పిచ్చోళ్లను చేస్తున్నరు!
⇒ వైద్యులపై మండిపడిన మంత్రి ‘పోచారం’
⇒ శానిటేషన్ అధ్వానంగా ఉంది, పరిశుభ్రత లేదు
⇒ మెడికల్ కళాశాల నిధుల వినియోగంపై స్పష్టత లేదు
⇒ పేద రోగులకు మానవత్వంతో సేవలందించాలని హితవు
⇒ సదరం శిబిరాల నిర్వహణపై కలెక్టర్ ఆగ్రహం
⇒ వాడీవేడీగా సాగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం
నిజామాబాద్ అర్బన్ : ‘‘మేమేమైన పిచ్చోళ్లలాగా కనబడుతున్నామా, సూటిగా సమాధానం చెప్పరెందుకు? మమ్మల్నే తికమక పెడతరు. మీతో మాట్లాడితే పిచ్చి లేస్తుంది. ఎర్రగడ్డకు పోవల్సి వస్తుంది. ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మానవతా దృక్పథంతో సేవలందించండి. మీలో మీకు సమన్వ యం లేదు. పనిలో శ్రద్ధ లేదు. వైద్యసేవలు అస్తవ్యస్తంగా మారాయి’’ అంటూ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వైద్యులపై మండిపడ్డారు.
సోమవారం జిల్లా ఆస్పత్రి అభివృద్ధి సంఘం సమీక్ష సమావేశం జరిగింది. ఆస్పత్రిలో సౌకర్యాలు, రోగుల అవసరాలపై చర్చించారు. వైద్యాధికారుల తీరుపై తీవ్రంగా చర్చ జరిగింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడు తూ ‘‘శానిటేషన్ ఎవరు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రికి రాగానే దుర్వాసన వస్తుంది. ఏ మాత్రం శుభ్రత లేదు. శానిటేషన్ సిబ్బంది ఎంత మంది ఉన్నారు. కాంట్రాక్టర్ ఎవరు? నెలకు ఎన్ని డబ్బులు చెల్లిస్తున్నారు’’ అంటూ ప్రశ్నించారు.
రూ. 2.15 లక్షలు చెల్లిస్తున్నారని, 61 మంది సిబ్బంది ఉన్నారని కాంట్రాక్టర్ బదులిచ్చారు. కొత్త, పాతవారికి వేరువేరు బడ్జెట్‌లు ఉన్నాయని, నిధులు రావడం లేదన్నారు. ఆస్పత్రి శుభ్రంగా శుభ్రంగా ఉందని చెప్పడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మేమేమైనా పిచ్చోళ్లమా...మాకు కనిపించడం లేదా, ఎక్కడ ఉంది శుభ్రత, మమ్మల్నే తప్పుదోవ పట్టిస్తావా’’ అంటూ అసహనం వ్యక్తం చే శారు.
శానిటేషన్ సిబ్బందికి గత జులై నుంచి నిధులు విడుదల కాలేదని చెప్పడంతో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, డీఎంఈ శ్రీనివాస్, వైద్యావిధాన పరిషత్ కమిషనర్ మీనాకుమారితో మంత్రి పోచారం ఫోన్‌లో మాట్లాడారు. నిధులకు సంబంధించి ఎవరూ అడగలేదని వారు చెప్పడంతో, సమన్వయం లేకనే పనులన్ని నిలిచి పోతున్నాయని, సక్రమంగా పనులు చేయాలని వైద్యులను హెచ్చరించారు.
ఎందుకు వెళుతున్నారు?
రేడియాలిస్టు సమయపాలన పాటించడం లేదని, అందుబాటులో ఉండడం లేదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త మంత్రి దృష్టికి తెచ్చారు. తాను పగలు 2.30 గంటలకు ఇంటికి వెళుతున్నానని రేడియాలజిస్టు చెప్పడంతో, ఎందుకు వెళుతున్నారంటూ మంత్రి ఎదురు ప్రశ్నించారు. సరైన సమాధానం రాకపోవడం తో, మీతో మాట్లాడితే మాకే పిచ్చి లేస్తుంది. ఎర్రగడ్డకు పోవల్సి వస్తుందంటూ మండిపడ్డారు.
ఆస్పత్రికి వచ్చే పేదరోగులకు మానవతా దృక్పథంతో సేవలందించాలని సూచించారు. మెడికల్ కళాశాలకు మంజూరైన రూ. 26 కోట్లను ఎలా వినియోగిస్తారో అధికారులు చెప్పలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కొనసాగుతున్న జనరిక్ మందుల దుఆణాలు, ఆస్పత్రికి డబ్బులు చెల్లించకపోవడం, ఆస్పత్రిలో ఆవరణలో ఏర్పాటు చేసిన ఆంధ్ర బ్యాంకు ఏటీఎంకు కేవలం నెలకు రూ. 1500 మాతమే వసూలు చేయడాన్ని మంత్రి ప్రశ్నించారు. ఆస్పత్రిలో సైకిల్ స్టాండ్, క్యాంటిన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. జనరిక్ మందు ల దుకాణాలను టెండర్ల ద్వారా ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రి పక్షాన జరుగ కపోతే ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
‘సదరం’ ఇలాగేనా?
సదరం నిర్వహణపై కలెక్టర్ మండిపడ్డారు. నియోజకవర్గాలవారీగా శిబిరాలు ఏర్పాటు చేస్తే జిల్లా ఆస్పత్రి వైద్యులు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ‘‘మీకు వాహనాలు ఏర్పాటు చేయాలా! మీరు ప్రభుత్వ వైద్యులు కారా! వైద్యులు లేరని ఆర్మూర్ నుంచి తరచూ ఫోన్లు వచ్చాయి. సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకోండి’’ అని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. డీసీహెచ్‌ఎస్ శివదాస్ సమాధానం చెప్పకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో జడ్‌పీ చైర్మన్ దఫేదర్ రాజు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, మేయర్ ఆకుల సుజాత, కళాశాల ప్రిన్సిపాల్ జీజీయాబాయి, డీఎంహెచ్‌ఓ గోవింద్‌వాగ్‌మోరే, ఆస్పత్రి సూ ప రిండెంట్ భీంసింగ్, ఆర్‌ఎంఓలు రజినీకాంత్, బ న్సీలాల్, విశాల్ పాల్గొ న్నారు. అంతకు ముం దు మంత్రి పోచారం ఆ స్పత్రిలోని వివిధ వా ర్డులను తిరుగుతూ పరి శీలించారు.