
షోలాపూర్ : పుణె-షోలాపూర్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వేగంగా వెళ్తున్న కారు ట్రక్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలోనే కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. రాయ్‌గర్‌లో పనిముగించుకున్న వీరు షోలాపూర్ మీదుగా సొంతూరు యావత్‌కు వెళ్తున్నారు. కాదమ్‌వాక్ వస్తీ వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాల్ని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న లోనికాల్బోర్ స్టేషన్ పోలీసులు దర్యాప్తు ప్రారభించారు. మృతులంతా 19 నుంచి 23 ఏళ్ల వయసువారే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment