
ఛండీగఢ్: ప్రస్తుత జనరేషన్‌లో యువత ప్రేమ పేరుతో రచ్చ చేస్తున్నారు. భయం, సిగ్గు లేకుండా పబ్లిక్‌గానే హద్దులు దాటుతున్నారు. ఇక, తాజాగా ఓ ప్రేమికుడు.. తన ప్రియురాలి కోసం పెద్ద సాహసమే చేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ను హాస్టల్ రూమ్‌లోకి తీసుకెళ్లేందుకు కొత్త ప్లాన్ చేశాడు. ఓ సూటు కేసులో ఆమెను దాచిపెట్టి తన రూమ్‌కి తీసుకువెళ్దామనుకున్నాడు. ఇంతలో సెక్యూరిటీకి ొదొరికిపోాయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. హర్యానాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీకి చెందిన యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. వీరి మధ్య ప్రేమ ముదిరిపోవడంతో తన గర్ల్‌ఫ్రెండ్‌ను విడిచి ఉండలేక ఆమెను తనతో పాటు హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాడు. దీంతో, ఆమెను ఓ పెద్ద సూట్ కేసులోప్యాక్ చేశాడు. సూట్ కేసులో ఆమెను తీసుకెళ్తూ హాస్టల్ లోకి ప్రవేశించాడు. అయితే, సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి లగేజ్ సూట్ కేసును చెక్ చేశారు.
ఇంకేముంది.. ఆ సూట్‌కేస్‌ను తెరవగానే లోపల అమ్మాయి కనిపించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే సూట్‌కేస్‌లో నుంచి ఆ అమ్మాయిని బయటకు తీశారు. హస్టల్‌లో తోటి విద్యార్థులు ఈ ఘటనను వీడియో తీశారు. ఆ తర్వాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూనివర్సిటీ యాజమాన్యం వారిద్దరినీ సస్పెండ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. వయసు ప్రభావం ఎంతటి తప్పునైనా చేయిస్తుందని కొందరు.. ఇదేమి ప్రేమ పైత్యంరా బాబు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
A boy tried sneaking his girlfriend into a boy's hostel in a suitcase.
Gets caught.
Location: OP Jindal University pic.twitter.com/Iyo6UPopfg— Squint Neon (@TheSquind) April 12, 2025