ఛండీగఢ్: బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్(42) హాఠాన్మరణం రాజకీయంగానే కాదు.. హర్యానా బుల్లితెరలోనూ విషాదం నింపింది. 2020లో బిగ్‌బాస్ షో కంటెస్టెంట్‌గా అలరించిన ఆమె.. రాజకీయ వేత్తగా కంటే తానొక కళాకారిణిని అనే విషయంపైనే ఎక్కువ దృష్టిసారిస్తుంటారు.
హర్యానా బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అయిన సోనాలి ఫోగట్‌కు సోషల్‌మీడియాలో ఉండే పాపులారిటీ అంతా ఇంతా కాదు. కేవలం గ్లామర్ పరంగానే కాదు.. హర్యాన్వి కల్చర్‌ను ప్రతిబింబించేలా ఉంటాయి ఆమె పోస్టులు. అందుకే పార్టీ ఆమె సేవలకు అంతలా ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ముఖ్యమైన కార్యక్రమాల్లోనూ ఆమె సందడి అంతా ఇంతా ఉండదు.
చివరికి.. తన చివరి పోస్టుల్లోనూ హిందీ పాటకు డ్యాన్స్ చేశారామె. అదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫొటోను సైతం పింక్ టర్బన్‌తో ఉన్న ఫొటోతో మార్చేశారు. తన సిబ్బందితో కలిసి గోవాకు వెళ్లిన ఆమె.. సోమవారం రాత్రి సమయంలో తనకు ఒంట్లో బాగోలేదని సిబ్బందితో చెప్పారు.
అయితే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే గుండెపోటుతో మరణించారు. చివరిసారిగా ఆమె చేసిన సోషల్ మీడియా పోస్టులకు ‘ఓం శాంతి’ కామెంట్లతో నివాళి అర్పిస్తున్నారు అభిమానులు. చివరి పోస్టులోనూ ఆమె కల్చర్‌ను, కళను వీడలేదని చెప్తున్నారు.
టీవీ షో, టిక్‌టాక్‌స్టార్‌గానే కాకుండా బీజేపీ నేతగానూ పేరు సంపాదించుకున్నారు సోనాలి ఫోగట్. ఈమె భర్త సంజయ్ ఫోగట్ 2016లో మరణించగా.. ఆమెకు ఒక కూతురు యశోధర ఉంది.
ఇదీ చదవండి: ఎవరీ సోనాలి ఫోగట్.. ఎందుకింత పాపులర్ అంటే..
Comments
Please login to add a commentAdd a comment