amberpet
-
మూసీ నిద్రలో కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: నల్గొండకు తాము వ్యతిరేకం కాదని, నల్గొండ రైతులకు బీజేపీ అండగా ఉంటుందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్‌రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళనలో పేదల ఇళ్లు కూల్చడానికి వ్యతిరేకంగా శనివారం(నవంబర్ 16) అంబర్‌పేట తులసీరామ్‌నగర్‌లో మూసీ నిద్ర కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ‘ పేదల ఇల్లు కూల్చితే మూసీ ప్రక్షాళన జరగదు. కంపెనీల కాలుష్యం రాకుండా అడ్డుకోవాలి. రివర్ బెడ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కాలుష్యం కాకుండా ఏం చేయాలో తెలియదు. కృష్ణా నీళ్ళు తెస్తారా ? గోదావరి నీళ్ళు తెస్తారా ? ఏ విషయంలోనూ సీఎంకు క్లారిటీ లేదు.మూసీ సుందరీకరణ చేయాలి. మూసీ రిటైనింగ్ వాల్ కట్టండి.లక్షా యాభై వేల కోట్లకు అదనంగా నా జీతం ఇస్తా.అవసరం అయితే ఇంటింటికీ చందాలు వసూలు చేసి ఇస్తాం.నిజాంకు భయపడలేదు..నీకు భయపడతామా. బుల్డోజర్కు భయపడం.పేదలు సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్తానంటే అడ్డుకోము. ఇళ్లు కూలగొట్టే పద్ధతి మంచిది కాదు. ఒక కేంద్ర మంత్రిగా..ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చెబుతున్నా..ఇల్లు కూల్చే కార్యక్రమాన్ని విరమించుకోవాలని మనస్పూర్తిగా కోరుతున్నా. వారం రోజులు ఇళ్ళల్లో పనిచేస్తే ఎంత జీతం వస్తుందో అంత మొత్తం మూసీ ప్రక్షాళనకు పేదలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.ముఖ్యమంత్రి మాట్లాడే భాష పద్ధతిగా లేదు.మూసీ పక్కన మట్టి పోస్తూ అక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. వైఎస్సార్ ఉన్నప్పుడే ఇక్కడ రోడ్లు వేశాం.వైఎస్సార్ ఉన్నప్పుడే ఇక్కడ ఇంగ్లీష్ మీడియా స్కూల్ కట్టాం. వైఎస్సార్ ఉన్నప్పుడే అంబర్ పేటలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.పేద ప్రజలను రెచ్చగొట్టాలని లేదు.ముఖ్యమంత్రిని విమర్శించాలని లేదు. రాజకీయంగా చూడవద్దు..ప్రజల తరఫున..ప్రజల కోసం..ప్రజలు చేస్తున్న ఉద్యమం ఇది.ప్రజలు చేస్తున్న కార్యక్రమంలో బీజేపీ పాల్గొన్నది.ఎంత మందిని జైల్లో వేస్తావో..ఎంత మందిని తొక్కిస్తావో చూద్దాం.ప్రతి అడ్డమైనవాడు విమర్శలు చేస్తున్నారు..ప్రజల కోసం భరిస్తాం’అని కిషన్‌రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: కిషన్‌రెడ్డి అసలు తెలంగాణ బిడ్డేనా: మంత్రి పొన్నం -
రక్షాబంధన్ కు సిద్ధమవుతున్న రాఖీలు
-
ప్రియురాలితో గదిలో.. భార్యకు దొరికిపోయిన భర్త
-
ప్రేమోన్మాదం విషాదాంతం! పుట్టినరోజే పట్టాలపై..
హైదరాబాద్, సాక్షి: అంబర్‌పేటలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలుడు(16) ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించలేదన్న కోపంతో బాలికపై కత్తితో దాడి చేసిన బాలుడు శవమై తేలాడు. విద్యానగర్ పట్టాలపై తల లేకుండా మొండంతో ఉన్న అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాలికను ప్రేమించాలంటూ సదరు బాలుడు వెంటపడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అతని పుట్టినరోజు కావడంతో ఒకరోజు ముందుగానే ఆమె సమక్షంలో కేక్ చేయాలని ఆశపడ్డాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కోపంతో గురువారం సాయంత్రం ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో అడ్డొచ్చిన ఆమె సోదరిని గాయపర్చాడు. దీంతో వాళ్లిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఘటన తర్వాత భయాందోళనకు గురైన బాలుడు.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం దర్యాప్తు తర్వాతే వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు. ఇదీ చదవండి: అయ్యో.. సునీత! -
హైదరాబాద్‌లో మరో హిట్ అండ్ రన్ కేసు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు.. వృద్ధురాలు ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా.. కారు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. అంబర్పేట్ నుంచి ఉప్పల్ వెళ్లే రోడ్డులో.. కింగ్ ప్యాలెస్ హోటల్ వద్ద బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని వినాయక్‌నగర్‌కు చెందిన ముత్యాలమ్మగా పోలీసులు గుర్తించారు. చెత్త పడేయడానికి వెళ్లి ఆమె ప్రమాదానికి గురైనట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న అంబర్‌పేట పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: మొదటి భార్య ఫిర్యాదుతో శవం వెలికితీత -
ఒంటరిగా ఉన్నపుడు ఎమ్మెల్యే ఇంకేం చేస్తాడో అని భయమేస్తుంది
-
బీఆర్ఎస్లో విభేదాలు.. బయటపడ్డ ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య వార్
సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేట అధికార బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య వివాదం మరింత ముదిరింది. మంగళవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య, ఆమె భర్త శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో పూలే విగ్రహానికి పూలమాల వేసే సమయంలో ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య వ్యాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇరు వర్గాల కార్యకర్తలు, అనుచరులు రోడ్డు మీదనే ఘర్షణకు దిగారు. అయితే కార్పొరేటర్ లావణ్య భర్త శ్రీనివాస్‌పై ఎమ్మెల్యే వెంకటేష్ చేయి చేసుకున్నారని ఆమె వర్గం ఆరోపిస్తుంది. మహాత్మాజ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసే సమయంలో ఎమ్మెల్యే తనను నెట్టుకుంటూ వెళ్లాడని కార్పొరేటర్ లావణ్య భర్త శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అంతేగాక గత కొంత కాలం నుంచి నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో తనను ఆహ్వానించడం లేదని కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ డివిజన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళన సభలో కూడా తమను అవమానించేలా ఎమ్మెల్యే వ్యవహరించారని అన్నారు. -
కుక్కలు దాడులు చేయడానికి కారణాలు ఇవే..
-
అంబర్‌పేట ఘటన.. పోలీస్ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై స్థానిక పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. మూడు రోజుల పాటు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే అంబర్‌పేట పోలీసులు శుక్రవారం కేసు వైపు అడుగేశారు. సీఆర్పీసీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే.. కేసులో ఎవరినీ నిందితులుగా చేర్చలేదు. మరోవైపు ఈ ఉదంతాన్ని మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా తీసుకున్న కోర్టు.. గురువారం విచారణ సందర్భంగా జీహెచ్ఎంసీ తీరుపై ఆగ్రహం వెల్లగక్కింది. -
అంబర్‌పేట కుక్కల దాడి ఘటన.. రామ్‌గోపాల్ వర్మ వరుస ట్వీట్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేటలో కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందడం, దానిపై నగర మేయర్ విజయలక్ష్మి స్పందించిన తీరు పట్ల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వరుస ట్వీట్లను సంధించారు. ‘పాపం నిరుపేద కుక్కలు వేరే దారి లేక ఆకలి తాళలేక 4 ఏళ్ల బాలుడిని చంపేశాయని మేయర్ అనడం షాకింగ్‌గా.. నమ్మశక్యం కాని విధంగా ఉంది. హృదయాన్ని పిండేస్తున్న బాలుడి వీడియో రిపీటెడ్‌గా నగర మేయర్‌కి చూపించాలి. మేయర్ తన పెట్ డాగ్స్‌కు తినిపిస్తున్న పాత వీడియోను ఆయన షేర్ చేసి...ఈ వీడియోని నగరంలో ఉన్న కుక్కలన్నింటికీ చూపిస్తే.. పిల్లల్ని చంపే బదులు, తమకు ఆకలి వేసినప్పుడు అవి నేరుగా ఆమె ఇంటికి వెళ్లవచ్చు. ఈ ఘటన అనంతరం మేయర్‌గా రిజైన్ చేసి అన్ని కుక్కలను మీ ఇంటికి తీసుకెళ్లి స్వయంగా వాటికి తినిపించవచ్చు కదా? అప్పుడు అవి మా పిల్లల్ని తినవు కదా’ అని వ్యంగాస్త్రాలు విసిరారు. ‘నగరంలోని మొత్తం 5 లక్షల కుక్కల్ని ఒక డాగ్ హోమ్‌లో రౌండప్ చేయండి’ అంటూ రాష్ట్ర ప్రభుత్వాధినేతలను అభ్యర్థించారు. కుక్కల అంశంపై గురువారం సమావేశం పెట్టామని, చర్చించాం అని మేయర్ చెప్పడంపై స్పందిస్తూ..‘ఏ రకమైన ముగింపునకు వచ్చారు మీరు? అకౌంటబిలిటీ కోసం దీన్ని మీరు పాయింట్ టు పాయింట్ ట్విట్టర్లో పెట్టగలరా?’ అని ప్రశ్నించారు. హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించడంపై ఉపశమనంగా ఉంది’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. – సాక్షి, సిటీబ్యూరో -
GHMC నిర్లక్ష్యంతో పసి బాలుడు చనిపోయాడు: హైకోర్టు
-
కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేటలో కుక్కల దాడిలో బాలుడి మృతి కేసుపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ ఏం చేస్తోందని ప్రశ్నించింది. నష్టపరిహారం చెల్లింపు అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నామని తెలిపిన కోర్టు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది. విచారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించిన ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. కాగా గత ఆదివారం అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మరణించిన విషయం తెలిసిందే. పలు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. అసలేం జరిగిందంటే... నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన గంగాధర్.. నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి అంబర్‌పేటలో నివాసముంటున్నారు. అంబర్‌పేటలోని ఓ కారు సర్వీసింగ్ సెంటర్లో వాచ్‌మన్‌గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. గత ఆదివారం గంగాధర్ తన ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్‌తో కలసి తాను పని చేస్తున్న సర్వీస్ సెంటర్‌కు వెళ్లారు. కుమారుడిని సర్వీస్ సెంటర్ లోపల ఉంచి తాను పనిచేసుకుంటున్నారు. ప్రదీప్ ఆడుకుంటూ అక్క కోసం కేబిన్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో చిన్నారి తల, కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన బాలుడి తండ్రి అక్కడికి వచ్చే లోపే చిన్నారి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
వీధి కుక్క కాటు ఏ విధంగా ప్రమాదకరం..?
-
ఈ పాపం ఎవరిది? అంబర్‌పేట కుక్కల దాడిపై జనాగ్రహం..
సాక్షి, సిటీబ్యూరో: గుంపుగా వచ్చిన కుక్కలు.. నాలుగేళ్ల బాలుడిని చుట్టుముట్టాయి. జంతువులను వేటాడినట్టు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఆ చిన్నారి పరిస్థితి.. పులినోట చిక్కిన లేడిపిల్లలా తప్పించుకోలేని దైన్యం. ఏంచేయాలో తెలియని తనం. అరుపులే తప్ప ఆదుకునే వారు లేని దుస్థితి. ఒక కుక్క కాలు.. మరొకటి చేయిని నోట కరిచి లాగేశాయి. ఆ సమయంలో పసికందు వేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. నిమిషాల వ్యవధిలో ఆ బాలుడి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆదివారం నగరంలోని అంబర్‌పేట చే నంబర్ చౌరస్తా ప్రాంతంలో జరిగిన ఈ హృదయ విదారక దృశ్యాల్ని సామాజిక మాధ్యమాల్లో చూసిన వారు కన్నీటి పర్యంతమయ్యారు. అభం శుభం తెలియని పసిబాలుడిని పీక్కు తినడాన్ని జీర్ణించుకోలేకపోయారు. నగరంలో ఎక్కడ చూసినా ఈ విషాదకర ఘటన గురించే చర్చిస్తూ కనిపించారు. కొన్నేళ్లుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా చీమకుట్టినట్లు కూడా లేని బల్దియా తీరుపై మండిపడ్డారు. కుక్కలు మీదపడి రక్కుతున్న చిత్రాలను చూసి నెటిజెన్లు ఆగ్రహావేశాలతో పోస్టింగులు చేశారు. జంతు ప్రేమికులిప్పుడేం చేస్తారు.. ఏం సమాధానం చెబుతారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలో చెప్పాలంటూ గొంతెత్తారు. ఆపరేషన్లు చేసి వదిలేస్తున్నారు.. వీధి కుక్కల స్వైర విహారం ఒక్క అంబర్‌పేటకే పరిమితం కాదు. నగరమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. కాగా.. అంబర్‌పేట సమీప ప్రాంతాల్లోనే ఈ సమస్య మరీ అధికంగా ఉంది. సమీపంలోని మూసీ పక్కనే ఉన్న కుక్కల ఆపరేషన్ కేంద్రానికి నగరంలోని పలు ప్రాంతాల నుంచి శునకాలను తీసుకువస్తుంటారు. ఇక్కడికి నిత్యం 50కి పైగా కుక్కలు తీసుకు వచ్చి వాటికి ఆపరేషన్లు చేస్తుంటారు. అనంతరం వాటిని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలేయాల్సి ఉంటుంది. కానీ.. అలా జరగడంలేదు. దీంతో వీధి శునకాలు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. నియోజకవర్గంలోని దుర్గానగర్, గోల్నాక, ప్రేమ్‌నగర్, పటేల్‌నగర్, చే నంబరు చౌరస్తా, బతుకమ్మకుంట ప్రాంతాల్లో కుక్కల బెడద తీవ్రంగా నెలకొంది. వీటి భయంతో సాయంత్రం సమయాల్లో మహిళలు, చిన్నారులు బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. బిస్కెట్ పాకెట్ అనుకుని.. ఆదివారం అంబర్‌పేట చే నంబర్ చౌరస్తా ప్రాంతంలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ చేతిలో వాటర్ బాటిల్‌తో కనిపించడంతో.. కుక్కలు దానిని బిస్కెట్ ప్యాకెట్ అనుకుని అతని వెంటపడ్డాయి. దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడడంతో అక్కడే ఉన్న తండ్రి గంగాధర్ ఇతర సిబ్బందితో సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపు బాలుడు అప్పటికే మృతి చెందాడు. అయిదు నిమిషాలు దాడి చేశాయి బాలుడు తండ్రితో పాటు కారు సరీ్వస్ సెంటర్‌కు వచ్చాడు. ప్రాంగణంలో ఆడుకుంటుండగా చూశా. ఒంటరిగా చేతిలో నీటి బాటిల్ పట్టుకుని బయటకు రావడంతో కుక్కలు వెంటబడి దాడి చేశాయి. పెద్దగా శబ్దం రాలేదు. అయినప్పటికీ వెంటనే తరిమేశాం. గాయపడ్డ బాలుడిని ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. – నాగులు, కారు సర్వీస్ సెంటర్ సెక్యూరిటీ గార్డు సుప్రీం ఆదేశాలు బేఖాతర్.. ► ఆర్ఓసీ నెంబర్ 8938/2009 ఎం 3 ప్రకారం పట్టణాల్లో ఉన్న వీధి కుక్కలకు 90 రోజుల్లోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని సుప్రీంకోర్టు దశాబ్దం క్రితం ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు నగరంలో అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదనే ఆరోపణలున్నాయి. ► నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 3500కు పైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. ఫీవర్ ఆస్పత్రికి నిత్యం పదుల సంఖ్యలో కుక్క కాటు బాధితులు వ్యాక్సిన్ కోసం వస్తున్నారు. జంతు సంరక్షణ కేంద్రాలు సరే... కుక్కలతో సహా జంతు సరంక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న జీహెచ్ఎంసీ.. కుక్కల బారి నుంచి ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వలేకపోతోంది. గతంలో ‘కేటీఆర్ అంకుల్ మమ్మల్ని వీధికుక్కల బారినుంచి కాపాడండి’ అంటూ చిన్నారులు ప్లకార్డులతో ప్రదర్శనలు చేశారు. అయినా పరిస్థితి మారలేదు. కుక్క కాట్లు..కన్నీటిచారికలు ఆరడం లేదు. టీటీ, ఏఆర్వీ, రిగ్ వ్యాక్సిన్ తప్పనిసరి.. కుక్క కాటుకు టీటీతో పాటు యాంటీ రేబీస్ వ్యాక్సిన్(ఏఆర్వీ), రేబీస్ ఇమ్యునో గ్లోబులిన్ (రిగ్) వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈవీ నారాయణగూడ ఐపీఎం (కుక్కల దవాఖానా), నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని కుక్కలకు రేబీస్ ఇంజక్షన్లు వేయించాలని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు. పెంపుడు కుక్కల యజమానులు వీటిని తప్పనిసరిగా తమ ఇళ్లలో పెంచుకునే కుక్కలకు వేయించాలన్నారు. వీధి కుక్కలకు జీహెచ్ఎంసీ నిధుల నుంచి కొనుగోలు చేసి వేయాల్సి ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు వీటిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతోంది గత కొద్ది రోజులుగా నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రిలో రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కుక్క కాటుకు గురైన బాధితులు వెంటనే ఫీవర్‌కు వచ్చి రిగ్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. కుక్క కరిసిన తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రేబిస్ సోకి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. రేబిస్ చికిత్సకు మందులేదు. కుక్క కరిస్తే మొదటిరోజు ఒక డోస్ 7, 13, 28వ రోజు ఇంజక్షన్లు తప్పనిసరిగా వేయించుకోవాలి. – డాక్టర్ కె.శంకర్, ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగోలులో దాడి.. ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచిన ఘటన కొత్తపేట డివిజన్ మారుతీనగర్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కొత్తపేట డివిజన్లో మారుతి నగర్ రోడ్ నెంబర్– 18లో వాచ్‌మన్‌గా పనిచేసే బాలు కుమారుడు నాలుగేళ్ల రిషి ఆడుకుంటుండగా కొన్ని శునకాలు వచ్చి బాలుడిపై దాడి చేసి తీవ్ర గాయాలు చేశాయి. గాయాల పాలైన చిన్నారిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వీధి కుక్కలు ఈ కాలనీలోకి వస్తున్నాయి. గుంపులు గుంపులుగా వస్తూ దారి వెంట వెళ్లే వారిని వెంబడించి దాడికి పాల్పడుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. కుక్కల భయంతో వణికిపోతున్నాం.. కుక్కల బెడద ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా ఉంటోంది. సాయంత్రం బయటకు వెళ్లడానికి భయమేస్తోంది. సాయంత్రం వీధిలో పిల్లలు ఆడుకోవడానికి జంకుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పెద్దగా ఫలితం లేకుండాపోయింది. – గిరిజ, బతుకమ్మకుంట పిల్లలు వెళ్లే సమయంలో.. నర్సింహ బస్తీలో వీధి కుక్కల బెడద అధికంగా ఉంది. వీధుల్లో కుక్కలు పెరిగిపోవడంతో పిల్లలు బడికి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ వీధిలో ఓ కుక్క ఇప్పటికే పది మందికి పైగా దాడిచేసి గాయపరిచింది. అంబర్‌పేట ఘటనతో మా బస్తీలో కూడా కుక్కలు పిల్లలపై ఎక్కడ దాడి చేస్తాయోనని భయంగా ఉంది. – వేణు గౌడ్, నర్సింహ బస్తీ ద్విచక్ర వాహనాలను వెంబడిస్తున్నాయి తిలక్‌నగర్ బాలాజీ నగర్ మెయిన్ రోడ్డులో కుక్కల బెడద అధికంగా ఉంది. ద్విచక్ర వాహనాలపై వచీ్చపోయే వారిని వెంబడిస్తున్నాయి. చీకటి పడిందంటే చాలు వెళ్లాలంటే వృద్ధులు, చిన్నారులు భయంతో వణికిపోతున్నారు. ఏవైనా ఘటనలు జరిగినప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు హడావుడి చేస్తున్నారే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలేదు. -రవి, తిలక్‌నగర్ బస్తీ మేయర్ చెప్పినవన్నీ అబద్ధాలే డెబ్బై అయిదు స్టెరిలైజేషన్ చేశామని నగర మేయర్ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు. ఇంత పెద్ద సంఖ్యలో స్టెరిలైజేషన్ చేసినట్లయితే వీధి కుక్కల సంఖ్య ఎందుకు పెరిగింది? 2021లో 4,60,000 ఉన్న వీధి కుక్కల సంఖ్య ప్రస్తుతం 5 లక్షల 75 వేలకు ఎలా పెరిగింది?. వీధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టే బాధ్యతను జీహెచ్ఎంసీ వదిలేసి, ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పడం చాలా నష్టకరం. వీధి కుక్కల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి. – ఎం శ్రీనివాస్, సీపీఎం, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆ సమయంలో దాడి చేసే అవకాశాలు ఎక్కువ ఫిబ్రవరి, సెపె్టంబర్ నెలలు కుక్కలకు బ్రీడింగ్ సీజన్ వంటివి. ఆయా నెలల్లో వీధి కుక్కలు మనుషుల్ని కరిచే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా ఆకలి బాధ కూడా ఒక ప్రధాన కారణమే. ఒక ప్రాంతంలోని శునకాలు మరో ప్రాంతంలోకి వస్తే ఆ రెండు వర్గాల మధ్య పోటీ ఏర్పడి వెర్రెత్తి ప్రవర్తిస్తాయి. ఆ సమయంలో అక్కడ కనిపించే వ్యక్తులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి. – డాక్టర్ ప్రవీణ్‌కుమార్, సూపర్‌స్పెషాలిటీ వెటర్నరీ ఆసుపత్రి, నారాయణగూడ చదవండి: కుక్కల దాడిలో చిన్నారి మృతి బాధాకరం.. చర్యలతో పునరావృతం కానివ్వం: మేయర్ -
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కచ్చితంగా చర్యలు తీసుకుంటాం: మేయర్
-
కుక్కల దాడిలో బాలుడి మృతి బాధాకరం: మేయర్
-
కుక్కల దాడిలో చిన్నారి మృతి బాధాకరం: మేయర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బాధాకరమన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఈ పరిణామంపై సాక్షి వరుస కథనాల నేపథ్యంలో స్పందించిన ఆమె అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వీధి కుక్కలను కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. నగరంలో కుక్కలను స్టెరిలైజ్ చేసేందుకు.. ప్రతీరోజూ 30 వాహనాలు తిరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇప్పటిదాకా 4 లక్షల కుక్కలకు స్టెరిలైజ్ చేసినట్లు గణాంకాలు వివరించారామె. నగరంలో ఐదున్నర లక్షలకుపైనే వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు ఆమె తెలిపారు. అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందడం బాధాకరమన్న ఆమె.. ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారామె. కుక్కలు ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారామె. అంతకు ముందు మేయర్ విజయలక్ష్మి అధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ భేటీకి జోనల్ కమిషనర్లు, వెటర్నరీ అధికారులు హాజరయ్యారు. వీధి కుక్కల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆమె అధికారుల నుంచి వివరాలను సేకరించారు. -
కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై విచారణకు ఆదేశం
-
వీధికుక్కల దాడిలో బాలుడి మృతి.. స్పందించిన మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో కుక్కల బెడదపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ చిన్నారి కుటుంబ సభ్యులకు మంత్రి సంతాపం తెలిపారు. వీధికుక్కల దాడిలో బాలుడి మృతి చాలా బాధాకరమని అన్నారు. సిటీలో కుక్కల నియంత్రణకై చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యతు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి మున్సిపాల్టీల్లోనూ వీధి కుక్కల సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. దీని కోసం జంతు సంరక్షణ కేంద్రాలను, జంతు జనన నియంత్రణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. కుక్కల స్టెరిలైజేషన్ కోసం చర్యలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాగా వీధి కుక్కలు దాడి చేయడంతో అంబర్‌పేటకు చెందిన నాలుగేళ్ల బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆదివారం నాడు తండ్రి పనిచేస్తున్న కారు సర్వీస్ సెంబర్ వద్దకు వెళ్లిన చిన్నారిని వీధి కుక్కలు వెంటాడాయి. కుక్కలను చూసి భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశాడు. అయినా అవి చిన్నారిని వదలకుండా తీవ్రంగా దాడి చేశాయి. కాళ్లు, చేతులను లాగడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తండ్రి హుటాహుటిన వచ్చి కుక్కలను వెళ్లగొట్టి.. తీవ్ర గాయాలపాలైన కుమారుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొడుకు మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరోవైపు కుక్కులు దాడి చేసిన దృశ్యాలు.. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డవ్వగా.. అవి చూస్తుంటే ఓళ్లు జలదరిస్తోంది. -
అంబర్‌పేట్‌లో విషాదం.. నాలుగేళ్ల బాలుడి ప్రాణం తీసిన వీధికుక్కలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి, అక్కతో కలిసి సంతోషంగా బయటకు వెళ్లిన బాలుడికి అదే రోజు చివరి రోజయ్యింది. అప్పటి వరకు ఉత్సాహంగా ఆడుకున్న చిన్నారిపై వీధికుక్కలు దాడి చేయడంతో మృతిచెందాడు. ఈ దారుణ ఘటన అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగుచూసింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన గంగాధర్.. ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. ఓ కారు సర్వీస్ సెంటర్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, భార్య, పిల్లలతో కలిసి అంబర్‌పేట్‌లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఆరేళ్ల కుమార్తే, నాలుగేళ్ల కమారుడు ప్రదీప్‌లను తను పనిచేస్తున్న సర్వీస్ సెంటర్ వద్దకు తీసుకెళ్లాడు. మార్తెను పార్కింగ్ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్లో ఉంచి, కుమారుడిని సర్వీస్ సెంటర్ లోపలికి తీసుకెళ్లాడు. అనంతరం పనిలో నిమగ్నమయ్యాడు. కాసేపు అక్కడ ఆడుకున్న కుమారుడు ప్రదీప్.. తర్వాత అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. కుక్కలను చూసి భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశాడు. అయినా అవి చిన్నారిని వదలకుండా తీవ్రంగా దాడి చేశాయి. కాళ్లు, చేతులను లాగడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. తమ్ముడి అరుపులు విన్న అక్క వెంటనే తండ్రి వద్దకు పెరుగెత్తి సమాచారమిచ్చింది. విషయం తెలుసుకున్న గంగాధర్ హుటాహుటిన వచ్చి కుక్కలను వెళ్లగొట్టి.. తీవ్ర గాయాలపాలైన కుమారుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొడుకు మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరోవైపు కుక్కులు దాడి చేసిన దృశ్యాలు.. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డవ్వగా.. అవి చూస్తుంటే ఓళ్లు జలదరిస్తోంది. -
హైదరాబాద్‌లోని ఈ రూట్లో 40 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నేటి నుంచి(జనవరి 30) ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అంబర్‌పేటలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్‌పేట టీ జంక్షన్ వరకు ఈ నెల 30వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు 40 రోజుల పాటు రోడ్డు మూసివేస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ రూట్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. గాంధీ విగ్రహం నుంచి 6 నంబర్ బస్టాప్ వరకూ వెళ్లే మార్గంలో (ఒకవైపు) వాహనాలను అనుమతించకుండా ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ఉప్పల్ వైపు నుంచి 6 నంబర్ బస్టాప్ మీదుగా చాదర్‌ఘాట్ వెళ్లే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు హబ్సిగూడ క్రాస్‌రోడ్స్ నుంచి తార్నాక, ఉస్మానియా వర్సిటీ, అడిక్‌మెట్ ఫ్లైఓవర్, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, బర్కత్‌పురా, నింబోలి అడ్డా వైపునకు వాహనాలను మళ్లించనున్నట్లు తెలిపారు. ఇక ఇదే మార్గంలో వెళ్లే సిటీ బస్సులు, సాధారణ వాహనాలను గాంధీ విగ్రహం నుంచి ప్రేమ్ సదన్ బాయ్స్ హాస్టల్, సీపీఎల్ అంబర్పేట్ గేట్, అలీఖేఫ్ క్రాస్‌రోడ్స్,. 6 నంబర్ బస్టాప్, గోల్నాక, నింబోలి అడ్డా మీదుగా చాదర్‌ఘాట్‌కు వెళ్లాల్సి ఉంటుందన్నారు. 6 నంబర్ బస్టాప్ వైపు నుంచి ఉప్పల్ వైపు వెళ్లే అన్ని వాహనాలను అనుమతించనున్నట్లు తెలిపారు. -
HYD: యువతితో ప్రేమ వివాహం, గొడవలు.. జిమ్ ట్రైనర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ఓ జిమ్ ట్రైనర్ ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీఐ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. పటేల్‌నగర్‌కు చెందిన వెంకటేష్‌గౌడ్ కుమారుడు రాకేష్‌గౌడ్(27) విద్యానగర్‌లో జిమ్‌ట్రైనర్. కాగా గతంలో ఓ అమ్మాయిని ప్రేమించి వివాహాం చేసుకున్నాడు. ఇద్దరి మద్య విభేదాలు తలెత్తడంతో భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తీవ్ర మానసిక వేదనకు గురై ఈ నెల 12న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు మొదటగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. శుక్రవారం తిరిగొచ్చిన రాకేష్ ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లోనే ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: అంబర్ పేట్ సీఐ సుధాకర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అంబర్పేట్ సీఐ సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కందుకూరు లిమిట్స్‌లో పది ఎకరాల ల్యాండ్ ఇప్పిస్తానని చెప్పి ఎన్ఆర్ఐ విజయ్ కుమార్ అనే వ్యక్తి నుంచి రూ.54లక్షలు తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా ఎలాంటి ల్యాండ్ ఇప్పించకపోవడంతో బాధితుడు వనస్థలీపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో భూ వివాదంలో సుధాకర్‌ను విచారించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: (Telangana: తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు అలర్ట్) -
అంబర్‌పేట్‌లో దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కార్యాలయం ప్రారంబోత్సవం
-
టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్లిన యువతి అదృశ్యం.. ముంబై వెళ్తున్నా అంటూ..
సాక్షి, హైదరాబాద్: టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్న ఓ యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన బుధవారం అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మల్లేష్ కథనం ప్రకారం.. అంబర్‌పేట డివిజన్ పటేల్‌నగర్‌లో నివసించే షేక్ ఉన్నీసా కూతురు షేక్ సనా(19) ఉదయం 11 గంటలకు టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లింది. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తల్లికి ఫోన్ చేసి తాను ముంబాయి వెళ్తున్నట్లు తల్లికి సమాచారం ఇచ్చి ఫోన్ స్విచాఫ్ చేసింది. దీంతో తల్లి ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: పాతబస్తీకి మెట్రో కలేనా..?)