
ప్రతీకాత్మక చిత్రం
లక్నో : చనిపోయిందని భావించిన ఓ మహిళా సజీవంగా తిరిగి వచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బులంద్‌షహర్‌లోని ఇస్లామాబాద్ ప్రాంతంలో నివసిస్తున్న వరీషా భర్త అమీర్ జూలై 23న తన భార్య కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అదే నెల 27న ఘజియాబాద్ సమీపంలో సూట్‌కేసులో కుక్కి ఉన్న ఓ మహిళా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం అమీర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, ఆ మృతదేహం తన భార్య వరీషాదేని చెప్పి తీసుకుకెళ్లారు. (చదవండి : ప్రియుడితో పారిపోయి.. భర్తపై నెపం వేసి)
కాగా, సోమవారం వరీషా పోలీసులకు సంప్రదించి తాను బతికే ఉన్నానని పేర్కొంది. అంతే కాకుండా తన భర్త అమీర్, అత్త వరకట్నం కోసం తనను వేధించారని, వారి టార్చర్ భరించలేక నోయిడా వెళ్లినట్లు తెలిపారు. దీంతో పోలీసులు అమీర్, అతని తల్లిపై వరకట్నం వేధింపులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరోవైపు సూట్ కేసులో లభించిన మృతదేహం ఎవరిదనేది తేల్చేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని బులంద్‌షహర్ పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment