Sanitation staff
-
పని చేయాల్సింది అధికారి ఇంట్లో కాదు.. బయట
హస్తినాపురం: పారిశుద్ధ్య పనులు నిర్వహించాల్సిన సిబ్బంది అధికారుల ఇళ్లలో పనులు చేస్తూ వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారమంతా జరుగుతోందని బాహాటంగానే చెప్పుకుంటున్నారు. హయత్‌నగర్ సర్కిల్ కమలానగర్లో ఓ అధికారి ఇంట్లో పని చేస్తూ ‘సాక్షి’కెమెరాకు చిక్కాడు. బస్తీలు, కాలనీల్లో పని చేయించాల్సిన అధికారి తన ఇంట్లో ఇలా పని చేయించుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: కోర్టు ధిక్కరణ కేసు: కలెక్టర్‌కు హైకోర్టు వినూత్న ప్రతిపాదన -
పారిశుద్ధ్య యోధులకు వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారితో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియర్లలో ఒకరైన పారిశుద్ధ్య కార్మికులకు త్వరలో ఉచితంగా వ్యాక్సిన్లు వేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని ఇతర 141 పురపాలికల్లో పనిచేస్తున్న సుమారు 75 వేల మంది పారిశుద్ధ్య కార్మికుల వివరాలను రాష్ట్ర పురపాలక శాఖ సేకరిస్తోంది. స్వీపర్లు, చెత్త కుండీలను ఖాళీ చేసే వారు, మురికి కాల్వలు శుభ్రం చేసేవారు, ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించే వారు, ఇతర పారిశుద్ధ్య కార్మికులు, శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎంటమాలజీ వర్కర్లు, వ్యర్థాలు తరలించే ట్రాక్టర్లు/డంపర్లు/ఇతర వాహనాల డ్రైవర్లు, స్వచ్ఛ ఆటోలు/రిక్షా కార్మికుల జాబితాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ‘గ్రేటర్’లోనే 30 వేల మంది.. జీహెచ్ఎంసీ పరిధిలో 30 వేల మంది, రాష్ట్రంలోని ఇతర 141 పురపాలికల్లో మరో 30 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తుండగా, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సేవరేజీ బోర్డు (జల మండలి) పరిధిలో మరో 15 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కోవిన్ (CoWIN) మొబైల్ యాప్‌లో వీరి వివరాలను నమోదు చేసే ప్రక్రియను రాష్ట్ర పురపాలక శాఖ ప్రారంభించింది. సామాన్యులకు యాప్.. వ్యాక్సినేషన్ కోసం ఎవరైనా సరే కోవిన్ యాప్ ద్వారా ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండగా, సామాన్య ప్రజలకు ఇంకా ఈ యాప్‌ను కేంద్రం అందుబాటులోకి తీసుకురాలేదు. ఈ యాప్ ద్వారా ఫ్రంట్‌లైన్ వారియర్ల రిజిస్ట్రేషన్ల కోసం మాత్రమే కొంతమంది ప్రభుత్వ అధికారులకు యాక్సెస్ సదుపాయం కల్పించింది. పారిశుద్ధ్య కార్మికుల వివరాలను సేకరించేందుకు... జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని మరో 12 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, పురపాలక శాఖ డైరెక్టరేట్‌లోని ఇద్దరు రీజనల్ డైరెక్టర్లకు కోవిన్ యాప్ యాక్సెస్ సదుపాయం కల్పించారు. పారిశుద్ధ్య కార్మికుల పేరు, వయసు, చిరునామాతో పాటు ఫొటో గుర్తింపు కోసం ఆధార్ కార్డు నంబర్, ఫోన్ నంబర్ వివరాలను సేకరిస్తున్నారు. వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వారు మళ్లీ 28 రోజులకు రెండో డోసును తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడానికి ఫోన్ నంబర్లను సైతం తీసుకుంటున్నారు. శాశ్వత పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందితో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న కార్మికుల వివరాలను సైతం సేకరిస్తున్నారు. వీరికి సైతం వ్యాక్సిన్.. ఇంటింటికీ తిరిగి ఆస్తి పన్నులు వసూలు చేయడం, కోవిడ్ కాంటాక్టులను గుర్తించడం, బహిరంగ ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలను అమలు చేయడం వంటి విధుల్లో పాల్గొనే మున్సిపాలిటీల ఇంజనీర్లు, రెవెన్యూ, ఇతర విభాగాల సిబ్బంది, సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ల ఆపరేటర్లు, మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు, ఫికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, వాటర్ ట్యాంకర్ ఆపరేటర్లు, దహనవాటికల్లో పనిచేసే మున్సిపల్ సిబ్బంది, సివిల్, ఎలక్ట్రికల్, ఇతర మెయింటెనెన్స్ పనుల్లో పనిచేసే జూనియర్ ఇంజనీర్లు, వాటర్ మీటర్ రీడర్లు, ప్లంబర్లు, వాటర్ సప్లై లైన్మెన్, పార్కుల నిర్వహణ సిబ్బందిని సైతం ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి వారికి సైతం టీకాలు వేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం వీరి వివరాలను సైతం సేకరించాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరింది. ఈ నేపథ్యంలోనే వీరికి సంబంధించిన వివరాలను సైతం పురపాలక శాఖ సేకరిస్తోంది. -
కొత్త 108 అంబులెన్సుల్లో వెంటిలేటర్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొనుగోలు చేసిన 108 అంబులెన్సుల్లో వెంటిలేటర్లు అమర్చుతున్నారు. మొత్తం 400 పైగా వాహనాలు కొనుగోలు చేశారు. ఇందులో 104 వాహనాలను ఏఎల్ఎస్ (అడ్వాన్స్డ్ లైప్ సపోర్ట్) వాహనాలుగా మార్చుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బాధితులను రకక్షించడంలో భాగంగా ఈ వాహనాలు పనిచేస్తాయి. వీటి కోసం అంతర్జాతీయ వైద్య ఉపకరణాల తయారీ సంస్థ ‘రెస్‌మెడ్’ నుంచి కొనుగోలు చేసిన మొబైల్ వెంటిలేటర్లను అమర్చుతున్నారు. 104 వాహనాల్లోనూ వెంటిలేటర్‌తో పాటు డిఫ్రిబ్యులేటర్(గుండె సంబంధిత ఇబ్బంది వచ్చినప్పుడు కాపాడే యంత్రం), పల్సాక్సీ మీటర్(రక్తంలో ఆక్సిజన్ శాతం నియంత్రణ) వంటి అత్యాధునిక వైద్య పరికరాలు ఉంటాయి. ఇవన్నీ అమర్చి ఈ నెలలో వీటిని వినియోగించేందుకు సమాయత్తం చేస్తున్నారు. (కరోనాపై పోరు; మరో మైలురాయి) గ్రామీణ పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్లు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కిట్లను అందజేయనుంది. ఇందుకుగాను రూ.3.84 కోట్లను జిల్లాలకు విడుదల చేసింది. ఈ నిధులతో గ్రామాల్లో పనిచేస్తున్న 19,584 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫాం, టోపి, రెండు జతల బ్లాక్ గమ్ షూ, యూనిఫాం మీద వేసుకోవడానికి కోట్ పంపిణీ చేయనుంది. ఒక్కొక్క రక్షణ కిట్ కోసం గరిష్టంగా రూ. 3 వేల చొప్పున ఖర్చు చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. (వీరంతా సచివాలయానికి రావాల్సిందే) -
లాక్డౌన్ తప్పదు
-
సఫాయి అన్నా నీకు సలామ్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పారిశుధ్య సిబ్బందికి కోత విధించిన వేతనాలను తిరిగి చెల్లిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వారికి అదనంగా నగదు ప్రోత్సాహకం కూడా అందజేస్తామన్నారు. అలాగే కరోనా నియంత్రణ పోరులో కీలకంగా పనిచేస్తున్న వైద్య సిబ్బందికి వారి మూలవేతనంలో 10 శాతాన్ని సీఎం ప్రోత్సాహకంగా ఇస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ఒకట్రెండు రోజుల్లో ఇస్తాం.. ‘వైద్యులు, పోలీసు సిబ్బందితో పాటు కొంతమంది కరోనా నియంత్రణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. పారిశుధ్య కార్మికులు భుజాన రసాయనాలు తగిలించుకుని స్ప్రే చేస్తూ నగరాలు, పట్టణాలను అద్దంలా పెడుతున్నారు. వీరు రాష్ట్రవ్యాప్తంగా 95,392 మంది ఉన్నారని గుర్తించాం. అందులో 43,661 మంది గ్రామపంచాయతీ కార్మికులు, 21,531 మంది మున్సిపాలిటీల సిబ్బంది, 2,510 మంది హెచ్ఎండబ్ల్యూఎస్ సిబ్బంది, 27,690 మంది జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు. వీరికి ఈ నెల వేతనం ఇచ్చే విషయంలో కొంత పొరపాటు జరిగింది. 10శాతం వేతనం కట్ అయింది. ఆ వేతనాన్ని ఒకట్రెండు రోజుల్లో జమ చేస్తం. దీంతోపాటు ముఖ్యమంత్రి ప్రోత్సాహకం కింద జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ సిబ్బందికి రూ.7,500 అదనంగా ఇస్తాం. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుధ్య సిబ్బంది రూ.5,000 ఇస్తాం. నేను గతంలో కూడా చెప్పాను. సఫాయి అన్నా నీకు సలామ్ అన్నా అని.. ఇప్పుడు కూడా చెబుతున్నా సఫాయి అన్నా నీకు సలామ్ అన్నా. తల్లిదండ్రుల తర్వాత మీరే గొప్ప వారు. కనిపించే దేవుళ్లు. మా సైనికులు మీరు. మేమిచ్చే డబ్బు తక్కువే. మిమ్మల్ని ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. భారతదేశ ధాన్యాగారంగా రాష్ట్రం బెంగాల్ నుంచి గన్నీ బ్యాగుల దిగుమతి కోసం ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతో మాట్లాడిన. అక్కడి కేబినెట్ కార్యదర్శి మన సీఎస్‌తో మాట్లాడినరు. మనం సేకరించిన ధాన్యంలో 50–60 శాతాన్ని గన్నీ బ్యాగుల్లోనే ఇవ్వాలని ఎఫ్‌సీఐ నిబంధన ఉంది. వీటిని బెంగాల్లో తయారు చేయించి పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. మనకు ఏడు కోట్ల గన్నీ సంచులు కావాలని అడిగిన. సాధ్యం కాకుంటే ఎఫ్‌సీఐ వాళ్లు 100 శాతం ప్లాస్టిక్ బ్యాగులు తీసుకోవాల్సి ఉంటుంది. 40లక్షల ఎకరాల వరి పంట తెలంగాణలో తొలిసారిగా వస్తోంది. ఈ కరోనా లేకుంటే నేను డ్యాన్స్ చేసి సంబరపడేవాడిని. డబ్బులు లేకున్నా ధాన్యం, మక్కల కొనుగోళ్లకు రూ.30వేల కోట్లు సమీకరించినం. 7వేల సెంటర్లు పెట్టినం. తెలంగాణ ఇప్పుడు భారతదేశ ధాన్యాగారం అయిపోయింది. ఇంకా రెండడుగులు ముందుకుపోతే దేవాదుల, సీతారామ, పాలమూరు, కాళేశ్వరం పూర్తి అయితే ఒక కోటీ 30లక్షల ఎకరాల దాకా వరి సాగుకు తెలంగాణ చేరుకుంటది. ఈ గన్నీ బ్యాగుల పంచాయతీ ఎందుకని మన దగ్గరే రెండు మూడు కంపెనీలు పెట్టించండని మంత్రికి చెప్పిన. వారికి రాయితీలు, భూములు ఇచ్చి ఒకటి రెండు జ్యూట్ మిల్స్ పెట్టించమన్న. రాజకీయాలకు నాలుగేళ్ల టైం ఉంది ఈ సమయంలో చిల్లరగాళ్లు చేసే ప్రచారాలను పట్టించుకోకుండా సమాజం జాగ్రత్తగా ముందుకెళ్లాలి. కొన్ని పత్రికలు కూడా పిచ్చి రాతలు రాస్తున్నయ్. వైద్యులకు రక్షణేదీ.. అని రాస్తున్నయ్. పీపీఈ కిట్లు లేవా? 40వేలున్నయ్ మీకు తెలుసా? అవసరమనుకుంటే కేసులు కూడా పెడతం. ఎంతో చిత్తశుద్ధితో, ధైర్యంగా పనిచేస్తున్న వైద్యుల మనోధైర్యం కోల్పోయేలా వెకిలి వార్తలు రాస్తరా? ఈ సమయంలో ప్రభుత్వానికి, సమాజానికి ఉపయోగపడే వార్తలు రాయాలి. వారికి శిక్ష తప్పదు. మీరు రాసేదాంట్లో వాస్తవం లేదు. మీకే ఉందా బాధ్యత.. మాకు లేదా? ఈ సమయంలో కూడా 5లక్షల కిట్లు, లక్షలాది మాస్కులకు ఆర్డర్ ఇచ్చినం. మా హెల్త్ మినిష్టర్ కానీ మేం కానీ పడుకుంటున్నామా? నిద్ర లేని రాత్రులు గడుపుతున్నం. వైద్యం ఒక్కటే కాదు కదా? రాష్ట్రంలో అన్నీ చూసుకోవాలి. ఈ సమయంలో భుజానికి భుజం తోడయి ముందుకెళ్లాలి. ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా. వక్రబుద్ధి ఉన్నవాళ్లు సక్రమంగా మారాలి. తర్వాత మీ ఇష్టం. అది మీ ఖర్మ. మీకు కరోనా తగలాలని శాపం పెడుతున్నా. రాజకీయాలకు ఇంకా నాలుగేళ్లు టైం ఉంది. హైరానా ఎందుకు? ఇప్పటికైనా క్లీన్‌మైండ్ ఉండాలి. వీరికి సరైన సమయంలో సరైన శిక్ష ఉంటుంది. ఆ శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే వీళ్లు ప్రజాద్రోహులు, దేశద్రోహులు. మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా ఆగాలి. కేసీఆర్ చెబితే ఖతర్నాక్ ఉంటది. మామూలుగా చెప్పడు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఇప్పుడు నేను చెపుతున్నవన్నీ కుత్సిత, చిల్లర బుద్ధితో అసత్యాలు ప్రచారం చేస్తున్న వారికి మాత్రమే. దీన్ని మీడియా కూడా సహించవద్దు. దేశ ఐక్యత కోసం పనిచేసే వాళ్లు ఈ సమయంలో గొప్పవాళ్లు కానీ వెకిలి మకిలి ప్రయత్నాలు చేసేవారు కాదు. ఆ త్యాగధనుల కాళ్లు కడిగి నెత్తిన పోసుకోవాలి. మీడియాలో కూడా మంచి వార్తలు రాసేవాళ్లున్నరు. వాళ్లకు దండం పెడతం, రెండు కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటం. పెద్దలు, బుద్ధిజీవులు, కవులు మంచి సాహిత్యం వెలువరించాలి. ప్రస్తుతం మానవ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే వైతాళికులు కావాలి. చిల్లర రాజకీయం, చిల్లర ప్రచారం, చిల్లర పేపర్లు కాదు. అల్పులు, గొప్పవాళ్లు ఇలాంటి సందర్భంలోనే బయట పడతారు. బీడీలు చుట్టే ఓ మహిళ, రేషన్ బియ్యాన్ని పంచిన మరో మహిళ.. ఇలాంటి వాళ్లకు పాద పూజ చేసి, రాష్ట్ర అవతరణ సమయంలో అవార్డులు కూడా ఇవ్వాలి. జిల్లాల్లో కష్టపడి పనిచేస్తున్న వారికి ప్రోత్సాహకంగా కొంత నగదు ఇస్తాం. 24 గంటలు కష్టపడే వాళ్లకు కొంత నగదు ఇచ్చేందుకు కలెక్టర్లకు నిధులిస్తాం. -
వలస కార్మికులపై బ్లీచ్ స్ప్రే
లక్నో/బరేలీ: లాక్డౌన్ కారణంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న వలస కార్మికులపై ప్రభుత్వయంత్రాంగాల నిర్లక్ష్య ధోరణికి తాజా ఉదాహరణ ఇది. భార్యాపిల్లలతో కలిసి వందలాది కిలోమీటర్లు కాలినడకన వస్తున్న బడుగు జీవులపై పారిశుధ్య సిబ్బంది కనికరం లేకుండా క్లోరిన్ నీటిని స్ప్రే చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీ, నోయిడాల్లో పనులు చేసుకునే షాజహాన్‌పూర్ తదితర ప్రాంతాలకు చెందిన 50 మంది వలస కార్మికులు లాక్డౌన్ కారణంగా కుటుంబాలతోపాటు కాలినడకన సొంతూళ్లకు బయలుదేరారు. సోమవారం ఉదయం బరేలీ బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచి ఉన్న సమయంలో కొందరు మున్సిపల్ సిబ్బంది వారి వద్దకు వచ్చారు. కరోనా వైరస్‌ను చంపే మందు స్ప్రే చేస్తామని, ఆ తర్వాత భోజనం పెట్టి, సొంతూళ్లకు బస్సుల్లో తీసుకెళతామని నమ్మ బలికారు. అందరినీ ఒకేచోట కూర్చోబెట్టి బ్లీచింగ్ నీటిని వారిపైకి నిలువెల్లా తడిచిపోయేలా స్ప్రే చేశారు. దీంతో చిన్నారులు కళ్ల మంటలతో రోదించగా, పురుషులు, మహిళలు ఒళ్లంతా దురదతో ఇబ్బందిపడ్డారు. తడి దుస్తులతోనే వారంతా తిరిగి కాలినడక సాగించారు. కాగా, బడుగు జీవుల పట్ల మున్సిపల్ సిబ్బంది చూపిన కాఠిన్యంపై మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ‘వలస కార్మికులపై రసాయనాలు స్ప్రే చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇలా చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిందా? కార్మికులు పడిన యాతనలకు ఏం చికిత్స చేయించారు? స్ప్రే కారణంగా దుస్తులు తడిచిన వారికి ఏర్పాట్లు చేశారా? పాడైపోయిన వారి ఆహార పదార్థాలకు బదులుగా ఏం సమకూర్చారు?’అంటూ ట్విట్టర్లో ప్రశ్నలు సంధించారు. ఈ వ్యవహారంపై జిల్లా మేజిస్ట్రేట్ నితీశ్‡ స్పందించారు. స్థానిక సిబ్బంది చేసింది తప్పేనని ఒప్పుకున్నారు. ‘వలస కార్మికులు ప్రయాణించే బస్సులను శానిటైజ్ చేయాలని మాత్రమే ఆదేశించాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం బాధితులకు అవసరమైన వైద్యం చేయిస్తాం’ అని వివరణ ఇచ్చారు. కాగా, లాండ్రీల్లో వాడే బ్లీచ్‌లో సోడియం హైపోక్లోరైట్ ఉంటుంది. దీనిని క్రిమిసంహారిణిగా కూడా ఉపయోగిస్తారు. -
మాస్కులు లేకుండానే..
-
పారిశుధ్య కార్మికులకు కరోనా ఎఫెక్ట్!
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టకాలంలో చెత్త సేకరిస్తున్న జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మాస్కులు లేకుండానే వారు చెత్త సేకరణకు వెళ్లడంతో ఇంటి యజమానులు అభ్యంతరం చెప్తున్నారు. వైరస్ నియంత్రణ చర్యలు పాటించకుండా, గుర్తింపు కార్డులు లేకుండా ఇళ్లల్లోకి ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈనేపథ్యంలో కరోనా వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని తమకు గుర్తింపు కార్డులు, మాస్కులు, గ్లౌజులు ఇవ్వాలని జీహెచ్ఎంసీ కోరుతూ మాల్కాజిగిరి జోన్‌లోని పారిశుధ్య కార్మికులు డిప్యూటీ కమిషనర్‌కు వినతి పత్రం అందజేసారు. (చదవండి: ఇలాంటివి కూడా చోరీ చేస్తారా..!) లాక్డౌన్ నేపథ్యంలో గుర్తింపు కార్డులు లేవని పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారని, చెత్త సేకరణకు వెళితే ఇంటి యజమానులు సైతం గుర్తింపు కార్డులు, మాస్కులు ధరించపోతే రావద్దంటున్నారని పారిశుధ్య కార్మికులు వాపోయారు. కాగా, పారిశుధ్య కార్మికులకు స్థానికులు మద్దతుగా నిలిచారు. అధికారులు, ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే చెత్త సేకరణ ఆగిపోతుందని వారు హెచ్చరించారు. (చదవండి: దేశానికి సేవ చేసేందుకు ఎప్పుడూ సిద్ధమే: నటి) -
పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలి
హైదరాబాద్: గ్రామాభివృద్ధికి, గ్రామపారిశుధ్యానికి నిత్యం శ్రమించే పంచాయతీ పారిశుధ్య ఉద్యోగులు, కార్మికులను పర్మనెంట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, అర్హులను గ్రామకార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎల్బీనగర్లోని మినీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో శనివారం జరిగిన ఆత్మగౌరవ పోరాట సభలో ఆయన మాట్లాడారు. గ్రామాలను మల్లెపూవులాగా తీర్చిదిద్దేది పంచాయతీ కార్మికులు, ఉద్యోగులేనని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రాష్ట్ర ఖజానా నుంచి పంచాయతీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని కోరారు. పంచాయతీ ఉద్యోగులు ఓటర్లను ప్రభావితం చేసే శక్తివంతులని, వారి పొట్ట కొట్టినవాడు గాలిలో కలుస్తాడన్నారు. పంచాయతీ ఉద్యోగులు, కార్మికులను పర్మనెంట్ చేయకపోతే ఉద్య మాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేటీఆర్ మోసం చేశారు: సున్నం రాజయ్య 2015లో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె సమయంలో పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న కేటీఆర్ అన్ని రాజకీయపక్షాలు, ప్రజాసంఘాల సమక్షంలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఎమ్మెల్యే సున్నం రాజయ్య దుయ్యబట్టారు. కార్మికుల పక్షాన కలసి వచ్చే పార్టీలతో అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చి పోరాటం చేస్తామన్నారు. నెలల తరబడి జీతాల్లేక కార్మికులు వెట్టి చాకిరీ చేస్తున్నారని, తెలంగాణలో పంచాయతీ కార్మికుల ఆత్మగౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. 44 రోజులుగా పంచాయతీ కార్మికులు దీక్షలు చేస్తుంటే సీఎం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రకారం వెట్టి ఉండటానికి వీల్లేదని, పంచాయతీ కార్మికులు మాత్రం వెట్టిబతుకు బతకాల్సి వస్తోందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా వేతనాలు ఇచ్చుకోండని ప్రభుత్వం పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. వర్షం కురుస్తున్నా పంచాయతీ కార్మికులు లెక్కచేయకుండా సభకు హాజరై వక్తల ప్రసంగాలకు జేజేలు పలికారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు సాయిబాబు, పాలడుగు భాస్కర్, బీసీ సంక్షేమ సంఘం నేత గుజ్జ రమేష్, టీజీపీయూఎస్ రాష్ట్ర సలహాదారు నల్లా రాధాకృష్ణ, చిక్కుడు ప్రభాకర్, స్కైలాబ్‌బాబు, సౌదాని భూమన్నయాదవ్ పాల్గొన్నారు. -
బయో వ్యర్థాలతో ఆటలా..!
సాక్షి, పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ) : ఎంతో జాగ్రత్తగా తరలించాల్సిన బయో వ్యర్థాలను కేజీహెచ్ ఆవరణలో ఎక్కడబడితే అక్కడే పారిశుధ్య సిబ్బంది కాల్చేస్తున్నారు. బాటిల్స్‌లో సేకరించిన రక్త నమూనాలు, సిరంజిలు, పెప్పెట్లు వంటివి ఆవరణలో కాల్చేయడంతోపాటు తుప్పల్లో, డొంకల్లో పారేస్తున్నారు. అసలు వీటిని అంత నిర్లక్ష్యంగా ఎవరు బయటకు తీసుకొస్తున్నారో అంతుచిక్కడం లేదు. భవంతుల వెనుక ఉన్న ఖాళీ స్థలాల్లో వీటిని తగలబెట్డడం వల్ల ఎవరికీ తెలియడం లేదు. అటుగా వెళ్లిన రోగులు, వారి బంధువులు వీటిని చూసి భయపడుతున్నారు. విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని చెబుతున్నారు. బయో వ్యర్థాలను జాగ్రత్తగా తరలించాల్సిన పారిశుధ్య సిబ్బంది ఈ విధంగా చేయడం వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని... అధికారులు తగిన చర్యలు తీసుకొని సంబంధిత సిబ్బందిని హెచ్చరించాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. -
పిచ్చోళ్లను చేస్తున్నరు!
⇒ వైద్యులపై మండిపడిన మంత్రి ‘పోచారం’ ⇒ శానిటేషన్ అధ్వానంగా ఉంది, పరిశుభ్రత లేదు ⇒ మెడికల్ కళాశాల నిధుల వినియోగంపై స్పష్టత లేదు ⇒ పేద రోగులకు మానవత్వంతో సేవలందించాలని హితవు ⇒ సదరం శిబిరాల నిర్వహణపై కలెక్టర్ ఆగ్రహం ⇒ వాడీవేడీగా సాగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిజామాబాద్ అర్బన్ : ‘‘మేమేమైన పిచ్చోళ్లలాగా కనబడుతున్నామా, సూటిగా సమాధానం చెప్పరెందుకు? మమ్మల్నే తికమక పెడతరు. మీతో మాట్లాడితే పిచ్చి లేస్తుంది. ఎర్రగడ్డకు పోవల్సి వస్తుంది. ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మానవతా దృక్పథంతో సేవలందించండి. మీలో మీకు సమన్వ యం లేదు. పనిలో శ్రద్ధ లేదు. వైద్యసేవలు అస్తవ్యస్తంగా మారాయి’’ అంటూ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వైద్యులపై మండిపడ్డారు. సోమవారం జిల్లా ఆస్పత్రి అభివృద్ధి సంఘం సమీక్ష సమావేశం జరిగింది. ఆస్పత్రిలో సౌకర్యాలు, రోగుల అవసరాలపై చర్చించారు. వైద్యాధికారుల తీరుపై తీవ్రంగా చర్చ జరిగింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడు తూ ‘‘శానిటేషన్ ఎవరు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రికి రాగానే దుర్వాసన వస్తుంది. ఏ మాత్రం శుభ్రత లేదు. శానిటేషన్ సిబ్బంది ఎంత మంది ఉన్నారు. కాంట్రాక్టర్ ఎవరు? నెలకు ఎన్ని డబ్బులు చెల్లిస్తున్నారు’’ అంటూ ప్రశ్నించారు. రూ. 2.15 లక్షలు చెల్లిస్తున్నారని, 61 మంది సిబ్బంది ఉన్నారని కాంట్రాక్టర్ బదులిచ్చారు. కొత్త, పాతవారికి వేరువేరు బడ్జెట్లు ఉన్నాయని, నిధులు రావడం లేదన్నారు. ఆస్పత్రి శుభ్రంగా శుభ్రంగా ఉందని చెప్పడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మేమేమైనా పిచ్చోళ్లమా...మాకు కనిపించడం లేదా, ఎక్కడ ఉంది శుభ్రత, మమ్మల్నే తప్పుదోవ పట్టిస్తావా’’ అంటూ అసహనం వ్యక్తం చే శారు. శానిటేషన్ సిబ్బందికి గత జులై నుంచి నిధులు విడుదల కాలేదని చెప్పడంతో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, డీఎంఈ శ్రీనివాస్, వైద్యావిధాన పరిషత్ కమిషనర్ మీనాకుమారితో మంత్రి పోచారం ఫోన్లో మాట్లాడారు. నిధులకు సంబంధించి ఎవరూ అడగలేదని వారు చెప్పడంతో, సమన్వయం లేకనే పనులన్ని నిలిచి పోతున్నాయని, సక్రమంగా పనులు చేయాలని వైద్యులను హెచ్చరించారు. ఎందుకు వెళుతున్నారు? రేడియాలిస్టు సమయపాలన పాటించడం లేదని, అందుబాటులో ఉండడం లేదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త మంత్రి దృష్టికి తెచ్చారు. తాను పగలు 2.30 గంటలకు ఇంటికి వెళుతున్నానని రేడియాలజిస్టు చెప్పడంతో, ఎందుకు వెళుతున్నారంటూ మంత్రి ఎదురు ప్రశ్నించారు. సరైన సమాధానం రాకపోవడం తో, మీతో మాట్లాడితే మాకే పిచ్చి లేస్తుంది. ఎర్రగడ్డకు పోవల్సి వస్తుందంటూ మండిపడ్డారు. ఆస్పత్రికి వచ్చే పేదరోగులకు మానవతా దృక్పథంతో సేవలందించాలని సూచించారు. మెడికల్ కళాశాలకు మంజూరైన రూ. 26 కోట్లను ఎలా వినియోగిస్తారో అధికారులు చెప్పలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కొనసాగుతున్న జనరిక్ మందుల దుఆణాలు, ఆస్పత్రికి డబ్బులు చెల్లించకపోవడం, ఆస్పత్రిలో ఆవరణలో ఏర్పాటు చేసిన ఆంధ్ర బ్యాంకు ఏటీఎంకు కేవలం నెలకు రూ. 1500 మాతమే వసూలు చేయడాన్ని మంత్రి ప్రశ్నించారు. ఆస్పత్రిలో సైకిల్ స్టాండ్, క్యాంటిన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. జనరిక్ మందు ల దుకాణాలను టెండర్ల ద్వారా ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రి పక్షాన జరుగ కపోతే ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ‘సదరం’ ఇలాగేనా? సదరం నిర్వహణపై కలెక్టర్ మండిపడ్డారు. నియోజకవర్గాలవారీగా శిబిరాలు ఏర్పాటు చేస్తే జిల్లా ఆస్పత్రి వైద్యులు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ‘‘మీకు వాహనాలు ఏర్పాటు చేయాలా! మీరు ప్రభుత్వ వైద్యులు కారా! వైద్యులు లేరని ఆర్మూర్ నుంచి తరచూ ఫోన్లు వచ్చాయి. సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకోండి’’ అని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. డీసీహెచ్ఎస్ శివదాస్ సమాధానం చెప్పకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, మేయర్ ఆకుల సుజాత, కళాశాల ప్రిన్సిపాల్ జీజీయాబాయి, డీఎంహెచ్ఓ గోవింద్‌వాగ్‌మోరే, ఆస్పత్రి సూ ప రిండెంట్ భీంసింగ్, ఆర్‌ఎంఓలు రజినీకాంత్, బ న్సీలాల్, విశాల్ పాల్గొ న్నారు. అంతకు ముం దు మంత్రి పోచారం ఆ స్పత్రిలోని వివిధ వా ర్డులను తిరుగుతూ పరి శీలించారు.