గుండెపోటుతో సంభవిస్తున్న హఠాన్మారణాలు ఆందోళన రేపుతున్నాయి. దీనికి సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. బాగా ఫిట్‌గా ఉన్నామను కున్నవారు కూడా ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నాయి
తాజాగా బ్రెజిలియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆకస్మిక మరణం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అదీ వీపుమీద టాటూ వేయించుకుంటూ ఉండగా ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. వివరాలు ఏంటంటే..
45 ఏళ్ల బ్రెజిలియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రికార్డో గొడోయ్ టాటూ వేసుకుంటూ ఉండగా కుప్పకూలిపోయాడు. వీపు మొత్తంవీపు టాటూ వేయించుకోవాలని భావించిన గొడోయ్ బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలోని టాటూ స్టూడియోకు వచ్చాడు. ఈ ప్రక్రియ కోసం మత్తు (జనరల్ అనస్థీషియా) ఇచ్చిన కొద్దిసేపటికే అతను గుండెపోటుకు గురయ్యాడు. దీంతో హుటాహుటిన కార్డియాలజిస్ట్‌తో సహా వైద్య సిబ్బంది అతడిని బతికించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రయత్నాలు విఫలమై అదే రోజు మధ్యాహ్నం గొడోయ్ మరణించాడు. ఈ విషయాన్ని స్టూడియో యజమాని గొడోయ్ ఇన్‌స్టా పేజ్ ధృవీకరించింది. జనవరి 20న ఈ విషాదం చోటు చేసుకుంది.
ఎవరీ గొడోయ్
ప్రీమియం గ్రూప్ సీఈవో రికార్డో గొడోయ్ లగ్జరీ కార్ల వాడకంలో పేరుగాంచాడు. వ్యాపారవేత్తగా, లగ్జరీ కార్లు , హై-ఎండ్ జీవనశైలితో బాగా పాపులర్ అయ్యాడు. లగ్జరీ కార్ల గురించి ఆకర్షణీయమైన పోస్ట్‌లతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేవాడు. సోషల్ మీడియాలో 225,000 మందికి పైగా అభిమానులను సంపాదించుకున్నాడు. లగ్జరీ ఆటోమొబైల్ పరిశ్రమ గురించి ఆకర్షణీయమైన కంటెంట్‌ను అందిస్తూ గొడోయ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులతో కనెక్ట్ అయ్యాడు.
టాటా వేయించుకున్నాక త్వరలోనే మిమ్మల్ని పలకరిస్తా అంటూ తన అనుచరులకు హామీ ఇచ్చిన గొడోయ్ గుండెపోటుతో మరణించడంతో ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేశారు. టాటూ స్టూడియో యజమాని సైతం సంతాపం ప్రకటించాడు. గొడోయ్‌ను "గొప్ప స్నేహితుడు"గా అభివర్ణించాడు. మరోవైపు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment