సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఓ విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంది. వీధులన్నీ కాలుష్యం వాయువులతో ఎలా కమ్ముకుపోతున్నాయో, అలాంటి కాలుష్యాన్ని నివారించాల్సిన అవసరం ఉందన్న విషయంలో కేంద్రానికి స్పష్టత వచ్చింది. పట్టణాల్లో పాదచారులకు, సైకిళ్లకు మరిన్ని సదుపాయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి నగరం, పట్టణంలో పాదచారులకు అనువుగా ఉండేటట్లు కనీసం మూడు మార్కెట్లను అభివృద్ధి చేయాలని, అందుకు రోడ్లపై తగిన ఫుట్‌పాత్‌లు ఉండాలని, సైకిళ్ల కోసం పట్టణాలు, నగరాల్లో మరిన్ని సైకిల్ ట్రాక్‌లు నిర్మించాలని గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటికి సంబంధించి అభివృద్ధి చేయాల్సిన చెరువులను జూన్ 30వ తేదీ నాటికి గుర్తించాలని, అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి పనులను పారంభించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. (‘బాయ్ కాట్ చైనా’ సాధ్యమేనా?)
వీధులను ప్రజలకు అనువైన విధంగా మార్చడానికి కరోనా సమయమే సానుకూలమని మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్ సమయాన్ని ఉపయోగించుకొని ఫుట్‌పాత్‌లను, సైకిల్ వేలను అభివృద్ధి చేస్తున్నాయి. ‘వరల్డ్ ఏర్ క్వాలిటీ రిపోర్ట్’ ప్రకారం ప్రపంచంలోని పది కాలుష్య నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. ఈ కారణంగా రోడ్ల విస్తరణకు, వాహనాల కుదింపునకు భారత ప్రభుత్వం ఎక్కువ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. (భారత్- చైనా సరిహద్దు ‘చిచ్చు’కు కారణం?)
Comments
Please login to add a commentAdd a comment