అదుపు తప్పి.. వేగంగా ఢీకొట్టి.. | Banjara Hills Car Accident | Sakshi
Sakshi News home page

అదుపు తప్పి.. వేగంగా ఢీకొట్టి..

Jan 26 2025 8:31 AM | Updated on Jan 26 2025 8:31 AM

Banjara Hills Car Accident

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారిపై నుంచి దూసుకెళ్లిన కారు

గుర్తు తెలియని వ్యక్తి మృతి.. మరో ఇద్దరికి గాయాలు  

బంజారాహిల్స్‌లో శనివారం తెల్లవారుజామున ఘటన 

బంజారాహిల్స్‌: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారి నుంచి కారు దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా..  మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌కు చెందిన ఆభరణాల వ్యాపారి తనయుడు సాధుల హర్షవర్ధన్‌ మరో ఐదుగురు స్నేహితులతో కలిసి బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌–13లోని సాయి మెన్షన్‌ అపార్ట్‌మెంట్‌లో  అద్దెకు ఉంటున్నాడు. 

ఆయనే నిర్మాతగా, హీరోగా అర్జున్‌ దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. శుక్రవారం రాత్రి హర్షవర్ధన్‌ తన స్నేహితులు సాంకేత్‌ శ్రీనివాస్‌ అలియాస్‌ తేజ, మాడే కార్తీక్, వంశీ, రాకేష్‌ నేతతో కలిసి ఉంటున్నాడు. హర్షవర్ధన్, వంశీలు గదిలో మద్యం తాగుతుండగా.. రాకేష్‌ అనే మరో స్నేహితుడు జూబ్లీహిల్స్‌లోని ఎయిర్‌లైవ్‌ పబ్‌లో ఉండగా తనను పికప్‌ చేసుకోవడానికి రావాలని హర్షవర్ధన్‌కు ఫోన్‌ చేశాడు. తాను మద్యం మత్తులో ఉన్నానని, మీరు వెళ్లి తీసుకురావాలంటూ కార్తీక్‌కు చెప్పి కారు తాళంచెవి ఇచ్చాడు.  అర్ధరాత్రి 1.04 గంటల ప్రాంతంలో కార్తీక్‌.. థార్‌ కారు  నడుపుతుండగా తేజ పక్కన కూర్చొని రాకే‹Ùను తీసుకురావడానికి జూబ్లీహిల్స్‌ పబ్‌కు బయలుదేరారు. 

బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–12 నుంచి అగ్రసేన్‌ చౌరస్తా మీదుగా అతి వేగంగా కేబీఆర్‌ పార్కు వైపు వెళ్తుండగా బసవతారకం కేన్సర్‌ హాస్పిటల్‌ సమీపంలో కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టి అక్కడ నిద్రిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తి (40) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన తెల్లవారుజామున 1.15 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.  సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ ఏసీపీ సామల వెంకట్‌రెడ్డి సిబ్బందితో కలిసి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.  ఘటన వివరాలను ప్రత్యక్ష సాక్షుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.  

కారు డోర్‌ తీసి పరారైన యువకులు.. 
కారు బోల్తా పడిన తర్వాత డోర్‌ నుంచి ఇద్దరు యువకులు బయటకు వచ్చి పరుగులు తీశారని అక్కడ ఉన్నవారు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు కారు నెంబర్‌ ఆధారంగా ఫోన్‌ నెంబర్‌ సేకరించి సీసీ ఫుటేజీల ఆధారంగా కారు ఎక్కడి నుంచి వచి్చందో గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత భయంతో కార్తీక్, తేజ పారిపోతూ గదిలో ఉన్న హర్షవర్దన్,  వంశీ, నేతను కూడా పారిపోవాలని చెప్పడంతో అంతా ఉడాయించారు. అయితే తెల్లవారుజామున ఇంటికి వచ్చిన రాకే‹Ùకు గదికి తాళం వేసి ఉండడం కనిపించింది. పోలీసులు రాకేష్‌ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ మిస్టరీ వీడింది. 

పరారీలో ఉన్న కార్తీక్, తేజ, హర్షవర్ధన్, వంశీ, నేత తదితరులను అదుపులోకి తీసుకున్నారు. కారు నడిపిన కార్తీక్‌ పక్కనే కూర్చొన్న తేజలపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 105 (2), 337, ఎంవీ యాక్ట్‌ 184, 187, పీడీపీపీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కారు ఇచి్చన హర్షవర్దన్‌పై కూడా కేసు నమోదైంది. కారు నడుపుతున్న కార్తీక్‌కు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని గుర్తించారు. కార్తీక్,  తేజకు డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహించగా వారు మద్యం తాగలేదని తేలింది.  బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement