Woman body found
-
పెళ్లి చేసుకుందని... యువతిని కన్న తండ్రే గన్‌తో కాల్చేశాడు!
న్యూఢిల్లీ: గత వారం ఉత్తర్‌ప్రదేశ్‌లో మధురలో ఒక సూట్ కేసులోని యువతి మృతదేహం పెద్ద కలకలం రేపిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో పోలీసులు పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆ యువతిని ఆమె తండ్రే హత్య చేసినట్లు తెలిపారు. సదరు బాధిత యువతి ఆయుషి చౌదరిగాగా గుర్తించారు పోలీసులు. ఈ మేరకు మధుర సూపరింటెండెంట్ పోలీస్ మాట్లాడుతూ...ఆయుషీని ఆమె తండ్రి నితీష్ యాదవ్ తన వద్ద ఉన్న లైసెన్స్డ్ గన్‌తో హతమార్చినట్లు తెలిపారు. ఆమె తన కుటుంబ సభ్యలకు ఇష్టం లేని మరో వర్గం వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు. ఆమె తన తల్లిందడ్రులకు కనీసం చెప్పకుండా వేరే వర్గానికి చెందిన ఛాత్రపాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందని చెప్పారు. దీంతో ఆమె తండ్రి యాదవ్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేక గన్‌తో ఆమెను కాల్చి చంపినట్లు తెలిపారు. ఆమెను హత్యచేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి మధురలో వదిలేసి వెళ్లిపోయాడని చెప్పారు. కాగా, గత శుక్రవారం మధురలోని యమునా ఎక్స్‌ప్రెస్ వే వద్ద ఒక ఎరుపు రంగు సూట్‌కేసు ఉందని కొంతమంది కార్మికులు ఫిర్యాదు చేయడంతోనే ఈ ఘటన వెలుగు చూసిందన్నారు పోలీసులు. ఆమె శరీరంపై పలు రక్తపు గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసుల హత్య కేసుగా నమోదు చేసుకుని, నిందితులను అదుపలోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడు వద్ద నుంచి గన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. (చదవండి: ఒకే ఫ్యామిలీలో ఆరుగురు మృతి.. అసలేం జరిగింది?) -
వికారాబాద్ జిల్లాలో దారుణం
-
భర్త చితిలో భార్య శవం
ముంబై: మరోసారి సతీసహగమనాన్నితలపించే దృశ్యం ఆవిష్కృతమైంది. చనిపోయిన భర్త చితికి నిప్పంటించిన అనంతరం కనిపించకుండా పోయిన భార్య.. భర్తతోపాటు తాను కాలిబూడిదై పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, ఆమెతో భర్త కుటుంబ సభ్యులు సతీసహగమన చర్యకు పాల్పడేలా చేశారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. తుకారాం అనే వ్యక్తి (55) గుండెపోటుతో ఆదివారం సాయంత్ర చనిపోయాడు. పోలీసులు కూడా అతడి మరణాన్ని ధృవీకరించారు. సోమవారం తుకారం అంత్యక్రియలు జరిగాయి. కానీ, అదే రోజు తుకారాం భార్య ఉష(50) కనిపించకుండా పోయింది. మరుసటి రోజు తుకారం చితాభస్మాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు స్మశానం వద్దకు వెళ్లగా అక్కడే ఉష కూడా కాలిపోయి ఉన్నట్లు గుర్తించారు. చనిపోయిన ఆ భార్య భర్తలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, పోలీసులు మాత్రం కుటుంబంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సతీ చర్యను భారత్ ఎప్పుడో రద్దు చేసిన విషయం తెలిసిందే.