Suitcase
-
హైవేపై సూట్‌కేసులో మహిళ మృతదేహాం.. ఒంటి నిండా గాయాలు
రోడ్డు మీద ఓ సూట్‌కేసులో మహిళ మృతదేహం లభ్యమవ్వడం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. ఢిల్లీ- లక్నో జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై శనివారం ఉదయం రెడ్ కలర్ సూట్‌కేసు ఉండటాన్ని ప్రయాణికులు గమనించి పోలీసులు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని సూట్‌కేసును తెరిచి చూడగా అందులో ఓ మహిళ మృతదేహం కనుగొన్నారు. ఆమె శరీరమంతా గాయాల గుర్తులు ఉ్నట్లు గుర్తించారు. మహిళ వయసు 25 నుంచి 30 ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి పోలీసు బృందం విచారణ చేపట్టారు. సూట్‌కేస్ నుంచి మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు. అధికారులు సూట్‌కేస్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా అందులో కొన్ని దుస్తులు కూడా ఉన్నాయి. అయితే మహిళ ఒంటిపై ఉన్న గాయాలు గమనిస్తే ఆమె మరణించి ఒక రోజు అయి ఉండవచ్చని ఎస్సీపీ వినీత్ భట్నాగర్ తెలిపారు. మహిళ ఎవరు? ఆమె మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. -
వృద్ధురాలిని హత్యచేసి.. సూట్‌కేస్‌లో కుక్కి..
నెల్లూరు (క్రైమ్)/తిరువళ్లూరు: పరిచయస్తురాలిని హత్యచేసి.. మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి.. పక్కరాష్ట్రంలో పడేసేందుకు ప్రయత్నించిన ఘటన సంచలనం కలిగించింది. నెల్లూరులో వృద్ధురాలిని హత్యచేసి మృతదేహాన్ని తమిళనాడులో పడేసేందుకు ప్రయత్నించారు. ఈ దుర్మార్గానికి సంబంధించి తండ్రీకుమార్తెలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు రాజేంద్రనగర్‌లో ఎం.రమణి (65), మురుగేశం దంపతులు ఉంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు. రమణి సోమవారం కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లి ఎంతకీ తిరిగిరాకపోవడంతో గాలించిన కుటుంబసభ్యులు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. మీంజూరు రైల్వేస్టేషన్లో మృతదేహం సంతపేట ఇన్స్పెక్టర్ మద్ది శ్రీనివాసరావు, ఎస్ఐ బాలకృష్ణ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి సాంకేతికత ఆధారంగా గాలింపు చేపట్టారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సీసీ ఫుటేజ్‌లు పరిశీలించారు. ఆ సమయంలో తమిళనాడులోని మీంజూరు రైల్వే పోలీసులు సంతపేట ఇన్స్పెక్టర్కు ఫోన్‌చేసి సూట్ కేసులో వృద్ధురాలి మృతదేహం ఉందని, ఆ సూట్ కేసును తీసుకొచ్చిన రాజేంద్రనగర్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం, అతని కుమార్తె తమ అదుపులో ఉన్నారని చెప్పారు. మృతదేహం ఫొటోను పంపించారు. మృతదేహం రమణిదిగా గుర్తించిన ఇక్కడి పోలీసులు రైల్వేపోలీసులకు సమాచారమిచ్చారు. మీంజూరు రైల్వేపోలీసుల విచారణలో రమణిని హత్యచేసినట్లు చెప్పారు. బంగారు ఆభరణాల కోసమే.. గతంలో రమణి ఇంటికి సమీపంలో ఉన్న బాలసుబ్రహ్మణ్యం కుటుంబం ఇటీవల అదేప్రాంతంలో అపార్ట్‌మెంట్‌కు వెళ్లిపోయింది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో రమణి ఒంటిపై ఆభరణాలు కాజేయాలని నిర్ణయించుకుని ఆమె కదలికలపై నిఘా ఉంచాడు. సోమవారం కూరగాయల కోసం వచ్చిన ఆమెతో మాట కలిపి తమ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్యచేసి ఒంటిపై ఉన్న సరుడు, నల్లపూసలదండ, కమ్మలు దోచుకున్నాడు.రమణి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి ట్రావెల్ సూట్‌కేస్‌లో కుక్కాడు. మృతదేహాన్ని నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా పడేస్తే తెలిసిపోతుందని.. పొరుగునున్న తమిళనాడులో పడేయాలని నిర్ణయించుకుని కుమార్తెకు చెప్పాడు. సాయంత్రం సుబ్రహ్మణ్యం, కుమార్తెతో కలిసి నెల్లూరు సౌత్ రైల్వేస్టేషన్లో చెన్నై వెళ్లే ప్యాసింజర్ రైలు ఎక్కారు. చెన్నై మీంజూరు స్టేషన్లో రైలు ఆగడంతో.. దిగి నెల్లూరు వెళ్లే రైలెక్కి మార్గంమధ్యలో సూట్‌కేస్‌ను బయట పడేయాలనుకున్నారు. రైలు కోసం వేచి ఉన్న సమయంలో అక్కడి రైల్వే పోలీసులు విజిల్ వేయడంతో కంగారుపడి వెళుతుండగా ప్లాట్‌ఫాంపై ఉన్న ఓ యువకుడు సూట్‌కేస్‌ను మరిచిపోయారంటూ కేకలు వేశాడు. రైల్వే పోలీసులు వారిని ఆపి సూట్‌కేస్ గురించి ప్రశ్నించగా నీళ్లునమలడం, భయపడడంతో వారికి అనుమానం వచ్చింది. సూట్‌కేస్ నుంచి రక్తం కారుతుండడంతో తెరచి చూశారు. మృతదేహం బయటపడింది. దీంతో వారిని రైల్వే పోలీసులు విచారించగా బంగారు ఆభరణాల కోసమే హత్యచేసినట్లు చెప్పారు. కాగా, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. çహత్య జరిగిన ప్రాంతం నెల్లూరు కావడంతో త్వరలోనే కేసును ట్రాన్స్ఫర్ చేస్తామని అక్కడి పోలీసులు తెలిపారు. -
క్రిప్టో బిలియనీర్ విషాదాంతం: సూట్‌కేసులో డెడ్‌బాడీ ముక్కలు
Fernando perez algaba: అర్జెంటీనాకు చెందిన క్రిప్టోకరెన్సీ ఇన్‌ప్లూయెన్సర్ ఫెర్నాండో పెరెజ్ అల్గాబా (41) అదృశ్యమైన ఘటన విషాదాన్ని నింపింది. గత వారం రోజులకు ముందు తప్పిపోయిన ఫెర్నాండో శవమై కనిపించాడు. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఒక సూట్ కేసులో ఆయన మృతదేహానికి చెందిన కొన్ని భాగాలను పోలీసులు కనుగొన్నారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని ఒక ప్రవాహం సమీపంలో సూట్‌కేస్‌లో అల్గాబా అవశేషాలను పోలీసులు కను గొన్నారు. అనుమానాస్పద ఎర్రటి సూట్‌కేస్‌ని కొందరు చిన్నారులు ఆడుకుంటుండగా గుర్తించారు. దీంతో పెద్దల సాయంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీ చేయగా సూట్‌కేసులో అల్గాబా కాళ్లు, ముంజేతులు కనుగొన్నారని పోస్ట్ పేర్కొంది. అతని మరో చేయి ప్రవాహంలో కనిపించింది. చివరికి బాధితుడి మొండెం, కత్తిరించిన తల వంటి మరిన్ని శరీర భాగాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని బాడీ మీద ఉన్న వివిధ రకాల టాటూలు , వేలిముద్ర విశ్లేషణ ద్వారా అతని గుర్తించారు. అప్పుల కారణంగానే హత్య చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. తదుపరి విచారణ, శవపరీక్షలో ఫెర్నాండో పెరెజ్ అల్గాబా శరీరం మూడు బుల్లెట్ గాయాలున్నట్టు తేలింది. ఇదొక ఒక ప్రొఫెషనల్ నేరగాడి పని అని ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అతను చాలా అప్పుల్లో ఉన్నాడని, మోసం ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఫెర్నాండో పెరెజ్ అల్గాబా మరణానికి కారణాలను పోలీసుల విచారిస్తున్నారు. కాగా అల్గాబా విలాసవంతమైన వాహనాలను అద్దెకు ఇవ్వడం, క్రిప్టోకరెన్సీని విక్రయించడం ద్వారా భారీ సంపదను ఆర్జించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు మిలియన్ ఫాలోయర్లు ఉన్నరు. విలాసవంతమైన జీవనశైలిని అనుసరించే ఈ క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్ ఎల్లప్పుడూ ‘ రాగ్స్ టు రిచెస్ స్టోరీ’ ల గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు. అతనికి అనేక కంపెనీలు కూడా ఉన్నాయి. 24 ఏళ్లకే అల్గాబా విలాసవంతమైన కార్లు, మోటార్‌సైకిళ్లు, జెట్ స్కీ లాంటి ఆస్తులున్నాయి. వీటిపై కూడా చాలా వివాదాలు ఉన్నట్టు సమాచారం. జూలై 19 నుంచి కనిపించకుండా పోయాడు. -
మహిళను ఆస్పత్రి పాలు చేసిన సూట్‌కేస్
-
ఎయిర్‌పోర్టులో పోయిన బ్యాగ్.. నాలుగేళ్ల తర్వాత ప్యాసెంజర్ దగ్గరకు.
వాషింగ్టన్: అమెరికాలో ఓ మహిళ ఎయిర్‌పోర్టులో నాలుగేళ్ల క్రితం పోగోట్టుకున్న బ్యాగ్ మళ్లీ దొరికింది. సదరు విమానయాన సంస్థ ఆమెకు ఫోన్ చేసి బ్యాగ్‌ను అప్పగించింది. అయితే బ్యాగ్ కొంత ధ్వంసమైంది. కానీ అందులోని వస్తువులు, దుస్తులు చెక్కుచెదరలేదు. 2018లో చికాగో నుంచి సెంట్రల్ అమెరికా వెళ్లింది గావిన్. అయితే ఆమె బ్యాగ్ మాత్రం ఎయిర్ పోర్టులోనే పోయింది. విమానయాన సంస్థకు ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. వాళ్లు అప్పుడు బ్యాగు కోసం వెతికినా దొరకలేదు. పరిహారంగా కొంత డబ్బు ఇచ్చారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఆ బ్యాగ్‌ను హాండురాస్ విమానాశ్రయంలో గుర్తించారు. వెంటనే ఆ మహిళకు ఫోన్ చేసి బ్యాగును హ్యూస్టన్‌కు పంపించారు. దీంతో ఆమె వెళ్లి దాన్ని తీసుకుంది. చికాగో విమానాశ్రయంలో బ్యాగును సరిగ్గా స్కాన్ చేయకపోవడం వల్లే పొరపాటు జరిగిందని, అది ఎక్కడుందో ఇన్ని రోజులు గుర్తించలేకపోయామని విమానయాన సంస్థ వివరణ ఇచ్చింది. చదవండి: ఆ పాస్‌పోర్టుకు పవరెక్కువ -
పెళ్లి చేసుకుందని... యువతిని కన్న తండ్రే గన్‌తో కాల్చేశాడు!
న్యూఢిల్లీ: గత వారం ఉత్తర్‌ప్రదేశ్‌లో మధురలో ఒక సూట్ కేసులోని యువతి మృతదేహం పెద్ద కలకలం రేపిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో పోలీసులు పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆ యువతిని ఆమె తండ్రే హత్య చేసినట్లు తెలిపారు. సదరు బాధిత యువతి ఆయుషి చౌదరిగాగా గుర్తించారు పోలీసులు. ఈ మేరకు మధుర సూపరింటెండెంట్ పోలీస్ మాట్లాడుతూ...ఆయుషీని ఆమె తండ్రి నితీష్ యాదవ్ తన వద్ద ఉన్న లైసెన్స్డ్ గన్‌తో హతమార్చినట్లు తెలిపారు. ఆమె తన కుటుంబ సభ్యలకు ఇష్టం లేని మరో వర్గం వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు. ఆమె తన తల్లిందడ్రులకు కనీసం చెప్పకుండా వేరే వర్గానికి చెందిన ఛాత్రపాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందని చెప్పారు. దీంతో ఆమె తండ్రి యాదవ్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేక గన్‌తో ఆమెను కాల్చి చంపినట్లు తెలిపారు. ఆమెను హత్యచేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి మధురలో వదిలేసి వెళ్లిపోయాడని చెప్పారు. కాగా, గత శుక్రవారం మధురలోని యమునా ఎక్స్‌ప్రెస్ వే వద్ద ఒక ఎరుపు రంగు సూట్‌కేసు ఉందని కొంతమంది కార్మికులు ఫిర్యాదు చేయడంతోనే ఈ ఘటన వెలుగు చూసిందన్నారు పోలీసులు. ఆమె శరీరంపై పలు రక్తపు గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసుల హత్య కేసుగా నమోదు చేసుకుని, నిందితులను అదుపలోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడు వద్ద నుంచి గన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. (చదవండి: ఒకే ఫ్యామిలీలో ఆరుగురు మృతి.. అసలేం జరిగింది?) -
నేరస్తులను పట్టుకునేందుకు... దాదాపు 70 శవాలను సూట్‌కేస్‌లో కుక్కి..
హత్య కేసుల్లో నేరస్తులను కనిపెట్టడానికి ఫోరెన్సిక్ బృదం ఇచ్చే రిపోర్టు అత్యత కీలకమైనది. కొన్ని నేరాల్లో మృతదేహాలు పూర్తిగా పాడైపోయిన స్థితిలో దొరకడంతో బాధితుల తోపాటు నిందితులను కూడా గుర్తించడం కష్టమవుతోంది. అలాంటి సందర్భాల్లో కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎలా కేసును పరిష్కరించాలి అనే దిశగా ముర్డోక్ విశ్వవిద్యాలయంలోని ఫోరెన్సిక్ బృదం ఒక సరికొత్త అధ్యయనానికి సిద్ధమైంది. అందుకోసం ఆస్ట్రేలియాలో ఒక ప్రదేశంలో సూట్‌కేసుల్లో దాదాపు 70 మృతదేహాలను కుళ్లిపోయేలా వదిలేశారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అవి డికంపోజ్ అవుతాయి. మరణించిన ఎన్ని రోజులకు శరీరం కుళ్లిపోతూ మార్పులు మొదలవుతుంది, అనేదాన్ని బట్టి ఎన్ని రోజలు ఇలా పడి ఉందని అనేది అంచనా వేయడం వంటివి కనుగొంటారు. అంతేగాక నేరస్తులు హత్య చేసి తాము దొరక్కుండా ఉండేందుకు మృతేదేహాన్ని దాచి ఉంచడం లేదా నాశనం చేసేందుకు వారి చేసే ప్రయోగాల్లో మృతదేహం స్థితిని అధ్యయనం చేయడం వంటివి చేస్తారు. పైగా హత్య చేసినప్పటి నుంచి తరలించే సమయంలో సెకండరీ క్రైమ్‌ని అంచన వేయగలుగుతారు. హత్య చేసిన తర్వాత నిందితులు ఏయే ప్రాంతాల్లో ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు వంటివి కూడా కనుగొంటారు. ఈ పరిశోధన నేరస్తుడిని ట్రేస్ చేసి మరింత సమాచారాన్ని అధికారులకు అందించేందుకు ఉపకరిస్తుంది. అందుకోసమే పరిశోధకులు సూట్‌కేసులలో వివిధ జంతువుల కళేభరాలను ఉంచి వాటిలో వస్తున్న మార్పులను అంచనా వేస్తున్నారు. నేర పరిశోధకులకు ఈ అతి పెద్ద ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు. MU’s resident bug whisperer @doc_magni has provided a fascinating look inside suitcases used to hide murder victims, and the role played by the insects trapped within. Read about her first-of-its kind experiment in @ConversationEDU ➡️ https://t.co/U93ZD7g1x4#forensics #CSI pic.twitter.com/dgAmeFElHe — Murdoch University (@MurdochUni) August 31, 2022 (చదవండి: ఫిరంగి పరిమాణంలో గుడ్లు... డైనోసార్లలో మరోజాతి) -
Robot Suitcase: ఈ సూట్‌కేసును మోయాల్సిన అవసరం లేదు..!
ప్రయాణాల్లో లగేజీ తప్పనిసరి. ఎంత లగేజీకి అంత మోత తప్పదు. ఫొటోలో కనిపిస్తున్న విచిత్రాకార సూట్‌కేసు గనుక మీ వెంట ఉంటే, మోత భారం తప్పుతుంది. ఎందుకంటే, దీనిని మోసే అవసరమే ఉండదు. మీరు ఎక్కడకు వెళ్లినా, ‘నిను వీడని నీడను నేనే...’ అన్నట్లుగా మిమ్మల్ని అనుసరిస్తూ వస్తుంది. ఇది స్వయంచాలక రోబో సూట్‌కేసు. వెస్పా స్కూటర్లను తయారు చేసే ఇటాలియన్ బహుళజాతి కంపెనీ ‘పియాగియో’కు అనుబంధ సంస్థ అయిన ‘పియాగియో ఫాస్ట్ ఫార్వర్డ్’కు చెందిన డిజైనర్లు ఈ రోబో సూట్కేసుకు రూపకల్పన చేశారు. ఫొటోలో కనిపిస్తున్నది ‘గిటా మినీ’ రోబో సూట్‌కేసు. ఇలాంటివి కాస్త పెద్ద పరిమాణంలోనూ ‘పియాగియో ఫాస్ట్ ఫార్వర్డ్’ సంస్థ రూపొందించింది. చదవండి: Eco Friendly Maker: ఆ సమస్యలకు చెక్.. లారీ షేప్‌లో ఉన్న ఈ ఎకో–ఫ్రెండ్లీ గ్రిల్ ధర రూ.17,859! -
సూట్ కేసు నుంచి దుర్వాసన.. దగ్గరకు వెళ్లి చూస్తే..
తిరువొత్తియూరు: తిరుపూర్‌లోని తారాపురం రోడ్డు పక్కన ఓ డ్రైనేజీ కాలువలో స్కూట్ కేసులో కుక్కిన యువతి మృతదేహం పడిఉండడం స్థానికంగా సంచలనం కలిగించింది. వివరాలు.. డ్రైనేజీ కాలువలో ఆదివారం ఓ సూట్ కేసులో పడి ఉండడం, అందులో నుంచి తీవ్రంగా దుర్వాసన వెలువడడంతో స్థానికులు వీరపాండి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ ఆనందన్ నేతృత్వంలోని పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సూట్ కేసును తెరిచి చూడగా అందులో 30 ఏళ్ల వయసున్న యువతి మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: పంజాబ్ సీఎం చన్నీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తానని పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ అన్నారు. పరువు నష్టం దావా వేయడానికి కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు నిర్వహించిన నేపథ్యంలో పంజాబ్ సీఎం చన్నీని ఉద్దేశించి కేజ్రీవాల్ ‘నిజాయితీ లేని వ్యక్తి’ అంటూ విమర్శించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై స్పందించిన చన్నీ.. తర్వలోనే పరువు నష్టం దావా వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇతరుల పరువు, ప్రతిష్టలకు భంగంకలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం కేజ్రీవాల్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. గతంలో కూడా నోటికొచ్చినట్లు మాట్లాడి.. తర్వాత క్షమాపణలు చెప్పిన ఘటనలు కూడా చూశామని గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు పలువురు నేతలపై ఇష్టమోచ్చినట్లు వ్యాఖ్యలు చేసి.. తర్వాత క్షమాపణలు చేప్పి అక్కడి నుంచి పారిపోతారని ఎద్దేవా చేశారు. అయితే ఈ సారిగా ఊరుకునే ప్రసక్తే లేదని.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తానని స్పష్టంచేశారు. భూపిందర్ సింగ్ హనీ నివాసంలో జరిగిన దాడుల్లో రూ.10 కోట్ల నగదు, 21 లక్షలకు పైగా విలువైన బంగారం, రూ. 12 లక్షల విలువైన రోలెక్స్ వాచ్‌ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనను దృష్టిలో పెట్టుకొని తమ పార్టీ నేతలపై ఈడీ దాడులు జరుపుతూ ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరగనుంది. ఫలితాలు మార్చి 10న వెల్లడికానున్నాయి. -
ఆ సూట్‌కేస్‌ను చూడకపోతే ఏం జరిగేది?
భారత్‌లో సినిమాలతో పాటు సీరియల్స్‌కు కూడా ఎంతో క్రేజ్. సోమవారం నుంచి శనివారం వరకూ రోజులో దాదాపు 10 గంటలపాటే సీరియల్స్ టెలికాస్ట్ అవుతాయంటేనే అర్థం చేసుకోవచ్చు. అయితే సీరియల్స్‌లో కొన్ని సీన్లు చూస్తే.. పిచ్చెక్కిపోతుంది. వీసమెత్తు లాజిక్ కూడా ఉండదు. తాజాగా ఓ సీరియల్ సీన్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. నెటిజనులు రకరకాల ప్రశ్నలు కురిపిస్తున్నారు. అదేంటో మీరు చూడండి. కలర్స్ టీవీలో ప్రసారం అయ్యే ఇష్క్ మెయిన్ మార్జావన్ 2లోని ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియో ఇది. దీనిలో రిధిమా (నటి హెల్లీ షా ఈ పాత్ర పోషించినది) కాళ్లకు సూట్‌కేస్ తగిలి ముందుకు తూలి పడుతుంది. దాంతో గోడకు గుద్దుకుంటుంది. స్పృహ కోల్పోయి సూట్‌కేస్‌లో పడుతుంది.(చదవండి: ఖాళీ కుక్కర్‌ను గ్యాస్ స్టౌపై పెట్టింది ఎవరు?) In case you haven't noticed what's happening in indian dramas these days. pic.twitter.com/5GfrCjYY5r — . (@Bellona__) September 21, 2020 ఇంతలో వైట్ హ్యాండ్ గ్లౌజులు ధరించిన ఓ వ్యక్తి ఆ సూట్‌కేస్‌ని తీసుకెళ్లి స్విమ్మింగ్ ఫూల్లో పడేస్తాడు. ఇంతలో వంశ్(రాహుల్ సుధీర్) సూట్‌కేస్ స్విమ్మింగ్ ఫూల్లో మునిగిపోవడం గమనిస్తాడు. ఇక్కడితో వీడయో అయిపోతుంది. అయితే దీనిపై నెటిజనులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అసలు సూట్‌కేస్ చూడకపోయుంటే ఏం జరిగేది.. దాని జిప్ ఎవరు పెట్టారు.. వచ్చే ఏడాది నవంబర్‌లో ఆ సూట్‌కేస్ పూర్తిగా మునిగిపోతుంది.. 200 ఎపిసోడ్ల తర్వాత ఆమెకు ఏం జరిగిందో చెప్పండి అంటూ ఫన్ని కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. -
సూట్‌కేసులో మృతదేహం.. తన భార్యదేనని..
లక్నో : చనిపోయిందని భావించిన ఓ మహిళా సజీవంగా తిరిగి వచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బులంద్‌షహర్‌లోని ఇస్లామాబాద్ ప్రాంతంలో నివసిస్తున్న వరీషా భర్త అమీర్ జూలై 23న తన భార్య కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అదే నెల 27న ఘజియాబాద్ సమీపంలో సూట్‌కేసులో కుక్కి ఉన్న ఓ మహిళా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం అమీర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, ఆ మృతదేహం తన భార్య వరీషాదేని చెప్పి తీసుకుకెళ్లారు. (చదవండి : ప్రియుడితో పారిపోయి.. భర్తపై నెపం వేసి) కాగా, సోమవారం వరీషా పోలీసులకు సంప్రదించి తాను బతికే ఉన్నానని పేర్కొంది. అంతే కాకుండా తన భర్త అమీర్, అత్త వరకట్నం కోసం తనను వేధించారని, వారి టార్చర్ భరించలేక నోయిడా వెళ్లినట్లు తెలిపారు. దీంతో పోలీసులు అమీర్, అతని తల్లిపై వరకట్నం వేధింపులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరోవైపు సూట్ కేసులో లభించిన మృతదేహం ఎవరిదనేది తేల్చేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని బులంద్‌షహర్ పోలీసులు పేర్కొన్నారు. -
ఎంత దైన్యం.. ఎంతెంత దూరం..!
పంజాబ్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 800 కి.మీ. దూరం. అయినా సరే, సొంతూళ్లకు కాళ్లే చక్రాలుగా చిన్నారులతో సహా బయలుదేరి లాక్డౌన్ కష్టాల్ని దాటేయత్నం చేస్తున్నారు పంజాబ్‌కు చెందిన వలస జీవులు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా హైవేపై ఓ తల్లి తన చిన్నారిని మోయలేక చక్రాలున్న సూట్‌కేస్‌పై పడుకోబెట్టి ఇలా తాడుతో లాక్కుని వెళుతోంది. ఈ దృశ్యం ఇప్పుడు వైరల్‌గా మారింది. అందరి కళ్లు చెమర్చేలా చేస్తోంది.! -
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో కలకలం
-
మన వెంటే ఉండే సూట్‌కేస్
ఫొటో చూశారుగా.. అదీ విషయం. ఇందులో కనిపిస్తున్న సూట్‌కేస్‌ను మనం లాక్కు వెళ్లే అవసరమే లేకపోగా.. అది మనల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ.. మన దగ్గరగానే అడుగులేస్తూ ఉండటం ఇంకో విశేషం. బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ కంపెనీ ఫార్వర్డ్ ఎక్స్ రోబోటిక్స్ తయారు చేసింది దీన్ని. రెండు బ్రష్‌లెస్ విద్యుత్తు మోటర్లు, బోలెడన్ని కెమెరాలు.. ఒక స్నాప్‌డ్రాగన్ మైక్రో ప్రాసెసర్ సాయంతో ఈ సూట్‌కేస్ తన పరిసరాలను గుర్తిస్తూ మీ వెంటే నడుస్తుందన్నమాట. రొమ్ము క్యాన్సర్ నివారణకు విటమిన్–డి రోజూ కాసేపు ఎండలో నిలబడితే ఆరోగ్యానికి మేలని మీరు చాలాసార్లు విని ఉంటారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. శరీరం స్వయంగా తయారు చేసుకోవడం సాధ్యం కాని విటమిన్ డీని సూర్య కిరణాలతో చేసుకోవచ్చు. ఎముకల దృఢత్వం మొదలుకొని అనేక సమస్యల పరిష్కారానికి విటమిన్ డీ దోహదపడుతుందని ఇప్పటికే అనేక పరిశోధనలు స్పష్టం చేశాయి. తాజాగా శరీరంలో విటమిన్ డీ ఎక్కువ మోతాదులో ఉంటే రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. విటమిన్ డీతో ఆరోగ్య ప్రయోజనాలకు ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థతో కలిపి ఈ అధ్యయనం జరిగింది. దాదాపు అయిదు వేల మందిపై ఇప్పటికే జరిగిన రెండు క్లినికల్ ట్రయల్స్ నుంచి సమాచారాన్ని సేకరించి విశ్లేషించినప్పుడు తమకు ఈ కొత్త విషయం తెలిసిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. 2002 – 2017 మధ్యకాలంలో జరిగిన ఈ దీర్ఘ అధ్యయనంలో అప్పుడప్పుడూ విటమిన్ డీ మోతాదులను పరిశీలించామని, మొత్తమ్మీద చూసినప్పుడు వీరిలో 77 మంది రొమ్ము కేన్సర్ బారిన పడ్డారని ఆయన చెప్పారు. కేన్సర్‌బారిన పడని వారిలో విటమిన్ డీ మోతాదు 60 నానోగ్రామ్స్/లీటర్‌గా ఉన్నట్లు గుర్తించామని.. సాధారణంగా 20 నానోగ్రాముల విటమిన్ డీ ఉంటే చాలని వైద్యం చెబుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన విటమిన్ డీ మోతాదును గణనీయంగా పెంచేందుకు అమెరికన్ వైద్యరంగం ప్రయత్నాలు చేస్తోంది. అరవై నానోగ్రాముల కంటే ఎక్కువ విటమిన్ డీ ఉన్న వారికి రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశం 20 శాతం వరకూ తక్కువగా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. అధ్యయనంలో పాల్గొన్న వారి వయసు, బాడీ మాస్ ఇండెక్స్, ధూమపానం వంటి అలవాట్లు అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పటికీ విటమిన్ డీ ఎక్కువగా ఉన్నవారికి రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని తమ అధ్యయనం చెబుతోందని వివరించారు. కొన్ని రకాల ఇతర కేన్సర్ల విషయంలోనూ విటమిన్ డీ ప్రభావం ఎంతో ఉన్నట్లు గతంలో జరిగిన పరిశోధనలు చెబుతూండటం ఇక్కడ గమనార్హం. -
సూట్‌కేస్‌లో 50 పాములు
బీజింగ్: విషపూరితమైన 50 పాములను సూట్‌కేస్‌లో రవాణా చేసేందుకు యత్నిం చిన ఓ వ్యక్తిని చైనాలోని ఓ రైల్వేస్టేషన్లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి సూట్‌కేస్‌లో బరువైన వస్తువు ఒకదానిని మడత పెట్టినట్లుగా రైల్వేస్టేషన్ లోని స్కానర్‌లో కనిపించింది. దీంతో అనుమానం వచ్చి సూట్‌కేస్‌ను తనిఖీ చేయగా, అందులో 4 కేజీల పాములు కనిపించాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం పాములను అటవీ అధికారులకు అప్పగించారు. పాములు పిట్ వైపర్ జాతికి చెందినవి. స్నేక్ వైన్ తయారుచేయటం కోసం పాములను కొనుగోలు చేసినట్లు నిందితుడు తెలిపాడు. -
సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం
మథుర: ఢిల్లీ- ఆగ్రా రహదారిపై శనివారం ఓ మహిళ మృతదేహం ఉన్న సూట్‌కేసు కలకలం సృష్టించింది. రహదారికి సమీపంలోని ఓ కాలువ పక్కన ఈ సూట్‌కేస్‌ను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సూట్‌కేస్ తెరిచి చూడగా అందులో అర్ధనగ్నంతో ఉన్న మహిళ మృతదేహం కనిపించిందని ఎస్పీ అలోక్ ప్రియదర్శిని తెలిపారు. మృతురాలికి 35 ఏళ్లు వయసుంటుందని, శరీరంపై అక్కడక్కడ గాయాలు ఉన్నాయని చెప్పారు. మహిళను వేరేచోట హతమార్చి.. అనంతరం మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉండొచ్చని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. -
సూట్‌కేసులో మహిళ మృతదేహం
మధుర: ఢిల్లీ-ఆగ్రా రహదారిపై మహిళ మృతదేహంతో ఉన్న ఒక సూట్ కేసు శనివారం ఉదయం కలకలం సృష్టించింది. ఆగ్రా సరిహద్దులో ఉన్న రాయ్‌పురా జత్ రోడ్డు పక్కన సూట్‌కేసు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సూట్‌కేసును తెరిచి చూడగా అందులో సుమారు 35ఏళ్ల మహిళ మృతదేహం కనిపించింది. మహిళ మృతదేహంపై లో దుస్తులు మాత్రమే ఉండగా.. శరీరంపై పలు చోట్ల కత్తితో పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయి. దుండుగలు ఆమెపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసినట్లు తెలుస్తోంది. కాగా రెండురోజుల క్రితం మహిళను వేరే చోట హతమార్చి, అనంతరం మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి ...దుండగులు ఇక్కడ పడవేసి ఉంటారని ఎస్పీ అలోక్ ప్రియదర్శిని తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక అసలు విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఫోరెన్సిక్ సిబ్బంది ఆధారాలు సేకరించినట్లు ఎస్పీ వెల్లడించారు. మహిళ ఛాయాచిత్రాలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించినట్లు చెప్పారు. -
సూట్‌కేసులో దాక్కొని దొరికిపోయాడు..
బెర్న్: యూరప్ వలస బాధితుల ఉదంతాలకు అద్దం పట్టే ఘటన స్విజర్లాండ్లో చోటు చేసుకుంది. ఇరాన్ నుంచి రైల్లో అక్రమంగా స్విజర్లాండ్లోకి ప్రవేశించడానికి ఓ వ్యక్తి సూట్‌కేసులో దాక్కున్నాడు. ఆరడుగుల ఎత్తున్న వ్యక్తి.. చిన్న సూట్‌కేసులో నక్కి మిత్రుడితో పాటు ప్రయాణిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సూట్‌కేసులో దాక్కొని సుమారు 45 నిమిషాలు ప్రయాణించిన తరువాత కలిగిన అసౌకర్యం మూలంగా ఆ వ్యక్తి శబ్దం చేయటంతో తోటి ప్రయాణికులకు అనుమానం కలిగింది. వారు సూట్‌కేసు నుంచి శబ్దాలు వస్తున్న విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు తనిఖీలు నిర్వహించారు. ప్లాట్‌ఫాంపై దానిని ఓపెన్ చేసిన పోలీసులు అందులో ఓ వ్యక్తి ఉండటం చూసి షాక్ తిన్నారు. సదరు వ్యక్తితో పాటు.. మిత్రుడి వద్ద సరైన పత్రాలు లేవని గుర్తించిన పోలీసులు వారిని తిరిగి వెనక్కి పంపారు. వీరు ఎరిత్రియాకు చెందినవారిగా గుర్తించారు. వలసలు వెళ్లే క్రమంలో ప్రమాదకరమైన మార్గాలను అన్వేషిస్తూ కొందరు మృత్యువాత పడుతున్నారు. -
బాగ్‌అంబర్‌పేటలో సూట్‌కేసు కలకలం
గుర్తు తెలియని వ్యక్తులు పుట్‌పాత్‌పై వదిలేసిన సూట్‌కేసు కలకలం సృష్టించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూట్‌కేసు పుట్‌పాత్‌పై ఉండడంతో స్థానికులు అందోళనకు గురయ్యారు. ఈ సంఘటన శుక్రవారం అంబర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఏపీ ఆనంద్‌కుమార్ కథనం ప్రకారం...బాగ్‌అంబర్‌పేట అయ్యప్ప ఆలయం సమీపంలో పుట్‌పాత్‌పై ఓ సూట్‌కేసు పడి ఉంది. దానిని ఎంతసేపటికి ఎవరూ తీసుకోకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇన్స్పెక్టర్ ఆనంద్‌కుమార్ బాంబ్‌స్క్వాడ్ బృందానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిసర ప్రాంతాల వాసులను అప్రమత్తం చేసి చాకచక్యంగా సూట్‌కేసును తెరిచారు. అందులో ఏమీ లేకపోవడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. ఈ సూట్‌కేసును చెత్త సేకరించే వారు ఇక్కడ వేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. -
సూట్‌కేసు నమోదులో తాత్సారం
► రూ.10.80 లక్షలు మాయంపై బాధితుల ఫిర్యాదు ► పది రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోని పోలీసులు ► ఎట్టకేలకు డీవైఎస్పీ చొరవతో నమోదైన కేసు అనంతపురం : వెయ్యి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా రూ.10.80 లక్షలు ఉన్న సూట్‌కేస్ అది. అయితే ఆ సూట్‌కేస్‌లోని డబ్బు మాయమైంది. వాటి స్థానంలో వాటర్ బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసి బాధితుడు షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదుకు వారు ససేమిరా అన్నారు. పది రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోలేదు. చివరకు అనంతపురం డీవైఎస్పీ మల్లికార్జునవర్మ ఆదేశంతో కేసు నమోదు చేయక తప్పలేదు. ఎలా జరిగిందంటే... అనంతపురం రూరల్ మండలం పూలకుంటకు చెందిన ఓబిరెడ్డి హైదరాబాద్‌లో ఓ పరిశ్రమ స్థాపించి అక్కడే వ్యాపారం చేస్తున్నారు. అనంతపురంలో ఓ వ్యాపారి నుంచి రూ.11 లక్షలు రావాల్సి ఉండగా వాటి వసూలు కోసం గత నెల 29న ఇక్కడికి వచ్చారు. స్థానిక సప్తగిరి లాడ్జిలో 119 గది అద్దెకు తీసుకున్నారు. తమ అన్న వస్తున్నాడని తెలిసి ఓబిరెడ్డి సోదరుడు మల్లిరెడ్డి తదితరులు అదే రోజు లాడ్జికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఓబిరెడ్డి అరవిందనగర్‌కు వెళ్లి తనకు రావాల్సిన రూ.11 లక్షలు వసూలు చేసుకుని తిరిగి లాడ్జికి చేరుకున్నారు. డబ్బు లెక్కపెట్టి అందులో తను రూ.10 వేలు, సోదరుడు మల్లిరెడ్డి రూ.10 వేలు తీసుకున్నారు. మిగిలిన రూ.10.80 లక్షలు సూట్‌కేసులో పెట్టి తాళం వేసి ఓబిరెడ్డి తన వద్ద ఉంచుకున్నారు. అందరూ బయటకు వెళ్తే గదికి తాళం వేసి ఆ తాళం కూడా ఓబిరెడ్డి తన వద్దే ఉంచుకున్నారు. రాత్రి 9 గంటలకు లాడ్జికి వచ్చిన ఆయన గదిలో ఉంచిన సూట్‌కేసు తీసుకుని కౌంటరులో బిల్లు మొత్తం చెల్లించి హైదరాబాద్‌కు ఓ ప్రైవేట్ బస్సులో బయలుదేరి వెళ్లారు. 30న ఉదయం బస్సు దిగి ఇంటికెళ్లి సూట్‌కేస్ తెరచి చూడగా అందులో డబ్బుకు బదులు వాటర్ బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయి. వెంటనే ఆయన ఈ విషయాన్ని పూలకుంటలోని తన సోదరుడు మల్లిరెడ్డికి సమాచారం అందించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్తే... జరిగిన సంఘటనపై గత నెల 30న ఫిర్యాదు చేసేందుకు ఓబిరెడ్డి సోదరుడు మల్లిరెడ్డి అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే ఫిర్యాదు తీసుకుంటే కేసు నమోదు చేయాల్సి వస్తుందని ససేమిరా అన్నారు. ఆ రోజు నుంచి ఉదయం, సాయంత్రం ప్రతి రోజూ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగినా లాభం లేదు. చివరకు రెండ్రోజుల కిందట బాధితుడు అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మను కలసి తమ గోడు వెల్లబోసుకున్నాడు. ఆయన ఆదేశాలతో పోలీసులకు కేసు నమోదు చేయక తప్పలేదు. లాడ్జీలో పని చేసే వారి పనేనా? రూ.10.80 లక్షలు మాయం వెనుక లాడ్జీలో పని చేసే వారి హస్తం ఉంద నే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గదికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో మారుతాళంతో గది తలుపు తీసి సూట్‌కేసులోని డబ్బు నొక్కేసి, వాటి స్థానంలో వాటర్ బాటిళ్లు ఉంచారని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీ సచివాలయంలో సూట్‌కేస్ కలకలం
హైదరాబాద్ : ఏపీ సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో శుక్రవారం ఓ సూట్‌కేస్ కలకలం రేపింది. సీఎం ఉండే ఫ్లోర్ కావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. సచివాలయానికి వచ్చిన ఒక మహిళ తన సూట్‌కేస్‌ను గది బయట ఉంచి లోపలికి వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న కొంతమంది కంగారు పడి పోలీసులకు సమాచారం అందించారు. వారు సూట్‌కేస్‌ను తెరచి చూడగా అందులో దుస్తులు మాత్రమే ఉండటం చూసి ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ సూట్‌కేసు మిఖైల్‌ను చంపి దాచేందుకేనా?
ముంబై: షీనా బోరా హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆదివారం షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జీయాకు చెందిన ముంబై నివాస ప్రాంతంలో వారు ఓ సూట్‌కేసును స్వాధీనం చేసుకున్నారు. ఈ సూట్‌కేస్ షీనా సోదరుడు మిఖైల్‌ను హత్య చేసి అందులో దాచి అటవీ ప్రాంతంలో షీనా హత్య చేసిన ప్రాంతంలోనే ఖననం చేసేందుకు సమీకరించారని పోలీసుల అనుమానం. కాగా, ఆధారాల సేకరణ కోసం షీనా హత్య జరిగిన తీరును తెలుసుకోవడానికి ఈ కేసులో నిందితులైన ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్‌లను ముంబై పోలీసులు ఆదివారం రాయ్‌గఢ్ జిల్లా అడవికి తీసుకెళ్లారు. ఇంద్రాణి, ఖన్నాలు హత్యకు కారణం నువ్వంటే.. నువ్వని పరస్పరం ఆరోపణలకు దిగారని పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ముంబై పోలీసులు.. నిందితులైన ఇంద్రాణి ముఖర్జియా, ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నా, ఇంద్రాణి కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ లను సోమవారం స్థానిక కోర్టులో హాజరుపర్చనున్నారు. -
సూట్ కేసులో యువకుడి మృతదేహం
సంబేపల్లె: వైఎస్సార్ జిల్లా సంబేపల్లె మండలం రెడ్డివారిపల్లె గ్రామ సమీపంలో శుక్రవారం సూట్ కేసులో కనిపించిన ఓ యువకుడి(32) మృతదేహం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కుంట తూముల వద్ద ఓ సూట్‌కేస్‌లోంచి దుర్వాసన వస్తుండటంతో గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాయచోటి రూరల్ సీఐ ప్రభాకర్ ఘటనా స్థలికి చేరుకుని సూట్ కేసును తెరవగా మృతదేహం కనిపించింది. హత్య చేసి, మృతదేహాన్ని సూట్ కేసులో ఉంచి కొద్ది రోజుల క్రితం ఇక్కడ పడేసి వెళ్లినట్లు తెలుస్తోందని పోలీసులు భావిస్తున్నారు. ఈ యువకుడు బ్రౌన్ రంగు ప్యాంటు, ఫుల్ షర్ట్ ధరించి ఉన్నాడు. మొహం గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉబ్బిపోయి ఉంది. కేసు దర్యాప్తులో ఉంది. -
సూట్ కేసులో మృతదేహం
నిజామాబాద్ క్రైం: నగర పరిధిలోని నాగారం బాబాన్ సాహెబ్ పహడ్ నిజాంసాగర్ కెనాల్ కట్టపై సూట్‌కేసులో మృతదేహం గురువారం కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి పారవేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నాగారం ప్రాంతం బాబాన్ సాహెబ్ పహడ్ నిజాంసాగర్ కెనాల్ కట్ట ప్రాంతంలో ఓ సూట్ కేసు పడి ఉంది. ఆ సూట్‌కేసు నుంచి భరించలేని దుర్వాసన వస్తుండటంతో కాలనీవాసులు కొందరు అనుమానం వచ్చి సూట్‌కేసులో ఏం ఉందోనని తెరిచిచూశారు. సూట్‌కేసులో 35 నుంచి 40 ఏళ్లవయసున్న వ్యక్తి కుళ్లిపోయిన మృతదేహం ఉండటంతో షాక్‌కు గురై పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో డీఎస్పీ ఆనంద్‌కుమార్, రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సైదులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నెల రోజుల క్రితం హత్య జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతుడు నలుపు రంగు ఫ్యాంట్, తెల్లగీతాల షర్టు ధరించి ఉన్నాడు. మృతదేహం ఏ మాత్రం గుర్తు పట్టనంతగా కుళ్లిపోయి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.