Bigg Boss 14 Fame Sonali Phogat Gets Trolled For Her Dance Video - Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌పై ట్రోలింగ్‌: ఆ వీడియోనే కారణం..

Published Sun, Jun 13 2021 3:21 PM | Last Updated on Sun, Jun 13 2021 5:57 PM

Bigg Boss 14 Fame Sonali Phogat Gets Trolled For Her Dance Video - Sakshi

నటి, హరియాణాకు చెందిన బీజేపీ నేత సొనాలీ ఫొగట్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ హిందీ పాటకు తనదైన స్టైల్‌లో స్టెప్పులేసిన డ్యాన్స్‌ వీడియోను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. సుమారు మూడు నెలల తర్వాత వ్యాయామం మొదలు పెట్టాను అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ వీడియోలో  బూడిద రంగు టైట్‌ దుస్తులు ధరించిన ఆమె ఎంతో ఎనర్జిటిక్‌గా డ్యాన్స్‌ చేసింది. అయితే ఈ వీడియో ఆమె అభిమానులకు పెద్దగా నచ్చినట్లు లేదు. ఆ బట్టలేంటి? ఒక హోదాలో ఉండి ఈ గెంతులేంటి? అని విమర్శించారు.

నాయకురాలిగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన మీరే ఇలాంటి వీడియోలు పోస్ట్‌ చేయడమేంటి? అని దుమ్మెత్తిపోశారు. మరికొందరైతే ఆమె అనుబంధ పార్టీ పేరును ఉటంకిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో నాలుక్కరుచుకున్న సొనాలీ వెంటనే ఆ డ్యాన్స్‌ వీడియోను డిలీట్‌ చేసినట్లు తెలుస్తోంది. కాగా సొనాలీ ఫొగట్‌ 2006లో హర్యన్వి షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఓ సీరియల్‌లోనూ ముఖ్యపాత్రలో ఆకట్టుకున్న ఆమె 2008లో బీజేపీలో చేరింది. ఇటీవలే హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌లోనూ పాల్గొంది.

చదవండి: Cobra: విక్రమ్‌ మరో ప్రయోగం.. ‘కోబ్రా’ నయా లుక్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement