ఇంతవరకు పలనా పర్యటన చేశామని గొప్పగా చెప్పుకునే వాళ్లుం. ఇక నుంచి స్పేస్‌గా వెళ్లమని గొప్పలు చెప్పుకుంటామేమో..!. ఇక ముందు అలాంటి రోజులే ఉంటాయేమో కాబోలు. ఈ జాబితాలో చేరిపోయింది 21 ఏళ్ల కర్సెన్ కిచెన్. 21 ఏళ్ల ఈ ఆస్ట్రానమీ స్టూడెంట్ ఇటీవలే బ్లూ ఆరిజిన్ సంస్థ నిర్వహించిన అంతరిక్ష యాత్రలో భాగమైంది. తద్వారా అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ఈ స్పేస్ ఔత్సాహికురాలి ఎవరూ..? ఆ ఛాన్స్ ఎలా లభించింది తదితరాల గురించి తెలుసుకుందామా..!.
చాపెల్ హిల్‌లోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో చదువుతున్న కర్సెన్ కిచెన్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ అంతరిక్ష నౌకలో ప్రయాణించారు. ఆమెతో పాటు నాసా ప్రాయోజిత ఏరోస్పేస్ శాస్త్రవేత్తతో సహా మరో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. మొత్త ఆరుగురు సభ్యుల సిబ్బంది ఆగస్టు 29న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:07 గంటలకు వెస్ట్ టెక్సాస్ సైట్ ఉప కక్ష్యలోకి దాదాపు 10 నిమిషాల తర్వాత ల్యాండ్ అయ్యారు. భూమి ఉపరితలాన్ని దాటి భార రహిత స్థితిలో సుమారు మూడు నిమిషాలకు పైగానే గడిపింది. తద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది కిచెన్.
‘అంతరిక్షంలోకి వెళ్లాలన్న నా కల నెరవేరింది. రోదసీ నుంచి భూమి అందాల్ని చూసి ముగ్ధురాలినయ్యా. ఇంత అందమైన గ్రహంపై జీవించడం నా అదృష్టంగా ఫీలయ్యా. ఇలా ఇప్పటివరకు అంతరిక్షంలోకి వెళ్లిన వారిలో నేనే పిన్న వయస్కురాలిని కావడం మరింత ఆనందంగా ఉంది. ఈ యాత్రలో భాగంగా కొన్ని వేల మైళ్ల వేగంతో రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడం, అంతరిక్షంలో భార రహిత స్థితిలో తేలియాడడం, చీకటిగా ఉన్న ఆకాశం, అక్కడ్నుంచి నీలం రంగులో కనిపించే భూమి.. ఇలా ప్రతిదీ మర్చిపోలేని మధురానుభూతే!’ అంటూ తన అంతరిక్ష యాత్ర అనుభవాల్ని గూర్చి కళ్లకు కట్టినట్లు చెప్పుకొచ్చింది.
అయితే ఇలా తన కుటుంబంలో స్పేస్‌లోకి వెళ్లోచ్చిన తొలి వ్యక్తి మాత్రం కాదు. ఎందుకంటే ఆమె తండ్రి కూడా అంతరిక్ష ఔత్సాహికుడే. అతను ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అంతరిక్షంపై ఆసక్తితో ఎప్పటికైనా స్పేస్ టూర్‌కి వెళ్లాలనుకున్నారాయన. ఆయనకు ఆ అవకాశం 2022లో వచ్చింది. ఆ సమయంలో బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టిన ‘ఎన్‌ఎస్-20 మిషన్’లో రోదసీలోకి వెళ్లారాయన. ఇలా తన తండ్రి కల నెరవేరడంతో తానూ అంతరిక్ష యాత్ర చేయాలన్న ఆసక్తిని పెంచుకుంది కిచెన్.
(చదవండి: ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న సైనా నెహ్వాల్..క్రీడాకారులకే ఎందుకంటే..?)
Comments
Please login to add a commentAdd a comment