Sonali Phogat
-
సోనాలీ ఫోగాట్ హత్యకు రూ.10 కోట్ల డీల్!
న్యూఢిల్లీ: బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్ స్టార్, నటి సోనాలీ ఫోగాట్(42) హత్యకు రూ.10 కోట్ల డీల్ కుదిరిందని, ఈ మేరకు తమ కుటుంబానికి ఇటీవలే రెండు లేఖలు అందాయని ఆమె బావ అమన్ పూనియా తాజాగా చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈ రెండు లేఖలు వచ్చినట్లు తెలిపారు. ఒక లేఖలో రూ.10 కోట్ల డీల్ గురించి, మరో లేఖలో పలువురు రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయన్నారు. లేఖల్లో కీలక సమాచార ముంది కాబట్టి వీటిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సోనాలీ ఫోగాట్ ఆగస్టు 23న గోవాలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు తొలుత ప్రచారం జరిగింది. కానీ, ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నట్లు పోస్టుమార్టంలో తేలింది. విచారణ చేపట్టిన పోలీసులు సోనాలీ సహాయకులైన సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్తోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం సీబీఐ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
ఎట్టకేలకు.. సోనాలి ఫోగట్ కేసులో కీలక పరిణామం
పనాజి: సంచలనం సృష్టించిన హర్యానా నటి, బీజేపీ నేత సోనాలి ఫోగట్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తీవ్ర ఒత్తిళ్ల నడుమ ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని నిర్ణయించినట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సోమవారం ప్రకటించారు. ‘‘మా పోలీసుల(గోవా పోలీసులు) మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. కానీ, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి, సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు సీబీఐకి అప్పగించాలని నిర్ణయించాం’’ అని గోవా సీఎం సావంత్ ప్రకటించారు. ఈ మేరకు సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి లేఖ రాసినట్లు సావంత్ వెల్లడించారు. అంతకు ముందు.. హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ కూడా గోవా పోలీసుల దర్యాప్తుపై సోనాలీ కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేయకుంటే సీబీఐ విచారణకే అప్పగిస్తామంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ మరుసటిరోజే గోవా ప్రభుత్వం సీబీఐకు కేసును అప్పగించడం గమనార్హం. గోవా టూర్‌కు వెళ్లిన ఆమె.. గత నెలలో ఆమె హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. తొలుత గుండెపోటుగా భావించినప్పటికీ.. కుటుంబ సభ్యుల అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అది హత్యనే విషయం నిర్ధారణ అయ్యింది. వ్యక్తిగత సిబ్బంది సుధీర్ సాంగ్వాన్, సుధీర్ అనుచరుడు సుఖ్విందర్‌లు ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులుగా పోలీస్ కస్టడీలో ఉన్నారు. సోనాలి ఫోగట్ హత్య జరిగిన మరుసటి రోజు నుంచే ఆమె కుటుంబం సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తూ వస్తోంది. ఆమెపై అత్యాచారం జరిగిందని, మత్తు పదార్థాలు ఇచ్చి మరీ అఘాయిత్యానికి పాల్పడి బ్లాక్ మెయిల్ చేశారంటూ కుటుంబ సభ్యులు.. ఆమె వ్యక్తిగత సిబ్బందిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదీ చదవండి: తల నరికేసే ఊరిలో.. సరిహద్దు! -
సోనాలీ ఫోగట్ హత్య కేసులో మరో ట్విస్ట్.. డైరీలో వారి పేర్లు!
Sonali Phogat.. బీజేపీ నేత, నటి సోనాలీ ఫోగట్ మృతి ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా, ఆమెకు డ్రగ్స్ ఇచ్చి చంపేసినట్టుగా సోనాలీ ఫోగట్ మృతి కేసులో నిందితుడు సుధీర్ సంగ్వాన్‌ను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమెకు సంబంధించిన వస్తువులు మిస్ అవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సోనాలీ ఫోగట్ ఫాంహౌస్ నుంచి ఖరీదైన కార్లు, ఫర్నిచర్ అదృశ్యమైనట్టు తెలిసింది. హత్య కేసును దర్యాప్తు చేసిన గోవా పోలీసులు ఫాంహౌస్‌లో విలువైన ఆస్తులు మాయం కావడం గుర్తించారు. దీంతో, మిస్ అయిన వస్తువులు, వాహనాలను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. మరోవైపు.. సోనాలీ ఫోగట్ ఆస్తిని చేజిక్కించుకోవాలని సుధీర్ సంగ్వాన్ ఎప్పటినుంచో ప్రణాళికలు రచిస్తున్నాడని దర్యాప్తు సమయంలో తేలినట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఆమె.. ఫాంహౌస్ విలువ రూ. 110 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఏటా రూ. 60వేలు చెల్లించి 20 ఏళ్ల పాటు ఫాంహౌస్‌ను లీజుకు తీసుకోవాలని సంగ్వాన్ స్కెచ్ వేశాడని పోలీసులు వెల్లడించారు. కాగా, ఆమె హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులకు సోనాలీ డైరీ దొరికింది. ఇక, ఆ డైరీలో పలువురు రాజకీయ నేతలు, కార్యకర్తల నెంబర్లు ఉన్నట్టు తెలిపారు. అయితే, వారి పేర్లు మాత్రం పోలీసులు బయటకు చెప్పలేదు. అలాగే ఓ పాస్‌పోర్టు, బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. सोनाली फोगाट के फ्लैट से जो मिला वो खोलेगा मौत के राज ! सब्सक्राइब करें #TimesNowNavbharat👉https://t.co/ogFsKfs8b9#TimesNowNavbharatOriginals #SonaliDeathMystery #SonaliPhogatDeath #SonaliPhogat pic.twitter.com/JVCrVG0i5q — Times Now Navbharat (@TNNavbharat) September 5, 2022 -
సొనాలీ ఫోగట్ హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడించిన సీపీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: గోవాలోని అంజునా పోలీసుల నిర్లక్ష్యమే బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్, టీవీ నటి సొనాలీ ఫోగట్ హత్యకు పరోక్ష కారణమైంది. ఆ కేసులో నిందితులుగా ఉన్న వారిలో ఇద్దరు ఉస్మానియా యూనివర్సిటీ ఠాణాలో గత నెలలో నమోదైన డ్రగ్స్ కేసులోనూ నిందితులుగా ఉన్నారు. దీనిపై అధికారిక సమాచారం ఇచ్చినా అంజునా పోలీసులు స్పందించలేదు. హైదరాబాద్ పోలీసులు ఆగస్టు 17న డ్రగ్స్ మాఫియాపై సమాచారం ఇవ్వగా.. 22 తెల్లవారుజామున ఫోగట్ హత్యకు గురి కావడం గమనార్హం. ఈ దారుణం జరిగిన పబ్ యజమాని సహా మరొకరు ఇక్కడి పోలీసులకు వాంటెడ్‌గా ఉన్నాడు. వీరిద్దరినీ గత నెల 28న గోవా పోలీసులు అరెస్టు చేశారు. పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకువస్తామని గురువారం కొత్వాల్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ప్రీతీష్ విచారణతో వెలుగులోకి.. గోవాలోని అంజునా బీచ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఏళ్లుగా డ్రగ్స్ దందా చేస్తున్న ఘరానా డ్రగ్ పెడ్లర్ ప్రీతీష్ నారాయణ్ బోర్కర్‌ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్– న్యూ) గత నెల 17న పట్టుకుంది. ఇతడి విచారణలో అంజునా ప్రాంతానికే చెందిన స్టీవెన్, ఎడ్విన్ నూనిస్ సహా ఆరుగురి నుంచి డ్రగ్స్ దేశవ్యాప్తంగా చలామణి అవుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రీతీష్‌ను అరెస్టు చేసిన ఉస్మానియా వర్సిటీ పోలీసులు ఆ కేసులో ఆరుగురినీ నిందితులుగా పేర్కొన్నారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీ సహా ఇతర వివరాలను అంజునా పోలీసులకు పంపిన హైదరాబాద్ అధికారులు వారిని అరెస్టు చేయాల్సిందిగా కోరారు. నిందితులకే వత్తాసు.. దేశవ్యాప్తంగా జరుగుతున్న డ్రగ్స్ దందాకు గోవా కీలకమన్నది జగమెరిగిన సత్యం. అక్కడి పోలీసుల సహకారంతోనే ఈ వ్యాపారం సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో నగరంలో దొరికిన ఓ వ్యక్తిని ప్రశ్నించగా.. గోవా నుంచి డ్రగ్ సరఫరా అయినట్లు తేలింది. దీంతో హెచ్– న్యూ టీమ్ అక్కడకు వెళ్లి ఆ సరఫరాదారు ఉన్న హోటల్‌పై దాడి చేసింది. ఫలితంగా అతడు చిక్కడంతో పాటు దాదాపు 100 గ్రాముల ఎండీఎంఏ రికవరీ అయింది. దీనిపై హెచ్–న్యూ టీమ్ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితుడిని తీసుకురావడానికి సన్నాహాలు చేసింది. అక్కడకు వచ్చిన అంజునా పోలీసులు నిందితుడిని తీసుకువెళ్లడానికి వీల్లేదని, తామే అరెస్టు చూపిస్తామని పట్టుబట్టారు. ఆపై పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లాలని చెప్పి పంపారు. సీన్ కట్ చేస్తే ఆ నిందితుడు, దొరికిన సరుకు ఏమైందో ఇప్పటికీ హెచ్– న్యూకి సమాచారం ఇవ్వలేదు. చదవండి: బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతిపై సీబీఐ దర్యాప్తు? కిడ్నాప్ కేసులు పెడతామంటూ బెదిరింపు.. తమకు వాంటెడ్‌గా ఉన్న వారిని అరెస్టు చేయడానికి వెళ్తున్న సందర్భంలో హెచ్–న్యూ అధికారులు కొన్నిసార్లు గోవా పోలీసుల సహాయం కోరారు. అలా జరిగిన ప్రతిసారీ నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. దీంతో వారికి సమాచారం ఇవ్వకుండానే హెచ్–న్యూ ఆపరేషన్లు చేపట్టడం మొదలెట్టింది. ఓ సందర్భంలో అలా వచ్చి నిందితులను అరెస్టు చేసి తీసుకువెళితే కిడ్నాప్ కేసులు పెడతామంటూ హెచ్–న్యూ అధికారులనే గోవా పోలీసులు బెదిరించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే స్టీవెన్, ఎడ్విన్ నూనిస్ల సమాచారాన్ని హెచ్–న్యూ గోవా పోలీసులకు అందించి అరెస్టు చేయమని కోరింది. ఎడ్విన్ అంజునా ప్రాంతంలో గ్రాండ్ లియోనీ రెసార్ట్, స్టీవెన్ హిల్ టాప్ పబ్ నిర్వహిస్తున్నారని, వీటిలో పని చేసే వారితోనే డ్రగ్స్ అమ్మిస్తున్నారని తెలిపింది. అయినప్పటికీ గోవా పోలీసులు పట్టించుకోలేదు. సొనాలీ హత్యలో ఆ ఇద్దరి పాత్ర.. సొనాలీ ఫోగట్ హత్య కేసులో ఎడ్విన్, స్టీవెన్ నిందితులుగా మారారు. ఈ హత్య గ్రాండ్ లియానీ రిసార్ట్‌లోని పబ్‌లోనే జరిగింది. ఆమెకు అధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చి చంపేశారు. ఆ మాదక ద్రవ్యాలను సరఫరా చేసింది ఎడ్విన్, స్టీవెన్గా తేలడంతో వారినీ నిందితులుగా చేర్చారు. ఎడ్విన్‌ను అరెస్టు చేసిన అంజునా పోలీసులు స్టీవెన్ కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు సమాచారం ఇచ్చినప్పుడే స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ‘ఫోగట్ హత్య కేసులో అరెస్టు అయిన ఎడ్విన్ ఓయూ పరిధిలో నమోదైన ప్రీతీష్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతడిని పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువస్తాం. డ్రగ్స్ కేసులో నిందితులను అరెస్టు చేయడానికి గోవా వెళ్లిన ప్రతిసారీ అక్కడి పోలీసుల నుంచి సహకారం లభించట్లేదు. అనేక సందర్భాల్లో నెగెటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. గోవా డ్రగ్ నెట్‌వర్క్‌పై హెచ్–న్యూకు ఉన్న సమాచారం గోవా పోలీసులకు ఎందుకు లేదంటూ అక్కడి పత్రికలూ రాస్తున్నాయి’ అని సీవీ ఆనంద్ అన్నారు. -
సోనాలి ఫోగట్‌కు అన్ని కోట్ల ఆస్తులున్నాయా? ఆస్తి కోసమే హత్యచేశారా?
హరియాణా బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడటం లేదు.సోనాలి ఫోగట్(43) హఠాన్మరణం కాస్త హత్యగా నిర్ధారణ కావడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు సోనాలి ఫోగట్ హత్య వెనుక ఎవరున్నారు? ఆస్తి కోసమే ఆమెను చంపాలనుకున్నారా వంటి కారణాలు ఇప్పుడు తెరమీదకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోనాలి ఫోగట్ కూతురు, ఆమె రూ 110కోట్ల విలువైన ఆస్తికి ఏకైక వారసురాలు యశోధర ప్రాణానికి కూడా ముప్పు ఉన్నట్లు ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. 2016లో సోనాలి ఫోగట్ భర్త సంజయ్ ఫోగట్ కూడా అనుమానాస్పద రీతిలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సోనాలిని కూడా హత్య చేశారు. ఈ క్రమంలో ఆస్తి కోసం సోనాలి కూతురు యశోధరను కూడా హత్య చేయొచ్చని ఆమె కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం యశోధరకు కేవలం 15 సంవత్సరాలే. ఈ క్రమంలో ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో యశోధరను తిరిగి హాస్టల్‌కు కూడా పంపొద్దని కుటంబీకులు నిర్ణయించారు. ఇప్పటికే ఆమెకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు తన తల్లి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని యశోధర డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..'నా తల్లిని పథకం ప్రకారమే హత్య చేశారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. గోవాలో వారం రోజుల పాటు షూటింగ్ ఉందని అమ్మ నాతో చెప్పింది. మరి అలాంటప్పుడు రిసార్ట్‌ను కేవలం రెండు రోజులకే ఎందుకు బుక్ చేసినట్లు? పక్కా ప్లాన్‌తోనే హత్య చేశారు. అయినా ఇప్పటివరకు మా అమ్మ హత్యకు గల కారణాలు పోలీసులు నిర్ధారించలేదు. గోవా పోలీసుల దర్యాప్తుతో నేను సంతృప్తిగా లేను. దర్యాప్తుపై అనేక సందేహాలున్నాయి. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నాం' అని ఆమె పేర్కొంది. -
సీబీఐ చేతికి సోనాలి ఫోగట్ మృతి కేసు?
గోవా: హరియాణా బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడటం లేదు. మృతికి కొద్ది గంటల ముందు జరిగిన సంఘటనలకు సంబంధించిన పలు వీడియోలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో అవసరమైతే సోనాలి మృతి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగిస్తామని తెలిపారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో ఫోగట్ కుటుంబ సభ్యులు కలిసిన తర్వాత ఈ మేరకు వెల్లడించారు సీఎం. ‘హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నాతో మాట్లాడారు. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆయను కలిసి సీబీఐ దర్యాప్తు జరపాలని కోరిన క్రమంలో.. అదే విషయాన్ని నాతో చెప్పారు. ఈ రోజు అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక.. అవసరమైతే కేసును సీబీఐకి అప్పగిస్తాం.’ అని తెలిపారు ప్రమోద్ సావంత్. సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు హరియాణా ముఖ్యమంత్రి ఖట్టర్‌ను శనివారం కలిశారు. నటి మృతి కేసులో సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. అనంతరం.. సీబీఐ దర్యాప్తు కోసం గోవా ప్రభుత్వానికి లేఖ రాస్తామని హరియాణా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మరోకరి అరెస్ట్.. సోనాలి ఫోగట్ మృతి కేసుకు సంబంధించి శనివారం ఇద్దరిని అరెస్ట్ చేశారు గోవా పోలీసులు. నిందితులు సోనాలి వెళ్లిన క్లబ్ యజమాని, డ్రగ్ డీలర్ దత్తప్రసాద్ గోయంకర్, ఎడ్విన్ నన్స్‌గా తెలిపారు. తాజాగా ఆదివారం మరో డ్రగ్స్ సరఫరాదారుడిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదీ చదవండి: సోనాలి ఫోగట్‌ను ఎవరు చంపారో తేల్చాలి.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులా కావొద్దు -
సోనాలి ఫోగట్ మృతి కేసు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులా కానివొద్దు
చండీగఢ్: హర్యానా బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతిపై అనుమానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేసినా ఆమె మరణానికి గల కారణాలపై మిస్టరీ వీడటం లేదు. ఈ నేపథ్యంలో సోనాలి ఫోగట్ కుటుంబసభ్యులు ఈ కేసును బాలీవుడ్ దివంగత నుటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుతో పోల్చుతున్నారు. ఫోగట్ మృతి కేసు కూడా సుశాంత్ కేసులా కాకూడదని అంటున్నారు. 'సుశాంత్ సింగ్ హత్యకు గురై ఉంటాడని ఆయన కుటుంబసభ్యులు ఇంకా నమ్ముతున్నారు. రియా చక్రవర్తి అతనికి డ్రగ్స్ ఇచ్చింది. అయినా ఇప్పుడు ఆమె బయటే ఉంది. కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదు. ఆ కేసు డ్రగ్స్ గురించి కాదు. హత్య గురించి' అని సోనాలి ఫోగట్ సోదరుడు కుల్దీప్ ఫోగట్ అన్నారు. సోనాలి ఫోగట్ మృతికి కారణమైన వారిని ఉరి తీయాలని కుల్దీప్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఆమె హత్యకు గురైందని పోలీసులు రుజువు చేయలేకపోతే సీబీఐని ఆశ్రయిస్తామన్నారు. నార్కో టెస్టు కూడా నిర్వహించాలని కోరుతామన్నారు. కుటుంబసభ్యుల అనుమతి అనంతరం సోనాలి భౌతికకాయానికి గురువారం పోస్టుమార్టం చేశారు వైద్యులు. ఆమె శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. దీంతో గోవా పోలీసులు సోనాలి మృతిని హత్య కేసుగా నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆమె సహాయకులిద్దరితో పాటు క్లబ్ ఓనర్, డ్రగ్ పెడ్లర్‌ను అరెస్టు చేశారు. చదవండి: సోనాలి ఫోగట్ దారుణ హత్య.. ఆ రెండున్నర గంటలేం జరిగింది? -
సోనాలి ఫోగట్ దారుణ హత్య.. ఎందుకు చంపారు?
బీజేపీ నేత, హిందీ బిగ్‌బాస్ షో మాజీ కంటెస్టెంట్ సోనాలి ఫోగట్(43) హఠాన్మరణం కాస్త హత్యగా నిర్ధారణ కావడం సంచలనం సృష్టిస్తోంది. కుటుంబ సభ్యుల ఆరోపణలకు బలం చేకూరేలా.. ఆమె అనుచరులే ఆమె మరణానికి కారణమన్న కోణంలోనే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినా కారణాలేంటన్నది మాత్రం పోలీసులు ఇంకా ప్రకటించకపోవడం విశేషం. తొలుత గుండెపోటు మరణంగా ప్రకటించిన వైద్యులు.. శవపరీక్షలో ఒంటిపై గాయాలున్నాయని నిర్ధారించారు. దీంతో సోనాలి ఫోగట్ మరణాన్ని అనుమానాస్పద మృతి కేసు నుంచి హత్య కేసుగా మార్చేశారు గోవా పోలీసులు. ఆపై ఆమె అనుచరులు సుధీర్ సంగ్వాన్, సుఖ్విందర్ వాసీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో.. ఈ ఇద్దరూ ఆమెకు ఇచ్చిన డ్రింకులో 1.5 గ్రాముల ఎండీఎంఏ కలిపినట్లు అంగీకరించారు. అంతేకాదు.. తన అనుచరుల సాయంతో తూలుతూ నడుస్తున్న సోనాలి ఫోగట్ వీడియోలు(సీసీటీవీ ఫుటేజీ)సైతం బయటకు రిలీజ్ చేశారు పోలీసులు. అతికష్టం మీద సుధీర్ సాయంతో ఆమె రెస్టారెంట్లో నడుస్తూ కనిపించారు. ఆ ఆధారాలతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ టీం వీళ్లిద్దరినీ పలు ప్రాంతాల్లోకి తీసుకెళ్లి.. కేసు దర్యాప్తు కొనసాగిస్తోంది. అలాగే త్వరలో వీళ్లిద్దరినీ కోర్టులో ప్రవేశపెడతామని గోవా పోలీసులు చెప్తున్నారు. ఆ రెండున్నర గంటలు! ఆధారాలు నాశనం చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉండడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు గోవా డీజీపీ జస్పాల్ సింగ్ తెలిపారు. కర్లీస్ రెస్టారెంట్ సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఆమెను సుధీర్ తన భుజం మీద మోసుకుంటూ టాయిలెట్‌కు తీసుకెళ్లాడు. వెనకాలే సుఖ్విందర్ కూడా ఉన్నారు. రెండున్నర గంటల తర్వాత.. అంజువా ఏరియాలోని సెయింట్ ఆంటోనీ ఆస్పత్రికి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఉదయం ఏడు గంటలకు వైద్యులు ఆమె గుండెపోటుతో చనిపోయిందని ప్రకటించారు. అయితే ఆ రెండు గంటల్లో ఏం జరిగిందో మాత్రం నిందితులు ఇంకా వెల్లడించలేదు. This is CCTV footage allegedly of Sonali Phogat with Sudhir Sangwan of August 22. She can barely walk. Drunk or God knows what they drugs they gave her 😑 #SonaliDeathMystery#SonaliPhogat pic.twitter.com/gj5JDCW4bL — Rosy (@rose_k01) August 26, 2022 సంచలనం సృష్టించిన సోనాలి ఫోగట్ మృతి కేసు.. మర్డర్‌గా నిర్ధారణ కావడం ఆమె అభిమానుల్ని విస్మయానికి గురి చేస్తోంది. ఆమె అత్యాచారానికి గురయ్యారని, బ్లాక్‌మెయిలింగ్‌తో సుధీర్, సుఖ్విందర్లపై ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. అయితే ఆమెను ఎందుకు చంపారనే కారణాన్ని మాత్రం నిందితులు ఇంకా వెల్లడించలేదని గోవా పోలీసులు చెప్తుండడం గమనార్హం. అయితే ఆర్థిక కారణాలే కారణం అయ్యి ఉంటాయని భావిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. సోనాలి ఫోగట్ హత్యకు కారణమైన గోవా కర్లీస్ రెస్టారెంట్ గతంలోనూ ఓ ఫారిన్ అమ్మాయి దారుణ హత్యాచారానికి కారణమైంది కూడా. ఆ సమయంలోనూ ‘డ్రగ్స్’ కోణంలోనే ఈ పబ్‌పై ఆరోపణలు వెల్లువెత్తగా.. కాలక్రమంలో ఆ విషయాన్ని అంతా మరిచిపోయారు. గోవా మెడికల్ కాలేజీలో ఆమె మృతదేహానికి పరీక్షలు పూర్తి కావడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. శుక్రవారం ఉదయం బంధువులు, అభిమానుల నడుమ ఆమె అంత్యక్రియలు జరిగాయి. సోనాలి కూతురు సైతం పాడె మోసి కన్నీటి పర్యంతం అయ్యింది. అంతకు ముందు తన తల్లికి న్యాయం చేయాలంటూ ఆమె ఓ వీడియోను విడుదల చేసింది. #SonaliPhogat's 15yrs old daughter demands justice; She said, "My mother should get justice. Proper investigation should be done. Culprit should get punished."pic.twitter.com/EzCbJVQ9KW — #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) August 26, 2022 ఇదీ చదవండి: తోక ఊపోద్దు, నాలుక కోస్తాం.. -
మరణానికి ముందు సోనాలి ఫోగట్‌కు డ్రగ్స్! .. సంచలన విషయాలు వెల్లడి
బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సోనాలి ఫోగట్ ఆగస్టు 23న గోవాలో హఠాన్మరణ చెందిన విషయం తెలిసిందే. తొలుత గుండెపోటుతో మరణించినట్లు భావించగా.. తరువాత సోనాలిది హత్యేనని ఆమె కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలతో గోవా పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. తాజాగా ఆమె డెత్ మిస్టరీలో మరో ట్విస్ట్ నెలకొంది. సోనాలికి పార్టీలో డ్రగ్స్ ఇచ్చినట్లు తేలింది. అదే ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు గోవా ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ శుక్రవారం మీడియాకు సంచలన విషయాలు వెల్లడించారు. సోనాలి ఫోగట్ మరణానికి ముందు అంజునాలో జరిగిన పార్టీలో ఆమెకు తన ఇద్దరు సహచరులు మత్తుమందు ఇచ్చినట్లు తేలిందన్నారు. అసహ్యకరమైన రసాయన పదార్ధాలను కలిపిన డ్రింక్‌ను ఆమెతో బలవంతంగా తాగించారని పేర్కొన్నారు. చదవండి: బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతదేహంపై గాయాలు.. హత్య కేసు నమోదు డ్రింక్ తాగిన తర్వాత ఆమె తనపై తాను కంట్రోల్ తప్పిందని తెలిపారు. సోనాలి నియంత్రణ కోల్పోవడంతో ఉదయం 4.30 నిమిషాలకు తనను టాయిలెట్లకు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే తరువాత రెండు గంటలపాటు ఏం చేశారనే దానిపై వివరణ లేదన్నారు. నిందితులిద్దరూ ఆమె హత్యకు సంబంధించిన కేసులో ఇప్పుడు ప్రధాన నిందితులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిద్దరూ ఆగస్టు 22న ఫోగట్‌తో కలిసి గోవాకు వెళ్లారని, అంజునాలోని కర్లీస్ రెస్టారెంట్లో పార్టీ చేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం వీరిని అరెస్ట్ చేసినట్లు, త్వరలోనే కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు. ఇక డ్రగ్స్ ప్రభావంతోనే సోనాలి మృతి చెందినట్లు తెలుస్తుందన్నారు. చదవండి: సోనాల్ ఫోగట్ మృతిలో మరో ట్విస్ట్.. నైట్ క్లబ్ వీడియో వైరల్ -
సోనాల్ ఫోగట్ మృతిలో మరో ట్విస్ట్.. నైట్ క్లబ్ వీడియో వైరల్
ఛండీగఢ్: బీజేపీ నేత, నటి సోనాల్ ఫోగట్ హఠాన్మరణంపై అనుమానాలు ఇంకా నివృత్తి కావడం లేదు. గోవాలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటనలో ఇద్దరిపై మర్డర్ కేసు నమోదు అయ్యింది. నిందితులను పోలీసులు గురువారం విచారించారు. ఇదిలా ఉండగా.. సోనాల్ ఫోగట్ మృతిపై ఆమె సోదరుడు రింకు ధాక, సంచలన ఆరోపణలకు దిగాడు. ఆమెపై ఏళ్ల తరబడి అత్యాచారం జరుగుతోందని, ఆస్తి కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశాడు. సోనాల్ ఫోగట్ పీఏ సుధీర్ సంగ్వాన్, అతని స్నేహితుడు సుఖ్విందర్‌లు కలిసి ఆమెకు గత మూడేళ్లుగా మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చేవాళ్లని అన్నాడు. ఆమెపై హిస్సార్‌లోని ఇంట్లో అఘాయిత్యానికి పాల్పడి వీడియో తీసేవాళ్లని, వాటి ఆధారంగా ఆమెను బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాగా, రింకు ఆరోపణ నేపథ్యంలో సోనాల్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోనాల్ తన పీఏ సుధీర్ సంగ్వాన్, ఫ్రెండ్ సుఖ్విందర్ వాసితో సోనాలి డ్యాన్స్ చేసింది. ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లిన ముగ్గురూ.. డ్యాన్స్ చేసినట్లు ఆ వీడియోలో ఉంది. వారందరూ ఎంతో క్లోజ్‌గా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక, పోస్టుమార్టమ్ రిపోర్ట్ ప్రకారం సోనాలి శరీరంపై బలమైన గాయాలు ఉన్నట్లు తేలిందని గోవా పోలీసులు చెప్పారు. This video is being told a month ago of a farm house in Gurugram, #SonaliPhogat dancing with Sudhir Sangwan and Sukhwinder Sangwan. pic.twitter.com/8fTtfzw88y — Nikhil Choudhary (@NikhilCh_) August 24, 2022 ఇది కూడా చదవండి: ఊహించని విషాదం.. మరణం ముందర సరదాగా సోనాలి.. అభిమానుల భావోద్వేగం -
బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతదేహంపై గాయాలు.. హత్య కేసు నమోదు
టిక్‌టాక్ స్టార్, బీజేపీ నేత సోనాలి ఫోగట్ మరణంపై గోవా పోలీసులు హత్యా కేసు నమోదు చేశారు. ఫోగట్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోనాలీ మృతదేహానికి గురువారం గోవా మెడికల్ కాలేజీలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ రిపోస్టులో ఆమె శరీరంపై అనేక మొద్దుబారిన గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో సోనాలితో పనిచేసే ఇద్దరు సహచరులపై గోవా పోలీసులు హత్యానేరం అభియోగాలు మోపారు. కాగా హర్యానాలోని హిసార్‌కు చెందిన టిక్‌టాక్ స్టార్, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ (42) ఆగస్టు 23న హఠాన్మరణం చెందింది. ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటుకు గురైన సోనాలి ఆసుపత్రికి తరలించేలోపు తుదిశ్వాస విడిచారు. అయితే ఆమె మరణం వెనుక హత్య కుట్ర దాగి ఉందని సోనాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చదవండి: సోనాల్ ఫోగట్‌పై మూడేళ్లుగా అత్యాచారం.. వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్! సోనాలి పీఏ సుధీర్ సంగ్వాన్‌తోపాటు ఆమెతో సన్నిహితంగా ఉండే సుఖ్వింధర్ అనే ఇద్దరు వ్యక్తులే హత్య చేసి ఉంటారని ఆరోపిస్తూ ఆమె సోదరుడు రింకూ ధాకా బుధవారం అంజునా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో గోవా సీఎం ప్రమోద్ సావంత్ అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు. గోవా డీజీపీ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. -
Sonal Phoghat: మత్తుమందిచ్చి అత్యాచారం.. ఆమెది ముమ్మాటికీ హత్యే!
ఛండీగఢ్: బీజేపీ నేత, నటి సోనాల్ ఫోగట్ హఠాన్మరణంపై అనుమానాల నేపథ్యంలో తీవ్ర ప్రకటనలు ఇస్తోంది ఆమె కుటుంబం. తాజాగా సోదరుడు రింకు ధాక, సంచలన ఆరోపణలకు దిగాడు. ఆమెపై ఏళ్ల తరబడి అత్యాచారం జరుగుతోందని, ఆస్తి కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నాడతను. సోనాల్ ఫోగట్ పీఏ సుధీర్ సంగ్వాన్, అతని స్నేహితుడు సుఖ్విందర్‌లు కలిసి ఆమెకు గత మూడేళ్లుగా మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చేవాళ్లని, ఆమెపై హిస్సార్‌లోని ఇంట్లో అఘాయిత్యానికి పాల్పడి వీడియో తీసేవాళ్లని, వాటి ఆధారంగా ఆమెను బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నారని రింకు చెబుతున్నాడు. సినీ, రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని సోనాలిని వాళ్లిద్దరూ బెదిరించేవారని, డబ్బు.. ఇతర సౌకర్యాలను అనుభవించేవాళ్లని, పరువుపోతుందనే భయంతోనే ఆమె ఇంతకాలం మౌనంగా ఉండిపోయిందని రింకు పోలీసులకు తెలిపాడు. చోరీ వంకతో.. తన భర్త చనిపోయాక.. కుటుంబం కంటే నటన, రాజకీయాల మీదే దృష్టిసారిస్తూ వచ్చింది సోనాలి ఫోగట్. 2019 ఎన్నికల సమయంలో సంగ్వాన్, సుఖ్విందర్‌లు సోనాలికి పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఆమె ప్రతీ విషయంలోనూ వీళ్లిద్దరి జోక్యం ఎక్కువైంది. ఆ సమయంలోనే ఆమెపై అత్యాచారం జరిగింది. ఇక కొంతకాలం కిందట సోనాలి ఇంట్లో చోరీ జరిగింది(ఇదీ కూడా సంగ్వాన్ ప్లాన్ అనేది రింకు ఆరోపణ). అది సాకుగా చూపి.. ఇంట్లో పని మనుషులను తొలగించారు. అప్పటి నుంచి ఆమె భోజనం బాధ్యతలన్నీ సుధీర్ చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆ భోజనంలో మత్తు మందు కలిపి.. నిత్యం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారని రింకు ఆరోపిస్తున్నాడు. అంతేకాదు ఈ విషయాన్ని తమ దగ్గరి బంధువైన అమన్‌కు స్వయంగా సోనాలినే వెల్లడించిందని అంటున్నాడు. అంతేకాదు.. షూటింగ్ వంకతో.. గోవాలో షూటింగ్ పేరుతో సోనాలి ఫోగట్‌ను తీసుకెళ్లారని, తీరా అక్కడికెళ్లాక షూటింగ్ లేదని చెప్పారని, ఈ క్రమంలోనే భోజనం చేశాక ఏదోలా ఉందని, అక్కడేదో జరుగుతోందని సోనాలి తమ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేసిందని, ఫోన్ ట్రేస్ చేసే ఛాన్స్ ఉండడంతో వాట్సాప్ కాల్ మాట్లాడాలని ప్రయత్నించిందని రింకూ చెప్తున్నాడు. సోనాలి ఇంటి తాళాల దగ్గరి నుంచి ఫోన్, బ్యాంక్ కార్డులు, ఆర్థిక లావాదేవీలన్నీ సుధీర్ దగ్గరే ఉండేవని, సోనాలి మరణం వార్త తెలిశాక ఆమె ఫోన్లతో పాటు తన ఫోన్లను సుధీర్ స్విచ్ఛాప్ చేసుకోవడం అనుమానాలకు తావిస్తోందని రింకు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గోవా డీజీపీ పర్యవేక్షణ ఆస్తి కోసమే కాదు.. ఆమె హత్య వెనుక రాజకీయ కుట్ర కోణం కూడా దాగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు రింకు. ఈ మేరకు గోవా పోలీసులకు ఫిర్యాదు చేసిన రింకు.. సుధీర్, సుఖ్విందర్లను అరెస్ట్ చేయాలని, తన సోదరికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. గుండెపోటుతో సోనాలి ఫోగట్ హఠాన్మరణం చెందిందని భావిస్తుండగా.. ఆమె మరణంపై కుటుంబ సభ్యుల అనుమానాల నేపథ్యంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు. గోవా డీజీపీ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఇదీ చదవండి: ‘శ్రీమతి’ మృతి.. న్యాయం కోసం పాదయాత్ర..! -
వాట్సాప్ కాల్ చేయమంది, అంతలోనే..
పనాజీ/ఛండీగఢ్: బీజేపీ నేత, సోషల్ మీడియా సెలబ్రిటీ సోనాలి ఫోగట్ మరణంపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 42 ఏళ్ల సోనాలి ఫోగట్ గోవా టూర్లో ఉండగా గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అయితే.. చనిపోవడానికి ముందు అక్కడి పరిస్థితులపై ఫోన్ కాల్ ద్వారా సోనాలి అనుమానాలు వ్యక్తం చేసిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గోవా పోలీసులు మాత్రం పూర్తిస్థాయి పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇంకా రానందునా అసహజ మరణం కిందే కేసు బుక్ చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి గోవాలో ఆస్పత్రికి తీసుకెళ్లే టైంకి ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే గుండెపోటుతో ఆమె మరణించిందన్న కోణంపై ఆమె కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదని, ఎలాంటి మందులు వాడడం లేదని సోనాలి ఫోగట్ సోదరి రమణ్ చెబుతోంది. మీడియాతో.. సోనాలి సోదరి రమణ్ ‘‘గుండెపోటుతో సోనాలి ఫోగట్ మరణించారనడం నమ్మశక్యంగా లేదు. మా కుటుంబం ఈ వాదనను అంగీకరించదు. ఆమె ఫిట్‌గా ఉండేది. ఎలాంటి జబ్బులు లేవు. మందులు కూడా వాడడం లేదు. చనిపోవడానికి ముందు ఆమె నాకు ఫోన్ చేసింది. మా అమ్మతోనూ మాట్లాడింది. భోజనం చేశాక.. ఏదోలా ఉందని చెప్పింది. అక్కడేదో జరుగుతోందని, అనుమానాస్పదంగా ఉందని, నార్మల్ కాల్ కాకుండా.. వాట్సాప్ కాల్లో మాట్లాడదాం అని చెప్పింది. కానీ, మళ్లీ కాల్ చేయలేదు. నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఉదయానికి ఆమె మరణించిందని తోటి సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు. ఈ వ్యవహారంలో మాకు అనుమానాలు ఉన్నాయి. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని హర్యానా, గోవా ప్రభుత్వాలను ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్, ఆప్ నేతలతో ఆమె ఫోన్లో మాట్లాడారు. అయితే గోవా పోలీస్ చీఫ్ జస్పాల్ సింగ్ మాత్రం ఈ మరణంలో ఎలాంటి అనుమానాలు తమకు కలగడం లేదని, పోస్ట్‌మార్టం నివేదికే విషయాన్ని నిర్ధారిస్తుందని అంటున్నారు. అంతేకాదు.. ఆమె పోస్ట్‌మార్టంను వీడియోగ్రఫీ చేయాలని గోవా పోలీసులు భావిస్తున్నారు. 2016లో సోనాలి భర్త సంజయ్ ఫోగట్ అనుమానాస్పద రీతిలోనే ఓ ఫామ్‌హౌజ్‌లో మృతి చెందగా.. ఆ మిస్టరీ ఈనాటికీ వీడలేదు. చనిపోయే ముందు కొన్నిగంటల వ్యవధిలో ఆమె హుషారుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, వీడియోలు సైతం పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Sonaliiphogat (@sonali_phogat_official) హర్యానా టీవీ సెలబ్రిటీ అయిన సోనాలి ఫోగట్ బీజేపీలో చేరిన తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు. 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. అయితే బిష్ణోయ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఇటీవలె బీజేపీలో చేరారు. దీంతో ఉప ఎన్నికలో సోనాలి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఇదీ చదవండి: చిన్న అడ్డంకి మాత్రమే.. అధిగమిస్తాం -
Sonali Phogat: చావు ఊహించనిది.. చివరి పోస్ట్‌లోనూ అదే!
ఛండీగఢ్: బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్(42) హాఠాన్మరణం రాజకీయంగానే కాదు.. హర్యానా బుల్లితెరలోనూ విషాదం నింపింది. 2020లో బిగ్‌బాస్ షో కంటెస్టెంట్‌గా అలరించిన ఆమె.. రాజకీయ వేత్తగా కంటే తానొక కళాకారిణిని అనే విషయంపైనే ఎక్కువ దృష్టిసారిస్తుంటారు. హర్యానా బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అయిన సోనాలి ఫోగట్‌కు సోషల్‌మీడియాలో ఉండే పాపులారిటీ అంతా ఇంతా కాదు. కేవలం గ్లామర్ పరంగానే కాదు.. హర్యాన్వి కల్చర్‌ను ప్రతిబింబించేలా ఉంటాయి ఆమె పోస్టులు. అందుకే పార్టీ ఆమె సేవలకు అంతలా ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ముఖ్యమైన కార్యక్రమాల్లోనూ ఆమె సందడి అంతా ఇంతా ఉండదు. View this post on Instagram A post shared by Sonaliiphogat (@sonali_phogat_official) చివరికి.. తన చివరి పోస్టుల్లోనూ హిందీ పాటకు డ్యాన్స్ చేశారామె. అదే సమయంలో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫొటోను సైతం పింక్ టర్బన్‌తో ఉన్న ఫొటోతో మార్చేశారు. తన సిబ్బందితో కలిసి గోవాకు వెళ్లిన ఆమె.. సోమవారం రాత్రి సమయంలో తనకు ఒంట్లో బాగోలేదని సిబ్బందితో చెప్పారు. View this post on Instagram A post shared by Sonaliiphogat (@sonali_phogat_official) అయితే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే గుండెపోటుతో మరణించారు. చివరిసారిగా ఆమె చేసిన సోషల్ మీడియా పోస్టులకు ‘ఓం శాంతి’ కామెంట్లతో నివాళి అర్పిస్తున్నారు అభిమానులు. చివరి పోస్టులోనూ ఆమె కల్చర్‌ను, కళను వీడలేదని చెప్తున్నారు. View this post on Instagram A post shared by Sonaliiphogat (@sonali_phogat_official) టీవీ షో, టిక్టాక్స్టార్గానే కాకుండా బీజేపీ నేతగానూ పేరు సంపాదించుకున్నారు సోనాలి ఫోగట్. ఈమె భర్త సంజయ్ ఫోగట్ 2016లో మరణించగా.. ఆమెకు ఒక కూతురు యశోధర ఉంది. View this post on Instagram A post shared by Sonaliiphogat (@sonali_phogat_official) ఇదీ చదవండి: ఎవరీ సోనాలి ఫోగట్.. ఎందుకింత పాపులర్ అంటే.. -
బీజేపీ నేత సోనాలి ఫోగట్ హఠాన్మరణం
ఛండీగఢ్: టీవీ యాంకర్, బీజేపీ నేత సోనాలి ఫోగట్(43) గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. తోటి ఉద్యోగులతో కలిసి గోవాకు వెళ్లిన ఆమె.. సోమవారం రాత్రి గుండె పోటుతో అక్కడే కన్నుమూసినట్లు సమాచారం. 2006లో టీవీ యాంకర్‌గా, టీవీ నటిగా కెరీర్‌ను ప్రారంభించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సోనాలి ఫోగట్.. రెండేళ్ల తర్వాత బీజేపీలో చేరారు. టిక్ టాక్ ద్వారా ఆమె పాపులారిటీ మరింత పుంజుకుంది. దీంతో బీజేపీ ఆమెను స్టార్ క్యాంపెయినర్‌గా మార్చేసుకుంది. సోషల్ మీడియాలో సోనాలికి ఫాలోయింగ్ ఎక్కువే. 2019 హర్యానా ఎన్నికల్లో ఆమె అదాంపూర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి.. కాంగ్రెస్ నేత కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఓడిపోయారు. అయితే.. అనూహ్యంగా కిందటి నెలలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బిష్ణోయ్.. బీజేపీలో చేరారు. పోయినవారం సోనాలి ఫోగట్‌తో బిష్ణోయ్ భేటీ కావడంతో.. అదాంపూర్ ఉపఎన్నికలో సోనాలినే అభ్యర్థిగా నిలబడతారనే ప్రచారం ఊపందుకుంది. ఈలోపే ఆమె కన్నుమూయడం గమనార్హం. సోనాలి ఫోగట్ భర్త 2016లో హిస్సార్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో అనుమానాస్పద రీతిలో మృతి చెందగా.. 2020లో ఓ అధికారిని చెప్పుతో కొట్టి ఆమె వివాదంలో నిలిచారు. ఇదీ చదవండి: చంటిబిడ్డతో ఫుడ్ డెలివరీ.. ఆ తల్లికి అంతా ఫిదా -
నటిపై ట్రోలింగ్: ఆ అవతారమేంటి? హోదాకు తగ్గట్లు ప్రవర్తించు!
నటి, హరియాణాకు చెందిన బీజేపీ నేత సొనాలీ ఫొగట్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ హిందీ పాటకు తనదైన స్టైల్లో స్టెప్పులేసిన డ్యాన్స్ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. సుమారు మూడు నెలల తర్వాత వ్యాయామం మొదలు పెట్టాను అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో బూడిద రంగు టైట్ దుస్తులు ధరించిన ఆమె ఎంతో ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేసింది. అయితే ఈ వీడియో ఆమె అభిమానులకు పెద్దగా నచ్చినట్లు లేదు. ఆ బట్టలేంటి? ఒక హోదాలో ఉండి ఈ గెంతులేంటి? అని విమర్శించారు. నాయకురాలిగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన మీరే ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడమేంటి? అని దుమ్మెత్తిపోశారు. మరికొందరైతే ఆమె అనుబంధ పార్టీ పేరును ఉటంకిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో నాలుక్కరుచుకున్న సొనాలీ వెంటనే ఆ డ్యాన్స్ వీడియోను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా సొనాలీ ఫొగట్ 2006లో హర్యన్వి షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఓ సీరియల్లోనూ ముఖ్యపాత్రలో ఆకట్టుకున్న ఆమె 2008లో బీజేపీలో చేరింది. ఇటీవలే హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్లోనూ పాల్గొంది. చదవండి: Cobra: విక్రమ్ మరో ప్రయోగం.. ‘కోబ్రా’ నయా లుక్ వైరల్ -
బీజేపీ నేత ఇంట్లో భారీ చోరి
చండీగఢ్, హిసార్: హరియాణాకు చెందిన బీజేపీ నేత, టిక్‌టాక్ స్టార్ సొనాలీ ఫోగాట్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బంగారు ఆభరణాలు, లైసెన్స్డ్ రివాల్వర్, 10లక్షల రూపాయల నగదుతో పాటు విలువైన వస్తువులు చోరీకి గురైనట్టు పోలీసులు వెల్లడించారు. వివరాలు.. ఈ నెల 9న సొనాలీ ఇంటికి తాళం వేసి చండీగఢ్ వెళ్లారు. తిరిగి 15వ తారీఖున ఇంటికి వచ్చారు. ఆమె వచ్చే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఆందోళనతో ఇంట్లోకి వెళ్లి చూడగా... బంగారం, వెండి ఆభరణాలు, లైసెన్స్డ్ తుపాకీతో పాటు 10 లక్షల రూపాయల నగదు కూడా చోరీకి గురయినట్లు తెలిసింది. దాంతో దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సొనాలీ. సొనాలీ ఇంటి వద్ద సీసీకెమరాలు ఉండటంతో తమ గురించి వీటిలో రికార్డు అయి ఉంటుందని భావించిన దొంగలు.. తమతో పాటు డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్)లో ఉన్న ఫుటేజీని కూడా తీసుకుపోయారని పోలీసులు తెలిపారు. సొనాలీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్టీఎం స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుఖ్జిత్ చెప్పారు. 2019లో జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అదంపూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన సొనాలీ ఫోగాట్.. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయిన సంగతి తెలిసిందే. చదవండి: డేటింగ్ యాప్‌తో వల, డ్రగ్స్ ఇచ్చి 16మందిని -
బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ అరెస్ట్
చంఢీగడ్: టిక్‌టాక్ స్టార్, బీజేపీ నేత సోనాలి ఫోగట్‌ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ అధికారిని అడ్డుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్ట్ చోటు చేసుకుంది. ఈ నెల ప్రారంభంలో సోనాలి ఫోగట్ బాలాస్మంద్‌లోని ధాన్యం మార్కెట్‌ను సమీక్షించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడున్న మార్కెట్ సెక్రటరీ సుల్తాన్సింగ్తో ఆమెకు వాదులాట జరిగింది. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన సోనాలి అతడిని చెప్పుతో కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలయ్యింది. ఈ క్రమంలో సదరు అధికారి దుర్భాషలాడుతూ, తనను అవమానించడం వల్లే కొట్టాల్సి వచ్చిందని సోనాలి పేర్కొన్నారు. ఈ క్రమంలో సుల్తాన్ సింగ్ ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక తానేమీ అనకముందే సోనాలి తనపై దాడి చేసిందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో పోలీసులు బుధవారం సోనాలిని అరెస్ట్ చేశారు. కాగా టిక్‌టాక్‌తో గుర్తింపు సంపాదించుకున్న సోనాలి ఫోగట్‌కు బీజేపీ గతేడాది ఎన్నికల్లో హర్యానాలోని ఆదంపూర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చింది. ఆమె గెలుపు తథ్యమనుకున్నప్పటికీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఓటమిపాలైంది. -
టిక్‌టాక్ స్టార్ సోనాలిపై కేసు నమోదు
చండీగఢ్: టిక్‌టాక్ స్టార్ బీజేపీ నేత సోనాలి పోగట్ మీద కేసు నమోదయ్యింది. హర్యానా ధాన్యం మార్కెట్లో అధికారి సుల్తాన్‌సింగ్‌ను చెప్పుతో కొట్టడంతో అతని ఫిర్యాదు మేరకు ఆమెపై శుక్రవారం స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై హిస్సార్ ఎస్పీ గంగారామ్ పునియా మాట్లాడుతూ...‘సుల్తాన్ సింగ్ ఫిర్యాదు మేరకు పోగాట్‌పై కేసు నమోదు చేశాం. ప్రభుత్వ అధికారిని అవమానించిన కేసులో పోగట్‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం’ అని తెలిపారు. (అధికారిని చెప్పుతో కొట్టిన బీజేపీ నాయకురాలు) సోనాలి ఫొగట్ కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో బాలాస్మంద్‌లోని ధాన్యం మార్కెట్‌ను సమీక్షించేందుకు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడున్న మార్కెట్ సెక్రటరీతో ఆమెకు వాదులాట జరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సోనాలి అతనికి చెంపదెబ్బ రుచి చూపించింది. అంతటితో ఆగకుండా చెప్పు తీసుకుని ఇష్టమొచ్చినట్లుగా కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సొనాలి మాట్లాడుతూ అతను దుర్భాషలాడుతూ, తనను అవమానించడం వల్లే కొట్టాల్సి వచ్చిందని పేర్కొంది. మార్కెట్ సెక్రటరీ మాత్రం తానేమీ అనకముందే సోనాలి తనపై దాడి చేసిందని చెప్పుకొచ్చాడు. కాగా టిక్‌టాక్‌తో గుర్తింపు సంపాదించుకున్న సోనాలి ఫొగట్‌కు బీజేపీ గతేడాది ఎన్నికల్లో హర్యానాలోని ఆదంపూర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చింది. ఆమె గెలుపు తథ్యమనుకున్నప్పటికీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఓటమిపాలైంది. (కరోనా: ప్రైవేటులో చార్జీలపై సుప్రీం విచారణ)