చండీగఢ్: టిక్‌టాక్ స్టార్ బీజేపీ నేత సోనాలి పోగట్ మీద కేసు నమోదయ్యింది. హర్యానా ధాన్యం మార్కెట్‌లో అధికారి సుల్తాన్‌సింగ్‌ను చెప్పుతో కొట్టడంతో అతని ఫిర్యాదు మేరకు ఆమెపై శుక్రవారం స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై హిస్సార్ ఎస్పీ గంగారామ్ పునియా మాట్లాడుతూ...‘సుల్తాన్ సింగ్ ఫిర్యాదు మేరకు పోగాట్‌పై కేసు నమోదు చేశాం. ప్రభుత్వ అధికారిని అవమానించిన కేసులో పోగట్‌పై ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశాం’ అని తెలిపారు. (అధికారిని చెప్పుతో కొట్టిన బీజేపీ నాయకురాలు)
సోనాలి ఫొగట్ కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో బాలాస్మంద్‌లోని ధాన్యం మార్కెట్‌ను సమీక్షించేందుకు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడున్న మార్కెట్ సెక్రటరీతో ఆమెకు వాదులాట జరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సోనాలి అతనికి చెంపదెబ్బ రుచి చూపించింది. అంతటితో ఆగకుండా చెప్పు తీసుకుని ఇష్టమొచ్చినట్లుగా కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సొనాలి మాట్లాడుతూ అతను దుర్భాషలాడుతూ, తనను అవమానించడం వల్లే కొట్టాల్సి వచ్చిందని పేర్కొంది. మార్కెట్ సెక్రటరీ మాత్రం తానేమీ అనకముందే సోనాలి తనపై దాడి చేసిందని చెప్పుకొచ్చాడు. కాగా టిక్‌టాక్‌తో గుర్తింపు సంపాదించుకున్న సోనాలి ఫొగట్‌కు బీజేపీ గతేడాది ఎన్నికల్లో హర్యానాలోని ఆదంపూర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చింది. ఆమె గెలుపు తథ్యమనుకున్నప్పటికీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఓటమిపాలైంది. (కరోనా: ప్రైవేటులో చార్జీలపై సుప్రీం విచారణ)
Comments
Please login to add a commentAdd a comment