యువతలో బాడీ బిల్డింగ్ క్రేజ్ ఎంతలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇటీవల బాడీబిల్డర్ల వరుస మరణాలతో ఇది ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహాలు తలెత్తాయి. వాళ్లంతా చిన్న వయసులోనే మరణించడం రకరకాల ఊహగానాలకు తెరలేపింది. అదీగా బాడీబిల్డర్‌గా అయ్యేందుకు అధిక బరువుతో చేసే వ్యాయామాలు గుండెపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు. కొందరూ కండరాలు ధృఢంగా అయ్యేందుకు కొన్ని రకాల మందులు వాడతుంటారని ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంతకీ ఈ బాడీబిల్డింగ్ క్రీడ అనేది ప్రమాకరమైనదా? ఆరోగ్య సమస్యలు తప్పవా అంటే..?.
బ్రెజిల్‌కి చెందిన 19 ఏళ్ల బాడీబిల్డర్ మాథ్యూస్ పావ్లక్ ఆదివారం మధ్యాహ్నం తన ఇంటిలో విగతజీవిగా కనిపించాడు. గుండెపాటు కారణంగా చనిపోయినట్లు సమాచారం. నిజానికి మాథ్యూస్ బాల్యంలో స్థూలకాయ సమస్యతో బాధపడేవాడు. దీన్ని అధిగమించేందుకు బాడీబిల్డింగ్ క్రీడను ఎంచుకున్నాడు. కేవలం ఐదేళ్లు ఆహోరాత్రులు కఠోర శ్రమతో కండలు తిరిగిన దేహంగా మార్చుకున్నాడు. అలా బాడీ బిల్డింగ్ కమ్యూనిటీలో ఒక సాధారణ పోటీదారుగా దిగి పలు కాంపీటీషన్ విజయకేతనం ఎగురవేశాడు. మంచి భవిష్యత్తు ఉన్న ఈ బాడీబిల్డర్ చిన్న వయసులోనే కానరాని లోకలకు వెళ్లిపోవడం పలు అనుమానాలకు తెరలేపింది.
సోషల్ మీడియాలో ఈ ఘటన హాట్‌టాపిక్‌గా మారింది. చిన్నవయసులోనే అందమైన శరీరాకృతిని పొందడం అనేది అంత ఈజీ కాదని, ఏవో మందుల వాడి ఉంటారంటు అనుమానాలు లేవెనెత్తారు. మరికొందరూ మాత్రం చనిపోయిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడటం తగదని వ్యాఖ్యనించారు. అయితే అతడి కోచ్ మాత్రం గొప్ప క్రీడాకారుని పొగొట్టుకున్నానంటూ పోస్ట్ పెట్టారు. అతడి జ్ఞాపకాలతో హృదయం బరువెక్కిందంటూ బాధగా సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఇలా ప్లావక్‌లా ఏప్రిల్‌లో జోనాస్ ఫిల్హో అనే మరో బాడీ బిల్డర్ 29 ఏళ్ల వయసులో మరణించాడు. అంతకముందు మేలో బాడీబిల్డర్, క్యాన్సర్ సర్వైవర్ మేజర్‌కాన్ 50 ఏళ్ల వయసులో చనిపోయాడు. వారంతా బాడీబిల్డర్లు, ఫిట్‌నెస్ ఔత్సాహికులే. పైగా చిన్న వయసులోనే తనువు చాలించడం బాధకరం.
ఎందుకంటే ఇలా..?
మంచి వ్యాయామం హృదయాన్ని బలపరుస్తుంది.కానీ బాడిబిల్డర్‌గా మారే క్రమంలో మితిమీరి చేసే వ్యాయామాలు గుండెపై ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. హృదయానికి సంబంధించిన కొరోనరీ ధమనుల కణజాలాలు దెబ్బతింటాయి. ఒక అమెరికన్ పరిశోధనా సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం, ఒక వ్యక్తి తన శరీర బరువులో సగానికి పైగా ఎత్తితే, గుండె జబులు వచ్చే ప్రమాదం ఎక్కువ అని పేర్కొంది.
అలాగే కండరాలు ధృఢంగా అవ్వడం కోసం స్టెరాయిడ్స్ వంటి మందులు వాడితే ఆ ప్రమాదం మరింత ఎక్కువ అని వెల్లడించింది.
బాడీబిల్డర్లు తరచుగా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉంటారు. ఫలితంగా మూత్రపిండాలు, గుండె తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇక స్టెరాయిడ్స్ అంటే శరీరంలోకి నేరుగా ఇంజెక్ట్ చేసే పోషకాలు. ఇది పురుషుల స్ఖలనాన్ని తగ్గించడమే కాకుండా కేన్సర్ వంటి వ్యాధుల బారిన పడేలా చేస్తుంది.
నిజానికి బాడీబిల్డర్‌గా అవ్వాలనుకునేవారు మంచి ఫిట్‌నెస్ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోండి. తొందరగా అవ్వాలనే క్రమంలో మందులు వంటి వాటి జోలికి పోవద్దని చెబుతున్నారు నిపుణలు. అలాగే మన శరీరం ధర్మం, పరిస్థితిని అనుసరించి బాడీ బిల్డర్‌గా అయ్యేందు కొంత సమయం పడుతుందనే విషయాన్ని గ్రహించాలని అంటున్నారు నిపుణులు.
(చదవండి: స్పేస్‌లోకి వెళ్లిన అతి పిన్న వయస్కురాలిగా కర్సెన్ కిచెన్..!)
Comments
Please login to add a commentAdd a comment