి కాంతిమతి కన్నన్. పాదచారుల సమస్యలపై కొన్నేళ్లుగా తన గళాన్ని వినిపిస్తున్నారు. ‘ఈ నగరంలో రోజుకి ఒక పాదచారి యాక్సిడెంట్లో చనిపోతున్నారని మీకు తెలుసా?’ అంటూ ప్రశ్నిస్తారామె. పాదచారుల హక్కుల పట్ల పాలకులు, ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నంత కాలం ఈ తరహా సంఘటనలు పెరుగుతూనే ఉంటాయన్నారు. జనాభాలో 70 శాతం మంది ఇప్పటికీ సొంత వాహన సౌకర్యం లేనివారే. మరి వీరంతా నడవడానికి సరైన దారేది? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెదికే ప్రయత్నం చేస్తున్నారు. నగర రోడ్లను సర్వే చేశారు. పేరుకి రాష్ట్ర రాజధాని నగరమే అయినా హైదరాబాద్‌లో ఎక్కడా పాదాచారులకు మార్గమే లేదని, అరకొరగా ఉన్న ఫుట్‌పాత్‌లు అక్రమ పార్కింగ్లు, చెత్తకుండీలు, చిరు వ్యాపారాలు, చిన్న చిన్న గుళ్లు, మందిరాలతో నిండిపోయాయని గుర్తించారు. వీటన్నింటినీ ఫొటోలు, వీడియోలు తీశారు. వీటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తన పరిధిలో తోచిన పరిష్కార మార్గాలు కూడా సూచించారు. చేస్తున్న ఉద్యోగాన్ని, వేలల్లో నెలవారీ జీతాన్ని వదిలేశారు. ‘రైట్ 2 వాక్ ఫౌండేషన్’ను సంస్థను ప్రారంభించారు. పూర్తి సమయాన్ని పాదచారుల హక్కులు, ఫుట్‌పాత్‌ల పరిరక్షణకు ఉద్యమించారు. పాదచారుల సమస్యలపై హైకోర్టులో పిల్ వేశారు. సీఎన్ఎన్, ఐబీఎన్ చానెల్లో సిటిజన్ రిపోర్టర్‌గా చేసి సమస్య తీవ్రతను వెలుగులోకి తెచ్చారు. 20 వేల మంది పాదచారుల నుంచి ఉద్యమానికి మద్దతుగా సంతకాలు సేకరించారు. ‘చాలా మంది ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు ఈ సమస్యపై స్పందించారు. కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించారు. అయితే ఇంకా చాలా జరగాలి. పాదచారుల హక్కులపై ప్రతి ఒక్కరిలో చైతన్యం పెరగాలి. పూర్తిస్థాయి పెడస్ట్రియన్ (పాదచారులు) పాలసీ రూపొందాలి. వీటికోసం పోరాడుతూనే ఉంటా’నంటున్నారు కాంతిమతి. ఇదే విషయంపై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. - ఎస్.సత్యబాబు -
పుస్తకం బూడిదయింది కల రగులుతూనే ఉంది
ష్ష్ష్... అమ్మాయి చదువుకుంటోంది. ఇది మనం మన ఇళ్లలో వినే మాట. పిల్ల చదువుకుంటుంటే... కేబుల్ కనెక్షన్ కూడా తీయించేస్తాం. కానీ దుర్గకు అలాంటి సౌకర్యం లేదు. బస్సు కారును, కారు ఆటోను, ఆటో స్కూటర్‌ను, స్కూటర్ సైకిల్‌ను, సైకిల్ పాదచారిని కేకలేసే రోడ్డది. ఇల్లు కాలి బుగ్గి అయ్యింది కాబట్టి దుర్గ చదువు రోడ్డున పడింది. ఆ రోడ్డు అంచే దుర్గ చదువుకునే ఫుట్‌పాత్. దుర్గ సంకల్పం ముందు రోడ్డు గోల ‘ష్ష్ష్’ అయిపోతుంది! పుస్తకం మంటల్లో కాలిపోయినా... దుర్గ ఆశయం రగులుతూనే ఉంది! కొన్ని సన్నివేశాలు లిప్తపాటే కళ్లకు కనిపించినా గుండెను తట్టి లేపుతాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి నేరుగా వస్తున్నప్పుడు అశోక్‌నగర్ సిగ్నల్ చౌరస్తాలో కనిపించే దృశ్యం అలాంటిదే! హైదరాబాద్ నగరం... బిజీబిజీ జీవితం ఒకవైపు, గజిబిజి ట్రాఫిక్ రణగొణలు మరోవైపు... హడావుడిగా ముందుకు సాగుతున్నప్పుడు నగరం నడిబొడ్డున అయినవాళ్లు కనిపించినా, పట్టించుకుని పలకరించే తీరికలేనంతగా మసిబారిపోయిన మనసులు. మనుషుల మీద నిర్లక్ష్యమేమీ కాదు గానీ, బండబారిన బతుకుల పరిస్థితులే అలాంటివి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఒక కదిలించే సన్నివేశం కనిపిస్తే... స్పందించకుండా ఉండటం సాధ్యమేనా..? ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి నేరుగా వస్తున్నప్పుడు అశోక్‌నగర్ సిగ్నల్ చౌరస్తా... మరో పద్దెనిమిది సెకన్లలో గ్రీన్ సిగ్నల్ పడుతుంది. అటూ ఇటూ చూపులు సారిస్తే... ఒకచోట చూపు నిలిచిపోయింది. నిజానికి చూపు నిలిచిపోయిందనే కంటే... అక్కడి దృశ్యమే దృష్టిని కట్టి పడేసింది. గబగబా రెండు ఫొటోలు... ఆ చౌరస్తాలోని ఒక ఫుట్‌పాత్ మీద నేలపై పరచిన గోనెసంచి. దాని మీద పరచిన పూలు... వాటి పక్కన ఒక తొమ్మిదేళ్ల పాప. ఆ పరిసరాలంతా వాహనాల రణగొణల చప్పుడు... దుమ్ముధూళి, పొగ, అరుపులు కేకలు... ఇవేవీ ఆ పాప ఏకాగ్రతకు భంగం కలిగించలేకపోతున్నాయి. దించిన తల పెకైత్తకుండా నోట్‌బుక్‌లో ఆ పాప ఏదో రాసుకుంటోంది. ఒకప్పుడు మహానుభావులు రాత్రివేళ వీధి దీపాల కింద కూర్చుని చదువుకున్నట్లు చిన్నప్పుడు మాస్టార్లు చెబితే విన్నాం. కానీ, ఈ చిట్టి చదువుల తల్లి మాత్రం నిజంగా వీధిలోనే... ఫుట్‌పాత్‌పై కూర్చుంది. అప్పటికింకా చీకటి పడలేదు గానీ, సమయం సాయంత్రం 4.30 గంటలు కావస్తోంది. మరో గంట గడిస్తే పొద్దుగుంకే వేళే అవుతుంది. ట్రాఫిక్ రణగొణలను ఏమాత్రం పట్టించుకోకుండా, ఆ పాప పుస్తకంలోకి ఒదిగిపోయి, రాత కొనసాగిస్తూనే ఉంది. అంత ఏకాగ్రతలోనూ పూల కోసం వచ్చిన వారికి పూలు ఇచ్చి, మరుక్షణమే పుస్తకంలో నిమగ్నమైపోయింది. నిరుపేద చదువులతల్లి ఆ పాప పేరు దుర్గ. ఆమె జవహర్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుకుంటోంది. వాళ్ల అమ్మా నాన్నలకు దుర్గ నాలుగో సంతానం. కానీ, ఆమెకు తోబుట్టువులు ఎలా ఉంటారో తెలియదు.. ఎందుకంటే వారిలో ఇద్దరు చనిపోగా.. మరోఅక్క మంజును చిన్నప్పుడే ఎవరో ఎత్తుకెళ్లిపోయారు. మంజు కోసం దుర్గ వాళ్ల తల్లిదండ్రులు కేసు పెట్టి, వెతికించినా లాభం లేకపోయింది. మంజు ఉంటే... ఆమెకిప్పుడు ఇరవయ్యేళ్లు ఉండేవట... ఇప్పుడు మిగిలింది ఆ దీనదంపతులకు దుర్గ మాత్రమే. పురానాపూల్‌కు చెందిన దుర్గ కుటుంబం బతుకుదెరువు కోసం అశోక్ నగర్‌లోని ఓ బస్తీకి కొన్నేళ్ల కిందట తరలి వచ్చింది. దుర్గ తండ్రి కూలిపనులకు వెళుతుంటాడు. తల్లి ప్రమీల ఫుట్‌పాత్ మీద పూల దుకాణం నడిపిస్తోంది. తల్లికి సాయంగా... సాయంత్రం బడి వదిలేయగానే చిట్టి దుర్గ నేరుగా ఫుట్‌పాత్ మీద తల్లి నడిపే పూల దుకాణానికి చేరుకుంటుంది. ఆమె రాగానే తల్లి ఇంటికి వెళ్లి పనులు చేసుకుంటుంది. తల్లి వెళ్లిన తర్వాత దుర్గ ఒకవైపు పూల అమ్మకాలు సాగిస్తూనే, మరోవైపు చదువు కొనసాగిస్తుంది. తల్లికి అనారోగ్యంగా ఉంటే, తానే ఇంటి పనులూ చేస్తుంది. తండ్రి వద్దకు వెళ్లి అతడికి భోజనం కూడా ఇచ్చి వస్తుంది. అనుకోని విషాదం... అసలే పేదరికంతో అల్లాడుతున్న దుర్గ కుటుంబానికి అగ్నిప్రమాదం రూపంలో అనుకోని విషాదం ఎదురైంది. తల్లితో కలసి బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చిన దుర్గకు... తాము అద్దెకు ఉంటున్న గది మంటల్లో బూడిదై కనిపించింది. ఆ స్థితిలో కంటినీరే తప్ప కళ్లలోని ఆశలన్నీ అడుగంటాయి. కాలిన ఇంట్లోకి అడుగుపెడుతూనే చిన్నారి దుర్గ నేరుగా తన పుస్తకాల సంచి కోసం వెతుక్కుంది. మొత్తం పుస్తకాలన్నీ కాలిపోయాయి. ఏడాదికోసారి తీసుకున్న కొత్త బట్టలూ కాలిపోయాయి. ఈ దుర్ఘటన చిన్నారి దుర్గను నిరాశలో ముంచేసింది. బడికి దూరమై... ఫుట్‌పాత్‌కు చేరువై... రోజూ సాయంత్రం వేళ మాత్రమే పూల అమ్మకం కోసం ఫుట్‌పాత్ మీదకు వచ్చే దుర్గను... అనుకోని అగ్నిప్రమాదం రోజంతా ఫుట్పాత్కే పరిమితం చేసింది. సర్వస్వం కోల్పోవడంతో... ఇప్పటికిప్పుడు పుస్తకాలు సైతం కొనలేని స్థితిలో తల్లిదండ్రులు ఉండటంతో దుర్గ నిస్సహాయంగా మిగిలింది. ‘నాకు బడికి పోవాలనుంది. బుక్కులు కాలిపోయినయి. నా దోస్తుల్ని చూస్తుంటే బడికి వెళ్లాలనిపిస్తుంది. కానీ అమ్మా వాళ్ల దగ్గర డబ్బులు లేవుగా... డబ్బులొచ్చాక పుస్తకాలు కొనుక్కుని బడికిపోతాను’ అని అమాయకంగా చెప్పింది ఆమె. డాక్టర్.. అవుతానో లేదో.. ‘బాగా చదువుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. పూలకొట్టువద్దకు రావడం వల్ల నాకు దోస్తులు కూడా చాలా తక్కువమందే ఉన్నారు. ఒక్క రోజు కూడా బడి మానేయకుండా వెళ్లాలనిపిస్తది. బాగా మార్కులు తెచ్చుకొని అందరికంటే ఫస్టు రావాలనిపిస్తది. డాక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే డాక్టర్ ని అయిపోతా.. కానీ, ఎప్పుడు అవుతానో ఎలా అవుతానో తెలియడం లేదు. నన్ను మంచిగా చదివించే వాళ్లుంటే బాగుంటదనిపిస్తుంది. డాక్టర్ అయ్యి మా అమ్మవాళ్లను బాగా చూసుకోవాలి’ అనే దుర్గ మాటలు ఎవరినైనా కదిలిస్తాయి. ఎవరూ చదివిచ్చినా నా బిడ్డ చల్లగా ఉంటే చాలు.. ‘ముందు నుంచి మాకు కష్టాలే... మొన్న ఇల్లు కాలిపోయి మొత్తం పోయింది. మాకు మిగిలింది ఈ ఒక్క బిడ్డే.. అందుకే కంటికి రెప్పలా చూసుకుంటున్నాం. మేం ఏం కోరుకోగలం.. ఎక్కడ ఉన్నా మా బిడ్డ చల్లగా ఉండాలని కోరుకోవడం తప్ప. ప్రభుత్వం సాయం చేసి నా బిడ్డను సదివిచ్చినా పర్వలేదు.. ఏ అయ్య అన్నా నా బిడ్డకు మంచి చదువు చెప్పించేందుకు ముందుకొచ్చి చదివిచ్చినా పర్వాలేదు. కానీ, దూరంగా పంపించం.. సాయంత్రం పోయి చూసి వచ్చేంత దగ్గరగా నా బిడ్డ ఉండాలి. ఎందుకంటే దుర్గే కదా మాకుంది’ అని దుర్గ తల్లి ప్రమీల చెప్పింది. - ఎం.నాగేశ్వరరావు, m.nageswararao@sakshi.com ఫొటోలు: మోహనాచారి -
'హత్తుకున్నాక.. 4 రోజులు స్నానం చేయలేదు'
బెంగళూరు: జీవితంలో తాను సాధించిన విజయాలు, పేరు ప్రతిష్ఠలు తన తండ్రి, కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్‌కు అంకిత మిస్తున్నట్టు ఆయన కుమారుడు శివరాజ్ కుమార్ ప్రకటించారు. కర్ణాటక చలనచిత్ర అకాడమీ, బెంగళూరులో నిర్వహించిన బెళ్లి హెజ్జి కార్యక్రమలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ దంపతులకు నిర్వాహకులు ఘన సన్మానం చేశారు. అనంతరం శివరాజక్ కుమార్ తన జీవితంలోని కొన్ని సంగతులను మీడియాతో పంచుకున్నారు. తండ్రి అడుగు జాడల్లోనే తాను నడుస్తున్నానని, ఆయనే తనకు ఆదర్శమని పేర్కొన్నారు. . ఆయన తన నటజీవితంలో చిన్నా, పెద్దా నటులందరితోనూ కలిసి పనిచేశారని ఈ స్టార్ హీరో గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా శంకర్ నాగ్, అనంత్ నాగ్, విష్ణువర్ధన్, అంబరీష్ అందరితో నటించారన్నారు. తాను కూడా భవిష్యత్తులో కన్నడ సినీ పరిశ్రమలో హీరోలందరితోనూ నటించే ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పారు. తాను చిన్నప్పటినుంచి స్టార్ కొడుకుగా కాకుండా సాధారణ పిల్లాడిలా పెరిగానని చెప్పుకొచ్చారు. కాలేజీకి బస్ లో వెళ్లేవాడినన్నారు. తాను సినిమాల్లోకి రాకుండా ఉండి వుంటే మంచి క్రికెటర్ అయి వుండేవాడినని తెలిపారు. కాలేజీలో చదువుకునే సమయంలో క్రికెట్ బాగా ఆడేవాడిననీ, దాన్ని అలా కొనసాగించి ఉండి ఉంటే దేశం కోసం మంచి క్రికెటర్‌గా మిగలేవాడినన్నారు. కానీ విధి మరోలా ఉండి యాక్టింగ్ స్కూలుకు వెళ్లాల్సి వచ్చిందంటూ చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనొక ఆసక్తికర విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ అంటే తనకు చాలా ఇష్టమని, వల్లమాలిన అభిమానమని చెప్పారు. అందుకే ఒకసారి కమల్ హాసన్ తనను ఆలింగనం చేసుకున్నపుడు నాలుగు రోజులు స్నానం చేయలేదన్నారు. ఎందుకంటే ఆయన్ని హత్తుకున్న పరిమళం తనను వీడిపోవడం ఇష్టంలేక అలా చేశానని వెల్లడించారు. కాగా ఇప్పటికే 100 సినిమాల మార్క్ ను దాటి విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తున్న శివరాజ్ కుమార్, యువహీరో సందీప్‌తో కలిసి 'కుంభ మేళా'లో నటించనున్నారు. దీంతోపాటు సోదరుడు, మరో టాప్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. -
ప్రమాదకరంగా మారిన శ్రీవారి మెట్టు మార్గం
-
223 అడుగుల ఎత్తులో ఫుట్‌పాత్
ప్రతి నిత్యం ఏదో ఒక కారణంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించే చైనీయులు తాజాగా.. తమ సివిల్ ఇంజనీరింగ్ నైపుణ్యానికి పదును పెట్టారు. ప్రపంచంలోనే ఎత్తైన ఫుట్‌పాత్ నిర్మించి సంచలనం సృష్టించారు. నేలకు 223 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ ఫుట్‌పాత్ నైరుతీ చైనాలోని చోంగ్ పింగ్ నగరంలో ఉంది. ఒక అపార్ట్మెంట్, షాపింగ్‌మాల్‌ను కలుపుతూ ఈ నిర్మాణం జరిగింది. అపార్ట్మెంట్లోని ప్రజలు నేరుగా షాపింగ్ మాల్‌లోకి వెళ్లేలా ఈ ఫుట్‌పాత్‌ను రూపొందించామని..దీనివల్ల ప్రజలు రోడ్లపైకి వచ్చే అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న ఓ రెసిడెన్సియల్ అపార్ట్ మెంట్లోని 22వ అంతస్తు నుంచి ఈ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జిని నిలిపి ఉంచేందుకు 75 అడుగుల పొడవు, 13 అగులు వెడల్పు ఉన్న 8 ఉక్కు కేబుల్స్ నిర్మించారు. బ్రిడ్జి పై నుంచి కిందికి చూసేందుకు విండోస్ వంటి కంతలను ఏర్పాటు చేశారు. భూమికి అంత ఎత్తులో ఉన్న ఈ ఫుట్‌పాత్‌పై నడిచేందుకు భయం కలగటం లేదా అని అడిగితే.. ఎందుకు లేదూ ఇక్కడి నుంచి చూస్తే.. సరాసరి.. కింద ఉన్న కార్ పార్కింగ్ లాట్ కనిపిస్తుంది. కళ్లు తిరుగుతాయ్ అంటూ అపార్ట్ మెంట్ వాసి చెంగ్ బదులిచ్చాడు. ఒక్కోసారి ఈ బ్రిడ్జి మీద నడవాలంటేనే భయంగా ఉందని ఆయన తెలిపాడు. మరోవైపు అధికారులు మాత్రం ఇది ప్రపంచంలో కెల్లా కూలెస్ట్ బ్రిడ్జ్ అంటూ మురిసిపోతున్నారు. అంతేకాదు.. ఈ బ్రిడ్జివల్ల బోలెడు సమయం కలిసొస్తుందని అంటున్నారు. రోడ్డుపై ట్రాఫిక్ పెరిగిపోవటంతో దాన్ని దాటుకుని షాపింగ్ మాల్ లోకి వెళ్లేందుకు చాలా సమయం పడుతోందని.. ఈ షార్ట్ కట్ బాగుందని యూత్ చెబుతున్నారు. ఈ కూల్ ఫుట్‌పాత్ గత ఏడాది డిసెంబర్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.