పెళ్లి చేసుకుందని... యువతిని కన్న తండ్రే గన్‌తో కాల్చేశాడు! | Police Said Delhi Woman found Inside Suitcase Killed By Her Father | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుందని... యువతిని కన్న తండ్రే గన్‌తో కాల్చేశాడు!

Published Mon, Nov 21 2022 4:46 PM | Last Updated on Mon, Nov 21 2022 7:41 PM

Police Said Delhi Woman found Inside Suitcase Killed By Her Father  - Sakshi

న్యూఢిల్లీ: గత వారం ఉత్తర్‌ప్రదేశ్‌లో మధురలో ఒక సూట్‌ కేసులోని యువతి మృతదేహం పెద్ద కలకలం రేపిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో పోలీసులు పలు షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. ఆ యువతిని ఆమె తండ్రే హత్య చేసినట్లు తెలిపారు. సదరు బాధిత యువతి ఆయుషి చౌదరిగాగా గుర్తించారు పోలీసులు. ఈ మేరకు మధుర సూపరింటెండెంట్‌ పోలీస్‌ మాట్లాడుతూ...ఆయుషీని ఆమె తండ్రి నితీష్‌ యాదవ్‌ తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ గన్‌తో హతమార్చినట్లు తెలిపారు.

ఆమె తన కుటుంబ సభ్యలకు ఇష్టం లేని మరో వర్గం వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు. ఆమె తన తల్లిందడ్రులకు కనీసం చెప్పకుండా వేరే వర్గానికి చెందిన ఛాత్రపాల్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందని చెప్పారు. దీంతో ఆమె తండ్రి యాదవ్‌ ఈ విషయాన్ని జీర్ణించుకోలేక గన్‌తో ఆమెను కాల్చి చంపినట్లు తెలిపారు. ఆమెను హత్యచేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ప్యాక్‌ చేసి మధురలో వదిలేసి వెళ్లిపోయాడని చెప్పారు.

కాగా, గత శుక్రవారం మధురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌ వే వద్ద ఒక ఎరుపు రంగు సూట్‌కేసు ఉందని కొంతమంది కార్మికులు ఫిర్యాదు చేయడంతోనే ఈ ఘటన వెలుగు చూసిందన్నారు పోలీసులు. ఆమె శరీరంపై పలు రక్తపు గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసుల హత్య కేసుగా నమోదు చేసుకుని, నిందితులను అదుపలోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడు వద్ద నుంచి గన్‌ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

(చదవండి: ఒకే ఫ్యామిలీలో ఆరుగురు మృతి.. అసలేం జరిగింది?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement