పట్టరాని కోపం, చిరాకు వచ్చినప్పుడు మాట్లాడే భాష, వైఖరీ మారిపోతుంది. అనాలనుకున్న నాలుగు మాటలు అనేస్తా గానీ ఆ కోపం తగ్గిన ఫీలింగ్ రాదు. కోపం, భాధ, ఆవేదన వంటి భావోద్వేగాలను కొందరూ ఆపుకోలేరు. ఏదైన ఎక్స్‌ప్రెస్ చేసేయాల్సిందే. అయితే ఇలా మనసులో బాధ, కోపాన్ని వెళ్లగక్కడమే మంచిదంటున్నారు. ఆ టైంలో పరుషంగా లేదా బ్యాడ్ లాంగ్వేజ్‌లో మాట్లాడటం వంటివి చేస్తాం. ఇలా చేయడమే మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలా చేస్తే మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. ఇదేంటీ..బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడమని ప్రోత్సహిస్తున్నారా అని కోప్పడకండి. ఇలా అనడానకి కారణం ఏంటంటే..
కోపం, ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడూ బ్యాడ్ లాంగ్వేజ్‌లో మాట్లాడుతుంటారు. కొందరూ ఆ వ్యక్తి మీద లేదా పని మీద కోపాన్ని ఇలా పరుష పదజాలం రూపంలో బయటకు వెళ్లగక్కేస్తారు. ఇలా చేస్తే మనసులో ఉన్న బాధ, కోపం, ఒత్తిడి తగ్గిపోయి రీలిఫ్ అయిపోతారట. ఒత్తిడి లేదా ఆందోళనను వదిలించుకోవడానికి ఇదో ఒక గొప్ప మార్గం అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
అందుకోసం పాక్ వైద్యుడు వకార్ హుస్సేన్ పది మంది పెద్దలు, దాదాపు 98 మంది పురుషులు, 155 మంది స్త్రీలపై వివిధ దశల వారిగా అధ్యయనం చేశారు. వారిలో కొందరూ భావోద్వేగాలను అణుచుకుని బయటకు ఎక్స్‌ప్రెస్‌చేయకపోవడంతో..వారిలో ఆందోళన, ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు వెల్లడయ్యింది. తమ కోపాన్ని, చిరాకుని వెళ్లగక్కేలా బ్యాడ్ లాంగ్వేజ్‌లో మాట్లాడే పురుషులు, స్త్రీలల్లో ఆందోళన, ఒత్తిడి తక్కువగా ఉన్నట్లు తేలింది. అంతేగాదు పరిశోధనలో భావోద్వేగాలను అణిచివేయడం లేదా దాచేసుకునే వారిలో మానసిక ఆరోగ్యం క్షీణించిపోయి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని వెల్లడించారు వైద్యుడు హుస్సేన్.
అయితే ప్రతిసారి ఇలా అగ్రెసివ్‌గా లేదా కోపంగా చిరాకులో మాట్లాడే కఠిన పరుష పదజాలం.. మన స్నేహితులు, బంధువుల మనసులు గాయపడేలా చేస్తాయి. ఒక రకంగా బంధాలు దూరమవుతాయి. అందుకే మన పెద్దలు కోపంలో వచ్చే ప్రతి మాట మనిషి వినాశనానికి హేతువు అని నొక్కి చెబుతుంటారు. కోపంగా ఉన్నప్పుడూ ఏదో ఒక పని చేయడం లేదా అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోవడం వంటివి చేయమంటారు. సైంటిఫిక్‌గా ఇలా వెళ్లగక్కడం వల్ల లోపలున్న బాధ లేదా కోపం తీరిపోయి ఆ క్షణం మీరు బాగున్నట్లు ఉన్నా దీర్ఘకాలంలో..అదే మన బాంధవ్యాలను విచ్ఛిన్నం చేసి మనల్ని ఒంటరిని చేసే అవకాశం ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ కోపం, బాధ, ఆందోళన, ఒత్తిడి, చిరాకులను తగ్గించుకునే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోమని సూచిస్తున్నారు.
అవేంటంటే..
స్మార్ట్‌ఫోన్‌లు, గాడ్జెట్‌లు, కంప్యూటర్‌లతో గడిపే సమాయాన్ని ఏదో విధంగా తగ్గించడం
కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం తగ్గించండి
యోగా, మెడిటేషన్ వంటివి చేయండి
బ్రీథింగ్ ఎక్సర్‌సైజులు కూడా ఈ భావోద్వేగాలను జయించగలిగేలా చేస్తుంది.
అతిగా కాఫీ లేదా టీ, ఎనర్జీ డ్రింక్స్ వంటివి కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తాయి. ఇవి ఆందోళనకు, నిద్రలేమికి కారణమవుతాయి.
అన్ని వయసుల వారు వ్యాయామం చేయడానికి కనీసం 30 నిమిషాలు కేటాయించడం మంచిది. దీని వల్ల బ్రెయిన్‌లో కార్డిసాల్ స్థాయిలు తగ్గి శ్వాసపై ధ్యాస పెరుగుతుంది. ఇలాంటి వాటితో భావోద్వేగాలను జయించి.. ఆరోగ్యకరమైన ఆనందకర జీవితాన్ని గడపండి అని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: మోదీ ప్రమాణా స్వీకారోత్సవంలో పాల్గొననున్న మహిళా లోకో పైలట్‌లు వీరే..!)
Comments
Please login to add a commentAdd a comment