body builder
-
మండే కండలు
తల్లిదండ్రులు లేరు. అండ దండలు లేవు. నానమ్మ నేటికీ పల్లెలో ఆకుకూరలు అమ్ముతుంది. కాని 24 ఏళ్ల ఎస్తేర్ రాణి గుంటూరు జిల్లా వేమూరు నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్‌లో మొదటి మహిళా బాడీబిల్డర్ అయ్యింది. ఇటీవల చెన్నైలో జరిగిన‘మిస్టర్ అండ్ మిస్ హిందూస్తాన్’ పోటీలో గోల్డ్‌మెడల్ సాధించింది. హైదరాబాద్‌లో జిమ్ ట్రయినర్‌గా ఉద్యోగం చేస్తున్న ఎస్తేర్ ఏ సాయం అందక గుండె మండుతోందని అంటున్నది.ఎస్తేర్ 2021లో గుంటూరు జిల్లా వేమూరు నుంచి హైదరాబాద్ వచ్చింది. కేవలం ఇంటర్ వరకూ చదువుకుంది. ఏదో ఒక పని చేయాలనుకుంటే ఏం చేయాలో తెలియలేదు. ఆమెకు సిటీలో ఎవరూ తెలియదు. స్కూల్లో కాలేజీలో అథ్లెటిక్స్‌లో మంచి ్రపావీణ్యం ఉంది. హామర్ త్రోలో నేషనల్స్ వరకూ వెళ్లింది. ఆ ఫిట్నెస్ వల్ల జిమ్‌లో పనికి కుదిరి ట్రయినర్‌గా మారింది. ‘‘కొద్దిపాటి జీతం. గుర్తింపు లేని పని. ‘ఏదైనా సాధించాలనే నా తపనకు ఆ పని సరిపోలేదు. ఆ సమయంలోనే మహిళా బాడీ బిల్డర్ల మీదకు నా దృష్టి వెళ్లింది. జాతీయస్థాయి కాంపిటీషన్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరు కూడా లేకపోవడాన్ని గమనించాను. ఇదే ఎందుకు నేను సాధించకూడదు అని భావించి ఎవరికీ చెప్పకనే ఎవరి అంగీకారం లేకనే నాకై నేనుగా కృషి చేసి ఎదిగాను’ అంటుంది ఎస్తేర్.అన్నీ ఆటంకాలేమహిళా బాడీగార్డ్ కావాలంటే పర్సనల్ ట్రయినర్ ఉండాలి. అందుకు నెలకు పది వేల నుంచి భారీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదీగాక నిర్దిష్ట డైట్ తీసుకోవాలి. రోజుకు కనీసం 7 గంటలు వర్కవుట్స్ చేయాలి. అవన్నీగాక మహిళలు బాడీ బిల్డింగ్ చేసే సమస్యలు అనేకం ఉంటాయి. ‘అయినా సరే అప్పుచేసి కండలు పెంచాను. రెండేళ్లలోనే తగినట్టుగా తయారయ్యి మొన్నటి సెప్టెంబర్‌లో వరల్డ్ ఫిట్నెస్ ఫెడరేషన్ (డబ్లు్య.ఎఫ్.ఎఫ్) నిర్వహించిన నేషనల్స్ బాడీబిల్డింగ్ పోటీల్లో ‘స్పోర్ట్స్ మోడల్’ కేటగిరీలో ద్వితీయస్థానంలో రజత పతకం సాధించాను.ఆ ఉత్సాహంతోనే ఈనెల 9,10 తేదీల్లో చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో డబ్లు్య.ఎఫ్.ఎఫ్ నిర్వహించిన ‘మిస్టర్ అండ్ మిస్ హిందూస్తాన్ ’ బాడీబిల్డింగ్ ఫిట్నెస్ చాంపియన్ షిప్ అండ్ మోడల్స్’ పోటీల్లో ‘మిస్ ఫిగర్’ కేటగిరీలో ప్రథమ స్థానంలో బంగారు పతకం గెలుచుకున్నాను. నా కేటగిరిలో దేశవ్యాప్తంగా పోటీ ఉన్నా నాకు స్వర్ణం రావడం మర్చిపోలేను’ అంటుంది ఎస్తేర్.దొరకని సాయంబాడీ బిల్డింగ్‌లో నిరంతర సాధన ఉండాలి. రోజుకు తీసుకునే ఆహారానికే 1500 నుంచి రెండు వేలు ఖర్చు అవుతుంది. ‘ఉద్యోగం చేస్తే సాధన మిస్ అవుతుందని ఫ్రీలాన్స్ జిమ్ ట్రయినర్‌గా పని చేస్తున్నాను. ఆసియా స్థాయి, ప్రపంచ స్థాయి బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ వరకూ వెళ్లాలని నా కల. ఊళ్లో మా నానమ్మ నేటికీ ఆకుకూరలు అమ్ముతుంది. మాకు సరైన తిండి లేదు. నా తమ్ముడు ఇంకా సెటిల్ కాలేదు. మహిళా బాడీ బిల్డింగ్ అంటే ఎన్నో సవాళ్లు.బంధువులు అందరూ నన్ను నిరోధించారు. అబ్బాయిగా మారిపోయానని సందేహించారు. ఇలా అయితే ఎవరు పెళ్లి చేసుకుంటారన్నారు. కాని నా గెలుపులను చూసి వారు ఇప్పుడు సంతోషిస్తున్నారు. మన సమాజంలో స్త్రీ తన శరీరాన్ని సరైన వస్త్రధారణలో ఉంచుకోవాలి. అందుకే ఎక్కువమంది స్త్రీలు ఆ రంగంలోకి రారు. ఏదైనా సాధించాలని వచ్చిన నావంటి వారిని ఎంకరేజ్ చేయడం ప్రభుత్వ బాధ్యత. అందరికీ అదే నా విన్నపం’ అంది ఎస్తేర్. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి‘మహిళా బాడీబిల్డింగ్‌లో ఉత్తర భారతదేశం వారు ముందంజలో ఉన్నారు. మనకు ప్రతిభ ఉన్నా పైస్థాయిలో మనల్ని ముందుకు తీసుకెళ్లేవారు లేరు. మçహారాష్ట్ర, హర్యాణ మహిళా బాడీబిల్డర్లు ఎంతో సౌకర్యంగా కెరీర్లో రాణిస్తున్నారు’ – ఎస్తేర్ -
అక్రమంగా స్టెరాయిడ్స్ అమ్మకం
సాక్షి, హైదరాబాద్: శారీరక సౌష్టవం, కండలు పెంచాలనుకునే వారి బలహీనతను ఆసరాగా చేసుకుని స్టెరాయిడ్స్ అమ్ముతున్న రాకేశ్ డిస్ట్రిబ్యూటర్స్ పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. రూ.2 లక్షల విలువైన 22 రకాల స్టెరాయిడ్స్‌ను స్వా«దీనం చేసుకుని, సంస్థను సీజ్ చేసినట్లు డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోఠిలోని ఈసామియా బజార్లో రాకేశ్ కనోడియా నిర్వహిస్తున్న రాకేశ్ డిస్ట్రిబ్యూటర్స్‌లో అక్రమంగా స్టెరాయిడ్స్ విక్రయి స్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈనెల 18, 19 తేదీల్లో సోదాలు చేసినట్టు తెలిపారు. స్వా«దీనం చేసుకున్న స్టెరాయిడ్స్‌ను పరీక్షల కోసం పంపామన్నారు. అనుమతి లేకుండానే మందుల దుకాణం.. మియాపూర్‌లోని శ్రీకాంత్ న్యూరోసెంటర్లో లెసెన్స్ లేని మందుల దుకాణాన్ని సీజ్ చేశారు. లైసెన్స్ లేకుండానే మందుల దుకాణాన్ని నిర్వహిస్తున్నట్టు సోదాల్లో భాగంగా గుర్తించామని కమలాసన్‌రెడ్డి వెల్లడించారు. -
ప్రపంచ ప్రఖ్యాత బాడీ బిల్డర్ గుండెపోటుతో కన్నుమూత
ప్రపంచంలోని గొప్ప బాడీబిల్డర్‌గా గుర్తింపు పొందిన ఇలియా 'గోలెం' యెఫిమ్చిక్ గుండెపోటు కారణంగా కన్నుమూశాడు. కండలు తిరిగిన దేహంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఇలియా కేవలం 36 ఏళ్ల వయస్సులోనే కన్నుమూయడం, గుండెపోటు ముప్పుపై చర్చకు దారి తీసింది. నిరంతరం జిమ్ చేస్తూ బాడీని ఫిట్‌గా ఉంచుకునే ఆరడుగుల ఆజానుభాహులు కూడా కూడా ఇటీవలి కాలంలో గుండెపోటుకు బలైపోతున్నారు. మీడియా నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 6న ఇలియాకు గుండెపోటు రావడంతో, భార్య అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. అంబులెన్స్ వచ్చే వరకు అతనికి సీపీఆర్ చేస్తూనే ఉంది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లిపోయాడు. సెప్టెంబర్ 11న కన్నుమూశారు. కోలుకుంటాడనే ఆశతో ఎదురు చూశాను. తని గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించినా,మెదడు పనిచేయడం ఆగిపోయిందని వైద్యులుచెప్పారని అతని భార్య అన్నా స్థానిక మీడియాతో పంచుకున్నారు. వృత్తిపరమైన బాడీబిల్డింగ్ ఈవెంట్లలో ఎప్పుడూ పోటీపడనప్పటికీ, ఆన్లైన్లో ట్రైనింగ్ వీడియోలను పంచుకునేవాడు. దీంతో ఫాలోవర్స్ బాగా పెరిగారు. 25-అంగుళాల కండపుష్టితో ‘మోస్ట్ మాన్‌స్ట్రస్ బాడీబిల్డర్,' రోజుకు 16,500 కేలరీలు భోంజేస్తాడు. 340 పౌండ్ల బరువు కారణంగా బాడీబిల్డింగ్ సర్కిల్‌లలో "ది మ్యూటాంట్" అనే మారుపేరు కూడా సంపాదించాడు. ఫిట్‌గా ఉండే ఇలియా అకాల మరణం అతని అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. యువకులలో గుండె సమస్యలు సర్వసాధారణంగా మారాయి. సాధారణగా మగవారికి 65, స్త్రీలలో 72ఏళ్ల తరువాత గుండెపోటు వస్తుందని భావించేవారు. కానీ ఇటీవలి పరిశోధనలో భాగంగా, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ గత దశాబ్దంలో 2శాతం పెరుగుదలతో 40 ఏళ్లలోపు వ్యక్తులు ఇప్పుడు తరచుగా గుండెపోటుతో మరణిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ కుమార్ ,సిద్ధార్థ్ శుక్లా మొదలు, ఇటీవల నటుడువికాస్ సేథి గుండెపోటు కారణంగా చిన్న వయసులోనే కన్నుమూసిన సంగతి తెలిసిందే. (విటమిన్ బీ12 లోపమా? ఈ ఆహారం తీసుకోండి!)గుండెపోటు కారణాలుగుండెకు రక్తప్రసరణలో తీవ్ర అడ్డంకులు, లేదా నిలిచిపోయినపుడు గుండె స్పందన రేటు విపరీతంగా పెరిగి, గుండెపోటుకు దారితీస్తుంది. గుండెపోటును మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (MI) అని కూడా పిలుస్తారు. శారీరక శ్రమ, వ్యాయామం చేయకపోవడం, వృత్తిపరమైన ,వ్యక్తిగత ఒత్తిడి, ధూమపానం, మద్యం సేవించడం వల్ల వస్తుంది.కరోనరీ ఆర్టరీ వ్యాధి: ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ధమనులలో రక్త ప్రవాహాన్ని అడ్డుకుని గుండె కండరాలకు రక్త సరఫరా నిలిచిపోతుంది. 40 ఏళ్లు పైబడిన వారిలో ఇది చాలా సాధారణ కారణమని వైద్యులు చెబుతున్నారు.వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్: ఇది ప్రాణాంతక పరిస్థితి. అతి వేగంగా గుండె కొట్టుకుంటుంది. వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ కారణంగా గుండె లయ తప్పి, పంపింగ్ సామర్థ్యం దెబ్బతింటుంది. ప్రాణాంతకం కావచ్చు.ఒత్తిడి: ఒత్తిడి గుండె ఆరోగ్యానికి చాలా హానికరం. తీవ్రమైన ఒత్తిడి గుండె పనితీరును దెబ్బతిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి, వ్యాయామం, ఒత్తిడి లేని జీవితమే గుండెకు రక్ష. ఇంట్లో ఎవరికైనా గుండెపోటు వచ్చిన చరిత్ర ఉంటే, తొందరగా మేల్కొని, వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమైన మార్గం. ఇదీ చదవండి: కాకరకాయ ఆయిల్‌తో ఎన్ని లాభాలో : చుండ్రుకు చెక్, జుట్టు పట్టుకుచ్చే! -
స్థూలకాయంపై పోరాటం.. 19 ఏళ్ల బాడీబిల్డర్‌ను వదలని గుండెపోటు
ఆకస్మిక గుండెపోటు మరణాలు.. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎందరో ప్రాణాలను బలితీసుకుంటుంది. బంగారు భవిష్యత్తు కలిగిన యువత ప్రాణాలను అర్థాంతరంగా లాగేసుకుంటుంది. సడెన్‌గా అపస్మారక స్థితికి చేరుకొని తిరిగిరాని లోకాలకు వెళుతున్నారు.తాజాగా బ్రెజిల్‌కు చెందిన ఓ యువ బాడీబిల్డర్ గుండెపోటు కారణంగా మృతిచెందాడు. ఆదివారం మధ్యాహ్నం తన ఇంటిలో విగతజీవిగా కనిపించాడు. దక్షిణ బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలో నివిసిస్తున్న 19 ఏళ్ల బాడీబిల్డర్ మాథ్యూస్ పావ్లక్ ఉభకాయ సమస్యలతో బాధపడేవాడు. దీనిని అధిగమించేందుకు బాడీ పెంచడం ప్రారంభించాడు. కేవలం అయిదు సంవత్సరాల్లోనే తన శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నాడు.బాడీబిల్డింగ్‌లో పోటీలు ఇవ్వడం మొదలు పెట్టాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చి నాల్గో స్థానంలో నిలిచాడు. అంతేగాక 2023లో యూ23 అనే పోటీలో పాల్గొని గెలుపొందాడు. అప్పటి నుంచి అతన్ని తన గ్రామస్థులు అందరూ మిస్టర్ బ్లమెనౌ అని పిలుస్తుంటారు.అయితే మాథ్యూస్ అకాల మరణం అనేక సందేహాలకు తావిస్తోంది. అనాబాలిక్ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగయ సమస్యలు తలెత్తి మృతిచెందినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన శరీరాకృతిని ఆకట్టుకునే విధంగా మలచడంలో మందుల వాడకం గుండెపోటుకు కారణమై ఉండవచ్చని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అయితే వీటిని పావ్లాక్ సన్నిహితులు ఈ విమర్శలను ఖండిస్తున్నారు. ఈ లోకంలో లేని వారి గురించి తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం సరికాదని చెబుతున్నారు. -
బాడీబిల్డింగ్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా..?
యువతలో బాడీ బిల్డింగ్ క్రేజ్ ఎంతలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇటీవల బాడీబిల్డర్ల వరుస మరణాలతో ఇది ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహాలు తలెత్తాయి. వాళ్లంతా చిన్న వయసులోనే మరణించడం రకరకాల ఊహగానాలకు తెరలేపింది. అదీగా బాడీబిల్డర్‌గా అయ్యేందుకు అధిక బరువుతో చేసే వ్యాయామాలు గుండెపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు. కొందరూ కండరాలు ధృఢంగా అయ్యేందుకు కొన్ని రకాల మందులు వాడతుంటారని ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంతకీ ఈ బాడీబిల్డింగ్ క్రీడ అనేది ప్రమాకరమైనదా? ఆరోగ్య సమస్యలు తప్పవా అంటే..?.బ్రెజిల్‌కి చెందిన 19 ఏళ్ల బాడీబిల్డర్ మాథ్యూస్ పావ్లక్ ఆదివారం మధ్యాహ్నం తన ఇంటిలో విగతజీవిగా కనిపించాడు. గుండెపాటు కారణంగా చనిపోయినట్లు సమాచారం. నిజానికి మాథ్యూస్ బాల్యంలో స్థూలకాయ సమస్యతో బాధపడేవాడు. దీన్ని అధిగమించేందుకు బాడీబిల్డింగ్ క్రీడను ఎంచుకున్నాడు. కేవలం ఐదేళ్లు ఆహోరాత్రులు కఠోర శ్రమతో కండలు తిరిగిన దేహంగా మార్చుకున్నాడు. అలా బాడీ బిల్డింగ్ కమ్యూనిటీలో ఒక సాధారణ పోటీదారుగా దిగి పలు కాంపీటీషన్ విజయకేతనం ఎగురవేశాడు. మంచి భవిష్యత్తు ఉన్న ఈ బాడీబిల్డర్ చిన్న వయసులోనే కానరాని లోకలకు వెళ్లిపోవడం పలు అనుమానాలకు తెరలేపింది. సోషల్ మీడియాలో ఈ ఘటన హాట్‌టాపిక్‌గా మారింది. చిన్నవయసులోనే అందమైన శరీరాకృతిని పొందడం అనేది అంత ఈజీ కాదని, ఏవో మందుల వాడి ఉంటారంటు అనుమానాలు లేవెనెత్తారు. మరికొందరూ మాత్రం చనిపోయిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడటం తగదని వ్యాఖ్యనించారు. అయితే అతడి కోచ్ మాత్రం గొప్ప క్రీడాకారుని పొగొట్టుకున్నానంటూ పోస్ట్ పెట్టారు. అతడి జ్ఞాపకాలతో హృదయం బరువెక్కిందంటూ బాధగా సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఇలా ప్లావక్లా ఏప్రిల్‌లో జోనాస్ ఫిల్హో అనే మరో బాడీ బిల్డర్ 29 ఏళ్ల వయసులో మరణించాడు. అంతకముందు మేలో బాడీబిల్డర్, క్యాన్సర్ సర్వైవర్ మేజర్కాన్ 50 ఏళ్ల వయసులో చనిపోయాడు. వారంతా బాడీబిల్డర్లు, ఫిట్నెస్ ఔత్సాహికులే. పైగా చిన్న వయసులోనే తనువు చాలించడం బాధకరం. ఎందుకంటే ఇలా..?మంచి వ్యాయామం హృదయాన్ని బలపరుస్తుంది.కానీ బాడిబిల్డర్గా మారే క్రమంలో మితిమీరి చేసే వ్యాయామాలు గుండెపై ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. హృదయానికి సంబంధించిన కొరోనరీ ధమనుల కణజాలాలు దెబ్బతింటాయి. ఒక అమెరికన్ పరిశోధనా సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం, ఒక వ్యక్తి తన శరీర బరువులో సగానికి పైగా ఎత్తితే, గుండె జబులు వచ్చే ప్రమాదం ఎక్కువ అని పేర్కొంది. అలాగే కండరాలు ధృఢంగా అవ్వడం కోసం స్టెరాయిడ్స్ వంటి మందులు వాడితే ఆ ప్రమాదం మరింత ఎక్కువ అని వెల్లడించింది. బాడీబిల్డర్లు తరచుగా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉంటారు. ఫలితంగా మూత్రపిండాలు, గుండె తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఇక స్టెరాయిడ్స్ అంటే శరీరంలోకి నేరుగా ఇంజెక్ట్ చేసే పోషకాలు. ఇది పురుషుల స్ఖలనాన్ని తగ్గించడమే కాకుండా కేన్సర్ వంటి వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. నిజానికి బాడీబిల్డర్‌గా అవ్వాలనుకునేవారు మంచి ఫిట్నెస్ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోండి. తొందరగా అవ్వాలనే క్రమంలో మందులు వంటి వాటి జోలికి పోవద్దని చెబుతున్నారు నిపుణలు. అలాగే మన శరీరం ధర్మం, పరిస్థితిని అనుసరించి బాడీ బిల్డర్‌గా అయ్యేందు కొంత సమయం పడుతుందనే విషయాన్ని గ్రహించాలని అంటున్నారు నిపుణులు. (చదవండి: స్పేస్‌లోకి వెళ్లిన అతి పిన్న వయస్కురాలిగా కర్సెన్ కిచెన్..!) -
ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే..
ఏడుపు అనేది శరీరం ఎదుర్కొనే సహజ ప్రతిస్పందన. ఈ ఏడుపు వల్ల మనిషికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంట. దీని కారణంగా మనసు, శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. తనవితీరా ఏడ్చి బాధను కన్నీటి రూపంలో పోగొట్టుకుంటే..శరీరం, మనసు రెండు బాగుంటాయని చెబుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మనసుకు ఈ ఏడుపు స్వీయ ఉపశమనం అని అంటున్నారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అదెలాగో సవిరంగా తెలుసుకుందామా..!భావోద్వేగాల కారణంగా శరీరంలో సహజ ప్రతిస్పందనగా ఏడుపు వస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి లేదా ఒత్తిడి హార్మోన్లలను విడుదల చేసి భావోద్వేగ సమతుల్యతను పునరుద్ధరించడానికి ఈ ఏడుపు ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు ఒక రకంగా ఈ ఏడుపు మనకు సానుభూతి చూపించేలా చేసి సామాజికి బంధాలను బలోపేతం చేసుకోవడంలో సహాయపడుతుంది.ఏడుపు వల్ల కలిగే ప్రయోజనాలు..ఇది మనసుకు, శరీరానికి మంచి ఓదార్పునిస్తుంది. ఎందుకంటే..ఏడుపు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుంది కాబట్టి మనసుకు, దేహానికి తెలియని ఓదార్పుని, స్వాంతనను ఇస్తుంది. ఇది మనసుకు ఒక మంచి రిలీప్ని అందిస్తుంది. కన్నీళ్ల వల్ల ఎండార్ఫిన్ విడుదలవ్వుతాయి. ఇవి శరీరానికి సహజ నొప్పి నివారిణిలా ప్రశాంతతను చేకూరుస్తాయి.అంటే.. ఏడుపు ద్వారా విడుదలయ్యే ఎండార్ఫిన్లు శారీరక, మానసిక నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయిని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా నొప్పిని నియంత్రించి విశ్రాంతిని కలుగుచేయడమే గాక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ఏడుపు మానసిక స్థితిని గణనీయంగా మెరుగుపరచడంలో ఉపకరిస్తుంది. మంచి నిద్రకు ఉపయోగపడుతుందని కూడా చెబుతున్నారు. అలా అని నిద్ర కోసం రోజువారీగా ఏడుపుని అలవాటు చేసుకోమని కాదు. బాగా ఏడ్చినప్పుడూ ఆందోళన తగ్గిపో ప్రశాంతంగా నిద్రపోతారని అంటున్నారు. దీనివల్ల మనసు తేలిక పడి భయాందోళనలు తగ్గుతాయి. ఫలితంగా నిద్రకు భంగం ఏర్పడదని నిపుణుల చెబుతున్నారు. ఏడుపు కళ్లను లూబ్రికేట్ చేస్తుంది. ఫలితంగా పొడిబారకుండా ఉండి కార్నియాను తేమగా ఉండేలా చేస్తుంది. అంతేగాదు ఈ ఏడుపు ద్వారా వచ్చే కన్నీళ్లు, దుమ్ము, ఇతర శిథిలాలను క్లీన్ చేయడంలో సహాయపడుతుంది కూడా. పైగా అంటువ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.పిల్లల్లో ఈ ఏడుపు ఊపిరి పీల్చుకోవడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది వారి శ్వాసనాళాలను శుభ్రపరిచి శ్వాస ద్వారా ఎక్కువ ఆక్సిజన్ని తీసుకునేలా చేయడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. ఎంత మేర ఏడవాలి అంటే..దీనికి ఎలాంటి ప్రమాణం లేదు. ఆయా వ్యక్తుల భావోద్వేగ సామర్థ్యం, కారణాలు, తట్టుకునే పరిస్థితులపై ఆధారపడి ఈ ఏడుపు రావడం అనేది ఉంటుంది. ఒకరి నుంచి మరోకరికి ఈ ఏడుపు వచ్చే విధానం వేరుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏదీఏమైన ఈ ఏడుపు అనేది సహజమైన ఆరోగ్యకర భావోద్వేగ ప్రతిస్పందన. ఇది భావోద్వేగాలు, ఒత్తిడిని విడుదల చేసేందుకు ఉపయోగపడే అద్భుతమైన సాధనం. కొందరూ తరుచుగా ఏడవడంలో ఉపశమనం పొందొచ్చు. మరికొందరూ తమ భావోద్వేగాలను భిన్నంగా వ్యక్తం చేయవచ్చు లేదా వ్యక్తీకరించొచ్చు.(చదవండి: -
నాలుగుసార్లు కోలిండియా స్థాయిలో.. సింగరేణిలోని గోల్డ్‌మెడలిస్ట్!
మంచిర్యాల: బాడీ బిల్డింగ్ పోటీల్లో బంగారు పతకాలతో బత్తుల వెంకటస్వామి విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. కోలిండియా స్థాయి పోటీల్లో రాణిస్తూ సింగరేణిలోని మందమర్రి ఏరియాకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. మందమర్రి ఏరియాలోని 33/11కేవీ సబ్‌స్టేషన్‌లో ఫోర్‌మెన్‌గా బత్తుల వెంకటస్వామి విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 4 నుంచి 6వరకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన కోలిండియా బాడీ బిల్డింగ్(90 కిలోల విభాగం) పోటీల్లో బంగారు పతకం సాధించి సింగరేణి పేరు దేశవ్యాప్తంగా మారుమోగించాడు.. వెంకటస్వామి 2006లో సింగరేణి ఎక్స్టర్నల్ ఎలక్ట్రీషియన్ పరీక్షలు ఉత్తీర్ణుడై ఎలక్ట్రీ షియన్‌గా విధుల్లో చేరాడు. 2013లో డిపార్టుమెంటల్ పరీక్షలు ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్ పాసయ్యాడు. వ్యాయామంపై ఆసక్తితో జిమ్‌లో చేరాడు. ప్రతీరోజు రెండున్నర, మూడు గంటల వరకు సాధన చేశాడు. బాడీ బిల్డింగ్ పోటీలపై మక్కువ పెంచుకున్నాడు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ సింగరేణి స్థాయిలో ఐదేళ్లుగా రానిస్తున్నాడు. అభినందనీయం.. మందమర్రి ఏరియాలో ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్‌గా విధులు నిర్వర్తించే వెంకటస్వామికి కోలిండియా పోటీల్లో గోల్డ్‌మెడల్ రావడం అభినందనీయం. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చెంది మరెన్నో గోల్డ్‌మెడల్స్ సాధించాలి. అందుకు సింగరేణి ప్రోత్సాహం ఉంటుంది. – మనోహర్, ఏరియా జీఎం ప్రతీ ఏరియాలో జిమ్ ఏర్పాటు చేయాలి! బంగారు పతకం సాధించడంలో సింగరేణి యాజమాన్యం ప్రోత్సాహం బాగుంది. పోటీలకు వెళ్లే ముందు ప్రత్యేకంగా మరికొంత సమయం ఇస్తే బాగుంటుంది. యాజమాన్యం మరింత సహకరించి ప్రోత్సహిస్తే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటా. సింగరేణిలో యువ ఉద్యోగులు సుమారు 20 వేల మందికి పైగానే ఉన్నారు. ఫిట్నెస్ కోసం సింగరేణి వ్యాప్తంగా ప్రతీ ఏరియాలో జిమ్ ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన కోచ్‌లను నియమించాలి. యువ ఉద్యోగులు ప్రతీరోజు జిమ్‌కు వెళ్లడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు విధులకు గైర్హాజర్ కాకుండా హాజరై సంస్థ నిర్దేశిత బొగ్గు ఉత్పత్తిలో పాలుపంచుకుంటారు. – వెంకటస్వామి, కోలిండియా గోల్డ్ మెడలిస్ట్ సాధించిన పతకాలు ప్రతీ సంవత్సరం డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో సింగరేణిలో నిర్వహించే బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంటున్నాడు. 2018–19, 2019–20, 2020–21, 2022–23 సంవత్సరాల్లో నిర్వహించిన పోటీల్లో బంగారు పతకాలు సాధించాడు. కోలిండియా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో సింగరేణి తరఫున 2019లో మధ్యప్రదేశ్‌లోని సింగ్రోళిలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని కాంస్య పతకం, 2020లో మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో నిర్వహించిన కోలిండియా పోటీల్లో కాంస్య పతకం, 2022లో పశ్చిమబెంగాల్లోని కోల్‌కత్తాలో నిర్వహించిన పోటీల్లో వెండి పతకం అందుకున్నాడు. నాగ్‌పూర్‌లో నిర్వహించిన పోటీల్లో బంగారు పతకం సాధించి దేశవ్యాప్తంగా మందమర్రి ఏరియాకు గుర్తింపు తెచ్చాడు. ఉరుకులు పరుగుల జీవితంలో బిజీ బిజీగా ఉండే యువతకు వెంకటస్వామి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఏదైనా సాధించాలనే తపన ఉంటే సాధనతో సమాజంలో గుర్తింపు వచ్చే విధంగా తయారవుతారని నిరూపిస్తున్నాడు. ఇవి చదవండి: మారు పేర్లు మారేదెప్పుడు? చిక్కుముడి వీడేదెప్పుడు? -
పాపులర్ బాడీ బిల్డర్ కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూత
పాపులర్ బాడీ బిల్డర్, ప్రముఖ వైద్యుడు రోడాల్ఫో డువార్టే రిబీరో డాస్ శాంటోస్ (33) కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. బ్రెజిల్కుచెందిన ఈయన సోషల్ మీడియాలో బాగా పాపులర్. అయితే అనాబాలిక్ స్టెరాయిడ్స్ వాడకం వల్ల అతను మరణించాడనే వార్తలు సోషల్‌మీడియలో గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను రొడాల్ప్ స్పోర్ట్స్ మెడిసిన్ అడ్ ఫార్మకాలజీ క్లినిక్ ఖండించింది. కాలేయంలో ట్యూమర్,రక్తస్రావం కారణంగా సావో పాలోలో రోడాల్ఫో నవంబర్ 19న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించినట్లు CNN బ్రసిల్ నివేదించింది. ఆదివారం (నవంబర్, 19) ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడని , కాలేయంలోని అడెనోమా ఫలితంగా రక్తస్రావం కారణంగా ఆయన గుండె ఆగిపోయిందని తెలిపింది. తన రోజువారీ జీవితంలోని ఫోటోలతోపాటు, జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియోలు ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాడు. ఇలాగే ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న కాబోయే భార్య కరోలిన్ సాంచెస్‌తో వీడియోలను కూడా ఎక్కువగా పోస్ట్ చేసేవాడు. తన రోగులు, ఇతర అథ్లెట్లు, బాడీ బిల్డర్ల అద్భుతమైన ఫలితాలను కూడా చూపించేవారు. ఇన్స్టాగ్రామ్ స్టార్‌కు 10,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Caroline Sanches (@carolinessanches) సావో పాలోకు దక్షిణాన మోమాలో ఉన్న ఈయన క్లినిక్ ఉంది. సాంచెస్ అక్కడ పోషకాహార నిపుణురాలుగా పనిచేస్తున్నారు. కాబోయే భర్త ఆకస్మిక మరణం తరువాత సాంచెస్ అతను గిటార్ వాయిస్తూ ‘మన మధ్య ఉన్న ప్రేమ, సాన్నిహిత్యం’ అంటూ పాడుతున్న వీడియోను ఎప్పటి ఎప్పటికీ శాశ్వతం అంటూ పోస్ట్ చేశారు.కాగా డాక్టర్ శాంటోస్ ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ సావో పాలో నుండి స్పోర్ట్స్ మెడిసిన్ మరియు ఎక్సర్సైజ్ ఫిజియాలజీలో డిగ్రీలు పొందారు. View this post on Instagram A post shared by Rodolfo Duarte (@rodolfo.drsantos) -
తొలి మూవీ బ్లాక్ బస్టర్, సంచలన నిర్ణయం.. షాకింగ్ నెట్‌వర్త్
బాలీవుడ్లో తొలి చిత్రమే సూపర్‌హిట్. యాక్టర్‌గా మంచి పేరు. బాలీవుడ్‌కి మంచి ఫిట్నెస్ హీరో దొరికాడు అనుకున్నారు. నెక్ట్స్ సల్మాన్ ఖాన్ అన్నారు. కానీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఇక జీవితంలో మజా ఏముంది? ఎన్నో అంచనాలతో నిర్మించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్. కెరీర్ ఫ్లాప్ కావడంతో నటనకు గుడ్‌బై..అయితేనేం ఇపుడు ఎంతోమంది సూపర్ స్టార్ల కంటే ఎక్కువే సంపాదిస్తున్నాడు. ఇంతకీ ఎవరా బాలీవుడ్ హీరో అతను చేస్తున్న వ్యాపారం ఏంటి? ఫిట్ నెస్ ఫ్రీక్, ఫిట్నెస్ ఐకాన్, సాహిల్ ఖాన్ సక్సెస్ స్టోరీ ఏంటి? 1975 నవంబరు 5న కోలకతాలో పుట్టిన సాహిల్‌ఖాన్ హిట్ మ్యూజిక్ వీడియో 'నాచెంగే సారీ రాత్'తో పాపులర్ అవ్వడమే కాదు మూవీ మేకర్స్ ఆకట్టుకున్నాడు. ఫలితంగా 2001లో, చిన్న బడ్జెట్ చిత్రం 'స్టైల్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. శర్మన్ జోషి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. అంతే సాహిల్ ఖాన్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఫైల్కుగా సీక్వెల్ 'ఎక్స్క్యూస్ మీ'నిర్మించారు. శర్మన్ జోషి , సాహిల్ ఖాన్లు మరోసారి 'ఎక్స్క్యూస్ మీ'లో ప్రధాన పాత్రల్లో నటించారు. కానీ కలెక్షన్ల విషయంలో బోల్తా పడింది. శర్మాన్ జోషి బాలీవుడ్లో నిలబడగలిగాడు కానీ సాహిల్ ఖాన్ యాక్టిగ్ కెరీర్ మాత్రం అంత సక్సెస్‌ఫుల్‌గా సాగలేదు. 'ఎక్స్క్యూస్ మీ' తర్వాత, 2005 విడుదలైన 'యాహీ హై జిందగీ', 'డబుల్ క్రాస్' కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. సాహిల్ ఖాన్ 'అల్లాదీన్' ,'రామా: ది సేవియర్' కూడా ఘోరంగా విఫలమయ్యాయి. టెలివిజన్ రంగంలో పెద్దగా పురోగతి కనిపించలేదు. ఫిట్నెస్ పరంగా సల్మాన్ ఖాన్‌కు గట్టి పోటీగా ‘నెక్స్ట్ సల్మాన్ ఖాన్’ గా ఉంటాడనుకున్న సాహిల్ ఖాన్ ఇక కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన ఫోకస్‌ను వేరే వైపు మళ్లించాడు. 2010లో బాడీబిల్డర్ , ఫిట్నెస్ ఫ్రీక్ అయిన సాహిల్ ఖాన్ నటనకు స్వస్తి చెప్పి ఫిట్నెస్ ట్రైనర్‌గా మారిపోయాడు. ముంబైలోనే అతి పెద్ద జిమ్ని స్థాపించాడు, అంతే స్వయంగా బాడీ బిల్డర్ కావడంతో సాహిల్ ఖాన్ ఇక వెనక్కి తిరిగి చూసింది లేదు. చిన్న మొత్తం పెట్టుబడితో మొదలై దేశవ్యాప్తంగా అనేక జిమ్‌లను నడుపుతూ ఈ వ్యాపారంలో తనకెదురే లేదని నిరూపించుకున్నాడు. అక్కడితో ఆగిపోలేదు..తన ఫిట్నెస్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూనే డివైన్ న్యూట్రిషన్ అనే తన సొంత కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీ ద్వారా వెయ్ ప్రొటీన్, క్రియేటిన్ , మజిల్ గెయినర్స్ వంటి ఫిట్నెస్ సప్లిమెంట్లను విక్రయాల్లో దూసుకుపోయాడు. ఈ డివైన్ న్యూట్రిషన్ ఫిట్నెస్ వ్యాపారమే నెట్‌వర్త్ రూ. 100 కోట్లకు పై మాటే. ముంబై బాడీ బిల్డింగ్ అసోసియేషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేశాడు. 2017లో సాహిల్ తన యాంటీ-డోపింగ్ సిక్స్-ప్యాక్ ఎనర్జీ డ్రింక్‌ని లాంచ్ చేసిన మరింత పాపులర్ అయ్యాడు. ఇది కాకుండా యూట్యూబ్ ఛానెల్ ద్వారా భారీగానే ఆర్జిస్తున్నాడు. ఫిట్నెస్ గురించి అవగాహన కల్పించేలా ఒక యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేశారు. ఈ యూట్యూబ్ ఛానెల్‌కు 3.2 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు , అతని వీడియోలను 29 కోట్లకు పైగా వీక్షించారు. దీని విలువ మొత్తం 40-60 కోట్లు. 2021లో సాహిల్ ఖాన్ ప్రపంచ ప్రఖ్యాత ఫిట్నెస్ ఈవెంట్ ప్రెజెంటింగ్ స్పాన్సర్ మి.ఒలింపియా గా నిలిచిన తొలి భారతీయ బాడీ బిల్డర్ సాహిల్ కంపెనీ పీనట్ బట్టర్ యూఎస్ ఎఫ్‌డీఏ సర్టిఫికేట్ తొలి భారతీయ కంపెనీ. సాహిల్ ఖాన్ ఇప్పుడు టీవీ షోలతో బిజీగా ఉన్నాడు. సినిమాల్లోనూ కనిపిస్తున్న సాహిల్ ఖాన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో మరింత బిజీగా ఉన్నాడు. మీడియా నివేదికల ప్రకారం మొత్తం సంపద రూ. 170 కోట్లు. ముంబైలోని అనేక సంస్థల నుండి అవార్డుల తోపాటు, కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు సాహిల్ ఖాన్. సాహిల్‌కి విలాసవంతమైన ఇల్లు మాత్రమే కాదు, మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఫెరారీ వంటి అనేక విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. 2003లో సాహిల్ ఖాన్ నెగర్ ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. 2005లో ఈ దంపతులు విడిపోయారు. -
గుండెపోటుతో బాడీ బిల్డర్ మృతి.. పెళ్లి తర్వాత ఈ పొరపాటు చేయడంతో
గుండెపోటు మరణాలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఇవి వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా వ్యాయామం చేస్తూనో, చేసిన తర్వాతో గుండెపోటుతో యువకులు కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. 'మిస్టర్ తమిళనాడు' టైటిల్ విన్నర్, ప్రముఖ బాడీ బిల్డర్ యోగేశ్ గుండెపోటుతో మరణించారు. (ఇదీ చదవండి: విజయ్‌కు వాటితో సంబంధం లేదు.. బాధ్యత అంతా నాదే: లోకేష్ కనకరాజ్) కోవిడ్ తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని పరిశోధనలు దీనికి మద్దతు ఇస్తుండగా, కొన్ని కోవిడ్ కారణంగా ఇటువంటి సంఘటనలు జరగడం లేదని నిపుణులు చెప్పినట్లు నివేదికలు ఉన్నాయి. అయితే ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిస్తూ ఫ్యాట్‌కు దూరంగా ఉండే వారు ఇలా చనిపోవడం సర్వసాధారణమైపోతోంది. యోగేష్ చెన్నైలోని అంబత్తూరు మేనంపేడులోని మహాత్మాగాంధీ వీధిలో నివాసం ఉంటున్నాడు. అతను బాడీ బిల్డర్, కొన్ని సంవత్సరాలుగా వివిధ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొని అనేక పతకాలు సాధించాడు. అతను 2021లోనే 9కి పైగా మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. బాడీబిల్డింగ్‌లో 'మిస్టర్ తమిళనాడు' అవార్డును అందుకున్నాడు. 2021లో వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. వీరికి రెండేళ్ల కూతురు కూడా ఉంది. పెళ్లి అనంతరం బాడీబిల్డింగ్ పోటీలకు విరామం ప్రకటించిన యోగేశ్.. ఓ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే జిమ్‌కు వెళ్లిన ఆయన శిక్షణ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన యోగేశ్.. బాత్రూమ్కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. దీనిని గమనించిన యువకులు వెంటనే యోగేశ్‌ను స్థానిక కిల్పౌక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. దీంతో యోగేశ్ గుండెపోటుతోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పెళ్లైన తర్వాత బాడీబిల్డింగ్కు విరామం ప్రకటించి తక్కువ బరువులు ఎత్తుతున్న యోగేశ్.. ఒక్కసారిగా భారీ బరువులు ఎత్తడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. -
దారుణం: డెడ్‌బాడీని కాలువలో పడేసిన పోలీసులు
పాట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులే అమానవీయ ఘటనకు పాల్పడ్డారు. ఓ బాధితుని మృతదేహాన్ని కాలువలో పడేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆ మృతదేహాన్ని మళ్లీ వెలికితీసి మార్చురీకి తరలించారు. పోలీసు కానిస్టేబుళ్లు ఓ బాధిత మృతదేహాన్ని కాలువలో పడేస్తుండగా.. ఓ బాటసారి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేయించారు. అయితే.. ఓ ప్రమాదంలో చిధ్రమైన మృతదేహాన్ని ఇలా కాలువలో పడేసినట్లు తెలిపారు. ఆ బాధిత మృతదేహం ఎవరిదో కూడా గుర్తించినట్లు స్పష్టం చేశారు. పోలీసు కానిస్టేబుళ్లు చేసిన ఘటన అమానవీయమని పేర్కొన్న జిల్లా ఎస్పీ రాకేశ్ కుమార్.. నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఆ కానిస్టేబుళ్లను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఆ చిధ్రమైన మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: యువకుడి బ్యాంక్ ఖాతాలో 753 కోట్లు -
అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన కిచ్చా.. ఆ లుక్‌తో కనిపించి!
కిచ్చా సుదీప్ ఈ పేరు వింటే చాలా తెలుగువారికి రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమానే గుర్తుకొస్తుంది. ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే ఈ ఏడాది ఆయన నటించిన విక్రాంత్ రోణ అభిమానులను పెద్ద ఆకట్టుకోలేదు. అయితే ఇటీవల సుమలత అంబరీష్ బర్త్ డే పార్టీలో కిచ్చా సుదీప్ కనిపించారు. ప్రస్తుతం ఆయన కిచ్చా46 చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విక్రాంత్ రోణ సినిమా తర్వాత కిచ్చా సుదీప్ నెక్స్ట్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా కోసం కిచ్చా సుదీప్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. తాజాగా తన న్యూ లుక్‌తో ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. (ఇది చదవండి: 'పుష్ప' లాంటి స్టోరీతో మరో సినిమా) కిచ్చా తన ఇన్‌స్టాలో సిక్స్ ప్యాక్‌తో బాడీని ప్రదర్శిస్తున్న ఫోటోలను పంచుకున్నారు. అయితే ఇదంతా కిచ్చా46 సినిమా కోసమేనని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ కోసం సుదీప్ ఇలా రెడీ అయ్యారంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం సుదీప్ తన సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పైల్వాన్ సినిమా కోసం సిక్స్ ప్యాక్‌తో కనిపించారు. ఇన్‌స్టాలో రాస్తూ..'వర్కవుట్ చేయడం నా సంతోషకరమైన క్షణాలలో ఒకటి. ఇది నన్ను ప్రశాంతంగా ఉంచుతుంది. మిమ్మల్ని దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. కిచ్చా46 చిత్రం క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కోసం మరో నెల సమయం ఉంది. దానికి ముందే ఈ వర్కవుట్.' అని సుదీప్ రాసుకొచ్చారు. కాగా.. తుపాకి, కబాలి, కర్ణన్, అసురన్‌తో సహా తమిళంలో భారీ బడ్జెట్ చిత్రాలను అందించిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కలైపులి ఎస్ తాను ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (ఇది చదవండి: పిల్లల ఫోటోలు రివీల్ చేసిన నయనతార.. ఈరోజే ఎందుకంటే?) View this post on Instagram A post shared by KicchaSudeepa (@kichchasudeepa) -
అతని వయసు 90..బాడీ పరంగా యువకుడే! ఎలాగంటే..
వయసులో అతను వృద్ధుడే కానీ బాడీ పరంగా ఉక్కులాంటి దేహం. యువ బాడీబిల్డర్లకు ఏ మాత్రం తీసిపోని దేహదారుఢ్యం అతని సొంతం. తొమ్మిది పదుల వయసులో ఓ వీల్‌చైర్‌కే పరిమితమై.. మనుషులను గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు. అతను మాత్రం చాలా యాక్టివిగ్ అచ్చం యువకుడిలో ఉండే నూతనోత్సహాం అతనిలో ఉంది. ఇంతకీ అతను ఎవరూ? ఆ వయసులో కూడా అంత చురుగ్గా ఎలా ఉన్నాడంటే.. జిమ్ అరింగ్టన్ అనే వ్యక్తి ఓ బాడీ బిల్డర్. అతను వయసులో ఉన్నపుడే ఎలాంటి బాడీని మెయింటేన్ చేశాడో అలానే వృద్ధాప్యంలో కూడా మెయింటేన్ చేసి అబ్బురపర్చాడు. 90ల వయసులో కూడా బాడీ బిల్డర్ మాదిరి తన కండలు, బాడీ తీరు మారకపోవడవం విశేషం. క్రమం తప్పకుండా చేసే జిమ్, తీసుకునే ఫుడ్ డైట్ కారణంగా అతను అలా బాడీని కంటిన్యూ చేయగలిగాడు. దీంతో అతను అత్యంత వృద్ధ బాడీ బిల్డర్‌గా రికార్డు నెలకొల్పోడు. తనకు చిన్నప్పటి నుంచి బాడీ బిల్డింగ్ మీద మక్కువ ఉండేదని, ఇదే తన ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకునేలా చేసిందని ఆనందంగా చెబుతున్నడు అరింగ్టన్. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డు అతని హెల్త్ సీక్రెట్‌కి సంబంధించిన వీడియోని నెట్టింట పోస్ట్ చేసింది. అందులో తన ఆరోగ్య రహస్యం, బాడీని అలా మెయింటైన్ చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చిట్కాలను పంచుకున్నాడు అరింగ్టన్. దీంతో ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఈ వయసులో కూడా బాడీని ఫిట్‌గా ఉంచి అందరికి స్ఫూర్తిగా నిలిచారంటూ అరింగ్టన్పై ప్రశంసల జల్లు కురిపించారు. (చదవండి: వ్యాధుల నిర్థారణ వైఫల్యతతో..ఏటా 8 లక్షల ప్రాణాలు బలి) -
ఘోరం.. జిమ్‌లో మెడ విరిగి ట్రైనర్ మృతి
చావు చెప్పి రాదు. అయితే.. దానిని కెలికి మరీ ఆహ్వానించడం ఎంత వరకు సబబు?.. పాముల్ని పట్టేవాడు దాని కాటుకే బలవుతాడని ఎవరో అన్నారు. వెతుక్కుంటూ వెళ్లి మరీ మృత్యువును పలకరించే ఘటనలు తరచూ మనం చూస్తుంటాం కూడా. అలాంటిదే ఇది.. జిమ్ ట్రైనర్.. అదీ అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న బాడీ బిల్డర్.. దానికి తోడు ఫిట్నెస్ ప్రియులకు జాగ్రత్తలు చెప్పే ట్రైనర్.. వెయిట్‌లిఫ్టింగ్Squat చేస్తూ మరణిస్తే?.. ఇండోనేషియా బాడీబిల్డర్, అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్న ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ జస్టిన్ విక్కీ(33) Justyn Vicky కెమెరా సాక్షిగా ప్రాణం విడిచాడు. సుమారు 400 పౌండ్ల బరువును(210 కేజీలు) ఎత్తే క్రమంలో మెడ విరిగి తీవ్రంగా గాయపడి చనిపోయాడతను. ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని.. జులై 15వ తేదీన ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా ఛానెల్స్ కథనాలు ప్రచురించాయి. మెడ విరగడంతో పాటు గుండెకు, లంగ్స్(కాలేయం) నరాలు దెబ్బతిని అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అతి బరువు ఎత్తే రిస్క్ చేయడం.. ఆ క్రమంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడమే అతని మరణానికి కారణమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ట్విటర్లో కనిపిస్తోంది. -
బామ్మ వయసు 73.. ప్రాణాలకు ప్రమాదమని తెలిసిన పోటీలో పాల్గొని చాంపియన్‌గా నిలిచింది!
ఆనందంగా జీవించే వారికి వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. అచ్చం ఇలాగే.. ఏడు పదుల వయసు దాటిన తర్వాత కూడా బాడీ బిల్డర్‌గా రికార్డులు బద్దలు కొడుతోంది ఈ బామ్మ. ఈమె పేరు రెబెకా వూడీ. అమెరికాకు చెందిన రెబెకా అథ్లెట్స్ కుటుంబంలో జన్మించింది. తండ్రి, అన్నయ్య ఇద్దరూ గోల్డన్ గ్లోవ్స్ బాక్సర్స్. రెబెకా తండ్రికి ఒక కోచింగ్ సెంటర్ కూడా ఉంది. అక్కడ మగపిల్లలతో పాటు, ఆడపిల్లలు కూడా బాడీ బిల్డింగ్‌తో బాక్సింగ్, ఫుట్‌బాల్, బేస్ బాల్, బాస్కెట్ బాల్ వంటి క్రీడల్లో శిక్షణ తీసుకునేవారు. అలా వారిని చూసి, చిన్నప్పుడే తానూ బాడీ బిల్డర్ కావాలని నిర్ణయించుకుంది. తండ్రి ప్రోత్సాహంతో బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని ఎన్నో విజయాలు సాధించింది. అయితే, తన నలభయ్యో ఏట చక్కెర వ్యాధి రావడంతో పోటీలకు స్వస్తి పలకాలని వైద్యులు ఆమెకు సూచించారు. అయినా తను బాడీబిల్డింగ్ని ఆపలేదు. ఇక తన 73వ ఏట అయితే, ఇకపై పోటీల్లో పాల్గొంటే ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు చెప్పారట. అప్పుడు కూడా ఆమె వెనుకడుగు వేయలేదు. వైద్యుల మాటను వమ్ము చేస్తూ.. 111 కిలోగ్రాముల పోటీలో పాల్గొని చాంపియన్‌గా నిలిచింది. ఇన్ని విజయాలు సాధించే ఈ బామ్మకు ఇప్పటికీ పిజ్జా, మెక్సికన్ ఫుడ్ అంటే చాలా ఇష్టమట. ‘ఇష్టమైన ఆహారం తీసుకుంటూ, ఆనందంగా జీవిస్తే ఏ అనారోగ్యమూ మిమ్మల్ని ఏమీ చేయలేదు’ అంటోంది ఈ బాడీబిల్డర్ బామ్మ. చదవండి: 127 గంటలు.. డ్యాన్స్! -
బాడీ బిల్డర్.. అయ్యాడు చైన్‌స్నాచర్
కర్ణాటక: మిస్టర్ ఆంధ్రాగా పేరు గడించిన కడప రవీంద్రనగర నివాసి సయ్యద్ బాషా (34), అతని అనుచరుడు షేక్ అయూబ్‌ను మంగళవారం బెంగళూరు దక్షిణ విభాగం గిరినగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.6 లక్షల విలువచేసే బంగారుచైన్లు, రెండు బైకులను స్వా«దీనం చేసుకున్నారు. డీసీపీ కృష్ణకాంత్ వివరాలను వెల్లడించారు. సయ్యద్ పాషా 2005 నుంచి 2015 వరకు కువైట్‌లో కారుడ్రైవరుగా పనిచేశాడు. అక్కడ ఉండగానే బంగారం స్మగ్లింగ్‌లో పాల్గొన్నాడు. కరోనా సమయంలో సొంతూరికి చేరుకుని బాడీ బిల్డర్‌గా రాణించి పోటీల్లో పాల్గొని మిస్టర్ ఆంధ్రగా గుర్తింపు పొందాడు. సులభంగా డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టాడు. చైన్ స్నాచింగ్‌లకు పాల్పడడంతో స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. బెంగళూరులో చోరీలు సులభమని.. సయ్యద్ జైలులో ఉండగా బెంగళూరులో సులభంగా దొంగతనాలు చేయవచ్చునని తోటి ఖైదీ సలహా ఇచ్చాడు. దీంతో సయ్యద్ కొంతకాలం కిందట బెయిల్‌పై విడుదలై కడప నుంచి బెంగళూరు కు చేరుకున్నాడు. బైక్‌లను దొంగిలించి వాటిపై గిరినగర, సుబ్రమణ్యనగర పోలీస్స్టేషన్ల పరిధిలో తిరుగుతూ ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. చోరీ తరువాత అదే ప్రాంతంలో మామూలుగానే తిరగేవాడు, దీని వల్ల తనపై ఎవరికీ అనుమానం రాదని భావించేవాడు. అంతేగాక మొబైల్‌ఫోన్‌ను కూడా వాడేవాడు కాదు. గిరినగరలో నమోదైన చైన్‌స్నాచింగ్ కేసుల్లో దర్యాప్తు చేసి సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా బైక్ నంబరును గుర్తించారు. మంగళవారం ఇద్దరిని అరెస్ట్‌చేసి విచారణ చేపట్టారు. నగరంలో చైన్‌స్నాచింగ్‌లతో పాటు 32 దొంగతనాలతో సయ్యాద్, అనుచరుని పాత్ర ఉన్నట్లు తెలిసింది. ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్టు బెంగళూరులో ఐపీఎల్ బెట్టింగ్ దందాకు పాల్పడుతున్న 160 మందితో కూడిన ముఠాను మంగళవారం సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి రూ.65 లక్షల నగదు స్వా«దీనం చేసుకున్నారు. బెంగళూరులో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో ఆన్లైన్లో బెట్టింగ్ దందా జోరుగా జరిగింది. ఆన్లైన్, యాప్‌ల ద్వారా జరిపేవారు. -
ప్రపంచ పొట్టి బాడీబిల్డర్ వివాహం.. వీడియో వైరల్
ప్రపంచ అత్యంత పొట్టి బాడీబిల్డర్‌గా పేరుపొందిన ప్రతీక్ విట్టల్ మోహిత్ వివాహ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. ప్రతీక్ విట్టల్ ఎత్తు కేవలం 3 అడుగుల 4 అంగుళాలు మాత్రమే. కాగా ప్రతీక్ పెళ్లి చేసుకున్న యువతి ఎత్తు 4 అడుగుల రెండు అంగుళాలు. నాలుగేళ్ల క్రితం ఈ ఇద్దరికీ పరియమైంది. ఆ తర్వాత ఒకరినొకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించడంతో ప్రతీక్ విట్టల్ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఫోటోలను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. పెళ్లి కుమారుడి దుస్తుల్లో ఓ వాహనంపై నిలుచుని డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్టు చేసి వార్తల్లో నిలిచాడు. ప్రతీక్ తన బాడీబిల్డింగ్ కేరీర్‌ను 2012లో మొదలుపెట్టాడు. 2016లో తొలిసారి కాంపిటీషన్లో పాల్గొన్నాడు. బాడీబిల్డర్‌గా ప్రతీక్ 2021లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను అందుకున్నాడు. పురుషుల విభాగంలో షార్టెస్ట్ కాంపిటీటివ్ బాడీబిల్డర్(Shortest Competitive Bodybuilder) టైటిల్ కూడా గెలుచుకున్నాడు. ఓ మంచి ఉద్యోగంలో చేరి జయను బాగా చూసుకోవాలంటూ ప్రతీక్ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Pratik Mohite (@pratikmohite_official) View this post on Instagram A post shared by Pratik Mohite (@pratikmohite_official) -
ఏం సమస్య వచ్చిందో ఏమో..! యువ బాడీబిల్డర్ ఆత్మహత్య
సాక్షి, బెంగళూరు: చిన్న వయసులోనే అందరూ అబ్బురపడేలా బాడీ బిల్డర్ అయ్యాడు. అందుకోసం పగలూ రాత్రి శ్రమించాడు. కానీ అతని కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. బెంగళూరులో ఒక బాడీ బిల్డర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్ణరాజపురం వద్ద హీరండహళ్లిలో జరిగింది. శ్రీనాథ్ (22) అనే బాడీ బిల్డర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈస్ట్ పాయింట్ కాలేజీలో శ్రీనాథ్ డీఫార్మసీ చదువుతున్నాడు. బాడీ బిల్డర్‌గా తయారై పలు దేహధారుడ్య పోటీల్లో పాల్గొంటూ ఉండేవాడు. ఏం సమస్య వచ్చిందో కానీ మంగళవారం తాను ఉంటున్న గదిలో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించాడు. కోలారు జిల్లా శ్రీనివాసపురకు చెందిన శ్రీనాథ్ మరణంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనాథ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తల్లిదండ్రులు చెబుతున్నారు. అవలహళ్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. -
పోటీకి వెళ్తే.. పతకంతోనే ఇంటికి..!
పార్వతీపురం టౌన్: జిల్లా కేంద్రానికి చెందిన పడాల సంతోష్ నచ్చిన రంగంలో రాణించేందుకు ఆసక్తి ఉంటే చాలని నిరూపించాడు. ఏడో తరగతి వరకూ రెగ్యులర్ విద్యాభ్యాసం చేసిన ఆ యువకుడు చదువు వంటబట్టకపోయినా ఓపెన్ టెన్త్ ద్వారా పది పాసయ్యాడు. వ్యాయామంపై ఆసక్తి ఉన్న సంతోష్ తన పేదరికాన్ని పక్కన పెట్టి ఇంటివద్దే ఉంటూ బాడీ బిల్డర్‌గా అవతరించాడు. ఎప్పటికైనా ఇంటర్నేషనల్ స్టేజీపై ప్రదర్శన ఇవ్వాలనుకున్న కలను మహారాష్ట్రలోని పూణేలో జరిగిన మిస్టర్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీల్లో సాకారం చేసుకున్నాడు. పార్వతీపురం పట్టణంలోని జగన్నాథపురం కాలనీలో ఉంటున్న సంతోష్ దేశంలో ఎక్కడ బాడీ బిల్డర్ పోటీలు జరిగినా ప్రదర్శన ఇస్తూ ప్రతిభ చూపుతున్నాడు. అనుకున్నది సాధించి.. సంతోష్ చదువు ఏడవతరగతితో ఆగిపోయింది. తండ్రి మజ్జయ్య రోజువారీ కూలీకాగా, తల్లి సత్యవతి పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికరాలు. బాడీ బిల్డింగ్ పోటీలపై ఆసక్తి ఉన్న సంతోష్ ఇంటి వద్దే తర్ఫీదు పొంది మంచి బాడీ బిల్డర్‌గా శరీర సౌష్టవాన్ని మెరుగుపరుచుకున్నాడు. పలు పోటీల్లో పాల్గొంటూ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగాడు. ప్రోత్సహిస్తున్న భార్య 29 ఏళ్ల సంతోష్ ఇప్పటివరకూ 29 పర్యాయాలు స్టేట్ లెవెల్లో ప్రథమ స్థానంలో నిలిచి మెడల్స్ సాధించాడు. ఏడు పర్యాయాలు స్టేట్ లెవెల్ చాంపియన్ షిప్ సాధించాడు. నాలుగేళ్ల క్రితం వివాహం జరగ్గా, సంతోష్‌కు బాడీబిల్డింగ్ పోటీలపై ఆసక్తి ఉండడంతో భార్య రాధారాణి ప్రోత్సహిస్తూ వచ్చింది. ఇప్పటికీ చిన్నచిన్న ప్రైవేట్ కూలీ పనులు చేస్తున్న సంతోష్ ప్రభుత్వపరమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. పదోతరగతి అర్హతతో ఉండే ఉద్యోగాల కోసం పలుచోట్లకు వెళ్తున్నాడు. తన భార్య ప్రోత్సాహం కారణంగానే ఈ అవకాశం, మెడల్స్ లభించాయని సంతోష్ తెలిపాడు. జిల్లాకు ఖ్యాతి.. పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన తరువాత జిల్లాకు చెందిన యువకుడు జాతీయ స్థాయిలో రాణించడం, దేశ నలుమాలలో ఎక్కడ బాడీ బిల్డింగ్ పోటీలు జరిగినా ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరుస్తూ పతకాలు సాధిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకువస్తున్నాడు. అంతేకాకుండా జిల్లా నుంచి 40 మంది యువకులకు బాడీ బిల్డింగ్‌లో తర్ఫీదు ఇస్తూ వారిలో 20 మంది రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దుతున్నాడు. సాధించిన విజయాలు రాష్ట్రస్థాయిలో 29సార్లు ప్రథమ స్థానం 15సార్లు చాంపియన్ ఆఫ్ చాంపియన్ జిల్లాస్థాయిలో 16సార్లు ప్రథమ స్థానం మిస్టర్ సౌత్ ఇండియా పోటీల్లో రెండోస్థానం ఐబీబీఎఫ్ జూనియర్ నేషనల్స్‌లో రెండోస్థానం 2012 పూణెలో జరిగిన జూనియర్‡ నేషనల్ మిస్టర్ ఇండియాలో రెండవ స్థానం 2014 గుజరాత్లో జరిగిన సీనియర్ నేషనల్ మిస్టర్ ఇండియాలో ఐదవ స్థానం 2015 మహారాష్ట్రలో జరిగిన సీనియర్ నేషనల్ మిస్టర్ ఇండియాలో నాల్గవ స్థానం 2018 పూణెలో జరిగిన మిస్టర్ ఇండియా పోటీల్లో ప్రథమ స్థానం 2021 శ్రీకాకుళం, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో మిస్టర్ ఆంధ్రా, ఓవరాల్ చాంపియన్ 2022 పూణెలో జరిగిన సీనియర్ నేషనల్ మిస్టర్ ఇండియా పోటీల్లో బ్రాంజ్ మెడల్ -
ప్రాణాల కోసం పోరాడుతున్న మాజీ మిస్టర్ యూనివర్స్
బాడీ బిల్డర్, మాజీ మిస్టర్ యూనివర్స్ కాలమ్ వాన్ మోగర్ ప్రాణాలతో పోరాడుతున్నారు. మోగర్ ప్రమాదం నుంచి బయటపడాలని, తర్వాగా కోలుకోవాలని ఆయన అభిమానులు దేవుడిని వేడుకుంటున్నారు. కోమాలో నుంచి బయటపడాలని ప్రార్థిస్తున్నారు. వివరాల ప్రకారం.. మాజీ మిస్టర్ యూనివర్స్ కాలమ్ వాన్ మోగర్ ఇటీవల రెండవ అంతస్థుల భవనంలోని కిటికీ నుండి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన వెన్నుముకకు గాయమైంది. ప్రమాదం అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మోగర్ కోమాలోకి వెళ్లిపోయాడని న్యూయార్క్ పోస్ట్ ఓ కథనంలో తెలిపింది. కాగా, ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆయన డ్రగ్స్ మత్తులో ఉన్నారని మోగర్ స్నేహితుడు యూట్యూబర్ నిక్ ట్రిగిల్లి చెప్పారు. ఇదిలా ఉండగా.. మిస్టర్ వాన్ మోగర్ 2018లో ‘బిగ్గర్’ చిత్రంలో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ పాత్ర చేసి ఎంతో ఫేమస్ అయ్యాడు. దీంతో నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, దురదృష్టవశాత్తు ఇలా ప్రమాదంలో మోగర్ గాయపడటంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా నిలవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: గుడ్‌బై ఐపాడ్.. బరువెక్కిన గుండెలతో వీడ్కోలు.. -
ఫిట్నెస్ క్వీన్ @ 55
కొంతమంది మధ్యవయసులోనూ కెరీర్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి దూసుకుపోతుంటారు. నిస్రీన్ పారిఖ్ మాత్రం యాభైఏళ్లకు పైబడ్డ వయసులోనూ చక్కటి ఫిట్నెస్తో అబ్బుర పరుస్తోంది. ‘‘ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరిస్తే వయసుతో సంబంధం లేకుండా అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చు’’ అని నిరూపించి చూపిస్తోంది నిస్రీన్ పారిఖ్. ముంబైలో పుట్టిన పెరిగిన నిస్రీన్ పారిఖ్‌కు చిన్నప్పటి నుంచి ఆటలాడడం అంటే ఎంతో ఇష్టం. పదిహేనేళ్లకే కరాటే నేర్చుకుంది. ఆల్ ఇండియా కరాటే ఫెడరేషన్, నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో పతకాలను కూడా సాధించింది. నిస్రీన్‌కు 1989లో పెళ్లయి పిల్లలు పుట్టడంతో..వారిని చూసుకోవడంలోనే సమయం గడిచిపోయేది. అయినా రోజువారి ఫిట్నెస్ వ్యాయామాలు చేయడం మాత్రం మర్చిపోలేదు. బెస్ట్ పర్సనల్ ట్రెయినర్... ఇంటి బాధ్యతల్లో నిమగ్నమైనప్పటికీ కాస్త వెసులుబాటు చేసుకుని ముంబై యూనివర్సిటీలో సైకాలజీ, సోఫియా కాలేజీలో డైట్ అండ్ న్యూట్రిషన్లో మాస్టర్స్ చేసింది. తరువాత ఎయిర్ ఇండియాలో ఉద్యోగులకు పర్సనల్ ట్రెయినర్‌గా పాఠాలు చెప్పేది. నిస్రీన్ క్లాసులకు మంచి ఆదరణ లభించడంతో 2015లో ఏటీపీ ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమంలో ‘బెస్ట్ పర్సనల్ ట్రెయినర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచింది. ఈ ఉత్సాహంతో స్కూల్ స్థాయి విద్యార్థులకు ఫిట్నెస్ ట్రెయినర్‌గా చేరింది. పిల్లలిద్దరూ బోర్డింగ్ స్కూల్లో చేరడంతో నిస్రీన్‌కు సమయం దొరికింది. దీంతో యోగాలో పీజీ డిప్లొమా చేస్తూనే ఇంటి దగ్గర సాధన చేస్తుండేది. తర్వాత విద్యార్థులకు, ఫిట్నెస్ ఔత్సాహికులకు యోగా పాఠాలు చెప్పడం మొదలు పెట్టింది. ఇలా గత పద్దెనిమిదేళ్లుగా యోగా పాఠాలు చెబుతూ ఎంతోమందిని ఫిట్‌గా ఉంచడంతోపాటు తను కూడా ఫిట్‌గా తయారైంది నిస్రీన్. ఆ ఆపరేషన్‌తో బాడీ బిల్డర్‌గా... నిస్రీన్‌కు 48 ఏళ్లు ఉన్నప్పుడు గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ వల్ల ఇబ్బందులు ఏర్పడడంతో గర్భసంచినే తొలగించారు. సర్జరీ సమయం లో కాస్త బలహీన పడిన నిస్రీన్.. తన ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టింది. రెండేళ్ల తరువాత పూర్తి ఫిట్నెస్ వచ్చిన నిస్రీన్ తన పిల్లల ప్రోత్సాహంతో 50 ఏళ్ల వయసులో తొలిసారిగా 2016లో ‘ముంబై బాడీబిల్డింగ్ కాంపిటీషన్లో పాల్గొంది. అలా పాల్గొన్న ప్రతి పోటీలో మెడల్ గెలుచుకుంటూ లేటు వయసు బాడీబిల్డర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. గ్లాడ్రాగ్స్ మిసెస్ ఇండియా, ఏషియన్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొని ‘మోడల్ ఫిజిక్ అథ్లెట్’గా పాపులారిటీ సంపాదించుకుంది. థాయ్‌లో జరిగిన ‘వరల్డ్ బాడీబిల్డింగ్ అండ్ ఫిజిక్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్’లో నాలుగోస్థానంలో నిలిచి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. కలలు నిజం చేసుకునేందుకు ద్వారాలెప్పుడూ తెరిచే ఉంటాయి. మనముందున్న సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగితే కలలను నిజం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఉదయాన్నే ప్రోటీన్ షేక్, తరువాత వర్క్ అవుట్స్‌తో రోజు ప్రారంభం అవుతుంది. అడ్వర్టైజ్మెంట్స్ షూట్స్, బాలీవుడ్ సెలబ్రెటీలను కలుస్తూనే, రోజూ ఫిట్నెస్ తరగతులు నిర్వహిస్తున్నాను. లాక్డౌన్ సమయంలో వర్చువల్ తరగతులను నడిపాను. కొన్ని ఫిట్నెస్ సప్లిమెంట్స్‌కు అంబాసిడర్‌గా పనిచేస్తూ ఎప్పూడూ బిజీగా ఉంటున్నప్పటికీ, నా కుటుంబ సహకారం వల్లే నేనెప్పుడూ ఎనర్జిటిక్‌గా, ఫిట్‌గా ఉండగలుగుతున్నాను. – నిస్రీన్ -
మిస్టర్ వరల్డ్ ఛాంపియన్ షిప్ కు సెలెక్ట్ అయిన హైదరాబాద్ యువకుడు
-
ఎస్తేర్ ‘జిమ్’దాబాద్.. ఏపీ తొలి మహిళా బాడీబిల్డర్
సృష్టికి మూలం స్త్రీ. ప్రతి మగాడి గెలుపు వెనుక ఓ మహిళ ఉంటుందంటారు. కానీ ఈ వనితల విజయం వెనుక వారి స్వయంకృషి ఉంది. అచెంచల ఆత్మవిశ్వాసం.. మొక్కవోని దీక్ష.. కఠోర సాధనతో వీరు తాము అనుకున్న లక్ష్యం సాధించారు. అవరోధాలను అవకాశాలుగా మలుచుకుని శక్తిసామర్థ్యాలకు పదునుపెట్టారు. ఉరిమే ఉత్సాహంతో ముందుకురికారు. జయభేరి మోగించి విజయతీరాలు చేరారు. తమ రంగాల్లో అనితరసాధ్యమైన ప్రతిభ కనబరిచారు. మహిళా లోకం సగర్వంగా తలెత్తుకునేలా.. కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించారు. చదవండి: ఇదేం కోడిగుడ్డు? వింత ఆకారాన్ని చూసేందుకు ఎగబడుతున్న జనం తెనాలి(గుంటూరు జిల్లా): రావూరి ఎస్తేరు రాణి.. ఈమె జీవితం వడ్డించిన విస్తరి కాదు.. చిన్నప్పుడే అమ్మానాన్నలకు దూరమయ్యారు. పేదరికం శాపంలా వెంటాడుతున్నా.. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. జిమ్ ట్రైనర్‌గా ఉపాధి పొందుతూనే బాడీబిల్డర్గానూ రాణించారు. రాష్ట్ర తొలి మహిళా బాడీ బిల్డర్‌గా గుర్తింపు పొందారు. ఫలితంగా ఈనెల 11న సిక్కింలో జరగనున్న నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీలకు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్తేరురాణి సొంతూరు తెనాలి సమీపంలోని వేమూరు. నాలుగున్నరేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెను, ఆమె తమ్ముడినీ నాయనమ్మ చేరదీసింది. ఇద్దరినీ చదివించింది. గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్ వరకు చదివిన ఎస్తేరు రాణి పొట్టకూటి కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ ఇంటికి దగ్గర్లో ఉన్న జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్ చేసేవారు. కొద్దినెలల్లోనే అక్కడ జిమ్ ట్రైనర్‌గా మారారు. ఆ తర్వాత శరీర సౌష్టవ పోటీలకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నారు. కఠోర సాధనతో ఏడాదిన్నరలోపే అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీల్లో పాల్గొనేందుకు గత జనవరిలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో సత్తాచాటారు. ఏపీ నుంచి జాతీయ పోటీల్లో పాల్గొనబోతున్న తొలి బాడీ బిల్డర్‌గా గుర్తింపు పొందారు. ప్రముఖుల ప్రోత్సాహం ఎస్తేరురాణికి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ రూ.లక్ష, అడిషనల్ డీజీపీ శ్రీధర్, సునీల్ కలిసి రూ.50 వేలు చొప్పున సాయాన్ని సమకూర్చారు. వెన్నుతట్టి ప్రోత్సహించారు. నిత్యం ఆరు గంటల కఠోర సాధన ఎస్తేరురాణి రోజూ ఆరు గంటలు కఠోర సాధన చేస్తారు. ఈ సాధన ఫలించాలంటే రోజూ కిలో చికెన్, ఇరవై గుడ్లు మెనూలో ఉండాలి. వచ్చే జీతం సరిపోకపోయినా.. కొందరి సాయంతో మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. నేషనల్స్‌లో పతకం సాధించి ఉద్యోగం పొందాలనేదే లక్ష్యమని ఎస్తేరు రాణి చెబుతున్నారు. ప్రతిభా ‘మాధవీ’యం తెనాలి: చుండూరు మండలం మోదుకూరుకు చెందిన ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గాలి మాధవీలతకు ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్స్, మేనేజ్మెంట్ విభాగాల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సేవలందించిన 75 మంది మహిళల జాబితాను ప్రకటించింది. అందులో మాధవీలతకు స్థానం లభించింది. భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ కె.విజయరాఘవన్, బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ ఈ నెల 3న ఈ జాబితాను ప్రకటించారు. వీరి స్ఫూర్తిదాయక సేవలను ‘షి ఈజ్ 75 విమెన్ ఇన్ స్టీమ్’ పేరుతో పుస్తక రూపంలో తీసుకురానున్నారు. నేటి తరానికి స్ఫూర్తినిచ్చేందుకు వీరి వీడియోలను ప్రదర్శిస్తారు. సదస్సులో వీరిని పరిచయం చేస్తారు. ఆ జాబితాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సైంటిస్ట్‌లు, కళాకారులు, సమాజ సేవకులు, మానవతావాద డాక్టర్ల సరసన చుండూరు మండలం మోదుకూరుకు చెందిన కనకారెడ్డి, శివలీల కోడలు మాధవీలతకు స్థానం లభించింది. సాధారణ రైతు కుటుంబం నుంచి.. ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామం మాధవీలత స్వస్థలం. 1971లో సాధారణ రైతు కుటుంబంలో అన్నపూర్ణమ్మ, వెంకారెడ్డి దంపతులకు జని్మంచారు. జేఎన్టీయూ, కాకినాడలో ఇంజినీరింగ్ పూర్తిచేసి, స్వగ్రామంలో తొలి ఇంజినీరుగా గుర్తింపును పొందారు. ఎన్ఐటీ, వరంగల్‌లో ఎంటెక్, ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్డీ చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని సర్వోత్తమ విశ్వవిద్యాలయం ఐఐఎస్సీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇదే విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్‌పర్సన్‌గా మాధవీలత సైన్స్‌ని, టెక్నాలజీని గ్రామీణాభివృద్ధికి చేరువచేసే ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తున్నారు. భారతదేశంలో జమ్ములో గల చీనాబ్ నదిపై రూ.1000 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోని అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జి డిజైన్, నిర్మాణంలో మాధవీలత ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. వ్యక్తిగత విషయానికొస్తే గృహిణిగా, అమ్మగా తన పాత్రపోషిస్తూనే వృత్తిపరంగానూ రాణిస్తున్న మాధవీలత అభిరుచిలోనూ తనదైన శైలి కబరుస్తుంటారు. కవితలనూ రాస్తుంటారు. ‘ఆశా’వహ దృక్పథంతో.. గుంటూరు వెస్ట్: ఆశావహ దృక్పథమే ఆమెను ముందుకు నడిపింది. పరిస్థితులకు ఎదురీదుతూనే ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. రూ.200తో వ్యాపారం మొదలు పెట్టి రూ.40లక్షల టర్నోవర్‌కు చేర్చారు. ఆమె పేరు ఆశా సేకూరు. ఊరు గుంటూరు. సహజసిద్ధ ఉత్పత్తుల తయారీతో సమున్నత ప్రగతి సాధించారు. ఇప్పుడు విదేశాలకూ తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఆశా విజయగాథ ఆమె మాటల్లోనే.. ఆలోచనాత్మకంగా ముందడుగు.. 2008లో విజయ్ ప్రసాద్‌తో పెళ్లయింది. నేను గర్భిణిగా ఉండగా ఆయన నడిపే యానిమేషన్ స్టుడియో ఆర్థిక ఇబ్బందులతో మూతపడింది. ఎనిమిదో నెలలోనే కూతురు తన్వీ పుట్టింది. సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయినా బెదిరి పోలేదు. ఆ సమయంలో పాప రంగు రావాలని కొన్ని లోషన్స్ వాడాను. అవి వికటించి ర్యాషెస్ వచ్చాయి. అమ్మమ్మకు చెబితే వంటగదిలో లభించే కొన్ని వస్తువులతో సున్నిపిండి చేసి ఇచ్చింది. ఇది పాపకు బాగా పనిచేసింది. అప్పుడే సహజసిద్ధ ఉత్పత్తులు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. సున్నిపిండి తయారీకి కేవలం రూ.200 ఖర్చయింది. ఆచరణ ఇలా.. ఆ తర్వాత పాప శరీరానికి బాదం ఆయిల్ మంచిదని రూ.5.000 వెచ్చించి చత్తీస్‌గఢ్ నుంచి ఆయిల్ ఎక్స్్రస్టేట్ మిషన్ కొన్నాను. కేజీ బాదం పప్పును పిండితే కేవలం 150 గ్రాములే వచ్చింది. దానిలో మరికొన్ని వస్తువులు కలిపి పాపకు వాడాను. బాగా పనిచేసింది. ఆ తర్వాత సహజసిద్ధ ఉత్పత్తుల తయారీలో ఆయుర్వేదిక్ కాస్మొటాలజీ, ఆర్గానిక్, ఇతర సర్టిఫికేట్ కోర్సులు చేశా. సొంతంగా సహజసిద్ధ సౌందర్య ఉత్పత్తులు తయారు చేసి మొదట నా బిడ్డకు వాడేదాన్ని. వాటి ఫలితాల ఆధారంగా తన్వీ నేచురల్స్ పేరిట సంస్థ స్థాపించి మార్కెటింగ్ చేయడం మొదలు పెట్టా. ప్రస్తుతం 25 రకాల వస్తువులు తయారు చేస్తున్నా. సంస్థ టర్నోవర్ ఇప్పుడు రూ.40లక్షలు. విదేశాలకూ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నా. ప్రస్తుతం 600 మంది రెగ్యులర్ వినియోగదారులు ఉన్నారు. యువతకూ ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నా అనుభవాలు వారికి మార్గదర్శకంగా ఉంటాయని భావిస్తున్నాను. -
నాడు ప్రపంచంలోనే అత్యంత బలమైన బాలుడు... పిన్న వయసు బాడీబిల్డర్... ఐతే ఇప్పుడు!!
చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభతో అందర్నీ ఆశ్చర్యచకితులను చేసి పేరుగాంచిన చిన్నారుల గురించి విని ఉన్నాం. కొంతమంది ఆ ప్రతిభను తమ జీవితాంతం కొనసాగిస్తే. మరికొందరికి పెద్దయ్యాక చిన్నప్పటి ప్రతిభ కనుమరగవుతుందో లేక వాళ్లకి ఇక ఆసక్తి తగ్గిపోతుందో తెలియదుగాను వారిలో కొన్ని తేడాలు కనిపిస్తూ ఉంటాయి. అచ్చం అలానే ఉక్రెయిన్‌కి చెందిన బాలుడు చిన్న వయసులోనే బాడీబిల్డర్‌గా పేరుగాంచాడు. కానీ ఇప్పడూ ఆ బాలుడిని చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. (చదవండి: సారీ! రిపోర్టులు మారిపోయాయి.. నీకు కరోనా లేదు!) అసలు విషయంలోకెళ్లితే.....ఉక్రేనియాకి చెందిన రిచర్డ్ సాండ్రాక్ 1992లో జన్మించాడు. అతను 2000 సంవత్సరం నుండి అతని పేరు మారు మ్రోగిపోయింది. కేవలం ఆరేళ్ల ప్రాయం నుండే 85 కిలోలు బరువులు ఎత్తాడు. ఇక ఎనిమిదేళ్లకు 95 కిలోలు వరకు బరువులు ఎత్తి ప్రపంచంలోనే బలమైన బాలుడిగా పేరుగాంచాడు. అంతేకాదు ఆ బాలుడికి 'లిటిల్ హెర్క్యులస్' అని పేరు కూడా పెట్టారు. అతి చిన్న వయసులో బాల సెలబ్రిటీగా పేరు సంపాదించుకున్నాడు. కానీ ఈ పేరు ప్రఖ్యాతుల వెనుకు ఆ బాలుడి కఠోర శ్రమ అసాధారణమైనది. అంతేకాదు ఆ చిన్న వయసులో ఆ బాలుడు తన తండ్రితో కలిసి రోజుకి ఏడు గంటలు వ్యాయమం చేసేవాడు. పైగా రోజుకు 600 పుష్అప్లు, 300 స్క్వాట్లు చేసేవాడు. కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్‌తో మంచి దేహదారుఢ్యాని సొంత చేసుకుని పేరు ప్రఖ్యాతులు పొందాడు. అయితే ఈ వ్యాయమాల వల్ల ఆ బాలుడి శరీరంలో కొవ్వు స్థాయిలు పడిపోయి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో అతని తల్లిదండ్రుల పై సర్వత్రా విమర్శలు రావడమే కాదు ఈ మేరకు అతని పై ఒక డాక్యుమెంటరీని కూడా విడుదల చేశారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇది అప్పటి సంగతి కానీ ఇప్పుడు అతన్ని చూస్తే మాత్రం ఆ బాలుడేనా అనే సందేహం కలగకమానదు. అయితే ఆ బాలుడికి ఇప్పుడు 29 ఏళ్లు. తాను ఇప్పుడు ఎటువంటి బరువులు ఎత్తడం లేదని చెప్పాడు. ప్రస్తుతం అతను హాలీవుడ్ స్టంట్‌మ్యాన్‌గా పని చేస్తున్నాడు. బరువులు ఎత్తడం బోరు కొట్టేసిందని ఇప్పుడూ తాను నాసా సంబంధించిన క్వాంటం శాస్త్రవేత్త కావలన్నదే తన ధ్యేయమని చెప్పాడు. (చదవండి: ఖరీదైన గిఫ్ట్‌ల స్థానంలో కుక్క బిస్కెట్లు, షేవింగ్ క్రీమ్‌లు) -
భార్య సలహాతో.. నాలుక, ముక్కు చెవులు కోయించుకున్న భర్త
కోరలు, కొమ్ములు కలగలిసిన ఆకారాన్ని చూస్తే.. ఎలాంటివారికైనా ధైర్యం సడలకమానదు. అందుకే ప్రపంచమంతా మెచ్చే అందాన్ని కాదని ఆ ప్రపంచాన్నే తమ రూపంతో వణికించాలనుకునే వెర్రిసాహసవంతులు చాలా మందే తయారయ్యారు. ఒళ్లంతా టాటూలు పొడిపించుకుంటూ, రంధ్రాలు, బొడిపెలు పెట్టించుకుంటూ.. బాడీ మోడిఫికేషన్ పేరుతో నాలుక, చెవులు, ముక్కు ఇలా ఏదిపడితే అది కత్తిరించుకుని జనాలను జడిపిస్తున్నారు. బ్రెజిల్‌కు చెందిన 44 ఏళ్ల మైఖెల్ ఫారో డో ప్రదోకు, అతడి భార్య కరోల్‌కు అలాంటి పైత్యమే పుట్టింది. ఇప్పటికే వాళ్లు తమ శరీరానికి ముప్పై వంకలు సృష్టించుకున్నారు. మరీముఖ్యంగా మిస్టర్ ప్రదో అయితే తలకు కొమ్ములు పెట్టించుకోవడమే కాకుండా నాలుకను రెండుగా చీల్చుకున్నాడు. తన పెదవులకు అటు ఇటు వెండి కోరలను కుట్టించుకున్నాడు. ముక్కు, చెవులను కోయించుకున్నాడు. అప్పటికీ అతడి క్రియేటివ్ తృష్ణ సంతృప్తిపడలేదు.. క్రూరమైన రూపం కోసం.. ఏకంగా ఎడమ చేయి ఉంగరపు వేలుని కట్ చేయించు కున్నాడు. అతడిని అలా మార్చడంలో ప్రదో భార్య పాత్ర చాలానే ఉంది. ఎందుకంటే ఆమె బాడీ మోడిఫికేషన్స్‌లో నిపుణురాలు. ఆమె సలహాతోనే ఏడాది కిందట ముక్కు కొనను తొలగించుకునే అత్యంత ప్రమాదకరమైన శత్రచికిత్స చేయించుకున్నాడు. ప్రపంచంలో ఆ ఆపరేషన్ చేయించుకున్న వారిలో మూడో వ్యక్తిగా నిలిచాడు మిస్టర్ ప్రదో. ఇలాంటి వారికీ స్పెషల్ క్రేజ్ ఉంటుందట. వీరిని ‘హ్యూమన్ సైతాన్ (మానవ దెయ్యం)’ అంటారట. అలా పిలిపించుకోవడమంటే ఎందుకంత పిచ్చో.. అలా శరీరాన్ని హింసించుకోవడంలో అదేం పైశాచికత్వామో మరి! కాదుకాదు.. ఇదొక రకమైన మానసిక దౌర్భల్యం అంటున్నారు మానసిక వైద్యనిపుణులు. బాడీ మోడిఫికేషన్‌కి ముందు మైఖెల్ -
గైనకాలజిస్టు, ఆరంకెల జీతం, అయినా సంతోషం లేదు.. బాడీబిల్డర్‌గా
Bodybuilder Maya Rathod (సాక్షి, వెబ్‌డెస్క్): ‘‘అమ్మాయివి నీకెందుకు ఆటలు.. కరాటేలు, తైక్వాండోలు అంటూ బెట్టు చేస్తే కష్టం.. కాలో.. చెయ్యో విరిగితే నిన్ను ఎవరూ పెళ్లి చేసుకోరు.. కావాలంటే డాన్స్ నేర్చుకో.. పద్ధతిగా ఉంటుంది.. అంతేకానీ.. మనకు ఇట్లాంటి ఆటలు వద్దు’’... సగటు మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లలకు ఉండే ‘సహజమైన’ ఆంక్షలు ఇవి. ముంబైకి చెందిన మాయా రాథోడ్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తాను తైక్వాండో శిక్షణ తీసుకుంటానని చెప్పినపుడు ఆమె తల్లిదండ్రులు కూడా ఇలాగే వారించారు. చక్కగా చదువుకుంటే చాలని, అనవసర ఆలోచనలతో తమను ఇబ్బంది పెట్టవద్దని సున్నితంగా మందలించారు. అమ్మానాన్నల మాట కాదనలేకపోయింది మాయా. తండ్రి కోరుకున్నట్టుగానే డాక్టర్ అయ్యింది. పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. ఇద్దరు పిల్లల తల్లిగా, గైనకాలజిస్టుగా అటు వ్యక్తిగత, ఇటు వృత్తిగత జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టింది. కానీ అథ్లెట్ కావాలన్న కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది ఆమె మనసులో. ఎక్కడో ఏదో వెలితి. పైగా రోజురోజుకు పెరుగుతున్న బరువు. తీవ్ర ఒత్తిడికి లోనైంది. తనను తాను కనుగొనే మార్గం కోసం అన్వేషించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో బాడీ బిల్డర్‌గా ఎదిగి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీబిల్డింగ్ అండ్ ఫిట్నెస్(ఐఎఫ్‌బీబీ) ఆస్ట్రేలియన్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన తొలి శ్వేతజాతీయేతర మహిళగా నిలిచింది. ఆరంకెల జీతం.. అయినా సంతోషం లేదు ‘‘చిన్నప్పటి నుంచీ నాకు క్రీడలంటే ఆసక్తి. మా కాలేజీ క్యాంపస్‌లో బెస్ట్ అథ్లెట్ నేనే. కానీ నా తల్లిదండ్రులకు ఈ విషయం ఏమాత్రం నచ్చేది కాదు. ఆటలాడేటపుడు ఒకవేళ గాయపడితే.. నన్నెవరూ పెళ్లి చేసుకోరనేది వారి భయం. అయినా, నేను వెనుకడుగు వేయలేదు. భరతనాట్యం క్లాసులు ఎగ్గొట్టి మరీ తైక్వాండో శిక్షణ తీసుకున్నా. అంతేకాదు సాయంకాలం వేళ గ్రౌండ్‌కు వెళ్లి క్రికెట్ కూడా ఆడేదాన్ని!. అథ్లెట్ కావాలన్న ఆశయం గురించి మా నాన్నకు చెప్పినపుడు.. ‘‘నువ్వు అమ్మాయివి. బాగా చదువుకుని గౌరవప్రదమైన వృత్తి చేపట్టినపుడే మనకు మంచి పేరు వస్తుంది’’ అని చెప్పారు. ఆయన చెప్పిన బాటను అనుసరించాను. మెడికల్ కాలేజీలో సీటు సంపాదించి గైనకాలజీ పూర్తిచేశాను. కాలేజీ చదువు అయిపోగానే పెళ్లి చేశారు. సంవత్సరం తిరిగేలోపే తల్లినయ్యాను. మంచి డాక్టర్‌గా పేరు. ఆరంకెల జీతం. అయినా.. నాకు సంతోషం లేదు. స్థూలకాయురాలిలా మారిపోయాను. ఊరికే అలసిపోయేదాన్ని. ఏదో తెలియని భయం ఆవహించింది. నన్ను నేను కోల్పోతున్న భావన. ఆ సమయంలో నా స్నేహితురాలు ఒకరు.. జిమ్‌కు వెళ్లమని సూచించింది. 20 కిలోల బరువు తగ్గాను అలా ఏడాది కాలంలో 20 కిలోల బరువు తగ్గాను. మా కోచ్ ఆశ్చర్యపోయారు. బాడీ బిల్డింగ్ చేయవచ్చు కదా అని సలహా ఇచ్చారు. నాకు మొదటి నుంచి బరువులు ఎత్తడం అంటే ఇష్టం. వెంటనే ఓకే అన్నాను. బాడీ బిల్డింగ్ పోటీలకు వెళ్లిన తొలినాళ్లలో అక్కడ చాలా తక్కువ మంది మహిళలు కనిపించేవారు. కాస్త మొహమాటంగా అనిపించేది. కానీ నా భర్త నన్ను ప్రోత్సహించేవారు. అయితే, మా అమ్మానాన్న, అత్తామామలు మాత్రం.. ‘‘మంచి జాబ్ వదులుకుని... ఇదంతా అవసరమా’’ అని నిట్టూర్చేవారు. నన్ను నేను నిరూపించుకోవాలని ఫిక్స్ అయ్యాను. మళ్లీ శిక్షణ మొదలుపెట్టాను. అప్పటికి మా పాప ఇంకా నా చనుబాలు తాగుతూనే ఉంది. తన ఆలనాపాలన, ఆస్పత్రిలో షిఫ్టుల్లో ఉద్యోగం, జిమ్‌కు వెళ్లడం... అబ్బో.. కాస్త కూడా విశ్రాంతి తీసుకునే సమయం ఉండేది కాదు. అనుకున్నది సాధించడానికి ఇవన్నీ తప్పవు మరి. రెండేళ్ల తర్వాత విజయం నన్ను వరించింది. స్టేట్ లెవల్ చాంపియన్‌షిప్‌లో రెండో స్థానం. ఈ క్రమంలో.. పీహెచ్డీ పూర్తి చేసేందుకు మూడేళ్ల తర్వాత సిడ్నీకి షిఫ్ట్ అయ్యాం. అప్పుడే రెండో కూతురు జన్మించింది. ఆస్ట్రేలియా గడ్డ మీద తొలి మహిళగా అక్కడికి వెళ్లాకే నాకొక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. గత 25 ఏళ్లలో అక్కడ ఒక్కరంటే ఒక్కరు కూడా భారతీయ మహిళా బాడీబిల్డర్ లేరని చెప్పారు. ఒక భారతీయురాలిగా నేను ఈ విజయం సాధించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఎనిమిది నెలల పాటు కఠోర శ్రమ... ఉదయం నాలుగు నుంచి ఏడు గంటల వరకు ట్రెయినింగ్, పెద్దమ్మాయిని స్కూళ్లో దింపడం, వంట చేయడం, ఆస్పత్రికి వెళ్లడం... ఇంటికి వచ్చి మళ్లీ పనులు చేసుకుని పిల్లల్ని నిద్రపుచ్చడం.. తర్వాత రాత్రి 10 నుంచి ఒంటి గంట వరకు ప్రాక్టీస్. ఎట్టకేలకు నా శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. ఐఎఫ్ఎఫ్బీ 2021 ఆస్ట్రేలియన్ చాంపియన్‌షిప్ టైటిల్ రూపంలో విజయం వరించింది. ఆస్ట్రేలియా గడ్డమీద ఈ ఘనత సాధించిన తొలి నల్లజాతి మహిళగా నిలిచాను. ప్రస్తుతం నా వయస్సు 30 ఏళ్లు. ఇప్పటికీ గైనకాలజిస్టుగా పనిచేస్తున్నా. ఎనిమిదేళ్లుగా బాడీబిల్డర్‌గా వివిధ పోటీల్లో రాణిస్తున్నా. పెళ్లై.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నేను ఇంతదాకా వస్తానని అస్సలు ఊహించలేదు. నాలో ఉన్న నిజాయితే నన్ను ఈరోజు ఈస్థానంలో నిలబెట్టింది. నేను ప్రేమించిన లక్ష్యం కోసం.. ఇతరులు ఏమనుకున్నా లెక్కచేయలేదు. ఉన్నది ఒక్కటే జీవితం.. మనకు నచ్చింది చేయాలి. నేను తల్లిని, వైద్యురాలిని, బాడీ బిల్డర్‌ను అని గర్వంగా చెప్పగలను’’ అని మాయా రాథోడ్ ఇటీవల హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విజయగాథ గురించి పంచుకున్నారు. -
నో స్వెట్ సర్జరీ: గుండెపోటుతో యంగ్ బాడీ బిల్డర్ మృతి
Mexican Influencer Odalis Santos Mena: మెక్సికన్ ఇన్‌ఫ్ల్యూయెన్సర్, యంగ్ బాడీ బిల్డర్ ఒడాలిస్ సాంటోస్ మీనా శస్త్ర చికిత్స వికటించి మృత్యువాతపడింది. 23 ఏళ్ల ఒడాలిస్ తన శరీరంలోని చెమటను నివారించేందుకు చేసుకున్న సర్జరీ వికటించి జూలై7న ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల మెక్సికోలోని గ్వాడాలజారాలోని స్కిన్పీల్ క్లినిక్ అండర్ ఆర్మ్(బాహువుల కింద) చెమటను తగ్గించడానికి చేసే చికిత్స ‘నో స్వెట్’ను ప్రోత్సహించడానికి ఓడాలిస్ను ప్రమోటర్‌గా నియమించుకుంది. ఇందులో చెమట గ్రంథులను తొలగించడానికి హీట్ ఎనర్జీని ఉపయోగిస్తూ చికిత్స చేస్తారు. ఇది శరీరంలోని దుర్వాసన, అండర్ ఆర్మ్ జుట్టును తగ్గించడానికి దోహదపడుతుంది. తాజాగా ఒడాలిస్ ‘నో స్వెట్’ చికిత్సను చేయించుకున్నారు. అయితే శస్త్రచికిత్సలో భాగంగా అధిక అండర్ ఆర్మ్ చెమటను నిరోధించేందుకు ఒడాలిస్ చెమట గ్రంథులను పూర్తిగా తొలగించారు. ఈ క్రమంలో మత్తుమందు ఇంజక్షన్ తీసుకున్న తర్వాత ఆమె గుండెపోటుకు గురయ్యారు. అయితే క్లినిక్‌లోని హెల్త్‌కేర్ వర్కర్స్ ఆమెను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ఒడాలిస్ చనిపోయారు. కాగా ఒడాలిస్ మృతిపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఆమెకు అందించిన మత్తుమందు, స్టెరాయిడ్ ప్రభావం వల్లే మరణించినట్లు పోలుసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే క్లినిక్‌లో శిక్షణ లేని వ్యక్తి మత్తుమందు ఇవ్వడం వల్లే ఆమె చనిపోయిందని అక్కడి మరో మీడియా పేర్కొంది. ఇక సాంటోస్ మీనాకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. పలు బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంది. అలాగే 2019లో మిస్ మరియు మిస్టర్ హెర్క్యులస్ టైటిల్‌తో పాటు వెల్నెస్ ఫిట్నెస్ జువెనైల్ పోటీల్లో కూడా గెలిచింది View this post on Instagram A post shared by Odalis Santos Mena (@odalis_sm) View this post on Instagram A post shared by Odalis Santos Mena (@odalis_sm) -
‘వామ్మో ఏంటా బట్టలు.. ముందు ఫ్లైట్ దిగు’
ఆడవాళ్ల వేషధారణ సొసైటీలో ఎడతెగని ఓ చర్చాంశం. అయితే తన దేశంలో వివక్ష ఎదురవుతుందనే.. ఆమె వెస్ట్రన్ దేశాలకు వలస వెళ్లింది. అక్కడ తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకుంది. కానీ, ఊహించని రీతిలో అక్కడా ‘చేదు’ అనుభవమే ఎదురయ్యిందంటూ కన్నీళ్లతో వాపోయింది. కానీ.. దెనిజ్ సెపినర్(26).. టర్కీ ఫిట్నెస్ మోడల్. అయితే అక్కడి సంప్రదాయలు ఆమెను ప్రొఫెషనల్‌లోకి అనుమతించలేదు . దీంతో అమెరికాకు వలస వెళ్లింది. ఫిట్నెస్ మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరు సంపాదించుకుంది. ఇంటర్నేషనల్ గుర్తింపు దక్కించుకున్న మొదటి టర్కీ బాడీ బిల్డర్ కూడా ఈమెనే. ఈ క్రమంలో బికినీ మోడలింగ్ కాంపిటీషన్లో పాల్గొనేందుకు జులై 8న మియామీ నుంచి టెక్సాస్‌కు బయలుదేరింది. అయితే ఫ్లైట్ ఎక్కిన కాసేపటికే సిబ్బంది ఒకరు వచ్చి.. ‘మీరు దిగిపోవాలి’ అన్నాడు. ఆమె అది జోక్‌గా అనుకుందట. దీంతో ‘మీ బట్టలు బాగోలేవు. మీ వల్ల ఇందులో ఉన్న ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి. దిగిపోండి’ అని మరోసారి చెప్పాడట. కావాలంటే తన టీషర్ట్‌తో కాళ్లను కప్పేసుకుంటానని ఆమె చెప్పినప్పటికీ.. వినకుండా ‘మీరు నగ్నంగా ఉన్నారు. దిగిపోవాల్సిందేన’ంటూ ఆమెతో దురుసుగా వ్యవహరించారట. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకుని వాపోయిందామె.‘ఆ మాట వినగానే భయమేసింది. వణికిపోయా. వాళ్లసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. నేనేం నగ్నంగా లేను కదా. రాత్రంతా ఒంటరిగా ఎయిర్‌పోర్ట్‌లో ఉండిపోయా. నా దేశంలో స్వేచ్ఛ లేదనే ఇక్కడికి వచ్చా. కానీ, ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదు’ అంటూ కన్నీళ్లతో వీడియోను పోస్ట్ చేసింది దెనిజ్. ట్విస్ట్ అయితే దెనిజ్ దుస్తులు మరీ బికినీ తరహాలో కురచగా ఉన్నాయని, అందుకే ఆమెను దించేశామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ‘ఫ్లైట్స్‌లో వెళ్లేవాళ్లకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా పడితే అలా బట్టలు వేసుకొస్తే.. అవతలి వాళ్లు ఇబ్బంది పడతారు కదా. ఆమె వేషధారణ అసభ్యంగా ఉందని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం మా సిబ్బంది చేసింది. కానీ, ఆమెనే దురుసుగా ప్రవర్తించడంతో ప్రతిగా అలా చేయాల్సి వచ్చింద’ని అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. దీంతో ఆమెకే నెగెటివ్ కామెంట్లు వస్తుండడంతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు కాసేపు ప్రైవసీ పెట్టేసిందామె. -
కండలు పెంచిన సీనియర్ నటుడు, వైరల్
సాక్షి , చెన్నై: అద్భుతమైన ఫిట్నెస్తో సీనియర్ హీరోలు కుర్ర హీరోల గుండెల్లో గుబులు రేపుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ 63 సంవత్సరాల వయసులో కండలు పెంచి అటు యంగ్ హీరోలను, ఇటు నెటిజన్లను ఆశర్యపరిస్తే, తాజాగా తమిళ సూపర్ హీరో శరత్‌కుమార్ (66) తన బాడీ బిల్డింగ్‌తో అదర గొట్టేస్తున్నాడు.. 66 ఏళ్ల వయసులో కూడా తన కండలతో నెట్టింట హల్చల్ చేస్తున్నాడు. సహజంగానే బాడీ బిల్డర్ అయిన శరత్ కుమార్ లేటెస్ట్ జిమ్ ఫోటో వైరల్ అవుతోంది. (ప్రముఖ నటి ఇంట్లో అపరిచితుడి గలాటా) కాగా పృథ్వీరాజ్, బిజు మీనన్ నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యపనమ్ కోషియం' తమిళ రీమేక్‌లో శరత్ కుమార్ నటించనున్నారని తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్ మూవీలో పృథ్వీరాజ్ పాత్రను శశికుమార్, శరత్ కుమార్ బిజు మీనన్ పాత్రను పోషించనున్నారని అంచనా. మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. -
అప్పట్లో ఒకరుండేవారు..
వీరఘట్టం: గుండె మీద ఒకటిన్నర టన్ను బరువును మోపితే చిరునవ్వుతో మోసేవారు. ఉక్కు సంకెళ్లతో ఒంటిని బంధిస్తే ఊపిరితిత్తుల నిండా గాలి బిగించి రెండు క్షణాల్లో తెంపేసేవారు. ఏనుగు ఛాతీ మీదకు ఎక్కితే ఐదు నిమిషాల పాటు ఆ బరువును మోయగలిగేవారు. ఆయన పేరు కోడి రామ్మూర్తి నాయుడు. సిక్కోలు తొలితరం నిజమైన కథానాయకుడు. వెండితెరపై వెలిగిపోయిన బాహుబలికి బాబు లాంటి వారు. వందేళ్ల కిందట ఆయన చేసిన విన్యాసాలను ఈ తరం దాదాపు మర్చి పోయింది. సిక్కోలు కీర్తి బావుటాను దేశవిదేశాల్లో సగర్వంగా ఆయన ఎగరేసిన గాథలను పిల్లలకు చెప్పే కథల్లో కలపడం మర్చిపోయింది. విజయనగరాధీశులు గర్వంగా చెప్పుకునే పంచరత్నాల్లో ఒకరైన సిక్కోలు ముద్దుబిడ్డ కోడి రామ్మూర్తి 138వ జయంతి రేపు. ఈ సందర్భంగా ఆ మహానుభావుడి స్మరణలో.. బహుముఖ ప్రజ్ఞాశాలి రామ్మూర్తి నాయుడు వ్యాయామ విద్యను బోధిస్తూనే వాయు స్తంభన, జల స్తంభన విద్యను ప్రదర్శించేవారు. ఇలా వ్యాయామ, దేహ దారుఢ్యం, యోగ విద్యలను అలవోకగా చేసేవారు. ఇన్ని విద్యలు తెలిసిన రామ్మూర్తి అలానే ఉంటే ఆయన చరిత్ర ఇన్ని మలుపులు తిరిగి ఉండేది కాదు. ఆయన తర్వాత కాలంలో విజయనగరంంలో ఒక సర్కస్ కంపెనీ స్థాపించారు. ఇది ఆయన పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. (చదవండి: విధ్వంసం: నత్తలొస్తున్నాయ్ జాగ్రత్త!) 20 ఏళ్ల వయస్సులోనే.. రామ్మూర్తి తన 20 ఏళ్ల వయసులోనే గుండెల మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. సర్కస్‌లో విన్యాసాలు మరింత కఠినమైనవి. ఆయనను ఉక్కు గొలు సులతో బంధించేవారు. ఊపిరితిత్తుల నిండా గాలి పూరించి, ఆ గొలుసులను తెంచేవారు. రెండు కార్లకు గొలుసులు కట్టి, వాటిని తన భుజాలకు తగిలించుకునేవారు. కార్లను వేగంగా నడిపించేవారు. అయినప్పటికీ అవి కదిలేవి కావు. ఏనుగును ఛాతీ మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు నిలిపేవారు. అందుకే ఆయన సర్కస్‌కు విశేషమైన ఆదరణ ఉండేది. ఆసియాలోని జపాన్, చైనా, బర్మా దేశాల్లో కూడా రామ్మూర్తి నాయుడు ప్రదర్శనలు ఇచ్చి భారతదేశ కీర్తిని చాటిచెప్పారు. బర్మాలో ఆయనపై హత్యాయత్నం జరగడంతో విదేశీ ప్రదర్శనలను నిలిపివేసి స్వదేశంలోనే స్థిరపడ్డారు. (చదవండి: మార్టూరులో కలకలం..) బ్రహ్మచారి.. కండల వీరుడు కోడి రామ్మూర్తినాయుడు నిత్య బ్రహ్మచారి. స్వచ్ఛమైన శాకాహారి అయిన ఈయన ఆంజనేయస్వామి భక్తుడు. చిన్నతనంలో వీరఘట్టం సమీపంలోని రాజచెరువు వద్ద వ్యాయామం చేస్తున్న సమయంలో ఓ సాధువు ఆయనను చూసి, రామ్మూర్తిని పిలిచి మంత్రోపదేశం చేశాడట. అప్పటి నుంచి రామ్మూర్తికి దైవచింతన కలిగిందట. కోడి రామ్మూర్తినాయుడు బల ప్రదర్శన ఊహాచిత్రం అనేక అవార్డులు.. ►అప్పట పూనాలో లోకమాన్య తిలక్ కోరిక మేరకు ప్రదర్శనలిచ్చారు. దీంతో తిలక్ రామ్మూర్తికి మల్లమార్తాండ, మల్లరాజ తిలక్ బిరుదులిచ్చారు. విదేశాల్లోనూ ప్రదర్శనలు ఇవ్వాలని ప్రోత్సహించారు. ►హైదరాబాద్‌లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి జగదేకవీర బిరుదునిచ్చారు. ►అప్పటి వైస్రాయి లార్డ్ మింటో రామ్మూర్తి ప్రదర్శనలు చూ డాలని వచ్చి తనే కారును నడుపుతూ ఆ కారును రామ్మూర్తి ఆపేయడం చూసి ముగ్ధుడైపోయాడు. ►అలహాబాదులో అఖిల భారత కాంగ్రెస్ సభ జరిగింది. రామ్మూర్తి సర్కస్ అక్కడ ప్రదర్శనలిచ్చింది. జాతీయ నాయకులెందరో చూసి అభినందించారు. పండిత మదనమోహన మాలవ్యా ఎంతగానో మెచ్చుకున్నారు. ►లండన్‌లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి రామ్మూర్తి ప్రదర్శనలకు అభిమానులైపోయారు. వారే తమ రాజభవనానికి ఆహ్వానించి ‘ఇండియన్ హెర్క్యులస్’ బిరుదునిచ్చారు. ► స్పెయిన్‌లోని బుల్ ఫైట్‌లో రామ్మూర్తి పంతులు పాల్గొన్న తీరును వేలాది మంది ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ►జపాన్, చైనా, బర్మాలలో రామ్మూర్తి ప్రదర్శనలు ఎంతో వైభవంగా సాగాయి. ఇలా బయటపడింది.. ఓ పుస్తక కథనం ప్రకారం కోడి రామ్మూర్తిలో ప్రతి భాపాటవాలు బయటపడడానికి ఓ సంఘటన దోహదపడింది. అప్పట్లో ఆయన విజయనగరంలో ఉండేటప్పుడు.. అదే నగరానికి చెందిన పేర్ల రామ్మూర్తి శెట్టి ఇంటి ముందట కాలువలో ఓ ఎద్దు పడిపోయింది. ఆ జమిందారు 20 మంది బలవంతులను రప్పించి ఎద్దును బయటకు లాగడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. సరిగ్గా అదే సమయానికి అటుగా వస్తున్న రామ్మూర్తిని చూసి జమిందారు హాస్యంగా ‘అదిగో మన శాండోగారు వస్తున్నారు. మీరంతా తప్పుకోండి. తను ఒక్కరే ఆ ఎద్దును బయటపడేయగలడు’ అని అన్నారు. దీంతో రామ్మూర్తి ఆ ఎద్దు పరిస్థితిని గమనించి దాని వద్దకు వెళ్లి మెడను, వెనుక కాళ్లను, తోకను గట్టిగా పట్టుకుని ఒకే ఉదుటన బయ ట పడేశారు. దీంతో రామ్మూర్తిలోని అసలు బలం అందరికీ ఆ ఘటనతోనే తెలియవచ్చింది. అల్లరి పిల్లాడి నుంచి చిచ్చర పిడుగులా.. ఇండియన్ హెర్క్యులస్. కళియుగ భీముడు. మ ల్ల మార్తాండ.. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో బిరుదులు గడించి ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పిన బా హుబలి కోడి రామ్మూర్తి నాయుడు. వీరఘట్టం ఈయన స్వస్థలం అని చెప్పుకోవడం జిల్లా వా సులకు ఎప్పటికీ గర్వకారణం. వీరఘట్టంలోని తెలగవీధికి చెందిన కోడి వెంకన్ననాయుడు, అప్పలకొండ దంపతులకు 1883 నవంబర్ 3న రామ్మూర్తి నాయుడు జని్మంచారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రామ్మూర్తి నాయుడు తండ్రి సంరక్షణలో గారాబంగా పెరిగారు. బా ల్యంలో బడికి వెళ్లకుండా వీరఘట్టానికి సమీపంలో ఉన్న రాజ చెరువు వద్దకు రోజూ వెళ్లి వ్యాయామం చేస్తుండేవారు. దీంతో తండ్రి వెంకన్న బాల్యంలోనే కొడుకుని చదువు కోసం వీరఘట్టం నుంచి విజయనగరంలో ఉన్న అతని త మ్ముడు నారాయణస్వామి(రామ్మూర్తి పిన తండ్రి) ఇంటికి పంపించారు. అక్కడ కూడా రామ్మూర్తికి చదువు అబ్బలేదు. విద్య కంటే వ్యాయామంపైనే ఎక్కు వ ఆసక్తి చూపుతూ పలు మల్లయుద్ధం పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఇక రామ్మూర్తికి చదువు వంటపట్టదని గ్రహించిన పిన తండ్రి అతడిని మద్రాసు పంపించి వ్యా యామ కళాశాలలో చేరి్పంచారు. తర్వాత అక్కడే పీడీగా పనిచేశారు. ఆఖరులో.. ఒకసారి బర్మాలో హత్యాయత్నం జరిగాక ఆయన ప్రదర్శనలకు అడ్డు పడింది. ఎంత డబ్బు గడించారో అంత కంటే గొప్పగా దా నాలు కూడా చేశారాయన. ఆఖరి రోజుల్లో ఆయన కాలిపై రాచపుండు వచ్చి కాలే తీసేయాల్సి వచ్చింది. శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఎలాటి మత్తుమందును (క్లోరోఫామ్) తీసుకోలేదని ఓ పుస్తకంలో పేర్కొని ఉంది. ప్రాణాయామం చేసి నిబ్బరంగా ఉండిపోయారట. చివరిరోజులు బలంఘర్, పాటా్నలో కలహండి (ఒడిశా) పరగణా ప్రభువు పోషణలో ఉంటూ 1942 జనవరి 16న కన్ను మూశారు. వెండితెరపై.. కోడి రామ్మూర్తినాయుడి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీసేందుకు గత ఏడాది కొంత మంది సినిమావాళ్లు వీరఘట్టం గ్రామానికి వచ్చి ఇక్కడ పరి స్థితులపై ఆరా తీశారు. వారం రోజులు వీరఘట్టంలో ఉండి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సినీ హీరో దగ్గుబాటి రాణా కోడి రామ్మూర్తిగా నటించనున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తర్వాత ఈ విషయంపై సినిమా ప్రస్తావన రాలేదు. ఆయన మా చిన్న తాతయ్య.. రామ్మూర్తినాయుడు మా చిన్న తాతయ్య. నా చిన్నతనంలో ఆయన విన్యాసాలు, సాహసాల గురించి విన్నా ను. నేను ఆయన్ని ఏనాడూ చూడలేదు. మానాన్న గారు చెప్పేవారు. మీ చిన్న తాత దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తూ ఎంతో కీర్తి సంపాదిస్తున్నాడని. అలాంటి వ్యక్తిని మనవడిని అయినందుకు గర్వంగా ఉంది. – కోడి వెంకటరావునాయుడు, రామ్మూర్తి నాయుడి మనవడు, వీరఘట్టం పాఠ్యాంశాల్లో చేర్చాలి ఒకప్పుడు 1985–1995 మధ్య కాలంలో కోడి రామ్మూర్తినాయుడు జీవిత చరిత్రపై తెలుగులో ఒక పా ఠ్యాంశం ఉండేది. కాలక్రమేణా సిలబస్ మారడంతో ఆ పాఠ్యాంశాన్ని తొలగించారు. ఇలాంటి మహానుభావుల జీవిత చరిత్రలు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాయి. ప్రభుత్వం ఆయన ఘనతను గుర్తించి సముచిత స్థానం కలి్పంచాలి. – ఎస్.వి.ఎల్.ఎన్ శర్మయాజీ, యజ్ఞకర్త, వీరఘట్టం ఆయన ఖ్యాతిని ప్రభుత్వం గుర్తించాలి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పిన మహానుభా వుని చరిత్రను భారత ప్ర భుత్వం గుర్తించాలి. వీరఘట్టంకు చెందిన ప్రసిద్ధ మల్లయోదుడు రామ్మూర్తి నాయుడు జీవిత చరిత్ర నేడు ఎందరికో ఆదర్శం. – డాక్టర్ బి.కూర్మనాథ్, రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్, వీరఘట్టం -
కన్న కల నిజం చేసుకున్నాడు
మనోజ్ పాటిల్ కల కన్నాడు. 24 సంవత్సరాల వయసులో ‘మిస్టర్ ఇండియా మెన్స్’ టైటిల్ గెల్చుకొని తన కలను నిజం చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీ బిల్డింగ్ (ఐఎఫ్‌బిబి)లోనూ తన సత్తా చాటాడు. భవిష్యత్‌కు బంగారుబాట పడింది. బాడీ బిల్డర్, అథ్లెట్, మోడల్, ట్రైనర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ముంబైలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మనోజ్ 13 సంవత్సరాల వయసు నుంచే సొంతకాళ్ల మీద నిలబడడం నేర్చుకున్నాడు. పేపర్‌బాయ్‌గా చేశాడు. కార్లు శుభ్రం చేశాడు. పాలపాకెట్లు అమ్మాడు. 16 సంవత్సరాల వయసులో జిమ్ మీద ప్రేమ పెంచుకున్నాడు. కండలు పెంచాడు. 18 సంవత్సరాల వయసులో బాడీ బిల్డింగ్ బరిలోకి దిగాడు. ఒక్కటీ గెలవలేదు. అయినా నిరాశపడలేదు. ఆ తరువాత మాత్రం విజయాలు వరుస కట్టాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు విజయాలు సొంతం చేసుకున్నాడు. ‘బాడీబిల్డింగ్‌ను కెరీర్‌గా మలుచుకోవాలనుకునేవారికి కావలిసింది బోలెడు డబ్బు కాదు బోలెడు ఓపిక’ అంటున్న మనోజ్ పాటిల్, ఆరోగ్యస్పృహ విషయంలో యువతకు విలువైన సలహాలు ఇస్తున్నాడు. -
బామ్మ ఫిట్‌నెస్‌కు నెటిజన్ల ఫిదా..
-
బామ్మ ఫిట్‌నెస్‌కు నెటిజన్ల ఫిదా..
టొరంటో : 73 ఏళ్ల మహిళ అంటే శక్తి ఉడిగిన స్ధితిలో మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారనుకునే వారిని ఈ బామ్మ షాక్‌కు గురిచేస్తుందనే చెప్పాలి. కెనడాలోని ఒంటెరియాకు చెందిన 73 ఏళ్ల వృద్ధురాలు జాన్ మెక్‌డొనాల్డ్ కండలు తీరిన దేహంతో ఔరా అనిపిస్తున్నారు. గతంలో అధిక బరువున్న జాన్ హైబీపీ, కొలెస్ర్టాల్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకునేవారు. 198 పౌండ్ల బరువుండే జాన్ మెక్‌డొనాల్డ్ నిత్యం కసరత్తులు, వ్యాయామాలతో ఏకంగా 50 పౌండ్లు తగ్గి కండలు తిరిగిన దేహాన్ని సొంతం చేసుకున్నారు. View this post on Instagram 3 years ago I began this long, slow journey and now I realize that there really isn’t any end to it. Each day I move in a direction based on my choices. Each month is a new milestone. Each year I seem to have changed so completely I think I can’t change any more and yet I do.💕💕 At this point, I truly realize that we are limitless. At any moment we can make a decision to change. No matter how difficult or challenging life is, we must remain steadfast in our aim and keep inching forward. When I got started I never imagined I’d be where I am today. I just wanted to get my health back and get off my medication. Each door we step through leads to another door and then another. I hope you all keep choosing to grow! To learn to love yourself, take the best care of yourself, and dare to dream and love with your whole heart again.🙏🙏 . Pink outfit by @womensbest . . #transformation #hope #justdoit. A post shared by Joan MacDonald (@trainwithjoan) on Feb 8, 2020 at 1:10pm PST బరువులు ఎత్తడంతో పాటు తాను జిమ్ చేస్తున్న ఫోటోలతో ఆమె ఫిట్‌నెస్‌పై ఏకంగా ఇన్స్టాగ్రాం పేజ్‌ను నిర్వహిస్తున్నారు. తాను సమతుల ఆహారం తీసుకోవడంతో పాటు అమినో యాసిడ్స్, ప్రొటీన్ షేక్స్ వంటి సప్లిమెంట్స్‌ను తీసుకుంటానని ఆమె చెబుతున్నారు. ఈ బామ్మ ఇన్‌స్టా పేజీకి ఇప్పుడు 5,00,000 మంది ఫాలోయర్లు ఉండటంతో ఈ సీనియర్ బాడీబిల్డర్ సోషల్ మీడియా సెలబ్రిటీ అయ్యారు. View this post on Instagram Transformation isn’t just about losing weight. Transformation can be about so much more! Certainly this has been my long, slow journey.💕💕 On the left I was visiting my own mother in a nursing home and seeing her health rapidly deteriorating. It absolutely broke my heart, and yet it was also frustrating to see her just accept her fate and refuse to fight to make things better. When my own daughter reached out to me and offered to help, it was like coming full circle. I was at a real cross roads. Do I follow in the footsteps of my mother, or do I try to break free of the cycle and create a different outcome for myself. I know so many of you want to know about the diet and the training, but what I can’t stress enough to you, is the importance of developing your mind. Throughout the past 3 years I have been deeply challenged, many times in tears 😭,and feeling like I was so slow to learn, BUT I did not give up. 👵🏼👵🏼. Since I started this journey 3 years ago I’ve learned to use an I-phone, I’ve learned to use apps (though they still seem complicated to me!) I’m even learning a new language (Spanish!). I’ve learned to be more confident in front of a camera and trust myself at interviews, and I’ve just gained so much more confidence and optimism about making my life better in general. Even my relationship with my husband has improved because I’m just a happier person. 🥰 That’s a pretty wonderful place to be this late in the game. 🙏 So, for those of you think more about losing weight, I am telling you, sometimes the weight we need to lose is more than the pounds on the scale. Sometimes we need to lose our negative self-talk, our feelings of failure, our lack of confidence in ourselves and in the world. Sometimes it’s the internal transformation that is its own best reward. I hope you learn to choose to be happy! With love Joan 💕 A post shared by Joan MacDonald (@trainwithjoan) on Feb 16, 2020 at 6:25am PST చదవండి : వందేళ్ల వృద్ధురాలి బర్త్‌డే విష్ తెలిస్తే షాక్! -
బహు దారుఢ్య ప్రజ్ఞాశాలి
గుండె కలవాడని మగవాణ్ణి అంటారు. కండ కలిగి ఉండటమూ మగవాడి పనే అంటారు. గుండె కండె మగవాడి హక్కా? స్త్రీకి కూడా గుండె ఉంటుంది. ఆమె కండ బిగించితే అందులోని దారుఢ్యం వజ్రసమానం అవుతుంది. మానసికంగా శారీరకంగా స్త్రీలు దృఢంగా ఉన్న సమాజమే ఆరోగ్యకరమైన సమాజం. కిరణ్ డీమ్బ్లా హైదరాబాద్‌లో ఉంటూ దేశంలోని సెలబ్రిటీల దృష్టిని ఆకర్షిస్తోంది. పెంచితే ఆమెలా కండ పెంచాలని స్త్రీలు పురుషులు అనుకుంటున్నారు. జీవిస్తే ఆమెలా బహుముఖ ప్రావీణ్యాలతో జీవించాలనుకుంటున్నారు. ఆమె పరిచయం ఇది. అద్దంలో చూసుకుంది.. ఉలిక్కిపడింది. నేనేనా? కాలేజీరోజుల్లో స్టేజ్ మీద పాటలు పాడే కాలాన్ని జ్ఞాపకం చేసుకుంది. సన్నటి నాజూకు రూపం గుర్తొచ్చింది. ఇదేంటి? ఇంతలా మారిపోయానా? అంటే .. పదేళ్లుగా తన గురించి ఆలోచించుకోవడమే మానేసింది.. శ్రద్ధే పెట్టుకోలేదు. పర్యవసానం 75 కేజీల బరువు. అద్దంలో ఇమడని ఆకారం. బాధేసింది ఆమెకు. పెళ్లయిన మరుక్షణం నుంచి ఇంటికోసం అంకితమైపోయింది. ఉదయం అయిదు నుంచి రాత్రి పన్నెండు వరకు ఉమ్మడి కుటుంబానికి అసౌకర్యం కలగకుండా రెక్కలతో కాపు కాసింది. అలసిపోయి నిద్రలో విశ్రాంతి తీసుకుంటున్నా తెల్లవారి మొదలయ్యే బాధ్యత కలతగా మారి కలవరపెట్టేది. ఆ విశ్రాంతిలేమో.. మరేమో కాని బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. అది తెలిసినప్పుడే అదిగో అలా అద్దం ముందుకు వచ్చింది మరిచిపోయిన తనను తిరిగి పరిచయం చేసుకోవాలనుకుంది. ఆమె పేరు కిరణ్ డీమ్బ్లా. అసలు ఎవరు ఆమె? 45 ఏళ్ల మహిళా వెయిట్ లిఫ్టర్. ఫిట్నెస్ ట్రైనర్. సిక్స్‌ప్యాక్ సాధించిన వనిత. పర్వతారోహకురాలు. గాయని. ఫొటోగ్రాఫర్. ఆ బహుముఖ ప్రజ్ఞగురించి...కిరణ్ హైదరాబాద్ వాసి. ఒకప్పుడు ఆమె సాధారణ గృహిణి. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు భార్య.. ఇద్దరు పిల్లల అమ్మ. అదే ఆమె అస్తిత్వం. భర్త, పిల్లలు, ఇల్లే ప్రపంచం అయిన అప్పటి కిరణ్ కూడా చాలామంది ఇల్లాళ్లలాగే తన గురించి పట్టించుకోవాలనే ఆలోచనేరాక వ్యాయామం అనే మాటే తెలియక లావైపోయింది. అనారోగ్యానికి తీసుకుంటున్న మందులూ ఆమె బరువును మరింత పెంచాయి. ఇంట్లోనే ఉంటే దిగులు ఎక్కువవుతోంది. వ్యాకులతా వెయిట్‌ను పెంచుతోంది. పోనీ బయటకు వెళ్లి ఏమన్నా చేద్దామంటే అప్పటికీ పిల్లలిద్దరూ చిన్నవాళ్లే. ఇరుగుపొరుగు ద్వారా యోగా గురించి తెలుసుకుంది. యోగా తరగతులకు వెళ్లడం మొదలుపెట్టింది. కొన్నాళ్లు గడిచేసరికి కొంత ఫలితం కనపడింది. తన మీద తనకు నమ్మకమూ పెరిగింది. యోగా కొనసాగిస్తూనే ఈత నేర్చుకోవాలనీ నిశ్చయించుకుంది. కాని అనుకున్నంత సులువు కాలేదు. తొలుత వారం పదిరోజులు నీళ్లను చూసి భయపడ్డంతోనే సరిపోయింది. అయినా పట్టువదలేదు కిరణ్. ఈతా నేర్చేసుకుంది. స్విమ్మింగ్‌కి వెళ్తున్నప్పుడే జిమ్ గురించి చెప్పారు అక్కడి ఫ్రెండ్స్. జిమ్‌లో చేరింది. ఇవన్నీ చేస్తూ ఉత్సాహంగా కనపడుతున్న భార్యను చూసి సంతోషపడ్డాడు ఆమె భర్త. పైగా ఆమె ఆరోగ్యంలో వచ్చిన మార్పూ గ్రహించాడు. కాబట్టి దేనికీ అడ్డుచెప్పలేదు. తెలియని పనిని భుజాన వేసుకోదు. భుజాన వేసుకున్న పనిని చేసేదాకా వదిలిపెట్టని నైజం కిరణ్ది. ఆమె దారికి భర్త అడ్డురాకపోవడానికి ఇదీ ఒక కారణమే. అదీగాక ఉద్యోగరీత్యా రకరకాల షిఫ్ట్‌లు, ప్రయాణాలతో భర్త ఎప్పుడూ బిజీయే. పిల్లలను చూసుకుంటూ మిగిలిన టైమ్‌ను ఈ రకంగా వినియోగించుకోవడం మొదలుపెట్టింది కిరణ్. ఫిట్నెస్కి ముందు కిరణ్... సెలబ్రిటీ ట్రైనర్... బాడీ బిల్డర్ పొద్దున నాలుగింటికే జిమ్‌కు వెళ్లిపోయి పిల్లలు నిద్రలేచే టైమ్‌కల్లా ఇంటికి వచ్చేసేది. పిల్లలను స్కూల్లో పంపి మళ్లీ కసరత్తు చేసేది. ఆరేడునెలలు తిరిగేసరికి ఈ శ్రమ ఆమెను 24 కిలోల బరువు తగ్గేలా చేసింది. ఆ ఉత్సాహాన్ని కొనసాగించింది. దాంట్లోనే కెరీర్ వెదుక్కునే దారి కోసం వెదికింది. ఆన్లైన్లో జిమ్ ట్రైనర్‌గా శిక్షణ తీసుకుంది. 2008లో బేగంపేట్ (హైదరాబాద్)లో సొంతంగా జిమ్‌ను ప్రారంభించింది. కిరణ్ వర్కవుట్స్ గురించి ఇతర జిమ్ ట్రైనర్స్ ద్వారా టాలీవుడ్ సెలబ్రెటీల చెవిన పడింది. రామచరణ్‌కు తెలిసి ఉపాసన వరకూ వెళ్లింది. దాంతో ఉపాసన.. కిరణ్ సమక్షంలో ఎక్సర్సైజులు మొదలుపెట్టింది. పోల్చుకోలేనంత స్లిమ్ అయిపోయింది ఉపాసన. అలా తమన్నా, అనుష్కశెట్టి, జయప్రద, ప్రభాస్, రాజమౌళి, ప్రకాశ్ రాజ్, తమిళ నటులు సూర్య, ఆర్యలకూ పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేసింది కిరణ్. తమన్నా కోసం ఇప్పటికీ పనిచేస్తోంది. సూర్యతో కిరణ్ డీమ్బ్లా సిక్స్‌ప్యాక్.. బ్యూటిఫుల్ బాడీ ‘ఫిట్నెస్ సాధించాను. కాని అదొక్కటే సరిపోదు కదా’ అనుకొని సిక్స్ ప్యాక్‌కి సిద్ధం కావాలని నిర్ణయించుకుంది కిరణ్. ఇది 2012 నాటి సంగతి. అనుకోవడమే తడవుగా గట్టి ప్రయత్నమూ మొదలుపెట్టింది. ఎనిమిది నెలల్లో సిక్స్ ప్యాక్ సాధించి చూపించింది కిరణ్. తర్వాత కొంతకాలానికే అంటే 2013లో హంగేరీలో వరల్డ్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఆ పోటీలకు డైరెక్ట్ ఎంట్రీ పొందిన ఏకైక మహిళా పోటీదారు కిరణ్ కావడం విశేషం. ఆమె ఘనత కూడా. అయితే ఇంకో పదిహేనురోజుల్లో ఆ పోటీలున్నాయనగా ఆమె కుటుంబంలో ముగ్గురు బంధువులు చనిపోయి మానసికంగా కుంగిపోయే పరిస్థితి ఎదురైంది. భర్త అండగా నిలిచాడు. వెన్నుతట్టాడు. పోటీల్లో పాల్గొంది. ఆరవ స్థానంలో నిలిచింది. ‘బ్యూటీఫుల్ బాడీ’ టైటిల్‌ను గెలుచుకుంది. డీజే.. కిరణ్‌లోని ఈ కళను చెప్పుకునే ముందు ఆమె నేపథ్యం చెప్పుకోవాలి. కిరణ్ సొంతూరు ఆగ్రా. సంప్రదాయ ఉమ్మడి కుటుంబంలోని ఆడపిల్ల. ఆమె తల్లి, మేనత్త, తోబుట్టువులు అందరికీ సంగీతం వచ్చు. ఆ ప్రభావంతో ఊహతెలియకముందే సరిగమల సాధన మొదలుపెట్టింది. ఊహ వచ్చేసరికి ప్రదర్శనలు ఇవ్వడమూ ప్రారంభించింది. హిందుస్థానీ సంగీతానికి తోడుగా తబలా వాద్యాన్ని, కథక్ నృత్యాన్నీ నేర్చుకుంది. ఎమ్మే మ్యూజిక్ చేసింది. ‘‘కాని పెళ్లితో వాటన్నిటినీ అటకెక్కించాల్సి వచ్చింది’’ అంటుంది కిరణ్ నవ్వుతూ. అలా అటకెక్కిన సంగీతం 2013 తర్వాత ఆమె గొంతులో పడింది. తమన్నాతో కిరణ్ డీమ్బ్లా సమకాలీన ఒరవడినీ ఒడిసిపట్టి... డీజేయింగ్లో ట్రైనింగ్ తీసుకొని డిస్కో జాకీగా మారింది. పాపులర్ అయింది. అక్కడితో ఆగిపోతే ఈ స్టోరీ ఇక్కడికే ఎండ్ అయ్యేది. వీటికి సమాంతరంగా మౌంటెనీరింగ్నూ ట్రాక్‌లో పెట్టింది. అయిదేళ్లుగా ప్రతియేడాది పర్వతారోహణకు వెళ్తుంది. ఇప్పటికే హిమాలయాలకు చెందిన అయిదు భిన్న ప్రాంతాల నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకూ వెళ్లింది కిరణ్. ఒక మజిలీ చేరగానే మరో కొత్త ప్రయాణానికీ సన్నద్ధమవడం కిరణ్ తత్వం. అలా ఇప్పుడు ఫొటోగ్రఫీని చేర్చుకుంది. నేర్చుకుంది. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా కెమెరాను చేతబట్టుకుంది. ప్రభాస్‌తో కిరణ్ డీమ్బ్లా నేను కండలు పెంచుతుంటే వింతగా చూసినవారున్నారు. నన్ను కామెంట్ చేసినవాళ్లలోఆడవాళ్లూ ఉన్నారు. అలాంటి మాటలకు విలువివ్వాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎవరేమనుకుంటారో అని నా ప్రయాణాన్ని ఆపను. నేను చేసిన .. చేసే ప్రతిపని నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పెంచుతోంది. నా పిల్లలు నన్ను చూసి గర్వపడ్తారు. ముందు మనింట్లో వాళ్లకు మనం స్ఫూర్తినివ్వాలి. తర్వాత సమాజానికి. మార్పు ఇంటి నుంచే మొదలవుతుంది. ఆడపిల్లలు ఎవరికివారే ధైర్యం నింపుకోవాలి. సెల్ఫ్డిఫెన్సివ్గా తయారుకావాలి. తల్లిదండ్రులు అలా పెంచాలి. మానసికస్థైర్యం ఇవ్వాలి. అలాగే అమ్మాయిలు కూడా తమతో సమానమనే స్పృహతో అబ్బాయిలను పెంచాలి. – కిరణ్ డీమ్బ్లా -
బాడీ బిల్డర్స్‌కు మంత్రి తనయుడి చేయూత
మారేడుపల్లి : చైనా దేశంలోని మంగోలియాలో సెప్టెంబర్ 12 నుండి 18 వరకు జరుగనున్న మిస్టర్ ఏషియన్, మిస్టర్ వరల్డ్ బాడీబిల్డింగ్ పోటీలకు ఎంపికైన బాడీ బిల్డర్స్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్ చేయూతనిచ్చారు. కార్ఖానా కాకగూడకు చెందిన కిరణ్‌కుమార్ సాధించిన పతకాలతో పాటు మిస్టర్ వరల్డ్ బాడీబిల్డింగ్ పోటీల ఎంపికకు సంబంధించి ‘సాక్షి’ దినపత్రికలో ‘చేయూతనందిస్తే సత్తా చాటుతా’ అనే కథనం సోమవారం ప్రచురితమైంది. తలసాని సాయికిరణ్ యాదవ్ స్పందించి కిరణ్‌కుమార్‌ను మంగళవారం తన కార్యాలయానికి పిలిపించుకుని వివరాలను సేకరించారు. పోటీలకు ఎంపికైన కిరణ్‌కుమార్‌తో పాటు మహ్మద్ నిజాముద్దీన్లకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. మిస్టర్ వరల్డ్ బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంటున్న వారికి రానుపోను 6 లక్షల రూపాయలు చెల్లించి విమాన టిక్కెట్లను బుక్‌చేశారు (ఒక్కొక్కరికి 3 లక్షలు చొప్పున). ఈ సందర్బంగా సాయికిరణ్‌యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు చేయూతనందిస్తుందని ఆయన అన్నారు. -
కేసరి లావణ్య @అంబర్‌పేట
సాక్షి, హైదరాబాద్: శరీర దారుఢ్య పోటీల్లో స్త్రీల ప్రాతినిథ్యం పెరుగుతోంది. కఠిన కసరత్తులతో కండలు పెంచి బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తా చాటుతున్నారు. బాడీ పవర్ యునైటెడ్ కింగ్డమ్(యుకె) సంస్థ ఇటీవల నిర్వహించిన ఫిట్ ఫ్యాక్టర్ హైదరాబాద్ పోటీల్లో నగరంలోని అంబర్‌పేటకు చెందిన కేసరి లావణ్య ఎంపికయ్యారు. ఈ నెల 23న నగరంలోని సోమాజిగూడలో గల జయగార్డెన్‌లో స్త్రీలు, పురుషుల విభాగంలో ఈ పోటీలు జరిగాయి. మహిళా విభాగంలో హైదరాబాద్ నుంచి ఇద్దరు, అస్సాం నుంచి ఒకరు పాల్గొన్నారు. ఈ పోటీలో పాల్గొన్న ముగ్గురు మహిళలకు జడ్జీలు కుమార్ మన్నాప్, డాన్ లయన్, బాలకృష్ణ, భరత్తేజ్ల సమక్షంలో పోటీలు జరిగాయి. ఈ పోటీలలో కేసరి లావణ్య ప్రథమ స్థానానికి ఎంపికైంది. ఈ సందర్భంగా విలేకరులతో కేసరి లావణ్య మాట్లాడుతూ.. ఫిట్ ప్యాక్టర్ పోటీలో తాను ప్రథమ స్థానంలో రావడం సంతోషంగా ఉందన్నారు. గతంలో జాతీయ స్థాయిలో స్క్వాడ్స్ ఫిట్నెస్ సంస్థ ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించిన జాతీయ స్థాయి ట్రాన్స్ఫర్ మిషన్ చాలెంజీ పోటీలలో మిసెస్ ఇండియా డివోటెడ్ 2017 రన్నర్‌గా నిలిచానని తెలిపారు. ఫిట్‌నెస్‌లో జాతీయ స్థాయిలో అవార్డులు గెలిచేందుకు తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. తాను ఫిట్నెస్ రంగంలో రాణించేందుకు తన భర్త శ్రీకాంత్ ప్రోత్సాహం ఎంతో ఉపయోగపడిందన్నారు. -
మిస్టర్ బాడీబిల్డర్
ఐదు పదుల వయసులోను తరగని ఉత్సాహం త్వరలో రెండు అంతర్జాతీయ పోటీలకు పయనం స్వయంకృషికి నిదర్శనం.. కోలారు రవి కోలారు జిల్లాలో నిత్యం కరువు ఉన్నా చదువులు, ఆటలు తదితర అనేక రంగాల్లో ప్రతిభావంతులకు మాత్రం కొదవ లేదు. అలాంటి కోవకు చెందిన వారే కోలారు నగరానికి చెందిన అంచె వెంకటరమణప్ప రవి ( ఏ వి రవి). 52 యేళ్ల వయసులో కూడా ఆయన త్వరలో జరగబోయే మిస్టర్ ఒలింపియా (అమెరికా), మిస్టర్ ఆసియా (ఫిలిప్పీన్స్) పోటీలకు భారత దేశ ప్రతినిధిగా ఎంపిక కావడం ఆయన ప్రతిభకు నిదర్శనంగా చెప్పాలి. పేద కుటుంబంలో పుట్టినా స్వయంకృషితో వివిధ రంగాల్లో ఎదగడం విశేషం. కేంద్ర ఆదాయపు పన్ను శాఖలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రవికి బాడీబిల్డింగ్ అంటే చిన్నప్పటి నుంచే ఎక్కడ లేని ఆసక్తి. ఆయన బెంగుళూరులో జిమ్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ఏకలవ్య శిక్షణతో స్వయం శక్తితో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. పేదరికంలో ఉన్నా అంది వచ్చిన అవకాశాలను సద్విని యోగం చేసుకుని అంచెలంచెలుగా ఎదిగారు. నాడు కోలారులో ఎలాంటి అధునాతన జిమ్‌లు లేకున్నా నగరంలోని గరడి వ్యాయామశాలలోనే ప్రాక్టీస్ చేస్తూ తన శరీరాన్ని ఉక్కులాగా మలుచుకున్నారు. వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేశారు. అనంతరం బాడి బిల్డింగ్ పై మక్కువ చూపిన రవి వెనక్కు తిరిగి చూడలేదు. తొలుత బెంగుళూరు విశ్వ విద్యాలయంలో మిస్టర్ బెంగుళూరుగా ఎన్నికై తరువాత జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు సొంతం చేసుకుని ఇంతవరకు 108 పథకాలను సాధించారు. తాను పాల్గొన్న ఏ పోటీలోను ఓటమి ఎదురు కాలేదని గర్వంగా చెబుతారు రవి. అనంతరం మిస్టర్ ఆసియా పోటీలో పాల్గొనే భారత జట్టుకు కోచ్‌గా విధులు నిర్వహించి ఆసియా ఛాంపియన్ షిప్‌ను సాధించారు. 2016లో బెస్ట్ కోచ్ అవార్డును కూడా అందుకున్నారు. సినిమాలలో నటన రవి ఇంతవరకు తెలుగు, తమిళ, కన్నడలో దాదాపు 128 కి పైగా సినిమాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులకు బాడీబిల్డింగ్ కోచ్‌గా కూడా పనిచేశారు. అవార్డులు అనేకం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏకలవ్య అవార్డు, స్టేట్ బెస్ట్ స్పోర్ట్స్ మెన్ అవార్డు, దసరా అవార్డు, కెంపేగౌడ అవార్డులను రవి అందుకున్నారు. జాతీయ స్థాయిలో రెండు సార్లు భారత శ్రేష్ట అవార్డు, భారతశ్రీ అవార్డు, భారత్‌కుమార్ అవార్డు, భారత కిశోర్ అవార్డు, దక్షిణ్ భారత్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రభుత్వాల ప్రోత్సాహం కరువైంది: రవి నిత్యం 8 గంటల వ్యాయామం చేస్తున్న రవి తాను డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకమని అంటున్నారు. సహజ సిద్దమైన శాఖాహారం ద్వారానే ఉత్తమ ఆరోగ్యంతో దేహధారుఢ్యం కలిగి ఉండవచ్చునని చెబుతున్నారు. క్రీడా విభాగం లో ఆదాయపు పన్ను శాఖలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం లభించడం మినహాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగిన ప్రోత్సాహం లేదని రవి అంటున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే బాడీ బిల్డింగ్ అకాడమిని స్థాపించి ఎంతో మందిని తయారు చేయవచ్చునని అంటున్నారు. -
నాడు హెచ్ఐవీ పేషెంట్.. నేడు బాడీ బిల్డర్
► ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు స్ఫూర్తిదాయకం ► పట్టుదలతో హెచ్ఐవీని జయించిన వైనం ► మిస్టర్ మణిపూర్, మిస్టర్ సౌత్ ఏషియా నిలిచిన మణిపూర్ వాసి సాక్షి, మణిపూర్: సంకల్పం మనిషిని ఎన్ని మెట్లు అయినా ఎక్కిస్తుంది.. చేరుకోలేని విజయ తీరాలకు చేరుస్తుంది.. ఈ మాటకు నేడు సజీవ సాక్ష్యంగా నిలిచాడు మణిపూర్‌కు చెందిన బాడీ బిల్డర్ ప్రదీప్ కుమార్ సింగ్. 2007లో మిస్టర్ మణిపూర్‌గా, 2012లో మిస్టర్ సౌత్ ఏషియా టైటిల్ గెలిచిన ప్రదీప్ నిజ జీవితంలో ఒక హెచ్ఐవీ పేషెంట్. 2000 సంవత్సరంలో అనుకోకుండా రక్త పరీక్షలు చేయించుకోవడంతో తనలో ఉన్న ప్రాణాంతక వ్యాధి బయట పడిందని ఆయన తెలిపాడు. హెచ్ఐవీ అనే విషబీజం తనలో ఉన్నా.. దానికెప్పుడు భయపడలేదని.. దానిని జయించేందుకు మార్గాలు అన్వేషించానని నేడు గర్వంగా చెబుతున్నాడు. బాడీ బిల్డర్‌గా.. హెచ్ఐవీ ఉందని తెలిశాక ప్రదీప్కుమార్ని బంధువులు, తెలిసిన వారు, స్నేహితుల, గ్రామస్థులు దాదాపుగా అందరూ వెలివేసినంత పనిచేశారు. ఈ పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం కోల్పోని ప్రదీప్ తన సోదరి సూచనతో బాడీ బిల్డింగ్వైపు దృష్టి సారించాడు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం, క్రమపద్దతిలో ఆహారం తీసుకోవడంతో శరీరాన్ని పెంచుకున్నాడు. పట్టుదలతో.. హెచ్ఐవీని జయించడంలో శారీరక ఆరోగ్యానిది ప్రధానపాత్ర కావడంతో తీసుకునే ఆహారం మొదలు.. చేసే వ్యాయామం.. అందుకు తగ్గ విధంగా బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజులను పట్టుదలతో చేసేవాడు. తనలో ఒక వైరస్ ఉందన్న విషయాన్ని సైతం మర్చిపోయి బాడీ బిల్డింగ్ మీదే దృష్టి నిలిపాడు. ఆ క్రమంలోనే 2007లో మిస్టర్ మణిపూర్‌గా, 2012లో మిస్టర్ సౌత్ ఏషియాగా నిలిచాడు. 17 ఏళ్లుగా... ప్రదీప్ కుమార్‌కు హెచ్ఐవీ బయటపడి సరిగ్గా 17 సంవత్సరాలు.. ఇన్నేళ్లలో అతను చిన్నచిన్న అనారోగ్యాలను కూడా గురికాలేదు. తనలాగే హెచ్ఐవీ బాధితులంతా.. మనో నిబ్బరంతో, పట్టుదలతో శరీరాన్నికాపాడుకుంటే వ్యాధిని జయించడం పెద్ద కష్టమేం కాదని ప్రదీప్ చెబుతున్నాడు. హెచ్ఐవీ సోకితే జీవితం ముగిసిపోయిందన్న మాటకు ముగింపు పలకడమే తన లక్ష్యం అని పేర్కొన్నాడు. ఫిజికల్ ట్రయినర్‌గా.. ప్రస్తుతం ప్రదీప్ కుమార్ వయసు 45 ఏళ్లు. బాడీ బిల్డర్‌గా అతను సాధించిన విజయాలను దృష్టిలో పెట్టుకుని మణిపూర్ ప్రభుత్వం అతడిని యువ క్రీడాకారులకు ఫిజికల్ ట్రయినర్‌గా నియమించింది. అంతేకాక హెచ్ఐవీ/ఎయిడ్స్‌కు అతన్ని ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం చేసింది. -
బాడీ బిల్డర్ అయ్యప్పకు ఆర్థిక సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన బాడీ బిల్డర్ అయ్యప్పకు ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ మేరకు శనివారం శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన లక్ష రూపాయల చెక్‌ను ఆయన చాంబర్లో అయ్యప్పకు అందజేశారు. పేద కుటుంబానికి చెందిన అయ్యప్ప భవిష్యత్తులో ప్రపంచస్థాయి బాడీ బిల్డర్‌గా ఎదిగి రాష్ట్రానికి పతకాలు సాధించి పెట్టాలని ఈ సందర్భంగా శాట్స్ చైర్మన్ కోరారు. అయ్యప్ప 2016 కర్ణాటకలో జరిగిన జాతీయ సీనియర్ మిస్టర్ ఇండియా పోటీల్లో 75 కేజీల విభాగంలో రజత పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలోని మియామిలో జరుగనున్న మిస్టర్ వరల్డ్ పోటీల కోసం అతను సాధన చేస్తున్నాడు. తనను ప్రోత్సహిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వానికి, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డికి ఈ సందర్భంగా అయ్యప్ప కృతజ్ఞతలు తెలిపాడు. -
ఈ కండల రాణి మిస్ ఇండియా!
ఉక్కు నరాలు, ఇనుప కండలు, వజ్ర సంకల్పం.. ఇవే యువతకు కావాలంటాడు స్వామి వివేకానంద. ఆయన దారిలోనే సాగుతున్నట్టు కనిపిస్తోంది 36 ఏళ్ల యాష్మిన్ మనాక్. అందమైన తన దేహాన్ని సిక్స్ ప్యాక్ బాడీగా మార్చిన ఆమె తాజాగా మిస్ ఇండియా 2016గా ఎంపికైంది. అయితే ఆమెకు ఈ పురస్కారాన్ని ఇచ్చింది ఏ అందాల పోటీనో కాదు. ఈ కండల లేడీని గౌరవించి ఇండియన్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్ నెస్ ఫెడరేషన్ (ఐబీబీఎఫ్ఎఫ్) ఈ టైటిల్ ను ప్రదానం చేసింది. తాను కూడా అందరిలాంటి అమ్మాయినేనని, కానీ ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధ్యానమిస్తానని చెప్తోంది యాష్మిన్. గత 17 ఏళ్లుగా వెయిట్ లిఫ్టింగ్ సాధన చేసిన ఈ అమ్మడు మూడేళ్ల నుంచి బాడీ బిల్డింగ్ మీద దృష్టి పెట్టింది. అకుంఠిత దీక్షతో ఆమె చేసిన కృషి ఫలంగా.. ఐబీబీఎఫ్ఎఫ్ ఇటీవల యూపీలోని బులంద్ షహర్ లో నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీలో ఆమెను రెండు పురస్కారాలు వరించాయి. వుమెన్ ఫిజిక్యూ కేటగిరీలో, వుమెన్ ఫిట్ నెస్ కేటగిరిలో రెండు బంగారు పతకాలను ఆమె సొంతం చేసుకుంది. ఢిల్లీలో జన్మించిన యాష్మిన్ కు చిన్నప్పటి నుంచి ఆటలంటే ప్రాణం. 'ఒక అమ్మాయిగా బాడీబిల్డింగ్ కెరీర్ ను ఎంచుకోవడం చాలా పెద్ద సవాలే. ఇది కేవలం పురుష ఆధిపత్యమున్న క్రీడ అన్న భావన ఉంది. కానీ, నా కుటుంబసభ్యులు, స్నేహితులు ఎంతగానో అండగా నిలిచారు. కొంతమంది నిరుత్సాహ పరిచినవాళ్లు ఉన్నారనుకోండి. కానీ వాళ్లను నేను పట్టించుకోలేదు' అని చెప్తోంది యాష్మిన్. సరికొత్త సవాళ్లను స్వీకరించడం తనకు ఇష్టమని, అందుకే బాడీ బిల్డింగ్ ను ఎంచుకున్నట్టు తెలిపింది. 'మామూలుగా ఉండటం బోరింగ్. పాతనమ్మకాలను బద్దలు కొట్టడం నాకు ఇష్టం. నేను బుల్లెట్ బైకును నడుపుతాను. పవర్ లిఫ్టింగ్ చేస్తాను. మగవారి కన్నా మరింత కండలు పెంచడాన్ని ఇష్టపడతాను' అని అంటున్నది యాష్మిన్. వచ్చే సెప్టెంబర్ లో భూటాన్ లో జరుగనున్న ఆసియన్ బాడీబిల్డింగ్ అండ్ ఫిజిక్యూ చాంపియన్ షిప్ 2016లోనూ తన సత్తా చాటేందుకు ఆమె ప్రస్తుతం పూర్తిస్థాయిలో సిద్దమవుతున్నది. ఆల్ ది బెస్ట్ యాష్మిన్ మనాక్. -
కండల వీరుడు.. ఎన్నికల యోధుడు
కండలు తిరిగి గండర గండడిలా కనిపిస్తున్న ఈ వీరుడిని చూశారా? ఈయనేదో వెయిట్ లిఫ్టరో, బాడీ బిల్డరో అనుకుంటున్నారా? అవి మాత్రమే కాదు.. ప్రత్యర్థులకు తన కండలతో పాటు తన హిస్టరీతో దడ పుట్టిస్తున్న పార్లమెంటేరియన్ కూడా. ఈయన పేరు కేసీ సింగ్ బాబా. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ - ఉధం సింగ్ నగర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు ఎంపీగా నెగ్గారు. ముచ్చటగా మూడోసారి కూడా అక్కడినుంచే పోటీ చేస్తున్నారు. కేవలం అక్కడి ప్రత్యర్థులు మాత్రమే కాదు.. ఎంపీలుగా పోటీ చేస్తున్నవారందరిలోకీ అత్యంత ఫిట్నెస్ ఉన్న అభ్యర్థి ఈయనేనని అంతా అనుకుంటున్నారు. ఇంతకీ సింగ్ బాబా వయసు ఏమాత్రం ఉంటుందో ఊహించగలరా? అక్షరాలా 66 ఏళ్లు!! దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందే.. అంటే 1947 మార్చి నెలలో పుట్టిన ఈయన ఇప్పటికి ఒకసారి మునిసిపల్ చైర్మన్, రెండుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు ఎంపీగా పనిచేశారు. ఇప్పటికీ ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లి, గంటన్నర పాటు ఒళ్లంతా అలిసేలా వ్యాయామం చేయకపోతే ఈయనకు అస్సలు ఏమాత్రం కుదరదట. అలా చెయ్యకపోతే తనకు ఒళ్లు నొప్పులు మొదలవుతాయని, 50 కిలోల వెయిట్ లిఫ్టింగ్ చేస్తేనే కాస్త బాగుంటుందని సింగ్ బాబా చెబుతున్నారు. ప్రచారంలో తలమునకలుగా ఉన్నా సరే, ముందు పొద్దున్నే జిమ్‌కు వెళ్లాల్సిందే, వ్యాయామం చేయాల్సిందేనట. మరో విషయం తెలుసా.. ఈయన పక్కా శాకాహారి. కాయగూరలు, ఆకు కూరలు తినే ఈయన ఇన్ని కండలు పెంచారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యంత బలమైన వ్యక్తిగా అవార్డు, రెండుసార్లు జాతీయ ఛాంపియన్ షిప్, ఒకసారి ఆసియా ఛాంపియన్షిప్ కూడా గెలుచుకున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై 90వేల ఓట్ల మెజారిటీతో నెగ్గినా, ఈసారి మాత్రం గట్టిపోటీయే ఉంది. బీజేపీ నుంచి భగత్ సింగ్ కోషియారీ, బీఎస్సీ నుంచి లయీక్ అహ్మద్, సమాజ్ వాదీ నుంచి అవతార్ సింగ్, ఆప్ నుంచి బల్లీ సింగ్ చీమా ఈయనతో పోటీపడుతున్నారు. కాంగ్రెస్ అంటే స్వతహాగా జనానికి ఉన్న ఆగ్రహంతో పాటు రెండుసార్లు ఎంపీగా చేయడంతో వ్యతిరేకత కూడా ప్రజల్లో ఉన్నట్లు చెబుతున్నారు.