Negligent
-
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం
-
టీటీడీ నిర్లక్ష్యం.. ఏడుగురు మృతి.. 40మందికి పైగా గాయాలు
-
వాట్సాప్‌లో మునిగిపోవడం వల్లే ఘోరం!
తిరువనంతపురం: కేరళ కన్నూరు స్కూల్ బస్సు ప్రమాదం ఘటనలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలోనే.. డ్రైవర్ ఫోన్ నుంచి వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ అయ్యి ఉంది. దీంతో డ్రైవర్ ఫోన్లో మునిగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.కన్నూరు జిల్లా వలక్కై శ్రీస్కంధపురం వద్ద బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు ఒకటి బోల్తాపడడంతో ఓ చిన్నారి మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సు కిటీకిలోంచి చిన్నారి బయట ఎగిరిపడగా.. ఆ వెంటనే బస్సు ఆమె మీద పడడంతో చిధ్రమయ్యింది. కలవరపరిచే ఆ దృశ్యాలు సోషల్ మీడియాకు చేరాయి.#Kerala : A tragic accident occurred in Valakkai, Sreekantapuram, #Kannur, when a school bus belonging to Chinmaya School overturned, claiming the life of an 11-year-old student and injuring 13 others.The deceased, Nedya S Rajesh, a Class 5 student, lost her life after falling… pic.twitter.com/csNHtZAiv3— South First (@TheSouthfirst) January 1, 2025అయితే నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వాదనను డ్రైవర్ నిజాం తోసిపుచ్చాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను.. తాను బస్సు నడుపుతూ ఫోన్ వాడలేదని.. ఎలాంటి వాట్సాప్ స్టేటస్(Whatsapp Status) అప్లోడ్ చేయలేదని.. బహుశా ఫోన్ టచ్ అయ్యి అలా జరిగి ఉంటుందని చెబుతున్నాడు. అంతేకాదు బస్సు బ్రేకులు పడకపోవం వల్లే యాక్సిడెంట్ జరిగిందని అంటున్నాడతను. అయితే.. యాక్సిడెంట్ టైంకే డ్రైవర్ వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ అయిన విషయాన్ని స్థానిక చానెల్స్ ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి.ఇక బస్సును పరిశీలించిన మోటార్ వెహికిల్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ డ్రైవర్ వాదనను కొట్టిపాస్తున్నారు. బ్రేకులు కండిషన్లోనే ఉన్నాయని చెబుతున్నారు. అలాగే బస్సు ఫిట్నెస్ సర్టిఫికెట్ కిందటి నెల డిసెంబర్ 29తో ముగియగా.. తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ దాకా రెన్యువల్ అయినట్లు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం(Driver Negligence) వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు..స్థానికులు మాత్రం సర్వీస్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లే ప్రమాదకరమైన మలుపు కారణంగానే ఈ ఘోరం జరిగిందని, తరచూ ఇక్కడ పలు ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతుండడం గమనార్హం.అప్పటికే ఆలస్యమైంది..శ్రీస్కంధపురం స్కూల్ బస్సు ప్రమాదం(School Bus Accident)లో చనిపోయిన స్టూడెంట్ను ఐదో తరగతి చదువుతున్న నెద్యా రాజేష్(11)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న స్థానికులు పిల్లలను బయటికి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే.. బస్సు కింద నలిగిపోయిన నెద్యాను మాత్రం కాస్త ఆలస్యంగా గుర్తించినట్లు చెబుతున్నారు వాళ్లు.‘‘పెద్ద శబ్దం రాగానే ఇక్కడున్న కొందరం పరిగెత్తాం. బోల్తా పడ్డ బస్సులోంచి పిల్లల రోదనలు వినిపించాయి. వాళ్లను బయటకు తీసి నీళ్లు తాగించాం. డ్రైవర్ సహా పిల్లల్లో కొందరికి గట్టి దెబ్బలే తగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించాం. కానీ, ఓ అమ్మాయి బస్సు కిందే ఉందన్న విషయం కాసేపటికి తెలిసింది. ఆమెను బయటకు తీసేసరికి బాగా రక్తం పోయి స్పృహ లేకుండా ఉంది. ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది’’ అని స్థానికుడొకరు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 15 మందికి చికిత్స అందుతుండగా.. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
యాద్రాది: డ్యూటీలకు డుమ్మా.. టీచర్లపై వేటు
సాక్షి, యాద్రాది: దీర్ఘకాలంగా విధులకు హాజరుకాకుండా డుమ్మా కొడుతున్న టీచర్లపై వేటు పడింది. 2005, 2006 నుంచి విధులకు రాని 16 మంది టీచర్లను తొలగిస్తూ యాద్రాది భువనగిరి జిల్లా డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.యాద్రాది జిల్లాలో 18 మంది ఉపాధ్యాయులు విధులకు హాజరుకావడం లేదు. 2005 నుంచి ఇప్పటివరకు డుమ్మా కొడుతున్న వారుండగా.. గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఇద్దరు డ్యూటీలో చేరారు. మిగిలిన 16 మంది స్పందించలేకపోవడంతో. గత మే నెలలో కూడా గెజిట్ నోటీసు విద్యాశాఖ జారీ చేసింది. అయినా టీచర్ల నుంచి స్పందన రాకపోవడంతో వారందరికీ సర్వీస్ నుంచి తొలగిస్తూ డీఈవో ఆదేశాలు జారీ చేశారు. -
బాబు హయాంలో సీనియర్లకు అవమానం
-
తల్లి ప్రేమకు దూరమైన పసికందు
బొమ్మనహళ్లి: బళ్లారిలో బాలింతల మరణాల పరంపర మరువక ముందే బెంగళూరులో ప్రసవించిన ఓ మహిళ శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం అవయవ వైఫల్యం, ఇతర సమస్యలతో మరణించిన హృదయవిదారక ఘటన జరిగింది. చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా గర్జే గ్రామానికి చెందిన గర్భిణీ అనూష మృతితో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. వివరాలు...చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా గర్జే గ్రామానికి చెందిన గర్భిణీ అనూషను తరికెరెలోని రాజ్ నర్సింగ్ హోంలో చేర్పించారు.సాధారణ ప్రసవం ద్వారా పాప పుట్టింది. కాన్పుకు ముందు స్కానింగ్ చేయగా కిడ్నీలో స్టోన్ ఉందని, డెలివరీ అయిన నెల తరువాత షిమోగాలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో సర్జరీ చేశారని సమాచారం. అయితే పేగులు దెబ్బతిన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనూషను ఇంటికి తీసుకువచ్చిన తరువాత కాళ్లు, చేతులు వాపు కనిపించింది. మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా సమస్య లేదని వైద్యుడు చెప్పారు. అయితే ఆమె ఆరోగ్య క్షీణించడంతో స్థానికంగా ఉన్న మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారు కామెర్లు ఉన్నట్లు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తీసుకువచ్చి నగరంలోని నాగరబావిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచారు. లివర్ సమస్యకు మరో ఆపరేషన్ చేసి సీటీ స్కానింగ్, ఎంఆర్ఐ, సర్జరీ అంటూ కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు దండుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి అనూష స్పృహలో లేదు. ఆమెకు గుండె సమస్య ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళన నెలకొంది. నిరంతర చికిత్స, వైద్య పరిశీలన లేక పోవడంతో తన భార్య మరణించిందని ఆమె భర్త ఆరోపిస్తున్నారు. అనూష ఎలా చనిపోయిందనేది కూడా వైద్యులు చెప్పలేకపోతున్నారని ఆమె బంధువులు, భర్త రోదించారు. ఆమె మృతితో రోజుల బిడ్డ అనాథగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ప్రైవేట్ ఆస్పత్రిలో బాలింత మృతి చెందడంపై ప్రజల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. -
తప్పతాగి ఫుట్‌పాత్‌పైకి ఎక్కించి.. పుణేలో ఘోరం
ముంబై: పుణేలో అర్ధరాత్రి ఘోరం జరిగింది. ఫుల్‌గా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఫుట్‌పాత్‌పైకి ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఫుట్‌పాత్ నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది.సుమారు ఒంటి గంట సమయంలో ఓ వ్యక్తి వాహనం నడుపుతూ వాఘోలి చౌక్ ఏరియాకు చేరుకున్నాడు. హఠాత్తుగా తన బండికి అక్కడే ఉన్న ఫుట్‌పాత్‌పైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాలు పోవడానికి కారణమైనందుకు మోటార్ వెహికిల్స్ యాక్ట్‌తో పాటు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.మృతుల్లో.. ఏడాది, రేండేళ్ల వయసున్న చిన్నారులు, విశాల్ పన్వర్(22) ఉన్నారు. అమరావతిలో నిర్మాణ పనుల కోసం వచ్చిన కూలీలు.. కేశ్నాథ్ ఫాటా ఏరియాలో ఫుట్‌పాత్‌పై పడుకున్నారని, వాళ్లపై నుంచి ట్రక్కు దూసుకెళ్లిందని, వాహనం నడిపిన వ్యక్తి బాగా తాగి ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.#महाराष्ट्र के पुणे में भयानक सड़क हादसा..नशे में धुत #डंपर ड्राइवर ने फुटपाथ पर सो रहे 9 लोगों को कुचला, 3 की मौत#Maharashtra #Pune #accident #footpath #Dumper #drunkdriving pic.twitter.com/y71i5EtaAQ— mishikasingh (@mishika_singh) December 23, 2024Pune: Dumper Truck Driver Claims Three Lives, Injures Nine In Wagholi Near Kesnand Phata In a tragic incident on Pune’s Wagholi area near Kesnand phata, a speeding dumper truck ran over 12 people sleeping on a footpath, killing three and injuring nine. The accident, reportedly… pic.twitter.com/K6T09Om7v4— Pune Pulse (@pulse_pune) December 23, 2024 -
ఆక్సిజన్ సిలిండర్‌తో.. నడి రోడ్డుపై..
ఏలూరు టౌన్: ఏలూరు ఎన్‌ఆర్‌పేటలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం తమ కర్కశత్వాన్ని ప్రదర్శించింది. కైకలూరు మండలం దేవిచింతపాడు గ్రామానికి చెందిన తానేటి నాగమణి 2 నెలల క్రితం ఏలూరు ఎన్‌ఆర్‌పేటలోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో కడుపులో కణితి ఉందని శస్త్ర చికిత్స చేయించుకుంది. ఆపరేషన్ అనంతరం ఆమె ఇంటికి వెళ్ళగా కొద్ది రోజులకు తీవ్ర అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను వేరే హాస్పిటల్‌కు తీసుకువెళ్ళగా పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తెలిపారని చెప్పారు. క్యాన్సర్ కణితిని శస్త్ర చికిత్స చేయటంతో ఇన్ఫెక్షన్ అయిందని, అది తీవ్ర అనారోగ్యానికి దారితీసిందని వైద్యులు చెప్పారని వివరించారు. ఈ నేపథ్యంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలు నాగమణిని శనివారం సాయంత్రం.. ముందుగా ఆపరేషన్ చేసిన హాస్పిటల్‌కు తీసుకురాగా, తమకు సంబంధం లేదని, వైద్యం చేయబోమంటూ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా చెప్పింది. రాత్రి 10.35 గంటల వరకూ ఆరున్నర గంటల పాటు రోడ్డుపైనే ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. -
బస్తీ దవాఖానాలకు సుస్తీ: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: పట్టణ పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలనే ఉదాత్త సంకల్పంతో బీఆర్ఎస్ 400పైగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకువచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో సోమవారం(సెప్టెంబర్23) కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. అయితే తాము ఏర్పాటు చేసిన బస్తీదవాఖానాలను కూడా కాంగ్రెస్ సర్కారుకు సరిగా నడపడం చేతకావడం లేదని కేటీఆర్ విమర్శించారు. అనేక రకాల విష జ్వరాలతో నగరవాసులు నరకయాతన పడుతుంటే ఆదుకోవాల్సిన బస్తీ దవాఖానాలకే ఈ అసమర్ధ ప్రభుత్వంలో సుస్తీ చేసిందన్నారు. ప్రజారోగ్యంపై మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య నేతృత్వంలో బీఆర్ఎస్ వేసిన కమిటీ సోమవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించకుండా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు ప్రబలుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఇదీ చదవండి: ఎల్వోపీ సీటు కోసం కేటీఆర్,హరీశ్ ఫైట్ -
Big Question: నేరం నీదే బాబు
-
AP: ఇంత నిర్లక్ష్యమా?.. మార్చురీ వద్ద దుర్భర పరిస్థితి
సాక్షి, విజయవాడ: ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద దుర్భర పరిస్థితి నెలకొంది. మృతదేహాల కోసం కుటుంబీకులు పడిగాపులు కాస్తున్నారు. వరదల కారణంగా చనిపోయిన వారి మృతదేహాలు మార్చురీకి తరలించగా, వరద నీటిలో ఉన్న మృతదేహాలను మార్చురీకి తీసుకురావడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.సీఎం చంద్రబాబుకు చెప్పుకుంటే కానీ మృతదేహాలను తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సహకరించడం లేదు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో 12 మృతదేహాలు ఉండగా, రెండు రోజుల నుంచి మృతదేహాల కోసం మార్చురీవద్దే కుటుంబీలు నిరీక్షిస్తున్నారు. పోస్టు మార్టం ప్రక్రియ పూర్తిచేసి ఇచ్చేందుకు అధికారులు, పోలీసులు జాప్యం చేస్తున్నారు.కాగా, బాధితుల ఆర్తనాదాలు అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయి. మూడ్రోజులుగా గల్లంతైన వారు శవాలుగా మారి నీటిలో కొట్టుకుపోతూ కనిపిస్తున్న దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా మారాయి. వరదల గురించి ముందుగా అప్రమత్తం చేయడంలో విఫలమైన ప్రభుత్వం.. కనీసం గల్లంతైన వారి ఆచూకీ అయినా చెబుతుందేమోన్న బాధిత కుటుంబాల ఆశలపై నీళ్లు చల్లుతోంది. మృతదేహాలు అలా కళ్లెదుటే వెళ్లిపోతున్నా, చంద్రబాబు సారధ్యంలోని ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడం కనీస భారతీయ సంప్రదాయమనే విషయాన్ని విస్మరిస్తోంది. ఇప్పటిదాకా 32 మృతదేహాలు వెలుగుచూశాయి. మూడ్రోజులుగా ప్రజల మధ్యే ఉన్నప్పటికీ ఈ వాస్తవాలు దాచిపెట్టడం చంద్రబాబు దుర్మార్గానికి పరాకాష్ట. -
ప్రజారోగ్యానికి చంద్రబాబు సర్కార్ ఉరితాడు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఏపీలో ప్రజారోగ్య రంగానికి చంద్రబాబు సర్కార్ ఉరితాడు బిగుస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోందని ఎక్స్(ట్విటర్) వేదికగా నిలదీశారు.‘‘ఇప్పటికే స్పెషలిస్టు వైద్యుల సహా సిబ్బంది నియామకాల్ని ఆపడంతో జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారు. మరోవంక బిల్లులు చెల్లించకుండా ఆరోగ్య శ్రీని నీరుగారుస్తున్నారు. తద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తిరిగి ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని తీసుకు వస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కావాల్సిన ఐదు మెడికల్ కాలేజీలను ఉద్దేశపూర్వకంగా మీరు నిర్లక్ష్యం చేయడం దీనికి ఇంకో సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ఏడాది ఆ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కాకపోవడం మీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.’’వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేయడం కోసం అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చాం. దీంట్లో భాగంగా విలేజ్-వార్డు క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, మండలానికి 2 పీహెచ్‌సీలు, 108,104 సర్వీసులు గణనీయంగా పెంపు, ఆరోగ్యశ్రీ పరిధిలోకి 3,257 చికిత్సలు, చికిత్స కాలంలో కోలుకునేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆరోగ్య ఆసరా, ప్రతి ఇంటిని జల్లెడపడుతూ ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు ఎప్పుడూ లేని విధంగా చేపట్టాం. ఆస్పత్రుల్లో నాడు-నేడు, కొత్త మెడికల్ కాలేజీలకోసం రూ.16,880 కోట్లతో పనులు చేపట్టాం. ఇవన్నీ చివరిదశకు వచ్చాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ చొప్పున 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని రూ.8,480 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టాం.’’ అని వైఎస్ జగన్ వివరించారు.‘‘పటిష్టమైన ప్రణాళిక వల్ల 2023-24 విద్యా సంవత్సరంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభం అయ్యాయి. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పేద విద్యార్థులకు ఎంతో మేలు జరిగింది. ఈ క్రమంలో 2024-25 విద్యా సంవత్సరంలో మరో ఐదు చోట్ల, పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీల్లో క్లాసులు ప్రారంభం కావాల్సి ఉంది. అన్ని వసతులూ ఉన్నా, చంద్రబాబూ… మీ వైఖరి కారణంగా వీటికి గ్రహణం పట్టింది. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీతో పొత్తులో ఉన్నా మీరు అనుమతులు తెచ్చుకోలేకపోయారు. ఇది మీ వైఫల్యంకాదా? ఫలితంగా మరో 750 సీట్లు అందుబాటులోకి రాకుండాపోయాయి. దీంతోపాటు కొత్తకాలేజీల్లో మెడికల్ సీట్లన్నింటినీ కూడా కన్వీనర్‌కోటాలో భర్తీచేస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూడా గాలికొదిలేశారు.’’ వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.‘‘మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేటుపరం చేసి, సామాన్యుల నెత్తిన భారం మోపే విధానాల్లోకి వెళ్తున్నారు. పీపీపీపీ మోడల్ అంటూ ప్రైవేటు కోసం, ప్రైవేటు కొరకు, ప్రైవేటు చేత, ప్రైవేటువల్ల నడుపుతున్న వ్యవస్థలా ప్రజారోగ్యరంగాన్ని మార్చేసి సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందుబాటులోలేని పరిస్థితిని తీసుకు వస్తున్నారు. ఈ విధానాలను ఇప్పటికైనా మార్చుకోండి. ప్రైవేటు సంస్థలకు పోటీగా ప్రభుత్వరంగం ఉన్నప్పుడే, ఆ పోటీ కారణంగా రేట్లు అదుపులో ఉంటాయి. వెంటనే స్పందించి ఈ సంవత్సరం ఆ 5 కాలేజీల్లో తరగతులు ప్రారంభం అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. మేం శరవేగంగా నిర్మించిన కాలేజీలకు మిగిలిన ఆ సొమ్మును కూడా విడుదలచేస్తూ ఈ సంవత్సరం కొన్ని, వచ్చే సంవత్సరం మిగిలిన అన్నీ పూర్తిచేసేదిశగా అడుగులు వేయండి. మీ మద్దతుపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఆ పలుకుబడిని వాడుకుని ఆ ఐదు కాలేజీలకు వెంటనే అనుమతులు తీసుకురావాలని కోరుతున్నాను.’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.. @ncbn గారూ… రాష్ట్రంలో ప్రజారోగ్య రంగానికి మీ ప్రభుత్వం ఉరితాడు బిగుస్తోంది. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోంది. ఇప్పటికే స్పెషలిస్టు వైద్యుల సహా సిబ్బంది నియామకాల్ని ఆపడంతో జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారు. మరోవంక బిల్లులు చెల్లించకుండా ఆరోగ్య శ్రీని…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 27, 2024 -
17 మంది చనిపోయినా చర్యలు తీసుకోని ప్రభుత్వం
-
అచ్యుతాపురం ఘటనపై బాబు సర్కార్ ఉదాసీన వైఖరి!
విజయవాడ, సాక్షి: అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ప్రమాదంపై చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శించిన ఉదాసీన వైఖరి తేటతెల్లమైంది. అంత భారీ ప్రమాదం జరిగితే.. ఏం పట్టనట్లు అధికారిక కార్యక్రమాల్లో మునిగిపోయారాయన. మంత్రుల సంగతి పక్కన పెడితే.. కనీసం అక్కడి ప్రజాప్రతినిధుల్ని కూడా ఆయన ఘటనా స్థలానికి వెళ్లమని ఆదేశించకపోవడం గమనార్హం. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో మధ్యాహ్నం 1.30 -2 గంటల మధ్య ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఆ టైంలో హోంశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఆ టైంలో ప్రమాదంపై సమాచారం అందినా.. ఆయన సహాయక చర్యలపై ఏమాత్రం సమీక్షించలేదు. పైగా ఆ మీటింగ్‌లో హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉన్నారు. వాళ్లకూ కనీస ఆదేశాలు ఇవ్వలేదు.చంద్రబాబు సమీక్ష అనంతరం.. 4 గంటలకు హోం మంత్రి అనిత ప్రెస్ మీట్ పెట్టారు. ప్రమాదంపై కనీసం స్పందించకుండా.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలతో సరిపెట్టారు. ఆ తర్వాత 5 గంటలకు సచివాలయంలో కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి శుభాష్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. అయితే ఆయన కూడా ప్రమాదంపై సగం సగం మాట్లాడారు. ప్రమాదంలో కార్మికులు ముక్కలు, చెక్కలైపోయారని అప్పటికే మీడియా ఛానెల్స్‌లో కథనాలు వచ్చాయి. ఇక పాలనా యంత్రాంగం అంతా ప్రెస్ నోట్లు, మీడియా దిగ్భ్రాంతులకే పరిమితం అయ్యింది. చివరకు.. రాత్రి 7 గంటలు దాటాక ప్రమాదంపై అనకాపల్లి కలెక్టర్‌తో చంద్రబాబు మాట్లాడారు. అర్ధరాత్రికి హోం మంత్రి అనిత ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నాం చంద్రబాబు అక్కడికి వెళ్లనున్నారు. అదే.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ తరహా ఘటనలు జరిగితే.. సత్వర చర్యలు ఉండేవి. స్థానిక ప్రజా ప్రతినిధులు సత్వరమే అక్కడికి పంపించి.. సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించేవారు. తద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించే యత్నమూ చేసేవారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున పరిహారం కూడా సత్వరంగా ప్రకటించి.. అదే త్వరగా బాధిత కుటుంబాలకు అందించేవారు. ఇదీ చదవండి: 'అచ్యుతాపురం సెజ్' బాధితులకు అండగా నిలవాలి: వైఎస్ జగన్ఇప్పుడు చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యే, ఎంపీ.. అఖరికి అధికారులు కూడా సకాలంలో అక్కడికి వెళ్లలేని దుస్థితి నెలకొందన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. మరోపక్క.. మదనపల్లె ఫైల్స్ ఘటనలో హెలికాఫ్టర్‌లో డీజీపీకి గంటలో పంపిన చంద్రబాబుకి.. అచ్యుతాపురం ఘటనలో సత్వరమే స్పందించాలన్న స్పృహ లేకపోవడంపై రాజకీయంగానూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
Delhi incident: ప్రమాదం వెనుక నిర్లక్ష్యం! ఏడుగురి అరెస్ట్
న్యూఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకోవడంతో.. అరెస్టుల సంఖ్య ఏడుకు చేరింది. అయితే ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోందనే విమర్శ బలంగా వినిపిస్తోందిప్పుడు. ప్రమాదానికి నెల ముందే ఈ ఇనిస్టిట్యూట్ పరిస్థితులపై అధికారులకు ఓ ఫిర్యాదు వెళ్లినట్లు తెలుస్తోంది. కిషోర్ సింగ్ కుష్వా అనే సివిల్స్ అభ్యర్థి.. కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(MCD)కు కోచింగ్ సెంటర్ నిర్వహణ తీరుపై లేఖ రాశాడు. ‘‘ఇది అత్యవసరమైన అంశం. విద్యార్థుల ప్రాణాలకు సంబంధించింది. కేవలం పార్కింగ్ కోసమో, స్టోరేజ్ కోసమో సెల్లార్లను ఉపయోగించుకోవాలన్న ఎంసీడీ నిబంధనలను కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పట్టించుకోవట్లేదు. .. సెల్లార్లోనే క్లాసులు, లైబ్రరీలను నిర్వహిస్తున్నారు. తద్వారా విద్యార్థులు, సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి కోచింగ్‌సెంటర్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని కిషోర్ సింగ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదు ఇంకా విచారణ దశలోనే ఉందని ఆయన చేసిన ఆన్లైన్ పోర్టల్‌లో స్టేటస్ చూపిస్తోంది. దీనిపై స్పందించడానికి అధికారులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. మరోవైపు.. ఢిల్లీలో జరిగిన దుర్ఘటనపై విద్యార్థులు, పలు రాజకీయ పార్టీల నేతలు మండిపడ్డారు. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని 12 రోజుల క్రితమే స్థానిక కౌన్సిలరుకు తెలియజేశామన్నారు. వెంటనే స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. ఏడుకు అరెస్టులు.. ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ ప్రమాద ఘటనలో.. బిల్డింగ్ యజమాని సహా ఐదుగురిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్టుల సంఖ్య ఏడుకి చేరింది. ఇంతకు ముందే కోచింగ్ సెంటర్ ఓనర్‌ను, కో ఆర్డినేటర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. దీంతో వాళ్లకు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. -
82 మార్కులు సాధిస్తే 18 వేశారు!
బత్తలపల్లి: పదో తరగతిలో ఫెయిల్‌గా చూపిన ఓ విద్యార్థి.. జవాబు పత్రం రీ వెరిఫికేషన్‌లో ఏకంగా 82 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. వివరాలు... బత్తలపల్లి మండలం రాఘవంపల్లికి చెందిన గోగుల సూర్యనారాయణ కుమారుడు అంజి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదివాడు. ఈ ఏడాది మార్చిలో బత్తలపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ కేంద్రంగా పబ్లిక్ పరీక్షలు రాశాడు. తెలుగులో 98, హిందీ 89, గణితం 92, భౌతిక శాస్త్రం 87, సాంఘిక శాస్త్రంలో 86 మార్కులు సాధించాడు. అయితే ఇంగ్లిష్‌లో కేవలం 18 మార్కులు వేయడంతో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. మెరిట్ విద్యారి్థగా మన్ననలు పొందిన అంజి ఫెయిల్ అయ్యాడనగానే ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. మానసికంగా కుదేలైన బాధిత విద్యారి్థకి సదరు ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ ధైర్యం చెప్పి వెంటనే రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయించారు. ఈ ఫలితాలు సోమవారం అందాయి. 100కు 82 మార్కులు వచ్చాయి. ఇన్విజిలేటర్ తప్పిదం కారణంగా తమ కుమారుడు ఇన్ని రోజులు మానసిక వేదన అనుభవించాడని తల్లిదండ్రులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను కోరారు. -
రామోజీఫిల్మ్ సిటీలో ప్రమాదం..ఒకరు మృతి, మరొకరికి గాయాలు
-
దేవుని కొలువులోనూ అదే నిర్లక్ష్యమా ?
-
ఒక బైక్‌పై ఓవర్‌స్పీడ్‌లో నలుగురు.. ముగ్గురి మృతి
సాక్షి, క్రైమ్: కాకినాడ జిల్లాలో నిర్లక్ష్యం ముగ్గురి జీవితాల్ని బలి తీసుకుంది. ఒకే బైక్‌పై నలుగురు యువకులు అతివేగంతో వెళ్లి ఓ ట్రాక్టర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. నాలుగో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. తాళ్లరేవు మండలం లచ్చిపాలెం బైపాస్ సెంటర్ వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు స్పాట్లోనే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వీళ్లంతా రత్తవారిపేట చెందిన పెయింటర్లుగా పోలీసులు గుర్తించారు. -
కోట్లు పెట్టి భవనాలు, లక్షలు పోసి పరికరాలు.. కాని ఏం లాభం..!
నారాయణ్‌పేట్: ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న’ చందంగా తయారైంది మద్దూరు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ) పరిస్థితి. రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రి భవనం, రూ.లక్షలు వెచ్చించి అధునాతన యంత్రాలు, సౌకర్యాలు కల్పించినా చివరికి వైద్యులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది జూన్ 16న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు 30 సీహెచ్‌సీని ప్రారంభించారు. అప్పటి నుంచి వైద్యారోగ్యశాఖ అధికారులు ఈ భవనాన్ని వైద్యవిధాన పరిషత్‌కు అప్పగించారు. దీంతో జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రి కిందకు ఈ సీహెచ్‌సీ వెళ్లింది. జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక డాక్టర్‌తో పాటు పీహెచ్‌సీలోని స్టాఫ్ నర్స్‌లతో ఇక్కడ వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఉదయం సయమంలో పీహెచ్సీలో పనిచేస్తున్న ఓ డాక్టర్ ఓపీ చూస్తున్నారు. అత్యవసర సమయంలో వైద్యం కావాలంటే గతంలో మాదిరిగానే జిల్లా కేంద్రానికి లేదా మహబూబ్‌నగర్‌కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎనిమిది మంది డాక్టర్లకు ఒక్కరే..? సీహెచ్‌సీ అసుపత్రిలో గైనిక్ సేవలు, జనరల్ సర్జన్, చిన్నపిల్లలకు వైద్య నిపుణుడు, మత్తు వైద్యుడు, దంత, అత్యవసర సేవలకు ఇలా మొత్తం ఎనిమిది మంది డాక్టర్లు, ఒక సూపరింన్డెంట్, ఇద్దరు ఫార్మసిస్టులు, ఒక అయూష్ మెడికల్ అధికారి, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ, అఫ్తాలమిక్ అసిస్టెంట్, డెంటల్ అసిస్టెంట్, ఓటి టెక్నీషియన్ 10 మంది నర్సులు, ఇతర సిబ్బందితో పాటు మరో 20 మంది పనిచేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నారు. పీహెచ్సీలో, జిల్లా అసుపత్రిలో పనిచేసే స్టాఫ్‌నర్స్‌లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలాఉండగా, ఈ సీహెచ్‌సీకి ఎలాంటి పోస్టులు ఇంకా మంజూరు కాకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అసుపత్రిలో పనిచేస్తున్న వారిని ఇక్కడి పంపించినట్లు అధికారులు తెలిపారు. అన్నీ ఉన్నా.. రూ.3.67 కోట్లతో సీహెచ్‌సీ భవన నిర్మాణం చేపట్టారు. ఈ ఆస్పత్రిలో అప్పటి కలెక్టర్ హరిచందన చొరవతో 2022 డిసెంబర్ 27న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(యూఎస్ఏ) సంస్థ సహకారంతో రూ. 10లక్షల వ్యయంతో 10 బెడ్లకడ్లాక్సిజన్ అందించేందుకు వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఈసీజీ, స్కానింగ్, తదితర వైద్య పరీక్షల సామగ్రి కూడా అందుబాటులో ఉంది. అన్నీ ఉన్నా డాక్టర్లే లేకపోవడం గమనార్హం. వైద్యం అందింటే నా భార్య బతికేది.. నెలలు నిండిన నా భార్య కాన్పు కోసం మద్దూరు సీహెచ్‌సీకి వచ్చింది. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన నర్సులు కాన్పు చేస్తామన్నారు. తీరా డెలవరీ సమయంలో రక్తస్రావాన్ని అరికట్ట లేకపోవడంతో నా భార్య, బిడ్డ ఇద్దరూ చనిపోయారు. ఒకవేళ డాక్టర్లు అందుబాటులో ఉండి ఉండే నా భార్య, పాప చనిపోయి ఉండేవారు కాదు. – కృష్ణ, తిమ్మారెడ్డిపల్లి, మద్దూరు, మండలం పోస్టులు మంజూరు కాలే.. వైద్యవిధాన పరిషత్ నుంచి మద్దూరు, కోస్గి ఆస్పత్రులకు పోస్టులు మంజూరు కాలేదు. జిల్లా ఆస్పపత్రి నుంచి ఒక డాక్టర్‌ను డిప్యూటేషన్‌పై ఓపీ చూడడానికి అక్కడికి పంపిస్తున్నాం. జిల్లా ఆస్పత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు వెళ్లిపోయారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పోస్టులు మంజూరు అవ్వొచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. – రంజిత్‌కుమార్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, నారాయణపేట అత్యవసర వైద్యం అందక.. గతేడాది ఆగస్టు 5న మండలంలోని తిమ్మారెడ్డిపల్లి చెందిన నిండు గర్భిణి కృష్ణవేణి(26) పురుటినొప్పులు రావడంతో ఇదే సీహెచ్‌సీ రాగా... వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్స్‌లు కాన్పు చేసేందుకు యత్నించారు. శిశువు పురిటిలోనే మృతి చెందగా.. శిశువు మృతదేహాన్ని బయటకు తీసే క్రమంలో తీవ్ర రక్తస్రావం కావడంతో గర్భిణిని హుటాహుటీనా 108లో జిల్లా అసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్త స్రావం కావడంతో ఆమె సైతం మృతి చెందింది. ఒకవేళా అందుబాటులో వైద్యులు ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని మృతురాలి భర్త కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సీహెచ్‌సీ.. మద్దూరు, దామరగిద్ద, దౌల్తాబాద్, మండలాల నుంచి దాదాపు 80 గ్రామాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. -
మా రేషన్ కార్డు ఎప్పుడు వస్తది సారు..?!
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే తెల్లరేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తరువాత ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులను ఇవ్వలేదు. 2016లో మాత్రం ఆహార భద్రత కార్డులను జారీ చేసింది. ఆ సందర్భంలో చాలా మంది కొత్తగా కార్డులు, పేర్ల మార్పిడి, పిల్లల పేరు ఎక్కించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అలాంటి సమస్యలు అన్ని పరిష్కారం కాకపోను చాలా మందికి కొత్తగా రేషన్ కార్డులు అందని పరిస్థితి నెలకొంది. ఆతరువాత ప్రభుత్వం రేషన్ కార్టులకు సంబంధించి ఆన్లైన్ సైట్‌ను బందు పెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలంటే అధికారులు రేషన్ కార్డులు తప్పనిసరిగా ఉండాలని చెబుతుండడంతో చాలామంది పేదలు పథకాలకు దూరమవుతున్నారు. రేషన్ కార్డుల్లేక.. వేలాది దరఖాస్తుల తిరస్కరణ.. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు సొంతిల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థికసాయం చేస్తోంది. ఇందుకోసం ఇటీవల జిల్లా వ్యాప్తంగా పేదల నుంచి దరఖాస్తులను స్వీకరించగా మొత్తం 78,890 మంది దరఖాస్తు వచ్చాయి. అందులో నియోజకవర్గానికి 3 వేల మందికి ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల పరిధిలో 18 వేల మందికి మొదటి విడతగా లబ్ధి పొందనున్నారు. అయితే ఈ పథకానికి వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో కేవలం 11 వేల మందిని మాత్రమే అధికారులు అర్హులుగా గుర్తించారు. ఇందులో తెల్ల రేషన్ కార్డులు లేక చాలా మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇదిలా ఉంటే బీసీ కులవృత్తిదారులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది. ఈ పథకానికి మొత్తం41,863 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కూడా రేషన్ కార్డులేని వారి వేలాది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వీటితోపాటు మైనార్టీ బంధు పథకంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా తాము ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కొత్త రేషన్ కార్డులతోపాటు పేర్ల మార్పులు, కొత్తగా పిల్లల పేర్లు ఎక్కించి కొత్త కార్డులు పంపిణీ చేయాలని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు కోరుతున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే.. ప్రస్తుతం ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన గృహలక్ష్మి, బీసీలకు ఆర్థిక సాయం, మైనార్టీ బంధు, దళిత బంధు పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతిఒక్క దరఖాస్తుదారు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. లేదంటే దరఖాస్తు చేసుకున్నా కూడా ఆన్లైన్లో తీసుకోని పరిస్థితి. అయినా కొందరు ఆన్లైన్లో కాకుండా కొన్ని పథకాలకు నేరుగా తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తుల ఆధారంగా అక్కడ ఆన్లైన్ చేశారు. కానీ, రేషన్ కార్డులేక పోవడంతో చాలా మంది దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడంతో అధికారులు వాటిని తిరస్కరిస్తున్నారు. రేషన్ కార్డు అందించాలి తెల్ల రేషన్ కార్డు లేకపోవడంతో మేము గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోలేక పోయాము. గతంలో డబుల్ బెడ్రూం ఇల్లు కూడా రాలేదు. 2016లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఉంటేనే పథకాలకు అర్హులని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికై నా రేషన్ కార్డు ఇచ్చి ఆదుకోవాలి. – అంబటి సంధ్య, పెద్దదేవులపల్లి తెల్ల రేషన్‌కార్డు లేక దరఖాస్తు చేసుకోలేదు నాకు రేషన్ కార్డు లేదు. చాలా కాలం క్రితం దరఖాస్తు చేసుకున్నాను. అయినా కార్డు రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తుంది. కానీ, రేషన్ కార్డులేక నేను దరఖాస్తు చేసుకోలేక పోయాను. ప్రభుత్వ పథకాలన్నింటికీ రేషన్ కార్డు తప్పనిసరి చేసి పేదలకు అవి పంపిణీ చేయకపోవడంతో పథకాల ఫలాలు అందరికీ అందడం లేదు. – శ్రీకాంత్, హనుమాన్ పేట, మిర్యాలగూడ -
అది చెత్తకుండి కాదు..! కంట్రోల్ వాల్వ్..!!
కరీంనగర్: నగరంలోని పలు రిజర్వాయర్లకు తాగునీటిని సరఫరా చేసే మెయిన్ కంట్రోల్ వాల్వ్ అది. కానీ చెత్తచెదారం.. మూత్రవిసర్జనకు నిలయంగా మారింది. నగరంలోని ఫిల్టర్‌బెడ్ నుంచి తాగునీటి ప్రధాన పైప్‌లైన్ భగత్‌నగర్‌లోని అంబేడ్కర్ స్టేడియం నుంచి రిజర్వాయర్లకు వెళ్తుంది. అంబేడ్కర్ స్టేడియం మెయిన్ గేట్ సమీపంలోని నాలా పక్కన దీనికి కంట్రోల్ వాల్వ్ ఉంది. దీని నిర్వహణపై అధికారులు ఇన్నాళ్లు దృష్టి పెట్టకపోవడంతో డస్ట్‌బిన్‌గా మారింది. సమీపంలోని వ్యాపారులు చెత్తాచెదారాన్ని ఇందులో పడేస్తుండటంతో గుట్టలుగా పేరుకుపోయింది. అలాగే ఈ ప్రాంత వాసుల కువాల్వ్ చాంబర్ సులభ్ కాంప్లెక్స్‌గా మారింది. రిజర్వాయర్లకు సరఫరా చేసే తాగునీరు కలుషితమ య్యే ప్రమాదం ఏర్పడింది. శనివారం నగరపాలక సంస్థ సిబ్బంది వాల్వ్‌కు మరమ్మతు చేసేందుకు వచ్చారు. వారు చెత్త గుట్టను చూసి, ఖంగుతిన్నారు. వెంటనే దాన్ని తొలగించారు. వాల్వ్‌కు భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి రాకూడదంటే చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
‘సీఎమ్మార్’పై నిర్లక్ష్యం
జగిత్యాల రూరల్: జిల్లాలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని వాటి సామర్థ్యాన్ని బట్టి రైస్‌మిల్లులకు ప్రభుత్వం కేటాయించింది. ధాన్యాన్ని మరపట్టించి బియ్యంగా మార్చి స ర్కారు ఇచ్చిన గడువులోగా సీఎమ్మార్ అప్పగించాలి. కానీ, రైస్‌మిల్లర్లు బియ్యం అప్పగింతలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఫలితంగా బియ్యం సేకరణలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవడంతోపాటు ఆంక్షలు విధిస్తోంది. అంతేకాదు.. నిర్దేశిత గడువులోగా బియ్యం అప్పగించాలని మిల్లర్లపై ఒత్తిడి పెంచుతోంది. మిల్లుల్లో అధికారులను నియమించి మర ఆడించే పనులనూ పర్యవేక్షిస్తోంది. సెప్టెంబర్ వరకు గడువు 2022–23 వానాకాలం సీజన్లో ప్రభుత్వం సేక రించిన 3,38,187 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లాలోని 132 రైస్‌మిల్లులకు అప్పగించింది. ఆ ధాన్యం స్వీకరించిన మిల్లర్లు.. 2,26,585 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్)ను ప్రభుత్వాని(ఎఫ్‌సీఐ)కి అప్పగించాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు కేవలం 28,780 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే మిల్లర్లు సర్కారుకు అప్పగించారు. రంగంలోకి దిగిన అధికారులు.. మిగతా బియ్యాన్ని సెప్టెంబర్ చివరి నాటికి అప్పగించాలని మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారు. బియ్యం అప్పగింతలో జాప్యం.. జిల్లాలో 2021–22 వానాకాలం సీజన్లోనూ 3,25,444 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 135 మంది రైస్‌మిల్లర్లకు అప్పగించారు. మిల్లర్లు ఇప్పటివరకు 2,06,171 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తిరిగి అప్ప గించారు. ఇంకా 38 మంది రైస్‌మిల్లర్లు 11,875 మె ట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. 2021– 22 యాసంగి సీజన్లో 2,70,776 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 125 మంది రైస్‌మిల్లర్లకు అధికారులు అప్పగించారు. మిల్లర్లు ఇప్పటివరకు 1,77,018 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎమ్మార్ కింద ఎఫ్‌సీఐకి అప్పగించారు. మిగతా ఏడుగురు రైస్‌మిల్లర్లు.. 6,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. నిర్లక్ష్యంపై ఆగ్రహం.. జిల్లాలో ప్రభుత్వం సేకరించిన ధాన్యం తీసుకున్న రైస్‌మిల్లర్లు. సకాలంలో సీఎమ్మార్ అప్పగించడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం మిల్లర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతోపాటు, ఆయా రైస్‌మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతోంది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం నిల్వలు తరచూ తనిఖీ చేయిస్తోంది. నిల్వల్లో వ్యత్యాసం వచ్చిన మిల్లర్లపై తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రతినెలా సమీక్ష.. సీఎమ్మార్ అప్పగింతలో రైస్‌మిల్లర్లు చేస్తున్న జాప్యంపై చర్యలు చేపట్టడంతో పాటు, ప్రతినెలా రైస్‌మిల్లర్లతో కలెక్టర్, అదనపు కలెక్టర్లు సమీక్షిస్తున్నారు. నిర్దేశిత గడువులోగా బియ్యం అప్పగించాలని రైస్‌మిల్లర్లను ఆదేశిస్తున్నారు. బియ్యం అప్పగించిన మిల్లర్లు మినహా అప్పగించని వారిని గుర్తించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. -
LB Nagar: కారు డోర్ తగిలి రెండేళ్ల పాప మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నిర్లక్ష్యం రెండేళ్ల పాప జీవితాన్ని బలి తీసుకుంది. చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం మన్సురాబాద్ నుంచి ఎల్బీ నగర్ రూట్లో.. కారు డ్రైవర్ రోడ్డులో కారు ఆపాడు. ఓ వ్యక్తి దిగి వెళ్లిపోగా.. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి హఠాత్తుగా కారు డోర్ తీశాడు. ఆ సమయంలో పక్క నుంచి వెళ్తున్న బైకు కారుడోర్కు తగిలింది. దీంతో ఆ బైక్‌పై ఉన్న కుటుంబ సభ్యులు కిందపడిపోయారు. రెండేళ్ల వయసున్న చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆ కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మృతి చెందిన చిన్నారిని ధనలక్ష్మి(2)గా గుర్తించారు పోలీసులు. చిన్నారి తల్లి శశిరేఖ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆమె భర్త గాయాలతో బయటపడినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.] కేసు నమోదు ఎల్బీనగర్లో చిన్నారి మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారును సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతిచెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద స్థలంలో ఇప్పటికీ రోడ్డుపైనే వాహనాలు నిలిచిపోయాయి. అయినా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. -
జగిత్యాల పెద్దాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం...మహిళా కడుపులో గుడ్డ మర్చిన వైద్యులు
-
విజయవాడ:చంటిబిడ్డను బలిగొన్న నిర్లక్ష్యం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కన్నతల్లి నిర్లక్ష్యం చంటిబిడ్డ ప్రాణాలు హరించింది. ముఖం నుంచి నడుం వరకూ అంతా వేడి నీటికి కాలిపోయినా మృత్యువుతో ఆ బిడ్డ చేసిన పోరాటం చివరకు విషాదంగా ముగిసింది. బోసి నవ్వులు, బుడి బుడి అడుగులు ఇక కనపడవన్న విషయం తెలిసిన ఆ కన్నవారికి కన్నీళ్లే మిగిల్చింది. కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు వేడి నీటి బకెట్లో పడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కొత్తపేట పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంబాడీపేటకు చెందిన ఆదిమల్ల ప్రణితి, ప్రేమ్కుమార్లు భార్యభర్తలు. వీరికి పాప(8 నెలలు) సంతానం. ప్రేమ్‌కుమార్ సెంట్రింగ్ పని చేస్తుండగా, ప్రణితి ఇంట్లోనే ఉంటుంది. ఈ నెల 27వ తేదీన భర్త ప్రేమ్‌కుమార్ పనికి వెళ్లగా, పాపకు స్నానం చేయించేందుకు మంచం పక్కనే.. ప్లాస్టిక్ బకెట్లో ఎలక్ట్రికల్ హీటర్ పెట్టి బాత్రూమ్లోకి వెళ్లింది. ఇంతలో గదిలో నుంచి పాప ఏడుపు వినిపించడంతో కంగారుగా వచ్చి చూసింది. పాప వేడినీటి బకెట్లో తల కిందులుగా పడి ఉండటంతో భయంతో కేకలు వేసింది. పాపను వేడినీటిలో నుంచి బయటకు తీయగా ముఖం, రెండు చేతులు, పొట్ట భాగం, వీపు, కాలి భాగం కాలిపోవడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో పాప చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పసిపిల్లలు ఉన్న ఇంట్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న విషయాలే కదా అనుకుంటారు తల్లిదండ్రులు, పెద్దలు. కానీ, ఆ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే.. అనుక్షణం పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. -
మృతదేహాలనే మార్చేశారు..
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం మార్చురీలో సిబ్బంది నిర్లక్ష్యంతో శనివారం అనూహ్య ఘటన చోటు చే సుకుంది. రెండు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఒకరి మృతదేహానికి బదులు మరొకరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో వారు తమ ఇళ్లకు తీసుకెళ్లి మృతదేహాలను చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తమ బిడ్డ చనిపోయాడని రోదించే క్రమంలో పోస్టుమార్టం సిబ్బంది కట్టిన కట్టు విప్పి చూసే సరికి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసుల సహకారంతో ఇరువురు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆందోళన చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి.. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తానేదార్పలి్లకి చెందిన రాగుల రమేశ్ (33) శుక్రవారం కుటుంబ కలహాలతో పురుగుల మందుతాగి ఎంజీఎంలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. దీంతో వైద్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన అశాడపు పరమేశ్ (45) నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీంతో పరమేశ్ మృతదేహాన్ని సైతం పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. శనివారం పోలీసుల పంచనామా అనంతరం రెండు మృతదేహాలకు ఫోరెన్సిక్ వైద్యులు పో స్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పూర్తిస్థాయిలో మృతదేహాలకు క ట్టు కట్టి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయి తే మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లి రోదిస్తున్న క్ర మంలో కట్టు విప్పి చూడగా మృతదేహం తమది కా దని భావించిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు ల సహాయంతో మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మార్చురీ సి బ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఎవరి మృతదేహాలను వారికి అప్పగించారు. ఈ విషయంపై ఎంజీఎం పరిపాలనాధికారులను వివరణ కోరగా ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
180 కిలో మీటర్లు.. 5 ఆస్పత్రులు.. సకాలంలో వైద్యం అందక తల్లీబిడ్డ మృతి
సాక్షి, అమ్రాబాద్/పాలమూరు: కాన్పు విషయంలో కుటుంబ సభ్యులు చేసిన జాప్యం, సకాలంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం రెండు నిండుప్రాణాలను బలితీసుకున్నాయి. పురిటినొప్పుల తో బాధపడుతూ రెండు పీహెచ్‌సీలు, రెండు ఆస్పత్రుల పరిధిలో 180 కి.మీ. దూరంపాటు ప్రయా ణించినా తల్లీబిడ్డ ప్రాణాలు దక్కలేదు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో సోమ వారం అర్ధరాత్రి ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం వంకేశ్వరానికి చెందిన స్వర్ణ(23)కు రెండేళ్ల క్రితం అమ్రాబాద్ మండలం ఎల్మపల్లికి చెందిన చారగొండ ప్రసాద్‌తో వివాహమైంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. స్వర్ణ గర్భం దాల్చడంతో కాన్పు కోసం 2 నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. సోమవారం రాత్రి 8:30 గంటల సమయంలో నొప్పులు రావడంతో ప్రైవేటు వాహనంలో ఆమెను పదర పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ కిందిస్థాయి సిబ్బందే ఉండటంతో భయపడిన కుటుంబ సభ్యులు... అమ్రాబాద్ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ కూడా వైద్యుడు లేకపోవడంతో అచ్చంపేటకు తీసుకెళ్లారు. అప్పటికే చాలా దూరం ప్రయాణించడంతో స్వర్ణకు ఫిట్స్ వచ్చాయి. అచ్చంపేట ఆస్పత్రి వైద్యులు నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి సిఫార్సు చేయడంతో అంబులెన్స్‌లో బయల్దేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు ప్రాథమికంగా ఇంజక్షన్లు ఇచ్చి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేయగా సోమవారం అర్ధరాత్రి 2:30గం. సమయం లో అక్కడికి చేరుకున్నారు. చివరకు సోమవారం అర్ధరాత్రి దాటాక 3:30 గంటలకు వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. కానీ ప్రసవించిన కాసేపటికే ఊపిరి తీసుకోలేక శిశువు మృతి చెందింది. అరగంట తర్వాత బాలింత కూడా మరణించింది. పదర, అమ్రాబాద్ పీహెచ్‌సీల్లో వైద్యులు అందుబాటులో ఉండి ప్రసవం చేసుంటే తమ బిడ్డ బతికేదని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గుండెపోటుతో మృతి చెందింది... స్వర్ణకు బీపీ సమస్య ఉంది. ప్రసవ సమయం కంటే ముందే ఆస్పత్రిలో ఆడ్మిట్ కావాలని స్థానిక వైద్యులు సూచించినా కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేసి నొప్పులు మొదలయ్యాకే అమ్రాబాద్ తీసుకెళ్లారు. అప్పటికే ఆమెకు ఒకసారి ఫిట్స్ వచ్చాయి. అక్కడి నుంచి అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ఆ తర్వాత మహబూబ్‌నగర్‌కు వచ్చేసారికి నాలుగుసార్లు ఫిట్స్ వచ్చాయి. మేం సాధారణ ప్రసవం చేశాక మరోసారి ఫిట్స్, ఆపై గుండెపోటు రావడంతో స్వర్ణ మృతి చెందింది. – మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ చదవండి: చేర్యాల జెడ్పీటీసీ హత్య: భూముల అమ్మకాలా.. బీరప్పగుడి వ్యవహారమా? -
ఎనిమిదేళ్లనాటి ఘటన.. అపోలో వైద్య బృందానికి భారీ జరిమానా
సాక్షి, హైదరాబాద్: వైద్యసేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అపోలో ఆసుపత్రి వైద్యుల బృందానికి భారీ జరిమానా విధించింది రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఆదేశించింది. బాధిత కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని తెలిపింది. ఈ ఘటన ఎనిమిదేళ్ల కిందటి నాటిది కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం చందానగర్ హుడా కాలనీలో నివసించే ఎం.ఆర్.ఈశ్వరన్(53) తీవ్ర కడుపునొప్పితో 2012 సెప్టెంబర్ 18న జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అప్పటికే డయాబెటిక్ పేషెంట్‌గా ఎనిమిదేళ్లు ఆయన వైద్య సహాయం పొందుతున్నాడు. ఈశ్వరన్‌ను పరీక్షించిన వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకొని కొలొనోస్కోపీ టెస్ట్ చేయించాలని సూచించారు. అదే నెల 20న మధ్యాహ్నం 12 గంటలకు ‘కొలొనోస్కోపీ’పరీక్ష కోసం వైద్యులు అపాయింట్మెంట్ ఇవ్వగా, 3 గంటలు ఆలస్యంగా పరీక్షకు తీసుకెళ్లారు. అయితే ఈశ్వరన్ స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లాడు. 116 రోజులు వెంటిలేటర్‌పై ఉండి 2013 జనవరి 14న చనిపోయాడు. ఆసుపత్రి వైద్యులు, మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతోనే ఈశ్వరన్ చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్ర వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంతో.. తాజాగా పరిహారం తీర్పు వెల్లడించింది ఫోరం. ఇదీ చదవండి: డబ్బుకోసం చూస్తే.. సుతారీ మేస్త్రీకి గుండె ఆగినంత పనైంది -
లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న సచివాలయ సిబ్బంది తీరు
పాములపాడు: ప్రజలకు నాణ్యమైన పాలన అందించడమే కాకుండా, మరింత చేరువ చేయాలని ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. ఎంతో మంది నిరుద్యోగులకు గ్రామంలో ఉద్యోగం కల్పించింది. ఈ విధానం విజయవంతం కావడంతో పలు రాష్ట్రాలు అధ్యయనం చేసి అమలు చేయడానికి పూనుకున్నాయి. అయితే కొన్నిచోట్ల స్థానిక సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. మండలంలోని చెలిమిల్ల గ్రామంలో సచివాలయ ఉద్యోగుల తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఉదయం 11.30 దాటినా ఒక్కరు కూడా విధులకు హాజరుకాకపోవడం, కార్యాలయానికి వచ్చిన వారిని పట్టించుకోకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు నిరీక్షించి వెనుదిరిగి వెళ్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని సక్రమంగా విధులు నిర్వర్తించేలా చూడాలని కోరుతున్నారు. -
ఆడుకున్న తండ్రి భుజాల మీదే శవంగా..
భోపాల్: మన దేశంలో వైద్యం.. సగటు మనిషికి ఇంకా అందనంత దూరంలోనే ఉంది. ఒకవైపు జనాలకు సరిపడా వైద్య సిబ్బంది లేనేలేరు. మరోవైపు.. నిత్యం ఏదో ఒక ఘటన వైద్య సౌకర్యాల, సదుపాయాల డొల్లతనాన్ని బయటపడుతూనే ఉంది. అలాంటిదే వైరల్ అవుతున్న ఈ ఘటన. మధ్యప్రదేశ్ ఛతార్పూర్ జిల్లాలో తాజాగా జరిగిన ఓ ఘటన వైరల్ అవుతోంది. నాలుగేళ్ల పసికందు శవాన్ని భుజాన వేసుకుని కాలినడకన చేరుకున్నాడు ఓ తండ్రి. దారిలో ఉన్న ఓ ఊరి ప్రజలు కొందరు తీసిన ఈ వీడియో వైరల్ కావడంతో వైద్యాధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ చిన్నారి కుటుంబం పౌడీ గ్రామానికి చెందింది. సోమవారం ఉన్నట్లుండి తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని తొలుత ఆమె కుటుంబం బుక్స్‌వాహా హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లింది. ఆపై పరిస్థితి విషమించడంతో మంగళవారం దామోహ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అదేరోజు ఆ చిన్నారి కన్నుమూసింది. బిడ్డ శవాన్ని ఊరికి తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్ కోసం విజ్ఞప్తి చేయగా.. ఆస్పత్రి సిబ్బంది సానుకూలంగా స్పందించలేదు. దీంతో బిడ్డ శవాన్ని దుప్పటితో కప్పి.. నిద్రపోయినట్లుగా.. ఓ బస్సులో బుక్స్‌వాహాకు చేసుకున్నాడు ఆ బిడ్డ తండ్రి. అక్కడ బిడ్డ తండ్రి, నగర్ పంచాయితీ వాళ్లను ఏదైనా వాహనం సమకూర్చమని అడిగాడు. కానీ, అధికారులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో డబ్బుల్లేక.. అక్కడి నుంచి కాలినడకనే బిడ్డ శవాన్ని భుజాన మోసుకుంటూ వెళ్లాడు ఆ తండ్రి. చివరికి.. ఓ ఊరి ప్రజలు ఆ ఘటనను వీడియో తీయడంతో పాటు ఆ బిడ్డ తండ్రికి సాయం చేశారు. A family in Chhatarpur had to carry the dead body of a four-year-old girl on their shoulders as the authorities allegedly did not provide a hearse to them to return to their village @ndtv @ndtvindia pic.twitter.com/vyTJ0meRpp — Anurag Dwary (@Anurag_Dwary) June 10, 2022 ఇదిలా ఉంటే.. సాగర్ జిల్లా గధాకోటలో ఓ వ్యక్తి చనిపోతే ఆంబులెన్స్‌కు నిరాకరించారు ఆస్పత్రి సిబ్బంది. గత్యంతరం లేక తోపుడుబండి మీద సోదరుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు ఓ వ్యక్తి. మరో ఘటనలో భగవాన్‌పుర దగ్గర గర్భిణికి సకాలంలో ఆంబులెన్స్ అందకపోవడంతో కన్నుమూసింది. ఈ మూడు ఘటనలు వరుసగా వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. ఘటనలపై దర్యాప్తునకు ఆదేశించింది. అయితే దామోహ్ ఘటనపై ఆస్పత్రి అధికారులు స్పందిస్తూ.. ఆంబులెన్స్ కోసం తమకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదని చెప్తున్నారు. గధాకోట ఘటనపై మెడికల్ ఆఫీసర్ సుయాష్‌స్పందిస్తూ.. పోస్ట్ మార్టం అయ్యేదాకా ఎదురు చూడమంటే.. వినిపించుకోకుండా మృతదేహాన్ని తీసుకెళ్లారని చెప్పారు. భగవాన్‌పుర ఘటనపై మాత్రం దర్యాప్తునకు ఆదేశించినట్లు వైద్యాధికారులు చెప్తున్నారు. -
బస్సు రూపంలో వెంటాడిన మృత్యువు....మిన్నంటిన రోదనలు
దేవుడా ఎంత పని చేశావయ్యా.. సంతోషంగా శుభకార్యానికి వెళ్తున్న వారిని ఎందుకింత నిర్దయగా కబళించావు.. మేము ఏం పాపం చేశామయ్యా.. ఇంత విషాదాన్ని మా కుటుంబాలకు మిగిల్చావు’ అంటూ బస్సు ప్రమాద బాధితులు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. తిరుపతి సమీపంలోని భాకరాపేట వద్ద లోయలో బస్సు బోల్తాపడిన ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను అంబులెన్సుల్లో ధర్మవరానికి తీసుకురాగానే బాధితుల రోదనలు మిన్నంటాయి. సాక్షి, ధర్మవరం టౌన్/ అర్బన్/ తనకల్లు/ కదిరిటౌన్/ పుట్టపర్తి: ధర్మవరంలోని ప్రముఖ పట్టు చీరల వ్యాపారి మలిశెట్టి మురళి కుమారుడు వేణు వివాహ నిశ్చితార్థ వేడుకలకు తిరుచానూరులోని రాధాకృష్ణ కల్యాణమండపానికి బయల్దేరిన వారిని బస్సు ప్రమాద రూపంలో మృత్యువు వెంటాడింది. భాకరాపేట వద్ద లోయలో శనివారం రాత్రి బస్సు బోల్తాపడిన ఘటనలో అక్కడికక్కడే ఎనిమిది మంది మృతి చెందగా, ఆదివారం సాయంత్రం మరొకరు చనిపోయారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. మృతుల్లో ధర్మవరానికి చెందిన మలిశెట్టి మురళి (45), తమ్ముడు మలిశెట్టి గణేష్ (42), మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ (38), బంధువు, పెళ్లిళ్ల పేరయ్య అయిన మలిశెట్టి వెంగప్ప (75), భార్య నాగలక్ష్మి (60), తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు చెందిన జింకా చంద్ర కుమార్తె చందన (10), ధర్మవరానికి చెందిన బస్సు డ్రైవర్ నబీరసూల్ (42), కదిరికి చెందిన క్లీనర్ షకీల్ (22), మలిశెట్టి మురళి స్నేహితుడు, విలేకరి అయిన బుక్కపట్నం మండలం మారాలకు చెందిన ఆదినారాయణరెడ్డి (45) ఉన్నారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, మరో కుటుంబంలో దంపతులు ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదం మిగి ల్చింది. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు 33 మంది ఉన్నారు. కన్నీటి వీడ్కోలు.. బస్సు ప్రమాద మృతుల్లో ఎక్కువమంది ధర్మవరానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. తిరుపతి ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మలిశెట్టి మురళి, తమ్ముడు గణేష్, మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ మృతదేహాలను ఆదివారం అంబులెన్స్‌లో కొత్తపేట ఉషోదయ స్కూల్ వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు బోరున విలపించారు. మృతదేహాలను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోదరుడు, వైఎస్సార్సీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, ఏపీ ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ వడ్డే బాలాజీ, దేవరకొండ రమేష్, గుండా ఈశ్వరయ్య సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గరుడంపల్లి సమీపాన మలిశెట్టి మురళి పొలంలో నిర్వహించిన ముగ్గురి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మలిశెట్టి వెంగప్పకు హిందూ శ్మశాన వాటికలోను, డ్రైవర్ నబీరసూల్‌కు ముస్లిం శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. కదిరిలో క్లీనర్ షకీల్, బుక్కపట్నం మండలం మారాలలో విలేకరి ఆదినారాయణరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారి చందనకు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ సమీపంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మృత్యువులోనూ వీడని బంధం.. ధర్మవరం పట్టణానికి చెందిన మలిశెట్టి మురళి, తమ్ముడు గణేష్, మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ బస్సు ప్రమాదంలో మృతిచెందారు. ముగ్గురు అన్నదమ్ములూ పట్టుచీరల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. కానీ బస్సు ప్రమాదం ఆ ఇంట విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతంగా మారింది. మురళి కుమారుడు వేణు (పెళ్లికొడుకు), భార్య లలితమ్మ, తమ్ముడు గణేష్ భార్య భైరవి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మురళి మృతితో అన్నదమ్ముల కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయినట్లయ్యింది. నీ వెంటే నేనూ.. ధర్మవరానికి చెందిన మలిశెట్టి వెంగప్ప శనివారం రాత్రి బస్సు ప్రమాదంలో మృతిచెందగా, గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని భార్య నాగలక్ష్మి (60) ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. భర్త మృతి చెందిన విషయం కూడా ఆమెకు తెలియకనే కన్నుమూసింది. అర్ధంతరంగా ముగిసిన విలేకరి జీవితం.. బుక్కపట్నం మండలం మారాల గ్రామానికి చెందిన ఆదినారాయణరెడ్డి బస్సు ప్రమాదంలో మృతిచెందారు. ఆదినారాయణరెడ్డి 20 ఏళ్లుగా పత్రికారంగంలో విలేకరిగా పనిచేస్తున్నారు. మలిశెట్టి మురళి స్నేహితుడు కావడంతో ఆయన కుమారుడి నిశ్చితార్థానికి ఆదినారాయణరెడ్డి బస్సులో వెళ్లారు. అలా వెళ్లిన విలేకరి అర్ధంతరంగా తనువు చాలించాడు. ఈయనకు భార్య గౌతమి, కుమార్తె మనీషా, కుమారుడు గణేష్‌రెడ్డి ఉన్నారు. అయ్యో ‘పాపం'.. ధర్మవరం కొత్తపేట నివాసి జింకా చంద్ర కుమార్తె జింకా చందన (10) స్థానిక మున్సిపల్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది. బంధువుల నిశ్చితార్థానికి వెళ్లి బస్సు ప్రమాదంలో చందన మృతి చెందింది. తండ్రి చంద్ర తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరి సొంతూరు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్. ఛిద్రమైన పేదల బతుకులు బస్సు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ నబీరసూల్, క్లీనర్ షకీల్ నిరుపేదలు. ఈ ప్రమాదంతో రెండు కుటుంబాలు ఛిద్రమయ్యాయి. కదిరికి చెందిన క్లీనర్ షకీల్ అవివాహితుడు. నార్పల మండలం గూగూడుకు చెందిన డ్రైవర్ నబీరసూల్ 12 ఏళ్ల క్రితం పొట్టకూటి కోసం తాడిపత్రికి వెళ్లాడు. అక్కడి నుంచి ధర్మవరం చేరుకుని డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఊహించని విధంగా మృత్యువాత పడటంతో ఇతని భార్య, ఇద్దరు పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇతని సోదరుడు హైదర్‌వలి కూడా లారీడ్రైవర్‌గా వెళ్తూ 16 క్రితం ముదిగుబ్బ వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. (చదవండి: లోయలో పడ్డ బస్సు.. ప్రమాదానికి కారణాలివే..!) -
లోయలో పడ్డ బస్సు.. ప్రమాదానికి కారణాలివే..!
సాక్షి, తిరుపతి: అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని చిత్తూరు జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్ ఎం.బసిరెడ్డి తెలిపారు. తిరుపతి సమీపంలోని భాకరాపేట వద్ద ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై ఆయన స్పందిస్తూ.. ఘాట్ రోడ్లో మలుపు గుర్తించకుండా స్ట్రెయిట్‌గా వెళ్లడం వల్ల ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు. చదవండి: 300 అడుగుల లోతు.. చిమ్మ చీకటి.. ప్రాణాలను పణంగా పెట్టి.. చెప్పినా డ్రైవర్ వినలేదు: పెళ్లికొడుకు వేణు బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు తెలిపారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని పెళ్లికొడుకు వేణు అన్నారు. స్పీడ్‌గా వెళ్లొద్దంటూ చెబుతున్నా డ్రైవర్ వినలేదని.. ఓవర్ స్పీడ్ కారణంగా బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిందన్నారు. రూయాలో 32 మంది, స్విమ్స్‌లో ఏడుగురు, బర్డ్ ఆసుపత్రిలో ఆరుగురికి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. బస్సు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని అర్బన్ ఎస్పీ తెలిపారు. మృతులు వీరే.. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, 45 మంది గాయపడ్డారు.ప్రమాద సమయంలో 55 మంది బస్సులో ఉన్నారు. రసూల్(డ్రైవర్), మలిశెట్టి వెంగప్ప, గణేష్, కాంతమ్మ, మురళీ, యశస్విని, ఆదినారాయణ, బస్సు క్లీనర్ మృతి చెందారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు సాయం.. బస్సు ప్రమాద ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మరణించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సహాయం అందించాలని, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. అంతేకాకుండా బాధితులు కోలుకునేంతవరకూ క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. -
బడికి తాళం వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు
-
అదృశ్యమంటే అలుసే.. ‘ప్రేమ’ వ్యవహారమో, అలకో అని వదిలేస్తున్నారు..
సాక్షి, హైదరాబాద్: తమవారు కనిపించకుండా పోయారంటే సంబంధీకుల బాధ వర్ణనాతీతం. నిద్రాహారాలు మాని వెతకడమే కాదు.. కనిపించిన ప్రతి దైవాన్నీ మొక్కుతారు. అలా మిస్సైంది మైనర్లు అయితే పరిస్థితి మరింత ఘోరం. పూర్తి స్థాయిలో ఫలితం ఉండదని తెలిసీ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఈ మిస్సింగ్ కేసులంటే పోలీసులకు చాలా అలుసుగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సీఆర్పీసీ, ఐపీసీలతో సహా ఏ చట్టంలోనూ సెక్షన్ సైతం లేకపోవడంతో మరింత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. చాలా కేసులను పెండింగ్ జాబితాలో పడేస్తుంటారు. ‘కీలకం’ అనుకుంటే తప్ప వీటిలో ప్రాథమిక దర్యాప్తు సైతం జరపరు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం గతేడాది రాష్ట్రంలో 3,100 మంది మైనర్లు మిస్సయ్యారు. అంతకు ముందు ఏళ్లల్లో చోటు చేసుకుని కొలిక్కి రాని కేసులు మరో 655 ఉన్నాయి. ఈ 3,755 కేసుల్లో ఇప్పటికీ 777 మంది ఆచూకీ తెలియలేదు. పోలీసు విభాగం ప్రతి ఏడాదీ కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటుంది. ఈ నేపథ్యంలోనే కనీసం 2022లో అయినా మైనర్ల మిస్సింగ్ కేసులకు తగు ప్రాధాన్యం ఇస్తుందా? అనేది వేచి చూడాలి. ఎందుకీ నిర్లక్ష్యం? ► గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మిస్సింగ్ కేసులు పెరిగాయి. రాష్ట్రంలో ఏటా 2 వేల మందికి పైగా అదృశ్యమవుతున్నారు. వీటిలో సగానికి పైగా ప్రేమవ్యవహారాలకు సంబంధించినవే. అమ్మాయి, అబ్బాయి ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోతారు. దాంతో ఇరు కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తాయి. కొద్ది రోజులకు వారి విషయం తెలియడంతో కేసు పరిష్కారమవుతుంది. ►‘ప్రేమ’ తర్వాత పరీక్షల సమయంలో మిస్సింగ్ కేసు సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మార్చి, ఏప్రిల్ మాసాల్లో సగటున రోజుకు 10–15 కేసులు రిజిస్టర్ అవుతుంటాయి. ఇలాంటి వారు కూడా కొన్ని రోజులకు ‘కనిపిస్తుంటారు’. ఈ కేసుల్లోనూ పోలీసులు చేస్తున్న కృషి ఏమాత్రం ఉండట్లేదు. ఎక్కువగా ఇలాంటి కేసులే వస్తుండటంతో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ►నిజమైన మిస్సింగ్, కిడ్నాప్ కేసులనూ ఇదే కోవకు చేర్చేసి చేతులు దులుపుకొంటున్నారు. యుక్త వయసు బాలబాలికల మిస్సింగ్ కేసులను పోలీసులు పట్టించుకోవట్లేదనే వాదనలు ఎక్కువగా ఉన్నాయి. 13 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారు మిస్ అయ్యారంటే అది కేవలం ‘ప్రేమ’ వ్యవహారమో, అలకో అని భావిస్తున్నారు. అలాంటి లేదంటూ తల్లిదండ్రులు గొల్లుమంటున్నా పట్టించుకోవట్లేదు. చదవండి: తెలంగాణ: 20 మంది బాధితుల్లో నలుగురికి సీరియస్! సమీక్షల్లోనూ వీరికి విలువ లేదు.. ►రాష్ట్ర డీజీపీ నుంచి జిల్లా ఎస్పీలు, జోనల్ డీసీపీల వరకు అనునిత్యం క్రైమ్ రివ్యూల పేరుతో సమీక్షలు నిర్వహిస్తుంటారు. వీటిలో ప్రధానంగా సొత్తు సంబంధిత కేసులు, సంచలనం సృష్టించిన వాటి పైనే దృష్టి పెడతారు. ఠాణాల వారీగా నమోదైన మిస్సింగ్ కేసులు ఎన్ని, లుక్ ఔట్ నోటీసులు ఇవ్వడంతో పాటు కాల్ డిటేల్స్ సేకరించడం మినహా మరే ఇతర చర్యలు తీసుకున్నారు? తదితర అంశాల జోలికి ఈ ఉన్నతాధికారులు పొరపాటున కూడా పోవడంలేదు. ►ఏడాదికి రెండుసార్లు మాత్రం ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ పేరుతో హడావుడి చేసి, ఫొటోలకు పోజులిచ్చి చేతులు దులుపుకొంటున్నారు. సీఐడీ అధీనంలోని మహిళ భద్రత విభాగం గతంలో ఇతర రాష్ట్రాల్లోని వ్యభిచార గృహాలపై దాడులు చేసి అక్కడ మగ్గుతున్న రాష్ట్రానికి చెందిన బాధితులను బయటకు తీసుకువచ్చేది. ఇప్పుడు ప్రత్యేకంగా రాష్ట్ర మహిళ భద్రత విభాగం ఏర్పడిగా ఇటీవల కాలంలో ఇలాంటి దాడుల ఊసే లేకుండాపోయింది. నేరగాళ్లకు వరం.. ►వ్యవహార శైలి నేరగాళ్లకు వరంగా మారుతోంది. ఈ నిర్లక్ష్యంతో అనేక ఘోరాలు జరిగిపోతున్నాయి. ఇంట్లోంచి కావాలని బయటకు వచ్చి దిక్కుతోచని వాళ్లు రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో సంచరిస్తుంటారు. ఇలాంటి వారిని చేరదీస్తున్న కొన్ని ముఠాలు ఘోరాలకు పాల్పడుతున్నాయి. మాయమాటలతో వల వేసిన, ఎత్తుకుపోయిన ఆడపిల్లలను ఏకంగా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో ఉన్న వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. ►స్థానిక పోలీసుల రికార్డుల్లో కేవలం మిస్సింగ్ కేసులుగా నమోదైన అనేక వ్యవహారాలు ఆపై టాస్క్‌ఫోర్స్ వంటి స్పెషలైజ్డ్ వింగ్స్ చొరవతో హత్యలుగా తేలిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. సిటీలో నిత్యం లభిస్తున్న అనేక గుర్తుతెలియని శవాలు ఎక్కడో ఒకచోట మిస్సింగ్‌గా ఉంటున్నవే. వీటిపై పోలీసులు చూపుతున్న నిర్లక్ష్యంలో అనేక మంది నేరగాళ్లు స్వేచ్ఛగా బాహ్య ప్రపంచంలో విహరించేస్తున్నారు. ఇవీ మైనర్ల మిస్సింగ్ గణాంకాలు: ►2020కి ముందు అదృశ్యమై ఆచూకీ లేని మైనర్లు: 655 ►2020లో అదృశ్యమైన వారు: 3100 ►2020 ఆచూకీ లభించిన వారు: 2978 ►ఇప్పటికీ ఆచూకీ లేని వాళ్లు: 777 -
అయ్యో దేవుడా.. వేడి నీళ్లని తెలియకపాయె!
సాక్షి, మైసూరు(కర్ణాటక): మైసూరులో ఘోరం చోటు చేసుకుంది. ఓ తల్లి నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాలు బలిగొంది. సలసల కాలే నీరు శరీరంపై పడి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ విషాద ఘటన మైసూరులో మంగళవారం చోటు చేసుకుంది. దాసనకొప్పలులో నివాసం ఉంటున్న రాము ఫొటోగ్రాఫర్ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాడు. ఈయనకు రెండేళ్ల కుమార్తె ఉంది. మంగళవారం చిన్నారికి స్నానం చేయించేందుకు తల్లి తన కుమార్తెను బాత్రూమ్కు తీసుకెళ్లింది. నీరు చాలా వేడిగా ఉండటంతో చల్లటి నీరు తెచ్చేందుకు వెళ్లింది. ఈక్రమంలో చిన్నారి బక్కెట్లోకి చేయి పెట్టింది. వేడి తీవ్రత తాళలేక చేయి బయటకు తీసే క్రమంలో బకెట్ ఒకపక్కకు ఒరిగి నీరంతా మీదపడి శరీరం బొబ్బలు ఎక్కింది. హుటాహుటిన కేఆర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కళ్లెదుటే చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: కువెంపు కోడలు రాజేశ్వరి కన్నుమూత -
ఎంత నిర్లక్ష్యం.. ఆపరేషన్ చేసి సూదిని కడుపులో మరిచిపోవడంతో..
తిరువొత్తియూరు: ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్న యువకుడి కడుపులో సూది మరచి కుట్లు వేసిన సంఘటన సంచలనం కలిగించింది. చెన్నై పులియాంతోపు బీకే కాలనీకి చెందిన రంజిత్‌కుమార్ (28) కడుపులో ఏర్పడిన గాయానికి పట్టాలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చేసుకున్నాడు. నొప్పి విపరీతంగా ఉండడంతో మూడు రోజుల తర్వాత స్కాన్ చేయించుకున్నాడు. కడుపులో సూది ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించగా తిరిగి ఆపరేషన్ చేయాలని తెలిపారు. దీనిని తిరస్కరించిన రంజిత్‌కుమార్ సోమవారం రాత్రి స్టాన్లీ ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు ఆపరేషన్ చేసి సూదిని తొలగించారు. చదవండి: గతంలోనూ బిపిన్ రావత్ ప్రయాణిస్తుండగా హెలికాప్టర్ ప్రమాదం.. ఎక్కడంటే? -
తిరుపతిపై గత పాలకుల నిర్లక్ష్యం: నాటి పాపాలు.. నేటి శాపాలు!
సాక్షి, తిరుపతి: నలభై ఏళ్ల క్రితం తిరుపతి పరిధిలో సుమారు 44 వరకు చెరువులు, కుంటలు ఉండేవి. కాలక్రమేణా అందులో చాలావరకు కబ్జాకోరల్లో చిక్కిపోయాయి. శేషాచలం కొండల నుంచి వచ్చే వర్షపు నీటిని నగరం వెలుపలకు తరలించే ఒరవ కాలువలు సైతం ఆక్రమణకు గురయ్యాయి. దీనిపై 2017లో అప్పటి అధికారులు నాటి టీడీపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వెంటనే కబ్జాలను తొలగించి చెరువులు, కాలువలు, కుంటలను పునరుద్ధరించకుంటే తిరుపతికి ముప్పు తప్పదని హెచ్చరించారు. అయినప్పటికీ గత ప్రభుత్వం సదరు నివేదికను బుట్టదాఖలు చేసింది. ఆ నిర్లక్ష్యమే నేడు తిరుపతి నగరాన్ని నిలువునా ముంచింది. చెరువులు.. కుంటలు మాయం! తిరుపతి నగరం చుట్టుపక్కల గతంలో పేరూరు పెద్ద చెరువు, తుమ్మలగుంట, అవిలాల, కలికాల చెరువు, చిన్నరాయల చెరువు. వెటర్నరీ కళాశాల సమీపంలో పందిగుంట, అలిపిరి సమీపంలో కొండగుంట, మెటర్నరీ ఆస్పత్రి వెనుక సింగారగుంట, ఐఎస్ మహల్ ప్రాంతంలో బొమ్మగుంట, దిగువన రామచంద్రగుంట. అలాగే నరసింహ తీర్థం, గంగమ్మ గుడి ఎదురుగా తాతయ్యగుంట, ఆర్టీసీ బస్టాండు స్థలంలో తాళ్లపాక చెరువు. కపిలతీర్థం, కరకంబాడి, కొర్లగుంట మధ్యలో ముదితినాయని గుంట, మురికినేని గుంట, లింగాలమ్మ చెరువు, సింగిరిగుంట, అడవి సింగన్న గుంట, అడివి వాని గుంట, పాత రేణిగుంట రోడ్డులో కొరమీనుగుంట, కైకాల చెరువు ఉండేవి. ప్రస్తుతం వీటిలో పేరూరు, తుమ్మలగుంట, అవిలాల చెరువులు మాత్రం మిగిలాయి. మిగిలిన చెరువులను కబ్జారాయుళ్లు మాయం చేసేశారు. వరద నీటికి దారేది! తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ప్రధానంగా నాలుగు పెద్ద కాలువలు ఉన్నాయి. శేషాచలం కొండల నుంచి వచ్చే వర్షపు నీరు కపిలతీర్థం, ఎస్వీ, వెటర్నరీ వర్సిటీలు, వ్యవసాయ కళాశాల మీదుగా వెళ్లే కాలువల ద్వారా పేరూరు, తుమ్ములగుంట, అవిలాల చెరువులకు చేరాలి. అక్కడి నుంచి ఓటేరు చెరువు మొరవ నుంచి యోగిమల్లవరం మీదుగా స్వర్ణముఖి నదిలో కలవాలి. అలాగే ఎస్వీయూ, పద్మావతి కళాశాల పరిసరాల్లో నుంచి వచ్చే వర్షపు నీరు మజ్జిగ కాలువ మీదుగా స్వర్ణముఖి నదికి చేరాలి. మాల్వాడీ గుండం నుంచి ప్రవహించే వర్షపు నీరు ఎన్జీఓ కాలనీ, రైల్యే కాలనీ, అశోక్ నగర్, కొర్లగుంట మీదుగా వినాయక సాగర్ చెరువు, చింతలచేను, కరకంబాడి మీదుగా దిగువకు ప్రవహించేవి. అన్నమయ్య కూడలి, పళణి థియేటర్ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు లక్ష్మీపురం, శ్రీనివాసపురం, పద్మావతిపురం నుంచి కొరమేనుగుంట, దామినేడు చెరువుకు చేరాలి. అవి నిండగానే స్వర్ణముఖి నదిలోకి వెళ్లేవి. అయితే ఈ కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వరద నీరు ప్రవహించే అవకాశం లేకుండా పోయింది. కొద్దిపాటి వర్షానికే నగరంలోని రోడ్లు తటాకాలను తలపించే పరిస్థితి ఏర్పడింది. నివేదికపై నిర్లక్ష్యం తిరుపతిని 2017లో వచ్చిన తుపాను ముంచెత్తింది. వరద తాకిడికి కాలువలు ఉప్పొంగడం, శేషాచల కొండల నుంచి వచ్చిన వర్షపు నీరు జతకలడవంతో నగరం జలమయమైంది. అప్పట్లో లక్ష్మీపురం, గాంధీపురం, ఎస్టీవీనగర్, కొరమీనుగుంట, కొర్లగుంట, చంద్రశేఖర్‌రెడ్డి కాలనీ, మారుతీనగర్, శివజ్యోతినగర్, రైల్వేకాలనీ, మధురానగర్, తాతయ్యగుంట, కట్టకిందపల్లె, ఎర్రమిట్ల, రాజీవ్‌నగర్, మాధవనగర్, కొత్తూరు, ఆటోనగర్ ముంపునకు గురయ్యాయి. అప్పటి కలెక్టర్ సిద్ధార్థజైన్, కార్పొరేషన్ కమిషనర్ వినయ్‌చంద్ క్షేత్రస్థాయిలో పర్యటించి కారణాలను తెలుసుకున్నారు. కరకంబాడి రోడ్డులో ఆక్రమణలకు ధ్వంసమైన కాలువ కాలువలను సర్వే చేయించి ఆక్రమణలను గుర్తించారు. వెంటనే కబ్జాలను తొలగించి కాలువలను విస్తరించకుంటే భవిష్యత్‌లో పెనుముప్పు తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి అందించారు. అంతటితో ఆగకుండా ఆక్రమణల తొలగింపునకు అనుమతులు ఇవ్వాలని పలుమార్లు విన్నవించారు. ఈ క్రమంలోనే నాటి ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ నరసింహయాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. కాలువల విస్తరణకు అప్పట్లోనే చర్యలు తీసుకుని ఉంటే ప్రస్తుతం తిరుపతికి ఇంతటి దయనీయస్థితి వచ్చి ఉండేది కాదు. టీడీపీ హయాంలో తీసుకున్న నిర్ణయం కారణంగా ఆటోనగర్‌లో ఇదీ పరిస్థితి (ఫైల్) బాబు హయాంలో ఇష్టారాజ్యం తిరుపతి పట్టణాభివృద్ధికి 1981లో తుడా ఆవిర్భవించిన తర్వాత చెరువులు, కుంటల్లో నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారు. దీనిపై 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆటోనగర్ శంకుస్థాపనకు వచ్చినప్పుడు స్థానికులు నిరసన తెలిపారు. ఈ ప్రాంతంలో ఆటోనగర్ ఏర్పాటైతే సమీపంలోని పెద్దచెరువు, దామినేడు చెరువు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో అందరూ భయపడినట్లుగానే దామినేడు, పెద్దచెరువులు ఆక్రమణకు గురయ్యాయి. చంద్రబాబు హయాంలో కబ్జాలపర్వయం తారస్థాయికి చేరింది. తిరుపతి పరిధిలోని చెరువులు, కుంటలు, కాలువలను తెలుగు తమ్ముళ్లు ఇష్టారాజ్యంగా కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టారు. 40 అడుగుల వెడల్పుగల కాలువలు కూడా నగరం నడిబొడ్డులోకి వచ్చేసరికి 5 నుంచి 10 అడుగులకు కుంచించుకుపోవడం గమనార్హం. గుండెలవిసేలా రోదిస్తున్న ఈ మహిళ పేరు గాయత్రి. ఎస్టీవీ నగర్‌లోని పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్ సమీపంలో నివాసం. ఈనెల 18న ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఈమె భర్త సుబ్బారావు వరదల కారణంగా నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయాడు. ఇప్పటికీ ఆచూకీ కరువైంది. టీడీపీ హయాంలోని ఆక్రమణల కారణంగా నీరు నగరాన్ని ముంచెత్తడంతో ఇప్పుడు ఈ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ హరిపురం కాలనీ మీదుగా ప్రవహించే ప్రధాన కాలువ పూర్తిగా కనుమరుగైంది. అక్కడక్కడ మాత్రమే కనిపించే ఈ కాలువ ప్రాంతాన్ని నాటి టీడీపీ నాయకులు పోటీ పడి ఆక్రమించుకున్నారు. కాలువ, కాలువ పోరంబోకు స్థలాలను అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఆ పాపం నేడు శాపమై తిరుపతి నగర దక్షిణ ప్రాంతాన్ని వరద నీటి రూపంలో పీడిస్తోంది. ఆ ప్రాంతం నుంచి వచ్చే వరద నీటి చానల్స్ పూర్తిగా కనుమరుగవడం గమనార్హం. తిరుపతి ఎల్బీనగర్ మీదుగా పది అడుగుల మేర ప్రవహించే వర్షపు నీటి కాలువ ఆక్రమణకు గురవడంతో ఐదు అడుగుల మేర కుంచించుకుపోయింది. 2002లో ఈ ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. నాటి టీడీపీ నాయకుల చర్యలతో ప్రస్తుతం ఆ ప్రాంతంతో పాటు చుట్టుపక్క కాలనీలను వరద ముంచెత్తింది. -
వంద కోసం అటెండర్ కక్కుర్తి.. పసి ప్రాణం బలైపోయింది
సాక్షి,నాంపల్లి(హైదరాబాద్): ఆస్పత్రి అటెండర్ కక్కుర్తి మూడేళ్ల బాలుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటన శనివారం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బోరబండ ప్రాంతానికి చెందిన షేక్ ఆజం కుమారుడు షేక్ ఖాజా(3) కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబసభ్యులు బాలుడిని ఈ నెల 27న నీలోఫర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో వైద్యులు ఆ చిన్నారికి వెంటిలేటర్ అమర్చి వైద్యం అందిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సుభాష్ అనే అటెండర్ శనివారం ఆ వార్డుకు వచ్చాడు. పక్క బెడ్ మీద ఉన్న రోగి సహాయకుల నుంచి వంద రూపాయలు తీసుకుని షేక్ ఖాజాకు సంబంధించిన వెంటిలేటర్‌ను మార్చేశాడు. కొద్దిసేపటికే షేక్ ఖాజా శ్వాస అందక మృతి చెందాడు. దీంతో రోగి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. అటెండర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణను వివరణ కోరగా స్పందించడానికి నిరాకరించారు. చదవండి: వివాహేతర సంబంధం: ఇంట్లో భర్త నిద్రపోతుంటే ప్రియుడితో కలిసి.. -
TS: మొండిచెయ్యి.. సగం రుణాలూ ఇవ్వలేదు..
సాక్షి, హైదరాబాద్: రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ ఏడాది వానాకాలం సీజన్ లక్ష్యంలో సగం రుణాలు కూడా ఇవ్వకపోడం విచారకరం. ఈ సీజన్లో రూ.35,665 కోట్లు ఇవ్వా లనేది లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం రూ. 15,500 వేల కోట్ల మేరకే రుణాలు మంజూరు అయ్యాయి. వాస్తవానికి సీజన్ ప్రారంభానికి ముందుగానే రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలి. ఆ ప్రకారం జూన్‌లో ప్రారంభమయ్యే వానాకాలం సీజన్‌కు మే నెల నుంచే రుణాలు ఇవ్వాలి. కానీ రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రాలేదు. దీంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది. బ్యాంకుల తీరును ఎప్పటికప్పుడు సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాల్సిన వ్యవసాయశాఖ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్ ఐదు రోజుల క్రితం ముగిసింది. పంటల సాగు 111 శాతం ఉండగా రుణాల మంజూరు మాత్రం మరీ నిరాశాజనకంగా ఉంది. 1.19 కోట్ల ఎకరాల్లో సాగు రాష్ట్రంలో నీటి వనరులు గణనీయంగా పెరిగాయి. సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో రెండు మూడేళ్లుగా వ్యవసాయ పంటల విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. రాష్ట్రంలో 63 లక్షల మంది రైతులున్నారు. వానాకాలం పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.16 కోట్ల ఎకరాలు కాగా, 1.19 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో వరి 61.94 లక్షల ఎకరాల్లో సాగైంది. సాధారణం కంటే వరి ఏకంగా 182 శాతం సాగైంది. వాస్తవంగా వరి రైతులే ఎక్కువగా రుణాలు తీసుకుంటారు. అయితే వరి సాగైనంత స్థాయిలో బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం గమనార్హం. ఇక పత్తి 46.42 లక్షల ఎకరాల్లో, కంది 7.64 లక్షల ఎకరాల్లో సాగైంది. కానీ ఈ పంటలకు కూడా రుణాలు ఆ స్థాయిలో అందలేదు. (2021–22కు సంబంధించిన మొత్తాలు వానాకాలం సీజన్వే) రూ. 5 వేల కోట్ల ప్రైవేట్ అప్పులు! 2021–22 రెండు సీజన్లలో రూ. 59,440 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందులో ఈ సీజన్‌కు రూ. 35,665 కోట్లు ఇవ్వాలనుకున్నారు. కానీ ఇప్పటివరకు అందులో 43.45% మేరకే రుణాలు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. బ్యాంకుల తీరు కారణంగానే రైతులు రుణాలు పొందలేక పోయారనే విమర్శలున్నాయి. కొద్దిపాటి రుణాలు తీసుకోవడానికి రైతులు ఎలాం టి తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. కానీ పా సు పుస్తకాలు తీసుకొని పంట రుణాలు ఇచ్చా యి. నిస్సహాయ పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్థుల వద్ద అప్పులు చేశారు. ఒక అంచనా ప్రకారం రూ.5 వేల కోట్ల ప్రైవేట్ అప్పులు చేసినట్లు అంచనా. మరి ముఖ్యంగా రైతుబంధుకు కాని, బ్యాంకు రుణాలకు కాని నోచుకోని కౌలు రైతుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. వీరికి ప్రైవేట్ రుణాలు తప్ప మరో ఆధారం లేదని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏడాదికేడాదికీ తగ్గుతున్న రుణాలు 2011–12 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో బ్యాంకులు తాము నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి 115 శాతం పంట రుణాలు ఇచ్చాయి. ఆ ఏడాది రూ.10,233 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం కాగా, రూ. 11,787 కోట్లు ఇచ్చాయి. ఇక 2012–13లో ఏకంగా 121 శాతం, 2013–14లో 103 శాతం ఇచ్చాయి. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక 2014–15లో పంట రుణాల లక్ష్యంలో 93 శాతమే ఇచ్చాయి. అలా క్రమంగా రుణాల మంజూరు తగ్గిస్తూ వస్తున్నాయి. -
TS Transco: పొలాల్లో జబర్దస్తీ.. పరిహారం నాస్తి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ టవర్లు, లైన్ల ఏర్పాటుతో రాష్ట్రంలో భూములు నష్టపోయిన బాధిత రైతులకు పరిహారం అందని ద్రాక్షగా మారింది. జిల్లా కలెక్టర్లు పరిహారం చెల్లింపు ఊసే ఎత్తడం లేదు. కలెక్టర్ల నిర్లక్ష్యం, ట్రాన్స్‌కో నిర్లిప్తతతో.. పరిహారం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది రైతులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. ఈ మేరకు బాధిత రైతు ఒకరు చేసిన ఫిర్యాదును విచారించిన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ).. పరిహారం ఇప్పించే అధికారం తమకు లేదని పేర్కొంది. జిల్లా కలెక్టర్లు మాత్రమే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అప్పట్లో స్పష్టం చేసింది. అయితే తాజాగా అదే కేసులో చిత్రమైన ఆదేశాలు జారీ చేయడంతో బాధిత రైతులను పట్టించుకునేవారే లేకుండా పోయారు. పరిహారం కోసం జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లండి.. రైతు పిటిషన్‌పై విచారణ జరిపిన కమిషన్ 2017 ఆగస్టు 7న ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 67(4)లోని నిబంధనల మేరకే కమిషన్ పాత్ర పరిమితమని, పరిహారం ఇప్పించలేమని స్పష్టం చేసింది. విద్యుత్ లైన్ల ఏర్పాటుతో భూములు నష్టపోతున్న రైతులు, ఇతర భూ యజమానులకు పరిహారం చెల్లింపునకు మార్గదర్శకాల రూపకల్పన కోసం అత్యవసరంగా జిల్లా కలెక్టర్లను సంప్రదించాలని ట్రాన్స్‌కోను ఆదేశించింది. ‘నిర్ణయాలన్నింటినీ జిల్లా కలెక్టర్ ముందు ఉంచి తగిన పరిహారం కోరే హక్కు పిటిషనర్‌కు ఉంది..’ అని స్పష్టం చేసింది. విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 67(4)లోని నిబంధనల మేరకే కమిషన్ పాత్ర పరిమితమని, పరిహారం ఇప్పించలేమని స్పష్టం చేసింది. విద్యుత్ లైన్ల ఏర్పాటుతో భూములు నష్టపోతున్న రైతులు, ఇతర భూ యజమానులకు పరిహారం చెల్లింపునకు మార్గదర్శకాల రూపకల్పన కోసం అత్యవసరంగా జిల్లా కలెక్టర్లను సంప్రదించాలని ట్రాన్స్‌కోను ఆదేశించింది. ‘నిర్ణయాలన్నింటినీ జిల్లా కలెక్టర్ ముందు ఉంచి తగిన పరిహారం కోరే హక్కు పిటిషనర్‌కు ఉంది..’అని స్పష్టం చేసింది. విద్యుత్ చట్టం 2003 కింద పరిహారాన్ని ప్రకటించేందుకు జిల్లా కలెక్టర్లు సహజ న్యాయ సూత్రాలు, భూసేకరణ చట్టాలను అనుసరించాలి. కేంద్రం జారీ చేసిన ‘రైట్ ఆఫ్ వే’నిబంధనలను దృష్టిలో పెట్టుకుని పరిహారం నిర్ణయించాలి. పిటిషనర్ ఈ అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సరైన పరిహారం కోరవచ్చు. ’అని కమిషన్ ఆదేశించింది. రైతులకు పరిహారం అందకపోవడం పట్ల ఈ ఉత్తర్వుల్లో కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కలెక్టర్లు జారీ చేసిన పరిహారం ఉత్తర్వులను సమీక్షించించే అధికారం కమిషన్‌కు ఉందని కూడా స్పష్టం చేసింది. కలెక్టర్లదే అధికారం: కేంద్ర విద్యుత్ నిబంధనలు–2006 ప్రకారం టవర్ల నిర్మాణానికి తప్పనిసరిగా రైతులు/భూయజమానుల సమ్మతి తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ నుంచి కూడా అనుమతి తీసుకోవాలి. కాగా టవర్ల ఏర్పాటుతో భూములు నష్టపోయిన వారికి పరిహారాన్ని నిర్ణయించి ఇప్పించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు కట్టబెడుతూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2007 ఫిబ్రవరి 27న ‘వర్క్స్ ఆఫ్ లైసెన్స్ రూల్స్’పేరుతో జీవో ఎంఎస్ నం.24 జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన నిబంధనల ప్రకారం కూడా పరిహారం ఇప్పించే బాధ్యత కలెక్టర్లదే. ఈఆర్సీ ఆదేశాలు బేఖాతరు: ఈఆర్సీ 2017లో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆ తర్వా త వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు వెంకట్‌రెడ్డి మూడుసార్లు అర్జీ పెట్టుకున్నారు. కానీ కలెక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఆయన 2020లో మళ్లీ ఈఆర్సీని ఆశ్రయించారు. విద్యుత్ చట్టంలోని నిబంధనలు ఉటంకిస్తూ.. ఈఆర్సీ ఉత్తర్వులు అమలు చేయని కలెక్టర్లు, ట్రాన్స్కోపై చర్యలు తీసుకోవాలని, జరిమానా విధించాలని కోరారు. తాజాగా ఈఆర్సీ విచిత్ర ఆదేశాలు భూ సేకరణకు మార్గదర్శకాలు రూపకల్పన చేయా లని జిల్లా కలెక్టర్‌ను గత ఉత్తర్వుల్లో ఆదేశించినప్పటికీ, అందులో పిటిషన్‌దారుడైన బాధిత రైతు కేసు ను నిర్దిష్టంగా ప్రస్తావించలేదని ఈఆర్సీ తన తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్‌ను సంప్ర దించడానికి రైతుకు కమిషన్ స్వేచ్ఛ ఇవ్వలేదని పేర్కొంది. జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాలని ట్రాన్స్ కోను కూడా ఆదేశించలేదని పేర్కొంది. కాబ ట్టి ఈఆర్సీ ఆదేశాలను జిల్లా కలెక్టర్, ట్రాన్స్‌కో అధికారులు బేఖాతరు చేశారన్న అంశం ఉత్పన్నం కాదని, వీరిపై చర్యలు తీసుకోలేమంటూ స్పష్టం చేసింది. కొత్త లైన్లకు సైతం లభించని పరిహారం నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సరఫరా చేయడానికి దామరచర్ల–డిండి, దామరచర్ల–చౌటుప్పల్ వరకు 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో వందల మంది రైతుల పొలాల్లో టవర్లు వేసినప్పటికీ పరిహారం చెల్లించలేదు. కల్లెపల్లికి చెందిన మాతృ నాయక్‌కు ఎకరంన్నర పొలం ఉండగా, పరిహారం ఇస్తామని హామీ ఇచ్చి 4 నెలల కిందట టవర్ వేశారు. కానీ ఇంకా ఇవ్వలేదు. ఇదే గ్రామానికి చెందిన మరో రైతు ఠాగూర్‌కు 3 ఎకరాల పొలం ఉండగా 4 నెలల కిందట టవర్ వేశారు. పరిహారం ఇవ్వలేదని, అధికారులను అడిగితే రేపు, మాపు అంటూ సమాధానం చెబుతున్నారని ఆయన వాపోతున్నారు. -
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఇలాంటి పనులా!
-
తెలంగాణ: నష్టాల ఆర్టీసీలో దుబారా..!
సాక్షి, హైదరాబాద్: దుబారాను నియంత్రించటంలో ఆర్టీసీ బరాబర్ అశ్రద్ధ వహిస్తోంది. ఫలితంగా అప్పులకుప్పగా మారిన రుణాలపై ఏడాదికి రూ.250 కోట్ల వడ్డీ చెల్లిస్తోంది. మూడు నాలుగు నెలల్లో ఆర్టీసీ లాభాల్లోకి రాని పక్షంలో ప్రైవేటీకరించటానికి వెనకాడనని సీఎం కేసీఆర్ హెచ్చరించారంటూ రెండు రోజుల కింద ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ పేర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ దుబారా అంశం చర్చకు వచ్చింది. డీజిల్ ఖర్చు, జీతాలు, విడిభాగాల వ్యయం తప్పనిసరిగా భరించాల్సినవే. కానీ, దుబారాను అరికట్టడం అధికారుల చేతుల్లో పని. దుబారా ఇలా.. హైదరాబాద్–3 డిపోలో 27 గరుడ బస్సులున్నాయి. వీటి కోసం డ్రైవర్లు, కండక్టర్లు పోను 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. డిపో కరెంటు బిల్లు నెలకు రూ.70 వేల వరకు వస్తోంది. ఈ డిపోలో ఉన్నవన్నీ దూరప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సులే. ఇవి డిపోల వద్ద ప్రయాణికులను ఎక్కించుకోవు. 15 కి.మీ. నుంచి 30 కి.మీ.మేర ఖాళీగా ప్రయాణించి బీహెచ్ఈఎల్, మియాపూర్, ఇమ్లీబన్ బస్స్టేషన్లలో ప్రయాణికులను ఎక్కించుకుంటాయి. నిత్యం బస్స్టేషన్ల వరకు ఖాళీగా వెళ్లటం, అక్కడి నుంచి ఖాళీగా తిరిగి రావటంతో ఒక్కో బస్సు అనవసరంగా రూ.2 వేలకుపైచిలుకు డీజిల్‌ను కాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బస్సులను మియాపూర్, బీహెచ్ఈఎల్ లాంటి డిపోలకే కేటాయిస్తే వృథా వ్యయాన్ని అరికట్టవచ్చు. సికింద్రాబాద్ జూబ్లీబస్టాండ్ పక్కనే పికెట్ డిపో ఉంటుంది. ఈ డిపోలో ఆర్టీసీ సొంత బస్సులు 30, అద్దె బస్సులు 40 ఉన్నాయి. అద్దె బస్సుల నిర్వహణ వాటి యజమానులదే అయినందున డిపోలోకి అవి రావు. సొంతంగా ఉన్న 30 బస్సుల కోసం ఓ పెద్ద భవనం, డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఇలా డ్రైవర్లు, కండక్టర్లు కాకుండా 50 మంది సిబ్బంది పని చేస్తున్నారు. భవనానికి కరెంటు బిల్లు నెలకు రూ.80 వేల వరకు వస్తోంది. హైదరాబాద్–2 డిపోలో సొంత బస్సులు 39 ఉంటే 42 అద్దె బస్సులు న్నాయి. ఈ బస్సులకు డ్రైవర్లు, కండ క్టర్లు పోను 50 మంది సిబ్బంది ఉన్నారు. కరెంటు బిల్లు రూ.80 వేలు వస్తోంది. ఇలాంటి చిన్న డిపోలను ఎత్తేసి ఆ బస్సులను వేరే డిపో ల్లో కలిపేస్తే ఈ వృథా వ్యయం ఉండదు. ఈ డిపోలు లేకపోతే వాటిల్లోని పెద్ద పోస్టులు రద్దవుతాయి. జీతాలు, కరెంటు బిల్లు వంటి భారాలు ఉండవు. డిపో భవనాలను ప్రైవేటు సంస్థలకు అద్దెకిస్తే ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరుతుంది. అనవసరపు ట్రిప్పులతో.. రాష్ట్రంలోని కొన్ని చిన్న పట్టణాల నుంచి హైదరా బాద్‌కు 45 నిమిషాలకో బస్సు తిప్పు తున్నారు. కానీ, ఆయా బస్సులు సిటీ చేరేటప్పటికీ 90% మేర ఖాళీగా ఉంటున్నాయి. అలాంటప్పుడు సిటీ ట్రిప్పులను గంటన్నరకు ఒకటి చొప్పున పెడితే ఈ ఖాళీ ట్రిప్పుల దుబారా ఉండదు. కరీం నగర్, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, కొత్త గూడెం, నిజామాబాద్, మెదక్, మహ బూబ్‌నగర్, కల్వకుర్తి, నల్లగొండ, సూర్యాపేట లాంటి పట్టణాల్లో ఈ సమస్య ఉంది. హైదరాబాద్‌కు వెళ్లేందుకు కరీంనగర్, వరంగల్ లాంటి బస్టాండ్లలో ఒకేసారి పలు డిపోల బస్సులు వచ్చి ప్లాట్‌ఫారమ్‌లలో నిలబడుతున్నాయి. ఇవన్నీ 70 శాతం లోపు ఆక్యుపెన్సీ రేషియోతోనే నడుస్తున్నాయి. నాన్‌స్టాప్ బస్సుల్లో అయితే ఇక సిటీకి వచ్చే వరకు మధ్యలో ఎక్కడా ప్రయాణికులు ఎక్కే వీలు ఉండటం లేదు. ఇది ప్రస్తుతం ఆర్టీసీలో పెద్ద దుబారాగా మారింది. పండగలు లాంటి ప్రత్యేక సందర్భాలు, వారాంతాల్లో తప్ప మిగతారోజుల్లో ఈ ట్రిప్పులకు డిమాండ్ ఉండటం లేదు. అయినా అనవసరంగా తిప్పుతున్నారు. -
ప్లాస్టిక్ వ్యర్థాలకు అడ్డాగా వైజాగ్ బీచ్
-
ఉప సర్పంచ్ వేధిస్తున్నారు.. సీఎం సభలో ఆత్మహత్య చేసుకుంటా
సాక్షి, హుజూరాబాద్ (కరీంనగర్): గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించిన చెక్కులపై ఉప సర్పంచ్ గుజ్జ జయసుధ సంతకం చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్ సర్పంచ్ నేరెళ్ల మహేందర్‌గౌడ్ ఆరోపించారు. సోమవారం గ్రామంలో మీడియాతో ఆయన గోడు వెళ్లబోసుకున్నారు. అప్పులు తెచ్చి, గ్రామంలో అభివృద్ధి పనులను పూర్తి చేశామని, 10 నెలలవుతున్నా చెక్కులపై ఉప సర్పంచ్ సంతకాలు పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల డీఎల్పీవో విచారణ జరిపి వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఆర్థికంగా చితికిపోయిన తనకు ఈ సమస్య పరిష్కారం కాకపోతే చావే శరణ్యమని అన్నారు. పురుగు మందు డబ్బా చూపిస్తూ సోమవారం సీఎం కేసీఆర్ సభలో ఆత్మహత్య చేసుకుంటానని మహేందర్‌గౌడ్ పేర్కొన్నారు. -
కులాంతర వివాహం.. బంధువుల సమక్షంలో అత్తింటివారు దూషించడంతో..
సాక్షి, మిర్యాలగూడ(నల్లగొండ): అట్రాసిటీ కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువకుడు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. మిర్యాలగూడ పట్టణం గాంధీనగర్‌కు చెందిన గ్యార సాయికుమార్, ఇందిరమ్మకాలనీకి చెందిన సౌజన్యను ఏడాదిన్నర క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులుగా దంపతుల మధ్య తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సౌజన్య కుటుంబ సభ్యులు సాయికుమార్‌ను బంధువుల సమక్షంలో కులం పేరుతో దూషించారు. ఈ విషయంపై సాయికుమార్ తల్లి సైదమ్మ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్య తీసుకోవాలని కోరుతూ ఈ నెల 6వ తేదీన వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారని సాయికుమార్ మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న సాయికుమార్ వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా తెరిచి తాగాడు. గమనించిన పోలీసులు వెంటనే అతడిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సాయికుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
MCH Hospital : ఒకరికి చేయాల్సిన శస్త్ర చికిత్స మరొకరికి..
‘గత నెలలో జిల్లా కలెక్టర్ శశాంక మాతా శిశు ఆసుపత్రి సందర్శనకు వెళ్లారు. ఓ రిటైర్డ్ వైద్యురాలి భర్త (ఆయన కూడా వైద్యుడే) కలెక్టర్ ముందు తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు. కాంట్రాక్టు పద్ధతిలో నియామకమైన ఓ రిటైర్డ్ అధికారి తన భార్యకు సంబంధించిన పదవీ విరమణ బెనిఫిట్స్ రాకుండా అడ్డుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ తర్వాత ఎంసీహెచ్‌లో కాంట్రాక్టు డాక్టర్‌గా చేరేందుకు కూడా అడ్డుపడుతున్నాడని ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిని అధ్వానంగా మార్చిన సదరు కాంట్రాక్టు డాక్టర్‌ను తొలగించాలని కోరారు. ఆసుపత్రిలో రింగ్ మాస్టర్లా వ్యవహరిస్తున్న సదరు కాంట్రాక్టు అధికారికి రూ.1.15 లక్షల వేతనం ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు’. సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌లోని మాతా శిశు కేంద్రం (ఎంసీహెచ్) అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. గర్భిణులు, బాలింతలు, శిశువులకు మెరుగైన వైద్యసేవలు అందించాల్సిన ఈ కేంద్రం నిర్లక్ష్యం, అలసత్వానికి వేదికగా మారింది. ఇక్కడి డాక్టర్లు బాధ్యతలు మరిచిపోయి వైద్యవృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తిస్తుంటే.. సిబ్బంది రోగులను ఆదాయ వనరులుగా భావిస్తూ పీక్కుతింటున్నారు. గర్భిణుల ప్రసూతి సమయంలో డాక్టర్లు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు అడ్డగోలుగా తయారైంది. శస్త్ర చికిత్స చేయాల్సిన రోగులనే మారుస్తూ గర్భిణుల జీవితాలతో ఆటలాడుతున్నారు. ఆసుపత్రిలో వైద్యుల నియామకం మొదలు ఆసుపత్రి నిర్వహణ వరకు ఒకరిద్దరు ‘పెద్ద’ల చేతుల్లోనే ఉంది. కాంట్రాక్టు పద్ధతిలో ఓ రిటైర్డ్ డాక్టర్‌కు ఏటా లక్షల రూపాయలు చెల్లిస్తూ అడ్మినిస్ట్రేటర్‌గా పెట్టి ఆసుపత్రి పరువును బజారుకీడుస్తున్నారు. ఆసుపత్రికి చెందిన రెగ్యులర్ వైద్యాధికారులు కూడా కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన వైద్యున్ని చూసి భయపడే పరిస్థితి నెలకొంది. రెగ్యులర్ వైద్యులను కాదని.. ఇటీవల గైనకాలజీ విభాగం హెచ్‌వోడీ మూడు నెలలపాటు లీవులో వెళ్లారు. అయితే.. ఆ పోస్టులో ఇన్చార్జిగా మరో రెగ్యులర్ వైద్యురాలిని నియామకం చేయాల్సి ఉండగా, ఓ కాంట్రాక్టు జూనియర్ వైద్యులరాలికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇదేంటని అడిగే పరిస్థితి కూడా ఇక్కడ లేకుండా పోయింది. పూర్తిగా ఆసుపత్రి రాజకీయ నాయకుల చేతుల్లో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. వైద్యులు రెండు గ్రూపులుగా విడిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్లే ప్రసవం కోసం వచ్చే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ అధికారిదే హవా.. ఆసుపత్రి నిర్వహణ కోసం ఓ రిటైర్డ్ డాక్టర్‌ను కాంట్రాక్టు పద్ధతిన ప్రతినెలా రూ.1.15 లక్షల వేతనంతో నియమించారు. సదరు అధికారి నిర్వహణ మరిచి అన్నింట్లో తల దూరుస్తూ రింగ్ మాస్టర్లా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎంసీహెచ్‌లో బాధ్యతలు అప్పగిస్తే.. ఎంసీహెచ్‌తోపాటు జిల్లా ఆసుపత్రిలో చక్రం తిప్పుతున్నారు. అన్నీ తానై నడుపుతున్నారు. ఓ గ్రూపును తయారు చేసి తన వెంటే ఉంచుకొని హల్చల్ చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ, పర్మినెంట్ ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు, వారిపై ఫిర్యాదులు, నిధుల వినియోగం, అభివృద్ధి పనులు మొదలైన అన్ని పనులకు ఉన్నతాధికారులను గు ప్పిట్లో పెట్టుకొని చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఓ రాజకీయ పార్టీ అండతోనే ఈ రిటైర్డ్ డాక్టర్‌ను నియమించి చోద్యం చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. నియామకాల్లోనూ.. జిల్లా ఆసుపత్రిలో అయినా సరే ఎంసీహెచ్ ఆసుపత్రిలో అయితే సదరు రింగ్‌మాస్టర్ తెలియకుండా కాంట్రాక్టు పద్ధతిన నాల్గవ తరగతి ఉద్యోగి కూడా ఉద్యోగం సంపాదించలేని పరిస్థితి. సదరు అధికారిని ప్రసన్నం చేసుకుంటేనే కింది నుంచి పైస్థాయి వరకు ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంటుంది. అతన్ని కాదని ఇతరులతో పైరవీలు చేయించారో ఏ స్థాయిలోనైనా అడ్డుకునే శక్తి అతనికి ఉంది. ఉన్నతాధికారులంతా అతని గ్రిప్‌లోనే ఉండడంతో ఆయన ఆడింది ఆటగా నడుస్తోంది. సిజేరియన్ ఘటనపై విచారణకు కమిటీ.. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మాలతి అనే మహిళకు వైద్యులు నిర్లక్ష్యంతో సిజేరియన్ చేసేందుకు ప్రయత్నించిన ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆర్ఎంఓ డాక్టర్ శౌర య్య, చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ అజయ్ కుమార్‌లతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల ఆదేశాలు జారీ చేశారు. వైద్యులపై పోలీసులకు ఫిర్యాదు మాతాశిశు కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంపై బాధితురాలి భర్త, వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన సింగిరెడ్డి నరోత్తమ్ రెడ్డి మంగళవారం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరోత్తమ్‌రెడ్డి భార్య మాలతి 7 నెలల గర్భిణి. ఈ నెల 17న ఆమెకు కడుపులో నొప్పి రావడంతో 108 వాహనంలో కరీంనగర్‌లోని మాతాశిశు కేంద్రానికి తరలించారు. గర్భసంచికి కుట్లు వేయాలని 21న నరోత్తమ్‌రెడ్డి భార్యను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. డెలివరీ ఆపరేషన్‌కు వచ్చారనుకొని వైద్యులు నిర్లక్ష్యంగా పొట్టచీరారు. దీనివల్ల పుట్టబోయే పిల్లల పరిస్థితి విషమంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నరోత్తమ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: కాళేశ్వరం అద్భుత సృష్టి.. ఈనెల 25న డిస్కవరీ చానల్లో -
మూగజీవాలపై యమపాశం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని హనుమాన్ బస్తీ, రామవరంలోని చిట్టిరామవరం పొలాల్లో విద్యుత్ తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. లక్ష్మీదేవిపల్లి, రేగళ్ల, ప్రగతినగర్ కాలనీలో కూడా విద్యుత్ తీగలు భయపెట్టిస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ లేకుండా ప్రధాన రోడ్డుకు దగ్గరగా ఉన్నాయి. 2020–21 సంవత్సరంలో జిల్లాలో జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో 79 పశువులు, 23 మంది వ్యక్తులు చనిపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. సాక్షి, హైదరాబాద్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు పాడి పశువులు, మూగ జీవాల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా వేలాడే విద్యుత్ తీగలు, ఏళ్ల తరబడి మరమ్మతులు, నిర్వహణ లేక గాలివానలకు తెగిపడే తీగలు, పడిపోయే స్తంభాలు, ఎర్తింగ్ లోపాలు, నాసిరకం పరికరాల కారణంగా రాష్ట్రంలో ఏటా వందల సంఖ్యలో మూగజీవాలు విద్యుదాఘాతానికి గురై మరణిస్తు న్నాయి. పెద్ద సంఖ్యలో రైతులు, ఇతరులు కూడా మృత్యువాత పడుతున్నారు. ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్/ ఎస్పీడీసీఎల్)ల అధికారిక లెక్కల ప్రకారం గడిచిన నాలుగేళ్లలో.. అనగా 2017–21 మధ్య కాలంలో రాష్ట్రంలో ఏకంగా 5,400కు పైగా మూగజీవాలు విద్యుత్ ప్రమాదాలకు బలయ్యాయి. ఏటా సగటున 1,300 మూగజీవాలు విద్యుత్ సంబంధిత ప్రమాదాల్లో మరణిస్తున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక అధికారిక లెక్కలకు అందని మూగజీవాల మరణాలు మరో రెండు రెట్లు అధికంగా ఉంటాయని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. రైతన్నల కుడిఎడమ భుజాలైన కాడెద్దులు పంట పొలాల్లో మేతకు వెళ్లినప్పుడో, మరో సందర్భంలోనో కరెంట్ షాక్‌కు గురై మృత్యు వాత పడటం ఆయా కుటుంబాలకు తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోంది. ప్రేమతో పెంచుకునే పాడి పశువులు విద్యుత్ ప్రమాదాల్లో మరణించినప్పుడు ప్రజల ఆవేదన వర్ణనాతీతంగా ఉంటోంది. లక్షల విలువైన పశువులతో పాటు జీవనాధారాన్ని కోల్పోయి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. 50 శాతం ప్రమాదాలకు శాఖా పరమైన లోపాలే కారణం కావడం విచారకరం. పరిహారం చెల్లింపుల్లో జాప్యం.. శాఖాపరమైన కారణాలతో మనుషులు, మూగ జీవాలు విద్యుదాఘాతానికి గురై మరణిస్తే డిస్కంలు విచారణ జరిపి పరిహారం చెల్లించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. మనుషులకు రూ.5 లక్షలు, ఆవులు, ఎద్దులు, గేదెలు వంటి పాడి పశువులకు రూ.40 వేలు, మేకలు, గొర్రెలకు రూ.7 వేల చొప్పున పరిహారం చెల్లించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) స్పష్టం చేసింది. అయితే ఈ పరిహారం చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. విచారణలు, నివేదికల పేరిట క్షేత్ర స్థాయి అధికారులు తాత్సారం చేస్తున్నారు. కొం త మంది క్షేత్రస్థాయి అధికారులు నెపాన్ని వినియో గదారులపై నెట్టేసి తప్పుడు నివేదికలు ఇచ్చి పరిహారం రాకుండా చేస్తున్నారనే విమర్శ లు న్నాయి. బాగా పాలిచ్చే ఆవులు, గేదెల మార్కెట్ ధర రూ.50 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉండగా, పరిహారం 50 శాతం కూడా రావడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో గతేడాది (2020–21) సంభవించిన విద్యుత్ ప్రమా దాల్లో 175 మంది మనుషులు మరణించగా, 150 బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించారు. 471 మూగజీవాలు బలి కాగా, 377 జీవాల యజమా నులకు పరిహారం చెల్లించారు. ప్రస్తుత 2021–22 లో గత మే నెల నాటికి 21 మంది మనుషులు,75 మూగజీవాలు మరణించగా 19 మందికి, 40 జీవా లకు పరిహారం లభించింది. చాలా ప్రమాదాలు శాఖాపరమైన కారణాలతోనే.. తక్కువ ఎత్తులో విద్యుత్ వైర్లు వేలాడటం, ఎర్తింగ్ నిర్వహణ లేకపోవడం, విద్యుత్ స్తంభాలు/వైర్లు తెగిపడడం, 11/6.6 కేవీ జంపర్లు విఫలం కావడం, 11 కేవీ ఏబీ స్విచ్ పైప్/కేబుల్ ఇన్సులేటర్ ఫెయిల్ కావడం, హెచ్‌టీ/ఎల్టీ లైన్ స్నాప్ కావడం, విద్యుత్ స్తంభాలకు సపోర్ట్‌గా ఉండే స్టే–వైర్లకు విద్యుత్ సరఫరా కావడం, చాలాచోట్ల రక్షణ లేని ట్రాన్స్ఫార్మర్లు, ఎల్టీ లైన్లకు చెట్ల కొమ్మలు తగలడం వంటి శాఖాపర కారణాలతోనే 50 శాతానికి పైగా విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తీగలు వేలాడటం వంటి వాటిపై క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఏళ్ల తరబడి సమస్యలను పరిష్కరించట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజల అజాగ్రత్తలు, అవగాహన లోపం, భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వంటి కారణలతో చాలా ప్రమాదాలు సంభవిస్తున్నాయని డిస్కంల అధికారవర్గాలు పేర్కొంటుండటం గమనార్హం. ‘పవర్ వీక్’ నిర్వహించినా మారని పరిస్థితి.. చాలా సందర్భాల్లో చిన్నచిన్న లోపాలే విద్యుదాఘాతాలకు దారితీసి నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఈ నేపథ్యంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు పవర్ వీక్ నిర్వహించాలని గతేడాది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు డిస్కంలను ఆదేశించారు. ఇకపై ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా ఎస్పీడీసీఎల్ సంస్థ రూ.195 కోట్లు ఖర్చు చేసి తమ పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లోని 8,567 గ్రామాల్లో వివిధ రకాల పనులు చేసినట్టు ప్రకటించుకుంది. వంగిన/తుప్పుపట్టిన/పాడైపోయిన 43,486 స్తంభాల మార్పిడి, దెబ్బతిన్న 22,483 స్టే వైర్ల మార్పిడి, 1,24,175 చోట్లలో వదులుగా ఉన్న తీగలను సరి చేయడం తదితర పనులు చేపట్టినట్లు వెల్లడించింది. ఎన్పీడీసీఎల్ సైతం ఇదే తరహాలో పవర్ వీక్ నిర్వహించి మరమ్మతు, నిర్వహణ పనులు చేపట్టినట్లు తెలిపింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ సమస్యలు కొనసాగుతుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుని పెద్ద సంఖ్యలో మూగజీవాలు బలవుతున్నాయి. -
రిమ్స్‌లో దారుణం: కాలం చెల్లిన ఇంజక్షన్లతో చికిత్స..
సాక్షి, ఆదిలాబాద్: రిమ్స్‌లో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రోగం నయం చేసుకునేందుకు ఆస్పత్రికి వస్తున్న వారికి కాలం చెల్లిన ఇంజక్షన్ ఇస్తూ వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. పట్టించుకోవాల్సి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రిమ్స్ ఆస్పత్రిలోని మూడో అంతస్తు మేల్ జనరల్ వార్డులో దాదాపు 30 మంది రోగులు వివిధ రోగాలతో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి ఆ వార్డులోని నర్సు ఐదుగురు రోగులకు ఇంజక్షన్లు ఇచ్చింది. వ్యాక్సిన్ బాటిళ్లను రోగుల బెడ్లపై ఉంచడంతో అదే వార్డులో చికిత్స పొందుతున్న ఓ ఆర్ఎంపీ వైద్యుడి కుమారుడు గమనించి ఇంజక్షన్‌కు కాలం చెల్లిందని వైద్యసిబ్బందికి చెప్పడంతో వెంటనే చెత్తబుట్టలో పారేశారు. బంధువుల ఆందోళన.. రోగుల బంధువులు ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్, బీ జేపీ నాయకులు అక్కడికి చేరుకుని వైద్య సిబ్బందిని నిలదీశారు. రిమ్స్ డైరెక్టర్‌ను ఫోన్లో సంప్రదించగా స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు ఇచ్చిన యాంటి బయోటిక్ ఇంజక్షన్ 2019లో తయారుకాగా 2021 జనవరితో గడువు ముగిసింది. ఈ విషయమై ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, బీజేపీ నాయకులు పాయల్ శరత్ సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రిమ్స్ సిబ్బంది, డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ బలరాం రాథోడ్‌ను వివరణ కోరగా కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపిన అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. సిబ్బందిపై కేసు నమోదు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న గాంధీచౌక్‌కు చెందిన గౌరీశంకర్‌శర్మ కుమారుడు కైలాస్‌శర్మ ఆస్పత్రి సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ వివరించారు. చదవండి: ల్యాబ్ నుంచి వైరస్ లీక్ కాలేదు : చైనా వైరాలజిస్ట్ -
వాణిజ్య పన్నుల శాఖకు రూ.84.11 కోట్లు నష్టం
సాక్షి, అమరావతి: వాణిజ్య పన్నుల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఖజానాకు రూ.84.11 కోట్ల ఆర్థిక నష్టం కలిగినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక (కాగ్)లో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం117 వాణిజ్య శాఖ కార్యాలయాలు ఉండగా.. 2018–19 సంవత్సరానికి గాను అందులో 37 కార్యాలయాల్లోని రికార్డులను కాగ్ పరిశీలించింది. చట్టాలను సరిగా అమలు చేయకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వల్ల మొత్తం 448 కేసుల్లో రూ.84.11 కోట్ల వ్యాట్‌ను తక్కువగా మదింపు చేసినట్టు వెల్లడైంది. 180 కేసుల్లో వ్యాట్‌ను విధించకపోవడం లేదా తక్కువగా విధించడం ద్వారా ఖజానాకు రూ.65.29 కోట్ల నష్టం వాటిల్లింది. జరిమానాలు, వడ్డీలు విధించకపోవడం ద్వారా రూ.6.68 కోట్లు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అధికంగా లేదా తప్పుగా క్లెయిమ్ చేయడం ద్వారా రూ.5 కోట్లు, సీఎస్టీ చట్టం కింద 67 కేసుల్లో పన్ను విధించకపోవడం వల్ల రూ.4 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు తేల్చింది. నిబంధనలకు విరుద్ధంగా రాయితీల చెల్లింపులు రాష్ట్ర పారిశ్రామిక విధానం 2015–20కి విరుద్ధంగా కొన్ని పరిశ్రమలకు పారిశ్రామిక రాయితీలను చెల్లించినట్టు కాగ్ నివేదికలో నిగ్గు తేలింది. నెల్లూరు జిల్లా పరిధిలోని మూడు ఐస్ ఫ్యాక్టరీలకు 2017 నుంచి 2019 మార్చి కాలానికి రూ.1.32 కోట్ల రాయితీలను నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసినట్టు కాగ్ పేర్కొంది. తినడానికి ఉపయోగించే ఐస్‌ను కాకుండా నిల్వ, సంరక్షణ కోసం తయారు చేసే ఐస్ ఫ్యాక్టరీ అయినప్పటికీ ఆహార తయారీ ప్రోత్సహాక విధానం కింద వీటికి రాయితీలు చెల్లించినట్టు పేర్కొంది. మొత్తం మంజూరైన రూ.1.32 కోట్ల రాయితీ సక్రమం కాదని, ఇప్పటికే చెల్లించిన రూ.76.39 లక్షలు తిరిగి రాబట్టాలని కాగ్ ప్రభుత్వానికి సూచించింది. రుణ భారంలో పీఎస్‌యూలు గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల పేరుతో భారీగా రుణాలను సమీకరించినట్టు కాగ్ పేర్కొంది. వరి ధాన్యం కొనుగోలు, పీడీఎస్ బియ్యం సేకరణ, మౌలిక వసతుల కల్పన పేరిట ప్రభుత్వరంగ సంస్థల పేరిట భారీగా రుణాలను సేకరించినట్టు తెలిపింది. 2016–17లో రాష్ట్ర పీఎస్‌యూల అప్పులు రూ.8,518.99 కోట్లుగా ఉంటే.. 2018–19 నాటికి రూ.30,530.91 కోట్లకు గణనీయంగా పెరిగిందని వ్యాఖ్యానించింది. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎస్బీఐ నుంచి రూ.19 వేల కోట్లను అప్పు తీసుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఈడబ్ల్యూఎస్ ఇళ్ల భూములు, మౌలిక వసతుల కల్పనకు ఏపీ పట్టణ మౌలిక సదుపాయాలు అభివృద్ధి సంస్థ రూ.3,951.59 కోట్ల రుణాలను తీసుకున్నట్టు పేర్కొంది. చదవండి: ఏపీ: 18వ రోజుకు కర్ఫ్యూ.. ఆంక్షలు మరింత కఠినతరం Cyclone Yaas: యాస్ తుపాను.. పలు రైళ్ల రద్దు -
వైరల్ వీడియో: కొంప ముంచిన సిబ్బంది నిర్లక్ష్యం..
-
కొంప ముంచిన సిబ్బంది నిర్లక్ష్యం.. వీడియో వైరల్
సాక్షి, మియాపూర్: ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి చనిపోయాడని ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 15 రోజుల పాటు మదీనాగూడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారని, రూ.10 లక్షల వరకు ఖర్చు చేసినట్లు చెప్పారు. తన తండ్రి కోలుకున్న తర్వాత ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాడని కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్–3కి చెందిన ప్రమోద్ ఆరోపించారు. బాధితుడి వివరాల ప్రకారం.. బీహెచ్ఈఎల్లో ఉద్యోగం చేసే ప్రమోద్ తండ్రి శంకర్‌పవార్ 57) కరోనా సోకడంతో గతనెల 11న మదీనాగూడలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఈనెల 3వ తేదీన పూర్తిగా కోలుకున్నాడు. దీంతో అతడికి ఆక్సిజన్ అందిస్తున్నారు. ఈనెల 4వ తేదీన ప్రమోద్ బయటకు వెళ్లి వచ్చేసరికి తన తండ్రికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ తొలగిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. వెంటనే సిబ్బందిని ప్రశ్నించగా వారు వచ్చి మాస్కు తొడిగేలోగా పల్స్ రేటు సున్నాకు పడిపోయింది. వెంటనే డాక్టర్లను పిలిచినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి మృతి చెందారని ప్రమోద్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. 6 గంటల పాటు అలాగే..
సాక్షి, కరీంనగర్ టౌన్: కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్ సెంటర్లో దారుణం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా వెంకట్రావుపేటకు చెందిన ఓ వ్యక్తి ఆదివారం ఉదయం కరోనాతో మృతిచెందగా మృతదేహాన్ని వైద్య సిబ్బంది మార్చురీకి తరలించకుండా 6 గంటలపాటు వార్డులోనే ఉంచారని మృతుడి బంధువులు ఆరోపించారు. అంబులెన్స్‌లు లేవని వచ్చే వరకు వేచిచూడాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని తెలిపారు. ఆస్పత్రి కరోనా పేషెంట్లతో నిండుతుండగా మృతదేహాలను ఇలా గంటల తరబడి వార్డులోనే ఉంచడంతో చికిత్స పొందుతున్న రోగులు ఆందోళనకు గురయ్యారు. -
కరోనా టెస్టులు లేకుండానే ఫలితాలొస్తున్నాయ్.. అదెలా
జిల్లా కేంద్రంలోని శాంతినగర్ అర్బన్‌హెల్త్ సెంటర్‌కు సోమవారం ఉదయం ఐదుగురు వ్యక్తులు కరోనా నిర్ధారణ పరీక్ష కోసం వచ్చారు. వారికి ఆరోగ్య కేంద్ర సిబ్బంది టోకెన్లు అందజేసి మధ్యాహ్నం 12గంటలకు నమూనాలు సేకరిస్తామని చెప్పారు. దీంతో వారు వెనుదిరిగారు. అయితే కొంత ఆలస్యంగా మళ్లీ వారు ఆరోగ్య కేంద్రానికి చేరుకోవడం, అప్పటికే మిగితా వారికి పరీక్షలు పూర్తయ్యాయి. ర్యాపిడ్ యాంటిజన్ టెస్ట్ కిట్లు అయిపోయాయని, రేపు రమ్మని సిబ్బంది చెప్పడంతో మరోమారు వారు వెనుదిరిగారు. సాయంత్రం వారి సెల్ఫోన్లకు పరీక్ష ఫలితాలు నెగిటివ్ అని రావడంతో నివ్వెరపోయారు’. అసలు పరీక్ష చేసుకోకముందు ఫలితం ఎలా వచ్చిందని విస్తుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్య కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితుల్లో నిర్ధారిత పరీక్షల్లో గందరగోళం నెలకొంది. ఇలాంటి సంఘటనలు జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్నాయి. ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని డిగ్రీ కళాశాల పక్కన గల శాంతినగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో కరోనా టెస్టుల్లో గందరగోళం చోటుచేసుకుంది. రెండు రోజుల కిందట వికలాంగుల కాలనీకి చెందిన ఓ ఉపాధ్యాయుడు పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కలిశాడు. కరోనా సోకిందనే అనుమానంతో టెస్టు చేయించేందుకు అక్కడికి వచ్చాడు. పరీక్ష చేసిన తర్వాత వైద్య సిబ్బంది ఆయనకు నెగిటివ్ అని చెప్పారు. అనంతరం రాత్రి సమయంలో కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఫోన్‌కు మెస్సేజ్ వచ్చింది. దీంతో రాత్రంతా ఆయన భయాందోళనకు గురయ్యారు. ఉదయం శాంతినగర్ అర్బన్‌హెల్త్ సెంటర్లో రికార్డు చూడగా ఆయనకు నెగిటివ్‌గా వచ్చింది. పరీక్షలు చేయించుకున్న ఇద్దరు వ్యక్తుల పేర్లు ఒకే విధంగా ఉండడంతో రిపోర్టు మారినట్లు తెలిసింది. అయినప్పటికీ భయంతో మరోమారు అక్కడే పరీక్ష చేసుకుంటే కరోనా నెగిటివ్ వచ్చింది. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీకి చెందిన ఐదుగురు వ్యక్తులు కరోనా పరీక్ష కోసం శాంతినగర్ పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. ఉదయం 10గంటలకు 50 నుంచి 54 వరకు వీరికి టోకెన్లు అందజేశారు. మధ్యాహ్నం రావాలని సిబ్బంది చెప్పడంతో వారు ఒంటిగంటకు వెళ్లారు. ఆ సమయానికి కరోనా టెస్టులు నిలిపివేయడం, వీరి నమూనాలను తీసుకోకపోవడంతో వారు వెనుదిరిగారు. అయితే సాయంత్రం సమయంలో ఆ ఐదుగురికి నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు ఫోన్లకు సంక్షిప్త సమాచారం అందింది. దీంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. పునరావృతమవుతున్న ఘటనలు... కరోనా పరీక్షల్లో కొంత గందరగోళం నెలకొంటుంది. కొంతమంది పరీక్షలు చేయించుకున్న తర్వాత ఫోన్‌కు మెస్సేజ్ రాకపోవడంతో ఆందోళనకు గురవుతుండగా, మరికొంత మందికి మొదట నెగిటివ్ అని చెప్పి.. ఆ తర్వాత పాజిటివ్ అంటూ మెస్సేజ్‌లు పంపుతున్నారు. ఏ సమాచారం నిజమో తెలియక బాధితులు తికతమక పడుతున్నారు. భీంపూర్ మండలానికి చెందిన ఓ గర్భిణులు ఇటీవల జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుంది. అక్కడ సిబ్బంది ఆమెకు నెగిటివ్ అని చెప్పారు. ఫోన్‌కు మాత్రం కరోనా పాజిటివ్ అని మెస్సేజ్ వచ్చింది. దీంతో ఆ గర్భిణి ఆందోళనకు గురైంది. ఉదయం పూటనే భీంపూర్ పీహెచ్సీలో మరోమారు కరోనా పరీక్ష చేయించుకోగా కరోనా నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ ఆమె గర్భిణి కావడంతో రిమ్స్‌లో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోగా అప్పుడు కూడా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. కొంతమంది వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కరోనా పరీక్షలు చేయించుకోవడానికి వచ్చే ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పర్యవేక్షణ కరువు... ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కరోనా పరీక్షలు చేయడం, కరోనా నివారణ టీకాలు వేయాల్సి ఉండగా, మధ్యాహ్నం 12గంటలకు కరోనా పరీక్షలు ప్రారంభించి ఒంటిగంట లోపు ముగిస్తున్నారు. టీకాలను ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకే వేస్తున్నారు. రోజురోజుకూ కేసులు పెరుగుతుండగా, వీరు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసమే నెగిటివ్ అని కరోనా నిర్ధారణ పరీక్ష కోసం సేకరించిన నమూనాల్లో 20శాతం ఆర్టీసీపీఆర్ కోసం పంపడం జరుగుతుంది. ర్యాపిడ్ పరీక్షల్లో నెగిటివ్ అని చూపించినప్పుడే ఆర్టీపీసీఆర్కు సంబంధించి ఆన్లైన్లో నమోదవుతోంది. అందుకోసమే నెగిటివ్ అనే రిపోర్టు పంపడం జరిగింది. – కిరణ్‌కుమార్, శాంతినగర్ యూపీఎహెచ్‌సీ వైద్యాధికారి ( చదవండి: రెమ్‌డెసివిర్ కావాలంటే ఈ నంబర్‌కు వాట్సాప్ చేయండి ) -
కుర్రాళ్ల బైక్ విన్యాసం: నిండుప్రాణం బలి
అనంతపురం క్రైం: కుర్రాళ్ల బైక్ విన్యాసం ఒక నిండుప్రాణాన్ని బలితీసుకుంది. అత్యంత రద్దీ కలిగిన ప్రదేశంలో మితిమీరిన వేగంతో వెళ్తూ నిల్చున్న వ్యక్తిని ఢీకొనడంతో అతడు గాలిలో ఎగిరి రోడ్డుపై పడి ప్రాణం విడిచాడు. వివరాల్లోకెళ్తే... అనంతపురంలోని వినాయకనగర్‌కు చెందిన పి.వెంకటరమణ (50) జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి సప్తగిరి సర్కిల్ సమీపంలో ద్విచక్రవాహనం ఆపి అటువైపు వెళ్లేందుకు అనకొండ షోరూం వద్ద నిల్చుని ఉన్నాడు. ఇంతలో టవర్‌క్లాక్ వైపు నుంచి మున్నానగర్‌కు చెందిన ఇలియాజ్ మరో యువకుడు కలిసి స్పోర్ట్స్ బైక్‌పై విన్యాసాలు చేసుకుంటూ పెద్ద పెద్ద శబ్దంతో హారన్ కొడుతూ దూసుకొచ్చారు. వేగాన్ని అదుపుచేసుకోలేక వెంకటరమణను ఢీకొనడంతో అతను ఎగిరి రోడ్డుపై పడ్డాడు. రోడ్డుకు బలంగా తగలడంతో తల, ముక్కు, చెవుల్లోంచి రక్తస్రావమైంది. అదుపుతప్పిన యువకులు అలాగే ముందుకెళ్లి ఒక ఆటోను ఢీకొని కిందపడ్డారు. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వెంకటరమణను ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. వెంకటరమణకు భార్య లక్షి్మ, నలుగురు పిల్లలు ఉన్నారు. నిందితుడికి దేహశుద్ధి మితిమీరిన వేగంతో ఢీకొని నిండుప్రాణాన్ని బలిగొన్న మున్నానగర్‌కు చెందిన ఇలియాజ్, మరో యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ట్రాఫిక్ పోలీసులు వచ్చేలోపు ఓ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. స్వల్పంగా గాయపడిన ఇలియాజ్‌ను ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. -
నీటిలో కలిసిన ప్రాణాలు.. కుటుంబాల్లో విషాదం
చాంద్రాయణగుట్ట: ఓ వెంచర్ నిర్వాహకుడి నిర్లక్ష్యమే చాంద్రాయణగుట్టలో ఎనిమిది అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్ తెలిపిన మేరకు.. బండ్లగూడ గౌస్‌నగర్‌లో మహ్మద్ హిల్స్ వెంచర్ పేరుతో మహ్మద్ పహిల్వాన్ కుటుంబ సభ్యులు వెంచర్‌ను చేస్తున్నారు. ఎత్తైన ప్రదేశంలో గుట్టపై ఉన్న ఈ వెంచర్‌కు ఇటీవలే భారీగా ప్రహారీ నిర్మించారు. కాగా ఈ ప్రహారీని ఎలాంటి పునాది లేకుండా బండరాళ్ల పైనే సిమెంట్ వేసి గ్రానైట్‌తో పైకి లేపారు. అనంతరం మట్టితో చదును చేశారు. అయితే ఇటీవల కురుస్తున్న భారీ వర్షానికి మట్టి కూరుకుపోవడంతో పాటు పునాది లేకపోవడంతో ప్రహారీ కూడా పట్టుతప్పి మంగళవారం రాత్రి ఒక్కసారిగా సగం మేర కూలి దిగువన ఉన్న రేకుల ఇళ్లపై పడింది. ఐదారు ఇళ్లపై గ్రానైట్లు పడినప్పటికీ....కేవలం రెండిళ్లపై ప్రభావం ఎక్కువగా చూపి అందులో ఉన్న ఉన్న ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి. ఒకే ఇంట్లో ఐదుగురి మృతి.. గౌస్‌నగర్‌కు చెందిన మహ్మద్ జహంగీర్ తన ఇద్దరు కుమారులు, కుమార్తెలు, కోడళ్లు, పిల్లలతో సంతోషంగా మంగళవారం రాత్రి నిద్రించాడు. నిద్రించిన కాసేపటికే భారీ శబ్దాలు రావడంతో చిన్న కుమారుడు మహ్మద్ నవాజ్ అఖ్నీ వెంటనే బయటికి పరుగులు తీశాడు. ఇంట్లో ఉన్న జహంగీర్ కుమారుడు పెద్ద కుమారుడు సమద్ రబ్బానీ (35), కోడలు సబా హాష్మీ(26), రెండో కుమార్తె ఫౌజియా నాజ్ (36), ఆమె కుమారులు సయ్యద్ జైన్((3), జొయేద్ (19 రోజులు)లు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో కుమార్తె సబియా అనాజ్ (31) తీవ్రంగా గాయపడింది. ఇలా ఒకే ఇంట్లో మొత్తం ఐదు మంది మృతి చెందారు. తల్లి, సంతానాన్ని కోల్పోయిన సిద్దిఖీ జహంగీర్ ఇంటిని ఆనుకునే సిద్దిఖీ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతని ఇంటిపై కూడా ఇదే మాదిరిగా గోడ కూలడంతో సిద్దిఖీ తల్లి జాకీ రా బేగం (50), కుమారుడు సయ్యద్ సాదిక్ (1), కుమార్తె సయ్యదా అన్వారీ (3)మృతి చెందారు. గౌస్‌నగర్‌లో విషాధచాయలు గౌస్‌నగర్‌లో పక్కపక్కింట్లోనే నివాసం ఉండే ఎనిమిది మంది మృత్యువాత పడడంతో స్థానికంగా తీవ్ర విషాధ ఛాయలు అలుముకున్నాయి. రాత్రి వర్షం కారణంగా రాలేకపోయిన బంధుమిత్రులు బుధవారం ఉదయమే పెద్ద ఎత్తున ఇళ్లకు చేరుకున్నారు. అనంతరం మృతదేహాలు రాకపోవడంతో పోస్టుమార్టం చేస్తున్న ఉస్మానియా ఆసుపత్రికి బయల్దేరారు. నీటిలో కలిసిన ప్రాణాలు భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది. జలం మధ్యలో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని జనం విలవిల్లాడారు. వరద నీటి సమస్యనుంచి బయటపడే ప్రయత్నంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. విద్యుదాఘాతంతో కార్పెంటర్ మృతి నాగోలు: కాసోజు నారాయణ చారి (35) ఎల్బీనగర్ బైరామల్‌గూడ కేకే గార్డెన్ సాగర్ ఎన్క్లేవ్ కాలనీలో నివాసముంటూ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం కురిసిన భారీ వర్షంతో సాగర్ ఎన్క్లేవ్ కాలనీలో వరద నీరు వచ్చింది. ఇంట్లో స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేయగా షార్ట్ సర్క్యూట్‌తో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా మంగళవారం రాత్రి మృతి చెందాడు. సెల్లార్ నీటిలో మునిగి చిన్నారి.. చంపాపేట: రమావత్ జితేంద్ర, లక్ష్మి దంపతులు సరూర్‌నగర్ పీఅండ్‌టీ కాలనీలోని సాహితీ నెస్ట్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. వీరికి అర్జిత్సాయి (3) అనే కుమారుడున్నాడు. భారీవర్షానికి అపార్ట్మెంట్ సెల్లార్లో వరదనీరు చేరింది. బుధవారం ఉదయం ఆడుకుంటూ సెల్లార్లోకి వెళ్ళిన అర్జిత్సాయి నీటిలోకి ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అర్జిత్‌ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. వరదలో కొట్టుకుపోయి మహిళ పహాడీషరీఫ్: మణికొండ ప్రాంతానికి చెందిన నర్సింగ్ రావు భార్య వరలక్ష్మి (32) గోషామహాల్లో జలమండలి కార్యాలయంలో స్వీపర్‌గా పని చేస్తుంది. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో సోదరుడు జోగు శంకర్ వెంట బైక్‌పై ఆదిబట్ల నుంచి శంషాబాద్ వైపు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో వెళుతున్నారు. ఫ్యాబ్‌సిటీ సరస్సు నిండటంతో నీటి ప్రవాహంలో అదుపుతప్పారు. శంకర్ బయటికి వచ్చినా వరలక్ష్మి రాలేకపోయింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం రాత్రి 7 గంటలకు మృతదేహం లభించిందని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. సెల్లార్లో నీటిని తోడుతూ.. అంబర్‌పే: బాగ్ అంబర్‌పేట వినాయక్‌నగర్‌లో మహాలక్ష్మి అపార్టుమెంట్ సెల్లార్లో నీరు చేరడంతో చంద్రమౌళి కుమారుడు రాజ్‌కుమార్(33) మోటార్ బుధవారం మోటార్ బిగిస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్‌షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడని అంబర్‌పేట పోలీసులు తెలిపారు. సెల్లార్లో షాక్.. ప్రైవేట్ ఉద్యోగి మృతి అమీర్‌పేట: గంటా శ్రీనివాస్ (47) ధరం కరం రోడ్డులో నివాసం ఉంటున్నాడు. ఐసీఐసీఐ బ్యాంకు వెనకాల సెల్లార్లో ఉన్న గోల్డెన్ కేఫ్ బార్ ఆండ్ రెస్టారెంట్లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో వరదనీరు రెస్టారెంట్లోకి వచ్చిన సమయంలో క్యాషియర్ శ్రీనివాస్‌తో పాటు, మేనేజర్ సుబ్బారెడ్డి, మరో బాయ్‌లో లోపలే ఉన్నారు. కరెంటు పోవడంతో జనరేటర్ ఆన్‌చేశారు. తరువాత కరెంటు రావడంతో నీటిలో విద్యుత్ ప్రవహించింది. వరద నీటిలో ఉన్న షాక్ తగిలి పడిపోయాడు. అక్కడే ఉన్న మేనేజర్, బాయ్ పోలీసులకు సమాచారం అందించారు. విద్యుత్‌వైర్లు బయటకు రావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నీటిని పంపింగ్ చేస్తూ వైద్యుడు.. బంజారాహిల్స్: డాక్టర్ చల్లా సతీష్‌కుమార్ రెడ్డి (49) యోగా, ఫిజియోథెరపి, నేచురోపతి స్పెషలిస్ట్‌గా శ్రీనగర్‌కాలనీలోని ఎస్బీహెచ్ కాలనీలో సేవలందిస్తున్నాడు. సతీష్‌కుమార్‌రెడ్డి ఇంటి సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరింది. బుధవారం ఉదయం నీటిని బయటికి పంపింగ్ చేసేందుకు ఆయన మెట్లు దిగి మోటార్ ఆన్ చేసేందుకు ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు. భయంతో గుండెపోటు..వృద్ధురాలి మృతి బడంగ్పేట్: బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని సాయిబాలాజీ టౌన్షిప్ కాలనీమొత్తం ముంపునకు గురైంది. మంగళవారం రాత్రి ఇంటిలోకి వరదనీరు రావడంతో భయాందోళనకు గురైన రామసహాయం రత్నమాల(65), గుండెపోటుతో చనిపోయింది. అర్ధరాత్రి కాలనీ మొత్తం జలమయం కావడంతో ఆసుపత్రికి తరలించే పరిస్థితి లేకపోవడంతో రాత్రి మొత్తం ఇతర కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటు గడిపారు. -
శ్రీశైలం విద్యుత్ కేంద్రంపై నిర్లక్ష్యం..
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం ప్రారంభం నుంచి ప్రమాదం వరకు కృష్ణానదిపై ఉన్న అన్ని జల విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే విద్యుధుత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రమంతా విద్యుత్ వెలుగులు పంచిన ఈ వెలుగుల దివ్వెలో ఈ నెల 20న జరిగిన ప్రమాదంతో చీకట్లు కమ్ముకున్నాయి. భారీ అగ్నిప్రమాదానికి ఏడుగురు విద్యుత్ ఉద్యోగులు మరణించడంతోపాటు ఇద్దరు అమరాన్రాజ బ్యాటరీ కంపెనీకి చెందిన ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. పవర్‌హౌస్‌లోని ప్యానెల్బోర్డులు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ వైర్లు కాలిపోయాయి. విద్యుత్ కాంతులతో మెరిసే ప్లాంట్‌లోని లోపలి దృశ్యం పొగతో నల్లగా మారింది. ఈ ప్రమాదంపై ఇప్పటికే సీఐడీ, నిపుణుల కమిటీ విచారణ కొనసాగుతుంది. మరోవైపు విద్యుత్ కేంద్రంలో పునరుద్ధరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండు అంతస్తుల్లో నిండుకున్న నీటి తోడిపోత కొలిక్కివచ్చింది. అనుకోని ఘటనతో భారీగా నష్టం వాటిల్లిన శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిశీలిస్తే ప్రతి ఏటా రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేయడం గమనార్హం. ఆది నుంచి అగ్రభాగమే రాష్ట్రానికే తలమానికంగా ఉన్న శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం ప్రారంభించినప్పటికి నుంచి విద్యుదుత్పత్తిలో అగ్రభాగాన నిలుస్తూ తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ వెలుగులు పంచింది. జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఆనాటి ఏపీఎస్ఈబీ ఆధ్వర్యంలో 1992లో భూగర్భ జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సివిల్ పనులతోపాటు కేంద్రంలోని ఆరు యూనిట్ల నిర్మాణాలు 2003 వరకు పూర్తయ్యాయి. కాగా తొలి యూనిట్ 2001లో పూర్తవగా.. తదుపరి ప్రతి ఆరు నెలలకు ఒక యూనిట్ చొప్పున పూర్తయ్యాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ కేంద్రం పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు. 6 యూనిట్ల ద్వారా ప్రతిరోజు 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. నిలిచిన విద్యుదుత్పత్తి రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు పంచిన శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఈ నెల 20న జరిగిన ప్రమాదంతో ప్రస్తుతం ఉత్పత్తి పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. కాంతివంతంగా ఉండే పవర్హౌస్లోపలి దృశ్యం పొగతో నల్లబారింది. ప్యా నల్ బోర్డులు, ట్రాన్స్ఫార్మర్లు కాలిబూడిదయ్యాయి. విద్యు త్ వైర్లు, పరికరాలు కాలిపోయాయి. బేస్బేలో టర్బైన్ల చు ట్టూ కాంక్రీట్, ఫోరింగ్ ధ్వంసమైంది. ప్రస్తుతం పునరుద్ధర ణ పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే పా రిశుద్ధ్య పనులు పూర్తి కాగా.. బయటి నుంచి విద్యుత్ తీసుకొని పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. రెండు అంతస్తుల్లో నిండుకున్న లీకేజీ నీటిని మోటార్ల ద్వారా తోడిపోత కొలిక్కి వచ్చింది. త్వరలోనే యథావిధిగా విద్యుదుత్పత్తి చేస్తామని అధికారులు ప్రకటించినా జపాన్ నుంచి నిపు ణులు వచ్చిన తర్వాతనే ప్రారంభిస్తారని తెలుస్తుంది. అయి తే సీఐడీ అధికారులు, నిపుణుల కమిటీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా విభాగాల్లో పనిచేసే ఉద్యోగులను విచారించి వివరాలు నమోదు చేసుకున్నట్లు సమాచారం. మొత్తంగా రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు పంచిన శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో త్వరగా విద్యుదుత్పత్తి ప్రారంభం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇలా.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు 7 వేల మిలియన్ యూనిట్లకుపైగా విద్యుత్ ఉత్పత్తి చేసింది. 2014– 15లో 1,802.583 మి.యూ, 2015– 16లో 155.263 మి.యూ, 2016– 17లో 616.832 మి.యూ, 2017– 18లో 826.490 మి.యూ, 2018– 19లో 984.396 మి.యూ, విద్యుదుత్పత్తి చేశారు. అలాగే గతేడాది 1,289 మి.యూ, ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకోగా 1993 మి.యూ సాధించారు. ఇక ఈ ఏడాది (2020– 21) జూలై 17 నుంచి భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. అప్పటి నుంచి మొత్తం ఆరు యూనిట్ల ద్వారా 24 గంటల వ్యవధిలో 20 మి.యూచొప్పున విద్యుదుత్పత్తి చేశారు. ఈ ఏడాది లక్ష్యం 1,400 మి.యూ, కాగా ప్రమాదం జరిగిన నాటికి అంటే కేవలం 32 రోజుల్లోనే దాదాపుగా 656 మి.యూ, ఉత్పత్తి చేసినట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. ఈ విధంగా శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ద్వారా మొత్తం 7,034 మి.యూ, విద్యుదుత్పత్తి చేపట్టారు. -
మానవత్వం మరిచారు..!
సాక్షి, భూపాలపల్లి : ఆపదలో ఉన్న ఓ మహిళను ఆస్పత్రికి చేర్చాల్సిన 108 సిబ్బంది ఆమె గుండె కొట్టుకోవడం లేదని చెప్పడం, అప్పటిదాకా ఆమెను తరలించిన ఆటో డ్రైవర్ నిజంగానే చనిపోయిందేమోనని మార్గ మధ్యంలోనే వదిలేసి వెళ్లడం, కరోనా భయంతో సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో సమయానికి వైద్యం అందక ఓ మహిళ మృతి చెందింది. ఈ అమానవీయ ఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వెంకటాపూర్ గ్రామానికి చెందిన శంకరమ్మ (45) మొక్కు తీర్చుకోవడానికి మంచిర్యాల జిల్లా భీమారం మండలం తాళ్లగూడెంలో ఉండే తన చెల్లి ఇంటికి మంగళవారం వచ్చింది. అక్కడ ఆమె శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతూ పడిపోయింది. నోటి నుంచి నురుగులు, ముక్కు నుంచి రక్తం రావడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారం అందించారు. అది రావడం ఆలస్యమవడంతో ఆమెను ఆటోలో తీసుకుని బయల్దేరారు. జైపూర్ మండలం వెలిశాల సమీపంలోకి రాగానే 108 వాహనం వారికి ఎదురైంది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శంకరమ్మను ఆటోలోనే పరీక్షించిన 108 సిబ్బంది ఆమె గుండె కొట్టుకోవడం లేదని, పల్స్ పడిపోయిందని చెప్పి ఆస్పత్రికి తరలించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆటోడ్రైవర్ సైతం మహిళను రోడ్డుపైనే దింపి వెళ్లిపోగా, ఆ కుటుంబం సహాయం కోసం ఎంతమందిని వేడుకున్నా ఎవరూ ముందుకు రాలేదు. అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రైవేటు అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. దానిలో మంచిర్యాలకు తరలిస్తుండగానే శంకరమ్మ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలా వైద్యసాయం అందాల్సినవారిని తక్షణమే ఆస్పత్రికి తరలించాల్సిన 108 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కరోనా భయంతో ఎవరూ దగ్గరకు రాకపోవడంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. -
సర్కారు నిద్రపోతోందా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాధి కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హైకోర్టు మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వ దయా దాక్షిణ్యాల మీద ప్రజల జీవితాలు ఆధారపడి లేవని, రాజ్యాంగ బద్దంగా కల్పించిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉదాసీన వైఖరితో ప్రజలకు సరైన వైద్యం అందక జీవించే హక్కు కాలరాయబడుతోందని, ఇటువంటి తీవ్రమైన సమయంలో న్యాయ స్థానం చూస్తూ ఊరు కోదని హెచ్చరిం చింది. కేంద్రం, ఐసీఎంఆర్ తమ మార్గ దర్శకాలు పాటించాలంటూ పదేపదే చెబుతున్నా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే చేయిదాటిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది . రాష్ట్రవ్యాప్తంగా కరోనా విజృంభిస్తూ నిత్యం వందలాది కేసులు నమోదు అవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని, ప్రభుత్వ తీరు చూస్తోంటే నిద్రపోతున్నట్లుగా ఉందని ఘాటుగా వ్యాఖ్యానించింది. కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి పరీక్షలు పెంచాలంటూ గత నెల 28న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖ ఇప్పటికీ తమకు అందలేదని ఏజీ చెబుతున్నారని....ఇంతకాలమైనా సమాచారం అందలేదనడం విస్మయానికి గురిచేస్తోందన్నారు. ప్రజలకు తెలియజేయాల్సిన కీలకమైన సమాచారాన్ని దాస్తున్నారని, ప్రజల సంరక్షణ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా ఇలా వ్యవహరించడం తగదన్నారు. తమ ఆదేశాలను అధికారులు ఉద్దేశపూర్వకంగా, ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్య ధోరణితోనే అమలు చేయలేదని, అధికారుల తీరు ఇప్పటికైనా మారకపోతే తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించింది. వెంటనే తమ ఆదేశాలను అమలు చేయాలని, ఈనెల 28 నాటికి తమ ఆదేశాలపై తీసుకున్న చర్యలను... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, మునిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ కె.రమేష్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్లు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీచేసింది. కరోనా చికిత్స అందించడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయండి ‘‘కరోనా బారినపడుతున్న వారిలో ఏ వయసు వారున్నారో ప్రకటించండి. అందులో ఫురుషులు, స్త్రీల సంఖ్య ఎంతో తెలియజేయండి. కరోనా రోగులతో కలిసిన వారి (సెకండరీ కాంటాక్ట్) వివరాలు వెల్లడించండి. వారికి 5వ, 10వ రోజు పరీక్షలు చేసి ఆ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచండి. వైద్య, ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌ను వెంటనే పునరుద్దరించండి. వైద్యం అందించే ఆసుపత్రుల వివరాలు, అందుబాటులో ఉన్న బెడ్స్ కేటగిరీ వారీగా వెల్లడించండి. వెంటిలేటర్‌తో కూడిన బెడ్స్, ఆక్సిజన్‌తో కూడిన బెడ్స్, సాధారణ బెడ్స్ ఏ ఆసుపత్రిలో ఎన్ని అందుబాటులో ఉన్నాయో అన్ని భాషల్లో ప్రముఖంగా కనిపించేలా అందులో ఉంచండి. అలాగే ఈ సమాచారాన్ని విస్తృతంగా ప్రసార మాద్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయండి. బెడ్స్ వివరాలను చెప్పాలని తాము ఈనెల 1న స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి 19 రోజులు గడిచినా ఇంకా అరకొర సమాచారమే ఇస్తున్నారు. ప్రజలకు వారికి సమీపంలోని ఏ ఆసుపత్రిలో బెడ్స్ అందుబాటులో ఉన్నాయో తెలిస్తే వారు అక్కడికి వెళ్లి చికిత్స పొందే అవకాశం ఉంటుంది. వెంటనే ఈ సమాచారాన్ని ప్రసార మాద్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి. పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయి? ఏ ల్యాబ్‌లో ఎన్ని ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉన్నాయో వెల్లడించాలి. రోజూ ఇచ్చే మెడికల్ బులెటిన్‌లోనూ ఈ సమాచారాన్ని చేర్చాలి. అలాగే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రస్తుతం ఉన్న వాట్యాప్ నెంబర్ 9154170960ను ప్రసార మాద్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయండి. మెడికల్ బులెటిన్‌లోనూ పేర్కొనండి. ఫిర్యాదుల స్వీకరణకు టెలిఫోన్లను పెంచండి. అత్యవసరమైన ఫిర్యాదులైతే 24 గంటల్లో పరిష్కరించండి. అంత తీవ్రతలేనివైతే 72 గంటల్లో పరిష్కరించండి. అలాగే ఏఏ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయో పేర్కొనండి. అన్ని జిల్లాల కలెక్టర్లు కరోనా రోగుల వివరాలను ప్రతి రోజూ ప్రకటించండి. వివాహాలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరుకావాలని నిబంధనలున్నాయి. వీటిని కచ్చితంగా అమలు చేసి కరోనా వ్యాప్తి చెందకుండా చూడండి. తదుపరి విచారణలోగా తీసుకున్న చర్యలను వివరించండి’’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికైనా మేల్కొనండి ‘‘కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల్లో భారత్‌లో తెలంగాణ రెండోస్థానంలో ఉంది. కర్ణాటకలో ఎనిమిదిన్నర రోజులకు కేసులు రెండింతలు అవుతుండగా....తెలంగాణ తొమ్మిదిన్నర రోజులకు కేసులు రెండింతలు అవుతున్నాయి. 2 వారాల్లో 20 వేల కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సగటు 7.18 శాతం ఉండగా...తెలంగాణలో 21.91 శాతం ఉంది. జాతీయ సగటుకన్నా మూడింతలు ఎక్కువ. అయినా అధికారుల్లో చలనం లేదు. 10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 2.10 లక్షల టెస్టులు చేయగా, తెలంగాణలో 1.09 లక్షల టెస్టులు మాత్రమే చేశారు. టెస్టులు నిర్వహించడంతో తెలంగా>ణ దేశంలోనే చివరి స్థానంలో ఉంది. తమిళనాడులో ప్రతి పదిలక్షల మందికి 24,292, ఏపీలో 24,138, మహారాష్ట్రలో 12,179 టెస్టులు చేస్తుండగా తెలంగాణలో కేవలం 5,961 పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. సెప్టెంబరు చివరి నాటికి 50 శాతం మంది కరోనా బారినపడే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. కరోనా విజృంభిస్తుండడంతో కర్ణాటకలో 10 రోజుల లాక్డౌన్ పెట్టారు. కేసులు తక్కువగానే ఉన్నా అస్సాంలోని గౌహతిలో 3 రోజుల లాక్డౌన్ పెట్టారు. ప్రజల ప్రాణాలకన్నా ఏదీ ఎక్కువ కాదు. వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోండి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. చివాట్లు పెడితే ప్రశంసించామంటారా ? ‘‘కరోనా కట్టడిలో ప్రభుత్వ పనితీరు బాగాలేదని, కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్ నిబంధనల మేరకు పరీక్షలు పెంచాలని పలుమార్లు ఆదేశాలు జారీచేశాం. ప్రతి విచారణ సమయంలో అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. అయినా ప్రభుత్వ పనితీరును హైకోర్టు ప్రశంసించినట్లుగా డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. ఇది ఎంత వరకు సమంజసం. మేము అనని అంశాన్ని తప్పుగా ఎలా చెబుతారు? అధికారులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ఏదో చేశామని గొప్పలు చెప్పుకోవడంలో భాగంగా హైకోర్టు పేరును వాడుకున్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం. సదరు అధికారులను వెంటనే విధుల నుంచి తప్పించాలి. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని ప్రభుత్వం తరఫున ప్రతిసారీ ఏజీ హామీ ఇస్తారు. అయినా అధికారులు అమలు చేయరు. ఇది ఇప్పటికి నాలుగోసారీ. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే హామీకి విలువ లేకుండా పోయింది. ప్రభుత్వం వినికిడి లోపం ఉన్నట్లుగా వ్యవహరిస్తోంది. మేం ఏం చేయాలనుకుంటే అదే చేస్తాం. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరన్న వైఖరి అధికారుల్లో కనిపిస్తోంది. ఈ పద్ధతిని ఇకనైనా మార్చుకోవాలి. ఇది కోర్టుకు అధికారులకు మధ్య ఘర్షణ కాదు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది. అధికారులు మా ఆదేశాల్లోని తీవ్రతను అర్థం చేసుకుంటారనే బావిస్తున్నాం’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. తెలుగులో ఉన్న క్లిప్పింగ్స్ పెడతారా ? ‘‘నాకు తెలుగు చదవడం రాదనే విషయం తెలుసు. అయినా ఈనెల 10, 11 తేదీలకు సంబంధించిన కొన్ని పేపర్ క్లిప్పింగ్స్‌ను తెలుగులోనే నా ముందుంచారు. ఈ వారం రోజుల వ్యవధిలో కనీసం హెడ్‌లైన్స్ అయినా ఇంగ్లీషులోకి తర్జమా చేయాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇది అధికారుల చేతగానితనం. చాలా ఓపికగా, సహనంతో ఎదురుచూశాం. ఇక తీవ్రమైన చర్యలుంటాయి. ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అధికారుల చర్యలు నేరపూరితంగా ఉన్నాయి. ఇక నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రిమినల్ చర్యలుంటాయి. న్యాయవ్యవస్థలో నలుగురిని కోల్పోయాం. 45 మంది సిబ్బంది కరోనాతో బాధపడుతున్నారు. జిల్లాల్లో న్యాయస్థానాలు తెరిచే పరిస్థితి లేదు. సరైన పీపీఈ కిట్స్ ఇవ్వడం లేదని, ఈ నేపథ్యంలో వారి ప్రాణాలకు ప్రమాదం ఉందనే భయంతో కేరళకు చెందిన నర్స్‌లు పనిచేసేందుకు సిద్దంగా లేరని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికైనా పరిస్థితి చక్కదిద్దండి. ఏ ఆసుపత్రిలో ఎన్ని పీపీఈ కిట్స్ అందుబాటులో ఉన్నాయో చెప్పండి. వైద్య సిబ్బంది ప్రాణాలకు రక్షణ కల్పించండి. ప్రాణాలకు తెగించి వైద్యం అందిస్తున్న వారు కరోనాబారిన పడకుండా కాపాడండి. అలాగే తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చేయండి. లేదంటే కోర్టుధిక్కరణ కింద తీవ్రమైన చర్యలను ఎదుర్కొంటారు’’ అని ధర్మాసనం హెచ్చరించింది. ఉస్మానియా ఆసుపత్రిలో వర్షానికి నీళ్లు చేరాయి. వార్డులన్నీ నీటితో నిండిపోయాయి. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు ఎలా వైద్యం పొందుతారు ? వైద్యులు, నర్సులు అక్కడ విధులెలా నిర్వహిస్తారు. రెండేళ్లుగా ఉస్మానియా ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పిస్తామని చెబుతున్నా ఎందుకు కల్పించలేదు. ఇప్పటికైనా ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాల్లో నూతన భవనాలు నిర్మించండి’’ అని ధర్మాసనం సూచించింది. -
గాంధీలో పేషెంట్ల పరిస్థితి దయనీయం
సాక్షి, హైదరాబాద్ : పోరాడాల్సింది వ్యాధితో.. రోగితో కాదని ప్రభుత్వం ఓవైపు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా... కరోనా వైరస్ సోకి ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి దారుణంగా ఉంది. తాజాగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో బాధితులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితికి ఈ వీడియో అద్ధం పడుతోంది. కోవిడ్ వార్డుల్లో అటెండర్లు లేక కరోనా పేషెంట్లు ఆరు బయటే పడి ఉన్నారు. కనీసం సాయం చేసేవారు లేక ఇద్దరు రోగులు అవస్థలు పడుతున్నారు. 60మంది కరోనా పేషెంట్లకు కేవలం నలుగురు మాత్రమే వార్డు బాయ్స్ ఉన్నారు. మరోవైపు కరోనా కేసులతో గాంధీ ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కరోనా వల్లే మృతి చెందాడని... కరోనా మహమ్మారి బంధుత్వాలను, మానవతా విలువలను మంటగలిపింది. వివరాళ్లోకి వెళితే.. టోలిచౌకి పారామౌంట్ కాలనీలోని ఓ భవనంలో మొదటి అంతస్తులో హారూన్ షా అద్దెకు నివాసముంటున్నాడు. ఇతని కుటుంబ సభ్యులు ఉద్యోగ రీత్యా వేర్వేరు నగరాల్లో ఉంటున్నారు. గత నెల 30వ తేదీన ఇతను భోజనం చేస్తుండగా ఒకేసారి కుప్పకూలిపోయి కిందబడటంతో పెద్ద శబ్దం వచ్చి పక్క ఫ్లాట్ వాళ్లు వచ్చి చూసి వెళ్లిపోయారు. మరుసటి రోజు హారూన్ షా మృతి చెందాడని తెలవడంతో కరోనా వల్లే మృతి చెందాడని స్థానికంగా పుకార్లు లేచాయి. ఈ పుకార్లతో హారూన్ ఇరుగుపొరుగు వారు తమ ఫ్లాట్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు మృతదేహాన్ని చూసి వెళ్లిపోయారే తప్పా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాగా మృతుడి దూరపు బంధువైన ముజాహెద్ అనే వ్యక్తి విషయం తెలుసుకుని అక్కడికి వచ్చాడు. స్థానికులెవరూ అంత్యక్రియలకు సహకరించకపోవడంతో ముజాహెద్ సఖీనా ఫౌండేషన్ వారిని సంప్రదించాడు. గతంలో అనాథలు, కోవిడ్–19తో మృతి చెందిన వారికి సఖినా ఫౌండేషన్ అంత్యక్రియలు నిర్వహించింది. -
‘కొండపోచమ్మ’ కాల్వకు భారీ గండి
సాక్షి సిద్దిపేట/గజ్వేల్: కొండపోచమ్మ సాగర్ కాల్వల నిర్మాణంలో డొల్లతనం మరోసారి బయటపడింది. ఇటీవల గజ్వేల్ మండలం కొడకండ్ల హెడ్ రెగ్యులేటరీ వద్ద, మర్కుక్ పంప్‌హౌస్ వద్ద సిమెంట్ లైనింగ్ దెబ్బతినడం, కొండపాక మండలం ఎర్రవల్లి వద్ద కాల్వలు దెబ్బతిన్న ఘటనలు మరువకముందే తాజాగా మంగళవారం మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్‌లో కాల్వకు భారీ గండి పడింది. దీంతో నీళ్లన్నీ పంట పొలాలు, ఇళ్లలోకి చేరాయి. ఈ హఠాత్పరిణామం వల్ల గ్రామస్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అలాగే.. 30 ఎకరాలకుపైగా పంట నష్టం వాటిల్లింది. వానాకాలం సమీపించే వరకు కాల్వల ద్వారా నీరు వదలాలనే ఉద్దేశంతో వేగంగా పనులు చేయడం.. పనుల్లో నాణ్యత లోపించడం.. సిమెంట్ లైనింగ్ సక్రమంగా చేయకపోవడం.. కాల్వల కోసం పోసిన కట్టలను గట్టిపడే వరకు తొక్కించకపోవడం, సరిగా చదును చేయకపోవడంతో కాల్వల నిర్మాణాల్లో నాణ్యత లోపించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం మూడు చోట్ల గండ్లు పడ్డాయి. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి జగదేవ్‌పూర్ కాల్వకు రిజర్వాయర్ నుంచి 3.5 కిలోమీటర్ల కాల్వ మేడ్చల్ జిల్లా తుర్కపల్లి వద్ద కలుస్తుంది. ఇక్కడ జగదేవ్‌పూర్, తుర్కపల్లి కాల్వలు పాయలుగా విడిపోతాయి. జగదేవ్‌పూర్ కాల్వ శివారు వెంకటాపూర్ నుంచి తీగుల్ వైపు వెళ్తుంది. ఈ కాల్వలను జూన్ 24న ప్రారంభించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం 6.30 గంటలకు శివారు వెంకటాపూర్ వద్ద మొల్లోనికుంట సమీపంలోని కాల్వ ప్రదేశంలో భారీ గండి పడింది. దీంతో కాల్వ కింది భాగంలో ఉన్న కల్వర్టు ద్వారా మొల్లోని కుంటలోకి భారీ ప్రవాహం, మరో ప్రవాహం గ్రామంలోకి వెళ్లింది. దీని వల్ల 30 ఎకరాల్లో మిర్చి, టమాట, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు గ్రామంలోని పలువురి ఇళ్లలోకి నీరు చేరింది. టీవీలు, వంట సామగ్రి, బియ్యం, బట్టలు, ఇతర విలువైన వస్తువులు తడిసిపోయాయి. పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నది. సమాచారం అందుకున్న నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరేరామ్, ఎస్ఈ వేణు, ఈఈ బద్రినారాయణ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు నీటిపారుదల శాఖ అధికారులు ముందుగా కాల్వ ప్రవాహాన్ని ఆపడానికి రిజర్వాయర్ వద్ద గేట్లను మూసేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రవాహం పెరగడం వల్లే గండి 295 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన జగదేవ్‌పూర్ కాలువలో ప్రవాహం పెరగడం వల్లే భారీ గండి ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. కాల్వ నుంచి నీటిని చెరువుల్లోకి పంపడం ఇటీవల మొదలైంది. కొత్త కావడం వల్ల నిజానికి ఈ కాలువలో 195 క్యూసెక్కులకు మించి ప్రవాహం ఉండకూడదని చెబుతున్నారు. కానీ సోమవారం రాత్రి నుంచి ఎక్కువ సామర్థ్యంలో నీటిని వదిలారని తెలిసింది. దీని వల్ల గండ్లు ఏర్పడి మొల్లోని కుంటలోకి కొంత, గ్రామంలోకి మరో 30 క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం వచ్చినట్లు చెబుతున్నారు. రాత్రి పూట గనుక ఈ గండ్లు పడి ఉంటే నిద్రావస్థలో ఉన్న జనంపైకి నీరు వేగంగా వచ్చి.. ప్రాణ నష్టం సంభవించేదని పలువురు అభిప్రాయపడ్డారు. కాగా, నీటిపారుదల శాఖ ఈఎన్సీ దగ్గరుండి జేసీబీ, ఇతర యంత్రాలతో గండ్లను పూడ్చి వేయించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఇలాంటివి సహజం: నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరేరామ్ ప్రాజెక్టుల నిర్మాణం, కాల్వల ద్వారా చెరువుల్లోకి నీళ్లు పంపే సందర్భాల్లో గండ్లు పడటం సహజంగా జరుగుతుంటాయని, దీనిని నాణ్యత లోపం, ఇంజనీర్ల వైఫల్యం అని నిరు త్సాహపర్చవద్దని నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరేరామ్ అన్నారు. మంగళవారం సాయంత్రం కొండపోచమ్మ సాగర్ జగదేవ్‌పూర్ కాల్వ గండి పడిన శివారు వెంకటాపూర్ వద్ద విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డలో 88 మీటర్ల ఎత్తు నుంచి 10 పంప్‌హౌస్‌లను దాటుకుంటూ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వరకు 618 మీటర్ల ఎత్తుకు విజయవంతంగా గోదావరి జలాలను తీసుకురాగలిగామని పేర్కొన్నారు. ఈ మహత్తర ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజనీర్లు రాత్రిపగలు అలుపెరగకుండా శ్రమించారని గుర్తు చేశారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేసే సందర్భంలో, కాల్వల ద్వారా చెరువులకు నీళ్లను పంపే సందర్భంలో సహజంగా ఇలాంటి చిన్నచిన్న లోపాలు బయటపడుతాయని పేర్కొన్నారు. తాము ప్రస్తుతం జగదేవ్‌పూర్ కాల్వలో నీటి ప్రవాహం ఏవిధంగా ఉందనే అంశంపైనే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. శివారు వెంకటాపూర్ వద్ద కాలువ పక్కన మట్టి వర్షానికి లూజుగా మారి సిమెంట్ లైనింగ్ దెబ్బతినడం చోటుచేసుకుందన్నారు. దీని వల్లే గండి ఏర్పడిందని చెప్పారు. పక్కనే బైపాస్ రోడ్డు ఉండటం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఈనెల 11న అర్ధరాత్రి ఎర్రవల్లి, కొడకండ్ల వద్ద కాలువలు దెబ్బతినడంలోనూ చిన్న లోపాలు బయటపడ్డాయని చెప్పారు. ఆ రోజు 220 మిల్లీమీటర్ల వర్షం కురవడం వల్ల నీటి ప్రవాహం పెరిగి అలా జరిగిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొండపోచమ్మ సాగర్ కాల్వల ద్వారా నీటిని పంపే సమయంలో తాము పది, పన్నెండు చోట్ల చిన్నచిన్న సమస్యలు వస్తాయని ముందే ఊహించామని, కానీ ఒకటి, రెండు చిన్న సమస్యలతోనే బయట పడగలిగామని స్పష్టం చేశారు. దీన్ని పెద్దదిగా చూపి ప్రజలను భయాందోళనలకు గురిచేయవద్దని కోరారు. -
ఒకే రోజు లక్షా 36 వేల కేసులు
జెనీవా: ప్రపంచ దేశాల్లో రోజురోజుకీ కోవిడ్ విజృంభిస్తోందని, ఈ వైరస్‌పై నిర్లక్ష్యం వద్దని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. అమెరికా, దక్షిణాసియా దేశాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రాస్ అద్నామ్ ఘెబ్రెయాసస్ చెప్పారు. ఆదివారం ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా 1,36,000 పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ‘కరోనా వైరస్ బట్టబయలై ఆరు నెలలైంది. ఇప్పటివరకు ఈ స్థాయిలో భారీగా కేసులు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. ఏ దేశం కూడా ఈ వైరస్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వెయ్యకూడదు’ అని అన్నారు. ఈ కేసుల్లో 75శాతం అమెరికా, బ్రెజిల్, దక్షిణాసియా దేశాలకు చెందినవేనని వెల్లడించారు. యూరప్‌లో కేసులు తగ్గుముఖం పడితే ఆఫ్రికా దేశాల్లో వైరస్ విస్తరిస్తోందన్నారు. అదే సమయంలో చాలా దేశాలు వైరస్‌పై విజయం సాధించడం ఊరట కలిగించే అంశమని అన్నారు. అయితే నిర్లక్ష్యంతో ఉంటే మళ్లీ వైరస్ విజృంభించే అవకాశాలున్నాయని టెడ్రాస్ హెచ్చరించారు. నిరసన ప్రదర్శనల్లో జాగ్రత్తలు వహించాలి ఆఫ్రికా అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రాస్ అన్నారు. జాతివివక్షకు వ్యతిరేకంగా జరిగే ప్రపంచవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఉద్యమానికి తాము ఎప్పుడూ మద్దతుగా ఉంటామని, అయితే ఈ ప్రదర్శనలన్నీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ప్రతీ నిరసనకారుడు ఒక మీటర్ దూరాన్ని పాటించాలని, దగ్గినప్పుడు చెయ్యి అడ్డుపెట్టుకోవడం వంటివి చేయాలని అన్నారు. -
విద్య, వైద్య రంగాలపై తీవ్ర నిర్లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: విద్యా, వైద్య రంగాలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆసుపత్రులు, బడుల పరిస్థితి ఏమాత్రం బాగుపడలేదన్నారు. గత ఆరేళ్లలో పేదల ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ తీ సుకోలేదని విమర్శించారు. ఆదివారం అసెంబ్లీలో పాఠశాల, ఉన్నత విద్య, సాంకేతిక వి ద్యాశాఖ పద్దులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రవేశపెట్టారు. ఇటు క్రీడలు, యువజన సేవ లు, పర్యాటక, కళలు, సాంస్కృతికశాఖ పద్దు ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. వైద్య,ఆరోగ్యశాఖ పద్దును మంత్రి ఈటల రాజేందర్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ పద్దును మంత్రి మల్లారెడ్డి ప్రతిపాదించారు. అలాగే ఎండోమెంట్, అట వీ, శాస్త్ర, పర్యావరణ, న్యాయ పాలన పద్దులపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ పద్దులపై మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు. ఇక సీఎం కేసీఆర్ తరఫున ప్రభుత్వ రంగ సంస్థల పద్దులను కేటీఆర్.. భారీ, మధ్య, చిన్నతరహా, గవర్నర్, కేబినెట్, సాధారణపరిపాలన, ఐఅండ్‌పీఆర్ పద్దులను ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్ శాఖ పద్దులను మంత్రి ఎర్ర బెల్లి దయాకర్‌రావు, రోడ్లు, భవనాలు, స్టేట్ లెజిస్లేచర్ పద్దులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. విద్యుత్ శాఖ పద్దును మంత్రి జగదీశ్‌రెడ్డి, విత్త పాలన, ప్రణాళిక, సర్వేలు, గణాంకాల పద్దులను మంత్రి హరీశ్ ప్రతిపాదించారు. ఈ పద్దుల పై చర్చ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పేద ల కోసం పెద్ద ఎత్తున నిధుల ను ఖర్చుచేస్తున్నట్టు చెబుతు న్నా, అవి సరిగా ఖర్చు కావ డం లేదన్నారు. ఈ ఆసుపత్రు ల్లో తగిన మౌలిక సదుపాయాలు, అధునాతన వైద్య పరికరాలు లేకపోగా, తగిన సంఖ్యలో డాక్టర్లు, సిబ్బంది లేక, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యారంగాన్ని సరైన పద్ధతిలో నిర్వహించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇంగ్లిష్ మీడియం డిమాండ్‌కు తగ్గట్టుగా ఒకటి నుంచి 10 తరగతుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పెద్దన్న కొట్టనంటే మాట్లాడతాను.. పంచాయతీరాజ్ పద్దులపై తన పెద్దన్న, పా తికేళ్లుగా మిత్రుడు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొట్టనంటే మాట్లాడతానని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. రెండ్రోజుల క్రితం చర్చ సందర్భంగా తనను ఉరికిచ్చి కొడతారని మంత్రి అ న్నారని, అయినా మిషన్ భగీరథ పూర్తిగా స క్సెస్ కాలేదని, తన నియోజకవర్గంలోని 33 4 హాబిటేషన్లలో సగం వాటికి ఇంకా నీళ్లు రాలేదన్నారు. గ్రామాల్లో మద్యం షాపులు, బెల్ట్‌షాపు ల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు ల్లో పారదర్శకత లేదని, అప్పులు తెచ్చిన రూ. వేల కోట్లు సరిగా ఖర్చు చేయడం లేదన్నారు. అప్పటికే 2, 3 పర్యాయాలు ప్రసంగం కొనసాగించేందుకు అనుమతినిచ్చిన స్పీకర్ ఈ సంద ర్భంగా రాజగోపాల్ మైక్‌ను కట్ చేశారు. మాకు అబద్ధాలు రావు..: సీతక్క సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలా చోట్ల ఆస్పత్రుల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కోరారు. విద్యా సౌకర్యాలు సైతం మెరుగ్గాలేవని, వాటిపై దృష్టి పెట్టాలన్నారు. పద్దులపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్యాని కి నిధులు పెంచాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సభ్యులు అబద్ధాలు చెప్పొద్దు అనడంతో ‘మాకు అబద్ధాలు రా వు. అబద్ధాలను సైతం అద్భుతంగా చెప్పేం త గొప్పోళ్లం కాదు. ఉన్నదే చెబుతాం..’అం టూ సీతక్క తిప్పికొట్టారు. ఇక గోదావరి తమ ప్రాంతం నుంచే వెళ్తున్న తమ నియోజకవర్గానికి చుక్కా నీరు అందడం లేదని, ఈ దృష్ట్యా చెక్‌డ్యామ్‌లను ఎక్కువగా మంజూరు చేయాలని విన్నవించారు. -
కలెక్టర్ చెప్పినా.. కాదు పొమ్మంటున్నారు
సాక్షి, వరంగల్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది జిల్లాలో డీఆర్డీఓ అధికారుల తీరు. 100 శాతం మానసిక వైకల్యంతో ఉన్న బాలికను చేతులపై మోసుకుని తల్లిదండ్రులు డిసెంబర్ 23న కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు వచ్చారు. ఏడాదిగా పింఛన్ రావడంలేదని, కార్యాలయాల చుట్టు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. స్పందించిన కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంబంధిత అధికారులతో మాట్లాడి పెండింగ్ పింఛన్ వెంటనే ఇవ్వడంతో పాటు ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ పెన్షన్ ఇవ్వాలని ఆదేశించారు. అప్పుడు సరేనని చెప్పిన అధికారులు.. నెల రోజులు దాటినా పట్టించుకున్న పాపానపోలేదు. ఇదిగో.. అదిగో అంటూ దాటవేస్తున్నారు. ఇది ఒక బాలిక సమస్యే కాదు. జిల్లాలో అనేక మంది దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. హన్మకొండ అర్బన్: ఖిలా వరంగల్ ప్రాంతానికి చెందని కొప్పుల గణేష్ కూతురు వర్షిణి నూరు శాతం మానసిక దివ్యాంగురాలు. ఇందుకు సబంధించి అన్ని రకాల పత్రాలు, సదరం సర్టిఫికెట్ ఉండగా గతంలో ఆసరా పింఛన్ అందేది. పెన్షన్ 2019 జనవరి నుంచి ఆగిపోవడంతో పలుమార్లు కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు, డీఆర్డీఓ కార్యాలయంలో వినతులు అందజేసినా ఫలి తం కానరాలేదు. సాంకేతిక సమస్యలు ఉన్నాయని.. త్వరలో పరిష్కరిస్తామని నాన్చుతున్నా రు. డీఆర్డీఓ అధికారుల మాటలతో విసిగిన వర్షిణి తలిదండ్రులు డిసెంబర్ 23న కదల్లేని స్థితిలో ఉన్న తమ కుమార్తెను ప్రజావాణికి తీసుకుని వచ్చి నేరుగా కలెక్టర్ పాటిల్‌ను కలిశారు. ఆమె దీనస్థితికి చలించిపోయిన ఆయన.. ఇంత కాలం ఏం చేస్తున్నారంటూ డీఆర్డీఓ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి కూడా పెన్షన్ అందకపోతే ఎలా అని ప్రశ్నించారు. కలెక్టర్ ప్రత్యేక నిధినుంచి బకాయిలు బాలిక వర్షిణి దీన స్థితితో తక్షణం స్పందించిన కలెక్టర్ పాటిల్.. తన ప్రత్యేక నిధి నుంచి ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న ఏడాది బకాయిలు ఇవ్వాలని ఆదేశించారు. బాధితుల బ్యాంక్ అకౌంట్, ఇతర వివరాలు తీసుకుని ఫైల్ తనకు పంపించాలని సూచించారు. పెండింగ్ బకాయిలు రెండు, మూడు రోజుల్లో జమ అవుతాయ ని.. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌గా పెన్షన్ అందుతుందని బాధితులకు భరోసా ఇచ్చారు. ఇది జరిగి నెల దాటిపోయినా ఇప్పటివరకు ఒక్క పైసా అందలేదు. దీంతో బాధితులు మళ్లీ సోమవారం(నేడు) గ్రీవెన్స్‌లో వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. -
సాక్షి ఎఫెక్ట్: వేటు మొదలైంది..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులపై వేటు మొదలైంది. తొలుత ఇద్దరు వీఆర్వోలను, జిల్లా పౌరసరఫరాల కార్యాలయం సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. అక్రమాలను ప్రోత్సహించేలా చోద్యం చూశారని వీరిపై చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలులో కొందరు మిల్లర్లు అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ మద్దతు ధరకు కాకుండా తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేశారు. తేమ శాతం తక్కువ ఉందని, 1075 రకాన్ని మద్దతు ధరకు తీసుకోమని చెప్పి తక్కువ ధరకు తీసుకున్నారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. అలాగే ఒడిశా నుంచి తీసుకొచ్చిన ధాన్యాన్ని జిల్లా రైతుల నుంచి కొనుగోలు చేసినట్టుగా కొనుగోలు కేంద్రాల్లో బినామీ రైతుల పేరున ఆన్లైన్ చేసి ప్రభుత్వ మద్దతు ధరను కొట్టేశారు. దీనిపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కానీ వీఆర్వోలు పట్టించుకోలేదు. మిల్లర్లకు పరోక్షంగా సహకరించారు. ప్రత్యేక అధికారుల తనిఖీల్లో వీరి నిర్లక్ష్యం, నిర్వాకం బయటపడింది. దీంతో సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ వారిపై సెస్పెన్షన్ వేటు వేశారు. కలెక్టర్ ఆదేశాలతో కదలిక రైతుల గోడును కళ్లారా చూశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని రైతుల నోట నుంచి విన్నారు. పండించిన ధాన్యానికి సంబంధించి క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇక్కట్లను దగ్గరుండి గమనించారు. దీంతో ధాన్యం కొనుగోళ్లు వ్యవహారాన్ని కలెక్టర్ జె.నివాస్ సీరియస్‌గా తీసుకున్నారు. ఎంత పకడ్బందీగా వ్యవహరించినా పరిస్థితిలో మార్పు రాలేదని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు సైతం ప్రతిష్టాత్మకంగా భావించారు. అధికారులందరినీ పరుగులు తీయించారు. అక్రమాలకు పాల్పడినా, ధాన్యం తీసుకోవడానికి వెనకడుగు వేసినా మిల్లులు సీజ్ చేసే అధికారాన్ని ఇచ్చారు. మిల్లుల వద్ద వీఆర్వోలను, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆర్ఐలను నియమించి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని తహశీల్దార్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో కొందరు మిల్లర్లు దారికొచ్చారు. ఫలితంగా కొనుగోళ్లు కొంతమేరకు వేగవంతమయ్యాయి. మిల్లర్ల రికార్డుల తనిఖీల్లో నిర్లక్ష్యం కలెక్టర్ అప్పగించిన బాధ్యతలను క్షేత్రస్థాయి సిబ్బందిలో కొందరు సరిగా నిర్వర్తించలేదు. కొందరు వీఆర్వోలు మిల్లులను తనిఖీలు చేయకుండా పరోక్షంగా అక్రమాలకు సహకరించారు. ధాన్యానికి సంబంధించి మిల్లర్లు రెండు రికార్డులు నిర్వహించాలి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం కోసం ఒక రికార్డు, నేరుగా రైతుల నుంచి (ప్రైవేటుగా) కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి మరో రికార్డును మిల్లరు చూపించాలి. కానీ తమకు వచ్చే లాభాలు పోతాయన్న ఉద్దేశంతో జిల్లాలో చాలామంది మిల్లర్లు రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదు. ప్రైవేటుగా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారు, ఎంత ధరకు తీసుకున్నారన్నది ఇట్టే తెలిసిపోతుంది. అదే జరిగితే మిల్లర్ల అక్రమాలు దాదాపు బయటపడతాయి. కానీ కొందరు క్షేత్రస్థాయి ఉద్యోగులు మిల్లర్ల వద్ద ఉండే రికార్డులను పరిశీలించడం లేదు. దీంతో కొందరు మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల వద్ద తెచ్చిపెట్టుకుంటున్నారు. ఆ ధాన్యాన్నే రైతుల వద్ద ఎంఎస్పీకి కొనుగోలు చేసినట్టుగా కొనుగోలు కేంద్రాల వద్ద ఆన్లైన్ చేయించుకుంటున్నారు. అలాగే ఒడిశా, పశ్చిమ బెంగాల్ ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ కొనుగోలు చేసినట్టుగా చూపిస్తున్నారు. ఇవన్నీ కలెక్టర్ దృష్టికి వచ్చాయి. ప్రత్యేక అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవ పరిస్థితులను నివేదించారు. కొందరు వీఆర్వోలు కలెక్టర్ ఆదేశాలను పెడచెవిన పెట్టిన విషయం బయటపడింది. సస్పెన్షన్ల పర్వం మిల్లుల రికార్డుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగంతో పొందూరు మండలం కనిమెట్ట వీఆర్వో పి.రంగారావు, వీఆర్ గూడేనికి చెందిన వీఆర్వో జి.వెంకటరమణలను సస్పెండ్ చేశారు. ఆరోపణలు రావడంతో డీఎస్ఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అనంత్‌ను తొలుత సీటును నుంచి తప్పించారు. శాఖాపరమైన విచారణ చేపట్టి మిల్లుల అడ్డగోలు ట్యాగింగ్‌లో ఆయన పాత్ర ఉన్నట్టు తేలిన అనంతరం సస్పెన్షన్ వేటు వేశారు. పోలాకి మండలంలోని రాళ్ళపాడు గ్రామంలో ఉన్న శ్రీవెంకటసిరి ఎంటర్ప్రైజెస్ అండ్ శ్రీరామకృష్ణ మోడరన్ రైస్‌మిల్‌కు 3269 క్వింటాళ్ల మేరకు అర్హత ఉంది. ఆ మిల్లును ఈదులవలసలో వెలుగు ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రానికి ట్యాగ్ చేశారు. అక్కడ రికార్డుల ప్రకారం 240 క్వింటాళఉ్ల మాత్రమే వెలుగు సిబ్బంది కొనుగోలు చేసి మిల్లుకు పంపించారు. అయితే సదరు మిల్లు యజమాని మాత్రం రాత్రికి రాత్రి నరసన్నపేటలోని ఒక కొనుగోలు కేంద్రం ద్వారా మొత్తం ధాన్యం తెప్పించుకున్నట్టుగా ఆన్లైన్ చేయించుకున్నారు. దానితో ఈదులవలస కొనుగోలు కేంద్రం పరిధి రైతుల నుంచి ధాన్యం తీసుకోవడానికి ససేమిరా అన్నారు. దీనిని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అధికారులు అప్రమత్తమై ఆరా తీయగా.. జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో జరిగిన కుమ్మక్కు వ్యవహారమే కారణమని తేలింది. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన అనంత్ ముందురోజు రాత్రి అడ్డగోలుగా ఆ మిల్లును నరసన్నపేట కొనుగోలు కేంద్రానికి ట్యాగింగ్ చేశారు. ఆ మిల్లు నిర్వాహకులు నరసన్నపేట కొనుగోలు కేంద్రం పేరుతో రాత్రికి రాత్రి ధాన్యం లావాదేవీలను ఆన్లైన్ చేయించుకున్నారు. ‘సాక్షి’ కథనం అక్షర సత్యం కావడంతో అనంత్‌పై చర్య తీసుకున్నారు. అయితే ఆయన ఒక్కరే బాధ్యులని చెప్పడానికి లేదు. వాస్తవంగానైతే ఆ లాగిన్ అనంత్ పరిధిలోనిది కాదు. ఒక అధికారి పరిధిలో ఉంటుంది. ఆ అధికారి లాగిన్ నుంచే మిల్లుల ట్యాగింగ్ జరగాలి. అలాంటిది అధికారి లాగిన్ నుంచి సీనియర్ అసిస్టెంట్ అడ్డగోలుగా మిల్లులు ట్యాగ్ చేయడం వెనక మరికొన్ని శక్తులు ఉండొచ్చని తెలుస్తోంది. అడ్డగోలుగా వ్యవహరిస్తే వేటు తప్పదు ధాన్యం కొనుగోలు విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరిపైనైనా వేటు తప్పదు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదు. రైతు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయడమే మా లక్ష్యం. రైతులకు ఇబ్బందులున్నా, సమస్యలు ఎదురైనా నేరుగా మాకు తెలియజేయవచ్చు. – కె.శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ -
ఖాకీ నిర్లక్ష్యం ప్రాణం తీసింది!
పంజగుట్ట: జరగరానిది జరిగినప్పుడు హడావుడి చేసే పోలీసులు ఆపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. నగరంలోని పంజగుట్ట పోలీసుస్టేషన్ వద్ద మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసి, బుధవారం ఉస్మా నియా ఆస్పత్రిలో మృతిచెందిన లోకేశ్వరి ఉదంతమే దీనికి నిదర్శనం. చెన్నైకి చెందిన లోకేశ్వరి (37) శ్రీనివాస్‌ను 2000లో వివాహం చేసుకుంది. కుమార్తె పుట్టిన తర్వాత వీళ్లు విడిపోయారు. లోకేశ్వరికి 2012లో మాట్రిమోనియల్ సైట్ ద్వారా నగరంలోని వారసిగూడకు చెందిన ఎస్.ప్రవీణ్‌కుమార్ పరిచయమయ్యాడు. 2013లో ఆమెను నగరానికి తీసుకువచ్చిన ప్రవీణ్ ఆమెతో సహజీవనం కొనసాగించాడు. అప్పట్లో సోమాజిగూడలో నగల దుకాణం నిర్వహించారు. మనస్పర్థలు రావ డంతో లోకేశ్వరిపై ప్రవీణ్ 2014లో పంజగుట్ట పోలీసుస్టేషన్లో చోరీ కేసు నమోదు చేయించాడు. ఈ కేసులో అరెస్టయి బెయిల్‌పై వచ్చిన ఆమె.. కుమార్తెను తీసుకుని చెన్నై వెళ్లిపోయింది. కేసు నమోదు చేయని పోలీసులు... ప్రవీణ్ తనకు రూ.7.5 లక్షలు ఇవ్వాలని లోకేశ్వరి చెబుతోంది. అతనికి ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో స్నేహితుడు కన్నన్‌తో శుక్రవారం ఇక్కడికి వచ్చింది. ప్రవీణ్ కోసం వెతికినా దొరక్కపోవడం, ఫోన్లో అందుబాటులోకి రాకపోవడం తో శుక్రవారమే పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రవీణ్‌ను ఫోన్ ద్వారా సంప్రదించిన పోలీసులు అతడి మాటలు నమ్మి కేసు నమోదు చేసేది లేదంటూ లోకేశ్వరితో చెప్పేశారు. దీంతో ఏసీపీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్న ఆమె ఆ పేరుతో ఫిర్యాదును సిద్ధం చేయించి మంగళవారం పంజగుట్ట ఠాణా వద్దకు వచ్చింది. 2 లీటర్ల పెట్రోల్‌ను తన వెంట తెచ్చుకుంది. ప్రవీణ్ మోసం.. పోలీసులు ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో ఆవేదన చెందిన లోకేశ్వరి ఠాణా ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. 70 శాతం కాలిన ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు వెంట ఉన్న కన్నన్ను మంగళవారమే అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ పేరుతో లోకేశ్వరి సిద్ధం చేసిన లేఖను మాయం చేశారు. బుధవారం లోకేశ్వరి మృతిచెందడంతో పోస్టుమార్టం నిర్వహించి ఆమె వస్తువుల్ని కన్నన్‌కు అప్పగించి రహస్యంగా చెన్నైకు పంపించేశారు. బుధవారం ప్రవీణ్‌పై చీటింగ్, ఆత్మహత్యకు ప్రేరేపించడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పంజగుట్ట పోలీసులు త్వరలోనే అరెస్టు చేస్తామని చెబుతూ నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. ప్రవీణ్‌ను ఫోన్లో సంప్రదించాం: తిరుపతన్న, పంజగుట్ట ఏసీపీ ‘2014లో లోకేశ్వరిపై నమోదైన కేసు అదే ఏడాది లోక్ అదాలత్‌లో రాజీ అయింది. తాజాగా లోకే శ్వరి శుక్రవారం పంజగుట్ట పోలీసుస్టేషన్‌కు వచ్చి ప్రవీణ్‌పై ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్సై.. ప్రవీణ్‌ను ఫోన్లో సంప్రదించారు. లోకేశ్వరి ఆరోపణల్ని ఖండించిన ప్రవీణ్.. తాను బెంగళూరులో ఉన్నానని, 2 వారాల్లో వస్తానని చెప్పాడు. ఆర్థిక కారణాల నేపథ్యంలో ఆమె కుటుంబం మృతదేహాన్ని చెన్నై తీసుకువెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించే స్థితిలో లేదని తెలిసింది. -
ఆశ చూపారు..అంతా మాయ చేశారు..
‘ఇస్తామంటే ఆశ... కొడతామంటే భయం...’ ఇది మానవ సహజం. ఇక్కడ ఇస్తామని ఆశ పెట్టిన గత ప్రభుత్వం లేనిపోని కారణాలతో అందనీయకుండా మాయ చేసింది. ఏదో వస్తుందన్న ఆశతో దరఖాస్తులు... ఇతర ధ్రువపత్రాలకోసం వేలాదిరూపాయలు ఖర్చుచేసిన లబ్ధిదారులు ఇప్పుడు లబోదిబో మంటున్నారు. విజయనగరం పూల్‌బాగ్: గత ప్రభుత్వం 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ. 26.96కోట్లతో 1783 యూనిట్లు రుణాలుగా అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. కానీ అందులో 883 మందికి సబ్సిడీ రిలీజ్ కాగా, 408 యూనిట్లు మాత్రమే గ్రౌండింగ్ పూర్తి చేసింది. మిగిలినవారికి రిక్తహస్తంచూపింది.2018–19 సంవత్సరం లో 8745 మంది ఎస్సీ లబ్ధిదారులు ఎంతో ప్రయాసలకోర్చి మీసేవ, ఈ –సేవా నెట్ సెంటర్లలో రుణాల కోసం ధ్రువపత్రాలు ఆన్లైన్ చేయించుకున్నారు. ఇందుకోసం తలకుమించి ఖర్చుచేశారు. చెప్పులు అరిగేలా అనేకసార్లు వివిధ కార్యాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరిగారు. సరిగ్గా రుణాలు మంజూరు చేసేసమయానికి ఎన్నికల కోడ్ పేరుతో అప్పటి ప్రభుత్వం రుణాల మంజూరు నిలిపివేసింది. ఇక ఏం చేయాలో తెలీక దరఖాస్తులుదారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడారు. 8745 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 1783 యూనిట్లు మంజూరయినట్టు చెప్పి... కేవలం 883 మందికే సబ్సిడీ రిలీజ్ చేశారు. తీరా రూ.13.62కోట్లతో 408 యూనిట్లు గ్రౌండింగ్ చేశా రు. మిగిలినవారి పరిస్థితి అగమ్యగోచరం చేశారు. అయితే కొత్త ప్రభుత్వ ఏర్పాటయ్యాక... నాడు దరఖాస్తు చేసుకున్నవారి పరిస్థితిని గుర్తించి మళ్లీ ఈ ఏడాది దరఖాస్తు చేసుకోనక్కర లేకుండా తాజా సంవత్సరానికి వాటిని బదలాయించారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి 1355 యూ నిట్లు మంజూరుకాగా వాటి కోసం రూ.23.25 కోట్లు మంజూరయ్యాయి.వాటి కో సం 8151 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా రుణా ల కోసం దరఖాస్తు చేసుకోవటానికి ఈ నెల 31వ తేదీ వరకు గడువు పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. పాతవారికి మరో ఛాన్స్.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి రు ణాలకోసం దరఖాస్తు చేసు కుని రుణాలు మంజూరు కాని 900 దరఖాస్తులను ఈ ఏడాదికి బదలాయించాం. వారు తిరిగి దరఖాస్తు చేసుకోనక్కర్లేదు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. – సాధు జగన్నాథం, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, విజయనగరం -
ఉగ్రవాదంపై చర్యల్లో పాక్ విఫలం
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని అణచివేయడానికి, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం అందకుండా అడ్డుకునే చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) తాజా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా మనీలాండరింగ్ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించే ఈ సంస్థ ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తీర్మానాలన్నీ పాక్ తుంగలో తొక్కిందని మండిపడింది. హఫీజ్ సయీద్‌తో పాటుగా ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ముద్ర వేసిన ఇతర ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయాన్ని నిరోధించడంలో పాక్ విఫలమైందని పేర్కొంది. పాక్ తీసుకుంటున్న ఉగ్రవాద నిరోధక చర్యలు 40లో 31 ఎఫ్ఏటీఎఫ్ ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేల్చింది. గత ఏడాదే ఎఫ్ఏటీఎఫ్ పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచింది. ఈ ఏడాది గ్రే లిస్ట్ నుంచి పాక్‌ను బ్లాక్ లిస్ట్‌కు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశాలు పారిస్‌లో ఈ నెల 13 నుంచి జరగనున్నాయి. మా విమానం తిరిగిచ్చేయండి! పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవలి అమెరికా పర్యటన గురించి ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా పర్యటనకు ఇమ్రాన్ సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు చెందిన ప్రైవేటు విమానంలో వెళ్లిన విషయం తెలిసిందే. తిరుగుప్రయాణంలో ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినందువల్ల ఇమ్రాన్, ఆయన బృందం వేరే విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. అయితే, సాంకేతిక లోపం వల్ల కాదు.. సౌదీ యువరాజుకు ఇమ్రాన్‌పై కోపం వచ్చి, తన విమానాన్ని వెనక్కు పంపించమని ఆదేశించినందువల్లనే ఇమ్రాన్ వేరే విమానంలో న్యూయార్క్ నుంచి పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లారని తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని ‘ది ఫ్రైడే టైమ్స్’ ఒక కథనంలో వెల్లడించింది. -
సర్కారు ఆస్పత్రిలో నిర్లక్ష్యపు ‘మత్తు’!
సాక్షి, కోల్‌సిటీ(రామగుండం) : గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి ఓ నిండు చూలాలుకు వైద్యులు ప్రసవం చేయకుండా నిరాకరించారు. మత్తుడాక్టర్ అందుబాటులో లేడనేసాకుతో కరీంనగర్‌కు రెఫర్ చేసి చేతులు దులుపుకున్నారు. మీడియా రంగప్రవేశం చేయడంతో, నిర్లక్ష్యం వీడిన వైద్యులు సదరు గర్భిణిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి ప్రసవం నిర్వహించారు. మత్తుడాక్టర్ లేడని.. గోదావరిఖని అడ్డగుంటపల్లి ప్రాంతానికి చెందిన బొల్లు రమ్య భర్తతో కలిసి కర్నాటక రాష్ట్రంలో ఉంటున్నారు. రెండోకాన్పు కోసం కర్నాటక నుంచి రమ్య పుట్టింటికి వచ్చింది.శుక్రవారం మధ్యాహ్నం నొప్పులు పెరగడంతో ఆస్పత్రికి తల్లి తీసుకొచ్చింది. సాయంత్రం వరకు ప్రసవం జరిపిస్తామని చెప్పిన వైద్యులు, సబ్బు నీళ్లుకూడా తాగించారు. చివరికి అనస్థీషియా డాక్టర్ అందుబాటులోలేరని, కరీంనగర్‌కు రెఫర్ చేశారు. మీడియా ప్రవేశంతో ఉలిక్కిపాటు... రమ్యను కరీంనగర్ తీసుకెళ్లడానికి ఆమె భర్త అందుబాటులో లేరని, తండ్రి కూడా ఊరెళ్లాడని ఒక్కదాన్ని అంత దూరం వెళ్లలేనని, ఇక్కడే ప్రసవం జరిపించాలని తల్లి విమల ఆవేదన వ్యక్తం చేసింది. అనస్థీషియా లేకుంటే తామేమీ చేయలేమని వైద్యసిబ్బంది చేతులెత్తేశారు. అప్పటికే ఒక గర్భిణీకి ప్రసవం చేసిన వైద్యులు, రమ్యకు ప్రసవం చేపట్టకుండా వెళ్లిపోయారని గర్భిణి తల్లి ఆరోపించింది. చివరికి మీడియా ప్రతినిధులు బాధితురాలి సమస్యపై వివరాలు సేకరిస్తుండడంతో, అప్పటి వరకు ప్రసవం చేయలేమని చెప్పిన వైద్యులు, హుటాహుటిన ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుపోయారు. వైద్యులు ఆపరేషన్ చేయడంతో రమ్య బాబుకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారు. వీడని వైద్యుల నిర్లక్ష్యం... ఆస్పత్రిలో ముగ్గురు అనస్థీషియా వైద్యులు, ముగ్గురు గైనకాలజిస్టులు ఆస్పత్రిలో సేవలందిస్తున్నప్పటికీ, రమ్యకు ప్రసవం చేయడానికి నిరాకరించడం నిర్లక్ష్యమేనని ఆరోపణలు వస్తున్నాయి. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చే ఒక్క గర్భిణిని కూడా బయటకు రెఫర్ చేయవద్దని, గతనెల 19న ఆస్పత్రిలో తనిఖీ చేయడానికి వచ్చిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్ అదనపు సంచాలకులు డాక్టర్ అశోక్‌కుమార్ ఆదేశించారు. ఇందుకు ప్రభుత్వాస్పత్రిలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ డెస్క్ కూడా పని చేయడం లేదని, వైద్యుల్లో నిర్లక్ష్యం వీడలేదని ఈ సంఘటనతో తేటతెల్లడైంది. వైద్యుల నిర్లక్ష్యం లేదు గర్భిణీకి ప్రసవం చేయకుండా వైద్యులు నిరాకరించలేదు. వైద్యులు, సిబ్బందికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. అందుకే ప్రసవం చేయడంలో కాస్త ఆలస్యం జరిగింది. నాకు విషయం తెలియడంతోనే వెంటనే వైద్యులతో చర్చించాను. వైద్యులు కూడా స్పందించి రమ్యకు ఆపరేషన్ ద్వారా ప్రసవం జరిపించారు. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారు. – డాక్టర్ రమాకాంత్, సూపరింటెండెంట్ -
ఓటు విలువ తెలుసుకో!
సాక్షి, బాన్సువాడ : వందశాతం పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఎంత కసరత్తు చేస్తున్నా ఓటర్లు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఓటర్లు నిర్లిప్తంగా వ్యవహరిస్తుండడంతో ఎన్నికల సంఘం ఆశించిన ఫలితాలు రావడం లేదు. పోలింగ్ శాతాన్ని పెంచడం కోసం కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఓటుహక్కుపై సదస్సులు, సమావేశాలు నిర్వహించారు. ఓటుహక్కు ప్రాధాన్యాన్ని చాటుతూ ఊరూరా ర్యాలీలు తీశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రచార వాహనాలతో స్థానిక భాషల్లో మైక్‌ల ద్వారా ప్రచారం చేయించారు. అయినా ఇంకా లక్షలాది మంది పోలింగ్ బూత్‌లవైపు తొంగి చూడడం లేదు. గతతో పోలిస్తే పోలింగ్ శాతం కొంతమేర పెరిగినా ఇంకా చాలా మంది ఓటు వేయడంపై నిరాసక్తతతో ఉండడం ఆందోళన కల్గిస్తోంది. గ్రామీణ ఓటర్లకంటే పట్టణ ఓటర్లే తమహక్కు వినియోగంపై అలసత్వం వహిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికలు మినహా సాధారణ ఎన్నికల్లో పోలింగ్ 75 శాతం మించడం లేదు. నిర్లిప్తతను వీడాలి ఐదేళ్లకోసారి ఒక్కగంట కేటాయిస్తే చాలు.. తమ తలరాతలు మార్చే ప్రతినిధిని ఎన్నుకోవచ్చన్న వాస్తవాన్ని ఓటర్లు గుర్తించాలి. ఓటేసినప్పుడే ప్రజాప్రతినిధిని ప్రభుత్వాన్ని నిగ్గదీసి, నిలదీసే హక్కు ఉంటుందని తెలుసుకోవాలి. ఒకవేళ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ‘నోటా’ బటన్ నొక్కినా ఓటు హక్కు వినియోగించుకున్నట్లే.. ‘నేను ఒక్కడినే ఓటేయకపోతే మన తలరాతలు మారవు కదా? అన్న నిర్లిప్తతను వీడాలి. ఓటర్లును తరళించే బాధ్యత ఈసీ తీసుకోవాలి. ఓటుహక్కు ప్రాధాన్యాన్ని చెబుతూ ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా ఓటర్ను పోలింగ్ కేంద్రానికి రప్పించడమే అసలైన పని. వాహన సదుపాయం కల్పించి బూత్‌లకు రప్పించడంలో రాజకీయ పార్టీలే ఇప్పటికీ క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇలా వాహనాలు ఏర్పాటు చేయడంపై ఆంక్షలు విధించిన, ఎన్నికల కమిషన్ వికలాంగులు, వయో వృద్ధు, అశక్తులను పోలింగ్ కేంద్రాలకు రప్పించడానికి ఒక ఆటోను ఏర్పాటు చేస్తోంది. జిల్లాలోని మారుమూల గ్రామాలు, అనుబంధ తండాల్లో, వాగులు, వంకలు దాటి బూత్‌లకు వెళ్లాల్సి ఉంది. ఇలాంటి చోట్ల సరైన వాహన సదుపాయం కల్పించే బాధ్యతను ఎన్నికల కమిషన్ తీసుకోవాలి. పోలింగ్ రోజుతో పాటు ముందురోజు, మర్నాడుకూడా ప్రభుత్వ పరంగా సెలవు ప్రకటిస్తే దూరప్రాంతాల్లో ఉండే ఓటర్లు స్వస్థలాలకు వచ్చి ఓటేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
ఖాకీ వనం.. పచ్చపాతం
పాత్రపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులఆదేశాలు శిరోధార్యంగా మారడం ఆరోపణలకు తావిస్తోంది. చట్టానికి అనుగుణంగా విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు పసుపు రంగు పులుముకుంటున్నారు. రాజ్యాంగ హక్కులు కాల రాస్తున్నారు. మొన్నటి కత్తుల రవికుమార్ నుంచి నిన్నటి కామిరెడ్డి నాని కేసుల వ్యవహారం వరకూ పోలీసుల పాత్రపై ప్రజలల్లో తీవ్రఅసంతృప్తి వ్యక్తమవుతోంది. పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : ఏలూరు రూరల్ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం తల లేని మొండెం లభించింది. ఇది హత్యగా మృతుని బంధువులు ఆరోపిస్తూ పలువురిపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయినా ఈ కేసు దర్యాప్తులో పురోగతి శూన్యం. సామాన్యులకు సంబంధించి పలు కేసులు పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోని పోలీసులు ఏమాత్రం ప్రాధాన్యత లేని అంశాలపై మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజలకు రక్షణ కల్పించడం, న్యాయం చేయాల్సిన పోలీసులు ఇలా ‘పచ్చ’ పాతం చూపించటంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. నేతలకు తొత్తులుగా.. దళితులను కించపరుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కనీసం కేసు కూడా పెట్టని పోలీసు అధికారులు.. చింతమనేని వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత నేత కత్తుల రవి, నవ వరుడు కామిరెడ్డి నానిపై కేసులు నమోదు చేయడంతో పాటు ‘పెద్దల’ ప్లాన్లను అమలుచేస్తూ అరెస్టుల హైడ్రామాలతో వేధింపులకు పాల్పడుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో పక్కా ప్రణాళికతోనే వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నేతలను కేసులు, అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేయటంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 41 నోటీసు ఇచ్చి పంపాల్సిన కేసుల్లో రాజకీయ నేతల మెప్పు కోసం వ్యక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేసేలా వ్యవహరిస్తూ జులుం ప్రదర్శించటంతో పోలీసు వ్యవస్థ ప్రజల్లో పలుచనవుతోంది. ఏలూరు హత్య దర్యాప్తులో పురోగతి ఏదీ ? ఏలూరు పోణంగి ప్రాంతంలో నాలుగురోజుల క్రితం తలలేని మొండెం లభించింది. ఇది ఏలూరులో సంచలనంగా మారింది. మృతుడి తల భాగం ఇప్పటికీ లభ్యం కాలేదు. పోలీసు బృందాలు తల కోసం తీవ్రస్థాయిలో గాలిస్తున్నాయి. మృతుడు ఏలూరు వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన కంచి సతీష్‌గా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా హత్యకు సంబంధించి వన్‌టౌన్ ప్రాంతంలోని ఓ మహిళా ప్రజాప్రతినిధి భర్త, తమ్ముడి పాత్రపై మృతుడి బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతుడికి తొమ్మిదేళ్ల క్రితం వివాహమైనా భార్య నుంచి విడిపోయి జీవిస్తున్నాడు. ఒకవేళ అటువైపు నుంచి ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలోనూ బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయినా పోలీసు అధికారులు మాత్రం ఇటువంటి కేసుల దర్యాప్తులో పురోగతి చూపకపోగా రాజకీయ ఒత్తిళ్లతో నాయకుల ఆదేశాలను పాటిస్తూ కేసులను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. -
ఇళ్లు.. ఇంకెప్పుడు?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. డబుల్ ఇళ్లను కేటాయించి.. టెం డర్లు పూర్తి చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలతో నిర్మాణాలు నెమ్మదిగా నడుస్తున్నాయి. వీటిలో కొన్నింటి పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిరుపేదలు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టడంతో నిర్మాణాల వేగం పుంజుకుంటుందనే ఆశతో ఉన్నారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం పూర్తికావడం ఒక ఎత్తయితే.. వాటిని లబ్ధిదారులకు కేటాయించడం మరో ఎత్తయింది. జిల్లాలో నిరుపేదలకు కేటాయించే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు ఒక అడుగు ముందు కు.. రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. ఖమ్మం, మధిర, పాలేరు, సత్తుపల్లి, వైరాతోపాటు ఇల్లెందులోని కామేపల్లి మండలానికి ప్రభుత్వం 14,490 డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించింది. వీటిలో 8,969 నిర్మాణాలను అనుమతించగా.. 7,374 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఇంకా 1,876 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. 994 ఇళ్లు పెంత్‌బీమ్ స్థాయిలో ఉండగా, 827 ఇళ్లకు శ్లాబ్ పూర్తయింది. 722 గృహాలకు ప్రహరీ నిర్మించారు. 891 ఇళ్లకు ప్లాస్టింగ్ పూర్తి చేశారు. ఇక 2,064 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. సవాలక్ష సమస్యలు.. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం విషయంలో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. మండలాలవారీగా డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరైనా.. వాటిని నిర్మించడం అధికారులకు తలనొప్పిగా మారింది. మొదటగా మండలంలో ఇళ్లు మంజూరైన ప్రాంతంలో స్థల సమస్య తీవ్రంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండడంతో అక్కడ మాత్రమే నిర్మాణాలు ప్రారంభించారు. అనేక ప్రాంతాల్లో స్థలాల లభ్యత లేకపోవడంతో నిర్మాణాలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో అధికారులు ఇళ్ల నిర్మాణం కోసం మళ్లీ స్థలాన్వేషణ చేయాల్సి వస్తోంది. ఈ కారణంగానే చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. అలాగే గతంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5,05,000 కేటాయించగా.. ఈ నగదుతో నిర్మాణాలు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో కూడా చాలా వరకు నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో ఇసుక లభించకపోవడంతో సగంలో నిలిచిపోయిన ఇళ్లు చాలా వరకు ఉన్నాయి. అలాగే లబ్ధిదారుల ఎంపిక తలనొప్పిలా మారింది. ఇన్ని ఇబ్బందులుపడి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినా.. వాటి కేటాయింపు అధికారులకు ఇబ్బందిగా మారింది. గ్రామాల్లో ఇళ్లు కావాల్సిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడం.. మంజూరై.. నిర్మించిన ఇళ్లు తక్కువగా ఉండడంతో వీటిని ఎవరికి కేటాయించాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. కొన్నిచోట్ల ఇళ్ల కేటాయింపులో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తుండడంతో ఇళ్ల కేటాయింపు నిలిచిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. లాటరీ పద్ధతిలో ఇళ్ల కేటాయింపు జరుగుతున్నా.. అధికారుల తీరుపై మాత్రం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణాలతో నిర్మాణం పూర్తయిన ఇళ్లను కూడా ఎవరికీ కేటాయించని పరిస్థితులు కొన్నిచోట్ల ఉన్నాయి. వేగవంతమయ్యేనా.. రెండోసారి అధికారం చేపట్టాక టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటుందనే ఆశాభావంతో నిరుపేదలు ఉన్నారు. నిర్మాణాలు జరగాల్సిన వాటిని వేగవంతం చేయడం.. నిర్మాణంలో ఉన్న వాటి విషయంలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, నిరుపేదలకు సొంత స్థలం ఉంటే రూ.6లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు. దీంతో నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తమ సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునేందుకు అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత అధికారులు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసే అవకాశం ఉంది. -
అంతు లేని నిర్లక్ష్యం!
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : భూప్రక్షాళన ఫలితాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. చేసిన తప్పులు సరిదిద్దుకోలేని రెవెన్యూ ఉద్యోగులు.. మరో పక్క కాసుల కోసం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఒంట్లో సత్తువ లేక, అయినవారు ఎవరూ తోడు లేని అభాగ్యులు, రెక్కాడితే డొక్కాడని నిరుపేదలను సైతం వదలకుండా డబ్బుల కోసం పీడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు... అంతులేని పొరపాట్లు చేసి, పాస్‌పుస్తకంలో సవరణచేయాలన్నా.. పుస్తకం ఇవ్వాలన్నా చేయి తడపాల్సిందేనని డిమాండ్ చేస్తూ కర్షకుల కన్నీటికి కారణమవుతున్నారు. రైతుల అవసరాలను ఆసరా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి. అవసరాలు తీరక... పెట్టుబడికి అవసరమైన అప్పు కోసమే.. లేక లేక అమ్ముకుని అవసరాలు తీర్చుకునేందుకు భూమే ఆధారంగా ఉన్న రైతులకు భూప్రక్షాళన ఇబ్బందులను తెచ్చిపెట్టింది. నిత్యం వందలాది మంది పాస్‌పుస్తకాల కోసం తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత సంవత్సరం వరకు చేతులో పట్టాదారు పాసుపుస్తకాలున్న చాలా మంది రైతులకు ఇప్పుడు కొత్త పాస్‌పుస్తకాలు అందలేదు. దీంతోబ్యాంకు రుణాలు దేవుడెరుగు... ప్రైవేట్ అప్పులూ పుట్టడం లేదు. అంతంత మాత్రంగా ఉన్న పంటలను రక్షించుకోవడానికి చేతిలో చిల్లిగవ్వ లేని రైతులు రుణం కోసం బ్యాంకులకు వెళ్లగా బ్యాంకర్లు మొండిచేయి చూపుతున్నారు. శాపంగా భూప్రక్షాళన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళనలో చోటు చేసుకున్న తప్పులు రైతుల పాలిట శాపంగా పరిణమించాయి. తప్పొప్పుల సవరణకు ప్రభుత్వం గడువు ఇచ్చినా అధికారులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయకపోవడంతో పట్టాదారు పాస్‌పుస్తకాలు చేతికి రాకపోగా రైతుబంధు పథకానికీ దూరమవుతున్నారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన పట్టాదారు పాస్‌పుస్తకాల్లో తప్పులు దొర్లిన వారితో పాటు పార్ట్–బీ(వివాదాస్పదమైనవి)లో ఉన్న భూముల విషయం ఇంకా ఓ కొలిక్కిరాలేదు. భూరిజిస్ట్రేషన్లు, ముటేషన్ల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రభుత్వం భూప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టగా ఆశించిన ఫలితాలు రాలేదు. రికార్డుల ప్యూరిఫికేషన్ అనంతరం వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. ఈ సందర్బంగా చోటు చేసుకున్న తప్పులను సవరించే ప్రక్రియ నేటికీ పూర్తి కాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎన్నికల విధుల్లోకి ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సాధారణ విధులకు దూరమైన అధికారుల తీరుతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమాన్ని సగంలోనే వదిలి అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమైంది. పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్తున్న రైతులకు ‘ఎన్నికల ఏర్పాట్లలో ఉన్నాం.. ఆగాల్సిందే’ అన్న సమాదానం వస్తుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం కలెక్టర్ కార్యాలయానికి పట్టాదారు పాస్పుస్తకాలిప్పించాలని కోరుతున్నారు. ఇదే క్రమంలో సోమవారం దేవరకద్ర, అడ్డాకులల్లో ఆందోళన చేసిన రైతులు మంగళవారం హన్వాడ, మద్దూరులో నిరసన తెలిపారు. జేబు నింపితేనే.... వీఆర్వో లేరు, తహసీల్దార్ సమావేశంలో ఉన్నారు... మ ళ్లీ రండనే సమాధానాలతో పాస్‌పుస్తకాలకోసం వెళ్లిన రై తులు నిత్యం ఎదుర్కొంటున్నారు. అయితే, అక్కడ అడిగినంత ముట్టజెప్పితే మాత్రం పాస్‌పుస్తకం వెంటనే చే తికి వస్తోందని పలువురు పేర్కొంటుండడం గమనార్హం. ముడుపు ముట్టజెప్పుకోకపోతే పాస్‌పుస్తకం ఊసెత్తడం లేదని రైతులు బహిరంగంగా పేర్కొంటున్నారు. జిల్లాలో 35,885 సవరణలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమంలో రికార్డుల ప్యూరిఫికేషన్ నిర్వహించిన అనంతరం కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సమయంలో పాస్‌పుస్తకాల్లో విపరీతంగా తప్పులు దొర్లడంతో సరిచేసి ఇస్తామని రైతుల నుండి పాస్‌బుక్‌లు, చెక్కులు తిరిగి తీసుకున్నారు. ఇలా జిల్లాలో 35,885 తప్పులను గుర్తించారు. అనంతరం పాస్‌పుస్తకాల్లో దొర్లిన తప్పులు సరిచేయక, చెక్కులు, పాస్‌బుక్కులు అందజేయకపోవడంతో రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు. -
దిక్కులేని దవాఖానా!
రాజంపేట : కడప–రేణిగుంట జాతీయరహదారిలో అధికంగా ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరుగుతోందని భావించి మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నా«థ్‌రెడ్డి హయాంలో రాజంపేట పెద్దాసుపత్రికి ట్రామాకేర్‌సెంటర్ మంజూరు చేయించారు. దీనిని ఇటీవల సీఎం ప్రారంభించారు. అయితే అది క్షతగాత్రులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారికి సకాలంలో చికిత్స అందకపోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సంఘటన ఇలా.. ఆదివారం పెనగలూరు మండలంలోని ఈటమార్పురం గ్రామానికి చెందిన శివరాజు కుమార్తె భవ్యశ్రీ బంధవులతోకలిసి అవ్వగారి ఊరైన రాజంపేట మండలంలోని ఊటుకూరు వచ్చింది. గంగమ్మకు మొక్కులు తీర్చుకొని బంధువులతో కలిసి రోడ్డుపై వెళుతుండగా కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు బైకుమీద ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు అందుబాటులేకపోవడంతో డ్యూటీ వైద్యురాలు సుమతికి ఫోన్‌చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది.ఇంటివద్దకు వెళ్లి ఆమెను తీసుకొచ్చేలోపే చిన్నారి మృత్యుఒడికి జారుకుంది. సకాలంలో వైద్యం అందకపోవడంవల్లే ఇలా జరిగిందని బంధువులు ఆగ్రహించారు. ఆందోళనకు దిగారు. ఆకేపాటి ఆందోళన వైద్యుల నిర్లక్ష్యానికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, పట్టణ కన్వీనరు పోలా శ్రీనువాసులరెడ్డి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. హాస్పిటల్ నిర్వహణతీరుపై పెదవి విరిచారు. చిన్నారు మృతికి కారకులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ విభాగం ప్రధానకార్యదర్శి ఈశ్వరయ్య, బీసీవిభాగం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి సుధాకర్, నాయకులు గోవిందుబాలకృష్ణ, రేవరాజు శ్రీనువాసరాజు, జావిద్‌అలీ పాల్గొన్నారు. సీఐ సూర్యనారాయణ అక్కడికి చేరుకున్నారు. సీఐతో ఆకేపాటి చర్చించారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు మన్నూరు ఇన్చార్జి ఎస్ఐ వినోద్ తెలిపారు. దిగజారుతున్న పెద్దాసుపత్రి పరువు రాజంపేటలో ఉన్న వైద్య విధానపరిషత్ ఏరియా ఆసుపత్రి పరువు రోజురోజుకు దిగజారిపోతోంది. 50పడకల ఆసుపత్రిగా ఉన్న పెద్దాసుపత్రిలో ట్రామాకేర్‌సెంటర్, ఓపీబ్లాక్‌ను ఇటీవల జిల్లాకు సీఎం చంద్రబాబు వచ్చిన సమయంలో ఆయన చేతుల మీదుగా ప్రారంభింపచేశారు. అయితే పూర్తి స్ధాయిలో పేదలకు వైద్యసేవలు అందించడంలో విఫలమైందన్న ఆరోపణలను మూటగట్టుకుంది. హెడ్‌క్యార్టర్స్‌లో లేని వైద్యులు.. ఈ ఆసుపత్రికి సంబంధించి వైద్యులు స్ధానికంగా లేకపోవడం వల్ల పేదలకు వైద్యసేవలు సరిగా అందడంలేదు. ఇన్చార్జి సూపరిండెంట్‌గా ఉన్న వైద్యుడు ఒకరు సమయపాలన పాటించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన బయోమెట్రిక్ పనిచేయడంలేదు. కొందరు వైద్యులు రావల్సిన సమయంలో కాకుండా ఇష్టం వచ్చినట్లు వస్తున్నారు. కడప–రేణిగుంట జాతీయరహదారిలో ఈ ఆసుపత్రి ఉంది. అత్యవసర సమయంలో సరిగా చికిత్స అందడంలేదని బాధితులు వాపోతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం,నిర్వహణ అధ్వానం ఫలితంగా నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. -
ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణి మృతి
మదనపల్లె టౌన్ : ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణి మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి మదనపల్లెలో జరిగింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందో ళనకు దిగారు. శుక్రవారం ఉదయం ఆస్పత్రి వద్దకు మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వారికి మద్దతుగా ప్రజా సంఘాల నాయకులు ధర్నా చేశారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గర్భిణి మృతిపై ఆస్పత్రి సిబ్బంది, మృతురాలి కుటుంబ సభ్యులను ఆరా తీశారు. ములకలచెరువు మండలం దేవలచెరువు పంచాయతీ గోళ్లవారిపల్లెకు చెందిన దంపతులు గంగాధర్ నాయుడు, రాణెమ్మ (30) పదేళ్లుగా నీరుగట్టువారిపల్లె బాబుకాలనీలో నివాసం ఉంటూ కూలి మగ్గాలు నేసుకుంటున్నారు. 13 ఏళ్ల తర్వాత మొదటి సారి రాణెమ్మ గర్భం దాల్చింది. ఆమె ప్రతి నెలా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో ప్రసవం నొప్పులు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. పరీక్షించిన డాక్టర్లు ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలని కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు ఆపరేషన్‌కు అంగీకరించడంతో ఏర్పాట్లు చేశారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో రాణెమ్మను ఆపరేషన్ థియేటర్‌కు తరలిస్తుండగా అస్వస్థతకు గురైంది. ఆమెకు ఇంజక్షన్ ఇవ్వడంతో ఒక్కసారిగా కేకలు వేసి స్పృహతప్పింది. డాక్టర్లు ఆమెకు చికిత్స అందించినా పరిస్థితి మారలేదు. విషమంగా మారడంతో తిరుపతికి తరలించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. అప్పటికే ఆమె మృతి చెందడంతో మృతురాలి కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. తమ బిడ్డను ప్రసవం చేసి కాపాడతారని ప్రభుత్వాస్పత్రికి తీసుకొస్తే అన్యాయంగా చంపేశారని సిబ్బందిపై ఘర్షణకు దిగారు. దీంతో ప్రభుత్వాసుపత్రిలోని అత్యవసర విభాగంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అర్థరాత్రి వరకు గొడవ కొనసాగింది. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ సురేష్ సిబ్బందితో ప్రభుత్వాస్పత్రికి చేరుకుని ఘర్షణ జరగకుండా ఇరువర్గాలకు సర్దిచెప్పారు. కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో అప్పటికి వివాదం సద్దుమనిగింది. వైద్యుల నిర్లక్ష్యమే.. శుక్రవారం ఉదయం రాణెమ్మ మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ప్రభుత్వాస్పత్రి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారికి ప్రజాసంఘాల నాయకులు వారికి మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. రాణెమ్మ మృతికి గల కారణాలపై వైద్యులు, మృతురాలి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాణెమ్మ మృతికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. మృతురాలి కుటుంబా నికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట జన్నే రాజేంద్రనాయుడు, సుబ్బానాయుడు, ఆంజనేయులు, భాస్కర్‌నాయుడు, సీపీఐ నాయకులు సాంబ, కాంగ్రెస్ నాయకులు శ్రీధర్, బాలాజీనగర్ షంషీర్, సురేంద్ర తదితరులు ఉన్నారు. మాతాశిశు మరణాలు తగ్గించాలి మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో వరుసగా మాతాశిశు మరణాలు జరుగుతుండడం బాధాకరమని, తగ్గేలా వైద్యులు కృషి చేయాలని డీసీహెచ్ఎస్ సరళమ్మ తెలిపారు. గర్భిణి రాణెమ్మ మరణవార్త తెలియగానే ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఆమెను డీసీహెచ్ఎస్ను ఎమ్మెల్యే తిప్పారెడ్డి నిలదీశారు. ప్రభుత్వాస్పత్రిలో ఏడాదిగా మాతాశిశు మరణాలు జరుగుతున్నా ఏమి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇలా అయితే పేదలు ప్రభుత్వాస్పత్రి దరిదాపులకు కూడా రారని తెలిపారు. డీసీహెచ్ఎస్ మాట్లాడుతూ వైద్య సిబ్బందిపై మృతురాలి బంధువులు దురుసుగా మాట్లాడి మనస్తాపానికి గురి చేశారని ఆరోపించారు. ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారని తెలిపారు. సిబ్బందిపై ఇలా దురుసుగా ప్రవర్తించడం తగదన్నారు. -
సెల్ఫోన్లో మాట్లాడుతూ ప్రసవం చేసిన నర్సు
తమిళనాడు, సేలం: ప్రసవం మహిళలకు మరో జన్మలాంటిది. ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన ప్రసవాన్ని సెల్ఫోన్లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువు మృతికి కారణమైన ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రం నర్సును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ సేలం కార్పొరేషన్ కమిషనర్ సతీష్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వివరాల్లోకి వెళితే.. సేలం దాదగాపట్టికి చెందిన ప్రభాకరన్ (28) ఆడిట్ కార్యాలయంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య కలైమణి (28). వీరిద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల వయస్సు కుమారుడున్నాడు. కలైమణి రెండోసారి గర్భం దాల్చింది. దీంతో ఆమె ప్రతి నెల దాదగాపట్టి ప్రాథమిక వైద్య కేంద్రంలో పరీక్షలు చేయించుకుంటోంది. అక్టోబర్ 1న ప్రసవ నొప్పులు రావడంతో కలైమణిని ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. అక్కడ డ్యూటీలో ఉన్న నర్స్ సెల్వి, ఆమె సహాయకురాలు తమిళ్ సెల్విలు కలైమణికి ప్రసవం చేశారు. వారు అజాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలిసింది. దీంతో ప్రసవంలో ఇబ్బందులు తలెత్తిన కారణంగా కలైమణిని ఉన్నత చికిత్స నిమిత్తం సేలం జీహెచ్‌కు తరలించారు. అక్కడ మృత శిశువు పుట్టింది. దీంతో బిడ్డ మృతదేహాన్ని తీసుకుని ప్రభాకర్ దంపతులు ఇంటికి వెళ్లిపోయారు. తర్వాత రోజు వచ్చిన నర్సు సెల్వి తాను ప్రసవం చూసినందుకు రూ. 8వేలు ఇవ్వాల్సిందిగా ప్రభాకరన్ వద్ద డిమాండ్ చేసింది. అసలే తాము బిడ్డను కోల్పోయిన బాధలో ఉంటే నర్సు లంచం అడగడం ప్రభాకరన్ జీర్ణించుకోలేకపోయాడు. రెండు రోజుల క్రితం సేలం కార్పొరేషన్ కమిషనర్ సతీష్‌కి ఫిర్యాదు చేశాడు.ఫిర్యాదులో తన భార్య కలైమణికి నర్సు సెల్వి, ఆమె సహాయకురాలు తమిళ్‌సెల్విలు ప్రసవం చేశారన్నారు. ఆ సమయంలో సెల్వి సెల్ఫోన్లో మాట్లాడుతూ ప్రసవం చేయడంతో మృతశివువు జన్మించాడన్నారు. నర్సు సెల్వి రూ.8000 లంచం అడిగినట్టు వివరించాడు. దీనిపై విచారణ జరపాలని ఆరోగ్యశాఖ అధికారి పార్తిబన్‌కు కార్పొరేషన్ కమిషనర్ సతీష్ ఉత్తర్వులు ఇచ్చారు. విచారణలో ప్రభాకరన్ ఫిర్యాదు నిజమని తేలింది. దీంతో నర్సు సెల్విని సస్పెండ్ చేస్తూ కార్పొరేషన్ కమిషనర్ సతీష్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెల్వి సహాయకురాలు తమిళ్‌సెల్విని హెచ్చరిస్తూ ఆ సంఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు పంపారు. -
అమరావతిలో CRDA అధికారుల నిర్లక్షానికి ఇద్దురు బలి
-
‘అనంత’ ఆసుపత్రిలో మరణమృదంగం
అనంతపురం న్యూసిటీ:అనంతపురం సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో మంగళవారం ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడడం కలకలం సృష్టించింది. చిన్నపిల్లల వార్డులో ఒకరు, అదే విభాగానికి సంబంధించి ఎస్‌ఎన్‌సీయూలో ఒకరు, లేబర్ వార్డులో ముగ్గురు పసికందులు మృతిచెందారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందారంటూ ఓ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఆస్పత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న తన బాబు వైద్యుల నిర్లక్ష్యం వల్ల చనిపోయాడంటూ విలపించిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడే ఉన్న స్వీపర్లు గమనించి విషయాన్ని సెక్యూరిటీ సిబ్బందికి తెలియజేయడంతో పెనుప్రమాదం తప్పింది. బిడ్డ కడుపులోనే చనిపోయిందన్నారు.. పెదవడుగూరు మండలం మేడమాకులపల్లికి చెందిన వీరనారాయణచారి తన భార్య ప్రమీలకు మంగళవారం ఉదయం నొప్పులు రావడంతో హుటాహుటిన సర్వజనాస్పత్రికి తీసుకొచ్చాడు. పరీక్షించిన వైద్యులు కాసేపట్లో కాన్పు చేస్తామని చెప్పారు. అనంతరం కాన్పు చేసిన వైద్యులు.. మృత శిశువును అప్పగించారు. దీనిపై బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. గైనిక్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని వీరనారాయణచారి ఆరోపించాడు. మూడ్రోజుల క్రితమే బిడ్డ కడుపులోనే చనిపోయిందని చెప్పడమేంటని తప్పుపట్టాడు. గత నెల 28న పరీక్షలకు వచ్చినప్పుడు కడుపులో బేబి, తల్లి బాగా ఉన్నారని చెప్పి.. అంతలోనే మూడ్రోజుల క్రితమే పాప చనిపోయిందని చెప్పడమేంటన్నాడు. వైద్యుల నిర్వాకంతోనే తమ పాప చనిపోయిందని మండిపడ్డాడు. దీనిపై ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మకు ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. సాధారణ వార్డుకు మార్చిన గంటల వ్యవధిలోనే.. గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన మల్లికార్జున కుమారుడు జశ్వంత్(11నెలలు) నిమోనియాతో బాధపడుతుండడంతో గత నెల 25న చిన్నపిల్లల వార్డులో చేర్చారు. మంగళవారం ఉదయం బాబు ఆరోగ్యం కుదుటపడిందని పీఐసీయూ నుంచి సాధారణ వార్డులోకి వైద్యులు మార్చారు. తల్లి కాస్త ఇడ్లీ తిన్పించింది. ఆ తరువాత కొద్ది గంటలకే ఆ తల్లి కేకలేస్తూ పీఐసీయూలోకి వచ్చింది. దీంతో పరీక్షించిన వైద్యులు.. అప్పటికే బాబు మృతి చెందినట్టు తెలిపారు. సాధారణ వార్డుకు మార్చిన గంటల వ్యవధిలోనే తన కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి దిగ్భ్రాంతికి గురైంది. అయ్యో దేవుడా! ఎంత పని చేశావయ్యా.. రేపోమాపో ఇంటికి తీసుకెళ్దామనుకుంటే అంతలోనే ఘోరం జరిగిందయ్యా. నాకింకెవ్వరు దిక్కయ్కా అంటూ.. రోదించడం అందర్నీ కలచివేసింది. కుమారుడు మరణాన్ని జీర్ణించుకోలేని ఆ తల్లి బాత్రూంలోకి వెళ్లి చీరతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే అక్కడే ఉన్న స్వీపర్లు గమనించి సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో తలుపులు పగులగొట్టి ఆమెను రక్షించారు. మరో ముగ్గురూ.. మరోవైపు ఎన్‌ఎస్‌సీయూలో శెట్టూరు యాటకల్లు గ్రామానికి చెందిన నగ్మ అనే మహిళకు జన్మించిన నెలలు నిండని ఆడబిడ్డ(980 గ్రాములు) మృతిచెందగా, కాన్పుల వార్డులో కూడేరు మండలం కమ్మూరు గ్రామానికి చెందిన గౌతమికి పుట్టిన మగబిడ్డ పురిట్లోనే చనిపోయాడు. అదే వార్డులో మరో మహిళకు పుట్టిన మగబిడ్డ కూడా పురిట్లోనే మరణించాడు. ఎన్నడూ లేనివిధంగా లేబర్‌వార్డులో ముగ్గురు చనిపోవడం కలకలం రేపింది. విచారణకు ఆదేశిస్తాం.. లేబర్‌వార్డులో పసికందులు చనిపోయిన విషయం తెలియదు. విచారణకు ఆదేశిస్తా. చిన్నపిల్లల వార్డులో జశ్వంత్ అనే బాబు చనిపోయాడు. ఇడ్లీ తిన్పించే సమయంలో అన్నవాహికలో కాకుండా లంగ్స్‌లో పడింది. అందుకే బాబు మృతిచెందాడు. ఎన్‌ఎస్‌సీయూలో ఓ బిడ్డ మృతిచెందింది. –డాక్టర్ జగన్నాథ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
అప్పుడు చెప్పలేదు కదా!
ఆర్థర్ ఆష్ ఓ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. అమెరికా జాతీయుడు. అమెరికా డేవిస్ కప్ జట్టుకు ఎంపికైన తొలి నీగ్రో ఇతను. అలాగే టెన్నిస్ చరిత్రలో మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన తొలి నీగ్రో జాతీయుడు కూడా ఇతనే కావడం విశేషం. ఓమారు బైపాస్ సర్జరీ చేసినప్పుడు ఇతనికి రక్తం కావలసివచ్చింది. అలా రక్తం ఎక్కించినప్పుడు ఇతనికి ఎయిడ్స్ వచ్చింది. అయితే ఎయిడ్స్ వచ్చిన వాళ్లు బాధకూడదని, వారిని చైతన్యపరచడంకోసం ఇతను ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఇతనిని ఓ పాత్రికేయుడు కలిసి ‘మీకీ జబ్బు వచ్చినందుకు ఆ భగవంతుడిని కోపగించుకున్నారా?‘ అని ప్రశ్నించాడు. దానికి ఆష్ జవాబిస్తూ తొలి నీగ్రో జాతీయుడిగా వింబుల్డన్ టైటిల్ సొంతం చేసుకున్నప్పుడు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పని నేను ఈరోజు ఎయిడ్స్‌తో బాధపడుతున్నాను కదాని దేవుడిని నిందించడం అర్థరహితమని అన్నాడు. ఖర్మఫలాన్ని అనుభవించకతప్పదని అన్నాడు ఆష్. మనం చేసిన పాపపుణ్యాలకు తగిన ఫలితాలు పొందుతామని, వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేరని అన్నాడు. విజయాలు సాధించినప్పుడు ఉప్పొంగిపోవడం, ఓడిపోయినప్పుడు కృంగిపోవడం తగదని, దేనినైనా ఒకేలా స్వీకరించకతప్పదని అతను చెప్పాడు. – యామిజాల జగదీష్ -
వృద్ధులను నిర్లక్ష్యం చేయడం నేరమే
విజయనగరం లీగల్ : వృద్ధులను నిర్లక్ష్యం చేయడం చట్ట రీత్యా నేరమని, అందుకు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద 5 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తామని, కొన్ని సందర్భాల్లో రెండు శిక్షలు పడతాయని జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఎం.శ్రీహరి తెలిపారు. మంగళవారం మండలంలోని పినవేమలి గ్రామాన్ని సందర్శించిన ఆయన గ్రామంలోని ఏబీసీడీ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉంటున్న వితంతువులు, వృద్ధులను పరామర్శించి, వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ వృద్ధులకు అవసరమైన న్యాయ సహాయాన్ని డీఎల్ఎస్ఏ ద్వారా ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. అలాగే వారికి చేతి కర్రలు, చెప్పులు తదితర వస్తువుల కోసం సాంఘిక సంక్షేమ శాఖకు సిఫారసు చేశారు. కార్యక్రమంలో వృద్ధాశ్రమం కేర్ టేకర్ ఎ.విజయలక్ష్మి, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. -
యువత భవిష్యత్తును కాలరాస్తున్న బాబు
రాష్ట్రంలో నిరుద్యోగం బారిన పడిన లక్షలాది యువతకు అవకాశాలను కల్పించడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు వారిని మత్తులో ముంచి, వ్యసనాల ఊబిలోకి నెట్టడానికి కావలసిన అన్ని ప్రయత్నాల్లోనూ ముందు ఉంటున్నారు. ప్రతి ఊరులో గ్రంథాలయం, స్కూలు, వైద్యాలయం నిర్మించాల్సిన బాధ్యత నెరవేర్చడానికి బదులుగా మద్యశాలలు నిర్మించేవాడు సరైన పాలకుడేనా? మహిళల మీద అత్యాచారాలు పెరగడానికి, యువకుల్లో నేరాలు పెరగడానికి తాగుడు ప్రధాన కారణం అని తెలిసి కూడా బాబు కనీసం బెల్టుషాపులను ఎందుకు ఎత్తివేయడం లేదు? నైతిక వర్తన విధ్వంసానికి పనిగట్టుకుని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో తాగుడు, జూదం, యధేచ్ఛగా పాలక వర్గం కనుసన్నల్లో, స్వయంగా తెలుగుదేశం ఎంఎల్ఏ, ఎంఎల్సీలు నడపడం వల్ల కాదా? వ్యవసాయ రంగంలోకి విద్యావంతులను ఆకర్షించి నూతన విధానాలకు తెరలేపవలసిన చంద్రబాబు, వ్యవసాయం దండగని బోధిస్తున్నాడు. చంద్రబాబుకు యువతపై నిర్లక్ష్యం మరింత పెరుగుతోంది. ఆయన ఓట్ల వెంపర్లాటలోపడి యువ శక్తిని నిర్వీర్యం చేస్తున్నారు. ఆం«ధ్రప్రదేశ్‌లో యువశక్తి అపారంగా వుంది. విస్తృతంగా మానవ వనరులున్న ఆంధ రాష్ట్రంలో యువశక్తిని ఉపాధి రంగంలోకి తీసుకురాగలిగితే సంపద వెల్లివిరుస్తుంది. యువకులు సంపద సృష్టికర్తలు శారీరక శక్తి, మానసిక శక్తి కలిసి వారు ఆధునిక పారిశ్రామిక, సాంకేతిక జ్ఞానాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. యువతీ,యువకుల్లో ఈనాడు వినూత్న ప్రతిభ, నైపుణ్యశక్తి ప్రజ్వలిస్తున్నాయి. చంద్రబాబు నిర్దిష్టమైన శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక వ్యవస్ధల నిర్మాణానికి పూనుకోలేక, యువశక్తిని నిర్వీర్యం చేసే అభూత కల్పనలు వల్లిస్తున్నారు. ఉన్న వనరులను కుదువబెట్టడం, వనరులను అమ్ముకోవడం, రాజకీయధనంగా మార్చుకోవడంలో వున్న నైపుణ్యం, ఉత్పత్తి శక్తులకు నిర్మాణాన్ని పొందించే కర్తృత్వం బాబు దగ్గర లేదు. ప్రపంచ వ్యాప్తంగా తయారవుతున్న వస్తువులకు, పరిశమలకు ముడిసరుకు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్, జపాన్, చైనా వలె ఎందుకు సొంత పరిశ్రమలను పారంభించడం లేదనేది పెద్ద పశ్న! భారీ కార్లపరిశ్రమలు, కార్ల విడిభాగాలు తయారు చేసే పరిశ్రమలు, విడిభాగాలను నిల్వచేసే గౌడౌన్ల నిర్మాణం వంటివాటికి లక్షల సంఖ్యలో యువశక్తిని వాడుకోవచ్చు. ఇలాంటి పరిశ్రమల స్థాపన ద్వారా కార్మికులను, గుమాస్తాలను, అకౌంటెంట్లను, మేనేజర్లను పెద్ద సంఖ్యలో ఉద్యోగులుగా వినియోగించవచ్చు. ఈ పారిశ్రామిక నిర్మాణాలకు బదులుగా మందుషాపులు, పబ్‌లు, క్లబ్‌లు, వినోదశాలలు నిర్మించి చంద్రబాబు బుద్ధిపూర్వకంగా యువకులను నాశనం చేస్తున్నారు. ఈనాడు రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. రాష్ట్రంలో 12 లక్షల మంది నిరుద్యోగులున్నారు. ఎందరో డిగ్రీలు, బీటెక్‌లు, ఎంటెక్‌లు, ఎంబీఏలు చేసి ఖాళీగా ఉంటున్నారు. కానీ కొడుకు అభివృద్ధి్ద మీద ఉన్న శ్రద్ధ బాబుకు ఈ యువత మీద లేదు. తండ్రికి తగ్గట్టే కుమారుడు లోకేశ్ సైతం అవినీతిలో, అబద్ధాల్లో తండ్రిని మించిన వాడిగా పేరుపొందుతున్నాడు. చివరకు మధ్యాహ్న భోజనంలో పిల్లలకు పెట్టే గుడ్ల విషయంలోనూ అవినీతే. అంగన్ వాడీ కేంద్రాల్లో నీళ్ల పాలు సరఫరా. అనేక స్కూళ్లలో విద్యార్థులకు తగినన్ని క్లాసురూములు లేవు. విద్యార్థినులెందరో బాల్య వివాహాలకు గురై విద్యాగంధం కోల్పోయి డ్రాపౌట్స్ అవుతున్నారు. దీనివల్ల ఉత్పత్తి కుంటుపడుతుందని, రాష్ట్రం అభాగ్యం కావడానికి స్రీవిద్య తక్కువ కావడమే కారణమని చంద్రబాబుకు తెలియదా? ప్రాథమిక వైద్యశాలల్లో ఒక పడక మీద ముగ్గురు బాలింతలు పడుకొంటున్న దృశ్యాలు బాబు కొడుకు చూడటం లేదా? మీరు పాలించే రాష్ట్రంలో యువకులు పనిలేక బెంగళూరు, మద్రాసు, ఢిల్లీ వంటి నగరాల్లో చాలీచాలని ఉపాధి కోసం పరిగెత్తుతోంటే అంకెల గారడీ చేస్తున్నారా? ఇక పోతే రాష్ట్రంలో గ్రంథాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు వెళ్లాలంటే గ్రంథాలయాలు, డిజిటల్ లైబ్రరీలు అవసరం. కానీ ఉన్న కాసిని గ్రంథాలయాల్లోనూ మంచినీళ్ల వసతి లేదు. కొత్త పుస్తకాల కొనుగోలు లేదు. దళిత బడుగు వర్గాల పిల్లలు పూర్తిగా గ్రంథాలయాలపైనే ఆధారపడి ఉంటారు. ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందో ఆలోచించాలి. గ్రంథాలయోద్యమం ద్వారానే స్వాతంత్య్రం వచ్చిందని, భాషా రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కూడా గ్రంథాలయోద్యమం వల్లనేనని చంద్రబాబు గ్రహించడం లేదు. ప్రతి ఊరులో గ్రంథాలయం, స్కూలు, వైద్యాలయం నిర్మించాల్సిన బాధ్యత నెరవేర్చడానికి బదులుగా మద్యశాలలు నిర్మించేవాడూ పాలకుడేనా? యువతను వ్యక్తిత్వ నిర్మాణంలో తీర్చిదిద్దాల్సిన పాలకుడు యువతను వ్యసనాల ఊబిలోకి నెడుతున్నారు. మహిళల మీద అత్యాచారాలు పెరగడానికి, యువకుల్లో నేరాలు పెరగడానికి తాగుడు ప్రధాన కారణం అని తెలిసి కూడా బాబు కనీసం బెల్టుషాపులను ఎందుకు ఎత్తివేయడం లేదు? మరోవైపున కంప్యూటర్, కమ్యూనికేషన్లు, ఇతర సర్వీసు రంగాలకు ఎనలేని ప్రాధాన్యమిస్తున్న చంద్రబాబు, ఈ సర్వీసు రంగాలకు కీలకమైన ఉత్పత్తి రంగాలు, వ్యవసాయం, పరిశ్రమలు, గనులు వంటివాటిని పూర్తిగా మర్చిపోయాడు. వ్యవసాయ రంగంలోకి విద్యావంతులను ఆకర్షించి నూతన విధానాలకు తెరలేపవలసిన చంద్రబాబు, వ్యవసాయం దండగని బోధిస్తున్నాడు. లోకేశ్ అయితే వ్యవసాయ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాడు. పెట్టుబడిదారులు వస్తూత్పత్తి కేంద్రాలతోబాటు తమ మార్కెట్ల కోసం బాబు వంటి ముఖ్యమంత్రులను కొనేస్తున్నారు. ఎన్నికలకు ధనాన్ని అందిస్తున్నారు. అందుకే లిక్కర్ ఉత్పత్తిదారులు, లిక్కర్ పంపిణీదారులు బాబు వెనుక ఉండి నడిపిస్తున్నారు. ఎన్నికల్లో కల్తీమద్యం అమ్మకాలతో కొత్తరకం యువకులను తాగుబోతులుగా మార్చి ఎన్నికల్లో వాడుకోవాలని వ్యూహాలు పన్నుతున్నారు. మోదీ, చంద్రబాబు ఇరువురూ కార్పొరేట్ బానిసలుగానే ఉన్నారు. వారి మధ్య అంతర్గత ఐక్యతకు అదే ప్రాతిపదిక. ఈ రెండు శక్తులు పెంచుతున్న ప్రైవేట్ సెక్టారులో దళిత బహుజనులకు ప్రతిభ పేరుతో ఉద్యోగాలు రాకుండా చేయడమే వీరి ప్రయత్నం. తద్వారా దళిత బహుజనుల యువత ఉపాధిలేక నిర్వీర్యత, నిర్వేదాలకు గురి కావాలని, మనం పుట్టిన రాష్ట్రంలో మనం బ్రతికే పరిస్థితి లేదనే నిర్వేదనకు అలవాటు పడతారనేదే వీరి ఆలోచన అని స్పష్టం అవుతుంది. నిజానికి 7,8 తరగతుల విద్యార్థినులకు సైకిళ్లు ఇవ్వడం వల్ల విద్యార్థినులు డ్రాపౌట్ శాతం తగ్గించవచ్చు. ఆరోగ్య సేవలకు నర్సరీ ట్రైనింగ్ సెంటర్సు ఎక్కువ పెట్టడం ద్వారా యువతను మరింతగా ఉపయుక్తం చేయవచ్చు. ఎందుకు చంద్రబాబు యువతను ఉపాధిరంగం వైపు నడిపించడం లేదు? ముఖ్యంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కలిపి 18 వేల బ్యాక్లాగ్ పోస్టులున్నాయి. ఎందుకు పూరించడం లేదు! ఎందుకు ఉన్నత విద్యలో దళితులపై వివక్ష చూపిస్తున్నారు? పి.హెచ్.డి చేసే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్పులు ఇవ్వడం లేదు. తద్వారా పరిశోధనా రంగం కుంటినడక నడుస్తో్తంది. అంతేకాదు. బి.ఎ.,ఎం.ఎ., ఫిలాసఫీ, ఆర్థ్ధిక శాస్త్రం, చరిత్రలను నిర్వీర్యం చేస్తున్నారు. అధ్యాపకుల పోస్టులు పూరించడం లేదు. ఎందుకు చంద్రబాబుకు ఉన్నత విద్యంటే వ్యతిరేకత? ఈ విషయాలను అర్థ్ధం చేసుకొని యువత పోరాటాలకు సన్నద్ధం కావాలి. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు అడుగు వేయాలి. రాజకీయ అవగాహన, రాజకీయ చైతన్యం, సిద్ధాంత బలం, ప్రత్యామ్నాయ ఆలోచన ఈనాటి యువతకు అవసరం. యువత తిరగబడిన అన్ని సందర్భాల్లో సమాజ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మానవ వనరులు శ్రమ, శక్తి, బహుముఖంగా వున్న ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి యువత నడుంకట్టాలి. కత్తి పధ్మారావు(వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, వ్యవస్థాపక అధ్యక్షుడు, నవ్యాంధ్రపారీ) -
ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణాలు!
సాక్షి, నెల్లూరు: ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వరుస దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలవుతున్నాయి. నిన్నటికి నిన్న చిత్తూరు జిల్లా పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యం అందక బాలింత ప్రాణాలు విడిచారు. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలోనూ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు గర్భిణికి వైద్యం అందలేదు. ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మూడురోజులుగా వైద్యులు అందుబాటులో లేరు. దీంతో గర్భిణీకి వైద్యం అందక.. కడుపులోనే శిశువు మృతిచెందింది. బిడ్డ దక్కకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై భగ్గుమంటున్నారు. పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలోనూ.. ఇక పుత్తూరు పట్టణం ఆచారి వీధికి చెందిన నిఖిలను డెలివరీ కోసం శనివారం పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ప్రసవం అనంతరం అధిక రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో ఆదివారం రాత్రి ఆమె మరణించింది. ప్రసవానంతరం సరైన చికిత్స చేయకుండా నిఖిల మరణానికి కారణమయ్యారంటూ ఆస్పత్రి సిబ్బందిపై మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి తీరుకు నిరసనగా రోడ్డుపై ధర్నాకు దిగి ఆందోళన చేపట్టారు. -
లాకౌట్‌కు సిద్ధం !
అనంతపురం అగ్రికల్చర్: పదేళ్ల కిందట పాల విప్లవం సృష్టించిన ప్రభుత్వ డెయిరీ పరిస్థితి ఇప్పుడు పతనావస్థకు చేరుకుంది. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం, డెయిరీ అధికారుల అలసత్వం పాడి రైతులకు శాపంగా మారాయి. హెరిటేజ్ అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు ప్రైవేట్ డెయిరీలను ప్రోత్సహిస్తుండటంతో ప్రభుత్వ డెయిరీ సంక్షోభంలో కూరుకుపోయింది. పాలక పెద్దలకు పట్టించుకునే తీరిక లేకపోవడంతో ఇదే అదనుగా డెయిరీలో పనిచేస్తున్న అధికారులకు ఇష్టారాజ్యమైంది. ఫలితంగా పెద్ద ఎత్తున నష్టాలు మూటగట్టుకుని పాడి రైతులకు సేవలందించలేక మూతబడేందుకు సిద్ధమైంది. పదేళ్ల కిందటే 70 వేల లీటర్లు పదేళ్లు వెనక్కి తిరిగి చూస్తే 2006–2012 వరకు రోజుకు 20 వేల మందికి పైగా రైతుల నుంచి 70 నుంచి 80 వేల లీటర్లు పాలు సేకరిస్తూ క్షీరవిప్లవం సృష్టించిన ఏపీ డెయిరీ ఇప్పుడు చతికిలపడిపోయింది. అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాయితీలు, సబ్సిడీలతో ఇచ్చిన ప్రోత్సాహంలో జిల్లాలో వ్యవసాయానికి ప్రధాన ప్రత్యామ్నాయంగా పాడి పరిశ్రమ అభివృద్ధి బాటలో దూసుకుపోయింది. 30 బీఎంసీలు మూత జిల్లా పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (ఏపీ డెయిరీ) ఆధ్వర్యంలో ఒక్కొక్కటి 50 వేల లీటర్లు చొప్పున అనంతపురం, హిందూపురంలో లక్ష లీటర్లు సామర్థ్యం కలిగిన పాలశీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. 2006–12 మధ్యకాలంలో 42 బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లు (బీఎంసీ) పనిచేస్తుండగా వాటి పరిధిలో 74 పాలరూట్లు, 540 వరకు పాల సేకరణ సెంటర్లు పనిచేస్తూ రోజుకు ఎంతలేదన్నా 70 వేల లీటర్లు పాల సేకరిస్తూ... వాటిని జిల్లాతో పాటు హైరదాబాద్‌కు రవాణా చేసి లాభాలబాటలో పయనించింది. కానీ... ఇపుడు 30 బీఎంసీలు మూతబడ్డాయి. కేవలం 30 పాలరూట్ల పరిధిలో 230 పాల సేకరణ సెంటర్లు మిణుకు మిణుకు మంటూ పనిచేస్తున్నాయి. వాటి నుంచి రోజుకు కేవలం 5 వేల నుంచి 5,500 లీటర్లు పాల సేకరిస్తున్నారు. రైతులు తక్కువైనా వారికి కూడా నెలల తరబడి బిల్లులు చెల్లించలేకపోతున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ డెయిరీ రైతులను బట్టులో వేసుకుంటూ తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాయి. డెయిరీపై అవినీతి ముద్ర డెయిరీలో పనిచేస్తున్న డీడీతో పాటు ఇతర అధికారులు, మేనేజర్లు, క్షేత్రస్థాయి సిబ్బందిలో చాలా మంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పాల సేకరణ, స్థానిక అమ్మకాలు, ఇతర రాష్ట్రాలకు అమ్మకం, చెల్లింపులు, నిర్వహణ విషయాల్లో అవినీతి అక్రమాలు పెరిగిపోవడం, అడిగేవారు లేకపోవడం, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం, ఆ శాఖ కమిషనరేట్ అధికారులు సహకరించకపోవడంతో ఇక్కడ పనిచేస్తున్న డీడీల్లో ఇటీవల కాలంలో నాగేశ్వర్రావు, వై.శ్రీనివాసులు అనే ఇరువురు అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. మూడు నెలల్లో డెయిరీని అభివృద్ధి బాటలో పట్టిస్తానంటూ గొప్పలు చెప్పిన డీడీ ఎం.శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టి 9 నెలలైనా చేసిందేమీ లేదన్న విమర్శలు వ్యక్తమతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ప్రభుత్వ డెయిరీకి పాలు పోస్తున్న పాడి రైతుల బాగోగులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. డెయిరీలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో డెయిరీ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది. ప్రైవేట్ డెయిరీల్లో లీటర్‌పై ఐదు నుంచి ఆరు రూపాయలు ఎక్కువగా ఇస్తున్నారు. సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయి. ఏపీ డెయిరీ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, ఆ శాఖ కమిషనరేట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదు. – బుల్లే ఆదినారాయణ, పాల ఉత్పత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
కోర్టు పక్షులు
పక్కనున్న కేసుల చిట్టా చూస్తే చాలు.. అధికార యంత్రాంగం విధి నిర్వహణలో ఎక్కువ సమయం వీటి విచారణలకే కేటాయించాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వేల సంఖ్యలో పెండింగులో ఉంటున్న కేసులు.. అధికారులను.. ముఖ్యంగా రెవెన్యూ యంత్రాంగాన్ని కోర్టు పక్షులుగా మార్చేస్తున్నాయి. జిల్లా కలెక్టర్ నెలలో కనీసం రెండుమూడు రోజులు ఏదో ఒక కేసులో కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది. జేసీ, ఆర్డీవో స్థాయి అధికారులదీ అదే పరిస్థితి. భూసేకరణ వంటి విభాగాల అధికారులైతే వారంలో మూడు నాలుగు రోజులు కోర్టు కేసుల్లోనే మునిగిపోవాల్సి వస్తోంది. ఫలితంగా రెవెన్యూ శాఖలో రోజువారీ వ్యవహారాలు పెండింగులో పడుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విశాఖ జిల్లాలోనే ఎక్కువ కేసులు నమోదవుతుంటే.. వాటి పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం కూడా కేసులను పెండింగులో పడేస్తూ.. కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో మరెక్కడా లేనన్ని కోర్టు కేసులు ఒక్క విశాఖ జిల్లాలోనే ఉన్నాయి. దాదాపు ఈ కేసులన్నీ భూ సేకరణ, భూ వివాదాలకు సంబంధించినవే. సుప్రీంకోర్టు మొదలుకొని హైకోర్టు, జిల్లా కోర్టు.. ఇతర కింది కోర్టుల్లోనూ వేల సంఖ్యలో కేసులు విచారణలో ఉన్నాయి. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే విశాఖ కలెక్టర్ నెలలో కనీసం ఒకటి రెండు రోజులు వీటి విచారణకు హాజరయ్యేందుకు ఢిల్లీ, హైదరాబాద్‌లకు వెళ్లాల్సి వస్తోంది. ఆయనే కాదు..జేసీ, ఆర్డీవోలు, తహసీల్దార్లు కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత నాలుగేళ్లలోనే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అలసత్వమే కారణం జిల్లాలో నమోదవుతున్న వాటిలో రెవెన్యూ, ఇనాం, వక్ఫ్, దేవాదాయ భూముల ఆక్రమణల కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. అధికారుల అలసత్వం వీటి పరిష్కారంలో జాప్యాని కి.. ఎక్కువ రోజులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి దారితీస్తోంది. సకాలంలో కౌంటర్లు దాఖలు చేయకపోవడంతో కింది కోర్టుల్లో పరిష్కరించుకోదగిన కేసుల్లో సైతం పై కోర్టుల ను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కొన్ని కేసుల్లో అధికారుల వ్యవహరిస్తున్న తీరు ప్రత్యర్థులకు వరంగా మారుతోంది. దసపల్లా హిల్స్‌తో పాటు కొన్ని కీలకమైన భూ వివాదాల్లో ప్రైవేటు పార్టీలకు అనుకూలం గా తీర్పులొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సివిల్ వివాదాలకు సంబంధించి.. సుప్రీంకోర్టులో నాలుగు, హైకోర్టులో 963, లోయర్, డిస్ట్రిక్ట్ కోర్టుల్లో 302, అప్పీల్స్ మరో ఐదు కలిసి మొత్తం 1274 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఉన్న నాలుగు కేసుల్లో కూడా కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంది. హైకోర్టు లో ఉన్న 963 కేసులకు సంబంధిం చి 312 కేసుల్లో కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంది. సివిల్ వివాదాలకు సంబంధించి జిల్లా, కింద కోర్టుల్లో 302 రిట్ పిటిషన్లు పెండింగ్‌లో ఉంటే.. వాటిలో 67 కేసుల్లో కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంది. ఐదు కేసుల్లో మాత్రమే అప్పీల్‌కు వెళ్లగా వాటన్నింటికీ కౌంటర్స్ ఫైల్ చేయాల్సి ఉంది. ఆన్లైన్ లీగల్ కేసెస్ మానిటరింగ్ సిస్టమ్(ఓఎల్‌సీఎంఎస్)కింద హైకోర్టులో 1585 కేసులు, కింద కోర్టుల్లో 96 కేసులు ఫైల్ కాగా.. ఇప్పటి వరకు హైకోర్టులో 656 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. రెవెన్యూ కోర్టుల్లో 560 కేసులు ఫైల్ కాగా.. 245 పరిష్కారమయ్యాయి. మరో 315 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇనాం కేసులు ఆర్డీవో కోర్టుల్లో 42, సీసీఎల్ఏ కోర్టులో 11 పెండింగ్‌లో ఉన్నాయి. గత 4 ఏళ్లలోనే అధికం కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు రాష్ట్రంలో మరెక్కడా లేనంతగా విశాఖ జిల్లాలోనే ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉండగా.. వీటిలో అధిక శాతం కేసులు గత నాలుగేళ్లలో దాఖలైనవే కావడం గమనార్హం. భూసేకరణ వివాదాల కేసులు చాలా తక్కువగా ఉండగా.. ఎక్కువ శాతం ప్రభుత్వ, ప్రైవేటు భూ వివాదాలే. ఆక్రమణదారులకు కొమ్ముకాయడం..భూ కబ్జాలను ప్రోత్సహించడం వల్లే అధికారులను పార్టీలుగా చేస్తూ బాధితులు కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఏళ్ల తరబడి ఈ కేసులు కోర్టుల్లో నలుగుతుండడంతో దానికి బాధ్యులైన వారు ఎక్కడున్నా సరే కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సి వస్తోంది. కోర్టుల చుట్టూ తిరిగే విభాగాల్లో మొదటి స్థానంలో రెవెన్యూ యంత్రాంగం ఉండగా..ఆ తర్వాత దేవాదాయ ధర్మదాయ శాఖ, అటవీ తదితర శాఖల అధికారులుంటున్నారు. ఈ ప్రభావం పాలనపై పడుతోందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
ఆయుర్వేద వైద్యం.. అంతులేని నిర్లక్ష్యం !
నాలుగేళ్లలో ప్రభుత్వం అన్ని రంగాలను చేసినట్లే వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందనడానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ ఆస్పత్రి.. అదే నవ్యాంధ్రలోని ఏకైక ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఆస్పత్రి... విజయవాడలోని ఆచంట ఆయుర్వేద ఆస్పత్రి. మందుల కొరత, అరకొర సౌకర్యాలు, వైద్యుల లేమి వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు ఏడాదిన్నర కిందట బందరు కాలువ ఒడ్డున ఉన్న కళాశాలను ఖాళీ చేయాలంటూ ఇరిగేషన్ శాఖనోటీసులు ఇవ్వగా, ప్రత్యామ్నాయంపై పాలకులు దృష్టి సారించడం లేదు. లబ్బీపేట(విజయవాడ తూర్పు): దేశీయ ప్రాచీన వైద్యమైన ఆయుర్వేదానికి పూర్వ వైభవం తీసుకు వస్తామంటున్న పాలకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. నవ్యాంధ్రలో ఉన్న ఏకైక ఆయుర్వేద కళాశాల, దానికి అనుబంధంగా ఉన్న ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనలో పాలకులు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. దీంతో ఆస్పత్రికి వచ్చిన రోగులకు సరైన వైద్యం అందించలేని దుస్థితి నెలకొంది. మరోవైపు వైద్య విద్యార్థులకు బోధన చేసేందుకు సైతం ప్రొఫెసర్లు అందుబాటులో లేని దుస్థితి. ఈ విషయమై అనేక మార్లు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆయుర్వేద కళాశాల, ఆస్పత్రులు బందరు కాల్వ ఒడ్డున ఉండటంతో వాటిని ఖాళీ చేయాలని ఏడాది కిందట ఇరిగేషన్ శాఖ నోటీసులు జారీ చేసారు. ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకునే వారే కరువయ్యారని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలోనే ఏకైక కళాశాల.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలు ఉండేవి. రాష్ట్ర విభజన అనంతరం వరంగల్, హైదరాబాద్ కళాశాలలు తెలంగాణ రాష్ట్రానికి చెందగా, విజయవాడలోని నోరి రామశాస్త్రి ఆయుర్వేద కళాశాల ఒక్కరే నవ్యాంధ్రలో మిగిలింది. దానికి అనుబంధంగా ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయుర్వేద కళాశాలలో ప్రతిఏటా బీఏఎంఎస్‌లో 60 సీట్లు భర్తీ చేస్తుండగా, పోస్టు గ్రాడ్యుయేషన్ నాలుగు విభాగాల్లో 20 మంది చేరుతున్నారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అరకొర సౌకర్యాలు.. ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద ఆస్పత్రికి నిత్యం 150 నుంచి 200 మంది అవుట్‌పేషెంట్స్ వస్తుంటారు. మరో 60 నుంచి 80 మంది వరకూ ఇన్‌పేషెంట్స్ చికిత్స పొందుతున్నారు. వారికి వైద్య సేవలు అందించేందుకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. నాల్గవ తరగతి ఉద్యోగులు, స్టాఫ్‌నర్సులు ఉద్యోగ విరమణ చేస్తుండగా, కొత్తవారిని పదేళ్లుగా భర్తీ చేయడం లేదు. దీంతో తీవ్రమైన సిబ్బంది కొరత నెలకొంది. రోగులకు సేవలు అందించేందు సిబ్బంది లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు బయటే.. ఆయుర్వేద ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన రోగులకు రక్తపరీక్షలు అవసరమైతే బయటే చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆస్పత్రిలోని లేబొరేటరీ అలంకారప్రాయంగానే ఉండడంతో పరీక్షలన్నీ వైద్యులు బయటకే సిఫారసు చేస్తున్నట్లు చెపుతున్నారు. దీంతో పేద రోగులు వందలాది రూపాయలు చెల్లించి పరీక్షలు చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఫార్మశీ తెలంగాణకు వెళ్లిపోవడంతో ప్రభుత్వం పూర్తిస్థాయిలో మందులు కొనుగోలు చేయడం లేదు. దీంతో ఆస్పత్రికి వచ్చిన రోగులకు మందులు బయటకే రాస్తున్నారు. మందులు లోకల్‌గా కొనుగోలు చేసేందుకు బడ్జెట్ కేటాయింపులు కూడా లేకపోవడంతో ఏమి చేయలేని దుస్థితి నెలకొంటుంది. కళాశాలను అభివృద్ధి చేయాలి నవ్యాంధ్రలో ఉన్న ఏకైక ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆయుర్వేద విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలి. నాల్గవ తరగతి సిబ్బందిని భర్తీ చేసి రోగులకు మెరుగైన సేవలు అందించేలా చూడాలి. ఆయుర్వేద ఫార్మశీని ఏర్పాటు చేసి, మందులు అందుబాటులో ఉండేలా చూడాలి. ఆయుర్వేద కళాశాల ఏర్పాటు, వన మూలికలు, పరిశోధనలకు ప్లాంటేషన్ అభివృద్ధికి ఐదెకరాలు కేటాయించాల్సిన అవసరం ఉంది. పంచకర్మ వైద్యానికి మంచి డిమాండ్ వున్న నేపధ్యంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ఆ విభాగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, నిపుణులైన సిబ్బందిని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం వుంది. – డాక్టర్ మెహబూబ్ షేక్, వైఎస్సార్సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు -
బయో వ్యర్థాలతో ఆటలా..!
సాక్షి, పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ) : ఎంతో జాగ్రత్తగా తరలించాల్సిన బయో వ్యర్థాలను కేజీహెచ్ ఆవరణలో ఎక్కడబడితే అక్కడే పారిశుధ్య సిబ్బంది కాల్చేస్తున్నారు. బాటిల్స్‌లో సేకరించిన రక్త నమూనాలు, సిరంజిలు, పెప్పెట్లు వంటివి ఆవరణలో కాల్చేయడంతోపాటు తుప్పల్లో, డొంకల్లో పారేస్తున్నారు. అసలు వీటిని అంత నిర్లక్ష్యంగా ఎవరు బయటకు తీసుకొస్తున్నారో అంతుచిక్కడం లేదు. భవంతుల వెనుక ఉన్న ఖాళీ స్థలాల్లో వీటిని తగలబెట్డడం వల్ల ఎవరికీ తెలియడం లేదు. అటుగా వెళ్లిన రోగులు, వారి బంధువులు వీటిని చూసి భయపడుతున్నారు. విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని చెబుతున్నారు. బయో వ్యర్థాలను జాగ్రత్తగా తరలించాల్సిన పారిశుధ్య సిబ్బంది ఈ విధంగా చేయడం వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని... అధికారులు తగిన చర్యలు తీసుకొని సంబంధిత సిబ్బందిని హెచ్చరించాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. -
ఓపెన్‌కాస్ట్ బ్లాస్టింగ్‌తో ఇబ్బందులు
సాక్షి, గోదావరిఖని(రామగుండం) : సింగరేణి రామ గుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ–2 డివిజన్ పరిధిలో గల ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్–3లో సోమవారం మట్టి తొలగించేందుకు ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థ చేపట్టిన బ్లాస్టింగ్ ధాటికి గోదావరిఖని విఠల్‌నగర్‌లోని ఓ ఇంట్లో ఫ్యాన్ ఊడి కిందపడింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న గాండ్ల వెంకటమ్మ అనే మహిళ చెవుకు గాయమైంది. ఆ సమయంలో తన కూతురు పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటుండగా వారిపై ఫ్యాన్ పడకపోవడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ఆదివారం కూడా ఇదే కాలనీలో నివసించే రాజు అనే కిరాణా వ్యాపారి ఇంట్లో బ్లాస్టింగ్ చేసిన తర్వాత ఫ్యాన్ కుప్పకూలింది. ఈ సమయంలో ఇంట్లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా ఓసీపీ–3లో మట్టి తొలగింపు పనుల కోసం చేస్తున్న బ్లాస్టింగ్‌కు వాడుతున్న పేలుడు పదార్థాలను ఎక్కువగా వినియోగిస్తున్న కారణంగానే తమ ఇళ్లు పగుళ్లు తేలడం, ఇంట్లో రేకులు, ఫ్యాన్లు ఊడిపడుతున్నాయని విఠల్‌నగర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. అయితే బ్లాస్టింగ్ విషయమై గతంలో ఆందోళన చేసినప్పుడు తక్కువ సామర్థ్యంతో బ్లాస్టింగ్ చేస్తున్నారని, ఆ తర్వాత షరా మామూలుగానే వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్ తెలిపారు. రెండు నెలల క్రితం ఓ ఇంట్లో మండంపై ఆడుకుంటున్న బాలుడిపై బ్లాస్టింగ్ జరిగిన సమయంలో పెద్ద బండరాయి పడింది. దీంతో బాలుడి కుటుంబసభ్యులు, స్థానికులు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులోపలికి వెళ్లి వాహనాలు నడవకుండా రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో స్పందించిన యాజమాన్యం అధికారులను విఠల్‌నగర్ కాలనీకి పంపించి ఇళ్లల్లో అద్దాలను బిగించారు. ఆ సమయంలో అద్దాలు పగలకుండా తక్కువ స్థాయిలో బ్లాస్టింగ్ చేసి కాలనీవాసులను అధికారులు నమ్మించారు. ఆ తర్వాత షరా మామూలుగానే బ్లాస్టింగ్ చేస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. కాగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబసభ్యులు నివసించే ఈ కాలనీలో బ్లాస్టింగ్ వల్ల నష్టపోతున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని స్థానికులంటున్నారు. దీనికితోడు రామగుండం కార్పొరేషన్‌కు పన్నులు చెల్లిస్తున్నా అధికారులు సింగరేణి యాజమాన్యంతో ఏనాడు తమ గురించి చర్చించలేదని, ఇక తమ ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలని కాలనీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం, రామగుండం కార్పొరేషన్ అధికారులు బ్లాస్టింగ్ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. -
వైఎస్సార్‌ను కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలి
సాక్షి,కొత్తపల్లి (కరీంనగర్) : నిరుపేద ముస్లింలకు ఉద్యోగ, విద్య అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్ల అమలులో వైఎస్ రాజశేఖరరెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేశ్ సూచించారు. కొత్తపల్లి(హెచ్) మండలం చింతకుంట, శాంతినగర్ మసీదుల్లో ఆదివారం జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేసి వారి అభ్యున్నతికి పాటుపడింది కేవలం వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. ప్రధానంగా టీఆర్ఎస్ ఎన్నికల మెనిఫెస్టోలో ఉన్న 12 శాతం రిజర్వేషన్ అమలుకు కేంద్రంపై కేసీఆర్ ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కేవలం దుస్తులు, విందులతో సంతృప్తిపరిస్తే ముస్లింల పేదరికం పోదని, ఓటు బ్యాంకుగా వినియోగించుకోకుండా వారికి ఉన్నత విద్యతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్ అని అన్నారు. జిల్లా కార్యదర్శి ఎండీ అహ్మద్ బేగ్, పట్టణ కార్యదర్శి సుంకరి సునీల్‌కుమార్, నాయకుడు ఎండీ సర్ఫోద్దీన్ పాల్గొన్నారు. తెలంగాణలో ఆర్థిక దోపిడీ గంగాధర(చొప్పదండి) : రాష్ట్రంలో అవసరం లేని నియామకాలు చేస్తూ రూ.లక్షల వేతనాలు, మంత్రి హోదాను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక దోపిడీకి పాల్పడుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఎంతోమంది ప్రభుత్వ ప్రతినిధులు, సలహాదారులున్నా.. రాజకీయ పునరావాసం కల్పించడానికి నియామకాలు జరుపుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ఢిల్లీలో ఇరువురు ప్రభుత్వ ప్రతినిధులుండగా.. వారికే ఎలాంటి పనులు లేకున్నా మరో వ్యక్తి జగన్నాథంను ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పనులు మానుకొని ఇలాంటి నియామకాలు చేసుకుంటూ పోతే ప్రభుత్వం విశ్వాసం కోల్పోతుందని అన్నారు. -
ప్రజలే బుద్ధి చెబుతారు..
సాక్షి, విశాఖ పట్టణం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయం అవినీతికి నిలయం. బీజేపీ పార్టీపై అనవసరమైన నిందలు వేస్తూ, రాద్దాంతం చేస్తున్నాడే తప్ప పరిపాలనను ఏమాత్రం పట్టించుకోవటం లేదు. రోజంతా అమరావతి జపమే తప్ప, ప్రజల బాగోగులపై ఏమాత్రం శ్రద్దలేదని ఏపీ బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ 2019 ఎన్నికల్లో ఏపీలో స్వతంత్రంగానే పోరాటం చేస్తుందని, ఈ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలకు అవకాశం ఇచ్చి బలమైన శక్తిగా ఎదుగుతామని ఆయన తెలిపారు. పెట్రోలు, డీజిల్ విషయాల్లో మమ్మల్ని అనవసరంగా నిందిస్తున్నారు. గత ప్రభుత్వాల కంటే మా ప్రభుత్వ హయాంలోనే వీటి ధరలకు కల్లెం వేశాం. వీటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. టీటీడీ విషయంలో రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై ధీటైన సమాధానం చెప్పలేకే, ఆయనపై ఎదురుదాడికి దిగుతున్నారు. టిటిడి వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపించి, నిజానిజాలను నిగ్గుతేల్చాలి. మాపై గోబెల్స్ ప్రచారం చేస్తోన్న చంద్రబాబు బొక్కబోర్లా పడ్డం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో తట్టా, బుట్ట సర్దుకోవడం ఖాయమని సురేష్ రెడ్డి ద్వజమెత్తారు. -
నర్సు నిర్లక్ష్యం.. మహిళ మృతి
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో నర్సు నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ మృతి చెందింది. అమ్మాజి అనే పేషెంట్‌కు ఐవీ క్యాండిల్ పెట్టకుండా నర్సు ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆమె చనిపోయింది. ఆమె మరణానికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణామని బంధువులు ఆందోళనకు దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి బాధిత కుటుంబానికి మద్దతు పలికారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రేషన్ కార్డుకు అవాంతరాలు
సాక్షి, రాజమహేంద్రవరం: తెల్ల రేషన్ కార్డు మంజూరుకు అర్హులైన లబ్ధిదారులకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నా యి. అర్హత ఉన్నా ప్రజా సాధికారిత సర్వేలో తమ పేర్లు నమోదు చేసుకోకపోవడం, ఇప్పటికే కుటుంబ సభ్యుల కార్డుల్లో పేర్లు ఉండ డం కొత్త కార్డు మంజూరుకు అవరోధంగా మారాయి. కొత్త రేషన్ కార్డు పొందడానికి లబ్ధిదారులు చేయాల్సిన పనులపై యం త్రాంగం అవగాహన కల్పించకపోవడంతో ఏళ్ల తరబడి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల్లో తీసుకున్నారు. జిల్లాలో 33 వేల దరఖాస్తులు వచ్చాయి. దరఖా స్తు ఎప్పడు ఇచ్చినా జనవరిలో నిర్వహించే జన్మభూమి సభల్లో కొత్తకార్డులు మంజూ రు చేస్తామని అధికారులు చెబుతూ వచ్చారు. సభల్లో 16,200 మందికి కార్డులు మంజూరు చేశారు. మిగిలిన వారికి ఎందుకు రాలేదోనన్న విషయంపై స్పష్టత కరువైంది. తమకు కార్డు ఎందుకు రాలేదో అన్న విషయం జన్మభూమి సభల్లో అడిగినా అధికారుల నుంచి సమాధానం కరువైంది. కొంతమంది తమకు కార్డు ఎందుకు రాలేదు? అంటూ తహసీల్దార్ కార్యాలయాలకు పరుగులు పెట్టారు. ఇప్పటికే కుటుంబ సభ్యుల కార్డులో మీరు సభ్యులుగా ఉన్నారంటూ కార్యాలయాల్లోని సిబ్బంది సమాధానం ఇచ్చారు. దరఖాస్తుదారుల్లో కొంతమంది వివరాలు ప్రజా సాధికారిత సర్వేలో నమోదు కాకపోవడం వల్ల కార్డులు మంజూరు కాలేదు. ఇప్పుడూ పాత కథే.. జూన్ రెండో తేదీన కొత్త రేషన్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తహసీల్దార్ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు ఆదివారం నుంచి అనుమతిచ్చింది. ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు మంగళవారం వరకూ గడువు ఇచ్చింది. జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల్లోని కంప్యూటర్ ఆపరేటర్లు ఆదివారం నుంచి రాత్రి వేళల్లో కూడా పని చేసి ప్రతి దరఖాస్తును ఆన్లైన్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఎప్పటిలాగే పాతకథే పునరావృతం అయింది. ప్రజా సాధికారిత సర్వేలో పేర్లు నమోదు చేసుకోకపోవడం వల్లే అత్యధిక దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పటికే తల్లిదండ్రుల కార్డుల్లో సభ్యులుగా ఉండడం వల్లనూ దరఖాస్తులు ఆన్లైన్ కాలేదు. ఎమ్మెల్యే పంపారు.. ఎందుకు రాదు? కొత్త కార్డు కోసం పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫారసులతో తహసీల్దార్ కార్యాలయాలకు వస్తున్నారు. వారి దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్లు ప్రయత్నిస్తుండగా కారు, ఆదాయం ఎక్కువగా ఉండడం, ప్రజా సాధికారిత సర్వేలో లేకపోవడం, ఇప్పటికే కార్డులో సభ్యులుగా ఉండడంతో ఆన్లైన్ కావడంలేదు. అదే విషయాన్ని కంప్యూటర్ ఆపరేటర్లు వారికి చెబుతున్నా ‘ఎమ్మెల్యేగారు, ఎమ్మెల్సీగారు పంపారు? ఎందుకు కాదు?’ అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. వారికి వివరంగా, అర్థమయ్యేలా చెప్పేసరికి కంప్యూటర్ ఆపరేటర్ల తల ప్రాణం తోకకు వస్తోంది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ పరిశీలిస్తే కొత్త కార్డులు ఎంత శాతం వస్తాయో అర్థం చేసుకోవచ్చు. 50 డివిజన్ల నుంచి 1,062 దరఖాస్తులు రాగా ఇందులో 600 దరఖాస్తులకు సంబంధించి ప్రజా సాధికారత సర్వేలో లబ్ధిదారుల వివరాలు నమోదు కాకపోవడం వల్ల ఆన్లైన్ కాలేదు. మరో 353 దరఖాస్తులు ఇప్పటికే కుటుంబ సభ్యుల కార్డుల్లో నమోదై ఉండడంతో వెబ్సైట్ తిరస్కరించింది. 9 దరఖాస్తులు ఇప్పటికే ఆన్లైన్ అవగా కొత్తగా 100 దరఖాస్తులు మాత్రమే ఆన్లైన్ అవడం గమనార్హం. దీనినిబట్టి నగరంలో దరఖాస్తు చేసుకున్న 1,062 మందికిగాను 109 మందికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది. ఈ దరఖాస్తులను కూడా అధికారులు ఆరు దశల్లో పరిశీలన చేసిన తర్వాత కార్డులు మంజూరు చేయనున్నారు. -
ఒక పిజ్జా ఇవ్వండి..!
‘డబ్బులు చెట్లకు కాస్తాయా ఏమన్నా’.. ఈ సామెత మనం చాలా సార్లే వింటుంటాం.. అయితే ఈ ఫొటోలో ఉన్న కుక్కకు మాత్రం అలా కాదు.. దీనికి డబ్బులు చెట్లకే కాస్తాయి.. అదెలా అనుకుంటున్నారా..? దీని పేరు నీగ్రో.. దీనికి ఏదైనా తినాలనిపిస్తే చాలు దుకాణానికి వెళ్లి చెట్ల ఆకులు ఇస్తుంది. వెంటనే ఆ దుకాణదారుడు దానికి కావాల్సింది ఇచ్చేస్తారు. నీగ్రో కొలంబియాలోని కాసనేర్ మాంటెర్రీ అనే యూనివర్సిటీలో ఉంటుంది. నీగ్రోను అక్కడి టీచర్లు దత్తత తీసుకున్నారు. విద్యార్థులకు నీగ్రో అంటే చాలా ఇష్టం. దీంతో వారంతా అప్పుడప్పుడు తినుబండారాలు కొనిస్తూ ఉంటారు. వారు డబ్బులిస్తూ దుకాణంలో కొనడం చూసిన మన నీగ్రోకు ఓ ఐడియా వచ్చింది. విద్యార్థులు తినుబండారాలు కొనివ్వనప్పుడు తాను కూడా తినుబండారాలను కొనుక్కోవాలని డిసైడ్ అయింది. విద్యార్థులు ఏదో ఇచ్చి కొనడం క్షుణ్నంగా పరిశీలించిన నీగ్రో.. చెట్ల ఆకులు తీసుకెళ్లి ఇస్తూ ఉండేది.. దుకాణదారులు కూడా ముచ్చట పడి ఏదో ఒకటి ఇస్తుంటారు. ప్రతి రోజూ బిస్కెట్ల కోసం వస్తూ ఉంటుందని గ్లాడిస్ బరెటో అనే దుకాణదారుడు చెబుతున్నాడు. నీగ్రో చాలా తెలివైన కుక్కండీ బాబోయ్ అని అక్కడి వారంతా తెగ సంబరపడతారు.. -
మానవత్వమా.. ఎక్కడ నీ చిరునామా..!
సాక్షి, కడప :ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడాల్సిన పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్నవారు మానవత్వాన్ని మరిచిపోతున్నారు. తమ ఎదుట ఉన్న రోగికి మెరుగైన వైద్యం అందితే బతుకుతాడనే విషయం తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం పలు విమర్శలకు తావిస్తోంది. పులివెందులకు చెందిన శ్రీనివాసులరెడ్డి విషయంలో కడప రిమ్స్ వైద్యులు కనీస మానవత్వం చూపి ఉంటే ఆయన బతికి ఉండేవాడని కుటుంబ సభ్యులు బోరుమంటున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో కూడా నిబంధనల పేరుతో మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించకపోవడంతో ఆయన ప్రాణం గాలిలో కలిసిపోయింది. పోనీ మెరుగైన వైద్యం ఇక్కడ ఉందా? అంటే యంత్రాలు లేక.. అసౌకర్యాల మధ్య వైద్యం అంతంత మాత్రంగానే ఉందని చెప్పకనే చెప్పొచ్చు. రిమ్స్‌లో కార్డియాలజీ వైద్యుడే లేనప్పుడు సాధారణ వైద్యంతో గుండె సంబంధిత సమస్యను కనిపెట్టి ఉన్నత వైద్యం అందించడం సాధ్యమేనా? అన్నది అంతటా చర్చకు దారితీస్తోంది. ఎంతో మహోన్నత ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ రిమ్స్ ఆస్పత్రిని నిర్మిస్తే.. ప్రస్తుత పరిస్థితిని చూస్తే రిమ్స్‌లో వైద్యం దైన్యంగా మారిందని స్పష్టమవుతోంది. ప్రాణానికి ఏదీ పూచీ ఇటీవల పులివెందుల పూలఅంగళ్ల వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాలు రాళ్లు రువ్వుకున్న ఘటనలో అరెస్టు అయిన వైఎస్సార్సీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గుండె నొప్పి రావడంతో మంగళవారం ఆయనను హుటాహుటిన రిమ్స్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన పరిస్థితి విషమించింది. అయితే కార్డియాలజీ వైద్యులు లేకపోవడం, నిందితులు అన్న నెపంతో బయటికి పంపకపోవడం, మెరుగైన వైద్య సేవలు అందించకపోవడం తదితర కారణాలతోనే శ్రీనివాసులురెడ్డి మృతి చెందారని బంధువులు ఆస్పత్రి యాజమాన్యంపై ఆరోపణలు చేస్తున్నారు. రిమ్స్ ఆస్పత్రికి వచ్చిన తర్వాత సంబంధిత పరీక్షలు నిర్వహిస్తే సమస్య నిర్ధారణకు ఆస్కారంతోపాటు తీవ్రత తగ్గించడానికి అవకాశం ఉండేది. కానీ కొన్ని పరికరాలు పనిచేయకపోవడం కూడా వైద్యం తీరుపై విమర్శలకు అవకాశం కల్పించింది. కేంద్ర కారాగారంలో 16 మార్లు పరీక్షలు పులివెందుల పూలంగళ్ల వద్ద మార్చి 4వ తేదీన జరిగిన ఘర్షణ కేసులో శ్రీనివాసులురెడ్డిని మార్చి మూడవ వారంలో పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత రిమాండ్‌కు కేంద్ర కారాగారానికి తరలించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రిమాండ్‌లో ఉండగా మంగళవారం బెయిలు కూడా వచ్చింది. శ్రీనివాసులురెడ్డి కేంద్ర కారాగారంలో ఉన్న నెలన్నర రోజుల వ్యవధిలో 16మార్లు జైలులో వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకున్నారు. రెండు, మూడు మార్లు కడుపునొప్పి, మూత్ర సంబంధిత, రక్తపోటుతో ఇబ్బంది పడినట్లు తెలియవచ్చింది. ఈమేరకు వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకున్నట్లు రికార్డులో నమోదైంది. కేవలం నెలన్నర రోజుల వ్యవధిలో 16మార్లు పరీక్షలు నిర్వహించుకున్న శ్రీనివాసులురెడ్డిని కనీసం ఒక సారైనా రిమ్స్‌కు తీసుకొచ్చి వైద్య సేవలు అందించిన పాపాన పోలేదు. చివరకు మంగళవారం శ్రీనివాసులురెడ్డిని రిమ్స్‌కు తెచ్చిన సందర్భంలో కూడా పాత పరీక్షల రిపోర్టులను రిమ్స్ అధికారులకు చూపించకపోవడంతో సాధారణ కేసుగా తీసుకుని వైద్య సేవలు అందించారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. తిలాపాపం.. తలాపిడికెడు.. పులివెందుల మండలంలోని పుట్రాయనిపేటకు చెందిన కల్లూరు శ్రీనివాసులురెడ్డి మరణంలో తిలాపాపం..తలాపిడికెడు అన్న చందాన ఇటు వైద్యులు.. అటు కేంద్ర కారాగార అధికారులను బాధ్యులుగా చేయక తప్పదు. కేంద్ర కారాగార అధికారులు రిమ్స్‌కు తెచ్చిన సందర్భంలో శ్రీనివాసులురెడ్డి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా తెలియజెప్పకపోవడం... రిమ్స్‌లో ప్రత్యేక నిబంధనల పేరుతో ప్రాణం పోతున్నా బయటికి పంపించకపోవడం వంటి కారణాల వల్ల శ్రీనివాసులురెడ్డి మృతి చెందాడని బంధువులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏది ఏమైనా ఆయన మరణానికి అధికారులు తప్పు చేసిన నేపథ్యంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
వైద్యం అందక రోగి మృతి
హైదరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 17 రోజు ల పాటు మృత్యువుతో పోరాడి మరణించిన ఘటన శనివారం ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. నగరంలోని కార్వాన్కు చెందిన కోరని బాగ్యలక్ష్మి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. భర్త చి న్నా ఆమెను లంగర్‌హౌజ్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు. దీం తో ఆమెను ఈ నెల 3న ఉస్మానియాకు తరలించగా, 5న అడ్మిట్ చేసుకున్నారు. బాగ్యలక్ష్మిని పరీక్షించిన వైద్యులు ‘బలహీనంగా ఉంది. అడ్మిట్ వద్దు. సమయానికి తినిపించండి. బాగవుతుంది. మందు బిళ్లలు వేయడం మరవద్దు’అని చెప్పి పంపించారు. -
అయ్యో పాపం..!
కొత్తగూడెంఅర్బన్: ఈ పాల బుగ్గల పసికందును చూస్తుంటే ఎవరి హృదయమైనా ఇలాగే రోదిస్తుంది. కొత్తగూడెంలోని ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం ఓ మూడు నెలల పసికందు మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతదేహంతో ఆస్పత్రి ఎదుట కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు. చుంచుపల్లి ఎస్సై నరేష్, చిన్నారి తల్లిదండ్రులు తెలిపిన వివరాలు.. టేకులపల్లి మండలం ముత్యాలంపాడుకు చెందిన ఎం.అనూష, నాగరాజు దంపతులకు రెండవ సంతనంగా మూడు నెలల క్రితం పాప పుట్టింది. శుక్రవారం ఉదయం పాప బాగా ఏడుస్తోంది. పాలు కూడా తాగడం లేదు. తల్లిదండ్రులు భయాందోళనతో కొత్తగూడెం పట్టణంలోని ముర్రేడు వంతెన సమీపంలోగల ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడు అక్కడ సిబ్బంది తప్ప వైద్యులు లేరు. వచ్చిన తరువాత పాపను పరీక్షించారు. ఆక్సిజన్తోపాటుసెలైన్ ఇచ్చారు. ఆ తరువాత ఎక్స్‌రేకు పంపించారు. క్స్‌రే రిపోర్ట్ చూసి, వెంటనే ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారు. ఖమ్మం తరలిస్తుండగా మార్గ మధ్యలోనే పాప ప్రాణాలు విడిచింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందని ఆరోపిస్తూ కుటుంబీకులు, బంధువులు కలిసి ఆస్పత్రి ఎదుట రెండు గంటలపాటు ఆందోళనకు దిగారు. త్రీ టౌన్, వన్ టౌన్, చుంచుపల్లి పోలీస్ స్టేషన్ల సిబ్బంది సర్దిచెప్పి వచ్చి ఆందోళనను విరమింపజేశారు. వైద్యులు, తల్లిదండ్రుల నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. ఆస్పత్రి డాక్టర్ మొరిశెట్టి హరిపై చుంచుపల్లి ఎస్సై నరేష్ కేసు నమోదు చేశారు.దీనిపై డాక్టర్ మొరిశెట్టి హరిని వివరణ కోరగా.. ‘‘పాపకు శ్వాస సంబంధ వ్యాధి ఉంది. నిమోనియా ఉండడంతో వలన శ్వాస తీసుకోలేకపోయింది’’ అని చెప్పారు. -
ఎవరు చేసినా వైద్యమే..
ఈ చిత్రంలో కనిపిస్తున్న గర్భిణి పేరు మజ్జి శారద. తెర్లాం మండలం లింగాపురం. పురిటి నొప్పులు వస్తున్నాయని 108లో బొబ్బిలి ఆసుపత్రికి మంగళవారం వచ్చింది. అయితే ఇక్కడి నుంచి విజయనగరం వెళ్లి పురుడు పోయించుకోమని రిఫర్ లెటర్ రాసి ఈమె చేతిలో పెట్టారు. అలాగని ఇక్కడ సౌకర్యాల్లేవని అనుకోకండి! బొబ్బిలి సీహెచ్‌సీలో మతా,శిశు అత్యవసర సేవా విభాగం ప్రత్యేకంగా ఉంది. కానీ దీనిని వినియోగించే పరిస్థితులు లేవు. ఇక్కడ అధునాతన అల్ట్రా సౌండ్ స్కానింగ్ సిస్టం కూడా పక్కనపెట్టేసి ఉంది. బొబ్బిలి ఆస్పత్రిలో ఎనిమిది మంది వైద్యులున్నారు. కానీ వైద్యం అందడం మాత్రం గగనమే! ముప్పై పడకల సీహెచ్‌సీగా ఉన్న ఈ ఆసుపత్రిని వంద పడకలు చేస్తామని గత నాలుగేళ్లుగా ప్రజాప్రతినిధులు ప్రకటిస్తూనే ఉన్నారు. స్థాయి మాట దేవుడెరుగు.. కనీసం వైద్యం అందినా సంతోషమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం సుమారు 300 మంది ఓపీ వస్తున్న ఈ ఆసుపత్రిలో అప్పటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఇచ్చిన వేడినీటిపంపిణీ విభాగం పడకేసింది. దీంతో వేడి నీరు కావాలంటే రోగులు పక్కనున్న హోటళ్లవైపు పరుగెత్తాల్సిందే. అలాగే ఏదేని రోగమొచ్చి ఆసుపత్రిలో చేరితే ఎక్స్‌రే కూడా బయటకెళ్లి తీసుకోవాల్సిందే. డెప్యూటేషన్లు షురూ.. ఇక్కడ పలు పోస్టులను ఇష్టం వచ్చిన రీతిలో డెప్యుటేషన్లు వేస్తుంటారు. రాజకీయంగా పలుకుబడి ఉంటే ఇక్కడ పోస్టింగ్‌తో వేరెక్కడయినా పనిచేయొచ్చు. రోగులకే ఇబ్బందులు తప్పవు. కానీ పూర్తి స్థాయిలో వైద్యం అందాలంటే బొబ్బిలి ఆసుపత్రిని తప్పించి ఇంకెక్కడయినా ఆశ్రయించొచ్చు. వైద్యం కోసం ఇక్కడికి వచ్చి మరింత మెరుగైన వైద్యం కోసం ఇక్కడి నుంచి ఎక్కడికయినా వెళ్లాలంటే అంబులెన్స్ ఇబ్బందులు తప్పవు. పదిన్నర గంటలకు ఒక్కరూ లేరే..? మంగళవారం ఇక్కడికి మాజీ కౌన్సిలర్ షణ్ముఖరావు తదితరులు వైద్యం కోసం వచ్చారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి పదిన్నర వరకూ వేచి చూస్తే ఇద్దరు మాత్రమే ఇక్కడకు వచ్చారు. మిగతా వారు రాలేదు. ఆయా కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక ఇతర సిబ్బంది ఒక్కొక్కరుగా వస్తున్నారు. దీంతో ఆసుపత్రిలో చెట్ల కింద రోగులు వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో మాజీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త మువ్వల శ్రీనివాసరావు, కన్నూరు శ్రీనివాసరావు తదితరులు అక్కడి ఫార్మసిస్టు వెంకటరమణకు లేఖ ఇచ్చి వెళ్లిపోయారు. నిర్ణీత సమయానికి వైద్యులు వచ్చేలా చూడాలని వారు ఆవేదన చెందారు. వైద్య సిబ్బంది గైర్హాజరుపై ఫిర్యాదు.. ఇంతలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పెంట మోహనరావు రావడంతో ఆయనను ఆసుపత్రి సిబ్బంది తీరుపై ప్రశ్నించారు. త్వరలో ఆసుపత్రిని ప్రక్షాళన చేయనున్నామని, ప్రధాన వైద్యులు జి శశిభూషణరావు సెలవులో ఉన్నారనీ, ఆయన వచ్చాక పరిస్థితులు చక్కదిద్దుతామని చెప్పారు. మరో ప్రధాన వైద్యుడు ఎస్వీ సత్యశేఖర్ మాట్లాడుతూ తాను విజయనగరంలో సమావేశం నిమిత్తం వచ్చాననీ, వైద్యులంతా నిర్ణీత సమయానికి వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బొబ్బిలి : ఈ చిత్రం చూడండి! ఇక్కడ ఇంజక్షన్ చేస్తున్న ఉద్యోగిని డాక్టరో లేక స్టాఫ్ నర్సో అనుకుంటే పొరపడినట్టే! ఈమె నైట్‌వాచ్‌మన్! పేరు పైడితల్లి! కానీ ఇక్కడ నిత్యం ఓపీ పెరిగిపోతుండటంతో వైద్యులు ఈమెను ఇంజక్షన్లు చేసేయమని ఆదేశాలు ఇచ్చేశారు. దీంతో ఈమె ఇక్కడ కూర్చుని వచ్చిన వారికి ఇంజక్షన్లు చేస్తుంటుంది. అలాగే బీపీ చూసేందుకు వైద్యులు, నర్సులు అందుబాటులో ఉండరు. ఈ ఆస్పత్రిని రాష్ట్ర గనుల శాఖా మంత్రి రెండు మూడు సార్లు పర్యటించి వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన ఆసుపత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఆసుపత్రిని వంద పడకల ఆసుత్రిగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు మొన్నటి జన్మభూమి సభలో ప్రకటించేశారు. కానీ ఇక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి. -
హోదా ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తున్నారు
ఉరవకొండ : రాష్ట్రంలో హోదా కోసం బంద్‌లు, ధర్నాలు చేయడం రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమేనని సీఎం చంద్రబాబు మాట్లాడటం అన్యాయమని, అది ప్రజా పోరాటాన్ని నీరుగార్చడమేనని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఎంపీల ఆమరణ దీక్షకు మద్దతుగా శుక్రవారం ఉరవకొండలో చేపడుతున్న రిలే దీక్షల శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ముందు నుంచీ హోదా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారని, తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇప్పుడు హోదా అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. హోదా కావాలని రాష్ట్రం ఉద్యమిస్తుంటే ఆయనకు సింగపూర్ ప్రయాణాలు ఎందుకని ప్రశ్నించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అమరావతిలో ఆనంద నగరం కార్యక్రమం చేపట్టారన్నారు. హోదా కోసం ఈనెల 16న హోదా సాధన సమితి అధ్వర్యంలో చేపట్టే రాష్ట్ర బంద్‌ను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటివరకు హోదా కోసం టీడీపీ వారు చేసిన ఆందోళనలు టీవీలు, పేపర్లలో తప్ప రోడ్లపై కన్పించలేదన్నారు. నాలుగేళ్లుగా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం పేరుతో హడావిడి చేస్తున్నా నేటికీ అమరావతి డిజైన్లు కార్యరూపం దాల్చలేదన్నారు. కేవలం సింగపూర్, మలేషియా అంటూ చంద్రబాబు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. పార్లమెంట్లో వైఎస్సార్సీపీ 14 రోజులపాటు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడితే కేంద్రం 15 నిమిషాలు కుడా దానిపై చర్చించలేకపోయిందన్నారు. పార్లమెంట్‌ను స్తంభింప చేయడాన్ని నిరసిస్తూ ప్రధాని మోదీ దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుశీలమ్మ, జెడ్పీటీసీ సభ్యులు తిప్పయ్య, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కలల ప్రాజెక్ట్.. నిర్లక్ష్యం ఎఫెక్ట్
గణనీయంగా తగ్గిపోయింది. పోర్ట్ కార ణంగా మత్స్య సంపద తగ్గిపోవడం, మత్స్యకారులకు ఉపాధి దొరక్కపోవడంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సాగరమాల పథకం కింద జువ్వలదిన్నె వద్ద మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ప్రకటించడంతో మత్స్యకారుల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. 2014 నుంచి అధికా రులు దశల వారీగా పలు సర్వేలు నిర్వహించి ప్రాజెక్ట్ నిర్మాణానికి డీపీఆర్ కూడా సిద్ధం చేశారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ చట్టం అనుమతులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. సు మారు రూ.242 కోట్లతో చేపట్టనున్న ఈ ఫిషింగ్ హార్బర్‌కు సాగరమాల పథకం కింద కేంద్రం రూ.121 కోట్లు, రాష్ట్రం వాటా కింద రూ.121 కోట్లు కేటాయిం చాల్సి ఉంది. బడ్జెట్లో రాష్ట్రం తన వాటా కేటాయిస్తే కేంద్రం వెంటనే తన వాటా కూడా మంజూరు చేస్తుంది. బడ్జెట్లో రాష్ట్రం ఒక్కపైసా కూడా కేటాయించకపోవడంతో కేంద్రం కూడా జాప్యం చేస్తుంది. వేట సాగక..పూటగడవక.. జిల్లాలో కావలి మండలం చెన్నాయపాళెం పెద్దపట్టపుపాళెం నుంచి తడ వరకు 12 మండలాల్లో 118 గ్రామాలను కలుపుతూ 169 కిలో మీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. సుమారు 2 లక్షల మంది మత్స్యకారులు సముద్రం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతి ఏటా వేట విరామ సమయంతో పాటు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సముద్రంలో అల్పపీడనాలు, వాయుగుండాలతో వేట సరి గా సాగదు. తీవ్ర ప్రతికూల పరిస్థితులు మధ్య కూడా మత్స్యకారులు కడలిపైనే ఆధారపడి బతుకీడుస్తున్నారు. 60 శాతం మత్స్య సంపద దళారుల పాలు జిల్లా తీరంలో ఏడాదికి 1.05 లక్షల (చేప, రొయ్యలు కలిపి) టన్నులపైగానే మత్స్య సంపదను కడలి గర్భం నుంచి బయటకు తీస్తున్నా కేవలం 40 శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతుంది. సరైన వసతులు, స్టోరేజ్ సామర్థ్యం లేని కారణంగా మిగిలిన 60 శాతం సరుకు దళారుల చేతుల్లో పడుతుంది. మత్స్యకారుల నుంచి అతి తక్కువ ధరకు చేపలు, రొయ్యలు సొంతం చేసుకుంటున్న దళారులు చెన్నై, బెంగళూరు వంటి రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కేవలం 40 శాతం ఎగుమతులపైనే ఏడాదికి జిల్లా నుంచి రూ.200 కోట్లు విదేశీ మారక ద్రవ్యం వస్తున్నట్లు అధికారుల అంచనా. జువ్వలదిన్నె వద్ద మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయితే ప్రస్తుతం ఉన్న 1.05 లక్షల టన్నుల ఉత్పత్తి రెట్టింపవుతంది. మినీ హార్బర్ కారణంగా పెద్దబోట్లు సంఖ్య పెరిగి ఏడాదికి 2 లక్షల టన్నుల ఉత్పత్తి బయటకు వస్తుంది అంచనా. ఎగుమతులు కూడా 40 నుంచి 80 శాతానికి పెరుగుతాయి. ఎగుమతులతో ప్రస్తుతం వస్తున్న రూ.200 కోట్లకు అదనంగా మరో రూ.200 కోట్లు కలిపి ఏడాదికి జిల్లా కు రూ.400 కోట్లు విదేశీ మారక ద్రవ్యం వచ్చే అవకాశం ఉంది. మినీ హార్బర్లో స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్లు ఉండటంతో దళా రుల ఆగడాలు తగ్గి ప్రాణాలు పణంగా పెట్టి వేట సాగించిన మత్స్యకారులకు కనీస గిట్టుబాటు ధర లభిస్తుంది. సా.. గుతున్న ప్రతిపాదనలు జువ్వలదిన్నె వద్ద మినీ ఫిషింగ్ హా ర్బర్ నిర్మాణానికి సంబంధించి 2014 లోనే బీజం పడింది. సాగరమాల పథకం కింద మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సర్వే ప్రారంభించిన అధికారులు జువ్వలదిన్నె సమీపంలో చిప్పలేరు వద్ద ఉన్న సముద్ర ముఖ ద్వార ప్రాంతం అనుకూలంగా ఉం టుందని గుర్తించారు. పలు దఫాలుగా సర్వే చేసిన అధికారులు స్థల సేకరణ కూడా పూర్తిచేసి సాంకేతిక పరమైన సర్వేలు ప్రారంభించారు. వ్యాప్కోస్ సంస్థ తీరంలో వాతావరణం, మట్టి స్వభావం, సోషియో ఎకనమికల్ సర్వేలు, జియాలజికల్ సర్వేలు, ఇలా మూడున్నరేళ్ల పాటు పలు రకాల సర్వేలన్నీ పూర్తి చేసిన తర్వాత 242.22 కోట్ల అంచనాతో డీపీఆర్ కూడా సిద్ధం చేసింది. సాగరమాల కింద రాష్ట్రం 50 శాతం వాటా కేటాయిస్తే కేంద్రం కూడా తన వాటా జమచేసి టెండర్లు పిలవాల్సి ఉంది. టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభించిన తర్వాత మూడేళ్లకు కానీ నిర్మాణం పూర్తికాదు. మినీ ఫిషింగ్ హార్బర్‌తో పాటు ఐస్ ఫ్యాక్టరీ, వలలు, పడవల మరమ్మతులు, చేపలు ఆరబెట్టుకునే ఫ్లాట్‌ఫాంలు, చేపల ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుతో మత్స్యకారలు జీవితాల్లో వెలుగులు నిండుతాయి. పబ్బం గడుపుకునేందుకే.. జిల్లాలో 2 లక్షల మంది మత్స్యకారల జీవితాలు ఆధారపడిన మినీఫిషింగ్ హార్బర్‌పై అధికార పార్టీ నాయకుల్లో చిత్తశుద్ధి కనబడటంతో లేదు. కడలి తీరా న్ని కబ్జాచేసి కాసుల తీరంగా మార్చుకున్న అధికార పార్టీ నాయకులు మత్స్యకారుల బతులకును ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారనే ఆరో పణలు లేకపోలేదు. మత్స్యకార గ్రా మాల్లో ‘దురా యి’ సంస్కృతిని అడ్డం పెట్టుకుని ఇ న్నాళ్లు అధికార పార్టీ నేతలు తమ ప బ్బం గడుపుకుంటున్నారు. మత్స్యకారుల్లో చైతన్యం వచ్చినా, ఆర్థికంగా బలపడినా తమ పునాదులు కదులుతాయనే భయంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బడ్జెట్లో నిధులు మంజూరు చేయించకుండా అడ్డుపడుతున్నారనే ఆరోపణలు బలంగానే ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్ విషయంలో నోరుమెదపడటం లేదు. ఉత్పత్తి రెట్టింపు అవుతుంది జువ్వలదిన్నె వద్ద మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయితే ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి రెట్టింపవుతుంది. ఎగుమతులు పెరగడంతో పాటు మత్స్యకారులకు లాభం చేకూరుతుంది. ప్రస్తుతం సీఆర్‌జెడ్ చట్టం అనుమతుల పరిశీలనలో ఉంది. నిధులు మంజూరైన తర్వాత టెండర్ల ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. పీ ప్రసాద్,మత్స్యశాఖ అధికారి, కావలి -
నల్లుల రాజ్యం
సాక్షి, విశాఖపట్నం: ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల కొన్ని ఏసీ బస్సుల్లో నల్లులు రాజ్యమేలుతున్నాయి. సరైన నిర్వహణ లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని డిపోల్లో నెలల తరబడి బస్సు సీట్ల పరిస్థితిని, వాటిలో తిష్టవేసిన నల్లుల నివారణకు చర్యలు చేపట్టడం లేదు. ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఇచ్చే బ్లాంకెట్లను ఎప్పటికప్పుడు మార్చకపోవడంతో వాటిలోనూ నల్లులు తిష్ట వేస్తున్నాయి. సీట్ల కింద నుంచే కాకుండా ఒళ్లంతా పాకుతూ రాత్రి వేళ అవస్థలు పెడుతున్నాయి. సోమవారం రాత్రి విజయవాడ నుంచి విశాఖపట్నం బయలుదేరిన 9372 సర్వీసు నంబరు గల ఇంద్ర బస్సు (విజయవాడ డిపో)లో ప్రయాణికులు నల్లుల బారిన పడ్డారు. బస్సులో అన్ని సీట్లలోనూ నల్లులు తమ ప్రతాపాన్ని చూపాయి. తొలుత వీటిని దోమలుగా భావించి సర్దుబాటు చేసుకున్నారు. బస్సు ఏలూరు దాటాక అంతా నిద్రకు ఉపక్రమించడంతో నల్లులు రక్తం తాగడం మొదలెట్టాయి. ఈ సమస్యపై ప్రయాణికులు డ్రైవర్ కాసులుకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు విజయవాడ చేరుకున్నాక సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు ఇంద్ర బస్సు డ్రైవర్ టి.వి.కాసులు పేర్కొన్నారు. రాత్రంతా తాము నల్లులతో పడ్డ అవస్థలను ప్రయాణికులు ‘సాక్షి’కి వివరించారు. ఏసీ ప్రయాణానికి భారీగా టికెట్ సొమ్ము వసూలు చేస్తున్న ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా చూడడం లేదంటూ మండిపడ్డారు. ఎవరూ నిద్రపోలేదు.. మేమెక్కిన ఇంద్ర బస్సులో 35 మందికి పైగా ఉన్నాం. నల్లులు విపరీతంగా కుట్టడంతో చేతులు, ఒళ్లు దద్దుర్లెక్కాయి. లైట్లు వేసుకుని చూస్తే ఒక్కొ సీట్లో వందల కొద్ది నల్లులున్నాయి. ఇలా అన్ని సీట్లలోనూ నల్లులు కనిపించాయి. అవి పెద్ద సైజులో ఉండడంతో మూడు, నాలుగు నెలలుగా నిర్వహణ లేదని అర్థమైంది. పిల్లలతో పాటు బస్సులో ఉన్న వారంతా రాత్రంతా జాగారం చేశాం. విశాఖ ఎప్పుడొస్తుందని ఎదురుచూశాం.– వెంకటేశ్వరరావు,ప్రయాణికుడు, విశాఖపట్నం -
వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడి మృతి
టెక్కలి/టెక్కలిరూరల్: డివిజన్ కేంద్రమైన టెక్కలిలో.. మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గ కేంద్రంలో 110 పడకల ఏరియా ఆస్పత్రి వద్ద ఆదివారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వైద్యం అందజేయడంతోనే స్థానిక ఆదిఆంధ్రావీధికి చెందిన యువకుడు సంకిలి తిరుపతిరావు(27) మృతిచెందాడని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. తిరుపతిరావుకు కడుపునొప్పి, తలనొప్పి రావడంతో భార్య పుష్పతో పాటు స్థానికులు ఆయనని శనివారం టెక్కలి ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యురాలు జ్యోతి వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో, శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. ‘108’లో రిమ్స్‌కు తరలించగా, తిరుపతిరావు మృతిచెందారు. టెక్కలి ఏరియా ఆస్పత్రిలో వైద్యురాలు జ్యోతి సక్రమంగా వైద్యసాయం అందజేయలేదని, మరో వైద్యుడు లక్ష్మణరావుకు సమాచారమిచ్చినా స్పందించలేదని మృతుని కుటుంబసభ్యులతో పాటు వీధి ప్రజలంతా అర్ధరాత్రి ఒంటి గంట సమయం నుంచి 2 గంటల వరకు ఏరియా ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సురేష్‌బాబు అక్కడికి చేరుకుని వారిని వారించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన వీరు.. ఆదివారం ఉదయం మళ్లీ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. లోపలికి ప్రవేశించి వైద్యురాలు జ్యోతిని నిలదీస్తూ ఫర్నీచర్‌ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం గేటు వద్ద బైఠాయించి జ్యోతి, సూపరింటెండెంట్ కె.కేశవరావుపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకుడు తమ్మన్నగారి కిరణ్, యు.శంకర్, శ్యామలరావు, వార్డు సభ్యుడు దోని బుజ్జి, తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతుగా నిలిచి ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తిరుపతిరావు కుటుంబానికి రూ. 5 లక్షలు ఆర్థికసాయంతో పాటు ఆయన పిల్లలకు వసతి గృహంలో సీట్లు వచ్చేలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ సంఘటనపై వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయ కర్త పేరాడ తిలక్ ఆరా తీశారు. వైద్యురాలు జ్యోతి మాట్లాడుతూ తిరుపతిరావును అపస్మారక స్థితిలో ఆస్పత్రికి తీసుకువచ్చారని, వైద్యం అందించాక పరిస్థితి విషమించిందని తెలిపారు. టెక్కలి సీఐ కె.భవానీప్రసాద్, పలాస సీఐ తాతారావు, ఎస్ఐ లు సురేష్‌బాబు, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
భవిత తారుమారు
ఒక సబ్జెక్ట్‌లో పాసైతే అన్నింట్లో పాసైనట్లే.. ఒక సబ్జెక్ట్‌లో ఫెయిలైతే అన్నింట్లో ఫెయిలే.. ఏమిటీ వింత అనుకుంటున్నారా? శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ యంత్రాంగం సృష్టించిన గందరగోళం ఇది. శనివారం విడుదలైన డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాలు యూనివర్సటీ యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తును తారుమారు చేశాయి. మార్కుల నమోదులో నిర్లక్ష్యం కారణంగా ఉండటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాల్లో ఒక సబ్జెక్టులో వచ్చిన మార్కులే మిగతా సబ్జెక్టుల్లోనూ పునరావృతమయ్యాయి. అనంతపురం నగరంలోని ఒక డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులందరికీ ఇలాంటి ఫలితాలే వచ్చాయి. దీంతో విద్యార్థుల్లో అయోమయం, ఆందోళన నెలకొంది. ♦ బీఎస్సీలో హాల్ టికెట్ నంబర్ 16841099గల విద్యార్థినికి స్టాటిస్టిక్స్ విత్ మేథమేటిక్స్–5లో 18 మార్కులు వచ్చాయి. స్టాటిస్టిక్స్ విత్ మేథమేటిక్స్–6, కంప్యూటర్ అప్లికేషన్స్–5, కంప్యూటర్ అప్లికేషన్స్–6లోనూ 18 మార్కులే వచ్చాయి. ♦ ఇక బీకాంలో హాల్‌టికెట్ నంబర్ –16835141గల విద్యార్థికి ఓ సబ్జెక్టులో 32 మార్కులు వచ్చాయి. ప్రోగ్రామింగ్ ఇన్ సీ, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సబ్జెక్టుల్లోనూ 32 మార్కులే వచ్చాయి. ఇలా ఒకే కళాశాలకు చెందిన విద్యార్థులందరికీ మార్కులు తారుమారు అయ్యాయి. తప్పులు సరిచేస్తాం మార్కుల నమోదులో తప్పిదాలను సరిచేస్తాం. బాధిత విద్యార్థులు నేరుగా వచ్చి పర్సనల్ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులందరికీ న్యాయం జరిగేలా చూస్తాం. –ప్రొఫెసర్ జె.శ్రీరాములు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్, ఎస్కేయూ -
తప్పులు... తిప్పలు...
విజయనగరం అర్బన్:ఉపాధ్యాయ పోస్టుల అర్హతకు నిర్వహిస్తున్న పరీక్ష(టెట్)లో మొదటినుంచీ గందరగోళం చోటు చేసుకుంటోంది. నిర్వాహకుల నిర్లక్ష్యం అభ్యర్థుల పాలిట శాపంగా మారుతోంది. ఇప్పటికే ప్రకటించిన మార్కులు తారుమారయిన విషయంతో ఆందోళన చెందుతున్న అభ్యర్థులకు వాటి సవరణ ప్రక్రియలోనూ తిప్పలు తప్పడం లేదు. జవాబులు, మార్కులు చూసుకొని తప్పులుంటే అభ్యర్థులు సవరణకు విన్నవించుకోవడానికి వీలుగా టెట్ నిర్వాహకులు వెబ్ సైట్‌ను రూపొందించి ప్రకటించారు. ఈ మేరకు ఈ నెల 22 నుంచి నెలాఖరు వరకు ఫిర్యాదు ఇచ్పుకోవాలని షెడ్యూల్ ప్రకటించారు. ప్రకటించి నాలుగు రోజులవుతున్నా సంబంధిత వెబ్సైట్ తెరుచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు టెట్ హెల్ప్‌లైన్(ఫోన్ నంబర్: 9121148061) కేంద్రం నుంచి సందేహాలను తీర్చడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. టెట్‌కి సంబంధించిన పేపర్–1, 2, 3 అభ్యర్థులను కలుపుకొని జిల్లా వ్యాప్తంగా 15,331 మంది దరఖాస్తు చేసుకోగా 94.08 శాతంతో 14,423 మంది హాజరై తమ ప్రతిభను ప్రదర్శించుకున్నారు. పనిచేయని వెబ్సైట్... నెల్లిమర్లకు చెందిన పేపర్–3 హిందీ సబ్జెక్ట్ అభ్యర్ధి పి.సునీత ప్రాధమిక ‘కీ’ అభ్యంతరాలపై విడుదల చేసిన ‘కీ’ అనుసరించి 100 మార్కులకు పైగా రావాల్సి ఉన్నా ఆమె క్వాలిఫై కానట్టు తేల్చారు. దీనిపై ఆమె టెట్‌కు సంబంధించిన వెబ్సైట్లో ఫిర్యాదు చేయగా వారు పంపించిన మార్కులుగాని, జవాబు పత్రంగానీ తనకు సంబంధించినది కాకుండా వేరేది ఇచ్చారు. ఈ సమస్యను తిరిగి చెప్పుకోవడానికి నిర్వాహక వ్యవస్థ అందుబాటులో లేదు. ఇలాంటి సమస్యలతో సతమతం అవుతున్నవారు జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. ఈ విషయంలో టెట్ నిర్వాహక హెల్ప్‌లైన్ సెంటర్‌కు తెలియజేసినప్పటికీ వారి నుంచి స్పందన లభించలేదని వాపోతున్నారు. రెండురోజులుగా ప్రయత్నిస్తే ఎట్టకేలకు కొందరికి అదృష్ట వశాత్తూ ఫోన్ పలికినా అటునుంచి అసహన సమాధానం వచ్చిందని చెబుతున్నారు. ఫిర్యాదుల సవరణకు ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే గడువు ఉండటంతో సమస్య ఎలా పరిష్కారం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పులు దిద్దలేనపుడు టెట్ మరలా జరపాలి పేపర్–3 హిందీ సబ్జెక్ట్ టెట్ రాశాను. ప్రాధమిక ‘కీ’కి వెబ్సైట్లో పెట్టిన నా జవాబు పత్రానికి సంబంధం లేదు. ఈ తప్పిదాన్ని సవరించాలని కోరుతూ నిబంధనల మేరకు రూ.200లు ఆన్లైన్లో రుసుం చెల్లించాను. ఈ నెల 31లోపు గడువుగా ప్రకటించారు. ఇంత వరకు సంబంధిత వెబ్సైట్ ఓపెన్ కావడంలేదు. హెల్ప్‌లైన్ సెంటర్లో టెట్ నిర్వాహకుల సమాధానాలు నిర్లక్ష్యంగా వస్తున్నాయి. అభ్యర్థుల సందేహాలు తీర్చలేకపోతే టెట్ని మరలా జరిపి న్యాయం చేయాలి. – పి.సునీత, టెట్ అభ్యర్థిని, నెల్లిమర్ల -
నిర్లక్ష్యం
సాక్షి, మెదక్ : పొరుగు జిల్లాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు పూర్తి కావచ్చాయి. మెదక్ జిల్లాలో మాత్రం క్యాంపు కార్యాలయాల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఈ జిల్లాలో ఉన్నదే రెండు నియోజకవర్గాలు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూ ర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిల క్యాంపు కార్యాలయాల నిర్మాణ పనులు పూర్తి చేయిం చడంలో ఆర్‌ఆండ్‌బీ అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు బహిరంగగానే ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు ఉండాలని నిర్ణయం తీసుకుంది. దీంతో నియోజకవర్గ కేం ద్రాల్లో జీప్లస్ వన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయించింది. 2016లో ఒక్కో ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయం నిర్మాణం కోసం రూ.కోటి నిధులు కేటాయిం చింది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు వచ్చి ఎమ్మెల్యేలను కలిసేందుకు వీలుగా క్యాంపు కార్యాలయాలను డిజైన్ చేయించారు. ఈ కార్యాలయంలో ఎమ్మెల్యేలకు ప్రత్యేక చాంబర్‌తోపాటు నాలుగు గదులు, హాల్, కాన్ఫరెన్స్ హాల్ నిర్మించనున్నారు. ప్రభుత్వం మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిల క్యాంపు కార్యాలయాల నిర్మాణానికి 2016 డిసెంబర్ నెలలో నిధులు కేటాయించింది. నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా ఇంకా పనులు పూర్తి కాకపోవడంపై ఎమ్మెల్యేల్లోనూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పలు సందర్భాల్లో ఇంజినీరింగ్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అయినా పనులు పూర్తి కాకపోవడం గమనార్హం. ఇంకా పిల్లర్ల దశలోనే.. డిప్యూటీ స్పీకర్ నివాసం మెదక్ పట్టణంలో ఉంది. నియోజకవర్గ ప్రజలను ఆమె ప్రస్తుతం అక్కడే కలుస్తున్నారు. తనను కలిసేందుకు వచ్చేవారితో సమావేశమయ్యేందుకు అనువైన వసతులు అక్కడ లేవు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం త్వరగా పూర్తయితే అక్కడే అధికారులు, ప్రజలను కలవవచ్చని ఆమె భావిస్తున్నారు. అయితే క్యాంపు ఆఫీసు నిర్మాణం పనులు ఎంతకూ పూర్తి కాలేదు. పట్టణ ప్రధాన రహదారి పక్కన ఫారెస్టు రేంజ్ ఆఫీస్ సమీపంలో ఈ క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం భవన నిర్మాణం పనులు పిల్లర్ల దశలో ఉన్నాయి. పనులు పూర్తి అయ్యేందుకు మరో 8 నెలలకు పైగా సమయం పట్టవచ్చని తెలుస్తోంది. అప్పటివరకు ఎన్నికలు వస్తే నిర్మా ణం పనులు మరింత జాప్యమయ్యే అవకాశం ఉంది. నర్సాపూర్‌లో పూర్తి కాని పనులు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం నిర్మాణం పనులు సైతం ఇంకా పూర్తి కాలేదు. నర్సాపూర్‌లోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఎంపీపీ ఇంటి నిర్మాణం చేపడుతుండగా ఆ భవనాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా మార్చేందుకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆసక్తి చూపారు. దీంతో ఆర్అండ్బీ అధికారులు ఎంపీపీ క్వార్టర్స్‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనంగా మార్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారు. మొత్తం రూ.70 లక్షలతో నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణం పనులు పూర్తయ్యేందుకు మరో రెండు, మూడు నెలల సమయం పట్టవచ్చని తెలుస్తోంది. -
భార్య శవాన్ని తోపుడు బండిపై తోసుకుంటూ..
లక్నో: మానవత్వం మసకబారుతోంది. డబ్బుకు ఉన్న పాటి విలువ మనిషి ప్రాణానికి లేకుండా పోయింది. ఒడిస్సాలో కొన్ని నెలల కిందట అంబులెన్స్‌కు డబ్బు చెల్లించే స్తోమత లేక ఓ వ్యక్తి తన భార్య శవాన్ని తన భుజంపై మోసుకుని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లటం అప్పట్లో అందరి మనసులను కదిలించింది. ఆ ఘటన మరవక ముందే అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషాదంలో ఒకవైపు అంబులెన్స్ సిబ్బంది చేసిన ఆలస్యం నిండు ప్రాణాలు తీస్తే.. మరోవైపు వైద్యుల కర్కశత్వం కట్టుకున్న భార్య శవాన్ని కిలోమీటర్ల దూరానికి తోపుడు బండిలో తోసుకుంటూ తీసుకెళ్లేలా చేసింది. మంగళవారం నాడు మెయిన్‌పురి జిల్లాకు చెందిన 36 ఏళ్ల కన్హయ్యలాల్ తన భార్య సోనీ అస్వస్థతకు లోనవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. గంటలు గడిచిన అంబులెన్స్ రాకపోవడంతో భార్యను తోపుడు బండిపై తోసుకుంటూ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మెయిన్‌పురి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు మార్గం మధ్యలోనే చనిపోయిందని చెప్పడంతో ఒక్క సారిగా కప్పకూలాడు కన్హయ్య. గుండె దిటవు చేసుకొని భార్య శవాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని కోరినప్పటికి ఆస్పత్రి వర్గాలు అందుకు ఒప్పుకోలేదు. దినసరి కూలీగా పనిచేస్తున్న అతను చేసేదేమీ లేక భార్య శవాన్ని గుడ్డలతో చుట్టి తోపుడు బండిపై తోసుకుంటూ వెళ్లాడు. ఈ దృశాన్ని చూసిన అక్కడి ప్రజల కళ్లు చెమ్మగిల్లాయి వారు ఆస్పత్రి వర్గాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఘటనపై యూపీ వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి ప్రశాంత్ త్రివేది స్పందిస్తూ.. 108 అంబులెన్స్ నెంబర్‌కు ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. కన్హయ్య చాలా పేదవాడు అతని దగ్గర ఫోన్ చేసేందుకు మొబైల్ కూడా లేదన్నారు. ఒకవేళ ఫోన్ చేసినా ఆస్పత్రికో లేదా వేరొక నెంబర్‌కో ఫోన్ చేసి ఉంటారని తెలిపారు. ఈ సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. -
‘నిర్లక్ష్యపు’ నిప్పు
జిన్నారం(పటాన్చెరు): రసాయన పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో కోట్ల రూపాయల ఆస్థి నష్టంతో పాటు, కొన్ని సార్లు కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పరిశ్రమల యజమానులు కనీస నియమనిబంధనలను కూడా పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నయాన్న విమర్శలు ఉన్నాన్నాయి. ఎండాకాలంలో ప్రమాదాలు మరింతా పెరిగే ప్రమాదం ఉంది. జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని ఖజీపల్లి, బొల్లారం, గడ్డపోతారం, గుమ్మడిదల, అనంతారం, బొంతపల్లి పారిశ్రామిక వాడల్లో దాదాపు 200 రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 50 శాతానికి పైగా చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఇంటర్మీడియట్ ప్రొడక్టులను తయారు చేస్తుంటారు. తగిన రక్షణ పరికరాలు లేకపోవటంతో తరచూ వీటిలోనే అధికంగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగిన పరిశ్రమలకు అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రమాదం జరుగుతున్న సమయంలో సైతం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు సంఘటనా స్థలానికి రాకుండా, ప్రమాదం జరిగిన తరువాత రోజు వచ్చి పరిశీలించటం ఆనవాయితీగా మారింది. ప్రమాదం జరుగతున్న సమయంలో తీవ్రత తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించడానికి అధికారులు అందుబాటులో ఉండడం లేదు. పరిశ్రమల్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాకర్టరీస్ అధికారులు సూచించిన మేర రక్షణ చర్యలు ఉండాలి. ఈ విషయాన్ని అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఇటీవల జరిగిన ప్రమాదాలు.. - గడ్డపోతారంలోని ఓ పరిశ్రమలో నెల రోజుల క్రితం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. సకాలంలో స్పందించిన సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. - బొల్లారంలోని ఓ రసాయన పరిశ్రమలో రెండు నెలల క్రితం కార్మికులు రసాయనాలను కలుపుతుండగా అగ్ని ప్రమాదం జరిగింది - బొంతపల్లిలోని మరో పరిశ్రమలో రెండు నెలల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో కార్మికులకు గాయాలయ్యాయి. పరిశ్రమ పూర్తిగా దగ్ధం కావడంతో తీవ్ర ఆస్థినష్టం జరిగింది. - అనంతారంలోని మరో చిన్నతరహా పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులుతీవ్రంగా గాయపడగా, భారీ ఆస్థి నష్టం జరిగింది. - ఇటీవల గుమ్మడిదలోని మహాసాయి రసాయన పరిశ్రమలో రసాయనాలను దింపుతుండగా స్పార్క్ వచ్చి ప్రమాదం జరిడంతో రూ. 30 కోట్ల వరకు ఆస్థినష్టం జరిగింది. పరిశ్రమ పూర్తిగా దగ్ధమైంది. నిపుణులైన కార్మికులు లేకే..? రియాక్టర్ల వద్ద అనుభవం ఉన్న నిపుణులైన కార్మికులతో పనులు చేయించాల్సి ఉంటుంది. వీరికి అధిక మొత్తంలో వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ యాజమాన్యాలను అనుభవం లేని కార్మికులతో పనులు చేయిస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. రసాయనాలను కలపడం, దిగుమతి చేస్తున్న సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎండాకాలం మరింత జాగ్రత్త అవసరం.. ఎండాకాలంలో రసాయన ప్రతి చర్యలు అధికంగా జరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఏటా పారిశ్రామిక వాడల్లో దాదాపు 30 ప్రమాదాలు జరిగితే అందులో 20 వరకు ఎండాకాలంలో జరిగినవే ఉంటాయి. అగ్నిమాపక కేంద్రం లేక.. పారిశ్రామిక వాడల్లో అగ్నిమాపక కేంద్రాలు లేకపోవటంతో ప్రమాదం జరిగిన సమయంలో ఆస్థినష్టం అధికమవుతోంది. గుమ్మడిదల, జిన్నారం మండలాల్లోని పారిశ్రామిక వాడల్లో ఎమైనా ప్రమాదాలు జరిగితే పటాన్చెరు, జీడిమెట్ల, నర్సాపూర్, బీహెచ్ఈఎల్ల నుంచి అగ్నిమాపక వాహనాలు రావాల్సిన పరిస్థితి. గడ్డపోతారం పారిశ్రామిక వాడకు హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి వచ్చిన సమయంలో ఈ ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా విషయం కార్యరూపం దాల్చలేదు. తెలియని ప్రమాదాలు ఎన్నో.. మల్టీనేషన్ కంపెనీల్లో జరుగుతున్న ప్రమాదాల విషయం బయటకు రావటం లేదు. వాటిల్లో ప్రమాదాలు జరిగినా అప్పటికప్పుడు మంటలను ఆర్పివేసేలా విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని సంఘటనల్లో కార్మికులు మృతి చెందినా విషయం బయటకు రానివ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. చర్యలు తీసుకుంటున్నాం రసాయన పరిశ్రమల్లో అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకునేలా యజమాన్యాలకు సూచనలు చేస్తున్నాం. నిబంధనలను పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంతో పాటు, నోటీసులు అందిస్తున్నాం. ఇటీవల గుమ్మడిదలలో జరిగిన ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాం. – రాజ్‌గోపాల్, ఇన్స్పెక్టర్ ఆఫ్ప్యాక్టరీస్ అధికారి -
చివరికి నష్టాలే..!
ఆశలు ఆవిరయ్యాయి. ఆరుగాలం కష్టించినా ఫలితం లేకుండా పోయింది. పంట చేతికందక.. పెట్టుబడీ రాక నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. మదనపల్లె డివిజన్ పరిధిలో ఇప్పుడు ఏ వరి రైతును కదిలించినా ఇవే గాథలు. పంట పచ్చగా ఉన్నా గింజ పట్టలేదని ఆవేదన చెందుతున్నారు. నకిలీ విత్తనాలు, వాతావరణ ప్రభావం వల్లే నష్టపోయామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సుమారు రెండువేల హెక్టార్లలో పంట సర్వనాశనమైందని, రూ.8 కోట్లకుపైగా నష్టపోయామని గుండెలు బాదుకుంటున్నారు. పలమనేరు: కరువుకు మారుపేరైన మదనపల్లె డివిజన్ పరిధిలో ఈసారి వరి భారీగా దెబ్బతింది. తెగుళ్లకోర్చి, కష్టాలకెదురొడ్డినా ఫలితం లేకపోయిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా రబీలో 4వేల హెక్టార్లలో వరి సాగయ్యేది. మూడేళ్లుగా వర్షాలు ఆశాజనకంగా కురవడంతో భూగర్భజలాలు పెరిగాయి. రైతులు వరిసాగుపై ఆసక్తి చూపారు. మొత్తం మీద చెరువులు, బావులు, కుంటలు, బోర్ల కింద 6,600 హెక్టార్లలో వరి సాగుచేశారు. స్థానికంగా లభించే నర్మద, కావేరి, బీపీటీ, నెల్లూరు ఎన్‌ఎల్‌ఆర్ తదితర రకాలు సాగుచేశారు. పంట ఏపుగా పెరిగింది. బాగానే పిలకలు వేసింది. ప్రస్తుతం వరి వెన్ను, కోతదశల్లో ఉంది. సగం పంటకు గింజ పట్టకుండా జల్లుబోయింది. తెగుళ్లకు తట్టుకుని.. నెల క్రితం వరి పైరు పసుపు రంగులోకి మారింది. ఆకుల కొనలు మాడిపోయాయి. సుడిదోమ, ఆకు ముడత సోకాయి. వాటికి అవసరమైన మందులు పిచికారీ చేసినా కొందరు రైతులు పంట కాపాడుకోలేకపోయారు. మరికొందరు భారీగా పెట్టుబడులు పెట్టి కొంతమేర నిలబెట్టుకున్నారు. ముంచిన మంచు.. వరి పంట చూసేందుకు పచ్చగా.. ఏపుగానే ఉంది. పిలకల్లో గింజపట్ట లేదు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని బాధిత రైతులు చెబుతున్నారు. గింజ పట్టకపోవడానికి గల కారణాలు వ్యవసాయ అధికారులకే అంతుచిక్క డం లేదు. పంటను పరిశీలించిన అధికారులు తిరుపతి పరిశోధన కేంద్రానికి చెందిన సైంటిస్టులను పిలిపించారు. వారు కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో వరి పంటను పరిశీలించి తగిన పరీక్షలు చేశాక ఫలితం వెల్లడిస్తామని చెప్పారు. గత నవంబరులో నాటిన వరికి ఎఫెక్టు ఎక్కువగా ఉందని తేల్చారు. మామూలుగా వరి పంటకు 15 డిగ్రీ లకంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండరాదు. కానీ నవంబరు, డిసెంబరు మాసాల్లో ఈ దఫా రాత్రిపూట చలిఎక్కువై ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయాయి. గింజపట్టని పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. అదును తెలియక.. అందుబాటులో లేక రబీ సీజన్లో వరి ఎప్పుడు సాగుచేయాలి.. అప్పటి వాతావరణ పరిస్థితుల మేరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైతులకు తెలియదు. ముఖ్యమైన విత్తన ఎంపిక ఎలా చేసుకోవాలో వారికి అవగాహన లేదు. హైబ్రిడ్ రకాల పేరిట కర్ణాటక నుంచి అందిన రకాలు, లోకల్ కంపెనీ సీడ్స్‌ను ఇక్కడి దుకాణాల్లో విక్రయించారు. ఏవి మేలో తెలియని రైతులు అందుబాటులో ఉన్న వరి విత్తనాలు కొని నారు పోశారు. వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం.. వరి వంగడాలు, వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దుకాణాల్లో నిబంధనల మేరకు విత్తనాలను విక్రయిస్తున్నారా..? లేదా..? అని తనిఖీలు చేయలేదు. సంబంధిత పంచాయతీల్లోని ఎంపీఈఓ (మల్టిపర్ఫస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్)లు పొలాలవైపు కన్నెత్తి చూడలేదు. ఫలితం రైతులు నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. రూ.8కోట్లకుపైగా నష్టం.. మదనపల్లె డివిజన్ పరిధిలో వరి సాగుకోసం హెక్టారుకు రూ.40 వేల దాకా వెచ్చించారు. ప్రస్తుతం సాగులో ఉన్న రెండు వేల హెక్టార్లలో పంట దెబ్బతింది. ఈ లెక్కన డివిజన్ పరిధిలో రూ.8 కోట్లకుపైగా పంటకు నష్టం వాటిల్లింది. కనీసం ప్రభుత్వమైనా స్పందించి గింజపట్టని వరిచేలకు నష్ట పరిహారం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. మొత్తం పోయింది నర్మద రకం వరిని ఎకరా పొలంలో సాగుచేశా. పంట చూసేందుకు భలే ఉంది. కానీ వెన్నులో గింజలేదు. నేను ఎన్నో ఏళ్లుగా వరిని సాగుచేస్తున్నా. ఎప్పుడూ ఇలాలేదు. ఎకరా పంటకు 20 వేలదాకా ఖర్చుపెట్టా. మొత్తం పోయింది. – కృష్ణప్ప, నాగిరెడ్డిపల్లె, వికోట మండలం ముందు నుంచి అనుమానంగానే ఉంది నేను ఈ దఫా కావేరి రకం వరిని మూడెకరాల్లో సాగుచేశా. ఇందుకు 90 వేలు ఖర్చయింది. నెల ముందు పంట పసుపు వర్ణంలోకి మారింది. రూ.12వేలు ఖర్చుబెట్టి మందులు పిచికారీ చేశా. పంట కుదరుకుంది. కానీ గింజపట్ట లేదు. అధికారులకు చూపిస్తే మాకు తెలియదన్నారు. సైంటిస్ట్ చూస్తే తెలుస్తుందన్నారు. ఇంట్లో తినేకి గింజకూడా లేదు. – కిచ్చరాజు, హనుమంత్‌నగర్, వీకోట మండలం అతిశీతల వాతావరణమే.. మంచుతో పాటు అతిశీతల వాతావరణంలో గింజ పట్టని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే శాస్త్రవేత్తలు పంటను పరిశీలించారు. దీనికి కారణాలు త్వరలో తేలనున్నాయి. రైతులకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదించాం. – బషీర్ అహ్మద్, వ్యవసాయశాఖ ఏడీ, పలమనేరు -
బాబోయ్.. బయోభూతం
ఆస్పత్రుల నుంచి వచ్చే బయో వ్యర్థాలనుప్రత్యేకంగా తరలించి ప్లాంటులో నిర్వీర్యంచేయాల్సి ఉండగా చాలావరకు నిబంధనలనుపాటించడం లేదు. పలు ఆసుపత్రుల నుంచిసేకరించిన వీటిని చెత్తతో కలిపి సాధారణడంపింగ్యార్డులకు తరలిస్తున్నారు. కాగా..ఈ ప్లాంటు మన జిల్లాలో లేకపోవడం..పొరుగున ఉన్న అనంతపురం జిల్లా ధర్మవరంమండలంలో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్నప్లాంటుకు వీటిని తరలించాల్సి ఉంది. కొన్నిప్రైవేటు ఆసుపత్రులు ఈ సంస్థతో ఒప్పందంచేసుకోకపోవడంతో.. ఒప్పందంలో ఉన్నఆసుపత్రులూ ఈ కార్యక్రమాన్ని సరిగాచేపట్టక పోవడంతో పాటు వ్యర్థాలనుఎక్కడంటే అక్కడ చెత్తలో పడేస్తున్నారు.జనాలను రోగాల పాల్జేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ ప్రమాదకరంగా మారుతోంది. వ్యర్థాలను నిబంధనల ప్రకారం నిర్వీర్యం చేయాల్సి ఉన్నా పలు చోట్ల ఈ కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. దీంతో ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. రోగులకు వినియోగించిన సిరంజీలు, బ్యాండేజీలు, బ్లేడ్లు, ఐవీసెట్లు ఇతర వ్యర్థ పరికరాల ద్వారా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. నిబంధనల ప్రకారం ఈ వ్యర్థాలను కేటాయించిన డబ్బాల్లో వేరుచేసి ప్రత్యేక ప్లాంటుకు తరలించి నీడిల్ బర్నల్ ద్వారా కరిగించి విచ్ఛిన్నం చేయాల్సి ఉంది. రోజూ 2 టన్నులు.. జిల్లాలో రిమ్స్, ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి, పులివెందులలో ఏరియా ఆసుపత్రి, సీఎం ఆరోగ్య కేంద్రాలు 11, పీహెచ్‌సీలు 75, సీహెచ్‌సీలు 12ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో సుమారు 300లకు పైగా ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 1,500 మంది ఆర్ఎంపీ, ఇతరులు (ప్రథమ చికిత్స చేయగలిగిన వారు) సేవలందిస్తున్నారు. అధికసంఖ్యలో ల్యాబ్‌లూ ఉన్నాయి. ఆయా ఆసుపత్రుల నుంచి నిత్యం సుమారు 2టన్నులకు పైగా బయోవ్యర్థాలు వస్తుంటాయని అంచనా. వాటిని కేటగిరీలుగా విభజించి ప్రత్యేకంగా కేటాయించిన డబ్బాల్లో వేయాలి. నిబంధనలు పాటించని ఆసుపత్రులు జిల్లాలో కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి ఉన్న ఆసుపత్రులు 181 ఉండగా.. మిగిలినవి అన«ధికారికంగా కొనసాగుతున్నాయి. వీటిలో అధిక శాతం ఆసుపత్రులు నిబంధనలు పాటించడం లేదు. వ్యర్థాలను వేరుచేయడం లేదు. పలుచోట్ల రంగుల డబ్బాలను కూడా పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. దీంతోపాటు కొన్నిచోట్ల వీటిని అట్ట పెట్టెల్లో వేస్తున్నారు. ఫలితంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదమున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. గ్రామాల్లో వినియోగించిన బయో వ్యర్థాలను అక్కడే చెత్తలో పడేస్తున్నారు. ఈ పరిణామం ప్రమాదకరంగా మారుతోంది. నిర్వీర్యం చేసేది కొంతే? ఆసుపత్రుల్లో వ్యర్థాలను సూచించిన రంగుల డబ్బాల్లో వేసి నిబంధనల ప్రకారం వీటిని నీడిల్ బర్నల్లో కరిగించాలి. శ్రీవెన్ ఎన్విరాన్ టెక్నాలజీస్ సంస్థ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని ధర్మవరం మండలం దంపెట్ల వద్ద ఈ వ్యర్థాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ఉంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ అయిన ఆసుపత్రుల నుంచి మంచానికి రూ.3.50 నుంచి రూ.4.50 వరకు రోజుకు వసూలు చేస్తారు. వాస్తవంగా 48గంటలకు మించి వైద్యశాలల్లో వ్యర్థాలను ఉంచకూడదు. కానీ పలుచోట్ల రోజుల తరబడి వీటిని సేకరించడం లేదు. దీంతో వ్యర్థాల నిల్వ పేరుకుపోవడంతో వీటిని పక్కనే ఉన్న డంపింగ్ డబ్బాల్లో సిబ్బంది పడేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు వీటిని కూడా కడప శివారుల్లోని మద్దిమడుగు డంపింగ్‌యార్డుకు తరలించి తగులబెడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఈ విషయంలో కఠిన చర్యలు చేపట్టడం లేదు. జిల్లాలో భారీసంఖ్యలో ఆసుపత్రులు ఉండగా రోజుకు కేవలం 429 కేజీల వ్యర్థాలు వస్తున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. నిబంధనలు ఇవి.. ♦ ఎరుపురంగు డబ్బాలో గ్లవ్స్, ప్లాస్టిక్ గొట్టాలు, సీసాలు, సెలైన్ సీసాలు, ఐవీ సెట్లు, మూత్రసంచులు, సూదులు లే ని సిరంజీలు, ట్యూబ్‌లు వ్యర్థాలు వేయాలి. ♦ పసుపు రంగు డబ్బాలో దూది, డ్రస్సింగ్, పిండికట్టు వ్యర్థాలు, గాజు వస్త్రం, శరీర ద్రవాలు, భాగాలు, అవయవాలు, నమూనాలు, మానవ కణజాలాలు, సూక్ష్మ క్రిమి వ్యర్థాలు, నెత్తురు, చీము, రక్త సంచులు, గడువు ముగిసిన మందులు, టీకాలు వంటి వాటిని వేయాలి. ♦ నీలం రంగు డబ్బాలో గాజు సీసాలు, ఇంప్లాట్లు, ప్రూఫ్ కంటైనర్లలో సూదులు, సిరంజీలు, కత్తిరించిన సూదులు వంటి వ్యర్థాలను వేర్వేరుగా వేయాలి. వ్యర్థాల విచ్ఛిన్నానికి చర్యలు.. ఆసుపత్రి వ్యర్థాలను సేకరించి విచ్ఛిన్నం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి రోజూ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి సేకరించి ప్లాంటుకు తరలించే విధంగా ఏర్పాట్లు చేశాం. మంచాల(బెడ్స్) ప్రాతిపదికన సొమ్ము తీసుకుని వ్యర్థాలను సేకరిస్తున్నారు. అసుపత్రి వ్యర్థాలు చెత్తలో కలుస్తుండడం, దీనిని డంపింగ్ యార్డులకు తరలిస్తుండడాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. జిల్లాలో అథరైజేషన్ చేయించుకోని 13 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశాం. – నరేంద్రబాబు, ఈఈ, కాలుష్య నియంత్రణ మండలి, తిరుపతి -
‘ఆ కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వద్దు’
సాక్షి, సిటీబ్యూరో: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఇందుకు సంబందించి విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. అదనపు పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా, సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతితో పాటు ఐదు జోన్ల డీసీపీలు, 17 డివిజన్ల ఏసీపీలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ కేసులను జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిత్యం సమీక్షిస్తూ ఉంటుంది. అయితే ఈ సమీక్ష విధానాన్ని కమిషన్ పూర్తి స్థాయిలో మార్చి ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించింది. ఇటీవల నగరంలో జరిగిన కమిషన్ పర్యటన నేపథ్యంలో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీనిని పరిగణలోకి తీసుకున్న కొత్వాల్ అదే ఫార్మాట్‌ను ప్రతి అధికారి అనుసరించాలని, ఆ మేరకే రివ్యూ రిపోర్ట్స్ తయారు చేయాలన్నారు. ఈ కేసులను డీఎస్పీ హోదాలో ఉండే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (ఏసీపీ) అధికారులు దర్యాప్తు చేస్తుంటారు. వీరి దర్యాప్తు తీరుతెన్నుల్ని డీసీపీలు పర్యవేక్షిస్తారు. ఈ నేపథ్యంలోనే వీరితో పాటు సీసీఎస్ అధికారులతోనూ పోలీసు కమిషనర్ భేటీ అయ్యారు. -
ప్రభుత్వంలో రైతులకు గుర్తింపేది..
ముదిగొండ : మాయమాటలతో ప్రజలను, రైతులను మభ్యపెడుతూ కాలం గడుపుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు విమర్శించారు. మండలంలోని కట్టకూరు గ్రామంలోజరిగిన ఓ కార్యక్రమానికి శుక్రవారం ఆయన హాజరై ప్రసంగించారు. అనంతరం మా ట్లాడుతూ మంత్రి అనుచరులకు, రైతు లు కానివారికి ట్రాక్టర్లు మంజూరు చేయ డం చాలా దారుణమన్నారు. అర్హులైన రైతులను పక్కన పెట్టి టీఆర్ఎస్ నాయకులకే ట్రాక్టర్లు పంపిణీ చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. జిల్లాలో ట్రాక్టర్ల కోసం దరఖాస్తులు పెట్టుకొని ఏళ్లు గడుస్తున్నా వారికి ఇవ్వకుండా వాటిని తమ కు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఇవ్వడం ఈ ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని, ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంతరం సాగర్ జలాలతో చెరువులను నింపి సాగు, తాగు నీరు అందించాలని కోరారు. ప్రభుత్వ పథకాలు పేదలకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సేవాదళ్ అధ్యక్షు డు వేంరెడ్డి రోషిరెడ్డి, జిల్లా కార్యదర్శి రూప్లానాయక్, నేతలు పసుపులేటి సైదులు, కాకుమాని మల్లికార్జునరావు, కార్యదర్శి చిట్యాల సైదాబాబు, సూరపల్లి శ్రీను, వీరునాయక్, గుగులోతు నాగేశ్వ రరావు, కె రాము, షేక్ యాకూబ్మి యా, కొత్తపల్లి నాగార్జున, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
మాతృభాష.. ఘోష !
‘దేశభాషలందు తెలుగు లెస్స’ అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెబుతారు. మాతృభాషపై మమకారం రోజురోజుకు తగ్గిపోతోం ది. తెలుగుభాష మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అందరూ ఆంగ్లం వైపే పరుగులు పెడుతున్నారు. అమ్మ భాషకన్నా పరాయిభాషపైనే ప్రేమ పెంచుకుంటున్నారు. కాన్వెంట్ చదువుపై మనసు పెడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో తెలుగు భా ష మనుగడ ప్రశ్నార్థకంలో పడిపోయే సూచనలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో దేశంలో రెండో అతిపెద్ద భాషగా విరాజిల్లిన తెలుగు ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది. మాతృభాషా పరి రక్షణకు చట్టం తెచ్చి దాన్ని ఆచరణలో పెడితేనే తెలు గుభాష ప్రాభవాన్ని కాపాడిన వారమవుతాం. కెరమెరి : తెలుగు మాధ్యమం ప్రాభవం నానాటికీ తగ్గిపోతోంది. పాఠశాల విద్యకు ప్రభుత్వం ప్రతి ఏటా రూ.వేల కోట్లు ఖర్చు చేస్తుంది. ఉచితంగా చదువులు చెప్పడంతో పాటు అవసరమైన పుస్తకాలు ఇతర సామగ్రిని ఇవ్వడం, మధ్యాహ్న భోజనం అందించడం తదితర కార్యక్రమాలతో పాఠశాల విద్య పటిష్టానికి కృషి చేస్తుంది. ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో నిపుణులైన ఉపాధ్యాయులున్నారు. మండలంలో 75 ప్రాథమిక పాఠశాలలు, 4 ప్రాథమికోన్నత పాఠశాలలు, 8 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలు 6తో కలిపి మొత్తం 91 పాఠశాలలున్నాయి. ఇందులో 6150 మంది విద్యార్థులున్నారు. చాలామంది విద్యార్థులు సంవత్సరం మధ్యలోనే చదువు మానేస్తుండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. మరోవైపు వీధికొక్కటి చొప్పున పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేటు పాఠశాలలు కొత్త ఎత్తులతో విద్యార్థులను ఆకర్శిస్తున్నాయి. కొన్ని మినహా చాలా ప్రభుత్వ పాఠశాలలు మాత్రం ఉత్తీర్ణతలో వెనుక బడుతున్నాయి. దీంతో మారుమూల గ్రామీణ ప్రాంతాల తల్లితండ్రులు సైతం ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. ఇదే సమయంలో మాతృభాషా తెలుగు మనుగడ ప్రమాదకర పరిస్థితిలో పడుతోంది. ప్రైవేటుకు ధీటుగా తయారు చేయాలి. తెలుగుమాధ్యమంలో చదివితేనే.. ప్రభుత్వం తెలుగు మాధ్యమంలో చదువుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులనే నిబంధన తీసుకురావాలి. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల్లో చదువుతూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో మార్పు తీసుకురావాలి. అప్పుడే మాతృభాషపై మమకారం పెరుగుతుంది. ఉపాధి కోసమైనా తెలుగు మాధ్యమంలో చేరే అవకాశముంటుంది. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నర్సరీ తరగతులు ప్రారంభించాలి ప్రభుత్వం పాఠశాలల్లో నర్సరీ తరగతులను ప్రవేశ పెడితే ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను సునాయాసంగా ఆకట్టుకునే అవకాశం ఉంది. అయితే ముందు నుంచే కసరత్తును ప్రారంభించాల్సి ఉంది. తెలుగు మాధ్యమంలోనే విద్యాబో ధన సాగించాలనే నిబంధన పెట్టాలి. ఆంగ్ల మాధ్యమం పై ఉన్న ఆసక్తిని తగ్గించాలి. తెలుగులోనే విరివిగా అవకాశాలు కల్పించే విధంగా చట్టాలు రూపొందించాలి. చైతన్యం పెరగాలి.. బడులు బాగా పని చేయాలంటే త ల్లి తండ్రుల్లో చైతన్యం పెరగాలి.విద్యార్థుల ప్రగతి, చదువు విధానం ఎప్పటి కప్పుడు అడిగి తెలుసుకుంటూ ఉన్నప్పడు ఉపాధ్యాయునిపై బాధ్యత పెరుగుతుంది. కాని పోషకులు మాత్రం ఎక్కడా సహకరించడం లేదు. క నీసం సమావేశాలకు పిలిస్తే కూడా రావడం లేదు. – ఎం శ్రీనివాస్, డీటీఎఫ్, మండల ప్రధాన కార్యదర్శి కెరమెరి -
నేతల జల్సా
సింగరేణిలో కార్మిక నాయకుల వ్యవహారశైలి రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. మస్టర్లు పడి విధులకు వెళ్లడం లేదు. యాజమాన్యమూ పట్టించుకోవడం లేదు. దీంతో సాధారణ కార్మికులపై పనిభారం, కంపెనీపై ఆర్థికభారం పెరుగుతోంది. సాధారణ కార్మికుడిపై అగ్గి మీద గుగ్గిలమయ్యే అధికారులు.. జల్సా చేస్తున్న నాయకుల విషయానికొచ్చే సరికి చేష్టలుడిగి చూస్తున్నారు. రామకృష్ణాపూర్(మంచిర్యాల జిల్లా) : సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం, ప్రాతినిధ్య సంఘం(గత ఎన్నికల్లో గెలిచిన) నాయకుల హవాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. బడా నేతలే కాదు చోటా మోటా నాయకులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, గనుల మీద మస్టర్లు పడి, విధులకు వెళ్లకుండా బయటే పచార్లు కొడుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కమిటీల పేరిట ఇష్టారాజ్యం సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచిన యూనియన్‌కు వివిధ కమిటీల్లో ప్రాధాన్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ గనికి పిట్ కమిటీ, క్రీడలు, ఆలయాలు, క్యాంటీన్లు, రక్షణ... ఇలా పలు రకాల కమిటీలను నియమిస్తారు. ఒక గనిని తీసుకుంటే కనీసం 10 మంది వరకు గుర్తింపు కార్మిక సంఘం ప్రతినిధులు ఉంటారు. వీరిలో చాలా మంది మస్టర్లు పడడమే తప్ప విధులు నిర్వర్తించిన పాపాన పోవడం లేదు. కొన్ని సంవత్సరాల తరబడి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో కార్యక్రమాలు మరింతగా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం విజయవంతం చేసేందుకు సంస్థ సైతం అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవడంతో నాయకులు మరింతగా రెచ్చిపోయారు. అవకాశం చిక్కిందంటే చాలు మూకుమ్మడిగా మస్టర్లు పడి కార్యక్రమాల్లో సొంత పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఇటీవల మందమర్రి ఏరియా పరిధిలోని ఓ జాతర ఏర్పాట్లకు సంబంధించి జీఎం పర్యటించిన సమయంలో ఏకంగా 20 మందికి పైగా యూనియన్ నాయకులు తరలిరావడం ఒకింత చర్చకు దారితీసింది. వీరంతా వారివారి డిపార్టుమెంట్లలో మస్టర్ పడి రావడం గమనార్హం. సంస్థకు రూ.కోట్లలో టోపీ నాయకుల వ్యవహార శైలి సింగరేణి సంస్థపై పెనుభారం మోపుతోందని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుత వాస్తవ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో కార్మికునికి మస్టర్‌కు కనీసం 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల నుంచి కనీసం 10 చొప్పున తీసుకున్న మొత్తం 470 మంది వరకు నాయకులు ఉంటారని తెలుస్తోంది. 29 భూగర్భ గనుల్లో 290 మంది, 18 ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల్లో 180 మంది మస్టర్లు పడే వారుంటారు. వారు విధులు నిర్వర్తించకున్న వేతనం చెల్లించాల్సిన పరిస్థితి. 1500 రూపాయల చొప్పున నెలకు 25 మస్టర్లకు గణించిన 470 మందికి కోటి 76 లక్షల 25 వేల రూపాయలు అవుతుంది. నెలకు కనిష్టంగా 20 మస్టర్ల చొప్పున తీసుకుంటే 1500 రూపాయల చొప్పున రూ. కోటి 41 లక్షల వ్యయం చేయాల్సి వస్తోంది. కనీసం ఏ పని ముట్టు ముట్టకుండా, చేతికి మట్టి అంటకుండానే గుర్తింపు కార్మిక సంఘం నాయకులకు వేతనాల రూపంలో ఇలా ముట్టజెపాల్సి వస్తోంది. ఈ లెక్కన సంవత్సరానికి ఎంతమేరకు అనవసరపు దుబారా సంస్థపై పడుతుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో ఉన్నా.. మస్టర్! విధుల అనంతరం ఔట్ టైం పడితేనే కార్మికుడి మస్టర్ లెక్కలోకి తీసుకుంటారు. కానీ జనరల్ షిఫ్టుల పేరిట మస్టర్లు పడుతూ బయట తిరిగే నాయకులకు ఇవేవి వర్తించవు. తతంగమంతా తెలిసినా సంబంధిత విభాగం సిబ్బంది అంతా చూసుకుంటారు. అవసరమైతే అమెరికాలో ఉన్నా స్థానికంగా మాత్రం విధుల్లో ఉన్నట్లు రికార్డులు వెల్లడిస్తాయి. ఇదంతా షరామామూలే అన్నట్లు ఉంటుంది. గతంలోనూ ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. తాము అత్యవసర పని మీద కూడా బయటకు వెళ్లలేకపోతున్నామని, అదే నాయకులైతే, మస్టర్ పడి జల్సా చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. -
వైద్యురాలి నిర్లక్ష్యంతో చిన్నారి మృతి
గద్వాల క్రైం: కాన్పు కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన గర్భిణిని ఓ ఆశ కార్యకర్త మభ్యపెట్టి ప్రైవేట్ క్లినిక్‌కు పంపించింది.. అక్కడ నిర్లక్ష్యంగా కాన్పు చేయడంతో పుట్టిన బిడ్డ పురిటిలోనే ప్రాణాలొదిలింది.. దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత వైద్యురాలే కారణమని బాధితులు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన గురువారం గద్వాలలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం..రెండురోజుల తర్వాత.. ధరూరు మండలంలోని నీళహల్లి గ్రామానికి చెందిన పావని అనే గర్భిణి ఈ నెల 22న కాన్పు కోసం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. అయితే డ్యూటీ డాక్టర్ వరలక్ష్మి గర్భిణిని పరిశీలించి కాన్పు కావడానికి ఇంకా సమయం ఉందని, ఎలాంటి భయం లేదని చెప్పారు. ఆస్పత్రిలోనే రెండు రోజులు గడిచినప్పటికీ పావనికి ఎలాంటి నొప్పులు రాలేదు. అయితే ఓ ఆశ కార్యకర్త తనకు తెలిసిన ఓ ప్రైవేట్ క్లినిక్‌లో డెలివరీ చేయించుకోండి అంటూ ప్రైవేట్ క్లినిక్‌కు ఈ నెల 24న పంపించారు. అక్కడ డాక్టర్ వరలక్ష్మి సాయంత్రం పావనికి సిజేరియన్ చేసి ఆడబిడ్డను బయటకు తీశారు. అయితే బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని, ఉమ్మ నీరు తాగిందని, బిడ్డ పేగు మెడకు చుట్టుకుందని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే అంబులెన్స్ ద్వారా కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ చిన్నారి ఆస్పత్రికి చేరేలోపే మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన బంధు వులు గురువారం మధ్యాహ్నం గద్వా ల ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెం ట్ కార్యాలయం ఎదుట ధర్నా చేప ట్టా రు. కాన్పు కోసం వచ్చిన సమయ ంలో ఎలాంటి ఇబ్బంది లేదని, సాధారణ కాన్పు అవుతుందని చెప్పిన వైద్యురాలు వరలక్ష్మి.. రెండురోజులు నిర్లక్ష్యం చేసి.. తనకు సంబంధించిన ప్రైవేట్ క్లినిక్‌లో సిజేరియన్ చేయడంతోనే బిడ్డ మృతిచెందిందని ఆరోపించారు. వైద్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి వైద్యాధికారి విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. నా తప్పిదం లేదు.. ఈ విషయమై వైద్యురాలు వరలక్ష్మి మాట్లాడుతూ బిడ్డ చినపోవడంలో తమ తప్పిదం లేన్నారు. ఉమ్మనీరు తాగడం, పేగు మెడకు చుట్టుకోవడంతోనే మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు పంపించామన్నారు. ఎవరికీ ప్రైవేట్ క్లినిక్‌లో వైద్యం చేయించుకోవాలని చెప్పలేదన్నారు. విచారణ జరుపుతాం.. ప్రభ్తుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడే కాన్పులు చేయాలి. అలా కాదని ఎవరైనా ప్రైవేట్ క్లినిక్‌లకు పంపించడం చట్టరీత్యా నేరం. ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ విజయ్‌కుమార్, సూపరింటెండెంట్, గద్వాల -
అయ్యో.. రామప్ప!
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన చారిత్రాక రామప్ప ఆలయ అభివృద్ధిని అధికారులు మరిచారు. నిత్యం వందలాది మంది భక్తులు సందర్శించే ఈ ఆలయానికి మేడారం జాతర నేపథ్యంలో వేలాదిగా తరలివస్తున్నారు. జనవరి 31 నుంచి మూడు రోజులపాటు మేడారంలో జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివస్తారు. దూర ప్రాంతాల నుంచి మేడారంను సందర్శించే భక్తులు తిరుగు ప్రయాణంలో వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. మేడారంలో దుమ్ము,దూళితో అలిసిపోయిన భక్తులు రామప్ప ఆలయ ప్రాంగణంలో ఒకరోజు విడిది చేస్తారు. ఈ సందర్భంగా రామప్ప సరస్సులో పుణ్యస్నానాలాచరించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనంతరం ఆలయ పరిసర ప్రాంతాల్లో భోజనాలు వండుకొని తిని విశ్రాంతి తీసుకుంటారు. మేడారం భక్తులకు సమస్యల స్వాగతం.. మేడారం జాతర మరో 5 రోజుల్లో ప్రారంభం కానున్నప్పటికీ ఇప్పటికే ప్రతిరోజు రామప్పను 10 వేల నుంచి 15 వేల మంది భక్తులు సందర్శిస్తున్నారు. మేడారం జాతర సందర్భంగా ఐదు లక్షలకుపైగా భక్తులు రామప్పను సందర్శించే అవకాశం ఉంది. భక్తుల సౌకర్యార్థం ఇప్పటి వరకు రామప్పలో కనీస వసతులు అ«ధికారులు కల్పించకపోవడంతో వారికి సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. తాగునీరు, మరుగుదొడ్లు, స్నానఘట్టాలు, పార్కింగ్ స్థలం, లైటింగ్ వసతి ఇలా ప్రతీ సమస్య భక్తులకు ఎదురు కానుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి రామప్పలో సౌకర్యాలు కల్పించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. కానరాని మరుగుదొడ్లు.. గత జాతర సందర్భంగా సరస్సు కట్ట సమీపంలో పది శాశ్వత స్నానఘట్టాలు, పది శాశ్వత మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ వాటి వద్ద నీటివసతి కల్పించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. ఆ సమయంలో రామప్ప పరిసర ప్రాంతాల్లో 30 తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ ఈ సారి తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రామప్పగుడి వద్ద తాత్కాలిక స్నానఘట్టాలు, మరుగుదొడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. బస్ సౌకర్యం కల్పించరూ.. నిత్యం రామప్పకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నా ఇక్కడికి బస్‌సౌకర్యం లేదంటే ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మేడారం జాతర సందర్భంగా భక్తుల రద్దీ పెరుగుతున్నా రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పరకాల, హన్మకొండ, భూపాలపల్లి నుంచి రామప్పకు ప్రత్యేక బస్సులు నడిపించడం తోపాటు ముఖ్యమైన కూడళ్లతో పాటు ఆలయం వరకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. రాత్రి 8 గంటల వరకు ఆలయంలోకి అనుమతించాలి రామప్ప ఆలయంలోకి వెళ్లేందుకు రాత్రి 8 గంటల వరకు భక్తులకు అవకాశం కల్పించాలని మేడారం భక్తులు, పర్యాటకులు పురావస్తుశాఖ అధికారులను కోరుతున్నారు. సాయంత్రం ఆరు దాటితే ఆలయ ప్రధాన గేట్లను మూసి వేస్తుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత నాలుగు రోజుల క్రితం మహబూబ్‌నగర్, జగిత్యాలకు చెందిన భక్తులు ఇదే విషయమై పురావస్తుశాఖ సిబ్బందితో గొడవపడి గేటుకు వేసిన చైన్‌ను ధ్వంసం చేసి రామప్ప ఆలయాన్ని సందర్శించారు. కంపు కొడుతున్న పరిసర ప్రాంతాలు రోజురోజుకు రామప్ప ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతున్నా గ్రామపంచాయతీ అధికారులుగానీ, ఆలయ సిబ్బందిగానీ ఎలాంటి పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో రామప్ప పరిసర ప్రాంతాలు కంపుకొడుతున్నాయి. రామప్ప ఆలయాన్ని దర్శించుకుంటున్న భక్తులు వారి వెంట తెచ్చుకున్న భోజన పదార్థాలను ఆరగించి ప్లేట్లను, భోజన పదార్థాలను రోడ్డుపైనే వేస్తుండడంతో దుర్గంధం వెదజల్లుతోంది. అధికారులు విఫలం రామప్పను సందర్శించే భక్తులకు వసతులు కల్పించకపోవడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయ శివారులోని ఒగరు కాల్వ వద్ద సులభ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలి. రామప్పలో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో రోడ్లకు ఇరువైపులా ప్లేట్లు, మిగిలిపోయిన భోజన పదార్థాలను భక్తులు పడేస్తున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు కంపుకొడుతున్నాయి. భక్తుల కోసం రామప్ప పరిసర ప్రాంతాల్లో తాగునీటి వసతి, స్నానఘట్టాలు, మరుగుదొడ్లు నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. వంగ మల్లేష్, పాలంపేట గ్రామస్తుడు కానరాని నీటి వసతి రామప్పకు చేరుకోనే మేడారం భక్తులకు ఆలయ సమీపంలో స్నానాలు చేయడానికి ఎలాంటి నీటివసతి లేకపోవడంతో ప్రతిసారి ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయ ఆవరణలో ఒక చేతిపంపుతోపాటు ఆలయం ముందు చిన్నవాటర్ ట్యాంకు ఉంది. భక్తులు తాగునీటికి వీటిపైనే ఆధారపడుతుండడంతో స్నానాలు చేసేందుకు సరస్సును ఆశ్రయించక తప్పడం లేదు. అంతేగాక ఆలయం ముందు ఇరుకైన కల్వర్టు ఉండడంతో గత ఆరేళ్ల క్రితం మేడారం భక్తులకు ఇబ్బంది కలగకుండా రెండు లక్షలతో తాత్కాలిక వంతెనతో మరో రహదారి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ వంతెన కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఆలయం ఎదుట ఉన్న ఇరుకైన వంతెన(బ్రిడ్జి) కూడా ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రమాదకరంగా మారిన వంతెనలకు అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
పల్లెకు రాని బస్సు
ఆదిలాబాద్‌రూరల్ : ఆర్టీసీ బస్సు చేరని గ్రామాలు ఈ రోజుల్లో కూడా అనేకం ఉన్నాయి. ప్రతి గ్రామానికి బస్సు నడిపించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. రోడ్డు మార్గం ఉన్న గ్రామాలకు బస్సు నడపడంలో ఆసక్తి కనబర్చడం లేదు. బస్సు నడపాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. మండలంలోని ఖండాల గ్రామ పరిధిలో సుమారు 18 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. రోడ్డు వేసి ఏడాదవుతున్నా ఆ గ్రామాలకు నేటికి బస్సు సౌకర్యం లేదు. కాలినడకనే శరణ్యం... మండంలంలోని పలు మారమూల గిరిజన గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సు ఆ గ్రామాలకు వెళ్లడం లేదు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు పదుల కిలో మీటర్ల చొప్పున కాలినడకన వస్తున్నారు. జిల్లా కేంద్రానికి మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు ప్రతి రోజు రాకపోకలు నిర్వహిస్తుంటారు. ఆర్టీసీ బస్సు నడవకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల్లో రాకపోకలు నిర్వహించడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు వాపోతున్నారు. అత్యవసర సమయాల్లోనైతే నానా అవస్థలు పడావల్సిన పరిస్థితి ఉందని ప్రయాణీకులు వాపోతున్నారు. నేటికీ బస్సు రాని గ్రామాలు... మండలంలోని ఖండాల గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలకు వెళ్లాలంటే సుమారు ఏడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి. పిప్పల్‌ధరి గ్రామ పంచాయతీ నుంచి ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కాలినడకన వెళ్తున్నారు. ఖండాల పంచాయతీ పరిధిలోని సుమారు 14 గ్రామాలకు వెళ్లేందుకు ప్రభుత్వం బీటీ రోడ్డు సౌకర్యం కల్పించింది. బీటీ రోడ్డు మార్గం వేసి సుమారు ఏడాది గడుస్తున్నా రాజుగూడ, పోతగూడ–1, పోతగూడ–2, ఖండాల తండా, ఖండాల గూడ, ధర్లొద్దీ, మొలాలగుట్ట–1, మొలాల గుట్ట–2, లోహర, జాంగూడ, ఎస్సీ గూడ, చిలాటీగూడ, సాలాయిగూడ, శివగూడ గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్న బస్సు మాత్రం వెళ్లడం లేదు. ప్రయాణీకులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఈ గ్రామాల్లన్నీ ఒకే రోడ్డు మార్గంలో ఉన్నాయి. అధికారులు స్పందించి బస్సును నడిపించేలా చూడాలని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కోరతున్నారు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్తున్నాం తమ గ్రామాలకు వెళ్లేందుకు బీటీ రోడ్డు వేసిన్నప్పటికీ ఆర్టీసీ బస్సు రావడం లేదు. దీంతో ప్రైవేట్ వాహనాలు ఆటోలు, జీపుల్లో రాకపోకలను నిర్వహిస్తున్నాం. అత్యవసర సమయాల్లోనైతే ఆ వాహనాలు రాకపోవడంతో కాలినడకన రాకపోకలు నిర్వహిస్తున్నాం. అధికారులు స్పందించి బస్సు నడిపిస్తే బాగుంటుంది. - నైతం శంభు, ఖండాల, ఆదిలాబాద్ ఆఫీసర్లకు చెప్పిండ్రాట తమ గ్రామానికి రాకపోకలు నిర్వహిచేందుకు గవర్నమెంట్ రోడ్డు వేసింది. కానీ బస్సు మాత్రం రావడం లేదు. మా ఊళ్లకు బస్సు నడపాలని మా ఊరోళ్లు ఆఫీసర్లకు చెప్పిండ్రాటా. కానీ ఇంత వరకు బస్సు నడవడం లేదు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – కనక రమేష్, ఖండాల, ఆదిలాబాద్ -
యాదాద్రిలో గాడి తప్పిన పాలన..!
యాదాద్రి దేవస్థానంలో పాలన గాడి తప్పింది. తప్పులపై తప్పులు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. రిటైర్డ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ కావడం అధికారుల అలసత్వాన్ని తేటతెల్లం చేస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రిలో అధికారుల పనితీరును చూసి భక్తులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. యాదగిరికొండ (ఆలేరు) : యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. కోట్లు వెచ్చించి ఆలయాన్ని దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దాలని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇక్కడి అధికార యంత్రాంగం మాత్రం విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగ విరమణ పొందినా.. దేవస్థానంలో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి గత సెప్టెంబర్‌లో ఉద్యోగ విరమణ పొందాడు. అయితే సంబంధిత సెక్షన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ రిటైర్డ్ ఉద్యోగి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో రెండు నెలల వేతనం జమ అయ్యింది. ఇటీవల గుర్తించిన సదరు విభాగం అధికారులు సదరు రిటైర్డ్ ఉద్యోగిని పిలిపించి వేతన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా అతడు నిరాకరించడంతో విషయం కాస్తా బయటికి పొక్కింది. గతంలోనూ.. ఇలాంటి ఘటనలు దేవస్థానంలో కొత్తేమి కాదని గత రికార్డులు పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది. గతంలో దేవస్థానంలో స్వీపర్‌గా పనిచేసిన ఉద్యోగి ఖాతాలో కూడా ఆరు నెలల వేతనం జమ అయింది. అదే విధంగా మరో ఉద్యోగికి అదనంగా ఇంక్రిమెంట్ కలిపిన ఘటనలు దేవస్థానంలో వెలుగుచూశాయి. అయినా కూడా సదరు విభాగం అధికారుల తీరులో మాత్రం నిర్లక్ష్యం ఇంకా కనిపిస్తోందని తాజా ఘటనే రుజువు చేస్తోంది. ఏళ్లకు ఏళ్లుగా.. సహజంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు బదిలీలు సహజం. మహా అయితే మూడు, నాలుగు సంవత్సరాలకు ఉద్యోగుల బదిలీలు జరుగుతుంటాయి. కానీ, దేవస్థానంలో ఓ స్థాయి ఉద్యోగి మాత్రం ఏకంగా రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడే విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. కిందిస్థాయిలో ఏ చిన్న తప్పు జరిగినా వెంటనే ఉన్నతాధికారులకు తెలిసిపోతోంది. ప్రసిద్ధ ఆలయంలో ఉద్యోగుల నిర్లక్ష్యం కనిపిస్తున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. కాగా, దేవస్థానంలో వెలుగుచూసిన ఘటనలపై వివరణ కోరేందుకు ఆలయ ఈఓ పలుమార్లు ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించినా ఆమె అందుబాటులోకి రాలేదు. -
బ్యాంకులో మోగిన అలారం
తాడేపల్లి రూరల్ (మంగళగిరి) : మంగళగిరిలోని ఎస్బీఐలో ఉన్నట్టుండి సోమవారం రాత్రి అలారం మోగడం ప్రారంభించింది. దీంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురై సీఐ హరికృష్ణ, ఎస్సై వినోద్‌కుమార్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని పరిశీలించగా ఎటువంటి అనుమానించదగ్గ అంశాలు కనపడలేదు. అలారం అరగంట మోగి ఆగిపోయింది. అయితే బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని పోలీసుల పరిశీలనలో నిర్ధారించారు. బ్యాంకులో మొత్తం 6 కిటికీలు ఉండగా, వాటి తలుపులన్నీ తీసి వెళ్ళినట్లు గుర్తించారు. దీనిపై బ్యాంకు అధికారులు, సిబ్బందితో మాట్లాడేందుకు సీఐ ప్రయత్నించగా ఎవ్వరూ అందుబాటులోకి రాలేదు. చివరకు పోలీసులే ఆ కిటికీల గుండా లోపలకు టార్చిలైట్లు వేసి పరిశీలించారు. పోలీసులు అక్కడే బ్యాంకు సిబ్బంది రాక కోసం ఎదురుచూస్తూ నిరీక్షిస్తున్నారు. -
అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యానికి చిన్నారి మృతి
-
చర్చలతోనే అన్ని సమస్యలకు పరిష్కారం
లక్నో: ఎలాంటి సమస్యలనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. రామ జన్మభూమి వివాద పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆయన శుక్రవారం అయోధ్యలో పలువురు ముస్లిం మతపెద్దలతో సమావేశమయ్యారు. ఫారంగి మహల్ ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా రెక్టర్, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డులో సీనియర్ సభ్యుడైన మౌలాని ఖాలిద్ రషీద్ ఫారంగిమహలి రవిశంకర్‌ను కలుసుకున్న వారిలో ఉన్నారు. ఈ వివాద పరిష్కారం ఇప్పటికే ఆలస్యమైందని, త్వరలోనే దీనికి ముగింపు పలకాలని కోరుకుంటున్నట్లు రవిశంకర్ తెలిపారు. -
అక్రమార్కులపై ఉక్కుపాదం
రాజమహేంద్రవరం క్రైం: ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టేందుకు ప్రయత్నించే అక్రమార్కుల నుంచి వాటిని రాబట్టేందుకు చర్యలు తీసుకున్నామని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ రీజనల్ ఆఫీసర్ టి.రాంప్రసాద్ వెల్లడించారు. ఏపీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అవినీతి వారోత్సవాలలో భాగంగా శని వారం రాజమహేంద్రవరం, తిలక్ రోడ్డులోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అక్రమార్కుల నుంచి రూ.346.56 కోట్లను రాబట్టేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై నివేదికలు ఎఫ్‌సీఐ, ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ బియ్యం, ధాన్యం, కోనుగోలు పై చెల్లించాల్సిన అగ్రికల్చరల్ మార్కెట్ ఫీజు (ఎఎంఎఫ్) ఆర్డీ సెస్, వృత్తి పన్ను, వ్యాట్ ఎగవేతన గ్రీన్ టాక్స్ మోటారు వెహికిల్స్ టాక్స్ ఇతర వ్యాపార సంస్థలు ఎగవేసిన పన్నుల కింద రూ 186.56 కోట్లు మొత్తం గుర్తించి ఆ మొత్తం వసూలు నిమిత్తం ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో.. జిల్లాలోని ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలపై ఆకస్మిక తనిఖీలు చేసి రూ 4,34,672 విలువ చేసే పీడీఎస్బియ్యం రూ.1,25,941 విలువ చేసిన బియ్యం, ఇతర ఉత్పత్తులు రూ.15,12,071 ఎల్పీజీ ఆయిల్, కిరోసిన్, ఇతర సరుకులు రూ.45,65,306 పప్పులు, నూనెలు, నిత్యావసర వస్తువులు మొత్తం కలిపి రూ.2.13 కోట్ల వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నా రు. ల్యాండ్ మాఫియాపై.. కాకినాడ రూరల్ మండలం రమణయ్య పేట పంచాయితీ పరిధిలో 30 ఏళ్లుగా అభివృద్ధి చేసిన భూముల లే అవుట్లపై విచారణ చేయగా సుమారు 68 లేఅవుట్లలో గుర్తించామని తెలిపారు. సుమారు రూ.68.29 కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు. ఆక్వా సాగులో అవకతవకలు తూర్పు గోదావరి జిల్లాలో అక్వా సాగుపై విచారణ చేయగా సుమారు 22,890 ఎకరాలలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్వా సాగు జరుగుతున్నట్లు, మిగిలిన 16,126 ఎరాలలో అక్వా రైతులు అధిక శాతం ప్రాథమిక అనుమతులు పొంది సాగు చేస్తున్నట్టు గుర్తించామన్నారు. సహజ వనరులపై దోపిడీపై.. కోరంగి మడ అడవుల సమీపంలో నిర్మించిన రోప్‌వే, బ్రిడ్జిల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, గుర్తించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. వంతాడ పరిసరాలలో లేటరైట్ గనుల నిర్వహణలో జరిగిన అక్రమాలను గుర్తించి నిబంధనలకు విరుద్ధంగా రిజర్వ్ ఫారెస్ట్‌లో రోడ్లు వేయడం, రిజర్వ్ ఫారెస్ట్ లో తవ్వకాలు సాగించిన మినరల్ కంపెనీల నుంచి రికవరీకి, బాధ్యులపై చర్యలకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. గోదావరి నది నుంచి ఎత్తిపోతల ద్వారా 2016 రబీలో చేపట్టిన కార్యక్రమాలలో లోపాలు గుర్తించి రూ.16 కోట్లు రికవరీ, సంబంధిత అధికారులపై చర్యలకు నివేదిక ఇచ్చామన్నారు. ఈ తనిఖీలలో ప్రభుత్వ ఆదాయానికి జరిగిన నష్టాన్ని గుర్తించి దాడులు నిర్వహించడంలో, నివేదికలు తయారు చేయడంలో బదిలీపై వెళ్లిన విజిలెన్స్ డీఎస్పీ పీఆర్ రాజేంద్ర కుమార్, సీఐలు, ఎస్వీ భాస్కరరావు, వై.సత్యకిషోర్, టి.రామ్మోహన్ రెడ్డి, బి.సాయిరమేష్, జి. శ్రీనివాస్, జె.భార్గవ్ మహేష్, పీడీ రత్నకుమార్, కుమార్ పాల్గొన్నారని తెలిపారు. -
పేరుకే పెద్దాస్పత్రి
చీరాల ఏరియా వైద్యశాల పేరుకు మాత్రమే పెద్దాస్పత్రి. సేవలు అందించే విషయంలో మాత్రం చిన్నాస్పత్రిగా ఉంది. 100 పడకలు ఉన్నా వైద్యం చేసేందుకు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర సేవలకు కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటూరు లేదా ఒంగోలు వెళ్లక తప్పడం లేదు. చీరాల ఏరియా వైద్యశాలలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, వైద్యశాల స్థితిగతులపై ప్రత్యేక కథనం. చీరాల రూరల్: చీరాల ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్మారక 100 పడకల ఆస్పత్రి జిల్లాలోనే రెండో పెద్దది. అన్ని రకాల వైద్య సేవలు అందించడంతో పాటు ప్రత్యేకంగా 25 పడకలతో సీమాంక్ సెంటర్ (తల్లి బిడ్డల ప్రసూతి వార్డు) కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వీటితో పాటు హెచ్ఐవీ బాధితుల కోసం (ఏఆర్టీ సెంటర్), రక్త పరీక్షల కోసం మెడాల్ ల్యాబ్, కిడ్నీ వ్యాధి బాధితుల కోసం డయాలసిస్ సెంటర్, శరీరంలో ఎలాంటి వ్యాధి ఉన్నా ఇట్టే పసిగట్టే సీటీ స్కాన్ కూడా ఏర్పాటు చేశారు. రోజూ 250 నుంచి 350 మంది వరకు రోగులు వచ్చి చికిత్స చేయించుకుంటారు. చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాలతో పాటు గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన రోగులు కూడా ఇక్కడికి వస్తుంటారు. వేధిస్తున్న వైద్యుల కొరత వైద్యశాలను వైద్యుల కొరత చాలాకాలంగా వేధిస్తోంది. 15 మంది వైద్యులు పని చేయాల్సి ఉండగా 10 మంది లోపే ఉన్నారు. ఉన్న అరాకొర వైద్యులతోనే నెట్టుకొస్తున్నారు. జనరల్ మెడిసిన్, సివిల్ సర్జన్లు, నరాలు, ప్రత్యేక గుండె వైద్య నిపుణులు ఇక్కడికి అడుగు పెట్టడం లేదు. ఏడెనిమిదేళ్లుగా వైద్యులు లేక, అరకొర వైద్య సేవలతో ఏరియా వైద్యశాల కునారిల్లుతోంది. నలుగురు సివిల్ సర్జన్లు ఉండాల్సి ఉండగా ఒక్క స్పెషలిస్టు వైద్యుడు కూడా లేకపోవడం గమనార్హం. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు కూడా లేరు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు, జ్వర పీడితులతో వైద్యశాల మొత్తం రోగులతో కిక్కిరిసిపోతోంది. వైద్య సిబ్బంది, వైద్యులు రోగులను సరిగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా వ్యాధులకు సంబంధించిన సమాచారం, రక్త పరీక్షల రిపోర్టులు రాలేదనే సాకుతో రేపు రండి.. రెండు రోజులు ఆగండి.. అంటూ వైద్యులు చికిత్సలు అందించకుండా కాలయాపన చేస్తున్నారు. కొరవడిన పర్యవేక్షణ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కంటి వైద్య నిపుణుడు ప్రసన్నకుమార్ గతేడాది బదిలిపై వెళ్లారు. అప్పటి నుంచి ఆర్ఎంఓ డాక్టర్ తిరుపాలును ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా నియమించారు. ప్రస్తుతం ఆర్ఎంఓ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. రెండు నెలల కిందటే పదవీ విరమణ చేయాల్సిన ఆయనకు ప్రభుత్వం పెంచిన రెండేళ్ల సర్వీసు కలిసొచ్చింది. అతడు రెండేళ్ల పాటు ఆస్పత్రిలో ఉండాల్సిందే. ఆయనకు సిబ్బందిపై కమాండింగ్ లేక పోవడంతో వైద్యశాలలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తెరుచుకోని నూతన భవనాలు నాబార్డు నిధులు రూ.8.75 కోట్లతో ప్రస్తుతం ఉన్న ఆస్పత్రి ఆవరణలోనే పడమర వైపున ఖాళీ స్థలంలో నూతన భవనాలు నిర్మించారు. వాటిలో ఓపీ బ్లాకు, సీమాంక్ సెంటర్, క్యాజువాలిటీ బ్లాకులు, పోస్టుమార్టం గదులు అత్యాధునికంగా రూపొందించారు. వాటిలో ఉపయోగించే పరికరాలు కూడా పెద్ద సంఖ్యలో కొనుగోలు చేశారు. నెల కిందట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆమంచి, ఇతర ఉన్నతాధికారులు అంగరంగ వైభవంగా నూతన భవనాలు ప్రారంభించారు. అయితే ఇప్పటికీ వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. పారిశుద్ధ్య విభాగానికి సంబంధింంచి అనుమతులు రాకుండా హడావుడిగా ప్రారంభించారు. ఆస్పత్రి ముందు భాగంలో నాలుగు అడుగులపైగా పల్లపు ప్రాంతం ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు వర్షపు నీళ్లన్నీ అక్కడ చేరి చెరువులా మారిపోయింది. పల్లంగా ఉన్న ప్రాంతానికి మెరక తోలించి రూ.3 లక్షలతో గ్రీనరీని ఏర్పాటు చేస్తున్నట్లు రెండు నెలల క్రితమే ఎమ్మెల్యే ఆమంచి ప్రకటించారు. ఇంత వరకు అడుగు ముందుకు పడలేదు. నూతన భవనాలు ఎప్పుడు ప్రారంభిస్తారా.. అని రోగులు ఎదురు చూస్తున్నారు. అనుమతి వస్తే భవనాలు తెరుస్తాం: డాక్టర్ తిరుపాలు, ఇన్చార్జి సూపరింటెండెంట్ నూతన భవనాల పనులన్నీ పూర్తయ్యాయి. ఆస్పత్రి భవనాలు తాళాలు తీయాలంటే పారిశుద్ధ్య విభాగానికి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. భవనాలు నిర్మించే సమయంలోనే పారిశుద్ధ్య విభాగానికి సంబంధించి అనుమతుల కోసం ఉన్నతాధికారు కు లిఖిత పూర్వకంగా విన్నవించాం. వైద్య శాఖ కమిషనర్ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. -
బీమా ఉపకారానికి ఎసరు!
శ్రీకాకుళం పాతబస్టాండ్: స్వయంశక్తి సంఘాల్లో ఉండి, వివిధ రకాల బీమాల్లో చేరిన వారి పిల్లలకు అందజేసే ఉపకార వేతనాలకు ప్రభుత్వం ఎసరుపెట్టింది. ఉపకార వేతనాలు మహిళా స్వయంశక్తి సంఘంలో సభ్యులుగా ఉండి, వారు జనశ్రీ బీమా, అభయహస్తం, ఇతర బీమా చేయించుకున్నవారి పిల్లలకు వర్తించేది. దీని ప్రకారం ఆ విద్యార్థులు ప్రభుత్వ, ప్రవేటు సంస్థల్లో 9, 10, ఇంటర్, లేదా, ఐటీఐ, డిప్లామా వంటి కోర్సులు చుదువుతున్నవారికి ఒకరికి నాలుగు సంవత్సరాలు పాటు ఏడాదికి రూ.12 వందలు వంతున ఉపకార వేతనాలు అందజేసేవారు. అయితే ఈ ఏడాది ఈ ఉపకార వేతనాలు ఇప్పటి వరకు మంజూరు కాలేదు. తిలోదకాలు గత ఏడాది నుంచే జనశ్రీ బీమా యోజన, ఆమ్ఆద్మీ బీమా యోజన పథకాలకు ప్రభుత్వం తిలోదకాలిచిŠంది. ఇప్పటి వరకు సభ్యులు కట్టిన ప్రీమియం గాలిలో కలిసిపోయాయి. అప్పటి వరకు ఉన్న బీమా పథకాలను ఎత్తివేసిన సర్కార్ అన్నింటినీ కలిపి చంద్రన్న బీమా పథకంగా చంద్రబాబు సర్కార్ తీసుకొచ్చింది. అయితే ఈ పథకంలో ఇప్పటికీ చాలామంది చేరలేదు. దీంతో చంద్రన్న బీమా ప్రయోజనం కొంతమందికే పరిమితమైంది. జిల్లాలో పరిస్థితి.. ∙జిల్లాలో సుమారు 45 వేల మహిళా స్వయంశక్తి సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 4,75,000 మంది సభ్యులుగా ఉన్నారు. వీరిలో 18 నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న మహిళలు ఏదైనా ఒక బీమా పథకంలో చేరేవారు. అయితే ప్రస్తుతం అభయహస్తం మినహా మిగిలిన బీమా పథకాలను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో అందరికీ చంద్రన్న బీమాలోనే చేరాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పథకంలో చేరిన వారి పిల్లలు 9, 10, ఇంటర్ లేదా సమానమైన తరగతులు, డిప్లమా చేస్తున్న విద్యార్థులకు ఉపాకార వేతనం మంజూరు చేయాల్సిఉంది. చంద్రన్న బీమాలో చేరిన వారి పిల్లలకు ఉపకార వేతనాలు అందజేస్తామని ప్రభుత్వం చెబుతుంది. జిల్లాలో 2014–15 సంవత్సరంలో 66,081 మంది విద్యార్థులకు గాను రూ.7.92 కోట్లు, 2015–16 విద్యా సంవత్సరంలో 56,544 మందికి రూ. 6.78 కోట్లు ఉపకార వేతనాలు అందజేయగా.. ఈఏడాది ఇప్పటివరకు ఒక్కరికి కూడా రూపాయి అందజేయలేదు. జిల్లాలో గత ఏడాది (2016–17) విద్యా సంవత్సరానికి పల్స్ సర్వే ఆధారంగా చంద్రన్న బీమాలో చేరిన వారి పిల్లలు 9 నుంచి ఇంటర్ వరకు చదువుతున్నవారు 1,23,273 మంది ఉన్నారు. వీరికి మొత్తం రూ. 14.79 కోట్లు మంజూరు చేయాల్సిఉంది. వీరికి ప్రతి సంవత్సరంలాగే..ఈ ఏడాది అగస్టు 15వ తేదీనాటికి ఈ ఉపకార వేతనాలు మంజూరు చేయాల్సి ఉన్నా సర్కార్ స్పందించలేదు. దీనికితోడు గత ఏడాది నుంచే విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ సైతం నిలుపుదల చేశారు. కేలవం ఆధార్ ఆధారంగా.. చంద్రన్న బీమా ఉన్నవారి పిల్లలకు, ఆయా పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఆధార్ అనుసంధానం చేసిన ప్రాప్తికి ఈ ఉపకారవేతనాలు అందజేసేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఈ విధానంతో తీవ్ర జాప్యం నెలకొంది. ఇప్పటికీ ఆధార్‌ను బ్యాంకు ఖాతాలతో జమకాకుండా 5,206 మంది ఉన్నారు. వీరందరికీ బ్యాంకు ఖాతాలు, ఆధార్ అనుసంధానం చేస్తే తప్ప పిల్లలకు ఉపకార వేతనాలు అందే అవకాశం లేదు. వారంలో ఉపకార వేతనాలు జమచేస్తాం బీమా పథకం వర్తింపజేసే విద్యార్థుల ఉపకార వేతనాలు మరో వారం రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. ఈ పథకంలో మార్పులు రావడంతో ఆలస్యమైంది. ఇక నుంచి ఎంటువంటి దరఖాస్తు చేయకుండానే కళాశాల, పాఠశాలల యాజమాన్యాలు ఆధార్ అనుసంధానం చేస్తే ఆర్హులైన 9, 10, ఇంటర్, లేదా సమానమైన కోర్సులు చదువుతున్న వారికి ఉపకార వేతనం అందుతుంది. – సీతారామయ్య, డీఆర్డీఏ ఏసీ -
ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం
పాలకులు ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. ఆదాయం వచ్చే పనులపై చూపుతున్న శ్రద్ధ పారిశుద్ధ్యం మెరుగుపై కనబరచడం లేదు. ఫలితంగా సీజనల్ వ్యాధులు ప్రజలను చుట్టుముడుతున్నాయి. ఇంటికి ఇద్దరు, ముగ్గురు జ్వరాల బారిన పడుతున్నారు. అనంతపురం సిటీ: సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. విషజ్వరాలు, డెంగీ, అతిసార తదితర జబ్బులతో రోగులు విలవిలలాడుతున్నారు. జిల్లా కేంద్రం అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో రోజుకు రెండు వేల దాకా రోగులు ఇన్పేషెంట్లుగా వైద్యం చేయించుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్షపునీరు ఎక్కడికక్కడ నిలుస్తోంది. రోజుల తరబడి అలాగే నిల్వ ఉండటంతో మురికిగుంటలుగా తయారవుతున్నాయి. మరోవైపు డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం లేదు. ఏ వీధికెళ్లినా చెత్తదిబ్బలు కనిపిస్తూనే ఉన్నాయి. అపరిశుభ్రత కారణంగా దోమల బెడద అధికమైంది. పగలంతా ఈగలు, రాత్రి అయితే దోమల మోతతో ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. గ్రామకార్యదర్శుల కొరత జిల్లాలో 1003 పంచాయతీలను 572 క్లస్టర్లుగా విభజించారు. 330 మంది గ్రామ కార్యదర్శులు ఉన్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరో 98 మంది కార్యదర్శులు ఉన్నారు. 575 మంది గ్రామ కార్యదర్శులను నియమించాల్సి ఉండగా ప్రభుత్వం ఇంత వరకు పట్టించుకోలేదు. గ్రామ కార్యదర్శుల కొరత కారణంగా ఉన్న వారు అదనపు పనిభారంతో ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్యంపై చిన్నచూపు గ్రామపంచాయతీల ఆదాయంలో 30 శాతం పారిశుద్ధ్య పనులకు వెచ్చించాలి. డ్రెయినేజీలో పూడికతీత, చెత్తదిబ్బల తొలగింపు, మురికికుంటల పూడ్చివేతతోపాటు దోమల నివారణకు గంబూషియా చేపలను వదిలి, వేస్ట్ ఆయిల్, ఇతర రసాయనాలు చల్లి, ఫాగింగ్ తదితర కార్యక్రమాలు చేపట్టాలి. అయితే జిల్లాలో అత్యధిక గ్రామాల్లో ఈ పనులేవీ జరగడం లేదు. ఆదాయం తెచ్చి పెట్టే సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలు, వీధిలైట్ల ఏర్పాటు పనులు తప్ప పారిశుద్ధ్యాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనికితోడు పదేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేసిన పారిశుద్ధ్య కార్మికుల స్థానంలో కొత్త వారిని నియమించలేదు. 26 మేజర్‌పంచాయతీల్లో కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారు. మైనర్ పంచాయతీల్లో ఆ ఊసే లేదు. దీంతో గ్రామాల్లో ఎక్కడా చూసినా అపరిశుభ్రత తాండవిస్తోంది. కనీసం దోమలు నివారించేందుకు, దుర్వాసనలు రాకుండా ఉండేందుకు వాడే బ్లీచింగ్ పౌడర్, సున్నం కొనుగోలు చేయడంలో కూడా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. మెరుగైన సేవలందిస్తున్నాం వర్షాల కారణంగా పరిస్థితి మొదట దయనీయంగా ఉన్నా.. కలెక్టర్ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య చర్యలు చేపట్టి మెరుగైన సేవలందించాం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ సమస్యను అధిగమించడానికి ఎంపీడీఓలు, విస్తరణాధికారులతో పాటు అన్ని శాఖల అధికారులూ సహకరించారు. ఇక కార్యదర్శుల కొరత విషయం ఈనాటిది కాదు...చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి గ్రామాలను చక్కదిద్దుతాం. – సుధాకర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి -
హైస్పీడ్ రైలుకు ‘డోక్లామ్’ సెగ
న్యూఢిల్లీ: డోక్లామ్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో చేపట్టిన మౌలిక ప్రాజెక్టులను చైనా నిర్లక్ష్యం చేస్తోందా? అంటే భారత రైల్వే వర్గాలు అవుననే జవాబిస్తున్నాయి. దాదాపు 492 కి.మీ పొడవున్న చెన్నై–బెంగళూరు–మైసూరు హైస్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం పూర్తిచేసి ఏడాది అయినప్పటికీ.. చైనా రైల్వే పనుల్లో ఎలాంటి పురోగతి చూపలేదని అధికారులు తెలిపారు. ఇందుకు భారత్–చైనాల మధ్య డోక్లామ్‌లో తలెత్తిన ఉద్రిక్తతే కారణమై ఉండొచ్చని రైల్వే శాఖ మొబిలిటి డైరెక్టరేట్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ‘చైనా రైల్వే ఎరియువన్ ఇంజనీరింగ్ గ్రూప్ కంపెనీ లిమిటెడ్(సీఆర్‌ఈఈసీ) 2016 నవంబర్‌లో నివేదిక సమర్పించిన అనంతరం రైల్వే బోర్డు అధికారులతో నేరుగా సమావేశం అవుతామని విజ్ఞప్తి చేసింది. ఆ తరువాత వారివైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ విషయమై సీఆర్‌ఈఈసీ స్పందన కోసం గత 6 నెలలుగా ఈ–మెయిల్స్ పంపిస్తూనే ఉన్నాం. చివరికి ఇక్కడి చైనా ఎంబసీ ద్వారా కూడా ప్రయత్నించాం. కానీ వారి నుంచి ఎలాంటి జవాబు రాలేదు’ అని ఓ రైల్వే ఉన్నతాధికారి తెలిపారు. కేవలం హైస్పీడ్ కారిడార్ మాత్రమే కాకుండా పలు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి చైనా రైల్వే ఆసక్తి చూపినప్పటికీ..డోక్లామ్ ఘటనతో వాటన్నింటిపై నీలినీడలు కమ్ముకున్నాయన్నారు. దేశవ్యాప్తంగా రైళ్ల వేగాన్ని ప్రస్తుతమున్న 80 కి.మీ/గంట నుంచి 160 కి.మీ/గంటకు పెంచేందుకు వీలుగా చెన్నై–బెంగళూరు–మైసూరు వంటి 9 హైస్పీడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. -
చచ్చినా.. చావే
వెంకటగిరి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో శవపరీక్షలంటే సమీప గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. పుట్టెడు దుఃఖంతో శవాలను శవపరీక్షలకు తీసుకొచ్చే బంధువులను ఆస్పత్రి వైద్యులు తమ వ్యవహారశైలితో మరింతగా కుంగిదీస్తున్నారు. గురువారం బాలయపల్లి మండలం భైరవరం గ్రామానికి చెందిన అల్లం శంకరమ్మ (35) విద్యుత్‌షాక్‌తో మృతి చెందగా, బంధువులు శవ పరీక్షల నిమిత్తం అదే రోజు సాయంత్రం ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే చీకటి పడిపోయిందని శుక్రవారం శవపరీక్షలు చేస్తామని వైద్యులు చెప్పడంతో చేసేది లేక పడిగాపులు పడ్డారు. అయితే శుక్రవారం శంకరమ్మ శవపరీక్షల ప్రక్రియలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం శవపరీక్ష చేస్తానని చెప్పిన వైద్యుడు శ్రీనివాస్ జాప్యం చేశాడు. చివరకు 10.30 గంటల సమయంలో ఆస్పత్రికే చెందిన మరో వైద్యుడు జిలానీబాషాకు ఆ విధులను అప్పగిం చాడు. ఆయన శవపరీక్ష చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో అడ్డుకుని ఓపీ రోగులను పరీక్షించిన అనంతరమే వెళ్లాలని సూచించాడు. దీంతో చేసేది లేక వైద్యుడు జిలానీబాషా రోగులను పరీక్షించిన అనంతరం శంకరమ్మ మృతదేహం వద్దకు వెళ్లాడు. మృతదేహాన్ని పరిశీలించి పలుచోట్ల గాయాలు ఉన్నాయిని, నెల్లూరుకు చెందిన ప్రత్యేక వైద్యనిపుణులతో శవపరీక్షలు చేయించాలని బంధువులకు సూచించి వెళ్లిపోయాడు. కాగా డాక్టర్ శ్రీనివాస్ నగదు డిమాండ్ చేశాడని, తాము ఇచ్చుకోలేని పేదలమని చెప్పడంతో శవపరీక్ష చేయడంలో జాప్యం చేస్తున్నాడని మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దూషణలకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటల్లో భైరవరం గ్రామానికి చెందిన తిరుపాలయ్యకు చేతివేళ్లు రెండు విరిగిపోయారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాస్, ఎస్సై కొండపనాయుడు వచ్చి పరిస్థితిని అదుపుచేశారు. ఎమ్మెల్యే రామకృష్ణకు పరాభవం వైద్యుల వ్యవహార శైలిని బంధువులు ఫోన్లో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన డాక్టర్ శ్రీనివాస్‌కు ఫోన్ ఇవ్వాలని సూచించగా, బంధువులు అందించే ప్రయత్నం చేశారు. అయితే వైద్యుడు ఫోన్ స్వీకరించలేదు. పలువురు ఫోన్ల ద్వారా డాక్టర్ శ్రీనివాస్‌తో మాట్లాడాలని ఎమ్మెల్యే విఫలయత్నం చేశారు. చేసేది లేక వ్యవహారాన్ని జిల్లా వైద్యాధికారి వరసుందరం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వైద్యుడు శ్రీనివాస్‌తో చర్చించి వైద్యుల బృందం ఆధ్వర్యంలో శవపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో ఎట్టకేలకు శంకరమ్మ మృతదేహానికి శవపరీక్షలు పూర్తిచేశారు. -
వైద్యుల నిర్లక్ష్యం..ఆటోలో ప్రసవం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భవతి ఆటోలోనే ప్రసవించింది. వివరాలు..కొత్తగూడెం జిల్లాకేంద్రం మేదరబస్తీకి చెందిన పూజ డెలివరీ నిమిత్తం జిల్లా ఆసుపత్రికి శుక్రవారం ఉదయం పదిన్నర సమయంలో వచ్చింది. ఆసుపత్రికి వచ్చి అర్ధ గంట అయినా డాక్టర్లు పట్టించుకోకపోవడంతో నొప్పులు ఎక్కువై ఆటోలోనే ప్రసవించింది. తల్లీ, బిడ్డా ఆరోగ్యంగానే ఉన్నారు. మీడియా అక్కడికి రావడంతో హడావిడిగా వైద్య సిబ్బంది బాలింతను చేతులతోనే ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. బాలింతను తీసుకువెళ్లడానికి కనీసం ఓ స్ట్రెచర్ లేకపోవడం గమనార్హం. వైద్యుల నిర్లక్ష్యం పట్ల గర్భిణీ బంధువులు విస్మయం వ్యక్తం చేశారు. పూజకు ఇది రెండో కాన్పు. రెండో కాన్పులో మగబిడ్డ జన్మించాడు. -
ఉనికి కోల్పోయిన ‘తనిఖీ’
ప్రభుత్వ పాఠశాలల్లో లోపిస్తున్న జవాబుదారీ తనం పని చేయని ఎస్ఎంసీ కమిటీలు జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు అవగాహన లేక పట్టుకోల్పోతున్న కమిటీలు ప్రజల భాగస్వామ్యం లేకుండా ఎందులోనూ పురోగతి ఉండదు. సమష్టి కృషితోనే ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఇందులో భాగంగానే పాఠశాల యాజమాన్య కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ కమిటీలను ఎంపిక చేశారు. కమిటీలను సమన్వయం చేసుకుంటూ సర్వశిక్ష అభియాన్ ద్వారా ఆయా పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా పాఠశాలల పనితీరు, అభివృద్ధి, విద్యాభివృద్ధి తదితర అంశాలకు సంబంధించి తరచూ ఆయా పాఠశాలలను కమిటీలు తనిఖీలు చేయాల్సి అవసరం ఎంతైనా ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఏర్పాటైన పాఠశాల కమిటీలు నామమాత్రంగానే మిగిలిపోతున్నాయి. - గుమ్మఘట్ట: జిల్లాలో 2,650 ప్రాథమిక పాఠశాలల్లో 1.60 లక్షల మంది, 600 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 70 వేల మంది, 610 ఉన్నత పాఠశాలల్లో 76 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరి ఉజ్వల భవిష్యత్తు ఆయా పాఠశాలల తనిఖీలపైనే ఆధారపడి ఉంది. తనిఖీలు ఎలా ఉండాలంటే.. పాఠశాల అభివృద్ధికి ఎలాంటి పథకాలు ఉన్నాయి? వాటి కోసం ఎంత ఖర్చు పెట్టారు? వంటి విషయాలపై తనిఖీదారులకు ముందస్తుగానే అవగాహన ఉండాలి. అదే సమయంలో సిబ్బంది నియామకం, వారి పనితీరు, విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన, తరగతి గదుల నిర్వహణ, హాజరు శాతం పెంపు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం తదితర విషయాలకు సంబంధించి సమగ్ర సమాచారం ఉండాలి. వీటిని ఎప్పటికప్పుడు తనిఖీల ద్వారా పర్యవేక్షిస్తూ ఉండాలి. ప్రతి నెలలో మూడో శనివారం విధిగా సమావేశం నిర్వహించాలి. పాఠశాలల అభివృద్దికి సంభందించి చర్చ జరగాలి. అందుకు కావాల్సిన నిధుల కోసం నివేదికలు సిద్దం చేయాలి. ఇలాంటివి జరగడమే లేదు. శిక్షణనే మరిచారు.. ఎస్ఎంసీలను నియమించిన ప్రభుత్వం.. అందులోని సభ్యులకు సమగ్ర శిక్షణ ఇవ్వడం విస్మరించింది. ఎస్‌ఎంసీల బాధ్యతలు తదితరాలపై నేటికీ సభ్యులకు పూర్తిస్థాయిలో అవగాహన లేదు. స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో జరిపామని రికార్డులు చూపారే తప్పా ప్రాథమికంగా సభ్యులకు వారి బాధ్యతలపై అవగాహన లేదు. జిల్లాలో పరిస్థితి ఇదీ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో యాజమాన్య కమిటీలు ఏర్పాటయ్యాయి. ప్రతి తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లి,దండ్రులు, సంరక్షులను సభ్యులుగా ఎన్నుకుంటారు. జిల్లా వ్యాప్తంగా 3,860 పాఠశాలల్లో యాజమాన్య కమిటీలు ఏర్పాటయ్యాయి. గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీపీ, మున్సిపల్ చైర్మెన్, మేయర్ తమ విచక్షణ మేరకు పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఇలాంటి సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. బహుళ ప్రయోజనాలు... ఎస్‌ఎంసీల పనితీరు మెరుగుపడితే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందనే అవగాహన ప్రజలు, తల్లి,దండ్రుల్లో పెరుగుతుంది. ప్రధానోపాధ్యాయులలో జవాబుదారీతనం పెరుగుతుంది. ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడుతుంది. ఇందులో భాగంగానే రెండ్రోజలు క్రితం సనప ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఏజెన్సీ గొడవ కారణంగా మధ్యాహ్న భోజనం సక్రమంగా అందని విషయంపై కమిటీ పర్యవేక్షణలో వెలుగు చూసింది. దీంతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మెమో జారీ చేసి పథకాన్ని పునరుద్ధరించారు. అలాగే సనప్ప జెడ్పీ ఉన్నత పాఠశాలలోనూ నెలకొన్న సమస్యలపై ప్రధానోపాధ్యాయుడికి మెమో ఇప్పించి, పరిష్కారానికి కమిటీ చొరవ చూపింది. పాఠశాల యాజమాన్య కమిటీలు చురుగ్గా పాల్గొనాలి పాఠశాల యాజమాన్య కమిటీలు వారి హక్కులను ముందుగా తెలుసుకోవాలి. చురుగ్గా పాల్గొని లోపాలను గుర్తించి సరిచేయాలి. స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలో అవగాహన కూడా కల్పించాం. ఎస్ఎంసీలకు తోడు మండల విద్యాధికారుల పర్యవేక్షణ పెంచితే ఉపాధ్యాయులు వేళకు రావడంతో పాటు నాణ్యమైన విద్య అందుతుంది. ఎస్ఎంసీలకు వారి విధులపై అవహన పెంచేలా సదస్సులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతాం. – లక్ష్మీనారాయణ, జిల్లా విద్యాధికారి, అనంతపురం -
నిండా నిర్లక్ష్యం!
– ‘యూ డైస్’ పని చేయించుకున్నారు.. - రెమ్యూనరేషన్ ఇవ్వకుండా సతాయిస్తున్నారు – ‘ నిధులు మంజూరు చేయని ఎస్ఎస్ఏ – ఏడాదిగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు అనంతపురం ఎడ్యుకేషన్: అవసరానికి వాడుకుని వదిలేయడమంటే ఇదేనేమో. సరిగ్గా ఏడాది కిందట 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టం (యూ డైస్) వివరాలను ఆన్లైన్లో నమోదు చేసిన ఉద్యోగులకు నేటికీ రెమ్యూనరేషన్ అందలేదు. పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించి అసలు కథ ఇలా.. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, పని చేస్తున్న ఉపాధ్యాయులు, పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులు తదితర వివరాలను ఏటా యూడైస్‌లో ఆన్లైన్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగానే ప్రభుత్వం విద్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుంది. యూడైస్‌కు ఇంతటి ప్రాధాన్యత ఉంటుంది. వివరాల నమోదులో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా చేసినా పిల్లలకు అన్యాయం జరుగుతుంది. అందుకే జిల్లా అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. ఏడాది కిందట పని చేయించుకున్న సిబ్బందికి ఇప్పటిదాకా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు. ఎమ్మార్సీల్లో పని చేస్తున్న ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు చాలా కష్టపడ్డారు. రేయంతా కాచుకుని నమోదు యూడైస్ నమోదు సమయంలో రాష్ట్రమంతా ఒకేమారు ఆన్లైన్ ఓపెన్ కావడంతో సర్వర్ డౌన్ అవుతుంది. దీంతో సిబ్బంది అర్ధరాత్రి, తెల్లవారుజామున వరకు మేలుకుని వివరాలు నమోదు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. జిల్లాలో 5,114 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వివరాలను గతేడాది యూడైస్‌లో నమోదు చేశారు. ఆన్లైన్ చేసినందుకు ఒక్కో స్కూల్‌కు రూ.80 కేటాయించారు. ఈలెక్కన మొత్తం రూ.4,09,120 జిల్లాకు రావాల్సి ఉంది. బడ్జెట్ రిలీజ్ అయినా.. వాస్తవానికి యూడైస్ వివరాలు నమోదు చేసినందుకు ప్రభుత్వం బడ్జెట్ కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ బడ్జెట్‌ను ఇతరవాటికి ఖర్చు చేసినట్లు తెలిసింది. బిల్లు డ్రా చేయకపోవడం వెనుక ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఎస్ఎస్ఏలో పని చేస్తున్న ఓ ఉద్యోగి ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల పట్ల కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇందులో భాగంగానే బడ్జెట్ అందుబాటులో ఉన్నా..సంబంధిత ఫైలు పెట్టకుండా ఆ ఉద్యోగి చక్రం తిప్పాడు. ఒకానొక సందర్భంలో ఫైలు కనిపించకుండా చేశాడు. రెమ్యూనరేషన్ కోసం ఉద్యోగులు పలుమార్లు అడిగినా...అదిగో ఇదిగో అంటూ అధికారులు దాట వేస్తూ వచ్చారు. అడిగి అడిగి చివరకు వదిలేశామని కొందరు కంప్యూటర్ ఆపరేటర్లు వాపోతున్నారు. సదరు ఉద్యోగి నిర్లక్ష్యం వల్లే తమకు రెమ్యూనరేషన్ రాకుండా అగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రెమ్యూనరేషన్ మంజూరయ్యేలా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్ఎస్ఏ పీఓ సుబ్రహ్మణ్యం ఏమంటున్నారంటే... నేను కొత్తగా వచ్చాను. గత ఏడాది చేపట్టిన యూడైస్ కార్యక్రమానికి సంబంధించి నాకు తెలీదు. ఆ ఫైలు గురించి విచారించి చర్యలు తీసుకుంటా. -
మార్గ‘దర్శనం’కరువు!
- పొలంబాట పట్టని అధికారులు - వ్యవసాయశాఖ, శాస్త్రవేత్తల మధ్య పెరిగిన అంతరం - కనిపించని శాస్త్రవేత్తల జాడ - రైతులకు ఖరీఫ్సాగు, ప్రత్యామ్నాయంపై సలహాలు కరువు - సీజన్లో సూచనలు ఇచ్చేవారులేక రైతుల అయోమయం అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్ సీజన్ మొదలైంది..సాగు సమయం మొచ్చింది.. రైతన్నకు దిశానిర్దేశనం చేయాల్సిన అధికారులు ‘పొలంబాట’ మరిచారు. వ్యవసాయశాఖ, శాస్త్రవేత్తల మధ్య అంతరం పెరిగింది. ఎక్కడా శాస్త్రవేత్తల దర్శనం లేదు. ఏ నేలలో ఏ పంట సాగు చేయాలో..ఏ మందు వాడాలో తెలియక రైతన్నలు అయోమయంలో ఉన్నారు. = జిల్లాకు కే–6 రకం వేరుశనగ అనువైందని వ్యవసాయశాఖ అధికారులు చెప్తుంటే.. రాయితీ రైతులందరికీ కే–6 రకం పంపిణీ చేశారు. కాదు... కాదు కే–9, ధరణి రకం బాగుంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వారిచ్చే సిఫార్సుల్లో కే–6 రకం లేదు. = ట్రైకోడెర్మావిరిడీతో విత్తనశుద్ధి చేసుకోవాలని అధికారులు సిఫార్సు చేస్తారు.. విత్తనంతో పాటు పెద్ద ఎత్తున విరిడీ పౌడరు పంపిణీ చేశారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం మాంకోజెబ్, ఇమిడాక్లోప్రిడ్, టిబుకొనజోల్ లాంటి మందులతో విత్తనశుద్ధి పాటించాలని వల్లె వేస్తారు. ఈ రెండు అంశాలను పరిశీలిస్తే వ్యవసాయశాఖ, శాస్త్రవేత్తల మధ్య సమన్వయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియక రైతులు పలుమార్లు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రైతులకు చేసే సూచనలు, సిఫార్సులు, సాంకేతిక సలహాలు, ఇతరత్రా సమగ్ర యాజమాన్య పద్ధతుల విషయంలో పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తుండం వల్ల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఖరీఫ్ కష్టాలతో సతమతం : కరువు పరిస్థితులకు ఆలవాలమైన ‘అనంత’ రైతులకు దిశా నిర్ధేశనం చేయాల్సిన వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తలోదారిలో వెళ్తుండడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా జిల్లాలో 9 లక్షల హెక్టార్లకు పైగా మెట్ట ప్రాంతం ఉండటం వల్ల వర్షం వస్తే కాని ఖరీఫ్ పంటలు సాగు చేయలేని దయనీయ పరిస్థితి.అయితే వర్షాలు కురవకపోవడం, కురిసినా అదనులో పడకపోవడం వల్ల ఏటా రైతులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు బాగా పడినా నాసిరకం విత్తనం లేదా చీడపీడలు ఆశించడం వల్ల పలుమార్లు పంటలు దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న 63 మండలాల్లోనూ ఒకటే పరిస్థితి. ఓ వైపు ప్రకృతి కన్నెర చేస్తుండగా మరోవైపు పాలకుల కరుణ లేకపోవడంతో రైతుల కష్టాలు వర్ణనాతీతం. ఏటా పెట్టుబడుల రూపంలోనే రూ.వందల కోట్లు కోల్పోతుండగా దిగుబడుల రూపంలో రూ.వేల కోట్ల నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ఈ సారి కూడా పరిస్థితి మరింత ఘోరంగా ఉండటంతో రైతు ఇంట ఆందోళన వ్యక్తమవుతోంది. తలోదారిలో అధికారులు, శాస్త్రవేత్తలు.. : భౌడం, ప్రధాన పంటకాలం ముగిసిన తర్వాత ప్రత్యామ్నాయ పంటలు ఏవి అనుకూలం, ఎప్పుడు వేసుకోవాలని చెప్పాల్సిన శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ఇటీవల కాలంలో కలిసి పనిచేయలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇటీవల కాలంలో కొందరు రైతులు జూన్ మొదటి వారంలోనే వేరుశనగ వేస్తున్నారు. మరికొందరు జూలై, ఆగస్టులోనూ వేస్తున్నారు. అంటే వేరుశనగ పంట కాలంలో చాలా అంతరం కనిపిస్తోంది. మిగతా పంటల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పొలంబాట మరచిపోయిన అధికారులు : ఖరీఫ్ ప్రారంభానికి నెల నెలన్నర ముందే అధికారులు, శాస్త్రవేత్తలు నాలుగైదు సార్లు సమావేశమై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి రైతులను సరైన దిశలో నడిపించాల్సి ఉన్నా అది జరగడం లేదు.ఈ ఖరీఫ్‌లో ఇంతవరకు ఒకసారి కూడా సమావేశమై కలిసి చర్చించని పరిస్థితి.అధికారులు పొలం బాట పట్టే పరిస్థితి లేదు.శాస్త్రవేత్తలు కూడా గ్రామాలకు వెళ్లి పంట స్థితిగతులు అంచనా వేసి సరైన సూచనలు, సిఫార్సులు చేసే పరిస్థితి కనిపించలేదు.ఒకటి ఆరా మినహా ఎవ్వరూ రైతులకు ఉపయోగపడే రీతిలో మార్గదర్శకం చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఏరువాక కేంద్రం (డాట్‌సెంటర్), కదిరి, రేకులకుంటలో వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఏఆర్ఎస్), రెడ్డిపల్లి, కళ్యాణదుర్గంలో కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే) ఉన్నాయి. అందులో అనుభవం కలిగిన సీనియర్ శాస్త్రవేత్తలు, వివిధ రంగాల్లో నిపుణలు, టెక్నికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అధికారుల విషయానికి వచ్చినా జేడీఏ నుంచి డీడీఏలు, ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు, ఎంపీఈవోలు...ఇలా పెద్ద సంఖ్యలో ఉన్నారు.కానీ..ఎక్కడా అధికారులు, శాస్త్రవేత్తలు కలిసి రైతులకు సూచనలు, సిఫారసులు చేసే పరిస్థితి లేకపోవడంతో ‘అనంత’ వ్యవసాయం తిరోగమన దిశలో పయనిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
గాంధీలో మారని సిబ్బంది తీరు
-
నీరసించిన ‘నాల్గో సింహాలు’
- అదుపు తప్పుతున్న శాంతిభద్రతలు - రెచ్చిపోతున్న అధికార పార్టీ నేతలు - ఖాకీలనూ ఖాతరు చేయని వైనం - దూషించినా, దాడి చేసినా ఏమీ అనలేని పరిస్థితి - మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్లు తలాడిస్తున్న ‘పోలీస్ పెద్దలు’ అసాంఘిక, చట్టవ్యతిరేక శక్తులపై పంజా విసరాల్సిన ‘నాల్గో సింహాలు’ నీరసించిపోయాయి. కొన్ని గుంట నక్కలు చెప్పినట్లు తలాడిస్తున్నాయి. అయినప్పటికీ ‘వనరాజు’ మౌనంగానే ఉంటున్నారు. ‘వ్యవస్థను గాడిలో పెట్టాను. అది అలా నడుస్తూ ఉంటుంద’ని అనుకుంటున్నట్లున్నారు. ‘వనరాజు’ నెమ్మదించడంతో ‘కొన్ని సింహాలు’ వేటాడడం మర్చిపోయాయి. కొందరు ఆడించినట్లు ఆడుతున్నాయి. (సాక్షి ప్రతినిధి, అనంతపురం) ఇటీవల అనంతపురం బైపాస్‌రోడ్డు పక్కన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి టెంటు వేసి విపక్ష నేతను తీవ్రపదజాలంతో దూషించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనే, అదీ డీఎస్పీ మల్లికార్జున వర్మ ఎదుటే టెంటు వేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి డీఎస్పీ ముందే కారు దిగి అక్కడికి వచ్చారు. ఆయన ఎదుటే విపక్షనేతను దుర్భాషలాడారు. అయినప్పటికీ డీఎస్పీ ప్రేక్షకపాత్ర పోషించారు. ఎమ్మెల్యే అనుకున్న పని పూర్తి చేశాక ఆయన వద్దకెళ్లి ఇక వెళ్లిపోవాలంటూ వినయంగా కోరారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న తనను పోలీసులు అడ్డుకుంటారనే భయం కానీ, డీఎస్పీ పక్కనే ఉన్నారనే కనీస గౌరవం కానీ లేకుండా ఎమ్మెల్యే ప్రవర్తించినా చర్యలు తీసుకోలేదు. అలాగే శుక్రవారం పుట్టపర్తి ఎయిర్‌పోర్టులోకి తనను అనుమతించలేదంటూ మునిసిపల్ చైర్మన్ గంగన్న ఎయిర్‌పోర్టు ముందు బైఠాయించారు. సీఐ, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఉన్నప్పటికీ పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారు. ఆయనపైనా ఎలాంటి చర్యలూ లేవు. దీన్నిబట్టి పోలీసువ్యవస్థ ఎటు వెళుతోందో? పోలీసులపై నేతలకు ఎలాంటి అభిప్రాయం ఉందో ఉన్నతాధికారులు ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డిపైన, గంగన్నపైన కేసు నమోదు చేశామని చెప్పవచ్చు గానీ.. పోలీసులంటే వారికి ఏమాత్రమూ గౌరవం లేదనే విషయంపై అధికారులు దృష్టి సారించలేదు. ఈ రెండు ఘటనల్లోనూ పోలీసుశాఖ పరువు మంటగలిసిందనే కోణంలో వారు ఆలోచించి ఉంటే వారిద్దరిపైనా చర్యలు మరోలా ఉండేవి. స్వయంకృతాపరాధం! కొందరు పోలీసుల వ్యవహారశైలి కారణంగానే అధికారపార్టీ నేతలు రెచ్చిపోతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. పనితీరుతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారికి కోరుకున్న చోట పోస్టింగులు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో సీఐలు, ఎస్ఐలు కూడా వారికి మద్దతు పలికిన నేతలనే ‘సుప్రీం’లుగా భావిస్తూ.. డీఎస్పీలు, ఎస్పీతో తమకు పనిలేదనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇటీవల నియమితులైన గుంతకల్లు అర్బన్ సీఐ రాజాగౌడ్, గుత్తి సీఐ ప్రభాకర్గౌడ్లకు కూడా ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ సిఫార్సులతోనే అక్కడ పోస్టింగులు వచ్చినట్లు ఎమ్మెల్యే సన్నిహితులతో పాటు కొందరు పోలీసులు కూడా చెబుతున్నారు. ఇలా చాలాచోట్ల ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికి పోస్టింగులు ఇచ్చారు. దీంతో అధికారపార్టీ నేతలు ఏది చెబితే అక్కడి పోలీసులు అలా చేసే పరిస్థితి ఏర్పడింది. పాదయాత్ర వ్యవహారంలోనూ విమర్శలు శింగనమల నియోజకవర్గంలో ఇటీవల వైఎస్సార్సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి మేలుకొలుపు పాదయాత్ర చేశారు. దీనికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఎమ్మెల్సీ శమంతకమణి, ప్రభుత్వ విప్ యామినీబాల ఆ యాత్రను ఆపేయించాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. లైసెన్స్డ్ తుపాకీ మిస్‌ఫైర్ అయిన ఘటనను ఆసరాగా తీసుకుని పోలీసులు కూడా మేలుకొలుపును ఆపేందుకు యత్నించారు. మైకులు అమర్చుకునేందుకు, పల్లెల్లో ప్రజలతో మాట్లాడేందుకు అనుమతించలేదు. అధికార పార్టీ నేతలను సంతృప్తి పరిచేందుకే ఇలా చేశారని విపక్షనేతలు గార్లదిన్నె సభలో పోలీసులపై మండిపడ్డారు. గన్మెన్ల తొలగింపులోనూ ఇదే ధోరణి ప్రదర్శించారు. గతంలో జేసీ బ్రదర్స్ ఒత్తిడితో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి గన్మెన్లను తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే.. చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య తర్వాత తిరిగి ఇచ్చారు. మట్కా, పేకాటకు అండ తాడిపత్రిలో మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ ఎవరు నిర్వహిస్తున్నారో అక్కడి పోలీసులకు క్షుణ్ణంగా తెలుసని, పీఏబీఆర్ వద్ద పేకాట పరిస్థితీ అంతేనని, నిర్వాహుకులు, పోలీసుల మధ్య ఉన్న సత్సంబంధాలతోనే ఇవి యథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. స్టేషన్లకు వచ్చే సామాన్యులకు న్యాయం చేయడంలోనూ కొందరు పోలీసులు రాజకీయ నాయకులు చెప్పినట్లే వింటున్నారు. ఇద్దరు కన్నకూతుళ్లను తనకు దూరంగా తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తున్నారని 2015లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చివరి కూతురిని కూడా తనకు అప్పగించకుండా తండ్రి వద్దకే పంపారని ఆ తల్లి బోరున విలపిస్తోంది. ఓ కీలక రాజకీయ నాయకుడి అండతోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అనంతపురం, ధర్మవరం, పెనుకొండలో కొందరు ‘మిడిల్ బాస్’లు అంతా తామై నడిపిస్తున్నారు. పంచాయితీలు, సెటిల్మెంట్లు వీరివద్ద జోరుగా నడుస్తున్నట్లు సమాచారం. ఈ పంచాయితీల్లో కూడా అధికార పార్టీ నేతల సిఫార్సులకే పెద్దపీట వేస్తున్నారు. జిల్లాలో పోలీసు వ్యవస్థ సరిగా నడవడం లేదని, పోలీసుబాసు ఇప్పటికైనా ప్రక్షాళన దిశగా దృష్టి సారించకపోతే రాప్తాడు, రుద్రంపేట హత్యల తరహా ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పోలీసుస్టేషన్లలో అధికార పార్టీ నేతల సిఫార్సులు మినహా సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షగానే మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మొక్కలపై చెట్టంత నిర్లక్ష్యం
జిల్లాను హరితవనంగా మారుస్తామంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు తరచూ ప్రకటనలు చేస్తున్నారు. ఈమధ్య కాలంలో మొక్కల పెంపకం పేరుతో భారీఎత్తున నిధులు ఖర్చు చేశారు. రోడ్లకు ఇరువైపులా, అటవీప్రాంతాలు, పాఠశాలల ప్రాంగణాలు...ఇలా అవకాశమున్న అన్ని ప్రాంతాల్లోనూ మొక్కలు నాటుతున్నట్లు ప్రకటించారు. ఇకపై ఎటుచూసినా పచ్చదనమే కన్పిస్తుందని గొప్పలు చెప్పారు. వాస్తవానికి చాలా మొక్కలు నర్సరీల్లోనే ఎండిపోయాయి. నాటిన మొక్కల పరిస్థితీ అంతే. అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామం వద్దనున్న జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) నర్సరీలో మొక్కలు ఎండిన దృశ్యాలివీ. నీళ్లు లేకపోవడంతో వీటిని ఎండబెట్టాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ట్యాంకర్లతోనైనా సరఫరా చేసి సంరక్షించాలన్న స్పృహ వారికి లేకపోయింది. - జి.వీరేశ్, సాక్షి ఫొటోగ్రాఫర్ -
మితి మీరిన వేగం.. తీసింది ప్రాణం
తుక్కుగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం - డీసీఎంను ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు - ముగ్గురు స్నేహితులు మృతి.. ఒకరికి గాయాలు హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు మరోసారి నెత్తురోడింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ కారు డీసీఎంను ఢీకొట్టి పది మీటర్ల దూరం పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు స్నేహితులు మృత్యువాత పడగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వైజాగ్‌కు చెందిన రవితేజ(27), విజయవాడకు చెందిన సూర్యతేజ(27), నల్లగొండకు చెందిన రోహిత్(26), కరీంనగర్‌కు చెందిన కె.కిరణ్ కుమార్(27) ఖరగ్‌పూర్ ఐఐటీలో క్లాస్మేట్స్. ప్రస్తుతం రవితేజ వొరాకిల్‌లో, రోహిత్ అమెజాన్‌లో, సూర్యతేజ జిమోసీలో ఉద్యోగాలు చేస్తుండగా.. కిరణ్ ఉద్యోగా న్వేషణలో ఉన్నాడు. వీరు కొండాపూర్‌లో వేర్వేరుగా నివాసం ఉం టున్నారు. ఖమ్మం జిల్లాలో స్నేహితుడి వివాహం ఉండటంతో శుక్రవారం ఉదయం 6.30 గంటలకు నలుగురు స్నేహితులు సూర్యతేజకు చెందిన వెర్నా కారు(ఏపీ16బీబీ3888)లో బయల్దే రారు. కాగా, మహేశ్వరం నుంచి డీసీఎం వ్యాన్(ఏపీ29టీసీ0458)లో డ్రైవర్ దయానంద్ ఉదయం 7.30 గంటలకు తుక్కుగూడ ఎంట్రీ రూట్ నుంచి ఓ ఆర్ఆర్ౖò పైకి వచ్చాడు. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు డీసీఎంను కొనభాగంలో ఢీ కొట్టింది. దీంతో పూర్తిగా అదుపుతప్పిన కారు వేగంగా పది మీటర్ల దూరం పల్టీలు కొడుతూ వెళ్లి రెయిలింగ్‌ను ఢీ కొంది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఓఆర్ఆర్ పెట్రోల్ సిబ్బంది కారు వెనుక సీటులో ఉన్న కిరణ్, రోహిత్‌ను బయటకు తీసి.. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కారు నడుపుతున్న సూర్యతేజ, పక్కన కూర్చున్న రవితేజ ఘటనా స్థలంలోనే కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రోహిత్ కూడా మృతిచెందాడు. తీవ్ర గాయాలపాలైన కిరణ్ నాంపల్లి కేర్ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. పోస్టుమార్టం అనంతరం ముగ్గురి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. నలుగురు స్నేహితులు అవివాహితులే. నిన్నటి వరకు తమతో ఉన్న ముగ్గురు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఉస్మానియా మార్చురీకి చేరుకున్నారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మితిమీరిన వేగం.. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. -
నత్తేనయం !
నకిరేకల్ : అధికారుల నిర్లక్ష్యమో.. కాంట్రాక్టర్ల పరిహాసమో గానీ రెండేళ్లలో పూర్తికావాల్సిన పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలోని రహదారుల విస్తరణ పనులు నత్త కంటే మిన్నగా సాగుతున్నాయి. రోడ్డు విస్తరణ జరుగుతుందనడంతో ఆనందించిన ప్రజలు, ప్రయాణికులకు నిరాశే మిగులుతోంది. జిల్లాలోని కీలకమైన జాతీయ రహదారిగా మారనున్న నకిరేకల్ – నాగార్జునసాగర్ రోడ్డు పనులు ప్రారంభమై మూడేళ్లు గడుస్తోంది. అయినా.. నేటికీ సగమైనా పూర్తికాలేదు. నిత్యం వేల సంఖ్యలో ప్రజలు ఈ రహదారి మీదుగా జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగిస్తారు. అయితే..విస్తరణ పనుల్లో భాగంగా రహదారి మొత్తం తవ్వారు. అక్కడక్కడా కొంత మేరకు ఒక వైపు రోడ్డు నిర్మాణం చేసి మరోవైపు తవ్వడంతో ఎప్పుడు ఏ వాహనం గుంతలో పడుతుందోనని ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి. ఈ రహదారి మీదుగా ప్రయాణమంటేనే ప్రజలు బిక్కచచ్చిపోయే స్థితి. కానీ తప్పని పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సివస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డ పనులను పూర్తిచేయాలని పలువురు కోరుతున్నారు. భూసేకరణ జాప్యంతో పనుల నిలిపివేత ఈ రహదారి పనులు భూ సేకరణ జాప్యంతో పడకేశాయి. నకిరేకల్ నుంచి నాగార్జున సాగర్ వరకు జిల్లాలో దాదాపు 86 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి 565 నిర్మాణానికి 2014 మార్చి 13న జీవిఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ సంస్థకు ఈ విస్తరణ పనులను దక్కించుకుంది. 2016 మార్చి 11వ తేదిలోగా ఈ పనులను పూర్తి చేయాల్సి ఉంది. పనుల ప్రారంభించి మూడేళ్లు కావస్తున్నా ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా మారాయి. 100 శాతం పనులలో కేవలం 40శాతం మేర పనులు మాత్రమే పూర్తి చేశారు. ఇంకా 60 శాతం మేర నిర్మాణం పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ మార్గంలో ప్రస్తుతం నల్లగొండ నుంచి హాలియా వరకు రహదారి విస్తరణ పనులు పూర్తి కాగా అధికారుల పర్యవేక్షణ, భూ సేకరణ జాప్యంతో నకిరేకల్ నుంచి వయా తాటికల్ మీదుగా నల్లగొండ వరకు జరుగుతున్న రహదారి పనులు గతేడాది కాలంగా నిలిచిపోయాయి. 2013లో మంజూరు జిల్లా నుంచి ఇప్పటికే హైదరాబాద్ – విజయవాడ, హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారులు వెళ్తున్నాయి. 2013లో కేంద్ర ప్రభుత్వం మూడో జాతీయ రహదారిని జిల్లాకు మంజూరు చేసింది. మహారాష్ట్రలోని సిరోంచ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రేణుగుంట(తిరుపతి) వరకు మొత్తం 643 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, చిత్తూరు జిల్లాల నుంచి ఈ రహదారి వెళ్తుంది. సిరోంచ నుంచి వరంగల్ వరకు, వరంగల్ నుంచి నకిరేకల్, నకిరేకల్ నుంచి రేణిగుంట వరకు మొత్తం మూడు విభాగాలుగా దీన్ని విభజించి మూడు జాతీయ రహదారి నెంబర్లు కేటాయించారు. సిరొంచ నుంచి వరంగల్ వరకు నిర్మించే రహదారికి 363, వరంగల్ – నకిరేకల్ వరకు 365, నకిరేకల్ నుంచి రేణిగుంట వరకు 565గా విభజించి కేటాయించారు. ఏడాదిగా నిలిచిన పనులు ప్రత్యేకించి జిల్లాలోని నకిరేకల్ – నల్లగొండ మధ్యలో ఉన్న 565 నెంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులు భూ సేకరణతో ఏడాది కాలంగా నిలిచిపోయింది. నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ వరకు 86 కిలో మీటర్ల పొడవున నిర్మించే 565 నెంబర్ జాతీయ రహదారి నిర్మాణాఇకి రూ.190 కోట్లు కేటాయించారు. 2014 మార్చిలో జీవిఆర్ ఇన్ఫ్రా సంస్థ ఈ పనుల కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. 2016 మార్చి 12 నాటికి 86 కిలో మీటర్ల మేర రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. నల్లగొండ నుంచి హాలియా వరకు మాత్రమే విస్తరణ పనులు పూర్తి చేశారు. నకిరేకల్ – నల్లగొండ మధ్యలోని రహదారి వెంట ఉన్న కొందరు రైతులు తమ భూములు కోల్పోతున్న నేపథ్యంలో కోర్టును ఆశ్రయించారు. దీంతో నిర్మాణ పనులకు ఏడాది కాలంగా పూర్తిగా బ్రేక్ పడింది. ప్రమాదపు అంచున ప్రయాణం నకిరేకల్ నుంచి వయా తాటికల్ మీదుగా నల్లగొండకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మొత్తం నకిరేకల్ నుంచి వయా తాటికల్ మీదుగా పానగల్ వరకు 21 కిలో మీటర్ల సింగిల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి విస్తరణకు శ్రీకారం చుట్టారు. రోడ్డు విస్తరణ అవుతుంది కదా ఇక రాకపోకలు ఎంతో సాఫీగా సాగిద్దామనుకున్న వాహనదారులు, ప్రయాణికుల ఆశలు నెరవేరడం లేదు. ఈ రహదారి మొత్తం పూర్తిగా పెకిలించి నిర్మాణ పనులు ఎక్కడికక్కడే వదిలివేశారు. దీంతో రోడ్డు పక్కన గుంతలు, కంకర, మట్టి దుమ్ముతో ప్రయాణికులు, వాహనదారులు ఇటుగా వెళ్లాలంటే జంకుతున్నారు. గత వర్షాకాలంలో రోడ్డు వెంట ఉన్న గుంతల్లో నీరు నిలిచి ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో పలువురు ప్రమాదాల బారిన పడిన ఘటనలు లేకపోలేదు. విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో హెచ్చరికల బోర్డులు కూడా నామమాత్రంగా ఏర్పాటు చేశారు. రాత్రి పూట ఒక వైపు తవ్విన రహదారి కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారు. సత్వరమే పనులు పూర్తి చేయాలి నకిరేకల్ వయా తాటికల్ మీదుగా నల్లగొండకు చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనులు సత్వరమే పూర్తి చేయాలి. రోడ్డు పనులు పూర్తికాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ మంది ద్విచక్రవాహనదారులు ఈ రహదారి మీదుగా నల్లగొండకు రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు విస్తరణ పనులతో పూర్తిగా అస్తవ్యస్తంగా మారి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఈ విషయంలో సంబంధిత కాంట్రాక్ట్ సంస్థ చొరవ చూపి పూర్తి చేయాలి. – కొండయ్య, తాటికల్, నకిరేకల్ మండలం -
వీరప్పన్‌ను కలిసిన సూపర్ స్టార్
పెరంబూర్: సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎంజీఆర్ కళగం పార్టీ అధ్యక్షుడు ఆర్ఎం.వీరప్పన్‌ను శుక్రవారం ఆయన ఇంటిలో కలిసి గంటకు పైగా మంతనాలు జరిపారు. వీరి కలయిక తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. రజనీకాంత్‌కు ఆర్ఎం.వీరప్పన్‌కు మధ్య చాలాకాలంగా సత్సంబంధాలున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ కథానాయకుడిగా సత్యామూవీస్ పతాకంపై ఆర్ఎం.వీరప్పన్ బాషా, మూండ్రముగం వంటి సంచలన విజయాలను సాధించిన చిత్రాలను నిర్మించారన్నది గమనార్హం. కాగా 1995లో బాషా చిత్ర విజయోత్సవ వేదికపై రజనీకాంత్ అన్నాడీఎంకే పార్టీని తీవ్రంగా విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెను కలకలాన్నే సృష్టించాయి. అంతే కాదు ఆ ప్రభావం ఆర్ఎం.వీరప్పన్పైనా పడింది. అప్పట్లో మంత్రిగా ఉన్న ఆయన పదవి కోల్పోయారు. తరువాత రజనీకాంత్‌తో ఆయన రాజకీయ గురువుగా చెప్పబడిన చోరామస్వామి, ఆర్వీ.వీరప్పన్లు రాజకీయ సమాలోచనలు జరిపారు. ఇలాంటి పరిణామాల తరువాత తాజాగా జయలలిత మరణానంతరం తమిళ రాజకీయాల్లో నెలకొన్న పరిణామాల మధ్య ఆర్ఎం.వీరప్పన్‌ను రజనీకాంత్ కలవడంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల భారతీయ జనతా పార్టీ రజనీకాంత్‌కు గాలం వేయడం, అదే సమయంలో ఆయన అభిమానులు రాజకీయాల్లోకి రావాలని తరచూ ఒత్తిడి చేస్తున్నారు. అదే విధంగా ఈ నెల 12 నుంచి 17 వరకూ రజనీకాంత్ తన అభిమానులతో సమావేశం కానుండటం లాంటి పరిస్థితులను గమనిస్తున్న రాజకీయ వర్గాలు ఈ ఊహించని పరిణామంతో రజనీ ఆలోచనా ధోరణిని అంచానా వేసే పనిలో పడ్డాయి. అదే విధంగా ప్రస్తుతం ఆర్ఎం.వీరప్పన్, రజనీకాంత్ కలయికలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, తదితర పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. రజనీకాంత్ తన అభిమానుల ఆకాంక్షను నెరవేర్చడానికి సిద్ధం అవుతున్నారా? తన రాజకీయరంగ ప్రవేశానికి తగిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నారా? అందుకే ఆర్ఎం.వీరప్పన్‌ను కలిసి మంతనాలు జరుపుతున్నారా? లాంటి ప్రశ్నలు రాజకీయవర్గాల్లో తలెత్తుతున్నాయి. -
స్పెషల్ అసిస్టెంట్లు కరువు!
–‘పది’ స్పాట్లో సగం మంది కూడా లేరు – ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయని విద్యాశాఖ – విద్యార్థుల జీవితాలతో చెలగాటం అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి జవాబుపత్రాలు మూల్యాంకనం చేయడం ఎంత ముఖ్యమో...వచ్చిన మార్కులు టోటలింగ్ చేయడం, మార్కుల పోస్టింగులు పరిశీలించడం అంతే ముఖ్యం. అయితే స్థానిక కేఎస్ఆర్ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి మూల్యాంకనంలో స్పెషల్ అసిస్టెంట్లు కరువయ్యారు. ప్రతి ముగ్గురు ఏఈ (అసిస్టెంట్ ఎగ్జామినర్లు)లకు ఒక స్పెషల్ అసిస్టెంట్ (ఎస్ఏ)ను ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన రోజుకు మూడువందల మందికి పైచిలుకు స్పెషల్ అసిస్టెంట్లు హాజరుకావాల్సి ఉంది. అయితే 60–70 మంది మాత్రమే వస్తున్నారు. దీంతో ఉన్నవారిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. స్పెషల్ అసిస్టెంట్లను తీసుకోవవడంలో విద్యాశాఖ నిర్లక్ష్యం చేస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. మూల్యాంకనంలో ఏమాత్రం తేడా వచ్చినా నష్టోపోయేది విద్యార్థులే. ఇవీ స్పెషల్ అసిస్టెంట్ల విధులు అసిస్టెంట్ ఎగ్జామినర్లు పేపర్లు దిద్ది మార్కులు వేసిన తర్వాత స్పెషల్ అసిస్టెంట్లు జవాబుపత్రం తీసుకుని మార్కుల పోస్టింగులు, మార్కుల టోటలింగ్ పరిశీలించాల్సి ఉంటుంది. ఏఈలు జవాబు పత్రాలు దిద్దుతున్న కంగారులో మార్కుల టోటలింగ్‌లో ఏవైనా తప్పులు జరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఏఈలు దిద్దిన జవాబు పత్రాలను స్పెషల్ అసిస్టెంట్లు మరోసారి పరిశీలించి మార్కుల వివరాలను ధ్రువీకరిస్తారు. పొరబాటున ఏఈలు చేతుల్లో టోటలింగ్‌లో తక్కువ వచ్చిన అంశాల్ని స్పెషల్ అసిస్టెంట్లు గుర్తించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అరకొర రెమ్యూనరేషన్ మూల్యాంకనం విధుల్లో పాల్గొంటున్న ఇతర అన్ని కేడర్ల కంటే కూడా స్పెషల్ అసిస్టెంట్లకే రెమ్యూనరేషన్ తక్కువ. ఏఈలకు డీఏ, పేపర్లు దిద్దినందుకుగాను రోజుకు సగటున రూ. 550 దాకా వస్తుంది. స్పెషల్ అసిస్టెంట్లకు మాత్రం కేవలం రూ. 165తో సరిపెడుతున్నారు. డీఏ కూడా లేదు. దీంతో అధికశాతం స్పెషల్ అసిస్టెంట్లగా వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. రెమ్యూనరేషన్ తక్కువ ఉన్నందున... రెమ్యూనరేషన్ తక్కువగా ఉందనే కారణంతో స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎంఈఓలకు గట్టిగా చెప్పాం. వీలైనంత మందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - గోవిందునాయక్, డెప్యూటీ క్యాంపు ఆఫీసర్ -
ఒంటిగంటకే ఖాళీ!
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి మూల్యాంకనం ఎంత బాధ్యతారహితంగా చేస్తున్నారనేందుకు బుధవారం జరిగిన తీరే ప్రత్యక్ష నిదర్శనం. మధ్యాహ్నం ఒంటిగంటకే దాదాపు అన్ని సబ్జెక్టుల అసిస్టెంట్ ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు కేంద్రాన్ని ఖాళీ చేసేశారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ ఎంత ముఖ్యమో...మూల్యాంకం కూడా అంతే ముఖ్యం. ఏమాత్రం పొరబాటు చేసినా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా జవాబుపత్రాలు దిద్దే విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. అంతటి ప్రాధాన్యత కల్గిన మూల్యాంకనం విధులను సిబ్బంది గాలికొదిలేశారు. ఇళ్లకు వెళ్లాలనే ఆత్రుతతో ఇష్టారాజ్యంగా దిద్దేసి వెళ్లిపోయారు. 8–3 గంటల వరకు చెప్పిన అధికారులు శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మూల్యాంకనం చేసి ఇళ్లకు వెళ్లాలని ముందురోజే క్యాంపు ఆఫీసర్, డీఈఓ పగడాల లక్ష్మీనారాయణ, డెప్యూటీ క్యాంపు ఆఫీసర్ గోవిందునాయక్ తెలిపారు. అయితే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకూ వస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరు 40 పేపర్లు దిద్దేసి తిరిగి 12 గంటల నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ప్రధాన గేటుకు తాళం వేసినా గోడలు దూకి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి క్యాంపు మొత్తం ఖాళీ అయింది. మిగిలిన జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు క్యాంపులు నడిచాయి. ఇక్కడి అధికారులు పండుగ దృష్టిలో ఉంచుకుని కాస్త వెసులుబాటు ఇస్తే దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసేశారు. నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూల్యాంకనం చేయాలి. తొలివిడతగా ఉదయం 20 పేపర్లు, రెండో విడతగా మధ్యాహ్నం 20 పేపర్లు దిద్దాల్సి ఉంది. సమయం ఎక్కువగా ఉండడం వల్ల దిద్దుటలో ఏమాత్రం తప్పులు దొర్లే అవకాశం ఉండదనేని అధికారుల భావన. కొందరు ఏసీఓలు 40 పేపర్లు ఉదయాన్నే ఇస్తుండడంతో వాటిని ఏఈలు మధ్యాహ్నం భోజన సమయానికి దిద్దేసి ఇంటిబాట పడుతున్నారు. కలెక్టర్ దృష్టికి.. బుధవారం జరిగిన ఘటన కలెక్టర్ కోన శశిధర్ దృష్టికి వెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా 12 గంటలకే కేంద్రం నుంచి వెళ్లిపోయిన వైనంపై ఆయన సీరియస్ అయినట్లు తెలిసింది. క్యాంపు పరిశీలించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. -
గాంధీ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం
హైదరాబాద్: వరుస సంఘటనలు చోటుచేసుకుంటున్నా గాంధీ అసుపత్రి సిబ్బందిని నిర్లక్ష్యం వీడటం లేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుకు కాలం చెల్లిన ఇంజక్షన్లు ఇవ్వడంతో 10 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. సిబ్బంది నిర్లక్ష్యంపై చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంజెక్షన్లు ఇచ్చిన అనంతరం చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు మందులను పరిశీలించగా అవి కాలం చెల్లినవి అని తేలింది. ఆసుపత్రి సిబ్బంది తమ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ప్రయత్నించారని, కాలం చెల్లిన మందులను చెత్తబుట్టలో వేసి గుట్టుచప్పుడు కాకుండా బయటకు పంపించే ప్రయత్నం చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. కోలుకుంటున్న చిన్నారులు ఇంజిక్షన్ల మూలంగా తీవ్ర అస్వస్థతకు గురికావడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
అగ్ని కీలలు
బుట్టాయగూడెం :అడవిలో కార్చిచ్చు రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అగ్ని కీలలు అరణ్యాన్ని భస్మీపటలం చేస్తున్నాయి. మూడు రోజులుగా దొరమామిడి, అలివేరు, పందిరి మామిడిగూడెం, కామవరం, గొట్టాలరేవు, చింతకొండ, ముంజులూరు, పులిరామన్నగూడెం, గోగుమిల్లి తదితర గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో అగ్నికీలలు ఎగసి పడుతున్నాయి. పచ్చదనంతో కళకళలాడే ఎత్తైన కొండలను సైతం మంటలు చుట్టుముడుతున్నాయి. బయటి ప్రాంతం నుంచి చూస్తే కొండలు, గుట్టల మీదుగా తెల్లటి పొగలు మేఘాలు కమ్మే శాయి. రాత్రి వేళ మంటలు కనిపిస్తున్నాయి. విలువైన అటవీ సంపద దహనమవుతున్నా అటవీ, అగ్నిమాపక శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా.. వేసవిలో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణమని చెప్పుకొస్తున్నారు. వెదురు తోపుల్లోని బొంగులు రాసుకోవడం వల్ల మంటలు రేగాయని అంటున్నారు. ఫైర్ వాచర్స్ ఏరీ ! బుట్టాయగూడెం మండలంతోపాటు జీలుగువిుల్లి, పోలవరం మండలాల్లో అటవీ ప్రాంతం ఉంది. ఏటా వేసవిలో ఏదో ఒక మూల అగ్నికీలలు చెలరేగి అడవిని కాల్చేస్తున్నాయి. విలువైన అటవీ సంపద తుడిచిపెట్టుకుపోవడంతోపాటు మూగజీవాలు సైతం మృత్యువాత పడుతున్నాయి. అడవిని పరిరక్షించేందుకు ఫైర్ వాచర్స్‌ను నియమించాల్సి ఉండగా.. అటవీ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. -
కేటాయింపు ఎంతో!
జిల్లాలోని మెట్టప్రాంత సాగునీటి పథకాలు ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్నాయి. డెల్టా ఆధునికీకరణ పనులు ముందుకుసాగడం లేదు. ఏటేటా నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. అయినా సర్కారు శ్రద్ధ కనబరచడం లేదు. ప్రతిఏటా అరకొర నిధులు విదిలిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం 2017–18 బడ్జెట్‌ను శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సారైనా పూర్తిగా నిధులు కేటాయిస్తుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కొవ్వూరు : జిల్లాకు వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో 15 సీట్లూ తమ పార్టీకి కట్టబెట్టిన ప్రజల రుణం తీర్చుకోలేనిదని, జిల్లాకు సముచిత ప్రాధాన్యం ఇస్తామని పదేపదే వల్లెవేశారు. కానీ ఈ మూడేళ్లలో ఆయన జిల్లాకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. గత బడ్జెట్లలో జిల్లాకు ఒనగూరిన ప్రయోజనం శూన్యం. ఇంకా రెండేళ్లే సమయం ఉన్నందున ఈ సారైనా జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారా అని ప్రజలు నిరీక్షిస్తున్నారు. జిల్లా రైతులపై శీతకన్ను పొరుగు జిల్లాకు నీటిని తరలించేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రూ.1,340 కోట్లతో ఆగమేఘాలపై పూర్తిచేసిన ప్రభుత్వం జిల్లా రైతులపై కపట ప్రేమ చూపిస్తోంది. మెట్ట ప్రాంత పథకాలపై శీతకన్ను వేసింది. దీంతో రైతుల నుంచి సర్కారు తీరుపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ‘తాడిపూడి’ వ్యయం రెట్టింపు తాడిపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు విడుదల కాకపోవడంతో అసంపూర్తిగా నిలిచింది. నిర్మాణ వ్యయంపై రూ.526.27 కోట్ల నుంచి రూ.1,042 కోట్లకు పెరిగింది. అధికారులు ఇటీవల కొత్త అంచనాలను తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇప్పటి వరకు రూ.488.11 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.554 కోట్ల మేర నిధులు అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. 2015 బడ్జెట్లో రూ.70కోట్లు కేటాయించారు. వినియోగం కూడా అంతంతమాత్రంగానే జరిగింది. దీంతో గత ఏడాది రూ.55 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో కొత్త అంచనాలకు అనుగుణంగా నిధులు విడుదల కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకం నిర్మాణ పనులకు ప్రభుత్వం ఏమేర ని««ధులు కేటాయిస్తుందో వేచిచూడాలి. డెల్టా ఆధునికీకరణపైనా చిన్నచూపు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి డెల్టా ఆధునికీకరణకు భారీ ఎత్తున నిధులు సమకూర్చారు. జిల్లాకు రూ.1,383.96 కోట్లు కేటాయించగా.. వీటిలో రూ.660 కోట్లు విలువైన పనులు మాత్రమే జరిగాయి. 2015–16 బడ్జెట్లో రూ.15కోట్లు, గత ఏడాది బడ్జెట్లో రూ.42.50 కోట్లు మాత్రమే జిల్లాకు కేటాయించారు. ఇంకా సుమారు రూ.720కోట్లకు పైగా పనులు చేపట్టాల్సి ఉంది. వీటికి అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించడం లేదు. జిల్లాలో అత్యవసరంగా చేపట్టాలి్సన 188 పనులకు ప్రభుత్వం 92 జీవో జారీ చేసింది. దీనిలో 83 కాలువ పనులు, 105 డ్రెయిన్లుకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. వీటిలో 95 పనులకు గతంలో టెండర్లు పిలిస్తే కేవలం 32 పనులు పూర్తి చేశారు. ఇంకా 29 పనులు ప్రారంభం కాలేదు. ఎర్రకాలువ ఆ«ధునికీకరణదీ అదే దుస్థితి ఎర్రకాలువ ఆధునికీకరణ పనులకు రూ.104 కోట్లు కేటాయించారు. దీనిలో రూ.40 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. దీనికి 2015లో రూ.150 కోట్లు కేటాయించగా, గత ఏడాది రూ.2.60 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం నిధుల విడుదల చేయకపోవడంతో నిర్మాణ వ్యయం ఏటేటా పెరుగుతోంది. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలోనూ కోత కొత్త వ్యవయసాయ కనెక్షన్లలోనూ జిల్లాపై ప్రభుత్వం పక్షపాతం ప్రదర్శిస్తోంది. గత ఏడాది జిల్లాకు 1,800 కనెక్షన్ల మంజూరు మాత్రమే లక్ష్యంగా ఇచ్చారు. దీంతో ఆరునెలల నుంచి కొత్త కనెక్షన్లు ఇవ్వడం లేదు. ఫలితంగా రైతులు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ మిగులులో ఉందని ప్రభుత్వం చెబుతున్నా వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో రైతుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ బడ్జెట్లోనైనా అవసరమైన వారందరికీ కనెక్షన్లు కేటాయిస్తారని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. డెల్టాలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి నిధుల కేటాయింపు ఎలా ఉటుందోననే అంశంపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది. చింతలపూడిపై ఏదీ కనికరం జిల్లాలోని మెట్టప్రాంత మండలాలకు సాగునీరు అందించే చింతలపూడి పథకం నిర్మాణ పనులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. రూ.1,701 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకానికి భూసేకరణతో కలిపి కేవలం రూ. 719.4 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా సుమారు రూ.982 కోట్లు అవసరం. 2015 బడ్జెట్లో రూ.22.03 కోట్లు, గత ఏడాది రూ.83 కోట్లు మాత్రమే కేటాయించింది. దీంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. అదనంగా మరో 2.8 లక్షల ఎకరాలకు నీరందించేందుకు రుపొందించిన రెండోదశకు ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,701 నుంచి రూ.4,909.80 కోట్లకు పెరిగింది. దీనికి సంబంధించి పరిపాలనా ఆమోదం లభించి ఏడు నెలులు కావస్తోంది. ఏడాది ఈ రెండో దశకు నిధులిస్తామని ఊరిస్తున్నా.. ఇప్పటివరకూ కేటాయించలేదు. ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తే పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. -
తారుమారుకు ప్రణాళిక!
బాలుడి మృతి దురదృష్టకర ఘటనగా చిత్రీకరణ అయిన వారితోనే విచారణ హడావుడిగా నివేదిక 20న పూనం మాలకొండయ్య రాక ‘ఈఎన్టీ’ వైద్యుల తీరుపై సర్వత్రా విమర్శలు విశాఖపట్నం : ప్రభుత్వ ఈఎన్టీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో మృత్యువాతపడ్డ బాలుడి ఉదంతాన్ని దురదృష్టకరంగా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యులైన వైద్యుల తప్పేమీ లేదంటూ తేల్చేం దుకు సన్నాహాలు మొదలయ్యాయి. నగరంలోని పెదవాల్తేరు ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) ఆస్పత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స వికటించి పెందుర్తి మండలం పురుషోత్తపురానికి చెందిన మూడేళ్ల జయశ్రీకర్ మంగళవారం మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటి దాకా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సతో చనిపోయిన ఘటనలు లేవు. సాక్షిలో ప్రచురితమైన ఈ కథనంపై కలెక్టర్ ప్రవీ ణ్‌కుమార్ స్పందించారు. ఆంధ్రమెడికల్ కళాశాల (ఏఎంసీ) ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ సత్యనారాయణ నేతృత్వంలో ఈఎన్టీ ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవో,ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతోకమిటీనియమించారు. విచారణ తీరుపై సందేహాలు ఎనస్థీషియా విభాగాధిపతి సత్యనారాయణ శుక్రవారం ఈఎన్టీ ఆస్పత్రికి వెళ్లి విచారణ చేపట్టారు. కాగా ఈ కమిటీకి నాయకత్వం వహిస్తున్న ఆంధ్రామెడికల్ కళాశాల మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్ సత్యనారాయణ, బాలుడికి మత్తు ఇచ్చిన వైద్యుడు వేణుగోపాల్ క్లాస్‌మేట్లని, శస్త్రచికిత్స చేసిన వైద్యుడు కృష్ణకిషోర్‌కు కమిటీ సభ్యుడైన డాక్టర్ సూర్యప్రకాష్ తోటి ఉద్యోగి కావడం విచారణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలల కిందట కూడా మూడు నెలల కిందట కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స వికటించి మరో బాలుడు మరణించాడు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నిష్పక్షపాతం గా ఉండేందుకు మరో ఆస్పత్రి లేదా పొరుగు జిల్లా ఆస్పత్రుల వైద్యులతో విచారణ జరిపిస్తారు. ఇక్కడ అందుకు విరుద్ధంగా కమిటీ వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాఉండగా శస్త్రచికిత్స వికటించి బాలుడు మృతి చెందిన విషయంపై తనకు ఎందుకు సమాచా రం ఇవ్వలేదని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఈఎన్టీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు కలెక్టర్ వద్దకు వెళ్లిన ఈఎన్టీ వైద్యులు తమ తప్పేమీ లేదని చెప్పుకున్నట్టు సమాచారం. యూనిట్ రద్దు చేస్తాం! ఈఎన్టీ ఆస్పత్రిలో వరుసగా చిన్నారులు మృత్యువాత పడుతుండడంపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న డీలిప్ ప్రతినిధులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. శుక్రవారం వీరు ఆస్పత్రిని సందర్శించి, గతంలో ఒక బాలుడు మరణించినప్పుడు మిన్నకున్నామని, ఇప్పుడు మరో చిన్నారి చనిపోవడాన్ని ఉపేక్షించబోమని, ఇకపై ఇలాంటివి పునరావృతమైతే కాక్లియర్ ఇంప్లాంట్ యూనిట్‌ను రద్దు చేస్తామని హెచ్చరించినట్టు భోగట్టా. 20న పూనం మాలకొండయ్య రాక..! కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు వికటించడాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణకు ఆమె ఈనెల 20న విశాఖ వస్తున్నట్తు తెలుస్తోంది. దీంతో ఆస్పత్రి వర్గాల్లో కలవరం మొదలైంది. సెలవుపై సూపరింటెండెంట్? కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స ఫెయిలై బాలుడు మరణించిన నేపథ్యంలో తలెత్తిన పరిణామాలతో ఆందోళన చెందుతున్న ఈఎన్టీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘునాథబాబు సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. -
ఖమ్మం జిల్లాలో 104కు సుస్తీ
-
పురుగుల సెలైన్: చిన్నారి మృతి
-
‘చెక్కు బౌన్స్ ’ చట్ట సవరణ!
న్యూఢిల్లీ: చెక్కు బౌన్స్ కేసుల విచారణ వేగవంతంగా పూర్తి చేసేందుకు ‘నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్’చట్టానికి సవరణలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. చెక్ బౌన్స్ వివాదాల పరిష్కారం చాలా క్లిష్టంగా ఉంటోందని పేర్కొన్నారు. దీంతో డబ్బు రాబట్టడానికి చాలా సమయం పడుతోందని చెప్పారు. నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్ చట్టానికి సవరణలు చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చర్యలు చేపడుతోందని తెలిపారు. ఎవరి చెక్కు బౌన్స్ అవుతుందో వారు ప్రతివాదన చేసేందుకు ముందే బౌన్స్ అయిన మొత్తానికి సరిపడా నగదును కోర్టులో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ఆ శాఖ ప్రతిపాదనలు చేసింది. చాలా కోర్టుల్లో పేరుకుపోయిన దాదాపు 18లక్షల చెక్కు బౌన్సు కేసుల పరిష్కారానికి ఈ సవరణలు ఎంతో ఉపయోగపడనున్నాయి. -
ఇష్టారాజ్యం
- కేజీబీవీల నిర్వహణను గాలికొదిలేస్తున్న ఎస్ఓలు - సిబ్బందీ అదే తీరు – అడ్డూ అదుపు లేకుండా అక్రమాలు – ఉద్యోగుల తొలగింపుతోనైనా తీరు మారేనా? అనంతపురం ఎడ్యుకేషన్ : కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) స్పెషలాఫీసర్లు (ఎస్ఓలు) ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సిబ్బంది పనితీరుపైనా అనేక విమర్శలొస్తున్నాయి. విద్యార్థినుల పొట్టకొడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 62 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో సుమారు 10,500 మంది విద్యార్థినులు చదువుతున్నారు. సింహభాగం కేజీబీవీలఽ నిర్వహణ గాడి తప్పింది. ఆడ పిల్లలను సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన స్పెషలాఫీసర్లు, సిబ్బంది వారిని అర్ధాకలితో పెడుతూ వంట సరుకులను అక్రమంగా అమ్ముకుంటున్నారు. ఇటీవల సెలవు రోజుల్లో బొమ్మనహాళ్ కేజీబీవీ నుంచి ఎస్ఓ, ఆమె బంధువులు సరుకులను బయటకు తరలించారు. ఇది అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యింది. అధికారుల తనిఖీలో వారు అడ్డంగా దొరికిపోయారు. నార్పల కేజీబీవీ నుంచి అకౌంటెంట్, వంట మనుషులు కలిసి సరుకులు అమ్ముకుంటున్నారు. చివరకు అందులో పని చేస్తున్న సీఆర్టీలు కూడా ఆ సరుకులను కొన్నారు. దీనిపై ఆధారాలతో సహా అధికారులకు ఫిర్యాదులందాయి. మరికొన్ని చోట్ల స్పెషలాఫీసర్లు, అకౌంటెంట్లు కలిసి సరుకుల్లో గోల్మాల్ చేస్తున్నారు. ట్రేడర్స్ నుంచి నెలవారీ మొత్తం మాట్లాడుకుని సెకండ్, థర్డ్ గ్రేడ్ సరుకులు కూడా తీసుకుంటున్నారు. దీనికితోడు ఎక్కువ మోతాదులో సరుకులు ఇచ్చినట్లు రికార్డులు రాస్తూ 30–40 శాతం బిల్లు మొత్తాన్ని స్వాహా చేస్తున్నారు. మార్పు వచ్చేనా? సరుకులు అమ్ముకోవడం, వంట చేస్తూ గంజిమీద పడి అమ్మాయిలు గాయపడడం, సిబ్బంది బాధ్యతారాహిత్యంఽ తదితర కారణాలతో ఇటీవల ఏకంగా 16 మంది ఉద్యోగులను తొలగిస్తూ కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. మరో ముగ్గురు ఎస్ఓలకు స్థానచలనం కల్పించారు. సరుకులు ఇంటికి తరలిస్తూ దొరికిపోవడంతో బొమ్మనహాల్ కేజీబీవీ ఎస్ఓ మహాలక్ష్మి, నిర్లక్ష్యంగా ఉన్న నార్పల కేజీబీవీ ఎస్ఓ నిర్మల, సరుకులు బయటకు అమ్ముకున్నారనే కారణంతో అక్కడి అకౌంటెంట్ అనిత, వంట మనుషులు లక్ష్మీనారాయణమ్మ, పుల్లమ్మ, బీబీ, లీలావతి, డే వాచ్‌ఉమన్ అచ్చమ్మ, సీఆర్టీలు సుకన్య, సహీరానస్రిన్ను విధుల నుంచి తప్పించారు. వంట చేయిస్తూ గంజి మీదపడి విద్యార్థినులు గాయపడిన ఘటనలో తలుపుల కేజీబీవీ వంట మనుషులు కృష్ణమ్మ, లక్ష్మీదేవి, రమణమ్మ, శాంతమ్మ, నైట్‌వాచ్ ఉమన్ అంజనమ్మ, ఏఎన్ఎం విజయరాణిని తొలిగించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తలుపుల ఎస్ఓ శారదను పరిగికి, పరిగి ఎస్ఓ సౌమ్యను రామగిరికి, రామగిరి ఎస్ఓ సరోజమ్మను కళ్యాణదుర్గం బదిలీ చేశారు. ఈ చర్యలతోనైనా సిబ్బందిలో మార్పు వచ్చేనా? కేజీబీవీల నిర్వహణ గాడిలో పడేనా? అన్న చర్చ సాగుతోంది. ఎవరినీ ఉపేక్షించం – దశరథరామయ్య, ఎస్ఎస్ఏ పీఓ ఆడ పిల్లలకు మెనూ ప్రకారం భోజనం పెట్టాల్సిందే. సరుకుల్లో నాణ్యత లోపించినా, మెనూ ప్రకారం భోజనం పెట్టకపోయినా ఉపేక్షించం. అందరూ బాధ్యతగా పని చేయాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు. -
విధి నిర్వహణలో అలసత్వం తగదు
బలవంతులు, బలహీనులంటూ రాజీలు చేయకండి – నేర సమీక్షా సమావేశంలో క్షేత్రస్థాయి అధికారులకు ఎస్పీ ఆదేశం కర్నూలు: విధి నిర్వహణలో అలసత్వం వీడి నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీలు, సీఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బలవంతులు, బలహీనులంటూ సమస్యలపై స్టేషన్లకు వచ్చిన బాధితులను రాజీ చేయకండని తెలిపారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏటీఎం కార్డు నెంబర్ తెలుసుకుని ఘరానా మోసాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠినంగా వ్యవహరించాలన్నారు. దారి తప్పితే ఎంతటి వారైనా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. లారీ దొంగతనాలపై నిఘా ఉంచాలన్నారు. శివరాత్రి బందోబస్తు, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నేరం జరిగిన చోట కీలక ఆధారం ఏదో ఒకటి ఉంటుందని, వాటితో కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. రౌడీయిజం, గూండాయిజం జిల్లాలో ఎక్కడ ఉన్నా పూర్తిగా అణచివేయాలన్నారు. గణేష్ నిమజ్జనం, బక్రీద్, పుష్కరాలు, వివిధ రకాల బందోబస్తుల్లో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ–బీట్స్ అమలుపై వర్క్‌షాప్ జిల్లా పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశపెట్టనున్న ఈ–బీట్స్ అమలుపై వర్క్‌షాప్ నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ–బీట్స్‌ను బలోపేతం చేసి నేరాలను తగ్గించాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. గస్తీలకు వెళ్లే పోలీసు సిబ్బంది విషయంలో సీఐలు, ఎస్ఐలు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఓఎస్డీ రవిప్రకాష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు డి.వి.రమణమూర్తి, బాబుప్రసాద్, ఎ.జి.కృష్ణమూర్తి, వెంకటాద్రి, హరినాథరెడ్డి, మురళీధర్, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రాజు, బాబా ఫకృద్దీన్, రామచంద్ర, హుసేన్ పీరాతో పాటు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
పులిచింతల నిర్వాసితులను పట్టించుకోరా..?
బెల్లంకొండ: పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వస్వం వీడి పునరావాస కేంద్రాలకు వచ్చిన తమను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు జిల్లా జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని మాచాయపాలెం పునరావాస కేంద్రాల్లో మంగళవారం జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు. మొదట మండలంలోని పాపాయపాలెం గ్రామంలో మండల అధికారులు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పునరావాస కేంద్రాల్లో జరిగిన కార్యక్రమంలో బాధితులు వారి సమస్యలను జేసీకి వివరించారు. తాము ఇక్కడకు వచ్చి దాదానుగా ఆరేళ్లు దాటినా ఇంతర వరకూ ప్రత్యేక పంచాయతీగా గుర్తించలేదని తెలిపారు. సైడ్ డ్రైనేజీలు లేవని, పుశువులు మేతకు వెళ్లేందుకు డొంక లేదని తెలిపారు. శ్మశానం లేక పోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని, మంచి నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని జేసీ శుక్లా హామీ ఇచ్చారు. ఎంపీడీవో సీహెచ్ బ్రమరాంబ, సర్పంచ్ నూన్సావతు బుజ్జికుమారి బాయి, ఎంపీటీసీ సభ్యుడు నరసింహానాయక్, పులిచింతల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవసహాయం, మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరెడ్డి, డిప్యూటీ తహశీల్ధార్ ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పులిచింతల నిర్వాసితులను పట్టించుకోరా..?
పులిచింతల నిర్వాసితులను పట్టించుకోరా..? పులిచింతల, నిర్వాసితులు, నిర్లక్ష్యం pulichintala, vicktims, negligecy 3పీడీపీ81–బాధితుల సమస్యలు వింటున్న జేసీ కృతికా శుక్లా, అధికారులు బెల్లంకొండ: పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వస్వం వీడి పునరావాస కేంద్రాలకు వచ్చిన తమను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు జిల్లా జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని మాచాయపాలెం పునరావాస కేంద్రాల్లో మంగళవారం జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు. మొదట మండలంలోని పాపాయపాలెం గ్రామంలో మండల అధికారులు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పునరావాస కేంద్రాల్లో జరిగిన కార్యక్రమంలో బాధితులు వారి సమస్యలను జేసీకి వివరించారు. తాము ఇక్కడకు వచ్చి దాదానుగా ఆరేళ్లు దాటినా ఇంతర వరకూ ప్రత్యేక పంచాయతీగా గుర్తించలేదని తెలిపారు. సైడ్ డ్రైనేజీలు లేవని, పుశువులు మేతకు వెళ్లేందుకు డొంక లేదని తెలిపారు. శ్మశానం లేక పోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని, మంచి నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని జేసీ శుక్లా హామీ ఇచ్చారు. ఎంపీడీవో సీహెచ్ బ్రమరాంబ, సర్పంచ్ నూన్సావతు బుజ్జికుమారి బాయి, ఎంపీటీసీ సభ్యుడు నరసింహానాయక్, పులిచింతల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవసహాయం, మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరెడ్డి, డిప్యూటీ తహశీల్ధార్ ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కంటిచూపు కోసం వెళ్లి కన్నుమూశాడు
ఏలూరు సిటీ : కంటి చూపు బాగవుతుందని ఆసుపత్రికి వెళ్లిన ఓ వ్యక్తి విగతజీవిగా మారాడు. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమని మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. టి.నరసాపురం మండలం తెడ్లం గ్రామానికి చెందిన డి.సుబ్బాచారి (55) కంటి శుక్లాల శస్త్రచికిత్స కోసం ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని ఏఏ కంటి ఆసుపత్రికి సోమవారం వచ్చాడు. అతనిని ఆపరేష¯ŒS థియేటర్లోకి తీసుకువెళ్లిన వైద్యులు 15 నిమిషాలకే అతను చనిపోయాడంటూ బయటకు తీసుకువచ్చారు. సుబ్బాచారి చనిపోయిన విషయాన్ని తెలసుకున్న ఏలూరులో పోలీస్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న అతని కుమారులు డి.విజయరాజు, రాజేంద్రప్రసాద్, బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే సుబ్బాచారి మృతికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో టూటౌ¯ŒS సీఐ బంగార్రాజు, నగర సీఐ ఎ¯ŒS.రాజశేఖర్, ఎస్సైలు దుర్గారావు, గంగాధర్ ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. సుబ్బాచారి కుమారులు మాట్లాడుతూ తమకే ఇలా వైద్యం చేస్తుంటే.. సామాన్యుల పరిస్థితి ఏమిటంటూ వైద్యులను నిలదీశారు. నిర్లక్ష్యంతో తమ తండ్రి ప్రాణాలతో చెలగాటమాడిన వైద్యులపై స్థానిక టూటౌ¯ŒS పోలీస్‌స్టేçÙ¯ŒSలో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన టూటౌ¯ŒS సీఐ యు.బంగార్రాజు దర్యాప్తు చేసి బాధ్యులకు శిక్షపడేలా చేస్తామని సుబ్బాచారి బంధువులకు హామీ ఇచ్చారు. -
ఆరోగ్యశ్రీ నిర్లక్ష్యంపై నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా
అనంతపురం అర్బన్ : పేద వర్గాలకు వరప్రదాయినిగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, దీనికి నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ తెలిపారు. ఈ ధర్నాకు ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ‘ఎన్టీఆర్ వైద్యసేవ’గా మార్పు చేశారే తప్ప.. అవసరమైన నిధులు మాత్రం మంజూరు చేయలేదని విమర్శించారు. దీంతో పేదలు తీవ్ర ఇబ్బందిపడాల్సి వస్తోందని పేర్కొన్నారు. మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గతంలో ఎందరో పేదలు ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా పొందారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. గుండె, కిడ్నీ తదితర ఆరోగ్య సమస్యలకు చికిత్స చేసేందుకు అనుమతి మంజూరు చేయాలంటూ చాలా ఆస్పత్రులు పెట్టుకున్న వినతులపై ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. ఇప్పటికే చికిత్స చేసిన వాటికి రూ. లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉందని వెల్లడించారు. ఈ పథకానికి నిధుల లేమిని ప్రభుత్వం సాకుగా చూపడం దుర్మార్గమన్నారు. -
సరైన వైద్యం అందక బాలింత మృతి
బంధువులు ఆందోళన ∙ రూ.2 లక్షల పరిహారానికి ఆస్పత్రి వర్గాల హామీ అంబాజీపేట : అంబాజీపేట స్త్రీల ఆస్పత్రిలో ౖÐð ద్యాధికారి నిర్లక్ష్యం వల్లే బాలింత మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. బుధవారం జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అయినవిల్లి మండలం తొత్తరమూడికి చెందిన తొత్తరమూడి మధుబాబుతో అంబాజీపేట హడ్కోకాలనీకి చెందిన వసంతకుమారి వివాహం అయ్యింది. వసంత కుమారి ప్రసవం నిమిత్తం గత నెల 30న స్థానిక స్త్రీల ఆస్పత్రిలో చేరింది. 1వ తేదీన శస్త్రచికిత్స చేయగా ఆమెకు పాపపుట్టింది. తదనంతర చికిత్స పొందుతుండగా బాలింతకు కిడ్నీ సమస్య, హైబీపీ రావడంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తీసుకువెళ్ళాలని వైద్యా ధికారి డాక్టర్ పుష్ప సూచించారు. దీంతో వసంతకుమారి బంధువులు ఆమెను కాకినాడ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె బుధవారం ఉదయం మృతి చెందింది. వైద్యం సరిగా అందకే వసంతకుమారి చనిపోయిందని ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలు చర్చించడంతో బాధిత కుటుంబానికి రూ.2 లక్షల నష్టపరిహరం చెల్లించేందుకు ఆస్పత్రి వర్గాలు అంగీకరించాయి. దీంతో పరిస్థితి సద్దు మణిగింది. ఇదిలా ఉండగా డాక్టర్ పుష్ప ప్రభుత్వ వైద్యాధికారిగా పనిచేస్తూ దీర్ఘ కాలిక సెలవు పెట్టి ఇక్కడ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న అల్లవరం, అమలాపురం తాలుక ఎస్సైలు డి.ప్రశాంతకుమార్, ఎం.గజేంద్రకుమార్ జరిగిన సంఘటనపై ఇరువర్గాలను విచారించారు. ఈ చర్చల్లో ఎంపీటీసీ ఉండ్రాజవరపు ప్రకాశరావు, నాగాబత్తుల సుబ్బారావు, ఉందుర్తి నాగబాబు పాల్గొన్నారు.