బాగ్‌అంబర్‌పేటలో సూట్‌కేసు కలకలం | the suitcase caused outrage in Bagh Amberpet | Sakshi
Sakshi News home page

బాగ్‌అంబర్‌పేటలో సూట్‌కేసు కలకలం

Published Fri, Jun 10 2016 8:18 PM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

the suitcase caused outrage in Bagh Amberpet

గుర్తు తెలియని వ్యక్తులు పుట్‌పాత్‌పై వదిలేసిన సూట్‌కేసు కలకలం సృష్టించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూట్‌కేసు పుట్‌పాత్‌పై ఉండడంతో స్థానికులు అందోళనకు గురయ్యారు. ఈ సంఘటన శుక్రవారం అంబర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

 

ఇన్‌స్పెక్టర్ ఏపీ ఆనంద్‌కుమార్ కథనం ప్రకారం...బాగ్‌అంబర్‌పేట అయ్యప్ప ఆలయం సమీపంలో పుట్‌పాత్‌పై ఓ సూట్‌కేసు పడి ఉంది. దానిని ఎంతసేపటికి ఎవరూ తీసుకోకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇన్‌స్పెక్టర్ ఆనంద్‌కుమార్ బాంబ్‌స్క్వాడ్ బృందానికి సమాచారం అందించారు.

 

సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిసర ప్రాంతాల వాసులను అప్రమత్తం చేసి చాకచక్యంగా సూట్‌కేసును తెరిచారు. అందులో ఏమీ లేకపోవడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. ఈ సూట్‌కేసును చెత్త సేకరించే వారు ఇక్కడ వేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement