తప్పతాగి ఫుట్‌పాత్‌పైకి ఎక్కించి.. పుణేలో ఘోరం | Three Members Died In Pune Footpath Tragedy Full Details Check Here In Telugu | Sakshi
Sakshi News home page

తప్పతాగి ఫుట్‌పాత్‌పైకి ఎక్కించి.. పుణేలో ఘోరం

Published Mon, Dec 23 2024 10:25 AM | Last Updated on Mon, Dec 23 2024 11:00 AM

Pune Footpath Tragedy Full Details Check Here In Telugu

ముంబై: పుణేలో అర్ధరాత్రి ఘోరం జరిగింది. ఫుల్‌గా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఫుట్‌పాత్‌పైకి  ట్రక్కుతో  దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఫుట్‌పాత్‌ నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది.

సుమారు ఒంటి గంట సమయంలో ఓ వ్యక్తి వాహనం నడుపుతూ వాఘోలి చౌక్‌ ఏరియాకు చేరుకున్నాడు. హఠాత్తుగా తన బండికి అక్కడే ఉన్న ఫుట్‌పాత్‌పైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని  అదుపులోకి తీసుకుని.. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాలు పోవడానికి కారణమైనందుకు మోటార్‌ వెహికిల్స్‌ యాక్ట్‌తో పాటు బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మృతుల్లో.. ఏడాది, రేండేళ్ల వయసున్న చిన్నారులు, విశాల్‌ పన్వర్‌(22) ఉన్నారు. అమరావతిలో నిర్మాణ పనుల కోసం వచ్చిన కూలీలు.. కేశ్‌నాథ్‌ ఫాటా ఏరియాలో ఫుట్‌పాత్‌పై పడుకున్నారని, వాళ్లపై నుంచి ట్రక్కు దూసుకెళ్లిందని, వాహనం నడిపిన వ్యక్తి బాగా తాగి ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement