ఏడుపు అనేది శరీరం ఎదుర్కొనే సహజ ప్రతిస్పందన. ఈ ఏడుపు వల్ల మనిషికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంట. దీని కారణంగా మనసు, శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. తనవితీరా ఏడ్చి బాధను కన్నీటి రూపంలో పోగొట్టుకుంటే..శరీరం, మనసు రెండు బాగుంటాయని చెబుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మనసుకు ఈ ఏడుపు స్వీయ ఉపశమనం అని అంటున్నారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అదెలాగో సవిరంగా తెలుసుకుందామా..!
భావోద్వేగాల కారణంగా శరీరంలో సహజ ప్రతిస్పందనగా ఏడుపు వస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి లేదా ఒత్తిడి హార్మోన్లలను విడుదల చేసి భావోద్వేగ సమతుల్యతను పునరుద్ధరించడానికి ఈ ఏడుపు ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు ఒక రకంగా ఈ ఏడుపు మనకు సానుభూతి చూపించేలా చేసి సామాజికి బంధాలను బలోపేతం చేసుకోవడంలో సహాయపడుతుంది.
ఏడుపు వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది మనసుకు, శరీరానికి మంచి ఓదార్పునిస్తుంది. ఎందుకంటే..ఏడుపు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుంది కాబట్టి మనసుకు, దేహానికి తెలియని ఓదార్పుని, స్వాంతనను ఇస్తుంది.
ఇది మనసుకు ఒక మంచి రిలీప్‌ని అందిస్తుంది. కన్నీళ్ల వల్ల ఎండార్ఫిన్ విడుదలవ్వుతాయి. ఇవి శరీరానికి సహజ నొప్పి నివారిణిలా ప్రశాంతతను చేకూరుస్తాయి.
అంటే.. ఏడుపు ద్వారా విడుదలయ్యే ఎండార్ఫిన్‌లు శారీరక, మానసిక నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయిని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా నొప్పిని నియంత్రించి విశ్రాంతిని కలుగుచేయడమే గాక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి.
ఏడుపు మానసిక స్థితిని గణనీయంగా మెరుగుపరచడంలో ఉపకరిస్తుంది.
మంచి నిద్రకు ఉపయోగపడుతుందని కూడా చెబుతున్నారు. అలా అని నిద్ర కోసం రోజువారీగా ఏడుపుని అలవాటు చేసుకోమని కాదు. బాగా ఏడ్చినప్పుడూ ఆందోళన తగ్గిపో ప్రశాంతంగా నిద్రపోతారని అంటున్నారు. దీనివల్ల మనసు తేలిక పడి భయాందోళనలు తగ్గుతాయి. ఫలితంగా నిద్రకు భంగం ఏర్పడదని నిపుణుల చెబుతున్నారు.
ఏడుపు కళ్లను లూబ్రికేట్ చేస్తుంది. ఫలితంగా పొడిబారకుండా ఉండి కార్నియాను తేమగా ఉండేలా చేస్తుంది. అంతేగాదు ఈ ఏడుపు ద్వారా వచ్చే కన్నీళ్లు, దుమ్ము, ఇతర శిథిలాలను క్లీన్ చేయడంలో సహాయపడుతుంది కూడా. పైగా అంటువ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
పిల్లల్లో ఈ ఏడుపు ఊపిరి పీల్చుకోవడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది వారి శ్వాసనాళాలను శుభ్రపరిచి శ్వాస ద్వారా ఎక్కువ ఆక్సిజన్‌ని తీసుకునేలా చేయడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
ఎంత మేర ఏడవాలి అంటే..
దీనికి ఎలాంటి ప్రమాణం లేదు. ఆయా వ్యక్తుల భావోద్వేగ సామర్థ్యం, కారణాలు, తట్టుకునే పరిస్థితులపై ఆధారపడి ఈ ఏడుపు రావడం అనేది ఉంటుంది. ఒకరి నుంచి మరోకరికి ఈ ఏడుపు వచ్చే విధానం వేరుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఏదీఏమైన ఈ ఏడుపు అనేది సహజమైన ఆరోగ్యకర భావోద్వేగ ప్రతిస్పందన. ఇది భావోద్వేగాలు, ఒత్తిడిని విడుదల చేసేందుకు ఉపయోగపడే అద్భుతమైన సాధనం. కొందరూ తరుచుగా ఏడవడంలో ఉపశమనం పొందొచ్చు. మరికొందరూ తమ భావోద్వేగాలను భిన్నంగా వ్యక్తం చేయవచ్చు లేదా వ్యక్తీకరించొచ్చు.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment