కేజీహెచ్ ఆవరణలో కాల్చేసిన రక్తం శ్యాంపిల్ ట్యూబ్‌లు, ఇతర వ్యర్థాలు
సాక్షి, పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ) : ఎంతో జాగ్రత్తగా తరలించాల్సిన బయో వ్యర్థాలను కేజీహెచ్ ఆవరణలో ఎక్కడబడితే అక్కడే పారిశుధ్య సిబ్బంది కాల్చేస్తున్నారు. బాటిల్స్‌లో సేకరించిన రక్త నమూనాలు, సిరంజిలు, పెప్పెట్లు వంటివి ఆవరణలో కాల్చేయడంతోపాటు తుప్పల్లో, డొంకల్లో పారేస్తున్నారు. అసలు వీటిని అంత నిర్లక్ష్యంగా ఎవరు బయటకు తీసుకొస్తున్నారో అంతుచిక్కడం లేదు. భవంతుల వెనుక ఉన్న ఖాళీ స్థలాల్లో వీటిని తగలబెట్డడం వల్ల ఎవరికీ తెలియడం లేదు. అటుగా వెళ్లిన రోగులు, వారి బంధువులు వీటిని చూసి భయపడుతున్నారు. విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని చెబుతున్నారు. బయో వ్యర్థాలను జాగ్రత్తగా తరలించాల్సిన పారిశుధ్య సిబ్బంది ఈ విధంగా చేయడం వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని... అధికారులు తగిన చర్యలు తీసుకొని సంబంధిత సిబ్బందిని హెచ్చరించాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment