Mental
-
చెత్త కుండీలోని పేపరు ముక్కలను కూడా చదవకుండా ఉండలేను..?
డాక్టర్ గారూ! నా సమస్య మీకు వింతగా అనిపించవచ్చు. గత రెండు సంవత్సరాల నుంచి విపరీతంగా నవలలు, వీక్లీలు... ఒకటేమిటి... ఏ పుస్తకం కనబడినా చదవడం అలవాటైంది. క్లాసు పుస్తకాలు చదువుతుంటే నేను చదివిన నవలల్లోని పాత్రలు, సన్నివేశాలు కళ్ళ ముందు మెదిలి చదవలేక΄ోతున్నాను. దానివల్ల ఆ చదువు ముందుకెళ్ళడం లేదు. ఏదైనా కొత్త పుస్తకం కనబడితే, వెంటనే మొత్తం చదవక΄ోతే, ఏదో పోగొట్టుకున్న భావన కలుగుతుంది. ఆఖరుకు చెత్త కుండీలోని పేపరు ముక్కలు కూడా తీసి చదవందే మనసు నిలకడగా ఉండడం లేదు. ఈ అలవాటును ఎంత మానుకుందాం అనుకున్నా మానలేకపోతున్నాను. దీనివల్ల నేను బీటెక్ పూర్తి చేయలేనేమోనని భయంగా ఉంది. సలహా ఇవ్వగలరు. – చందన, విజయనగరంపుస్తకాలు, నవలలు చదవడం మంచి అలవాటే! కానీ ఏ అలవాటైనా అతిగా చేయడం మంచిదికాదు. కొత్త పుస్తకం కనబడిన వెంటనే మొత్తం చదవాలనే తపన, చదవక΄ోతే ఏదో తెలియని అలజడి ఇవన్నీ ఒక ఎత్తైతే, చివరకు చెత్త కుండీలోని పేపరు ముక్కలను కూడా ఏరుకుని చదవందే ఉండలేక΄ోవడమనేది ఖచ్చితంగా ఒక మానసిక రుగ్మతే! ‘ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’ అనే మానసిక జబ్బుకు లోనైనవారే ఇలా ప్రవర్తిస్తారు. అలా అతిగా చదవాలనే తపన పడటం, ఆ అలవాటును మీరు మానుకోవాలనుకున్నా మానుకోలేకపోవడం ఈ మానసిక సమస్య ముఖ్య లక్షణం. మెదడులోని ‘సెరొటోనిన్’ అనే ప్రత్యేక రసాయనిక పదార్థం సమతుల్యంలో తేడాలొచ్చినప్పుడు, మీరు చెప్పిన లాంటి లక్షణాలు బయటపడతాయి. ‘క్లోమిప్రెమిన్ ప్లూ ఆక్సిటెన్’ అనే మందుల ద్వారాను, ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’ అనే ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారానూ ఈ సమస్య నుంచి మిమ్మల్ని పూర్తిగా బయట పడేయవచ్చు. మీరు వెంటనే మంచి సైకియాట్రిస్ట్ట్ను కలిస్తే మీ సమస్యకు తగిన చికిత్స చేస్తారు. మీరు మీ బీటెక్ చదువు త్వరలోనే విజయవంతంగా పూర్తి చేయగలరు. ధైర్యంగా ముందుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్!ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com(చదవండి: ఇదేం నిరసన..!'గడ్డం తొలగించండి.. ప్రేమను కాపాడండి’) -
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం బ్రేక్ తీసుకోవడమే మంచిదా..?
మన దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్‌లో (Paris Olympics 2024) పతకం లక్ష్యంగా బరిలోకి దిగి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తన ఓటమికి గల కారణాలను వివరిస్తూ..తన మనసు శరీరం విరామం కోరుకుంటుందంటూ భావోద్వేగంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టంది. మానసిక శారీరం ఆరోగ్యం కోసం కాస్త విరామం తీసుకుని బ్యాడ్మింటన్‌లో కొనసాగుతానని చెప్పుకొచ్చింది. ఇక్కడ పీవీ సింధు తీసుకున్న నిర్ణయాన్ని ఆరోగ్య నిపుణులు స్వాగతించడమే గాక ప్రశంసించారు. నిజానికి శారీరక మానసిక ఆరోగ్యం కోసం కాస్త విరామం తీసుకోవడమే మంచిదా..? నిపుణులే ఏమంటున్నారంటే..ఏ వృత్తి లేదా క్రీడల్లో ఒత్తిడి అనేది సహజం. ప్రతిసారి మనదే పైచేయి అవుతుందని చెప్పలేం. అలాగే మనపై మన వాళ్లు పెట్టుకునే భారీ అంచనాలు ఒక్కోసారి తలకిందులై విమర్శలపాలవ్వుతాం. అలాంటప్పుడు చాలా సంయమనంగా వ్యవహరించాలి. అన్నికంటే ముఖ్యంగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాల్సిన క్లిష్టమైన సమయం అని అంటున్నారు నిపుణులు. ఇక్కడ పీవీ సింధుపై భారీ అంచానలు ఉన్నాయి. ఈసారి ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలుచుకుంటుందనుకున్నారు. అలాగే ఆమె కూడా విజయం తనదే అని గట్టిగా విశ్వసించింది. అందుకోసం జరిగిన ప్రిపరేషన్లో గాయాలు, ఒత్తిడి మాములుగా ఉండవు. తీరా బరిలోకి దిగాక ప్రత్యర్థి ఎత్తు, దూకుడు ఊహకందని విషయం అనేది తెలిసిందే. అనుకోని రీతీలో పరాజయం పాలైతే ఎంత పెద్ద స్టార్ ఆటగాడికైన జీర్ణించుకోలేని బాధ, ఆవేదన ఉంటాయి. అయినా ఆటలో గెలుపోటములు సహజం అని తెలిసినా..ఒక్కోసారి ఇంత కష్టం వృధా అయ్యిందన్న బాధ నిలువనియ్యదు. అలాంటప్పడే ఏ మనిషి అయినా సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అమూల్యమైన సమయం. ఇక్కడ కోపం, బాధను పక్కన పెట్టి మానసికంగా దృఢంగా ఉండేందుకు యత్నించాలి. అంటే ఆరోగ్యంపై పూర్తి దృష్టిసారించగలిగితేనా ఏదైనా చేయడం సాధ్యం అవుతుందనేది గుర్తించాలి. అదే పని సింధు చేసింది ఇక్కడ. అలుపెరగని ప్రాక్టీస్, ఒత్తిడులతో అలసిపోయానని చెప్పడమే గాక తన మనుస్సు, శరీరం విశ్రాంతి కోరుకుంటుందనే సంకేతాల్ని గుర్తించి ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చింది సింధు. అన్ని సంపదల్లోకెల్లా "ఆరోగ్యమే మహాభాగ్యం" అన్న నానుడిని స్పురణకు తీసుకొచ్చింది. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని చెప్పకనే చెప్పింది అని నిపుణులు అంటున్నారు. ఆటలోనే కాదు జీవనశైలిలోనూ స్ఫూర్తిగా నిలిచిందంటూ సింధు నిర్ణయాన్ని కొనియాడుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎప్పుడైనా శరీరం, మనసు తాను బాగాలేను, సిద్ధంగా లేను అని చెబుతున్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. కాస్త విశ్రాంతి తీసుకుని నూతన ఉత్సాహంతో మళ్లీ కార్యరంగంలోకి దిగి మంచి మంచి విజయాలను అందుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అప్పుడే కెరీర్ పరంగానూ, వ్యక్తిగతంగానూ బాగుంటాం అని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: వర్షాకాలంలో పచ్చి బాదంపప్పులే ఎందుకు తినాలంటే..?) -
బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
పట్టరాని కోపం, చిరాకు వచ్చినప్పుడు మాట్లాడే భాష, వైఖరీ మారిపోతుంది. అనాలనుకున్న నాలుగు మాటలు అనేస్తా గానీ ఆ కోపం తగ్గిన ఫీలింగ్ రాదు. కోపం, భాధ, ఆవేదన వంటి భావోద్వేగాలను కొందరూ ఆపుకోలేరు. ఏదైన ఎక్స్‌ప్రెస్ చేసేయాల్సిందే. అయితే ఇలా మనసులో బాధ, కోపాన్ని వెళ్లగక్కడమే మంచిదంటున్నారు. ఆ టైంలో పరుషంగా లేదా బ్యాడ్ లాంగ్వేజ్‌లో మాట్లాడటం వంటివి చేస్తాం. ఇలా చేయడమే మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలా చేస్తే మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. ఇదేంటీ..బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడమని ప్రోత్సహిస్తున్నారా అని కోప్పడకండి. ఇలా అనడానకి కారణం ఏంటంటే..కోపం, ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడూ బ్యాడ్ లాంగ్వేజ్‌లో మాట్లాడుతుంటారు. కొందరూ ఆ వ్యక్తి మీద లేదా పని మీద కోపాన్ని ఇలా పరుష పదజాలం రూపంలో బయటకు వెళ్లగక్కేస్తారు. ఇలా చేస్తే మనసులో ఉన్న బాధ, కోపం, ఒత్తిడి తగ్గిపోయి రీలిఫ్ అయిపోతారట. ఒత్తిడి లేదా ఆందోళనను వదిలించుకోవడానికి ఇదో ఒక గొప్ప మార్గం అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అందుకోసం పాక్ వైద్యుడు వకార్ హుస్సేన్ పది మంది పెద్దలు, దాదాపు 98 మంది పురుషులు, 155 మంది స్త్రీలపై వివిధ దశల వారిగా అధ్యయనం చేశారు. వారిలో కొందరూ భావోద్వేగాలను అణుచుకుని బయటకు ఎక్స్ప్రెస్చేయకపోవడంతో..వారిలో ఆందోళన, ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు వెల్లడయ్యింది. తమ కోపాన్ని, చిరాకుని వెళ్లగక్కేలా బ్యాడ్ లాంగ్వేజ్‌లో మాట్లాడే పురుషులు, స్త్రీలల్లో ఆందోళన, ఒత్తిడి తక్కువగా ఉన్నట్లు తేలింది. అంతేగాదు పరిశోధనలో భావోద్వేగాలను అణిచివేయడం లేదా దాచేసుకునే వారిలో మానసిక ఆరోగ్యం క్షీణించిపోయి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని వెల్లడించారు వైద్యుడు హుస్సేన్.అయితే ప్రతిసారి ఇలా అగ్రెసివ్‌గా లేదా కోపంగా చిరాకులో మాట్లాడే కఠిన పరుష పదజాలం.. మన స్నేహితులు, బంధువుల మనసులు గాయపడేలా చేస్తాయి. ఒక రకంగా బంధాలు దూరమవుతాయి. అందుకే మన పెద్దలు కోపంలో వచ్చే ప్రతి మాట మనిషి వినాశనానికి హేతువు అని నొక్కి చెబుతుంటారు. కోపంగా ఉన్నప్పుడూ ఏదో ఒక పని చేయడం లేదా అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోవడం వంటివి చేయమంటారు. సైంటిఫిక్‌గా ఇలా వెళ్లగక్కడం వల్ల లోపలున్న బాధ లేదా కోపం తీరిపోయి ఆ క్షణం మీరు బాగున్నట్లు ఉన్నా దీర్ఘకాలంలో..అదే మన బాంధవ్యాలను విచ్ఛిన్నం చేసి మనల్ని ఒంటరిని చేసే అవకాశం ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ కోపం, బాధ, ఆందోళన, ఒత్తిడి, చిరాకులను తగ్గించుకునే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోమని సూచిస్తున్నారు. అవేంటంటే..స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లు, కంప్యూటర్లతో గడిపే సమాయాన్ని ఏదో విధంగా తగ్గించడంకెఫిన్ ఎక్కువగా తీసుకోవడం తగ్గించండియోగా, మెడిటేషన్ వంటివి చేయండిబ్రీథింగ్ ఎక్సర్సైజులు కూడా ఈ భావోద్వేగాలను జయించగలిగేలా చేస్తుంది. అతిగా కాఫీ లేదా టీ, ఎనర్జీ డ్రింక్స్ వంటివి కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తాయి. ఇవి ఆందోళనకు, నిద్రలేమికి కారణమవుతాయి. అన్ని వయసుల వారు వ్యాయామం చేయడానికి కనీసం 30 నిమిషాలు కేటాయించడం మంచిది. దీని వల్ల బ్రెయిన్లో కార్డిసాల్ స్థాయిలు తగ్గి శ్వాసపై ధ్యాస పెరుగుతుంది. ఇలాంటి వాటితో భావోద్వేగాలను జయించి.. ఆరోగ్యకరమైన ఆనందకర జీవితాన్ని గడపండి అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: మోదీ ప్రమాణా స్వీకారోత్సవంలో పాల్గొననున్న మహిళా లోకో పైలట్లు వీరే..!) -
నిడదవోలులో మానసిక దివ్యాంగులకు అండగా నాట్స్
అమెరికాలో తెలుగు వారికి పలుసార్లు అండగా నిలిచిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తెలుగు రాష్ట్రాల్లోనూ సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నిడదవోలు మండలం రావిమెట్లలో హృదయాలయం మానసిక దివ్యాంగుల పాఠశాలకు నాట్స్ తన వంతు చేయూత అందించింది. ఈ క్రమంలోనే నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ఈ పాఠశాలను సందర్శించారు. మానసిక దివ్యాంగుల చదువుకు వినియోగించే మెటీరియల్ కోసం 50 వేల రూపాయలను నాట్స్ అందించింది. హోప్ ఫర్ స్పందన సహకారంతో గత కొంత కాలంగా నాట్స్ మానసిక దివ్యాంగులకు చేయూత అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది. సమాజంలో మానసిక దివ్యాంగులకు మానవత్వంతో ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన బాధ్యత ఉందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి అన్నారు. నాట్స్ మానసిక దివ్యాంగులకు అండగా నిలిచేందుకు తన వంతు సహకారం అందిస్తుందని తెలిపారు. దివ్యాంగుల కోసం నాట్స్‌తో కలిసి పనిచేస్తున్న హోఫ్ ఫర్ స్పందనకు నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తి మృతి..వాటర్ ట్యాంక్‌ని క్లీన్ చేస్తుండగా..) -
రామానాయుడు ఫిలిం స్కూల్లో కౌన్సిలింగ్ ఫౌండేషన్ కోర్సు !
మానవుని దైనందిన జీవితంలో అతి ముఖ్యమైనది మానసిక ఆరోగ్యం. ప్రస్తుత బిజీ లైఫ్‌లో సంపాదన పరుగులో మనిషికి మానసిక ప్రశాంతత దారుణంగా కరువయ్యిందనే చెప్పాలి. అందుకోసం తాను ఏం చేయాలన్నది కూడా స్ప్రుహ లేనంత గందరగోళంలో ఉన్నాడు. దీంతో సమస్యలన్నీ ఒక పెనుభూతంలా కనిపించి ఎదుర్కొనే స్థైర్యం లేక నిసత్తువుగా మారిపోతున్నాడు. విద్యార్థుల నుంచి పెద్ద పారిశ్రామిక వేత్తల వరకు అందర్ని వేధిస్తున్న సమస్యే ఈ మానసిక అనారోగ్యం.దీన్ని మెరుగుపరుచుకుని మనల్ని మనం సంసిద్ధం చేసుకునేలా కౌన్సిలింగ్ ఇచ్చే చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. అలానే రామానయుడు ఫిల్మ్ స్కూల్ ముందుకొచ్చింది. ఈ మేరకు గ్లోబల్ వెల్ఫేర్ ఫౌండేషన్, ముదిత ట్రైబ్ ఫౌండేషన్ల సహకారంతో రామా నాయుడు ఫిల్మ్ స్కూల్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే నో కాస్ట్ ఫౌండేషన్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని పర్సన్-టు-పర్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిస్టియన్ కౌన్సెలింగ్ అనే సంస్థ నిర్వహిస్తుంది. దీని ద్వారా ఆయా వ్యక్తులు సహ కౌన్సిలర్లుగా మారి తమ కమ్యూనిటీలలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించే స్థాయికి చేరేలా ఈ కోర్సుని రూపొందించారు.మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కౌన్సిలింగ్ నో కాస్ట్ ఫౌండేషన్ కోర్సు రామానాయుడు ఫిలిం స్కూల్లో ఇవాళ మే 1 నుంచి ప్రారంభమై మే 6, 2024 వరకు నిర్వహిస్తున్నారు. ఈ వారం రోజుల ఫౌండేషన్ కోర్సు కోసం సుమారు 56 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. కరోనా మహమ్మారి తర్వాత మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కౌన్సిలర్ల డిమాండ్ ఎక్కువయ్యిందని గ్లోబల్ వెల్ఫేర్ ఫౌండేషకి చెందిన శ్రీనివాసన్ లింగేశ్వరన్ అన్నారు. ఆ డిమాండ్‌ని తీర్చే ఉద్దేశ్యంతోనే ఈ కోర్సుని రూపొందిచడం జరిగిందని చెప్పారు. ఇది కేవలం కౌన్సిలర్ల కొరత సమస్యను పరిష్కరించడమే కాకుండా మానిసిక ఆరోగ్యాన్ని గురించి అవగాహన కల్పించేలా ప్రాధాన్యత ఇచ్చేలా చేసి సంపూర్ణ సంక్షేమ నిబద్ధతకు పెద్ద పీట వేస్తుంది. ఈ మేరకు ముదిత వ్యవస్థాపకురాలు మిహీకా దగ్గుబాటి మాట్లాడుతూ..ఎటువంటి ఖర్చు లేకుండా వారివారీ కమ్యూనిటీలలో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా శక్తిమంతంగా చేయడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఇలాంటి కోర్సులు నగరంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి ప్రభావాన్ని చూపిస్తాయని రామానాయుడు పిల్మ్ స్కూల్ చైర్మన్ డి సురేష్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యాసకులకు ఇద్దరూ ప్రఖ్యాత మనస్తత్వవేత్తలు కౌన్సిలింగ్ ద్వారా మాసిక ఆరోగ్యంపై లోతైన అవగాహానను, ఆచరణాత్మక పద్ధతుల గురించి కూలంకషంగా తెలియజేస్తారు. ఈ కోర్సులో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కీలక అంశాలన్నింటిని నిపుణులు కవర్ చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయా వ్యక్తులు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే గాక ఇతరులను ప్రభావితం చేసేలా కౌన్సిలర్లుగా మారి సంతోషకరమైన సమాజానికి బాటలు వేస్తారు. ఇంకెందుకు ఆలస్యం ఈ కోర్సులో జాయిన్ అయ్యి ఉజ్వల భవిష్యత్తు దిశగా ఇవాళ నుంచే తొలి అడుగులు వేద్దాం. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!) -
స్పీచ్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఒక్క రోజులో ఏం జరుగుతుంది?
ఊరుకున్నంత ఉత్తమం లేదని మన పెద్దలు అంటుంటారు. అతిగా మాట్లాడటం వల్ల లేనిపోని సమస్యలు తలెత్తడమే కాకుండా మానసిక శక్తి బలహీనపడుతుంది. కొన్నిసార్లు అతిగా మాట్లాడటం పెద్దపెద్ద వివాదాలకు దారితీస్తుంది. మౌనం వహించడం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ షౌనక్ అజింక్యా మౌనం గొప్పదనాన్ని వివరించారు. ఒక రోజంతా నిశ్శబ్దంగా ఉంటే అది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. ‘స్పీచ్ ఫాస్టింగ్’ గొంతులోని స్వర తంతువు (వాయిస్ రీడ్స్)లకు విశ్రాంతిని ఇస్తుంది. రోజంతా నిశ్శబ్దంగా ఉంటడం ఒత్తిడిని తగ్గిస్తుంది. అలసటను తొలగిస్తుంది. కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది. శరీరానికి విశ్రాంతినిస్తుంది. ప్రశాంతమైన నిద్రకు దోహదపడుతుంది. రోజంతా మౌనంగా లేదా అధికంగా మాట్లాడకుండా ఉండగలిగితే మానసిక స్వాంతనను పొందుతారు. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినగలుగుతారు. మౌనంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెరుగుపడతాయి. పలు మతాలలో మౌనవ్రతం అనేది భగవంతుడిని చేరుకునేందుకు ఒక మార్గంగా చెబుతారు. మౌనవ్రతం అంతర్గత బలాన్ని పెంచుతుంది. మనలోని అంతరంగాన్ని అర్థం చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. రోజంతా మౌనంగా ఉండటం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుందని డాక్టర్ అజింక్య తెలిపారు. స్వర తంతువులు, గొంతు కండరాలు, ముఖ కండరాలు రిలాక్స్ అవుతాయి. అధికసమయం మౌనంగా ఉండటం, గాఢమైన శ్వాస తీసుకోవడం వల్ల శరీరం రిలాక్స్ అవడమే కాకుండా రక్తపోటు అదుపులో ఉంటుంది. బీపీని అదుపులో ఉంచుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. తక్కువగా మాట్లాడటం వల్ల మెదడుకు పదును పెట్టినట్లవువుతుంది. అలాగే పరధ్యానం తొలగి, మరింత ఏకాగ్రత ఏర్పడుతుందని అజింక్య వివరించారు. -
మీకు తెలుసా? మైండ్లోనూ డిక్షనరీ ఉంటుదట!
డిక్షనరీ అనేది బుక్‌షెల్ఫ్‌లోనే కాదు మనలోనూ ఉంటుంది. దీన్ని మెంటల్ డిక్షనరీ అంటారు. ఫిజికల్ డిక్షనరీలాగే ఈ మెంటల్ డిక్షనరీలోనూ రకరకాల పదాలు, వాటికి సంబంధించిన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. మెంటల్ డిక్షనరీ విషయంలో ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య స్వల్ప తేడాలు ఉంటాయి. రకరకాల కారణాల వల్ల కొందరి మెంటల్ డిక్షనరీలో పరిమితమైన పదసంపద మాత్రమే ఉండొచ్చు. కొందరి విషయంలో మాత్రం విద్య, కళలు, జీవితానుభవాలు...మొదలైన వాటి వల్ల పదసంపద ఎక్కువగా ఉంటుంది. 20 సంవత్సరాల అమెరికన్ ఇంగ్లీష్ స్పీకర్‌కు 40,000 పదాల వరకు తెలిసి ఉంటాయని, 60 ఏళ్ల వయసులో ఆ పదాల సంఖ్య 48,000లకు చేరుతుందని, కొందరి విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు. కొన్ని సందర్భాలలో మనం ఉపయోగించాల్సిన పదం గురించి తెలిసినా గుర్తు రాకపోవచ్చు. ఈ పరిస్థితిని టిప్–ఆఫ్–ది–టంగ్ ఫినామినన్ అంటారు, వయసు పెరుగుతున్న కొద్దీ ఈ పరిస్థితి ఎక్కువగా ఎదురవుతుంది. (చదవండి: చీరకట్టులో కత్తి పాఠాలు! ఆమె కర్ర పట్టిందంటే.. మైమరచిపోవాల్సిందే) -
‘బాసర’ విద్యార్థుల కోసం ఏఐ యాప్
నిర్మల్ బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులకు మానసిక, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన ఆర్ట్ఫీషెయల్ ఇంటెలిజెన్స్(ఏఐ) బేస్డ్ ప్లాట్ ఫాం యాప్‌పై అవగాహన కల్పించారు. ఇటీవల అక్కడ వరుసగా చోటుచేసుకుంటున్న ఆత్మహత్యల ఘటనలపై ‘ఎందుకలా చనిపోతున్నారు..’శీర్షికన ‘సాక్షి’మెయిన్‌పేజీలో గురువారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించి సంగతి తెలిసిందే. ఈమేరకు వర్సిటీ వర్గాలు స్పందించాయి. ప్రముఖ మానసిక నిపుణులు అమెరికాకు చెందిన డాక్టర్ మైక్, బిట్స్‌పిలానీ ప్రొఫెసర్ మోహన్‌తో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇన్చార్జి వైస్‌చాన్స్‌లర్ వెంకటరమణ ఏఐ యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మానసిక స్థితిపై.. విద్యార్థి మానసిక స్థితిని తెలుసుకోవడానికి ఏఐ బేస్డ్ యాప్ బాగా ఉపయోగపడుతుందని అమెరికా మానసిక నిపుణుడు మైక్ అన్నారు. ఈ యాప్ ద్వారా అడిగే 17 ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వారు సమాధానాలు ఇచ్చిన తర్వాత వాటిని నిపుణుల విశ్లేషణ, సంప్రదింపుల తర్వాత విద్యారి్థకి ఏ మోతాదులో మానసిక సహాయం చేయాలనేది నిర్ణయిస్తామన్నారు. విశ్లేషణాత్మక డేటా, నిపుణుల అనుభవం ద్వారా వారికి సహాయం అందిస్తామని చెప్పారు. బిట్స్ పిలానీ ప్రొఫెసర్ మోహన్ మాట్లాడుతూ విద్యార్థులకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. -
మీకు మీరే నిజమైన స్నేహితుడు, మీరే అసలైన శత్రువు
సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య మానసిక రోగం. నిజమైన బయటకు చెప్పుకోలేం కానీ.. చుట్టున్న ప్రపంచంలో ఎంతో మంది మానసిక రోగులు... నాతో సహ. అయితే ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన సమస్య ఉంది. కొందరు నియంత్రించుకోవచ్చు. మరికొందరు సమస్యలో పీకల్లోతులో ఇరుక్కుపోవచ్చు. ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా బయటపడాలి? మన చుట్టున్న ప్రపంచంలో భౌతికంగా ఒక్కొక్కరు ఒక్కోలా కనిపిస్తారు. కొందరు ఎత్తుంటారు, మరికొందరు చిన్నగా ఉంటారు. కొందరు అందంగా కనిపిస్తారు. మరికొందరు అందంగా కనిపించేందుకు ఆరాటపడతారు. భౌతికంగానే కాదు, మానసికంగా కూడా చాలా తేడాలుంటాయి. భౌతికంగా గొప్పగా కనిపించడం వేరు, మానసికంగా వ్యక్తిత్వంలో ఉన్నతంగా ఉండడం వేరు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలబడాలంటే ఎంతో శక్తి కావాలి. కానీ మన చుట్టున్న వారిలో కొందరు ఈ పోటీని తట్టుకోలేక ఒత్తిడికి గురయి మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. అసలు సైకాలజికల్‌గా సమస్యలేంటాయి? ఎన్ని స్థాయిలు ఉన్నాయి? లెవల్ - 1 - (అయోమయం, గందరగోళం) మనం ఈ పోటీ ప్రపంచంలో గెలవాలన్న ఆరాటం ఈ పోటీలో ఏమవుతుందో అన్న భయం, ఆందోళన సరైన దారిలో గెలవలేం కాబట్టి ప్రత్యామ్నయాల కోసం వెతుకులాట పక్కదారులు పట్టే ఆలోచనలు, అదుపు తప్పే మనసు చెడు అలవాట్లకు బానిస (డ్రగ్స్, మద్యం, పోర్నో, మొబైల్ అడిక్షన్) ఇతరులను విమర్శించడం, నేనే కరెక్ట్ అనుకోవడం నచ్చజెప్పడానికి ఎవరు (అమ్మ, నాన్నతో సహా) ప్రయత్నించినా.. వారు చెప్పేదంతా తప్పు అనుకోవడం వాదించడం, గొడవ పడడం, వక్రమార్గంలోనైనా గెలవాలని తాపత్రయపడడం Reminder pic.twitter.com/YVVFXJS135— Wise Chimp (@wise_chimp) August 5, 2023 లెవల్ - 1(అయోమయం, గందరగోళం)లో పరిశీలనలు ఎలాంటి పాజిటివిటీ ఉండదు వీళ్లంతట వీళ్లే సమస్య నుంచి ఎప్పటికీ బయటకు రాలేదు ఏదో ఒక ప్రయత్నం చేస్తే తప్ప మార్పు రాదు ఎవరో ఒకరు వీళ్లను బయటకు తీసుకురాగలిగితే తప్ప ఇలాంటి వాళ్లు సమస్య నుంచి బయటకు రాలేరు లెవల్ - 2 - కార్యసాధకులు, విజేతలు - లక్షణాలు ఏం నేర్చుకోవాలి? ఎలా సాధించాలి? ఎలాంటి కఠిన పరిస్థితులకయినా అలవాటు పడే, సర్దుకునే నైజం నేను గెలవాలి, నాకున్న నైపుణ్యాలు ఎలా ఉపయోగపడతాయి? మరింత ముందుకు వెళ్లాలంటే ఏం నేర్చుకోవాలి? ఏం తెలుసుకోవాలి? చుట్టున్న సమాజాన్ని ఎలా మంచి కోసం వినియోగించుకోవాలి? అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లేలా నేనేం చేయాలి? నేను గెలుస్తాను సరే, మరికొంతమందికి ఎలా సాయ పడగలను? May you always fly high like your helicopter shots. Happy birthday, MS! pic.twitter.com/f9aqiY6HV0 — Sachin Tendulkar (@sachin_rt) July 7, 2023 లెవల్ - 2 - కార్యసాధకులు, విజేతలు - పరిశీలనలు మన చుట్టున్న విజేతల్లో ఇదే మీరు చూస్తారు. మన మధ్యనే ఉంటారు, మనం ఊహించలేనంత ముందుకు వెళతారు. సమాజాన్ని ఔపాసన పట్టేస్తారు, మనకు కనిపించని అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఎంచుకున్న మార్గంలో అత్యున్నత దశకు చేరుకుంటారు నలుగురికి మేలు చేసే ఎంటర్ప్రెన్యూర్లుగా మారతారు సంపద సృష్టిస్తారు, తాము గెలిచి మరొకరికి మార్గదర్శకంగా మారతారు ఎంతో మంది సక్సెస్ ఫుల్ లీడర్లలో కనిపించే సీక్రెట్ ఇంతటితోనే ముగుస్తుందా? ఇంతకంటే అత్యున్నత దశ ఏమి లేదా? కచ్చితంగా ఉంది. సంపదతోనే అంతా ముగియదు. ఆ తర్వాత ఇంకేదైనా చేయాలని కలిగే అనుభూతే అత్యున్నత దశ. మూడో లెవల్ - మహాత్ములు - లక్షణాలు నేను ఏంటీ అన్నది పక్కనబెడతారు నా సమస్య అంటూ ఏదీ ఉండదు నేను ఈ సమాజానికి ఏం చేయగలను అన్నది మాత్రమే భావన ప్రతీ ఆలోచనలో తన నుంచి ఏదో ఒక సందేశం ఇతరులకు చేరాలన్న తాపత్రయం మూడో లెవల్ - మహాత్ములు - పరిశీలనలు ఇదేమీ వైరాగ్యం కాదు, ఇదొక అద్భుతమైన స్థాయి. రమణ మహర్షినే చూడండి, ఆయనకు ఏ ఆస్తులు లేకపోవచ్చు, కానీ ప్రపంచమే ఆయనది. మనసును నియంత్రించుకోగల శక్తిని, ఆలోచనలను పెంచుకోగల యుక్తిని తెలుసుకున్నారు. Compassion is concern for others - sincere concern for others' well-being founded on awareness of our own experience. Since it makes us happy when others show us affection and offer us help, if we show others affection and readiness to help they too will feel joy. — Dalai Lama (@DalaiLama) August 4, 2023 మూడో లెవల్ - మహాత్ములు - పరిశీలనలు ఇలాంటి వారు తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా గమనిస్తారు, చదువుతారు. ధ్యానం, వ్యాయామం, యోగ ముద్రతో మనస్సును శాంతంగా మరియు స్థిరంగా ఉంచుకుంటారు ప్రతి రోజు.. వర్తమానంలో జీవిస్తుంటారు నిజమైన ఆలోచనల మధ్య అన్ని భ్రమలను వీడి పూర్తి పాజిటివిటీతో జీవిస్తుంటారు ఎలాంటి ఆడంబరాలుండవు, ఏది ఎంత అవసరమో అంతే తీసుకుంటారు ఏం ఆశించకుండా ఇంకొకరికి సాయం చేస్తారు, అయితే ఇక్కడ సంపద అనేది మానసిక సాయం సలహాలు, మార్గనిర్దేశనం, పాజిటివిటీని పెంపొందించే మాటల రూపంలో ఉంటుంది. ఈ స్థాయిలోకి అందరూ రాకపోవచ్చు కానీ ప్రయత్నిస్తే ప్రతీ ఒక్కరు రెండో స్థాయిలోకి రావొచ్చు. మీరు మారండి. మారను అనుకోవడమే కష్టం. ఎలా మారాలి? ఎందుకు మారాలి? ఎంత వరకు మారాలి? ఈ ప్రశ్నలన్నింటికీ మీలోనే సమాధానాలున్నాయి. మార్పు ఎలా ఉంటుందన్నది మీ ఇష్టం. (డాక్టర్ మృదుల, ప్రముఖ సైకాలజిస్టు, లైఫ్ కోచ్, సర్టిఫైడ్ కౌన్సిలర్ (నేషనల్ కెరియర్ సర్వీస్, కార్మిక ఉపాధి శాఖ), NLP ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ లర్నింగ్ & డెవలప్మెంట్ మేనేజర్, సర్టిఫైడ్ ఇన్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ ఇన్ ఎమోషనల్ ఇంటలిజెన్స్, సైకాలజీలో పీహెచ్డీ చేశారు, ఈ రంగంలో 20 ఏళ్లుగా ఉన్నారు. మానసిక శాస్త్రంలో ఎంతో మంది ఆలోచనలను ప్రభావితం చేసిన వ్యక్తి) -
అమెరికా వీధుల్లో తిరుగుతూ.. ఆకలితో అలమటిస్తూ..
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువతి. రెండేళ్లుగా బాగానే ఉన్నా ఇటీవల తీవ్రంగా మానసిక ఒత్తిడికి లోనైంది. ఆస్పత్రిలో చేర్చినా భయాందోళనతో బయటికి వెళ్లిపోయింది. తన పేరేమిటో కూడా సరిగా చెప్పలేని స్థితికి చేరుకుంది. చివరికి ఆకలితో అలమటిస్తూ అక్కడి వీధుల్లో తిరుగుతోంది. హైదరాబాద్‌లోని మౌలాలి ప్రాంతానికి చెందిన సయ్యదా లులూ మిన్హాజ్ జైదీ దీన గాథ. ఆమెను గమనించిన ఓ హైదరాబాదీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె ఎవరన్నది తెలిసింది. ఆమెను హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆకలితో అలమటిస్తూ.. లులూ జైదీ 2021 ఆగస్టులో ఎంఎస్ ఇంజనీరింగ్ చేసేందుకు అమెరికాలోని డెట్రాయిట్కు వెళ్లింది. అక్కడి ట్రినీ యూనివర్సిటీలో చదువుతోంది. తరచూ తల్లితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. కానీ కొన్ని నెలల కింద మానసిక ఒత్తిడికి లోనైంది. నాలుగు నెలల నుంచి తల్లికి ఫోన్ చేయడం కూడా మానేసింది. ఆమె ప్రవర్తనలో విపరీత మార్పును చూసిన తోటి విద్యార్థులు తల్లికి సమాచారం ఇచ్చారు. ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. లులూ జైదీ తీవ్ర మానసిక ఒత్తిడిలో కూరుకుపోయినట్టు గుర్తించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. కానీ ఆమె ఆస్పత్రిలోంచి వెళ్లిపోయింది. వీధుల్లో తిరుగుతూ, ఎవరేమైనా పెడితే తింటూ గడుపుతోంది. ఈ క్రమంలో షికాగో నగరానికి చేరుకుంది. అక్కడ ఓ వీధిలో ఆకలితో ఆలమటిస్తున్న లులూ జైదీని అక్కడే ఉంటున్న హైదరాబాదీ గమనించి మాట్లాడారు. ఆమె పేరు కూడా చెప్పలేని పరిస్థితి, ఆకలితో అలమటిస్తున్న తీరును వీడియో తీసి సోషల్ మీడియాలో హైదరాబాద్ గ్రూప్‌లలో షేర్ చేశారు. అమెరికాలోని హైదరాబాదీలు, తోటి విద్యార్థులు ఇది చూసి.. లులూ జైదీని షికాగోలోని సురక్షిత ప్రాంతానికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. హైదరాబాద్‌కు తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు లులూ జైదీ దుస్థితి గురించి తెలిసిన ఆమె తల్లి.. తన కుమార్తెను కాపాడి, తిరిగి హైదరాబాద్‌కు తీసుకురావాలంటూ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆమెను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన జైశంకర్.. ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో షికాగోలోని భారత కాన్సులేట్ జనరల్.. లులూ జైదీ ఎవరి వద్ద ఉందో తమతో టచ్‌లోకి రావాలని విజ్ఞప్తి చేశారు. -
కాలుష్యంతో శిశువుల్లో మానసిక సమస్యలు
సాక్షి, న్యూఢిల్లీ: వాయు కాలుష్యం, నాణ్యత లేని గాలి కారణంగా భారత్‌లో రెండేళ్లలోపు శిశువుల్లో మానసికంగా ఎదుగుదల సమస్యలు తలెత్తుతున్నట్లు అధ్యయనంలో తేలింది. సాధారణంగా రెండేళ్ల లోపు వయసున్న శిశువుల్లో మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ వయసులో స్పర్శ, అనుభవం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. జ్ఞానేంద్రియాలను పూర్తిగా ఉపయోగించుకుంటారు. కాలుష్యంతో కూడిన గాలిని పీల్చడం వల్ల మెదడు అభివృద్ధిలో వేగం మందగిస్తుందని, ఈ ప్రతికూల ప్రభావం జీవితాంతం ఉంటుందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వాయు కాలుష్యం వల్ల శిశువుల్లో మానసికపరమైన ఎదుగుదలతో పాటు భావోద్వేగ, ప్రవర్తన సంబంధిత సమస్యలు తలెత్తుతాయని, ఇవి వారి కుటుంబాలపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకుడు ప్రొఫెసర్ జాన్ స్పెన్సర్ చెప్పారు. (చదవండి: ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి బాంబు బెదిరింపు!) -
పరిణతి... జీవన సాఫల్యం
బాల్యదశ తరువాత మనలో శారీరకంగా వచ్చే మార్పు, ఎదుగుదలే పరిణతి. ఇది భౌతికమైనదే కాదు, మానసికమైనదీ కూడ. మన ఆలోచనలలో, ఆలోచనా రీతిలో వచ్చిన, వస్తున్న తేడాను చూపుతుంది. అంటే మన మనోవికాసాన్ని, దాని స్థాయిని సూచిస్తుంది. మనం వయసు రీత్యా ఎదిగే క్రమంలో మన భాషలో, అభివ్యక్తిలో, ఎదుటివారిని అర్ధం చేసుకునే తీరులో, మన స్పందనలో వెరసి మన ప్రవర్తనలో వచ్చే క్రమానుగతమైన మార్పే పరిణతి. కొంతమందిలో వారి శారీరక వయసు కన్నా పరిణతి వయసు ఎక్కువ. మరికొందరిలో దీనికి భిన్నమూ కావచ్చు. వయసులో పెద్దవారైనా తగిన పరిణతి లేకపోవచ్చు. అలాగే వయసులో చాలా చిన్నవారైనా కొంతమందిలో ఎంతో మానసిక పరిణతి కనిపిస్తుంటుంది. కాబట్టి మన వయసు మన మానసిక ఎదుగుదలకు దర్పణం కావచ్చు. కాకపోవచ్చు. అందువల్లనే పరిణతికి వయసు లేదని, వయసు రీత్యా నిర్ధారించలేమని విజ్ఞులు చెపుతారు. పరిణతికి ఛాయార్థాలు చాలా ఉన్నా పరిపక్వత అన్న అర్థంలో ఎక్కువగా వాడతారు. ప్రవర్తన గురించి చెప్పటానికి తరచూ వాడే మాట. పరిణతి అన్న నాలుగు అక్షరాలలో ఎంతో విశేషమైన, లోతైన, విస్తృతార్థముంది. పరిణతంటే సంక్షిప్తంగా చెప్పాలంటే భావోద్వేగాల మీద గట్టి పట్టు, నియంత్రణే పరిణతి. విచక్షణ, వివేచన, సంయమనం, సహనం, క్షమాగుణం, ఉచిత సంభాషాణ తీరు, దూరదృష్టి, విభేదాలు మరచి అందరిని కలుపుకుని ముందుకు సాగే వైఖరి. ఇక్కడ ఉదాహరించినవి కొన్నే అయినా ఈ పరిణతి ఇంకా ఎన్నో లక్షణాలను దానిలో పొదవుకుంది. మన పుట్టుకకు లక్ష్యం జీవితాన్ని మెరుగుపరుచుకోవటం. మనలోని దుర్గుణాలను తొలగించుకుంటూ, మంచిని పెంచుకుంటూ ఇతరులను కలుపుకుని మనలోని మానవీయ శక్తులను బలపరచుకుంటూ ముందుకుసాగాలి. అదే జీవిత సార్థకత. ఉత్తమమైన, ఉన్నతమైన పథంలో పయనించగలగాలి. అప్పుడే కదా మానవులు బుద్ధిజీవులన్న మాటకు మరింత ఊతాన్నిచ్చినట్టు! ఇది మనసు లో నిలుపుకుని మానవుడే మహనీయుడు అన్న మాటను సుసాధ్యం చేయాలనుకునే వారికి.. పరిణితి ఎందుకు సాధ్యం కాదు? అన్న ఆలోచన వస్తుంది. దీన్ని సాధించి తీరాలన్న పట్టుదల వస్తుంది. అటువంటి వారికి ఇంత గొప్ప పరిణితి సాధించటం అసాధ్యం కాదు. అంటే దీనర్థం పరిణతికున్న అర్ధ పార్శా్వలన్నిటిపై వారికి ఓ పట్టు వచ్చి వారి వ్యక్తిత్వంలో ఒక భాగమైపోతుంది. మన జీవనక్రమంలో అనేకమందితో కలసి ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ ప్రయాణం కొందరితో కొంతకాలం, మరికొందరితో జీవితాంతం సాగుతుంది. వీరందరితోనూ సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవలసిన ఆవశ్యకత ఉంది. దీనికి గొప్ప మానసిక పరిణతి కావాలి. ఇంతటి ఉన్నత పరిపక్వత సాధించే గలిగే వారు వేళ్ళమీద లెక్కించగల సంఖ్యలోనే ఉంటారు. వాళ్లు వయసులో పెద్దవారైనా చిన్నవారైనా గొప్పవారే, ఆదర్శనీయులే, నమస్కరించ తగినవారే. ఒక విషయాన్ని అర్థం చేసుకునే పద్ధతిలో మన దృష్టి ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇక్కడ దృష్టి అంటే మన వైఖరి. సమగ్రమైన అవగావన రావాలంటే దానికి చుట్టుకొని ఉన్న అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకోవాలి. అపుడే దానిమీద సాధికారంగా మాట్లాడగలం. ఈ దృష్టి, విశ్లేషణా శక్తి, అవగాహనా తీరునే పరిణతి అంటాం. స్థాయిలో పరిణితి సాధ్యమా? అన్న ప్రశ్న చాలామందిలో ఉదయిస్తుంది. గట్టి ప్రయత్నం చేయగలిగితే కనక ఇది సాధ్యమే.. ఇది మన దృఢ నిశ్చయం మీద ఆధారపడి ఉంటుంది. అందరూ ప్రయత్నించినా ఇది ఏ కొందరికో మాత్రమే పట్టుబడే శక్తి. ఈ పరిణితికి ఆవృతమైన అనేక లక్షణాలలో కొందరికి కొన్ని బాగా అలవడచ్చు. అందుకే దీనికి స్థాయీభేదం ఉంటుంది. ప్రతి ఒక్కరి వయసు పెరుగుతూ ఉంటుంది. ఇది భౌతికమైనది. దీనికి అదే నిష్పత్తిలో మానసిక ఎదుగుదల ఉందా? మనలో ఎంతమంది వయసుకు తగిన విధంగా సమయోచితంగా ప్రవర్తిస్తున్నాం!? ఈ రెండిటి మధ్య ఒక సమతౌల్యత పరిణతే కదా! మనం కొన్ని విషయాల్లో కొందరితో విభేదిస్తాం. అంతమాత్రాన బద్ధశత్రువులం కానవసరంలేదు. ఓ భావపరమైన, సిద్ధాంతపరమైన విషయాల వరకు మాత్రమే దానిని పరిమితి చేయాలి. అలాగే చంపదగ్గ శత్రువు మన చేత చిక్కినా వాడిని చంపకుండా తగిన మేలు చేసి విడిచిపెట్టాలని వేమన చెప్పిన దానిలోనూ, మనకు అపకారం చేసిన వారికి కూడ వారి తప్పులను ఎంచకుండా ఉపకారం చేయాలని బద్దెన చెప్పిన దానిలో గోచరించేది పరిణతే. పరిణతి ఓ ధైర్యం. నిశ్చలత, స్థిత ప్రజ్ఞత. చక్కని శ్రుతి లయలతో, ఆరోహణ అవరోహణలతో, భావయుక్తంగా అటు శాస్త్రీయత ఇటు మాధుర్యం రెండిటి సమాన నిష్పత్తిలో అద్భుతంగా సంగీతకచేరి చేస్తున్నాడో యువ సంగీత కళాకారుడు. ఆ రాగ జగత్తులో, ఆ భావనాజగత్తులో విహరిస్తూ తాదాత్మ్యతతో పాడుతున్న అతడి గానం పండిత, పామర రంజితంగా సాగింది. తన సంగీత ప్రవాహంలో ఊయలలూగించిన ఆ కళాకారుడు అంధుడు. కచేరి అనంతరం అతణ్ణి ఆ ఊళ్ళో అతనికి చిన్నప్పుడు సరళీ స్వరాలు నేర్పుతూ అసలు ఈ గుడ్డివాడికి ఆ విద్య అలవడనే అలవడదని తరిమేసిన అతని గురువు దగ్గరకు తీసుకు వెళ్లారు నిర్వాహకులు. ఆ శిష్యుడు ఆయనకు పాదాభివందనం చేసి‘ఇదంతా మీరు పెట్టిన భిక్షే’ అని వినయంగా ఆయన పక్కన నిలబడ్డాడు. అంతే! ఆ గురువుకు తను చేసిన చర్య మనసులో కదిలి, సిగ్గుపడ్డాడు. అటు సంగీతంలోనే కాకుండా ప్రవర్తనలోనూ ఎంతో పరిణతి సాధించిన శిష్యుణ్ణి చూస్తూ ఆనందాశ్రువులు రాలుస్తూ మనసారా అతణ్ణి ఆశీర్వదించాడు. శారీరక వయసు కన్నా పరిణతి వయస్సు ఎక్కువని చెప్పటానికి ఇది చక్కని ఉదాహరణ. పరిణతి పొందటానికి అత్యంత అవసరమైనది అవేశాన్ని వీడటం. దానికి ఎంత దూరమైతే మానసిక పరిపక్వతకు అంత దగ్గరవుతాం. ఆవేశంలో ఆలోచనా శక్తిని కోల్పోతాం. వివేకం నశిస్తుంది. ఆ స్థితిలో మన మనసు తుఫానులో చిక్కుకున్న కల్లోలిత సంద్రమే. ఈ ఆవేశహంకారాలే విశ్వామిత్రుణ్ణి రాజర్షి స్థాయి నుండి మహర్షి, బ్రహ్మర్షి స్థాయికి చేర్చటానికి అభేద్యమైన అవరోధమైంది. ఆయన జీవితంలో సింహభాగాన్ని ధార పోసేటట్టు చేసింది. – లలితా వాసంతి -
పిచ్చి మొగుడు
లీగల్ స్టోరీస్ మగవాళ్ల పిచ్చిచేష్టలతో ఎన్నో పెళ్లిళ్లు నాశనం అవుతున్నాయి! కట్నాల పిచ్చి, కామం పిచ్చి, అభద్రత పిచ్చి, వయొలెన్స్ పిచ్చి, పోల్చే పిచ్చి, హేళన పిచ్చి, శాడిజం పిచ్చి, నిర్లక్ష్యం పిచ్చి... ఇలాంటి వెర్రి వేధింపులెన్నో! ఏదోలా ఈ పిచ్చిమొగుళ్లతో మన బంగారాలు సర్దుకుపోతున్నారు. కానీ.. మొగుడు నిజంగానే పిచ్చోడైతే? ఆ ‘పిచ్చిపెళ్లి’కి సూపర్ ట్రీట్మెంట్ ఇచ్చే సెక్షన్ ఉంది!! ఎప్పటిలాగే భయంభయంగా గదిలోకి వెళ్లింది స్వర్ణ. మంచం మీద బాలాజీ వెల్లకిలా పడుకొని గాల్లో రాతలు రాస్తున్నాడు. ఆమె అలికిడిని గమనించినట్టు లేడు. కొంచెం ధైర్యం వచ్చింది స్వర్ణకు. ఆ ధైర్యంతోనే మంచం మీద కూర్చుంది. ఆ కదలికా బాలాజీని డిస్టర్బ్ చేయలేదు. పరిశీలనగా చూసింది అతడిని. సీరియస్‌గా ఉంది మొహం గాల్లో రాస్తున్న రాతల మీదే ఉంది అతడి ఏకాగ్రత. అడ్డదిడ్డంగా పెరిగిన జుట్టు కళ్ల మీద పడుతోంది. కనీసం దాన్ని పక్కకు తోసుకోవాలన్న ఆలోచన కూడా లేదు మనిషికి. మోకాలు దాకా మడిచిన కుడి కాలు మీద ఎడమ కాలు బరువు వేసి.. కుడి చేయి పొట్టమీద పెట్టుకొని ఎడమ చేయిని గాల్లో ఆడిస్తున్నాడు. మొహమంతా చెమటలు పట్టి ఉంది. వెళ్లి ఏసీ ఆన్ చేసింది. ఆ తేడానూ గమనించినట్టు లేదు. ఈసారి మంచానికి అటుపక్కకు వెళ్లి బాలాజీ కళ్లమీద పడుతున్న జుట్టును సవరిద్దామని అతని మొహందాకా చేతిని తీసుకెళ్లింది.. అంతే హఠాత్తుగా ఈలోకంలోకి వచ్చినవాడిలా... ఆమె చేతిని విసిరికొట్టాడు బాలాజీ. ఆ తోపుకి అడుగు దూరంలో పడింది ఆమె. కోపంగా లేచి ఆమె జుట్టు పట్టుకొని బరబరా ఈడ్చికెళ్లి గది బయటకు గెంటేసి తలుపేసుకున్నాడు బాలాజీ. బాధ, అవమానం, ఉక్రోషంతో ఆమె మొహం ఎర్రబడింది. పొంగుకొస్తున్న దుఃఖాన్ని కళ్లల్లోకి రాకుండా అదిమేసింది. తొలి రాత్రే బతుకు తెల్లారింది పెళ్లయి రెండేళ్లవుతోంది. తొలిరాత్రీ ఇదే అనుభవం. ఎంతసేపూ మనిషి నుంచి ఏ స్పందన రాకపోయేసరికి తనే చొరవ తీసుకుంది. ఈడ్చి కొట్టాడు. బిత్తర పోయింది. తెల్లవారి గదిలోకి రావడానికే భయపడింది. అత్తగారికి విషయం చెబితే... ‘వాడికి సంప్రదాయంగా ఉండే ఆడపిల్లంటే ఇష్టం. అడ్వాన్స్‌గా ప్రవర్తిస్తే నచ్చదు. వాడంతట వాడు నీ దగ్గరకు వచ్చే వరకు ఆగాలి మరి’ అని సూక్తి చెప్పింది. అదింకా అవమానంగా అనిపించింది స్వర్ణకు. నెల.. రెండు నెలలు.. యేడాది.. యేడాదిన్నర గడిచినా భర్త నడతలోని మర్మం బోధపడలేదు స్వర్ణకి. అరుస్తాడు. అప్పుడే ఏడుస్తాడు. ఇంతలోకే నవ్వుతాడు. మూలుగుతాడు. ఆరోగ్యవంతుడో.. అనారోగ్యవంతుడో తెలియట్లేదు. యేడాదిన్నర తర్వాత ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగినప్పుడు.. అతిదగ్గరి వాళ్లనే అతిథులుగా పిలిచారు అత్తింటి వాళ్లు. చివరకు తన పుట్టింటి వాళ్లను కూడా పిలవలేదు. వ్రతానికేంటి.. అసలు పెళ్లయినప్పటి నుంచి అత్తగారింట్లో ఏ శుభకార్యమైనా వాళ్లకు వచ్చే అనుమతిలేదు.. తనకు అటు వెళే యాక్సెస్ లేదు. అంతా అయోమయం. ఏం జరుగుతుందో.. తన జీవితమెటుపోతుందో తెలీని అయోమయం. పుట్టింటి వాళ్లతో కనెక్షన్ కట్! భర్త ఎప్పుడూ ఈ లోకంలో ఉండడు. పెళ్లి చూపులప్పుడు అబ్బాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పారు. వాకబు చేస్తే కూడా నిజమే అని తేలింది. అయితే రెండు నెలలుగా లీవ్‌లో ఉన్నారని చెప్పారు యూనివర్శిటీలో. కారణం అడిగితే.. పోస్ట్ డాక్టోరియల్ కోర్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు అందుకే లీవ్ అన్నారు అత్తగారు వాళ్లు. నిజమే కామోసు అని సర్దుకున్నారు పుట్టింటివాళ్లు. పెళ్లిచూపులప్పుడు ఆయన తీరుతెన్నులు చూసి ప్రొఫెసర్ అంటే ప్రొఫెసర్లాగే ఉన్నాడు ఏమీ పట్టించుకోకుండా అని జోకులేశారే కాని అసలు విషయాన్ని గ్రహించలేకపోయారు. పెళ్లయ్యాక ఆయన పద్ధతి గురించి అత్తగారికి చెబితే.. ‘వాడినేం ఇన్సల్ట్ చేస్తున్నావో అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు’ అంది. అలాంటి సమర్థింపులు వినివినీ సహనం చచ్చిపోయి ‘అసలు నావైపు చూస్తే కదా ఇన్సల్ట్ అయినా చేయడానికి’ అని స్వర్ణ జవాబిచ్చింది.‘అమ్మో మీ అమ్మలాంటి దాన్ని నాకే ఎదురు మాట్లాడుతున్నావంటే! పాపం.. చదువు తప్ప లోకం తెలీని అమాయకుడు నా కొడుకు.. వాడిని ఎంత రాచిరంపాన పెడుతున్నావో? అందుకే వాడు అలా ఉంటున్నాడు నీతో’ అని నింగీ నేలా ఏకం చేసింది. అప్పటి నుంచి పుట్టింటివారితో తన కనెక్షన్‌ను కట్ చేసింది. భర్త ఏ కోర్స్కూ ప్రిపేర్ అవట్లేదు. ఉద్యోగానికీ వెళ్లట్లేదు. పదిమందిలో కలవడు. ఎవరింటికీ వెళ్లడు. కొత్తవాళ్లెవరు వచ్చినా సహించడు. తన గదిలోకి వస్తే చాలు.. బయటకు గెంటేస్తాడు. డైనింగ్ టేబుల్ దగ్గరా వాళ్లమ్మ తప్ప ఎవరు కనిపించినా కంచాలు, గిన్నెలు గిరాటేస్తాడు. కుర్చీలు ఎత్తేస్తాడు. అసలు తన పొడే గిట్టదు అతనికి. క్షణమొక నరకంగా బతుకుతోంది. మెట్టినింటి మెంటల్ బ్యాగ్రౌండ్! ఇందాక స్వర్ణ అత్తగారింట్లో జరిగిన సత్యనారాయణ వ్రతం దగ్గర ఆగాం కదా! ఆరోజూ పీటల మీద అత్తగారు, మామగారితో పాటు స్వర్ణ, బాలాజీ కూడా కూర్చోవాల్సి ఉండింది. భయభయంగానే భర్త పక్కన సర్దుకుంది స్వర్ణ. ఆమెను గమనించలేదు అతడు. వ్రతం మధ్యలో ఉన్నప్పుడు ఏదో సందర్భంగా ఆమె చేయి అతడికి తగిలింది. అంతే ఎక్కడలేని బలంతో ఆమెను తన్నాడు. అతని చర్యకు అక్కడున్న వాళ్లంతా హతాశులయ్యారు. బిక్కచచ్చిపోయింది స్వర్ణ. ఏడుస్తూ గదిలోకి వెళ్లిపోయింది. ఆమె అత్తగారి వదిన (అన్నయ్య భార్య) స్వర్ణ గదిలోకి వెళ్లి ఆమెను సముదాయించింది. ‘ఇదేంటి పెద్దమ్మా.. పెళ్లయి యేడాదిన్నర అవుతున్నా ఆయన అంతు చిక్కడు నాకు’ అంటూ గోడు వెళ్లబోసుకుంది. ‘అతనికేం మాయరోగమో తెలిసి చావట్లేదు’ అని బాధను వెళ్లగక్కింది. ‘మెంటలమ్మా’ అంది నిపాందిగా ఆవిడ! షాక్ అయింది స్వర్ణ. ‘అవును.. మీ అత్తగారి వంశంలో ఆ రోగం ఉంది. మీ అత్తగారి మరిదికీ ఉండేది. పిచ్చితో దేశాలు పట్టుకుపోయాడు. వీడికీ వచ్చింది. బాగా చదివాడు. కాని మెంటల్. దాంతోనే ఉద్యోగానికి కూడా వెళ్లట్లేదు’ అని నిజం చెప్పింది. చెవులప్పగించి విన్నది స్వర్ణ. టెస్ట్‌ట్యూబ్ బేబీ కోసం ఒత్తిడి బంధువులు అందరూ వెళ్లిపోయాక అత్తగారికి నిలదీసింది ‘మానసికంగా బాగాలేడని తెలిసీ తన గొంతు ఎందుకు కోశారు’ అంటూ. ‘గొంతు కోయడం కాదు. బంగారు పల్లకీ ఎక్కించాం. నీ జన్మలో నీకిలాంటి అత్తిల్లు దొరికేదా? ఇప్పుడు నీకేం తక్కువ. లంకంత ఇల్లు.. ఒంటినిండా బంగారం. బీర్వానిండా పట్టు చీరలు. తినడానికి వెండి కంచాలు... కాలుకదపనివ్వకుండా ఇంటినిండా నౌకర్లు, చాకర్లు. పుట్టినప్పటి నుంచి ఇలాంటి సుఖాన్ని ఎరుగుదువా? ఇంకే ఇంటికి వెళ్లినా ఇలాంటి జీవితం ఉండేదా? నోర్మూసుకొని పడి ఉండు. నువ్వు మాకేం చేయక్కర్లేదు. ఓ వారసుడిని మా చేతుల్లో పెట్టు చాలు’ అంది. ఖంగు తిన్నది ఆ మాటకు స్వర్ణ. ‘వారసుడా? కాపురం చేయకుండా బిడ్డనెట్లా కంటారు?’ అంది అమాయకంగా. ‘నంగనాచిలా మాట్లాడకు. చదువుకున్న దానివే కదా.. కాపురం లేకుండా పిల్లల్ని కనే పద్ధతులున్నాయని తెలీదా? టెస్ట్‌ట్యూబ్ బేబీని కనివ్వు. మా బంధువులకే నర్సింగ్‌హోమ్ ఉంది. గుట్టుచప్పుడు కాకుండా పని జరిగిపోతుంది. మీ ఇంట్లో వాళ్లకు కూడా తెలియద్దు. బిడ్డ పుట్టాక.. ఆస్తిలో సగం నీ పేర రాస్తాం’ వ్యాపారిలా మాట్లాడుతున్న అత్తగారిని చూసి విస్తుపోయింది స్వర్ణ. ఆమె ప్రపోజల్‌ను తిరస్కరించింది. ఆ రోజు నుంచి తనను ఎక్కడికీ వెళ్లనివ్వకుండా కట్టుదిట్టం చేశారు. 24 గంటలూ ఆవిడ కాపలా. రోజూ ఒత్తిడే.. టెస్ట్‌ట్యూబ్ బేబీ కోసం ఒప్పుకోమని. ఆ మానసిక హింసను తట్టుకోలేక.. ఓరోజు తన స్నేహితురాలికి ఫోన్ చేసింది. విషయం చెప్పింది. ‘అతడు మానసిక రోగి. నీకు అంటగట్టారు. వెంటనే లాయర్ని కలువు’ అని సలహాతో పాటు తనకు తెలిసిన అడ్వకేట్ నంబరూ ఇచ్చింది. పిచ్చికి ‘ట్రీట్మెంట్’ ఉంది పై కేసులో అబ్బాయి తీవ్రమైన మానసిక అస్వస్థతతో ఉన్నాడు. అది నిరంతరం కొనసాగుతూనే ఉంది. మందుల వల్ల మత్తులో ఉన్నప్పుడు తప్ప మిగతా వేళ్లల్లో అబ్బాయి వయొలెంట్‌గా ప్రవర్తిస్తున్నాడు. కొన్నిసార్లు అతని ఉనికి ఇతరులకు.. ముఖ్యంగా భార్యకు ప్రాణాపాయంగా çపరిణమించవచ్చు. ఎందుకంటే భార్యకే ఆయనతో సన్నిహితంగా మెలిగే అవకాశం ఎక్కువ కాబట్టి. ఇలా సంసారం జీవితం ఉండకపోగా.. ప్రాణాలకూ ముప్పే. చికిత్సకు లొంగని మానసిక అస్వస్థత, పిచ్చి, ఉన్మాదం ఉన్నప్పుడు భాగస్వామి విడాకులు తీసుకునే వీలు కల్పిస్తోంది చట్టం. బాలాజీ మానసిక అనారోగ్యం మందులతో తాత్కాలికంగా మేనేజ్ చేయడం తప్ప అది తగ్గేదికాదని డాక్టర్లూ స్పష్టం చేశారు. దాంతో స్వర్ణ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13, సబ్ సెక్షన్ 1, క్లాజ్ 3 ప్రకారం బాలాజీ నుంచి విడాకులు తీసుకుంది. అబ్బాయి విషయం తెలిసీ దాచి పెట్టి , మోసం చేశారని అత్తింటి వారిపై కూడా క్రిమినల్ కేసులు వేయవచ్చు. లేదంటే తగినంత దీర్ఘకాలిక భరణం పొందవచ్చు. – ఇ. పార్వతి, అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్ parvatiadvocate2015@gmail.com – సరస్వతి రమ -
వివాదంలో శ్రీకాంత్ 'మెంటల్'
-
వివాదంలో శ్రీకాంత్ 'మెంటల్'
ఈ శుక్రవారం విడుదలైన శ్రీకాంత్ మూవీ మెంటల్పై మరో వివాదం మొదలైంది, గతంలో టైటిల్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు అభ్యంతరం తెలపటంతో మెంటల్ పోలీస్‌గా ఉన్న పేరును మెంటల్‌గా మార్చారు. తాజాగా ఈ సినిమాకు దర్శకుడిగా, నా పేరు వేయకుండా వేరే వారి పేరు వేశారంటూ కరణం పి బాబ్జీ అనే వ్యక్తి గొడవకు దిగాడు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాల మూలంగా వాయిదా పడుతూ వచ్చింది. ఫస్ట్ లుక్ టీజర్లు రిలీజ్ అయిన సమయంలో చిత్ర దర్శకుడిగా కరణం పి బాబ్జీ పేరు కనిపించినా.. విడుదలకు దగ్గరయిన తరువాత మాత్రం ఎస్ కె బషీద్‌ను దర్శకుడిగా పరిచయం చేశారు. టైటిల్స్ లోనూ బషీద్ పేరుతోనే సినిమా రిలీజ్ అయ్యింది. ఈ విషయంపై స్పందించిన కరణం బాబ్జీ, మెంటల్ సినిమాకు తానే దర్శకుడినని, తన పేరు తీసేసి బషీద్ పేరు వేశారని ఆరోపించారు. ఈ సినిమాకు 5.17 లక్షల పెట్టుబడి కూడా పెట్టానని, దాదాపు ఏడాదిన్నర పాటు సినిమా కోసం పనిచేశానని తెలిపాడు. టైటిల్ విషయంలో హీరో శ్రీకాంత్‌కు ఫోన్ చేస్తే అరగంటలో మార్పిస్తానని చెప్పి ఇంత వరకు మార్పించలేదని ఆరోపించారు. రేపటిలోగా పేరు మార్చకపోతే ఛాంబర్ ముందు దీక్ష చేస్తానని, అప్పటికీ స్పందించకపోతే బషీద్ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటాన్నారు. ఈ విషయంపై స్పందించిన నిర్మాత మండలి పేరు మార్చే అధికారం నిర్మాతకు మాత్రమే ఉంటుందని, నిర్మాత ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
‘మెంటల్’ పాటల విడుదల
-
మేం వంద సినిమాలు చేయలేం
- గోపీచంద్ ‘‘శ్రీకాంత్ అన్నయ్య ఆల్మోస్ట్ వంద చిత్రాలకు పైగా చేశారు. అన్ని సినిమాలు చేయడం నిజంగా గ్రేట్. ఇప్పుడు మేం వంద సినిమాలు చేయలేం. ఆయన సినిమాల్లో నాకు బాగా నచ్చినవి ‘ఖడ్గం’, ‘ఆపరేషన్ ధుర్యోదన’, ‘మహాత్మ’. నేను ‘మహాత్మ’ సినిమా చూసిన వెంటనే అన్నయ్యకు ఫోన్ చేసి చాలా బాగుంది, అద్భుతంగా నటించారని చెప్పా. అంతటి నటన, ఇంటెన్సిటీ నాకు ‘మెంటల్’ చిత్రంలో కనిపిస్తోంది. ఆ మూడు చిత్రాలకంటే ఈ ‘మెంటల్’ బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరో గోపీచంద్ అన్నారు. శ్రీకాంత్, అక్ష జంటగా కరణం పి.బాబ్జీ(శ్రీను) దర్శకత్వంలో వీవీఎస్ఎన్వీ ప్రసాద్, వీవీ దుర్గాప్రసాద్ అనగాని నిర్మించిన చిత్రం ‘మెంటల్’. సాయి కార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని గోపీచంద్ విడుదల చేశారు. చిత్రదర్శకుడు మాట్లాడుతూ-‘‘మంచి పాటలిచ్చి సాయికార్తీక్ వంద శాతం న్యాయం చేశాడు. కొత్తవాడినైనా నేను చెప్పినట్లు శ్రీకాంత్‌గారు నటించారు’’ అని పేర్కొన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ-‘‘ఐ రెస్పెక్ట్ టు పోలీస్. మన సైనికులన్నా నాకు ఇష్టం. ఇటీవల కార్గిల్ వెళ్లొచ్చా. కచ్చితంగా ఈ చిత్రం పోలీసులకు గౌరవం తెచ్చేలా ఉంటుంది. సినిమా చూశాక నేను దర్శకుణ్ణి హగ్ చేసుకున్నా. అంత బాగా తీశాడు’’ అని చెప్పారు. -
పట్టించుకోకుంటే పని కోల్పోయినట్లే!
మానసిక అనారోగ్యంతో కొన్ని వేల సంవత్సరాల పని శక్తిని కోల్పోతాం అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ప్రతి సంవత్సరం పెరుగుతున్న మానసిక అనారోగ్యం వల్ల వచ్చే 2030 సంవత్సరం నాటికి సుమారు 12 బిలియన్ల పనిరోజులు లేదా 50 మిలియన్ సంవత్సరాల పని వృధా అయిపోతుందని డబ్ల్యూహెచ్ ఓ తాజా నివేదిక ప్రకారం తెలుస్తోంది. మానసిక ఒత్తిడి, ఆత్రుత వంటి లక్షణాలకు చికిత్స అందించడంలో వైఫల్యం చెందితే సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక ఉత్పాదకతలో 925 బిలియన్ డాలర్ల ఖరీదైన నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని వరల్డ్ హెల్గ్ ఆర్గనైజేషన్ కొత్త అధ్యయనాల ప్రకారం తెలుస్తోంది. సాధారణ మానసిక అనారోగ్య చికిత్సకోసం పెట్టుబడి, ఆరోగ్య ఆర్థిక ప్రయోజనాలు పై ప్రపంచంలోనే మొదటిసారి విశ్లేషణ జరిపిన సంస్థ తన పరిశోధనా వివరాలను ల్యాన్సెట్ సైకియాట్రీ లో ప్రచురించింది. మానసిక ఒత్తిడి అనారోగ్యాల చికిత్సకు వెచ్చించే ఒక డాలర్... ఆరోగ్యంతోపాటు తిరిగి 4 డాలర్ల ఖరీదైన ఉత్పాదకతను పెంచే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. మానసిక ఒత్తిడి, అనారోగ్యాలకు చికిత్స అందించడం పై దృష్టి పెట్టకపోవడం, ఓ మానవ తప్పిదంగానూ, పిసినారితనంగానూ కనిపిస్తోందని, అన్ని దేశాలు మానసిక ఆరోగ్య సేవలపై పెట్టుబడికి అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు సిఫార్సు చేయాలని, ప్రస్తుత ప్రభుత్వాలు తమ ఆరోగ్య బడ్జెట్ లో కేవలం సగటున మూడు శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నాయని నివేదిక ద్వారా వెల్లడైంది. వచ్చే 15 సంవత్సరాల్లో కౌన్సెలింగ్, యాంటీ డిప్రెషన్ మందులకోసం 147 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తే... 399 బిలియన్ డాలర్ల ఖరీదైన కార్మిక శక్తి పెరుగుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. ప్రపంచ జనాభాలో దాదాపు పదిశాతం మంది అంటే సుమారు 740 మిలియన్లమంది ఇప్పుడు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని, అందులోనూ సాధారణ మానసిక అనారోగ్యం క్రమంగా పెరుగుతోందని తాజా అధ్యయనాల్లో తేలింది. 1990 నుంచి 2013 మధ్య కాలంలో ప్రజల్లో మానసిక ఆందోళన, వ్యాకులత దాదాపు సగం పెరిగింది. అత్యవసర పరిస్థితులు, యుద్ధాలు వల్ల వ్యక్తుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు వెల్లువెత్తుతున్నాయని, 20 శాతం ప్రజలు అటువంటి సంఘటనలవల్లే ఒత్తిడికి గురౌతున్నారని డబ్ల్యూ హెచ్ ఓ అంచనా వేసింది. ఇది ఓ ప్రజారోగ్య సమస్య కాదని, అభివృద్ధి సమస్యగా గుర్తించాలని, నిరాశ, ఆత్రుత వంటి వాటికి చికిత్సను అందిస్తే... అది ఆర్థిక అభివృద్ధికి మంచి అర్థాన్ని తెస్తుందని తమ పరిశోధనల్లో తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మార్గరెట్ చాన్ తెలిపారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
'నా మానసిక ఆరోగ్యం బాగోలేదు'
వివాదాస్పద న్యాయమూర్తి కర్నన్ మరోసారి తెరపైకి వచ్చారు. భారత ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. తన మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని.. ఆ నేపథ్యంలోనే తప్పుడు ఆర్డర్ పంపానని భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ జె.ఎస్ కెహర్, జస్టిస్ ఆర్.భానుమతికి తెలియజేశారు. కొందరు సహచర న్యాయమూర్తులు ఎగతాళి చేయడంతో మానసికంగా కుంగిపోయానని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ కర్నన్ తెలిపారు. అయితే ఆ న్యాయమూర్తులు ఎవరన్న వివరాలను మాత్రం చెప్పలేదు. భవిష్యత్తులో తన వైఖరి సక్రమంగా ఉండేలా చూసుకుంటానని, అటువంటి తప్పులు తిరిగి జరగకుండా చూసుకుంటానని జస్టిస్ కర్నన్ తన లేఖలో హామీ ఇచ్చారు. తాను షెడ్యూల్డు కులాలకు చెందిన వ్యక్తి కావడంతో ఇతర న్యాయమూర్తుల వేధింపులకు గురౌతున్నానని, కొన్ని సందర్భాల్లో తనను ఎగతాళి చేస్తున్నారని గతంలో ఆ విషయాన్నిసిజిఎఫ్ జాతీయ కమిషన్ ఛైర్మన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తాజా లేఖలో తెలిపారు. తనను వేధించిన జడ్జిల పేర్లను వెల్లడించలేదని, న్యాయవ్యవస్థలో కులతత్వాన్ని నిర్మూలించాలని, మత సామరస్యాన్ని కాపాడటంలో న్యాయవ్యవస్థ ముందుండాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్. ఠాకూర్.. గతంలో జస్టిస్ కర్నన్ ను కోల్‌కతా హైకోర్టుకు బదిలీచేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఆ ఉత్తర్వులపై ఏకపక్షంగా స్పందిస్తూ తనకు తానే సుమోటోగా చర్యలు తీసుకుంటూ నిర్ణయం ప్రకటించుకున్న కర్నన్.. తనను బదిలీ చేయడానికి గల కారణాలను భారత ప్రధాన న్యాయమూర్తి ఫిబ్రవరి 15లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే మద్రాస్ హైకోర్ట్ విజ్ఞప్తి మేరకు ఫిబ్రవరి 12న కర్నన్ జారీచేసిన అన్ని ఉత్తర్వులపైనా జస్టిస్ కెహర్ నేతృత్వంలోని బెంచ్ స్టే విధించింది. తిరిగి నోటీసులు అందేవరకూ కర్నన్ కు ఎటువంటి జ్యుడీషియల్ వర్క్ అప్పగించరాదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆదేశాలిచ్చారు. తర్వాత ఓసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ ను జస్టిస్ కర్నన్ వ్యక్తిగతంగా కలిశారు. తాజాగా తన ప్రవర్తనకు గల కారణాలను వివరిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. -
మెంటల్ కాదు... డెంటల్ రికార్డు...
తిక్క లెక్క ఇతగాడి పేరు శివమణి కాదు... అందుకే ‘మెంటల్’ కాదు గానీ, కొంచెం ‘డెంటల్’. మరేమీ లేదు... ఇతగాడికి దంతసిరిసంపదలపై జాగ్రత్త ఎక్కువ. అంతేకాదు, దంతసిరిని ధగధగలాడించే టూత్‌పేస్టులపై కొంచెం టేస్టు కూడా ఎక్కువే! ఇదోరకం కలాపోసన లెండి. అయితే ఏంటి..? అనుకుంటున్నారా..? ఈ కలాపోసనతోనే ఇతగాడు ఏకంగా గిన్నెస్ బుక్కులోకి ఎక్కేశాడు. ఏమంత ఘనకార్యం చేశాడంటారా..? ఫొటో చూస్తే అర్థం కావట్లేదూ! తన జీవితకాలంలో వాడేసిన టూత్‌పేస్ట్ ట్యూబులను పారవేయకుండా పదిలంగా దాచుకున్నాడు. ఇతరులు పారవేయబోతున్నవి కూడా వెరైటీగా కనిపిస్తే వెంటతెచ్చి మరీ ఇంట్లో పెట్టుకున్నాడు. ఇలా ఏకంగా 2,037 టూత్‌పేస్ట్ ట్యూబులను సేకరించాడు. -
మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారయత్నం
ఏపూరు(గుంటూరు): ఏపూరు మండలం గుప్మాన్తండాలో 12 ఏళ్ల మతిస్థిమితం లేని బాలికపై సోమవారం నాగేశ్వర నాయక్(30) అనే వ్యక్తి అత్యాచారయత్నం చేయబోయాడు. బహిర్భూమికి వెళ్లిన సమయంలో అత్యాచారయత్నం చేయబోవడంతో బాలికకేకలు వేసింది. కేకలు విన్న స్థానికులు సంఘటనస్థలానికి వచ్చే సరికి నిందితుడు పరారయ్యాడు. బాలికను చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిచ్చోళ్లను చేస్తున్నరు!
⇒ వైద్యులపై మండిపడిన మంత్రి ‘పోచారం’ ⇒ శానిటేషన్ అధ్వానంగా ఉంది, పరిశుభ్రత లేదు ⇒ మెడికల్ కళాశాల నిధుల వినియోగంపై స్పష్టత లేదు ⇒ పేద రోగులకు మానవత్వంతో సేవలందించాలని హితవు ⇒ సదరం శిబిరాల నిర్వహణపై కలెక్టర్ ఆగ్రహం ⇒ వాడీవేడీగా సాగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిజామాబాద్ అర్బన్ : ‘‘మేమేమైన పిచ్చోళ్లలాగా కనబడుతున్నామా, సూటిగా సమాధానం చెప్పరెందుకు? మమ్మల్నే తికమక పెడతరు. మీతో మాట్లాడితే పిచ్చి లేస్తుంది. ఎర్రగడ్డకు పోవల్సి వస్తుంది. ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మానవతా దృక్పథంతో సేవలందించండి. మీలో మీకు సమన్వ యం లేదు. పనిలో శ్రద్ధ లేదు. వైద్యసేవలు అస్తవ్యస్తంగా మారాయి’’ అంటూ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వైద్యులపై మండిపడ్డారు. సోమవారం జిల్లా ఆస్పత్రి అభివృద్ధి సంఘం సమీక్ష సమావేశం జరిగింది. ఆస్పత్రిలో సౌకర్యాలు, రోగుల అవసరాలపై చర్చించారు. వైద్యాధికారుల తీరుపై తీవ్రంగా చర్చ జరిగింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడు తూ ‘‘శానిటేషన్ ఎవరు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రికి రాగానే దుర్వాసన వస్తుంది. ఏ మాత్రం శుభ్రత లేదు. శానిటేషన్ సిబ్బంది ఎంత మంది ఉన్నారు. కాంట్రాక్టర్ ఎవరు? నెలకు ఎన్ని డబ్బులు చెల్లిస్తున్నారు’’ అంటూ ప్రశ్నించారు. రూ. 2.15 లక్షలు చెల్లిస్తున్నారని, 61 మంది సిబ్బంది ఉన్నారని కాంట్రాక్టర్ బదులిచ్చారు. కొత్త, పాతవారికి వేరువేరు బడ్జెట్లు ఉన్నాయని, నిధులు రావడం లేదన్నారు. ఆస్పత్రి శుభ్రంగా శుభ్రంగా ఉందని చెప్పడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మేమేమైనా పిచ్చోళ్లమా...మాకు కనిపించడం లేదా, ఎక్కడ ఉంది శుభ్రత, మమ్మల్నే తప్పుదోవ పట్టిస్తావా’’ అంటూ అసహనం వ్యక్తం చే శారు. శానిటేషన్ సిబ్బందికి గత జులై నుంచి నిధులు విడుదల కాలేదని చెప్పడంతో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, డీఎంఈ శ్రీనివాస్, వైద్యావిధాన పరిషత్ కమిషనర్ మీనాకుమారితో మంత్రి పోచారం ఫోన్లో మాట్లాడారు. నిధులకు సంబంధించి ఎవరూ అడగలేదని వారు చెప్పడంతో, సమన్వయం లేకనే పనులన్ని నిలిచి పోతున్నాయని, సక్రమంగా పనులు చేయాలని వైద్యులను హెచ్చరించారు. ఎందుకు వెళుతున్నారు? రేడియాలిస్టు సమయపాలన పాటించడం లేదని, అందుబాటులో ఉండడం లేదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త మంత్రి దృష్టికి తెచ్చారు. తాను పగలు 2.30 గంటలకు ఇంటికి వెళుతున్నానని రేడియాలజిస్టు చెప్పడంతో, ఎందుకు వెళుతున్నారంటూ మంత్రి ఎదురు ప్రశ్నించారు. సరైన సమాధానం రాకపోవడం తో, మీతో మాట్లాడితే మాకే పిచ్చి లేస్తుంది. ఎర్రగడ్డకు పోవల్సి వస్తుందంటూ మండిపడ్డారు. ఆస్పత్రికి వచ్చే పేదరోగులకు మానవతా దృక్పథంతో సేవలందించాలని సూచించారు. మెడికల్ కళాశాలకు మంజూరైన రూ. 26 కోట్లను ఎలా వినియోగిస్తారో అధికారులు చెప్పలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కొనసాగుతున్న జనరిక్ మందుల దుఆణాలు, ఆస్పత్రికి డబ్బులు చెల్లించకపోవడం, ఆస్పత్రిలో ఆవరణలో ఏర్పాటు చేసిన ఆంధ్ర బ్యాంకు ఏటీఎంకు కేవలం నెలకు రూ. 1500 మాతమే వసూలు చేయడాన్ని మంత్రి ప్రశ్నించారు. ఆస్పత్రిలో సైకిల్ స్టాండ్, క్యాంటిన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. జనరిక్ మందు ల దుకాణాలను టెండర్ల ద్వారా ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రి పక్షాన జరుగ కపోతే ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ‘సదరం’ ఇలాగేనా? సదరం నిర్వహణపై కలెక్టర్ మండిపడ్డారు. నియోజకవర్గాలవారీగా శిబిరాలు ఏర్పాటు చేస్తే జిల్లా ఆస్పత్రి వైద్యులు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ‘‘మీకు వాహనాలు ఏర్పాటు చేయాలా! మీరు ప్రభుత్వ వైద్యులు కారా! వైద్యులు లేరని ఆర్మూర్ నుంచి తరచూ ఫోన్లు వచ్చాయి. సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకోండి’’ అని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. డీసీహెచ్ఎస్ శివదాస్ సమాధానం చెప్పకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, మేయర్ ఆకుల సుజాత, కళాశాల ప్రిన్సిపాల్ జీజీయాబాయి, డీఎంహెచ్ఓ గోవింద్‌వాగ్‌మోరే, ఆస్పత్రి సూ ప రిండెంట్ భీంసింగ్, ఆర్‌ఎంఓలు రజినీకాంత్, బ న్సీలాల్, విశాల్ పాల్గొ న్నారు. అంతకు ముం దు మంత్రి పోచారం ఆ స్పత్రిలోని వివిధ వా ర్డులను తిరుగుతూ పరి శీలించారు. -
శాస్త్రీయ దృక్పథంతోనే మానసిక చైతన్యం
అనంతపురం టవర్‌క్లాక్ : శాస్త్రీయ దృక్పథంతోనే ప్రజలు మానసికంగా చైతన్య వంతులు కాగలరని ఎమ్మెల్సీ డాక్టర్‌గేయానంద్ ఆన్నారు. శుక్రవారం నగర శివారులో శ్రీశ్రీ నగర్లో ప్రజాశక్తి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్యశిబిరాన్ని మేయర్ స్వరూప ప్రారంభించారు. కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమీషనర్ సత్యప్రకాష్ హాజరయ్యారు. అనంతరం గేయానంద్ మాట్లాడుతూ ప్రజల్లో మానసిక రుగ్మతలపై చైతన్యం పెరగాల్సి ఉందన్నారు. చిన్న చిన్న సమస్యలకు క్షణికావేశానికి లోనై జీవితాలనే బలిచేసుకుంటున్నారన్నారు. ప్రతి ఒక్కరూ మానసిక వికాసంతో శాస్త్ర్రీయ దృక్పథం అలవరుచుకోవాలని తెలిపారు. మేయర్ స్వరూప మాట్లాడుతూ ప్రజల కోసం వైద్యశిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మానసిక సమస్యలతో అన్ని వర్గాల ప్రజలు సతమతమవుతున్నారని తెలిపారు. మానసిక జబ్బులకు నేడు అధునిక వైద్యం అందుబాటులో ఉందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమీషనర్ సత్యప్రకాష్ మాట్లాడుతూ దేశంలో నేటికి మానసిక రుగ్మతలతో ఎంతో మంది తనువు చాలిస్తున్నారని తెలిపారు. వైద్యం శిబిరం నిర్వహించిన సీపీఎం శాఖ, ట్రినిటీ రిహబిలిటేషన్స్ ట్రస్టు వారిని ఆయన అభినందించారు. మానసిక, స్త్రీ వ్యాదులు, పిల్లల జబ్బులు గురించి అవగాహన కల్పించారు. ప్రజల్లో మానసిక జబ్బులపై అవగాహన కల్పించుటకు ప్రభుత్వం ముందుకు రావాలని మానసిక వైద్యులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో కార్పొరేటర్ భూలక్ష్మి, సాహితి సంస్థ కన్వీనర్ వేణుగోపాల్, సీపీఎం నాయకులు ప్రకాష్‌రెడ్డి, గిరి, కుమార్, విజయ్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
మనోబలానికి ప్రార్థన దివ్యౌషధం
ధ్యాన భావనలు మనసుని తొలిచివేసే ఆలోచనల్లో భయం ఒకటి. భయం సార్వజనీనం. పశుపక్ష్యాదులకు కూడా ఉంటుందీ భయం. భయాన్ని మన జీవితంలో అనేక రకాల బెంగలతో భవిష్యత్తు, కుటుంబం, పని లేదా వ్యాపారాల గురించి వెలిబుచ్చుతాం. కొన్ని బెంగలు చిన్నవిగా ఉంటే, కొన్ని తీవ్రంగా ఉంటాయి. ఇది మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాలకు మంచిది కాదని మనందరికీ తెలుసు. బెంగపడి సాధించేదేమీ లేదని కూడా తెలుసు. మనకు భవిష్యత్తులో రాసిపెట్టి ఉన్నదాన్ని, మనం బెంగపడడం వల్ల ఏమీ మార్చలేమనీ తెలుసు. అయినప్పటికీ మనం బెంగపడి, కంగారు పడి, దిగులు చెంది, భయపడి పోతుంటాం. దీన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ సమస్య మన వివేకానికి సంబంధించినది కాదు. అలాగయితే భయం తొలగిపోవాలి. మరి సమస్య ఎక్కడుంది? మన మనసులో, మన మానసిక అలవాట్లలో ఉందన్నమాట. సగం మానసిక సమస్యలు నా భావపరమైన అలవాట్ల నుంచి వస్తాయి. ఈ అలవాట్లు నేను నా మనసులో పదేపదే భావాలను తిరగదోడటం వల్ల ఏర్పడతాయి. ఇప్పుడు భావాలు నా అంతఃచేతన మనసులో లోతుగా ఉన్నాయి. వాటిని సంస్కారాలు లేదా వాసనలు అంటారు. వాటిని నేను పారద్రోలాలంటే, నేను వాటిని ప్రయత్నపూర్వకంగా బయటకు లాగి, వాటి వ్యతిరేక భావాలను సాధన చేయాలి. నేను ప్రశాంతంగా కూర్చొని, నా బెంగలనన్నిటినీ పైకి లాగి, వాటిని బయట పెట్టి, వాటి కింద దాగిన గట్టి మనసును కనుక్కోవాలి. నేను బెంగపడడం లేదని నాకు నేనే చెప్పుకోవాలి. మొదట్లో అది యాంత్రికంగా ఉండవచ్చు. లేదా చూడడానికి అలా ఉండవచ్చు. కానీ రానురాను అది నేను అలవరచుకున్న ఒక సానుకూల ఆలోచన అవుతుంది. ఈ కొత్త అలవాటును పెంపొందించుకోడానికి, నేను దేవుని సహాయం కోరుతాను. నాకు బలాన్నివ్వమని వేడుకుంటాను. ‘ఓ దేవా! నా భవిష్యత్తును, అది ఎలాగున్నా సరే, మనస్ఫూర్తిగా ఆహ్వానించే శక్తిని ఇవ్వు నాకు. నా భవిష్యత్తు గానీ, నా కుటుంబ భవిష్యత్తుగానీ, నా దేశ భవిష్యత్తుగానీ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అది మంచీచెడుల మేలు కలయికగా ఉంటుందని మాత్రం నాకు తెలుసు. నేను వాటిని అనుభవించక తప్పదు. ఎందుకంటే నేను భూమ్మీద పుట్టిందే నా కర్మఫలాన్ని హరింపజేయడానికి. వాటిని నేను ఆడించలేను. తప్పించుకోలేను. అందుకని ఏ విధమైన బెంగకూ లోను కాకుండా, వాటిని ప్రశాంతంగా ఆహ్వానించేందుకు నాకు శక్తి కావాలి’. ప్రార్థన చేస్తే నా శక్తి పెరుగుతుందని మొదట నేను నమ్మాను. మనసారా, భక్తితో చేసిన ప్రతి ప్రార్థన తర్వాతా నేను మరింత శక్తిని పుంజుకున్నాను. ఆ శక్తిని నేను గ్రహించుకుని, నేనిప్పుడు మరింత శక్తిమంతంగా ఉన్నాను. నా జీవితంలో ఎటువంటి సంఘటననైనా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను అని నాకు నేనే చెప్పుకుంటాను. నా వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం, కుటుంబ సభ్యుల జీవితాలలో ఒడిదుడుకులు, వ్యాపారంలో లాభనష్టాలు ఏవి కలిగినా సరే నాకిక బెంగ లేదు. నేను ఇక కంగారుపడను. నేను ఇక దిగులు చెందను. మిన్ను విరిగి మీదపడ్డా దాన్ని ఎదుర్కోడానికి నేను సిద్ధం. నేను విశ్రాంతిగా ఉన్నాను. నేను విశ్రాంతిగా ఉన్నాను. నేను విశ్రాంతిగా ఉన్నాను. శాంతోహం శాంతోహం శాంతోహం. - స్వామి పరమార్థానంద (తెలుగు: మద్దూరి రాజ్యశ్రీ) -
ప్యాలియేటివ్ కేర్వేదన-సాంత్వన!
కొన్నిసార్లు జబ్బు చాలా మంచిది. అది బంధాలను బలంగా చేస్తుంది. అందర్నీ దగ్గర చేస్తుంది. కళ్లు చెమర్చేలా చేస్తుంది. అన్నీ అమర్చేలా చూస్తుంది. సన్నిహితులెవరో చెబుతుంది. కానీ చికిత్సకు లొంగే జబ్బు అయితేనే మంచిది. అందులోనూ డబ్బు ఉంటేనే జబ్బు మంచిది. కానీ ఆ వచ్చిన రుగ్మత ఒకపట్టాన లొంగనిదైతే? ఎప్పటికీ తగ్గనిదైతే? మృత్యువొక్కటే దానికి మందైతే? అయితే ఆ వేదన ఒక్క రోగిదే కాదు... అనుభవించే అందరిదీ. పక్కనుండే పలువురిదీ. ఇక మరణం అనివార్యమని నిర్ధారించే జబ్బు వస్తే... ఆ వచ్చే కష్టాలు కేవలం చికిత్సాపరమైనవి మాత్రమే కాదు. మరెన్నో! ముఖ్యంగా శారీరకంగా కలిగే నొప్పులు, తెంచుకోలేని పాశాలు, మానసికమైన క్లేశాలు... వీటన్నింటినుంచీ విముక్తి ఎలా? మరణమే శరణ్యమనే పరిస్థితుల్లో సంవేదననుంచి సాంత్వన ఇచ్చే ‘ప్యాలియేటివ్ కేర్’పై అవగాహన కోసం ఈ ప్రత్యేక కథనం. హాస్పిటల్ కాదది... హాస్పిస్ ఒక రోగికి వచ్చిన జబ్బు కారణంగా ఇక మరణం తప్పదు. అలాంటి రోగిని ఏ హాస్పిటల్ చేర్చుకుంటుంది? పైగా అలాంటి రోగులను చేర్చుకోడానికి విముఖత చూపుతుంది. ఫలానా దగ్గర రోగికి నయమైపోయిందనే కీర్తి వస్తే గొప్పగానీ... ఫలానాయన అంత పెద్ద ఆసుపత్రిలోనూ చనిపోయారంటే అది ఆసుపత్రికి అపకీర్తి కదూ! అందుకే అలాంటివారిని చేర్చుకోడానికి హాస్పిటళ్లు ముందుకు రావు. చెవికి చేదుగా వినిపించినా, మనసుకు కష్టంగా అనిపించినా ఇది సత్యం. మరి హాస్పిటళ్లే ముందుకు రాకపోతే వారికి వేదన నుంచి విముక్తి ఎలా? అందుకే ఇలాంటి రోగులకు సాంత్వన కలిగించేందుకు ఉద్భవించినవే ‘హాస్పిస్’లు. ఒక్కమాటలో చెప్పాలంటే... అది ఇల్లైనా కావచ్చు లేదా హాస్పిటల్ వంటి వసతైనా కావచ్చు. కానీ రోగి తన చివరి రోజు వరకూ నొప్పీ, బాధా లేకుండా ప్రశాంతంగా బతికేలా చేసే ఇన్‌పేషెంట్ వసతి సౌకర్యమే ‘హాస్పిస్’. హాస్పిస్ కాదేమో... హాస్-‘పీస్’ ఏమో! మరణం తప్పదని తెలిశాక మనసు దెబ్బతింటుంది. శారీరక బాధలకు మానసిక వేదన తోడుగా వస్తుంది. ఇలా రెట్టింపైన బాధలను తగ్గించే మార్గం ఏదైనా ఉంటే అది హాస్పిస్. పెదవిపై ‘హాసాన్ని’, మనస్సుకు శాంతిని... అదే ‘పీస్’ ఇప్పించే ఆ ప్రదేశాన్ని ‘హాస్పిస్’ అనడం కంటే హాస్-పీస్ అనడం సముచితమేమో! క్యూర్ లేని చోట కావాల్సిందే... కేర్ కొన్ని జబ్బులకు ఇక చికిత్స జరిగే పరిస్థితి ఉండదు. ఉదాహరణకు మెటస్టెసస్ దశకు చేరిన క్యాన్సర్‌కు ఇక చికిత్స చేసే మార్గం మిగలదు. కీమోథెరపీ, రేడియేషన్ ప్రక్రియ, శస్త్రచికిత్సలూ ఇవేవీ పనిచేయవు. కానీ ఆ దశలో అంతులేని శారీరక వేదన ఉంటుంది. ఇలాంటి అవసానదశలో ఉన్నవారికీ కొన్ని శారీరక బాధలుంటాయి. అవి మరీ తీవ్రంగానూ ఉంటాయి. ఆ సంవేదనలకు కావాల్సింది శమన చికిత్సఒక్కటే. లక్షణాలకు చేసే ఉపశమన చికిత్స ఒక్కటే. ఆ చికిత్సను అందిస్తూ, రోగుల బాధల తీవ్రత తగ్గించే కేర్‌ను అందిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న మాట ఇది... ‘ప్యాలియేటివ్ కేర్’ అంటే ఒక రోగికి ఇక జబ్బును నయం చేసే చికిత్స ఇవ్వడం సాధ్యం కాదని నిర్ధారణ అయినప్పుడు రోగికి తీవ్ర లక్షణాల బాధ నుంచి విముక్తి కలిగించే చికిత్స (సింప్టమ్యాటిక్ ట్రీట్మెంట్), మానసిక వేదననుంచి దూరం చేసే మానసిక చికిత్స (సైకలాజికల్ ట్రీట్మెంట్), ఆత్మతృప్తిని ప్రసాదించే ఆధ్యాత్మిక చికిత్స (స్పిరిట్యువల్ ట్రీట్మెంట్) ఇవ్వాలనీ, రోగి బంధువులను సైతం ఆవేదననుంచి దూరం చేసేలా ఈ కార్యకలాపాలు ఉండాలని, తద్వారా రోగి జీవననాణ్యతను (క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ను) మెరుగుపరచాలనీ చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ). అంతేకాదు... రోగికీ, అతడి బంధువులకూ అవసరమైన మానసిక, సామాజిక బలాన్నీ ప్రసాదించాలని పేర్కొంటోంది. ఆ అపోహే వద్దు... రోగిని బాధల నుంచి విముక్తం చేసేలా వ్యవహరిస్తారనే మాట ఒక్కోసారి కొందరిలో తప్పుడు అభిప్రాయాలను కలిగించవచ్చు. రోగికి తీవ్రమైన బాధా, నొప్పీ ఉంటాయి కాబట్టి వాటి నుంచి విముక్తం కలిగించడానికి ‘కారుణ్యమరణం’ కలిగిస్తారేమో అనే అపోహ ఉంటుంది. కానీ ప్యాలియేటివ్ కేర్‌లో రోగికి కారుణ్యమరణం కలిగేలా చేయరు. మరణాన్ని ముందుకు తీసుకురారు. అది వచ్చినప్పుడు దాన్ని ఆలస్యం చేయరు. జబ్బు వచ్చినా, రుగ్మతతో రుజాగ్రస్తమైనా రోగి తన సహజమరణం సమీపించినప్పుడే చనిపోయేలా చేస్తారు. ఆ సమయంలోనూ వారు పెద్దగా బాధపడని విధంగా తాత్విక దృక్పథం కలిగి ఉండేలా రోగికీ, కుటుంబ సభ్యులందరికీ తగిన కౌన్సెలింగ్ ఇస్తారు. అయితే ఎంతగా కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ రోగితో ఉండే భావోద్వేగ పరమైన బంధాల వల్ల అది సరిపోయినంత అని ఎవరూ చెప్పలేరు. అలా చేయడం సాధ్యమూ కాదు. అంగట్లో అన్నీ ఉన్నా రోగి నోట్లో మందూ కరవే... సాధారణంగా చివరిదశలో తీసుకుంటున్న రోగికి ప్రధానంగా అవసరమైనవి నొప్పిని తెలియకుండా చేసే మందులు. వీటిని వైద్యుల పర్యవేక్షణలో అవసరం ఉన్నవారికే ఇస్తే ఆ మందులను ‘ఓపియాయిడ్స్’ అనవచ్చు. కానీ ఒక మత్తు కోసం, ఒక దుర్వ్యసనం కోసం దుర్వినియోగం చేస్తే వాటిని ‘నార్కోటిక్స్’ అంటారు. అందుకే వీటి లభ్యత తక్కువ. సాధారణ మెడికల్ షాపుల్లో ఇవి దొరకనే దొరకవు. ఇవి దొరికే ప్రత్యేకమైన మందుల దుకాణాలుంటాయి. అక్కడా ఎంతో మంది ఉన్నత స్థాయి వైద్యాధికారుల అనుమతులతోనే వీటిని విక్రయిస్తారు. అంతేకాదు... వీటి ప్రిస్క్రిప్షన్ కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. ఆ ప్రిస్కిప్షన్ ఉంటేనే ఈ మందు దొరకడం సాధ్యమవుతుంది. విచిత్రం ఏమిటంటే... వీటిపై కఠినాతికఠినమైన నిబంధనలు ఉండటం వల్ల ఈ మందుల తయారీకి అవసరమైన పంట అయిన ‘ఓపియమ్’ ప్రపంచంలో పండే మొత్తం పంటలో 90 శాతం భారత్‌లో పండుతోంది. కానీ నొప్పుల నివారణ కోసం కేవలం 5 శాతం కంటే తక్కువకే ఇక్కడ దీని లభ్యత పరిమితమైంది. అంతెందుకు ఈ తరహా రోగులు రాష్ట్రమంతటా విస్తరించి ఉన్నా... ఈ బాధానివారిణులు మాత్రం కేవలం ప్రస్తుతం ‘హైదరాబాద్’లో మాత్రమే లభ్యమవుతున్నాయి. మొదటి కారణం... ‘ప్యాలియేటివ్ కేర్’ చికిత్స ప్రక్రియలపై అవగాహన తక్కువగా ఉండటం. రెండో కారణం... వీటి లభ్యతపై కఠినమైన నిబంధనలు అమలవుతూ ఉండటం. ఈ పరిమితుల దృష్ట్యా ప్యాలియేటివ్ కేర్ అవసరమైన రోగులు ఎందరో దీనికి దూరంగా నొప్పులతో విసిగిపోతూ, బాధలతో వేసారిపోతూ దుర్భరంగా జీవిస్తున్నారు. హాస్పిస్ నుంచి హాస్పిటల్‌కు తరలిస్తారా? ప్యాలియేటివ్ కేర్ దొరికే హాస్పిస్ నుంచి రోగిని హాస్పిటల్‌కు తరలించేందుకు అవకాశమే ఉండదు. ఎందుకంటే ఇక రోగికి మృత్యువు తప్పదని తెలిశాకే ఇక్కడికి చేర్చుతారు. ఒకవేళ రోగి సంక్లిష్ట దశల్లోకి వెళ్లి మరణానికి చేరువవుతుంటే బాధానివారణకు అవసరమైన చర్యలు చేపడతారు తప్ప... ఆసుపత్రికి తీసుకెళ్లరు. అయితే కొందరు రోగులు తమ పరిస్థితిని గుర్తెరిగాక... తమ సొంత ఇంట్లోనో, తమకు ఇష్టమైన చోటో ప్రశాంతంగా కన్నుమూద్దామని భావిస్తారు. అలాంటి రోగుల కోరిక మేరకు వారు తమకు ఇష్టమైన, అనువైన చోటికి వెళ్లవచ్చు. విజయ సంతృప్తి... ఆత్మతృప్తి ఒక కఠినమైన, సంక్లిష్టమైన కేసును స్వీకరించి రోగిని బతికిస్తే ఆ డాక్టర్‌కు తన వృత్తిపరంగా విజయసంతృప్తి లభిస్తుంది. కానీ మరణం తథ్యమని తెలిసిన ఒక రోగికి కేవలం బాధ నుంచి విముక్తి కలిగిస్తే ఏమొస్తుంది? కనీసం ఫీజు కూడా రాదు. అందుకే కేవలం ఆత్మతృప్తి కోసమే ఈ రంగాన్ని ఎంచుకుని సేవలందించే వారే భారత్‌లో ప్యాలియేటివ్ కేర్‌లో కొనసాగుతున్నారు. సేవాపథంలో సాగుతున్నారు. విజయసంతృప్తికీ... ఆత్మతృప్తికీ... తెచ్చుటలో ఉన్న హాయికీ... ఇచ్చుటలో ఉన్న హాయికీ తేడా తెలిసిన వారే ఈ కేర్ కోసం క్రతువు సాగిస్తున్నారు. చివరగా... ఉర్దూ మహాకవి, గజల్ చక్రవర్తి గాలిబ్ అంటాడూ... మృతియే లేకున్న ఈ బతుకుకు రుచే లేదు అని వచిస్తాడు. మరణం కూడా గొప్ప ఆనందకర అనుభవమేనని ప్రవరిస్తాడు. గోరు ఊడిన సుఖం లాంటిదే మరణమంటూ మృత్యువును నిర్వచిస్తాడు. ఎప్పటికైనా తప్పనప్పుడు ఆనందంగా ఆహ్వానించమని ఉద్బోధిస్తాడు. ఆ తాత్విక స్థాయిని, ఆధ్యాత్మిక భావననూ, ఆ అంతర్దర్శనాన్ని అందరూ దర్శించగలిగేలా చేసే పవిత్రక్షేత్రమే ఈ ప్యాలియేటివ్ కేర్ సెంటర్. ఓ వ్యక్తికి చివరగా దొరకాల్సిన సేవల మజిలీ... ఈ మలిమజిలీ! మేలిమి మలిమజిలీ!! బాధా విముక్తి కోసం శక్తిమేర ప్రయత్నం చివరకు తీసుకుని తీసుకుని మరణించే కొన్ని జబ్బుల చివరి దశ చాలా బాధాకరంగా ఉంటుంది. కొన్ని జబ్బులు భయంకరమైన శారీరక వేదనలను కలిగిస్తాయి. ఆ దశలో తీవ్రమైన నొప్పులతో, వికారాలతో, వాంతులు, భ్రాంతులూ, మింగలేకపోవడాలూ, విరేచనాలూ, విలాపాలూ విషాదాలూ వంటి బాధలు శరీరాన్ని వేదనకూ, మనసును ఆవేదనకూ గురిచేస్తాయి. శత్రువుకూ ఈ పరిస్థితి వద్దనే బాధనుంచి విముక్తి కోసం శక్తిమేరకు ప్రయత్నించే సిబ్బంది హాస్పిస్‌లో నిరంతరం పనిచేస్తుంటుంది. కలచివేసే నొప్పిని అణచివేసేందుకూ, తొలిచేసే బాధను ఆవలికి తోసేసేందుకు కృషి చేస్తుంది. ఇక్కడ బాధానివారణా నిపుణులుంటారు. వీరిని ప్యాలియేటివ్ కేర్ స్పెషలిస్టులంటారు. మందులందించే నర్సులుంటారు. సలహాలతో సాంత్వన పరిచే కౌన్సెలర్లుంటారు. స్వచ్ఛంద సేవకులుంటారు. ముక్తిని పొందాలనుకుని భక్తిని ఆశ్రయించేవారికి మనసును సేదదీర్చేలా మాట్లాడే మానవీయమూర్తులుంటారు. ఔషధాల కోసం ఫార్మసిస్టులూ, పౌష్టికాహారం కోసం అవసరమైన న్యూట్రిషనిస్టులు... ఇలా వీళ్లంతా కలిసికట్టుగా పనిచేస్తూ మన గుండెబరువులను వారు పంచుకుంటూ, మన వేదనలను ఆవలికి తోస్తూ ఉంటారు. పునరావాసం కాదది... మరణావాసం ప్రపంచంలోని మొట్టమొదటి హాస్పిస్ను పధ్నాల్గవ శతాబ్దంలో సెయింట్ జాన్స్ ఆఫ్ జెరూసెలం రోడ్స్‌లో ప్రారంభించారు. పతితులూ, పథికులూ, నొప్పి చేత పీడితులూ, బాధాసర్పదష్టులు అలా వెళ్తూ వెళ్తూ, మార్గమధ్యంలో మరణవేదన బారిన పడితే వారికి దిక్కెవరు... అన్న ఆలోచననుంచి పుట్టిందే ఈ మొట్టమొదటి హాస్పిస్. లాటిన్లో హాస్పెస్ అనే మాటకు అర్థం... ‘అనుకోని ఓ అపరిచిత అతిథికి అవసరమైన ఆతిథ్యమిచ్చి చివరివరకూ వేదనలనుంచీ, రోదనలనుంచీ విముక్తి కల్పించడం’. దీనికి సుదీర్ఘమైన నేపథ్యమూ ఉంది. పదకొండో శతాబ్దం నుంచే యుద్ధాల్లో గాయపడి కోలుకోలేకున్నవారూ, అంతుతెలియని జబ్బులతో తీసుకుంటున్నవారూ, మార్గమధ్యంలో రోగగ్రస్తులై దారీతెన్నూ తెలియని ప్రస్థాన పథికులూ... ఆ ప్రవాసాల్లో చివరి వరకూ నివాసముండి, ప్రశాంతంగా కనుమూయడానికి అవసరమైన కేంద్రాలుండేవి. ప్రధానంగా ఇవి సుదీర్ఘప్రయాణం చేసే యాత్రికులకోసం ఉద్దేశించినవి. ఇక ఎప్పటికీ జబ్బు తగ్గదని తెలిసిపోయాక, తేలిపోయాక వీరికి కలిగిన రుగ్మతనూ, రుజాగ్రస్త అవస్తను ‘టెర్మినల్ ఇల్నెస్’ అనేవారు. ఇల్లేలేనివారి ఇల్‌నెస్‌ను, వారి వెల్నెస్ను పట్టించుకునే వారెవరు? వారికోసమూ ఏదైనా ఏర్పాటు ఉండాలనే మానవీయమూర్తుల తాత్వికత నుంచి ఆవిర్భవించిన చికిత్సా ప్రక్రియ ఇది. ప్రేమను పంచుతూ రోగికి చివరి వరకూ చేసే సేవ పేరే ‘ప్యాలియేటివ్ కేర్’! ఆ కేర్‌ను అందిస్తూ చివరివరకూ ఉంచే మరణావాసమే ‘హాస్పిస్’. మరి ఆ సామాజిక బలం దొరుకుతోందా? దురదృష్టవశాత్తూ మరణమే శరణ్యమైన రోగులకు సామాజిక స్థ్యైర్యాన్ని అందించే పరిస్థితి భారత్‌లో లేదు. మనదేశంలో మరణాన్ని ఒక కీడుగా పరిగణిస్తారు. ఒక చెడుగా చూస్తారు. అందుకే తప్పనిసరిగా మరణించే రోగిని చేర్చుకోడానికి ఆసుపత్రులూ అంత సుముఖంగా ఉండవు. అలాంటి వారికి అద్దెకు ఇల్లు ఇవ్వడానికి యజమానులూ సిద్ధంగా ఉండరు. మన దేశంలోని అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి ఏమిటంటే... క్యాన్సర్ నాలుగో దశతో ఇక తప్పనిసరిగా మరణిస్తాడనే రోగి ఉన్న కుటుంబానికి ఇల్లే అద్దెకు ఇవ్వరు. తమ ఇంటిలో ఆ రోగి మరణించడాన్ని అంగీకరించరు. ఇక ఇల్లే ఇవ్వని వారు ఇల్నెస్ గురించీ, వారి వెల్నెస్ గురించీ ఆలోచిస్తారనుకోవడం అత్యాశే. అందుకే ఈ తరహా రోగులకు అవసరమైన సామాజిక స్థైర్యం (సోషల్ సపోర్ట్) అందడం లేదు. అలాంటి వారికి ఇప్పుడు ‘హాస్పిస్’లే ఒక వరం. కానీ మరో దురదృష్టపరిస్థితి ఏమిటంటే... భారతదేశంలో ప్రతిష్ఠాత్మకమైన హాస్పిటల్‌కు అనుబంధంగానైనా ఒక హాస్పిస్ కూడా లేదు. మన రాష్ట్రంలోనూ ఒక్క హైదరాబాద్‌లో తప్ప ఇంకెక్కడా ఈ వసతి లేదు. స్పర్శ్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోనే కొందరు మానవీయ వైద్య నిపుణుల చొరవతో ఈ కార్యక్రమం సాగుతోంది. అలాంటి రోగుల అవసరాలను తీరుస్తోంది. ఎదురుగా ఎన్నెన్నో సవాళ్లు... ఈ తరహా చికిత్స సౌకర్యాల ఏర్పాటుకు ఎన్నో సవాళ్లు అడ్డంకిగా ఉంటాయి. ముఖ్యంగా వసతి. ఒకచోట అందరూ చనిపోయేవారే ఉంటారని తెలిశాక అలాంటి ఆవాసాన్ని తమ పొరుగునే ఉండాలని కోరుకునేంత మానవీయ, మాననీయ మూర్తులెవరు? ఇక చికిత్స ఎంతగా చేసినా ఫలితం ఉండదు. చేయాల్సిన చికిత్సల్లా లక్షణాలను బట్టి కనిపించే బాధలకు లేపనం పూయడం లాంటిదే. నొప్పికి మందు వేయడం లాంటిదే. తాత్కాలికంగా ఉపశమనం కలిగించడం లాంటిదే. అలాంటప్పుడు రోగికీ ఆ విషయం తెలిశాక, బంధువలకూ సంగతి అర్థమయ్యాక తగ్గని రోగం కోసం డాక్టర్‌కు ఫీజు చెల్లించాలంటే ఇష్టపడేవారెవరు? అది సరే... అన్నీ తెలిసి ఫీజు అడగాలంటే సదరు వైద్యుడికి మాత్రం మొహమాటం ఉండనే ఉంటుంది కదా. కాబట్టి ఫీజు వసూలుకు అవకాశం లేదు. ఒకవేళ అడిగినా అది మానవత్వం కాదు. కాబట్టి ఈ తరహా ‘ప్రాక్టీస్’ను ఎంచుకునే అవకాశమే తక్కువ. అందుకే భారత్‌లో అత్యున్నత స్థాయిలో ‘ప్యాలియేటివ్ కేర్’ కోర్సే లేదు. మన రాష్ట్రంలోనూ ఈ తరహా అత్యున్నత స్థాయి విద్య చదివిన వారూ పెద్దగా లేరు. దేశవ్యాప్తంగానూ ఒకరిద్దరే ఈ తరహా అత్యున్నత స్థాయి విద్యను అభ్యసించిన వారున్నారు. మరి సమాజానికి ఈ తరహా సేవలూ కావాలి కదా. అందుకే చొరవ తీసుకని కొందరు మానవత్వంతో తమకు చేతనైన పరిధిలో ఇలాంటి సేవ అందిస్తున్నారు. ప్యాలియేటివ్ కేర్‌లోని ప్రధాన లక్ష్యాలు రోగికి నొప్పి నుంచి లక్షణాల బాధలనుంచి విముక్తి కలిగించడం. మరణం తథ్యమని తెలిశాక ఆ సమయం వరకూ సాధ్యమైనంత మేరకు మంచి, సాధారణ జీవితాన్నే అందించడం. సామాజిక, ఆధ్యాత్మిక, మనశ్శాంతిని ఇచ్చే సాంత్వన ప్రక్రియలను అనుసరించడం. సంఘపరంగా అవసరమైన స్థైర్యాన్ని అందించడం. మరణం వరకూ మామూలుగానే ఉండేలా, తన దైనందిన పనులన్నీ ఇదివరకులాగే చురుగ్గా చేసుకునేలా రోగిని ప్రోత్సహించడం. అలాంటి స్ఫూర్తిని రోగిలో రగిలించడం. రోగి కుటుంబాన్ని సైతం అన్ని విధాలా మానసికంగా సిద్ధం చేసి, వారినీ మామూలుగా ఉంచేందుకు ప్రయత్నించడం, వారిలోని బాధను తొలగించడానికి కృషి చేయడం. పై విషయాలన్నీ జరిగేందుకు అవసరమైన వ్యక్తులతో ఒక సమూహం (టీమ్)గా ఏర్పడి అన్ని విషయాల్లోనూ రోగికీ, అతడి బంధువులకూ ఆ బృందం ఒక భరోసాగా నిలవడం. చేయూతనివ్వడం. రోగి అనునిత్యం సానుకూల దృక్పథంతోనూ, మంచి నాణ్యమైన జీవనప్రమాణాలతోనూ జీవించేలా చేయడం. హైదరాబాద్‌లోని ‘స్పర్శ్’ స్వచ్ఛందంగా... వసూళ్లకు అవకాశం లేని ఈ రంగంలోకి ప్రవేశించి, సమాజానికి తమ వంతు సేవగా తమ భాగస్వామ్యాన్ని అందజేస్తున్నారు కొందరు డాక్టర్లు. వారిలో ప్రధానమైన వారు డాక్టర్ ఫణిశ్రీ. ఆమె ఈ సంస్థకు మెడికల్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. పైగా ఆమె ప్యాలియేటివ్ కేర్‌లో శిక్షణపొందిన నిపుణురాలు. అలాగే డాక్టర్ సుబ్రహ్మణ్యం కూడా ఈ స్పర్శ్ సంస్థకు అధ్యక్షుడిగా, ప్రధాన ట్రస్టీగా, కోశాధికారిగా సేవలందిస్తున్నారు. ఇక మరికొందరు స్వచ్ఛంద సేవకులు సైతం ఈ కృషిలో భాగస్వామ్యం వహిస్తున్నారు. హాస్పిస్ సౌకర్యాన్ని తమ సేవామందిరం బయటకూడా అందిస్తున్నారు. అంటే ఇండ్లకు వెళ్లీ కడగండ్లు తీర్చే సేవా చేస్తున్నారు. వీరు తమ సేవలన్నింటినీ ఉచితంగా అందజేస్తున్నారు. ఇందుకుగాను ఎలాంటి డబ్బునూ వీళ్లు రోగుల నుంచి లేదా వారి బంధువులు, సన్నిహితుల నుంచి స్వీకరించరు. కానీ ఈ తరహా సేవలకు, మందులకూ పెద్ద ఎత్తున నిధులు అవసరం. అందుకోసం ఒకవేళ రోగి బంధువులూ, సన్నిహితులూ తమ వంతు విరాళాలు అందించదలచుకుంటే తమ స్పర్శ్ సంస్థకు ఇవ్వాల్సిందిగా కోరతారు. రోగికి కావాల్సింది ఆత్మీయ స్పర్శ: కాబట్టే ఈ సంస్థకు విజిటింగ్ అవర్స్ అంటూ ఉండవు. సందర్శకులెప్పుడైనా రావచ్చు. తుదిఘడియల్లో తోడుగా ఉంటూ... తామున్నామన్న భరోసా ఇస్తూ... చివరి వరకూ రోగి వెంటే నడుస్తూ, వారితో కలిసి చదువుతూ, ఆడుతూ, పాడుతూ, ఆనందింపజేస్తూ తమ స్పర్శను వారికి అందించవచ్చు. హైదరాబాద్‌లో స్పర్శ్ చిరునామా స్పర్శ్ హాస్పిస్,సెంటర్ ఫర్ ప్యాలియేటివ్ కేర్, ప్లాట్ నెం. 85, (8-2-703/2/1), రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ - 500 034. ఫోన్: 040 2338 4039, 94904 48222. ఈ-మెయిల్ : hospicesparsh@gmail.com వెబ్సైట్: www.sparshhospice.org - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి