ఆకస్మిక గుండెపోటు మరణాలు.. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎందరో ప్రాణాలను బలితీసుకుంటుంది. బంగారు భవిష్యత్తు కలిగిన యువత ప్రాణాలను అర్థాంతరంగా లాగేసుకుంటుంది. సడెన్‌గా అపస్మారక స్థితికి చేరుకొని తిరిగిరాని లోకాలకు వెళుతున్నారు.
తాజాగా బ్రెజిల్‌కు చెందిన ఓ యువ బాడీబిల్డర్ గుండెపోటు కారణంగా మృతిచెందాడు. ఆదివారం మధ్యాహ్నం తన ఇంటిలో విగతజీవిగా కనిపించాడు. దక్షిణ బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలో నివిసిస్తున్న 19 ఏళ్ల బాడీబిల్డర్ మాథ్యూస్ పావ్లక్ ఉభకాయ సమస్యలతో బాధపడేవాడు. దీనిని అధిగమించేందుకు బాడీ పెంచడం ప్రారంభించాడు. కేవలం అయిదు సంవత్సరాల్లోనే తన శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నాడు.
బాడీబిల్డింగ్‌లో పోటీలు ఇవ్వడం మొదలు పెట్టాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చి నాల్గో స్థానంలో నిలిచాడు. అంతేగాక 2023లో యూ23 అనే పోటీలో పాల్గొని గెలుపొందాడు. అప్పటి నుంచి అతన్ని తన గ్రామస్థులు అందరూ మిస్టర్ బ్లమెనౌ అని పిలుస్తుంటారు.
అయితే మాథ్యూస్ అకాల మరణం అనేక సందేహాలకు తావిస్తోంది. అనాబాలిక్ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగయ సమస్యలు తలెత్తి మృతిచెందినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన శరీరాకృతిని ఆకట్టుకునే విధంగా మలచడంలో మందుల వాడకం గుండెపోటుకు కారణమై ఉండవచ్చని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అయితే వీటిని పావ్లాక్ సన్నిహితులు ఈ విమర్శలను ఖండిస్తున్నారు. ఈ లోకంలో లేని వారి గురించి తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం సరికాదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment